టోల్ గేట్స్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్‌ట్యాగ్ ప్రవేశపెట్టింది. ఈ ఫాస్ట్‌ట్యాగ్ విధానం అమలులోకి వచ్చిన తరువాత టోల్ గేట్స్ వద్ద వేచి ఉండాల్సిన సమయం బాగా తగ్గింది. అయితే కొంతమంది వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్‌ను విండ్ స్క్రీన్ మీద కాకుండా.. ఇతర ప్రదేశాల్లో అంటించి టోల్ ప్లాజాల వద్ద అనవసర ఆలస్యాలకు కారణమవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్‌హెచ్‌ఏఐ కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది.
ఎన్‌హెచ్‌ఏఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. వెహికల్ విండ్‌స్క్రీన్ మీద కాకుండా ఫాస్ట్‌ట్యాగ్‌ను ఇతర ప్రదేశాలలో అంటిస్తే అలాంటి వారి నుంచి డబుల్ టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు సమాచారం. కాబట్టి తప్పకుండా వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్‌ను విండ్‌స్క్రీన్‌పై అంటించాలి.
కొందరు వాహనదారులు విండ్‌స్క్రీన్ మీద ఫాస్ట్‌ట్యాగ్‌ను అంటించకపోవడం వల్ల టోల్ ప్లాజాలో అనవసరమైన ఆలస్యానికి కారణమవుతున్నారు. కాబట్టి ఇకపై అలా చేసేవారు రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని వాహన వినియోగదారులు తప్పకుండా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
విండ్‌స్క్రీన్ మీద ఫాస్ట్‌ట్యాగ్‌ను అంటిస్తే టోల్ ప్లాజాలో తొందరగా ట్రాన్సక్షన్ జరుగుతుంది. అప్పుడు గేట్ వేంగంగా ఓపెన్ అవుతుంది. అప్పుడు వెనుక వచ్చే వాహనదారులు కూడా వేగంగా ముందుకు వెళ్ళవచ్చు. అలా కాకూండా ఫాస్ట్‌ట్యాగ్ అడ్డదిడ్డంగా, ఎక్కడపడితే అక్కడ అంటిస్తే వారికి మాత్రమే కాకుండా.. వెనుక వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment