stainless steel
-
సెప్టెంబర్ 14 నుంచి గ్లోబల్ స్టెయిన్లెస్ స్టీల్ ఎక్స్పో
న్యూఢిల్లీ: స్టెయిన్లెస్ స్టీల్ రంగంలో ఉన్న అవకాశాలు, డిమాండ్‌పై కంపెనీలు చర్చించనున్నాయి. ముంబైలో సెప్టెంబర్ 14 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ‘గ్లోబల్ స్టెయిన్లెస్ స్టీల్ ఎక్స్పో 2023’ ఇందుకు వేదికగా నిలవనుంది. పరిశ్రమకు చెందిన 500 మందికి పైగా ఇందులో పాల్గొననున్నారు. ఈ వివరాలను విగ్రో కమ్యూనికేషన్స్ అండ్ ఎగ్జిబిషన్స్ (వీసీఈ) ప్రకటించింది. డిమాండ్‌ను సృష్టించడం, కాలుష్య ఉద్గారాల నియంత్రణ లక్ష్యాలు, కొత్త టెక్నాలజీలపై పరిశోధన, అభివృద్ధి తదితర అంశాలపై స్టెయిన్లెస్ స్టీల్ కంపెనీల ప్రతినిధులు చర్చించనున్నారు. ‘‘భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే విషయంలో స్టెయిన్లెస్ స్టీల్ కీలక పాత్ర పోషించనుంది. గ్లోబల్ స్టెయిన్లెస్ స్టీల్ ఎక్స్‌పోలో భాగంగా సీఈవోలతో రౌండ్ టేబుల్, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు జరుగుతాయి. వీటికితోడు పరిశ్రమ తరఫున సాంకేతిక సదస్సులు కూడా ఉంటాయి’’అని వీసీఈ డైరెక్టర్ అనితా రఘునాథ్ తెలిపారు. -
మన స్మారకం.. ఘన నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర అవతరణను సాకారం చేసిన తెలంగాణ అమరవీరుల స్మారకార్థం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం గురువారం ప్రారంభం కానుంది. హుస్సేన్‌సాగర్ తీరంలో గతంలో ఉన్న లుంబినీపార్కు స్థలంలో సచివాలయ భవనానికి ఎదురుగా నిర్మించిన ఈ స్మారకాన్ని గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అతుకుల్లేని స్టెయిన్లెస్ స్టీల్‌తో నిర్మించిన ఈ కట్టడం నగరంలో పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. అద్దంతో నిర్మించినట్టుండే ఈ కట్టడం ప్రపంచంలోనే నాలుగోది కావటం విశేషం. జర్మనీ తయారీ స్టెయిన్లెస్ స్టీల్‌ను దుబాయ్‌లో నిపుణులు ప్రీఫ్యాబ్రికేటెడ్ చేసి నగరానికి తరలించి అతికించి రూపొందించారు. కేవలం జర్మనీ తయారీ స్టెయిన్లెస్ స్టీల్‌కే దాదాపు రూ.50కోట్లు వ్యయం చేశారు. రూ.177 కోట్ల వ్యయంతో ఆరు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనం 26,800చ.మీ.ల విస్తీర్ణంలో రూపొందింది. 45 మీటర్ల ఎత్తుతో దీపం జ్వలిస్తున్నట్టు ప్రమిద ఆకారంలో నిర్మించిన ఈ భవనం ఆకట్టుకుంటోంది. క్లౌడ్ గేట్: ఇది అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన చికాగోలో ఉంది. అక్కడి సముద్రం ఒడ్డున భారీ ఆకాశహర్మ్యాల ప్రతిబింబాలతో అత్యంత సుందరంగా ఉంటుంది. ఎత్తయిన భవనాలు మేఘాలను తాకేలా ఉంటాయని ‘క్లౌడ్ గేట్’పేరుతో దీన్ని మిలీనియం పార్కులో ఏర్పాటు చేశారు. భారత్‌లో పుట్టి బ్రిటిష్ ఆర్కిటెక్ట్‌గా స్ధిరపడ్డ అనీశ్కపూర్ దీన్ని డిజైన్ చేశారు. లిక్విడ్ మెర్క్యురీ ఇతి వృత్తంగా రూపకల్పన చేసినప్పటికీ అది చిక్కుడు గింజ ఆకారంలో ఉండటంతో ‘ది బీన్’గా ఖ్యాతి పొందింది. ఇందుకు 168 భారీ స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లను వినియోగించారు. ఇది 66 అడుగుల పొడవు 33 అడుగుల ఎత్తు ఉంది. 2004లో నిర్మాణం మొదలై 2006లో ప్రారంభమైంది. ప్రపంచంలో ఈ తరహా నిర్మాణాలివి.. బిగ్ ఆయిల్ బబూల్: ఇది చైనాలోని కార్మే నగరంలో కొలువు దీరింది. ఆధునిక చైనా రూపకల్పనలో అక్కడి ప్రభుత్వం 1955 ప్రాంతంలో కార్మేలో చమురు బావుల తవ్వకం చేపట్టింది. తొలి బావి 1956లోఅందు బాటులోకి వచ్చింది. ఆ నగరం చమురు కేంద్రం అన్న భావన వచ్చేలా ‘బిగ్ ఆయిల్ బబూల్’పేరుతో స్థానికంగా దీన్ని నిర్మించారు. చికాగోలోని క్లౌడ్ గేట్‌కు నకలుగా ఉన్నా.. చైనా మాత్రం కాదంటోంది. దాదాపు 250 స్టెయిన్లెస్ స్టీల్ షీట్లతో దీన్ని 2013లో రూపొందించారు. కానీ ఇది చికాగో నిర్మాణం తరహాలో లేదన్న విమర్శలు మాత్రం వినిపించాయి. దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం: భారీ స్టెయిన్లెస్ స్టీల్ షీట్లతో నిర్మించిన మూడో కట్టడం ఇది. ఆధునిక నిర్మాణాలకు కేంద్రంగా దుబాయ్ నిలుస్తోందని చెప్పే ఉద్దేశంతో యూఏఈ ప్రభుత్వం నిర్మించింది. నాలుగు అంతస్తులుగా ఉండేలా 225 అడుగుల ఎత్తు, 17600 చదరపు మీటర్ల వైశాల్యంతో దీన్ని నిర్మించారు. ఇందులో ఎగ్జిబిషన్లు, ఇతర ప్రదర్శనలు, సదస్సులు నిర్వహిస్తారు. ఆధునిక దుబాయ్ లక్ష్యాన్ని అరబ్బీ అక్షరాల్లో తీర్చిదిద్దారు. మనం వందల ఏళ్లు బతకలేకపోయినా, మన ఆధునిక ఆవిష్కరణలు వందల ఏళ్లు మనుగడ సాగిస్తాయన్న ప్రారంభంతో ఆ పద్యం ఉంటుంది. దీన్ని 2016లోనే నిర్మించినా, 2022లో పూర్తి చేసి అధికారికంగా ప్రారంభించారు. -
దుబాయ్ స్టీలు.. అంచనా పెంచేసింది
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా అలాంటివి రెండే నిర్మాణాలున్నాయి.. మూడోది హైదరాబాద్‌లో రూపుదిద్దుకుంటోంది. అమెరికాలోని షికాగోలో 2006లో రూపొందిన ‘ది బీన్’శిల్పం మొదటిది కాగా, చైనాలోని జింగ్జియాన్ రీజియన్‌లో 2015లో ‘ది ఆయిల్ బబుల్’శిల్పం రెండోది. ఈ రెండింటి కంటే కొన్ని రెట్లు పెద్దదిగా ప్రమిద ఆకృతిలో రూపుదిద్దుకుంటున్నదే హైదరాబాద్‌లోని ‘అమరవీరుల స్మారక భవనం’. అద్దంలో కనిపించినట్టుగానే ఎదుటి ప్రాంతం ప్రతిబింబిస్తుంది. ఇది నునుపుగా ఉండే 60 వేల చదరపు అడుగుల స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపుదిద్దుకుంటోంది. ఇందులో అతుకుల్లేని విధంగా స్టెయిన్లెస్ స్టీల్ ప్యానెల్స్‌ను అమరుస్తారు. దాదాపు 48 అడుగుల ఎత్తుతో ఉం డే ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత గిన్నిస్‌బుక్ రికార్డుల్లో చోటు దక్కించుకుంటుందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. తెలంగాణ అమరవీరులను స్మరించుకునేలా.. వెలుగుతున్న ప్రమిద ఆకృతిలో రూపుదిద్దుకుంటున్న ఈ నిర్మాణం దేశంలోనే ఆ తరహా కట్టడాల్లో మొదటిది. హైదరాబాద్ పర్యాటకులకు గొప్ప అనుభూతిని పంచేలా ఇది రూపొందుతోంది. అన్నీ కుదిరితే వచ్చే దసరా నాటికి ఇది ప్రారంభానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఇప్పుడు కట్టడం చుట్టూవాడే స్టెయిన్లెస్ స్టీలు ప్యానెల్స్ వ్యయాన్ని కంపెనీ భారీగా పెంచేసింది. రూ.140 కోట్లలోపు వ్యయంతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు రూ.177 కోట్లను దాటబోతోంది. అమెరికా తరహాలో చైనాలోని ఆకృతి ఇదీ సంగతి... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర అమరవీరులదే. అందుకే వారి స్మృత్య ర్థం ఓ స్మారకాన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధా రణ నిర్మాణంగా కాకుండా ప్రత్యేకంగా ఉం డాలని భావించింది. దీంతో రకరకాల డిజైన్ల ను పరిశీలించి చివరకు వెలుగుతున్న ప్రమిద నమూనాను ముఖ్యమంత్రి ఎంపిక చేశారు. అయితే ఆ డిజైన్‌కు అతుకుల్లేని విధంగా చుట్టూ స్టెయిన్లెస్ స్టీలు ప్యానెల్స్‌ను వినియోగించే విషయంలో డిజైన్ రూపొందించిన సంస్థ స్ట్రక్చరల్ ఇంజనీర్, పనులు నిర్వహించే యంత్రాంగానికి మధ్య సమన్వయం కొరవడింది. నిర్మాణం తర్వాత చుట్టూ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తారని భావించి, దానికి రూ.5 కో ట్ల వరకు ఖర్చు వస్తుందని అంచనా వేసుకున్నారు. స్థానికంగానే దాన్ని రూపొందిస్తారని అధికారులు భావించారు. అయితే, అది అతుకుల్లేకుండా కనిపించేవిధంగా, వాతావరణ మార్పులకు వెలసిపోకుండా, పెద్ద పెద్ద పక్షు లు వాలినప్పుడుగానీ, ఇతర పరిస్థితుల్లోగానీ ఎలాంటి గీతలు పడకుండా, సొట్టలు పడ కుండా ఉండేటట్టు ప్రత్యేక రోబోటిక్ కటింగ్, లేజర్ బెండింగ్ పద్ధతిని అనుసరించాల్సి రావడంతో వ్యయం భారీగా పెరిగింది. దుబాయ్ కంపెనీతో ఒప్పందం చైనాలో ఆ విధమైన ఆధునిక పరిజ్ఞానం ఉందని అధికారులు మొదట గుర్తించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనాతో ఒప్పందం చేసుకునే వీలు లేకపోవటంతో ఓ దుబాయ్ కంపెనీని సంప్రదించారు. ముఖ్యమంత్రి ఆ మోదం పొందిన డిజైన్ కావటంతో దానిలో మార్పులు చేసేందుకు అధికారులు జంకా రు. గ్లాస్ ప్యానెల్స్, అల్యూమినియం ప్యానెల్స్‌తో చేయిస్తే సాధారణ ఖర్చులోనే ముగిసేది. కానీ, ఈ స్తూపం నిర్మాణంలో ప్రత్యే కంగా 4 ఎంఎం గేజ్‌తో ప్రత్యేక స్టీల్‌నే వాడా ల్సి వచ్చింది. సంబంధిత దుబాయ్ కంపెనీతో మాట్లాడాక కంగుతినటం అధికారుల వంతైంది. దాదాపు రూ.40 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి రావటమే దానికి కారణం. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ కంపెనీతోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫలితంగా ప్రాజెక్టు అంచనా వ్యయం అంతమేర పెరిగిపోవాల్సి వచ్చింది. ఇప్పు డు ఆ స్టీల్‌ను అక్కడే ప్రమిద ఆకృతికి తగ్గట్టుగా పలు ప్యానెల్స్‌గా కట్ చేసి, వాటికి గీతలు, సొట్టలు పడని విధంగా ప్రత్యేక కంటెయినర్లలో ఉంచి దుబాయ్ నుంచి తెప్పిస్తున్నారు. మొత్తం 23 కంటెయినర్లలో ఐదు కంటెయినర్లు మన దేశానికి చేరుకున్నాయి. ఇందులో రెండు కంటెయినర్లు పనిజరుగుతున్న చోటికి రాగా, మిగతా మూడు డ్రైపోర్టులో ఉన్నాయి. మిగతావి మరో మూడు నెలల్లో ఇక్కడికి రానున్నాయి. -
స్టీల్ కత్తి కంటే 3 రెట్లు పదునైందట! దేనితో తయారు చేశారో తెలుసా..
