steel demand
-
ఐపీవో బాటలో మరో కంపెనీ
స్టీల్ తయారీలో సమీకృత కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏవన్ స్టీల్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల(Cpaital Market) నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. వాటిలోని వివరాల ప్రకారం ఐపీవో(IPO) కింద రూ.600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. మరో రూ.50 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు సందీప్ కుమార్, సునీల్ జలాన్, క్రిషన్ కుమార్ జలన్ ఆఫర్ చేయనున్నారు. తద్వారా మొత్తం రూ.650 కోట్లు అందుకునే యోచనలో కంపెనీ ఉంది.ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 85.56 శాతంగా నమోదైంది. ఈక్విటీ జారీ నిధులను కంపెనీ అనుబంధ సంస్థ వినయ స్టీల్స్‌లో పెట్టుబడులకు వినియోగించనుంది. సంస్థ విస్తరణకు వీలైన మెషీనరీ కొనుగోలు, సొంత అవసరాల కోసం సోలార్ ఎనర్జీ(Solar Energy)ని సమకూర్చుకోవడం తదితరాలు చేపట్టనుంది. దాంతోపాటు మరికొన్ని నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది.ఇదీ చదవండి: 1,673 కోట్ల యూపీఐ లావాదేవీలుఆంధ్రప్రదేశ్లోనూ..బెంగళూరు కంపెనీ ఏవన్ స్టీల్స్ ఇండియా విభిన్న ప్రొడక్టుల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ముడిస్టీల్ సామర్థ్యంరీత్యా దక్షిణాదిలోని టాప్–5 కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని యూనిట్‌తోపాటు కర్ణాటకలో మరో 5 ప్లాంట్లను నిర్వహిస్తోంది. ప్రధానంగా స్టీల్ తయారీలో వినియోగించే లాంగ్, ఫ్లాట్ స్టీల్ ప్రొడక్టులుసహా ఇండ్రస్టియల్ ప్రొడక్టులను తయారు చేస్తోంది. 2024 జూన్30కల్లా వార్షికంగా 14.97 లక్షల మెట్రిక్ టన్నుల ఫినిష్డ్ ప్రొడక్టుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎంఎస్పీ స్టీల్ అండ్ పవర్, బాలాజీ ఇండస్ట్రీస్, శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీతో పోటీ పడుతోంది. -
ఉక్కు ఉత్పత్తుల దిగుమతి సుంకం పెంపు
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్టీల్ ఉత్పత్తులపై సుంకాలు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చైనా, వియత్నాం నుంచి దిగుమతి చేసుకునే కొన్ని ఉక్కు ఉత్పత్తులపై 12-30% మధ్య సుంకం విధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న చైనా, వియత్నాం ఎగుమతి చేసే వెల్డెడ్ స్టెయిన్లెస్ స్టీల్ పైపులు, ట్యూబ్‌లకు ఈ సుంకం వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. వచ్చే ఐదేళ్లపాటు ఈ పన్ను నిబంధన అమలులో ఉంటుందని పేర్కొంది. దేశీయ స్టీల్ కంపెనీల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దిగుమతి సుంకం అధికంగా ఉంటే ఖర్చులు పెరిగి విదేశాల నుంచి కొనుగోలు చేసే ఉక్కును తగ్గిస్తారని ప్రభుత్వ ఉద్దేశమని తెలిపాయి.ఇదీ చదవండి: దేశంలో భద్రత గుర్తింపు పొందిన తొలి కంపెనీఇండియా ప్రపంచంలోనే స్టీల్ ఉత్పత్తిలో రెండో స్థానంలో నిలిచింది. 2023 ఆర్థిక సంవత్సరంలో 12.5 కోట్ల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసింది. 2024లో అది 14.4 కోట్ల టన్నులకు చేరుతుందని అంచనా. 2029 నాటికి దీని ఉత్పత్తి 20.9 కోట్ల టన్నులు అవుతుందని మార్కెట్ భావిస్తుంది. వచ్చే ఐదేళ్లలో ఈ పరిశ్రమ ఏటా 9.18 శాతం మేర వృద్ధి నమోదు చేస్తుందని అంచనా. -
ఇకపై వాటి దిగుమతులకు ఆమోదం తప్పనిసరి
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అనుమతి లేని దిగుమతులకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆమోదం తప్పనిసరి చేసింది. నాసిరకం వస్తువులు మార్కెట్లోకి వెళ్లకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుత విధానం ప్రకారం..అన్ని ప్రమాణాలకు లోబడి ఉన్న సరైన అర్హత కలిగిన విదేశీ ఉక్కు పరిశ్రమల ఉత్పత్తులకు బీఐఎస్ సర్టిఫికేషన్ జారీ చేస్తుంది. బీఐఎస్, ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించిన సరుకును మార్కెట్లో విక్రయించేందుకు అనుమతిస్తారు. కానీ కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెక్నికల్ కమిటీ సదరు ప్రమాణాల ప్రకారం ధ్రువీకరించి దిగుమతి చేసే వీలుంది. దేశవ్యాప్తంగా ఏప్రిల్-ఆగస్టు మధ్య 7.68 మిలియన్ టన్నుల ఐరన్, స్టీల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నారు. ఇది గతేడాదితో పోలిస్తే 4.82 మిలియన్ టన్నులు నుంచి 59.45శాతం పెరిగింది. వియత్నాం, జపాన్, చైనా నుంచి భారీ పరిమాణంలో ఎగుమతి చేసుకుంటున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. దాంతో ధరలు ప్రభావితం అవుతున్నట్లు తెలుస్తుంది. -
స్టీల్ డిమాండ్ వృద్ధి అంచనా 5.4 శాతం
న్యూఢిల్లీ: భారత్‌లో స్టీల్ డిమాండ్ పుంజుకోనుంది. ఇది ఈ ఏడాది 5.4 శాతం వృద్ధితో 83.8 మిలియన్ టన్నులకు (ఎంటీ) పెరగొచ్చని వరల్డ్ స్టీల్ అసోసియేషన్(డబ్ల్యూఎస్‌ఏ) అంచనా వేసింది. 2017లోనూ డిమాండ్ ఇదే వృద్ధితో 88.3 ఎంటీలకు చేరుతుందని అభిప్రాయపడింది. తక్కువ ముడి చమురు ధరలు సహా ఇన్ఫ్రా వృద్ధికి, దేశీ త యారీ సామర్థ్యం పెంపునకు ప్రభుత్వం తీసుకుంటున్న పలు సంస్కరణలు డిమాండ్ పెరుగుదలకు దోహదపడతాయని వివరించింది. కాగా అంతర్జాతీయంగా స్టీల్ డిమాండ్ ఈ ఏడాది 0.8% క్షీణతతో 1,488 ఎంటీలకు తగ్గొచ్చని అంచనా వేసింది. ఇక 2017లో ఈ డిమాండ్ మళ్లీ పుంజుకొని 0.4% వృద్ధితో 1,494 ఎంటీలకు పెరగొచ్చని తెలిపింది.