steel
-
ట్రంప్ నిర్ణయం.. ఈ దేశాలపై ప్రభావం!
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. అనేక కీలక ప్రకటనలు చేశారు. ఇప్పుడు తాజాగా దిగుమతి వస్తువులపై.. దిగుమతి సుంకాలను 25 శాతం పెంచనున్నట్లు సమాచారం. అమెరికాలోకి ప్రవేశించే ఉక్కు, అల్యూమినియంపై ట్యాక్స్ పెంపు జరిగితే.. కెనడా, బ్రెజిల్, మెక్సికో, సౌత్ కొరియా, జపాన్ వంటి దేశాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.ఆదివారం న్యూ ఓర్లీన్స్‌లోని ఎయిర్ ఫోర్స్ వన్‌లో మీడియా ముందు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపుకు సంబంధించిన ప్రకటన చేశారు. ఇది ఇంకా అమల్లోకి రాలేదు.. బహుశా ఒకటి లేదా రెండు రోజుల్లో అమలయ్యే అవకాశం ఉంది. ట్రంప్ విధించనున్న పన్ను ఏ దేశాలను లక్ష్యంగా చేసుకుని విధిస్తున్నారు?.. ఏ దేశాలకు మినహాయింపులు ఉంటాయనే విషయం వెల్లడించలేదు.ట్రంప్ చేసిన ప్రకటన అన్ని దేశాలకు వర్తిస్తే.. ఇండియాపై కూడా ప్రభావం ఉంటుంది. అమెరికాకు ఇనుము & ఉక్కు వస్తువులను ఎగుమతి చేసే అతిపెద్ద దేశాలలో భారతదేశం ఒకటి కాకపోయినా.. సంవత్సరానికి కేవలం మూడు బిలియన్ల డాలర్ల విలువైన ఎగుమతులు మాత్రమే. అయినప్పటికీ కొంత ప్రభావం ఉంటుందని స్పష్టమవుతోంది.అమెరికా విధానాలను సహరించని.. దేశాల దిగుమతులపై సుంకాలను పెంచనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. చెప్పినట్లుగానే కొన్ని రోజులకు ముందు చైనా, కెనడా, మెక్సికో వంటి దేశాల దిగుమతులపై సుంకాలను పెంచేశారు. ఎన్నికల సమయంలో కూడా ట్రంప్ ట్యాక్స్ మీద పదేపదే వ్యాఖ్యానించారు. అమెరికా పరిశ్రమలను రక్షించడానికి, వాణిజ్య సమతుల్యతలను మెరుగుపరచడమే తన ఉద్దేశ్యమని, ఈ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెబుతున్నారు.డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అధిక సుంకాలు ప్రపంచంలోని చాలా దేశాలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఇతర ప్రధాన దేశాలు తప్పకుండా ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ దూకుడు ప్రపంచ వ్యాపార నాయకుల ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తోంది. అయితే రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలియాల్సి ఉంది. -
అన్నంత పనిచేసిన ట్రంప్.. ఒకేసారి
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) అన్నంత పని చేస్తున్నారు. ఒక్కో దేశంపై వరుస పెట్టి సుంకాల మోత మోగించేస్తున్నారు. తాజాగా, అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి తెరతీసేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతయ్యే స్టీల్, అల్యూమినియంపై 25శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు.ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘మంగళవారం లోపు పరస్పర సుంకాల (reciprocal tariffs) విధింపుపై ప్రకటన చేస్తాం. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది’ అని స్పష్టం చేశారు. అయితే, ఈ పరస్పర సుంకాల విధింపుల లక్ష్యం ఏంటో స్పష్టత ఇవ్వలేదు. తాను విధించబోయే పరస్పర సుంకాలు విదేశీ సుంకాలకు అనుగుణంగా ఉంటాయని చెప్పారు. ఇది అన్నీ దేశాలకు వర్తిస్తుందని అన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మా నుంచి వసూలు చేస్తే.. మేము వారి నుంచి వసూలు చేస్తాం’ అని వ్యాఖ్యానించారు.తొలిసారి ఎంత విధించారంటే?తొలిసారి 2016-2020వరకు అమెరికా అధ్యక్షుడిగా విధులు నిర్వహించిన ట్రంప్ స్టీల్‌పై 25శాతం, 10శాతం అల్యూమినియంపై టారిఫ్ విధించారు. అదే సమయంలో కెనడా, మెక్సికో, బ్రెజిల్‌తో సహా వ్యాపార భాగస్వాములకు పన్ను రహిత(డ్యూటీ ఫ్రీ) లావాదేవీలు జరిగేలా చూశారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ డ్యూటీ ఫ్రీ వ్యాపార కార్యకలాపాల్ని బ్రిటన్, జపాన్, యూరోపియన్ యూనియన్లకు విస్తరించారు. కెనడా,మెక్సికోకు దెబ్బఅమెరికా అధికారిక గణాంకాల ప్రకారం.. ట్రంప్ విధించబోయే 25శాతం సుంకం ప్రభావం కెనడా, బ్రెజిల్, మెక్సికో వాణిజ్య రంగంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు సౌత్ కొరియా, వియాత్నంలు సైతం భారీ సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కెనడా నుంచి 79శాతం అల్యూమినియం అమెరికాకు ఎగుమతి అవుతుంది. 2024 మొదటి 11 నెలల్లో అమెరికాకు 79 శాతం ఎగుమతి చేసింది. కెనడా తర్వాత అల్యూమినియం స్క్రాప్, అల్యూమినియం మిశ్రమం ప్రధాన సరఫరాదారుగా మెక్సికో కొనసాగుతుంది. ఈ తరుణంలో ట్రంప్ నిర్ణయాలు ఆయా దేశాల వాణిజ్య విభాగంలో ఆటు పోట్లు ఎదురు కానున్నాయి. -
ఐపీవో బాటలో మరో కంపెనీ
స్టీల్ తయారీలో సమీకృత కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏవన్ స్టీల్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల(Cpaital Market) నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. వాటిలోని వివరాల ప్రకారం ఐపీవో(IPO) కింద రూ.600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. మరో రూ.50 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు సందీప్ కుమార్, సునీల్ జలాన్, క్రిషన్ కుమార్ జలన్ ఆఫర్ చేయనున్నారు. తద్వారా మొత్తం రూ.650 కోట్లు అందుకునే యోచనలో కంపెనీ ఉంది.ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 85.56 శాతంగా నమోదైంది. ఈక్విటీ జారీ నిధులను కంపెనీ అనుబంధ సంస్థ వినయ స్టీల్స్‌లో పెట్టుబడులకు వినియోగించనుంది. సంస్థ విస్తరణకు వీలైన మెషీనరీ కొనుగోలు, సొంత అవసరాల కోసం సోలార్ ఎనర్జీ(Solar Energy)ని సమకూర్చుకోవడం తదితరాలు చేపట్టనుంది. దాంతోపాటు మరికొన్ని నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది.ఇదీ చదవండి: 1,673 కోట్ల యూపీఐ లావాదేవీలుఆంధ్రప్రదేశ్లోనూ..బెంగళూరు కంపెనీ ఏవన్ స్టీల్స్ ఇండియా విభిన్న ప్రొడక్టుల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ముడిస్టీల్ సామర్థ్యంరీత్యా దక్షిణాదిలోని టాప్–5 కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని యూనిట్‌తోపాటు కర్ణాటకలో మరో 5 ప్లాంట్లను నిర్వహిస్తోంది. ప్రధానంగా స్టీల్ తయారీలో వినియోగించే లాంగ్, ఫ్లాట్ స్టీల్ ప్రొడక్టులుసహా ఇండ్రస్టియల్ ప్రొడక్టులను తయారు చేస్తోంది. 2024 జూన్30కల్లా వార్షికంగా 14.97 లక్షల మెట్రిక్ టన్నుల ఫినిష్డ్ ప్రొడక్టుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎంఎస్పీ స్టీల్ అండ్ పవర్, బాలాజీ ఇండస్ట్రీస్, శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీతో పోటీ పడుతోంది. -
‘ఉక్కు’ మహిళలు!
ప్రముఖ స్టీల్ తయారీ కంపెనీ టాటా స్టీల్ మైనింగ్ కార్యకాలాపాలను పూర్తిగా మహిళలతోనే నిర్వహించి రికార్డు నెలకొల్పింది. పురుషులకు ధీటుగా మైనింగ్ పనుల్లో పూర్తి మహిళలతో స్టీల్‌ను ఉత్పత్తి చేస్తుంది. దేశంలో మొట్టమొదటిసారి ఇలా మహిళలతో మైనింగ్ పనులు చేయిస్తున్న కంపెనీగా టాటా గుర్తింపు పొందింది.ఇదీ చదవండి: విద్యార్థులకు ఎయిరిండియా టికెట్ ధరలో ఆఫర్జార్ఖండ్ లోని పశ్చిమ సింగ్ భూమ్ జిల్లాలోని నోముండి ఇనుప గనిలో టాటా స్టీల్ మహిళాషిఫ్ట్ను ప్రారంభించింది. భారీ మెషినరీ, పారలు, లోడర్లు, డ్రిల్స్, డోజర్లు, షిఫ్ట్ పర్యవేక్షణతో సహా అన్ని మైనింగ్ కార్యకలాపాలను మహిళా ఉద్యోగులతోనే నిర్వహిస్తోంది. మహిళలు దేనిలో తక్కువకాదని చెప్పడంతోపాటు వారు సమాజంలో మరింత ధీమాగా ఉండేలా కంపెనీ చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడంలో స్థానికులను భాగస్వామ్యం చేసేందుకు ప్రత్యేకంగా ‘తేజస్విని’ పేరుతో నియామకాలు, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
సుప్రీం కోర్టు ఆమోదంతో రూ.4,025 కోట్ల ఆస్తులు అప్పగింత
సుప్రీం కోర్టు ఆమోదం మేరకు భూషణ్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌కు చెందిన రూ.4,025 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు అందజేసింది. దీనికి సంబంధించి ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ తాజాగా వివరాలు వెల్లడించింది. ఎన్సీఎల్టీ ఆమోదం మేరకే జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలో మేజర్ వాటాలు కొనుగోలు చేసినట్లు గుర్తించడంతో ఆస్తులు అందజేస్తున్నట్లు పేర్కొంది.బ్యాంకు రుణ చెల్లింపుల్లో మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై 2019లో భూషణ్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌పై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆస్తులను జప్తు చేసింది. అంతకుముందు నెలలో ఆ రుణాలు చెల్లించలేక కంపెనీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించింది. ఆ సమయంలో భూషణ్ పవర్ అండ్ స్టీల్ సమస్యకు సంబంధించి జేఎస్‌డబ్ల్యూ స్టీల్ పరిష్కార ప్రణాళికను ఎన్సీఎల్టీ ఆమోదించింది. తర్వాత ఈడీ ఆస్తులను జప్తు చేసింది. ఎన్సీఎల్టీ ఆమోదంతోనే కంపెనీలో వాటాను చేజిక్కించుకునేందుకు బిడ్ వేసినట్లు సుప్రీం కోర్టులో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ స్పష్టం చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది.ఇదీ చదవండి: రైలు నుంచి కింద పడిన వస్తువులను ఈజీగా పొందండిలా..జేఎస్‌డబ్ల్యు స్టీల్‌ను 1982లో సజ్జన్ జిందాల్ స్థాపించారు. జిందాల్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (జిస్కో), జిందాల్ విజయనగర్ స్టీల్ లిమిటెడ్ (జేవీఎస్ఎల్) కలిసి జిందాల్ స్టీల్‌గా ఏర్పడ్డాయి. ఈ కంపెనీ యూఎస్‌లో ఏటా 35.7 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని అతిపెద్ద తయారీ యూనిట్ కర్ణాటకలోని విజయనగరలో ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద సింగిల్ లొకేషన్ ఉక్కు ఉత్పత్తి కేంద్రం. -
ఉక్కు ఉత్పత్తుల దిగుమతి సుంకం పెంపు
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్టీల్ ఉత్పత్తులపై సుంకాలు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చైనా, వియత్నాం నుంచి దిగుమతి చేసుకునే కొన్ని ఉక్కు ఉత్పత్తులపై 12-30% మధ్య సుంకం విధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న చైనా, వియత్నాం ఎగుమతి చేసే వెల్డెడ్ స్టెయిన్లెస్ స్టీల్ పైపులు, ట్యూబ్‌లకు ఈ సుంకం వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. వచ్చే ఐదేళ్లపాటు ఈ పన్ను నిబంధన అమలులో ఉంటుందని పేర్కొంది. దేశీయ స్టీల్ కంపెనీల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దిగుమతి సుంకం అధికంగా ఉంటే ఖర్చులు పెరిగి విదేశాల నుంచి కొనుగోలు చేసే ఉక్కును తగ్గిస్తారని ప్రభుత్వ ఉద్దేశమని తెలిపాయి.ఇదీ చదవండి: దేశంలో భద్రత గుర్తింపు పొందిన తొలి కంపెనీఇండియా ప్రపంచంలోనే స్టీల్ ఉత్పత్తిలో రెండో స్థానంలో నిలిచింది. 2023 ఆర్థిక సంవత్సరంలో 12.5 కోట్ల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసింది. 2024లో అది 14.4 కోట్ల టన్నులకు చేరుతుందని అంచనా. 2029 నాటికి దీని ఉత్పత్తి 20.9 కోట్ల టన్నులు అవుతుందని మార్కెట్ భావిస్తుంది. వచ్చే ఐదేళ్లలో ఈ పరిశ్రమ ఏటా 9.18 శాతం మేర వృద్ధి నమోదు చేస్తుందని అంచనా. -
దేశీ స్టీల్ పరిశ్రమకు చైనా ముప్పు!
న్యూఢిల్లీ: చైనాలో డిమాండ్ పడిపోవడంతో ఆ దేశం నుంచి ఉక్కు దిగుమతులు దేశాన్ని ముంచెత్తుతున్నాయంటూ కేంద్ర ఉక్కు శాఖ మాజీ కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా తెలిపారు. ‘‘ఫ్లాట్ స్టీల్ ఉత్పత్తుల పరంగా చూస్తే దిగుమతులు పెద్ద సమస్యగా ఉంది. చైనాలో వినియోగం పడిపోవడం మన మార్కెట్‌ను కుదిపేస్తోంది’’అని సిన్హా పేర్కొన్నారు.‘ఇండియన్ ఐరన్ ఓర్, పెల్లెట్’ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పెరిగిపోతున్న దిగుమతులతో స్థానిక ఉక్కు ఉత్పత్తుల ధరలపై, స్టీల్ తయారీ సంస్థల లాభాలపై ప్రభావం పడుతుందన్నారు. ‘‘చైనా నుంచి అనుచితంగా దిగుమతులు వచ్చి పడుతున్నాయి. దీని పట్ల భారత ప్రభుత్వం సకాలంలో స్పందించాలి’’ అని అన్నారు. చైనా తదితర దేశాల నుంచి ముంచెత్తుతున్న చౌక స్టీల్ దిగుమతులను అడ్డుకోవాలంటూ పరిశ్రమ ఇప్పటికే ఎన్నో పర్యాయాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం గమనార్హం.ప్రపంచ ఉక్కు ఎగుమతుల కేంద్రంగా భారత్ మారాలన్న లక్ష్యానికి విరుద్ధంగా.. మన దేశం నికర దిగుమతుల దేశంగా మారుతుండడం పట్ల పరిశ్రమ ఆందోళనను వ్యక్తం చేసింది. దిగుమతులపై సంకాల విధింపునకు ఏడాది, ఏడాదిన్నర సమయం తీసుకుంటే, అది దేశీ పరిశ్రమకు మేలు చేయబోదని సిన్హా అభిప్రాయపడ్డారు. -
టాటా స్టీల్.. 2,800 ఉద్యోగాలు కోత
టాటా స్టీల్ తన ఉద్యోగుల సంఖ్యలో కోత విధిస్తామన్న ప్రతిపాదనల్లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసింది. బ్రిటన్ తయారీ యూనిట్‌లోని ‘కార్బన్ ఇంటెన్సివ్ బ్లాస్ట్ ఫర్నేస్’ మూసివేత ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పింది. ఈమేరకు టాటా స్టీల్ గ్లోబల్ సీఈఓ టీవీ నరేంద్రన్ రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘బ్రిటన్‌లోని టాటా స్టీల్ తయారీ ప్లాంట్‌లో ఉద్యోగులు కోత ఉండబోతుందని గతంలోనే ప్రకటించాం. ఆ ప్రతిపాదనల్లో ఎలాంటి మార్పులేదు. ఇప్పటికే ఒక కార్బన్-ఇంటెన్సివ్ బ్లాస్ట్ ఫర్నేస్‌ను మూసివేస్తున్నట్లు చెప్పాం. ఆమేరకు చర్యలు ప్రారంభమయ్యాయి. స్టీల్ ముడిసరుకుగా ఉన్న ఐరన్‌ఓర్ ధరలు భారీగా పెరిగాయి. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడం లేదు. యూకే ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు అవసరమని ప్రతిపాదనలు పంపించాం. తయారీ యూనిట్‌లోని మరో బ్లాస్ట్ ఫర్నేస్‌ను సెప్టెంబర్‌లో మూసివేసేలా చర్చలు జరుగుతున్నాయి. రెండు ఫర్నేస్‌లు మూతపడడంతో సౌత్ వేల్స్‌లోని పోర్ట్ టాల్బోట్ యూనిట్లో 2,800 వరకు ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఉద్యోగులు తొలగింపు అంశం యూనియన్లు, కంపెనీ, ప్రభుత్వం సమష్టి బాధ్యత. కేవలం కంపెనీ నిర్ణయాలే వాటిని ప్రభావితం చేయవు’ అని చెప్పారు.ఇదీ చదవండి: జులైలో పెరిగిన జీఎస్టీ వసూళ్లుబ్రిటన్ వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్స్ జులైలో మాట్లాడుతూ..కొత్త ప్రభుత్వం టాటా స్టీల్ ప్రతినిధులతో చర్చించి ఉద్యోగులు కోతను నివారించేలా చర్యలు చేపడుతుందన్నారు. ప్లాంట్ నుంచి తక్కువ కార్బన్ విడుదలయ్యేలా అవసరమయ్యే సాంకేతిక సహాయం అందిస్తుందని చెప్పారు. ‘లోకార్బన్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్’ను నిర్మించడంలో సహాయం చేయడానికి గత ప్రభుత్వం టాటా స్టీల్‌తో చేసుకున్న 500 మిలియన్ పౌండ్ (రూ.5,318 కోట్లు) ఒప్పంద ప్యాకేజీపై కొత్త ప్రభుత్వం సంతకం చేయాల్సి ఉంది. -
Economic Survey 2023-24: ప్రతి ఊరికి కావాలి.. ఇలాంటి స్టీల్ బ్యాంక్
పెళ్లయినా శుభకార్యమైనా పార్టీ మీటింగ్ అయినా ప్రభుత్వ హెల్త్ క్యాంప్లైనా భోజనాల దగ్గర ప్లాస్టిక్ వాడకం ఉంటుంది. చెత్త పేరుకు పోతుంది. డబ్బు కూడా వృథా. అదే స్టీల్ గిన్నెలు ఉంటే? ఒకసారి కొంటే ప్రతిసారి ఉపయోగించుకోవచ్చు. ఈ ఆలోచనతో 2020లో తెలంగాణాలోని సిద్దిపేటలో ఏర్పడిన స్టీల్ బ్యాంక్ ‘ఎకానమిక్ సర్వే 2023–24 బుక్’లో తాజాగా చోటు సంపాదించుకుంది. ఇది మహిళా నిర్వహణకు వారి పర్యావరణ దృష్టికి దక్కిన విజయం.ఇది మహిళల విజయం. జాతీయంగా దక్కిన గుర్తింపు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో ఎకనామిక్ సర్వే రిపోర్ట్‌ను విడుదల చేస్తారు. సోమవారం విడుదల చేసిన రిపోర్ట్ 12వ చాప్టర్లో మౌలిక సదుపాయాలు, వృద్ధిలో భాగంగా సిద్దిపేట స్టీల్ బ్యాంక్ వలన జరిగిన ఉపయోగం గురించి వివరించారు. దీనితో స్టీల్ బ్యాంక్ నిర్వాకులైన మహిళలతో పాటు సిద్దిపేట ఎం.ఎల్.ఏ. హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.ప్లాస్టిక్ వద్దనుకుని2022లో సిద్దిపేట మున్సిపాలిటీలో ‘కంటి వెలుగు కార్యక్రమం’లో భాగంగా వైద్య సిబ్బందికి ఆయా గ్రామ పంచాయతీలు భోజన ఏర్పాట్లు చేశాయి. వైద్య సిబ్బంది భోజనం చేసేందుకు ప్లాస్టిక్‌ను వినియోగించాల్సి వచ్చింది. ఇది ఊళ్లో అనవసర చెత్తను పోగు చేస్తోంది. అదే సమయంలో పర్యావరణానికి హాని కూడా. ఈ పారేసిన ప్లాస్టిక్‌ని పశువులు తింటే ప్రమాదం. అందుకే డీపీఓ దేవకీదేవి ప్లాస్టిక్‌కు బదులు స్టీలు వాడాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో గ్రామ పంచాయతీ నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ సేకరించి స్టీల్ ప్లేట్లు, గ్లాస్లు, స్పూ¯Œ లు, వాటర్ బాటిల్లను కొనుగోలు చేశారు. ఇలా ఏ గ్రామానికి ఆ గ్రామం కొని జిల్లాలోని 499 గ్రామ పంచాయతీల్లో వినియోగించారు. దీంతో రోజుకు 6 కిలోల నుంచి 8 కిలోల ప్లాస్టిక్‌ను వినియోగించకుండా నిర్మూలించారు.సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 34 స్టీల్ బ్యాంక్‌లో ఉన్న పాత్రల వివరాలు భోజనం ప్లేట్లు 25,500, అల్పహార ప్లేట్లు 8,500, వాటర్ గ్లాస్లు 25,500, టీ గ్లాస్లు 8,500, చెంచాలు 25,500, చిన్న గిన్నెలు 25,500, స్టీల్ ట్రేలు 612, బకెట్లు 272, ఇతరములు 3వేలు వస్తువులున్నాయి.– గజవెల్లి షణ్ముఖ రాజు, సిద్దిపేట, సాక్షి– ఫొటోలు: కె. సతీష్ కుమార్సంతోషంగా ఉంది...ప్లాస్టిక్‌ను నిర్మూలించేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో స్టీల్ బ్యాంక్‌లను ఏర్పాటు చేయించాం. మనం పాటించి తర్వాత ప్రజలు పాటించాలన్న స్ఫూర్తితో బ్యాంక్‌ల ఏర్పాటు. కంటి వెలుగు కార్యక్రమంలో వైద్య సిబ్బందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాం. వీరికి స్టీల్ ప్లేట్, గ్లాస్లు, వాటర్ బాటిల్ల ద్వారానే అందించాం. మా కృషికి గుర్తింపు దొరకడం సంతోషంగా ఉంది– దేవకీదేవి, డీపీఓసంఘం మహిళలు‘మాది సిద్దిపేటలోని వెన్నెల సమైక్య మహిళా సంఘం. శ్రీసాయితేజ సమైక్య మహిళా సంఘంకు చెందిన గడ్డమీది నవ్య ఇద్దరం కలిసి గత నాలుగేళ్లుగా స్టీల్ బ్యాంక్‌ను కొనసాగిస్తున్నాం. మా ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 34 వార్డుల్లో స్టీల్ బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు. 29, ఫిబ్రవరి 2020న మా స్టీల్ బ్యాంక్ ప్రారంభించారు. మా వార్డు పరిధిలో వివాహాలు, ఇతర శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు జరిగితే ముందుగానే సామాగ్రి కోసం సమాచారం ఇస్తారు. వారు ఎంత మందితో కార్యక్రమం నిర్వహిస్తున్నారో చెబితే వారికి సరిపడా సామాగ్రిని అందజేస్తాం. వీటిని ప్రత్యేక సంచిలో వేసి ఇస్తాం. వారి కార్యక్రమం అయిపోయిన తర్వాత క్లీన్ చేసి తీసుకువస్తారు. ఏదైనా వస్తువులు మిస్ అయితే వాటికి డబ్బులు తీసుకుంటాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాస్లు, కప్‌లు ధర కంటే తక్కువ అద్దెకే కిరాయికి ఇస్తున్నాం. ప్లాస్టిక్ నిర్మూలిస్తున్నామనే సంతోషంతో పాటు మాకు ఆర్థికంగా సైతం దోహదపడుతుంది. మా కమిషనర్ ప్రసన్న రాణి, చైర్పర్సన్ కడవేర్గు మంజుల, కౌన్సిలర్ దీప్తిల సహకారంతో ముందుకు వెళ్తున్నాం. పెళ్లిళ్ల సీజన్ అయితే ఎక్కువ మంది తాకిడి ఉంటుంది. మా దగ్గర అన్ని కిరాయికి పోతే మా పక్క వార్డులో ఉంటే తీసుకుని వారికి అద్దెను చెల్లిస్తాం. ప్రజల నుంచి బాగా స్పందన వస్తోంది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి రేపటి తరాలకు మంచి పర్యావరణాన్ని బహుమతిగా ఇవ్వాలనే లక్ష్యంతో వీటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నాం.– బాలగోని దీప్తి, వెన్నెల సమైక్య మహిళా సంఘం. -
శ్రీటీఎంటీ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్‌గా బుమ్రా
ముంబై: శ్రీటీఎంటీ స్టీల్ ఉత్పత్తుల తయారీ సంస్థ దేవశ్రీ ఇస్పాత్ తాజాగా భారతీయ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. గత 50 ఏళ్లుగా ఉక్కు రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్నామని కంపెనీ ఎండీ ప్రకాశ్ గోయెంకా తెలిపారు. నాణ్యత, విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యమిచ్చే తమ బ్రాండ్‌కి బుమ్రా సముచిత ప్రచారకర్త కాగలరని ఆయన పేర్కొన్నారు. శ్రీటీఎంటీతో జట్టు కట్టడంపై బుమ్రా సంతోషం వ్యక్తం చేశారు. -
టాప్ 5 దేశాలను వెనక్కి నెట్టిన భారత్!
ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ఉత్పత్తి చేసే టాప్ 5 దేశాలతో పోలిస్తే భారత్‌లోనే వృద్ధి నమోదైనట్లు ప్రపంచ స్టీల్ అసోసియేషన్(డబ్ల్యూఎస్‌ఏ) నివేదిక వెల్లడించింది. స్టీల్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న చైనా ఏప్రిల్ నెలలో 85.9 మిలియన్ టన్నులతో 7 శాతం క్షీణించినట్లు డబ్ల్యూఎస్‌ఏ తెలిపింది.డబ్ల్యూఎస్‌ఏ రిపోర్ట్ ప్రకారం..ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు చైనా ఉక్కు ఉత్పత్తి 343.7 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది 2023తో పోలిస్తే 3% తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న భారత్ ఏప్రిల్‌లో 3.6% పెరుగుదలతో 12.1 మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య 49.5 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి 8.5% వృద్ధి సాధించింది. జపాన్, అమెరికా, రష్యాలు మొదటి త్రైమాసికంలో 2-6% క్షీణించాయి. జనవరి-ఏప్రిల్ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇండియా మినహా మిగతా నాలుగు అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి చేసే దేశాల్లో ప్రొడక్షన్ తగ్గింది.ఇదీ చదవండి: ఏఐతో మరింత అందంగా: రిలయన్స్ఇండియాలో స్టీల్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నప్పటికీ ప్రపంచ డిమాండ్ ఇంకా కోలుకోలేదని డేటా సూచిస్తుంది. క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ సెహుల్ భట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘అధిక వడ్డీ రేట్లు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉక్కు వినియోగిస్తున్న రంగాల్లో డిమాండ్ తగ్గింది. 2023లో ఐరన్‌ఓర్(ముడి ఉక్కు) ఉత్పత్తిలో ఎలాంటి మార్పులులేవు. ఈ ట్రెండ్ 2024లోనూ కొనసాగుతుందని అంచనా. ఈ ధోరణి భారతీయ ఉక్కు తయారీదారుల మార్చి త్రైమాసిక ఆదాయాలపై ప్రభావం చూపింది. దేశంలో అధిక ఐరన్‌ఓర్ దిగుమతి కారణంగా ధరలు ప్రభావితమయ్యాయి’ అని చెప్పారు. -
టాటా స్టీల్ సరికొత్త రికార్డ్‌లు
స్టీల్ ఉత్పత్తుల్లో టాటా స్టీల్ సరికొత్త రికార్డ్లను నమోదు చేస్తోంది. టాటా స్టీల్‌కు రిటైల్, ఆటోమోటివ్, రైల్వే విభాగాల నుండి భారీ ఆర్డర్లు రావడంతో ఉత్పత్తుల్ని పెంచేస్తుంది. ఫలితంగా ఆర్ధిక సంవత్సరం 2024లో మొత్తం స్టీల్ డెలివరీలలో 6 శాతం వృద్ధిని 19.90 మిలియన్ టన్నులని నివేదించింది. మునుపటి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 18.85 మిలియన్ టన్నుల (ఎంటీ) ఉక్కును ఉత్పత్తి చేసినట్లు టాటా స్టీల్ వెల్లడించింది. ఆటోమోటివ్, ప్రత్యేక ఉత్పత్తుల సెగ్మెంట్ డెలివరీలు ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 2.9 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసింది. ఫలితంగా ఆర్ధిక సంవత్సరం 2023 మునుపటి రికార్డును అధిగమించింది. బ్రాండెడ్ ఉత్పత్తులు, రిటైల్ సెగ్మెంట్ డెలివరీలు ఫైనాన్షియల్ ఇయర్ 2024లో డెలివరీలు 11 శాతం పెరిగి 6.5 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తులు & ప్రాజెక్టుల సెగ్మెంట్ డెలివరీలు 6 శాతం పెరిగి 7.7 మిలియన్ టన్నులకు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఈ ఏడాది ఈమే టాప్.. తర్వాతే అంబానీ, అదానీ.. కానీ..
సంపన్నుల జాబితా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు అంబానీ, అదానీ కదా.. అయితే వారి సంపాదన ఎక్కువగా ఉండడం వల్ల వారు సంపన్నుల జాబితాలో చోటుసంపాదిస్తుంటారు. ఈ ఏడాది అత్యధిక సంపద ఆర్జించిన జాబితాలో సావిత్రి జిందాల్(73) అగ్రస్థానంలో నిలిచినట్లు ‘బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్’ నివేదించింది. ఆమె మొత్తం సంపద రూ.2.1 లక్షల కోట్లు. అయితే ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె సంపద రూ.80 వేలకోట్లు పెరిగిందని నివేదిక వెల్లడించింది. దాంతో అంబానీ, అదానీ, బిర్లా.. వంటి ప్రముఖుల సంపదను సావిత్రి జిందాల్ మించిపోయారు. దాంతో ఈ ఏడాది అధికంగా సంపదించిన జాబితాలో ఆమె అందరి కంటే ముందు నిలిచారని నివేదిక తెలిపింది. అయితే మొత్తంగా మాత్రం రూ.7.7 లక్షల కోట్ల సంపదతో ముఖేష్ అంబానీ అత్యధిక సంపన్నుడిగానే కొనసాగుతున్నారు. ప్రపంచ కుబేరుల్లో 13వ స్థానంలో నిలిచారు. అయితే ఈ ఏడాది ఆయన సంపద రూ.43 వేలకోట్లు పెరిగినట్లు తెలిసింది. రూ.7 లక్షల కోట్ల సంపదతో దేశంలోని సంపన్నుల జాబితాలో గౌతమ్అదానీ రెండో స్థానంలో ఉన్నారు. జిందాల్ గ్రూప్‌ను స్థాపించిన ఓం ప్రకాశ్ జిందాల్ సతీమణే సావిత్రి జిందాల్. ఆయన మరణానంతరం ఓపీ జిందాల్ గ్రూప్ ఛైర్‌పర్సన్‌గా ఆమె వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూప్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ అండ్ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జిందాల్ స్టెయిన్లెస్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు కంపెనీల షేర్లు దేశీయ మార్కెట్లో లాభాల్లో దూసుకెళ్లడంతో సావిత్రి జిందాల్ సంపద భారీగా పెరిగింది. దేశీయ కుబేరుల జాబితాలో అయిదో స్థానంలో నిలిచినా.. దేశంలోని మహిళా సంపన్నుల జాబితాలో ఆమెదే అగ్రస్థానం. మొత్తం సంపద విషయంలో అజీమ్ ప్రేమ్‌జీ (రూ.2 లక్షల కోట్లు)ను సావిత్రి దాటేశారు. ఇదీ చదవండి: తగ్గిన ‘తీపి’ ఉత్పత్తి..! కారణాలు ఇవే.. ఈ ఏడాది ఎక్కువ సంపదను ఆర్జించిన వారి జాబితాలో హెచ్‌సీఎల్ టెక్ అధినేత శివ్‌నాడార్ రూ.66 వేలకోట్లతో రెండో స్థానంలో నిలిచారు. స్థిరాస్తి సంస్థ డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఛైర్మన్ కేపీ సింగ్ సంపద రూ.59వేలకోట్లు పెరగడంతో మూడో స్థానంలో ఉన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ బిర్లా, షాపూర్ మిస్త్రీ రూ.52 వేలకోట్ల చొప్పున సంపదను పెంచుకున్నారు. ముకేశ్ అంబానీ సంపద ఈ ఏడాది రూ.43 వేలకోట్లు పెరిగింది. సన్‌ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వి, రవి జైపురియా, ఎంపీ లోథా, సునీల్ మిత్తల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
ఇకపై వాటి దిగుమతులకు ఆమోదం తప్పనిసరి
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అనుమతి లేని దిగుమతులకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆమోదం తప్పనిసరి చేసింది. నాసిరకం వస్తువులు మార్కెట్లోకి వెళ్లకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుత విధానం ప్రకారం..అన్ని ప్రమాణాలకు లోబడి ఉన్న సరైన అర్హత కలిగిన విదేశీ ఉక్కు పరిశ్రమల ఉత్పత్తులకు బీఐఎస్ సర్టిఫికేషన్ జారీ చేస్తుంది. బీఐఎస్, ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించిన సరుకును మార్కెట్లో విక్రయించేందుకు అనుమతిస్తారు. కానీ కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెక్నికల్ కమిటీ సదరు ప్రమాణాల ప్రకారం ధ్రువీకరించి దిగుమతి చేసే వీలుంది. దేశవ్యాప్తంగా ఏప్రిల్-ఆగస్టు మధ్య 7.68 మిలియన్ టన్నుల ఐరన్, స్టీల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నారు. ఇది గతేడాదితో పోలిస్తే 4.82 మిలియన్ టన్నులు నుంచి 59.45శాతం పెరిగింది. వియత్నాం, జపాన్, చైనా నుంచి భారీ పరిమాణంలో ఎగుమతి చేసుకుంటున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. దాంతో ధరలు ప్రభావితం అవుతున్నట్లు తెలుస్తుంది. -
బుర్జ్ ఖలీఫాను మించి.. నిర్మాణ సామగ్రి ఉత్పత్తి గురించి ఆసక్తికర విషయాలు!
నిర్మాణ రంగం రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచంలో ఎన్నెన్నో అద్భుతమైన భవనాలు ఈ రోజుకీ పురుడుపోసుకుంటున్నాయి. ఇలాంటి భవనాలు లేదా నగరాల నిర్మాణానికి కావాల్సిన ప్రధానమైన ముడిపదార్ధాలు సిమెంట్, ఉక్కు (స్టీల్), ఇసుక. 2020లో ప్రపంచంలో ఈ ముడిపదార్ధాల ఉత్పత్తి ఎంత? ఏ దేశంలో ఎక్కువ ఉత్పత్తి ఉంది.. వంటి ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సిమెంట్ అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం, 2020లో అత్యధికంగా సిమెంట్ ఉత్పత్తి చేసిన దేశాల జాబితాలో చైనా (2200 మిలియన్ టన్నులు) అగ్ర స్థానంలో, రెండవ స్థానంలో భారత్ (340 మిలియన్ టన్నులు) నిలిచాయి. చివరి స్థానంలో సౌత్ కొరియా మొదలైన దేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం సిమెంట్ ఉత్పత్తి 2020లో 4.1 బిలియన్ టన్నులు. ప్రపంచలోని అన్ని దేశాలు ఉత్పత్తి చేసిన సిమెంటుతో ఒక దిమ్మె నిర్మిస్తే.. అది 1,195 మీటర్ల పొడవు, 1.7 బిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణం ఉంటుంది. బరువు ఏకంగా 4.1 బిలియన్ టన్నులు ఉంటుంది. ఈ దిమ్మె పొడవు బుర్జ్ ఖలీఫా కంటే 365 మీటర్లు ఎక్కువ ఉంటుందన్నమాట. సిమెంట్ తయారు చేసేటప్పుడు టన్నుల కొద్దీ కార్బన్ డయాక్సైడ్ (CO2) విడుదలవుతుంది, అధిక మొత్తంలో నీరు అవసరమవుతుంది. కాంక్రీట్ ఉత్పత్తిలో అధిక కార్బన్ ఉద్గారాలు, నీటి వినియోగాన్ని తగ్గించేందుకు, స్వీడిష్ పవర్ కంపెనీ వాటెన్ఫాల్ ఓ ప్రత్యేకమైన కాంక్రీట్ మిశ్రమాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా CO2 ఉద్గారాలు బాగా తగ్గుతాయి. ఉక్కు (స్టీల్) సిమెంట్ తరువాత నిర్మాణానికి కావాల్సిన ముఖ్యమైన లోహం ఉక్కు. 2020లో ప్రపంచంలోని అన్ని దేశాలు కలిపి మొత్తం 180 కోట్ల టన్నుల బరువైన ఉక్కుని ఉత్పత్తి చేశాయి. అంతకు ముందు 1900 నుంచి ఉక్కు పరిశ్రమ 2500 కోట్ల టన్నుల స్టీల్ స్క్రాప్‌ను రీసైకిల్ చేసింది. దీని వల్ల 3500 కోట్ల టన్నుల ఇనుము వినియోగం, 1800 కోట్ల టన్నుల బొగ్గు వినియోగం తగ్గింది. ప్రపంచ దేశాల్లో ఉత్పత్తి అయిన ఉక్కుతో ఓ దిమ్మె నిర్మిస్తే.. అది 610 మీటర్ల ఎత్తు, 227.8 మిలియన్స్ ఘనపు మీటర్ల పరిమాణం, 180 కోట్ల టన్నుల బరువుతో నిర్మితమవుతుంది. ఇదీ చదవండి: గంటకు 23 మంది.. ఏడాదికి వేలల్లో.. ఆందోళనలో టెకీలు! రంగాల వారీగా రికవరీ రేట్లు ఇసుక నిర్మాణ రంగంలో మరో ముఖ్యమైన మెటీరియల్ ఇసుక, కంకర (చిన్న రాళ్లు). 2020లో ఉత్పత్తి అయిన ఇసుక 26.5 కోట్ల టన్నులు. ఇంత ఇసుకతో ఏకంగా 555 మీటర్ల ఎత్తు, 171 మిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణంతో ఓ దిమ్మె నిర్మించవచ్చు. ప్రస్తుతం చాలా నగరాల్లో ఇసుక అవసరం లేకుండానే పెద్ద పెద్ద భవనాలను గాజు, ఇతర మెటీరియల్స్ ఉపయోగించి ఎంతో అందంగా నిర్మిస్తున్నారు. -
ప్రకృతి ప్రేమకు నిదర్శనం
నగర జీవనంలో ప్రతిదీ యూజ్ అండ్ త్రోగా మారుతోంది.‘ఈ కాంక్రీట్ వనంలో ప్రకృతి గురించి అర్థం చేసుకుంటున్నదెవరు’.అని ప్రశ్నిస్తారు. హైదరాబాద్ నల్లగండ్లలో ఉంటున్న నిదర్శన.అపార్ట్మెంట్ సంస్కృతిలో వ్యర్థాలను ఎలా వేరు చేయాలి,ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించాలనే విషయాల మీద నెలకు ఒకసారి నాలుగేళ్లుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తోంది. కార్పోరేట్ కంపెనీలో మార్కెటింగ్ కమ్యూనికేషన్స్‌లో మేనేజర్‌గా వర్క్ చేసిన నిదర్శన సస్టెయినబుల్ లివింగ్ పట్ల ఆసక్తి పెరిగి, పర్యావరణ హిత వస్తువుల వాడకాన్ని ప్రోత్సహిస్తూ,హస్తకళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పర్యావరణానికి మేలు చేసే పని ఏ కొంచెమైనా ఎంతో సంతృప్తినిస్తుందని చెబుతోంది. ‘‘ఈ రోజుల్లో మనం ఏ పని చేసినా అది ప్రకృతికి మేలు చేసేదై ఉండాలి. ఈ ఆలోచన నాకు నాలుగేళ్ల క్రితం కలిగింది. దీనికి కారణం మన దగ్గర చేస్తున్న పెళ్లిళ్లు, పార్టీలు. ఫంక్షన్లకు వెళ్లినప్పుడు అక్కడ యూజ్ అండ్ త్రో ఏరియా చూస్తే మనసు వికలమయ్యేది. దీంతో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, సస్టైనబుల్ లివింగ్ మార్గం పట్టాను. ఈవెంట్స్‌కి స్టీల్ గిన్నెల రెంట్ మాటీ పేరతో ఫౌండేషన్ ఏర్పాటు చేశాను. నాలాగే ఆలోచించే మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఫంక్షన్లకు స్టీల్ పాత్రలు నామమాత్రపు రెంట్‌తో ఇచ్చే బ్యాంక్ ఏర్పాటు చేశాను. ఆ తర్వాత ఇదే థీమ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాను. ఎవరింట్లో పెళ్లి, పండగ, పుట్టిన రోజులు జరిగినా మా దగ్గర నుంచి స్టీల్ పాత్రలు రెంట్‌కు తీసుకోవచ్చు. అలాగే, అపార్ట్మెంట్స్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాను. ఈ వర్క్‌షాప్స్‌లో కిచెన్ గార్డెనింగ్, కంప్రోస్ట్, ఎకో ఫ్రెండ్లీ గిఫ్ట్ థీమ్స్.. వంటివన్నీ అందుబాటులో ఉంటాయి. హస్తకళాకారుల నుంచి.. నెలకు ఒకసారి గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలను చూసుకొని పర్యావరణ స్పృహ కలిగించడానికి ఎకో ఫెస్ట్ ఏర్పాటు చేయడం మొదలుపెట్టాను. ఇందుకు ఇతర స్వచ్ఛంద సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీ సభ్యులు, ఐటీ ఉద్యోగులు తమ మద్దతును తెలియజేస్తున్నారు. నా టీమ్‌లో స్వచ్ఛందంగా పనిచేసే పది మంది బృందంగా ఉన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలలోని నగరాలలోనూ ఈ ఎకో ఫెస్ట్ ఏర్పాటు చేస్తాను. ఇందులో హస్తకళాకారులు తయారుచేసిన రకరకాల కళాకృతులు, జ్యువెలరీ బాక్సులు, ఇత్తిడి, రాగి వస్తువులు, జ్యూట్ కాటన్ పర్సులు, ఇంటీరియర్ వస్తువులు .. వంటివన్నీ ఉంటాయి. హస్తకళాకారులే నేరుగా వచ్చి తమ వస్తువులు అమ్ముకోవచ్చు. ఒక్కొక్క కళాకారుడి నుంచి సేకరించిన వస్తువులను కూడా ప్రదర్శనలో ఉంచుతాను. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ కళాకారులకు అందజేస్తుంటాను. గ్రామీణ కళాకారులకు తమ హస్తకళలను ఎక్కడ అమ్మితే తగినంత ఆదాయం వస్తుందనే విషయంలో అంతగా అవగాహన ఉండదు. అందుకే, ఈ ఏర్పాట్లు చేస్తుంటాను. దీని ద్వారా కళకు, కొనుగోలుదారుకు ఇద్దరికీ తగిన న్యాయం చేయగలుగుతున్నాను అనే సంతృప్తి లభిస్తుంది. ‘ది బాంటిక్ కంపెనీ( పేరుతో ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా హస్తకళాకృతులను అందుబాటులో ఉంచుతున్నాను. ఎకో ఫ్రెండ్లీ గిఫ్టింగ్ కార్పోరేట్ కంపెనీలలో పండగల సందర్భాలలో ఇచ్చే కానుకలకు కన్‌స్టలెన్సీ వర్క్ కూడా చేస్తాను. ఇక్కడ కూడా ఎకో థీమ్‌తో కస్టమైజ్డ్ గిఫ్ట్ బాక్స్‌లు తయారుచేసి అందిస్తుంటాను. ఇక ఇళ్లలో జిరగే చిన్న చిన్న వేడుకలకూ ఎలాంటి కానుకలు కావాలో తెలుసుకొని, వాటిని తయారుచేయించి సప్లయ్ చేయిస్తుంటాను. కార్పోరేట్ కంపెనీలలో వర్క్‌షాప్స్ కార్పోరేట్ కంపెనీలలో సస్టెయినబులిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేస్తాను. అక్కడ ఉద్యోగులు పర్యావరణ హిత వస్తువులతో తమ జీవన విధానాన్ని ఎలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చో, ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చో కార్యక్రమాల ద్వారా తెలియజేస్తుంటాను. అంతేకాదు, కిచెన్ వ్యర్థాలను ఎలా వేరు చేయాలి, కిచెన్ గార్డెన్‌ను తమకు తాముగా ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనే విషయాల మీద వర్క్‌షాప్స్ ఉంటాయి. అంతేకాదు, రోజువారీ జీవన విధానంలో ప్రతీది పర్యావరణ హితంగా మార్చుకుంటే కలిగే లాభాలనే వివరిస్తుంటాను. ఇదేమంత కష్టమైన పని కాదని వారే స్వయంగా తెలుసుకోవడం, తాము ఆచరిస్తున్న పనులు గురించి ఆనందంగా తెలియజేస్తుంటారు. మంచి జీవనశైలిని నలుగురికి పంచడంలోనే కాదు ప్రకృతికి మేలు చేస్తున్నాన్న సంతృప్తి కలుగుతుంది. అదే విధంగా గ్రామీణ కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నానన్న ఆనందమూ కలుగుతుంది’ అని తెలియజేస్తారు నిదర్శన. – నిర్మలారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
స్టీల్ బ్రిడ్జికి ‘నాయిని’ పేరు
హైదరాబాద్: ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.426 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ఇందిరాపార్కు చౌరస్తాలో మంత్రి కేటీఆర్ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. స్టీల్‌బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య తీరుతుందని, నగరంలోని వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా వెళ్లే వాహనాదారులకు ఇది ఎంతో వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు. ఎటువంటి రోడ్డు వెడల్పు లేకుండా దుకాణాదారులకు నష్టం కలిగించకుండా అనుకున్న సమయానికి స్టీల్‌బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మెట్రో ట్రైన్ మీదుగా అత్యంత ఎత్తు నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం స్టీల్ మాత్రమే ఉపయోగించి నిర్మించినట్లు తెలిపారు. ఇది నగరానికే తలమానికమని ఆయన కొనియాడారు. కాగా.. స్టీల్ బ్రిడ్జికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరును ఖరారు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం తొలి హోంమంత్రిగా నాయిని నర్సింహారెడ్డి పని చేశారని, స్టీల్ బ్రిడ్జికి ఆయన పేరు పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వు జారీ చేయనుందన్నారు. నాయిని నరసింహారెడ్డి సుదీర్ఘ కాలం పాటు ముషీరాబాద్ కేంద్రంగా రాజకీయాల్లో పాల్గొని తెలంగాణ ఉద్యమానికి అనేక సేవలందించారన్నారు. అక్కడే ఉన్న వీఎస్టీ ఫ్యాక్టరీ కార్మికుల యూనియన్ నాయకుడిగా దశాబ్దాల పాటు పనిచేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాల్లో నాయిని సేవలను దృష్టిలో ఉంచుకొని స్టీల్ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. -
హైదరాబాద్‌లోనే ‘టాప్’గా.. అత్యంత ఎత్తైన ఫ్లై ఓవర్..
హైదరాబాద్: నగరంలోనే అత్యంత ఎత్తులో.. మెట్రోరైలు మార్గంపైన నిర్మించిన ఫ్లై ఓవర్ త్వరలో ప్రారంభం కానుంది. వీఎస్టీ నుంచి ఇందిరాపార్కు వరకు నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ ఈ నెలలో ప్రారంభం కానున్నట్లు మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో తెలపడంతో, ఇప్పటికే పూర్తయిన ఈ ఫ్లైఓవర్‌కు తుది మెరుగులద్దే పనులు చేస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ చిక్కులు తప్పించేందుకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద జీహెచ్ఎంసీ వివిధ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు నిర్మిస్తోంది. వాస్తవానికి ఈపాటికే ప్రారంభం కావాల్సిన ఈ ఫ్లైఓవర్ పనుల్లో స్థల సేకరణ తదితర సమస్యలతో జాప్యం ఏర్పడింది. గుడి స్థలాన్ని సైతం సేకరించాల్సి వచ్చింది. కొద్దిరోజుల క్రితం ఈ ఫ్లైఓవర్‌ను తనిఖీ చేసిన మంత్రి కేటీఆర్.. పనులు సత్వరం పూర్తి చేయాల్సిందిగా ఆదేశించడంతో వేగం పెంచి పూర్తి చేశారు. ఎస్సార్డీపీ కింద జీహెచ్ఎంసీ ఇప్పటికే 32 పనులు పూర్తి చేసింది. ఫ్లై ఓవర్లలో ఇది 20వ ఫ్లై ఓవర్‌గా అధికారులు తెలిపారు. ఎంతో ఎత్తులో.. ఎస్సార్డీపీ కింద ఇప్పటి వరకు నిర్మించిన ఫ్లై ఓవర్లు ఒక ఎత్తయితే. ఇది మరో ఎత్తు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ఈ ఫ్లై ఓవర్ మెట్రో మార్గాన్ని క్రాస్ చేయాల్సి ఉండటంతో మెట్రో మార్గం పైనుంచి దీన్ని తీసుకువెళ్లారు. అక్కడ భూమి నుంచి ఫ్లై ఓవర్ ఎత్తు 26 మీటర్లకు పైగా ఉందని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్ట్స్)ఎం.దేవానంద్ తెలిపారు. బహుశా ఈ నెల రెండో వారంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ పేర్కొంది. ఎస్సార్డీపీలో పొడవైన ఫ్లై ఓవర్లలో ఇది మొదటి స్టీల్ ఫ్లైఓవర్ అని తెలిపింది. దీని అంచనా వ్యయం రూ.450 కోట్లు. ఫ్లై ఓవర్ పొడవు 2.6 కి.మీ. స్టీల్‌తో నిర్మాణం నగరీకరణ, ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా నిర్మాణ సమయం తగ్గించేందుకు స్టీల్‌తో నిర్మించారు. ఖర్చు దాదాపు 30 శాతం అధికమైనప్పటికీ, 40 శాతం మేర సమయం తగ్గుతుండటంతో ట్రాఫిక్ సమస్యలున్న ప్రాంతాల్లో స్టీల్‌బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. హౌరా– కోల్కత్తా నగరాలను కలుపుతూ హుగ్లీ నదిమీద నిర్మించిన పొడవైన హౌరాబ్రిడ్జి స్టీలు బ్రిడ్జేనని అధికారులు తెలిపారు. ప్రయోజనాలు ఈ ఫ్లై ఓవర్(ఎలివేటెడ్ కారిడార్) అందుబాటులోకి వచ్చాక ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ట్రాఫిక్ తగ్గుతుంది. సచివాలయం నుంచి హిందీ మహావిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ, అంబర్‌పేట, మూసారంబాగ్ల వైపు వెళ్లే వారికి ప్రయాణ సమయం కలిసి వస్తుంది. ప్రస్తుతం ట్రాఫిక్ సిగ్నళ్లున్న ఇందిరాపార్కు, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ఎక్కడా ఆగకుండా సిగ్నల్ ఫ్రీగా వెళ్లిపోవచ్చు. -
స్టీలు ఇల్లు..ఈజీగా మడతేసి తీసుకుపోవచ్చు!