చెక్క కత్తి (ఓన్లీ మేడ్ విత్ వుడ్)... దీనితో మాంసం, కూరగాయలు.. ఇంకా గట్టి పదార్థాలు కూడా కట్ చేయొచ్చు. చెక్కతో తయారు చేసిన కత్తేమిటీ, గట్టి పదార్థాలను కట్ చేయడమేంటి..? మీ అనుమానం ఇదేనా! నిజంగానే చెక్కతో తయారు చేసిన కత్తి అండీ!! అచ్చం స్టెయిన్లెస్ స్టీల్ కత్తి మాదిరి. నిజం చెప్పాలంటే.. స్టీల్ కత్తి కంటే కూడా మూడు రెట్లు పదునైనది .. యూనిర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఈ విధమైన కత్తిని తయారు చేసింది. ఈ విశ్వవిద్యాలయం పరిశోధకులు మామూలు కలపను గట్టిపడే ప్రక్రియను వినియోగించి ఈ కత్తిని తయారు చేశారట. దీంతో సాధారణ చెక్క కంటే 23 రెట్లు బలంగా తయారైంది. ఇది పర్యావరణానికి కూడా మంచిదట. ఈ చెక్క కత్తి విశేషాలు ప్రొఫెసర్ టెంగ్ లీ మాటల్లో.. చదవండి: Foods For Bone Health: అరటి, పాలకూర, డ్రై ఫ్రూట్స్, చేపలు, బొప్పాయి.. ఇవి తింటే.. ‘స్టీమింగ్ లేదా కంప్రెషన్ వంటి వుడ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ శతాబ్దాలుగా ఆచరనలో ఉన్నాయి. ఐతే కొంచెం ఒత్తిడి తగలగానే విరిగిపోతాయి. ఐతే సాధారణంగా ఒక చెట్టులో 40-50 శాతం నారతో కలప ఏర్పడుతుంది. మిగిలిన భాగమంతా హెమిసెల్యులోజ్, లిగ్నిన్ అని పిలువబడే బైండర్ ఉంటుంది. అది నార బలాన్ని తగ్గిస్తుంది. నార నిర్మాణాన్ని దెబ్బతీయకుండా చెక్కలో బలహీనమైన భాగాలను తొలగించడం ద్వారా చెక్క కత్తిని అభివృద్ధి చేశాం. ఈ విధంగా తయారు చేసిన కత్తి, తేమ తగిలిన తర్వాత కూడా దాని పదును చెదరకుండా ఉండేందుకు మినరల్ ఆయిల్‌తో పూత పూశాము. ప్రక్రియ చెక్క తుప్పులను ఉక్కులాగా, పదునుగా చేయగలదని, తుప్పు నిరోధకతను కలిగి ఉంటుందని’ ఆయన పేర్కొన్నారు. వంటగదిలో కట్టింగ్ బోర్డ్, చాప్ స్టిక్‌లు, రోలింగ్ పిన్ వంటి చాలా కాలంగా వినియోగించే చెక్క ముక్కలను కూడా ఈ ప్రక్రియ ద్వారా పదునుపెట్టి కత్తులుగా మార్చొచ్చట. అసలు ఇంతవరకూ ఎప్పుడైనా ఊహించామా చెక్కతో తయారు చేసిన కత్తులు కూడా ఉంటాయని.. ఈ చెక్క కత్తుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? చదవండి: Science Facts: క్యాన్సర్ నివారణకు పసుపు ఉపయోగపడుతుందా?.. అదే అడ్డంకి.. -
మొదటి ప్రపంచ యుద్ధం ఇప్పటికీ ఉంది
మొదటి ప్రపంచ యుద్ధానికి ఇదేమీ ‘టైమ్’ కాదు. టైమ్ అంటే సందర్భం. వరల్డ్ వార్–1 మొదలైంది 1914 జూలై 14. ముగిసింది 1918 నవంబర్ 11న. ప్రారంభానికీ, ముగింపునకు వందేళ్లు ఎప్పుడో దాటిపోయాయి. పోనీ ఈ ప్రథమ ప్రపంచ సంగ్రామానికి కారకుడైన బోస్నియా యువకుడు గవ్రిలో ప్రిన్సిప్ బర్త్, డెత్‌ల తేదీల కూడా దగ్గర్లో ఏమీ లేవు. మరేమిటి! అకస్మాత్తుగా యుద్ధం–1? ఒక విశేషం అయితే ఉంది. ఎయిడ్స్‌కు కారణమైన హెచ్.ఐ.వి. వైరస్ అసలు ఎక్కడి నుంచి సంక్రమించిందో కనిపెట్టేందుకు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్న ఒక కెనడా ప్రొఫెసర్‌కు మధ్య ఆఫ్రికాలోని కామెరాన్‌లో మొదటి ప్రపంచ యుద్ధం మధ్య కాలం నాటి (1916) సైనికుడొకరు ఆకలికి తట్టుకోలేక ఒక చింపాజీని చంపి తినడంతో ఆ చింపాజీ నుంచి ఎయిడ్స్ క్రిమి సంక్రమించిన జాడలు కనిపించాయి. అలా.. చింపాంజీ టు మనిషి.. ఎయిడ్స్ వచ్చి ఉంటుందని ఆ ప్రొఫెసర్ గారొక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ సంగతిని తాజాగా కెనడా, యూఎస్‌లలోని మెడికల్ జర్నల్స్ ప్రకటించాయి. ఎయిడ్స్‌ని అలా ఉంచితే.. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మానవాళికి ‘సంక్రమించిన’ కొన్ని ఇన్వెన్షన్స్ కూడా ఉన్నాయి. వాటిలో కొన్నివి. చేతి వాచీ మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు మహిళలు మాత్రమే చేతివాచీలు ధరించేవారు. అయితే అవి వారికి ఆభరణాలుగా ఉండేవి. మగవారైతే కాలంతో తమకు పనేముంది అన్నట్లు ఉండేవారు. తెలియందేముంది! తామే కాలాన్ని నడిపిస్తున్నామన్న ఆ ఆధిక్య భావన భూమి పుట్టినప్పటి నుంచి మగజాతికి ఉన్నదే కదా! అయితే ఘరానా ఉండటం కోసం మాత్రం వాచీలను జేబుల్లో పైకి కనిపించేలా పెట్టుకుని తిరిగేవారు. యుద్ధం మొదలయ్యాక పగలూ రేయీ ఏకమై పురుషులు కూడా టైమ్‌ను చూసుకునేందుకు వీలుగా జేబుల్లోంచి తీసి చేతికి పెట్టుకోవలిసి వచ్చింది. ఆ రిస్ట్ వాచీలకు, పాకెట్ వాచీలకు మధ్యస్థ రూపం మరొకటి వచ్చింది. అవి ‘ట్రెంచ్ వాచీ’లు. వాటినే రిస్ట్లెట్స్ అనేవారు. ఒక గ్రేట్ వార్ వస్తే కానీ రిస్ట్‌వాచ్‌లు తగిలించుకోని ‘గ్రేట్’ పీపుల్ ఈ మగవాళ్లు! ఇది ఆవిష్కరణ కానీ, ఒక అలవాటుకు ఆరంభం. జిప్పులు మగవాళ్ల ప్యాంట్లకు, ఆడవాళ్ల గౌన్లకు మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ‘హుక్లెస్ ఫాస్ట్నర్స్’ మాత్రమే ఉండేవి. ఇప్పుడు మనం చూస్తున్న జిప్పుల్లాంటివి అవి. లాంటివే కానీ, జిప్పులు కావు. గిడియోన్ సండ్బాక్ అనే స్వీడిష్ అమెరికన్ ఇంజినీరు చిక్కుపడని, కక్కేలు ఇరుక్కోని సాఫీగా ఉండే జిప్పులను హుక్కుతో పాటు 1914లో డిజైన్ చేశారు. ఆ యుద్ధ పరిస్థితుల్లో సైనిక వస్త్రాల అవసరాలకు కొత్త డిజైన్లలోని జిప్పులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. చివరికి అవే మన్నికైనవిగా స్థిరపడ్డాయి. ఫ్యాషన్లు ఎన్ని మారినా, జిప్ డిజైన్ మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. అంతకుమించి జిప్పులను మెరుగు పరచడానికి ఏమీ లేదని, మెరుగు పరిచే అవసరమే లేదని తర్వాత్తర్వాత వచ్చిన ఇంజనీర్లు తేల్చేశారు! స్టెయిన్లెస్ స్టీల్ తుప్పు పట్టని విధంగా క్రోమిమంతో తయారు చేసిన స్వచ్ఛమైన ఉక్కు ‘స్టెయిన్లెస్ స్టీల్’. మొదటి ప్రపంచ యుద్ధకాలానికి ముందు స్టెయిన్లెస్ స్టీల్ లేనేలేదు. యు.ఎ.లోని షెఫీల్డ్ ప్రాంతంలో ఉండే హ్యారీ బ్రియర్లీ యుద్ధ ప్రారంభ కాలమైన 1914 లో ఈ రకం స్టీల్‌ను కనిపెట్టారు. యుద్ధ విమానాల ఇంజిన్లు, మెస్ కిట్ సిల్వర్‌వేర్, వైద్య పరికరకాల తయారీకి ఒక మేలు రకమైన లోహం అవసరం అవడంతో, ఆ అవసరం నుంచి స్టెయిన్లెస్ స్టీల్ అవిర్భవించింది. పైలేట్స్ ఇదొక ఫిట్నెస్ టెక్నిక్. జోసెఫ్ పైలేట్స్ అనే జర్మన్ ఫిట్నెస్ మాస్టర్ ఈ టెక్నిక్‌ను (వ్యాయామ విధానం) మొదటి ప్రపంచ యుద్ధం ముగుస్తుండగా 1918 చివర్లలో వృద్ధి చేశారు. యుద్ధకాలంలో ఆయన ఆసుపత్రులలోని రోగుల నడకకు బలం చేకూర్చే పైలేట్స్ వ్యాయామం కోసం ‘క్యాడిలాక్’ అనే సాధనాన్ని రూపొందించారు. స్వయంగా ఆసుపత్రులకు వెళ్లి ఈ టెక్నిక్‌తో వ్యాయామ సేవలు కూడా అందిం చారు. శానిటరీ నేప్కిన్స్ 1914లో యూఎస్‌లోని కింబర్లీ క్లార్క్ అనే సంస్థ కలప గుజ్జుతో ఒక వస్త్రాన్ని తయారు చేసింది. యుద్ధ కాలంలో పత్తి కొరత ఏర్పడి, పత్తి వస్త్రాలకు అవసరం పెరగడంతో ప్రత్యామ్నాయంగా ఆ కంపెనీ గుజ్జు వస్త్రాన్ని కనిపెట్టింది. దానికి సెల్యుకాటన్ అని పేరుపెట్టింది. అమెరికా సైన్యంలోని క్షతగాత్రుల కోసం సర్జికల్ డ్రెస్సింగ్‌గా ఆ వస్త్రాన్ని సరఫరా చేసింది. రక్తస్రావాన్ని సెల్యుకాటన్ సమర్థం గా నిలువరించడంతో, యుద్ధానంతరం కొటెక్స్ శానిటరీ పాడ్స్ తయారు చేసి మార్కెట్లో విడుదల చేసింది. ఆ ప్రాడక్ట్‌కు అమితమైన ఆదరణ లభించింది. నేడు వాడుకలో ఉన్న శానిటరీ నేప్కిన్స్ వాటికి ఆధునాతన రూపమే. పోర్టబుల్ ఎక్స్–రేస్ తొలి ‘రేడియోలాజికల్ కారు’ అవిష్కరణ జరిగింది కూడా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే. ఈ కారును కనిపెట్టింది పోలెండ్ భౌతిక శాస్త్రవేత్త మేరీ క్యూరీ. ఈ వాహనంలో ఎక్స్ రే మిషన్ ఉండేది. ఫొటోగ్రాఫ్ డార్క్ రూమ్ పరికరాలు ఉండేవి. యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స చేయడానికి ఆర్మీ సర్జన్లు నేరుగా యుద్ధ క్షేత్రంలోనికే ఈ రేడియోలాజికల్ కార్లను నడుపుకుంటూ వెళ్లేవారు. -
కరోనా ఏ వస్తువుపై ఎన్ని రోజులు ఉంటుందంటే..
న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు, పరిశోధకులు తీవ్రంగా శ్రమిస్తున్నా సంగతి తెలిసిందే. అయితే కరోనాకు మందు లేకడపోవడంతో.. దాని వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైరస్ వ్యాప్తికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో), సెంటర్ ఫర్ డిసిజ్ కంట్రోల్(సీడీసీ) లోతైన పరిశోధనలు జరుపుతున్నాయి. వైరస్ ఎలా వ్యాపిస్తుంది, ఏయే వస్తువులపైన ఎంత సేపు ఉంటుందనే దానిపై పరీక్షలు కొనసాగుతున్నాయి. అందుకే వైరస్ ఎక్కువ కాలం నిలిచి ఉండే వస్తువులకు దూరంగా ఉండాలని నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. వస్తువుల ఉపరితలాలపై కరోనా వైరస్ నిలిచే ఉండే కాలం అక్కడి ఉష్ణోగ్రతలపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ప్లాస్టిక్ : కాపర్ మంచి ఉష్ణ కారకం కాకపోవడం వల్ల దాని ఉపరితలంపై కరోనా వైరస్ 2 నుంచి 3 రోజులపాటు నిలిచి ఉంటుంది. అందుకే మిల్క్ ప్యాకెట్లను, ప్లాస్టిక్ బాటిళ్లతోపాటుగా ప్లాస్టిక్ సంబంధిత వస్తువులను వాడేవారు వాటిని తప్పనిసరిగా సబ్బుతోగానీ, నీటితో గానీ శుభ్రపరచాలి. ముఖ్యమైన వస్తువులు తప్ప మిగిలిన ప్లాస్టిక్ వస్తువులను మట్టుకోకుండా దూరంగా పెట్టడం మంచింది. బయటకు వెళ్లినప్పుడు ప్టాస్టిక్ వస్తువులను ముట్టుకుంటే వెంటనే చేతులు శుభ్రపరచుకోవడం మంచింది. స్టెయిన్లెస్ స్టీల్ : ప్రస్తుతం వంట గదిలో వినియోగించే వాటిలో ఎక్కువగా స్టెయిన్లెస్ స్టీల్ వస్తువులే కనిపిస్తున్నాయి. వీటిపై కూడా కరోనా వైరస్ 2 నుంచి 3 రోజులపాటు నిలిచి ఉండే అవకాశం ఉంది. అందుకే కిచెన్‌లోని వస్తువులను రోజుకు ఒక్కసారైనా శుభ్రపరుచుకోవాలి. అలాగే మనం రోజువారి అవసరాల కోసం వినియోగించుకునే వాటిని ఒక పక్కకు ఉంచి వాటిని మాత్రమే తరుచూ శుభ్రపరుచుకుంటే వైరస్ వ్యాపించే అవకాశం తగ్గుతుంది. ఇంట్లోని టీవీ స్ర్కీన్‌ను 70 శాతం అల్కహాల్ కలిగిన ద్రావణాలతో శుభ్రపరచాలి. అట్టపెట్టెలు : అట్టపెట్టెలపై కరోనా వైరస్ ఒక్క రోజు వరకు నిలిచి ఉండే అవకాశం ఉంది. అయితే ఇవి అంతా ప్రమాదకరం కాకపోయినప్పటికీ.. వాటిని ముట్టుకున్న అనంతరం చేతులు శుభ్రపరుచుకోవడం వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. ఇంట్లో వినియోగించే వస్తువులు.. : మనం నిత్యం వినియోగించే బెడ్ షీట్స్, కూరగాయలు, పండ్లు.. వంటి వాటి ద్వారా వైరస్ వ్యాప్తి అవకాశం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వాటిని శుభ్రంగా ఉంచుకోవడం ఉత్తమం. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు బయటి నుంచి తెచ్చుకున్నప్పుడు వాటిని శుభ్రపరడం.. మళ్లీ వినియోగించేటప్పుడు నీటితో కడుక్కోవడం చేయాలి. కాగా, పలు పరిశోధనల్లో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు కరోనా నియంత్రణ కోసం భౌతిక దూరం పాటించాలని, తరుచూ చేతులను కడుక్కోవాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. ముఖ్యంగా నోరు, ముక్కు ద్వారా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుండటంతో.. చేతులు కడగకుండా నోటిని, ముఖాన్ని ముట్టుకోవద్దని హెచ్చరించింది. ఒక మనిషి దగ్గినప్పుడు దాదాపు 3 వేల తుంపర్లు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో.. జనసమర్థం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరుతుంది. ఇప్పటికే కరోనా కట్టడి కోసం అనేక దేశాలు లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వాసన మాయం సబ్బు శాశ్వతం
చేపల కూరను చాలామంది ఇష్టపడతారు. అది ఎంత రుచిగా ఉంటుందో.. వాటిని శుభ్రం చేశాక మన చేతులు అదే రేంజ్లో వాసన వేస్తాయి. ఎన్ని రకాల సబ్బులు వాడినా ఒక పట్టాన వాసన వదలదు... అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా ఆ కోవకే వస్తాయి. ఆ సమస్య నుంచి మనల్ని బయట పడేసేందుకు వచ్చిందే ఈ ‘రబ్ అవే బార్’.. ఇది అరగదు.. తరగదు.. కానీ మీ చేతులను శుభ్రంగా, ఎలాంటి వాసనలు లేకుండా చేస్తుంది. దీన్ని స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేశారు. చల్లటి నీటి కింద ఈ బార్‌తో చేతులు కడుక్కుంటే చాలు. ఈ రబ్ అవే బార్‌కు, కూల్ వాటర్‌కు మధ్య జరిగే కెమికల్ రియాక్షన్ వల్ల వాసనలు దూరమవుతాయట. ఇదేదో బాగుంది కదూ... ఒక్కసారి కొనేస్తే సరి. ఎన్ని రోజులైనా దీన్ని హాయిగా వాడుకోవచ్చు. ఇవి వివిధ రకాల షేపుల్లో, సైజుల్లో దొరుకుతున్నాయి. -
వేసవి పానీయం..
సాక్షి, కరీంనగర్,ఎండాకాలం.. ఘడియకోసారి గొంతు తడుపుకోవాలనిపిస్తుంది.. లీటర్లకొద్దీ నీటిని తాగాలనిపిస్తుంది.. దాహాన్ని ఒక్క గ్లాస్ రసంతో చెక్ పెట్టొచ్చు. ఇంట్లోనే మనకు నచ్చిన పానీయూన్ని తయూరు చేసుకోవచ్చు. అటు దాహం తీరడం తోపాటు ఇటు ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. శరీరాన్ని ఎక్కువ సేపు చల్లగా ఉంచు కోవచ్చు. అవేమిటో తెలుసుకుందామా..? ఓసారి ఈ రసాలు పరిశీలిం చండి. లెమన్ సోడా... వేసవిలో చాలామంది ఎక్కువగా తాగే పానీయం ఇది. నిమ్మకాయ రసం, ఉప్పు కలిపి తయారు చేస్తారు. దాహార్తి తీరుస్తుంది. మసాలా రుచిలో కూడా దొరుకుతుంది. తోపుడు బళ్లపై ఎక్కువగా విక్రయిస్తున్నారు. ధర రూ.5 నుంచి రూ.10 వరకు ఉంటుంది. కొబ్బరినీళ్లు... వేసవిలో డీహైడ్రేషన్ నుంచి కాపాడే ఔషధ గుణాలున్న పానీయం కొబ్బరి నీరు. కొన్ని ప్రాంతాల్లో లీటర్లలో కొబ్బరి నీటిని అమ్ముతున్నారు. లీటర్ ధర రూ.100 నుంచి 130 వరకు ఉంది. అంతేకాదు ప్రోసెస్ చేసిన కొబ్బరినీటిని చిన్నచిన్న డబ్బాలు, ప్యాకెట్లలో కూడా విక్రయిస్తున్నారు. సబ్జా... ఇంట్లో సులువుగా తయారు చేసుకునే వేసవి పానీయాల్లో ఇది ఒకటి. దీని తయారీకి సబ్జాగింజలు, బెల్లం, మిరియాల పొడిని వినియోగిస్తారు. శరీరంలో వేడిని నియంత్రిస్తుంది. మిరియాల పొడి కారణంగా కొంచెం ఘాటుగా విభిన్న రుచిని కలిగి ఉండడం దీని ప్రత్యేకత. తయారీ ఇలా... ఒక స్పూన్ సబ్జాగింజల్ని నీటిలో నానబెట్టాలి. రెండు స్పూన్ల బెల్లం పొడిని 250 మిల్లీలీటర్ల నీటిలో వేయాలి.దానిలో నానబెట్టిన సబ్జాగింజల్ని వేసి రెండుగంటలు పాటు ఉంచాలి. చివర్లో రుచి కోసం మిరియాల పొడిని జత చేయాలి. చెరుకు రసం.. వేసవికాలంలో చాలామంది సేవించే పానీయం చెరుకురసం. అయితే రోడ్డుపక్కన కిరోసిన్ పొగల మధ్య లభించే చెరుకు రసం తాగకపోవ డమే మేలు. చెరుకు రసం తయారీకి స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారైన ఆటోమేటిక్ మిషన్లు వచ్చేశాయి. దీనిలో ప్రత్యేక ఫ్రీజర్ ఉండడంతో రసం చల్లగా ఉంటుంది. ధర రూ.20 నుంచి రూ.25 వరకు ఉంటుంది. ఫలూదా... ఇది ఇరానియన్ పానీయం. దీని తయారీకి పాలు, సబ్జా గింజలు, సేమ్యాలు వినియోగిస్తారు. రుచి కోసం డ్రైఫ్రూట్స్ వేస్తారు. చల్లదనం కోసం ఐస్‌క్రీమ్ వాడుతారు. పోషకవిలువలు అధికంగా ఉండే పానీయం ఇది. ధర రూ.20 నుంచి రూ.30 వరకు ఉంటుంది. చిన్నారులు అధికంగా ఇష్టపడే పానీయం. పచ్చిమామిడికాయను ఉడకబెట్టాలి. నీళ్లు ఆవిరిగా మారిన తర్వాత పైపొరను తీయాలి. లోపల గుజ్జుకు నీటిని జత చేయాలి. తర్వాత వడపోయాలి. అలావచ్చిన చిక్కటి ద్రావణానికి లీటర్‌కు 400 గ్రాముల చక్కెర, అల్లం పేస్ట్, తగినంత రాక్ సాల్ట్ కలిపి మరగబెట్టి చల్లార్చాలి. ఫ్రిజ్‌లో పెడితే చాలు. పుల్లగా తీయగా ఉండే పనా సిద్ధం.