నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష కేంద్రం బయటే ఉండిపోయిన విద్యార్థులు
ఆదిలాబాద్‌టౌన్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో నిమి షం నిబంధన పలువురు విద్యార్థులకు శాపంగా మారుతోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే క్రమంలో బస్సులు, ఆటోలు సమయానికి లేకపోవడంతో పరీక్షకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇందులో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని బంగారుగూడకు చెందిన ఇద్దరు ప్రథ మ సంవత్సరం విద్యార్థులు మూడు నిమిషాలు ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల ఆదిత్య జూని యర్ కళాశాల కేంద్రంలో వీరు పరీక్ష రాయాల్సి ఉండగా అధికారులు అనుమతించలేదు. ప్రాదే య పడినప్పటికీ ససేమిరా అనడంతో గత్యంతరం లేక ఇంటిబాట పట్టారు. కాగా, గురువారం జైనథ్ మండలం మాంగుర్ల గ్రామానికి చెందిన విద్యార్థి శివకుమార్ సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోలేనని మ నస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. నిమిషం ఆలస్యం నిబంధన విద్యార్థులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఈ నిబంధన తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
651 మంది గైర్హాజరు..
ఇంటర్ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన ప్రథ మ సంవత్సర పరీక్షకు 10,461 మంది హాజరు కా వాల్సి ఉండగా 9,810 మంది హాజరయ్యారు. 651 మంది గైర్హాజరయ్యారు. జనరల్‌విద్యార్థులు 9,344 మందికి గాను 8,792 మంది హాజరయ్యారు. 552 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 1,117మందికి గాను 99 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రవీందర్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment