న్యూఢిల్లీ: స్టెయిన్‌లెస్ స్టీల్ రంగంలో ఉన్న అవకాశాలు, డిమాండ్‌పై కంపెనీలు చర్చించనున్నాయి. ముంబైలో సెప్టెంబర్ 14 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ‘గ్లోబల్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఎక్స్‌పో 2023’ ఇందుకు వేదికగా నిలవనుంది. పరిశ్రమకు చెందిన 500 మందికి పైగా ఇందులో పాల్గొననున్నారు.
ఈ వివరాలను విగ్రో కమ్యూనికేషన్స్ అండ్ ఎగ్జిబిషన్స్ (వీసీఈ) ప్రకటించింది. డిమాండ్‌ను సృష్టించడం, కాలుష్య ఉద్గారాల నియంత్రణ లక్ష్యాలు, కొత్త టెక్నాలజీలపై పరిశోధన, అభివృద్ధి తదితర అంశాలపై స్టెయిన్‌లెస్ స్టీల్ కంపెనీల ప్రతినిధులు చర్చించనున్నారు.
‘‘భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే విషయంలో స్టెయిన్‌లెస్ స్టీల్ కీలక పాత్ర పోషించనుంది. గ్లోబల్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఎక్స్‌పోలో భాగంగా సీఈవోలతో రౌండ్ టేబుల్, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు జరుగుతాయి. వీటికితోడు పరిశ్రమ తరఫున సాంకేతిక సదస్సులు కూడా ఉంటాయి’’అని వీసీఈ డైరెక్టర్ అనితా రఘునాథ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment