హెల్త్‌టిప్స్
గ్యాస్‌ట్రైటిస్ సమస్యను తగ్గించడంలో కాకర జ్యూస్ బాగా పనిచేస్తుంది. అర్థపావు కప్పు కాకరకాయ జ్యూస్‌ను భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. ఇలా రోజుకు రెండు పూటలు తీసుకుంటే సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంద {పతిరోజు పరగడుపున చిటికెడు జీలకర్ర పొడి తింటే జీర్ణశక్తి పెరుగుతుంది.
ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ తేనె, రెండు టీ స్పూన్‌ల నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల కొవ్వు కరగడమే కాకుండా గొంతులో జీర కూడా పోతుంది. ఒక గ్లాస్ నీటిలో కొన్ని తులసి ఆకులు, కొన్ని పుదీనా ఆకుల్ని వేసి మరిగించాలి. తరువాత ఆ నీటిని వడకట్టి తాగితే దగ్గు, జలుబు తగ్గుముఖం పడతాయి.