చెక్క కత్తి (ఓన్లీ మేడ్ విత్ వుడ్)... దీనితో మాంసం, కూరగాయలు.. ఇంకా గట్టి పదార్థాలు కూడా కట్ చేయొచ్చు. చెక్కతో తయారు చేసిన కత్తేమిటీ, గట్టి పదార్థాలను కట్ చేయడమేంటి..? మీ అనుమానం ఇదేనా! నిజంగానే చెక్కతో తయారు చేసిన కత్తి అండీ!! అచ్చం స్టెయిన్‌లెస్ స్టీల్ కత్తి మాదిరి. నిజం చెప్పాలంటే.. స్టీల్ కత్తి కంటే కూడా మూడు రెట్లు పదునైనది ..
యూనిర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఈ విధమైన కత్తిని తయారు చేసింది. ఈ విశ్వవిద్యాలయం పరిశోధకులు మామూలు కలపను గట్టిపడే ప్రక్రియను వినియోగించి ఈ కత్తిని తయారు చేశారట. దీంతో సాధారణ చెక్క కంటే 23 రెట్లు బలంగా తయారైంది. ఇది పర్యావరణానికి కూడా మంచిదట. ఈ చెక్క కత్తి విశేషాలు ప్రొఫెసర్ టెంగ్ లీ మాటల్లో..
చదవండి: Foods For Bone Health: అరటి, పాలకూర, డ్రై ఫ్రూట్స్, చేపలు, బొప్పాయి.. ఇవి తింటే..
‘స్టీమింగ్ లేదా కంప్రెషన్ వంటి వుడ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ శతాబ్దాలుగా ఆచరనలో ఉన్నాయి. ఐతే కొంచెం ఒత్తిడి తగలగానే విరిగిపోతాయి. ఐతే సాధారణంగా ఒక చెట్టులో 40-50 శాతం నారతో కలప ఏర్పడుతుంది. మిగిలిన భాగమంతా హెమిసెల్యులోజ్, లిగ్నిన్ అని పిలువబడే బైండర్ ఉంటుంది. అది నార బలాన్ని తగ్గిస్తుంది. నార నిర్మాణాన్ని దెబ్బతీయకుండా చెక్కలో బలహీనమైన భాగాలను తొలగించడం ద్వారా చెక్క కత్తిని అభివృద్ధి చేశాం. ఈ విధంగా తయారు చేసిన కత్తి, తేమ తగిలిన తర్వాత కూడా దాని పదును చెదరకుండా ఉండేందుకు మినరల్ ఆయిల్‌తో పూత పూశాము. ప్రక్రియ చెక్క తుప్పులను ఉక్కులాగా, పదునుగా చేయగలదని, తుప్పు నిరోధకతను కలిగి ఉంటుందని’ ఆయన పేర్కొన్నారు.
వంటగదిలో కట్టింగ్ బోర్డ్, చాప్ స్టిక్‌లు, రోలింగ్ పిన్ వంటి చాలా కాలంగా వినియోగించే చెక్క ముక్కలను కూడా ఈ ప్రక్రియ ద్వారా పదునుపెట్టి కత్తులుగా మార్చొచ్చట. అసలు ఇంతవరకూ ఎప్పుడైనా ఊహించామా చెక్కతో తయారు చేసిన కత్తులు కూడా ఉంటాయని.. ఈ చెక్క కత్తుల గురించి మీరు ఏమనుకుంటున్నారు?
చదవండి: Science Facts: క్యాన్సర్ నివారణకు పసుపు ఉపయోగపడుతుందా?.. అదే అడ్డంకి..
Comments
Please login to add a commentAdd a comment