న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే స్టీల్ ఉత్పత్తులపై సుంకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఒక నివేదికను స్టీల్ మంత్రిత్వ శాఖ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఒక నివేదికను అందించినట్టు సమాచారం. దీంతో కేంద్ర వాణిజ్య, ఉక్కు పరిశ్రమల మంత్రిత్వ శాఖలు కనీస దిగుమతి ధరలు(మినిమం ఇంపోర్ట్ ప్రైసెస్) పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే సుంకం వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ వార్తలతో స్టాక్ మార్కెట్ లో స్టీల్ రంగం షేర్లు మెరుపులు మెరిపిస్తున్నాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతున్న బుధవారం నాటి మార్కెట్ లో టాటా స్టీల్, హిందాల్కో, తదితర మెటల్ రంగ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అటు చైనా మార్కెట్ల పతనం మన దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది.
కాగా ప్రపంచ ఉక్కు సంఘం (డబ్ల్యుఎస్ఎ) నివేదికల ప్రకారం, చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలతో పోలిస్తే 2015 లో భారతదేశంలో స్టీల్ ఉత్ప త్తిలో గణనీయమైన వృద్ధి సాధించింది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా, రష్యా తదితర దేశాల నుంచి దిగుమతి అవుతున్న తక్కువ శ్రేణి ఉత్పత్తులను నిరోధించి దేశంలో స్టీల్ పరిశ్రమ విస్తరణకు ఉపకరించేందుకు కేంద్రం ఈ చర్యలకు ఉపక్రమిస్తున్న తెలుస్తోంది. చౌకైన చైనీస్ దిగుమతుల డంపింగ్ కారణంగా ఉక్కు పరిశ్రమ ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల పరిష్కరించేందుకు చర్యలు తీసుకునేందుకు, ఉక్కు మంత్రిత్వ శాఖతో సంప్రదిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
స్టీల్ దిగుమతులపై సుంకం పెంపు? షేర్లు జూమ్..
Published Wed, Apr 20 2016 11:27 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM
Advertisement