Basil leaves
-
Health: ఏది పడితే ఆ టాబ్లెట్ వేసుకోవద్దు! పైనాపిల్, నిమ్మ, కివి పండ్లు.. ఇంకా తులసితో..
గత కొద్దిరోజులుగా వాతావరణంలో వస్తున్న రకరకాల మార్పుల వల్ల దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. చాలామంది మెడికల్ షాప్‌కు వెళ్లి వాళ్లు ఇచ్చిన మందులు తెచ్చుకుని వేసుకుంటూ ఉంటారు. అది చాలా ప్రమాదం. దానివల్ల రకరకాల దుష్ఫలితాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. దగ్గు, జలుబుకు సహజమైన చిట్కాలు పాటించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అవేమిటో తెలుసుకుందాం. అసలు దగ్గు, జలుబు రాకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తిన్నట్లయితే తొందరగా ఈ అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బలవర్థకమైన ఆహారం తీసుకొని శరీరాన్ని బలంగా ఉంచుకుంటే, అసలు ఇవి రాకుండానే ఉంటాయి. జలుబు, దగ్గు వంటి సమస్యల నివారణకు యాంటీబయాటిక్స్ ఉపయోగించటం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. సహజ చిట్కాలు... ►తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే జలుబు, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. ►రోజుకు రెండుసార్లు పసుపు, వేడి పాలను కలిపి తీసుకుంటే కూడా ఉపశమనం దొరుకుతుంది. ►మిరియాల కషాయాన్ని తాగినా, లవంగాలు బుగ్గన పెట్టుకుని వాటి రసాన్ని మింగుతున్నా, వేడి వేడి మసాలా టీ తయారు చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది ►చెంచాడు నిమ్మరసాన్ని, రెండు స్పూన్ల తేనెను వేడినీళ్లలో కలుపుకొని తాగితే ఉపశమనం దొరుకుతుంది. ►అల్లాన్ని దంచి కషాయం చేసుకుని తాగినా, అల్లం టీ చేసుకుని తాగినా కూడా రిలీఫ్ ఉంటుంది ►కొద్దిగా పసుపు, ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో పుక్కిట పట్టడం వల్ల గొంతుకు ఉపశమనం దొరుకుతుంది∙ ►కొన్ని తులసి ఆకులు, చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి ముక్కలు, టీ స్పూన్ వాము, మెంతులు, పసుపు, నాలుగైదు నల్ల మిరియాలు వేసి నీళ్లు పోసి బాగా మరిగించి కషాయం తయారు చేసుకుని తాగితే మరింత మంచి ఫలితం ఉంటుంది. వేడినీళ్ళకే ఓటేయండి... ►దగ్గు, జలుబుతో బాధపడేవారు శీతల పానీయాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ►అదేవిధంగా ఫ్రిజ్‌లో నుంచి తీసిన చల్లటి నీళ్లను తాగడానికి బదులు ఎప్పుడు నీళ్లు తాగినా కాస్త వేడిగా ఉన్న నీటిని మాత్రమే తాగడం మంచిది. ఈ పండ్లు మంచివి పైనాపిల్, నిమ్మ, కివి వంటి పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కూడా జలుబు, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. చదవండి: Health: బీరకాయ, నేతి బీరకాయ తరచుగా తింటున్నారా? ఇందులోని అధిక సెల్యులోజ్ వల్ల.. Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే.. -
రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? బ్లాక్ కాఫీ తాగుతున్నారా? ఇవి తింటే..
శరీరంలో అక్కడక్కడ రక్తం గడ్డ కడుతోందా? రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? సాధారణంగా రక్తం మూడు విధాలుగా గడ్డ కడుతుంది. 1. సిరలలో... అది ముఖ్యంగా కాళ్ళలో వస్తుంది. కాలికి వాపు రావడంతో పాటు నొప్పి ఉంటుంది. కొన్ని సార్లు చర్మం రంగు మారుతుంది. 2. ఊపిరితిత్తులలో కొన్ని సార్లు గడ్డ కడుతుంది. ఇది చాలా ప్రమాదకరం. కాళ్ళలో నుంచి రక్తప్రవాహంలో సిరల ద్వారా ఊపిరితిత్తులకు చేరవచ్చు. ఆయాసం, ఛాతీ నొప్పి ముఖ్య లక్షణాలు. 3. గుండె లో కూడా గడ్డ కడుతుంది. కొన్నిసార్లు ధమనుల ద్వారా మెదడుకు వెళ్లి పక్షవాతం రావచ్చు. D-dimer అనే రక్త పరీక్ష వలన సిరలలో ఉండే రక్త గడ్డ ను కొనుక్కో వచ్చు. గుండెలో ఉన్న రక్త గడ్డను Echocardiogramతో కనుక్కో వచ్చు. ఊపిరితిత్తుల రక్త గడ్డ ను ఛాతీ CT scanతో తెలుసుకోవచ్చు. రక్తం మన శరీరంలో చేసే కీలకమైన పనులేంటీ? 1. ఆక్సిజన్‌ను సరఫరాచేసేది రక్తమే మనం బతకాలంటే ఆక్సిజన్ తప్పనిసరి అని తెలుసు. అయితే, ఆ ఆక్సిజన్ కేవలం ఊపిరితిత్తులకే పరిమితం కాదు. శరీరమంతా వ్యాపిస్తుంది. మరి గాలి రూపంలో ఉండే ఆక్సిజన్ శరీరానికి ఎలా అందుతుందనేగా మీ అనుమానం? ఆ ఆక్సిజన్‌ను సరఫరా చేసేది వాహకం రక్తమే. కేవలం ఆక్సిజన్ మాత్రమే కాదు, శరీరానికి కావల్సిన పోషకాలు, హార్మోన్లకు సైతం సరఫరా చేస్తుంది. అయితే, మనం తినే ఆహారం, మన అలవాట్లు సక్రమంగా ఉన్నప్పుడు రక్తం కూడా శుద్ధిగా ఉంటుంది. ప్రవాహానికి కూడా ఎలా ఆటంకాలు ఉండవు. 2. రోజూ వ్యాయామం చేయాలి వ్యాపారం లేదా ఉద్యోగరీత్యా ఎక్కువ సేపు కుర్చొనే వ్యక్తులు తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి. వాకింగ్ చేయడానికి సమయం లేనట్లయితే.. ఇంట్లో యోగాతో ఆరోగ్యాన్ని పొందవచ్చు. ప్రాణాయామం ద్వారా శ్వాసక్రియను అదుపులో ఉంచుకోవచ్చు. శ్వాసక్రియలో సమస్య లేనప్పుడే.. రక్తం కూడా స్వచ్ఛంగా ఉంటుంది. 3. చక్కగా నిద్రపోండి నిద్ర సమయంలోనే శరీరంలో కణజాలంలో మార్పులు జరుగుతుంటాయి. కణాల పుననిర్మాణానికి అవసరమైన హార్మోనులు విడుదలవుతాయి. నిద్ర సమయంలో శరీరంలోని కండరాలు విశ్రాంతి తీసుకోవడం వల్ల పెద్దగా పని ఉండదు. ఆ సమయంలోనే శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్తుంటాయి. కాబట్టి ప్రతీ రోజూ తప్పనిసరిగా కంటి నిండా నిద్రపోండి. 4. బీట్రూట్ జ్యూస్ తాగండి లేదా తినండి బీట్రూట్లో శరీరానికి మేలు చేసే ఫైబర్, ఫొలేట్, విటమిన్ ఆ9, ఫైబర్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, విటమిన్‌ఇ ఉంటాయి. రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా రక్తనాళాలు సంకోచించడాన్ని అరికడుతుంది. బీట్రూట్ను ఆహారంగా గానీ, జ్యూస్‌గా గానీ తీసుకోవచ్చు. 5. నీళ్లు ఎక్కువగా తాగండి శరీరంలో ఎన్నో రకాల విషతుల్యాలు (టాక్సిన్) ఉంటాయి. అవన్నీ బయటకు పోవాలంటే తప్పకుండా నీళ్లు తాగాలి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగితే చాలు శరీరం టాక్సిన్లు విసర్జించి రక్తాన్ని శుద్ధిగా ఉంచుతుంది. 6. తులసి ఆకులు తులసి ఆకులు, విత్తనాల్లో విటమిన్-కె , ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఎర్ర రక్తకణాలు, రక్త శుద్ధికి, వృద్ధికి తులసి ఆకులు, విత్తనాలు ఎంతో మంచివి. 7. పసుపు తప్పనిసరి భారతీయులు పసుపును శుభ సూచకంగా భావిస్తారనే సంగతి తెలిసిందే. పసుపు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త కణాలకు రక్షణ కల్పిస్తాయి. ఇందులో కుర్కుమీన్ శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీరాడికల్స్‌ను నాశనం చేస్తుంది. అందుకే, మీరు తినే ఆహారంలో తప్పకుండా పసుపు ఉండేలా చూడండి. 8. ఆకుకూరలు ఎక్కువగా తినండి పచ్చని ఆకు కూరలతోపాటు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి వారంలో ఒక్కసారైనా తీసుకోండి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. వీటిలో ఉండే పోషకాలు, ఖనిజాలు రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 9. నిమ్మరసం మంచిది కాలేయంలోని టాక్సిన్లను తొలగించాలంటే నిమ్మరసం తాగాల్సిందే. రోజూ గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసం పిండుకుని తాగితే రక్త సరఫరా మెరుగవుతుంది. జీర్ణవ్యవస్థకు మేలు చేయడమే కాకుండా రోగ నిరోధక శక్తి పెంచుతుంది. 10. ఉసిరి తినండి ఇటీవల ఉసిరి వాడకం చాలా తగ్గిపోయింది. పూర్వికులు ఏదో ఒక రూపంలో ఉసిరిని ఎక్కువగా తినేవారు. ఇప్పుడు ఇది దొరకడమే గగనమైపోయింది. ఒక వేళ మీకు ఉసిరి దొరికితే అస్సలు వదలొద్దు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫిటో న్యూట్రియంట్లు, విటమిన్ ఈ, సీ పుష్కలంగా ఉంటాయి. ఉసిరి రక్తాన్ని వృద్ధి చేయడమే కాకుండా శుద్ధి చేస్తుంది. 11. అల్లం వెల్లులి మంచిది మన వంటకాల్లో అల్లం వెల్లులి ప్రాధాన్యం తెలిసిందే. ఇవి నోటికి రుచే కాదు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. వెల్లులిలో అనేక న్యూట్రియంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. పొటాషియం, ఐరన్, విటమిన్ సీ కూడా పుష్కలంగా ఉంటాయి. వెల్లులి రక్తపోటును అదుపులోకి ఉంచుతుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే అల్లంలో విటమిన్ C, B3, B6, మెగ్నీషియం ఉన్నాయి. ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపేందుకు సహకరిస్తుంది. రక్తాన్ని శుద్ధిగా ఉంచుతుంది. 12. బ్లాక్ కాఫీ తాగండి రక్తాన్ని శుద్ధి చేసేది కాలేయమే. కాబట్టి.. ఇది సక్రమంగా పనిచేస్తేనే రక్తం కూడా శుద్ధిగా ఉంటుంది. కాబట్టి.. దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకోండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని, రక్తాన్ని శుద్ధిగా ఉంచుతాయి. ఇందులో ఇంకా విటమిన్ B2, B3 కూడా ఉన్నాయి. మెగ్నీషియం, పోటాషియం, మ్యాంగనీస్‌లు కూడా శరీరానికి అందుతాయి. 13. ఇవి కూడా మంచివే రక్తంలో ఐరన్ లోపిస్తే బెల్లం తీసుకోండి. ఒమెగా 3 ఎక్కువగా ఉండే సోయాబీన్, చేపలు, అవిసె గింజలు, వాల్‌నట్స్‌ను తప్పకుండా తీసుకోండి. -డా.నవీన్ నడిమింటి, ఆయుర్వేద నిపుణులు చదవండి: 37 Days Challenge: అతడి విజయ రహస్యమిదే! చెడు అలవాట్లకు దూరంగా.. ఇంకా ఇలా చేశారంటే! Suman Kalyanpur Facts: సుమన్ గొంతు లతాతో సమానం! అయినా ఆమెను ఎదగనివ్వలేదా? ఇన్నాళ్లకు ఎట్టకేలకు.. -
తులసి ఆకులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి.. ఖాళీ కడుపుతో నమిలితే
Health Tips In Telugu: ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న తులసి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. తులసిలో ఆల్సోలిక్ యాసిడ్, యూజినాల్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది జలుబు, జ్వరం వంటి అనేక సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది. అందువల్ల మీకు యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నట్లయితే తులసి మీకు ఉత్తమమైనది. ఖాళీ కడుపుతో ఆకులు నములితే.. చక్కెర వ్యాధిగ్రస్తులకు తులసి దివ్యౌషధం. తులసి ఆకులు హైపోగ్లైసీమిక్ స్థాయి నియంత్రణ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించడంలో సహాయపడతాయి. దీని కోసం మీరు గుప్పెడు తులసి ఆకులను తీసుకొని రాత్రంతా ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. తర్వాత ఉదయం ఖాళీ కడుపుతో ఆకులు నములుతూ నీళ్లు తాగేసెయ్యండి. ఇలా చేయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. తులసి ఆకుల కషాయాన్ని రోజూ తాగితే తులసిలో విటమిన్ ఎ, విటమిన్ డి, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియను బలోపేతం చేయడానికి కూడా తులసి బాగా పనిచేస్తుంది. తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. తులసి ఆకుల కషాయాన్ని రోజూ తాగడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం పొందవచ్చు. చదవండి: ప్లాస్టిక్ కవర్లలో వేడి వేడి ఛాయ్! పొట్ట కింద ‘టైర్లు’!.. అలారం మోగుతోంది.. వినబడుతోందా? Veganuary: చర్మానికి మంచి నిగారింపు.. ఆరోగ్యమూ బాగుంటుంది: నటి -
Health Tips: కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి విముక్తికై ఇలా!
Health Tips In Telugu: గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఫ్యాటీ ఫిష్ తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చేపలలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండెను ఫిట్‌గా ఉంచుతాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి విముక్తికై! ►అరకప్పు పెరుగులో చెంచా నిమ్మరసం, అరస్పూను ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ►తులసి ఆకుల రసాన్ని తీసి దానికి ఒక చెంచా తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మరిన్ని ఆరోగ్య చిట్కాలు ►పుదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారంలో ఫ్యాట్ ఎక్కువుగా ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో పుదీనా తీసుకుంటే అజీర్తి సమస్య ఉండదు. ►పైత్యం, ఆ కారణంగా తలతిప్పటం వంటి సమస్యలున్నప్పుడు జీలకర్రను మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్‌ను నీటిలో కలిపి తాగాలి. ఇలా రెండు రోజుల పాటు రోజుకు రెండుసార్లు చేయాలి. ►పొట్టకి సంబంధించిన పలు సమస్యలకు వెల్లుల్లి మంచి మందు, ఒకటి రెండు రెబ్బల వెల్లుల్లిని మెత్తగా నూరి ఆ రసాన్ని అరకప్పు నీటిలో కలిపి తాగడం వల్ల అరుగుదల సమస్య దూరం అవుతుంది. దాంతోపాటు పొట్టలో పురుగులు, శరీరంలోని విషపదార్ధాలు నశిస్తాయి. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది. చదవండి: వేలెడంత సైజు.. వండుకుని తింటే.. ఆ టెస్టే వేరు! Sia: ఇకపై పాత చెప్పులు, షూస్ పారేసే ముందు ఒక్కసారి ఆలోచించండి! మీ వల్ల ఎంతో మందికి.. -
Health Tips: ఫుడ్ పాయిజనింగ్ సమస్యా.. ఈ చిట్కాతో చెక్!
చెడిపోయిన ఆహార పదార్థాలు, పురుగులు పడిన పండ్లు వంటివాటిని చూసుకోకుండా తింటుంటాం. అందువల్ల ఒకోసారి ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంటుంది. కడుపులో బాగా గడబిడ, తిప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు, టీ స్పూన్ ఆవపిండిని గ్లాసు నీళ్ళలో కలిపి తాగితే కడుపులోని విషపదార్థం వాంతిరూపంలో బయటకు వచ్చేస్తుంది. అస్వస్థత నుంచి ఉపశమనం కలుగుతుంది. తులసి ఆకులతో కషాయం తులసి ఆకులు తింటే ఎంతో మంచిదంటారు. ఇవి వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చేయడంలో తోడ్పడతాయి. అదే విధంగా శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఓ ఐదారు ఆకుల కషాయాన్ని మరగించి టీ మాదిరి చేసుకుని తాగితే, దగ్గు, జలుబు, ఆస్తమా అదుపులోకి వస్తాయి. చదవండి: Sabja Seeds Health Tips: సబ్జా గింజలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? -
హెల్త్ టిప్స్
►కూరగాయ ముక్కలని పెద్దవిగా కట్ చేస్తే వీటిలో లభించే విటమిన్స్ వృథా అవ్వవు. ►ప్రతిరోజూ నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే థ్రోట్ ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గుతుంది. ►క్యారెట్, టొమాటో కలిపి జ్యూస్‌చేసి, తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని నీళ్లలో కలుపుకుని తాగితే రక్తశుద్ధి అవుతుంది. ►తులసి ఆకులని మరిగించిన నీటితో స్నానం చేస్తే చర్మం పై రాషెస్ తగ్గుముఖం పడతాయి. ►జీలకర్ర, పంచదారని కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ►గ్లాసుడు నీళ్లలో పావు టీ స్పూన్ ఏలకుల పొడి కలుపుకుని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్ బాధ నుండి బయట పడవచ్చు ►అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుముఖం పడుతుంది. ►నెలసరి నొప్పితో బాధపడేవారు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక ఉసిరికాయను తింటే ఉపశమనం లభిస్తుంది. ►పంటి నెప్పితో బాధ పడేవారు, ఒక లవంగాన్ని పంటికింద ఉంచితే మంచి ప్రభావం ఉంటుంది. -
ముఖ కాంతికి...
►కొద్దిగా తులసి ఆకులు, మూడు బచ్చలి ఆకులను కలిపి గ్రైండ్ చేయాలి. దీంట్లో సరిపడా నీటిని జత చేసి పేస్ట్ చేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే చర్మం మీ కాంతిమంతం అవుతుంది. ►అర టీ స్పూన్ ఆవాల నూనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమన్ని వేళ్లతో కొద్దికొద్దిగా తీసుకుని వలయాకారంలో 10 నిమిషాల పాటు మసాజ్ చేసి, గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే చర్మం నిగారిస్తుంది. ►తెల్ల ఉల్లిపాయని గ్రైండ్ చేసి రసం తీయాలి. దీంట్లో పావు టీ స్పూన్ తేనె, చిటికెడు రాళ్ల ఉప్పు వేయాలి. అది కరిగిన తరవాత ఈ మిశ్రమాన్ని మొటిమల మీద అప్లై చేసి 20 నిమిషాల వరకు ఉంచి చన్నీటితో కడిగేయాలి. మొటిమలు తగ్గుతాయి. ►దాల్చిన చెక్కను పొడి చేయాలి. దీంట్లో కొద్దిగా నీటిని చేర్చి పేస్ట్‌లా కలపాలి. మొటిమలు, మచ్చలు ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేసి ఆరిన తరవాత కడిగేయాలి. వారానికి ఒక్కసారి ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే మొటిమలు, మచ్చలు తగ్గి చర్మకాంతి పెరుగుతుంది. ►టేబుల్ స్పూన్ శనగపిండిలో గుడ్డులోని తెల్లసొన, టీ స్పూన్ గంధం పొడి కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌లు అన్ని రకాల చర్మాల వారికి అనువుగా ఉంటాయి. వారంలో ఒక్కసారి ఈ ప్యాక్‌లను వాడడం వలన చర్మకాంతిలో వచ్చే మార్పు ఇట్టే తెలిసిపోతుంది. ►సగం క్యారట్, ఒక ముక్క నారింజ, అర టేబుల్ స్పూన్ పాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఈ ప్యాక్ వారంలో ఒకసారి చేయడం వల్ల చర్మకాంతి మెరుగుపడుతుంది. -
హెల్త్ టిప్స్
కూరగాయ ముక్కలని పెద్దవిగా కట్ చేస్తే వీటిలో లభించే విటమిన్స్ వృథా అవ్వవు.ప్రతిరోజూ నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే థ్రోట్ ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గుతుంది.క్యారెట్, టొమాటో కలిపి జ్యూస్ చేసి, తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని నీళ్లలో కలుపుకుని తాగితే రక్తశుద్ధి అవుతుంది.తులసి ఆకులని మరిగించిన నీటితో స్నానం చేస్తే చర్మం పై రాషెస్ తగ్గుముఖం పడతాయి.జీలకర్ర, పంచదారని కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.గ్లాసుడు నీళ్లలో పావు టీ స్పూన్ ఏలకుల పొడి కలుపుకుని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్ బాధ నుండి బయట పడవచ్చుఅల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుముఖం పడుతుంది. -
హెల్త్‌టిప్స్
గ్యాస్ట్రైటిస్ సమస్యను తగ్గించడంలో కాకర జ్యూస్ బాగా పనిచేస్తుంది. అర్థపావు కప్పు కాకరకాయ జ్యూస్‌ను భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. ఇలా రోజుకు రెండు పూటలు తీసుకుంటే సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంద {పతిరోజు పరగడుపున చిటికెడు జీలకర్ర పొడి తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ తేనె, రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల కొవ్వు కరగడమే కాకుండా గొంతులో జీర కూడా పోతుంది. ఒక గ్లాస్ నీటిలో కొన్ని తులసి ఆకులు, కొన్ని పుదీనా ఆకుల్ని వేసి మరిగించాలి. తరువాత ఆ నీటిని వడకట్టి తాగితే దగ్గు, జలుబు తగ్గుముఖం పడతాయి. -
తులసి ఫేస్ ప్యాక్
బ్యూటిప్స్ గుప్పెడు తులసి ఆకులు తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. తులసి ఆకులు లేకపోతే తులసి పౌడర్‌నైనా నీటిలో కలుపుకుని పేస్ట్ చేసుకోవచ్చు. పౌడర్ మార్కెట్లో లభిస్తుంది. తులసి ఆకుల పేస్ట్ రెండు టీ స్పూన్లు, ఓట్మీల్ పౌడర్ రెండు టీ స్పూన్లు, రెండు టీ స్పూన్ల పాలు, కొద్దిగా నీళ్ళు తీసుకుని అన్నింటినీ కలిపి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ముందుగా ముఖాన్ని చన్నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్యాక్‌ను ముఖమంతా అప్లై చేసుకుని, పదిహేను నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్యాక్ వేసుకున్న వెంటనే ఎండలోకి వెళ్ళకూడదు. ఈ ప్యాక్‌ను నెలకు రెండుసార్లు వేసుకుంటే మొటిమలు రావడం తగ్గుతుంది. చర్మం రంగు కూడా మెరుగవుతుంది. సెన్సిటివ్ స్కిన్వాళ్ళు ఈ ప్యాక్‌ను ముందుగా చేతిపై వేసుకుని మంట, దురద లేకపోతే ముఖానికి వేసుకోవచ్చు. కోకోనట్ మాస్క్: టేబుల్ స్పూన్ కొబ్బరినూనె ముఖానికి పట్టించి, వలయాకారంలో సుతిమెత్తగా మర్దనా చేయాలి. టవల్ తీసుకుని వేడి నీటిలో ముంచి ముఖం పై అద్దాలి. ఇలా అయిదారు సార్లు చేయాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి. చివరగా రోజ్ వాటర్‌ని అప్లై చేయాలి. ఇలా వారంలో రెండు సార్లయినా క్రమం తప్పకుండా చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.