కలపను కట్ చేసే కత్తులను చూసి ఉంటారు.. కానీ, కత్తినే కట్ చేసే కలపకత్తిని చూశారా? కూరగాయలు, పండ్లతోపాటు మాంసం ముక్కలను కూడా ఈజీగా కట్ చేయగలదు ఈ కత్తి. సాధారణ లోహపు కత్తి కంటే ఇది 23 రెట్లు బలమైనది, మూడు రెట్లు పదునైనది.
కూరగాయలు కట్ చేసే కత్తుల్లో ఎక్కువగా స్టీల్, ఇనుము వంటి లోహాలనే ఎందుకు వాడటం.. విరివిగా దొరికే కలపను ఎందుకు ఉపయోగించ కూడదు అని ఓ విద్యార్థికి వచ్చిన అద్భుతమైన ఆలోచనే ఈ రూపకల్పనకు దారితీసింది. ఇందుకు అమెరికాలోని మేరిల్యాండ్ యూనివర్సిటీ అధ్యాపకులు కూడా సహాయం చేయడంతో చక్కటి ఈ కలపకత్తి తయారైంది.
సాధారణ కత్తిలాగే.. సెల్యులోజ్, ఇతర రసాయనాలను ఓ ప్రత్యేకమైన కలపతో చేర్చి, అధిక ఉష్ణోగ్రత, ఒత్తిడిని ఉపయోగించి, దీనిని తయారు చేశారు. అయితే, దీనిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ టెంగ్ లీ తెలిపారు. ఏదిఏమైనా.. కలపకత్తి ‘కత్తి’లా ఉంది కదూ!
Comments
Please login to add a commentAdd a comment