Health Tips In Telugu: ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న తులసి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. తులసిలో ఆల్సోలిక్ యాసిడ్, యూజినాల్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది జలుబు, జ్వరం వంటి అనేక సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది. అందువల్ల మీకు యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నట్లయితే తులసి మీకు ఉత్తమమైనది.
ఖాళీ కడుపుతో ఆకులు నములితే..
చక్కెర వ్యాధిగ్రస్తులకు తులసి దివ్యౌషధం. తులసి ఆకులు హైపోగ్లైసీమిక్ స్థాయి నియంత్రణ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించడంలో సహాయపడతాయి. దీని కోసం మీరు గుప్పెడు తులసి ఆకులను తీసుకొని రాత్రంతా ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. తర్వాత ఉదయం ఖాళీ కడుపుతో ఆకులు నములుతూ నీళ్లు తాగేసెయ్యండి. ఇలా చేయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.
తులసి ఆకుల కషాయాన్ని రోజూ తాగితే
తులసిలో విటమిన్ ఎ, విటమిన్ డి, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియను బలోపేతం చేయడానికి కూడా తులసి బాగా పనిచేస్తుంది. తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. తులసి ఆకుల కషాయాన్ని రోజూ తాగడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం పొందవచ్చు.
చదవండి: ప్లాస్టిక్ కవర్లలో వేడి వేడి ఛాయ్! పొట్ట కింద ‘టైర్లు’!.. అలారం మోగుతోంది.. వినబడుతోందా?
Veganuary: చర్మానికి మంచి నిగారింపు.. ఆరోగ్యమూ బాగుంటుంది: నటి
Comments
Please login to add a commentAdd a comment