వేసవి పానీయం.. | Summer drink .. | Sakshi
Sakshi News home page

వేసవి పానీయం..

Published Tue, May 6 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM

Summer drink ..

 సాక్షి, కరీంనగర్,ఎండాకాలం.. ఘడియకోసారి గొంతు తడుపుకోవాలనిపిస్తుంది.. లీటర్లకొద్దీ నీటిని తాగాలనిపిస్తుంది..  దాహాన్ని ఒక్క గ్లాస్ రసంతో చెక్ పెట్టొచ్చు.  ఇంట్లోనే మనకు నచ్చిన పానీయూన్ని తయూరు చేసుకోవచ్చు. అటు దాహం తీరడం తోపాటు ఇటు ఆరోగ్యం  సొంతం చేసుకోవచ్చు. శరీరాన్ని ఎక్కువ సేపు చల్లగా ఉంచు కోవచ్చు. అవేమిటో  తెలుసుకుందామా..?  ఓసారి  ఈ రసాలు పరిశీలిం చండి.
 
లెమన్ సోడా...
వేసవిలో చాలామంది ఎక్కువగా తాగే పానీయం ఇది. నిమ్మకాయ రసం, ఉప్పు కలిపి తయారు చేస్తారు. దాహార్తి తీరుస్తుంది. మసాలా రుచిలో కూడా దొరుకుతుంది. తోపుడు బళ్లపై ఎక్కువగా విక్రయిస్తున్నారు. ధర రూ.5 నుంచి రూ.10 వరకు ఉంటుంది.
 
కొబ్బరినీళ్లు...
వేసవిలో డీహైడ్రేషన్ నుంచి కాపాడే ఔషధ గుణాలున్న పానీయం కొబ్బరి నీరు.  కొన్ని ప్రాంతాల్లో లీటర్లలో కొబ్బరి నీటిని అమ్ముతున్నారు. లీటర్ ధర రూ.100 నుంచి 130 వరకు ఉంది. అంతేకాదు ప్రోసెస్ చేసిన కొబ్బరినీటిని చిన్నచిన్న డబ్బాలు, ప్యాకెట్లలో కూడా విక్రయిస్తున్నారు.
 
సబ్జా...
ఇంట్లో సులువుగా తయారు చేసుకునే వేసవి పానీయాల్లో ఇది ఒకటి. దీని తయారీకి సబ్జాగింజలు, బెల్లం, మిరియాల పొడిని వినియోగిస్తారు. శరీరంలో వేడిని నియంత్రిస్తుంది. మిరియాల పొడి కారణంగా కొంచెం ఘాటుగా విభిన్న రుచిని కలిగి ఉండడం దీని ప్రత్యేకత.

తయారీ ఇలా...
ఒక స్పూన్ సబ్జాగింజల్ని నీటిలో నానబెట్టాలి. రెండు స్పూన్ల బెల్లం పొడిని 250 మిల్లీలీటర్ల నీటిలో వేయాలి.దానిలో నానబెట్టిన సబ్జాగింజల్ని వేసి రెండుగంటలు పాటు ఉంచాలి. చివర్లో రుచి కోసం మిరియాల పొడిని జత చేయాలి.
 
చెరుకు రసం..
వేసవికాలంలో చాలామంది సేవించే పానీయం చెరుకురసం. అయితే రోడ్డుపక్కన కిరోసిన్ పొగల మధ్య లభించే చెరుకు రసం తాగకపోవ డమే మేలు. చెరుకు రసం తయారీకి స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారైన ఆటోమేటిక్ మిషన్లు వచ్చేశాయి. దీనిలో ప్రత్యేక ఫ్రీజర్ ఉండడంతో రసం చల్లగా ఉంటుంది. ధర రూ.20 నుంచి రూ.25 వరకు ఉంటుంది.
 
ఫలూదా...
ఇది ఇరానియన్ పానీయం. దీని తయారీకి పాలు, సబ్జా గింజలు, సేమ్యాలు వినియోగిస్తారు. రుచి కోసం డ్రైఫ్రూట్స్ వేస్తారు. చల్లదనం కోసం ఐస్‌క్రీమ్ వాడుతారు. పోషకవిలువలు అధికంగా ఉండే పానీయం ఇది. ధర రూ.20 నుంచి రూ.30 వరకు ఉంటుంది.
 
చిన్నారులు అధికంగా ఇష్టపడే పానీయం. పచ్చిమామిడికాయను ఉడకబెట్టాలి. నీళ్లు ఆవిరిగా మారిన తర్వాత పైపొరను తీయాలి. లోపల గుజ్జుకు నీటిని జత చేయాలి. తర్వాత వడపోయాలి. అలావచ్చిన చిక్కటి ద్రావణానికి లీటర్‌కు 400 గ్రాముల చక్కెర, అల్లం పేస్ట్, తగినంత రాక్ సాల్ట్ కలిపి మరగబెట్టి చల్లార్చాలి. ఫ్రిజ్‌లో పెడితే చాలు. పుల్లగా తీయగా ఉండే పనా సిద్ధం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement