National high away
-
తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ.. సొంతూళ్లకు ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ మొదలైంది. ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రద్దీగా మారాయి. హైదరాబాద్ నుంచి ఆంధ్రా ఓటర్లు భారీగా తరలివెళ్తున్నారు. చౌటుప్పల్ పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. ఎల్లుండి పోలింగ్ సందర్భంగా సొంతూళ్లకు ఓటర్లు పయనమవడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది.పోలింగ్‌కు కేవలం రెండు రోజులే మిగిలి ఉండటంతో శనివారం వేకువజాము నుంచే హైవేపై భారీ రద్దీ నెలకొంది. ఆయా వాహనాలు విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు వెళ్తున్నాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపైకి చేరుకోవడంతో పలుచోట్ల నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. హైదరాబాద్ నుంచి ఏపీకి 508 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. బెంగుళూరు నుంచి ఏపీకి 592 స్పెషల్ సర్వీసులు నడుపుతోంది. సాధారణ ఛార్జీలతోనే స్పెషల్ బస్సులు నడపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ వెల్లడించారు. -
ఐదు జాతీయ రహదారులతోపాటు 475 రోడ్లు బంద్
హిమాచల్ ప్రదేశ్‌లో తాజాగా కురుస్తున్న మంచు కారణంగా ఐదు జాతీయ రహదారులతో సహా 475 రహదారులు మూతపడ్డాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతంలో మంచు కురుస్తున్న కారణంగా 333 విద్యుత్ సరఫరా పథకాలు, 57 నీటి సరఫరా పథకాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హిమపాతం కారణంగా చంబాలో 56, కాంగ్రాలో ఒకటి, కిన్నౌర్‌లో ఆరు, మండిలో 51, సిమ్లాలో 133 రోడ్లు మూసుకుపోయాయని విపత్తు నిర్వహణ విభాగం పేర్కొంది. అంతకుముందు శనివారం రాష్ట్రంలో 504 రహదారులను మూసివేశారు. వీటిలో నాలుగు జాతీయ రహదారులు ఉన్నాయి. అంతేకాకుండా పలు చోట్ల మంచు కురుస్తుండటంతో విద్యుత్ సరఫరా, నీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని లాహౌల్-స్పితిలోని తొమ్మిది ప్రాంతాలలో మంచు తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. లాహౌల్ స్పితి పోలీసులు తమ సోషల్ మీడియా హ్యాండిల్లో జిల్లా వాతావరణం, రహదారి పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేశారు. నూతన సంవత్సరం ప్రారంభమైనది మొదలు హిమాచల్ ప్రదేశ్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు. అయితే హిమాచల్ ప్రదేశ్‌కు వచ్చే పర్యాటకులు ఇక్కడి వాతావరణ పరిస్థితులను తెలుసుకుని ప్రయాణానికి ప్లాన్ చేసుకోవాలని స్థానిక పోలీసులు సూచిస్తున్నారు. -
రోడ్డు కోసమని రోడ్డున పడేస్తున్నారు...
నారాయణ్‌పేట్: కేంద్ర ప్రభుత్వం మహబూబ్‌నగర్– చించోలి రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించింది. బెంగుళూరు– ముంబాయి మధ్య జాతీయ రహదారులను అనుసంధానం చేసేందుకు మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని భూత్పూర్ నుంచి కర్ణాటకలోని మన్నెకలి వరకు ఉన్న 192 కి.మీ., మేర రోడ్డును జాతీయ రహదారిగా విస్తరించడానికి గతేడాది రూ.703 కోట్లు మంజూరయ్యాయి. తెలంగాణలో మూడు జిల్లాలను కలుపుతూ వెళ్తున్న ఈ రోడ్డును 167 జాతీయ రహదారిగా గుర్తించారు. మొదటి ప్యాకేజీలో భాగంగా భూత్పూర్ నుంచి దుద్యాల వరకు ఈ ఏడాది మార్చిలో పనులు ప్రారంభించగా.. ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల బీటీ వేయగా.. అవసరమైన చోట కల్వర్టుల నిర్మాణం దాదాపుగా పూర్తిచేశారు. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు తొలగిస్తుండటంతో గూడు కోల్పోవడమే కాక.. పలువురి ఉపాధికి ఎసరు వచ్చింది. దీంతో జాతీయ రహదారి వచ్చిందని సంతోషపడాలో.. లేక తమ గూడు చెదిరిందని బాధపడాలో అర్థం కాక గొడోమంటున్నారు. 400 ఇళ్ల వరకు.. 5 మండలాల్లోని 17 గ్రామాల్లో 50 ఫీట్లలోపు ఉన్న 400 ఇళ్ల వరకు తొలగిస్తుండడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రూ.లక్షలు వెచ్చించి నిర్మించుకున్న ఇళ్లు కళ్ల ముందే కూల్చివేస్తుండడంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం సైతం లేకపోవడం.. అటు ప్రభుత్వం వేరే దారి చూపకపోవడంతో రోడ్డుపాలవుతున్నారు. 50 ఫీట్లలోపు ఉన్న ఇళ్లకు, వ్యవసాయ భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వమని అధికారులు తేల్చిచెప్పారు. భూత్పూర్ నుంచి దుద్యాల వరకు కేవలం 100 మాత్రమే 50 ఫీట్ల బయట ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటికి మాత్రమే పరిహారం ఇస్తామనడంతో బాధితులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. 81.5 ఎకరాల భూమి.. భూత్పూర్ నుంచి దుద్యాల వరకు 60 కి.మీ., రోడ్డు విస్తరణకు గాను 81.5 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. 5 మండలాల్లోని 17 గ్రామాలకు చెందిన 547 మంది రైతులు తమ భూములు కోల్పోతున్నారు. ఇందులో ప్రధానంగా వ్యవసాయ పొలాలతోపాటు ప్లాట్లు కూడా ఉన్నాయి. ఆయా గ్రామాల్లో బాధితుల వారిగా ఎవరి భూమి, ఇల్లు ఎంతెంత పోతుంది అని గతేడాది అక్టోబర్‌లోనే అధికారులు సర్వే చేసి మార్కింగ్ ఇచ్చారు. ఇళ్లు, భూ నిర్వాసితులకు కలిపి పరిహారం ఇవ్వడానికి రూ.135 కోట్లు కేటాయించారు. అయితే పనులు ప్రారంభమై 8 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వలేకపోయారు. ఇటీవల రంగారెడ్డిపల్లి సర్పంచ్ లక్ష్మీదేవి పరిహారం చెల్లించాలని విస్తరణ పనులు అడ్డుకున్నారు. హోటల్ పోయింది.. గండేడ్‌లో మంచి అడ్డా దొరకడంతో తాత్కాలికంగా షెడ్డు వేసుకొని హోటల్ నిర్వహిస్తున్నా. నిత్యం రూ.2–3 వేల వరకు గిరాకీ అయ్యేది. ఇప్పుడు దాన్ని తీసేయమంటున్నారు. హోటల్‌నే నమ్ముకున్న మేము ఎలా బతకాలో అర్థం కావడం లేదు. ఇంటిల్లిపాది దానిపైనే ఆధారపడ్డాం. కనీసం ఇంకోచోట బతికే పరిస్థితి లేకపోవడంతో ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. – ఆంజనేయులు, చెన్నాయిపల్లి ఒక్క గదే మిగిలింది.. నాకు మూడు షెట్టర్లు, రెండు గదులు ఉండగా.. ఒక్క దాంట్లో మొబైల్ షాపు పెట్టుకొని మిగతావి అద్దెకు ఇచ్చాం. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునే వాళ్లం. అధికారులు వచ్చి రెండు రోజుల్లో మార్కింగ్ చేసిన వరకు తీసేయాలని.. లేదంటే జేసీబీతో కూల్చేస్తామన్నారు. అలా చేస్తే మొత్తం పోతుందని సొంతంగా కూల్చేయడం వల్ల ఒక్క గది మిగిలింది. – ఇజాజ్ హుస్సేన్, మహమ్మదాబాద్ పనులు జరుగుతున్నాయి.. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా 50 ఫీట్ల లోపు ఉన్నవాటికి ఎలాంటి పరిహారం ఇవ్వం. ఇక భూమి పోతున్న నిర్వాసితులకు సంబంధించి ఇప్పటికే అధికారులు వివరాలు సేకరించి బ్యాంకు ఖాతా నంబర్లు తీసుకున్నారు. ఎవరికి ఎంతెంత రావాలో నిర్ణయించారు. నిర్వాసితులకు నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. భూ నిర్వాసితులకు డబ్బులు ఇచ్చాకే పనులు చేపడతాం. ప్రభుత్వ భూములు ఉన్నచోట పనులు జరుగుతున్నాయి. – రమేష్, డీఈ, నేషనల్ హైవే సల్కర్‌పేట్‌కు చెందిన గిరమోని రవికుమార్‌కు 37 గుంటల తరిపొలం ఉండగా జాతీయ రహదారి నిర్మాణంతో మొత్తం పోతుంది. అయితే భాగాలు పంచుకోవడం మూలంగా ఇతని ఆధీనంలో ఉన్న సర్వే నంబర్ వేరే వారి పేరిట ఉండడంతో పరిహారం అందడం కష్టంగా ఉంది. అటు భూమి పోవడమే కాక.. ఇటు పరిహారం అందే పరిస్థితి లేకపోవడంతో అయోమయంలో పడ్డాడు. దాదాపు 25 ఏళ్లుగా అదే భూమిని నమ్ముకున్నాడు. రోడ్డు విస్తరణ కారణంగా సర్వం కోల్పోతున్నాడు. జానంపల్లికి చెందిన చెన్నారం వెంకటయ్య ఆర్సీసీ ఇల్లు నిర్మించుకొని అందులోనే హోటల్ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. 15 రోజుల క్రితం అధికారులు వచ్చి మార్కింగ్ ఇచ్చి కూల్చివేస్తామని చెప్పారు. ఆ తర్వాత జేసీబీతో మార్కింగ్ ఇచ్చిన వరకు ఇల్లు కూల్చివేయడంతో ప్రస్తుతం ఒక్క గోడ మాత్రమే మిగిలింది. ప్రస్తుతం అతనికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో బంధువుల ఇంట్లో తల దాచుకుంటున్నాడు. ఉపాధి కూ డా పోవడంతో బతుకు భారంగా మారింది. ఉపాధికి ఎసరు.. చాలా గ్రామాల్లో రోడ్డుకిరువైపులా పలు రకాల దుకాణాలు నిర్వహిస్తున్నారు. కిరాణం, మెకానిక్, జిరాక్స్, ఫర్టిలైజర్, మెడికల్ షాపు, హాస్పిటల్, హోటళ్లతో జీవనం సాగిస్తున్నారు. అయితే రోడ్డు విస్తరణ పేరిట ఇవన్నీ తొలగిస్తుండడంతో వారంతా ఉపాధి కోల్పోతున్నారు. మహమ్మదాబాద్‌లో రోడ్డుకిరువైపులా కనుచూపు మేర కనీసం ఒక్క టీ షాపు కూడా లేదు. రోజూవేలు సంపాదించే వారు కనీసం రూ.100 కూడా వచ్చే పరిస్థితి లేక.. కుటుంబాలు ఎలా పోషించాలో అని దిక్కుతోచని స్థితిలో పడ్డారు. -
జల ప్రళయం.. మునిగిన 44వ జాతీయ రహదారి..
ఆదిలాబాద్: భారీ వర్షాలకు హైదరాబాద్–నాగ్‌పూర్ 44వ జాతీయ రహదారి నీట మునిగింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షంలకు స్వర్ణ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సోన్ మండలంలోని కడ్తాల్ వద్ద 44వ జాతీయ రహదారిపై వర్షం నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో గురువారం సాయంత్రం నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్‌లో 44 వ జాతీయ రహదారి హైదరాబాద్–నాగ్‌పూర్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇరు వైపుల జాతీయ రహదారిపై గంటల తరబడి వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సోన్ ఎస్సై సంతోషం రవీందర్ తన సిబ్బందితో అక్కడకు చేరుకొని ఎవరు వెళ్లకుండా తగిన చర్యలు చేపడుతున్నారు. -
జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్!
ఆదిలాబాద్: పెన్‌గంగలో శనివారం రాత్రి వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. మండలంలోని డొల్లార వద్ద గల బ్రిడ్జిని తాకుతూ ప్రవాహం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్రిడ్జి మీదుగా రాకపోకలను నిలిపివేశారు. బ్రిడ్జికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిప్పర్వాడ టోల్‌ప్లాజా వద్దనే వాహనాలను అపేసారు. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బ్రిడ్జికి ఇరు వైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆదివారం ఉదయం ప్రవాహ ఉధృతి తగ్గడంతో రాకపోకలను అనుమతించారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
దళితుల భూములు లాక్కోవద్దు
డాపూర్(సంగారెడ్డి): సదాశివపేట దళితుల భూములు గుంజుకోవద్దని, హెచ్ఎండీ లేఅవుట్ పేరిట వారి భూముల్లో రియల్ ఎస్టేట్ దందా ఆపాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సదాశివపేట దళితులు వారి భూములను రియల్ ఎస్టేట్ దందాకు ఇవ్వొద్దని కోరుతూ కులవ్యవక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ సదాశివపేట పట్టణ శివారులోని సర్వే నంబర్ 165లోగల 114.21 ఎకరాల భూమిలో గత 50 సంవత్సరాలుగా 200 మంది దళిత కుటుంబాలు వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారన్నారు. హైదరాబాద్ – ముంబయి నేషనల్ హైవే కు ఆనుకొని ఆ భూములు ఉన్నాయన్నారు. వాటి విలువ సుమారు రూ.350 కోట్లకు పైగా ఉంటుందన్నారు. పేద దళితుల భూములను గుంజుకొని రియల్ ఎస్టేట్ దందా చేస్తారా? అని ప్రశ్నించారు. హెచ్ఎండీఏ లే అవుట్ పేరుతో రియల్ ఎస్టేట్ దందా వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, జిల్లా సభ్యుడు మోహన్ దాస్, సదాశివపేట దళిత రైతులు సిద్దాపురం శంకరయ్య, చుక్కల మానేయ, కర్రె సుధాకర్, సంజీవులు, సునందరావు, అనూప్ కుమార్, ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు . -
క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ ఎంపీ
ఆర్మూర్: ఆర్మూర్ మండలం అంకాపూర్ శివారులోని 63వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన వృద్దుడిని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే రాజకీయంగా బద్ద శత్రువులుగా ఉన్న వీరిద్దరు ప్రమాద స్థలంలో ఎదురుపడటంతో ఒకరినొకరు మాట్లాడించుకోవడం ఆసక్తికరమైన అంశంగా మారింది. జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామానికి చెందిన గాదెపల్లి చిన్నగంగారెడ్డి ద్విచక్ర వాహనంపై ఆర్మూర్ వైపు వెళ్తున్నాడు. సీడ్ కంపెనీ నుంచి వచ్చిన లారీ ఢీ కొనడంతో తలకు గాయమైంది. అదే రోడ్డు మార్గంలో పెర్కిట్ నుంచి అంకాపూర్‌కు వస్తున్న ఎంపీ అర్వింద్, బీజేపీ రాష్ట్ర నాయకుడు పల్లె గంగారెడ్డి రోడ్డు ప్రమాదం జరిగింది చూసి తమ వాహనాలను ఆపారు. క్షతగాత్రుడిని స్థానికులు పలకరిస్తున్న క్రమంలో మాక్లూర్ అర్బన్ పార్క్‌కు వెళ్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి రోడ్డు ప్రమాదాన్ని గమనించి తన కాన్వాయిని ఆపించారు. గన్మెన్ల సహకారంతో క్షతగాత్రుడిని తన వాహనంలో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం పంపించారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఎంపీ అర్వింద్, పల్లె గంగారెడ్డిని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పలకరించారు. ఎంపీ సాబ్ నిజామాబాద్ నుంచి వస్తున్నారా అని ఎమ్మెల్యే అడిగారు. పెర్కిట్‌లోని తన ఇంటి నుంచి అంకాపూర్‌లో చేరికల కార్యక్రమానికి వెళ్తున్నట్లు ఎంపీ సమాధానం ఇచ్చారు. -
రీజినల్ రింగ్‌రోడ్డులో వెదురుతో బారియర్.. సౌండ్‌పై వారియర్!
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక ఎక్స్‌ప్రెస్ వేగా నిర్మించనున్న హైదరాబాద్ రీజినల్ రింగ్‌రోడ్డులో పర్యావరణ అనుకూల విధానాలను అవలంబించే దిశగా జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) కసరత్తు చేపట్టింది. ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనాల ధ్వనిని నియంత్రించే నాయిస్ బారియర్లుగా.. వాహనాలు అదుపుతప్పితే పక్కకు దొర్లిపోకుండా ఆపే క్రాష్ బారియర్లుగా వెదురును వినియోగించాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. వేగంగా దూసుకెళ్లే వాహనాల ధ్వని నుంచి.. ఎక్స్‌ప్రెస్ వేలలో వాహనాలు వేగంగా దూసుకుపోతుంటాయి. వాటి నుంచి విపరీతంగా ధ్వని వెలువడుతూ ఉంటుంది. దానికితోడు హారన్లు కూడా మోగిస్తుంటారు. నివాస ప్రాంతాలకు దగ్గరగా హైవేలు ఉన్న ప్పుడు ఈ ధ్వనితో జనం ఇబ్బంది పడతారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులు బెదిరిపోతుంటాయి. దీనికి పరిష్కారంగా రోడ్డుకు ఇరువైపులా ధ్వనిని అడ్డుకునే నాయిస్ బారియర్లను ఏర్పాటు చేస్తుంటారు. ధ్వనిని నియంత్రించే గుణమున్న పదార్థాలతో తయారైన మందంగా ఉన్న షీట్లను 3 మీటర్ల ఎత్తుతో ఏర్పాటు చేస్తుంటారు. ఇది ఖర్చుతో కూడుకున్నది. పర్యావరణానికీ మంచిదికాదు. దీనికి పరిష్కారంగా రోడ్లకు ఇరువైపులా కొన్ని రకాల గుబురు చెట్లను నాటి ధ్వనిని నియంత్రించే విధానం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలోకి వచ్చింది. ఇలా ధ్వనిని నిరోధించే ప్రక్రియలో వెదురు బాగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ క్రమంలోనే రీజనల్ రింగురోడ్డుపై నిర్ధారిత ప్రాంతాల్లో రెండు వైపులా ఫర్గేసియా రూఫా, ఫర్గేసియా స్కోబ్రిడా, ఫర్గేసియా రొబస్టా జాతుల వెదురును పెంచాలని భావిస్తున్నారు. ఐదు మీటర్ల ఎత్తు, కనీసం ఐదారు మీటర్ల వెడల్పుతో ఈ చెట్లను పెంచితే.. మూడు మీటర్ల ఎత్తుతో ఏర్పాటు చేసే పటిష్ట క్రాష్ బారియర్‌తో సమానమని నిపుణులు చెప్తున్నారు. కొన్ని హైవేల పక్కన వీటిని ప్రయోగాత్మకంగా నాటేందుకు ఎన్హెచ్ఏఐ ఇటీవల ఏర్పాట్లు ప్రారంభించింది. అయితే ఈ వెదురుకు వేగంగా, మరీ ఎత్తుగా పెరిగే లక్షణంతో ఉన్నందున.. ఆయా ప్రాంతాల్లోని విద్యుత్ వైర్లకు ఆటంకంగా మారొచ్చన్న సందేహాలు ఉన్నాయి. దీనిపై అధికారులు త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. క్రాష్ బారియర్లుగా కూడా.. రోడ్డుపై అదుపు తప్పే వాహనాలు దిగువకు దూసుకుపోకుండా, మరో లేన్‌లోకి వెళ్లకుండా క్రాష్ బారియర్లు అడ్డుకుంటాయి. సాధారణంగా రోడ్లకు రెండు వైపులా స్టీల్ క్రాష్ బారియర్లను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు వాటి స్థానంలో వెదురుతో చేసిన బారియర్ల ఏర్పాటుపై ప్రయోగాలు మొదలయ్యాయి. రీజనల్ రింగురోడ్డులో కూడా వీటిని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న కోణంలో పరిశీలన జరుగుతోంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్–యావత్మాల్ జిల్లాలను జోడించే వణి–వరోరా హైవేలో ప్రపంచంలోనే తొలిసారిగా వెదురు క్రాష్ బారియర్లను 200 మీటర్ల మేర ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. బాంబూసా బాల్కోవా జాతి వెదురు దుంగలను క్రమపద్ధతిలో కోసి వాటిని క్రియేసాట్ నూనెతో శుద్ధి చేసి.. రీసైకిల్డ్ హైడెన్సిటీ పాలీ ఇథలీన్ పూతపూసి ఈ బారియర్లను రూపొందించారు. ఇండోర్‌లోని నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు పరీక్షల అనంతరం వీటిని స్టీల్ క్రాష్ బారియర్లకు ప్రత్యామ్నాయంగా వినియోగించొచ్చని తేల్చారు. రీజినల్ రింగురోడ్డులో వీటి ఏర్పాటుపై త్వరలో స్పష్టత రానుంది. వేగంగా భూసేకరణ.. రీజినల్ రింగ్‌రోడ్డు ఉత్తరభాగానికి సంబంధించి 158.6 కిలోమీటర్ల మేర భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పరిహారం జారీ కోసం అవార్డ్ పాస్ చేయటంలో కీలకమైన 3డీ గెజిట్ నోటిఫికేషన్లు కూడా విడుదలవుతున్నాయి. సంగారెడ్డి–తూప్రాన్ మధ్య 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున రెండు ప్యాకేజీలకు మరో నెల రోజుల్లో టెండర్లు జారీ కానున్నాయి. ఆ తర్వాత ఆరు నెలల్లో రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశముంది. దీంతో రోడ్డు డిజైన్లను ఖరారు చేసే పనిని ఎన్హెచ్ఏఐ సమాంతరంగా ప్రారంభించింది. ఇందులోభాగంగా ప్రయోగాత్మకంగా వెదురును వినియోగించాలని భావిస్తోంది. చదవండి: లకారం ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ విగ్రహం.. హైకోర్టు స్టే.. కీలక మార్పులు! -
ఆ నేషనల్ హైవేలో ఎప్పుడూ రిపేర్లేనా? ప్రమాదాలు పట్టించుకోరా?
తణుకు: జాతీయ రహదారి నిర్వహణ పేరుతో సిబ్బంది అవలంభిస్తున్న విధానాల వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తణుకు పట్టణ పరిధిలోని జాతీయ రహదారి అభివృద్ధి పనుల పేరుతో ఇటీవల మరమ్మతులు చేపట్టారు. అయితే గత కొన్నేళ్లుగా మరమ్మతుల పేరుతో నిత్యం ట్రాఫిక్ మళ్లిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సుదీర్ఘంగా సాగుతున్న పనులు తద్వారా పలువురు వాహనదారులు మృత్యువాత పడుతుండగా పదుల సంఖ్యలో వాహనదారులు గాయాల పాలవుతున్నారు. మరోవైపు జాతీయ రహదారి నిర్వహణ పనులకు వినియోగిస్తున్న భారీ వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా తణుకు మండలం దువ్వ జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో హైవే నిర్వహణ వాటర్ ట్యాంకర్ వాహనం ఢీకొని పదో తరగతి చదువుతున్న బాలిక మరణించింది. ఇలాగే గతంలో సైతం పలువురు మృత్యువాత పడ్డారు. నిత్యం ట్రాఫిక్ మళ్లింపే పెనుగొండ మండలం సిద్ధాంతం నుంచి తాడేపల్లిగూడెం వరకు దాదాపు 50 కిలోమీటర్లు మేర జాతీయ రహదారి విస్తరించి ఉంది. జాతీయ రహదారి నిర్వహణ, మరమ్మతులు చేపట్టేందుకు దాదాపు రెండేళ్ల క్రితం ఒక కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. ఇందులో భాగంగా ఈ రోడ్డులో నిత్యం మరమ్మతులు చేస్తుండటంతో ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నారు. దీంతో రోడ్డుకు మధ్య భాగంలో ట్రాఫిక్ కోన్స్ ఏర్పాటు చేస్తున్నారు. కిలోమీటర్ల మేర వీటిని ఏర్పాటు చేస్తుండటంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. * మంగళవారం దువ్వలో జరిగిన ప్రమాదంలో రోడ్డు డివైడర్‌లో మొక్కలకు నీళ్లు పోసే వాటర్‌ట్యాంకర్ మోటారు సైకిల్ ను ఢీకొట్టడంతో బాలిక అక్కడిక్కడే మరణించింది. * ఇటీవల డీమార్ట్ సమీపంలో సైతం మోటారు సైకిల్‌పై వెళ్తున్న మహిళ రోడ్డు డివైడర్‌పై పడి మృతి చెందారు. * పెరవలి మండలానికి చెందిన మరో వ్యక్తిని హైవే నిర్వహణ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. * ఉండ్రాజవరం జంక్షన్ వద్ద సిగ్నల్ వద్ద వేచి ఉన్న యువకుల మోటారు సైకిల్‌ను వెనుక నుంచి వాహనం ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. * ఇటీవల అలంపురం సెంటర్ వద్ద ట్రాఫిక్ మళ్లింపులో భాగంగా రోడ్డు దాటుతున్న మహిళను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తణుకు పట్టణానికి చెందిన మహిళ మృతి చెందగా ఆమె కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. * దువ్వ జాతీయ రహదారిపై డివైడర్ మధ్యలో గొయ్యిలో పడి ఒక యువకుడు మృతి చెందాడు. నాసిరకం పనులు జాతీయ రహదారి నిర్మాణ పనులు నాసిరకంగా చేపట్టడంతో నిత్యం మరమ్మతులకు గురవుతున్నాయి. మరోవైపు పగలు సమయాల్లో మాత్రమే మరమ్మతు పనులు చేపడుతూ రోడ్డు మళ్లింపు చేపట్టాల్సి ఉంది. అయితే జాతీయ రహదారి నిర్వహణ సిబ్బంది మాత్రం రాత్రి సమయాల్లో సైతం ట్రాఫిక్ కోన్స్ అలాగే వదిలేయడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కోసారి మరమ్మతు పనులు చేయపోయినప్పటికీ రోడ్డు మార్గం మళ్లిస్తుండటంతో సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జాతీయ రహదారి ఆనుకుని గ్రామాల ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా జాతీయ రహదారి నిర్వహణ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ప్రకాశం జిల్లా ఒంగోలు లో రోడ్డు ప్రమాదం
-
దేశంలోనే తొలి 'ఎలక్ట్రిక్ హైవే'.. ఆ నగరాల మధ్య నిర్మాణం!
ఢిల్లీ: దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ హైవేను నిర్మించేందుకు ప్రణాళిక రచిస్తోంది భారత ప్రభుత్వం. తొలి రహదారిని దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలమధ్య నిర్మించనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ రహదారిపై ట్రాలీబస్సుల మాదిరిగానే ట్రాలీ ట్రక్కులను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ తెలిపారు. దాని ద్వారా కాలుష్యం తగ్గటంతో పాటు సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఢిల్లీలో నిర్వహంచిన హైడ్రాలిక్ ట్రైలర్ ఓనర్స్ అసోసియేషన్ కార్యక్రమం వేదికగా తొలి ఎలక్ట్రిక్ హైవే వివరాలను బహిర్గతం చేశారు గడ్కరీ. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.2.5 లక్షల సొరంగాలను నిర్మించినట్లు తెలిపారు. 'ఢిల్లీ నుంచి ముంబై వరకు ఎలక్ట్రిక్ హైవే నిర్మించాలని ప్రణాళిక చేస్తున్నాం. ట్రాలీబస్సుల మాదిరిగానే మీరు ట్రాలీట్రక్కులను ఈ దారిలో తీసుకొస్తాం.' అని తెలిపారు. అయితే.. ఈ రహదారి గురించి పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఎలక్ట్రిక్ హైవే అంటే ఏమిటి? ఎలక్ట్రిక్ హైవే అనగానే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. వాహనాలకు ఈ రహదారులపై వెళ్తున్న క్రమంలో ఓవర్‌హెడ్ విద్యుత్తు లైన్ల ద్వారా పవర్ సరఫరా చేస్తారు. రైల్వే ట్రాక్‌ల మాదిరిగానే ఉంటాయి. హైవే పొడవున ఓవర్‌హెడ్ విద్యుత్తు లైన్లు ఏర్పాటు చేస్తారు. ట్రాలీబస్సులు, ట్రాలీట్రక్కులను ఉపయోగించటం ద్వారా కాలుష్యం తగ్గటంతో పాటు రవాణా సామర్థ్యం పెరుగుతుందనేది కేంద్రం ఆలోచన. మరోవైపు.. పెట్రోల్, డీజిల్‌ల ద్వారా కాలుష్యం పెరిగిపోతున్న క్రమంలో భారీ వాహనాల ఓనర్లు ఇథనాల్, మెథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయాలవైపు వెళ్లాలని కోరారు నితిన్ గడ్కరీ. అలాగే.. అన్ని జిల్లా కేంద్రాలను నాలుగు లైన్ల రహదారులతో అనుసంధానిస్తామన్నారు. ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోతుందని, ఆర్టీఓల ద్వారా అందే సేవలను డిజిటలైజ్ చేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించటమే తమ లక్ష్యమన్నారు. వస్తు రవాణా వ్యయం చైనా, ఐరోపా, అమెరికాలతో పోలిస్తే భారత్‌లోనే అధికమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Reverse Waterfall: ఆకాశంలోకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా? -
రాష్ట్రంలో ఆరేడు టోల్‌ప్లాజాల తొలగింపు?
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై కొన్ని టోల్‌ప్లాజాలను మూసివేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 60 కి.మీ., అంతకంటే తక్కువ దూరంలో టోల్గేట్లు ఉంటే ఒకదాన్ని మూసేయనున్నట్లు ఇటీవల కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో జాతీయ రహదారులపై 29 టోల్‌గేట్లున్నాయి. కేంద్రం నిర్ణయం మేరకు పంతంగి, రాయ్కల్, కొత్తగూడెం, మన్ననూరు, గుమ్మడిదల, గూడూరు, కడ్తాల్ టోల్‌ప్లాజాలను తొలగించాల్సి ఉంటుంది. అయితే ఏవేవి మూసేస్తారన్న విషయంపై స్పష్టత ఇవ్వలేమని, దేశం మొత్తం యూనిట్‌గా ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ అధికారులు నిర్ణయం తీసుకుంటారని ఎన్హెచ్ఏఐ స్థానిక ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. పక్క రాష్ట్రంలోని చివరి టోల్‌ప్లాజా, మన రాష్ట్రంలోని ఆ రూట్లో మొదటి టోల్‌ప్లాజాల మధ్య 60 కి.మీ. దూరంలేని పక్షంలో ఒకదాన్ని తొలగించాలి. ఆ లెక్కన రాష్ట్రంలోని టోల్‌ప్లాజాలు, పొరుగున ఉన్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని టోల్‌బూత్‌లతో కలిపి చూసి నిర్ణయం తీసుకుంటారని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, పీపీపీ పద్ధతిలో రోడ్ల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్, పెట్టుబడి మొత్తాన్ని వడ్డీతో కలుపుకొని టోల్ రూపంలో వసూలుకు అనుమతి ఉంటుంది. ఇప్పుడు వాటిని ఎత్తేస్తే, కాంట్రాక్టర్ నష్టపోయే మొత్తాన్ని కేంద్రం చెల్లించాలి. ఈ విషయంలో ఎలాంటి విధివిధానాలను అనుసరిస్తారనే దానిపై అధికారుల్లో ఇంకా స్పష్టత రాకపోవడం విశేషం. ఢిల్లీ నుంచి తమకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. (చదవండి: దివ్యాంగులు ఐపీఎస్‌కు అర్హులే..) -
జాతీయ రహదారులు పెరుగుతున్నయ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ రహదారుల వాటా క్రమంగా పెరుగుతోంది. కొంతకాలంగా కేంద్రం భారీగా కొత్త రోడ్లను మంజూరు చేస్తుండటంతో లెక్కల్లో మార్పు కనిపిస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2020–21 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం రోడ్లలో జాతీయ రహదారుల వాటా 3.6 శాతంగా ఉంది. మొత్తం రోడ్ల నిడివి 1,07,871.2 కిలోమీటర్లు ఉండగా ఇందులో జాతీయ రహదారులు 3,910 కిలోమీటర్ల మేర ఉన్నాయి. అయితే ఇది 10 నెలల కిందటి నాటి పరిస్థితి. 2021–22 ఆర్థిక ఆర్థిక సంవత్సరంలో దాదాపు మరో వెయ్యి కిలోమీటర్ల రోడ్డు అందుబాటులోకి వచ్చింది. దీంతో జాతీయ రహదారుల మొత్తం నిడివి 4,983 కి.మీ. కు చేరింది. అంటే మొత్తం రోడ్లలో వీటి వాటా 4.6 శాతానికి చేరింది. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. ప్రస్తుతం దేశంలో ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు జాతీయ రహదారులు 4.06 కిలోమీటర్లు ఉండగా రాష్ట్రంలో 4.45 కిలోమీటర్లు ఉన్నాయి. నల్గొండ టాప్.. పెద్దపల్లి లాస్ట్: రాష్ట్ర సర్కారు లెక్కల ప్రకారం జాతీయ రహదారుల్లో నల్గొండ జిల్లా వాటా ఎక్కువుంది. ఈ జిల్లాలో 273 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులున్నాయి. నాగర్‌కర్నూలు, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో జాతీయ రహదారులే లేకపోవటంతో అట్టడుగు స్థానంలో ఉంది. -
ప్రమాదకరంగా కటౌట్లు..!
శంషాబాద్ రూరల్: జాతీయ రహదారి, గ్రామ రహదారులపై ఏర్పాటు చేసిన కటౌట్లు ప్రమాదకరంగా మారాయి. మండలంలోని ముంచింతల్ శివారులో ని శ్రీరామనగరంలో ఇటీవల 12 రోజుల పాటు జరిగిన సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఆయా రోడ్డు మార్గాల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాల్లోనూ.. బెంగళూరు జాతీయ రహదారితో పాటు గొల్లూరు, ముచ్చింతల్, బుర్జుగడ్డతండా, పెద్దషాపూర్‌తండా, పీ–వన్ మార్గాల్లో ఉత్సవ నిర్వాహకులతో పాటు రాజకీయ పార్టీ నేతలు భారీగా కటౌట్లు ఏర్పాటు చేశారు. ఉత్సవాలు ముగిసి వారం దాటినా ఇప్పటిదాకా వాటిని తొలగించడంలేదు. కటౌట్లు ఎప్పుడు విరిగి పడతాయోనని వాహనదారులు, స్థానిక గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తొలగింపులో నిర్లక్ష్యం.. రహదారులపై ఏర్పాటు చేసిన కటౌట్లను తొలగింపులో అటు ఉత్సవ నిర్వాహకులు..ఇటు పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కటౌట్ల ఏర్పాటుతో ఉత్సవాల సమయంలో సందర్శకులకు కొంత వరకు అటు వెళ్లే మార్గాలను సూచనలకు ఉపయోగపడ్డాయి. కానీ పూర్తయినా వెంటనే వాటిని తొలగించే బాధ్యత పంచాయతీలపై ఉన్నా..వారు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానిక ప్రజలు మండి పడుతున్నారు. వాహనదారులకు ఇబ్బంది.. బుర్జుగడ్డతండాకు వెళ్లే రోడ్డు మార్గంలో జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేసిన కటౌటు విరిగింది. ఇది ఎప్పుడు ఊడి కింద పడుతుందో తెలియడం లేదు. వీటితో పాటు చాలా చోట్ల ఉన్న కటౌట్లు వాహనదారులకు ఇబ్బందిగా మారాయి. -
ఆర్ఆర్ఆర్పై వాహనాల వేగం 120 కి.మీ. మలుపే లేకుండా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డుపై వాహనాలు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో జాతీయ రహదారులను 100 కిలోమీటర్ల గరిష్ట వేగానికి వీలుగా నిర్మిస్తున్నా ఆర్ఆర్ఆర్ను మాత్రం ఇంకో 20 కి.మీ. ఎక్కువ వేగంతో వెళ్లేలా నిర్మించనున్నారు. వాహనాలు ఒక్కసారిగా మలుపు తిరిగే పరిస్థితి లేకుండా 2,500 మీటర్ల దూరం నుంచే మలుపు తిరిగేలా ఏర్పాట్లు చేయనున్నారు. అదుపుతప్పిన వాహనాలు అవతలి లేన్‌లోకి దూసుకెళ్లకుండా సెంట్రల్ మీడియన్‌కు కూడా క్రాష్ బారియర్లు పెట్టనున్నారు. ఇలా సరికొత్త హంగులతో ఆర్ఆర్ఆర్ రూపుదిద్దుకోబోతోంది. మలుపుల ప్రభావం లేకుండా.. సాధారణంగా రోడ్డు మలుపులే ప్రమాదాలకు ప్రధాన కారణమవుతుంటాయి. ఇందుకే చాలా రోడ్లపై వెళ్లాల్సిన వేగం కన్నా తక్కువ వేగానికే పరిమితం చేస్తుంటారు. ప్రస్తుతం జాతీయ రహదారులపై 80 కి.మీ. వేగ పరిమితి బోర్డులు కనిపిస్తుండటం తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో స్పీడ్ గన్స్ పెట్టి మరీ వాహనదారులను నియంత్రిస్తున్నారు. కానీ ఆ పరిస్థితి రాకుండా ఆర్ఆర్ఆర్ను డిజైన్ చేస్తున్నారు. జాతీయ రహదారులపై మలుపుల ప్రభావం లేకుండా 700 మీటర్ల ముందు నుంచే రోడ్డు మలుపునకు వీలుగా వాలు ఉండేలా చూడాలని ప్రమాణాలు నిర్ధారించారు. దీని వల్ల ఎక్కడా మలుపు ఉన్న భావన రాదు. ఎక్స్‌ప్రెస్ వేల విషయంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఆర్ఆర్ఆర్కు 2,500 మీటర్ల దూరం నుంచే మలుపు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. అంటే మలుపు ఉన్న ప్రాంతానికి 2.5 కి.మీ. ముందు నుంచే రోడ్డు డిజైన్ వాలుగా మారుతుంది. సాధారణంగా మలుపు వద్ద వాహనాలు అదుపు తప్పకుండా రోడ్లపై ఔటర్ లైన్ ఎత్తుగా ఉంటుంది. ఇదీ కొన్ని వాహనాలకు ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఆర్ఆర్ఆర్కు 2.5 కి.మీ. దూరం నుంచే మలుపు డిజైన్ చేస్తున్నందున ఔటర్ లైన్ సమతలంగానే ఉండేలా ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు పాత అలైన్మెంట్ సమయంలో కాళేశ్వరం కాలువలు నిర్మించలేదు. దీంతో కాలువలు, ఇతర జలాశయాలు, చానళ్లను తప్పిస్తూ రూపొందించిన కొత్త అలైన్‌మెంట్‌ను ఇటీవల ఖరారు చేశారు. వీటిని తప్పించాల్సి రావడంతో భారీ మలుపులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమస్య రాకుండా, మలుపుల ప్రభావం లేకుండా రెండున్నర కిలోమీటర్ల నుంచి వాహనాలు మలిగేలా రోడ్డు నిర్మిస్తున్నారు. 4 వరుసల క్రాష్ బారియర్లు కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారులకుచివర్లలో ఇనుప క్రాష్ బారియర్లను ఏర్పాటు చేస్తుండటం తెలిసిందే. నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు చివర్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు తొలిసారిగా నాలుగు వరుసల్లో వీటిని ఆర్ఆర్ఆర్పై ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డుకు చివర్లలో రెండు వైపులా రెండు వరుసలతో పాటు సెంట్రల్ మీడియన్ వైపు మరో వరుస చొప్పున మూడు అడుగుల ఎత్తులో వీటిని పెట్టనున్నారు. సాధారణంగా సెంట్రల్ మీడియన్‌లో డివైడర్ తరహాలో ఒక అడుగు ఎత్తుతో రాతి వరుస నిర్మించి మధ్యలో మట్టి నింపి మొక్కలుపెడతారు. కానీ చాలా చోట్ల వాహనాలు అదుపు తప్పినప్పుడు అవతలి లేన్‌లోకి దూసుకెళ్లి ఎదురు వచ్చే వాహనాలను ఢీకొంటున్నాయి. దీన్ని నివారించేందుకు ఆర్ఆర్ఆర్లో సెంట్రల్ మీడియన్‌కు ఇనుప క్రాష్ బారియర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్రాష్ బారియర్ ఉన్నందున ఎత్తుగా రాతి నిర్మాణం ఉండదు. -
సీసీఐ ఫ్యాక్టరీ కోసం జాతీయ రహదారి దిగ్బంధం
ఆదిలాబాద్ రూరల్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని పునఃప్రారం భించాలని డిమాండ్ చేస్తూ గురువారం సీసీఐ సాధన కమిటీ 44వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించింది. పట్టణ శివారు ప్రాంతంలోని జందాపూర్ ఎక్స్‌రోడ్డు వద్ద చేపట్టిన ఈ కార్యక్రమానికి బీజేపీ మినహా అన్నిపార్టీలు మద్దతు తెలిపాయి. మూడు గంటలపాటు కొనసాగిన ఆందోళనతో నాగ్‌పూర్, హైదరాబాద్ రోడ్డు మార్గాల్లో వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కేంద్ర ప్రభుత్వం సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రారంభించే వరకు ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి తీసుకెళ్తామని కమిటీ సభ్యులు స్పష్టం చేశా రు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ, మూత పడిన సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించడం కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని గతంలో కేం ద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పని చేసిన హన్స్‌రాజ్ ప్రకటించారని గుర్తుచేశారు. అలాగే 2018 ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే సిమెంట్ ఫ్యాక్టరీని పునః ప్రారంభిస్తామని ఎంపీ సోయం బాపురావు కూడా హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఆ హామీని నిలబెట్టుకోకుండా బాపురావు సోయి లేకుం డా మాట్లాడుతున్నారని విమర్శించారు. -
టోల్గేట్ బాదుడు.. అక్టోబరు ఫాస్టాగ్ వసూళ్లు రూ.3,356 కోట్లు
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో ప్రయాణాలు ఊపందుకోవడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడాన్ని సూచిస్తూ అక్టోబర్‌లో ఫాస్టాగ్ టోల్ లావాదేవీలు రికార్డు స్థాయిలో జరిగాయి. 21.42 కోట్ల లావాదేవీల ద్వారా రూ. 3,356 కోట్లు వసూలయ్యాయి. శనివారం ఒక్క రోజే ఏకంగా రూ. 122.81 కోట్లు ఫాస్టాగ్ టోల్ వసూళ్లు నమోదయ్యాయి. ఇది ఆల్–టైం గరిష్టం కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో అభివృద్ధి అంతా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో జరుగుతోంది. దీంతో రోడ్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత టోల్గేట్లు వస్తున్నాయి. సగటున ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక టోల్గేట్ ఉంటోంది. దీంతో జాతీయ రహదారి ఎక్కితే చాలు టోల్ వలిచేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం సైతం ఫాస్టాగ్ పేరుతో ఆటోమేటిక్ టోల్ సిస్టమ్‌ని నిర్బంధగా అమలు చేస్తోంది. -
టూమచ్: గడ్కరీ ట్వీట్ చేశాకే అందరికీ తెలిసింది
Kuthiran Tunnel: ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న ప్రాజెక్టు లాంఛింగ్ గురించి ఆ రాష్ట్ర ప్రభుత్వానికే కనీస సమాచారం లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేరళ కుథిరన్ టన్నెల్.. ఎన్‌హెచ్ 544పై మన్నూథి-వడక్కన్‌చెరి మధ్య కేరళ సర్కార్ నిర్మించిన ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్(సొరంగ మార్గాలు). శనివారం ఎలాంటి సమాచారం లేకుండానే తెరుచుకోవడం అక్కడి మంత్రులు, అధికారుల్ని విస్మయానికి గురి చేసింది. తిరువనంతపురం: కుథిరన్(త్రిస్సూర్) వద్ద కేరళ-తమిళనాడు, కర్ణాటక జాతీయ రహదారులను కలుపుతూ మార్గం ఉంటుంది. అయితే ఇక్కడ ట్రాఫిక్‌జామ్‌లో గంటల తరబడి వాహనదారులు ఎదురు చూడాల్సి వచ్చేది. అంతేకాదు ఇరుకు రహదారి, ప్రమాదకరమైన మలుపులతో తరచూ ప్రమాదాలు కూడా జరుగుతుండేవి. దీంతో ఆరు లైన్ల రోడ్డుకి అనుసంధానిస్తూ.. పీచీ-వలహని వైల్డ్ లైఫ్ శాంక్చురీ వద్ద కొండల్ని తొలగించి సుమారు 964 మీటర్ల పొడవుతో రెండు సొరంగ మార్గాలు నిర్మించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ సొరంగం వల్ల కొచ్చి-కొయంబత్తూర్‌ల మధ్య దూరం 3 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు ప్రధాన ట్రాఫిక్ సమస్య-ప్రమాదాలకు చెక్ పెట్టొచ్చని కేరళ భావించింది. హైదరాబాద్‌కు చెందిన కేఎంసీ కంపెనీ, సబ్‌కాంట్రాక్ట్‌తో ది ప్రగతి గ్రూప్‌లు ఈ ప్రాజెక్టులో భాగం అయ్యాయి. 2016, జూన్‌లో టన్నెల్ పేలుడుతో మొదలైన పనులు.. ఐదేళ్లుగా నడుస్తూ వచ్చాయి. దీంతో సౌత్‌లోనే ఇదొక సుదీర్ఘమైన ప్రాజెక్టుగా పేరు దక్కించుకుంది. సుమారు 200 కోట్లు(లెక్కల్లో 165 కోట్లు), ఐదేళ్ల తర్వాత ఎట్టకేలకు సొరంగ మార్గాల నిర్మాణం పూర్తైంది. అయితే ఒకవైపు నిర్మాణ సంస్థ నుంచి మరోవైపు ఎన్హెచ్ఏఐ(నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి ఈ సొరంగాలు ఎప్పుడు తెరుచుకుంటాయో అనేదానిపై క్లారిటీ లేకుండా పోయింది. దీంతో కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని ఆరాతీయగా.. ఆగస్టులో ఈ టన్నెల్ లాంఛింగ్ ఉండొచ్చని బదులిచ్చింది కేంద్ర రోడ్డు రవాణా శాఖ. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేసేదాకా.. కేరళ అధికారులకు, మంత్రులకు, ఆఖరికి సదరు కంపెనీకి సైతం ఈ సొరంగ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందనే విషయం తెలియకపోవడం విశేషం. We will open one side of the Kuthiran Tunnel in Kerala today. This is the first road tunnel in the state and will drastically improve connectivity to Tamil Nadu and Karnataka. The 1.6 km long tunnel is designed through Peechi- Vazahani wildlife sanctuary. pic.twitter.com/9yG0VhrsLq — Nitin Gadkari (@nitin_gadkari) July 31, 2021 ఇక సాయంత్రం ఐదు గంటలకు త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ హరిత కుమార్‌కు, ఎన్హెచ్ఏఐ(నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) డైరెక్టర్‌కు మాత్రమే కేంద్రం నుంచి సమాచారం అందింది. దీంతో వాళ్లు టన్నెల్ దగ్గరికి చేరుకుని.. 7గం.55ని.ఎడమ టన్నెల్‌ను ప్రారంభించగా సామాన్యుల రాకపోకలను అనుమతి లభించింది. అయితే ఇది దారుణమని, అయినప్పటికీ ప్రజలకు పనికొచ్చే పని కావడంతో విమర్శలు-వివాదం చేయదల్చుకోలేదని అధికారులు అంటున్నారు. మరోవైపు కుడి సొరంగమార్గాన్ని డిసెంబర్ నాటికి ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక ప్రజల నుంచి టోల్ కలెక్షన్, మన్నూథి-వడక్కన్‌చెరీ ఆరులేన్ల రోడ్(కిలోమీటర్ మేర) పూర్తయ్యాకే వసూలు చేయాలని కేఎంసీ కన్ స్ట్రక్షన్స్ లిమిటెడ్‌కు కేరళ ప్రభుత్వం సూచించింది. ఎందుకంటే ఈ రోడ్ నిర్మాణ సమయంలో అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తునే వినిపించాయి కాబట్టి. -
‘మా సమాధులపై రోడ్డు వేయండి’
సాక్షి, ఖమ్మం: మా భూములు లాక్కుంటే చావుకూడా వెనకాడం, మా శవాలను పూడ్చి సమాధులపై నుంచి రహదారి నిర్మించండి అంటూ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బాధిత రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. జాతీయ రహదారి నిర్మాణానికి భూ సేకరణకు గాను అధికార యంత్రాంగం చింతకాని మండలం బస్వాపురం గ్రామ రెవెన్యూ పరిధిలోని రైతులతో శుక్రవారం ఉదయం నగరంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తొలుత రైతులు తమ అభిప్రాయాలు చెప్పాలని సూచించారు. దీంతో బస్వాపురానికి చెందిన దొబ్బల వెంగళరావు మాట్లాడుతూ.. తమ ప్రాంతం నుంచి గతంలో సాగర్ కాల్వను తీశారని, ఈ క్రమంలో అనేక మంది రైతులు తమ భూములు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేకి సైతం అవే రైతులకు సంబంధించిన భూములు కోల్పోవాల్సి వస్తుందని, దీంతో తాము భవిష్యత్తులో ఏమి చేయాలో అర్థంకావటం లేదన్నారు. గతంలో చేసిన అలైన్‌మెంట్‌ను రాజకీయ నాయకులు వారివారి స్వార్థం కోసం మార్చారని ఆరోపించారు. రైతుల అభిప్రాయాలను తీసుకోకుండా భూములను లాక్కునే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం మరికొంతమంది రైతులు మాట్లాడి, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు సమర్పించారు. సామరస్యంగా పరిష్కరించుకుందాం రైతులు అధైర్యపడొద్దని అదనపు కలెక్టర్ మధుసూదన్ అన్నారు. రైతులకు న్యాయం చేసేందుకు తమవంతుగా ప్రయత్నం చేస్తామని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామన్నారు. అనంతరం ఎన్హెచ్ఏఐ డిప్యూటీ మేనేజర్ జానకిరామ్ మాట్లాడారు. గతంలో 70మీటర్లు ఉన్న రహదారిని 60మీటర్లకు కుదించటం జరిగిందన్నారు. సాయంత్రం కొదుమూరు గ్రామ రైతులతో సమావేశం నిర్వహించారు. సమావేశాల్లో ఖమ్మం ఆర్డీఓ రవీంధ్రనా«థ్, చింతకాని తహసీల్దార్ తిరుమలచారి, భూ సేకరణ విభాగం డిప్యూటీ తహసీల్దార్ రంజిత్ పాల్గొన్నారు. – మధుసూదన్, అదనపు కలెక్టర్ -
హైవేపై అత్యవసర ల్యాండింగ్
ఘజియాబాద్: విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో లోపం తలెత్తడంతో పైలెట్ జాతీయరహదారిపై సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు. ఈ ఘటన ఢిల్లీ సమీపంలో చోటుచేసుకుంది. ఎన్సీసీకి చెందిన రెండు సీట్ల శిక్షణ విమానం ఒకటి గురువారం మధ్యాహ్నం బరేలీ నుంచి హిండన్ ఎయిర్‌బేస్‌కు బయలుదేరింది. అరగంట తర్వాత ఇంజిన్‌లో లోపం తలెత్తినట్లు గుర్తించిన పైలెట్ అప్రమత్తమయ్యాడు. అధికారుల సూచనల మేరకు ఘజియాబాద్ జిల్లాలో రెండో నంబర్ జాతీయ రహదారిపై విమానాన్ని అత్యవసరంగా దింపాడు. అందులోని ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. విమానం రెక్క ఒకటి స్వల్పంగా దెబ్బతింది. -
డివైడర్ లేక ప్రమాదాలు
సాక్షి, విజయనగరం రూరల్ : మండలంలోని చెల్లూరు–ముడిదాం గ్రామాల మీదుగా జాతీయ రహదారికి ఇరువైపులా డివైడర్లు లేక ప్రమాదాలకు నిలయంగా మారింది. మండలంలోని చెల్లూరు నుంచి ముడిదాం, రీమాపేట గ్రామాల మీదుగా వీటీ అగ్రహారం వరకు సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉన్న జాతీయ రహదారిపై రోడ్డు డివైడర్లు లేకపోవడంతో ఎప్పటికప్పుడు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముడిదాం, రీమాపేట, ప్రశాంతినగర్ గ్రామాలు జాతీయ రహదారికి ఆనుకోవడంతో ప్రజలు బెంబెలెత్తుతున్నారు. విశాఖపట్నం నుంచి విజయనగరం, సాలూరు, పార్వతీపురం ఒడిశాకు రోజూ వేలాది వాహనాలు ఇదే రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటాయి. ట్రాఫిక్ రద్దీ ఎక్కువ కావడం, భారీ వాహనాలు ప్రయాణిస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే జాతీయ రహదారి, పట్టణ శివారు కావడం రోడ్డు చిన్నదైనా వాహన చోదకులు మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో గ్రామస్తులు ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. కనీసం నెలకోసారైనా మూడు కిలోమీటర్ల రోడ్డులో ఎక్కడోచోట రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటుందని గ్రామస్తులు తెలిపారు. ఉదయం ఏడు గంటల నుండే విద్యార్థులు పాఠశాలలకు సైకిళ్లు, ఆటోలపై రాకపోకలు సాగించడంతో తల్లిదండ్రులు భయం భయంగానే పిల్లలను పాఠశాలలకు సాగనంపుతున్నారు. పాలకులు, ఆర్ ఆండ్ బి అధికారులు స్పందించి రోడ్డు డివైడర్ మంజూరు చేసి నిర్మించాలని ముడిదాం, రీమాపేట, ప్రశాంతినగర్ ప్రజలు కోరుతున్నారు. భయమేస్తోంది రోడ్డు ఇరుగ్గా ఉండటం, భారీ వాహనాలు, కార్లు అతివేగంగా వెళ్లడంతో ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోనని భయమేస్తోంది. రోడ్డు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవలసిందే. చిన్నపిల్లలు, విద్యార్థులు, వృద్ధులు రోడ్డు దాటాలంటే మనిషి తోటు ఉండాల్సిందే. – తుపాకుల అప్పలరాజు, ప్రశాంతినగర్ డివైడర్లు ఏర్పాటు చేయాలి ముడిదాం, రీమాపేట, ప్రశాంతినగర్ గ్రామాలు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నాయి. ప్రశాంతినగర్ వద్ద భారీ వాహనాలు రోడ్డు పక్కనే నిలిపేస్తున్నారు. రోడ్డుకు ఇరుకుగా ఉండటం, వాహనాలు అతివేగంగా వెళ్లడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు డివైడర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు తగ్గుతాయి. – అలమండ అప్పలరాజు, మాజీ సర్పంచ్, ముడిదాం -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
వారంతా వివిధ గ్రామాల నుంచి ఎవరి పనిమీద వారు పట్టణానికి వచ్చి వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు నంద్యాల వైపు వెళ్తున్న ఆటో ఎక్కారు. బయలుదేరిన ఐదు నిమిషాలకే వెనుక నుంచి లారీ రూపంలో మృత్యువు యమపాశం విసిరింది. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లె మెట్ట సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. సాక్షి,ఆళ్లగడ్డ(కర్నూలు): మండల పరిధిలోని పేరాయిపల్లె మెట్ట సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు.. దొర్నిపాడు మండలం చాగరాజువేముల గ్రామానికి చెందిన చాకలి శివుడు, భార్య లక్ష్మిదేవి పట్టణానికి చేరుకొని, ఎర్రగుంట్ల గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. బత్తలూరు గ్రామానికి చెందిన విలియం మనవరాలికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో కోడలితో కలిసి పట్టణంలోని వైద్యశాలకు వచ్చి అక్కడ చికిత్స చేయించుకుని, తిరిగి గ్రామానికి వెళ్లేందుకు ఇదే ఆటో ఎక్కారు. వీరితో పాటు మరో ఆరుగురు కూడా నంద్యాల వైపు వెళ్లేందుకు ఆటోలో ఎక్కి కూర్చోవడంతో ఆటో నంద్యాల వైపు బయలు దేరింది. పేరాయిపల్లె›మెట్ట సమీపంలోకి రాగానే ఆటోలో ఉన్న ప్యాసింజర్ సంచి కిందపడుతోందని చెప్పడంతో డ్రైవర్ సడన్‌గా రోడ్డు సైడుకు తిప్పి నిలిపాడు. వెనుకనే వస్తున్న లారీ క్షణాల్లో ఆటోను ఢీకొంది. ప్రమాదంలో చాగరాజువేముల గ్రామానికి చెందిన చాకలి లక్ష్మీదేవి (50), బత్తలూరు గ్రామానికి చెందిన విలియం (61) అక్కడికక్కడే మృతిచెందగా, లక్ష్మీదేవి భర్త చాకలి శివయ్యతో పాటు నల్లగట్లకు చెందిన బాలిక మాధవి, బత్తలూరు గ్రామానికి చెందిన సులోచన, గాజులపల్లి గ్రామానికి చెందిన రసూల్బీలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, „ýక్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమచికిత్స అనంతరం నంద్యాల వైద్యశాలకు తీసుకెళ్లారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. -
మాంసాహార విక్రయాలపై నియంత్రణేదీ..?
సాక్షి, ఆలేరు : ఆలేరులో మాంసాహర విక్రయాలపై అధికారుల నియంత్రణ కొరవడింది. గ్రామ పంచాయతీ, పశువైధ్యాధికారుల అనుమతి లేకుండానే మేకలు, గొర్రెలను వధిస్తున్నారు. మూగ జీవాలను కోసే ముందు సంబంధిత అధికారులు ఆమోద ముద్ర వేయాలి. ఆరోగ్యం ఉందని సర్టిఫై చేసిన తరువాతనే వధించాల్సి ఉంటుంది. అలాగే మాంసం కోసే వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి. కానీ ఇవేమీ పట్టడం లేదు. ఆరోగ్యంగా లేని మేకలను, గొర్రెలను ఇండ్ల వద్ద వధిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మటన్‌ధర ప్రస్తుతం కేజీకి 550 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. కొందరు పొట్టేలు మాంసానికి బదులు మేక, గొర్రె మాంసాన్ని అంటగడుతున్నారని పలువురు వాపోతున్నారు. నిబంధనలు గాలికి.. మటన్ షాపులు రహదారి పక్కన మురికి కాల్వ పక్కన విక్రయిస్తున్నారు. మాంసం పై దుమ్ము ధూళి, ఈగలు వాలుతున్నాయి. మాంసాన్ని అమ్మే షాపులు పరిశుభ్రంగా ఉండాలి. నిల్వ చేసిన మాంసాన్ని అమ్మకూడదు. ఆహార పదార్థాలు..ప్రధానంగా మాంసాన్ని విక్రయించే షాపులకు అనుమతి ఉండాలి. మేకలను, గొర్రెలను వధించినప్పుడు వెలువడే వ్యర్థాలను నిర్ధేశిత ప్రాంతాలకు తరలించాలి. ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.. మాంసాన్ని ఫ్రిజ్‌లో ఉంచకుండా కొన్ని గంటల పాటు వేలాడదీస్తే వ్యాధి కారక క్రిములు చేరుతాయి. ఈ మాంసాన్ని తింటే అమీబియాసిస్, విరేచనాలు, ఈకొలై వల్ల సంక్రమించే వ్యాధులు సంభవిస్తాయి. ఈగలు ముసిరిన మాంసాన్ని తింటే టైపాయిడ్, గ్యాస్ట్రో, ఎంటరైటిన్ వ్యాధులు వస్తాయి. వీటితో పాటు విరేచనాలు అవుతాయి. అసంపూర్తిగా మడిగెలు.. మటన్ షాపుల నిర్వహణ కోసం ఆలేరు పట్టణంలో సుమారు 15సంవత్సరాల క్రితం మడిగెలు నిర్మించి అసంపూర్తిగా వదిలేశారు. వీటిని ఉపయోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పిల్లర్ల వరకు నిర్మించి వదిలేశారు. ప్రస్తుతం అసంపూర్తి మడిగెల్లో కంపచెట్లు పెరిగి, మూత్రశాలగా మారింది. వీటిని పూర్తి స్థాయిలో నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. -
విస్తరణ లేదు...బైపాస్ అవదు
గుంటూరు, చిలకలూరిపేటరూరల్: జాతీయ రహదారిని ఆరులైన్లుగా విస్తరించాలన్న యోచన పదేళ్లయినా అమలుకు నోచుకోలేదు. ఈలోగా బైపాస్ ఏర్పాటు చేసేందుకు భూ సేకరణ చేసి గజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం బైపాస్ కోసం రైతుల వద్ద నుంచి సేకరించిన భూమికి పరిహారం అందించినా రాష్ట్ర ప్రభుత్వ వాటా నేటికీ చెల్లించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయలోపంతో ఈ దుస్థితి దాపురించింది. రహదారి విస్తరణ, బైపాస్ రెండూ జరగకపోవటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూ, వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. విస్తరణ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం 16వ నంబర్ జాతీయ రహదారిని(గతంలో ఐదవ నెంబర్) 2009లో ఆరులైన్లుగా విస్తరించాలని నిర్ణయించింది. ఈ రహదారి విజయవాడ నుంచి చిలకలూరిపేట వరకు 82.5 కిలోమీటర్ల దూరం ఉంది. వాహనాల సంఖ్య పెరిగిన క్రమంలో ఆరులైన్లుగా విస్తరించాలని 2009 మే 1న కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ నుంచి ఒంగోలు వరకు ఉన్న 68 కిలోమీటర్లు ఆరులైన్లుగా విస్తరించినప్పటికీ, చిలకలూరిపేట నియోజవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం నుంచి చిలకలూరిపేట మండలం బొప్పూడి శివారు వరకు ఉన్న 14.5 కిలోమీటర్ల పరిధిలో మాత్రం కోర్టుకేసుల నేపథ్యంలో ఆరు లైన్లుగా విస్తరణకు నోచుకోలేదు. బైపాస్ ఏర్పాటు చేసేందుకు అనుమతులు లభించి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌ను అందించకపోవటంతో నేటికీ పనులు ప్రారంభించలేదు. అనేక అవాంతరాలతో అనుమతులు నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారి సమీపంలో ఉన్న పారిశ్రామిక వేత్తలు, పట్టణంలోని భవనాలకు చెందిన యజమానులు జాతీయ రహదారిని ఆరులైన్ల విస్తరణకు అంగీకరించలేదు. బైపాస్‌ను ఏర్పాటు చేసేందుకు భూసేకరణకు కేంద్రప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే సన్నచిన్నకారు రైతులు తమ విలువైన భూమిని ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఈ విషయమై 2010లో ఉమ్మడి రాష్ట్ర హైకోర్డును ఆశ్రయించారు. కోర్టు రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించి బైపాస్‌ను ఏర్పాటు చేయాలని తీర్పు వెలువరించింది. 2016లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రహదారుల సమీపంలో ఉన్న భూములకు ఒక ధర, భవనాలు ఉన్న భూములకు ఒక ధర, రహదారులకు దూరంగా ఉన్న భూములకు మరొక ధరను నిర్ణయిస్తూ(ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరల కన్నా 2.5 శాతం) అధికంగా చెల్లించేందుకు రైతులు అంగీకరించటంతో బైపాస్కు రంగం సిద్ధమైంది. ఆరు లైన్ల బైపాస్కు అనుమతి నేషనల్ హైవేస్ యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం నుంచి మండల కేంద్రమైన నాదెండ్ల, చిలకలూరిపేట పట్టణం, చిలకలూరిపేట మండల పరిధిలోని బొప్పూడి మీదుగా 16.38 కిలోమీటర్ల దూరంలో ఆరులైన్ల బైపాస్‌ను ఏర్పాటు చేసేందుకు 650 మంది రైతులకు చెందిన 132.12 ఎకరాల భూమిని సేకరించింది. సంబంధిత భూమిలో సర్వేలు నిర్వహించిన నేషనల్ హైవే అధికారులు సెక్షన్3(డీ) ప్రకారం 12–01–2018న, 31–05–2018న పత్రికల ద్వారా గజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లపై అభ్యంతరాలు ఉంటే పరిష్కరించేందుకు 2018 ఆగస్టులో నరసరావుపేట ఆర్డీవో నేతృత్వంలో సమావేశాలు నిర్వహించారు. బైపాస్కు భూములు ఇచ్చేందుకు మెజార్టీ రైతులు అంగీకరించారు. అసలు చిక్కు ఇదే ... కేంద్రప్రభుత్వం బైపాస్ రోడ్‌ను ఏర్పాటు చేసే క్రమంలో రైతులకు అందించే పరిహారంలో కేవలం 25 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కోరింది. బైపాస్ నిర్మాణంలో భూమిని కోల్పోతున్న రైతులకు రూ.223.30 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ. 55.80 కోట్లు అందించాలని కేంద్రప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 4న లేఖరాసింది. అనంతరం అక్టోబర్ 1న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జాతీయ రహదారుల శాఖకు చెందిన అధికారులు మరో విడత లేఖ రాశారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవటం గమనార్హం. బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.525.78 కోట్లను కేటాయిస్తూ కేంద్రప్రభుత్వం బిడ్లను(టెండర్) గత ఏడాది అక్టోబర్ 22న ప్రకటించింది. బిడ్లకు చివరి తేదీగా 17–01–2019న నిర్ణయించారు. నేటికీ రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రైతుల పరిహారం వాటాను చెల్లించకపోవటం ప్రశ్నార్ధకంగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న ప్రమాదాలు జాతీయ రహదారిలో కేవలం 14.50 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆరులైన్లుగా విస్తరించలేదు. గత తొమ్మిదేళ్ల కాలంలో తిమ్మాపురం నుంచి బొప్పూడి శివారు వరకు 310 ప్రమాదాలు చోటు చేసుకుని 128 మంది మరణించారు. 171 మంది క్షతగాత్రులయ్యారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బైపాస్ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వానికి లేఖ అందించాం చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్రప్రభుత్వం రూ.525.78 కోట్లతో టెండర్లు పిలించింది. బిడ్ల ప్రక్రియ ఈనెల 17వ తేదీన ముగుస్తుంది. రైతులకు చెందిన భూమిని సేకరించాం. గజిట్ నోటిఫికేషన్ విడుదల చేశాం. రైతులకు పరిహారం అందించకుండా రోడ్డు నిర్మాణం చేయటం భావ్యం కాదు. పరిహారం ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం వాటా అయిన 25 శాతం(రూ.55.80 కోట్లు) చెల్లించాలని లేఖను అందించాం. ప్రభుత్వం నిధులు కేంద్రానికి జమచేస్తే పరిహారం వెంటనే మంజూరు చేసి రైతులకు పంపిణీ చేసి బైపాస్ నిర్మాణం ప్రారంభిస్తాం–కె.శ్రీనివాసరావు,పి.డి, నేషనల్హైవే, విజయవాడ -
ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు దుర్మరణం
పెద్దపంజాణి : మండలంలోని బట్టందొడ్డి సమీపంలో పలమనేరు–పుంగనూరు జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం కారును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ చంద్రమోహన్ కథనం మేరకు.. పుంగనూరు పట్టణానికి చెందిన నరసింహులు భార్య అనిత, కుమారుడు నవీన్(26), కూతురు కొడుకు హర్షిత్(10), స్నేహితుడు దొరస్వామి(61) కలిసి కారులో సొంత పనుల నిమిత్తం చిత్తూరు వెళ్లారు. పని ముగించుకుని స్వగ్రామం బయలుదేరారు. పెద్దపంజాణి మండలం బట్టందొడ్డి సమీపంలో ఎదురుగా వస్తున్న చిత్తూరు ఒకటో డిపోకు చెందిన మెట్రో బస్సు ఢీకొంది. దీంతో నవీన్, హర్షిత్ అక్కడిక్కడే మృతి చెందారు. దొరస్వామి, అనితకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారమిచ్చారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి తరలించారు. అక్కడ దొరస్వామి మృతిచెందాడు. ఎస్ఐ చంద్రమోహన్ అక్కడికి చేరుకుని మృతదేహాలను పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జాతీయ రహదారులు దిగ్బంధించిన వైఎస్సార్ సీపీ
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం జాతీయ రహదారుల దిగ్బంధనం కొనసాగుతోంది. ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ ఎంపీలు ఢిల్లీలోని ఏపీ భవన్లో చేపట్టిన నిరాహార దీక్షకు మద్ధతుగా ఏపీలోని పలు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ నాయకులు నిరాహార దీక్షలకు పూనుకున్నారు. మంగళవారం అన్ని నియోజకవర్గాల్లో జాతీయ, రాష్ట్ర రహదారుల దిగ్బంధన కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయం నుంచి సోమవారం ప్రకటన వెలువడిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఉదయం నుంచే జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. అలాగే వైఎస్సార్సీపీ ఎంపీల దీక్షకు మద్ధతుగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీశ్రేణులు ఏపీలో రిలే నిరాహార దీక్షలకు దిగాయి. పలు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు తీసి, మానవహారాలు ఏర్పాటు చేసి నిరసన తెలిపాయి. నెల్లూరు : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో వైఎస్ఆర్ సీపీ ఎంపీలు రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతో వారికి మద్దతుగా నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధనం చేశారు. సూళ్లూరుపేట హోలీ క్రాస్ సెంటర్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధనం. రాస్తారోకో నిర్వహించిన నేతలు కళాత్తూర్ శేఖర్ రెడ్డి..వెంకట రమణా రెడ్డి...రాజా సులోచనమ్మ..తుపాకుల ప్రసాద్. నిరాహార దీక్షకు మద్దతుగా ఉదయగిరిలో మాజీ ఎంఎల్ఏ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగో రోజు కొనసాగుతున్న నిరసన దీక్షలు. ప్రత్యేక హోదా కోసం పొదలకూరులో సర్వేపల్లి ఎంఎల్ఏ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గూడూరు జాతీయ రహదారిపై వైఎస్సార్ సీపీ ఇంచార్జి మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు. అనంతపురం: తాడిపత్రిలో వైఎస్సార్ సీపీ నేత పైలానరసింహయ్య చేపట్టిన నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. ఆరోగ్యం క్షీణించినా ఆయన దీక్ష అలాగే కొనసాగిస్తున్నారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ అంకోలా- నెల్లూరు జాతీయ రహదారిని గుంతకల్లులో కార్యకర్తలతో కలిసి వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై. వెంకట్రామిరెడ్డి దిగ్బంధనం చేశారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎంపీ ల దీక్షకు మద్దతుగా ధర్మవరం మాజీ శాసన సభ సభ్యుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆద్వర్యంలో చేపట్టిన రిలే నిరహారదీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ప్రత్యేక హొదా కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీలకు మద్దతుగా రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నాల్గవ రోజుకు చేరుకున్నాయి. ఎంపీల ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా గుత్తిలో బిక్షాటన చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు. హిందూపురం వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు. 4వ రోజులో భాగంగా తుమకుంట చెక్ పోస్టు వద్ద రహదారుల దిగ్బంధం చేపట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా కళ్యాణదుర్గంలో రహదారులు నిర్బంధించిన వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఉషశ్రీచరణ్, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు బుక్కరాయసముద్రంలో హైవే దిగ్బందం. అనంతపురం-తాడిపత్రి మధ్య స్తంభించిన రాకపోకలు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి సహా 100 మంది అరెస్ట్. కృష్ణా జిల్లా : నందిగామలో ప్రత్యేక హోదా కోరుతూ ఆందోళన చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆందోళనలో భాగంగా మంగళవారం నాడు జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమం ఉండటంతో పోలీసులు ముందస్తుగా ఇంటి వద్దనే హౌస్ అరెస్టు చేశారు. నందిగామ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మొండితోక జగన్ మోహన్‌తో పాటు మరి కొంత మంది నేతలను ముందస్తుగా హౌస్ అరెస్టు చేసి అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 65వ నెంబర్ జాతీయ రహదారి దిగ్బంధం చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రత్యేక హోదా కోసం జగ్గయ్యపేటలో రహదారుల దిగ్బంధం చేసిన పలువురు వైఎస్ఆర్సీపీ నేతలను గృహనిర్బంధం చేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన వైఎస్సార్సీపీ జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్ (చిన్న), నంబూరి రవిలను పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గుడివాడలోని గాంధీ మండపంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో మైనారిటీ నాయకుల రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. వైఎస్సార్ జిల్లా: ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలకు మద్దతుగా రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట వద్ద వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గుంటి మడుగు సుధాకర్ రాజు ఆధ్వర్యంలో కడప- చెన్నై జాతీయరహదారి దిగ్బందం చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆమరణ దీక్షకు మద్దతుగా బద్వేలులో పార్టీ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్య౦లో చేపట్టిన రిలే రాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. అలాగే పోరుమామిళ్లలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కూడా నాలుగోరోజుకు చేరుకున్నాయి. వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కడప-చెన్నై ప్రధాన రహదారిపై కార్యకర్తలతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. చిత్తూరు జిల్లా: ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్షలు చేస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీలకు మద్దతుగా తిరుపతి తుడా సర్కిల్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన రిలే దీక్షలు నాల్గవ రోజుకు చేరుకున్నాయి. సత్యవేడులో వైఎస్సార్సీపీ నియోజక వర్గ సమన్యకర్త ఆదిమూలమ్ నేతృత్వంలో ధర్నా కార్యక్రమం జరిగింది. గుడిపాలలోని చెన్నై జాతీయ రహదారిపై పార్లమెంట్ యువజన విభాగం నాయకుడు మధుసూదన్ ఆధ్వర్యంలో రహదారుల దిగ్భంధం కార్యక్రమం జరిగింది. వైస్సార్సీపీ ఎంపీలకు మద్దతుగా పీలేరులో వైస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు సుంకర చక్రధర, ఎంపీపీ హరిత ఆధ్వర్యంలో కడప-చిత్తూరు జాతీయ రహదారి దిగ్భంధనం నగరిలో తిరుపతి - చెన్నై జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు రాస్తార కో చేపట్టారు వైఎస్సారీసీపీ ఎంపీలకు మద్దతుగా శ్రీకాళహస్తిలో పెండ్లి మండపము వద్ద రోడ్డుపై వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో ధర్నానిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎంపీలకు మద్ధుతుగా తిరుపతి ఎస్వీయూలో విద్యార్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాల్గవ రోజు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి నేతృత్వంలో నిరసన. మద్దతుగా పాల్గొన్న ఎస్వీయూ ప్రొఫెసర్లు. కర్నూలు జిల్లా: బనగానపల్లె నియోజకవర్గం వైఎస్సార్ పార్టీ ఇంచార్జ్ కాటసాని రామిరెడ్డి అధ్వర్యంలో బనగానపల్లె పట్టణం పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద 4వ రోజు అవుకు మండల వైఎస్సార్ పార్టీ మహిళ కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిద్ధం రెడ్డి రాం మోహన్ రెడ్డి, పీఆర్ వెంకటేశ్వర రెడ్డి, బండి బ్రహ్మానంద రెడ్డి, డాక్టర్ మహమ్మద్ హుస్సేన్ తదీతరులు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో వైఎస్సార్సీపీ ఎంపీల ఆమరణ దీక్షకు మద్దతుగా ఆధోనిలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు 167వ నెంబర్ జాతీయ రహదారి దిగ్బంధం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవా తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు పట్టణంలో ప్రత్యేక హోదా కొసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి దిగ్బందం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెంలోని పోలీసు ఐల్యాండ్ వద్ద తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో అయిదవ రోజు రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్లో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలకు మద్ధతుగా నాలుగో రోజు కొనసాగుతున్నదీక్షలు. ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త కవురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష. జాతీయ రహదారుల దిగ్బంధనం. వైఎస్సార్సీపీ ఎంపీల దీక్షకు మద్దతుగా పెదవేగి మండలం గోపన్నపాలెంలో దెందులూరు వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. పెదపాడు మండలం అప్పనవీడులో జాతీయ రహదారి దిగ్బంధం. కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కోటగిరి శ్రీధర్ , వైఎస్సార్సీపీ నేతలు. ప్రకాశం జిల్లా: యర్రగొండపాలెంలో ప్రత్యేక హోదా సాధనకై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు జాతీయ రహదారిపై దిగ్బంధం చేసి రాస్తారోకో నిర్వహించారు. మార్కాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపురంలో జాతీయ రహదారి దిగ్బంధం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి యమ్ షంషీర్ అలీ బేగ్, పట్టణ కన్వీనర్ బాల మురళీ కృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు ఎన్ కొండయ్యలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలో వైఎస్సార్సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరహారదీక్షలకు మద్దతుగా సంతనూతలపాడు బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ నాయకుల ధర్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దుంపా చెంచిరెడ్డి, కార్యకర్తలు. కొండపి ఎంఆర్ఓ ఆఫీసు ఎదురుగా కొండపి వైఎస్సార్సీపీ ఇంచార్జ్ అశోక్ బాబు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు. భారీ స్థాయిలో పాల్గొన్న మహిళలు. కనిగిరి పీవీఆర్ పార్క్ వద్ద వైఎస్సార్సీపీ నాయకులు చేపట్టిన రిలే నిరాహరదీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. పాల్గొన్న నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ బుర్రా మదుసూదన్ యాదవ్, బన్ని, సరితా రెడ్డి, సుజాత, మాల్యాద్రి తదితరులు. వైఎస్సార్ సీపీ ఎంపీలకు మద్దతుగా కంభం వై జంక్షన్ రోడ్డుపై దిగ్భందం చేసిన గిద్దలూరు వైఎస్సార్ సీపీ ఇంచార్జి ఐవీ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా: కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న నాల్గోవ రోజు రిలే నిరాహారదీక్షలు. దీక్షలో పాల్గోన్న యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అనంత బాబు, సీతారామాంజనేయులు, దుర్గా ప్రసాద్ రెడ్డి,లింగం రవి,గాగరిన్,అడపా సుబ్బారావు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీలకు సంఘీభావంగా తుని గొల్లప్పారావు సెంటర్లో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. కార్యాకర్తలు16వ నెంబర్ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. రాజోలు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ బొంతు రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో చించినాడ బ్రిడ్జి వద్ద రహదారి దిగ్భందనం చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వైఎస్సార్సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ ధీక్షకు సంఘీభావంగా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెం వద్ద జాతీయ రహాదారి దిగ్భంధం. నాల్గవ రోజు రిలేదీక్ష చేపట్టిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, కార్యకర్తలు. విశాఖపట్నం జిల్లా : ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలకు మద్దతుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు, సమన్వయకర్తలు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు ఆధ్వర్యంలో పాయకరావుపేటలో వైఎస్సార్సీపీ శ్రేణుల రిలే నిరాహార దీక్షలు నాల్గవ రోజు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలో రాష్ట్ర అదనపు కార్యదర్శి సీతారామరాజు, బోలిశెట్టి గోవిందు,దనిశెట్టి బాబూరావు, దగ్గుపల్లి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఎంపీలకు మద్ధతుగా మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో మాడుగుల జంక్షన్లో వైఎస్సార్సీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షకు దిగాయి. చోడవరం సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో కార్యకర్తలు స్థానిక ఎమ్మార్వో కార్యాలయం పక్కన రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ఆర్థిక సంఘం ప్రధాన కార్యదర్శి జొన్నాడ శ్రీనివాస్ రజకుల ఆధ్వర్యంలో చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి కొత్తూరు నాలుగు రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. నర్సీపట్నంలో వైఎస్సార్సీపీ కన్వీనర్ పెట్ల ఉమాశంకర గణేష్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరాయి. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలకు మద్దతుగా అనకాపల్లిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. కార్యకర్తలు మంగళవారం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ప్రత్యేక హోదా నినాదాలు చేవారు. ఈ రాస్తారోకో పార్లమెంటరీ సమన్వయకర్త వరుదు కళ్యాణి, గొల్లవిల్లి శ్రీనివాస్, బీశెట్జి జగన్, జాజుల రమేష్, శ్రీధర్ రాజు, భూలోకనాయు, ఆళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గాజువాకలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా : ఢిల్లీలో వైఎస్సార్సీపి ఎంపీల దీక్షకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. సత్తెనపల్లి తాలూకా సెంటర్లో గుంటూరు-హైదరాబాద్ రహదారిపై అంబటి రాంబాబు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నరసరావుపేట శివారులో హైవేపై బైఠాయించిన నిరసన తెలిపిన నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భట్టిప్రోలులో ప్రధాన రహదారిపై బైఠాయించిన వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, కార్యకర్తలు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఆధ్వర్యంలో వెదుళ్లపల్లిలో జాతీయ రహదారిని దిగ్బంధించిన వైసీపి కార్యకర్తలు చిలకలూరిపేట సమన్వయకర్త మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో నాలుగో రోజు రిలే నిరాహారదీక్షలకు కూర్చున్న కార్యకర్తలు పొన్నూరు ఐలాండ్ సెంటర్లో రావి వెంకటరమణ ఆధ్వర్యంలో నాలుగవ రోజు చేరిన కార్యకర్తల రిలే నిరాహారదీక్షలు గుంటూరు చుట్టుగుంట సెంటర్లో ఎమ్మెల్యే ముస్తఫా, లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధం. భారీగా నిలిచిపోయిన వాహనాలు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నాలుగో రోజుకు చేరిన రిలే నిరాహారదీక్షలు విజయనగరం జిల్లా : ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలకు మద్దతుగా విజయనగరం జిల్లా కేంద్రంలో కోలగట్ల వీరభద్ర స్వామి నేతృత్వంలో రహదారి దిగ్బంధం కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ జగన్ నాలుగేళ్లుగా చేస్తున్న పోరాటాన్ని ప్రజలు గమనిస్తున్నారని, అందుకే హోదా కోసం చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారన్నారని ఈ సందర్భంగా కోలగట్ల వ్యాఖ్యానించారు. -
22న ఏపీలో హైవేల దిగ్బంధనం
సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ.. ఈ నెల 22న చేపట్టబోయే జాతీయ రహదారుల దిగ్బంధానికి టీడీపీ, బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపినట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి 22 ప్రజాసంఘాలు సంఘీభావం ప్రకటించాయని, విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఉదయం పది నుంచి పన్నెండు గంటల వరకు జాతీయ రహదారుల దిగ్బంధం చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ కార్యక్రమాన్ని టీడీపీ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని, టీడీపీకి చిత్తశుద్ధి వుంటే ఈ కార్యక్రమానికి సహకరించాలంటూ పిలుపునిచ్చారు. టీడీపీ ఎటువంటి ఆటంకాలు కల్పించినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పార్లమెంటులో అవిశ్వాసం ఎదుర్కొనే ధైర్యం బీజేపీకి లేదని అన్నారు. సరళీకరణ విధానాలను అవలంభిస్తున్న బీజేపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం ఇష్టం లేదని, అందుకే అవిశ్వాసంపై చర్చ జరిగితే తమ బండారం ఎక్కడ బయటపడతుందోనని భయపడుతోందని ఆరోపించారు. ఇదే విషయమై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ స్పందిస్తూ.. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి సైంధవ పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. బీజేపీతో కలిసి టీఆర్ఎస్ లాలుచీ పడిందని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్, అన్నాడీఎంకేలు చర్చకు సహకరించాలని కోరారు. రాష్ట్రానికి రైల్వేజోన్ ఇవ్వకపోగా, ఉన్న రైళ్లను రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను ఎలా రద్దు చేస్తారంటూ నిలదీశారు. రేపు ఉదయం కనకదుర్గమ్మ వారధి వద్ద జాతీయ రహదారి నిర్బంధం చేస్తున్నట్టు తెలిపారు. కేంద్రానికి స్పష్టమైన సంకేతాలు ఇవ్వడాని అన్ని పార్టీలు ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
బైపాస్ గుబులు
చేవెళ్ల: హైదరాబాద్–బీజాపూర్ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించడంతో ఆ రోడ్డును విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి మన్నెగూడ వరకు ఉన్న 60 కిలోమీటర్ల పరిధిని ఒక భాగంగా.. మన్నెగూడ నుంచి మరో భాగంగా విభజించారు. విస్తరణకు మొదటి దశలో రూ.400 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే సర్వే పనులు పూర్తయ్యాయి. మొదటి విడతలో భాగంగా పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు ఉన్న రోడ్డులో 16 అండర్‌పాస్‌లు, రెండు బైపాస్‌లు, ఒక టోల్‌గేటు ఏర్పాటు చేయనున్నారు. రెండేళ్లలో రోడ్డు పనులు పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి భూసేకరణ పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. బైపాస్‌తో భూములు కోల్పోనున్న రైతులు చేవెళ్ల వద్ద బైపాస్ రోడ్డు నిర్మించేందుకు చేవెళ్ల, కేసారం, దామరగిద్ద, ఇబ్రహీంపల్లి గ్రామాలకు చెందిన 120 మందికిపైగా రైతులకు సంబంధించిన దాదాపు 90 ఎకరాల పట్టా భూములు కోల్పోతున్నారు. ఇందులో చాలా మంది చిన్న, సన్నకారు రైతులు ఉండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్‌తో భూముల ధరలు ఆకాశాన్నంటినా.. పొలాలను అమ్మకుండా కాపాడుకుంటున్న రైతులు ఇప్పుడు రోడ్డు విస్తరణలో భూములు పోతుండడంతో అయోమయంలో పడ్డారు. తమ బతుకులను అన్యాయం చేసే రోడ్డు తమకొద్దని అంటున్నారు. రోడ్డు విస్తరణలో మొత్తం 60 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 450 ఎకరాల భూమి అవసరం ఉందని అధికారులు గుర్తించారు. స్పష్టత ఇవ్వని అధికారులు నేషనల్ హైవే రోడ్డు విస్తరణలో భాగంగా భూముల సేకరణకు సంబంధించి రైతులకు ఎలాంటి పరిహారం చెల్లిస్తారనే విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందుతుందని చెబుతున్నారు. కానీ రైతులు మాత్రం తమకు పరిహారం వద్దు.. భూమికి బదులు భూమి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అధికారులు అంగీకరపత్రాలపై సంతకాలు చేయాలంటూ రైతుల వద్దకు వెళ్తున్నారు. సర్వం కోల్పోతున్నాం.. బైపాస్ రోడ్డులో నా రెండు ఎకరాల భూమి పోతుంది. నాలుగు ఎకరాలు ఉంటే అందులో మధ్య నుంచి రోడ్డు పోవడంతో రెండు ఎకరాలు భూమిపోతుంది. దీంతో ఉన్న రెండు ఎకరాలు రోడ్డుకు ఇరువైపులా మిగులుతుంది. వ్యవసాయ బావి పోతుంది. ఎలా బతకాలి. – గుడిసె రాములు, బాధిత రైతు, చేవెళ్ల చట్ట ప్రకారం భూసేకరణ చట్ట ప్రకారమే భూసేకరణ చేస్తున్నాం. ఇప్పటికే రైతుల వివరాలతో ప్రకటనలు విడుదల చేశాం. చట్ట ప్రకారం రైతులకు పరిహారం వస్తుంది. అది రెండితలా, మూడింతలా అనేది నిబంధనల ప్రకారం ఉంటుంది. అభ్యంతరాలు ఉంటే కోర్టు ద్వారా పోరాడవచ్చు. – వెంకటేశ్వర్లు, ఆర్డీఓ, చేవెళ్ల -
అభివృద్ధి బాట
పెద్దశంకరంపేట(మెదక్): ఉమ్మడి జిల్లాలైన సంగారెడ్డి, మెదక్ జిల్లాల మీదుగా వెళ్తున్న 161వ జాతీయ రహదారి (సంగారెడ్డి–నాందేడ్– అకోలా)ని నాలుగు వరుసలుగా చేపట్టేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా భూ సేకరణ పనులను అధికారులు ముమ్మురం చేశారు. రూ.2500 కోట్ల వ్యయంతో సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలను కలుపుతూ 140 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారిని విస్తరించనున్నారు. మెదక్ జిల్లాలో టేక్మాల్ , అల్లాదుర్గం, పెద్దశంకరంపేట మండలాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేర్కొన్న విధంగా భారత్‌మాలలో భాగంగా 2018–19 సంవత్సరంలో 4,500 కిలోమీటర్ల మేర నిర్మాణాలు చేపట్టనుంది. రాష్ట్రంలో ఇప్పటికే 367 కిలోమీటర్ల మేరకు 5 ప్రాజెక్టులను చేపట్టేందుకు ఎన్హెచ్ఏఐ టెండర్లను పిలిచింది. మిగతా 529 కిలోమీటర్ల జాతీయ రహదారిని భారత్‌మాల ఫేజ్–1 ప్రాజెక్టు కింద చేపట్టేందుకు నిర్ణయించింది. వీటిని 2021–22 కల్లా పూర్తిచేయాలని సంకల్పించింది. పూర్తయిన విస్తరణ సర్వే పెద్దశంకరంపేట మండలం మీదుగా వెళ్తున్న రహదారిలో భాగంగా జిల్లాలోని అల్లాదుర్గం మండలం గడ్డిపెద్దాపూర్ నుంచి టేక్మాల్ మండలం బొడ్మట్‌పల్లి, పేట మండలంలోని జంబికుం వరకు 27 కిలోమీటర్ల వరకు విస్తరణలో రైతులు, ఇతర వాణిజ్య, వ్యాపారస్థులు నష్టపోనున్నారు. ఈ మండలాల పరిధిలో 266 ఎకరాల భూమిని సేకరించనున్నారు. అల్లాదుర్గంలో 144.08 ఎకరాలు, టేక్మాల్ మండలంలో 21.9 ఎకరాలు, పేట మండలంలో 100.17 ఎకరాలను సేకరిస్తున్నారు. జాతీయ రహదారికి ఇరువైపుల 100 ఫీట్ల రహదారిని విస్తరించనున్నారు. మార్కెట్ ధరకు అనుగుణంగా.. ఈ జాతీయ రహదారిపై ఎనిమిది చోట్ల బైపాస్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో సంగారెడ్డి, అందోల్–జోగిపేట, పెద్దశంకరంపేట, నిజాంపేట, పిట్లం, పెద్దకొడుపుగల్, మేనూరు, మద్నూర్ గ్రామాల పరిధిలో బైపాస్‌లను నిర్మించనున్నారు. జిల్లాలో కేవలం పేట మండలంలోనే బైపాస్ ఏర్పాటు కానుంది. అల్లాదుర్గం, టేక్మాల్ పరిధిలో బైపాస్‌లు లేవు. పేటలో కట్టెల వెంకటాపూర్ శివారులోని రాఘవానితాండా నుంచి కమలాపూర్ వరకు 2.5 కిలోమీటర్ల దూరం బైపాస్‌ను ఏర్పాటు చేయనున్నారు. భూసేకరణలో భాగంగా భూములు నష్టపోతున్న వారు ప్రస్తుత మార్కెట్ ధరకు అనుగుణంగా ధరలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే అల్లాదుర్గం, టేక్మాల్, పేట మండలాలకు చెందిన భూ నిర్వాసితులతో ఆర్డీఓ నగేష్, అధికారులు సమావేశం నిర్వహించారు. మరో రెండు సార్లు సమావేశం కూడా నిర్వహించనున్నారు. నష్టపరిహారం పెంచాలి జాతీయరహదారి విస్తరణలో భూములు కొల్పోతున్న వారికి ప్రస్తుత మార్కెట్‌ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. ఈ విషయంలో ప్రభ్తుత్వం చర్యలు చేపట్టాలి. మాకు ముందుగానే నష్టపరిహారం చెల్లించాలి. నష్టపోతున్న వారికి ఉపాధి సైతం చూపించాలి. –యాదగిరి, కమలాపూర్, పెద్దశంకరంపేట -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని డెంటల్ కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రసాద్ అనే వ్యక్తి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం పట్టణం ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన ప్రసాద్, వజ్రాపు వెంకట శ్రీధర్ ద్విచక్రవాహనంపై డెంటల్ కాలేజీ నుంచి వస్తున్నారు. ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం డీకొనడంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాల పాలైన శ్రీధర్ పూర్తి వివరాలు వెల్లడించే పరిస్థితిలో లేకపోవడంతో మృతుడి సమాచారం తెలియలేదు. ఔట్‌పోస్టు పోలీసులు వివరాలను సేకరించారు. ఆటో ఢీకొని ఒకరు... వజ్రపుకొత్తూరు : ఆటో బోల్తాపడడంతో మండలం తర్లాగడివూరు గ్రామానికి చెందిన కోనేరు శ్యామ్ (25) మృతి చెందాడు. వజ్రపుకొత్తూరు ఎస్ఐ ఎస్.తాతారావు, శ్యామ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయదశమి సందర్భంగా సోమవారం శ్యామ్ మిత్రులతో కలిసి ఆటోలకు పూజలు చేశారు. తర్వాత చినవంకులూరు గ్రామానికి వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ఆటో వంకులూరు రోడ్డుపక్కన బోల్తాపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్యామ్‌ను 108 అంబులెన్స్‌లో పలాస ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తాతారావు తెలిపారు. సైక్లిస్టును తప్పించబోయి ఒకరు... పూండి : వజ్రపుకొత్తూరు మండలం పూండిలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోవిందపురం గ్రామానికి చెందిన పుచ్చ వెంకటరావు తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరావు పూండి బస్టాండ్ రోడ్డులో ఫాస్ట్‌ఫుడ్ దుకాణం నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం స్థానిక పెట్రోల్ బంక్‌లో తన బైక్‌కు పెట్రోల్ పోసుకుని రోడ్డు దాటుతుండగా అడ్డంగా వచ్చిన సైక్లిస్టును తప్పించబోగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన అతనిని విశాఖపట్నం తరళిలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. మృతునికి భార్య దాలమ్మ , ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వజ్రపుకొత్తూరు హెడ్ కానిస్టేబుల్ ప్రకాశరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ద్విచక్రవాహనం ఢీకొనడంతో... సోంపేట : రాణిగాం గ్రామం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాణిగాం గ్రామానికి చెందిన ఎన్.గున్నయ్య (40) సైకిల్‌పై వెళుతుండగా పలాస మండలం బంటుకొత్తూరు గ్రామానికి చెందిన వ్యక్తులు ద్విచక్రవాహనం ఢీకొన్నారు. గున్నయ్యను హరిపురం ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు పలాస రూరల్ : పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నెమలినారాయణపురం జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన రామకృష్ణ తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. ఆటో డ్రైవింగ్ నేర్చుకుంటుండగా ప్రమాదం జరిగిందని కొందరు, రెండు వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని మరికొందరు చెబుతున్నారు. బాధితుడిని కాశీబుగ్గ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఇద్దరికి.. నరసన్నపేట రూరల్ : జాతీయ రహదారిపై శ్రీరాంపురం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. రోడ్డు దాటుతున్న మహిళ ముద్దపు సూరోడును కొటబొమ్మాళి నుంచి శ్రీకాకుళం వెళ్తున్న మోటార్ సైకిల్ ఢీకొంది. ఈ ఘటనలో మహిళతో పాటు ద్విచక్రవాహనం నడుపుతున్న సకలాబత్తుల శ్రీధర్ గాయపడ్డారు. క్షతగాత్రులను ఎన్‌హెచ్ అంబులెన్స్‌లో నరసన్నపేట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.