coconut water
-
మౌత్ అల్సర్ నుంచి ఉపశమనానికై.. ఇలా చేయండి!
కొన్ని రకాల యాంటీ బయాటిక్స్ వాడటం, కొన్ని రకాల వ్యాధులతో బాధపడటం వల్ల నోటిలో పుళ్లు ఏర్పడుతుంటాయి. కొందరికి ఊరికినే కూడా అప్పుడప్పుడు నోటిపూత వస్తుంటుంది. ఇలాంటప్పుడు ఏమైనా తాగినా, తిన్నా చాలా బాధగా ఉంటుంది. మౌత్ అల్సర్స్ నుంచి ఉపశమనం పొందడానికి తేనె చక్కటి మార్గం. నోట్లో కణజాలాలు చిట్లిపోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది కాబట్టి.. తేనెను పూయడం వలన కొత్త కణజాలాలు తిరిగి ఏర్పడడానికి ఇది దోహదం చేస్తుంది. తేనెలో పసుపు కలిపి పేస్ట్ లా చేసుకుని రాసినప్పుడు కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది.మొక్కజొన్న కంకి ఒలిచేటప్పుడు వచ్చే సిల్క్ దారాల్లాంటి కార్న్ సిల్క్‌ను వృథాగా పడేస్తారు. కానీ అవి కిడ్నీ రాళ్లను బయటకు పంపడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. వాటిని నీటిలో ఉడికించి చల్లారాక వడగట్టి తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో కొత్తగా రాళ్లు ఏర్పడవు. ఇది మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించడంలో కార్న్ హెయిర్ ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లను తరచూ తాగడం, కొబ్బరి నూనెను పూయడం, అలానే ఎండు కొబ్బరిని తినడం వల్ల కూడా నోటిపూత తగ్గుతుంది. ఎందుంకటే కొబ్బరి శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఫలితం గా నోటిపూత త్వరగా మాని΄ోతుంది.పాలపదార్ధాలైన నెయ్యి, మజ్జిగ వంటి పదార్ధాలు కూడా నోటిపూత నుంచి ఉపశమనం కల్పిస్తాయి. ఎక్కడైతే నోటిపూత గాయాలున్నాయో అక్కడ నేయి రాయడం, రోజుకు రెండుమూడుసార్లు గ్లాసు మజ్జిగ తాగడం వల్ల ఎంతో ఉపశమనం గా ఉంటుంది.తులసి ఆకులు కూడా నోటిపూతకు మంచి ఔషధం. రోజుకు నాలుగైదు సార్లు తులసాకులు నమలడం వల్ల నోటిపూత తొందరగా తగ్గి΄ోతుంది.చిన్న ఐస్ ముక్కతో పుండు ఉన్న చోట మర్దనా చేయడం, లవంగం నమలడం కూడా నోటిపూతను తగ్గిస్తాయి.ఇవి చదవండి: Beauty Tips: కాలానుగుణంగా.. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే..? -
వేసవిలో కొబ్బరి నీళ్లు మంచివని తాగేస్తున్నారా?ఐతే వాళ్లు మాత్రం..
వేసవిలో కొబ్బరి నీళ్లుకు మించిన డ్రింక్ లేదని చాలామంది దీనికే ప్రాధాన్యత ఇస్తారు. అందులోనూ ఈ కాలంలోని ఎండల తాపం నుంచి బయటడేందుకు కొబ్బరిబోండాలే తోడ్పడతాయి. ఇది దాహార్తిని తీర్చడమే గాక వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. పైగా ఆరోగ్యానికి మంచిది. చర్మానికి మంచి నిగారింపును కూడా ఇస్తుంది. ఈ కొబ్బరి నీటితో ముఖం కడుక్కుంటే కాంతివంతంగా కనిపిస్తుంది. అన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కొబ్బరినీళ్లు వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అలాంటి వాళ్లు అస్సలు తాగొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కొబ్బరి నీళ్ల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బరువుని అదుపులో ఉంచుతుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. శరీరానికి చలువ చేస్తుంది కూడా. అలాంటి కొబ్బరి నీళ్లను అతిగా తీసుకుంటే మాత్రం చాలా నష్టాలను ఫేస్ చేయాల్సిందే. ఈ కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అలా అని అతిగా తాగారో అంతే దుష్ప్రభావాలు ఉంటాయిని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే.. పక్షవాతం.. కొబ్బరి నీళ్లలో సోడియం, పొటాషియం మరియు మాంగనీస్ వంటి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అందుకే కొబ్బరినీళ్లను పరిమితంగా తీసుకంటే బాడీకి చాలా మంచిది. కానీ దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో పొటాషియం పరిమాణం పెరిగి.. పక్షవాతానికి గురయ్యే అవకాశం ఉంది. అతిసారం.. కొబ్బరి నీళ్లలో మోనోశాకరైడ్లు, పులియబెట్టే ఒలిగోశాకరైడ్లు మరియు పాలియోల్స్ ఉంటాయి. ఇవి షార్ట్ చైన్ కార్బోహైడ్రేట్లు. శరీరంలో ఈ మూలకాల పరిమాణం పెరిగితే... అవి బాడీ నుండి నీటిని పీల్చుకోవడం ప్రారంభిస్తాయి, దీని కారణంగా విరేచనాలు, వాంతులు, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి కొబ్బరి నీళ్లను రోజూ తాగడం మానేసి అప్పుడప్పుడు మాత్రమే తీసుకోండి. లో బీపీ రావచ్చు కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని ఎక్కువగా తాగడం వల్ల బీపీ పడిపోయే అవకాశం ఉంది. దీని వల్ల బాధితుడి ప్రాణం ప్రమాదంలో పడుతుంది. అలాంటి వాళ్లు.. మధుమేహం ఉన్నవారు కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగకూడదు. ఇది చక్కెర మరియు అధిక కేలరీలను కలిగి ఉంటుంది, దీని కారణంగా శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అమితు వీటిలో ఆర్టిఫిషియల్ స్వీట్ కాంపౌండ్స్ లేకపోయినా, కొబ్బరి నీళ్లలో చాలా కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నవారికి ఇది సమస్యగా మారుతుంది. కాబట్టి, రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటే, కొబ్బరి నీళ్లు చాలా మితంగా తాగాలి. బ్లడ్ షుగర్ మందులు తీసుకునేవారికి డేంజర్. అలాగే రక్తపోటుకు సంబంధించి మందులు తీసుకుంటుంటే, కొబ్బరి నీళ్లకు వీలైనంత దూరంగా ఉండాలి. ఈ వ్యాధు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగాలనుకుంటే వైద్యుడిని సంప్రదించి తీసుకోవడం మంచిది. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించాలనుకుంటే మాత్రం వైద్యులను మీ వ్యక్తిగత ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనలు మేరకు అనుసరించడం ఉత్తమం. (చదవండి: కట్టెల పొయ్యి, బొగ్గుల మీద చేసిన వంటకాలు తినకూడదా?) -
కొబ్బరి బోండాం నీళ్లు, ఈ లెక్క తెలుసా మీకు!
వేసవి వచ్చిందంటే దాహార్తికి ముందుగా గుర్తొచ్చేది కొబ్బరి నీళ్లే. కాస్త ఖరీదు ఎక్కువనిపించినా , కార్బోహైడ్రేట్లు, ముఖ్యమైన పోషకాలతో సహజంగా లభించే కొబ్బరి బోండాలు చాలా ఉత్తమం. ఇంకా మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ పోషకాలు పుష్కలంగా వీటిల్లో లభిస్తాయి. అయితే మనం కొబ్బరి బోండాలో నీరు ఎంత ఉంది అనేది ఎలా గుర్తుపట్టాలి? ఒకసారి పరిశీలిద్దాం. వామ్మో.. ఎండ సుర్రుమంటోంది.. దాహం.. కాస్త నీళ్లు ఎక్కువ ఉన్న బోండాం ఇవ్వు బాబు అనగానే.. కొబ్బరి బోండాలు అమ్యే వ్యక్తి ఏం చేస్తాడు? గుర్తుందా? కాయమీద కొట్టి చూస్తాడు.. లేదంటే కాయను పట్టుకొని ఊపి చూస్తాడు కదా. అంతే సింపుల్. దాదాపు మనం కూడా అలాగే చెక్ చేసుకోవచ్చు. అలాగే సాధారణంగా కొబ్బరికాయ గుండ్రంగా, పెద్దగా ఉంటే అందులో నీరు ఎక్కువగా ఉంటుంది.ఆకుపచ్చ రంగులో కాకుండా, ముదురు గోధుమ రంగులో ఉండే(ఇపుడు మార్కెట్లో లభిస్తున్న బెంగళూరు కాదు) ముదిరిన లేదా పండు కొబ్బరికాయలో నీరు తక్కువగా ఉంటుంది. కొబ్బరికాయను తీసి బాగా కదిలించినపుడు కూడా నీటి శబ్దం వినిపిస్తే .. సో అది కూడా తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్లలో కొంచెం తీపి పుల్లని వగరు రుచి ఉంటుంది. త్వరగా పుల్లగా మారిపోతోంది. కాబట్టి తెరిచిన తర్వాత దానిని ఫ్రిజ్‌లో ఉంచి 24 గంటలలోపు తినాలి. అలాగే కొబ్బరి గుజ్జు సాంద్రతను కొలవడానికి టర్బిడిమీటర్ను ఉపయోగిస్తారట.ట్రాన్స్మిషన్ స్పెక్ట్రోఫోటోమీటర్గా, ‘‘విస్తా’’తో కొబ్బరినీళ్లను కొలుస్తారట. మరో విషయం ఏమిటంటే, ఇపుడు కొబ్బరి బొండాలుగా కాకుండా బాటిళ్లతో అమ్ముతున్నారు కాబట్టి వాటిని తీసుకోవచ్చు. లేదా దుకాణ దారుడి వద్ద మనమే బోండాలు కొట్టించుకుని, బాటిల్లో నింపుకోవచ్చు. అయితే ఈ నీళ్లను సాధ్యమైనంత తొందరగా సేవించాలి. లేదంటే పోషకాలు నష్టపోతాం. నిల్వ ఉండటం, పులిసిపోవడం వల్ల ఏదైనా అనారోగ్య సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. నోట్: కొబ్బరి నీళ్ల రుచి, సాంద్రత, ఎంత ఉన్నాయి, అలాగే గుజ్జు , టేస్ట్ తదితర అంశాలన్నీ ఆయా రకాలను బట్టి ఉంటుంది. -
'మార్చి' వచ్చింది.. బోండాం 'కొట్టు..'
‘కొబ్బరి నీళ్ల జలకాలాడి కోనాసీమ కోకాగట్టి’... అని రాశాడు వేటూరి. కొబ్బరి నీళ్లతో జలకాలాడే భాగ్యం సామాన్యుడికి లేదు. పూర్వం కొన్ని బావుల్లో నీళ్లు కొబ్బరి నీళ్లలా అనిపించేవి. జనానికి ఆ బావి ఫేవరెట్‌గా ఉండేది. ‘ఎన్ని ఫ్యాన్లున్నా ఒక్క ఏసీకి సమానం కావు గందా’ అని ముళ్లపూడి వెంకట రమణ అన్నట్టు ఎన్ని బిస్లరీ బాటిళ్ల నీళ్లైనా ఒక్క కొబ్బరిబోండాంకు సమానం కావు. సృష్టి మొత్తం మీద గర్భాన తియ్యటి, శుభ్రమైన నీళ్లను దాచుకున్న కాయ కొబ్బరికాయ మాత్రమే. పండ్ల రసాలు తయారు చేసేటప్పుడు ఏదో ఒక మేరకు ఇన్ఫెక్ట్ కావచ్చు. కాని కొబ్బరినీళ్లను కలుషితం చేయలేము. అందుకే వేసవి వచ్చిందంటే ఎండలో కాయకష్టం చేసేవారికి, రోజంతా రోడ్ల పై తిరిగే సన్న జీవులకి, కార్లలో తిరిగే కలిగిన వారికీ కూడా కొబ్బరినీళ్లు ప్రాణధార. అదేమిటోకాని కొన్ని విషయాలు విశ్వామిత్రుడి అకౌంట్లో పడ్డాయి. పౌరాణిక విశ్వాసాల ప్రకారం కొబ్బరికాయ బ్రహ్మదేవుని సృష్టి కాదట. విశ్వామిత్రుడిది అట. ఎవరు సృష్టించినా భారతీయులకు కొబ్బరికాయ లేకుండా పూట గడవదు. భక్తి కలిగిన వారికి పూజల్లో, జఠరాగ్ని కలిగిన వారికి వంటల్లో కొబ్బరి తప్పనిసరిగా ఉండాల్సిందే. మరి మార్చి వచ్చిందంటే గెలలు గెలలుగా దిగే కాయ కత్తికి సర్రున తెగుతూ తన నీటితో జిహ్వకు జీవం పోస్తుంది. కాని కొబ్బరి నీళ్ల గురించి కొన్ని వివరాలు తెలుసుకొని ఉండి వాటిని సేవించడం మంచిది. ప్రయోజనాలు.. కొబ్బరి నీళ్లు పోషకాలు, ఎలక్ట్రోలైట్లను ఇస్తాయి. ఒక రకంగా కొబ్బరి నీళ్లు నోటి ద్వారా ఒంట్లో చేరే సెలైన్బాటిల్తో సమానం. మన శరీరానికి రోజుకు కనీసం 280 మిల్లిగ్రాముల సోడియం కావాలి. ఒక కొబ్బరిబోండాంలో దాదాపు 300 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. అంటే శరీరానికి కావాల్సిన సోడియం రోజుకు సరిపడా అందినట్టే. ఇక పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ కూడా సమృద్ధిగా ఉంటాయి. అందుకే కొబ్బరినీళ్లు ఉత్తమ లవణ జలం. వీటిని మధ్యాహ్న భోజనానికి ఒక గంట ముందు, లేదా సాయంత్రం వేళల్లో తీసుకుంటే మంచిది. వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి కొబ్బరినీళ్లు ఉత్తమ సహాయకారి. ఎండల్లో వాంతులు, విరేచనాలు అవుతుంటే కొబ్బరినీళ్లను మెల్లమెల్లగా ఎక్కువసేపు తాగితే శరీరం పుంజుకుంటుంది. ఎండ వల్ల చర్మం టాన్ అయితే కొబ్బరినీళ్లతో బాగా రుద్దితే ఆ టాన్ పోతుంది. ముఖంపై మొటిమలు ఉంటే కొబ్బరినీళ్లలో ముంచిన దూదితో శుభ్రం చేస్తే అవి పోతాయి. వేసవిలో చెమట వల్ల వచ్చే దుర్వాసన పోవాలంటే కొబ్బరినీళ్లు తాగాలి. జీర్ణక్రియకు మంచిది. కొబ్బరినీళ్లలో ఉన్న పొటాషియం బీపీని నియంత్రించడానికి, కిడ్నీల పని తీరుకు తోడ్పడుతుంది. కొబ్బరి నీళ్లలో యాలకుల పొడి చిటికెడు వేసుకుని తాగితే అరికాళ్లలో మంటలు తగ్గుతాయి. ‘దేహమే దేవాలయం’ అన్నారు. దేవాలయంలో కొబ్బరికాయ కొడితే ఏ ఆధ్యాత్మిక ఫలితాలు కలుగుతాయో, కొబ్బరినీళ్లు తాగితే దేహమనే దేవాలయానికి అవే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి చదవండి: వయాగ్రా..! నవజాత శిశువుల పాలిట వరం! -
కొబ్బరి నీళ్లు పంచినా అభ్యంతరమేనట!?
హైదరాబాద్: ఎన్నికల సంఘం అధికారులు డబ్బులు పట్టుకుంటున్నారు.. నగలు పట్టుకుంటున్నారు.. బంగారం పట్టుకుంటున్నారు.. తాజాగా ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నిస్సహాయులకు, రోడ్లపై విధులు నిర్వర్తించే పోలీసులకు కొబ్బరి నీళ్లు పంచుతుండగా అభ్యంతరం చెప్పిన ఘటన చర్చనీయాంశమైంది. రహదారులపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల దప్పిక తీర్చడం కూడా తప్పేనా? ఇవేం రూల్స్ అంటూ ఆ మహిళా ప్రతినిధి నిట్టూరుస్తూ వెళ్లిపోవడం గమనార్హం. వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో లయన్స్ క్లబ్ ప్రతినిధి డాక్టర్ విజయలక్ష్మి రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు కొబ్బరినీళ్ల సీసాలను అందిస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఎన్నికల అధికారులు ఆమె వాహనాన్ని ఆపి ‘ఏం పంపిణీ చేస్తున్నారు’? అని ప్రశ్నించారు. ఆమె చెప్పిన జవాబు విన్న అధికారులు ఎన్నికల సమయంలో అవేవీ కుదరవమ్మా అంటూ హితవు పలి కారు. మంచినీళ్లు ఇవ్వాలన్నా, అన్నదానాలు చేయాలన్నా, కొబ్బరినీళ్లు పంచాలన్నా ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తీసుకోవాలంటూ చెప్పడంతో ఆమె అవాక్కయ్యారు. తాను 15 ఏళ్ల నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని.. ఇవేం దిక్కుమాలిన రూల్స్ అంటూ కారెక్కి వెళ్లిపోయారు. -
షుగర్ పేషెంట్స్ కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. అనేక అనారోగ్య సమస్యలకు కొబ్బరినీళ్లు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. నూటికి నూరుపాళ్లు సహజసిద్ధమైన, కల్తీకి ఆస్కారం లేని పానీయం ఇది. అందుకే ఎవరైనా అనారోగ్యానికి గురైతే కొబ్బరిబోండం తాగమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు.శరీరంలోని వేడిని తగ్గించి, డీహైడ్రేట్ అయ్యేలా కాపాడుతుంది. ఆరోగ్యపరంగానే కాకుండానే అందం రెట్టింపు అయ్యేందుకు కూడా కొబ్బరిబోండం సహాయపడుతుంది. ప్రతిరోజూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఫాస్పరస్, సీ విటమిన్ వంటి ఎన్నో ఖనిజ లవణాలు కలిగిన కొబ్బరినీళ్లతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయా? షుగుర్ పేషెంట్స్ కొబ్బరినీళ్లు తాగొచ్చా అన్నది ఈ స్టోరీలో తెలుసుకుంది. కొబ్బరినీళ్లతో బోలెడు ప్రయోజనాలు ► కొబ్బరినీళ్లలో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి అనేకరకాల వ్యాధులను దూరం చేస్తాయి. ► కొబ్బరినీళ్లలో 94 శాతం నీరు ఉంటుంది. ఇది వ్యార్థాలను తొలగించి శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి. ► కొబ్బరినీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ► జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపర్చడమే కాకుండా పొట్ట సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ► రోజూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల అధిక రక్తపోటును నివారిస్తుంది. ► గుండెజబ్బులు, హార్ట్ ఫెయిల్యూర్ రిస్కును తగ్గించడంలో కొబ్బరినీళ్లు ముఖ్య పాత్ర వహిస్తుంది ► కిడ్నీ సమస్యలలో ఎఫెక్టివ్: కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. ► బరువు తగ్గిపోతున్నామని బావించేవాళ్లు ప్రతిరోజూ కొబ్బరినీళ్లు తాగాలి. ఇందులోని తక్కువ కొవ్వు శరీరానికి మేలు చేస్తుంది. షుగర్ పేషెంట్స్ కొబ్బరినీళ్లు తాగొచ్చా? ♦ డయాబెటీస్ పేషెంట్స్ కొబ్బరినీళ్తు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలో పెరుగుతాయనే అపోహ ఉంటుంది. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొబ్బరినీళ్లు తాగడం వరం లాంటిదని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుందని వైద్యులు అంటున్నారు. ♦ ఇది టైప్ 2 డయాబెటిస్, ప్రీడయాబెటిస్‌లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్న వాళ్ళు ముదిరిన కొబ్బరి నీటిని కాకుండా లేత కొబ్బరి నీటిని తాగడం మంచిది. ఎందుకంటే ముదురు కొబ్బరితో పోలిస్తే లేత కొబ్బరిలో చక్కెర శాతం చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ♦ అయితే ఈమధ్య కాలంలో ప్యాక్ చేసిన కొబ్బరినీళ్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి. వీటిని షుగర్ పేషెంట్స్ తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. ఇందులో ప్రిజర్వేటీస్, చక్కెరలు డయాబెటిస్ పేషెంట్స్‌కి మంచిది కాదని, వాళ్లు మాత్రం సహజంగా దొరికే కొబ్బరినీళ్లు తాగడమే ఉత్తమమని పేర్కొంటున్నారు. -
Health Tips: పొటాషియం లోపిస్తే జరిగేది ఇదే! నిర్లక్ష్యం వద్దు! ఇవి తింటే...
మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాల్లో పొటాషియం కూడా ఒకటి. ఇది మినరల్స్ జాబితాకు చెందుతుంది. పొటాషియం మన శరీరంలో బీపీని నియంత్రిస్తుంది. స్ట్రోక్స్ రాకుండా చూస్తుంది. అదే విధంగా.. కండరాల నొప్పులు, కండరాలు పట్టుకుపోయినట్లు అనిపించడం వంటి సమస్యలను పొటాషియం తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. అందువల్ల పొటాషియం ఉండే ఆహారాలను మనం రోజూ తీసుకోవాలి. పొటాషియం లోపిస్తే మన శరీరంలో పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే.. ►కండరాలు బలహీనంగా మారుతాయి. ►కండరాలు పట్టుకుపోయినట్లు అనిపిస్తుంది. ►అలసట, గుండె అసాధారణ రీతిలో కొట్టుకోవడం, ఆకలి లేకపోవడం, మానసిక కుంగుబాటు, హైపోకలేమియా, వాంతులు, విరేచనాలు అవుతుండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ►కొందరికి మలంలో రక్తం కూడా వస్తుంది. ►అందువల్ల శరీరంలో పొటాషియం లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. ►సాధారణంగా మనకు రోజుకు 2.5 నుంచి 3.5 గ్రాముల వరకు పొటాషియం అవసరం అవుతుంది. మనం తినే ఆహారాల నుంచే మనకు పొటాషియం లభిస్తుంది. సప్లిమెంట్లను వాడాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే పలు ఆహారాలను తీసుకోవడం వల్ల పొటాషియం లోపం రాకుండా చూసుకోవచ్చు. పొటాషియం ఎందులో లభిస్తుందంటే(Potassium Rich Foods).. ►కోడిగుడ్లు ►టమాటాలు ►చిలగడ దుంపలు ►విత్తనాలు ►నట్స్ ►అరటి పండ్లు ►యాప్రికాట్స్ ►చేపలు ►తృణ ధాన్యాలు ►పెరుగు ►పాలు ►మాంసం ►తర్బూజా ►క్యారెట్ ►నారింజ ►కివీ ►కొబ్బరినీళ్లు బీట్రూట్ వంటి ఆహారాల్లో పొటాషియం విరివిగా లభిస్తుంది కాబట్టి వీటిని తరచూ తీసుకుంటే పొటాషియం లోపం రాకుండా ఉంటుంది. చదవండి: Health Tips: అరటి పండు పాలల్లో కలిపి తింటున్నారా? అయితే.. 5 Fruits For Monsoon Diet: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..! Vitamin D Deficiency: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! -
Hair Care: హెయిర్ స్ట్రెయిటనింగ్.. కొబ్బరి నీళ్లు, ఆలివ్ ఆయిల్ ఉంటే చాలు!
Hair Straightening Tips Without Using Heat: రసాయనాలు ఎప్పుడూ జుట్టు సహజత్వాన్ని కోల్పోయేలా చేస్తాయి. అందుకే ఎటువంటి రసాయనాలు, స్ట్రెయిటనింగ్ యంత్రాలు వాడకుండా రింగులు తిరిగిన కురులను సహజసిద్ధంగా స్ట్రెయిటనింగ్ ఎలా చేసుకోవచ్చో చూద్దాం... ►రింగుల జుట్టుని స్ట్రెయిట్‌గా మార్చేందుకు... కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలపాలి. ►ఈ నీటిని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి నలభై నిమిషాలు ఆరనివ్వాలి. ►తరువాత చల్లటినీళ్లు, సాధారణ షాంపుతో తలస్నానం చేయాలి, వారానికి ఒకసారి ఇలా చేయాలి. ఇలా కూడా చేయొచ్చు! ►ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెలో ఆలోవెరా జెల్ వేసి చక్కగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి నలభై నిమిషాల పాటు ఆరనివ్వాలి. ►తరువాత సల్ఫేట్ లేని షాంపుతో తలస్నానం చేయాలి. వీటిలో ఏ ఒక్క పద్ధతిని అయినా క్రమం తప్పకుండా అనుసరిస్తే రింగులు తిరిగిన జుట్టు స్ట్రెయిట్‌గా మారి మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చదవండి: Hair Care Tips: వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉల్లిపాయ రసం, కొబ్బరి నూనెతో దీపిక పదుకోణ్ ఒత్తయిన జట్టు వెనుక రహస్యమిదే..! -
Health Tips: వేసవిలో విజృంభించే కామెర్లు, అతిసార.. ఈ ‘పానీయం’ తాగారంటే!
Coconut Water Benefit In Summer: వేసవిలో అత్యద్భుతమైన సహజ పానీయం కొబ్బరినీరు. దీనికోసం ప్రత్యేకించి ఎలాంటి తంటాలు పడనక్కర్లేదు. కొబ్బరిబోండాన్ని కొట్టి నేరుగా లోపలి నీరు తాగేయడమే. కొబ్బరినీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు శరీరానికి శక్తినిస్తాయి. కొబ్బరిని పండించే ప్రతి దేశంలోనూ ప్రజలు కొబ్బరినీటిని ఇష్టంగా తాగుతారు. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్లో కొబ్బరినీటి వినియోగం ఎక్కువ. దాదాపు నాలుగైదు దశాబ్దాల కిందట కాంబోడియాలో కొబ్బరినీటిని రోగులకు సెలైన్గా కూడా ఇచ్చేవారు. వేసవితాపం నుంచి కొబ్బరినీరు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. వేసవిలో విజృంభించే కామెర్లు, అతిసార వంటి రోగాలతో బాధపడేవారికి కొబ్బరినీరు చాలా సురక్షితమైన పానీయం. చదవండి: Ambali Health Benefits: అంబలి తాగుతున్నారా.. స్థూలకాయం, మధుమేహం.. ఇంకా -
Summer Care Tips: ఓవర్ కూల్డ్ వాటర్ తాగుతున్నారా? అయితే..
సమ్మర్ వచ్చేసింది. ఏటా వచ్చేది, వెళ్లేదే కదా! అనుకోవడానికి వీల్లేదు. ఈ సారి వేసవి పరీక్ష పెట్టే అవకాశం ఉంటుంది. వేసవి తీవ్రత గురించి కాదు, వేసవిని దేహం తట్టుకోగలగడం గురించి ఇప్పుడు ప్రశ్న. గడచిన రెండు వేసవి కాలాలు ఇంట్లోనే గడిచిపోయాయి. కోవిడ్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌లు, ఆన్లైన్ క్లాసులు, తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్లకపోవడం వంటి జాగ్రత్తలతో వేసవి కారణంగా ఎదురయ్యే సన్‌స్ట్రోక్ వంటి అనారోగ్యాలను తప్పించుకోగలిగాం. మనుషులు నీడపట్టున ఉన్నప్పటికీ ఈ రెండేళ్లపాటు దేహం మాత్రం విశ్రాంతి తీసుకోలేదు. కోవిడ్ వైరస్‌తో పోరాటం చేస్తూనే ఉంది. కోవిడ్ బారిన పడిన వాళ్లలో నీరసం, ఇతర పోస్ట్ కోవిడ్ లక్షణాలను మాత్రమే గుర్తిస్తాం. కానీ కోవిడ్ బారిన పడకుండా తప్పించుకున్న వాళ్లు కూడా వైరస్‌తో సాగిన నిరంతర పోరాటంలో అలసిపోయి ఉన్నారు. కోవిడ్ బారిన పడని దేహాలు కూడా నీరసించి ఉన్నమాట వాస్తవం. అందుకే ఈ వేసవిని ఎదుర్కోవడం కోవిడ్ బారిన పడిన వాళ్లకు, పడని వాళ్లకు కూడా పెద్ద పరీక్ష అనే చెప్పాలి. ఒక మోస్తరు ఎండను కూడా తాళలేని స్థితిలోకి వెళ్లిపోతోంది దేహం. ఈ గడ్డు కాలాన్ని జాగ్రత్తగా దాటడానికి జాగ్రత్తలు తీసుకుందాం. ఏం చేయాలి? ►రోజుకు మూడు లీటర్ల మంచి నీటిని తాగాలి. ఫ్రిజ్‌లో ఉంచిన విపరీతమైన చల్లదనం నిండిన (ఓవర్ కూల్డ్) నీటిని తాగడం కంటే గది ఉష్ణోగ్రతలో ఉన్న నీరు లేదా ఒకమోస్తరు చల్లదనంతో ఉన్న నీటిని మాత్రమే తాగాలి. ►కొబ్బరి నీరు లేదా మజ్జిగ అరలీటరు తాగాలి. ►స్నానానికి చల్లటి నీరు లేదా గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి. మరీ వేడి నీటితో స్నానం చేయరాదు. ►గోరువెచ్చటి నీటితో స్నానం చేసిన తర్వాత నాలుగైదు మగ్గుల చల్లటి నీటితో తల, మెడను చల్లబరుచుకోవాలి. ►గది ఉష్ణోగ్రతలు దేహం భరించలేని స్థాయికి పెరిగినట్లు అనిపిస్తే తడి టవల్‌తో ముఖం, మెడ, చేతులను తుడుచుకోవాలి. కోల్డ్ ప్యాక్ వేసినట్లన్నమాట. ►ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్యలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదు. ►బయటకు వెళ్లాల్సి వస్తే తలకు క్యాప్ లేదా స్కార్ఫ్ కట్టుకోవాలి. ►ఆల్కహాలు అలవాటున్న వాళ్లు ఈ కాలంలో మానేయాలి లేదా వీలయినంత తక్కువగా తీసుకోవాలి. ►వ్యాయామం దేహానికి మంచిదే, కానీ ఈ కాలంలో మితంగా మాత్రమే చేయాలి. దేహం నీరసించి పోయేటట్లు వ్యాయామం చేయరాదు. చదవండి: Sabja Seeds Health Tips: సబ్జా గింజలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? -
మొటిమలు పోగొట్టే రవీనా టండన్ చిట్కాలు..
ముంబై: అందం మానవ జాతికి దేవుడిచ్చిన గొప్ప వరం. కానీ వివిధ కారణాలతో మొటిమలు రావడం వల్ల మొఖం అంద విహీనంగా తయారవుతుంది. యుక్త వయస్సుల్లో హర్మోన్ల అసమౌల్యత, ఒత్తిడి, పోషకాహార లోపం తదితర కారణాలతో మొటిమలు తరుచుగా వస్తుంటాయి. అయితే మొటిమలు నివారించడానికి ఎన్నో చిట్కాలను పాటిస్తుంటారు. అయితే అదిరిపోయే అందంతో లక్షలాధి అభిమానులను సంపాధించుకున్న బాలీవుడ్ నటి రవీనా టండన్, మొటిమలు తగ్గడానికి కొన్ని చిట్కాలను సూచించారు. రవీనా టాండన్ సూచించే చిట్కాలివే 1) ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయని, కొబ్బరి నీళ్లు తాగాక చివరగా కొంచెం నీళ్లను మొఖానికి రాస్తే చర్మం చల్లబడి మొటిమలు నివారణకు తోడ్పడతాయని తెలిపింది. 2) మొఖం కాంతి వంతంగా మెరవాలంటే, రోజ్ వాటర్‌తో ముల్తానీ మట్టిని మొటిమలపై రాస్తే చర్మానికి రక్షణ వ్యవస్థగా పనిచేస్తు, మొటిమలు రాకుండా అడ్డుకుంటుందని పేర్కొంది. 3) చివరగా జీరాతో నిరంతరం మొఖాన్ని శుభ్రం చేసుకోవాలని, పేస్ట్‌లాగా ఉపయోగిస్తే ఆకర్శనీయ కాంతి వంతమైన అందాన్ని సొంతం చేసుకోవచ్చు. చదవండి: వచ్చే జన్మలో కూడా ఖాళీ లేదు -
బ్యూటిప్స్
►ఎండలో కమిలిన ముఖానికి... ►వేసవి ఎండలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఈ ఎండల్లో కాసేపలా బయటకి వెళ్లి రాగానే ముఖం నల్లబడిపోవడం లేదా కమిలిపోవడం... ఆ తర్వాత ముఖం చూసుకుని ఉష్షోమని నిట్టూర్చడం సహజం. ఇలా కాకుండా ఉండాలంటే కొబ్బరిపాలలో దూది ముంచి, దానితో ముఖమంతా సున్నితంగా మర్దనా చేసుకుని ఆరిపోయిన తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే తిరిగి ముఖం ఎప్పటిలా కాంతులీనుతుంది. ►బయటినుంచి వచ్చాక కొబ్బరినీళ్లతో ముఖం కడుక్కున్నా కొబ్బరినీళ్లలో దూది ముంచి ముఖానికి రాసుకుని ఆరిపోయాక కడుక్కున్నా ముఖం తాజాగా కళ కళలాడుతుంది. -
భగత్ హల్వా (1795 నుండి)
భగత్ హల్వా తాజ్‌మహల్ అంత పురాతనమైనది కాకపోవచ్చును కాని, ఇంచుమించు అంత పురాతనమైనదే. బెలాంగంజ్ ప్రాంతానికి చెందిన లేఖ్‌రాజ్ భగత్ సుమారు రెండు శతాబ్దాల క్రితం హల్వాను అమ్మడం ప్రారంభించారు. మట్టితో అలికిన నేల మీద కూర్చుని రెస్టారెంట్ భోజనం చేసే రోజులు అవి. చెక్క స్పూనుతో, మట్టి పాత్రలలో మాత్రమే ఆ రోజుల్లో ఆహారం తీసుకునేవారు. దక్షిణ భారతీయులు, చైనీయులు ఇక్కడకు ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు. లడ్డు, బర్ఫీల స్థానంలో స్టేపుల్ ఫుడ్ అంటే పూరీ కూర, కేక్స్ పేస్ట్రీలు వంటివి పరిచయం చేశారు. అన్నిటికీ దీటుగా నిలబడింది ఇది.భగత్ హల్వాయి కుటుంబం లో తొమ్మిదో తరానికి చెందినవారు రాజ్‌కుమార్ భగత్. మొఘలుల కాలం నుంచి వీరి కుటుంబాలు ఇక్కడే ఉన్నాయట. బొగ్గులు, కట్టె పుల్లల వంటి వాటిని వంటకు ఉపయోగించే వారు కాదు. కేవలం ఆవు పిడకల మీద మాత్రమే వంట చేసేవారు. మొదట్లో పూరీ కూర తయారుచేసేవారు. బేడాయ్ (స్టఫ్డ్ పూరీ), రబ్రీ, జిలేబీ, బర్ఫీ వంటి మిఠాయిలు తయారుచేసేవారు. కాలక్రమేణా వీరు తమ వ్యాపారాన్ని విస్తరించారు. నగరంలో చాలా షాపులు ప్రారంభించారు. స్వీట్స్ నుంచి కేకుల వరకు, బ్రెడ్ నుంచి బటర్ వరకు, చాట్ నుంచి ఫాస్ట్ ఫుడ్ వరకు, అన్ని రకాల సంప్రదాయ మిఠాయిలు సైతం వీరు తయారుచేస్తున్నారు. కోకోనట్ వాటర్ రిఫ్రెషనర్ కావలసినవి: కొబ్బరి నీళ్లు – ఒకటిన్నర లీటర్లు; పుదీనా ఆకులు – అర కప్పు; నిమ్మ తొనలు – 4 (చిన్న చిన్న ముక్కలు); నిమ్మ రసం – ఒక టీ స్పూను; సన్నగా పొడవుగా తరిగిన పుచ్చకాయ ముక్కలు – అర కప్పు; ఐస్ క్యూబ్స్ – కొద్దిగా. తయారీ: ∙ఒక పాత్రలో ఒక టీ స్పూను నిమ్మ రసం, కొద్దిగా పుదీనా ఆకులు వేసి బాగా కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలి ∙నిమ్మ తొనలు, పుచ్చకాయ ముక్కలు జత చేసి అన్నీ కలిసేలా మిక్సీ పట్టాలి ∙గ్లాసులోకి తీసుకోవాలి ∙కొబ్బరి నీళ్లు, ఐస్ క్యూబ్స్ జత చేసి బాగా కలిపి, చల్లగా అందించాలి. ట్రాపికల్ కోకోనట్ సంగారియా కావలసినవి: పైనాపిల్ తరుగు – ఒక కప్పు; పచ్చి మామిడికాయ తురుము – ఒక కప్పు; కమలాపండు తొనలు – ఒక కప్పు (చిన్న చిన్న ముక్కలు చేయాలి); కొబ్బరి నీళ్లు – ఒకటిన్నర కప్పులు తయారీ: ∙ఒక పెద్దపాత్రలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి ∙సుమారు రెండు గంటలపాటు మూత పెట్టి ఉంచేయాలి ∙కొద్దిగా ఐస్ వేసి చల్లగా అందించాలి. వాహ్ లస్సీవాలా! వాహ్!!!జైపూర్ లస్సీవాలా (1944 నుంచి) జైపూర్ లస్సీవాలా గురించి ఎవరికి తెలియదు కనుక మళ్లీ వాళ్ల గురించి చెప్పడానికి. తరతరాలుగా అందరూ అక్కడి లస్సీ తాగినవారే. జైపూర్ వెళితే లస్సీని రుచి చూడకుండా వెనక్కు రారు. ఎం.ఐ. రోడ్లో ఈ లస్సీవాలా సుమారు ఏడు దశాబ్దాలుగా లస్సీ అమ్ముతున్నారు. 1944లో కిషన్‌లాల్ అగర్వాల్ ‘లస్సీవాలా’ ప్రారంభించారు. జైపూర్‌లో ఇటువంటి షాపు ఇదే మొదటిది. ఇక్కడ సంప్రదాయబద్ధంగా తియ్యగా, ఉప్పగా రెండు ఫ్లేవర్స్లోను లస్సీ దొరుకుతుంది. ఇప్పుడు సుగర్ ఫ్రీ లస్సీ కూడా అందిస్తున్నారు. ఈ లస్సీని రుచి చూడని సెలబ్రిటీలు లేరు. ప్రముఖ బాలీవుడ్ తారలంతా ఈ లస్సీని రుచి చూసినవారే. ఈ లస్సీవాలాను దర్శించి, లస్సీ రుచిని తలచుకుంటూ నాలుక తడుపుకుంటుంటారు. అమితాబ్, ముఖేష్ అంబానీ, శిల్పాశెట్టి, డింపుల్ కపాడియా, శోభాడే వంటి వారంతా ఈ లస్సీని ఆస్వాదించినవారే. మిగిలిన షాపులు రాత్రివరకు తెరిచి ఉంటాయి. లస్సీవాలాలు మాత్రం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకు మాత్రమే తెరచి ఉంటాయి. ఇందుకు కారణం ఏమిటని ప్రశ్నిస్తే, లస్సీవాలా అధినేత ఘనశ్యామ్ అగర్వాల్ ఇందుకు మంచి సమాధానం చెబుతారు, ‘సాయంత్రానికి పెరుగు పులిసిపోతుంది. అంతేకాదు ఆ తరవాత ఇంక మా దగ్గర పెరుగు కూడా మిగలదు’ అంటారు. కుల్లాడ్ (మట్టి పాత్ర) 200 మి.లీ., 400 మి.లీ. పరిమాణంలో రెండు సైజులలో లస్సీ దొరుకుతుంది. ఇందులో పెరుగు, ఐస్, మంచి నీళ్లు పోస్తారు. మండుటెండలో చల్లటి లస్సీ కోసం నిలబడలేమనుకుంటే, ప్యాకింగ్ కూడా తెప్పించుకోవచ్చు. బటర్ పేపర్‌తో కవర్ చేసి, దారంతో బిగించి ఇంటి గుమ్మం దగ్గరకు చేరుతుంది ఈ కుల్లాడ్. భారతీయులే కాకుండా, ప్రతిరోజు కనీసం వంద మంది విదేశీయులు సైతం కుల్లాడ్ లస్సీని రుచి చూస్తారు. జైపూర్ వెళితే లస్సీ తాగడం మరచిపోకండేం!!! -
కోకోనియాలు
వేసవికి కొబ్బరినీళ్లు విరుగుడు చెట్టు పొట్టలో నుంచి తన ముంతలోకి నింపిన ఔషధం కోటి పానీయాలలో కూల్... కోకో పానీయం ఫ్రూటీ కోకోనట్ వాటర్ స్లషెస్ కావలసినవి: కొబ్బరి నీళ్లు – ఒక కప్పు; ఫ్రోజెన్ ఫ్రూట్స్ – అర కప్పు (అరటిపళ్లు, స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీ ముక్కలను ఫ్రిజ్‌లో ఉంచి తీయాలి). తయారీ: ∙బ్లెండర్లో కొబ్బరి నీళ్లు, ఫ్రోజెన్ ఫ్రూట్స్ వేసి అన్నీ కలిసేలా బాగా బ్లెండ్ చేయాలి ∙గ్లాసులోకి తీసుకుని వెంటనే తాగేయాలి. పైనాపిల్ కోకోనట్ జ్యూస్ కావలసినవి: తాజా పైనాపిల్ జ్యూస్ – ముప్పావు కప్పు; కొబ్బరి నీళ్లు – అర కప్పు; అల్లం రసం – అర టీ స్పూను; తేనె – ఒక టీ స్పూను; నిమ్మరసం – ఒక టీ స్పూను తయారీ: ∙పైన చెప్పిన పదార్థాలను మిక్సీ జార్లో వేసి బాగా కలిసేలా తిప్పి, గ్లాసులలోకి తీసుకోవాలి.సుమారు ఒక గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచి, బయటకు తీసి చల్లగా తాగాలి. కోకోనట్ అండ్ చియా పుడ్డింగ్ కావలసినవి: కొబ్బరి తురుము – పావు కప్పు; సబ్జా గింజలు – పావు కప్పు; చిక్కటి కొబ్బరి పాలు – ముప్పావు కప్పు; కొబ్బరి నీళ్లు – అర కప్పు; వెనిలా ఎక్స్ట్రాక్ట్ – ఒక టీ స్పూను; ఉప్పు – చిటికెడు; తాజా స్ట్రాబెర్రీలు – అర కప్పు తయారీ: ∙చిన్న పాత్రలో కొబ్బరి తురుము, సబ్జా గింజలు, కొబ్బరి పాలు, కొబ్బరి నీళ్లు, వెనిలా ఎక్స్ట్రాక్ట్, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి ∙ఫ్రిజ్‌లో పెట్టి, రెండు గంటల తరవాత తీయాలి ∙స్ట్రాబెర్రీలతో అలంకరించి అందించాలి. లెమన్ కోకోనట్ క్వెంచ్ కావలసినవి: తాజా నిమ్మ రసం – 2 టేబుల్ స్పూన్లు; కొబ్బరి నీళ్లు – ఒకటిన్నర కప్పులు; నీళ్లు – పావు కప్పు; తేనె – ఒక టేబుల్ స్పూను; అల్లం తురుము – అర టీ స్పూను; ఉప్పు – కొద్దిగా. తయారీ: ∙మిక్సీ జార్లో నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, తేనె, అల్లం తురుము, ఉప్పు వేసి అన్నీ కలిసేలా మిక్సీ పట్టాలి ∙గ్లాసులోకి తీసుకుని కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి, చల్లగా తాగాలి ∙ఈ జ్యూస్‌ని ఫ్రిజ్‌లో రెండు వారాల దాకా నిల్వ ఉంచుకోవచ్చు. కోకోనట్ కాఫీ వాటర్ కావలసినవి:కొబ్బరి నీళ్లు – ఒక కప్పు; కాఫీ డికాక్షన్ – పావు కప్పు (చిక్కగా ఉండాలి); ఐస్ – తగినంత. తయారీ: ఒక గ్లాసులో కొబ్బరి నీళ్లు, కాఫీ డికాక్షన్, ఐస్ వేసి బాగా కలపాలి. \(ఏదైనా తక్కువ అనిపిస్తే జత చేసుకోవాలి) ∙చల్లగా తాగాలి. – నిర్వహణ: వైజయంతి పురాణపండ -
కళ్లకు టీ బ్యాగ్ ముఖానికి కొబ్బరినీళ్లు
♦ కళ్ల కింద ఉబ్బుగా కనిపిస్తుంటే (పఫ్పీ ఐస్) ఇలా చేయండి. వాడిన టీ బ్యాగ్ డీప్ ప్రిజ్‌లో పెట్టి చల్లబడ్డాక ఆ టీ బ్యాగ్‌తో కళ్ల కింద కాపడం పెడుతూ ఉండాలి. కను రెప్పల కింద, పైన ఇలా రెండు వైపులా 5 నుంచి 10 నిమిషాల సేపు చేస్తే ఉబ్బు తగ్గుతుంది. ♦ ముఖ చర్మం మృదువుగా ఉండాలంటే మృతకణాల సంఖ్య తగ్గాలి. దీనికోసం దానిమ్మ రసం, ద్రాక్షరసం టీ స్పూన్ చొప్పున తీసుకోవాలి. దీంట్లో అర టీ స్పూన్ బాదం నూనె కలిపి బాగా కలిపి చర్మానికి పట్టించి, వేళ్లతో సున్నితంగా మర్దన చేయాలి. దానిమ్మ, ద్రాక్ష రసంలో పులుపు వల్ల మృతకణాలు తగ్గుతాయి. బాదం నూనెలోని ఇ–విటమిన్ వల్ల చర్మం మృదువుగా అవుతుంది. ♦ ముఖ చర్మం పొడిబారి నిస్తేజంగా కనిపిస్తుంటే కొబ్బరి నీళ్లను వేళ్లతో అద్దుకుని మసాజ్ చేసుకోవాలి. సబ్బుతో కాకుండా సోప్ లిక్విడ్ లేదా సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు ముఖచర్మాన్ని పొడిబారనీయకుండా చేస్తాయి. -
ఫుడ్ ఫ్యాక్ట్స్
కొబ్బరి నీళ్లను అత్యవసర పరిస్థితుల్లో రక్తంలోని ప్లాస్మాకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. వంగపండు రంగులో ఉన్న క్యారెట్లే అసలైన క్యారెట్లు. అసలెప్పటికీ పాడవని ఒకే ఒక పదార్థం తేనె. మూడువేల సంవత్సరాల వరకు ఇది నిల్వ ఉంటుంది. పచ్చి వేరుశెనగల్లో కంటే కాస్త దోరగా వేయించిన వాటిలోనే పోషకాలు ఎక్కువగా వుంటాయి. -
వేసవి పానీయం..
సాక్షి, కరీంనగర్,ఎండాకాలం.. ఘడియకోసారి గొంతు తడుపుకోవాలనిపిస్తుంది.. లీటర్లకొద్దీ నీటిని తాగాలనిపిస్తుంది.. దాహాన్ని ఒక్క గ్లాస్ రసంతో చెక్ పెట్టొచ్చు. ఇంట్లోనే మనకు నచ్చిన పానీయూన్ని తయూరు చేసుకోవచ్చు. అటు దాహం తీరడం తోపాటు ఇటు ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. శరీరాన్ని ఎక్కువ సేపు చల్లగా ఉంచు కోవచ్చు. అవేమిటో తెలుసుకుందామా..? ఓసారి ఈ రసాలు పరిశీలిం చండి. లెమన్ సోడా... వేసవిలో చాలామంది ఎక్కువగా తాగే పానీయం ఇది. నిమ్మకాయ రసం, ఉప్పు కలిపి తయారు చేస్తారు. దాహార్తి తీరుస్తుంది. మసాలా రుచిలో కూడా దొరుకుతుంది. తోపుడు బళ్లపై ఎక్కువగా విక్రయిస్తున్నారు. ధర రూ.5 నుంచి రూ.10 వరకు ఉంటుంది. కొబ్బరినీళ్లు... వేసవిలో డీహైడ్రేషన్ నుంచి కాపాడే ఔషధ గుణాలున్న పానీయం కొబ్బరి నీరు. కొన్ని ప్రాంతాల్లో లీటర్లలో కొబ్బరి నీటిని అమ్ముతున్నారు. లీటర్ ధర రూ.100 నుంచి 130 వరకు ఉంది. అంతేకాదు ప్రోసెస్ చేసిన కొబ్బరినీటిని చిన్నచిన్న డబ్బాలు, ప్యాకెట్లలో కూడా విక్రయిస్తున్నారు. సబ్జా... ఇంట్లో సులువుగా తయారు చేసుకునే వేసవి పానీయాల్లో ఇది ఒకటి. దీని తయారీకి సబ్జాగింజలు, బెల్లం, మిరియాల పొడిని వినియోగిస్తారు. శరీరంలో వేడిని నియంత్రిస్తుంది. మిరియాల పొడి కారణంగా కొంచెం ఘాటుగా విభిన్న రుచిని కలిగి ఉండడం దీని ప్రత్యేకత. తయారీ ఇలా... ఒక స్పూన్ సబ్జాగింజల్ని నీటిలో నానబెట్టాలి. రెండు స్పూన్ల బెల్లం పొడిని 250 మిల్లీలీటర్ల నీటిలో వేయాలి.దానిలో నానబెట్టిన సబ్జాగింజల్ని వేసి రెండుగంటలు పాటు ఉంచాలి. చివర్లో రుచి కోసం మిరియాల పొడిని జత చేయాలి. చెరుకు రసం.. వేసవికాలంలో చాలామంది సేవించే పానీయం చెరుకురసం. అయితే రోడ్డుపక్కన కిరోసిన్ పొగల మధ్య లభించే చెరుకు రసం తాగకపోవ డమే మేలు. చెరుకు రసం తయారీకి స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారైన ఆటోమేటిక్ మిషన్లు వచ్చేశాయి. దీనిలో ప్రత్యేక ఫ్రీజర్ ఉండడంతో రసం చల్లగా ఉంటుంది. ధర రూ.20 నుంచి రూ.25 వరకు ఉంటుంది. ఫలూదా... ఇది ఇరానియన్ పానీయం. దీని తయారీకి పాలు, సబ్జా గింజలు, సేమ్యాలు వినియోగిస్తారు. రుచి కోసం డ్రైఫ్రూట్స్ వేస్తారు. చల్లదనం కోసం ఐస్‌క్రీమ్ వాడుతారు. పోషకవిలువలు అధికంగా ఉండే పానీయం ఇది. ధర రూ.20 నుంచి రూ.30 వరకు ఉంటుంది. చిన్నారులు అధికంగా ఇష్టపడే పానీయం. పచ్చిమామిడికాయను ఉడకబెట్టాలి. నీళ్లు ఆవిరిగా మారిన తర్వాత పైపొరను తీయాలి. లోపల గుజ్జుకు నీటిని జత చేయాలి. తర్వాత వడపోయాలి. అలావచ్చిన చిక్కటి ద్రావణానికి లీటర్‌కు 400 గ్రాముల చక్కెర, అల్లం పేస్ట్, తగినంత రాక్ సాల్ట్ కలిపి మరగబెట్టి చల్లార్చాలి. ఫ్రిజ్‌లో పెడితే చాలు. పుల్లగా తీయగా ఉండే పనా సిద్ధం. -
నేడు సీతారాముల కల్యాణం
