వాహనదారులకు ముఖ్య గమనిక, ఫాస్టాగ్‌లపై కీలక అప్‌డేట్‌! | Fastag Charges Compared In Different Banks - Sakshi
Sakshi News home page

వాహనదారులకు ముఖ్య గమనిక, ఫాస్టాగ్‌లపై కీలక అప్‌డేట్‌!

Published Mon, Feb 26 2024 1:10 PM | Last Updated on Mon, Feb 26 2024 1:51 PM

Fastag Charges Compared In Top Authorized Banks - Sakshi

టోల్‌గేట్ల వద్ద సమయం ఆదా చేయడంతో పాటు, వాహనాల రద్దీని తగ్గించేందుకు కేంద్రం ఎలక్ట్రానిక్‌ పద్దతిలో ఫాస్టాగ్ వ్యవస్థని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) నిర్వహిస్తోంది. 

ఫాస్టాగ్‌లోని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ఫాస్టాగ్‌కు అనుసంధానం చేసిన ప్రీ ప్రెయిడ్ లేదా సేవింగ్ ఖాతా నుంచి నేరుగా టోల్ చెల్లింపులకు అవకాశం కల్పిచ్చింది. ఈ ఫాస్టాగ్‌ చెల్లింపులు పేమెంట్స్‌ పేటీఎం బ్యాంక్‌ (పీపీబీఎల్‌) ద్వారా జరిగేవి. కానీ సెంట్రల్‌ బ్యాంక్‌ పేటీఎంపై ఆంక్షలు విధించడంతో ఇప్పుడు ఫాస్టాగ్‌ యూజర్లు.. టోల్‌ చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ తరుణంలో పీపీబీఎల్‌లో ఫాస్టాగ్‌లను ఫిబ్రవరి 29 లోపు వినియోగించుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ సూచించింది. ఆ తర్వాత నుంచి తాము నిర్ధేశించిన బ్యాంకుల్లో మాత్రమే ఫాస్టాగ్‌లను కొనుగోలు చేయాలని తెలిపింది. నిర్ధేశించిన గడువు తర్వాత పీపీబీఎల్‌ మినహా బ్యాంకులు అందించే ఫాస్టాగ్‌లను పొందాలని వెల్లడించింది. ఇప్పుడు ఆయా బ్యాంకుల్లో నిర్ధేశించిన మొత్తాన్ని చెల్లించి ఫాస్టాగ్‌లను పొందవచ్చు. 
 
ఫాస్టాగ్‌ ఛార్జీలు?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఫాస్టాగ్‌ యాక్టివేషన్ ఛార్జీలు నామమాత్రంగా ఉన్నాయి. అయితే, వినియోగదారులకు మూడు రకాల ఫాస్టాగ్‌ ఛార్జీలు ఉన్నాయని గుర్తించాల్సి ఉంటుంది. వాటిల్లో 

1.ఫాస్టాగ్‌ జాయినింగ్ ఫీజు - ఫాస్టాగ్‌ యూజర్‌గా పేరు నమోదు చేసుకొని, మీ వాహనానికి ఫాస్టాగ్‌ను వినియోగించేలా యాక్టీవేట్‌ చేసేందుకు ఫాస్టాగ్‌ జాయినింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు ఒక్కసారే ఉంటుంది.  

2.సెక్యూరిటీ డిపాజిట్ - ఫాస్టాగ్‌ అకౌంట్‌ మూసివేసే సమయంలో ఎలాంటి బకాయిలు లేకుండా పూర్తిగా వాపస్‌ చేసేందుకు అతితక్కువ మొత్తంలో సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. మీ వాహనాన్ని బట్టి ఆ మొత్తం మారుతూ ఉంటుంది. యూజర్ల ఫాస్టాగ్‌ ఖాతాలో తగినంత నిధులు లేకుంటే, ఏదైనా బకాయి ఉన్న టోల్ ఛార్జీలను సర్దుబాటు చేయడానికి సెక్యూరిటీ డిపాజిట్‌ని బ్యాంకులు ఉపయోగించుకోవచ్చు

3.ఫాస్టాగ్‌ యాక్టివేషన్‌ టైం : ఫాస్టాగ్‌ యాక్టివేషన్ అయిన వెంటనే ఏదైనా టోల్ ఛార్జీలు చెల్లించడానికి ఈ మొత్తం మీ ఫాస్టాగ్‌ ఖాతాలో ఉంటుంది. ఈ థ్రెషోల్డ్ మొత్తం వాహనం తరగతిపై ఆధారపడి ఉంటుంది.

ఫాస్టాగ్‌లు జారీ చేసే బ్యాంకులు, వినియోగదారులు ఫాస్టాగ్‌ కోసం ఎంత చెల్లించాలో తెలిపే వివరాలు ఇలా ఉన్నాయి.  

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
ప్రస్తుత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వాహనదారుల నుంచి ట్యాక్స్‌ కింద రూ.100, సెక్యూరిటీ కింద రూ.100 వసూలు చేస్తుంది. కారు, జీప్, వ్యాన్, టాటా ఏస్ ఇలాంటి మినీ-లైట్ కమర్షియల్ వాహనాలకు విధిస్తుంది. 

ఐసీఐసీఐ బ్యాంక్‌
ఐసీఐసీఐ బ్యాంక్‌ జాయినింగ్ ఫీజుగా బ్యాంక్ రూ. 99.12 (GSTతో సహా) వసూలు చేస్తుంది. సెక్యూరిటీ డిపాజిట్ రూ. 200, కారు, జీప్, వ్యాన్‌ థ్రెషోల్డ్ మొత్తం రూ. 200. ఈ మొత్తం చెల్లిస్తేనే మీ ఫాస్టాగ్‌ పనిచేస్తుంది. లేదంటే ఎలాంటి ఉపయోగం ఉండదు

ఎస్‌బీఐ బ్యాంక్‌ 
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్లు, జీప్‌లు, వ్యాన్‌లు, టాటా ఏస్‌, ఇతర కాంపాక్ట్ లైట్ కమర్షియల్ వాహనాలకు ఫాస్టాగ్‌ ఫీజులు లేదా సెక్యూరిటీ డిపాజిట్‌లకు ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయదు. కాకపోతే ఫాస్టాగ్‌ యాక్టివేషన్ కోసం కనీస బ్యాలెన్స్ రూ. 200 అవసరమని గుర్తించాలి.  

యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంక్ ఫాస్టాగ్‌ జారీ చేసినందుకు కస్టమర్‌ నుంచి ఎలాంటి రుసుమును వసూలు చేయదు. అయితే, తిరిగి రెన్యువల్‌ చేసే సమయంలో బ్యాంక్ రూ.100 (అన్ని ట్యాక్స్‌లు కలిపి) వసూలు చేస్తుంది. కారు, జీపు, వ్యాన్ వంటి వాహనాలకు బ్యాంకు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.200 వసూలు చేస్తుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా
బరోడా ఫాస్టాగ్‌ వన్‌ టైమ్‌ ఫీ కింద జీఎస్టీతో కలిపి రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ వాహనం రకాన్ని బట్టి మారుతుంది. థ్రెషోల్డ్ పరిమితి రూ. 200తో పాటు కారు, జీప్,  వ్యాన్‌లకు రూ. 200 సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేస్తుంది. 

కెనరా బ్యాంక్
కెనరా బ్యాంక్ రెన్యువల్‌ సమయంలో రీ-ఇష్యూషన్ ఫీజు కింద రూ.100 వసూలు చేస్తుంది. టాగ్‌ని ఆన్‌లైన్‌లో రీ-లోడ్ చేయడానికి కన్వీనియన్స్ ఫీజు రూ.10 అవుతుంది. కారు, జీప్, వ్యాన్ వంటి వాహనాలకు సెక్యూరిటీ డిపాజిట్ రూ.200, థ్రెషోల్డ్ మొత్తం రూ. 100 ఉంది. 

ఐడీబీఐ
ఐడీబీఐ బ్యాంక్‌ పన్నులతో సహా రూ. 100 రీ-ఇష్యూషన్ ఫీజును వసూలు చేస్తుంది. బ్యాంక్ ట్యాగ్ డిపాజిట్ రూ. 200 వసూలు చేస్తుంది. 

కొటక్‌ మహీంద్రా 
వీసీ4 కోసం బ్యాంక్ రూ. 100 వసూలు చేస్తుంది. ఇతర వెహికల్ క్లాస్‌కు ఫాస్టాగ్‌ జాయినింగ్ ఫీజుగా, డిపాజిట్‌గా రూ. 200 కట్టాల్సి ఉంటుంది. 


  
ఇండస్‌ఇండ్ బ్యాంక్
ఇండస్‌ఇండ్ బ్యాంక్ సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ. 200, కస్టమర్ వాలెట్‌లో లోడ్ చేసే థ్రెషోల్డ్ మొత్తంగా రూ. 200 వసూలు చేస్తుంది. బ్యాంక్ వన్ టైమ్ ట్యాగ్ జాయినింగ్ ఫీజుగా రూ. 100 , రీఇష్యూన్స్ ఫీజు కోసం రూ. 100 వసూలు చేస్తుంది.

పీఎన్‌బీ
కారు, జీప్ , వ్యాన్ వంటి వాహనాలకు రూ. 200 సెక్యూరిటీ డిపాజిట్ ఛార్జ్ చేయబడుతుంది . థ్రెషోల్డ్ మొత్తం రూ. 100

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్
ఫాస్టాగ్‌కి ఒక్కసారి రుసుము రూ. GSTతో కలిపి 100. ట్యాగ్ జాయినింగ్ ఫీజు (వన్-టైమ్ ఫీజు) రూ. 99.99 (అన్ని వర్తించే పన్నులతో సహా),  వన్-టైమ్ ట్యాగ్ రీ-ఇష్యూషన్ ఫీజు రూ. 99.99 (అన్ని వర్తించే పన్నులతో సహా). రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ వాహనం రకాన్ని బట్టి ఉంటుంది. కారు / జీప్ / వ్యాన్ కోసం వన్-టైమ్ సెక్యూరిటీ డిపాజిట్ (రిజర్వ్ చేయబడిన మొత్తం) మొత్తం రూ. 150.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement