
ఆదిలాబాద్: పెన్‌గంగలో శనివారం రాత్రి వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. మండలంలోని డొల్లార వద్ద గల బ్రిడ్జిని తాకుతూ ప్రవాహం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్రిడ్జి మీదుగా రాకపోకలను నిలిపివేశారు. బ్రిడ్జికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్దనే వాహనాలను అపేసారు.
వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బ్రిడ్జికి ఇరు వైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆదివారం ఉదయం ప్రవాహ ఉధృతి తగ్గడంతో రాకపోకలను అనుమతించారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.