ముస్తాబైన భద్రగిరి.. ఏర్పాట్లు పూర్తి వేలాదిగా చేరుకుంటున్న భక్తజనం ముత్యాల తలంబ్రాలతో నేడు గవర్నర్ రాక భద్రాచలం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో మంగళవారం జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది. శ్రీరామనవమి రోజున భద్రగిరిలో జరిగే స్వామివారి కల్యాణాన్ని వీక్షించేందుకు మన రాష్ట్రంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. మిథిలాస్టేడియంలోని సుందరంగా తీర్చిదిద్దిన కల్యా ణ మండపంలో స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మండపంలో స్వామి వారి కల్యాణ తంతు మంగళవారం ఉదయం 10.30 నుంచి ప్రారంభమవుతుంది. అభిజిత్ లగ్నమందు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు మాంగల్య ధారణ జరుగుతుంది. మిథిలా స్టేడియంలో 35 వేల మంది వరకూ భక్తులు కూర్చుని స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు ఏర్పాటు చేశారు. రామాలయం పరిసర ప్రాంతాల్లో ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. ఈసారి ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మిథిలా స్టేడియంలో సెక్టార్లలో 40 కూలర్లను ఏర్పాటు చేశారు. సుమారు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు ప్రత్యేక వసతి కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తులు సేద తీరేందుకు గోదావరి ఘాట్, మిథిలా స్టేడియం ప్రాంగణంతో పాటు వివిధ ప్రాంతాల్లో భారీ టెంట్లను ఏర్పాటు చేశారు. రామాలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులందరికీ స్వామి వారి ప్రసాదాలను అందించేందుకు సుమారు 2 లక్షల లడ్డూల ప్రసాదాలను సిద్ధం చేశారు. అదే విధంగా 100 క్వింటాళ్ల స్వామి కల్యాణం తలంబ్రాలను సిద్ధం చేశారు. ఈసారి అందరికీ ముత్యాల తలంబ్రాలను అందించేందుకు రూ.5లకు ఒక ప్యాకెట్ చొప్పున విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం తరఫున రాష్ట్ర గవర్నర్ నరసింహన్ స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భద్రాచలం చేరుకున్న దేవాదాయశాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మిథిలా స్టేడియంలో ఇదే వేదికపై బుధవారం స్వామి వారికి పట్టాభిషేక మహోత్సవం జరుగనుంది. రామయ్యకు మండపేట బోండాలు మండపేట, న్యూస్‌లైన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణ మహోత్సవంలో తూర్పు గోదావరి జిల్లా మండపేట కొబ్బరి బోండాలు కొలువుదీరనున్నాయి. పట్టణానికి చెందిన కేవీఏ రామారెడ్డి, మహాలక్ష్మి దంపతులు 2001 నుంచి భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవానికి బోండాలను అలంకరించి తీసుకెళ్తున్నారు. బోండాలకు ఎనామిల్, వాటర్ పెయింట్లు వేస్తారు. పూసలు, రాళ్లు, రిబ్బన్లు తదితర సామగ్రితో సుందరంగా తీర్చిదిద్దుతారు. శంఖు చక్రాలు, నామాలు, సీతారాముల పేర్లతో ప్రత్యేకంగా ముస్తాబు చేస్తారు. ఈ అలంకరణకు పది రోజులు పడుతుందని రామారెడ్డి తెలిపారు. సీతారాముల కల్యాణ వేడుకలో ఈ బోండాలను కానుకగా ఇవ్వాలని ఆకాంక్షించామని, అదే తరువాత ఆనవాయితీగా మారిందని చెప్పారు. రాజన్న సన్నిధిలో.. వేములవాడ, న్యూస్‌లైన్: కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో శ్రీ సీతారాముల కల్యాణం మంగళవారం వైభవంగా జరుగనుంది. ఈ వేడుకను తిలకించేందుకు సుమారు రెండు లక్షల మంది తరలివస్తారు. మంగళవారం ఉదయం 10.05 నుంచి మధ్యాహ్నం 12.35 మధ్య జానకీరాముల కల్యాణం నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో కృష్ణాజీరావు తెలిపారు. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు కల్యాణ వేడుకలను తిలకించేందుకు వీలుగా ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. అనంతరం సాయంత్రం 4.30కు రథోత్సవం నేత్రపర్వంగా నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణ వేడుక జరుగుతున్న సమయంలోనే శివసత్తులు, హిజ్రాలు శివుడిని పెళ్లాడటం ఇక్కడ ఆనవాయితీ. ఓవైపు సీతారాముల తలంబ్రాల వేడుక కన్నులపండువగా సాగుతున్న సమయంలో వీరంతా పరస్పరం తలంబ్రాలు పోసుకోవటం విశేషం. -
కొబ్బరి నీటికీ అంటిన ‘విషం’
సాక్షి, చెన్నై: రసాయనిక ఎరువులు, పురుగుమందుల అతి వినియోగం వల్ల వ్యవసాయోత్పత్తులు విషతుల్యంగా మారిపోతాయనడానికి ఇదొక తాజా నిదర్శనం. తమిళనాడులోని తిరుపూరు జిల్లా ఉడుమలైలో 4,500 ఎకరాల్లో కొబ్బరి చెట్లు విస్తరించి ఉన్నాయి. ఇటీవల అక్కడి చెట్ల నుంచి సేకరించిన కొబ్బరి కాయలు, కొబ్బరి బొండాలలోని నీళ్లు విషతుల్యంగా మారినట్లు తేలింది. రైతులే సమస్యను గుర్తించి స్థానిక వ్యవసాయూధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నిపుణుల సూచనలతో నిమిత్తం లేకుండా రసాయనిక ఎరువులు, పురుగు మందులను విచ్చలవిడిగా వాడడం వల్లనే కొబ్బరి నీళ్లు విషతుల్యంగా మారాయని ఉడుమలై వ్యవసాయశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ చిన్నవేల్ నిర్ధారించారు. నిపుణుల సలహా మేరకు రసాయనాలను పరిమితంగా వినియోగించడం శ్రేయస్కరమని ఆయన రైతాంగానికి సూచించారు.