Most Used Social Media 2021: సోషల్ మీడియా ఈ కాలంలో స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతీ ఒక్కరి జీవితంలో భాగమై ఉండొచ్చు. కానీ, అందులోని ప్లాట్‌ఫామ్స్ మాత్రం కాదు!. అవసరం, ఆసక్తిని బట్టి యాప్స్‌ని ఉపయోగించడం యూజర్ ఇష్టం. ఈ తరుణంలో మోస్ట్ యూజింగ్ ప్లాట్‌ఫామ్‌గా పేరున్న ఫేస్‌బుక్‌కు పెద్ద షాకే తగిలింది.
జపాన్, ఉగాండాలో ఫేస్‌బుక్‌ను ట్విటర్ గట్టి దెబ్బ కొట్టింది. అది అలా ఇలా కూడా కాదు. 2021లో మోస్ట్ యూజ్డ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై స్టాట్‌కౌంటర్ అనే వెబ్ ట్రాఫిక్ అనలిసిస్ కంపెనీ ఒక నివేదికను విడుదల చేసింది. కిందటి ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా 72.4 శాతం ట్రాఫిక్ ఫేస్‌బుక్‌కు దక్కింది. ఆ తర్వాతి ప్లేస్‌లో ట్విటర్ జస్ట్ 8.8 శాతంతో నిలిచింది. పింటెరెస్ట్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, రెడ్డిట్, టంబ్లర్, ఇతరాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కానీ..
జపాన్‌లో మాత్రం ట్విటర్‌కు ఎక్కువ ఆదరణ లభించింది. 48.65 శాతం యూజర్లు ఆసక్తి చూపించగా.. ఆ తర్వాతి స్థానంలో ఇమేజ్ షేర్ సోషల్ మీడియా యాప్ పింటెరెస్ట్ నిలిచింది. ఫేస్‌బుక్ 16 శాతం ట్రాఫిక్‌తో మూడో స్థానానికి పరిమితమైంది. ఉగాండా విషయానికొస్తే.. ట్విటర్ 49. 79 శాతంతో ట్విటర్ టాప్ పొజిషన్‌లో నిలిచింది. రెండో స్థానంలో పింటెరెస్ట్ (23.09), మూడో స్థానంలో ఫేస్‌బుక్ కేవలం 12 శాతం ట్రాఫిక్‌కే పరిమితమైంది.
కారణాలు?
ఫేస్‌బుక్ మీద వస్తున్న విమర్శల కారణంగానే జపాన్ ఇంటర్నెట్‌యూజర్లు.. ఫేస్‌బుక్‌కు దూరంగా ఉంటున్నట్లు ఫీడ్‌బ్యాక్, కామెంట్ల ద్వారా తెలుస్తోంది. 2017 చివర్లో జపాన్‌లో ఫేస్‌బుక్ మార్కెట్ హఠాత్తుగా పడిపోవడం మొదలై.. ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. అయినప్పటికీ ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా ఆందోళన చెందడడం లేదు. అందుకు కారణం.. ఇన్‌స్టాగ్రామ్‌కు క్రమక్రమంగా జపాన్‌లో పెరుగుతున్న ఆదరణ. ఇక ఉగాండాలో ట్విటర్ ఆదరణకు, ఫేస్‌బుక్ వ్యతిరేకత పట్ల గల కారణాలపై స్పష్టత లేదు. మరవైపు వెనిజులాలో సైతం ట్విటర్‌కు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటున్నప్పటికీ.. ఫేస్‌బుక్ స్ట్రాంగ్ మార్కెట్‌తో గట్టి పోటీ ఇస్తోంది.
చదవండి: యూజర్ల ప్రైవసీతో చెలగాటం..! గూగుల్, మెటా సంస్థలకు దిమ్మతిరిగే షాక్..!
Comments
Please login to add a commentAdd a comment