కోకోనియాలు | summer special story on Coconut water | Sakshi
Sakshi News home page

కోకోనియాలు

Published Sat, Mar 2 2019 12:20 AM | Last Updated on Sat, Mar 2 2019 12:20 AM

summer special story on Coconut water - Sakshi

వేసవికి కొబ్బరినీళ్లు విరుగుడు చెట్టు పొట్టలో నుంచి తన ముంతలోకి నింపిన ఔషధం కోటి పానీయాలలో కూల్‌... కోకో పానీయం 


ఫ్రూటీ కోకోనట్‌ వాటర్‌ స్లషెస్‌
కావలసినవి: కొబ్బరి నీళ్లు – ఒక కప్పు; ఫ్రోజెన్‌ ఫ్రూట్స్‌ – అర కప్పు (అరటిపళ్లు, స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీ ముక్కలను ఫ్రిజ్‌లో ఉంచి తీయాలి).
తయారీ: ∙బ్లెండర్‌లో కొబ్బరి నీళ్లు, ఫ్రోజెన్‌ ఫ్రూట్స్‌ వేసి అన్నీ కలిసేలా బాగా బ్లెండ్‌ చేయాలి ∙గ్లాసులోకి తీసుకుని వెంటనే తాగేయాలి.


పైనాపిల్‌ కోకోనట్‌ జ్యూస్‌
కావలసినవి: తాజా పైనాపిల్‌ జ్యూస్‌ – ముప్పావు కప్పు; కొబ్బరి నీళ్లు – అర కప్పు; అల్లం రసం – అర టీ స్పూను; తేనె – ఒక టీ స్పూను;  నిమ్మరసం – ఒక టీ స్పూను

తయారీ: ∙పైన చెప్పిన పదార్థాలను మిక్సీ జార్‌లో వేసి బాగా కలిసేలా తిప్పి, గ్లాసులలోకి తీసుకోవాలి.సుమారు ఒక గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచి, బయటకు తీసి చల్లగా తాగాలి.

కోకోనట్‌ అండ్ చియా పుడ్డింగ్‌
కావలసినవి: కొబ్బరి తురుము – పావు కప్పు; సబ్జా గింజలు – పావు కప్పు; చిక్కటి కొబ్బరి పాలు – ముప్పావు కప్పు; కొబ్బరి నీళ్లు – అర కప్పు; వెనిలా ఎక్స్‌ట్రాక్ట్‌ – ఒక టీ స్పూను; ఉప్పు – చిటికెడు; తాజా స్ట్రాబెర్రీలు – అర కప్పు

తయారీ: ∙చిన్న పాత్రలో కొబ్బరి తురుము, సబ్జా గింజలు, కొబ్బరి పాలు, కొబ్బరి నీళ్లు, వెనిలా ఎక్స్‌ట్రాక్ట్, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి ∙ఫ్రిజ్‌లో పెట్టి, రెండు గంటల తరవాత తీయాలి ∙స్ట్రాబెర్రీలతో అలంకరించి అందించాలి. 

లెమన్‌ కోకోనట్‌ క్వెంచ్‌
కావలసినవి: తాజా నిమ్మ రసం – 2 టేబుల్‌ స్పూన్లు; కొబ్బరి నీళ్లు – ఒకటిన్నర కప్పులు; నీళ్లు – పావు కప్పు; తేనె – ఒక టేబుల్‌ స్పూను; అల్లం తురుము – అర టీ స్పూను; ఉప్పు – కొద్దిగా.

తయారీ: ∙మిక్సీ జార్‌లో నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, తేనె, అల్లం తురుము, ఉప్పు వేసి అన్నీ కలిసేలా మిక్సీ పట్టాలి ∙గ్లాసులోకి తీసుకుని కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి, చల్లగా తాగాలి ∙ఈ జ్యూస్‌ని ఫ్రిజ్‌లో రెండు వారాల దాకా నిల్వ ఉంచుకోవచ్చు.

కోకోనట్‌ కాఫీ వాటర్‌
కావలసినవి:కొబ్బరి నీళ్లు – ఒక కప్పు; కాఫీ డికాక్షన్‌ – పావు కప్పు (చిక్కగా ఉండాలి); ఐస్‌ – తగినంత.

తయారీ: ఒక గ్లాసులో కొబ్బరి నీళ్లు, కాఫీ డికాక్షన్, ఐస్‌ వేసి బాగా కలపాలి. \(ఏదైనా తక్కువ అనిపిస్తే జత చేసుకోవాలి) ∙చల్లగా తాగాలి.
– నిర్వహణ: వైజయంతి పురాణపండ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement