
సమ్మర్ వచ్చేస్తుందంటేనే భయం వేస్తుంది. ఉక్కపోతాలు, సూర్యుడి భగభగలు తలుచుకుంటే వామ్మో..! అనిపిస్తుంది. ఆఖరికి వండిన ఏ వంటకాలు నిల్వ ఉండవు. మధ్యాహ్నా 12 దాటితే బయటకు అగుపెట్టే ఛాన్సే లేదన్నంత వేడి సెగలు. ఎంత నీడ పట్టున కూర్చొన్న ఆ ఎండల వేడికి ఒకటే దాహం, నోరంతా పెడుచుకట్టుకుపోయినట్లు ఉంటుంది. దాంతో చాలావరకు కొబ్బరి బొండాలు, చెరుకురసం వంటివి వాటితో హైడ్రేటెడ్‌గా ఉండేలా చేసుకుంటారు. అయితే చెరుకురసంలో ఉండే అధిక చక్కెరల దృష్ట్యా కొబ్బరి నీళ్ల వైపుకే మొగ్గు చూపుతారు. అందులోనూ వేసవి అని అటు కొబ్బరి కాయల వ్యాపారలు అదును చూసి ఎక్కువ ధరలకు విక్రయిస్తుంటారు. ఎండల భయంతో విధిలేక అంత ధర వెచ్చించి మరీ కొని తాగేస్తుంటారు. అయితే అదేం అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు. సమ్మర్‌లో కొబ్బరి బొండాలు తప్పనిసరి ఏం కాదని తేల్చి చెబుతున్నారు. వాటికి బదులుగా తక్కువ ఖర్చులో డీహైడ్రేషన్‌కి చెక్‌పెట్టొచ్చని చెబుతున్నారు అదెలాగో చూద్దామా..!.
ఆరోగ్య స్పుహ ఎక్కువై సోషల్ మీడియాలోనూ, పేపర్‌లోనూ కొబ్బరి నీరుకి మించిన దివ్యౌషధం లేదంటూ ఊదరగొట్టుస్తున్నారు. నిజానికి కొబ్బరి నీరేమి సర్వరోగ నివారిణి కాదంటున్నారు వైద్యులు. ఇది హైడ్రేషన్‌గా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అది సమంజసమే అయినా..మార్కెట్లో అధిక ధర పలుకుతున్నప్పడు ప్రత్యామ్నాయంగా తరుచుగా నీరు తాగితే చాలు. పోనీ వేడికి తాళ్లలేకపోతున్నాం అనుకుంటే అరటిపండ్లు, నీళ్లు తాగినా డీహైడ్రేషన్‌కి గురవ్వరని చెబుతున్నారు నిపుణులు.
ఎలక్ట్రోలైట్ల సమృద్ధి కారణంగా..
చాలామంది వేసవిలో కొబ్బరి నీళ్లు తాగకపోతే వేడి చేస్తుందని, ముక్కు నుంచి రక్తం కారుతుందని ఫిర్యాదులు చేస్తుంటారు. అది చాలా తప్పు ఆ సమస్యకు మూల కారణం తెలుసుకునేలా ఈఎన్‌టీ వైద్యుడిని సంప్రదించాలే గానీ కొబ్బరినీరు తగ్గిస్తుందని చెప్పడం సరైనది కాదంటున్నారు వైద్యులు. అలాగే చాలామంది మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి కొబ్బరి నీరే మంచిదనుకుంటారు. అది కూడా సరైనది కాదు. ఎందుకంటే కొబ్బరినీటిలో పోషకాలు ఉన్నాయి కానీ అది మూత్రపిండాల్లో రాళ్లను తగ్గించేంత శక్తి అయితే ఉండదని నొక్కి చెప్పారు నిపుణులు. కేవలం వడదెబ్బ తగ్గినప్పుడు ఈ కొబ్బరినీరు తక్షణమే శక్తిని ఇచ్చి, ఎలక్ట్రోలైట్లతో బాడీని భర్తీ చేస్తుంది. త్వరితగతిన కోలుకునేలా చేస్తుందన్నారు.
లేత కొబ్బరి నీరు ప్రకృతి ప్రసాదించిన రిఫ్రెషింగ్ అమృతం!. ఎలక్ట్రోలైట్లతో నిండిన ఇది, తక్కువ కేలరీలు, అధిక పొటాషియం, విటమిన్ బీ, సీలు కలిగిన హైడ్రేటింగ్ పానీయం. రీహైడ్రేషన్, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మనకు మంచి ఆరోగ్యకరమై ఎనర్జీ ఇచ్చేందుకు తీసుకోవాలే తప్ప. అది తీసుకుంటేనే హైడ్రేటెడ్‌గా ఉంటామనేది అపోహేనని తేల్చి చెప్పారు. అలాగే దీన్నీ హైడ్రేషన్‌కి సంబంధించిన ప్రాథమిక వనరుగా తీసుకోకూడదు.
ఆ సమస్యలు ఉత్ఫన్నమైనప్పుడూ..
అథ్లెట్లకు లేదా వేడి వాతావరణంలో పనిచేసేవారికి కొబ్బరినీటిలో ఉండే అధిక ఎలక్ట్రోలైట్ కంటెంట్ కారణంగా తీసుకోమని వైద్యులు సూచిస్తారే తప్ప, ప్రత్యామ్నాయంగా అరటిపండ్లు, చల్లటి నీరు తాగవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. కొబ్బరి నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించినప్పటికీ ఇది అన్నీ ఆరోగ్య సమస్యలకు అద్భుత నివారిణీ మాత్రం కాదని చెప్పారు.
ముఖ్యంగా విరేచనాలు, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారికి అలసట బారిన పడకుండా ఉండేలా వైద్యులు నీటికి బదులుగా దీన్ని సూచించడం జరుగుతుందని వివరించారు. కాబట్టి సరసమైన ధరల్లో కొబ్బరి బొండాలు దొరికితే హయిగా కొనుక్కుని ఆస్వాదించండి లేదంటే హైడ్రేషన్ కోసం తక్కువ ధరలోనే ప్రత్యామ్నాయులు ఉన్నాయనే విషయం గ్రహించండి అని చెబుతున్నారు వైద్యులు.
(చదవండి: జెన్ జడ్ రెబల్స్..ఈ తరం ఉద్యోగులు సరిచేసుకోవాల్సినవి ఇవే..!)