Traffic
-
కమ్మేస్తున్న ‘పొగమంచు'.. ‘డ్రైవింగ్'లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
సాక్షి,తెలంగాణ : మీరు రాత్రి సమయాల్లో వాహనం నడుపుతున్నారా? ప్రయాణ సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాల వల్ల ఇబ్బంది పడ్డారా? అయితే ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే లో బీమ్ లైట్లను వినియోగించాలని రవాణా శాఖ కోరుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగడంతో పాటు దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. ఆయా రాష్ట్రాల్లో పొగమంచు కారణంగా దృశ్య నాణ్యత పడిపోయింది. దట్టమైన పొగమంచులో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పలు చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే, రాత్రి సమయాల్లో ప్రయాణికులు తమ వాహనాలలో లో బీమ్ లైట్లను వినియోగించాలని తద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని రవాణ శాఖ అధికారులు చెబుతున్నారు. అందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ను ఉదహరిస్తుంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్ సైతం లో బీమ్‌తో ప్రయాణించింది. తోటి వాహనదారుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని వాహనాలు లో బీమ్‌లో ప్రయాణించాయని, మీరు కూడా లో బీమ్‌ను వినియోగించాలని ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. Hon’ble Chief Minister Shri @revanth_anumula ’s entire convoy is using low beams.The reason is, they want to understand what is behind them. Let us all learn from them and Use low beams when we are too close to vehicle in front and road is well lit!@HiHyderabad @HYDTP pic.twitter.com/FgRZpC3Gn0— Team Road Squad🚦🚴♀️ (@Team_Road_Squad) December 19, 2024‘లో బీమ్ లైట్ల’ డ్రైవింగ్‌తో ఉపయోగాలు అవాంతరాలు లేని ప్రయాణం: నగరాలు, ఇతర రహదారుల్లో లో బీమ్ లైట్లను వినియోగించడం వల్ల ఎదురుగా ఉన్న ఇతర వాహనాలు నడిపై డ్రైవర్ కళ్లకు అంతరాయం ఉండదు. మార్గ మధ్యలో ఎలాంటి అడ్డంకులున్నా సులభంగా గుర్తించవచ్చారు. భద్రత: హై బీమ్ లైట్లను వినియోగించడం వల్ల ఎదురు వస్తున్న వాహనదారులకు అసౌకర్యం కలుగుతుంది. ప్రమాదానికి కారణమవుతాయి. లో బీమ్ లైట్లతో ప్రమాదాల్ని నివారించవచ్చు. తోటి వాహనదారుల సంక్షేమం: లో బీమ్ లైటన్లను ఉపయోగించడం ఎదురుగా వాహనాల్లో వస్తున్న వాహనదారుల సంక్షేమాన్ని కోరిన వారిమవుతాం. ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కొనసాగేందుకు ఉపయోగపడుతుంది. నిబంధనలు: అనేక నగరాల్లో జరిగే ప్రమానాన్ని నివారించేలా, లేదంటే ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు లో బీమ్ లైట్లు ఉపయోగించుకోవచ్చనే నిబంధనలు ఉన్నాయి. -
రైతుల ఆందోళన.. ఉద్రిక్తత.. ట్రాఫిక్ జామ్
న్యూఢిల్లీ: రైతుల ఆందోళనతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రభుత్వం సరిహద్దుల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించింది. రైతుల పాదయాత్రతో చిల్లా సరిహద్దులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. #WATCH | Noida, Uttar Pradesh: Traffic congestion seen at Chilla Border as farmers from Uttar Pradesh are on a march towards Delhi starting today. pic.twitter.com/A5G9JuT1KM— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 2, 2024భారతీయ కిసాన్ పరిషత్ (బికేపీ)నేత సుఖ్బీర్ ఖలీఫా మీడియాతో మాట్లాడుతూ కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం న్యాయమైన పరిహారం, మెరుగైన ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ రైతులు పాదయాత్ర చేపట్టారన్నారు. తూర్పు ఢిల్లీ పోలీసుల అధికారి అపూర్వ గుప్తా మాట్లాడుతూ ఢిల్లీలో రైతుల ఆందోళనపై తమకు ముందస్గు సమాచారం అందిందని తెలిపారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున, రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదన్నారు. శాంతిభద్రతల పరిస్థితికి విఘాతం తలెత్తకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూస్తున్నామన్నారు.#WATCH | Uttar Pradesh: Security heightened in Noida as farmers from Uttar Pradesh are on a march towards Delhi starting today. pic.twitter.com/X67KeeUDba— ANI (@ANI) December 2, 2024డిసెంబరు 6వ తేదీ నుంచి తమ సభ్యులు ఢిల్లీ వైపు పాదయాత్రను ప్రారంభిస్తారని, కేరళ, ఉత్తరాఖండ్, తమిళనాడు రాష్ట్రాల రైతు సంఘాలు కూడా అదే రోజు ఆయా అసెంబ్లీల వైపు పాదయాత్రలు చేసేందుకు సిద్ధమవుతున్నారని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ మార్చ్ తెలిపారు.ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం -
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాలో.. సిగ్నల్ దాటాలంటే చుక్కలే
సాక్షి బెంగళూరు: ఐటీ ఇండస్ట్రీలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తూ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన బెంగళూరు నగరం ప్రస్తుతం ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. నగర వాసులకు ట్రాఫిక్ అనేది నేడు అతిపెద్ద సమస్యల్లో ఒకటిగా మారింది. రద్దీ సమయాల్లో ఒక్కో ట్రాఫిక్ సిగ్నల్ దాటాలంటే రెండు మూడు సార్లు ఆగి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ప్రశాంత వాతావరణం, నిండైన పచ్చదనంతో ఒకప్పుడు ఉద్యాననగరంగా గుర్తింపు పొందిన బెంగళూరులో ప్రస్తుతం జనాభా సంఖ్య కంటే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఏటా వాహనాల సంఖ్య భారీగా పెరుగుతూ రావడంతో ప్రస్తుతం నగరంలో రోడ్ల సమర్థ్యానికి మించి వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో 1.40 కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయి. దీంతో రోడ్ల విస్తరణకు బీబీఎంపీ (బృహత్ బెంగళూరు మహానగర పాలికె) అడుగులు వేస్తోంది. దశాబ్ద కాలంలో మారిన నగరం..శరవేగంగా విస్తరిస్తున్న మహానగరం కావడం, కాంక్రీటీకరణ, అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ తదితర కారణాల వల్ల బెంగళూరు గడిచిన దశాబ్ద కాలంలో ఎంతో మారిపోయింది. విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా మెట్రో, ఫ్లయ్వోవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించినప్పటికీ ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం దొరకడంలేదు. రోడ్ల విస్తరణ అభివృద్ధికి కావాల్సిన స్థలాన్ని స్వాదీనం చేసుకునేందుకు అవసరమైన ఆరి్థక వనరులు బీబీఎంపీ వద్ద లేకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. బెంగళూరు ట్రాఫిక్ రద్దీపై ఒక మహిళ ఇటీవల ఎక్స్‌లో చేసిన చిన్న పోస్టు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రష్యాలో ఒక మూల నుంచి ఇంకో మూలకు కారులో ప్రయాణించాలంటే 149 గంటలు పడుతుందని, అంత సేపు ప్రయాణించినా ఇంకా రష్యాలోనే ఉంటారని, బెంగళూరు పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉందంటూ ఇక్కడి ట్రాఫిక్ని ఎద్దేవా చేస్తూ అనఘ అనే మహిళ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ ట్వీట్‌పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.ప్రస్తుతం ఈ ట్వీట్‌కు పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆమె చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో భారీ చర్చకు తెరతీసింది. అయితే బెంగళూరు ట్రాఫిక్ రద్దీకి ఆమె ట్వీట్ ఒక చిన్న ఉదాహరణ మాత్రమేనని, నగరవాసులను ఎవ్వరిని కదిలించినా ఇలాంటి ట్రాఫిక్ వ్యథలు వందల కొద్దీ చెబుతారని నెటిజన్లు అంటున్నారు.బీబీఎంపీ పరిధిలో రహదారుల పొడవు: 12,878 కి.మీఇందులో ఆర్టిరియల్, సబ్ ఆర్టిరియల్ (అధిక సామర్థ్యంగల) రోడ్లు: 1344.84 కి.మీ నగరంలో రిజిష్టర్ అయిన వాహనాల సంఖ్య: 1.40 కోట్లుటామ్టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారందేశంలో అత్యధిక ట్రాఫిక్ ఉండే నగరాల్లో బెంగళూరు స్థానం: 1ప్రపంచంలో అత్యధిక ట్రాఫిక్ ఉండే నగరాల్లో బెంగళూరు స్థానం: 6నగరంలో సగటున 10 కి.మీ ప్రయాణించేందుకు పట్టే సమయం: 28 నిమిషాలు -
Meetho Sakshi: మేడ్చల్ రోడ్లపై నరకం..
-
OTT Review: ఊహకందని థ్రిల్లింగ్ వెకేషన్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ట్రాఫిక్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.వెకేషన్ అంటే ఆనందంగా... సరదాగా అందరితో గడిపే కాన్సెప్ట్. కానీ అదే వెకేషన్ ఊహకందని, ఊహించలేని నైట్ మేర్ అయితే... ఈ లైన్‌ను ఆధారంగా చేసుకునే హాలీవుడ్ దర్శకుడు డీన్ టేలర్ ‘ట్రాఫిక్’ చిత్రాన్ని రూపొందించారు. సినిమా మొత్తం గ్రిప్పింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో నిండి ఉంటుంది. ఇది పెద్దల సినిమా. ΄ûలా పాట్టన్, ఒమర్ ఆప్స్ వంటి ప్రముఖ హాలీవుడ్ నటులు లీడ్ రోల్స్‌లో నటించారు.ఇక సినిమా కథ ప్రకారం... బ్రీ కాలిఫోర్నియాలోని ఓ దినపత్రికలో పని చేసే జర్నలిస్ట్. తాను రాసే కథనాలు సరిగ్గా పత్రికలో రావడం లేదని తపన పడుతూ ఉంటుంది. ఈ దశలో బ్రీ తన ప్రియుడు జాన్‌తో కలిసి అతని స్నేహితుడి డారెన్ గెస్ట్ హౌస్‌కి వెకేషన్‌కి వెళతారు. ఈ వెకేషన్ లొకేషన్ శాక్రిమెంటోలోని కొండ లోయల ప్రాంతంలో దూరంగా ఉంటుంది. ఈ వెకేషన్‌కి వెళ్లే సమయంలో బ్రీ, జాన్‌కు ఓ గ్యాస్ స్టేషన్లో కాలిఫోర్నియా బైకర్స్‌తో చిన్నపాటి ఘర్షణ జరుగుతుంది.ఇదే కథకు మలుపు. ఆ ఘర్షణతో బైకర్స్ వీళ్ళ కారును వెంబడిస్తారు. బ్రీ వాళ్ళు గెస్ట్ హౌస్‌కి వెళ్లిన తరువాత బైకర్స్ ఏం చేశారు? వాళ్లను బ్రీ ఎలా ఎదుర్కొంది? ఆ సంఘటన తర్వాత తన జర్నలిస్ట్ కెరీర్లో బ్రీ సాధించిన గొప్ప అంశమేంటి? అన్న విషయాలన్నీ లయన్స్ గేట్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ట్రాఫిక్’లో చూడాల్సిందే. రోజు వారీ ట్రాఫిక్ కష్టాలతో సతమతమయ్యేవారు ఈ వీకెండ్ ‘ట్రాఫిక్’ సినిమాతో థ్రిల్లింగ్ వెకేషన్ అనుభూతి పొందుతారనేది నిజం. సో... ఎంజాయ్ ది ‘ట్రాఫిక్’. – ఇంటూరు హరికృష్ణ -
మొబైల్ డేటా ట్రాఫిక్.. అగ్రగామిగా జియో
న్యూఢిల్లీ: మొబైల్ డేటా ట్రాఫిక్‌లో వరుసగా మూడవ త్రైమాసికంలో ప్రపంచ అగ్రగామిగా రిలయన్స్ జియో కొనసాగుతోందని కన్సల్టింగ్, రిసర్చ్ కంపెనీ టెఫిషంట్ తెలిపింది. ప్రపంచ ప్రత్యర్థులను జియో మించిపోయిందంటూ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించింది.జియో, చైనా మొబైల్, ఎయిర్టెల్, చైనా యునికామ్తోపాటు వొడాఫోన్ ఐడియా తదితర ఆపరేటర్ల మొబైల్ డేటా ట్రాఫిక్‌ను పోలుస్తూ ఒక పత్రాన్ని పంచుకుంది. ‘చైనా మొబైల్ కేవలం 2 శాతం వార్షిక వృద్ధి సాధించింది.జియో, చైనా టెలికాం 24 శాతం, ఎయిర్టెల్ 23 శాతం వృద్ధి నమోదు చేశాయి. చైనా మొబైల్లో ఏం జరుగుతోంది? అంటూ టెఫిషంట్ ప్రశ్నించింది. సెప్టెంబర్ చివరినాటికి జియో మొత్తం మొబైల్ చందాదార్ల సంఖ్య 47.88 కోట్లుంది. -
నిమజ్జనం.. గంటల కొద్దీ ట్రాఫిక్ ఇబ్బందుల్లో జనం
దాదర్: నిమజ్జనోత్సవాలు ముగియడంతో స్వగ్రామాలకు తరలిపోయిన వేలాది మంది భక్తులు ముంబై దిశగా తిరగు పయన మయ్యారు. ఒక్కసారిగా వేలాది వాహనాలు బయటపడటంతో ముంబై–గోవా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ సమస్య మరింత తీవ్రమైంది. ఇప్పటికే అనేక మంది గౌరీ గణపతులను గురువారం నిమజ్జనం చేసి శుక్రవారం నుంచి తిరుగు పయనమయ్యారు. దీంతో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది. ఇదిలా ఉండగా బుధవారం మళ్లీ ముంబై–గోవా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. పెద్ద సంఖ్యలో వాహనాలు బయటపడటం ఒక కారణమైతే, రోడ్లపై ఏర్పడిన గుంతలు మరో కారణమని తెలుస్తోంది. సాధారణంగా ముంబై–గోవా జాతీయ రహదారి నిత్యం తేలికపాటి, ట్రక్కులు, ట్యాంకర్లు, కంటైనర్లు, ట్రాలీలు తదితర సరుకులు చేరేవేసే భారీ వాహనాల రాకపోకలతో బిజీగా ఉంటుంది. గణేశోత్సవాల సమయంలో ముంబై నుంచి కొంకణ్ దిశగా వెళ్లే భక్తుల వాహనాల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరంతా ముంబై–గోవా జాతీయ రహదారినే ఆశ్రయిస్తారు. దీంతో గణేశోత్సవాలు ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచి ఈ రహదారిపై (నిత్యావసర సరుకులు చేరేవేసే వాహనాలు మినహా) భారీ వాహనాలకు నిషేధం ఉండింది. ఉత్సవాలు ముగిసిన రెండు రోజుల వరకు ఈ నియమాలు అమలులో ఉంటాయి. దీన్ని బట్టి ముంబై–గోవా జాతీయ రహ దారి ఏ స్థాయిలో బిజీగా ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది. సాధారణంగా నిమజ్జనోత్సవాలు సాయంత్రం ముగియగానే అదే రోజు అర్ధరాత్రి దాటగానే అనేక మంది తిరుగుపయనమవుతా రు. కానీ ఈ సారి మంగళవారం సాయంత్రం ని మజ్జనోత్సవాలు ముగిసినప్పటికీ అనేక మంది బుధవారం మధ్యాహ్నం తరువాత బయలుదేరారు. బుధవారం మిలాద్ ఉన్ నబీ పండుగ కావడంతో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో గురువారం ఉదయమే విధుల్లో చేరే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న కారి్మకులు, కూలీలు, వ్యాపారులు బుధవారం మధ్యాహ్నం తరువాత కుటుంబ సభ్యులతో ముంబై దిశగా తిరుగు పయనమయ్యారు. ఇటీవల కరిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ పాడైపోయా యి. ఎక్కడ చూసిన గుంతలు దర్శనమిచ్చాయి. దీనికి తోడు రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు అనేక చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. దీంతో వాహనాల వేగానికి బ్రేక్ పడింది. (వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్య! 19 గంటల పాటు సాగిన శోభాయాత్ర )15–17 గంటల ప్రయాణం భక్తుల వాహనాలకు (అప్, డౌన్లో) ప్రభుత్వం టోల్ నుంచి మినహాయింపు నిచ్చినప్పటికీ గుంతల కారణంగా వేగానికి కళ్లెం పడింది. దీంతో పది గంటల్లో పూర్తికావల్సిన ప్రయాణం 15–17 గంటలు పడుతుంది. ముంబై–గోవా జాతీయ రహదారిపై ఎక్కడ చూసినా పికప్ వాహనాలు, టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాలే దర్శనమిచ్చాయి. విపరీతమైన ట్రాఫిక్ జామ్ కారణంగా గంటల తరబడి సీట్లో కూర్చుండలేక అనేక మంది కొద్ది సేపు విశ్రాంతి తీసుకునేందుకు రోడ్డుపక్కనున్న డాబాలను ఆశ్రయించారు. దీంతో డాబా వాలాల బేరాలు జోరందుకున్నాయి. శీతలపానీయాలు, వాటర్ బాటిళ్లు, చీప్స్, తదితర చిరుతిళ్ల ప్యాకెట్లు దొరక్కుండా పోయాయి. కొన్ని చోట్ల మందకొడిగా, మరికొన్ని చోట్ల నిలిచిపోయిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు క్రమబదీ్ధకరించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒకపక్క గుంతలు, పాడైపోయిన రోడ్లతో వాహనాలు ఎటూ కదలలేని పరిస్థితి. దీంతో వాహనాలు ఇటు ముందుకు వెళ్లలేక అటు తిరిగి వెనక్కి వెళ్లి మరో మార్గం మీదుగా వెళ్లలేక నరకయాతన అనభవించారు. -
వెనిస్లో ముంబై స్టైల్ ట్రాఫిక్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చెందిన వీడియోలో ఒక కాలువలో పడవలు.. ఒకదాని వెంట ఒకటి వెళ్తూ ఉన్నాయి. ఈ వీడియో షేర్ చేస్తూ.. ''ముంబై తరహా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడానికి మాత్రమే వెనిస్ వరకు ప్రయాణించారు. ముంబైతో పోలిస్తే ఇది కొంత తక్కువే అని నేను అంగీకరిస్తున్నాను'' అని అన్నారు. దీనికి సండే ఫీలింగ్ అంటూ ఓ హ్యస్టాగ్ కూడా ఇచ్చారు.ఇదీ చదవండి: రాత్రిపూట వెలుగు ఆర్డర్ చేసుకోవచ్చు.. మీరు ఎక్కడంటే అక్కడ!Traveled all the way to Venice only to run into a Mumbai-style traffic jam!(Ok, I admit this traffic pile-up is less stressful…🙂)#SundayFeeling pic.twitter.com/n25G8Y5upk— anand mahindra (@anandmahindra) September 15, 2024 -
వెంబడిస్తున్న టీఎస్ఐని కారుతో ఢీకొట్టి..
ఢిల్లీకి ఆనుకునివున్న నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. అతివేగంతో వెళుతున్న కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్(టీఎస్ఐ)ను కారుతో బలంగా ఢికొట్టి, తీవ్రంగా గాయపరిచిన ఉదంతం వెలుగు చూసింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ జై ప్రకాష్ సింగ్ నోయిడాలోని రజనీగంధా కూడలిలో విధులు నిర్వహిస్తుండగా, అతనికి అనుమానాస్పద వాహనం గురించిన సమాచారం అందింది. వెంటనే ఆయన ఆ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా, అందులోని డ్రైవర్ కారును అత్యంత వేగంగా పోనిచ్చాడు.వెంటనే జై ప్రకాష్ సింగ్ ఒక స్కూటీ లిఫ్ట్ తీసుకొని కారును వెంబడించి, అట్టా రెడ్ లైట్ దగ్గర ఓవర్టేక్ చేసి కారును ఆపడానికి ప్రయత్నించారు. అయితే ఇంతలో ఆ కారు డ్రైవర్ స్కూటీని ఢీకొట్టి, జై ప్రకాష్ సింగ్‌ను తీవ్రంగా గాయపరిచి, కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. టీఎస్ఐ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ వాహనాన్ని సీజ్ చేశారు. నిందితుని కోసం గాలింపు చేపట్టారు. -
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్‌లో వర్షం దంచి కొట్టింది.. సోమవారం మధ్యాహ్నం కుండ పోతగా వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయ్యాయి. ముఖ్యంగా, రాజేంద్ర నగర్, మణికొండ, గండిపేట, జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, సికింద్రాబాద్, నాంపల్లి, మెహిదిపట్నం, టోలీచౌకి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్రం ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల రోడ్లపై నడుములోతు నీళ్లు నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనాలు మొరాయించాయి.హైదరాబాద్‌లో వర్షం పడడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు తీవ్రంగా ఎండ కాసింది. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. అంతలోనే భారీ వర్షం కమ్ముకొచ్చింది. తొలుత చిరుజల్లులు మొదలయ్యాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా భారీ వర్షం కురిసింది. రోడ్లపైన ఉన్నవాళ్లు ఎక్కడైనా తలదాచుకుందామా అనుకునేలోపు పూర్తిగా తడిచిపోయారు. దీనికి తోడు ఓ వైపు ట్రాఫిక్ జామ్, రోడ్లపై భారీగా నిలిచిపోయిన నీళ్లతో ప్రత్యక్షంగా నరకం చూసినంత పనైంది. మరోవైపు నగరంలో మరో రెండు మూడు గంటల్లో భారీగా వర్షం పడే అవకాశం ఉందని జారీ చేసిన హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. -
K Padmaja: సవాళ్లే పట్టాలెక్కించేది
దక్షిణ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పిసిసిఎమ్) గా భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ సీనియర్ అధికారి కె.పద్మజ హైదరాబాద్ రైల్ నిలయంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. 1991 ఐఆర్టిఎస్ బ్యాచ్‌కు చెందిన పద్మజ ఎస్‌సిఆర్‌లో మొట్టమొదటి మహిళా పిసిసిఎమ్. ‘ఇప్పుడంటే మహిళా అధికారులను అందరూ అంగీకరిస్తున్నారు కానీ, 30 ఏళ్ల క్రితం పురుష ఉద్యోగులు నా నుంచి ఆర్డర్స్ తీసుకోవడానికే ఇబ్బంది పడేవారు..’ అంటూ నాటి విషయాలను చెబుతూనే, ఉద్యోగ జీవనంలో సవాళ్లను ఎదుర్కొన్న తీరు తెన్నులను ‘సాక్షి’తో పంచుకున్నారు.‘‘సౌత్ సెంట్రల్ రైల్వేలో మొట్టమొదటి మహిళా ఆఫీసర్‌గా ఈ పోస్ట్‌లోకి రావడం చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడంటే వర్క్‌ఫోర్స్‌లో చాలామంది అమ్మాయిలు వస్తున్నారు. కానీ, నేను జాయిన్ అయినప్పుడు ఒక్కదాన్నే ఉండేదాన్ని. కొత్తగా వర్క్‌లో చేరినప్పుడు ఒక తరహా స్ట్రెస్ ఉండేది. నన్ను నేను చాలా సమాధానపరుచుకునేదాన్ని. ‘ఒక్కదాన్నే ఉన్నాను అని ఎందుకు అనుకోవాలి.. ఎవరో ఒకరు రూట్ వేస్తేనే ఆ తర్వాత వచ్చే మహిళలకు మార్గం సులువు అవుతుంది కదా’ అనుకునేదాన్ని.ఎదుర్కొన్న సవాళ్లుమొదట్లో డివిజనల్ ఆఫీస్ మేనేజర్‌గా జాయిన్ అయినప్పుడు ఒక మహిళను అధికారిగా అంగీకరించడానికి సహోద్యోగులకే కష్టంగా ఉండేది. నేను మొదటిసారి ఇన్స్పెక్షన్కి వెళ్లినప్పుడు స్టేషన్ మాస్టర్‌కి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. మొదట వాళ్లు నమ్మలేదు. ఆఫీసుకు ఫోన్ చేసి ‘ఇక్కడెవరో లేడీ వచ్చారు. ఆవిడేమో నేను డివిజనల్ ఆఫీస్ మేనేజర్ని అంటోంది, ఏమిటిది?’ అని అడిగారు. మా కొలీగ్ ‘ఆవిడ కూడా నాలాగే ఆఫీసర్’ అంటే అప్పుడు వాళ్లు అంగీకరించక తప్పలేదు. ఆ స్టేజ్ నుంచి ఇక్కడకు రావడానికి చాలా సవాళ్లు ఉన్నాయి. మొదట్లో గుర్తించిన మరో విషయం ఏంటంటే తోటి ఉద్యోగులు చాలామంది నా నుంచి ఆర్డర్స్ తీసుకోవడానికే ఇబ్బంది పడేవారు. దీంతో ‘నేను ఎక్స్పర్ట్ అయితేనే ఈ అసమానతను తొలగించగలను’ అనుకున్నాను. అందుకు, నా పనిని ఎప్పుడూ ముందు చేసినదానికన్నా బెటర్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాను. పనిచేసే చోట రూల్స్ పరంగా అన్నీ క్లియర్‌గా ఉంటాయి. అయితే, మనతో ఉండే కొలీగ్స్, సీనియర్స్ విషయంలో వారి ప్రవర్తనలో తేడాలు కనిపిస్తుంటాయి. ‘ఇంత సమర్థంగా చేస్తున్నా కూడా ఇంకా వివక్షతోనే చూస్తున్నారే..’ అని అనిపించేది. ఇంటì నుంచి బయటకు వచ్చినప్పుడు వీటన్నింటినీ ఎదుర్కోకతప్పదు అన్నట్టుగా ఉండేవి ఆ రోజులు. ఇప్పటి తరంలో ఈ ఆలోచన పూర్తిగా మారిపోయింది. అయితే, ఏదీ అంత సులువైనది కాదు, కష్టమైన జర్నీయే. కానీ, నిన్నటి కన్నా ఈ రోజు బెటర్‌గా మార్చుకుంటూ రావడమే నన్ను ఇలా ఒక ఉన్నత స్థానంలో మీ ముందుంచ గలిగింది. ముఖ్యమైనవి వదులుకోవద్దుపిల్లల చిన్నప్పుడు మాత్రం తీరిక దొరికేది కాదు. ఉద్యోగం, ఇల్లు, వేడుకలు.. వీటన్నింటిలో కొన్ని త్యాగాలు చేయక తప్పలేదు. వాటిని మనం అంగీకరించాల్సిందే. అయితే, ముఖ్యమైన వాటిని వదిలేదాన్ని కాదు. నాకు ఇద్దరు కూతుళ్లు. ఇప్పుడు వాళ్లు వర్కింగ్ ఉమెన్. డ్యూటీ చూసుకుంటూనే పిల్లల పేరెంట్ టీచర్ మీట్, స్పోర్ట్స్ మీట్, స్కూల్ ఈవెంట్స్.. తప్పనిసరి అనుకున్నవి ఏవీ మిస్ అయ్యేదాన్ని కాదు. ఆఫీస్ పని వల్ల ఇంట్లో ముఖ్యమైన వాటిని వదులుకున్నాను ... అనుకునే సందర్భాలు రాకూడదు అనుకునేదాన్ని. ఉద్యోగంలో చేరిన కొత్తలో ఊపిరి సలుపుకోనివ్వనంత గా పనులు చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉండేది. అయితే, వర్క్‌ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టినతర్వాత అన్నీ సులువుగా బ్యాలన్స్ చేసుకో గలిగాను. మా నాన్నగారు ఐఎఎస్ ఆఫీసర్ కావడంతో తరచు బదిలీలు ఉండేవి. మా అమ్మానాన్నలు ఎంతో బిజీగా ఉండి కూడా మాతో ఎలా ఉండేవారో తెలుసు కాబట్టి, నేనే సరైన టైమ్ ప్లానింగ్ చేసుకోవాలి అనుకున్నాను. ఏదైనా పనికి గంట సమయం కుదరకపోతే అరగంటలోనైనా పూర్తి చేయాలి. ప్లానింగ్ మన చేతుల్లో ఉన్నప్పుడు దేనినీ వదులుకోవాల్సిన అవసరం లేదు. నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టం. ఇప్పటికీ రోజూ కొంతసమయం బుక్స్‌కి కేటాయిస్తాను. అలాగే, మొక్కల పెంపకం పట్ల శ్రద్ధ తీసుకుంటాను. పాజిటివ్ ఆలోచనలు మేలు..ముందుగా మహిళ ఇతరుల మెదళ్ల నుంచి ఆలోచించడం మానేయాలి. వాళ్లేం అనుకుంటారో, వీళ్లేం అంటారో... అనే ఆలోచన మన జీవితాన్ని నరక మయం చేస్తుంది. కెరియర్ మొదట్లోనే మన కల పట్ల స్పష్టత ఉండాలి. ఎన్ని సమస్యలు వస్తున్నా మనకంటూ ఒక స్పష్టమైన దారిని ఎంచుకోవాలి. సగం జీవితం అయిపోయాకనో, పిల్లలు పెద్దయ్యాక చూద్దాంలే అనో అనుకోవద్దు. ముందుగా అన్ని రకాలుగా స్థిరత్వం ఉండేలా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలి. సమస్యలు వచ్చేదే మనల్ని ధైర్యంగా ఉంచడానికి అనుకోవాలి. మనకు ఏం కావాలో స్పష్టత ఉంటే బ్యాలెన్స్ చేసుకోవడం సులువు అవుతుంది’’ అంటూ సొంతంగా వేసుకున్న దారుల గురించి వివరించారు ఈ ఆఫీసర్. కుటుంబ మద్దతుట్రెయిన్స్కు సంబంధించిన సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, ప్రమాదాలు.. వంటి సమయాల్లో నైట్ డ్యూటీస్ కూడా తప్పనిసరి. నిరంతరాయంగా పని చేస్తూనే ఉండాలి. మా పని ఈ కొద్ది గంటలు మాత్రమే అన్నట్టు ఏమీ ఉండదు. 24/7 ఏ సమయంలోనైనా డ్యూటీలో ఉండాల్సిందే. మా పేరెంట్స్, కుటుంబ సభ్యులందరూ నా బాధ్యతలను, పని ఒత్తిడిని అర్థం చేసుకొని, పూర్తి మద్దతుని, సహకారాన్ని ఇవ్వడం వల్ల నేను నిశ్చింతగా నా పనులు చేçసుకోగలిగాను.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటో: నోముల రాజేష్‌రెడ్డి -
అర్ధరాత్రి పోలీసులపై టీడీపీ గుండాల దాడి..
-
పూజా ఖేడ్కర్ ఉక్కిరిబిక్కిరి.. మరో వివాదంలో ట్రైనీ ఐఏఎస్
పూణే: ట్రైనీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. వరుస ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఇటీవల మహరాష్ట్ర పూణే జిల్లాలో ట్రైనీ ఐఏఎస్ అధికారికగా పనిచేస్తున్న పూజా ఖేడ్కర్ తాను వినియోగించే ఆడికారుకు అనధికారికంగా రెడ్ బీకాన్ లైట్ల వినియోగం,గవర్నమెంట్ ఆఫ్ మహరాష్ట్ర అని స్కిక్కర్లు అంటించడంతో పాటు పై అధికారులు లేని సమయంలో వారి ఛాంబర్లను అనుమతి లేకుండా ఉపయోగించుకోవడంపై వివాదం తలెత్తింది. అందుకు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులు జరుపుకున్న వాట్సప్ చాటింగ్ వెలుగులోకి వచ్చింది. నాటి నుంచి పూజా ఖేడ్కర్ వివాదాలతో కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ వస్తున్నారు. తాజాగా ఖేడ్కర్ వినియోగిస్తున్న ఆడికారు 21 సార్లు ట్రాఫిక్స్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ట్రాఫిక్ పోలీసులు నోటీసులు ఆమె ఇంటికి నోటీసులు పంపించడం చర్చనీయాంశంగా మారింది. ఆ నోటీసుల్లో ఆడికారును నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. వాటిపై రూ.27వేలు జరిమానా చెల్లించాలని పూజా ఖేడ్కర్‌కు అధికారులు నోటీసు జారీ చేశారు .నిబంధనల్ని ఉల్లంఘించి ‘మీ ప్రైవేట్ వాహనం ముందు,వెనుక భాగంలో ‘మహారాష్ట్ర గవర్నమెంట్’ స్కిక్కర్లు అంటించడం,రెడ్ బీకన్ లైట్‌ను కూడా ఫిక్స్ చేశారు. . అందుకు నోటీసులు ఇచ్చేందుకు ట్రాఫిక్ అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. ఆసమయంలో ఎవరూ లేరని అధికారులు అన్నట్లు తెలుస్తోంది. అనేక ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినా పూణే పోలీసులు ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మరి దీనిపై ఖేడ్కర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. కాగా, వరుసగా వస్తున్న ఆరోపణలపై విలేకరులు ఆమె స్పందన కోరగా..‘ఈ అంశంపై మాట్లాడే అధికారం నాకు లేదు. ప్రభుత్వ నియమాలు నాకు దీనిపై మాట్లాడేందుకు అనుమతించవు’అని అన్నారు. -
‘అనంత్-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల పెళ్లి వేడుకను పురస్కరించుకుని ముంబయిలో ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా స్థానిక పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ముందస్తు ప్రకటన విడుదల చేశారు. జులై 12 నుంచి 15 వరకు అనంత్-రాధికల వివాహ వేడుక జరిగే బాందాకుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లోని జియో కన్వెన్షన్ సెంటర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఈ ట్వీట్‌పై స్పందించిన ఓ నెటిజన్ ‘అంబానీ పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’ అని కామెంట్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారుతుంది.ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేశ్ అంబానీ ఇంట్లో పెళ్లంటే మామూలుగా ఉంటుందా..! ఇప్పటికే అంగరంగ వైభవంగా రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ను జరుపుకున్నారు. అందుకోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. ఈ సెలబ్రేషన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు వందల సంఖ్యలో హాజరయ్యారు. మరి పెళ్లికి ఇంకెందరు వస్తారోననే చర్చ జరుగుతోంది. అయితే అలా వస్తున్న వారికి ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా ముంబయి ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.ముంబయి ట్రాఫిక్ పోలీసులు ‘ఎక్స్’ ప్లాట్ఫామ్లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం..2024 జులై 12-15 వరకు ముంబయిలోని బాందాకుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో సామాజిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు, వీఐపీలు వస్తున్నారు. దాంతో భద్రతా కారణాల వల్ల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వైపునకు వెళ్లే వాహనాలను వేరే మార్గానికి మళ్లిస్తున్నామని తెలిపారు.పోలీసుల ప్రకటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘అనంత్ అంబానీ పెళ్లి ఈవెంట్ పబ్లిక్ ఈవెంట్ ఎలా అవుతుంది?’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. ‘హత్రాస్ భోలేబాబా వ్యవహారం కంటే అంబానీ పెళ్లికి ప్రభుత్వం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోంది.. కారణం ఏంటో..’ అని ఒకరు, ‘అంబానీ పెళ్లి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’ అని మరొకరు కామెంట్లు చేస్తున్నారు.Due to a public event at the Jio World Convention Centre in Bandra Kurla Complex on July 5th & from July 12th to 15th, 2024, the following traffic arrangements will be in place for the smooth flow of traffic.#MTPTrafficUpdates pic.twitter.com/KeERCC3ikw— Mumbai Traffic Police (@MTPHereToHelp) July 5, 2024ఇదీ చదవండి: సంగీత్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన అంబానీ కుటుంబంఅనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలు శుక్రవారం(జులై 12)న శుభ వివాహ్‌తో ప్రారంభమవుతాయి. జులై 13 శనివారం శుభ్ ఆశీర్వాద్, జులై 14న మంగళ్ ఉత్సవ్ కార్యక్రమాలతో ముగుస్తాయి. -
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
సాక్షి,హైదరాబాద్: భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో ఆదివారం(జూన్30) సాయంత్రం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా రోడ్లపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులెదురయ్యాయి. సికింద్రాబాద్, బేగంపేట్, బోయిన్పల్లి, తిరుమలగిరి, బొల్లారం రామంతాపూర్, ఉప్పల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, కేపీహెచ్‌బీ, కూకట్పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, బోరబండ, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, మైత్రీవనం, అమీర్‌పేట, పంజాగుట్టల్లో భారీ వర్షం కురిసింది. వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.రోడ్లపై అక్కడక్కడా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద సమస్య ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఆదివారం(జూన్23) సాయంత్రం భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, బోరబండ, పంజాగుట్ట, యూసఫ్‌గూడ, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, చంపాపేట్, సైదాబాద్, చాదర్‌ఘాట్, మలక్‌పేట్, సరూర్‌నగర్, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, బోరబండపంజాగుట్ట, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఎల్బీనగర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షంతో పలుచోట్ల ట్రాఫిక్‌జామ్ అయింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరదనీరు చేరింది. ఓ వైపు రహదారి విస్తరణ పనులు, మరోవైపు వరదనీటితో వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. పలు చోట్ల వరద నీటి కారణంగా వాహనాలు స్లోగా వెళ్లాయి. -
ట్రాఫిక్‌పై డ్రోన్ కన్ను
సాక్షి, హైదరాబాద్: నిత్యం బిజీగా ఉండే రోడ్డు.. మధ్యలో ఓ కారు మొరాయించి నిలిచిపోయింది. దాంతో ట్రాఫిక్ జామ్ మొదలైంది. ఆ ప్రాంతానికి పైన గాల్లో ఎగురుతున్న ‘డ్రోన్’ద్వారా పోలీసులు ఇది చూశారు. వెంటనే ట్రాఫిక్ రిలీఫ్ వ్యాన్ వచి్చ, మొరాయించిన కారును అక్కడి నుంచి తరలించింది. వాహనాలన్నీ సాఫీగా ముందుకు సాగిపోయాయి. అంటే భారీగా ట్రాఫిక్ జామ్ కాకముందే.. సమస్య పరిష్కారమైపోయింది. ఇదేదో చాలా బాగుంది కదా. ఇకపై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ చిక్కులకు ఇలా సింపుల్‌గా చెక్ పడిపోనుంది. తొలుత సైబరాబాద్ పరిధిలో.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో దీనికి సంబంధించి ‘థర్డ్ ఐ ట్రాఫిక్ మానిటరింగ్ డ్రోన్’అందుబాటులోకి వచ్చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద ఐకియా, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, హఫీజ్‌పేట, హైటెక్ సిటీ, మాదాపూర్, రాయదుర్గం తదితర ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఆదివారం ఈ డ్రోన్‌ను వినియోగించారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు, వాహనాల రద్దీ ఎక్కడ ఎక్కువగా ఉంది? జంక్షన్ల వద్ద వాహనాల వేగం ఎలా ఉంది? ఎక్కడైనా నీరు నిలిచి ఉందా? అనే అంశాలతోపాటు రోడ్డు ప్రమాదాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ఏదైనా సమస్య ఏర్పడితే ట్రాఫిక్ పోలీసు బృందాలు వెంటనే స్పందించి పరిష్కరించవ చ్చు. వాహనాలు సు లభంగా, వేగంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. ఎలా పనిచేస్తాయంటే..? థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ, రేడియో ఫ్రీక్వెన్సీల సాయంతో ఈ డ్రోన్ సైబరాబాద్ కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమై ఉంటుంది. భూమి ఉపరితలం నుంచి 150–170 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. ఈ డ్రోన్‌కు ఉండే మూడు అత్యాధునిక కెమెరాలతో, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్డు మీద ట్రాఫిక్ జామ్‌లు, వాహనాల రద్దీ, కదలికలను చిత్రీకరిస్తుంది.రియల్ టైమ్‌లో కంట్రోల్ సెంటర్‌కు పంపిస్తుంది. కంట్రోల్ సెంటర్ సిబ్బంది ట్రాఫిక్ పరిస్థితి, రద్దీని విశ్లేíÙంచి, ఏదైనా సమస్య ఉంటే గమనించి క్షేత్రస్థాయిలోని ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇస్తారు. తద్వారా ట్రాఫిక్‌ను క్రమబదీ్ధకరిస్తారు. గాలిలో ఏకధాటిగా 45 నిమిషాల పాటు తిరగగలిగే సామర్థ్యమున్న ఈ డ్రోన్ 15 కిలోమీటర్ల దూరం వరకు హెచ్డీ క్వాలిటీ వీడియోను పంపించగలదు. ఇతర కమిషనరేట్లలో.. సైబరాబాద్ పోలీసుల ట్రాఫిక్ నిర్వహణ కోసం డ్రోన్లను వినియోగించాలని గతంలోనూ ఆలోచన చేశారు. అప్పుడప్పుడు డ్రోన్లను అద్దెకు తీసుకొచ్చి వినియోగించేవారు. తాజాగా కార్పొరేట్ సామాజిక సేవ (సీఎస్ఆర్) కింద ‘సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ)’నిధులతో సొంతంగా ఒక డ్రోన్‌ను కొనుగోలు చేశారు. దీని ఫలితాలను బట్టి మరిన్ని డ్రోన్లను సమకూర్చుకోనున్నారు.ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో వినాయక నిమజ్జనం, హనుమాన్ జయంతి, బోనాలు, శ్రీరామనవమి, షాబ్–ఈ–బరాత్ వంటి ర్యాలీలు, జాతరల సమయంలో డ్రోన్లను వినియోగిస్తూ నిఘా పెడుతున్నారు. ఇకపై ట్రాఫిక్ పర్యవేక్షణ కోసమూ వినియోగించనున్నారు. హైదరాబాద్‌లో డ్రోన్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ కోసం ప్రత్యేకంగా ‘డీ–కెమో’విభాగం ఉంది. దీనికి డీసీపీ/ఏసీపీ ర్యాంకు అధికారి హెడ్‌గా ఉంటారు.ట్రాఫిక్ పోలీసులకు శిక్షణ డ్రోన్ ఆపరేషన్ ప్రాథమిక దృష్టి ముఖ్యంగా ఐటీ కారిడార్ మీద ఉంటుంది. ఇక్కడ అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడంలో ట్రాఫిక్ పోలీసులకు డ్రోన్ సాయం అందిస్తుంది. ఈ మేరకు డ్రోన్ వినియోగంపై ట్రాఫిక్ పోలీసులకు శిక్షణ ఇవ్వనున్నాం. – అవినాష్ మహంతి,పోలీస్ కమిషనర్, సైబరాబాద్‘ట్రాఫిక్’కు వాడే డ్రోన్ ప్రత్యేకతలు ఇవీ:డ్రోన్ పేరు: మావిక్ 3 ప్రో ధర: రూ.5.5 లక్షలు బరువు: ఒక కిలో బ్యాటరీ: 5 వేల ఎంఏహెచ్. సుమారు 4 గంటల బ్యాకప్ గరిష్ట ఎత్తు: భూమి ఉపరితలం నుంచి 400 మీటర్లు విజిబులిటీ: 5 కిలోమీటర్ల దూరం వరకు గరిష్ట వేగం: సెకన్‌కు 8 మీటర్లు. గాలి, వర్షం లేకపోతే వరి్టకల్‌గా సెకన్‌కు 21 మీటర్ల వేగంతో ఎగరగలదు. స్టోరేజ్ 8 జీబీ నుంచి 1 సామర్థ్యం: టీబీ వరకు ఉంటుంది. -
గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షాలకాలంలో ట్రాఫిక్ కష్టాలు
-
మౌంట్ ఎవరెస్ట్‌పై భారీగా ట్రాఫిక్‌జామ్!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరంపై పర్యాటకుల తాకిడి పెరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇంతమంది ఈ ఉన్నత పర్వతాన్ని అధిరోహించడానికి సిద్ధమయ్యారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే వారి సంఖ్య ప్రతి ఏటా వేగంగా పెరుగుతోంది. బేస్ క్యాంప్‌లో పర్యాటకులు క్యూ కడుతున్నారు. బీబీసీ నివేదిక ప్రకారం ఇటీవల ఇద్దరు పర్వతారోహకులు మృతి చెందారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వందలాది మంది పర్వతారోహకుల క్యూ కనిపిస్తుంది. వీరిని చూస్తుంటే నగరంలోని రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారేమోనని అనిపిస్తుంది.ఈ ఫొటోను చూసిన ది నార్తర్నర్ అనే యూజర్ ఇలా రాశాడు. ‘ఎవరెస్ట్ అతి ఎత్తయిన శిఖరం. అయిత ఇప్పుడది మురికిగా మారింది. ఇక్కడ మనుషుల మృతదేహాలు కనిపిస్తున్నాయి. మంచులో కూరుకుపోతున్నవారికి సహాయం అందించేందుకు ఇక్కడ ఎవరూ లేరు. కాలుష్యం మరింతగా పెరుగుతోంది. చుట్టూ దుమ్ము, ధూళి కనిపిస్తోంది. ఇది ఎప్పటికి అదుపులోకి వస్తుంది?’ అని ప్రశ్నించాడు.భారత పర్వతారోహకుడు రాజన్ ద్వివేది మే 19 ఉదయం 6 గంటలకు ఎవరెస్టును విజయవంతంగా అధిరోహించారు. ఆయన అక్కడి పరిస్థితి చూసి విచారం వ్యక్తం చేశారు. ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ‘ఎవరెస్ట్ పర్వతారోహణ అంత సులభం కాదు. 1953 మేలో తొలిసారిగా ఎవరెస్ట్ అధిరోహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం ఏడు వేల మంది ఎవరెస్ట్‌ను అధిరోహించారు. అయితే ఇక్కడి చలి వాతావరణం, గాయాల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా మృతి చెందిన వారికి సంబంధించిన డేటా ఎక్కడా లేదు. దానిని ఎవరూ లెక్కించడం లేదు. గంటకు 100 నుండి 240 మైళ్ల వేగంతో వీచే బలమైన గాలులను ఎదుర్కోవడం పర్వతారోహకులకు పెద్ద సవాలు’ అని ఆయన పేర్కొన్నారు. రాజన్ ద్వివేది ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ఆ వీడియోలో మంచు శిఖరాలపై లెక్కకు మించిన పర్వతారోహకులు కనిపిస్తారు. Everest; the highest, the dirtiest and the most controversial place on Earth. Humans bypassing corpses, leaving people dying, ignoring help cries, making it dirtiest place with pollution & human wastes ; all for the glory of summit. When will it stop?! #StopCommercialAlpinism pic.twitter.com/Yahobk9c5F— The Northerner (@northerner_the) May 25, 2024 -
చిలకలూరిపేట సభపై ఎల్లో మీడియా వక్రభాష్యం
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహంలోకి వెళుతున్నట్లుగా ఉంది. ఒకవైపు జనసేన, BJPలను బతిమలాడుకుని పొత్తు పెట్టుకున్న ఆయన, వ్యవస్థలపై దృష్టి సారించినట్లుగా ఉంది. 58 నెలలపాటు న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని నిత్యం కేసులు వేస్తూ , ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వానికి అడుగడుగున ఆటంకాలు కల్పిస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు కీలకమైన ఈ రెండు నెలలు తన మిత్రపక్షం బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెచ్చి వీలైనంతమేర YSR కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అన్ని రాజకీయ పార్టీలకు ఈ రెండు నెలలు కీలకం అవుతాయి. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న కూటమి సభ విఫలం అవడంతో , ఆ నెపం మొత్తాన్ని పోలీసులపైన తోసేసి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నాలు ఆరంభించారు. DGPతో పాటు కొందరు IPS అధికారులను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముఖ్య అదికారి మీనాకు ఫిర్యాదు చేసింది. దానిపై జనసేన, BJP ప్రతినిధులు కూడా సంతకాలు చేసి ఆ పాపంలో పాలు పంచుకున్నారు. నిజంగా ప్రధాని మోడీ సభ అంత నాసిరకంగా జరగడానికి కారణం ఎవరు? నిర్వహణ బాధ్యతలన్నీ తెలుగుదేశం నేతలే తీసుకున్నారు కదా! అలాంటప్పుడు వైఫల్యానికి కూడా వారే బాద్యత వహించాలి కదా! దానిని కప్పిపుచ్చే ప్రయత్నం స్పష్టంగా కనబడుతోంది. (సభ ఏర్పాట్లను పూర్తిగా దగ్గరుండి పర్యవేక్షించిన లోకేష్) మిత్రపక్షంగా బిజెపి అయిందో లేదో, వెంటనే చంద్రబాబు నాయుడు తన మేనేజ్ మెంట్ స్కిల్ ఉపయోగించి ఎన్నికలను నెల రోజులు ఆలస్యంగా జరిగేలా చేశారన్నది ఎక్కువ మంది భావన. ఇక ఇప్పుడు ఎపిలో చిత్తశుద్దితో పనిచేస్తున్న పోలీసు అధికారులపై దాడి చేసి వారిని భయోత్పాతానికి గురి చేయడం ద్వారా లబ్ది పొందాలన్న కుట్రకు తెరలేపారు. అందుకే మోడీ సభకు సంబందించి టిడిపి ఫిర్యాదు చేసిందన్న భావన ఏర్పడింది. ఆ ఫిర్యాదు పత్రంలో పేర్కొన్న అంశాలు చూడండి. తాము ముందస్తుగానే పోలీసులకు భద్రత ఏర్పాట్ల గురించి లేఖ రాసినా, అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని, భద్రత ఏర్పాట్లలో లోపాలకు డిజిపి బాద్యుడని ఎన్నికల ముఖ్య అధికారికి టిడిపి రాసిన లేఖలో తెలిపింది. జన సమూహాన్ని నియంత్రించడం, ట్రాఫిక్‌ను క్రమబద్దం చేయడంలో పోలీసులు విఫలం అయ్యారని టిడిపి ఆరోపణ. అందువల్లే కూటమి బహిరంగ సభలో ప్రజలు తోసుకుంటూ ముందుకు వచ్చారని, అలాగే మైక్ సౌండ్ సిస్టమ్ వైపు కూడా వచ్చారని టిడిపి పేర్కొంది. దానివల్ల మోడీ స్పీచ్ ఇస్తున్నప్పుడు పలుమార్లు మైక్ ఆగిపోయిందని ఆ పార్టీ ఫిర్యాదుగా ఉంది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని ఆ పార్టీ ఆరోపించింది. ప్రధాని పలుమార్లు టవర్ల నుంచి దిగాలని సభకు వచ్చినవారిని కోరినా, పోలీసులు చొరవ తీసుకోలేదని పార్టీ ఆరోపించింది. మోడీని సత్కరించడానికి తెచ్చిన పుష్పగుచ్చాన్ని కాని, శాలువాని కాని పోలీసులు అనుమతించలేదని చిత్రమైన ఫిర్యాదు చేసింది. ఇదంతా YSRCPతో పోలీసులు కుమ్మక్కయి కుట్ర చేశారని టిడిపి అభియోగం. ఇక సభకు వస్తున్న వాహనాలను జాతీయ రహదారిపై కావాలని ఆపేశారని మరో ఆరోపణ చేసింది. సభకు వచ్చిన వారి అత్యుత్సాహం వల్లే మైక్ సిస్టమ్ పని చేయకుండా నిలిచిపోయిందని మాత్రం టిడిపి అంగీకరించడం విశేషం. డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి, ఐజి పాలరాజు, పల్నాడు ఎస్పి రవిశంకర్ రెడ్డిలపై ఆరోపణలు గుప్పిస్తూ టిడిపి ఈ లేఖ రాసింది. (సభలో పరిస్థితి) ఈ లేఖలోని ఆరోపణలపై జాగ్రత్తగా పరిశీలన చేసినా, విచారణ జరిపినా కొన్ని విషయాలు తేలికగా తెలిసిపోతాయి. లేఖ ఆసాంతం పరిశీలిస్తే.. తెలుగుదేశం పార్టీ డొల్లతనం బయటపడుతుంది. ప్రధాని మోడీ పాల్గొన్న సభకు భద్రత ఏర్పాట్ల నిమిత్తం నాలుగువేల మంది పోలీసులను నియమించారు. అయినా తక్కువ మందిని పెట్టారని అసత్యపు ఆరోపణను కూటమి నేతలు చేశారు. కరెంటు పోయిందన్నది అబద్దమని చెబుతున్నారు. సభా ప్రాంగణానికి ప్రత్యేకంగా విద్యుత్ లైనే లేదట. సభ అంతా జనరేటర్ పై ఆధారపడి ఏర్పాటు చేసుకున్నారట. అలాంటప్పుడు కరెంటు పోయే సమస్య ఎక్కడ నుంచి వస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. మైక్ సిస్టమ్ సరైనది ఎంపిక చేసుకునే బాధ్యత టిడిపి వారిదే కాని, పోలీసులకు ఏమి సంబంధం? చిలకలూరిపేట ప్రాంతంలో రికార్డింగ్ డాన్స్ లకు వాడే మైక్ సిస్టమ్‌ను తెలుగుదేశం నేతలు తీసుకురావడంతోనే ఈ సమస్య వచ్చిందన్నది స్థానికుల అభిప్రాయంగా ఉంది. ఒకసారి ప్రధాని భద్రత కోసం వచ్చే ప్రాంగణాన్ని SPG అధీనంలోకి తీసుకున్న తర్వాత స్థానిక పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఉండవు. SPG అనుమతి ఇచ్చి ఉంటే ప్రధాని కోసం టిడిపి తెచ్చిన పుష్పగుచ్ఛం, శాలువాను స్థానిక పోలీసులు అనుమతించకుండా ఎలా ఉంటారు? (మోదీని సన్మానిస్తారని ప్రకటన చేయగా.. శాలువాలు, పూలబోకే లేక దిక్కులు చూస్తోన్న బాబు, పవన్) టిడిపి నేతలు చేసినవన్నీ అబద్దపు ఆరోపణలని పోలీసు అధికారుల సంఘం నేతలు చెబుతున్నారు. పోలీసులకు రాజకీయ రంగు పులమడం సరికాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. సభ ఎజెండా ఖరారు చేసుకునేటప్పుడు అన్ని సిద్ధంగా ఉన్నాయా ? లేదా? అన్నది చూసుకోవల్సిన బాధ్యత కూటమి నేతలపై ఉంటుంది. వారు వాటిని ఎందుకు చెక్ చేసుకోలేదు? ఇదే టైమ్ లో బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఒక విగ్రహ జ్ఞాపికను వేదిక మీదకు ఎలా తీసుకు వెళ్లగలిగారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చేతులూపుకుంటూ వెళ్లి కూర్చున్నారే కాని, ప్రధానిని సత్కరించడానికి అవసరమైన ఏర్పాట్ల గురించి ఎందుకు ఆరా తీయలేదో తెలియదు. రోడ్లపై ట్రాఫిక్ ను రెగ్యులేట్ చేయలేదని ఇంకో తప్పుడు ఆరోపణ చేశారు. నిజానికి ఈ సభ కోసం భారీగా ఏమీ వాహనాలు రాలేదు. ఆ విషయం గమనించిన తెలుగుదేశం వారు రోడ్డుపై కొన్ని వాహనాలను అడ్డంగా నిలిపి, చాలా వాహనాలు ఆగిపోయినట్లు కలరింగ్ ఇస్తూ దానిని డ్రోన్ ద్వారా వీడియో తీశారు. కాని ఆ విషయం బయటపడిపోవడంతో ఈ దిక్కుమాలిన ఫిర్యాదు చేశారు. ఎప్పుడూ ఏదో ఒక అబద్దపు ప్రచారంతో నెట్టుకువచ్చే తెలుగుదేశం పార్టీ ఈ రకంగా కూడా ప్రజలను మోసం చేసే యత్నం చేసింది. RTC బస్ లు తగినన్ని ఇవ్వలేదని టిడిపి మీడియా ప్రచారం చేసింది. విషయం ఏమిటంటే 2500 RTC బస్‌లను రిజర్వు చేసుకున్న టిడిపి వాటిలో 1500 బస్ లను ఎందుకు కాన్సిల్ చేసిందో కూడా వివరించాలి కదా! అసలు రాష్ట్రంలో వారివల్ల ఎక్కడ ఏ తప్పు జరిగినా, ముందుగా ఎదుటివారిపై తోసేయడం చంద్రబాబు బృందానికి అలవాటేనన్నది రాజకీయ వర్గాల విమర్శగా ఉంది. ప్రధాని మోడీ సభలో ఏదైనా అలజడి జరిగితే దానిని ప్రభుత్వంపై నెట్టి రాజకీయ లబ్ది పొందాలన్నది వారి లక్ష్యం కావచ్చని అనుమానిస్తున్నారు. సభలో ప్రజలు ఎవరూ టవర్లు ఎక్కకుండా అక్కడ పార్టీ వలంటీర్లనో, కార్యకర్తలనో పెట్టుకోవలిసిన టిడిపి ఎందుకు ఆ పని చేయలేదు? ఆయా టిడిపి సభలలో ఒక యాంకర్ మాదిరి వైర్ లెస్ కార్డు సిస్టమ్ వాడి ప్రసంగం చేసే చంద్రబాబుకు పాతపద్దతిలో మైక్ సిస్టమ్ ఎలా అనుమతించారు? గతంలో కందుకూరు వద్ద ఇరుకు రోడ్డుపై సభ పెట్టి తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించిన ఏం చేశారు? గుంటూరులో చంద్రబాబు సభకు వచ్చేవారికి చీరలు ఇస్తామని ప్రకటించి,వేలాది మంది వచ్చేలా చేసి, అక్కడ సరిగా నిర్వహించకుండా తొక్కిసలాట జరిగినప్పుడు ఏం చేశారు? మనుష్యులు మరణించినప్పుడు ఆ నెపాన్ని పోలీసులపైనే నెట్టేయలేదా? గోదావరి పుష్కరాలలో చంద్రబాబు ప్రచార యావవల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణించినప్పుడు చంద్రబాబు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడింది గుర్తు లేదా? కుంభమేళాలలో చనిపోవడం లేదా? రోడ్డు ప్రమాదాలలో పోవడం లేదా అని ప్రశ్నించి అందరిని విస్తుపరిచారు. ఇప్పుడు తమ పార్టీ ప్రయోజనాల కోసం అలాంటి ఘటన ఏదైనా జరిగితే ప్రయోజనం అని ఏమైనా భావించారా అన్న విమర్శను కొందరు చేస్తున్నారు. కేవలం పోలీసు ఉన్నతాధికారులను భయపెట్టి , తమ పార్టీ అభ్యర్ధులు చేసే డబ్బు పంపిణీ, కానుకల పంపిణీ వంటి వాటికి అడ్డు రాకుండా చూసుకోవాలన్న ఆలోచనతో వారిపై ఈ ఆరోపణలు చేశారా అన్న సందేహం వస్తుంది. దానికి తగినట్లే ఈనాడు మీడియా ఇదంతా పోలీసుల వైఫల్యం అని, కేంద్రం నిఘా అధికారులు నివేదిక పంపించారంటూ కధనాన్ని కూడా ప్రచారం చేసింది. పైగా పల్నాడు ఎస్పిపై ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవచ్చంటూ రాసేసింది. అసలు విచారణ చేసిందెప్పుడు, సంబందిత అధికారుల వివరణ కోరిందెప్పుడు? నివేదికను కేంద్రానికి పంపిందెప్పుడు? అదే నిజమైతే ఈనాడు మీడియాకే ఎందుకు ఇచ్చారు? అంటే ఇదంతా ఒక కుట్రగా కనిపించడం లేదా!ఇంతకాలం కోర్టులను అడ్డంపెట్టుకుని ఇలాంటి కధలను నడిపిన టిడిపి, ఈనాడు, ఆంద్రజ్యోతి తదితర ఎల్లో మీడియా, ఇప్పుడు కొత్త తరహా కుట్రలకు తెరలేపినట్లుగా ఉంది. అందులో భాగంగానే ఇలాంటి తప్పుడు ఆరోపణలతో ప్రచారం చేస్తున్నారనుకోవాలి.ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. జనం అంతా సభ విఫలం అయిందని, మోడీకి అవమానకరంగా సభ నడిచిందని అనుకుంటుంటే, ఈనాడు మాత్రం అందుకు భిన్నంగా టీవీలో ఒక ప్రచారం చేసింది. సభ ముగిసిన వెంటనే ప్రధానిని చంద్రబాబు, పవన్ కలిశారని, ఆ సందర్భంగా మోడీ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని అన్నారని టీవీలో వార్తలు ఇచ్చింది. అది నిజమే అయితే ఇప్పుడు ఆ వైఫల్యం..ఈ వైఫల్యం అంటూ కొత్తబాణి ఎందుకు అందుకున్నట్లు? - కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టు -
Banjara Hills: ట్రాఫిక్ బూత్‌లో మృతదేహం
హైదరాబాద్: రోడ్డు నంబర్–1లోని తాజ్‌కృష్ణా హోటల్ చౌరస్తాలో ఉన్న ట్రాఫిక్ బూత్ అంబ్రిల్లాలో అనుమానాస్పద మృతదేహాన్ని బంజారాహిల్స్ పోలీసులు స్వాదీనం చేసుకుని ఉస్మానియాకు తరలించారు. తాజ్‌కృష్ణా చౌరస్తాలోని ట్రాఫిక్ బూత్‌లో గుర్తుతెలియని మృతదేహం(32) ఉన్నట్టు మంగళవారం ఉదయం విధుల్లోకి వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని బంజారాహిల్స్ సీఐ రాఘవేందర్ తెలిపారు. ఆరా తీయగా ఫుట్‌పాత్‌లపై పడుకునే నిరాశ్రయుడిగా తేలిందని ఆయన చెప్పారు. తలకు వెనకాల గాయమైందని.. రోడ్డు దాటుతున్నప్పుడు ఏదైనా వాహనం ఢీకొట్టిందా? లేక ప్రమాదవశాత్తూ కిందపడ్డాడా? అనే విషయాలు తెలియాల్సి ఉందన్నారు. -
డాన్స్‌తో ట్రాఫిక్ కంట్రోల్.. వీడియో వైరల్!
మనిషన్నాక ఏదోఒక అభిరుచి ఉంటుంది. కొందరికి సింగర్ కావాలని, మరికొందరికి యాక్టర్ కావాలనివుంటుంది. అలాగే రచయిత కావాలని, క్రీడాకారులు కావాలని కూడా కొందరు కోరుకుంటారు. అయితే కొంతమంది తమ అభిరుచిని వదిలి వేరే పని చేయాల్సి వస్తుంది. అలాంటివారు వారి అభిరుచిని వదులుకోలేరు. ఒక ట్రాఫిక్ పోలీస్ విషయంలో ఇదే కనిపించింది. అతనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డుపై ట్రాఫిక్‌ను నియంత్రించడాన్ని గమనించవచ్చు. అయితే అతను డ్యాన్స్ చేస్తూ, ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడాన్ని చూడవచ్చు. ఒకసారి మూన్‌వాక్‌తో, మరోమారు స్టెప్పులు వేస్తూ.. వాహనాలకు సిగ్నల్ ఇస్తూ కనిపిస్తున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా లైక్ చేస్తున్నారు. ఈ వీడియోను నాగాలాండ్ ప్రభుత్వ పర్యాటక, ఉన్నత విద్యా శాఖ మంత్రి టెమ్జిన్ ఇమ్నా అలోంగ్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 51 వేల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. వీడియోను చూసిన ఒక యూజర్ కామెంట్ బాక్స్‌లో.. ‘మా సింగం సార్.. ఇండోర్ నుండి వచ్చారు. నేను ఆయనను చూసేందుకు హైకోర్టు స్క్వేర్‌కి వెళ్తుంటాను’ అని రాశారు. మరొక యూజర్ ‘సూపర్’అని రాశారు. अपने Moves दिखाने के लिए सही Platform का इंतजार मत करो, Platform को सही खुद बना लो! 😉 pic.twitter.com/5WE4plySsH — Temjen Imna Along (@AlongImna) February 27, 2024 -
Hyderabad: సిటీలో నేటి నుండి కొత్త ట్రాఫిక్ విధానం
-
కర్నాటక సీఎంకు ‘సుప్రీం’లో ఊరట!
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. 2022లో జరిగిన నిరసనల్లో రోడ్డును బ్లాక్ చేశారంటూ సీఎం సిద్ధరామయ్యపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ఫిర్యాదుదారునికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులపై విచారణకు సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇదే కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రులు ఎంబీ పాటిల్, రామలింగా రెడ్డి, కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలాలకు ఈ నెల మొదట్లో కర్ణాటక హైకోర్టు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. అలాగే వారంతా ప్రజాప్రతినిధి కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళతే కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ బెలగావి నివాసి. ఆయన ఉడిపిలోని ఓ హోటల్లో శవమై కనిపించాడు. తన కాంట్రాక్టు పనులలో నాటి మంత్రి ఈశ్వరప్ప కమీషన్ డిమాండ్ చేశారని సంతోష్ పాటిల్ ఆరోపించాడు. ఆ తర్వాత మంత్రి ఈశ్వరప్ప తనపై వస్తున్న ఆరోపణలను తిరస్కరించడమే కాకుండా సంతోష్ పాటిల్‌పై పరువు నష్టం కేసు వేశారు. ఆ తరువాత పాటిల్ వాట్సాప్ మెసేజ్‌లో తన మరణానికి మంత్రి మంత్రి ఈశ్వరప్ప బాధ్యుడని పేర్కొన్న విషయం వెలుగు చూసింది. ఈ నేపధ్యంలో 2022 ఏప్రిల్‌లో ఇదే కేసులో కేఎస్ ఈశ్వరప్పను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రస్తుత సీఎం సహా కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. నాటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇంటిని చుట్టుముట్టడంతోపాటు పలు రహదారులను బ్లాక్ చేశారు. దీంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. -
గడుసు పిల్లే..! మొత్తానికి తాళి కట్టించుకుంది! వైరల్ వీడియో
పెళ్లిళ్లలో ఉండే హడావిడి అంతా ఇంతాకాదు. పెళ్లి పనులు మొదలు పెట్టినదగ్గర్నుంచి ఆ మూడు ముళ్లు పడేదాకా అదొక యజ్ఞంలా లాంటిదే. అందులోనూ అమ్మాయి తరపువారికి అయితే ఈ టెన్షన్ మరీ ఎక్కువ. ఈక్రమంలో బెంగళూరులో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాఫిక్‌లో ఇరుక్కున్న ఒక పెళ్లి కూతురు ముహూర్తం దగ్గరపడుతున్న సమయంలో తెలివైన నిర్ణయం తీసుకుంది.. అసలు ఏం జరిగిందంటే.. మూడుముళ్ల వేడుక కోసం అందంగా ముస్తాబైన, బెంగళూరుకు చెందిన పెళ్లి కూతురు పెళ్లి మండపానికి బయలు దేరింది. తీరా భయంకరమైన ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అసలే బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ. దీనికి పెళ్లిళ్ల సీజన్. ఎటూ కదల్లేని పరిస్థితి. ఇలా అయితే.. ఇక పెళ్లి అయినట్టే అనుకుందో ఏమోగానీ, కారు దిగి తన సన్నిహితులతో మెట్రోలో ఎంచక్కా వివాహ మండపానికి చేరింది. సమయానికి తాళి కట్టించుకుంది. పెళ్లి ముస్తాబు, పట్టుచీర నగలతో వధువు నిశ్చింతగా మెట్రోలో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అమ్మాయి గడుసుదే అంటే ప్రశంసలు దక్కించుకుంటోంది. అయితే ఇందులో కొసమెరపేంటి అంటే ఈ వీడియో ఇప్పటిది కాదు.. గత ఏడాది నాటిది. సోషల్ మీడియా పుణ్యమా అంటూ మళ్లీ వైరల్ అవుతోంది. Whatte STAR!! Stuck in Heavy Traffic, Smart Bengaluru Bride ditches her Car, & takes Metro to reach Wedding Hall just before her marriage muhoortha time!! @peakbengaluru moment 🔥🔥🔥 pic.twitter.com/LsZ3ROV86H — Forever Bengaluru 💛❤️ (@ForeverBLRU) January 16, 2023