న్యూఢిల్లీ: పండుగ సీజన్‌లో ప్రయాణాలు ఊపందుకోవడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడాన్ని సూచిస్తూ అక్టోబర్‌లో ఫాస్టాగ్ టోల్ లావాదేవీలు రికార్డు స్థాయిలో జరిగాయి. 21.42 కోట్ల లావాదేవీల ద్వారా రూ. 3,356 కోట్లు వసూలయ్యాయి. శనివారం ఒక్క రోజే ఏకంగా రూ. 122.81 కోట్లు ఫాస్టాగ్ టోల్ వసూళ్లు నమోదయ్యాయి. ఇది ఆల్–టైం గరిష్టం కావడం గమనార్హం.
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో అభివృద్ధి అంతా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో జరుగుతోంది. దీంతో రోడ్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత టోల్‌గేట్లు వస్తున్నాయి. సగటున ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక టోల్‌గేట్ ఉంటోంది. దీంతో జాతీయ రహదారి ఎక్కితే చాలు టోల్ వలిచేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం సైతం ఫాస్టాగ్ పేరుతో ఆటోమేటిక్ టోల్ సిస్టమ్‌ని నిర్బంధగా అమలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment