ప్రతీకాత్మక చిత్రం
గత కొద్దిరోజులుగా వాతావరణంలో వస్తున్న రకరకాల మార్పుల వల్ల దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. చాలామంది మెడికల్ షాప్‌కు వెళ్లి వాళ్లు ఇచ్చిన మందులు తెచ్చుకుని వేసుకుంటూ ఉంటారు.
అది చాలా ప్రమాదం. దానివల్ల రకరకాల దుష్ఫలితాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. దగ్గు, జలుబుకు సహజమైన చిట్కాలు పాటించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అవేమిటో తెలుసుకుందాం.
అసలు దగ్గు, జలుబు రాకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తిన్నట్లయితే తొందరగా ఈ అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బలవర్థకమైన ఆహారం తీసుకొని శరీరాన్ని బలంగా ఉంచుకుంటే, అసలు ఇవి రాకుండానే ఉంటాయి. జలుబు, దగ్గు వంటి సమస్యల నివారణకు యాంటీబయాటిక్స్ ఉపయోగించటం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.
సహజ చిట్కాలు...
►తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే జలుబు, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.
►రోజుకు రెండుసార్లు పసుపు, వేడి పాలను కలిపి తీసుకుంటే కూడా ఉపశమనం దొరుకుతుంది.
►మిరియాల కషాయాన్ని తాగినా, లవంగాలు బుగ్గన పెట్టుకుని వాటి రసాన్ని మింగుతున్నా, వేడి వేడి మసాలా టీ తయారు చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది
►చెంచాడు నిమ్మరసాన్ని, రెండు స్పూన్ల తేనెను వేడినీళ్లలో కలుపుకొని తాగితే ఉపశమనం దొరుకుతుంది.
►అల్లాన్ని దంచి కషాయం చేసుకుని తాగినా, అల్లం టీ చేసుకుని తాగినా కూడా రిలీఫ్ ఉంటుంది
►కొద్దిగా పసుపు, ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో పుక్కిట పట్టడం వల్ల గొంతుకు ఉపశమనం దొరుకుతుంది∙
►కొన్ని తులసి ఆకులు, చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి ముక్కలు, టీ స్పూన్ వాము, మెంతులు, పసుపు, నాలుగైదు నల్ల మిరియాలు వేసి నీళ్లు పోసి బాగా మరిగించి కషాయం తయారు చేసుకుని తాగితే మరింత మంచి ఫలితం ఉంటుంది.
వేడినీళ్ళకే ఓటేయండి...
►దగ్గు, జలుబుతో బాధపడేవారు శీతల పానీయాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది.
►అదేవిధంగా ఫ్రిజ్‌లో నుంచి తీసిన చల్లటి నీళ్లను తాగడానికి బదులు ఎప్పుడు నీళ్లు తాగినా కాస్త వేడిగా ఉన్న నీటిని మాత్రమే తాగడం మంచిది.
ఈ పండ్లు మంచివి
పైనాపిల్, నిమ్మ, కివి వంటి పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కూడా జలుబు, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది.
చదవండి: Health: బీరకాయ, నేతి బీరకాయ తరచుగా తింటున్నారా? ఇందులోని అధిక సెల్యులోజ్ వల్ల..
Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే..
Comments
Please login to add a commentAdd a comment