
టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్
జమ్‌షేడ్‌పూర్: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ స్టీల్‌కు డిమాండ్ పెరుగుతూనే ఉంటుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. వ్యయ నిర్వహణ, సామర్థ్యాలతో దీన్ని ఎదుర్కోవాలన్నారు. టాటా స్టీల్ వ్యవస్థాపకుడు జేఎన్ టాటా 186వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టెక్నాలజీని అందుపుచ్చుకునే విషయంలో ఉద్యోగులు, కార్మిక సంఘాలతోపాటు ప్రభుత్వం, విధానాల రూపంలో కంపెనీకి సాయం అవసరమన్నారు.
‘‘విస్తరణ విషయంలో సాహసోపేతంగా వ్యవహరించాలి. సామర్థ్యాలు, వ్యయ నియంత్రణలు కొనసాగించాలి. ఉత్పాదకతను పెంచుకోవాలి. అదే సమయంలో పెట్టుబడులు కొనసాగించాలి’’అని టాటా స్టీల్ విషయంలో కర్తవ్యబోధ చేశారు. టారిఫ్‌లపై కొనసాగుతున్న చర్చను ప్రస్తావించగా.. సుంకాల గురించి మాట్లాడుకోవడంలో అర్థం లేదంటూ, ఉత్పాదకతపై దృష్టి పెట్టాలని సూచించారు.
టారిఫ్‌లు అన్నవి ప్రభుత్వం విధించే సుంకాలని, విదేశీ వస్తువులు దేశంలోకి దిగుమతి చేసుకునేందుకు కంపెనీలు వీటిని చెల్లిస్తాయన్నారు. సెమీకండక్టర్ చిప్‌ల విషయంలో భారత్ స్వావలంబన సాధించాల్సి ఉందన్న అభిప్రాయాన్ని చంద్రశేఖర్ వ్యక్తం చేశారు. ఎల్రక్టానిక్స్, హెల్త్‌కేర్, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలు చిప్‌లపై ఆధారపడి ఉన్నట్టు చెప్పారు. ఇందుకోసమే అసోం, గుజరాత్‌లో టాటాగ్రూప్ సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టు గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment