
చెడిపోయిన ఆహార పదార్థాలు, పురుగులు పడిన పండ్లు వంటివాటిని చూసుకోకుండా తింటుంటాం. అందువల్ల ఒకోసారి ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంటుంది. కడుపులో బాగా గడబిడ, తిప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు, టీ స్పూన్ ఆవపిండిని గ్లాసు నీళ్ళలో కలిపి తాగితే కడుపులోని విషపదార్థం వాంతిరూపంలో బయటకు వచ్చేస్తుంది. అస్వస్థత నుంచి ఉపశమనం కలుగుతుంది.
తులసి ఆకులతో కషాయం
తులసి ఆకులు తింటే ఎంతో మంచిదంటారు. ఇవి వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చేయడంలో తోడ్పడతాయి.
అదే విధంగా శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఓ ఐదారు ఆకుల కషాయాన్ని మరగించి టీ మాదిరి చేసుకుని తాగితే, దగ్గు, జలుబు, ఆస్తమా అదుపులోకి వస్తాయి.
చదవండి: Sabja Seeds Health Tips: సబ్జా గింజలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?