‘స్టీలు సామాన్లు కొంటాం.. పాత ఇనుప సామాన్లు కొంటాం..’ అనేది పాతదే. త్వరలోనే ‘స్టీలు ఇళ్లను కొంటాం..’ అని కూడా వినపడొచ్చు. ఎందుకంటే, భవిష్యత్తులో చాలామంది స్టీలు ఇళ్లల్లోనే నివసించనున్నారు. ఈ మధ్యనే వాషింగ్టన్‌లోని ఓ ప్రైవేటు సంస్థ నాలుగు స్టీల్ గ్రెయిన్ హౌస్‌లను నిర్మించింది. చూడటానికి పాతకాలపు ధ్యానపు డబ్బాల్లా ఉన్నాయి. కానీ, వీటిలోపల విశాలమైన బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ ఉన్నాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే విధంగా ఇందులోని టెంపరేచర్ సిస్టమ్ పనిచేస్తుంది. పైగా ఇన్‌బిల్ట్ సీసీ కెమెరాలతో పనిచేసే స్మార్ట్ హోమ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంటిని కంటికిరెప్పలా కాపాడుతుంది. దీన్ని మడతేసి ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లచ్చు కూడా. అవుట్డోర్ వాతావరణాన్ని ఎంజాయ్ చేసేవారికి ఈ ఇల్లు భలే బాగుంటుంది. అయితే ఈ ఇంటి ధర 1.6 మిలియన్ డాలర్లు (అంటే రూ. 13 కోట్లు). ఈ ఇళ్ల ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. త్వరలోనే ఈ స్టీలు ఇళ్లను పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. (చదవండి: కొండను కొంటారా? ఔను! అమ్మకానికి సిద్ధంగా ఉంది!) -
స్టీల్‌బ్యాంక్
కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అని కోరుకునే సాధారణ గృహిణి తులికా సునేజా. ‘చుట్టూ ఉన్న వాతావరణం స్వచ్ఛంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది, అప్పుడే భవిష్యత్ తరాల మనుగడకు ఢోకా ఉండదన్న తాపత్రయం తనది. ‘వాయు, ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది. వీలైనంత వరకు కాలుష్యాన్ని తగ్గిద్దాం’ అని చెప్పేవారే కానీ ఆచరించేవారు అరుదు. అందుకే కాలుష్య స్థాయుల్లో చెప్పుకోదగ్గ మార్పులు కనిపించడంలేదని భావించిన తులికా... పర్యావరణాన్ని కాపాడడానికి నడుం బిగించి ‘క్రోకరీ బ్యాంక్’ నడుపుతోంది. ఈ బ్యాంక్ ద్వారా డిస్పోజబుల్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి కృషిచేస్తోంది. ఫరీదాబాద్‌కు చెందిన తులికా సునేజా ఓ రోజు పిల్లలతో బయటకు వెళ్లి ఇంటికి తిరిగొస్తున్నప్పుడు... రోడ్డుమీద కొంతమంది ఉచితంగా అన్నదానం చేస్తుండడం చూసింది. నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు అని సంతోష పడేలోపు.. చుట్టుపక్కల చెల్లాచెదరుగా పడి ఉన్న ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, స్పూన్లు కనిపించాయి. తులికాతో ఉన్న తన పిల్లలు ‘‘అమ్మా ఇలా ప్లాస్టిక్ పడేయడం పర్యావరణానికి మంచిది కాదు, దీనిని నియంత్రించడానికి షరిష్కారమే లేదా?’’ అని తల్లిని ప్రశ్నించారు. అప్పుడు ఆ ప్రశ్నకు తులికా దగ్గర సమాధానం లేదు. కానీ డిస్పోజబుల్ ప్లాస్టిక్‌ను నియంత్రించే మార్గాలు ఏవైనా ఉన్నాయా అని రోజుల తరబడి ఆలోచించసాగింది. కొన్నిరోజుల తర్వాత తన మదిలో మెదిలిన ఐడియానే ‘క్రోకరీ బ్యాంక్’. ఎవరికీ నమ్మకం కుదరలేదు.. తనకు వచ్చిన క్రోకరీ బ్యాంక్ ఐడియాను తన స్నేహితులతో చెప్పింది తులిక. ‘‘బ్యాంక్ ఆలోచన బావుంది కానీ ఎవరు పాటిస్తారు. బ్యాంక్ ఏర్పాటు చేయడానికి చాలా స్థలం, డబ్బులు కావాలి’’ అన్న వారే తప్ప సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తన బ్యాంక్ ఆలోచన కార్యరూపం దాల్చడానికి తన భర్త సాయం తీసుకుంది. ఆయన వెన్నుతట్టి ప్రోత్సహించడంతో.. తాను దాచుకున్న డబ్బులతో స్టీ్టల్వి.. యాభై టిఫిన్ ప్లేట్లు, యాభై స్పూన్లు, యాభై భోజనం చేసే ప్లేట్లు, యాభై గ్లాసులు కొనింది. ఇవన్నీ పదమూడు వేల రూపాయల్లోనే వచ్చేశాయి. ఈ స్టీల్ సామాన్లతో 2018లో తనింట్లోనే ‘క్రోకరీ బ్యాంక్’ను ఏర్పాటు చేసింది. ఈ బ్యాంక్ గురించి తెలిసిన కొంతమంది తమ ఇళ్లల్లో జరిగే చిన్నచిన్న ఫంక్షన్లకు ఈ సామాన్లు తీసుకెళ్లేవారు. ఈ విషయం ఆనోటా ఈ నోటా సోషల్ మీడియాకు చేరడంతో చాలామంది ఫంక్షన్లకు ఈ ఇక్కడి నుంచే సామాన్లను తీసుకెళ్లడం మొదలు పెట్టారు. కొంతమంది పర్యావరణవేత్తలు సైతం తులికాకు మద్దతు ఇవ్వడంతో క్రోకరీ బ్యాంక్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. చిన్నాపెద్దా పుట్టినరోజు వేడుకలు, కిట్టీపార్టీలు, కొన్ని ఆర్గనైజేషన్లలో జరిగే చిన్నపాటి ఈవెంట్లకు సైతం ప్లాస్టిక్ వాడకుండా ఈ బ్యాంక్ నుంచే సామాన్లు తీసుకెళ్తున్నారు. తులికాను చూసి ఫరీదాబాద్‌లో పదికి పైగా స్టీల్ క్రోకరీ బ్యాంక్‌లు ఏర్పాటయ్యాయి. నేను చాలా చిన్నమొత్తంతో క్రోకరీ బ్యాంక్‌ను ఏర్పాటు చేశాను. ఎవరైనా ఇలాంటి బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం పెద్ద కష్టం కాదు. నాలా మరికొంతమంది పూనుకుంటే ప్లాస్టిక్ కాలుష్యం తగ్గుముఖం పడుతుంది. దీని ద్వారా 2018నుంచి ఇప్పటిదాకా ఐదులక్షల డిస్పోజబుల్ ప్లాస్టిక్‌ను నియంత్రించగలిగాను. భవిష్యత్‌లో మరింత పెద్ద సంస్థను ఏర్పాటు చేసి భారీస్థాయిలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రిస్తాను. – తులికా -
విజయ్ దేవరకొండ ఖాతాలో మరో కంపెనీ
హైదరాబాద్: టీఎంటీ బార్ల తయారీలోని శ్యామ్ స్టీల్ నటుడు విజయ్‌దేవరకొండతో కలసి నూతన డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు. టెలివిజన్ ప్రచార చిత్రాన్ని ఇగ్నిషన్ ఫిల్మ్స్‌కు చెందిన రెన్సిల్ డిసిల్వ, పార్థో సర్కార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ టెలివిజన్ ప్రచారం ద్వారా ఏపీ, తెలంగాణలో కస్టమర్లకు తన ఉత్పత్తులను మరింత చేరువ చేయాలన్నది శ్యామ్ స్టీల్ ప్రణాళికగా ఉంది. -
రిటైల్ విక్రయాల్లోకి సుగ్న స్టీల్స్
హైదరాబాద్: చిన్న నిర్మాణాలకు కూడా ఫ్యాక్టరీ ధరలకే స్టీల్‌ను అందించే ఉద్దేశంతో సుగ్న మెటల్స్ సంస్థ రిటైల్ విక్రయాల్లోకి ప్రవేశించింది. రోహిత్ స్టీల్స్‌తో కలిసి హైదరాబాద్‌లో తొలి అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. 8 ఎం.ఎం. మొదలుకుని 32 ఎంఎం వరకు వివిధ ఉక్కు ఉత్పత్తులను ఎన్ని టన్నులైనా ఈ స్టోర్ నుంచి కొనుగోలు చేయొచ్చని సుగ్నా చైర్మన్ భరత్ కుమార్ అగ్రవాల్ తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ సహా దక్షిణాదిలో పలు ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలకు టీఎంటీ స్టీల్‌ను సరఫరా చేస్తున్నట్లు వివరించారు. పరిగిలోని తమ సొంత ప్లాంటులో రోజుకు 1,300 టన్నుల ఉక్కును ఉత్పత్తి కంపెనీ సేల్స్ ప్రెసిడెంట్ నితిన్ జైన్ తెలిపారు. తమ ఉత్పత్తుల రిటైల్, హోల్‌సేల్ పంపిణీ కోసం ఎక్స్‌క్లూజివ్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్‌గా రోహిత్ స్టీల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. -
రూ. 2,500 కోట్లతో శ్యామ్ స్టీల్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టీఎంటీ ఉక్కు కడ్డీల తయారీ సంస్థ శ్యామ్ స్టీల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తమ రిటైల్ కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. వచ్చే అయిదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 500 పైచిలుకు డీలర్ డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు కంపెనీ డైరెక్టర్ లలిత్ బెరివాలా తెలిపారు. అలాగే నటుడు విజయ్ దేవరకొండను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు పేర్కొన్నారు. ఉత్పత్తి సామర్థ్యాల పెంపునకు రూ. 2,500 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు వివరించారు. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లోని ప్లాంటుపై రూ. 1,000 కోట్లు, మరో కొత్త ప్లాంటుపై రూ. 1,500 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు బెరివాలా చెప్పారు. ప్రస్తుత సామర్థ్యం వార్షికంగా 0.7 మిలియన్ టన్నులుగా ఉండగా, దీన్ని 1 మిలియన్ టన్నులకు పెంచుకుంటున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 4,500 కోట్ల టర్నోవరు నమోదు కాగా వచ్చే మూడేళ్ల వ్యవధిలో దీన్ని రూ. 9,000 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. -
క్యూ3లో మెరుగ్గా ఉక్కు కంపెనీల లాభాలు
న్యూఢిల్లీ: సవాళ్లతో గడిచిపోయిన సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో దేశీ ఉక్కు తయారీ సంస్థల లాభదాయకత మెరుగుపడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా పెరుగుతున్న డిమాండ్, తగ్గుతున్న ముడి ఉత్పత్తుల వ్యయాలు ఇందుకు దోహదపడవచ్చని భావిస్తున్నారు. ‘ఒకవైపు ఉక్కు ధరలు పడిపోతూ మరోవైపు ముడి వస్తువుల రేట్లు.. ముఖ్యంగా కోకింగ్ కోల్ ధరలు పెరిగిపోతూ ఉండటం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారతీయ స్టీల్ కంపెనీల ఆర్థిక పనితీరుపై ప్రతికూల ప్రభావం పడింది. అయితే, కోకింగ్ కోల్ వ్యయాలు తగ్గడం, పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాలు పుంజుకంటూ ఉండటం వంటి అంశాలతో మూడో త్రైమాసికంలో వాటి లాభదాయకత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి‘ అని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా సీనియర్ వైస్–ప్రెసిడెంట్ జయంత రాయ్ చెప్పారు. వచ్చే రెండు త్రైమాసికాల్లో ఉక్కు రంగం లాభదాయకత ఒక మోస్తరుగా మెరుగుపడవచ్చని ఎక్యూయిట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ అనలిటికల్ ఆఫీసర్ సుమన్ చౌదరి తెలిపారు. సరఫరాపరమైన సవాళ్లతో పెరిగిన ముడి వస్తువుల రేట్లు ద్వితీయార్థంలో తగ్గుముఖం పట్టనుండటం, సీజనల్‌గా డిమాండ్ పుంజుకుని ఉక్కు ధర పెరగడం వంటివి ఇందుకు సహాయపడగలవని తెలిపారు. ప్రాంతీయంగా ఆశావహంగా భారత్.. ముడి వస్తువులు .. ఇతర ఉత్పత్తుల వ్యయాలు అధిక స్థాయిలో ఉండి, ఉక్కు ధరలు గణనీయంగా పడిపోవడం వల్ల సీజనల్‌గా స్టీల్ కంపెనీలకు జూలై–సెప్టెంబర్ త్రైమాసికంగా బలహీనంగా ఉంటుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ ఫైనాన్స్) కౌస్తుభ్ చౌబల్ తెలిపారు. అయినప్పటికీ, ప్రాంతీయంగా భారత్ ఆశావహంగానే ఉందని, వచ్చే 12 నెలల్లో స్టీల్ వినియోగం సింగిల్ డిజిట్ శాతంలో వృద్ధి నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. ఆటో రంగం నుండి డిమాండ్, ఇన్ఫ్రాపై ప్రభుత్వం భారీగా పెట్టుబడులు కొనసాగిస్తుండటం ఇందుకు దోహదపడగలవని వివరించారు. ద్వితీయార్థంలో అంతర్జాతీయంగా స్టీల్‌కు డిమాండ్ బలహీనంగా ఉన్నా దేశీయంగా మాత్రం బాగానే ఉండటంతో పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరంలో 6–8 శాతం వృద్ధి చెందవచ్చని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మనీష్ గుప్తా చెప్పారు. ఉక్కు ధరలు ఒక శ్రేణిలో తిరగవచ్చని పేర్కొన్నారు. చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. నేటి నుంచి -
బ్లూ స్టీల్ తయారీపై దృష్టి
చెన్నై: బ్లూ స్టీల్‌ను తయారు చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు నగరానికి చెందిన సుమంగళ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ రాజేంద్రన్ సబానాయగం తెలిపారు. శనివారం నగరంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడున్నర దశాబ్దాలుగా ఉక్కు తయారీలో ప్రత్యేకతను చాటుకుంటున్నామని అన్నారు. పుదుచ్చేరిలోని తమ ప్లాంట్‌లో బ్లూ స్టీల్‌ను తయారు చేయడానికి ఆధునిక స్క్రాప్ ష్రెడర్, థర్మో మెకానికల్ ట్రీట్మెంట్ ఫినిషింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. ఇందు కోసం రూ.25 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.679 కోట్లు టర్నోవర్ నమోదు చేశామని.. ఈ ఏడాది రూ.1,000 కోట్ల టర్నోవర్‌కు చేరనున్నట్లు వివరించారు. సంస్థ ప్రెసిడెంట్ అశ్విన్ పాల్గొన్నారు. చదవండి: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా?.. ఈ బెల్టు ట్రై చేయండి, వెంటనే ఉపశమనం! -
యువకుడి కడుపులో 63 ‘స్టీల్ స్పూన్లు’.. ఏడాదిగా అవే ఆహారం!
లక్నో: ఏదైనా ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతేనే.. కడుపులో నొప్పితో సతమతమవుతాం. అలాంటిది ఓ వ్యక్తి ఏడాదిగా స్టీల్ స్పూన్లు తింటున్నాడు. పొట్ట నిండా స్పూన్లు ఉన్న ఈ షాకింగ్ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. బాధితుడి శరీరంలో ఏకంగా 63 స్టీల్ స్పూన్లు ఉండటం చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. గంటల తరబడి శస్త్రచికిత్స చేసి చెంచాలను బయటకు తీశారు. ఏం జరిగింది? జిల్లాకు చెందిన విజయ్ అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. దాంతో ఏడాది క్రితం కుటుంబ సభ్యులు డీఅడిక్షన్ కేంద్రంలో చేర్పించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం మరింత క్షీణించగా.. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. కడుపులో స్పూన్లు ఉన్నట్లు తేల్చారు. ఆపరేషన్ చేసి 63 చెంచాలను బయటకు తీశారు. అయితే.. స్పూన్లు ఎలా వచ్చాయని డాక్టర్లు ప్రశ్నించగా.. తాను గత ఏడాది నుంచి స్పూన్లు తింటున్నానని విజయం చెప్పటంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ‘ఆ స్పూన్లు నువ్వే తింటున్నావా అని మేము అడిగితే అవునని చెప్పాడు. సుమారు 2 గంటల పాటు ఆపరేషన్ చేసి స్పూన్లు తొలగించాం. ప్రస్తుతం అతడు ఐసీయూలో ఉన్నాడు. పరిస్థితి విషమంగానే ఉంది. రోగి సుమారు ఏడాది కాలంగా స్టీల్ చెంచాలు తింటున్నాడు.’ అని డాక్టర్ రాకేశ్ ఖర్రాన్ తెలిపారు. మరోవైపు.. డీఅడిక్షన్ కేంద్రంలోనే విజయ్‌కి బలవంతంగా స్పూన్లు తినిపించారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఇదీ చదవండి: 11కేవీ హైఓల్టేజ్ కరెంట్ తీగలపై స్టంట్స్.. తర్వాత ఏం జరిగిందంటే? -
మద్యం మత్తులో దారుణం.. స్నేహితుడి శరీరంలోకి గ్లాస్ చొప్పించి..!
భువనేశ్వర్: అప్పటి వరకు అంతా కలిసి సరదాగా గడిపారు. ఫూటగా మద్యం సేవించారు. మద్యం మత్తులో అందులోని ఓ స్నేహితుడి పట్ల అరాచకంగా ప్రవర్తించారు. అతడి శరీరం వెనుకభాగంలో స్టీల్ గ్లాస్‌ను చొప్పించారు. ఎవరికైనా చెబితే ఏమనుకుంటారోనని ఎవరికీ చెప్పలేదు బాధితుడు. చివరకు నొప్పి తీవ్రం కావటంతో ఆసుపత్రికి వెళ్లగా శాస్త్రచికిత్స చేసి గ్లాస్‌ను బయటకు తీశారు వైద్యులు. ఈ అరాచక చర్య గుజరాత్‌లోని సూరత్‌లో జరగగా.. ఒడిశాలోని గంజాం జిల్లా వైద్యులు బాధితుడికి ఉపశమనం కల్పించారు. ఇంతకి ఏం జరిగిందంటే? ఒడిశా, గంజాం జిల్లాలోని బుగుడ బ్లాక్ బలిపదార్ గ్రామానికి చెందిన బాధితుడు కృష్ణ చంద్రా రౌత్(45).. కొద్ది రోజుల క్రితం గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లి అక్కడి టెక్స్టైల్ మిల్లో పని చేస్తున్నాడు. దాదాపు 10 రోజుల క్రితం స్నేహితులతో కలిసి దావత్ చేసుకున్నారు. అంతా కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో బాధితుడు కృష్ణ చంద్ర శరీరం వెనుకభాగంలో స్టీల్ గ్లాస్ చొప్పించారు కీచకులు. ఆ తర్వాత రోజు నుంచి అతడికి నొప్పి మొదలైంది. కానీ, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. నొప్పి తీవ్రం కావడం వల్ల సూరత్ నుంచి అతడి సొంతూరికి వచ్చేశాడు. ఆ తర్వాత మలవిసర్జన కాకపోవటం వల్ల పొట్ట ఉబ్బిపోయింది. నొప్పి భరించలేని స్థితికి చేరటంతో బెర్హమ్పుర్లోని ఎంకేసీజీ వైద్య కళాశాల, ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అక్కడ సైతం గ్లాస్ విషయం వైద్యులకు తెలపలేదు బాధితుడు. పరీక్షలు నిర్వహించి అసలు విషయం వెల్లడించారు డాక్టర్లు. శరీరం వెనుకభాగంలో చిక్కుకుపోయిన స్టీల్ గ్లాస్‌ను ఆపరేషన్ లేకుండానే బయటకు తీసేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో సర్జరీ చేసుకోవాల్సిందిగా బాధితుడికి సూచించారు. దానికి అంగీకరించటంతో సుమారు 2.5 గంటల పాటు శ్రమించి శాస్త్ర చికిత్స పూర్తి చేసి గ్లాసును బయటకు తీశారు. బాధితుడు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపారు. మరో నాలుగైదు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: ప్లాస్టిక్‌లా మారిపోయిన యువతి చర్మం.. అదే కారణమా? -
కేంద్రం కీలక నిర్ణయం, మరింత తగ్గనున్న స్టీల్ ధరలు!
న్యూఢిల్లీ: స్టీల్, సిమెంట్ ధరలు దిగొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను రియల్ ఎస్టేట్ పరిశ్రమ జాతీయ సంఘాలైన క్రెడాయ్, నరెడ్కో కొనియాడాయి. తయారీదారులు ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశాయి. స్టీల్, సిమెంట్ ధరలు గడచిన ఏడాది కాలంలో గణనీయంగా పెరిగిపోవడం పట్ల ఈ అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. వీటి కారణంగా నిర్మాణ వ్యయాలు పెరిగిపోయాయని, వినియోగదారులపై భారం పడుతోందంటూ ప్రభుత్వం దృష్టికి ఈ సంఘాలు పలు పర్యాయాలు తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో స్టీల్ తయారీకి ముడి పదార్థాలైన కోకింగ్ కోల్, ఫెర్రో నికెల్ తదితర వాటిపై కస్టమర్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ గత శనివారం నిర్ణయాన్ని ప్రకటించింది. దీనివల్ల తయారీ వ్యయాలు తగ్గుతాయని, అంతిమంగా ఉత్పత్తుల ధరలు దిగొచ్చేందుకు సాయపడతాయని క్రెడాయ్, నరెడ్కో అంచనా వేస్తున్నాయి. ఐరన్‌ఓర్ ఎగుమతులపై సుంకాన్ని 50 శాతం వరకు, స్టీల్ ఇంటర్మీడియరీలపైనా 15 శాతం కేంద్రం పెంచింది. భాగస్వాములు అందరికీ ప్రయోజనం ‘‘తయారీ వ్యయాల పెరుగుదలపై ఆర్థిక మంత్రి, ప్రభుత్వ జోక్యాన్ని మేము కోరుతూనే ఉన్నాం. పెరిగిపోయిన వ్యయాలతో రియల్ ఎస్టేట్ రంగంలో 18 నెలల్లో వృద్ధిపై ప్రభావం పడింది. స్టీల్ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు తగ్గించడం భాగస్వాములు అందరికీ ఉపశమనం ఇస్తుంది’’అని క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు హర్షవర్ధన్ పటోడియా అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి అదనంగా ముడి ఇనుము, స్టీల్ ఇంటర్మీడియరీల దిగుమతులపైనా సుంకాలు తగ్గించడం దేశీయంగా స్టీల్ ఉత్పత్తుల ధరలు చల్లారడానికి సాయపడతాయన్నారు. చదవండి👉 సామాన్యులకు మరో శుభవార్త! నూనెలతో పాటు వీటి ధరలు తగ్గనున్నాయ్! -
హమ్మయ్యా.. కనీసం వాటి ధరలైనా తగ్గుతాయంట?
న్యూఢిల్లీ: రెండు సంవత్సరాలుగా పెరుగుతూ వస్తున్న స్టీల్ ధరలు తిరిగి తిరోగమన బాట పట్టే అవకాశం ఉందని క్రిసిల్ తాజా నివేదిక అంచనావేసింది. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చి చివరినాటికి టన్నుకు గరిష్ట స్థాయిలో రూ.70,000కు చేరిన స్టీల్ ధర, 2023 మార్చి నాటికి రూ.60,000కు దిగిరావచ్చని పేర్కొంది. అయితే ధరలు నిట్టనిలువునా పడిపోయే పరిస్థితి లేదని, క్రమంగా దిగిరావచ్చని అంచనావేసింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. - స్టీల్ ధర ఇంకా అధికంగానే, కరోనా ముందస్తుకన్నా ఎక్కువ స్థాయిలోనే ఉంది. సరఫరాల్లో అంతరాయాలు, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా చైనాలో డీకార్బనైజేషన్ చర్యలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నుండి ఉత్పన్నమయ్యే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అధిక స్థాయిలో ఉన్న ముడిసరుకు ధర దీనికి కారణం. ఎగుమతుల్లో ఇప్పటి వరకూ ఉన్న సానుకూల పరిస్థితులూ అధిక ధరలకు మద్దతునిస్తున్నాయి. - వచ్చే నెలలో రుతుపవనాల ప్రారంభం కారణంగా ధరల సర్దుబాటు జరిగే అవకాశం ఉంది. నిర్మాణాలు నిలిచిపోయే అవకాశం వల్ల, డిమాండ్ తగ్గడం ఇందుకు ఒక కారణం కావచ్చు. అలాగే దేశీయ మిల్లులు ఎగుమతుల నుండి పొందే తక్కువ ప్రీమియం ధరల తగ్గుదలకు దారితీసే వీలుంది. - కాగా ఒక్క ఫ్లాట్ స్టీల్ విషయానికి వస్తే, 2021–22లో 50 శాతానికి పైగా పెరిగాయి. ఈ పెరుగుదల ఈ ఆర్థిక సంవత్సరంలో 3–5 శాతానికి పరిమితం కావచ్చు. - ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూలై) ఈ రంగం కొంత రికవరీని చూడవచ్చు. అయితే ఈ రికవరీ (శాతాల్లో)కి లో బేస్ కారణం అవుతుంది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. నిజానికి వినియోగ సెంటిమెంట్ బలహీనంగానే ఉంది. అదిక ఇన్పుట్ వ్యయాల వల్ల వినియోగదారు కొనుగోళ్లు వాయిదా వేసుకుంటున్నారు. ఒక్క భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ద్రవ్యోల్బణం సమస్యలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ భవిష్యత్తులో ధరల తగ్గుదలకు దరితీసే అంశాలే. - ఏప్రిల్ నుండి హాట్–రోల్డ్ కాయిల్ ధరలు యూరప్, అమెరికాల్లో 25 శాతంపైగా క్షీణించాయి, మార్చి మధ్యన టన్నుకు 1,600 గరిష్ట స్థాయికి చేరిన ధర తర్వాత 1,150–1,200 డాలర్లకు తగ్గింది. - స్టీల్ తయారీలో కీలక ముడి పదార్థమైన కోకింగ్ కోల్ ధర భారీగా పెరడం గమనార్హం. గత ఫిబ్రవరిలో టన్నుకు 455 డాలర్లు పలికిన కోకింగ్ కోల్ ధర కేవలం మూడు వారాల్లో టన్నుకు 47 శాతం ఎగసి 670 డాలర్లకు చేరింది. గరిష్ట స్థాయిల నుంచి ధర తగ్గినా, ప్రస్తుతం 500 డాలర్ల వద్ద పటిష్ట డిమాండ్ ఉంది. ఆయా అంశాలు దేశీయంగా స్టీల్ ధర తీవ్రతకు కారణం. కోవిడ్–19ను మహమ్మారిగా ప్రకటించిన 2020 మార్చితో పోల్చితే 2022 ఏప్రిల్ నాటికి ధ ర 95% ఎగసి టన్నుకు రూ.76,000కు చేరింది. - ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల నుండి బలమైన దేశీయ డిమాండ్ నేపథ్యంలో భారతీయ ఉక్కు రంగ అవుట్‌లుక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థిరంగా ఉండనుందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్–రా) ఇటీవలి తన తాజా నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. గ్లోబల్ డిమాండ్ అనిశ్చితి ఆందోళనల నేపథ్యంలోనూ దేశీయ పరిశ్రమ దృఢంగా ఉంటుందన్న భరోసాను ఇండ్–రా వెలిబుచ్చింది. చదవండి: వడ్డింపు బాటలో మరో ఐదు బ్యాంకులు -
భలే దొంగలు...ఏకంగా 60 అడుగుల బ్రిడ్జినే...
Thieves Stolen 60 Feet Steel Bridge: ఇటీవల దొంగతనానికి వచ్చి గోడ కన్నంలో ఇరుక్కుపోయిన ఘటన గురించి విన్నాం. బంగారం, డబ్బులు, ఇంట్లో ఫర్నిచర్ వంటివి ఎత్తుకుపోవడం గురించి విన్నాం. కానీ అసాధ్యమైనవి, అలాంటివి కూడా ఎత్తుకుపోతారా అనిపించే వాటిని ఒక దొంగల ముఠా పక్కా ప్లాన్‌తో ఎత్తుకుపోయింది. పైగా స్థానికుల సాయంతో దర్జాగా పట్టుకెళ్లిపోయింది. వివరాల్లోకెళ్తే...బిహార్‌లోని రోహతాస్ జిల్లాలో పట్టపగలు 60 అడుగుల వంతెనను దొంగలించారు. అసలెవరూ ఊహించని విధంగా అసాధారణమైన దాన్ని ఎత్తుకెళ్లిపోయారు. పోలీసుల కథనం ప్రకారం...అమియావర్ గ్రామం వద్ద 1972లో అర్రా కాలువపై వంతెన నిర్మించారు. ఇది ఇప్పుడూ చాలా పాతది మాత్రమే కాదు, ప్రమాదకరమైనది కూడా. అయితే స్థానిక గ్రామస్తులు ప్రస్తుతం ఈ వంతెనను వినియోగించడంలేదు. ఈ మేరకు ఒక దొంగల ముఠా నీటి పారుదల శాఖ అధికారులుగా ఆ గ్రామంలోని స్థానికులకు పరిచయం చేసుకున్నారు. ఆ వంతెనను కూల్చివేస్తున్నామని చెప్పడమే కాకుండా గ్రామస్తుల సాయం కూడా తీసుకున్నారు. ఆ వంతెన ఉక్కుతో కూడిన నిర్మాణం. ఆ ముఠా గ్యాస్ కట్టర్లు, ఎర్త్‌మూవర్ యంత్రాలను ఉపయోగించి వంతెనను కూల్చివేసి, మూడు రోజుల్లో మొత్తం మెటల్ని స్వాహా చేశారు. దీంతో నీటి పారుదల శాఖ అధికారుల అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ పై ఫిర్యాదు అందడంతో పోలీసులు ఘటనస్థలికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వంతెన 60 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తు ఉంటుందని చెబుతున్నారు పోలీసులు. గతంలో ఇలాంటి ఘటనలు చెక్ రిపబ్లిక్, యూఎస్‌లోని పెన్సిల్వేనియా, ఉక్రెయిన్ వంటి దేశాల్లో చోటు చేసుకున్నాయి. ఏదిఏమైన దొంగలకు కూడా రొటిన్‌గా చేసే దొంగతనాలు పై బోర్ కొట్టిందో ఏమో ఇలా వైరైటీగా దొంగతనం చేయాలనుకున్నారు కాబోలు. Bihar |60-feet long-abandoned steel bridge stolen by thieves in Rohtas district Villagers informed some people pretending as mechanical dept officials uprooted bridge using machines like JCB & gas-cutters. We've filed the FIR:Arshad Kamal Shamshi, Junior Engineer,Irrigation dept pic.twitter.com/o4ZWVDkWie — ANI (@ANI) April 9, 2022 (చదవండి: ఏ క్షణంలోనైనా మీ ప్రాణాలు పోవచ్చు.. మాజీ సీఎంలకు వార్నింగ్) -
కలప కత్తి... కత్తి కాదు అంతకు మించి గురూ!
కలపను కట్ చేసే కత్తులను చూసి ఉంటారు.. కానీ, కత్తినే కట్ చేసే కలపకత్తిని చూశారా? కూరగాయలు, పండ్లతోపాటు మాంసం ముక్కలను కూడా ఈజీగా కట్ చేయగలదు ఈ కత్తి. సాధారణ లోహపు కత్తి కంటే ఇది 23 రెట్లు బలమైనది, మూడు రెట్లు పదునైనది. కూరగాయలు కట్ చేసే కత్తుల్లో ఎక్కువగా స్టీల్, ఇనుము వంటి లోహాలనే ఎందుకు వాడటం.. విరివిగా దొరికే కలపను ఎందుకు ఉపయోగించ కూడదు అని ఓ విద్యార్థికి వచ్చిన అద్భుతమైన ఆలోచనే ఈ రూపకల్పనకు దారితీసింది. ఇందుకు అమెరికాలోని మేరిల్యాండ్ యూనివర్సిటీ అధ్యాపకులు కూడా సహాయం చేయడంతో చక్కటి ఈ కలపకత్తి తయారైంది. సాధారణ కత్తిలాగే.. సెల్యులోజ్, ఇతర రసాయనాలను ఓ ప్రత్యేకమైన కలపతో చేర్చి, అధిక ఉష్ణోగ్రత, ఒత్తిడిని ఉపయోగించి, దీనిని తయారు చేశారు. అయితే, దీనిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ టెంగ్ లీ తెలిపారు. ఏదిఏమైనా.. కలపకత్తి ‘కత్తి’లా ఉంది కదూ! చదవండి: వంగే రాయి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారోయి..! -
స్టీల్ కంపెనీపై ఐటీ దాడులు...లెక్కల్లోకి రాని సొమ్ము రూ. 175 కోట్లు
తప్పుడు పత్రాలు, ఫోర్జరీ వే బిల్లులతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఓ స్టీల్ కంపెనీపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. ఏకకాలంలో కంపెనీకి సంబంధించిన కార్యాలయాలు, నివాస స్థలాలో సోదాలు నిర్వహించారు. ఇందులో వందల కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్టుగా తేలింది. స్టీలు కంపెనీ స్టీల్ తయారీ కంపెనీపై ఐటీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆగస్టు 25న మొదలైన ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పక్కా సమాచారంతో ముంబై, గోవా, పూనేలో ఆ స్టీలు కంపెనీకి సంబంధించిన మొత్తం 44 స్థలాలల్లో ఈ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయని బిజినెస్ టూడే వెల్లడించింది. ఈ దాడుల్లో అనేక బోగస్ పత్రాలు, ఫోర్జరీ వే బిల్లులు కనుగొన్నట్టు తెలుస్తోంది. రూ.175 కోట్లు తప్పుడు పత్రాలు, దొంగ బిల్లులు, ఫేక్ ఇన్వాయిస్ల సాయంతో ఇటు జీఎస్టీ, అటూ ఐటీ ట్యాక్స్ రూపేనా మొత్తం రూ. 175 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీని కోసం కొనుగోలు చేయకుండానే ఐరన్ స్కా్రప్, స్పాంట్ ఐరన్ కొన్నట్టుగా రూ. 160 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్లు సృష్టించినట్టు ఆధారాలు లభించాయి. వే బిల్లులకు సంబంధించి వెహికల్ట్రాకింగ్ సిస్టమ్ వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. 194 కేజీల వెండి ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో రూ. 3 కోట్ల రూపాయల విలువైన నగదు లభించింది. దీంతో పాటు రూ. 5.20 కోట్ల విలువైన బంగారు నగలతో పాటు రూ. 1.34 కోట్ల విలువ చేసే 194 కేజీల వెండిని కూడా సీజ్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కంపెనీ ప్రతినిధులు ఐటీ అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నారని, రెయిడ్ మధ్యలోనే ఆపేయాల్సిందిగా బెదిరింపులు వస్తున్నట్టు ఐటీ శాఖకు చెందిన విశ్వసనీయ వ్యక్తులు మీడియాకు సమాచారం అందించారు. చదవండి : జియో వర్సెస్ ఎయిర్టెల్ ! గూగుల్ షాకింగ్ నిర్ణయం -
తగ్గడంలే... ఇళ్ల ధరలు పెరుగుతాయట!
సాక్షి, వెబ్‌డెస్క్: అద్దె ఇళ్లలో ఉండే సవాలక్ష నిబంధనలకు తోడు కరోనా సంక్షోభం నేర్పిన పాఠాలతో సొంతిళ్లు అవసరమనుకునే వారి సంఖ్య పెరిగింది. అప్పు చేసైనా సరే ఇది నా ఇల్లు అనిపించుకుందామనే ప్రయత్నాలు పెరిగాయి. అయితే అంతకు ముందే ఇంటి నిర్మాణ రంగంలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు అనూహ్యంగా పెరిగిపోవడంతో సొంతింటికి కల మరోసారి మధ్య తరగతి ప్రజలకు అందని ద్రాక్షగానే మారుతోంది. స్టీలు ధరలకు రెక్కలు ఇంటి నిర్మాణ రంగంలో కీలకమైన స్టీలు ధరలు ఏడాది కాలంలో దాదాపు 30 శాతం పెరిగాయి. లాక్డౌన్ కంటే ముందు హోల్‌సేల్ మార్కెట్లో 8 మిల్లీమీటరు స్టీలు టన్ను ధర రూ.42,000 ఉండగా ఇప్పుడు టన్ను స్టీలు ధర రూ.57,00లకు చేరుకుంది. ఇదే తరహాలో సిమెంటు బ్యాగు ధర సగటున వంద రూపాయల వరకు పెరిగింది. వీటితో పాటు ఇంటి నిర్మాణంలో కీలకమైన కాపర్ ధర 40 శాతం, అల్యుమినియం ధర 60 శాతం పెరిగినట్టు డెవలపర్లు చెబుతున్నారు. డిమాండ్ పెరిగింది కరోనా కల్లోల సమయంలో అద్దె ఇళ్లలో ఎదురైన ఇబ్బందులతో సొంత ఇల్లు కావాలనుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో నిర్మాణంలో ఉన్న వెంచర్లు, అపార్ట్మెంట్లకు డిమాండ్ పెరిగింది. అయితే పెరిగిన ధరలు వారికి షాక్ ఇస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటికే సేవింగ్స్ చాలా ఖర్చుకావడం, ఎక్కువ మందికి జీతాల్లో కోతలు పడ్డాయి. ఈ తరుణంలో లోన్లు తీసుకుని ఇళ్లు కొందామనుకునే వారికి పెరుగుతున్న ధరలు అశనిపాతంలా మారాయి. కట్టాలన్నా కష్టమే డెవలపర్లు ఒకేసారి పెద్ద ఎత్తున సిమెంటు, స్టీలు కొనడం వల్ల హోల్‌సేల్ ధరలకు లభిస్తున్నాయి. కానీ జిల్లా కేంద్రాలు, ఇతర చిన్న పట్టణాల్లో ఇంటి నిర్మాణం స్వంతంగా చేపట్టాలనుకునే వారికి పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో టన్ను స్టీలు ధర 65,000 దగ్గర ఉంది. సిమెంటు బ్యాగు రూ. 400 దగ్గర లభిస్తోంది. దీంతో సొంతింటి కల భారంగా మారుతోంది. పెరిగిన లేబర్ కష్టాలు గతంలో బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిషాల నుంచి లేబర్ పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌తో పాటు పెద్ద ప్రాజెక్టులు, జిల్లా కేంద్రాల్లో పనికి వచ్చే వారు. లోకల్ లేబర్‌తో పోల్చితే వీరు తక్కువ కూలీలకే పనులకు వచ్చేవారు. వరుస లాక్డౌన్లు, కోవిడ్ నిబంధనల కారణంగా తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిన లేబర్‌లో చాలా మంది అక్కడే ఉండి పోయారు. దీంతో పని ప్రదేశాల్లో కూలీల కొరత ఏర్పడింది. డబుల్ కూలీ ఇస్తే తప్ప లేబర్ దొరికే పరిస్థితి లేదంటున్నారు డెవలపర్స్. 30 శాతం పెరుగుతాయి కోవిడ్ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. మరోవైపు క్రమంగా నిర్మాణ రంగం కూడా గాడిన పడుతోంది. ధీర్ఘకాలం పాటు మధ్యలో ఆగిపోయిన భవనాల్లో తిరిగి పనులు ప్రారంభం అవుతున్నాయి. ప్రస్తుతం అపార్ట్మెంట్ల ధరలు పెరిగిన మాట వాస్తవమేని, అయినా సరే ఇప్పుడు ఇళ్లు కొనడమే మంచిందని, పెరిగిన ముడి పదార్థాల ధరల వల్ల రాబోయే రోజుల్లో ఇళ్ల ధరలు కనీసం 30 శాతం వరకు పెరగవచ్చని క్రెడాయ్ ప్రతినిధులు అంటున్నారు. స్టీలు ధరల పెరుగుదల (టన్ను ధర ) స్టీలు సైజు 2020 ఫిబ్రవరి 2021 ఆగస్టు 8 ఎంఎం రూ.42,000 రూ.57,000 10 ఎంఎం రూ. 41,000 రూ.56,000 12 ఎంఎం రూ.40,5000 రూ 56,000 14 ఎంఎం రూ.41,000 రూ.56,000 16 ఎంఎం రూ.41,000 రూ. 56,000 -
ఉత్పత్తి ఉరకలెత్తేలా, రాష్ట్రానికి క్యూ కడుతున్న ఉక్కు కంపెనీలు
సాక్షి, అమరావతి: ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతం అవుతున్నాయి. రాష్ట్రంలో భారీ ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థలతో పాటు దేశీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)తో పాటు చిన్నాచితకా కలిపి మొత్తం 33 ఉక్కు తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఏటా 8.4 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి వున్నాయి. ఇందులో ఆర్ఐఎన్ఎల్ ఒక్కటే 6.3 మిలిమిన్ టన్నుల సామర్థ్యంతో ఉంటే మిలిగిన 32 కంపెనీలు 2.1 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం ద్వారా ఉక్కు ఉత్పత్తిలో దేశంలోనే ఐదో స్థానంలో ఉన్న ఏపీని మూడవ స్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రస్తుతం ఉక్కు ఉత్పత్తిలో మొదటి నాలుగు స్థానాల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. రాష్ట్రానికి కంపెనీల క్యూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కడప ఉక్కు ఫ్యాక్టరీలో భాగస్వామిగా చేరడానికి ఎస్సార్ స్టీల్ కంపెనీ ముందుకొచ్చింది. మూడు మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ యూనిట్ పనులను నవంబర్ నుంచి ప్రారంభించే విధంగా ఎస్సార్ స్టీల్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అలాగే నెల్లూరు జిల్లా కృష్ణపట్నం రేవుకు సమీపంలో రూ.7,500 కోట్ల పెట్టుబడితో 2.25 మిలియన్ టన్నుల ఉక్కు తయారీ యూనిట్ ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ కంపెనీ ముందుకు రాగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. మరోవైపు దక్షిణ కొరియా ఉక్కు దిగ్గజ కంపెనీ పోస్కో కూడా రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఆ కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే కృష్ణపట్నం వద్ద స్థలాలను పరిశీలించి వెళ్లారు. మరోవైపు హ్యుందాయ్ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ, గ్రీనె ట్క్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దేశంలో తయారవుతున్న వాహనాల్లో ఉపయోగించే 55 శాతం ఉక్కు దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉత్పత్తి అవుతుండటం, రాష్ట్రంలో సుదీర్ఘ సముద్ర తీరం, పోర్టులు ఉండటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు వంటి అంశాలు ఉక్కు దిగ్గజ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. -
గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్..! ఇకపై
న్యూ ఢిల్లీ: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..! ఇకపై గ్యాస్ ఎప్పుడు ఖాళీ అవుతుందనే విషయాన్ని తెలుసుకోవడం మరింత సులువుకానుంది. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్ల బరువు కూడా భారీగా తగ్గనుంది. తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) కొత్తగా స్మార్ట్ ఎల్పీజీ సిలిండర్లను విడుదల చేసింది. వీటిని ఇండానే కాంపోజిట్ సిలిండర్లుగా పిలువనున్నారు. ఈ కొత్త స్మార్ట్ సిలిండర్లతో కస్టమర్లు తమ తదుపరి రీఫిల్‌ను ఎప్పుడు బుక్ చేయాలనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చును. ప్రస్తుతం ఐఓసీఎల్ విడుదల చేసిన స్మార్ట్ సిలిండర్లతో గ్యాస్ ఎంత పరిమాణం ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చును. సాధారణంగా గ్యాస్ సిలిండర్లు స్టీల్‌తో చేస్తారు. కాగా ఐఓసీఎల్ రిలీజ్ చేసిన స్మార్ట్ సిలిండర్లను హై-డెన్సిటీ పాలిథిలిన్(హెచ్డీపీఈ)తో తయారుచేశారు. ఈ సిలిండర్లు మూడు లేయర్ల నిర్మాణాన్ని కల్గి ఉంది.ఈ నిర్మాణంతో స్టీల్ సిలిండర్లు మాదిరి స్మార్ట్ సిలిండర్లు ధృడంగా ఉంటాయని తెలుస్తోంది. ఇండానే కాంపోజిట్ సిలిండర్ ప్రత్యేకతలు ►నార్మల్ సిలిండర్ల కంటే ఈ సిలిండర్లు తేలికైనవి. ప్రస్తుతం ఉన్న సిలిండర్లలో సగానికిపైగా బరువు తగ్గనుంది. ►ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉంచుతుంది. ►వినియోగదారులు సులభంగా రీఫిల్ చేసుకునేందుకు సహాయపడుతుంది. ►స్టీల్ సిలిండర్లు వినియోగించే కొద్దీ అవి తుప్పు పడతుంటాయి. కానీ ఈ సిలిండర్‌కు అలాంటి సమస్యలు ఉండవు. ►మూస పద్దతిలో కాకుండా ట్రెండ్‌కు తగ్గట్లు ఆధునిక పద్దతుల్లో దీన్ని డిజైన్ చేశారు. ►ప్రస్తుతం, ఈ స్మార్ట్ సిలిండర్లు న్యూఢిల్లీ, గుర్గావ్, హైదరాబాద్, ఫరీదాబాద్, లూధియానాలలో అందుబాటులో ఉన్నాయి. ►వినియోగదారుల సౌకర్యం కోసం 5 కిలోల నుంచి 10 కిలోల పరిమాణాల్లో అందుబాటులో ఉన్నాయి. ►ఈ సిలిండర్లు త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని ఐఓసిఎల్ ప్రకటించింది. ►మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మీరు ప్రస్తుతం ఉన్న ఎల్పిజి స్టీల్ సిలిండర్లకు బదులు ఈ స్మార్ట్ సిలిండర్లను మార్చుకునే సౌకర్యం ఉంది. ►ఇందుకోసం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ లేని ఈ సిలిండర్లకు సెక్యూరిటీ డిపాజిట్ కింద 10 కిలోల బరువు సిలిండర్ కు రూ .3350, 5 కిలోల బరువున్న సిలిండర్‌కు రూ .2150 చెల్లించాల్సి ఉంటుంది. -
ఎంపీ విజయసాయిరెడ్డితో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ భేటీ
-
రూ.11,606 కోట్లతో వైఎస్సార్ స్టీల్ పరిశ్రమ
సాక్షి, అమరావతి: రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నమైన ఉక్కు పరిశ్రమను సాకారం చేసే పనుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలంలో సర్కార్ సొంతంగా వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ పేరిట నిర్మిస్తున్న ఉక్కు కర్మాగారంలో భాగస్వామ్య కంపెనీగా ఎస్సార్ స్టీల్ ఎంపికైంది. సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,148.68 ఎకరాల్లో రూ.11,606 కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ఎస్సార్ స్టీల్ చేసిన ప్రతిపాదనకు తాజాగా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్లో భాగస్వామి ఎంపిక కోసం ప్రభుత్వం టెండర్లు పిలవగా సాంకేతిక అంశాలు పరిశీలించాక లిబర్టీ స్టీల్‌ను ఎస్బీఐ క్యాప్ ఎంపిక చేసింది. అయితే లిబర్టీ స్టీల్‌కు ఆర్థిక వనరులను సమకూర్చే మాతృ సంస్థ జీఎఫ్జీ అలయన్స్ బ్రిటన్‌లో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందనే వార్తలు రావడంతో రెండో స్థానంలో ఉన్న ఎస్సార్ స్టీల్‌ను ఎంచుకుంది. ఈ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వానికి 85 శాతం వాటా ఏడాదికి మొత్తం 30 లక్షల టన్నుల సామర్థ్యంతో వివిధ ఉక్కు ఉత్పత్తుల తయారీకి ఎస్సార్ స్టీల్ ముందుకొచ్చింది. ఇందుకు మొత్తం రూ.11,606 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసింది. ఈ భాగస్వామ్య కంపెనీలో రాష్ట్ర ప్రభుత్వం 85 శాతం, ఎస్సార్ స్టీల్ 15 శాతం వాటాలు కలిగి ఉంటాయి. ఈ భాగస్వామ్య కంపెనీ ఏర్పాటుకు మొత్తం రూ.4,062 కోట్ల ప్రారంభ మూలధనం అవసరమవుతుందని అంచనా వేయగా.. ఇందులో ఎస్సార్ స్టీల్ రూ.609 కోట్ల సమకూరుస్తుంది. వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.3,000 కోట్లపైన పెట్టుబడి పెట్టనుంది. 2024 మార్చి నాటికి ఉత్పత్తి ప్రారంభం.. తొలి దశలో ఏడాదికి కనీసం పది లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మార్చి 31, 2024కి ఉత్పత్తిని ప్రారంభించాలి. తొలిదశలో 3,150 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని ఎస్సార్ స్టీల్ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ స్టీల్ ప్లాంట్‌కు అనుబంధంగా ఏర్పాటయ్యే అనేక యూనిట్లు, ఇతర కార్యకలాపాల ద్వారా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. దీనికి ఒప్పందం కుదిరి ఎస్సార్ స్టీల్ పనులు ప్రారంభించేలోగా రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లతో ఇతర మౌలిక వసతులు కల్పించనుంది. ఉత్పత్తిని ప్రారంభించే నాటికి భాగస్వామ్య కంపెనీలో మెజార్టీ వాటా అంటే 51 శాతం వాటాను ఎస్సార్ స్టీల్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉత్పత్తి ప్రారంభమైన ఏడేళ్లలోపు రాష్ట్ర ప్రభుత్వం తన పూర్తి వాటాను విక్రయించే విధంగా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఉత్పత్తి మొదలయ్యాక ఏడేళ్లపాటు రాష్ట్ర పెట్టుబడులకు 8.7 శాతం చొప్పున రాబడి రావచ్చని ఎస్బీఐ క్యాప్ అంతర్గత అంచనా వేసింది. -
ఈ 3 చిన్న షేర్లూ యమస్పీడ్
మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్పప్పటికీ ఈ చిన్న తరహా కౌంటర్లకు మాత్రం డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఐటీ సేవల కంపెనీ బిర్లాసాఫ్ట్ లిమిటెడ్, ఆటో విడిభాగాల సంస్థ స్టీల్ స్ట్రిప్స్ వీల్స్, సాఫ్ట్వేర్ సేవల కంపెనీ రామ్‌కో సిస్టమ్స్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. బిర్లాసాఫ్ట్ డిజిటల్ సోల్యూషన్స్ అందించేందుకు గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ ఇన్నోవియోతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు బిర్లాసాఫ్ట్ పేర్కొంది. యూఎస్, యూరోపియన్ మార్కెట్లలో పలు బీమా రంగ దిగ్గజాలకు ఇన్నోవియో టెక్నాలజీ సొల్యూషన్స్ అందిస్తున్నట్లు తెలియజేసింది. నోకోడ్ ప్లాట్‌ఫామ్ విభాగంలో కంపెనీకున్న నైపుణ్యం బిర్లాసాఫ్ట్కు ఎంతో ప్రయోజనకరమని కంపెనీ ఎస్వీపీ శిల్పా భండారీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బిర్లాసాఫ్ట్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 7 శాతం జంప్‌చేసి రూ. 98 వద్ద ట్రేడవుతోంది. రామ్‌కో సిస్టమ్స్ ఏవియేషన్ రంగ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్‌కు పేరొందిన రామ్‌కో సిస్టమ్స్.. యూఎస్ కంపెనీ టాక్టికల్ ఎయిర్ సపోర్ట్ నుంచి ఆర్డర్ పొందినట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా ఏవియేషన్ ఎంఆర్వో సూట్ V5.8ను టాక్టికల్ కోసం వినియోగించనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో రామ్‌కో సిస్టమ్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 114 సమీపంలో ఫ్రీజయ్యింది. స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ యూరోపియన్ మార్కెట్ నుంచి తొలిసారి అలాయ్ వీల్స్ సరఫరాకు కాంట్రాక్టును సంపాదించినట్లు స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ తాజాగా పేర్కొంది. మెహసనా ప్లాంటు నుంచి వీటిని సరఫరా చేయనున్నట్లు తెలియజేసింది. తద్వారా యూఎస్, ఈయూ మార్కెట్లకు 3100 సీవీ వీల్స్‌ను ఎగుమతి చేయనున్నట్లు తెలియజేసింది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో స్టీల్ స్ట్రిప్స్ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 457 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 468 వరకూ ఎగసింది. -
స్టీల్ స్ట్రిప్స్ వీల్స్- గుజరాత్ గ్యాస్ స్పీడ్
స్టీల్ వీల్స్ కోసం యూఎస్ మార్కెట్ల నుంచి తాజాగా ఎగుమతి ఆర్డర్ లభించినట్లు వెల్లడించడంతో స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. కాగా.. మరోపక్క పీఎన్జీఆర్బీ నుంచి రెండు కొత్త ప్రాంతాలకు లైసెన్సులను పొందినట్లు పేర్కొనడంతో గుజరాత్ గ్యాస్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ ప్రస్తుతం భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ ట్రక్ అండ్ కారవాన్ ట్రైలర్ మార్కెట్ నుంచి సరికొత్త ఎగుమతి ఆర్డర్ లభించినట్లు స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ తాజాగా పేర్కొంది. ఆర్డర్లో భాగంగా 14,000 స్టీల్ వీల్స్‌ను సరఫరా చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. వచ్చే రెండు నెలల్లో చెన్పై ప్లాంటు నుంచి వీటిని ఎగుమతి చేయనున్నట్లు తెలియజేసింది. తద్వారా 3.15 లక్షల డాలర్ల(సుమారు రూ. 2.4 కోట్లు) ఆదాయం లభించే వీలున్నట్లు వెల్లడించింది. ఈ బాటలో ఇకపై మరిన్ని ఆర్డర్లు లభించే వీలున్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ షేరు ఎన్ఎస్ఈలో 6.25 శాతం జంప్‌చేసి రూ. 446 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 457 వరకూ దూసుకెళ్లింది. గత నెల రోజుల్లో ఈ షేరు 31 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! గుజరాత్ గ్యాస్ తాజాగా పెట్రోలియం, సహజవాయు నియంత్రణబోర్డు(పీఎన్జీఆర్బీ)నుంచి రెండు ప్రాంతాలకు లైసెన్సులు పొందినట్లు గుజరాత్ గ్యాస్ వెల్లడించింది. పంజాబ్‌లోని అమృత్సర్, భటిండా జిల్లాలకు గ్యాస్ సరఫరా హక్కులను పొందినట్లు పేర్కొంది. తద్వారా సిటీ గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌ను ఇక్కడ ఏర్పాటు చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఇందుకు ముందుగా నిధుల సమీకరణ వివరాలతోపాటు.. గ్యాస్ సరఫరా ఒప్పందాలు తదితరాలను పీఎన్‌జీఆర్‌బీకి దాఖలు చేయవలసి ఉన్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో గుజరాత్ గ్యాస్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 3.3 శాతం లాభపడి రూ. 319 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 324ను అధిగమించడం ద్వారా సరికొత్త గరిష్టానికి చేరింది. కాగా.. గత నెల రోజుల్లో ఈ షేరు 35 శాతం లాభపడటం విశేషం! -
స్టీల్ ఉత్పత్తులపై యాంటీడంపింగ్ డ్యూటీ..?
విదేశాల నుంచి భారత్‌లోకి దిగుమతయ్యే స్టీల్ ఉత్పత్తులపై యాంటీడంపింగ్ డ్యూటీ విధించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేశీయ స్టీల్ ఉత్పత్తిదారులను ఆదుకునే చర్యల్లో భాగంగా యూరప్, జపాన్, అమెరికా, కొరియా దేశాల నుంచి దిగుమతి అవుతున్న స్టీల్ ఉత్పత్తులపై 5ఏళ్ల పాటు ఈ డ్యూటీని విధించనుంది. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ దేశాల నుంచి దిగుమతయ్యే స్టీల్ ఉత్పత్తులపై టన్నుకు 222డాలర్ల నుంచి 334 డాలర్ల పరిధిలో యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. అలాగే నాణ్యత ఆధారంగా ఉత్పత్తులకు డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్‌ను తిరస్కరించింది. యూరప్, జపాన్, అమెరికా, కొరియా దేశాల నుంచి భారత్‌లోకి సగటు ధర కంటే తక్కువ విలువలో స్టీల్ ఉత్పత్తులు దిగుమతి అవుతుండటంతో యాంటీ డంపింగ్ డ్యూటీ విధించేందుకు వాణిజ్య శాఖ సిపార్సు చేసింది. తక్కువ ధరల్లో స్టీల్ ఉత్పత్తుల దిగుమతుల కారణంగా దేశీయ స్టీల్ పరిశ్రమ నష్టాలను ఎదుర్కోందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్) నివేదికలో తెలిపింది. యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే..? ఇతర దేశాల నుంచి ఏదైనా సరుకు లేదా వస్తువులను మన మార్కెట్ లో లభించే ధర కంటే తక్కువ ధరకు దిగుమతి చేస్తే వాటిపై విధించే టారిఫ్‌ను యాంటీ డంపింగ్ డ్యూటీ అంటారు. సాధారణంగా స్వదేశీ వ్యాపారాన్ని రక్షించేందుకు చాలా దేశాలు ఈ రకమైన టారీఫ్ విధిస్తుంటాయి. -
స్టీల్ బ్యాంక్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు
-
స్టీల్ దిగుమతులపై..డ్యూటీ గడువు పెంపు
కొన్ని రకాల స్టిల్ ఉత్పత్తులపై యాంటి డంపింగ్ డ్యూటీ గడువును ప్రభుత్వం పొడిగించింది. చైనా, మలేషియా, కొరియా దేశాల నుంచి దిగుమతయ్యే స్టీల్ ఉత్పత్తులపై విధించే యాంటి డంపింగ్ డ్యూటీ గడువును డిసెంబర్ 4వరకు పొడిగిస్తున్నట్లు ఈ మేరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. చైనా, మలేషియా, కొరియా దేశాల నుంచి అతితక్కువ ధరకు ఇండియాలో దిగుమతయ్యే స్టీల్ ఉత్పత్తులను నియంత్రించేందుకు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఐదేళ్ల కాలపరిమితితో 2015 జూన్ 5న యాంటీ డంపింగ్ డ్యూటినీ దేశీయంగా అమల్లోకి తెచ్చింది.ఈ జూన్ 5(రేపటి)తో ఈ గడువు ముగియనుండడంతో ఈ ఏడాది డిసెంబర్ 4 వరకు దీనిని పొడిగించింది. ముఖ్యంగా స్టెయిన్లెస్ స్టీల్ 304 సిరీస్‌కు ఈ డ్యూటీ వర్తిస్తుంది. ఒక్కో టన్నుకు 180-316 డాలర్ల మధ్య యాంటి డంపింగ్ డ్యూటీ విధిస్తారు. వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్(డీజీటీఆర్) మలేషియా, చైనా, కొరియ దేశాలపై యాంటీ డంపింగ్ గడువును మరో 6 నెలలపాటు పెంచమని కోరడంతో..ఆర్థిక మంత్రిత్వశాఖ దీనిని ఆమోదించి గడువును పొడిగించింది. ఇతర దేశాల నుంచి అతి తక్కువ ధరల్లో ఉత్పత్తులు మన దేశంలోకి దిగుమతి అవ్వడం వల్ల దేశీయ పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. దీంతో ప్రపంచ వాణిజ్య సంస్థ( డబ్ల్యూటీఓ) నిబంధనలకనుగుణంగా దిగుమతులను కొంతమేర నియంత్రించేందుకు యాంటీ డంపింగ్ డ్యూటీని అమలు చేస్తున్నారు. -
కాంక్రీట్ వద్దు.. స్టీల్
వాషింగ్టన్: అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణంపై మొండిగా వ్యవహరిస్తున్న అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెత్తబడ్డారు. అక్రమ వలసదారుల్ని అడ్డుకునేందుకు సరిహద్దులో కాంక్రీట్ గోడ కాకపోయినా స్టీల్‌తో గోడలాంటి నిర్మాణాన్ని చేపట్టాలని వ్యాఖ్యానించారు. అక్రమవలసదారుల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రంగా నష్టం జరుగుతోందని వాపోయారు. స్టీల్ గోడలాంటి నిర్మాణంపై చర్చించేందుకు అమెరికా ఉక్కు పరిశ్రమ సంఘం అధ్యక్షుడితో పాటు ముఖ్యులతో సమావేశమవుతానని తెలిపారు. గోడ కారణంగా అక్రమ వలసలతో పాటు మాదకద్రవ్యాల సరఫరాను అడ్డుకోవచ్చనీ, తద్వారా నేరాలు తగ్గుముఖం పడతాయని వెల్లడించారు. ఆదివారం వైట్‌హౌస్ నుంచి క్యాంప్ డేవిడ్‌కు బయలుదేరిన సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. దాదాపు 3 వారాలుగా కొనసాగుతున్న షట్‌డౌన్ సుదీర్ఘకాలం కొనసాగుతుందని ట్రంప్ పునరుద్ఘాటించారు. గోడ నిర్మాణం విషయమై ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ, మైనారిటీ నేతల చక్ కలిసివస్తే 20 నిమిషాల్లో సమస్య పరిష్కారమైపోతుందని స్పష్టం చేశారు. షట్డౌన్కు వీరిద్దరే కారణమని ఆరోపించారు. -
స్టీల్ వినియోగంలో 7 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ: దేశీయ స్టీల్ వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతోపాటు 2019–20లోనూ 7 శాతానికి పైగా పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టడమే దీనికి కారణమని పేర్కొంది. ముఖ్యంగా అందుబాటు ధరల్లో ఇళ్లు, విద్యుత్ పంపిణీ, రైల్వేలకు 2018–19 బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చినందున, మధ్య కాలంలో దేశీయంగా స్టీల్ వినియోగ వృద్ధి సానుకూలంగా ఉంటుందని, దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి నమోదవడమే కాకుండా, రానున్న ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే స్థాయిలో వృద్ధికి అవకాశం ఉంటుందని ఇక్రా అంచనా వేసింది. డిమాండ్ ఆశాజనకంగానే ఉన్నప్పటికీ... దేశీయ స్టీల్ పరిశ్రమ ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.5– 3 శాతం మధ్యే ఉండొచ్చని, చౌక దిగుమతులే ఇందుకు కారణమని పేర్కొంది. చైనా స్టీల్ డిమాండ్ మితంగానే ఉండడం, అధిక సరఫరా పరిస్థితులు సమీప కాలంలో ఈ రంగానికి సవాళ్లని అంచనా వేసింది. మరీ ముఖ్యంగా, అంతర్జాతీయ మార్కెట్లో స్టీల్ ధరలు గణనీయంగా తగ్గడంతో దిగుమతులు చౌకగా మారాయని, ఈ రకమైన దిగుమతులు దేశీయ మార్కెట్‌కు చేరడం మొదలైతే దేశీయంగా ధరలపై అధిక ఒత్తిడి ఉంటుందని పేర్కొంది. -
ఆర్సెలర్ మిట్టల్ చేతికి ఎస్సార్ స్టీల్ !
న్యూఢిల్లీ: రుణ భారంతో కుదేలైన ఎస్సార్ స్టీల్ టేకోవర్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆర్సెలర్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ అండ్ సుమిటొమో మెటల్ కార్పొరేషన్ల కన్సార్షియమ్ ఎస్సార్ స్టీల్ కంపెనీని టేకోవర్ చేయనున్నది. ఎస్సార్ స్టీల్ కంపెనీ 30కు పైగా బ్యాంక్‌లకు రూ.45,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ నడుస్తోంది. ఎస్సార్ స్టీల్‌ను చేజిక్కించుకోవడానికి రష్యాకు చెందిన వీటీబీ గ్రూప్‌కు చెందిన న్యూమెటల్ కంపెనీ కూడా పోటీ పడింది. న్యూమెటల్ కంపెనీ రూ.37,000 కోట్లు ఆఫర్ చేయగా, ఆర్సెలర్ మిట్టల్ కన్సార్షియమ్ రూ.42,000 కోట్లు ఆఫర్ చేసింది. మరోవైపు భూషణ్ స్టీల్‌ను కొనుగోలు చేయడానికి జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు కూడా సీసీఐ ఆమోదం తెలిపింది. -
రూపాయి క్షీణత.. స్టీల్‌కు మంచి రోజులు
ముంబై: పడుతున్న రూపాయి దేశీయ స్టీల్ రంగానికి లాభం చేకూర్చనుంది. రానున్న నెలల్లో ఎగుమతుల వృద్ధికి దోహదపడుతుందని, అదే సమయంలో దిగుమతుల ధరలు పెరగడం వల్ల దేశీయ ఉత్పత్తుల ధరలకు ఊతం లభిస్తుందని, దీంతో మొత్తం మీద దేశ స్టీల్ వాణిజ్య లోటు తగ్గిపోతుందని ఇక్రా తన నివేదికలో పేర్కొంది. రూపాయి డాలర్‌తో 71.75కు క్షీణించిన విషయం తెలిసిందే. ‘‘2018–19 మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో స్టీల్ ఎగమతులు 33 శాతం క్షీణించాయి. అదే సమయంలో దిగుమతులు 11 శాతం పెరిగాయి. దీంతో గత రెండు సంవత్సరాలుగా ఎగుమతి దేశంగా ఉన్న భారత్, నికరంగా స్టీల్ దిగుమతిదారుగా మారింది. సీజన్ వారీగా రెండో క్వార్టర్లో వినియోగం బలహీనంగా ఉండే అవకాశం ఉంది. అయితే, మౌలిక రంగంపై ప్రభుత్వ వ్యయాలు పెరుగుతుండడం, పంటలకు కనీస మద్దతు ధరల నేపథ్యంలో గ్రామీణ డిమాండ్ మెరుగుపడతుందన్న అంచనాలతో రానున్న నెలల్లో స్టీల్ వినియోగం పెరుగుతుందని అంచనా వేస్తున్నాం’’ అని ఇక్రా తెలిపింది. -
సుగ్న మెటల్స్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టీల్ రంగంలో ఉన్న సుగ్న మెటల్స్ ఏడాదిలో కొత్త ప్లాంటును ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌కు దగ్గరలోని పరిగి వద్ద రూ.30 కోట్లతో నెలకు 10,000 టన్నుల సామర్థ్యంతో టీఎంటీ బార్స్ తయారీ ప్లాంటును నెలకొల్పుతోంది. ఏడాదిలో ఇది కార్యరూపంలోకి వస్తుం దని సంస్థ ఎండీ భరత్ కుమార్ అగర్వాల్ తెలిపారు. టర్బో ఎఫ్ఈ 550 పేరుతో నూతన రకం స్టీల్ బార్స్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. పరిగి వద్ద ఇప్పటికే కంపెనీకి నెలకు 15,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల థెర్మో మెకానికల్లీ ట్రీటెడ్ (టీఎంటీ) బార్స్ తయారీ యూనిట్‌తోపాటు 18,000 టన్నుల బిల్లెట్ల ఉత్పత్తి కేంద్రం ఉంది. ఇప్పటి దాకా రూ.100 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. సంస్థలో 600 మంది ఉద్యోగులు ఉన్నారు. కొత్త యూనిట్‌తో ఈ సంఖ్య 700లకు చేరనుంది. కాగా గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.460 కోట్ల టర్నోవర్ నమోదయ్యిందని డైరెక్టర్ ముదిత్ సొంథాలియా తెలిపారు. -
ఉక్కు రంగానికి దివాలా జోష్
న్యూఢిల్లీ: ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ).. భారత ఉక్కు రంగంలో ఏకీకరణను వేగవంతం చేస్తోందని ఎర్నస్ట్ అండ్ యంగ్(ఈవై) తాజా నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా భారత ఉక్కు రంగంలోకి ప్రవేశించడానికి పలు అడ్డంకులు ఎదుర్కొంటున్న విదేశీ కంపెనీలకు మార్గం సుగమం అవుతోందని ఈ నివేదిక పేర్కొంది. ఇక్కడ జరిగిన ఇండియా మినరల్స్ అండ్ మెటల్స్ ఫోరమ్ సమావేశంలో ఈవై పార్ట్నర్, ఉక్కు రంగానికి చెందిన అంజనీ అగర్వాల్ ఈ నివేదిక వివరాలను వెల్లడించారు. భారత ఉక్కు రంగంపై ఐబీసీ ప్రభావం, సంబంధిత అంశాలపై ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు... ►దివాలా ప్రక్రియ కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు వస్తున్న కేసుల్లో అధిక భాగం ఉక్కు రంగానికి చెందినవే ఉన్నాయి. ► కొత్త దివాలా చట్టం కారణంగా దివాలా ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఫలితంగా ఉక్కు రంగంలో సమూల మార్పులు రానున్నాయి. ► దివాలా తీసిన కంపెనీల రుణ భార సమస్య ఐబీసీ కారణంగా వేగవంతంగా పరిష్కారమవుతుంది. కొద్దో, గొప్పో ఉన్న రుణం రెన్యువల్ కావడం సులభమవుతుంది. ►దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న కంపెనీలను కొనుగోలు చేయడానికి పోటీ తీవ్రంగా ఉండటంతో ఆ కంపెనీలకు మంచి విలువే దక్కనున్నది. ►భారత్‌లో భవిష్యత్ డిమాండ్‌కు తగ్గట్లుగా ఉత్పత్తుల తయారీకి అనువుగా పలు కంపెనీలు ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. దీనికి కావలసిన భారీ పెట్టుబడులను బ్యాంకింగ్ రంగం సమకూర్చగలదు. ►ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉక్కు రంగంలో ఏకీకరణ జోరుగా సాగుతోంది. ఇది భారత్‌పై ఇంకా ప్రభావం చూపలేదు. అయితే ఐబీసీ కారణంగా భారత్‌లో కూడా ఉక్కు రంగంలో ఏకీకరణ మరింత వేగవంతం కానున్నది. ఇప్పటికే టాటా స్టీల్ ఒక కంపెనీని, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ మరొక కంపెనీని కొనుగోలు చేయడం దీనికి నిదర్శనం. ►ఏడాదిలోపు దివాలా ప్రక్రియ కిందకు మరిన్ని కంపెనీలు రానున్నాయి. ► పునర్వ్యవస్థీకరణ అనంతరం ఏర్పడే కంపెనీల కారణంగా బలమైన లోహ పరిశ్రమ భారత్‌లో నెలకొంటుంది. ► ఈ రంగంలో ఇప్పటికే బలంగా ఉన్న కంపెనీలు తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాయి. మరో వైపు ఇతర రంగాల్లోని కంపెనీలు కొత్తగా ఈ రంగంలోకి వస్తుండటంతో ఈ రంగం విస్తృతి మరింతగా పెరగనున్నది. ►దేశంలో గవర్నెన్స్ ప్రమాణాలు ముఖ్యంగా లోహ, ఉక్కు రంగాల్లో మరింతగా మెరుగుపడనున్నాయి. ► ఉక్కు రంగానికి సంబంధించి భారత్‌లో అపార అవకాశాలు ఉండటంతో దీర్ఘకాలంలో డిమాండ్‌కు ఢోకా ఉండదని పలు కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఆ కంపెనీలు వెనకాడ్డం లేదు. ► మౌలిక రంగంపై ప్రభుత్వం దృష్టి పెడుతుండటంతో ఏడాదికి 30 కోట్ల టన్నుల ఉక్కు వినియోగించాలన్న లక్ష్యం సాకారం కానున్నది. -
టన్ను స్టీల్‌పై రూ.2,500 దాకా ఆదా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టీల్ రంగంలో భారత్‌లో తొలి అగ్రిగేటర్ అయిన స్టీల్ ఆన్ కాల్ సర్వీసెస్ తన కస్టమర్లకు త్వరితగతిన సరుకు చేర్చేందుకు భారీ గిడ్డంగులను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్, వైజాగ్, అమరావతి, బెంగళూరు, చెన్నై, కొచ్చిలో ఇవి రానున్నాయి. వీటి కోసం రూ.150–200 కోట్లు ఖర్చు చేస్తామని స్టీల్ ఆన్ కాల్ సీఎండీ ఎ.రవికుమార్ తెలిపారు. సీఈవో లక్ష్మి, సీఎంవో ఈశ్వరయ్యతో కలిసి ఆయన మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 2016 ఏప్రిల్‌లో కంపెనీ ప్రారంభం అయిందని, ఈ ఏడాది దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు. లైవ్ ప్రైస్ ద్వారా కస్టమర్లకు 20 బ్రాండ్ల స్టీల్ విక్రయిస్తున్నామని తెలిపారు. తమ ప్లాట్‌ఫామ్ ద్వారా ఒక టన్నుపై వినియోగదార్లకు రవాణా, ఇతర ఖర్చులు రూ.2,500 దాకా ఆదా అవుతుందని వెల్లడించారు. ఇందుకు కనీసం ఒక టన్ను ఆర్డరు చేయాల్సి ఉంటుందన్నారు. 2017–18లో కంపెనీ రూ.76 కోట్ల టర్నోవర్ సాధించింది. -
ట్రంప్ ‘సుంకం’ షాక్..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... మొత్తానికి అన్నంత పనీ చేశారు. అమెరికాలోని ఉద్యోగాలను, ఎకానమీని కాపాడే పేరిట వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచ దేశాలను నిత్యం టెన్షన్ పెడుతున్న ట్రంప్ తాజాగా ఉక్కు, అల్యూమినియంలపై దిగుమతి సుంకాలు విధించారు. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు శుక్రవారం ఆమోదముద్ర వేశారు. తద్వారా అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాల భయాలకు ఆజ్యం పోశారు. ట్రంప్ ప్రస్తుత నిర్ణయంతో... ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం మేర దిగుమతి సుంకాలు 15 రోజుల్లో అమల్లోకి వస్తాయి. అయితే, పొరుగుదేశాలైన మెక్సికో, కెనడాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. మిగతా దేశాలు కూడా మినహాయింపులు కావాలనుకుంటే అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధులతో (యూఎస్టీఆర్) చర్చల ద్వారా సాధించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ట్రంప్ నిర్ణయంపై అమెరికాలో మిశ్రమ స్పందన వ్యక్తం కాగా.. కీలక వ్యాపార భాగస్వామ్య దేశాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాయి. ఉక్కు, అల్యూమినియం పరిశ్రమలు రెండూ.. దేశ భద్రతకు సైతం కీలకమైనవని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘ఉక్కు ఉక్కే. దీనికి తిరుగులేదు. ఉక్కు లేకుంటే దేశం లేదు. అనేక సంవత్సరాలుగా మన పరిశ్రమలను మిగతా దేశాలు టార్గెట్ చేశాయి. నిజానికి దశాబ్దాలుగా పాటిస్తూ వస్తున్న అనుచిత విదేశీ వాణిజ్య విధానాల వల్ల మన ప్లాంట్లు మూతపడ్డాయి. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని వర్గాలు పూర్తిగా అణగారిపోయాయి. ఇకపై ఇలాంటివన్నీ ఆగిపోతాయి‘ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉక్కు, అల్యూమినియంపై సుంకాల విధించడం ద్వారా అమెరికా భద్రతను కూడా కాపాడుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. అమెరికాలో ఉక్కు, అల్యూమినియం రంగంలో పెరుగుతున్న సంక్షోభం గురించి వాణిజ్య శాఖ తొమ్మిది నెలలుగా అధ్యయనం చేసిన మీదట ఈ నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. అమెరికా ప్రయోజనాల కోసమే.. అమెరికా ఉద్యోగులు, కంపెనీల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెప్పారు. అమెరికాలో తయారు చేసే ఉత్పత్తులపై పన్నులు ఉండవని.. ఒకవేళ ఇతర దేశాల కంపెనీలేవైనా ఆ ప్రయోజనాలు పొందదల్చుకుంటే, అమెరికాలోనే ప్లాంటు పెట్టి పొందవచ్చని తెలియజేశారు. ‘మన నౌకలు, మన విమానాలు.. మన యుద్ధ పరికరాలు మొదలైన వాటన్నింటినీ మన దేశంలో తయారైన ఉక్కు, అల్యూమినియంతోనే ఉత్పత్తి చేద్దాం. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సమస్య పరిష్కారానికి ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకుంటున్నాం‘ అని ట్రంప్ పేర్కొనారు. కాగా అమెరికాలోనే దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొని వర్గాలు అమెరికాకు ప్రయోజనకరమైన చరిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించగా... మరికొన్ని వర్గాలు ఈ నిర్ణయం దేశ ఎకానమీని దెబ్బతీస్తుందని, వాణిజ్య యుద్ధాలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. భారత్ ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రతికూలం.. సుంకాల వల్ల భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఇంజనీరింగ్ ఉత్పత్తులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఈఈపీసీ) చైర్మన్ రవి సెహ్గల్ తెలిపారు. అమెరికా బాటలోనే చైనా, యూరప్ కూడా రక్షణాత్మక చర్యలకు దిగితే భారత ఎగుమతులు మరింతగా దెబ్బతింటాయన్నారు. అమెరికా దిగుమతి చేసుకునే మొత్తం ఉక్కులో భారత్ వాటా 1.28 శాతంగా, అల్యూమినియం దిగుమతుల్లో 1.12 శాతంగా ఉంది. చైనా, ఈయూ అభ్యంతరాలు.. దిగుమతి సుంకాల విధింపుపై చైనాతో పాటు యూరోపియన్ యూనియన్‌లోని అమెరికా వ్యాపార భాగస్వామ్య దేశాలు తీవ్రంగా స్పందించాయి. ఇది ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించాయి. సుంకాల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చైనా పేర్కొనగా.. ఇరు దేశాల సంబంధాలపై ఇది పెను ప్రభావం చూపుతుందని జపాన్ వ్యాఖ్యానించింది. దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థలో (డబ్ల్యూటీవో) ఫిర్యాదు చేసే అవకాశం ఉందని దక్షిణ కొరియా వెల్లడించింది. మిగతా యూరోపియన్ యూనియన్ దేశాలతో కలిసి పరిణామాల ప్రభావాలపై చర్చించి, తగు నిర్ణయాలు తీసుకుంటామని ఫ్రాన్స్ పేర్కొంది. వాణిజ్య వివాదాలను పరిష్కరించుకునేందుకు టారిఫ్‌లు విధించడమనేది సరైన పద్ధతి కాదని బ్రిటన్ అభిప్రాయపడింది. రక్షణాత్మక ధోరణులు, టారిఫ్‌లు పనిచేయవని పేర్కొంది. సుంకాల పెంపునకు ప్రతీకారంగా చర్యలు తీసుకునేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని, అయితే చర్చలకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తామని యూరోపియన్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ జిర్కీ కెటైనెన్ తెలిపారు. అమెరికా నుంచి దిగుమతయ్యే ఏయే ఉత్పత్తులపై సుంకాలు విధించవచ్చన్న దానిపై బ్రసెల్స్ ఇప్పటికే ఒక జాబితా కూడా సిద్ధం చేసింది. భారత్‌కు హెచ్చరిక.. సుంకాల విధింపు విషయంలో పనిలో పనిగా చైనాతో పాటు భారత్‌కు కూడా హెచ్చరికల్లాంటివి చేశారు ట్రంప్. చైనా, భారత్ లాంటి దేశాలు విధించే సుంకాలకు, అమెరికా విధించే సుంకాలకూ వ్యత్యాసముంటే ఆ మేరకు మార్పులుంటాయన్నారు. ‘ఏదో ఒక దశలో ఈ తరహా విధానాన్ని కూడా తెస్తాం. ఉదాహరణకు మనమేమీ సుంకాలు విధించకుండానే.. చైనా 25 శాతమో.. భారత్ 75 శాతమో విధిస్తోందనుకుందాం. అలాంటప్పుడు మనమూ అదే స్థాయిలో సుంకాలు విధిస్తాం. వాళ్లు 50 శాతం వేస్తే.. మనమూ 50 శాతం విధిస్తాం‘ అని అధికారిక ప్రకటనలపై సంతకాలు చేయడానికి ముందు ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా మోటార్ సైకిల్స్ ముఖ్యంగా – హార్లే డేవిడ్సన్ బైకుల మీద భారత్ విధిస్తున్న సుంకాలు చాలా భారీగా ఉంటున్నాయని ట్రంప్ కొద్ది రోజుల క్రితమే ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మార్చి 20న భారత్ నిర్వహించబోయే డబ్ల్యూటీవో సదస్సుకు అమెరికా ప్రతినిధి రాబర్ట్ లైథిజర్ రాకపోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. -
ట్రంప్ నిర్ణయంతో తక్షణ ప్రమాదమేమీలేదు
సాక్షి, న్యూఢిల్లీ: స్టీల్ దిగుమతులపై అమెరికా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై భారత ప్రభుత్వం స్పందించింది. తక్షమే తమ ఎగుమతులపై ఎలాంటి ప్రభావం వుండదని ఉక్కు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అమెరికాకు మన ఎగుమతులు కేవలం 2 శాతం మాత్రమేననీ, ప్రస్తుతానికి ఎలాంటి భారం పడదని ఉక్కు శాఖ కార్యదర్శి అరుణ్ శర్మ చెప్పారు. అన్ని దేశాలు అమెరికా పద్ధతిని పాటిస్తే నిస్సందేహంగా అంతర్జాతీయ వాణిజ్య క్రమంలో తీవ్రప్రభావాన్ని చూపిస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్ యింగ్ శుక్రవారం వ్యాఖ్యానించారు. చైనా ఐరన్ అండ్ స్టీల్ అసోసియేషన్ వైస్-సెక్రటరీ జనరల్ లి జిన్ చాంగ్ మాట్లాడుతూ, చైనాపై ప్రభావం పెద్దగా ఉండదన్నారు. కాగా అమెరికా ప్రభుత్వం స్థానికి ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై భారీగా సుంకం విధించే యోచనలో ఉంది. చైనా, యూరోప్, పొరుగు దేశం కెనడా లాంటి ప్రధాన వాణిజ్య భాగస్వాముల స్టీల్ దిగుమతులపై భారీ సుంకం విధించనున్నామని ట్రంప్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా చైనాలాంటి దేశాలనుంచి గతకొన్ని దశాబ్దాలుగా అమెరికా స్టీల్ అల్యూమినియం కంపెనీలు అగౌరవానికి గురయ్యారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. అందుకే దేశరక్షణ కోసం గొప్ప గొప్ప స్టీల్ మేకర్స్, అల్యూమినియం మేకర్స్ తయారు కావాలన్నారు. అమెరికాలో ఉక్కు , అల్యూమినియం పరిశ్రమలను పునర్నిర్మిం చాలని ట్రంప్ పేర్కొన్నారు. -
‘డబుల్’ కు తక్కువ ధరకు స్టీల్
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ప్రారంభించినప్పుడు మార్కెట్లో స్టీల్ ధర టన్నుకు రూ.32,550.. ప్రస్తు తం అది రూ.53,100. ఇప్పుడు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ధర తగ్గించేందుకు స్టీల్ కంపెనీల కూటమి అంగీకరించి శుక్రవారం ఖరారు చేసిన ధర రూ.43,660. అం టే టన్నుపై ఆదా అవుతున్న మొత్తం రూ.9,440. ఇదే కసరత్తు డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ప్రారంభించిన సమయంలో చేసి ఉంటే దీనికి రెట్టింపు ఆదా ఉండేది. సకాలం లో అధికారులు స్పందించకపోవటం, నిర్ణయాలు వేగంగా తీసుకోకపోవటం, ప్రభు త్వం సమీక్షించకపోవటంతో స్టీల్ రూపంలో ఖజానాపై భారీ భారం పడనుంది. రూ.264 కోట్ల ఆదా.. డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూనిట్ కాస్ట్‌కు, ఇంటి డిజైన్‌కు పొంతన కుదరకపోవటంతో ఇళ్ల నిర్మా ణాన్ని చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఇసుకను ఉచితంగా సరఫ రా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయినా స్పందన లేకపోవటంతో సిమెంటు కంపెనీలతో చర్చించి ధర కొంతమేర తగ్గిం చింది. మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి రెండు పర్యాయాలు కంపెనీల ప్రతినిధులతో చర్చించడంతో ధర తగ్గించేందుకు అంగీకరించారు. శుక్రవారం మంత్రులతో జరిగిన చర్చల్లో ధర తగ్గించేందుకు అంగీకరించారు. గ్రామాల్లో లక్ష ఇళ్లకు 1.45 లక్షల టన్నులు, పట్టణాల్లో 60 వేల ఇళ్లకు 1.04 లక్షలు, జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లకు 2.78 లక్షల టన్నుల స్టీల్ అవసరమని అధికారులు తేల్చారు. సమావేశంలో గృహనిర్మాణ సంస్థ చైర్మన్ భూంరెడ్డి, ఎమ్మెల్సీ సుధాకరరెడ్డి, ఎమ్మెల్యే బాలరాజు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కలప.. ఉక్కు కంటే గట్టిగా..!
వాషింగ్టన్: ఉక్కు కంటే దృఢంగా, ఎక్కువ మన్నిక కలిగిన కలపను తయారుచేసే కొత్త విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ విధానంలో తయారుచేసిన కలప, సాధారణ కలప కంటే 12 రెట్లు దృఢంగా, పది రెట్లు ఎక్కువ మన్నికతో ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఉక్కు, టైటానియం మిశ్రమ లోహాలు, కార్బన్ ఫైబర్‌కు ప్రత్యామ్నాయంగా దీన్ని వాడవచ్చని వెల్లడించారు. కార్లు, విమానాలు, ఇళ్ల నిర్మాణంలోనూ వాడుకోవచ్చు. పరిశోధనలో భాగంగా తొలుత కలపను సోడియం హైడ్రాక్సైడ్, సోడియం సల్ఫైట్ కలిపిన ద్రావణంలో 7 గంటల పాటు ఉడికించారు. ఈ ప్రక్రియతో వృక్ష కణజాలంలోని సెల్యులోజ్పై ఎలాంటి ప్రభావం పడకపోగా, లిగ్నిన్ వంటి పాలిమర్లు వేరుపడ్డాయి. దీంతో కణజాలంలో ఖాళీస్థలం ఏర్పడిందన్నారు. అనంతరం ఈ కలపను 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఒకరోజు పాటు బలమైన ఒత్తిడితో నొక్కిపెట్టామన్నారు. దీంతో కలపలోని సెల్యులోజ్ కణజాలాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి దృఢమైన కలప తయారయిందన్నారు. -
ఇన్ఫ్రా పరుగులు...
• అక్టోబర్‌లో 6.6 శాతం • ఆరు నెలల గరిష్ట స్థారుుకి వృద్ధి • స్టీల్, రిఫైనరీ రంగాల మెరుగైన పనితీరు న్యూఢిల్లీ: మౌలిక రంగ వృద్ధి అక్టోబర్‌లో రికార్డు స్థారుుకి చేరుకుంది. గత ఆరు నెలల కాలంలోనే అత్యధికంగా అక్టోబర్‌లో 6.6 శాతంగా నమోదైంది. స్టీల్, రిఫైనరీ రంగాల అద్భుత పనితీరు ఈ స్థారుు వృద్ధికి తోడ్పడ్డారుు. మౌలికంలో భాగమైన విద్యుదుత్పత్తి, ఎరువుల ఉత్పత్తి, సిమెంట్ ఉత్పత్తి మాత్రం భారీగా పడిపోరుుంది. వరుసగా మూడో నెల కూడా బొగ్గు ఉత్పత్తి తగ్గింది. మౌలికంలో భాగమైన ఎనిమిది రంగాలు... బొగ్గు, ముడి చమురు, సహజవాయువు,, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుదుత్పత్తి వృద్ధి రేటు గతేడాది అక్టోబర్‌లో కేవలం 3.8 శాతంగానే ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 5 శాతంగా నమోదవగా.. తాజాగా అది 6.6 శాతానికి చేరుకుంది. దేశీయ పారిశ్రామిక ఉత్పత్తిలో మౌలిక రంగం వాటా 38 శాతం. ఈ రంగం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ కాలంలో 4.9 శాతం వృద్ధి చెందింది. గతేడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 2..8 శాతం మాత్రమే. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం గణాంకాలను విడుదల చేసింది. ⇔ అక్టోబర్‌లో స్టీల్ ఉత్పత్తి రెండంకెల స్థారుులో 16.9 శాతంగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో ఇది 5.5 శాతం. ⇔ రిఫైనరీ ప్రొడక్ట్స్ ఉత్పత్తి సైతం 15.1 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఏడాది అక్టోబర్‌లో ఇది కేవలం 4.4 శాతంగా ఉంది. ⇔ 2015 అక్టోబర్‌లో ఎరువుల ఉత్పత్తి 16.8 శాతంగా ఉండగా తాజాగా అది 0.8 శాతానికి పడిపోరుుంది. సిమెంట్ ఉత్పత్తి సైతం 13.8 శాతం నుంచి 2.8 శాతానికి క్షీణించింది. ⇔ బొగ్గు ఉత్పత్తి 6.6% నుంచి 1.6%కి, సహజ వారుువు ఉత్పత్తి 1.4%కి, ముడి చమురు ఉత్పత్తి 3.2 శాతానికి తగ్గింది. -
పెద్ద ఉక్కు పరిశ్రమలకు షాక్
న్యూఢిల్లీ: పెద్ద ఉక్కు పరిశ్రమలకు కేంద్రప్రభుత్వం షాక్ ఇచ్చింది. వాటి తీవ్రమైన లాబీయింగ్ ను వ్యతిరేకించిన ప్రభుత్వం స్టీల్ కనీస దిగుమతి ధర(ఎంఐపీ)ను మరో రెండు నెలలపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 66 స్టీల్ అంశాలపై కనీస దిగుమతి ధరను డిసెంబర్ 4 వరకు పొడిగిస్తూ భారత ఉక్కు - కామర్స్ మంత్రిత్వ శాఖ నోటిషికేషన్ జారీ చేసింది. దీంతో దేశీ స్టీల్ పరిశ్రమకు విదేశీ చౌక ఉత్పత్తుల నుంచి మరికొంతకాలం ఉపశమనం లభించనుంది. విదేశాల నుంచి దిగుమతయ్యే చౌక ఉత్పత్తులకు చెక్ పెట్టేందుకు ఈ తాజా నిర్ణయం ఉపకరిస్తుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీనిపై ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సానక్ మిశ్రా హర్షం వ్యక్తం చేశారు. తాము పరిమితిని ఆరు నెలలపాటు పొడిగించాలని కోరినట్టు తెలిపారు. దేశీయ స్టీల్ కంపెనీల కష్టాలు తగ్గడంతోపాటూ, మార్కెట్ మరింత బలోపేతమవుతుందన్నారు. కాగా సుమారు 173 స్టీల్ ప్రొడక్టులకు వర్తించే ఎంఐపీని ప్రభుత్వం తొలుత ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో ప్రభుత్వం మరోసారి అక్టోబర్ 4వరకూ గడువును పొడిగించింది. తాజా ఎంఐపీ పొడిగింపు 66 ఉత్పత్తులకు వర్తించనుంది. ఐరన్ లేదా నాన్‌అల్లాయ్ స్టీల్ సెమీ ఫినిష్డ్ ఉత్పత్తులు, విభిన్న ఫ్లాట్ రోల్డ్ ప్రొడక్టుల దిగుమతులపై ఎంఐపీ అమలుకానుంది. -
ఉక్కు కంటే నాలుగు రెట్ల గట్టి లోహం!
వాషింగ్టన్: టైటానియం బంగారం మిళి తమై ఏర్పడ్డ లోహం ఉక్కు కంటే మూడు నుంచి నాలుగు రెట్లు గట్టిగా ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది చాలా లోహాల కంటే గట్టిదని తెలిపారు. దీన్ని వైద్య రంగంలో కూడా వాడవచ్చని రైస్ వర్సిటీకి చెందిన ఎమీలియా మొరోసన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. టైటానియం గట్టి పదార్థమని, దీన్ని కృత్రిమ మోకాళ్లు, తొం టికీళ్ల నిర్మాణానికి వినియోగిస్తారన్నారు. -
నీటి తరలింపునకు బ్రేక్
యల్లయ్య కాలువ నీటిని స్టీల్‌ప్లాంట్‌కు తరలించే యత్నం అడ్డుకున్న రైతు సంఘాలు నీరు తరలిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక చివరకు వెనుతిరిగిన అధికారులు అనకాపల్లి: శారదానది నుంచి స్టీల్‌ప్లాంట్‌కు అడ్డగోలుగా నీటిని తరలించే ప్రక్రియను అనకాపల్లికి చెందిన రైతులు, ప్రజాసంఘాల సభ్యులు అడ్డుకున్నారు. అనకాపల్లి పట్టణ సరిహద్దులోని శారదానదికి ఆనుకొని ఉన్న యల్లయ్య, ఏలేరు కాల్వల కూడలి వద్ద జరుగుతున్న నీటిమళ్లింపును నిరసిస్తూ బుధవారం పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. రాత్రికి రాత్రి యల్లయ్యకాల్వకు నీరు పారే మార్గాన్ని మట్టితో కప్పివేసి ఆ నీటిని ఏలేరు కాల్వలోకి మళ్లించడంతో స్థానిక రైతులు ఆందోళనతో అఖిలపక్ష నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. దాడి వీరభద్రరావుతో పాటు వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ తదితర పార్టీల నాయకులు, వ్యవసాయదార్లసంఘం, నీటిసంఘం, రైతుసంఘం ప్రతినిధులు నీటి మళ్లింపు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం రెండుగంటల వరకు అక్కడే ఉండి నీటిమళ్లింపు ప్రక్రియను నిలుపుచేయించారు. అప్రమత్తమైన రైతులు స్టీల్‌ప్లాంట్ నీటి అవసరాల కోసం యల్లయ్య కాలువ నీటిని ఏలేరు కాలువలోకి మళ్లించే పనిని ప్లెసిబో అనే ప్రైవేట్ ఇంజినీరింగ్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. కొద్దిరోజుల నుంచి ఏలేరు కాలువకు ఆనుకొని రహదారులు, ఇంజిన్లు ఏర్పాటు చేస్తున్నారు. యల్లయ్యకాలువ నీటిని ఏలేరు కాల్వలోకి మళ్లిస్తున్నారని తెలుసుకున్న రైతులు అప్రమత్తమై కాలువ ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా దాడి వీరభద్రరావు, రైతులు నీటిపారుదలశాఖ, స్టీల్‌ప్లాంట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శారదానీటిని స్టీల్‌ప్లాంట్‌కు తరలించడం తగదన్నారు. అయితే తమకు అనుమతి ఉందని చెప్పేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ రైతులు వినకుండా అక్కడే కూర్చున్నారు. యల్లయ్య కాలువకు నీరు వెళ్లే మార్గాన్ని మూసివేసి ఏలేరు కాలువలోకి నీటిని మళ్లించడం పట్ల రైతుసంఘాలు, ప్రజాసంఘాలప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్ధుడెన నీటిపారుదలశాఖ ఎస్ఈ వల్లే ఈ దుస్థితి ఏర్పిడిందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు సైతం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పరిస్థితి తెలుసుకున్న పట్టణ ఎస్ఐలు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ లీలారావు తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని నీటిపారుదలశాఖ, జీవీఎంసీ, స్టీల్‌ప్లాంట్ అధికారులతో చర్చలు జరిపారు. యల్లయ్యకాలువ నీటిని స్టీల్‌ప్లాంట్‌కు తరలించేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ తాము అంగీకరించబోమని రైతులు భీష్మించుకొని కూర్చోవడంతో అధికారులు వెనుతిరిగారు. స్టీల్‌ప్లాంట్ జీఎంపై ఆగ్రహం చర్చలు పూర్తయిన తర్వాత యంత్రాలను తొలగించే అంశంలో స్టీల్‌ప్లాంట్ నీటి నిర్వహణ విభాగ జీఎం రామానుజం చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, అఖిలపక్ష నేతలు, రైతుసంఘాల సభ్యులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు స్టీల్‌ప్లాంట్ నీటి నిర్వహణ జీఎం రామానుజం, వాటర్‌మేనేజ్‌మెంట్ మేనేజర్ శివరామకృష్ణ వెనుతిరిగారు. అక్కడ పరిస్థితిపై జీవీఎంసీ ఎస్ఈ ఆనందరావు, అడ్వయిజర్ జగన్మోహనరావు, నీటిపారుదలశాఖ ఏఈ తమ్మినాయుడులు కొద్దిసేపు చర్చించారు. ఈ ఆందోళనలో రైతుసంఘాల ప్రతినిధులు విల్లూరి పైడారావు, విల్లూరి రాము, కర్రి బలరాం, కర్రి మోదునాయుడు, కొణతాల శ్రీను, వైఎస్ఆర్ సీపీ నేతలు సూరిశెట్టి రమణఅప్పారావు, ఆడారి సూరి అప్పారావు, జాజుల రమేష్, ప్రజారాజకీయ ఐక్యవేదిక నాయకుడు కనిశెట్టి సురేష్‌బాబు, బీజేపీ నేత గంగుపాం నాగేశ్వరరావు, వ్యవసాయదార్లసంఘం నాయకులు భీశెట్టి కృష్ణ అప్పారావు, సీపీఎం నాయకుడు ఎ.బాలకృష్ణ, సీపీఐ నాయకుడు వై.ఎన్.భద్రం తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకులకు ‘ఉక్కు’ సంకెళ్లు..!
♦ ఎన్పీఏలుగా మారనున్నమరో రూ. 50 వేల కోట్ల రుణాలు ♦ స్టీల్ రంగానికి ప్రత్యేక ఫండింగ్ ఏజెన్సీ ♦ ఏర్పాటు చేయాలంటున్న బ్యాంకులు ♦ కొత్త రుణాలు ఇవ్వడం సాధ్యం కాదని గగ్గోలు కొండలా పేరుకుపోతున్న మొండిబకాయిలతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న దేశీ బ్యాంకింగ్ రంగానికి ఇప్పుడు ‘స్టీల్’ భయం పట్టుకుంది. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం, ధర పతనంతో తీవ్ర సమస్యల్లో కూరుకుపోయిన ఇనుము-ఉక్కు రంగ కంపెనీలు బ్యాంకర్లకు దడ పుట్టిస్తున్నాయి. ఎందుకంటే.. రానున్న కాలంలో ఈ రంగానికి ఇచ్చిన రుణాల్లో దాదాపు మరో రూ.50 వేల కోట్ల రుణాలు మొండిబకాయిలు(ఎన్పీఏ)లుగా మారనున్నట్లు అంచనా. ఆర్థిక సంవత్సరం ముగియడంతో భారీగా రుణాలు తీసుకున్న ఉక్కు కంపెనీల నుంచి బకాయిలు వసూలు చేసుకోవడంపై బ్యాంకులు దృష్టిసారిస్తున్నాయి. అవసరమైతే వాటిని డిఫాల్టర్ల జాబితాలో చేర్చేందుకు సైతం సమాయత్తమవుతున్నాయి. దీనివల్ల ప్రొవిజనింగ్ కేటాయింపులు పెరిగిపోయి బ్యాంకుల లాభాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయినప్పటికీ.. ఆర్బీఐ, ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు బ్యాంకులు రికవరీ ప్రక్రియను ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోపక్క, తీవ్ర అనిశ్చితిలో ఉన్న స్టీల్ రంగానికి ఇకపై తాము కొత్తగా రుణాలిచ్చే పరిస్థితి లేదని కూడా బ్యాంకర్లు స్పష్టం చేస్తుండటం గమనార్హం. ఈ త్రైమాసికంలోనే... స్టీల్ రంగ రుణాలకు సంబంధించి ఎన్పీఏలుగా మారనున్న రూ.50 వేల కోట్లను చాలా వరకూ ఈ ఏడాది(2016-17) తొలి త్రైమాసికంలో తమ ఖాతా పుస్తకాల్లో మొండిబకాయిలుగా చూపనున్నాయి. కొన్ని బ్యాంకులు మాత్రం కొన్ని స్టీల్ రుణాలను గతేడాది ఆఖరి త్రైమాసికం(క్యూ4)లోనే ఎన్పీఏలుగా పరిగణించినట్లు సమాచారం. భారీ రుణ భారంతో ఇప్పటికే ఉన్న భూషణ్ స్టీల్, ఎస్సార్, విసా స్టీల్, ఎలక్ట్రో స్టీల్ వంటి కొన్ని కంపెనీలతో ఇప్పటికే బ్యాంకర్లు చర్చలు జరిపినట్లు ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఇందులో చాలా వరకూ కంపెనీలకు ఇచ్చిన రుణాలను బ్యాంకులు 5/25 స్కీమ్ కింద పునర్వ్యవస్థీకరించడం గమనార్హం. ఆర్బీఐ 2014లో తీసుకొచ్చిన ఈ స్కీమ్ ప్రకారం ఏదైనా కంపెనీకి ఇచ్చిన రుణాలను బ్యాంకులు అవసరమైతే మరో 25 ఏళ్ల వరకూ పొడిగించే అవకాశం ఉంటుంది. అయితే, ప్రతి ఐదేళ్లకోసారి వడ్డీరేట్లను సవరించే షరతు విధిస్తారు. దీనివల్ల రుణ గ్రహీతలకు రీపేమెంట్ సులభం అవడమే కాకుండా చెల్లించాల్సిన కిస్తీ(ఇన్స్టాల్మెంట్) మొత్తం కూడా తగ్గుతుంది. గతేడాది డిసెంబర్ నాటికి మొత్తం బ్యాంకుల పునర్వ్యవస్థీకరణ రుణాల్లో 21 శాతం(దాదాపు రూ.54,051 కోట్లు) ఇనుము-ఉక్కు రంగ కంపెనీలవే. 2015 సెప్టెంబర్ చివరివరకూ చూస్తే స్టీల్ రంగం స్థూల ఎన్పీఏలు 8.4 శాతం కాగా, వచ్చే ఏడాది మార్చికల్లా ఇవి 12 శాతానికి ఎగబాకవచ్చని అంచనా. దేశవ్యాప్తంగా ఇప్పుడు అత్యధికంగా రుణభారం ఉన్న రంగం కూడా ఇదే కావడం గమనార్హం. ప్రత్యేక ఏజెన్సీయే శరణ్యం... రానున్న కాలంలో తాము ఇక స్టీల్ రంగానికి రుణాలివ్వడం అసాధ్యమని... అందువల్ల ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. విద్యుత్ రంగానికి రుణకల్పన కోసం ఏర్పాటు చేసిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ) తరహాలో స్టీల్ రంగానికి కూడా ఒక ఫండింగ్ ఏజెన్సీని నెలకొల్పే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని ఎస్బీఐ ఎండీ బి. శ్రీరామ్ ఇటీవల ఒక నోట్లో అభిప్రాయపడ్డారు. ఎందుకంటే 2025 నాటికి ఈ రంగం వార్షిక ఉత్పాదక సామర్థ్యం 300 మిలియన్ టన్నులకు చేరాలన్న లక్ష్యం సాకారమవ్వాలంటే.. రూ.10 లక్షల కోట్ల రుణాలు అవసరమవుతాయన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. స్టీల్ రంగాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం కనీస దిగుమతి ధర(ఎంఐపీ), రక్షణాత్మక దిగుమతి సుంకం వంటి చర్యలు తీసుకుంటోందని.. దీనివల్ల పరిశ్రమకు కొంత ప్రయోజనం ఉంటున్నప్పటికీ, ఉక్కు వినియోగ రంగాలైన ఆటోమొబైల్, గృహోపకరణాలు, ఇంజినీరింగ్ కంపెనీల మార్జిన్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు ఎస్బీఐ నోట్ ప్రస్తావించింది. ఇనుము-ఉక్కు రంగం పరిస్థితి ఇదీ ♦ బ్యాంకుల మొత్తం రుణాలు: రూ. 3 లక్షల కోట్లు ♦ మొండిబకాయిలుగా మారిన రుణాల పరిమాణం: 27 శాతం ♦ బ్యాంకుల మొత్తం రుణాల్లో స్టీల్ రంగం వాటా: 4.7 శాతం ♦ మొత్తం ఎన్‌పీఏల్లో దీని వాటా: 6.9% -
స్టీల్ దిగుమతులపై సుంకం పెంపు? షేర్లు జూమ్..
న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే స్టీల్ ఉత్పత్తులపై సుంకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఒక నివేదికను స్టీల్ మంత్రిత్వ శాఖ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఒక నివేదికను అందించినట్టు సమాచారం. దీంతో కేంద్ర వాణిజ్య, ఉక్కు పరిశ్రమల మంత్రిత్వ శాఖలు కనీస దిగుమతి ధరలు(మినిమం ఇంపోర్ట్ ప్రైసెస్) పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే సుంకం వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ వార్తలతో స్టాక్ మార్కెట్ లో స్టీల్ రంగం షేర్లు మెరుపులు మెరిపిస్తున్నాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతున్న బుధవారం నాటి మార్కెట్ లో టాటా స్టీల్, హిందాల్కో, తదితర మెటల్ రంగ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అటు చైనా మార్కెట్ల పతనం మన దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. కాగా ప్రపంచ ఉక్కు సంఘం (డబ్ల్యుఎస్ఎ) నివేదికల ప్రకారం, చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలతో పోలిస్తే 2015 లో భారతదేశంలో స్టీల్ ఉత్ప త్తిలో గణనీయమైన వృద్ధి సాధించింది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా, రష్యా తదితర దేశాల నుంచి దిగుమతి అవుతున్న తక్కువ శ్రేణి ఉత్పత్తులను నిరోధించి దేశంలో స్టీల్ పరిశ్రమ విస్తరణకు ఉపకరించేందుకు కేంద్రం ఈ చర్యలకు ఉపక్రమిస్తున్న తెలుస్తోంది. చౌకైన చైనీస్ దిగుమతుల డంపింగ్ కారణంగా ఉక్కు పరిశ్రమ ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల పరిష్కరించేందుకు చర్యలు తీసుకునేందుకు, ఉక్కు మంత్రిత్వ శాఖతో సంప్రదిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పైసలందనిదే ఫైలు ముట్టరు!
ఆర్ కార్డుల జాబితాల్లో తప్పులే ఆయన ఆదాయ వనరులు తప్పు తీవ్రతను బట్టి వేలు నుంచి లక్షలు డిమాండ్ ఉన్నతాధికారుల ఆదేశాలు సైతం బేఖాతరు ఇదీ స్టీల్‌ప్లాంట్ సబ్ ఎంప్లాయ్మెంట్ అధికారి తీరు తమ్మినాన రామయ్య స్టీల్‌ప్లాంట్ నిర్వాసితుడు. ఇంటికో ఉద్యోగం హామీలో భాగంగా ప్రభుత్వం అతనికి ఆర్.కార్డు మంజూరు చేసింది. వయసు దాటినా ఉద్యోగం రాలేదు. దాంతో బీటెక్ చేసిన తన కుమారుడు జయప్రకాష్‌కు తన ఆర్.కార్డును బదిలీ చేయించాడు. కొడుక్కి ప్లాంట్‌లో ఉద్యోగం రావాలంటే ఆర్.కార్డు ఆధారంగా స్టీల్‌ప్లాంట్ సబ్ ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో అతని పేరు నమోదు చేయించాలి. దానికి ఎప్పుడో సెప్టెం బర్‌లోనే దరఖాస్తు చేశారు. మహా అయితే.. రెండుమూ డు రోజుల్లో ఆ పని పూర్తి అవ్వాలి. కానీ అలా జరగలేదు.. ఎంప్లాయ్మెంట్ అధికారి సైంధవుడిగా అడ్డుపడ్డారు.. రకరకాల సాకులు చెబుతూ ఎనిమిది నెలలు కాలయాపన చేశా రు. చివరికి అసలు విషయానకొచ్చారు. రూ.8 లక్షలు ఇస్తేనే పని అవుతుందని తేల్చేశారు. అంత ఇచ్చుకోలేనని రామయ్య అనడంతో.. బేరసారాలు మొదలయ్యాయి.. రూ.5 లక్షలు.. రూ. 2 లక్షలు.. ఇలా చివరికి రూ.1.50 లక్షలకు ఒప్పందం కుదిరింది. కథ అక్కడే అడ్డం తిరిగింది.. ఈ బేరసారాలతో విసిగిపోయిన రామయ్య ఏసీబీకి ఉప్పందించారు. ఇంకేముంది.. సొమ్ములందుకుంటూ ఎంప్లాయ్మెంట్ అధికారి ఉచ్చులో ఇరుక్కున్నారు. గాజువాక: లంచాలు డిమాండ్ చేయడం.. ముక్కు పిండి వసూలు చేయడం.. ఈ అధికారికి కొత్త కాదు. అసలాయన స్టయిలే అది. పైసలందనిదే ఫైలు ముట్టరు. ఉన్నతాధికారుల ఉత్తర్వులంటే లెక్కేలేదు. ఎవరెన్ని ఆదేశాలిచ్చినా.. తనకో పద్ధతి ఉందంటారు. గట్టిగా మాట్లాడితే డేటా లేదనో.. ఇంకేదో లేదనో కొర్రీలు వేసి తిప్పించుకోవడం ఆయనకు అలవాటు. ఏసీబీ ట్రాప్‌లో మంగళవారం అడ్డంగా దొరికిపోయిన స్టీల్‌ప్లాంట్ సబ్ ఎంప్లాయిమెంట్ అధికారి పి.ఎం.సతీష్‌కుమార్ బాధితులు రామయ్యతోపాటు ఇంకెందరో ఉన్నారు. ఆర్ కార్డుల జాబితాల్లో దొర్లిన తప్పులు, పొరపాట్లను ఆయన తన అక్రమ సంపాదనకు మార్గంగా మార్చుకున్నారని నిర్వాసితులు ఎప్పట్నుంచో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ భూసేకరణ విభాగం అధికారులు నిర్వాసితుల ఆర్ కార్డులను వారి వారసులకు బదిలీ చేసినా.. వాటిని ఇక్కడి ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో నమోదు చేయడానికి ఇక్కడి అధికారి వేలు.. లక్షలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కొత్త కాదు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ సైతం ఈ విషయాన్ని నిర్థారించారు. గత మూడేళ్ల కాలంలో ఈ అధికారి తీరుతో నిర్వాసితులు తీవ్ర ఆర్థిక భారం మోయాల్సి వచ్చిందని మంగళవారంనాటి సంఘటనతో స్పష్టమవుతోంది. స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌కు డబ్బులు ఇచ్చుకోలేని అనేకమంది నిర్వాసితులు నెలల తరబడి తిరిగి చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో తమ ఆస్తులను తనఖా పెట్టో, తలకు మించిన వడ్డీలకు అప్పులు తెచ్చో ముడుపులు చెల్లిస్తున్నారు. లంచాలు ఇవ్వని 40 రిజిస్ట్రేషన్లు పెండింగ్: ఎంప్లాయ్మెంట్ అధికారి డిమాండ్ చేసినంత సొమ్ము ఇచ్చుకోలేక రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో 40 మందికి పైగానే ఇంకా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. 35 ఏళ్ల క్రితం ఉక్కు భూసేకరణ అధికారులు జారీ చేసిన ఆర్ కార్డుల రికార్డులు ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్నాయి. భూసేకరణ కార్యాలయంలో డేటా కనిపించకపోవడం, డౌట్ఫుల్ జాబితాల్లో ఉండటం, కార్డుదారుల పేర్లలో రకరకాల తప్పులు చోటు చేసుకోవడంవంటి సమస్యలు తెలిసిందే. ఆ జాబితాను భూసేకరణ అధికారులు జిల్లా జాయింట్ కలెక్టర్‌కు, ఇక్కడి సబ్ ఎంప్లాయ్మెంట్ కార్యాలయానికి కూడా పంపించారు. ఈ జాబితానే సతీష్‌కుమార్ తనకు వరంగా మలచుకున్నారు. భూసేకరణ విభాగం అధికారులు కోరిన సమాచారాన్ని అందజేసి తప్పులను సరిచేసుకొని ఆర్ కార్డులను మార్చుకొని ఇక్కడికి వచ్చినా.. డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకొనే పరిస్థితి లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేసిన సంఘటనలున్నాయి. తనకు జిల్లా జాయింట్ కలెక్టర్ నుంచి వచ్చిన జాబితాలో సంబంధిత ఆర్ కార్డు డేటా సరిగ్గా లేదని, అందువల్ల దాన్ని నమోదు చేయలేమంటూ తొలుత తిప్పి పంపడం, ఆ తరువాత డ బ్బులు తీసుకొని పని పూర్తి చేయడం ఈ అధికారికి పరిపాటిగా మారిందన్న ఆరోపణలు తీవ్రంగానే ఉన్నా యి. కార్డులో దొర్లిన తప్పు తీవ్రతనుబట్టి రూ.15 వేల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఎట్టకేలకు పాపం పండింది. ఆ అధికారి ఏసీబీకి దొరికిపోయారని నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు తనఖాపెట్టి నగదు ఇచ్చా: తనకు అంత పెద్ద మొత్తంలో లంచం ఇవ్వగలిగే స్తోమత లేకపోయినా తన కుమారుడి భవిష్యత్తు కోసం ఉన్న ఒక్క ఇంటిని తనఖా పెట్టి డబ్బులు అప్పు తెచ్చానని బాధితుడు టి.రామయ్య పేర్కొన్నాడు. స్టీల్‌ప్లాంట్ కోసం సర్వం కోల్పోయిన తమను అధికారులు ఇలా ఇబ్బంది పెడుతుంటే తట్టుకోలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించానని చెప్పారు. -
విధి చిదిమేసింది..
ఆ యువకుడికి భవిష్యత్‌పై ఎన్నో ఆశలు.. మరెన్నో బరువు బాధ్యతలు.. వాటన్నిటినీ మోయడానికి సిద్ధపడుతున్నాడు. అప్పుల్లో ఉన్న కుటుంబాన్ని గట్టెక్కించాలనుకున్నాడు. అందుకు ప్రభుత్వ ఉద్యోగమే సరైనదని భావించేవాడు. అందుకోసం కష్టపడి చదివేవాడు. ప్రతిభావంతుగా పేరు తెచ్చుకున్నాడు. వారం రోజుల్లో స్టీల్‌ప్లాంట్‌లో జరిగే జూనియర్ ఇంజినీర్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ఇంతలోనే విధికి క న్నుకుట్టింది. అతని కలలనూ, కొడుకుపై పెట్టుకున్న ఆశలనూ రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చి చిదిమేసింది. ఈ విషాదగాథ రోడ్డు ప్రమాదంలో గాయపడి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్ అయి, అవయవదానం చేసిన అల్లాడ సాయికుమార్‌ది. విశాఖపట్నం/అల్లిపురం: సాయికుమార్ నగర శివారులోని రఘు ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. కాలేజీలో 80 శాతం మార్కులు సాధిస్తూ ప్రతిభావంతుడిగానే గాక బుద్ధిమంతుడిగానూ పేరు సంపాదించాడు. తల్లిదండ్రులు చంద్రశేఖర్, కోటలక్ష్మిల పేదరికాన్ని చూసిన సాయికుమార్ అమ్మానాన్నలు పంపే డబ్బును అతి పొదుపుగా ఖర్చు పెట్టేవాడు. తాను తల్లిదండ్రులకు భారం కాకూడదనుకుని స్నేహితులతో బయటకు కూడా వెళ్లేవాడు కాదు. తొందరగా ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వోద్యోగం సంపాదించాలని తరచూ స్నేహితులతో చెప్పేవాడు. తన ఉద్యోగంతో అప్పుల్లో ఉన్న కుటుంబాన్ని గట్టెక్కించాలని చెబుతుండేవాడు. ఇటీవల జరిగిన ‘గేట్ 2016’ పరీక్ష కూడా బాగానే రాశాడు. ఈ నెల 28న జరిగే స్టీల్‌ప్లాంట్ జూనియర్ ఇంజనీర్ పరీక్షకు హాజరవుతున్నాడు. హాల్‌టిక్కెట్టు కూడా తీసుకున్నాడు. ఈ పరీక్ష కోసం రేయింబవళ్లు కష్టపడి చదువుతున్నాడు కూడా. తల్లిదండ్రులకు సాయికుమార్ ఒక్కడే కొడుకు. మరొక కుమార్తె ప్రియాంక. ఈమె బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. ‘నిన్ను ఎమ్మెస్సీ చదివిస్తాను బాగా చదువు చెల్లెమ్మా!’ అంటుండేవాడు. ఎదిగివచ్చిన కొడుకు కొన్నాళ్లలోనే ఉద్యోగంలో చేరతాడని, తమ కష్టాలు తీరతాయని ఎన్నో కలలు కంటున్నారు. ఇంతలోనే పిడుగులాంటి వార్త! సాయికుమార్ బైకు ప్రమాదంలో గాయపడ్డాడని. కొడుకు తొందరగా కోలుకోవాలని తల్లిదండ్రులతో పాటు బంధువులు, స్నేహితులు కోటి దేవుళ్లకు మొక్కుకున్నారు. కానీ ఏ దేవుడూ కనికరించలేదు. సాయికుమార్ బ్రెయిన్‌డెడ్ అయి బతకడని వైద్యులు గుండెలు పిండేసే చేదు నిజాన్ని వెల్లడించారు. ఒకపక్క పుట్టెడు విషాదంలో ఉన్న వారంతా గుండె నిబ్బరం చేసుకుని సాయికుమార్ అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. ఫలితంగా సాయికుమార్ మరణించాక కూడా ముగ్గురికి ప్రాణదానం, మరో ఇద్దరికి వెలుగు ప్రసాదించగలిగాడు. విషణ్ణవదనంతో బంధుమిత్రులు, స్నేహితులు సాయికుమార్ మృతదేహాన్ని స్వగ్రామం కేడీపేటకు తరలించారు. జీర్ణించుకోలేకపోతున్నాం.. సాయికుమార్ స్నేహితులతో చాలా స్నేహపూర్వకంగా ఉండేవాడు. ఒకసారి స్నేహం చేస్తే ఎవరూ ఆయనను వదులుకోవడానికి ఇష్టపడరు. ఎప్పుడూ చదువుపైనే ధ్యాస. ఎక్కడికైనా వెళ్దామన్నా వచ్చేవాడు కాదు. మా ఫ్రెండ్ ఇక లేడన్న నిజాన్ని మేమంతా జీర్ణించుకోలేకపోతున్నాం. - జిలానీ బాషా, సాయికుమార్ స్నేహితుడు -
ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్ ‘మైనస్’
► వార్షిక ప్రాతిపదికన నవంబర్ ఉత్పత్తిలో వృద్ధి శూన్యం... ► 1.3 శాతం క్షీణిత (మైనస్) నమోదు ► ఇదే నెల ఐఐపీ గణాంకాలపై ► ప్రతికూల ప్రభావం చూపే అవకాశం! న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్ ఉత్పత్తి 2015 నవంబర్‌లో పూర్తి నిరాశను మిగిల్చింది. 2014 నవంబర్‌తో పోల్చిచూస్తే... ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా 1.3 శాతం క్షీణత (మైనస్)ను నమోదుచేసుకుంది. గడచిన ఏడు నెలల కాలంలో ఇంత దారుణమైన ఫలితం ఎన్నడూ రాలేదు (ఏప్రిల్‌లో 0.4 శాతం క్షీణత). మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది పరిశ్రమల గ్రూప్ వాటా దాదాపు 38 శాతం. జనవరి రెండవ వారంలో వెలువడనున్న నవంబర్ ఐఐపీ ఫలితంపై తాజా ఫలితం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2014 నవంబర్‌లో గ్రూప్ ఉత్పత్తి రేటు 8.5 శాతం. 2015 అక్టోబర్‌లో 3.2%. కాగా 2015 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ చూస్తే వృద్ధి రేటు 2 శాతంగా ఉంది. 2014 ఇదే కాలంలో ఈ రేటు 6 శాతం. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన నవంబర్ గణాంకాల ప్రకారం 8 రంగాల పనితీరునూ వార్షిక రీతిన వేర్వేరుగా చూస్తే... క్షీణతలో... క్రూడ్ ఆయిల్: ఉత్పత్తి క్షీణత మరింత పెరిగింది. -0.1%క్షీణత మరింతగా-3.3% క్షీణతకు జారింది. సహజ వాయువు: ఈ రంగంలో కూడా -2.3 శాతం క్షీణత మరింతగా - 3.9 శాతానికి దిగింది. సిమెంట్: వృద్ధిలేకపోగా -1.8 శాతం క్షీణత నమోదయ్యింది. స్టీల్: ఈ రంగంలో కూడా అసలు వృద్ధి లేకపోగా 8.4 శాతం క్షీణత (మైనస్) నమోదయ్యింది. వృద్ధి రేట్లు డౌన్... విద్యుత్: ఉత్పత్తి 9.9 శాతం నుంచి నిశ్చల స్థాయి (0 శాతం)కి చేరింది. బొగ్గు: వృద్ధి రేటు 14.6 శాతం నుంచి 3.5 శాతానికి పడిపోయింది. రిఫైనరీ ప్రొడక్టులు: వృద్ధి 8.1 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గింది. ఒకే ఒక్కటి... ఎరువులు: ఈ రంగం మాత్రం మంచి పనితీరు కనబరిచింది. 2.8 శాతం క్షీణత (మైనస్) 13.5 శాతం వృద్ధికి చేరింది. -
ఇంటక్‌లో నిర్వేదం
నిస్సహాయ స్థితిలో గుర్తింపు సంఘం కమిటీల్లో జాప్యంపై కార్యకర్తల్లో అసంతృప్తి సమస్యలు వినేవారే లేరని కార్మికులు ఆవేదన ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌లో ఐఎన్టీయూసీకి మొదటి నుంచి ప్రత్యేక గుర్తింపు ఉండేది. ప్రతిపక్షంలో ఉన్నా, గుర్తింపులో ఉన్నా వారి ఎన్నికల గుర్తు సింహం వలే దుడుకుగా, ఏది శాసిస్తే అది జరిగేలా ఉండేది. ఇటీవల కాలంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయి, నిస్సహాయ స్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గెలిచి తొమ్మిది నెలలైనప్పటికి కమిటీల నియామకాలు ప్రక్రియ పూర్తికాక పోవడం, గతంలో ఫ్రంట్ హయాంలో యాజమాన్యం ప్రతిపాదించిన వివిధ అంశాలను వ్యతిరేకించిన ఇంటక్ గుర్తింపులోకి వచ్చిన తర్వాత వాటిని అంగీకరించడం ప్రత్యక్ష ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా యూనియన్‌లో నెలకొన్న ఈ పరిస్థితి పట్ల నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు యూనియన్ స్తబ్దంగా ఉండటంతో ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఉందని నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. సమస్యలు వినే నాథుడు కరువు? ఈ ఏడాది ఫిబ్రవరి 14న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. ఏడేళ్ల తర్వాత ఈ ఎన్నికల్లో ఐఎన్టీయూసీ మంచి మెజార్టీతో గెలుపొందింది. ఉక్కు యాజమాన్యం నుంచి మే 29న అధికారికంగా గుర్తింపు పత్రాన్ని అందుకున్నారు. తీవ్రమైన జాప్యంతో ఐఎన్టీయూసీ నాయకత్వం పీఎఫ్, ఎస్బీఎఫ్, సెంట్రల్ సేఫ్టీ కమిటీ, ఉక్కునగరంలోని అంబేద్కర్ కళాక్షేత్రం, ఆంధ్రకేసరి కళాక్షేత్రం, వడ్లపూడి, అగనంపూడి, గంగవరం కమిటీలను పూర్తిచేయగలిగారు. ఉక్కు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు అతి ముఖ్యమైన ఉక్కు జనరల్ ఆస్పత్రి, టౌన్ డెవలప్మెంట్ కమిటీలకు ఇంతవరకు మోక్షం కలగలేదు. దీని వల్ల ఉక్కు జనరల్ ఆస్పత్రి సమస్యలను వినే నాథుడు లేకుండా పోయారు. ఇక ప్రొడక్షన్, మార్కెటింగ్, సీఎస్ఆర్, వెల్ఫేర్ వంటి క మిటీల ఊసేలేదు. పరిమితికి మించి సభ్యులను కోరడం వల్లే ? చాలా కమిటీలకు పరిమితికి మించి సభ్యులను గుర్తింపు యూనియన్ కోరడంతో అవి పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఉన్నవాటిని తీసుకుని, మిగిలిన వాటిని అడిగి ఉంటే బాగుండేదని గుర్తింపు యూనియన్ నాయకులే వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ విధంగా జాప్యం జరగడం వల్ల కార్మికుల్లో అపఖ్యాతి మూటగట్టుకోవడం తప్ప ఒరిగేదేమి లేదంటున్నారు. పుండు మీద కారం చల్లినట్టు యాజమాన్యం ఇటీవల ప్రారంభించిన గేటు నిబంధనలు కార్మికుల్లో మరింత అసంతృప్తి రేకెత్తిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే సొంత క్యాడర్లో మరింత అసంతృప్తి ప్రబలే అవకాశముంది. తక్షణం కమిటీలు వేయడంతో పాటు జనరల్ ఆస్పత్రి, టౌన్ అడ్మిన్, గేటు సమస్యలపై చర్యలు తీసుకోకపోతే జరిగే నష్టానికి యూనియన్ నాయకత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. -
ఉక్కు తయారీలో అగ్రస్థానమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ఉక్కు తయారీలో ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని చేరుకునేందుకు కేంద్రప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) డెరైక్టర్ ఎస్.ఎస్.మహంతి తెలిపారు. దేశంలో ఇనుము, ఉక్కు రంగాల్లో జరుగుతున్న పరిశోధనలన్నింటినీ సమన్వయపరిచేందుకు, తద్వారా ఈ రంగంలో ఉన్నత స్థానానికి ఎదిగేందుకు స్టీల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఇండియా పేరుతో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. వంద కోట్లు, ప్రైవేట్ కంపెనీలు మరో రూ.వంద కోట్లు అందించాయని, ఈ మూలధనంతో సంస్థ పనిచేస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో గురువారం మిశ్రధాతు నిగమ్ (మిధాని), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్‌లు ఏర్పాటు చేసిన జాతీయ సదస్సుకు మహంతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోహాల తయారీలో భారత్ ఇతర దేశాలకు ఏమాత్రం తీసిపోదని, అయితే భవిష్యత్ అవసరాల దృష్ట్యా పరిశోధనలను ముమ్మరం చేసేందుకు కొత్త కేంద్రం ఉపకరిస్తుందన్నారు. భారత్ అభివృద్ధి చేస్తున్న యుద్ధ వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌లో ఉపయోగించిన ప్రత్యేకమైన ఉక్కు మొత్తం స్వదేశంలోనే తయారైందని మరే ఇతర దేశం ఇలాంటి ఘనత సాధించలేదని చెప్పారు. సీఆర్జీవో స్టీల్ తయారీకి ఒప్పందం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో ఉపయోగించే సీఆర్జీవో ఉక్కు తయారీని దేశీయంగానే చేపట్టేందుకు మిశ్రధాతు నిగమ్ సెయిల్‌తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎం.నారాయణరావు తెలిపారు. ఏటా కొన్ని లక్షల టన్నుల సీఆర్జీవో ఉక్కును దిగుమతి చేసుకుంటున్నామని, సొంతంగా తయారు చేసుకుంటే విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని చెప్పారు. ఇందుకు తగ్గ వసతులు మిశ్రధాతు నిగమ్‌లో అందుబాటులోనే ఉన్నాయని అన్నారు. సెయిల్‌కు చెందిన భద్రావతి స్టీల్స్‌లో ఈ ప్రత్యేక ఉక్కును తయారు చేసి మిధానీలో దాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చునన్నారు. కార్యక్రమంలో ఎన్ఎండీసీ సీఎండీ నరేంద్ర కొఠారీ, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డిప్యూటీ డెరైక్టర్ వెంకట కృష్ణన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ డెరైక్టర్ అమోల్ గోఖలే తదితరులు పాల్గొన్నారు. -
ఉక్కు ఎస్ఎంఎస్లో ఉత్పత్తి బంద్
నిలిచిపోయిన మరో కన్వర్టరు రెండు వారాలు ఉత్పత్తికి విఘాతం విశాఖపట్నం: విశాఖ ఉక్కులో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి స్టీల్ మెల్ట్ షాప్-2లోని కన్వర్టర్-1 కూడా మరమ్మత్తులకు గురి కావడంతో విభాగంలో ఉత్పత్తి నిలిచిపోయింది. 13రోజుల పాటు ఉత్పత్తికి అంతరాయం కలగనున్నది. దీని ప్రభావం వల్ల విభాగం వార్షిక లక్ష్యాలకు తీవ్ర విఘాతం కలగనున్నది. వారం రోజుల క్రితం విభాగంకు చెందిన కన్వర్టర్-2కు రంధ్రం పడటంతో ఆ కన్వర్టర్ నిలిచిపోయిన విషయం విదితమే. ఒక్క కన్వర్టర్‌తో ఉత్పత్తి ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఉత్పత్తి ప్రక్రియలో ఉన్న మొదటి కన్వర్టర్‌కు చెందిన షెల్ హీట్ పెరిగిపోవడం గమనించారు. రిఫ్రాక్టరీ లైనింగ్ పాడైందని గుర్తించి దానిని మరమ్మతులకు అందించారు. విభాగం కన్వర్టర్లకు అవసరమైన రిఫ్రాక్టరీ బ్రిక్స్ సరఫరా లేకపోవడం వల్ల ఈ పరిస్ధితి తలెత్తినట్టు సమాచారం. రెండో కన్వర్టర్‌కు మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. అది పూర్తికావడానికి మరో మూడు వారాలు పట్టే అవకాశం ఉంది. విభాగంలో రెండు కన్వర్టర్లు ఉండగా కేవలం ఒక కన్వర్టర్‌కు సరిపడా రిఫ్రాక్టరీ మెటీరియల్ మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో రెండో కన్వర్టర్‌కు చెందిన లైనింగ్‌ను మొదటి కన్వర్టర్‌కు అమర్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ రిఫ్రాక్టరీ బ్రిక్స్‌ను సకాలంలో సరఫరా చేయకపోవడం, యాజమాన్యం సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్టు కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
టన్నుకు స్టీల్ 750 తగ్గింది
-
ఆగస్ట్‌లో మౌలిక రంగ వృద్ధి 5.8%
న్యూఢిల్లీ: కీలకైమైన 8 మౌలిక పరిశ్రమలు ఆగస్ట్‌లో 5.8% వృద్ధిని అందుకున్నాయి. ప్రధానంగా బొగ్గు, సిమెంట్, విద్యుత్ రంగాల పనితీరు ఇందుకు దోహదపడింది. గతేడాది(2014) ఆగస్ట్‌లో మౌలిక పరిశ్రమల పురోగమన రేటు 4.7% చొప్పున నమోదైంది. వాణిజ్య, పరిశ్రమల శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం బొగ్గు రంగం 13.4% వృద్ధిని చూపగా, సిమెంట్ 10.3%, విద్యుత్ 12.6% చొప్పున పుంజుకున్నాయి. ఈ బాటలో స్టీల్ ఉత్పత్తి 9.1% మెరుగుపడినప్పటికీ, ముడిచమురు 4.9%, సహజవాయువు ఉత్పత్తి 8.3% చొప్పున క్షీణించడం గమనార్హం.ఇదే విధంగా రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువుల విభాగం 4.3% చొప్పున నీరసించాయి. కాగా, ఏప్రిల్-ఆగస్ట్ కాలానికి 8 కీలక పరిశ్రమలతో కూడిన మౌలిక రంగం 4.4% వృద్ధిని సాధించింది. గతంలో ఇదే కాలానికి 4.2% వృద్ధి నమోదైంది. ఆగస్ట్‌లో 8 కీలక పరిశ్రమలు సగటున మెరుగైన ఫలితాలను సాధించడంతో పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాలు సానుకూలంగా వెలువడేందుకు వీలుచిక్కనుంది. ఐఐపీలో వీటికి 38% వెయిటేజీ ఉండటమే దీనికి కారణం. ఆర్థిక రికవరీకి సంకేతం ఆగస్ట్‌లో కీలక పరిశ్రమలు 5.8% వృద్ధి సాధించడం ద్వారా ఆర్థిక పురోగమన సంకేతాలను మరింత బలపరుస్తున్నాయని పరిశ్రమల సమాఖ్య అసోచామ్ వ్యాఖ్యానించింది. బొగ్గు రంగ వేగం కొనసాగకపోయినప్పటికీ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి ఆటంకం ఉండబోదని అభిప్రాయపడింది. మెరుగుపడుతున్న పారిశ్రామికోత్పత్తిని గణాంకాలు పట్టిచూపుతున్నాయని పేర్కొంది. భవిష్యత్‌లో బొగ్గు రంగంలో జోష్ కొనసాగాలంటే బ్లాకులను ప్రభుత్వం తిరిగి వేలం ద్వారా కేటాయించాల్సిన అవసరం ఉందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ చెప్పారు. ఈ నెల మొదట్లో సుప్రీం కోర్టు మొత్తం 214 బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. -
మార్స్ మిషన్‌లో సెయిల్ ఉక్కు
హైదరాబాద్: అంగారక గ్రహానికి పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)లో తమ భాగస్వామ్యం కూడా ఉందని ఉక్కు దిగ్గజం సెయిల్ పేర్కొంది. అరుణ గ్రహానికి వెళ్లిన పీఎస్ఎల్వీకి సంబంధించి ఇంధనం, ఆక్సిడైజర్ ట్యాంకుల ఫ్యాబ్రికేషన్‌లో సెయిల్ ఉక్కును ఉపయోగించినట్లు వివరించింది. ఇందుకోసం సేలంలోని స్టీల్ ప్లాంటులో తయారైన ఉక్కును వినియోగించినట్లు సంస్థ చైర్మన్ సీఎస్ వర్మ తెలిపారు. ఇంధన, ఆక్సిడైజర్ల ప్రతిచర్యలను ఎదుర్కొని దీర్ఘకాలం పాటు ఎటువంటి లీకేజీలు లేకుండా ఇది మన్నుతుందని ఆయన వివరించారు. గతంలోనూ పలు పీఎస్ఎల్వీలకు స్టెయిన్లెస్ స్టీల్‌ను అందించినట్లు ఆయన వివరించారు. -
పొట్టేళ్ల మార్కెట్ రూ.2 కోట్లు
తగరపువలస: విజయ దశమి, బక్రీద్‌లను పురస్కరించుకుని ఆదివారం స్థానిక ప్రైవేట్ మార్కెట్లో జరిగిన సంతలో మేకలు, గొర్రెల వ్యాపారం రూ.2 కోట్ల వరకు జరిగింది. నగరం నుంచి మేక లు, గొర్రెలు కొనుగోలు చేయడానికి వచ్చిన ఉద్యోగులు, మారు బేరగాళ్లతో సంత కిటకిటలాడింది. పారిశ్రామికవాడకు చెందిన జీవీఎంసీ, స్టీల్‌ప్లాంట్, షిప్‌యార్డు, ఇంధన కంపెనీల ఉద్యోగు లు ఈ సంతకు ప్రభుత్వ వాహనాలతోనే రావడం ఆనవాయితీ. దీనికి ముందు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కందివలసగెడ్డ, మానాపురం, అచ్యుతాపురం సంతలో ఎక్కువగా విక్రయాలు జరుగుతాయి. ఆదివారం ఉద్యోగులకు సెలవు కావడంతోపాటు నగరానికి దగ్గరగా ఉండటంతో తగరపువలస సంతకే ప్రాధాన్యత ఇచ్చారు. కొమ్ములతోపాటు ధరలూ అధికమే.. ప్రతిష్టకు చిహ్నంగా భావించిన కొనుగోలుదారు లు దసరా ఉత్సవాలకు ప్రత్యేకంగా భారీగా కొ మ్ములు తిరిగిన మేకలు, గొర్రెలకే ప్రాధాన్యత ఇస్తారు. కొమ్ములు ఎంతగా తిరిగితే, వీటి ధర కూడా అంతగా ఉంటుం ది. విజయనగరం జిల్లా డెంకాడ మండలానికి చెందిన బంగార్రాజుపే ట, కొండ్రాజుపేటకు చెందిన రైతులు ఏడాది పొడుగునా పొట్టేళ్ల పెంపకంపై దృష్టిపెడతారు. వివిధ సంతల్లో మేలుజాతి గొర్రెలను ఎంపిక చేసుకొని కొనుగోలు చేసి పెంచుతారు. మామూ లు రోజుల్లో ఇరవై కిలోల గొర్రె రూ.10వేల లోపే ఉండగా ఈ సంతలో రూ.12వేలు దాటడం విశేషం. ఆదివారం సంతతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 1500 వరకు మేకలు, గొర్రెల విక్రయాలు జరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. కొండెక్కిన నాటు కోడి ధరలు కోళ్ల ధరలు ఆకాశాన్ని తాకాయి. వేములవలస మార్కెట్లో ఆదివారం నాటు కోళ్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాదే ఇక్కడ కోళ్ల మార్కెట్ ప్రారంభమయింది. విశాఖపట్నం, పెందుర్తి పరిసర ప్రాంతాల నుంచి వ్యాపారులు ఎగబడడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. కిలో బరువు ఉండే నాటు కోడి పుంజు రూ. 400లు వరకూ పలికింది. పందెం కోళ్ల ధర రూ. 3,000 నుంచి రూ. 4.000 వరకు పలికింది. -
బళ్లారిలో వేదాంతా స్టీల్ ప్లాంట్
న్యూఢిల్లీ: ఏడాదికి 5 మిలియన్ టన్నుల సామర్థ్యంగల స్టీల్ ప్లాంట్‌ను కర్ణాటకలోని బళ్లారిలో ఏర్పాటు చేయాలని వేదాంతా గ్రూప్ భావిస్తోంది. ఇందుకు రూ. 30,000 కోట్లను ఇన్వెస్ట్‌చేసే ప్రణాళికలు వేసింది. ఈ దిశలో ఇప్పటికే సాధ్యాసాధ్యాల నివేదిక(ఫీజిబిలిటీ స్టడీ) కోసం ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భాగస్వామ్యం ద్వారా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించాయి. అయితే భాగస్వామి కోసం చర్చలింకా మొదలుపెట్టలేదని తెలిపాయి. దేశ ఇనుము, ఉక్కు రంగంలో విస్తరించేందుకు వీలుగా అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని వేదాంతా భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. బళ్లారి స్టీల్ ప్లాంట్‌పై కంపెనీ అత్యంత ఆసక్తిని చూపుతున్నదని, ఇక్కడ 700 ఎకరాలను కలిగి ఉన్నదని వివరించాయి. ఆగస్ట్ 1న లండన్‌లో నిర్వహించనున్న కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో ఈ ప్లాంట్ విషయమై ఒక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలిపాయి. 2011లో రూ. 220 కోట్లు వెచ్చించడం ద్వారా బళ్లారి స్టీల్ అండ్ అల్లాయ్స్(బీఎస్ఏఎల్) ఆస్తులను వేదాంతా సొంతం చేసుకుంది. 5 లక్షల టన్నుల సామర్థ్యంతో సమీకృత స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని బీఎస్ఏఎల్ ప్రణాళికలు వేసినప్పటికీ, రుణ భారం కారణంగా విఫలమైంది. -
స్టీల్, సిమెంట్ ధరలు పైపైకి
బాన్సువాడ రూరల్ : సిమెంట్, స్టీల్, ఇటుకల ధరలు రోజురోజుకీ పెరుగుతుండటంతో భవన నిర్మాణ రంగం కుదేలవుతోంది. ఫలితంగా ఏళ్ల తరబడి అద్దె ఇంట్లో ఉంటూ అప్పుచేసి సొంతిల్లు నిర్మించుకుందామనుకున్న సామాన్యుడి కల నెరవేరటం లేదు. అకాశాన్ని అంటుతున్న బిల్డింగ్ మెటీరియల్ ధరలతో సగంలోనే నిర్మాణాలు ఆగిపోతున్నాయి. బాన్సువాడలో నెలరోజుల క్రితం వరకు రూ. 200 ఉన్న బస్తా సిమెంట్ ధర ప్రస్తుతం రూ. 300కు చేరింది. సాధారణ ఇటుక ధరసైతం మొన్నటి వరకు వెయ్యికి రూ. 2,500 ఉండగా ప్రస్తుతం రూ. 3,000లకు చేరింది. స్టీలు క్వింటాలుకు రూ. 4,500 పలుకుతోంది. పెరిగిన ధరలు నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా సిమెంట్, ఇటుక, స్టీలు ధరలు పెరుగుతుండటంతో ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టిన వారుకూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోజురోజుకు ధరలు పెరుగిపోతూ ఉండటంతో పలువురు నిర్మాణాలను నిలిపివేస్తున్నారు. సాధారణంగా వేసవి కాలంలోనే గృహ నిర్మాణాలు ఎక్కువగా కొనసాగుతాయి. దీంతో నిర్మాణాలు ప్రారంభించినవారు పెరిగిన ధరలతో ఆందోళన చెందుతున్నారు. నిర్మాణాలకు చేయాల్సిన ఖర్చు అంచనాలకు రెట్టింపు అవుతోందని భవన నిర్మాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్టీల్, సిమెంట్ ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో సాధారణంగా గ్రామాల్లో పెంకుటిళ్లను మాత్రమే నిర్మించుకునేవారు. ఆర్సీసీ బిల్డింగ్‌ల నిర్మాణాలు అరుదుగా జరిగేవి. అయితే ప్రభుత్వం ఇందిరమ్మ పథకంలో భాగంగా పెంకుటిళ్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్సీసీ భవనాల నిర్మాణాలు పెరిగాయి. స్టీల్, సిమెంట్ ధరలు పెరగడంతో ఇందిరమ్మ గృహ నిర్మాణాలు కూడా మందగించాయి. ప్రభుత్వం స్పందించాలి.. ధరలు ఇలాగే పెరుగుతూ పోతే సామాన్యుడికి సొంతింటి కల నెరవేరని పరిస్థితులు నెలకొంటాయి. సాధారణ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ సీఏం కేసీఆర్ వెంటనే కొత్తవారితోపాటు ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారికి సైతం గృహ నిర్మాణానికి రూ. 3 లక్షలు మంజూరు చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. -
పరిశ్రమలతో పొంచి ఉన్న ప్రమాదం
ఏయూలోని జాతీయ సదస్సులో మంత్రి ‘గంటా’ ఆందోళన త్వరలో సేఫ్టీ అడిట్ చేయించనున్నట్టు వెల్లడి పోర్టు కాలుష్యాన్ని నియంత్రించాలని సూచన ఏయూ క్యాంపస్ : నగరం చుట్టూ ఉన్న ఎన్టీపీసీ, స్టీల్‌ప్లాంట్, ఫార్మా, కెమికల్ పరిశ్రమలతో ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర విద్య, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వీటిపై త్వరలో సేఫ్టీ అడిట్ చేయిస్తామని వెల్లడించారు. పోర్టు కాలుష్యాన్ని సైతం నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విశాఖ నగరం బాంబ్‌పై కూర్చున్నట్టుగా దర్శనమిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో సోమవారం ‘పర్యావరణంపై ఉద్గారాలు, మలిన పదార్థాల ప్రభావం’ అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. పరిశ్రమల స్థాపన ద్వారా సాధించే ప్రగతికంటే ప్రజారోగ్యమే ప్రధానమన్నారు. చిన్నపాటి మానవ తప్పిదాలు ప్రాణాలను హరిస్తున్నాయని, దీనిని ఇటీవల ప్రమాదాలే స్పష్టం చేశాయన్నారు. విశాఖను గ్రీన్ సిటీగా మలిచే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలనాన్నరు. పచ్చదనం పెంచితేనే నిర్మాణ అనుమతులు ఇవ్వాలనే ప్రతిపాదన ఉందన్నారు. ఏయూ వీసీ జి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ గ్రీన్హౌస్ గ్యాస్‌లు, విద్యుత్ అయస్కాంత తరంగాల ప్రభావం మానవుని ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతున్నాయన్నారు. సదస్సు చైర్మన్ ఆచార్య పి.ఎస్.అవధాని మాట్లాడుతూ సదస్సుకు 102 పరిశోధన పత్రాలను విభిన్న అంశాలపై సమర్పించనున్నట్టు తెలిపారు. సమస్యను గుర్తించడం, విశ్లేషించడం, పరిష్కారాలను చూపడం సదస్సు ఉద్దేశంగా పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్ డెరైక్టర్(ప్రాజెక్ట్స్) పి.సి.మహాపాత్రో మాట్లాడుతూ తమ పరిశ్రమలో 90 శాతం వ్యర్థాలను పునర్వినియోగం చేస్తున్నట్టు తెలిపారు. పరిశ్రమలో 43 శాతం పైగా హరితవనంగా చేశామన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రత్యేక సంచికను మంత్రి విడుదల చేశారు. ఆదికవి నన్నయ వర్సిటీ వీసీ పి.జార్జి విక్టర్, జేఎన్టీయూ కాకినాడ వీసీ జి.తులసీరామ్ దాస్, ఏయూ రెక్టార్ ఇ.ఎ.నారాయణ, రిజిస్ట్రార్ కె.రామ్మోహనరావు, ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రమూర్తి, ఆదికవి నన్నయ వర్సిటీ రిజిస్ట్రార్ కె.రఘుబాబులతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పైపులైన్ల పడగ
విశాఖ చుట్టూగ్యాస్ పైపులైన్ల ఉచ్చు పదుల సంఖ్యలో గ్యాస్, చమురు కంపెనీలు తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ దుర్ఘటనతో కలవరం విశాఖవాసుల్లో వణుకు విశాఖవాసులను గ్యాస్ ముప్పు కలవరపరుస్తోంది. నగరం చుట్టూ గ్యాస్ పైపులైన్లు ఉండడంతో ఏ క్షణాన ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో..ఏ పైపులైన్ లీకవుతుందోననే భయం వెన్నాడుతోంది. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన గెయిల్ గ్యాస్ పైపులైను భారీ పేలుడు దుర్ఘటన నేపథ్యంలో నగరవాసుల్లో ఆందోళన మొదలయింది. నగరం చుట్టూ అత్యంత భారీ పైపులైన్లు పాతబడి ప్రమాదకరంగా ఉన్నాయి. ఇప్పటికే నగరంలో హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, స్టీల్‌ప్లాంట్, హెచ్‌పీ, బీపీసీ టెర్మినల్ ప్లాంట్లు, గ్యాస్ కంపెనీలు భారీగా ఉన్నాయి. ఇవన్నీ నిత్యం గ్యాస్ లోడింగ్, అన్‌లోడింగ్‌తో ప్రమాద హేతువులుగా మారాయి. సాక్షి, విశాఖపట్నం : నగరం నుంచి హైదరాబాద్‌కు గెయిల్ సంస్థ భారీ పైపులైన్ వేసింది. రోజుకు 2.5 లక్షల గ్యాస్ సిలెండర్లను నింపగలిగే సామర్థ్యం ఈ పైపులైన్ సొంతం. ఆ పక్కనే హెచ్‌పీసీఎల్ చమురు, డీజిల్ తరలించే పైపులైన్ కూడా ఉంది. స్టీల్‌ప్లాంట్‌లో భారీ స్థాయిలో గ్యాస్ వినియోగం జరుగుతోంది. హెచ్పీసీల్లోనూ గ్యాస్ పైపులైన్లు భారీస్థాయిలో పనిచేస్తున్నాయి. ఇవికాకుండా సుమారు 13 రకాల ఇండస్ట్రియల్ పార్కులు, ఎస్ఈజెడ్లు, ఉక్కు ఆథారిత కంపెనీలు గ్యాస్‌తో నడుస్తున్నాయి. ఇలా భారీ స్థాయిలో కంపెనీలు వందలాది పైపులైన్లు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఆయా కంపెనీలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. గతంలో స్టీల్‌ప్లాంట్‌లో అనేకసార్లు గ్యాస్ లీకై పదుల సంఖ్యలో కార్మికులు మృతి చెందారు. ఇటీవల గ్యాస్‌లీకై ఉక్కు ఎస్ఎంఎస్-2లో ఇద్దరు ఇంజినీర్లు మృత్యువాత పడ్డారు. 1997లో హెచ్‌పీసీఎల్ గ్యాస్ అన్లోడింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో 60 మంది వరకు మత్యువాత పడ్డారు. 2013 ఆగస్టులో కూలింగ్ టవర్ కూలి 23మంది వరకు మృతి చెందారు. ఇలా నిత్యం ఏదొక కంపెనీలో గ్యాస్ ప్రమాదం జరుగుతూనే ఉంది. కంపెనీలు వేసిన గ్యాస్‌పైపులైన్లు ఇప్పుడు ప్రజలకు సైతం ప్రాణాలకు ముప్పు తెచ్చేలా ఉన్నాయి. ఈ పైపులైన్లు నిర్మించి చాలా ఏళ్లు అవుతుండడంతో ఎక్కడ, ఎప్పుడు, ఏ పైపులైను లీకవుతుందోననే భయం వెన్నాడుతోంది. సింధియా, మల్కాపురం, గాజువాక ప్రాంతాల్లో వందలాది పైపులున్నాయి. ఇవి పాతపబడిపోయి గ్యాస్, చమురు లీకవుతున్నాయి. కంపెనీలు మాత్రం ఈ పైపులైన్ల భద్రతను పట్టించుకోవడంలేదు. వాస్తవానికి గ్యాస్‌పైపులైన్ల వెంబడి నిత్యం కంపెనీల సిబ్బంది పహారా కాయాలి. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా తక్షణమే అప్రమత్తమై స్పందించాలి. కానీ ఇది జరగడం లేదు. పారిశ్రామిక ప్రాంతంలో ఖాళీగా ఉన్న వందలాది ఎకరాల్లో విస్తరించిన పైపులను ఏ కంపెనీ కూడా పట్టించుకోవడం లేదు. దీని వల్ల ఏ ప్రమాదం జరిగినా గ్యాస్ వాసన, రసాయనాల లీకు, అగ్ని ప్రమాదాల కారణంగా నగరవాసుల భద్రతకు ముప్పు పొంచి ఉంటుంది. గెయిల్, హెచ్‌సీపీఎల్ నగరం నుంచి హైదరాబాద్‌కు నిర్మించిన పైపులైన్లు అనేక గ్రామాల మీదుగా వెళ్తున్నాయి. వీటిపై తెలిసో తెలియకో స్థానికులు ఇళ్లు నిర్మిస్తున్నారు. చమురు కోసం దొంగలు వీటిని పగులగొట్టి ఇంధనం కాజేస్తున్నారు. ఇది ప్రమాదకరం. ఏ చిన్న నిప్పు అంటుకున్నా ఇవి పేలి రోజుల తరబడి మంటలు కొనసాగుతాయి. తూర్పుగోదావరి జిల్లా నగరం దుర్ఘటన నేపథ్యంలో మరోసారి ఆయా కంపెనీలు గ్యాస్, చమురు పైపులైన్ల భద్రతపై పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా అంతులేని నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది. నగరానికి ఇంకో గ్యాస్ పైపులైన్ ఇప్పటికే గ్యాస్ పైపులైన్లతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగరానికి మరో భారీ పైపులైను రాబోతోంది. కాకినాడ నుంచి విశాఖ వరకు గృహ, పారిశ్రామిక అవసరాల కోసం ప్రత్యేకంగా పైపులైను వేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. గరిష్టంగా 10 లక్షల మంది గృహ వినియోగదారులకు, 40 భారీ కంపెనీలు, 13 ఇండస్ట్రియల్ పార్కులు, ఎస్ఈజెడ్లకు నిరంతర గ్యాస్ అందించడానికి దీన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
బైస్ట్రో చైర్ కంపెనీ నిర్మించిన బుల్లి ఈఫిల్ టవర్
విశ్వవిఖ్యాత ఈఫిల్ టవర్‌కు దీటుగా నిలిచిన ఈ టవర్ నిజానికి స్టీల్‌తో మాత్రం తయారుకాలేదు. బైస్ట్రో రకం కుర్చీలతో దీనిని తయారుచేశారు. ఫెర్మోబ్ అనే ఫర్నీచర్ తయారీ సంస్థ 125 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా 324 మీటర్ల ఎత్తయిన ఈఫిల్ టవర్ ఎదురుగా 324 కుర్చీలతో దీన్ని ఇలా ఏర్పాటుచేశారు. ఈఫిల్ టవర్‌ను సైతం సరిగ్గా 125ఏళ్ల క్రితం ప్రారంభించారు. -
పరిశ్రమలకు రేల్వే షాక్...!
చార్జీల పెంపుతో సిమెంటు, ఉక్కు రవాణా భారం సిమెంటు రేట్లు 3% మేర పెరిగే అవకాశం 2.5 శాతం వరకూ పెరగనున్న ఐరన్ ధరలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సరకు రవాణా చార్జీలను 6.5 శాతం మేర పెంచాలన్న రైల్వేశాఖ నిర్ణయంతో సిమెంటు, స్టీలు తదితర ఉత్పత్తులు మరింత భారం కానున్నాయి. దాదాపు 40 శాతం సిమెంటు రవాణా రైల్వేల ద్వారానే ఉంటోంది. ఈ నేపథ్యంలో రవాణా చార్జీల పెరుగుదలతో సిమెంటు రేట్లు 3 శాతం మేర పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దీంతో బస్తా ధరపై భారం రూ. 10కి కాస్త అటూ, ఇటూగా ఉండొచ్చని వివరించాయి. ఇక ఇనుము, దుక్కిఇనుము వంటి వాటి రేట్లు కూడా పెరగనున్నాయి. వీటి ధరలు సుమారు 2.5 శాతం దాకా పెరగవచ్చని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఫౌండ్రీమెన్ దక్షిణ ప్రాంత చైర్మన్ వి. రామస్వామి సాక్షి బిజినెస్ బ్యూరోకి తెలిపారు. ఉక్కు కంపెనీలపై కూడా అంతేశాతం భారం వుండవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేట్ల పెరుగుదల భారాన్ని కంపెనీలు.. వినియోగదారులకు బదలాయిస్తాయా లేదా ప్రస్తుతానికి అవే భరిస్తాయా అన్నది చూడాల్సి ఉంటుందని పరిశీలకులు పేర్కొన్నారు. ఏటా రూ. 8,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకునే లక్ష్యంతో రైల్వేస్ అటు రైలు ప్రయాణ చార్జీలను 14.2 శాతం మేర, సరకు రవాణా చార్జీలను 6.5 శాతం మేర పెంచాలని నిర్ణయించింది. ఈ నెల 25 నుంచి ఈ రేట్లు అమల్లోకి రానున్నాయి. రియల్టీ రంగానికి దెబ్బ... ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న సిమెంటు, ఉక్కు తదితర ఉత్పత్తుల ధరలు రైల్వే రవాణా చార్జీల పెంపు వల్ల మరింత ఎగిసే అవకాశం ఉందని రియల్టీ దిగ్గజం పార్శ్వనాథ్ డెవలపర్స్ చైర్మన్ ప్రదీప్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ రంగానికి ఉక్కు, సిమెంటు..రెండూ ప్రధాన ముడి సరుకులని ఆయన చెప్పారు. గడ్డుకాలం ఎదుర్కొంటున్న రియల్టీ రంగానికి రవాణా చార్జీల పెంపు గట్టి ఎదురుదెబ్బగా ఆయన వ్యాఖ్యానించారు. ‘ఇప్పటికే అమ్ముడుకాని ప్రాజెక్టు యూనిట్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో మేం ప్రాపర్టీ రేట్లను పెంచే పరిస్థితి కూడా లేదు’ అని జైన్ పేర్కొన్నారు. కాబట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ రంగానికి కాస్త ఊరటనిచ్చే విధంగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నట్లు జైన్ తెలిపారు.ఇప్పటికే వృద్ధి మందగమనంలో ఉన్నందున ఉక్కు వంటి భారీ పరిశ్రమలపై రవాణా చార్జీల పెంపు భారాన్ని మోయగలిగే పరిస్థితి లేదని సీఐఐ పేర్కొంది. సరకు రవాణా ద్వారా రైల్వేస్‌కి సుమారు 20 శాతం ఆదాయం ఉక్కు రంగం నుంచే ఉందని, ఇప్పటికే ఈ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉందని బెనర్జీ పేర్కొన్నారు. ఎరువుల సబ్సిడీ భారం మరో రూ.200 కోట్లు: సరకు రవాణా చార్జీల పెంపుదలతో ఎరువుల సబ్సిడీ భారం ఏటా దాదాపు రూ. 200 కోట్ల మేర పెరగనుంది. అయితే, ఈ ప్రభావం రిటైల్ రేట్లపై ఉండబోదని ఎరువుల సంస్థల సమాఖ్య(ఎఫ్ఏఐ) డెరైక్టర్ జనరల్ సతీష్ చందర్ తెలిపారు. ప్రతి ఏటా దేశీయంగా 4.4 కోట్ల టన్నుల ఎరువులు రవాణా అవుతుండగా.. ఇందులో 80% రవాణా రైలు మార్గంలోనే ఉంటోంది. మధ్యంతర బడ్జెట్లో కేంద్రం రూ. 67,970 కోట్ల మొత్తాన్ని ఎరువుల సబ్సిడీగా నిర్ణయించింది. విశాఖ ఉక్కుపై ప్రభావం... సాక్షి,విశాఖపట్నం: రైల్వేశాఖ రవాణా చార్జీలు పెంచడంతో విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌పై మరింత భారం పడనుంది. ఛత్తీస్‌ఘడ్ నుంచి నిత్యం లక్షల టన్నుల్లో ముడి ఇనుమును వైజాగ్‌పోర్టు,గంగవరం పోర్టుల నుంచి ప్లాంటు వరకూ సరుకును తీసుకురావడానికి రవాణా చార్జీల రూపంలోనే ఏటా రైల్వేకు కోట్లకు కోట్లు చెల్లిస్తోంది. ఇప్పుడు చార్జీలు మరింత పెరగడంతో ఆర్థికంగా మరింత సమస్య ఎదుర్కోనుంది. ఇప్పటికే ముడి ఇనుము విక్రయ ధరలను నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) భారీగా పెంచేసింది. మార్కెట్లో ఉక్కు అమ్మకాలు మందగించి సతమతమవుతోన్న స్టీల్ రంగానికి ఒకపక్క ముడి ఇనుము ధర పెంచడం, మరోపక్క రవాణా చార్జీలు పెంచడంతో ఆర్థిక భారం భరించలేక త్వరలో ఉక్కు ధరలను కూడా పెంచే అవకాశం ఉంది. రైల్వే నిర్ణయం వెలువడిన తర్వాత స్టీల్‌ప్లాంట్‌తోపాటు అనేక ప్రైవేటు ఉక్కు కంపెనీల యాజమాన్యాలు ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆర్థికభారంపై చర్చించాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరోపక్క ఇక్కడి ఎన్టీపీసీ ప్లాంటుపైనా రవాణా చార్జీల పెంపు భారం పడనుంది. తాల్చేరుతోపాటు ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ నుంచి ఎన్టీపీసీ 8 లక్షల బొగ్గు దిగుమతి చేసుకుంటోంది. ద్రవ్యోల్బణం మరింత పైపైకి.. న్యూఢిల్లీ: రైలు ప్రయాణ చార్జీలు, సరకు రవాణా చార్జీల పెంపుదల అనివార్యమే అయినప్పటికీ.. దీని వల్ల ద్రవ్యోల్బణం మరికాస్త పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. రవాణా వ్యయాలు పెరిగిపోవడమే ఇందుకు కారణమన్నారు. ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొందని, అయితే దీని వల్ల రైల్వే ఆర్థిక పరిస్థితి మెరుగుపడగలదని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ చీఫ్ ఎకానమిస్టు డీకే జోషి చెప్పారు. ఇటీవలే విడుదలైన గణాంకాల ప్రకారం.. టోకుధరల ఆధారిత ద్రవ్యోల్బణం మే నెలలో ఏకంగా అయిదు నెలల గరిష్టమైన 6.01 శాతం మేర ఎగిసిన సంగతి తెలిసిందే. అటు, ప్రయాణికులపై కొంత భారం పడుతున్నప్పటికీ.. రైలు చార్జీల పెంపు స్వాగతించతగినదేనని ఎర్న్స్ట్ అండ్ యంగ్ పార్ట్నర్ అభయ అగర్వాల్ తెలిపారు. తగినన్ని నిధులు ఉంటేనే రైల్వే శాఖ మెరుగైన సర్వీసులు అందించడం సాధ్యపడుతుందన్నారు. సాహసోపేత నిర్ణయం.. చార్జీల పెంపు విషయంలో ప్రభుత్వం సాహసోపేతంగా వ్యవహరించిందని, సబ్సిడీలను కట్టడి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్న సంకేతాలను ఇది పంపించినట్లయిందని వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ సీఏసీపీ మాజీ చైర్మన్ అశోక్ గులాటీ పేర్కొన్నారు. ఇది సర్వీసుల మెరుగుదలకు, ముందుముందు రేట్ల తగ్గుదలకు తోడ్పడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న రైల్వేస్‌ని ఒడ్డున పడేసేందుకు దిద్దుబాటు చర్యలు అవసరమని, ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని అసోచాం ప్రెసిడెంట్ రాణా కపూర్ వ్యాఖ్యానించారు. సరకు రవాణా, రైలు చార్జీలను పెంచడమనేది రైల్వేస్ మెరుగైన సేవలు అందించేందుకు తోడ్పడగలవని భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. సురక్షితమైన సర్వీసులు అందించే దిశగా వనరులు సమకూర్చుకోవడానికి ఉపయోగపడగలదని వివరించారు. రైల్వేస్ ప్రాజెక్టుల్లో పాల్గొనేలా బహుళజాతి ఫండింగ్ ఏజెన్సీలను ఆహ్వానించడం, రైల్వే స్థలాలను మెరుగ్గా వినియోగించుకోవడం, రైల్ అసెట్ లీజింగ్ అథారిటీని ఏర్పాటు చేయడం తదితర చర్యల ద్వారా మరిన్ని వనరులు సమకూర్చుకోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు, ఏళ్ల తరబడి పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్లుగా రేట్లను పెంచి ఉంటే.. ఇంత భారీగా ఒకేసారి పెంచాల్సిన అవసరం ఉండేది కాదని ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా అభిప్రాయపడ్డారు. -
ఇంటికి వెళ్తూ అందని లోకాలకు..
రోడ్డు ప్రమాదంలో స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి మృతి కొప్పాక జంక్షన్ వద్ద ఢీకొన్న రెండు కార్లు అనకాపల్లిరూరల్: కాసేపట్లో ఇంటికి చేరాల్సిన వ్యక్తిని రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. ఈ సంఘటన మండలంలోని కొప్పాక జాతీయ రహదారి మలుపు వద్ద ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి విజయరామరాజు పేటకు చెందిన ఎ.వి.ఎస్.అప్పారావు స్టీల్ ప్లాంట్‌లో ఎలక్ట్రికల్ ఎస్ఎమ్ఎస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే కొప్పాకలో సొంత ఇల్లు నిర్మించుకున్నాడు. ఆదివారం స్టీల్‌ప్లాంట్‌లో విధులు ముగించుకొని ఇంటికి కారులో బయలుదేరాడు. కొప్పాక జంక్షన్ మలుపు వద్ద అనకాపల్లి నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఇన్నోవా కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టగా అప్పారావు బయటకు తూళి పడ్డాడు. తలకు బల మైన గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో కారు డ్రైవర్ పరారయ్యాడు. స్థానిక యువకుడు గమనించి బైక్‌పై సుమారు మూడు కిలోమీటర్లు వెంబడించి కారుతో పాటు అందులో ఉన్న వారందరినీ సంఘటన స్థలానికి తీసుకువచ్చాడు. ప్రమాదంలో ఇన్నోవా కారులో ఉన్న కర్రి సన్యాసమ్మ, బుద్ధ జగదీశ్వరావు, బుజ్జి, కర్రి పద్మలకు గాయాలయ్యాయి. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయరామరాజుపేట, కొప్పాకలో విషాదఛాయలు అందరితో కలిసిమెలసి ఉండే అప్పారావు మృతితో విజయరామరాజుపేట, కొప్పాకలో విషాదఛాయలు అలుముకున్నాయి. అధిక సంఖ్యలో తరలివచ్చిన జనం మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. -
ఇల్లు...కట్టినోళ్లు గొల్లు!
సిమెంట్ ధరలు పైపైకి... అదే దారిలో ఇతర ముడి సరుకు ధరలు నిర్మాణాలపై అదనపు భారం ‘ఇల్లు కట్టి చూడు... పెళ్లి చేసి చూడు...’ అన్నారు పెద్దలు. పెళ్లి మాటేమో గానీ ఇల్లు కట్టడం మాత్రం పేద, మధ్య తరగతి ప్రజలకు తలకు మించిన భారంగా మారింది. సిమెంట్ ధర వారం రోజుల వ్యవధిలో గతంలో ఉన్నడూ లేనంతగా పెరిగింది. ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే ముడి సరుకు ధరలూ అదే తరహాలో పెరుగుతుండడం సామాన్యులకు ఆందోళన కలిగిస్తోంది. వారం రోజుల వ్యవధిలో సిమెంట్, ఇటుక, స్టీల్, చిప్స్(కంకర), ఇసుక ధరలు పెరగడం వల్ల నిర్మాణాలపై అదనపు భారం పడుతోంది. పిల్లర్లు, స్లాబులకు ఉపయోగించే ఇనుము(స్టీల్) కొంత ఊరట నిస్తున్నాయి. కానీ మిగిలిన ముడి సరుకుల ధరలు పెరగడంతో ఇళ్ల నిర్మాణదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మండలంలో సొంత ఇళ్లు, ఇతర వాణిజ్య సముదాయాలు, పాఠశాల భవనాలు అధిక సంఖ్యలో నిర్మాణ దశల్లో ఉన్నాయి. ధరల పెరుగుదల కారణంగా మందగించాయి. వేసవిలోనే నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశం చేయాలని భావించిన వారికి పెరిగిన ధరలు షాక్‌నిస్తున్నాయి. రూ.300 చేరిన సిమెంట్ వారం రోజుల క్రితం సిమెంట్ ధర అరకులోయలో రూ. 245 ఉంటే అదే సిమెంట్ ధర ఇపుడు రూ. 300 చేరింది. సిమెంట్ పరిశ్రమల యజమానులు సిండికేట్‌గా ఏర్పడడంతో ఒక్కసారిగా ధరలు ఆకాశనంటుతున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నారు. భవిష్యత్‌లో మరలా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బస్తాకు రూ. 60 వరకు పెరగడం గమనార్హం. ఇటుకల ధరలు పైపైకి... భవన నిర్మాణానికి అవసరమైన అన్ని ముడి సరుకుల మాదిరిగానే ఇటుకల ధరలు పెరిగాయి. రెండు వేల మట్టి ఇటుక గతంలో రూ. 8వేలు ఉండగా, ప్రస్తుతం రూ. 10 వేలుకు పెరిగింది. వెయ్యి ఫాల్ జి బ్రిక్స్ రూ. 13వేలు నుంచి రూ. 15వేలకు పెరిగింది. ఇసుక బంగారమే... భవన నిర్మాణానికి ఇసుక ప్రాణదాత. చుట్టుపక్కల గెడ్డల్లో ఇసుక లభిస్తున్నా ధర మాత్రం ఎక్కువగానే ఉంది. ఇసుక బంగారంగా మారింది. ఇదే అదనుగా ట్రాక్టర్, లారీల యజమానులు అదనపు ధరలకు విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక ధర రూ. 800 నుంచి రూ. 1000 పలుకుతోంది. వర్షాకాలం రానుండడంతో ట్రాక్టర్, లారీల యజమానులు ఇసుక నిల్వలు చేసుకుంటున్నారు. మార్కెట్లో గిరాకీని బట్టి ధరలు పెంచుతున్నారు. కంకర...ధర కటకట : నిర్మాణాలకు అవసరమైన కంకర ఎస్.కోట సమీపం నుంచి ఈ ప్రాంతానికి ఎక్కువగా దిగుమతి అవుతోంది. నాణ్యమైన కంకర కావడంతో వినియోగదారులు వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో కంకర ధర బాగా పెరిగింది. కొద్ది రోజుల క్రితం రెండు యూనిట్ల లారీ లోడు రూ. రూ.10వేల నుంచి రూ.13వేలకు చేరింది. 40 యం.యం. లారీ లోడు రూ. 7,500 నుండి రూ.9 వేలుకు చేరింది. పునాది బండ...గుది బండ : పునాదులకు ఉపయోగించే బండ రాళ్ల ధర కూడ బాగా పెరిగింది. పునాదులకు అవసరమైన ట్రాక్టర్ లోడు బండరాళ్లు రూ. 1200 నుంచి రూ. 1500 చేరింది. అయినా ఒక యూనిట్ రాయి పూర్తిగా రావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. -
8 కీలక పరిశ్రమలు ఓకే
ఏప్రిల్‌లో వృద్ధి 4.2 శాతం విద్యుత్, ఎరువులు, సిమెంట్ బెటర్ న్యూఢిల్లీ: మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 38 శాతం వాటా కలిగిన 8 కీలక పరిశ్రమల గ్రూప్ ఏప్రిల్‌లో కొంత మంచి ఫలితాన్ని ఇచ్చింది. 4.2 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. 2014 మార్చిలో ఈ రేటు 2.5 శాతంకాగా, 2013 ఏప్రిల్ నెలలో 3.7 శాతం. విద్యుత్, ఎరువులు, సిమెంట్, బొగ్గు రంగాలు మంచి ఫలితాలను ఇవ్వడం వృద్ధి కొంత మెరుగ్గా ఉండడానికి కారణమయ్యింది. ఇంకా ఈ గ్రూప్‌లో క్రూడ్ ఆయిల్, సహజ వాయువులు, రిఫైనరీ ప్రొడక్టులు, స్టీల్ ఉన్నాయి. సోమవారం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. వివిధ రంగాల పనితీరును 2013 ఏప్రిల్‌తో పోల్చిచూస్తే... బొగ్గు: వృద్ధి రేటు 1.2% నుంచి 3.3%కి ఎగసింది. ఎరువులు: ఈ రంగం క్షీణత నుంచి బైటపడింది. ఈ రంగం మైనస్ (-) 2.4 శాతం నుంచి 11.1 శాతం వృద్ధిలోకి మళ్లింది. సిమెంట్: వృద్ధి 5.2% నుంచి 6.7 శాతానికి ఎగసింది. విద్యుత్: ఈ రంగంలో వృద్ధి రేటు భారీగా 3.5 శాతం నుంచి 11.2 శాతానికి ఎగసింది. క్రూడ్ ఆయిల్: వృద్ధి క్షీణతలోనే ఉన్నా (-1.2 శాతం) ఇది కొంత తగ్గి మైనస్ (-) 0.1 శాతంగా ఉంది. సహజ వాయువులు: క్షీణత (-) 17.4 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గింది. రిఫైనరీ ప్రొడక్టులు: 6.2% వృద్ధి రేటు క్షీణతలోకి జారిపోయింది. ఈ రేటు -2.2%గా నమోదయ్యింది. ఉక్కు: వృద్ధి రేటు 10.1% నుంచి 3.1%కి పడింది. ఐఐపీ నిరుత్సాహమే: ఇక్రా అంచనా కోర్ ఇన్ఫ్రా పరిశ్రమల పనితీరు బాగున్నప్పటికీ, ఏప్రిల్ 2014 ఐఐపీ వృద్ధి మాత్రం ఒక శాతం లోపే ఉండే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తోంది. ఈ గణాంకాలు ఈ నెల రెండవ వారం చివర్లో రానున్నాయి. ఐఐపీ గణాంకాలు వరుసగా రెండవనెల మార్చిలో క్షీణ దిశలో ఉన్నాయి. మార్చిలో ఈ రేటు -0.5 శాతంగా నమోదయ్యింది. -
ఇది మనకి పనికిరాదా?
వాయనం కొన్నాళ్లక్రితం మహిళలందరి నోటా ఓ వస్తువు గురించి తరచూ వినిపిస్తూ ఉండేది. ఆ వస్తువు మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ వారి ఎదురు చూపులు ఫలించలేదు. అది మార్కెట్లోకి రాలేదు. వచ్చిన ఒకట్రెండు చోట్ల కూడా సక్సెస్ అవ్వలేదు. దాంతో భారతీయ మార్కెట్ నుంచి అది మాయమైంది. ఇంతకీ ఆ వస్తువేంటో తెలుసా... డిష్ వాషర్! గిన్నెలు కడుక్కోవడానికి తయారు చేసిన ఈ యంత్రం చాలా ఉపయోగకరమైనది. గిన్నెలన్నీ ఇందులో అమర్చి బటన్ నొక్కితే, అదే కడిగేస్తుంది. ఇది మనకూ లభిస్తే బోలెడంత శ్రమ తగ్గిపోతుందని భారతీయ మహిళలు ఆశించారు. కానీ మన దగ్గర డిష్ వాషర్లు పనికి రావని తేలిపోయింది. దానికి కారణాలు బోలెడు. దీని ఖరీదు చాలా ఎక్కువ కాబట్టి పట్టణాల్లోని ఉన్నత ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల్లాంటివాళ్లు మాత్రమే దీన్ని కొనగలుగుతారు. అయితే భారతీయ నగరాల్లో చాలాచోట్ల నీటి సమస్య ఉంది. డిష్ వాషరేమో చాలా నీరు తీసుకుంటుంది విదేశాల్లో తినే ఆహారంలో నూనెశాతం చాలా తక్కువ. కానీ మనం నూనె, మసాలాలు, నెయ్యి వంటివి ఎక్కువ వాడతాం. కాబట్టి జిడ్డు, మొండి మరకలు ఏర్పడతాయి. వాటిని వాషర్ పూర్తిగా పోగొట్టలేదు. ఎందుకంటే ఇది విదేశీయుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని చేసింది కదా! ముందు మనం ఓసారి కడిగి, అప్పుడు వాషర్లో పెట్టాల్సి ఉంటుంది. అంతకంటే మామూలుగా కడుక్కోవడమే బెటర్ కదూ! విదేశీయులు పింగాణీ, ఫైబర్ వస్తువులు ఎక్కువ వాడతారు. అవి తేలిగ్గా శుభ్రమవుతాయి. కానీ మనం స్టీలు, సీమవెండిని ఎక్కువ వాడతాం. వాటిని కడగడం వాషర్‌కి కాస్త కష్టమే! కాస్త పెద్ద కుటుంబమైతే ఎక్కువ గిన్నెలుంటాయి. రెండు మూడు సార్లు కడుక్కోవాలి. మరి కరెంటు బిల్లు మామూలుగా వస్తుందా! పైగా ఎక్కువమంది ఉండే కుటుంబాల్లో పెద్ద పెద్ద గిన్నెల్లో వండుతారు. అవి వాషర్లో పట్టవు కూడాను! ఇన్ని సమస్యలు ఉండబట్టే మనకు డిష్ వాషర్లు అంతగా అందుబాటులోకి రాలేదు. మరి ఏ కంపెనీ అయినా మనల్ని తృప్తిపరిచే వాషర్లు తయారుచేస్తుందేమో చూద్దాం! -
విశాఖ ఉక్కు లాభం రూ.250 కోట్లు
సాక్షి, విశాఖపట్నం: 2013-2014 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి మాసాంతానికి వైజాగ్ స్టీల్‌ప్లాంట్ రూ.13,527 కోట్ల టర్నోవర్‌పై రూ.250 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు ప్లాంట్ సీఎండీ మధుసూదన్ ప్రకటించారు. గతేడాది నికర లాభం రూ.353 కోట్లతో పోల్చితే ఇది కొంచెం తక్కువేనన్నారు. అమ్మకాల్లో 8 % వృద్ధిసాధించినట్లు వివరించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ప్లాంట్ పనితీరు వివరించడానికి శనివారం ఆయన విశాఖలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 2013-2014లో సుమారు రూ.11 వేల కోట్ల వ్యయంతో మొదటి దశ కింద 6.3 మిలియన్ టన్నుల ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచామని చెప్పారు. క్యాప్టివ్ విద్యుత్ ఉత్పాదనలో 4%, విదేశీ ఉక్కు ఎగుమతుల్లో 25% వృద్ధి సాధించడం సంతోషంగా ఉందన్నారు.