విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్టీల్ ఉత్పత్తులపై సుంకాలు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చైనా, వియత్నాం నుంచి దిగుమతి చేసుకునే కొన్ని ఉక్కు ఉత్పత్తులపై 12-30% మధ్య సుంకం విధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న చైనా, వియత్నాం ఎగుమతి చేసే వెల్డెడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ పైపులు, ట్యూబ్‌లకు ఈ సుంకం వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. వచ్చే ఐదేళ్లపాటు ఈ పన్ను నిబంధన అమలులో ఉంటుందని పేర్కొంది. దేశీయ స్టీల్ కంపెనీల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దిగుమతి సుంకం అధికంగా ఉంటే ఖర్చులు పెరిగి విదేశాల నుంచి కొనుగోలు చేసే ఉక్కును తగ్గిస్తారని ప్రభుత్వ ఉద్దేశమని తెలిపాయి.
ఇదీ చదవండి: దేశంలో భద్రత గుర్తింపు పొందిన తొలి కంపెనీ
ఇండియా ప్రపంచంలోనే స్టీల్ ఉత్పత్తిలో రెండో స్థానంలో నిలిచింది. 2023 ఆర్థిక సంవత్సరంలో 12.5 కోట్ల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసింది. 2024లో అది 14.4 కోట్ల టన్నులకు చేరుతుందని అంచనా. 2029 నాటికి దీని ఉత్పత్తి 20.9 కోట్ల టన్నులు అవుతుందని మార్కెట్ భావిస్తుంది. వచ్చే ఐదేళ్లలో ఈ పరిశ్రమ ఏటా 9.18 శాతం మేర వృద్ధి నమోదు చేస్తుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment