కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. అనేక అనారోగ్య సమస్యలకు కొబ్బరినీళ్లు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. నూటికి నూరుపాళ్లు సహజసిద్ధమైన, కల్తీకి ఆస్కారం లేని పానీయం ఇది. అందుకే ఎవరైనా అనారోగ్యానికి గురైతే కొబ్బరిబోండం తాగమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు.శరీరంలోని వేడిని తగ్గించి, డీహైడ్రేట్ అయ్యేలా కాపాడుతుంది.
ఆరోగ్యపరంగానే కాకుండానే అందం రెట్టింపు అయ్యేందుకు కూడా కొబ్బరిబోండం సహాయపడుతుంది. ప్రతిరోజూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఫాస్పరస్, సీ విటమిన్ వంటి ఎన్నో ఖనిజ లవణాలు కలిగిన కొబ్బరినీళ్లతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయా? షుగుర్ పేషెంట్స్ కొబ్బరినీళ్లు తాగొచ్చా అన్నది ఈ స్టోరీలో తెలుసుకుంది.
కొబ్బరినీళ్లతో బోలెడు ప్రయోజనాలు
► కొబ్బరినీళ్లలో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి అనేకరకాల వ్యాధులను దూరం చేస్తాయి.
► కొబ్బరినీళ్లలో 94 శాతం నీరు ఉంటుంది. ఇది వ్యార్థాలను తొలగించి శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి.
► కొబ్బరినీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది.
► జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపర్చడమే కాకుండా పొట్ట సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.
► రోజూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల అధిక రక్తపోటును నివారిస్తుంది.
► గుండెజబ్బులు, హార్ట్ ఫెయిల్యూర్ రిస్కును తగ్గించడంలో కొబ్బరినీళ్లు ముఖ్య పాత్ర వహిస్తుంది
► కిడ్నీ సమస్యలలో ఎఫెక్టివ్: కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు తాగడం మంచిది.
► బరువు తగ్గిపోతున్నామని బావించేవాళ్లు ప్రతిరోజూ కొబ్బరినీళ్లు తాగాలి. ఇందులోని తక్కువ కొవ్వు శరీరానికి మేలు చేస్తుంది.
షుగర్ పేషెంట్స్ కొబ్బరినీళ్లు తాగొచ్చా?
♦ డయాబెటీస్ పేషెంట్స్ కొబ్బరినీళ్తు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలో పెరుగుతాయనే అపోహ ఉంటుంది. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొబ్బరినీళ్లు తాగడం వరం లాంటిదని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుందని వైద్యులు అంటున్నారు.
♦ ఇది టైప్ 2 డయాబెటిస్, ప్రీడయాబెటిస్‌లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్న వాళ్ళు ముదిరిన కొబ్బరి నీటిని కాకుండా లేత కొబ్బరి నీటిని తాగడం మంచిది. ఎందుకంటే ముదురు కొబ్బరితో పోలిస్తే లేత కొబ్బరిలో చక్కెర శాతం చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది.
♦ అయితే ఈమధ్య కాలంలో ప్యాక్ చేసిన కొబ్బరినీళ్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటున్నాయి. వీటిని షుగర్ పేషెంట్స్ తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. ఇందులో ప్రిజర్వేటీస్, చక్కెరలు డయాబెటిస్ పేషెంట్స్‌కి మంచిది కాదని, వాళ్లు మాత్రం సహజంగా దొరికే కొబ్బరినీళ్లు తాగడమే ఉత్తమమని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment