సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ మొదలైంది. ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రద్దీగా మారాయి. హైదరాబాద్ నుంచి ఆంధ్రా ఓటర్లు భారీగా తరలివెళ్తున్నారు. చౌటుప్పల్ పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. ఎల్లుండి పోలింగ్ సందర్భంగా సొంతూళ్లకు ఓటర్లు పయనమవడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది.
పోలింగ్‌కు కేవలం రెండు రోజులే మిగిలి ఉండటంతో శనివారం వేకువజాము నుంచే హైవేపై భారీ రద్దీ నెలకొంది. ఆయా వాహనాలు విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు వెళ్తున్నాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపైకి చేరుకోవడంతో పలుచోట్ల నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. హైదరాబాద్ నుంచి ఏపీకి 508 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. బెంగుళూరు నుంచి ఏపీకి 592 స్పెషల్ సర్వీసులు నడుపుతోంది. సాధారణ ఛార్జీలతోనే స్పెషల్ బస్సులు నడపుతున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment