Cold
-
ఢిల్లీలో ఉదయాన్నే వర్షం.. హిమాచల్‌ను ముంచెత్తిన మంచు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ఎన్సీఆర్(Delhi NCR)లోని పలు ప్రాంతాల్లో ఈరోజు(శనివారం) ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. చల్లని గాలులు కూడా వీస్తున్నాయి. రెండు రోజుల క్రితం వరకూ వేడి వాతావరణంలో ఇబ్బంది పడిన ప్రజలకు రెండు రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షాలు ఉపశమనాన్ని అందిస్తున్నాయి. వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో స్థానికులు ఎంజాయ్ చేస్తున్నారు. #WATCH | Delhi: Rain lashes several parts of the National Capital. (Visuals from Central Secretariat) pic.twitter.com/8MajN4O8tD— ANI (@ANI) March 1, 2025వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావం వల్ల ఢిల్లీలో వర్షం కురుస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి మేఘాలు కమ్ముకున్నాయి. సాయంత్రం తేలికపాటి వర్షం పడటంతోపాటు చల్లని గాలులు వీచాయి. అయితే ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోలేదు. శుక్రవారం గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు(Maximum and minimum temperatures) పెరుగుతూనే ఉన్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 5.9 డిగ్రీలు ఎక్కువగా ఉంది. అంతకు ముందు గురువారం కనిష్ట ఉష్ణోగ్రత 19.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.మార్చి ఒకటి నుండి పశ్చిమ హిమాలయ ప్రాంతాన్ని కొత్త పశ్చిమ అల్పపీడనం తాకబోతోంది. దీని ప్రభావం పర్వత ప్రాంతాల్లో అధికంగా కనిపించనుంది. ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో స్వల్ప ప్రభావం చూపనుంది. రాబోయే మూడు రోజుల్లో ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత తగ్గనుంది. ప్రస్తుతం 15-19 డిగ్రీల మధ్య ఉన్న ఉష్ణోగ్రత 13-15 డిగ్రీల మధ్యకు చేరుకోనుంది. శుక్రవారం రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రం తేలికపాటి వర్షం కురిసింది. వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.హిమాచల్ ప్రదేశ్‌లో..హిమాచల్ ప్రదేశ్‌లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అలాగే భారీగా కురుస్తున్న హిమపాతం స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపధ్యంలో చంబా, కులు, లాహౌల్-స్పితి, మండీలోని కర్సోగ్ సబ్-డివిజన్, సిమ్లా జిల్లాలోని రోహ్రు సబ్-డివిజన్, కిన్నౌర్ జిల్లాలోని విద్యా సంస్థలను మూసివేశారు. ఈ మేరకు విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రా జిల్లాల్లో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. శుక్రవారం ఉదయం సిమ్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. హిమపాతం కారణంగా, ఎగువ సిమ్లాలోని అనేక మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.రాష్ట్రంలో వర్షాలు, హిమపాతం మరియు కొండచరియలు విరిగిపడటం వల్ల వందలాది రోడ్లు దెబ్బతిన్నాయి. సిమ్లా-రాంపూర్, సిమ్లా-బిలాస్పూర్ హైవేలు, రాష్ట్ర రహదారి సిమ్లా-సున్నీ తట్టపాణి జాతీయ రహదారులను అతకష్టం మీద పునరుద్ధరించారు. చౌపాల్ రాష్ట్ర రహదారిని మంచు కారణంగా మూసివేశారు. రాష్టంలోని ములింగ్‌లో హిమపాతం కారణంగా, పర్యాటక వాహనం రోడ్డు మధ్యలో చిక్కుకుంది. వాహనంలోని పర్యాటకుడిని ములింగ్ పంచాయతీ డిప్యూటీ ప్రధాన్‌తో పాటు కొంతమంది యువకులు కాపాడారు.ఇది కూడా చదవండి: Himachal: ఎడతెగని హిమపాతం.. స్కూళ్లు, కాలేజీలు మూసివేత -
చిటపట.. గజగజ..
రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితి.. పగలంతా ఉక్కపోత.. రాత్రయితే వణికిస్తున్న చలి.. కనిష్ట ఉష్ణోగ్రతలు పతనం కావడం, చలిగాలుల ప్రభావంతో వాతావరణం వేగంగా చల్లబడుతోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలంతా అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కపోతగా ఉంటే.. రాత్రిపూట గజగజమంటూ చలి వణికిస్తోంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం, కొన్నిప్రాంతాల్లో అంతకు మించి నమోదవుతుండగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణంకంటే తక్కువగా నమోదవుతున్నాయి. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వర కు అధికంగా నమోదు కాగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. బుధవా రం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 34.1 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 10.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడంతో జనజీవనం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ మార్పులు అనారోగ్య సమస్యలకు దారితీస్తాయ ని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా గరిష్ట ఉష్ణో గ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం భారీ వ్యత్యాసంతో నమోదయ్యాయి. మెదక్‌లో సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతకంటే 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు కాగా, హైదరాబాద్, రామగుండంలో 3డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది.రాష్ట్ర ప్రణాళికా విభా గం వివరాల ఆధారంగా కనిష్ట ఉష్ణోగ్రత కోహి ర్లో 6.9 డిగ్రీలుగా నమోదైంది. రానున్న 3 రోజులు కూడా రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ గా నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారు లు అంచనా వేస్తున్నారు. ఈసారే ఎందుకిలా?రాష్ట్రానికి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో చలిగాలులు వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు పతనం కావడం, చలిగాలుల ప్రభావంతో వాతావరణం వేగంగా చల్లబడుతోంది. భౌగోళికంగా రాష్ట్రం దక్కన్ పీఠభూమిలో ఎత్తైన ప్రాంతంలో ఉండటంతో ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గడం, పెరగడం జరుగు తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా చలికాలంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే తక్కువగా నమోదవుతుంటాయి. ప్రస్తుతం తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి బలమైన చలిగాలులు వీస్తుండడంతో చలి తీవ్రత పెరిగింది. గతేడాది రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదు కాగా.. ఈ ఏడాది మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
చలి పంజా
సాక్షి, అమరావతి/సాక్షి, పాడేరు: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. నెలరోజుల నుంచి తగ్గుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఇంకా పడిపోతున్నాయి. ఈ ఏడాది గతం కంటే దారుణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి పెరిగిపోయింది. సాధారణంగా ఈ సమయంలో 22 నుంచి 26 డిగ్రీల వరకూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ఏజెన్సీ ప్రాంతాల్లో 18 నుంచి 22 డిగ్రీల వరకూ కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండేవి. కానీ.. తాజాగా మైదాన ప్రాంతాల్లోనే 18 నుంచి 24 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖ ఏజెన్సీతోపాటు రాయలసీమ రీజియన్‌లోనూ చాలాచోట్ల 12 నుంచి 20 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గతం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. రాత్రి సమయాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీలకు మించడం లేదు.ఏజెన్సీలో చలి విజృంభణచలితో ఏజెన్సీలో ప్రజలు వణుకుతున్నారు. మళ్లీ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు శుక్రవారం పడిపోయాయి. సాయంత్రం నుంచే చలిగాలులు వీస్తున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తోంది. రాత్రి సమయంలో చలిప్రభావం మరింత అధికంగా ఉంటుంది. దీంతో ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. అరకులోయలో 8.2 డిగ్రీలు, జి.మాడుగుల 9, డుంబ్రిగుడ 9.2, అనంతగిరి 9.5, జీకే వీధి 9.8, పాడేరు మండలం మినుములూరు 10, హుకుంపేట 10.5, చింతపల్లి 10.6, కొయ్యూరు 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు శుక్రవారం నమోదయ్యాయి.వణుకుతున్న ఏజెన్సీఅల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో డిసెంబర్ 16న అతి తక్కువగా 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడంతో అక్కడి ప్రజలు గజగజ వణికిపోయారు. ఈ నెల 4న అరకు సమీపంలోని కుంటలో 4.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, అనంతగిరి, డుంబ్రిగుడ తదితర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో 7 నుంచి 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే చాలాచోట్ల ఏజెన్సీలో 12 నుంచి 15 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. కానీ.. ఇప్పుడు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ అంతకంతకు పడిపోతున్నాయి. రాయలసీమలోని వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 15 నుంచి 23 డిగ్రీల వరకూ పడిపోయాయి.ఎల్‌నినో ప్రభావమే కారణంనైరుతి రుతుపవనాలు తిరోగమించే సమయంలో ఈసారి రాష్ట్రమంతటా వర్షాలు కురిశాయి. డిసెంబర్ చివరి వరకూ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లగా మారిపోయింది. ఎల్‌నినో ప్రభావంతో ఈ పరిస్థితి నెలకొన్నట్టు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారం వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వేకువజామున మంచు ఎక్కువగా కురుస్తుండటంతో వాహనాల రాకపోకలు స్తంభిస్తున్నాయి.దట్టమైన మంచులో వాహనాలు వెళ్లేందుకు దారులు కనిపించడంలేదు. చాలా ప్రాంతాల్లో ఉదయం 10 గంటలు దాటితే గానీ మంచు వీడటం లేదు. చలికి చల్లగాలులు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు, చిన్నారులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఉద్యోగాలకు వెళ్లేవారు, రైతులు, కార్మికులు, ఇతర పనులు చేసుకునేవారు సైతం బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. -
వణికిస్తున్న చలి
సాక్షి, హైదరాబాద్/ తిర్యాణి (ఆసిఫాబాద్): రాష్ట్రంలో చలి గజగజ వణికిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే దిగువకు పడిపోయాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావాలతో గతవారం వరకు సాధారణ స్థితి కంటే కాస్త అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వచ్చాయి. ప్రస్తుతం ఆ ప్రభావం తొలగిపోవడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే కాస్త ఎక్కువగానే నమోదైనప్పటికీ.. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ), తిర్యాణి మండలం గిన్నెధరిలో 6.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5.6 డిగ్రీ సెల్సియస్ వరకు తక్కువగా నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం నల్లగొండ మినహా అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 3 డిగ్రీల మేర అధికంగా నమోదు కావడం గమనార్హం. -
మందపాటి రగ్గు కప్పుకున్నా చలి తగ్గడంలేదా.. కారణమిదే..
శీతాకాలంలో చలిగా అనిపించడం సహజం. దీంతో చలి నుంచి తప్పించుకునేందుకు ఉన్ని దుస్తులు ధరిస్తారు. రాత్రిపూట మందపాటి రగ్గులు కప్పుకుంటారు. అయినప్పటికీ కొందరు తమకు ఏమ్రాతం చలి తగ్గలేదని చెబుతుంటారు. పైగా కాళ్లు చేతులు, చల్లబడిపోతున్నాయని, చలికి తట్టుకోలేకపోతున్నామని అంటుంటారు. అయితే ఇందుకు వారి శరీరంలో వివిధ విటమిన్లు, పోషకాల లోపం కారణం కావచ్చంటున్నారు నిపుణులు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఇవి కూడా చలికి కారణమే..మెగ్నీషియం లోపం: మెగ్నీషియం లోపం వల్ల కండరాల తిమ్మిర్లు, నొప్పులు తలెత్తుతాయి. రక్త ప్రసరణ సరిగా జరగదు. ఫలితంగా ఇది చేతులు, కాళ్లు చల్లబడేందుకు కారణంగా నిలుస్తుంది. తృణధాన్యాలు, ఆకు కూరలు వంటి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం లేదా మెగ్నీషియం సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు.ఇనుము: శరీరంలో ఐరన్ లేనప్పుడు, అది రక్తహీనతకు కారణమవుతుంది. ఫలితంగా అలసట, నీరసంతోపాటు చేతులు, కాళ్ళు చల్లగా మారుతాయి. ఆహారంలో లీన్ మీట్, పౌల్ట్రీ, చేపలు, బీన్స్, ఆకు కూరలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం వలన ఐరన్ లోపాన్ని నివారించవచ్చు.ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు: ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ, రక్త ప్రసరణలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల లోపం రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. ఫలింగా చలిగా ఉన్నట్లు అనిపిస్తుంది.విటమిన్ బీ12: విటమిన్ బీ12 శరీరంలో రక్త కణాలను తయారు చేయడంలో, నరాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. బీ 12 లోపం కండరాల దృఢత్వాన్ని దెబ్బతీస్తుంది. ఈ లోపాన్ని తగ్గించేందుకు చేపలు, మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులతోపాటు బలవర్థకమైన తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి.విటమిన్ డి: ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో, శరీరంలో కాల్షియం స్థాయిలను నియంత్రించడంలో విటమిన్ డి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం బలహీనమైన రక్త ప్రసరణకు కారణమవుతుంది. ఈ లోపం చేతులు, కాళ్లు చల్లబడేలా చేస్తుంది. ఎండలో బయట కాస్త సమయం గడపడం, చేపలు, గుడ్లు, బలవర్థకమైన పాల ఉత్పత్తులు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. తద్వారా శరీరంలో విటమిన్ డి స్థాయి కొనసాగుతుంది. ఫలితంగా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: విమాన ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు -
ఫోన్లూ వణుకుతాయ్
ఎండలకు రాళ్లు కూడా పగులుతాయని విన్నాం. కానీ.. చలికి ఫోన్లు సైతం పగిలిపోతాయట. వేసవితో పోలిస్తే శీతాకాలంలో స్మార్ట్ఫోన్లు కిందపడితే స్క్రీన్లు అత్యంత సులభంగా పగిలిపోతాయని ఎలక్ట్రానిక్ నిపుణులు చెబుతున్నారు. ఫోన్లతో పాటు స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరుపై చలి తీవ్ర ప్రభావాన్నే చూపుతాయని పేర్కొంటున్నారు. చలికాలం వచ్చిందంటే చాలామంది ఆరోగ్య విషయాల్లో అనేక జాగ్రత్తలు తీసుకుంటారని.. ఇకపై చలికాలంలో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, అమరావతివిలువైన డేటా కోల్పోయే అవకాశంప్రస్తుత డిజిటల్ యుగంలో ఏ సమాచారమైనా పేపర్ డాక్యుమెంట్ల రూపంలో భద్రపరుచుకోవడం కంటే.. వాటిని ఫోన్లు లేదా వ్యక్తిగత కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో సేవ్ చేసుకుని భద్రపరచుకుంటుంటాం. అయితే ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో ఉండే హార్డ్ డ్రైÐవ్లు కొన్ని సందర్భాల్లో విపరీతమైన చలికి ప్రభావితమై పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. దీంతో హార్డ్ డ్రైవ్‌లలో మాత్రమే నిక్షిప్తమై ఉండే మన విలువైన సమాచారం, డాక్యుమెంట్లను పూర్తిగా తిరిగి చూడడానికి వీలులేని విధంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఉపయోగించేవారు తాము వాడేవి కొత్తవి కదా అని అజాగ్రత్త ఉండొచ్చు. కానీ, కొత్తవి అయినంత మాత్రాన చలికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకోవడం కేవలం అపోహేనట. కొత్త ఎల్రక్టానిక్ పరికరాలు కూడా విపరీతమైన చలి పరిస్థితుల్లో వాటి పనితీరు తగ్గుముఖం పట్టవచ్చని నిఫుణులు పేర్కొంటున్నారు.చలి విపరీతంగా ఉంటే ఫోను ఆగిపోయే ఛాన్స్» ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌ల ఎల్సీడీ, ఓఎల్ఈడీ స్కీన్లు నిదానంగా పనిచేయడం వల్ల ఆ సమయంలో వాటిని ఉపయోగిస్తున్నప్పుడు ఆ పరికరాల స్కీన్లపై కనిపించే బొమ్మలు, అక్షరాల నాణ్యత, స్పష్టత సరిగా ఉండకపోయే అవకాశం ఉంది. » ప్రమాదవశాత్తు స్మార్ట్ ఫోను వంటివి కిందపడితే వేసవి కాలంలో కంటే శీతాకాలంలో వాటి స్క్రీన్లు అత్యంత సులభంగా పగిలిపోతాయి. » ఎలక్ట్రానిక్ పరికరాలను వేలిముద్రల గుర్తింపు, ముఖ గుర్తింపు ద్వారానే త్వరగా అన్, ఆఫ్ అయ్యేలా పెట్టుకుంటాం. కానీ.. ఎక్కువ చలి సమయంలో సెన్సార్ విధానం సరిగా పనిచేయక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్నెస్ బ్యాండ్లు వంటి ధరించగలిగేవి విపరీతమైన చలిలో కచి్చతమైన రీడింగ్‌లను తెలపలేవు. » కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లో ఉపయోగించే హార్డ్ డ్రైవ్‌లు చలి ప్రభావంతో ఆలస్యంగా ఓపెన్ కావడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి. » ఎల్రక్టానిక్ వస్తువులలో ఉండే సున్నితమైన, అతి సున్నితమైన సర్క్యూట్లు చలికి తుప్పు పట్టే అవకాశం ఉండటంతో ఆయా వస్తువులు పూర్తిగా పనిచేయకుండా పోయే అవకాశం ఏర్పడుతుంది. » కెమెరాలు సైతం చలి తగ్గి ఎండ పెరిగే కొద్దీ వాటి అద్దాలపై పొరగా ఏర్పడే పొగమంచు ఫొటోల్లోని బొమ్మ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. » ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు చల్లని ఉష్ణోగ్రతలలో పేలవంగా పనిచేస్తాయని, విపరీతమైన చలిలో బ్యాటరీ తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోవచ్చు లేదా శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంది. » స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్ బడ్లు వేగంగా బ్యాటరీ నష్టానికి గురికావడంతో అవి పనిచేయడంలో ఎక్కువగా అవాంతరాలు ఏర్పడే వీలుంది. » ఎలక్రానిక్ పరిరకాలకు ఉపయోగించే గాజు, ప్లాస్టిక్ వంటివి చలికి పెళుసుబారి చిన్న ఒత్తిడికే పగుళ్లు లేదా విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఇలా చేయడం బెటర్» చలికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వ్యక్తిగతంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో.. ఎల్రక్టానిక్ పరికరాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని నిఫుణులు సూచిస్తున్నారు. » శీతాకాలంలో ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లకు సాధారణ కన్నా ఎక్కువసార్లు చార్జింగ్ పెడుతూ ఉండాలి. ఎక్కువ కాలం పాటు గడ్డకట్టే చలికి పరికరాలను బహిర్గతం చేయకుండా ఉంచాలి. తప్పనిసరిగా బయటకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు చలి సోకని కవర్లలో వాటిని ఉంచాలి.» చలికాలంలో స్మార్ట్ ఫోన్లు సహా అన్ని ఎల్రక్టానిక్ వస్తువులను ఆరుబయట చలిలో ఎక్కువ సమయం వినియోగించాల్సి వస్తే.. ఇంటికి చేరుకోగానే వాటిని శుభ్రం చేయడం మంచిదని సూచిస్తున్నారు. » చల్లటి పరిస్థితులను తట్టుకునేలా రూపొందించిన ఎల్రక్టానిక్ పరికరాలను కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. -
విద్యార్థినులపై ప్రిన్సిపాల్ కర్కశత్వం
ఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ఐనపల్లి మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల ప్రిన్సిపాల్ అక్కడి విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. ఔటింగ్‌కు వెళ్లి అరగంట ఆలస్యంగా వచ్చారన్న కారణంతో రెండు గంటలపాటు బయట చలిలోనే నిల్చోబెట్టారు. మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థులకు ఆదివారం తల్లిదండ్రులను కలిసేందుకు ఔటింగ్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో వారు తమ తల్లిదండ్రులతో కలిసి బయటకు వెళ్లారు.సాయంత్రం 4 గంటలలోపు వారు తిరిగి పాఠశాలలోకి వెళ్లాల్సి ఉండగా, అరగంట ఆలస్యంగా రావటంతో ప్రిన్సిపాల్ వారిని లోనికి అనుమతివ్వలేదు. దీంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పాఠశాల ఎదురుగానే చలిలో సుమారు రెండు గంటలపాటు వేచి ఉన్నారు. అటువైపుగా వెళ్లిన పోలీస్ సిబ్బంది గమనించి ఆరా తీసి పిల్లలను లోపలికి పంపాలని కోరినా ప్రిన్సిపాల్ వినిపించుకోలేదు. ఈ విషయాన్ని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో వివరాలు తెలుసుకోవాలని డీటీడీఓకు కలెక్టర్ సూచించారు. దీంతో రంగంలోకి దిగిన డీటీడీఓ సదరు ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే విద్యార్థినులను హాస్టల్లోకి అనుమతివ్వాలని ఆదేశించడంతో ప్రిన్సిపాల్ దిగొచ్చారు. కాగా ప్రిన్సిపాల్ తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులతోనూ నిత్యం అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని, తమ పిల్లలతో మాట్లాడనీయకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. -
ముక్కుదిబ్బడ బాధిస్తోందా?!
అదో చిత్రమైన పరిస్థితి. చూడ్డానికి అంతా బాగానే ఉంటుంది. కానీ ముక్కు రంధ్రాల్లో ఏదో అడ్డు ఉన్న భావనతో గాలి ఆడటం కష్టమవుతుంది. ఒక్కోసారి ఒక్కో ముక్కు రంధ్రం నుంచి మాత్రమే గాలాడుతుంటుంది. అదీ అతి కష్టంగా. నలుగురితో ఉన్నప్పుడు ముక్కు ఎగబీలుస్తూ, గాలాడని ముక్కు రంధ్రాన్ని తెరవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరీ ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కోసారి గురక కూడా వస్తుంది. ఈ గాలి ఆడకపోవడం సమస్యకు అదనంగా చికాకూ, చిరాకూ కలుగుతుంటాయి. ఈ సమస్య ఎందుకొస్తుంది, పరిష్కారాలేమిటో చూద్దాం.ముక్కుదిబ్బడ కారణంగా శ్వాస పీల్చుకోలేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. రకరకాల కారణాలతో వచ్చే అలర్జీలు, సైనసైటిస్, ముక్కులోని రెండు రంధ్రాల మధ్యన ఉండే దూలం (సెప్టమ్) సరిగా లేకపోవడం, (అంటే) ముక్కు దూలం పూర్తిగా నిటారుగా లేకుండా అది ఎంతో కొంత ఒంపు తిరిగి ఉండటం వంటి అనేక అంశాలు శ్వాస సరిగా తీసుకోలేకపోవడానికి కారణమవుతాయి. నిజానికి ముక్కు నుంచి ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్లేలోపు... ఊపిరి పీల్చుకునే సమయంలోనే ముక్కులో కొన్ని ప్రక్రియలు జరుగుతాయి. ముందుగా బయటి నుంచి ముక్కులోకి ప్రవేశించిన గాలి ఉష్ణోగ్రతను... ఊపిరితిత్తుల వద్ద ఉన్న ఉష్ణోగ్రతతో దాదాపు సమం చేయడానికి ముక్కులోని మ్యూకస్ పొరలపై ఉండే నేసల్ టర్బినేట్స్ ప్రయత్నిస్తాయి. బయటి తేమను ఊపిరితిత్తుల వద్ద ఉన్న తేమతో సమం చేయడానికీ ఈ టర్బినేట్స్ కృషిచేస్తాయి. ముక్కులోపలి వెంట్రుకల సహాయంతో గాలిలోని కాలుష్యాలు కొంత ఫిల్టర్ అవుతాయి. అయితే అలర్జీల సమస్య ఉన్నవారిలో ముక్కులోని మ్యూకస్ పొరల్లో ఇన్ఫ్లమేషన్ కారణంగా వాపు వచ్చే అవకాశముంది కాబట్టి ముక్కు ద్వారా గాలి సాఫీగా లోపలికి వెళ్లే ప్రక్రియలో కొంత అడ్డంకులు ఏర్పడతాయి. ఈ అడ్డంకుల కారణంగానే ‘ముక్కు దిబ్బడ’ వస్తుంది. దాంతో గాలిని బలంగా పీల్చడం లేదా నోటితో గాలి పీల్చాల్సి రావడం జరుగుతుంటుంది. ఇలాంటివారు కాస్త పక్కకు ఒరుగుదామన్నా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే పడుకుంటే ఈ బాధ మరింత పెరుగుతుంది. కూర్చున్నప్పుడే కొద్దిమేర ఈ సమస్య తగ్గినట్టు అనిపిస్తుంది. కొన్ని వైద్య చికిత్సలు... ముక్కుదిబ్బడ సమస్య ఉపశమనం కోసం కొన్ని రకాల సింపుల్ చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ సలహాతో డీకంజెస్టెంట్స్, యాంటీహిస్టమైన్స్, నేసల్ స్ప్రేస్ వంటి మందుల్ని వాడటం మేలు. వీటితో చాలా వరకు మంచి ప్రయోజనం ఉంటుంది. ∙యాంటీహిస్టమైన్స్ : ట్యాబ్లెట్స్ రూపంలో లభ్యమయ్యే ఈ మందులు కఫం రూపంలో ఉండే మ్యూకస్‌ను వీలైనంతగా తొలగించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని దూరం చేసి, శ్వాస సాఫీగా జరిగేలా చూస్తాయి. అయితే యాంటీహిస్టమైన్స్‌లో ప్రతికూలత ఏమిటంటే ఇవి వాడినప్పుడు బాధితులు చాలావరకు మందకొడిగా కనిపిస్తుంటారు. చురుకుదనం ఎక్కువగా ఉండదు. డీకంజెస్టెంట్స్ : ముక్కులో కేవలం రెండు చుక్కలతో చాలావరకు ప్రయోజనం ఉంటుంది. ఈ చుక్కల మందు... ముక్కులోని అడ్డంకి ఫీలింగ్‌ను తొలగించడానికి, టర్బినేట్స్ డీ–కంజెషన్కు ప్రయత్నిస్తాయి. ముక్కు కారడం వంటి సమస్యలు పరిష్కారం దొరకక΄ోయినా శ్వాస సాఫీగా అయ్యేందుకు ఇవి చాలావరకు తోడ్పడతాయి. ∙సెలైన్ నేసల్ స్ప్రే : ముక్కులోకి స్ప్రే చేసుకునే ఈ మందులు ముక్కుదిబ్బడను తాత్కాలికంగా తగ్గిస్తాయి. ఆవిరి పట్టడం : అనేక శతాబ్దాలుగా అనుసరిస్తున్న ఇంటి చిట్కా ఇది. ముక్కు దిబ్బడ పట్టిన సందర్భాల్లో ప్రతి ఒక్కరూ ముందుగా ప్రయత్నించదగిన ప్రక్రియ ఆవిరి పట్టడం. విక్స్ లాంటి మందును వేడి నీటిలో వేసి ఆవిరి పట్టే ఈ ప్రక్రియ చాలా సురక్షితమైనది. అయితే వీటిన్నింటితో ప్రయోజనం లేనప్పుడు డాక్టర్లు ముక్కు దూలం సరిచేయడానికి శస్త్రచికిత్సను సూచిస్తారు. లేదా ఇతరత్రా కారణాలను బట్టి చికిత్స అందిస్తారు. మరికొన్ని అనర్థాలు కూడా... తరచూ ముక్కుదిబ్బడ సమస్యతో బాధపడుతుండేవారిలో దీర్ఘకాలంలో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు వాళ్లలో గురక, స్లీప్ ఆప్నియా, తగినంత నిద్ర లేకపోవడం, పట్టిన కొద్దిపాటి నిద్రలో నాణ్యత లేకపోవడం, రాత్రి నిద్ర సరిపోకపోవడంతో అసహనం, పనిపై దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటి అనేక సమస్యలు కనిపిస్తుంటాయి. డాక్టర్ ఈ.సీ. వినయకుమార్, సీనియర్ ఈఎన్టీ సర్జన్ (చదవండి: ప్లాస్టిక్స్ బరువును పెంచుతాయా..?) -
మన్యం గజగజ
చింతపల్లి: మన్యంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. దట్టంగా పొగమంచు కురవడంతోపాటు శీతల గాలులు, చలి తీవ్రత పెరిగాయి. దీంతో మన్యం వాసులు గజగజ వణుకుతున్నారు. గురువారం డుంబ్రిగూడలో 8.6 డిగ్రీలు, జి.మాడుగుల, జీకే వీధిల్లో 8.7 డిగ్రీలు, హుకుంపేటలో 8.8 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ ఉష్ణోగ్రతల విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. అదేవిధంగా అరకులోయలో 9.1, డిగ్రీలు, పెదబయలులో 9.5, చింతపల్లిలో 9.4, పాడేరులో 9.8, ముంచింగ్‌పుట్టులో 11.2, కొయ్యూరులో 13.3, అనంతగిరిలో 15.5 డిగ్రీలు చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వివరించారు. వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. బుధవారం నుంచి ఈ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది నవంబర్ 10, 12, 29, 30 తేదీల్లో 13 నుంచి 13.5 డిగ్రీలు మాత్రమే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ నెలలో నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు ముందుగానే నమోదు కావడంతో మన్యం ప్రాంత ప్రజలు వణుకుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చలిగాలులు బాగా వీస్తున్నాయి. ఉదయం 9.30 గంటలు దాటే వరకు పొగమంచు వదలడం లేదు. పొగమంచు, చలి తీవ్రత వల్ల వాహనచోదకులు, విద్యార్థులు, పొలం పనులకు వెళ్లే రైతులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. -
మంచు కురిసే వేళలో.. మూడింతలైన కశ్మీర్ అందాలు
జమ్ము: జమ్ముకశ్మీర్‌లోని పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న హిమపాతం మైదాన ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీంతో మైదాన ప్రాంతాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. కాశ్మీర్‌లోని పర్వతప్రాంతాల్లో మంచు కురిసిన అనంతరం జమ్ముకశ్మీర్‌లో విపరీతమైన చలి వాతావరణం ఏర్పడింది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. సోన్మార్గ్లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 5.3 డిగ్రీలుగా నమోదైంది.కుప్వారాలోని మచిల్ సెక్టార్లో మంచు కురవడంతో ఆ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తోంది. భారీగా పేరుకున్న హిమపాతం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. గురేజ్, తులైల్, కంజల్వాన్ సరిహద్దు ప్రాంతాలతో సహా బందిపోరా ఎగువ ప్రాంతాలలో కూడా తెల్లటి మంచు దుప్పటి అందంగా పరుచుకుంది.మైదాన ప్రాంతాల్లో కురుస్తున్న పొగమంచు ప్రభావం సిమ్లా వరకు వ్యాపించింది. పొగమంచు కారణంగా మైదాన ప్రాంతాల నుంచి రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దీంతో కల్కా నుంచి సిమ్లా వెళ్లే నాలుగు రైళ్లు నాలుగు గంటలు ఆలస్యంగా నడిచాయి. దీంతో వారాంతాల్లో సిమ్లా వచ్చే పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే మూడు రోజుల పాటు మైదాన ప్రాంతాల్లో మంచుకురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీంతో రైళ్ల రాకపోకలపైనా ప్రభావం పడనుంది.హిమాచల్ ప్రదేశ్‌లో చలి తీవ్రత అధికమయ్యింది. ఆదివారం నాడు 13,050 అడుగుల ఎత్తయిన రోహ్తంగ్ పాస్‌తో సహా పలు పర్వత శిఖరాలపై భారీగా మంచు కురిసింది. లాహౌల్-స్పితి, కులులో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీంతో నదులు, వాగులు, జలపాతాలు గడ్డకడుతున్నాయి.ఇది కూడా చదవండి: కార్తీక వనసమారాధనలో గలాటా -
బీహార్‌లోకి ప్రవేశించిన చలి
పట్నా: బీహార్‌లోకి చలి అప్పుడే ప్రవేశించింది. మరో రెండు మూడు రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని, ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పులు కనిపించబోవని వాతావరణ శాఖ తెలిపింది. అధిక తేమ కారణంగా రాష్ట్రాంలోని పలు జిల్లాల్లో ఉదయం వేళ పొగమంచు కమ్ముకుంటోంది.రాజధాని పట్నాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దీపావళికి ముందే గాలి నాణ్యత క్షీణించింది. పట్నా వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో తుఫాను గాలులు కొనసాగుతున్నాయి. ఫలితంగా బీహార్‌లోని ఈశాన్య ప్రాంతం మేఘావృతమై ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. గాలి దిశ పశ్చిమం వైపు కొనసాగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రత 31 నుండి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 20 నుండి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది. ఇది కూడా చదవండి: పుష్కర కాలానికి పూచే నీలకురంజి పుష్పం..! -
హిమాచల్‌లో రెండు డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. లాహౌల్ స్పితి జిల్లా కుకుమ్సేరిలో కనిష్ట ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్. గరిష్ట- కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య ఏర్పడిన వ్యత్యాసం పలువురికి అనారోగ్యాలను తెచ్చిపెడుతోంది. పగటిపూట ఎండవేడిమి, సాయంత్రం వీచే చల్లని గాలి వ్యాధులకు కారణంగా నిలుస్తోంది.సిమ్లా వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ 17 వరకు వాతావరణం నిర్మలంగా ఉండనుంది. అంటే వర్షం, ఉరుములు, మెరుపులు, వడగళ్ల వాన మొదలైనవి ఉండవు. మరోవైపు కిన్నౌర్ జిల్లా కల్పాలో తేలికపాటి వర్షం నమోదైంది. ధర్మశాలలోని ధౌలాధర్ పర్వతాలపై కూడా తేలికపాటి హిమపాతం కనిపించింది.దీనిని ఈ సీజన్లో మొదటి హిమపాతంగా చెబుతున్నారు. ఎత్తయిన ప్రాంతాల్లో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ స్పితి జిల్లాలోని కుకుమ్సేరిలో అత్యల్ప ఉష్ణోగ్రత 2.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉనాలో అత్యధికంగా 35.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సిమ్లాలో 23.8 డిగ్రీలు, కల్పాలో 21.8 డిగ్రీలు, ధర్మశాలలో 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇది కూడా చదవండి: ఎయిరిండియా విమానంలో బాంబు? -
రాష్ట్రంలో మూడేళ్లుగా చలి తక్కువే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత మూడేళ్లుగా అత్యంత చలి రోజులు నమోదు కాలేదు. అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా గత ఐదేళ్లతో పోలిస్తే 2023లోనే నమోదయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో సంవత్సరాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన రోజులు, అత్యధిక చలి నమోదైన రోజుల వివరాలను కేంద్ర పర్యావరణ గణాంకాల నివేదిక–2024 వెల్లడించింది.2014లో సగటున మూడ్రోజులు మాత్రమే అత్యంత చలి నమోదైందని, 2018లో సగటున ఏనిమిది రోజులు అత్యంత చలి నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. 2019లో కేవలం ఒకరోజు మాత్రమే అత్యంత చలి నమోదైతే.. 2020లో ఆరు రోజులపాటు అత్యంత చలి నమోదైంది. అదే 2021 నుంచి 2023 వరకు ఒక్కరోజు కూడా అత్యంత చలి నమోదు కాలేదుఇక 2023లో దేశంలో ఢిల్లీ, హరియాణ, రాజస్థాన్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అత్యధిక చలి రోజులు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. 2023లో ఢిల్లీలో అత్యధికంగా సగటున ఐదు రోజులు అత్యంత చలి రోజులు నమోదైంది. వరుసగా రెండ్రోజులు 45 డిగ్రీలుంటే హీట్ వేవ్..ఎక్కడైనా రెండ్రోజులపాటు గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే హీట్‌వేవ్ పరిస్థితులుగా పరిగణిస్తారు. రాష్ట్రంలో 2016 మే 2న ప్రకాశం జిల్లా వెలిగండ్లలో అత్యధికంగా 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, 2017 మే 17న ప్రకాశం జిల్లా టంగుటూరులో అత్యధికంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే 31 2018లో నెల్లూరు జిల్లా మర్రిపాడు, డిచ్చిపల్లిలో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2019 మే 26న కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2020 మేలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2021 మేలో ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా 45.9 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. ఇక 2022లో అత్యధికంగా తిరుపతిలో 45.9 డిగ్రీలు, 2023లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం గ్రామీణ ప్రాంతంలో 2023 మే 16న అత్యథికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.అత్యధిక ఉష్ణోగ్రతల తీరూతెన్ను ఇలా..ఇక రాష్ట్రంలో 2014లో సగటున 16 రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వగా ఆ తరువాత 2023లోనే సగటున 15 రోజుల పాటు ఇవి నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. 2023లో దేశంలోకెల్లా బిహార్‌లో 18 రోజులపాటు అత్యధిక వేడి రోజులు నమోదయ్యాయి. ఆ తరువాత ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛతీస్‌గఢ్ తమిళనాడు రాష్ట్రాలున్నాయని నివేదిక పేర్కొంది. -
Health: ఇది సాధారణమే! చలికాలంలో తరచుగా జలుబు..
నాకు 5వ నెల. చలికాలంలో తరచుగా జలుబు చేస్తుంది. ఇలాంటి సమయంలో ఏ మందులు వేసుకోవాలి. డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? – మాధురి, జగ్గంపేటజలుబు అనేది గర్భవతిగా ఉన్నప్పుడు చాలా సాధారణం. జలుబు, ఫ్లూ వైరస్ వల్ల వ్యాపిస్తుంది. మాములుగా జలుబుకి ఆవిరి తీసుకోవడం, పై పూతగా ఏమైనా రాసుకోవడం, పారాసిటమాల్ లాంటివి తీసుకోవచ్చు. కానీ జలుబుతో పాటు ఒళ్లునొప్పులు, దగ్గు, జ్వరం ఉంటే మాత్రం ఫ్లూ లక్షణాలు అని అర్థం. అప్పుడు డాక్టర్ని వెంటనే సంప్రదించాలి. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంతమంది గర్భిణీలకు వాతావరణంలోని మార్పులతో ఇబ్బందులు ఎదురవుతాయి. యాంటీ వైరల్ మాత్రలు కుడా వాడాల్సి వస్తుంది. త్వరగా చికిత్స అందకపోతే కొందరిలో అది న్యూమోనియాగా మారుతుంది. దీనికి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాల్సి ఉంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు హార్మోనల్ మార్పుల వల్ల, ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది. అందుకే ఎక్కువమంది ఇబ్బందులు ఎదుర్కొంటారు.హై యాంటీబయాటిక్స్ ఇవ్వవలసి వస్తుంది. ఫ్లూ కారణంగా ముందస్తు డెలివరీ అయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. చలికాలంలో మీరు ఉన్న పరిసరాల్లో ఎవరో ఒకరికి జలుబు, ఫ్లూ ఉంటాయి. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వైరస్లు కూడా ఉంటాయి. అలాంటప్పుడు నిరోధించడం చాలా కష్టం. అందుకే గర్భిణీలు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. ఫ్లూ వ్యాక్సినేషన్ ఏ నెలలోనైనా తీసుకోవచ్చు. ఇది తీసుకున్న వారిలో ఫ్లూ తాలూకు ఇబ్బందులు తక్కువగా ఉంటాయని నిరూపణ అయ్యింది. సరైన పోషకాహారం, నిద్ర, రోజుకు కనీసం నాలుగైదు లీటర్ల ద్రవ పదార్థాలు తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్, ముక్కులో వేసుకునే ్రడాప్స్ మంచివి కావు. డీకంజెస్టంట్ (కఫం పోయేలా చేసే) ఉన్న మందులు కూడా వాడకూడదు.ఫ్లూ వచ్చినప్పుడు చేసే చికిత్సతో కడుపులో ఉన్న బిడ్డ మీద ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. మీకు 5వ నెలలో చేసే టిఫా స్కాన్‌లో బిడ్డ ఎదుగుదల తెలుస్తుంది. ఒక వేళ ఫ్లూ ఎక్కువ ఉండి, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుంటే వెల్ బీయింగ్ స్కాన్ అదనంగా చేస్తారు. మీకు జలుబు మాత్రమే ఉంటే ఒకటి రెండువారాల్లో తగ్గుతుంది. ఉప్పు నీటితో పుక్కిలించడం, వేడినీటిలో నిమ్మరసం వేసుకుని తాగడం వల్ల కూడా ఉపశమనం కలుగుతుంది. ముక్కు మూసుకుపోయి, తుమ్ములు, గొంతు బొంగురుపోవడం లాంటివి ఉండి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి.మీకు షుగర్, ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులున్నా, వాటి తాలూకు ఇబ్బందులు ఎదురైనా డాక్టర్ని కలసి, వారి సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఒకటి రెండు వారాల వరకూ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా జలుబు ఉంటే వాళ్లు వాడిన వస్తువులు వాడకూడదు. చేతులను ముక్కు, కళ్ల వద్ద పెట్టుకోకూడదు. చేతులను శు్రభంగా కడుక్కోవాలి. మాస్క్ వాడటం కూడా మంచిది. ఫ్లూ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేయించుకుంటే తగ్గదు. అందుకే రాకముందే ముందు జాగ్రత్త చర్యగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫీవర్ ఉంటే డాక్టర్ని కలసి మందులు వాడాలి.హెల్త్ ట్రీట్.. పీసీఓఎస్‌తో తిండి సమస్యలు..?మహిళల్లో రకరకాల ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే పాలీ సిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ (పీసీఓఎస్) తిండి సమస్యలకు కూడా కారణమవుతుందని తాజా పరిశోధనలో తేలింది. పీసీఓఎస్‌తో బాధపడే మహిళలు బులీమియా (తిన్న తర్వాత బరువు పెరిగిపోతామన్న ఆందోళనతో బలవంతంగా వాంతి చేసుకోవడం), బింజ్ ఈటింగ్ (నియంత్రణ లేకుండా నిరంతరం తినడం) వంటి సమస్యలకు కూడా లోనవుతారని ఒక అంతర్జాతీయ పరిశోధనలో తేలింది. తొమ్మిది దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పీసీఓఎస్‌తో బాధపడే 28,922 మంది మహిళలపైన, ఈ సమస్య లేని 2,58,619 మంది మహిళలపై జరిపిన విస్తృత పరిశోధనలో ఈ అంశమై శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు.ఈ పరిశోధన సారాంశాన్ని ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం’ సంచికలో ప్రచురించారు. ఆహారం తినడంలో సమస్యలకు లోనయ్యే పీసీఓఎస్ మహిళలపై జరిపిన పరిశోధనల్లో మరికొన్ని అంశాలూ బయటపడ్డాయి. వీరిలో నెలసరి సక్రమంగా రాకపోవడం, ఒక్కోసారి అసలే రాకపోవడం, అండాశయం పైపొరపై పూర్తిగా పరిపక్వం కాని అండాలు ఏర్పడటం, పురుష హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ మోతాదు ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. పీసీఓఎస్ లేని మహిళలతో పోలిస్తే, పీసీఓఎస్‌తో బాధపడే మహిళల్లోనే ఆహారం తినే అంశంలో రకరకాల సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్లోని కేలీ గయోర్ఫీ, అవా సానెత్ల ఆధ్వర్యంలో ఈ పరిశోధన నిర్వహించారు. – డా. భావన కాసు -
దీపికా పదుకొణె, అలియా భట్ల బ్యూటీ సీక్రెట్ ఇదే..!
సినీ తారలు ఎంతలా గ్లామర్ మెయింటెయిన్ చేస్తారో మనకు తెలిసిందే. మూడు పదుల వయసులో వన్నె తరగని అందం, గ్లామర్ వారి సొంత. ముఖ్యంగా వయసు పైనబడినట్లు కనిపించకుండా యవ్వనపు మేని ఛాయాలా కనిపించేందుకు ఏం చేస్తారో తెలుసుకోవాలని కుతుహలంగా ఉంటారు అభిమానులు. వారిలా ఉండేలా రకరకలుగా అందానికి సంబంధించిన ప్రయోగాలు చేస్తుంటారు. ఇంతకీ అందాల భామలు బ్యూటీ రహస్యం ఏంటంటే..బాలీవుడ్ అగ్ర తారలు దీపకా పదుకొణె దగ్గర నుంచి అలియా భట్ వరకు అంతా ఐస్ ఫేషియల్‌కి ప్రాధాన్య ఇస్తారు. ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుందట. ముఖం తాజాగా, ప్రకాశవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ముడతలను మాయం చేస్తుందట. ఉబ్బిన కళ్లకు మంచి ఫలితం ఉటుందట. కళ్లు చుట్టూతా ఉన్న ఉబ్బిన భాగ్నాన్ని నార్మల్‌గా మారుస్తుందట. ఇదెలాగంటే..ఏం లేదు ఉదయాన్నే చక్కగా ముఖాన్ని ఫేస్‌వాష్ లేదా సబ్బుతో క్లీన్ చేసుకుని చక్కగా ఫ్రీజ్‌లోని ఐస్ క్యూబ్లతో థెరఫీ చేయించుకుంటారు. ఇది కళ్ల చుట్టు ఉన్న వలయాన్ని, ఉబ్బిన చర్మాన్ని రిపేర్ చేస్తుంది. క్యూబ్ చేతితో పట్టుకుని ముఖంపై అప్లై చేసుకోవడం ఇబ్బందిగా ఉండొచ్చు. అలాంటప్పుడు ఐస్నిఒక పల్చటి క్లాత్‌లో చుట్టి ముఖంపై అప్లై చెయ్యొచ్చు. ఈ థెరపీ ముఖంపై రంధ్రాలను దగ్గర చేసి, మృదువుగా మారుస్తుంది. అలాగే ముఖంపై ఉండే మంట, ఇరిటేషన్ల నుంచి కూడా మంచి ఉపశమనం ఇస్తుంది.అలాగే ముఖమంతా రక్తప్రసరణ జరిగి..చర్మానికి సహజమైన మెరుపుని ఇస్తుంది. ముఖ్యంగా మొటిమల సమస్యను నివారిస్తుందిగ్రీన్ టీ, దోసకాయ రసం వంటి వాటిని ఐస్ క్యూబ్లకు జోడించి అప్లై చేస్తే చర్మానికి అవసరమయ్యే యాంటిఆక్సిడెంట్లు అందుతాయి. అబ్బా చలి..చలిగా.. ఉండి ముఖంపై పెట్టేకునేందుకు వామ్మో..! అనిపించేలా ఉన్నా..ఈ కోల్డ్ థెరపీ చర్మ సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తుంది. (చదవండి: అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్: నీతా అంబానీ వాచ్ ధర అన్ని కోట్లా..!) -
'జలుబు' ఇంత ప్రమాదకరమైనదా? ఇలా కూడా ఉంటుందా..?
సాధారణంగా జలుబు మహా అయితే వారం రోజులు ఇబ్బంది పెడుతుంది. ఆ తర్వాత అంతా నార్మల్‌గా ఉంటుంది. మన పెద్దలు ఈ జలుబు గురించి తమాషాగా.. అంటే మందులు వేసుకుంటే వారం రోజుల్ల తగ్గుతుంది లేదంటే నెల రోజులు పడుతుందని అంటుంటారు. నిజానికి జులుబు సాధారణమైన వ్యాధే గానీ వస్తే మాత్రం ఊపిరాడక దాంతో పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ఇదంతా చెబుతున్నానంటే ఇలానే సాధారణ జలుబుగా తేలిగ్గా తీసుకుని ఓ వ్యక్తి ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. బాబోయ్ జలబు ఇంత సివియర్‌గా ఉంటుందా? అనిపించేలా అతడు చాలా అనారోగ్య సమస్యలనే ఫేస్ చేశాడు. ఇది ఎక్కడ జరిగిందంటే..ఈ దిగ్బ్రాంతికర ఘటన కెనడాలోని అంటారియోలో చోటు చేసుకుంది. ఎంతో ఫిట్ణెస్గా ఉండే 33 ఏళ్ల పవర్‌లిఫ్టర్ జారెడ్ మేనార్ట్కి ఈ చేదు అనుభవం ఎదురయ్యింది. గతేడాది జారెడ్, అతని భార్య, ముగ్గురు కుమార్తెలు జలుబు బారినపడ్డారు. అయితే భార్య, పిల్లలు కొద్దిరోజుల్లోనే కోలుకగా, జారెడ్ పరిస్థితి మాత్రం సివియర్ అయ్యిపోయి రోజురోజుకి పరిస్థితి దిగజారిపోవడం మొదలయ్యింది. ఇదేంటి పరిస్థితి ఇలా ఉందేంటని అతడిని ఆస్పత్రికి తరలించగా..అసలు విషయం బయటపడింది. ఇది సాధారణ జలుబు కాదని, రోగనిరోధక వ్యవస్థపై దాడిచేసే ప్రాణాంతకమైన హెమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్(హెచ్ఎల్హెచ్)తో బాధపడుతున్నాట్లు వెల్లడించారు. ఇలాంటి వ్యాధికి సంబంధించిన కేసులు 2006 నుంచి 2019 వరకు ఏకంగా 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని అన్నారు. ఈ కేసుల్లో మరణాల రేటు దాదాపు 40% ఉంటుందని అంచనా వేశారు. ఇది వైరస్ లేదా బ్యాక్టరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని తెలిపారు. దీన్ని సాధారణంగా మోనో లేదా ముద్దు వ్యాధి(కిస్సింగ్ డిసీజ్) అని పిలుస్తారు. సాధారణ మోనో(సాధారణ జలుబు) అయితే కొద్ది వారాల్లోనే తగ్గిపోతుందని, మోనో హెచ్ఎల్హెచ్ కలియితో వచ్చే జలుబు మాదిరి వ్యాధి మాత్రం అవయవ వైఫల్యానికి దారితీస్తుందని అన్నారు. ఇక్కడ జారెడ్ మాత్రం చాలా రోజులు వెంటిలేటర్‌పై ఉన్నాడు. డయలాసిస్ కూడా చేయాల్సి వచ్చింది. అస్సలు అతను బతికే అవకాశాలపై కూడా వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక చివరిగా కీమోథెరపీ వంటి శక్తిమంతమైన చికిత్సలను అందించారు. ఈ చికిత్స క్రమంలో ఏకంగా 19 కేజీల బరువు తగ్గిపోయాడు జారెడ్. చెప్పాలంటే ఏదో మిరాకిల్ జరిగినట్టుగా అనూహ్యంగా కోలుకున్నాడు జారెడ్. అయితే కూర్చొవడం, నిలబడటం, నడవడం, ఊపిరి పీల్చుకోవడం, మాట్లాడటం, తదితరాలన్నింటిని కష్టబడి నేర్చుకోవాల్సి వచ్చింది. ఈ కీమోథెరపీ కారణంగా పాదాల్లో నరాలు దెబ్బతిన్నాయి, వాసనను కూడా కోల్పోయాడు. కరెక్ట్‌గా చెప్పాలంటే మాములు వ్యక్తిలా అవ్వడానికి చాలా సమయమే తీసుకుంది. పాపం జారెడ్ తాను ఈ జలుబుని తేలిగ్గా తీసుకోవడంతోనే ఇంతటి పరిస్థితికి దారితీసిందని బాధగా చెప్పుకొచ్చాడు. తన వెయిట్ లిఫ్టింగ్ కసరత్తులతో ఇది వరికిటి మాదిరిగా బలాన్ని పుంజుకున్నానని అన్నాడు. అస్సలు తన కుమార్తెలను ఎత్తుకోగలనా అని బాధపడిపోయాను, కానీ మళ్లీ ఇదివరకిటి మాదిరిగా కండలు తిరిగిన దేహంతో యథాస్థితికి వచ్చినందుకు ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు జారెడ్.(చదవండి: కేన్స్‌లో హైలెట్‌గా నటి పుచ్చకాయ హ్యాండ్‌బ్యాగ్..వెనుక ఇంత కథా..!) -
కొన్ని వ్యాధులకు మద్యమే మందట.. తాగితే తగ్గుతుందట!
'మద్యం ఆరోగ్యానికి హానికరం' అంటూ యాడ్లలోనూ సినిమాల్లోనూ తెగ కనిపిస్తుంది. అదీగాక మద్యం తాగితే లివర్, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు పాడై ప్రాణాలు కోల్పోతారనివైద్యులు హెచ్చరిస్తుంటారు. అయితే మద్యం తాగితే కొన్ని వ్యాధులు రావట. పైగా ఆ వ్యాధులకు మద్యమే మందట. తాగితే ఆ వ్యాధులు తగ్గుముఖం పడతాయిని సాక్షాత్తు వైద్యులే చెబుతున్నారు. అలా అని ఇష్టారీతిగా తాగేయ్యొద్దని వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఏ వ్యాధులకు మద్యం మందు? ఎంత మోతాదులో తాగితే బెటర్ అంటే.. ఇటీవల కాలంలో మద్యం తాగేవాళ్ల సంఖ్య రోజు రోజుకి అనూహ్యంగా పెరుగుతుంది. దీనివల్ల దీర్ఘాకాలిక వ్యాధులు బారినపడే ప్రమాదం ఉదన్నా సరే వీకెండ్ అని, వెకేషన్ అని ఏదో ఒక సందర్భం పేరుతో విచ్చల విడిగా తాగేయడం నేటి యువతకు ఓ ఫ్యాషన్ అయిపోయిందని చెప్పొచ్చు. పోనీ తాగిన అందుకు తగ్గ ఫుడ్ జ్రాగత్తలు తీసుకుంటే బావుండు. పడని బ్రాండెడ్ మందు కూడా ట్రై చేసేసి లేనిపోని ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటుంటారు కొందరూ. ఆరోగ్య నిపుణులు, వైద్యులు మద్యం సేవిస్తే వచ్చే ఆరోగ్య సమస్యల గురించి వివరించినా.. ఐ డోంట్ కేర్ అన్నట్లు తాగేస్తుంటారు మందుబాబులు. పరిస్థితి చేయి దాటాక తాగుడు అలవాటు నుంచి బయటపడేందుకు డీ అడిక్షన్ సెంటర్ల చుట్టూ తెగ ప్రదిక్షణాలు చేసేస్తుంటారు. ఇంత వరకు పరిస్థితి ఎందుకు తెచ్చుకోవడం అని వైద్యులు తరుచుగా ప్రశ్నిస్తుంటారు రోగులన. అసలు ఇలాంటి సమస్య తెచ్చుకోకుండా మందుబాబులు జాగ్రత్తగా ఉండేలా వైద్యులు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇష్టంగా తాగే మందు వల్ల కలిగే ప్రయోజనాల తోపాటు ఏ మోతాదులో తీసుకుంటే హాయిగా ఉండొచ్చో సవివిరంగా చెప్పారు. అవేంటంటే.. ఆ వ్యాధులు తగ్గుతాయట.. బ్రాందీ, రమ్, విస్కీ జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు బారినపడకుండా కాపాడుతుందట. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయట. అలాగే జలుబు కారణంగా వచ్చే శ్లేష్మాన్ని క్లియర్ చేస్తుందట. ఇందులో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ కంటెంట్ క్యాన్సర్ వ్యతిరేకంగా పనిచేస్తుందట. ముఖ్యంగా అండాశయ, మూత్రాశయ క్యాన్సర్లు రాకుండా నియంత్రిస్తుందట. రాగి బారెల్స్‌లో ఉండే బ్రాందీలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. ఇది మంచి యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. పైగా హృదయనాళాల ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇలాంటి మంచిఫలితాలను పొందాలంటే ఇక్కడ బ్రాందీ, రమ్ వంటివి రోజుకి 30 నుంచి 60 ఎంఎల్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యక్తిగత ఆరోగ్య చరిత్రను పరిగణలోనికి తీసుకుని, అందుకు అనుగుణంగా నిపుణుల సూచించిన విధంగా మోతాదుకు మించి మద్యం సేవించకుండా ఉంటేనే ఈ సత్ఫలితాల పొందగలరని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ ఏదైన తగు మోతాదులో మితంగా ఉంటే శరీరానికి అవసరమయ్యే మంచి ఔషధ గుణాలను పొందగలమని చెబుతున్నారు నిపుణులు. వార్నింగ్: తాగమని కాదు..! ఇక్కడ మందు తాగండని లేదా తాగడం మంచిదని చెప్పడం ప్రధాన ఉద్దేశ్యం కాదు. తాగే అలవాటు ఉన్నవారు, అస్సలు తాగకుండా ఉండలేని వారు దీని వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటే కనీసం తగు మోతాదులో లేదా ఆరోగ్యకరమైన పద్ధతిలో తీసుకుని సురక్షితంగా ఉంటారని తెలియజేయడమే తప్ప. ఇక్కడ ఎవర్నీ మందు తాగమని ప్రోత్సహించే ఉద్దేశ్యం లేదని చెబుతున్నారు నిపుణులు. కొన్ని హానికరైమన వాటిల్లో కూడా మేలు చేసే గుణాలు ఉంటాయని చెప్పేందుకే అని అన్నారు. ఇవి తెలుసుకుంటే ఆ చెడు అలవాటుని కూడా ఆరోగ్యానికి మంచిదిగా మలుచుకుంటే తాగుడు సమస్య నుంచి బయటపడొచ్చు లేద చెక్ పెట్టగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసమే. దీన్ని అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు, ఆరోగ్య నిపుణుల సలహాలు సూచనల మేరుకు పాటించటం ఉత్తమం. -
వండర్ఫుల్ టిప్స్ : బ్రెడ్ ప్యాకెట్లో బంగాళదుంప...ఓసారి ట్రై చేయండి..!
మన బామ్మల దగ్గర్నించి, ఇప్పటిదాకా వంటిట్లో గానీ, వంటల్లో గానీ, చిన్న చిన్న అనారోగ్యాలకు కానీ చక్కటి ఇంటి చిట్కాలను, హోం రెమిడీస్ను ఫాలో అవుతూ ఉంటాం. నిజానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి కూడా. మరి అలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కొన్ని మీ కోసం.. ⇒ కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే పెరుగు తొందరగా పాడవదు. ⇒ అగరబత్తిసుసితో ఇత్తడి పాత్రలు కడగడితే భలే శుభ్రపడతాయి. ⇒ కత్తిపీటకు ఉప్పు రాయడం వల్ల పదునుగా తయారవుతుంది. ⇒ మినపప్పు త్వరగా నానాలంటే ఆ నీళ్లలో ఇనుప వస్తువు ఏదైనా వేయాలి. ⇒ బ్రెడ్ ప్యాకెట్ లో బంగాళదుంప ముక్కలుంచితే త్వరగా పాడవ్వదు. ⇒ నిమ్మ చెక్క మీద ఉప్పు, మిరియాల పొడి చల్లి స్టౌ మీద ఉంచి, కొద్దిగా వేడి చేసి, ఆ రసాన్ని పిండుకొని తాగితే మైగ్రేన్ నుంచి ఉపశమనం దొరుకుతుంది ⇒ నిమ్మ రసం, తేనె, గ్లిజరిన్‌లను సమపాళ్ళలో కలపాలి. రోజుకు మూడుసార్లు ఒక టీ స్పూను చొప్పున తీసుకుంటే దగ్గు త్వరగా తగ్గుతుంది ⇒ ఎండలో ఎక్కువ సేపు తిరగడం వల్ల తలనొప్పి, తల తిరిగినట్లు ఉంటుంది కదా చిన్న అల్లం ముక్క నూరి నిమ్మరసంలో కలిపి తాగితే ఉపశమనం. ⇒ పిల్లలకు జలుబు చేసినపుడు, తులసి, అల్లం, నాలుగు వామ్ము ఆకులు వేసి మరిగించిన నీళ్లను తాగిస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ⇒ ముక్కు బాగా దిబ్బడ వేసినపుడు, పిల్లల్ని వెల్లకిలాకాకుండా, ఒక పక్కకు పడుకోబెట్టి, వీపు మీద బేబీ విక్స్ రాసి మెల్లిగా రుద్దితే తొందరగా నిద్ర పోతారు. -
చలిగాలుల జాడలేదు
సాక్షి, విశాఖపట్నం: డిసెంబర్, జనవరి నెలల్లో ఎముకలు కొరికేస్తున్నట్టుగా చలి తీవ్రత ఉంటుంది. కానీ.. ఈ ఏడాది అలాంటి పరిస్థితి కనిపించలేదు. ఈ శీతాకాలం సాదాసీదాగానే ప్రభావం చూపించిది తప్ప జనాన్ని గజగజలాడించ లేదు. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలతో తీవ్ర వడగాడ్పులు (సివియర్ హీట్æవేవ్స్) వీస్తుంటాయి. అదే శీతాకాలంలో కొన్ని రోజులు అతి శీతల గాలులు (సివియర్ కోల్డ్ వేవ్స్) వీచి గడ్డ కట్టించే చలికి కారణమవుతాయి. అలాంటి రోజుల్లో కనిష్ట (రాత్రి) ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకంటే తక్కువగా నమోదవుతాయి. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తుంది. విశాఖ ఏజెన్సీ (అల్లూరి సీతారామరాజు జిల్లా)లోని లంబసింగి, చింతపల్లి, అరకు, పాడేరు వంటిచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా క్షీణిస్తాయి. అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 5–6 డిగ్రీలకు దిగజారిపోతాయి. లంబసింగిలో అయితే ఏటా జనవరిలో ఏకంగా ఉష్ణోగ్రత జీరో డిగ్రీలకు పడిపోతుంది. కానీ.. ఈ శీతాకాలం సీజన్ అందుకు భిన్నంగా సాగింది. ఈ సీజన్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ రోజులు 8–15 డిగ్రీల మధ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలకంటే (చింతపల్లి, లంబసింగిల్లో) తక్కువగా రాష్ట్రంలో ఎక్కడా నమోదు కాలేదు. మన్యం సహా రాష్ట్రంలో ఒక్క రోజూ అతి శీతల గాలులు (కోల్డ్ వేవ్స్) వీయలేదు. శీతల తీవ్రత అధికంగా ఉండే జనవరిలోనూ చలి ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. ఫలితంగా చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందే అవసరం ఏర్పడ లేదు. గడచిన కొన్నేళ్లలో ఇలాంటి పరిస్థితి లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తూర్పు, ఈశాన్య గాలులే ఇందుకు కారణం సాధారణంగా శీతాకాలంలో దక్షిణాదికంటే ఉత్తర, వాయవ్య భారతదేశంలో శీతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అటునుంచి మన రాష్ట్రం వైపు ఉత్తర, వాయవ్య గాలులు బలంగా వీస్తుంటాయి. దీంతో చలి తీవ్రత ఆంధ్రప్రదేశ్‌పై కూడా కనిపిస్తుంది. అయితే.. ఈ ఏడాది రాష్ట్రంపైకి తూర్పు, ఈశాన్య గాలులు బలంగా వీస్తున్నాయి. ఫలితంగా ఈ గాలులు ఉత్తర, వాయవ్య గాలులకు ఒకింత అడ్డుకట్ట వేశాయి. ఈ ఏడాది చలి తీవ్రత అంతగా లేకపోవడానికి, అతిశీతల గాలులు వీయకపోవడానికి తూర్పు, ఈశాన్య గాలుల ప్రభావం అధికంగా ఉండటమే కారణమని భారత వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు 17–23 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. దీంతో చలి ప్రభావం ఏమంత ఉండటం లేదు. గతంలో ఫిబ్రవరి ఆరంభంలో ఇలాంటి పరిస్థితి లేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల ఇవి 30–35 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మరో 10 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆపై చలి నిష్క్రమిస్తుందని పేర్కొంటున్నారు. -
12 ఏళ్ల రికార్డులను దాటేసిన జనవరి చలి
దేశ రాజధాని ఢిల్లీలో గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంత చలి ప్రస్తుత జనవరిలో నమోదైంది. ఈ నెల మొత్తంలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 17.7 డిగ్రీలుగా నమోదుకాగా, కనిష్ట సగటు ఉష్ణోగ్రత 6.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. ఈసారి చలిగాలుల ప్రభావం ఢిల్లీలో గరిష్టంగా ఐదు రోజుల పాటు కనిపించింది. జనవరి 30 వరకు నమోదైన డేటా ప్రకారం ఢిల్లీలో గత 12 ఏళ్లలో సగటున ఈ నెలలోనే చలి అత్యధికంగా నమోదైందని భారత వాతావరణ శాఖ అధికారి ఆర్కే జెనామణి తెలిపారు. జనవరిలో గరిష్ట ఉష్ణోగ్రత చాలా రోజుల పాటు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యింది. 2012 నుంచి 2024 వరకు ఢిల్లీలో ఇంత తక్కువ సగటు గరిష్ట ఉష్ణోగ్రత ఎన్నడూ నమోదు కాలేదు. అయితే కనిష్ట సగటు ఉష్ణోగ్రత 6.2 డిగ్రీలుగా నమోదయ్యింది. అంతకుముందు జనవరి 2013లో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 6.1 డిగ్రీలుగా నమోదైంది. 2015లో గరిష్ట సగటు ఉష్ణోగ్రత 17.9 డిగ్రీలు కాగా, 2022లో 18 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మంగళవారం దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాలను పొగమంచు కమ్ముకుంది. కనిష్ట ఉష్ణోగ్రత 11.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉదయం 9 గంటలకు గాలి నాణ్యత సూచిక 364 (చాలా పేలవమైన విభాగంలో) నమోదైంది. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో నేటి ఉదయం పొగమంచు కమ్మేయనుంది. బుధవారం నుండి ఫిబ్రవరి 4 వరకు లడఖ్, జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. -
జలుబు, దగ్గు, గొంతు నొప్పి వేధిస్తున్నాయా?
వాతావరణం కొద్దిగా మారిందంటే చాలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి చుట్టుముడతాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ సీజనల్ వ్యాధుల బారిన పడతారు. ముఖ్యంగా జలుబు, దగ్గు ఒక్క పట్టాన తగ్గదు. దీనికి తోడు చాలా నీరసం, అలసట. అయితే సాధారణ జలుబు, దగ్గును చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది. యాంటీ బయాటిక్స్ అవసరాన్ని దాదాపు నివారించవచ్చు. సాధారణ జలుబును వైద్యపరంగా వైరల్ ఇన్ఫెక్షన్ లేదా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ అంటారు. జలుబు లేదా ఫ్లూ ఉన్నప్పుడు కనిపించే మరో లక్షణం దగ్గు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యలను దాదాపు వంట ఇంట్లోని దినుసులతోనే తగ్గించు కోవచ్చు. అల్లం, తులసి, వాము ఆకులతో కషాయాన్ని చేసుకొని, కొద్దిగా తెనె కలుపుకుని తాగవచ్చు. అలాగే వేడి పాలల్లో సేంద్రీయ పసుపు కలుపుకొని తాగవచ్చు. నల్ల మిరియాల టీ నల్ల మిరియాల్లో విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది సహజంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కనుక నల్ల మిరియాలు, బెల్లం, నాలుగు తులసి ఆకులు వేసుకొని టీ కాచుకొని తాగవచ్చు. అలాగే ధనియాల కషాయం కూడా. ఇది చేసుకోవడం చాలా సులభం కూడా. మరి ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలేంటో తెలుసు కుందాం. ఒక టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ వాము, జీల కర్ర, యాలకులు, ఐదు లవంగాలు, ఐదు మిరియాలు, అర టీ స్పూన్ శొంఠి పొడి, చిన్న దాల్చిన చెక్క ముక్కను తీసుకొని తడి లేని మిక్సీ జార్లో మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఈ పౌడర్ని ఓ గాజు సీసాలో భద్ర పరుచుకోవాలి. తయారీ విధానం ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్లు తీసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ పొడిని వేయాలి. ఇలా ఐదు నుంచి 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ మిశ్రమానికి ఒక స్పూన్ తేనె కలుపు కోవచ్చు. దీన్ని వేడి, వేడిగా తాగాలి. దీంతో ముక్కు దిబ్బడ తగ్గి శ్వాస సాఫీగా అవుతుంది. వాస్తవానికి తేనె దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే వాతావరణం మార్పుల ద్వారా వచ్చే వ్యాధులు ఉంచి ఉపశమనం మాత్రమే కాదు, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ హోమ్ టిప్స్ వల్ల ప్రయోజనాలే కానీ సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవు. ఆవిరి పట్టడం యూకలిప్టస్ లేదా రోజ్మేరీ ఆయిల్ లేదా కాస్తంత పసుపు వేసి, బాగా కాగిన వేడి నీటి ఆవిరి పడితే మంచిది. సుమారు 10-15 నిమిషాలు పాటు స్టీమ్ పడితే గొంతులోని కఫం కరిగి, గొంతు నొప్పితోపాటు, దగ్గు కూడా తగ్గుతుంది. రోజుకు రెండు సార్లు ఇలా ఆవిరి పట్టవచ్చు. నోట్: జలుబు ఏమాత్రం తగ్గకుండా, దగ్గు మరీ ఎక్కువగా వేధిస్తుంటే మాత్రం వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. లేదంటే ఒక్కోసారి ఈ ఇన్ఫెఫెక్షన్ ఇతర భాగాలకు కూడా పాకే ప్రమాదం ఉంటుంది. -
మళ్లీ గ్యాస్ చాంబర్‌గా ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీని చలిగాలులు చుట్టుముట్టాయి. గాలి దిశలో మార్పు కారణంగా ఢిల్లీ మరోసారి గ్యాస్ ఛాంబర్‌గా మారింది. గాలి వేగం తక్కువగా ఉండడంతో గురువారం ఉదయం నుంచి ఆకాశంలో పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీలో బుధవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 409 వద్ద నమోదైంది. ఇది మంగళవారం కంటే 41 సూచీలు అధికం. గురువారం ఉదయం నుంచి రాజధానిలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. మధ్యాహ్నం వేళ కూడా సూర్యరశ్మి తక్కువగానే ఉంది. రాత్రి అయ్యేసరికి వాతావరణం మరింత చల్లగా మారిపోతోంది. పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా జనానికి కంటి, శ్వాస సమస్యలు ఎదురవుతున్నాయి. బుధవారం ఢిల్లీలోని 13 ప్రాంతాల్లో ఏక్యూఐ 400గా నమోదైంది. శనివారం వరకు పరిస్థితులు మెరుగుపడే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఆ శాఖ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం గాలి పశ్చిమం నుండి ఉత్తరం వైపునకు సగటున గంటకు ఆరు నుండి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీచింది. రాబోయే రెండు రోజులలో వివిధ దిశల నుండి గాలి వీయనుంది. శుక్రవారం ఈశాన్యం నుండి వాయువ్య దిశలో గాలి వీయనుంది. దాని వేగం నాలుగు నుండి ఎనిమిది కిలోమీటర్లుగా ఉండవచ్చు. శనివారం వాయువ్యం నుండి పశ్చిమ దిశగా గాలి వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో గాలి వేగం గంటకు ఆరు నుంచి 12 కిలో మీటర్లుగా ఉండవచ్చు. అందుకే ఈ వారం అంతా గాలి నాణ్యత పేలవంగానే ఉండవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. -
ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు.. 22 రైళ్లు ఆలస్యం
ఢిల్లీ: దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రోడ్లపై విజిబిలిటీ(దృశ్యమానత) సున్నాకి పడిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఢిల్లీకి వెళ్లే దాదాపు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ)లో అనేక విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐజీఐ విమానాశ్రయంలో విజిబిలిటీ 350 మీటర్లుగా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొద్ది గంటల్లో ఇది 200 మీటర్ల మేర తగ్గే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్, చండీగఢ్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. #WATCH | Visibility affected in parts of the national capital as a blanket of dense fog covers Delhi. (Visuals from Rajaji Marg shot at 7.30 am) pic.twitter.com/Nfm5eAHTVi — ANI (@ANI) January 14, 2024 ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దట్టమైన పొగమంచు ఏర్పడింది. తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ వేగంతో ప్రయాణించాలని వాహనదారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్పా ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. #WATCH | Visibility affected due to dense fog in Uttar Pradesh's Lucknow as cold wave conditions prevail in the region (Visuals shot at 7.00am) pic.twitter.com/BH6DMRWw3W — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 14, 2024 దేశ రాజధానిలో 3.6 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గడంతో ఈ సీజన్లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే 3-4 రోజుల్లో వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడుతుందని ఐఎండీ తెలిపింది. 22 trains to Delhi from various parts of the country are running late due to dense fog conditions as on 14th January. pic.twitter.com/vmY6LBOSvr — ANI (@ANI) January 14, 2024 ఇదీ చదవండి: ‘ఇండియా’కు ఖర్గే సారథ్యం! -
జనవరి చలి ఏదీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయంలో ఎముకలు కొరికే చలి ఉండాలి. కానీ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండడంతో చలికి బదులు ఉక్కపోత ఉంటోంది. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. సగటున 3 డిగ్రీల నుంచి 7 డిగ్రీల మేర అధికంగా నమోదవుతుండడం గమనార్హం. రాష్ట్రంలోని వాతావరణంలో నెలకొన్న మార్పులతో ఈ పరిస్థితి కొనసాగుతోందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వచ్చే మూడురోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతటా అధికమే... రాష్ట్రంలో అంతటా కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఐఎండీ అధికారుల గణాంకాల ప్రకారం అదిలాబాద్‌లో సాధారణం కంటే 9.1 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదైంది. ఈ సమయంలో 10 డిగ్రీల నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా.. ప్రస్తుతం 19 డిగ్రీలు నమోదవుతోంది. నిజామాబాద్‌లో సాధారణం కంటే 5.7 డిగ్రీ సెల్సియస్, రామగుండంలో 5.5 డిగ్రీ, భద్రాచలంలో 4.3 డిగ్రీ, మెదక్‌లో 3.8 డిగ్రీ, హైదరాబాద్‌లో 3 డిగ్రీ సెల్సియస్ చొప్పున అధికంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుత వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో రానున్న మూడు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో రాత్రిపూట చలి ప్రభావం పెరిగే అవకాశం ఉంది. గురువారం ఖమ్మంలో 31 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 18 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. -
చలితో పెరిగిన గుండెపోటు కేసులు.. వారంలో 31 మంది మృతి!
మధ్యప్రదేశ్‌లో గత 15 రోజులుగా తీవ్రమైన చలి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా గ్వాలియర్ జిల్లాలో గత ఆరు రోజులుగా చలి తీవ్రత కొనసాగుతోంది. వారం రోజులుగా ఇక్కడి జనం ఎండను చూడనేలేదు. చలిగాలుల కారణంగా జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. గ్వాలియర్ జిల్లాలో తీవ్రమైన చలి కారణంగా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరిగిపోతున్నాయి. స్థానిక హాస్పిటల్ కాంప్లెక్స్‌లోని కార్డియాలజీ విభాగానికి వస్తున్న గుండెపోటు బాధితుల సంఖ్య మరింతగా పెరిగింది. రోజూ దాదాపు 30 నుంచి 35 మంది బాధితులు వస్తున్నారు. గత ఆరు రోజుల్లో గుండెపోటుతో 17 మంది రోగులు మృతిచెందగా, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 31 మంది కన్నుమూశారు. అక్టోబర్-నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్, జనవరిలో హృద్రోగుల సంఖ్య 25 నుంచి 30 శాతం వరకూ పెరుగుతున్నదని, ప్రతిసారీ ఇదే పరిస్థితి కనిపిస్తోందని జయరోగ్య ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌరవ్ కవి భార్గవ తెలిపారు. చలి వాతావరణం తీవ్రమైనప్పుడు గుండెపోటు, రక్తపోటు కేసులు పెరుగుతాయని హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ రామ్ రావత్ పేర్కొన్నారు. తాజాగా ప్రభుత్వాసుపత్రుల్లో గుండెపోటు, స్ట్రోక్ బాధితుల సంఖ్య 30 శాతం పెరగగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో గుండెపోటు బాధితుల సంఖ్య 40 శాతం మేరకు పెరిగింది. -
కాస్త ఎండ.. అంతలోనే విపరీతమైన చలి!
దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగడంతో పాటు విపరీతంగా పొగమంచు కమ్ముకుంటోంది. అయితే చాలా రోజుల తర్వాత ఆదివారం కాస్త ఎండ కనిపించింది. అయితే సాయంత్రానికల్లా మళ్లీ చలి వివరీతంగా పెరిగింది. పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీకి వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సహా 22 రైళ్లు ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. చలి కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో ఉదయం పూట ఈ వారం పొడవునా తేలికపాటి పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది. జనవరి 9న తేలికపాటి వర్షం లేదా చినుకులు పడవచ్చు. ఢిల్లీలో శీతాకాల సెలవులను జనవరి 12 వరకు పొడిగించారు. అయితే ఇది ఐదవ తరగతిలోపు విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. 6 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల తరువాతనే వీరికి తరగతులు నిర్వహిస్తారు. ఢిల్లీలో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 18.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది శనివారం కంటే మూడు డిగ్రీలు తక్కువ. కనిష్ట ఉష్ణోగ్రత 8.2 డిగ్రీలుగా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత తగ్గడం వల్ల వాయు కాలుష్యం తీవ్రమయ్యింది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 333గా ఉంది. జమ్మూ డివిజన్లో దట్టమైన పొగమంచు కారణంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. 11 విమానాలు ఆలస్యంగా నడిచాయి. -
ఢిల్లీ స్కూళ్లకు మరో 5 రోజులు సెలవులు
న్యూఢిల్లీ: ఢిల్లీలో చలి తీవ్రత పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలకు ఈ నెల 12వ తేదీ వరకు సెలవులను పొడిగించింది. ఢిల్లీలో పాఠశాలలకు సోమవారంతో శీతాకాల సెలవులు ముగియాల్సి ఉంది. ‘ఢిల్లీలో చలి వాతావరణ పరిస్థితులు కొనసాగుతుండటంతో నర్సరీ నుంచి అయిదో తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను మరో అయిదు రోజుల పాటు మూసి ఉంచాలని నిర్ణయించాం’అని విద్యాశాఖ మంత్రి అతిషి ఆదివారం ‘ఎక్స్’లో తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తమ విద్యార్థుల కోసం ఆన్లైన్ తరగతులు నిర్వహించుకోవచ్చని తెలుపుతూ విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసింది. 6 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం ఉదయం 8 గంటలు–సాయంత్రం 5 గంటల మధ్యలోనే తరగతులు నడపాలని కోరింది. -
ఇలా సెలవులిచ్చారు.. అలా క్యాన్సిల్ చేశారు!
దేశ రాజధాని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం బుధవారం వరకు పాఠశాలలకు సెలవులు పొడిగిస్తూ జారీ చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంది. సెలవులు పొడిగిస్తూ సర్క్యులర్ జారీ చేసిన గంటలోపే విద్యాశాఖ డైరెక్టరేట్ ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. సెలవు పొడిగింపుపై తగిన నిర్ణయం తీసుకున్న తర్వాత ఢిల్లీ ప్రభుత్వ విద్యా డైరెక్టరేట్ కొత్తగా మళ్లీ సర్క్యులర్ జారీ చేయనుంది. దేశ రాజధాని ఢిల్లీలో చలిగాలులు, పొగమంచు కారణంగా అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలకు సెలవులు పొడిగించారు. జనవరి 10 వరకు పాఠశాలలు మూసివేయాలని విద్యాశాఖ డైరెక్టరేట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే పొరపాటుగా సెలవుల ఉత్తర్వు జారీ అయ్యిందని విద్యా శాఖ పేర్కొంది. సెలవుల పొడిగింపుపై ఆదివారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో విపరీతమైన చలిగాలుల వీస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. పగటిపూట సూర్యకాంతి చాలా తక్కువగా ఉంటోంది. దట్టమైన పొగమంచు కారణంగా, విమానాలు, రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అటువంటి పరిస్థితిలో విద్యార్థులకు పిల్లలకు ఉపశమనం కలిగించేందుకు శీతాకాలపు సెలవులను పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. -
‘సూరీడు కనిపించి ఏడురోజులైంది’
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌వాసులను గత వారం రోజులుగా ఎముకలు కొరికే చలి గజగజ వణికిస్తోంది. ఈ ప్రాంతంలో ‘సూరీడు కనిపించి ఏడురోజులైంది’ అని స్థానికులు చెబుతున్నారు. పొద్దస్తమానం ఉండే చలి కారణంగా జనజీవనం స్తంభించింది. చలి నుంచి రక్షించుకునేందుకు స్థానికులు రగ్గుల కింద తలదాచుకుంటున్నారు. ఈ పరిస్థితులను గమనించిన జిల్లా యంత్రాంగం గ్వాలియర్‌లో జనవరి 6న అన్ని ప్రీ-ప్రైమరీ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. చలి తీవ్రత కారణంగా ప్రీ ప్రైమరీ నుంచి ఐదో తరగతి వరకు నడుస్తున్న అన్ని పాఠశాలలకు జనవరి 6వ తేదీ శనివారం సెలవు ప్రకటించినట్లు గ్వాలియర్ కలెక్టర్ అక్షయ్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆరు నుంచి 12వ తరగతి వరకు అన్ని క్లాసులను మునుపటిలానే నిర్వహిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్వాలియర్‌లో గత వారం రోజులుగా చలి తీవ్రత అధికంగా ఉంది. జనవరి 2 నుండి రాత్రి ఉష్ణోగ్రతలు 9 నుండి 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. వాతావరణశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గ్వాలియర్ ప్రజలు సూర్యుడిని చూసేందుకు మరో రెండు మూడు రోజులు వేచి చూడాల్సివుంటుంది. ప్రస్తుతం జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండనుంది. ఒకటి రెండు రోజుల్లో చినుకులు కూడా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. గ్వాలియర్-చంబల్‌లో దట్టమైన పొగమంచు ఏర్పడుతోంది. -
రాగల రెండు రోజుల్లో చలి మరింత తీవ్రం!
ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రత రెండు నుండి 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో చలి మరింత తీవ్రమయ్యింది. గంగాతీరంలోని మైదాన ప్రాంతాలలో దట్టమైన పొగమంచు ఏర్పడుతోంది. దీని కారణంగా రైళ్లు, రహదారి రవాణాకు తీవ్ర ఆటంటాలు ఎదురువుతున్నాయి. హర్యానా, రాజస్థాన్, పంజాబ్లలోని చాలాచోట్ల చలి విపరీతంగా ఉన్నదని ఢిల్లీ, ఉత్తర మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఇటుంటి పరిస్థితులే ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 10 నుంచి 18 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యింది. హర్యానాలోని అంబాలాలో గరిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. ఇది సాధారణం కంటే 7.5 డిగ్రీలు తక్కువ. పంజాబ్‌లోని పాటియాలాలో ఉష్ణోగ్రత 11.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది ఈ సీజన్లో సగటు కంటే 7.5 డిగ్రీల సెల్సియస్ తక్కువ. రాజస్థాన్‌లోని సికార్‌లో ఉష్ణోగ్రత 12.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఇది ఈ సీజన్లో సాధారణం కంటే 10 డిగ్రీలు తక్కువ. మధ్యప్రదేశ్‌లోని గుణాలో గరిష్ట ఉష్ణోగ్రత 13.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 10 డిగ్రీలు తక్కువ. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని, ఫలితంగా చలి మరింత తీవ్రం అవుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. -
న్యూఇయర్ వేళ ఈ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్!
ఢిల్లీ: దేశ రాజధానిలో న్యూఇయర్ దట్టమైన పొగమంచు, తీవ్రమైన చలితో ప్రారంభం కానుంది. 2024 న్యూఇయర్ నాడు ఢిల్లీ సహా పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాలపై ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా జనవరి 1న రాజస్థాన్, బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. దట్టమైన పొగమంచు, అతి శీతల పరిస్థితులపై వాతావరణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరభారతంలో చలి తీవ్రత 9 డిగ్రీల సెల్సియస్ నుంచి 6 డిగ్రీల వరకు పడిపోయే అవకాశాలు ఉంటాయని వెల్లడించింది. పంజాబ్‌లోని అమృత్సర్, ఫతేఘర్ సాహిబ్, గురుదాస్‌పూర్, హోషియార్పూర్, జలంధర్, కపుర్తలా, లూథియానా, పఠాన్‌కోట్, పాటియాలా, రూప్‌నగర్, తరణ్ జిల్లాల్లో దట్టమైన పొగమంచుతో కూడిన చల్లని వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇదీ చదవండి: రామ మందిర విరాళాల పేరిట నకిలీ క్యూఆర్ కోడ్.. వీహెచ్‌పీ అలర్ట్ -
ఉత్తరాదిని ‘కమ్ముకున్న పొగమంచు’
సాక్షి, న్యూఢిల్లీ: చలి పులికి ఉత్తరాది రాష్ట్రాలు గజగజ వణుకుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లో మంచుతెరలు దట్టంగా పరుచుకున్నాయి. ఢిల్లీసహా ఆరు రాష్ట్రాల విమానాశ్రయాల్లో సోమవారం ఉదయం పొగమంచు తీవ్రతంగా ఉండటంతో రన్‌వే కూడా కనిపించని పరిస్తితి ఏర్పడింది. దీంతో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఏర్పడటంతో పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. సోమవారం ఉదయం ఢిల్లీ, అమృత్సర్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, గ్వాలియర్, జైసల్మేర్ విమానాశ్రయాల్లో జీరో విజిబిలిటీ నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. వచ్చే కొద్ది రోజులు చలి మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనావేసింది. ప్రతికూల వాతావరణ ప్రభావంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సోమవారం ఉదయం పొగమంచు కారణంగా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. ప్రాణం తీసిన పొగమంచు! బహ్రెయిచ్(యూపీ): దట్టంగా కమ్ముకున్న పొగమంచు ముగ్గురి ప్రాణాలు పోవడానికి కారణమైంది. సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్–బల్రామ్పూర్ రహదారిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మంచుదుప్పటి కప్పిన రోడ్డుపై వేగంగా వస్తున్న ట్రక్కును ప్రయాణికుల బస్సు ఢీకొట్టింది. డ్రైవర్లతో పాటు ఒక ప్రయాణికుడు మరణించాడు. 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. -
ఆ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు... తీవ్రమైన చలిగాలులు!
జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, బీహార్.. ఈ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు, తీవ్రమైన చలిగాలులు అలముకున్నాయి. గత కొద్ది రోజులుగా ఎత్తయిన ప్రాంతాల్లో మంచు కురుస్తుండటంతో మైదాన ప్రాంతాల్లోనూ చలిగాలులు తీవ్రమయ్యాయి. మరో రెండు మూడు రోజుల వరకు ఈ వాతావరణం నుంచి ఎలాంటి ఉపశమనం ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. గత రెండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో ఢిల్లీలోని పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దృశ్యమానత తక్కువగా ఉండటంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం పంజాబ్‌లోని అమృత్సర్, రాజస్థాన్‌లోని చురులో పొగమంచు కారణంగా విజిబులిటీ కనిష్టంగా ఉంది. జమ్మూ కశ్మీర్లో దట్టమైన పొగమంచు కొత్త సంవత్సరానికి స్వాగతం పలకనుంది. శ్రీనగర్‌లోని వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం 2024 జనవరి ఒకటి నుండి మూడు వరకు రాష్ట్రం మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల వర్షం, మంచు కురుస్తుంది. ప్రస్తుతం కశ్మీర్లో చలిగాలులు వీస్తుండటంతో చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా నమోదైంది. శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 2.1 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. పహల్గామ్లో మైనస్ 3.9 డిగ్రీల సెల్సియస్, గుల్మార్గ్లో మైనస్ 3.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లేహ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 7.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యం పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఆదివారం సాయంత్రం 4 గంటలకు 411గా నమోదైంది. ఇది తీవ్రమైన విభాగంలోకి వస్తుంది. శనివారం ఏక్యూఐ 450గా నమోదయ్యింది. ఇది కూడా చదవండి: ఇక్కడి ఆస్తులకు జియో ట్యాగింగ్ తప్పనిసరి! -
నీలగిరిలో మంచుదుప్పటి.. అలరిస్తున్న వీడియో!
ఢిల్లీతో సహా ఉత్తర భారతంలో విపరీతమైన చలి నెలకొంది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఈరోజు(ఆదివారం) మైనస్ రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పుడు దక్షిణ భారతంలోనూ ఇటువంటి వాతావరణం నెలకొంది. తమిళనాడులోని నీలగిరిలో ఈరోజు ఉదయం(ఆదివారం) ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు చేరుకుంది. ఈ విధమైన వాతావరణం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వార్తా సంస్థ ఏఎన్ఐ షేర్ చేసిన వీడియోలో నీలగిరిలో భూమిపై మంచు వ్యాపించడాన్ని చూడవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా జంతువులు కూడా ఇబ్బంది పడుతుండటాన్ని గమనించవచ్చు. అయితే ఇక్కడి వాతావరణాన్ని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఇదిలావుండగా గత కొన్ని రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వరదలు సంభవిస్తున్నాయి. గత రెండు రోజులుగా దక్షిణాది జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు, వరదల కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కూడా చదవండి: ఐదుగురు సీఈఓల అర్ధాంతర రాజీనామా.. 2023లో ఊహించని పరిణామం! #WATCH | Nilgiris, Tamil Nadu: A layer of frost covered the Thalaikundha area of Nilgiris after 0 degrees Celcius temperature was recorded this morning. pic.twitter.com/Z43LzgaGvb — ANI (@ANI) December 24, 2023 -
చలి పెరిగింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. ప్రస్తుతం నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి అత్యంత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు నెలకొన్నాయి. దీంతో క్రమంగా తగ్గుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు మరింత పడిపోయాయి. ఉష్ణోగ్రతల పతనానికి తో డుగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత కుమ్రుంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో 6.8 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. అంతటా తగ్గుదలే... రాష్ట్ర మంతటా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్. కానీ ప్రస్తుతం సగటు కనిష్ట ఉష్ణోగ్రత 12.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల వారీగా పరిశీలిస్తే మెదక్, హన్మకొండలో సాధారణం కంటే 4 డిగ్రీల మేర తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, నల్లగొండ, రామగుండంలో, అదిలాబాద్ కనిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర తక్కువగా, ఇతర ప్రాంతాల్లో 2 డిగ్రీల మేర తక్కువగా నమోదై నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంకో రెండు రోజులు ఇలానే రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 30డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 9.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. -
చింతపల్లిని వణికిస్తున్న చలిపులి
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): జిల్లాలోని ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకులోయ, చింతపల్లిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 7 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 8.3 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రోజుల వ్యవధిలోనే భారీగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో గిరిజనులు వణికిపోయారు. పాడేరు మండలం మినుములూరులో 11డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ అంతటా పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 10 గంటలకు కూడా మంచు తెరలు అలుముకుంటున్నాయి. చింతపల్లితో పాటు లంబసింగి, గూడెంకొత్తవీధి ప్రాంతాల్లో ప్రయాణికులు కూడా చలి తీవ్రతకు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. -
ఇలా చేస్తే..కేవలం 24 గంటల్లో జలుబును తగ్గించుకోవచ్చు
జలుబు వచ్చిందంటే ఓ పట్టాన వదలదు. ఇప్పటివరకు జలుబును తగ్గించేందుకు ఎలాంటి ఇన్స్టంట్ మెడిసిన్స్ లేవు. కొందరికి వారం రోజుల్లో తగ్గితే, మరికొందరికి నెల రోజులైనా తగ్గదు. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. పెద్దలకు ఏడాదిలో మూడు సార్లు, చిన్నపిల్లలకు అయితే ఏడాదిలో పది లేదా అంతకంటే ఎక్కువ సార్లు జలుబుతో బాధపడుతుంటారని ఓ అధ్యయనంలోవెల్లడైంది. ఎలాంటి మెడిసిన్స్ వాడకుండానే ఇంట్లోనే దొరికే వస్తువులతో కేవలం 24 గంటల్లో జలుబుకు చెక్ పెట్టొచ్చు ఇలా.. ►ఏ కాలంలో అయినా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చాలామంది చలికాలంలో సరిగా నీళ్లు తాగరు. ఇలా అస్సలు చేయకూడదు. జలుబు చేసినప్పుడు తేనెతో కలిపిన నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ► వేడి నీటిలో లేదా పాలలో ఒక టీ స్పూన్ పసుపు కలపి తాగండి. దీని వల్ల జలుబు, దగ్గు నుంచి మీకు ఉపశనం కలుగుతుంది. పసుపులో ఆంటీ బాక్టీరియల్ గుణాలు జలుబు, దగ్గు నుంచి కోలుకోవడంలో ఉపయోగపడతాయి. ► తేనె, నిమ్మరసం వాడటం వల్ల జలుబు, దగ్గు నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఒక చెంచాడు నిమ్మరసం, రెండు చెంచాల తేనెను వేడి నీళ్లు లేదా వేడి పాలలో కలిపి తాగండి. ► అల్లం టీ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. జలుబు, దగ్గు ఉన్న సమయంలో మీరు అల్లం టీ తాగితే రిలీఫ్ గా ఉంటుంది. దీని కోసం మీరు చేయాల్సిందల్లా కొన్ని అల్లం ముక్కలు తీసుకోని వాటిని నీటిలో లేదా పాలలో కలిపండి. తరువాత దాన్ని బాగా మరిగించి తాగండి. ► ఒక గ్లాసు నీళ్లలో పావు స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఉప్పు కలిపిన నీళ్లతో బాగా పుక్కిలిస్తే గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. జింక్ లాజెంజెస్ అనే పెప్పర్మెంట్స్ మార్కెట్లో దొరుకుతాయి. ఇవి జలుబును చాలా త్వరగా తగ్గించగలవు. ఇందులో బెర్రీ, లెమన్.. ఇలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అయితే మీరు యాంటీబయాటిక్స్ వాడితే మాత్రం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించి వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. గుమ్మడి గింజలు, పప్పు ధాన్యాలు, బాదం, చేపలు వంటి వాటిల్లోనూ జింక్ అధికంగా ఉంటుంది. జలుబులో వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. ► బీట్రూట్ జ్యూస్‌లో డైటరీ నైట్రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరపు నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాకుండా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. జలుబుతో బాధపడుతున్న 76మందిలో.. రోజుకు ఏడు కంటే ఎక్కువసార్లు బీట్రూట్ తాగిన వారిలో జలుబు లక్షణాలు తగ్గినట్లు ఓ అధ్యయనంలో తేలింది. ► టాబ్లెట్లల కంటే నాజిల్ స్ప్రేలు మెరుగ్గా పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి జలుబు తాలూకూ బాక్టీరియాను చంపి ఇన్స్టంట్ రిలీఫ్ ఇవ్వగలదు. వీటితో పాటు జలుబు అటాక్ అయినప్పుడు సాధ్యమైనంత వరకు గోరువెచ్చని నీళ్లే తాగితే బెటర్. ఇక అన్నింటి కంటే ముఖ్యమైనది విశ్రాంతి. ట్యబ్లెట్స్ వేసుకున్నా, హోమ్ రెమిడీలు ట్రై చేసినా సరైన విశ్రాంతి తీసుకున్నప్పుడే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. -
ప్లాస్టిక్ మంచిదికాదని స్టీల్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారా?
ఇటీవల కాలంలో ప్లాస్టిక్ బాటిల్స్ మంచిదికాదని స్టీల్ లేదా రాగి వాటర్ బాటిల్స్ వాడుతున్నారు. ఈ ప్లాస్టిక్ బాటిల్స్‌లో వాటర్ ఉంటే ఒక రకమైన వాసన రావడమే గాక ఆరోగ్యానికి పర్యావరణానికి మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరించడంతో విరివిగా మార్కెట్లోకి వస్తున్న స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ వాడుతున్నారు చాలామంది. ఇలాంటి పునర్వినియోగ వాటర్ బాటిల్స్‌ని ఉపయోగించేటప్పుడ తగు జాగ్రత్తుల తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడటం ఖాయం. అందుకు నెట్టింట వైరల్ అవుతున్న.. యూఎస్ఏకి చెందిన మహిళ ఉదంతమే ఉదహారణ. ఆమె ఈ పునర్వినియోగ వాటర్ బాటిల్స్‌తో ఎలా అనారోగ్యం పాలైందో టిక్‌టాక్‌లో వివరించింది. మీరు కూడా ఆమెలానే చేస్తున్నట్లయితే అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకన్నట్లే అవుతుంది. అందువల్ల ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో సదరు మహిళ.. ఇలాంటి పునర్వినయోగ స్టెయిన్ లెస్ బాటిల్స్‌నే తాను వాడుతున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే తనకు ఒక రోజు ఉన్నట్లు జలుబు చేసిందిని, తర్వాత ట్యాబ్లెట్లు వేసుకున్నాక తగ్గింది మళ్లీ రెండు రోజులకే జలుబు, దగ్గు రెండు విపరీతంగా వచ్చాయి. దీంతో డాక్టర్లను సంప్రదించి యాంటీబయోటిక్ మందులు వాడింది. త్వరితగతినే కోలుకుంది కూడా. అయితే మళ్లీ వారం రోజులకే మళ్లీ సైనస్ వంటి లక్షణాలతో జలబు రావడం జరిగింది. తనకు జలుబు చేయడం అన్నదే చాలా అరుదు అలాంటిది ఇలా తరచుగా ఒక నెలలోనే రెండు మూడు సార్లు జలుబున బారిన పడుతున్నానేంటీ ఏమైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నాయా అని భయపడింది. దీంతో సమస్య ఎక్కడ ఉందా అని చెక్చేసుకుంది. వ్యక్తిగత పరిశుభ్రత దగ్గర నుంచి తీసుకునే ఆహార పదార్థల వరకు ఎక్కడ తలెత్తుంది ఈ సమస్య, దేనివల్ల తనకు ఇలా అయ్యిందని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించగా..తాగే వాటర్ సురక్షితంగా ఉందా లేదా అన్న ఆలోచన తట్టింది. వెంటనే బాటిల్స్ అన్ని చెక్‌చేయగా ఆమె తాగే వాటర్ బాటిల్ అడుగున నాచులా ఆకుపచ్చిన బూజు(శిలింధ్రం) ఉండటం చూసి అవాక్కయ్యింది. అన్ని శుభ్రంగా ఉంచే నేను బాటిల్స్ మాత్ర అస్సలు క్లీన్ చేయడం లేదని తెలిసింది. బహుశా దీని వల్ల ఇన్నిసార్లు జలుబు బారిన పడ్డానని అర్థమయ్యే తక్షణమే వాటిని క్లీన్ చేసినట్లు వివరించింది. ఈ విషయాన్నే వైద్యులకు తెలపగా, వారు కూడా ఇలాంటి ఆకుపచ్చ నాచు కారణంగా ఫుడ్ పాయిజినింగ్, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటి పలు రకాల ఇన్పెక్షన్లు వస్తాయని చెప్పారు. తాగే నీరు, తీసుకునే ఆహారం విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలని సూచించారని పేర్కొంది. ఈ స్టీల్ బాటిల్స్ పర్యావరణానికి హితమైనప్పటికీ వాడేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోండి లేదంటే తనలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవల్సి వస్తుందని చెబుతోంది సదరు మహిళ. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.. ఏ బాటిల్ అయినా దానిలో వాటర్ అలానే ఉండిపోతే కచ్చితంగా కింద బాటిట్ అడుగుభాగన జిగురులాంటి సిలికాన్ మాదిరి పదార్థం ఏర్పడుతుంది. కొద్దిరోజులక ఆకుపచ్చని బూజులాంటి శిలిధ్రం ఫామ్ అయ్యిపోతుంది. మనం అందులో ఉన్న నీటిని అలాగే తాగితే ముందుగా గొంతునొప్పి, జలుబు వంటి అనారోగ్యాల బారిన పడతాం. తరుచుగా జలుబుతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. బాటిల్స్‌ని కనీసం మూడు లేదా ఐదు రోజుల కొకసారి వేడినీటితో క్లీన్ చేసుకోవాలి లోపల జిగురు వంటి సిలాకాన్లాంటి పదార్థం రాకుండా మార్కెట్లో దొరికే బ్రెష్‌తో క్లన్ చేసుకోవాలి. తాగే బాటిల్ బాగుందో లేదో కూడా చెక్‌చేసుకుని తాగండి ఏ బాటిల్లోనైన నీరు నిశ్చలంగా మూడు నుంచి నాలుగు రోజులు ఉండిపోతే ఒక విధమైన వాసన వస్తుంది. ఇలాంటి వాటర్ అత్యంత ప్రమాదకరం. సాధ్యమైనంత వరకు బాటిల్లో ఎక్కువకాలం నిల్వ ఉండే వాటర్‌ని తాగొద్దు, వాటిని ఎప్పిటికప్పుడూ లేదా కనీసం మూడు నుంచి నాలుగురోజుల కొకసారి క్లీన్ చేసుకుని తాగేందుకు యత్నించండి. (చదవండి: బరువు తగ్గడంలో పనీర్ హెల్ప్ అవుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..?) -
ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన చలి తీవ్రత.. వణుకుతున్న మన్యం జిల్లాలు..ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన చలి తీవ్రత.. వణుకుతున్న మన్యం జిల్లాలు
-
రాష్ట్రం గజగజ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చలి పెరుగుతోంది. అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు గజగజ వణుకుతున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఉత్తరాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఈసారి ఉత్తరాంధ్రతోపాటు అన్ని జిల్లాల్లోనూ 2 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలుచోట్ల 9 నుంచి 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కుంతలంలో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ ఇంకా తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అరకు ఏజెన్సీలో ఈ నెలాఖరుకు ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గుతాయని, జనవరి మొదటి, రెండు వారాల్లో 4 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గుతాయని, దీనివల్ల చలి తీవ్రత ఇంకా పెరిగే పరిస్థితి ఉందని చెబుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సైతం తక్కువగానే... రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు తగ్గాయి. సాధారణంగా ఈ సమయంలో 26 నుంచి 28 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు ఉండాలి. ఇప్పుడు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గాయి. ఉపరితల ఆవర్తనాల వల్ల చలి ప్రభావం ఇంకా పెరుగుతోంది. లక్షద్వీప్, తమిళనాడుతోపాటు అరేబియా సముద్రంలో ఆవర్తనాల వల్ల దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ఈ ఆవర్తనాల ప్రభావంతో కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని, రాయలసీమలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వర్షాల వల్ల రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని పేర్కొంటున్నారు. కాగా, ఈ నెలాఖరులో బంగాళాఖాతంలో తమిళనాడులోని మహాబలిపురం వద్ద తుపాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జనవరి 4వ తేదీన బంగాళాఖాతంలో మరో తుపానుకు అవకాశం ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. -
అమృత్‌సర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు.. ఎంతంటే..
దేశంలోని పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న హిమపాతం మైదాన ప్రాంతాల్లో చలి తీవ్రతను మరింత పెంచుతోంది. ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రతపెరిగింది. దీంతో పాటు పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కూడా ఏర్పడుతోంది. వాతావరణ శాఖ ‘ఎక్స్’ హ్యాండిల్లో అందించిన సమాచారం ప్రకారం హర్యానా, పంజాబ్, చండీగఢ్, అస్సాం, మేఘాలయలో రాబోయే ఐదు రోజుల పాటు ఉదయం దట్టమైన పొగమంచు ఏర్పడనుంది. డిసెంబర్ 21 వరకు ఇదేవిధమైన వాతావరణం ఉండనుంది. కాగా గత 24 గంటల్లో హర్యానా, పంజాబ్, చండీగఢ్, యూపీ, ఢిల్లీ, వాయువ్య రాజస్థాన్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బీహార్, మధ్యప్రదేశ్‌లలో ఐదు నుంచి 10 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2-3 రోజుల్లో ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. గత 24 గంటల్లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 3.6 డిగ్రీలుగా నమోదైంది. యూపీలోని బరేలీలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని రేవా, ఉమారియాల్లో 6.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలావుండగా గత 24 గంటల్లో దక్షిణ తమిళనాడులో 39 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్కాశి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ తమిళనాడులోని చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ బులెటిన్‌లో తెలిపింది. డిసెంబర్ 19న కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 7.1 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఈ సీజన్లో సగటు ఉష్ణోగ్రత కంటే ఒక డిగ్రీ తక్కువ. మంగళవారం పాక్షికంగా ఆకాశం మేఘావృతమై, పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా జమ్మూకశ్మీర్‌లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉత్తర కాశ్మీర్‌లోని గుల్మార్గ్లో మైనస్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది కూడా చదవండి: లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి రాహుల్, ప్రియాంక పోటీ? -
చెట్లపై మంచు ముత్యాలు.. వీధుల్లో చలిమంటలు!
ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ జిల్లాలో చలిగాలులు స్థానికులను గజగజా వణికిస్తున్నాయి. తీవ్రమైన చలికి తోడు విపరీతంగా మంచు కురుస్తుండటంతో మొక్కలు, చెట్లు మంచుతో నిండిపోతున్నాయి. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. చలి తీవ్రత దృష్ట్యా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సామాన్యుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ కూడళ్లు, జనావాసాల వద్ద చలి మంటలు వెలిగించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కుందన్‌కుమార్ జిల్లా మున్సిపల్ ముఖ్య అధికారులు, జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారులను ఆదేశించారు. గత కొన్ని రోజులుగా అంబికాపూర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు నిరంతరం పడిపోవడానికితోడు, చలిగాలులు చుట్టుముడుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టర్ అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. చలి మంటలు వేసేందుకు కలప వినియోగాన్ని తగ్గించాలని, పేడ పిడకలను ఉపయోగించాలని సూచించారు. చలిగాలుల విజృంభిస్తున్న దృష్ట్యా ప్రజలు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని కోరారు. అవసరమైన సందర్భంలో వైద్యులను సంప్రదించాలని సలహా ఇచ్చారు. ఇది కూడా చదవండి: 2023.. భారత్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాలివే.. -
శీతోష్ణస్నానం
వసంతకాలమే ఋతువుల రాణి అనుకుంటాం కానీ, హిమానీ నిబిడ హేమంతమూ, చలి వణి కించే శిశిరకాలం మాత్రం ఏం తక్కువ? ఆమాటకొస్తే ఏ ఋతువుకా ఋతువు జీవజాలాన్ని ఏకచ్ఛత్రంగా శాసించే మహరాణియే! మహరాణి అన్నప్పుడు ఆగ్రహానుగ్రహాలు సమపాళ్లలో ఉండకతప్పదు. అసలు మనం అల్లుకునే ఊహలు, కల్పించుకునే భావనలు, సృష్టించుకునే మాటల ఇరుకులో మనమే ఎలా బందీలమవుతామంటే; చన్నీళ్ళ, వేణ్ణీళ్ళ స్నానాలూ; పర్వదినాల్లో నదీ, సముద్రస్నానాలే తప్ప ఏటేటా నిండా మునిగే ఋతుస్నానాలు మనకు స్ఫురించవు. జ్యేష్ఠ – ఆషాఢమాసాల మహోష్ణంలోనూ, శ్రావణ – భాద్రపదాల కుంభవృష్టుల్లోనూ స్నానించినట్టే మార్గ శిర – పుష్యమాసాల్లో నిలువునా కోతపెట్టే శీతలస్నానాలే మనకు రాసిపెట్టి ఉంటాయి. ఇది ఋతు వుల రాణి ఆగ్రహపార్శ్వమైతే; హేమంత – శిశిరాలలో మిట్టమధ్యాహ్నం వేళ ఆరుబయటికో, డాబా మీదికో తరిమి శీతోష్ణస్నానంతో హాయిగొలపడం అనుగ్రహపార్శ్వం. హేమంతం కలిగించే ఆ హాయి ఇంకా ఎన్నెన్ని విధాలుగా ఉంటుందంటే, భక్త పోతన అంతటి వాడిలో కూడా అది రక్తిని రంగరించి రసికతను రాశిపోస్తుంది. శ్రీమంతమైన హేమంతం ప్రవేశించేసరికి చేమంతులు ధరించిన పూబంతుల కౌగిలిలో ఎందరో చలి భయాన్ని జయించారు కానీ; విరహులకు ఆ యోగం లేకుండా మన్మథుడు వేధించాడట. ఉత్తరపు గాలి అదే పనిగా విసురుతూ చీకాకు పెట్టే హేమంతరాత్రులలో మంచుకిరణాల రేరాజు మహాశత్రువయ్యాడట. ఎడమొహం, పెడమొహంగా ఉన్న దంపతులు కూడా రాజీపడిపోయి జంటగా చలిని జయించడానికి సిద్ధమ య్యారట. పగటి సమయం తగ్గి, అగ్ని ఆప్తమిత్రుడైపోయాడట. అతి శీతల దీర్ఘరాత్రుల పాలబడి లోకమంతా గడగడా వణికిపోయిందట. హిమం తాకిడికి కమలాలు బెదిరి తరిగి పోయాయట. ఆదికవి వాల్మీకి హేమంత చిత్రణలూ హృద్యంగా ఉంటాయి. పృథివి విరగబండుతుంది కానీ మంచు కసిపట్టినట్టు మనుషుల్ని కాల్చుకుతింటుంది. నీరూ, నీడా దుస్సహమవుతాయి. మధ్యా హ్నాలు సుఖసంచార సమయాలవుతాయి. సూర్యుడు దూరంగా జరిగిపోవడం వల్ల హిమాల యాలు మంచుతో పూర్తిగా గడ్డకట్టి సార్థకనామలవుతాయి. ఆకాశం కప్పు కింద నిద్రించడం మాని అందరూ ఇంటికప్పు కింద ముడుచుకుంటారు. సమస్త జనాన్ని ఇళ్ళల్లో బంధింపజేయగలిగిన హేమంత రుతురాజు యశస్సు దిక్కులను ఆవరించిందా అన్నట్టుగా మంచు సర్వత్రా కమ్ముకుందని మరో కవి వర్ణిస్తాడు. శీతఘాతానికి అన్ని జీవులూ సొమ్మసిల్లినా తను మాత్రం అచలంగాఉండి అందగించే భూదేవిని మెచ్చి ఆ హేమంత ప్రభువే వజ్రాలు కానుక చేశాడా అన్నట్టుగా ప్రాతర్వేళల లేత పచ్చికలపై మంచుబిందువులు రహించాయని ఇంకో కవి అభివర్ణన. నిత్యనూతనమవుతూ, ఆదికవి నుంచి ఆధునిక కవి వరకు ఋతుచక్రం ఒక్కలానే తిరుగుతూ ఉంటుంది. ‘ఇవాళలాగే ఎప్పుడు కూడా ఇనబింబం పయనించు నింగిపై; ఎప్పుడు కూడా ఇవాళ లాగే గాలులు వీచును, పూవులు పూచును’ అంటూ శిశువులకు హామీపత్రం రాసిస్తాడు మహాకవి. ‘రాత్రంతా మంచుముక్కలా బిగుసుకున్న ఆకాశంలో కదల్లేని నక్షత్రాలు వెండి తెరల కాంతిలోంచి జారుకుంటూ గడ్డిపరకలపై కన్ను తెరిచే’ దృశ్యమూ; ఉదయం తొడుక్కున్న చలివస్త్రంలోంచి చెట్లు చల్లని పచ్చసిరాతో జీవితం కాగితమ్మీద కొత్త సంతకాలు చేయడ’మూ (బి.వి.వి. ప్రసాద్) నేటి కవి దృష్టినీ సమానంగా ఆకర్షిస్తాయి. అలాంటిదే, ‘పటిక ముక్కల్లాంటి మంచుబిందువుల శీతాకాలంలో చెరువు తేటపడడమూ, అప్పుడే అడవి, ఆకాశం, చెరువు ఒకదాని సౌందర్యాన్ని ఒకటి ఆస్వా దించడమూ’ (కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ) కూడా! సంగీతాన్ని వాయుశిల్పంలా దర్శించిన మరో కవి (పసునూరు శ్రీధర్ బాబు) స్వనస్నానమాచరించి శీతాకాలపు గదిలో చుబుకంకింద వణికే పిడికెళ్లేసుకుని ఓ మూల ముడుచుక్కూచోవలసిందేనంటాడు. ఏ ఋతువూ మరో ఋతువులా ఉండదు; ఒక ఋతువులోంచి మరో ఋతువులోకి మారి పోయే మన అనుభవమూ, అనుభూతీ ఒక్కలా ఉండవు. ప్రతి ఋతువులోనూ మనం పునర్జ న్మిస్తాం. ప్రతి ఋతువూ మనకు శైశవం నుంచి వార్ధక్యం వరకూ అన్ని దశలనూ చవిచూపి మరీ నిష్క్రమిస్తుంది. ప్రతి ఋతువులోకీ ఒక శిశువుగా కళ్ళు తెరుస్తాం. ఏటా పునర్జీవించే ఈ ఋత జన్మలను గణించకుండా ఒక్క జన్మనే ఊహించుకోవడం కూడా మనకు మనం విధించుకునే అజ్ఞానమే. అసలు జీవితమంటేనే ఋతువుల మధ్య నిరంతర సంచారం. సందర్భం వేరైనా మరో కవి(సిద్ధార్థ) అన్నట్టు, ఒక ఋతువులోంచి ఇంకొక ఋతువులోకి ‘అందరూ ఎవరికివారే కొత్తగా పుట్టి నడచుకుంటూ వెళ్లిపోతారు’. ఋతువులు, మాసాలు, సంవత్సరాలతో మన కేలండర్ మనకున్నట్టే ఈ విశ్వానికీ, అందు లోని ఈ భూగోళానికీ, అందులో మనం కూడా భాగమైన ప్రకృతికీ తనదైన కేలండర్ ఉంది.వందల కోట్ల సంవత్సరాల అస్తిత్వంలో భూమి ఎన్నో హిమప్రళయాలను చూసింది. వాటిలో చివరిదైన మంచుయుగం ఇరవయ్యారు లక్షల సంవత్సరాల క్రితం మొదలై పదకొండు వేలసంవత్సరాల క్రితం వరకూ కొనసాగింది. ఇప్పుడు మనం జీవిస్తున్న కాలాన్ని కూడా మంచు యుగపు అంతర్దశగానే చెబుతారు. శీతోష్ణాల నిరంతర సంఘర్షణ నుంచే జీవం పుట్టి నేటి రక రకాల రూపాల్లోకి పరివర్తన చెందింది. ఆ వైశ్విక ఋతుభ్రమణం మన చేతుల్లో లేనిది కనుక దాని నలా ఉంచితే; మనకు తెలిసిన, మనం ప్రత్యక్షంగా భాగమైన ఋతుభ్రమణాన్ని మన చేతులారా గతి తప్పించకుండా చూసుకోవలసిన బాధ్యత మనదే! -
ఢిల్లీని కబళించిన చలి పులి.. పొగమంచుతో తగ్గిన విజిబులిటీ!
దేశ రాజధాని ఢిల్లీలో నేడు (ఆదివారం) చలి మరింత పెరిగింది. పొగమంచు కారణంగా విజిబులిటీ మరింత తగ్గింది. ఇటువంటి వాతావరణంలో రోడ్డు రవాణా, రైలు రవాణా, విమానాల రాకపోకలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్వాసులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 6.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. ఇది సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా ఉంది. శనివారం 5.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవగా, ఇది సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువ. మరోవైపు ఆదివారం ఉదయం 8.30 గంటలకు సఫ్దర్జంగ్లో 700 మీటర్ల విజిబిలిటీ లెవల్ మాత్రమే ఉంది. పాలెంలో ఇది 800 మీటర్లుగా ఉంది. ఆదివారం ఆకాశం నిర్మలంగా ఉంటుందని, కాస్త ఎండగా ఉండే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 24 నుండి 25 డిగ్రీలు మధ్య ఉండవచ్చు. వారమంతా ఇదే వాతావరణం కొనసాగనుంది. ఈ వారంలో ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఇది కూడా చదవండి: ‘రాత్రుళ్లు ఎవరూ బయట నిద్రించకుండా చూడండి’ -
రానున్న మూడ్రోజులు గజ గజే..
సాక్షి, హైదరాబాద్: చలి తీవ్రత రాష్ట్రంలో క్రమక్రమంగా పెరుగుతోంది. చాలాచోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. చలికాలం మధ్యస్థానికి చేరడంతో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముంది. రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. గురువారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 12.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. నల్లగొండ, హైదరాబాద్, వరంగల్, మెదక్‌లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యాయి. -
ఢిల్లీలో చలి విజృంభణ.. కశ్మీర్లో జీరోకు దిగువన ఉష్ణోగ్రతలు!
దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండటంతో చలి మరింతగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో పలు రాష్ట్రాల్లో విరివిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇంతేకాదు డిసెంబర్ 12 నుండి పశ్చిమ బెంగాల్, సిక్కింలోని వివిధ ప్రాంతాలలో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ)హెచ్చరిక జారీ చేసింది. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఢిల్లీ-ఎన్సీఆర్ వాతావరణ స్థితిగతుల విషయానికి వస్తే ఉష్ణోగ్రతలో నిరంతరం క్షీణత కనిపిస్తోంది. ఆదివారం (డిసెంబర్ 10) రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రత 8.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఈ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతాయని, ఉదయం పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలియజేసింది. సోమవారం (డిసెంబర్ 11) గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత పేలవమైన విభాగంలోనే కొనసాగుతోంది. అంతే కాదు రాబోయే మూడు రోజుల్లో రాజధానిలో కాలుష్య సమస్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. కాగా డిసెంబరు 11న పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని చోట్ల, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జమ్మూకశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 4.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బారాముల్లా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లో ఉష్ణోగ్రతలు మైనస్ 4.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: ఈ మూడు కారణాలే బాబాను సీఎం రేసు నుంచి తప్పించాయా? -
నేడు, రేపు అక్కడక్కడా తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బుధ, గురువారాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో మార్పులతో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ స్థితిలోనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంది. మంగళవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 33.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 18.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. బుధ, గురు వారాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయంది. గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. -
ఒకవైపు కాలుష్యం.. మరోవైపు వణికిస్తున్న చలి!
దేశ రాజధాని ఢిల్లీలో ప్రజల ఊపిరి పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి దిశలో మార్పు, వేగం తగ్గడం వల్ల ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మళ్లీ తీవ్ర వర్గానికి చేరుకుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీసీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం జహంగీర్‌పురిలో 434, బవానాలో 441, ద్వారకలో 412, బురారీలో 441, ఆనంద్ విహార్‌లో 387, అశోక్ విహార్‌లో 386గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) నమోదైంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పొగమంచు కమ్మేయడంతో పాటు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. పర్వతాలపై మంచు కురుస్తుండటంతో మైదాన ప్రాంతాల్లో చలి పెరుగుతోంది. సాయంత్రం వేళల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఫలితంగా ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా 10.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సగటు గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదైంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదైంది. ఇదిలా ఉండగా వాయు కాలుష్య నియంత్రణకు అనుసరిస్తున్న విధానం తదుపరి దశకు చేరుకుంది. దీంతో రాజధానిలో జీఎన్జీ, బీఎస్4 డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులు మినహా ఇతర బస్సుల ప్రవేశాన్ని నిషేధించనున్నారు. టూరిస్ట్ బస్సులు, కాంట్రాక్ట్ బస్సులు, రాష్ట్ర రవాణా బస్సులు, డీజిల్ బస్సులు మినహా ఇతర రాష్ట్రాల్లోని అన్ని రకాల పర్మిట్లు కలిగిన బస్సులు ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని నిషేధించనున్నట్లు ఒక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: నేపాల్‌లో మరోమారు భూకంపం.. 4.5 తీవ్రత నమోదు! -
ఆదిలాబాద్ @ 16.7
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతోనే చలి తీవ్రత మొదలవుతుంది. కానీ ఈసారి ఈశాన్య రుతుపవనాల రాక ఆలస్యం కావడం... వాతావరణంలో నెలకొన్న మార్పులతో కొంత కాలంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతూ వచ్చాయి. మధ్యలో రెండు మూడురోజులు చలి పెరిగినా తర్వాత పెరిగిన ఉష్ణోగ్రతలు ఇప్పుడు క్షీణించడం ప్రారంభించాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతుండడం, రాష్ట్రానికి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తుండడంతో చలి పెరుగుతోంది. మరో మూడురోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బుధవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఖమ్మంలో 34 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదిలాబాద్‌లో 16.7 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌తో పాటు మెదక్, నల్లగొండల్లో చలి పెరిగింది. రానున్న మూడురోజులు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఆ తర్వాత మరింత తగ్గుతాయని చెబుతున్నారు. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది ఇదే సమయంలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ప్రస్తుతం సాధారణ స్థితిలోనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
మీ బుజ్జాయికి జలుబు చేసిందా? ఇలా చేస్తే వెంటనే తగ్గుతుంది
అప్పటివరకూ ఎక్కడ ఉంటుందో తెలియదు కాని సీజన్ మారగానే ఒక్కసారిగా వచ్చి పట్టేస్తుంది జలుబు. పెద్దవాళ్లయితే ఏదో విధంగా తట్టుకుంటారు కాని పిల్లలు నీరసించిపోతారు. ఒకరి నుంచి ఒకరికి వెంటనే వ్యాపించే ఈ జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్ నివారణకు చిట్కాలు. ►జలుబు, జ్వరం లక్షణాలు కనిపించగానే ఎక్కువ హానికరం కాని పారాసిటమాల్ టాబ్లెట్లు వాడవచ్చు. జలుబు పూర్తిగా దారికి వచ్చే వరకు రోజుకు మూడుసార్లు వేడి నీళ్లలో ఉప్పు వేసుకొని పుక్కిటపట్టించాలి.. ►రోజులో కనీసం మూడుసార్లయినా పసుపు లేదా, అదుబాటులో ఉండే జండూబామ్ వేసుకుని ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గడంతో పాటు ఉపశమనం కలుగుతుంది. ► ఈ సీజన్లో నీళ్ల నుంచి అనేక జబ్బులు వ్యాపిస్తాయి. కాబట్టి పిల్లలు, పెద్దల దాకా అందరూ కాచి, చల్లార్చి వడపోసిన నీళ్లు మాత్రమే తాగితే మంచిది. ► జలుబు లక్షణాలను త్వరగా తగ్గించే వాటిలో ముఖ్యమైనది నిమ్మపండు.. గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం, కాస్త తేనె కలుపుకొని రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు. ► మిరియాలు, వెల్లుల్లి, అల్లం వంటివి ముక్కు దిబ్బడను తగ్గించడంతో పాటు, జలుబు చేసిన సమయంలో రిలీఫ్‌గా ఉండేందుకు తోడ్పడతాయి. ► జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు ఆవనూనెకు వెల్లుల్లి కలిపి చిన్నారి ఛాతీపైనా, మెడ, వీపు భాగాల్లోనూ మసాజ్ చేయాలి. ► పిల్లలు జలుబుతో బాధపడుతున్నప్పుడు వారికి ఆరారగా మంచినీరు తాగిస్తుండటం వల్ల కోల్పోయిన నీటి శాతం భర్తీ అయి శరీరానికి వ్యాధితో సమర్థంగా పోరాడగల శక్తి వస్తుంది. -
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మొదలైన చలి తీవ్రత
-
చిన్నారుల ముక్కు నుంచి రక్తం వస్తుందా? చాలావరకు ఇది..
ఈ సీజన్లో పిల్లలు వానల్లో తడిసి, జలుబు చేసి ముక్కు చీదినప్పుడు రక్తం రావచ్చు. చిన్నారుల ముక్కు నుంచి రక్తస్రావం జరగడాన్ని ఎపిస్టాక్సిస్ అంటారు. చాలావరకు ఇది ఏమాత్రం ఆందోళనకరం కాదు. పిల్లల ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... పిల్లలు కాస్త ముందుకు ఒంగి కూర్చునేలా చూడాలి నోటితో గాలిపీల్చుకొమ్మని చెప్పాలి. రక్తస్రావం అవుతున్న ముక్కు రంధ్రం వైపు భాగాన్ని బొటనవేలు, చూపుడువేలుతో కాసేపు అలాగే నొక్కి పట్టి ఉంచాలి. ముక్కుపైన ఐస్‌ప్యాక్ లేదా కోల్డ్ ప్యాక్ ఉంచాలి. వాళ్లు గట్టిగా ముక్కు చీదకుండా చూడాలి. రక్తస్రావం తగ్గాక మళ్లీ అలా జరగకుండా ఉండేందుకు పిల్లల వేళ్ల గోళ్లు కత్తిరిస్తూ, వాళ్లు ముక్కులో వేళ్లు పెట్టుకుని గిల్లుకోకుండా చూడాలి. ఈ కొద్దిపాటి జాగ్రత్తలతో రక్తస్రావం తప్పక ఆగిపోతుంది. ఒకవేళ ఆగకపోతే తక్షణం డాక్టర్ / ఈఎన్టీ స్పెషలిస్ట్‌ను కలవాలి. (చదవండి: ఏజెన్సీ ప్రాంతాలను కలవరపెట్టే 'మలేరియా'..తస్మాత్ జాగ్రత్త లేదంటే..) -
జలుబు, దగ్గు నుంచి బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి
వేసవికాలం ముగిసింది. వర్షాకాలం వచ్చేస్తోంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా దగ్గు, జలుబులు వంటివి సర్వసాధారణం. ఈ సమస్య అంత ప్రమాదకరమైనది కానప్పటికీ, ఇది ఒకరి నుంచి మరొకరి అంటుకునే అవకాశం ఉంటుంది. తరచుగా దగ్గు, జలుబు నుంచి వంటింటి చిట్కాలతో సత్వర ఉపశమనం పొందొచ్చు. తులసి ఆకుల రసంలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఓ నాలుగైదు తమలపాకులను వెచ్చచేసి, వాటిని నూరి రసం తీసి, దానిలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఓ రెండు చెంచాల నూనెను కాచి, ఒక పెద్ద చెంచాడు కర్పూరాన్ని పొడిచేసి నూనెలో కలిపి ఒక సీసాలో నిల్వ ఉంచాలి. దీనిని ఛాతీకి, గొంతుకకూ రాస్తే దగ్గు, జలుబు తగ్గుతాయి. గుప్పెడు జామాయిలు (యూకలిప్టస్ ) ఆకుల్ని రెండు గ్లాసుల నీళ్లల్లో పోసి అవి మరిగి ఒక గ్లాసు అయ్యేదాకా మరగబెట్టాలి. అనంతరం ఆ నీటిని వడగట్టి అందులో కొంచెం పంచదార కలిపి, రోజుకు మూడుసార్లు తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. -
Health: ఏది పడితే ఆ టాబ్లెట్ వేసుకోవద్దు! పైనాపిల్, నిమ్మ, కివి పండ్లు.. ఇంకా తులసితో..
గత కొద్దిరోజులుగా వాతావరణంలో వస్తున్న రకరకాల మార్పుల వల్ల దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. చాలామంది మెడికల్ షాప్‌కు వెళ్లి వాళ్లు ఇచ్చిన మందులు తెచ్చుకుని వేసుకుంటూ ఉంటారు. అది చాలా ప్రమాదం. దానివల్ల రకరకాల దుష్ఫలితాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. దగ్గు, జలుబుకు సహజమైన చిట్కాలు పాటించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అవేమిటో తెలుసుకుందాం. అసలు దగ్గు, జలుబు రాకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తిన్నట్లయితే తొందరగా ఈ అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బలవర్థకమైన ఆహారం తీసుకొని శరీరాన్ని బలంగా ఉంచుకుంటే, అసలు ఇవి రాకుండానే ఉంటాయి. జలుబు, దగ్గు వంటి సమస్యల నివారణకు యాంటీబయాటిక్స్ ఉపయోగించటం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. సహజ చిట్కాలు... ►తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే జలుబు, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. ►రోజుకు రెండుసార్లు పసుపు, వేడి పాలను కలిపి తీసుకుంటే కూడా ఉపశమనం దొరుకుతుంది. ►మిరియాల కషాయాన్ని తాగినా, లవంగాలు బుగ్గన పెట్టుకుని వాటి రసాన్ని మింగుతున్నా, వేడి వేడి మసాలా టీ తయారు చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది ►చెంచాడు నిమ్మరసాన్ని, రెండు స్పూన్ల తేనెను వేడినీళ్లలో కలుపుకొని తాగితే ఉపశమనం దొరుకుతుంది. ►అల్లాన్ని దంచి కషాయం చేసుకుని తాగినా, అల్లం టీ చేసుకుని తాగినా కూడా రిలీఫ్ ఉంటుంది ►కొద్దిగా పసుపు, ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో పుక్కిట పట్టడం వల్ల గొంతుకు ఉపశమనం దొరుకుతుంది∙ ►కొన్ని తులసి ఆకులు, చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి ముక్కలు, టీ స్పూన్ వాము, మెంతులు, పసుపు, నాలుగైదు నల్ల మిరియాలు వేసి నీళ్లు పోసి బాగా మరిగించి కషాయం తయారు చేసుకుని తాగితే మరింత మంచి ఫలితం ఉంటుంది. వేడినీళ్ళకే ఓటేయండి... ►దగ్గు, జలుబుతో బాధపడేవారు శీతల పానీయాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ►అదేవిధంగా ఫ్రిజ్‌లో నుంచి తీసిన చల్లటి నీళ్లను తాగడానికి బదులు ఎప్పుడు నీళ్లు తాగినా కాస్త వేడిగా ఉన్న నీటిని మాత్రమే తాగడం మంచిది. ఈ పండ్లు మంచివి పైనాపిల్, నిమ్మ, కివి వంటి పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కూడా జలుబు, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. చదవండి: Health: బీరకాయ, నేతి బీరకాయ తరచుగా తింటున్నారా? ఇందులోని అధిక సెల్యులోజ్ వల్ల.. Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే.. -
అడెనోవైరస్ కలకలం.. పిల్లలకు మాస్కులు తప్పనిసరి చేసిన సర్కార్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అడెనోవైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. పిల్లలందరూ కచ్చితంగా మాస్కు ధరించాలని సీఎం మమతా బెనర్జీ సూచించారు. చిన్నారులు భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. బెంగాల్లో అడెనోవైరస్ బారినపడి ఇప్పటివరకు 19 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరిలో 13 మంది చిన్నారులకు దీర్ఘకాలిక రోగాలున్నాయని మమత చెప్పారు. పిల్లలలో దగ్గు, జలుబు లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, ఒకవేళ జ్వరం ఉంటే తక్షణమే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం వివరాల ప్రకారం అడెనోవైరస్ ఫ్లూ లాంటిదే. ఇది సోకిన చిన్నారులు సాధారణ జ్వరం నుంచి తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా పిల్లల శ్వాసకోశ వ్యవస్థపై ఈవైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. అడెనోవైరస్ అన్ని వయస్కుల పిల్లలకు సోకుతుంది. అయితే ఎక్కువగా నవజాత శిశువులు, 10 ఏళ్లుపైబడిన పిల్లలు దీని బారినపడుతున్నారు. అడెనోవైరస్ లక్షణాలు ► జ్వరం ► జలుబు ► దగ్గు ► గొంతులో నొప్పి ► కళ్లు గులాబీ రంగులోకి మారడం ► న్యుమోనియా ► శ్వాసనాళాల వాపు ► జీర్ణాశయంలో ఇన్ఫెక్షన్ రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న, శ్వాససంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు అడెనోవైరస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం బెంగాల్ రాష్ట్రంలోని అనేక ఆస్పత్రులు చిన్నారులతో నిండిపోయాయి. దీంతో అన్ని జిల్లాల వైద్య అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అవసరమైన సదుపాయాలు, వైద్య పరికరాలు సమాకూర్చాలని ఆదేశించింది. చదవండి: వాళ్లు గుంపుల్లో తిరగొద్దు.. కర్ణాటక ఆరోగ్య మంత్రి హెచ్చరిక.. -
హెల్త్ టిప్స్
♦ రాత్రి పడుకోబోయేటప్పుడు ఒక గ్లాసు మంచి నీటిలో చిన్న పటిక బెల్లం ముక్కను వేసి ఉంచి ఆ నీటిని ఉదయం లేవగానే తాగాలి. పదిహేను రోజుల పాటు ఇలా చేస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది. ♦ చిటికెడు పసుపును గ్లాసు పాలలో కాచి, రోజూ ఉదయాన్నే తాగుతుంటే జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతాయి.. ♦ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గాలంటే రోజుకు రెండుసార్లు కప్పు పాలల్లో ముక్కలుగా చేసిన ఒక వెల్లుల్లి రెబ్బను వేసి బాగా మరగనిచ్చి వెల్లుల్లి ముక్కలను తీసి, ఆ పాలు తాగితే మంచి గుణం కన్పిస్తుంది. ♦ దగ్గు, ఆయాసంతో బాధపడేవారు స్పూన్ అల్లం రసం, స్పూను దానిమ్మరసం, స్పూన్ తేనె కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే సరి ∙చిన్నపిల్లలు మలబద్దకంతో బాధపడుతుంటే రోజూ రెండు స్పూన్లు ద్రాక్షరసం ఇస్తూ ఉంటే సమస్య తొలగుతుంది, ♦ అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు తోటకూర, క్యారెట్, నారింజలను సమంగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. -
మీ పిల్లలు తరచు దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా?
ఇది అటు చలికాలం కాదు, అలాగని పూర్తి వేసవి కాలమూ కాదు... అటూ ఇటూ కానీ సంధికాలం. ఈ కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలే తరచుగా అనారోగ్యం బారిన పడుతుంటారు. వాటిలో ప్రధానమైనవి దగ్గు, జలుబు. అలెర్జీ, దగ్గు, న్యూమోనియా, బ్రాంకైటిస్, అధిక జ్వరం, టాన్స్లైటిస్, చెవి ఇన్ఫెక్షన్ సమస్యలు పిల్లలకు తరచు సోకుతుంటాయి. తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు పిల్లలకు దగ్గు, జలుబు వంటి సమస్యలుంటే కృత్రిమ రంగులు కలిపిన ఆహారాలు, అధిక తీపి, ఎక్కువ చల్లగా ఉండే ఆహారాలను తినిపించకూడదని వైద్యులు సలహానిస్తుంటారు. ఎందుకంటే ఇవి దగ్గును ఎక్కువ చేస్తాయి. అలాగే బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. అంతేకాదు ఇది సంక్రమణ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. వీటితోపాటు క్యాండీలు, ఐస్ క్రీం, చాక్లెట్లు, డోనట్స్, పేస్ట్రిలు, ద్రాక్ష, రిఫ్రిజిరేటర్ లో ఉండే చల్లని ఆహారాలకు పిల్లలను వీలైనంత దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఇవి దగ్గును బాగా పెంచుతాయి. దుమ్ము, ధూళి ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు పిల్లలను పంపించకూడదు. ఎందుకంటే ఇవి దగ్గును ప్రేరేపిస్తాయి. ముఖ్యంగా పిల్లలకు బొమ్మలు ఇవ్వాల్సి వస్తే.. వాటిని వాష్ చేసిన తర్వాతే ఇవ్వండి. అలాగే పావురాలు, ఇతర పెంపుడు జంతువులకు కొద్దిగా దూరంగా ఉంచండి. ఇవి అలెర్జీని కలిగిస్తాయి. -
Health Tips: ద్రాక్ష రసాన్ని కొంచెం తేనెలో కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే
♦ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు మూడు వెల్లుల్లి రేకులు తింటే రక్తపోటు, కడుపులో మంట, నులిపురుగుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ♦ కొన్ని స్పాంజి ముక్కలను నీళ్ళలో తడిపి ఫ్రీజర్‌లో ఉంచండి. చెయ్యి కాలినా లేదా ఏ తలుపు సందులోనో పడి నలిగినా ఒక స్పాంజి ముక్కను తీసి బాధ ఉన్న ప్రదేశంలో కొద్దిసేపు ఉంచితే నొప్పి, వాపు వెంటనే తగ్గుతాయి. ♦ పళ్ళు వచ్చే ముందు పిల్లలు ప్రతిదాన్నీ కొరుకుతూ చిగుళ్ళు నొప్పి పుట్టి ఏడుస్తూ ఉంటారు. అటువంటప్పుడు సారింజ తొనలలోని విత్తనాలు తీసేసి, ఆ తొనలను కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి వాటిని పిల్లలకు ఇస్తే ఆ చల్లదనం వారి బాధను పోగొట్టి రిలీఫ్ ఇస్తుంది. వారికి అవసరమైన ‘సి’ విటమిన్ కూడా లభిస్తుంది. ♦ ద్రాక్ష రసాన్ని కొంచెం తేనెలో కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. ♦ కొబ్బరినూనె, నిమ్మరసం సమపాళ్ళలో తీసుకుని బాగా కలిపి కొద్దిగా వేడిచేసి నొప్పిగా ఉన్న ప్రాంతం లో మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ♦ కిడ్నీ వ్యాధుల నివారణకు రెండు వంతుల దోసకాయ రసానికి, ఒక వంతు ద్రాక్ష రసాన్ని కలిపి ఉదయం, సాయంత్రం ఒక కప్పు చొప్పున తాగి చూడండి ♦ బచ్చలి రసం, అనాసరసం సమపా ళ్లలో తీసుకుని దానిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. -
Amarnath Vasireddy: మూడు వారాలుగా దగ్గు, జలుబు ఆగకుండా వస్తున్నాయా?
గత మూడు వారాలుగా మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ జలుబు- దగ్గు ఆగకుండా వస్తోందా? ఒక వేళ తగ్గినా మళ్ళీ తిరగపెడుతోందా..? భయపడకండి. ఇది కరోనా కాదు. ఇప్పుడు లక్షలాది మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. మరో వారం పది రోజుల్లో సమస్య దానంత అదే పరిష్కారమైపోతుంది. ఎందుకిలా..? రెండు రకాలు: ►ఎలర్జీలు ►శక్తివంతమయిన బాక్టీరియా వైరస్లు. గమనించారా ? ఒక రోజు విపరీతమయిన చలి. పొగ మంచు. ఉన్నట్టుండి ఇంకో రోజు ఫ్యాన్ వేసుకోకపోతే నిద్రపట్టనంత ఉక్కపోత. వాతావరణంలో విపరీత మార్పులు. పొగ మంచు. దీనికి తోడు వాతావరణ కాలుష్యం. ఫాగ్.. స్మోక్.. రెండూ కలిసి స్మోగ్. దీనివల్ల చాలా మందిలో ఎలర్జీ లు వస్తున్నాయి. జలుబు అయితే తుమ్ములు నెమ్మదిగా వస్తాయి. అదే ఎలర్జీ అయితే ఒక్కో సారి ఆగకుండా వస్తాయి. ఎలర్జీ కి మందు లేదు. బయట మంచు ఉన్నా బెడ్ రూమ్ లో ఉన్న మీకు పచక్ పచక్ అని తుమ్ములొస్తున్నాయా ? అయితే ఎలర్జీ. జస్ట్ రిలాక్స్. మరో వారం లో వాతావరణం సెట్ అయిపోతుంది. అప్పుడు పోతుంది. కాకపోతే ప్రతి వింటర్ లో మీకు ఈ బాధ తప్పదు. వీలైనంతవరకు మంచు అదే స్మోగ్ లో బయటకు పోవద్దు. ఎండ వచ్చి పొగ మంచు తగ్గాక బయటకు వెళ్ళండి. కర్టైన్స్ తో కిటికీలు మూసి ఉంచండి. ఇక రెండో ది మొండి వైరస్ బాక్టీరియాలు. నిజానికి అవి మొండి కావు. అవి వృద్ధి చెందడానికి అనుకూల వాతావరణం.. బయట + మీ శరీరం లోపల.. రెండు చోట్లా ! బయటేమో స్మోగ్. లోపల మీ ఇమ్మ్యూనిటి వీక్. రెండేళ్లుగా మాస్క్‌లు వేసుకొని మీ ఇమ్మ్యూనిటీని బజ్జో పెట్టేశారు. తక్కువ మొత్తంలో వైరస్లు బాక్టీరియాలు సోకాలి. ఇమ్యూనిటీ కణాలు వాటిని చంపాలి. అదే దానికి బాటింగ్ ప్రాక్టీస్. రెండేళ్లు నెట్ ప్రాక్టీస్ లేకుండా బాట్స్మన్ పిచ్‌పైకి దిగితే ? ఇంకేముంది..? బాతే. అదే డక్ అవుట్. ఇప్పుడు అదే జరుగుతోంది. పోనీ లెండి. ఇప్పుడైనా బాటింగ్ ప్రాక్టీస్ అవుతోంది. ఇలా చేయండి. ►దగ్గుమందు తాగొద్దు. దాని వల్ల నష్టం తప్ప లాభం ఉండదు. ►వేడి నీరు తాగాలి. పురుషులు నాలుగు లీటర్లు. స్రీలు మూడు. పిల్లలు వయసు బట్టి ఒకటి నుంచి రేండు లీటర్ లు. వేడి నీటిలో ఉప్పు వేసుకొని నోట్లో పోసుకొని గార్గిల్ చేయాలి. ►అవసరం అయితే అల్లం పసుపు కాషాయం చేసి తాగండి. జస్ట్ టీ కప్పులో కొద్దిగా. రోజుకు ఒక సారి. మూడు నాలుగు రోజులు మాత్రం. ►శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. బాగా నిద్ర పోవాలి. స్ట్రెస్ కి దూరంగా ఉండాలి. -వాసిరెడ్డి అమర్నాథ్, ప్రముఖ ఉపాధ్యాయులు, వ్యక్తిత్వ, మానసిక పరిశోధకులు -
ఆ ముగ్గుర్నీ కలిశాకే ఈ నిర్ణయం తీసుకున్నా!..ఎప్పటికీ స్వెటర్స్ వేసుకోను
భారత్ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ టీషర్ట్స్ ధరించడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అదీ కూడా శీతాకాలంలో ఇంత భయంకరమైన చలిలో సైతం రాహుల్ ఎందుకు టీషర్ట్స్ వేసుకుంటున్నారంటూ మీడియాతో సహా సర్వత్ర ఇదే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ విషయమై స్పందించారు. తాను ముగ్గురు బాలికలను కలిసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ ఆ చర్చలకు తెరదించారు. వారిని కలిసిన తర్వాత నుంచే టీ షర్టులు ధరించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అందరూ ఈ టీ షర్ట్ ఎందుకు ధరిస్తున్నారు చలిగా అనిపించడం లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. "ఐతే నేను కేరళలో ప్రవేశించినప్పుడూ కాస్త వేడిగ, తేమగా ఉంది. కానీ మధ్యప్రదేశ్‌లోకి వచ్చేటప్పటికీ కాస్త చల్లగా ఉంది. అప్పుడే అక్కడకి చిరిగిన బట్లతో ముగ్గురు పేద బాలికలు నా దగ్గరికి వచ్చారు. సరైన దుస్తులు ధరించకపోవడంతో చలికి గజగజ వణకుతున్నారు. దీంతో ఆరోజు నేను నిర్ణయించుకున్నా వారికి చలి అనిపించేంత వరకు(వారు స్వెటర్లు ధరించేంత వరకు) తనకు చలి అనిపించదు. అప్పటి వరకు నేను కూడా స్వెటర్స్ ధరించను. అంతేకాదు ఆ ముగ్గురు బాలికలకు చలి అనిపిస్తే రాహుల్‌కి కూడా చలి అనిపిస్తుందని ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పారు. అయినా తాను టీషర్ట్స్ వేసుకోవడం అనేది ప్రధానాంశం కాదని, ఈ యాత్రలో తన వెంట వస్తున్న పేద రైతులు, కూలీలపై దృష్టి పెట్టండని మీడియాకి చురకలంటించారు. పేద రైతులు, కార్మికులు, వారి పిల్లలు చిరిగిని బట్టలు, టీషర్ట్లు, స్వెటర్లు ధరించకుండా ఎందుకు ఉన్నారో అనేది ప్రధానం, దాని గురించే ఆలోచించండి." అని చెప్పారు రాహుల్. కాగా జోడో యాత్ర హర్యానాలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలో జరిగింది. జనవరి 30 కల్లా జమ్ము కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కి చేరుకోవడంతో ఈ యాత్ర ముగుస్తుంది. इस टी-शर्ट से बस इतना इज़हार कर रहा हूं, थोड़ा दर्द आपसे उधार ले रहा हूं। pic.twitter.com/soVmiyvjqA — Rahul Gandhi (@RahulGandhi) January 9, 2023 (చదవండి: ఇలా నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు: రాహుల్ గాంధీ) -
Viral: జారిపోతున్న కార్లు.. అమెరికా మంచు తుఫాన్ వీడియోలు వైరల్..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుఫాన్ 'బాంబ్ సైక్లోన్' విధ్వంసం సృష్టిస్తోంది. రక్తం గట్టకట్టే చలిలో ప్రజలు వణికిపోతున్నారు. వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ మంచు తుఫాన్ కారణంగా క్రిస్మస్ పండుగను కూడా సరిగా జరుపుకోలేకపోయారు. చరిత్రలో ఎన్నడు లేని విధంగా మంచు భారీగా కురవడంతో అమెరికాలోని అనేక ప్రాంతాలు మంచు దిబ్బల్లా మారాయి. రోడ్లు, ఇళ్లు శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి ఈ మంచు కారణంగా అనేక ప్రమాదాలు కూడా జరిగాయి. A drone has captured incredible footage of entire houses encased in ice after a bomb cyclone hit the US and parts of Canada. Read more: https://t.co/jMSLhhH6kY pic.twitter.com/wdLzJUuUJA — Sky News (@SkyNews) December 28, 2022 #bombcyclone2022 #snowstorm #BombCyclone ravages East America,death toll rises to 60 The worst damage was in the #Buffalo area of #NewYork.Severe impact on electricity services. Due to the blizzard,nearly 200,000 residents eastern #USA haven't Electricity in the extreme cold pic.twitter.com/GFhGbitYGA — Kaustuva Ranjan Gupta (@GuptaKaustuva) December 28, 2022 మంచు తుఫాన్ వల్ల అమెరికాలో ఇప్పటివరకు 70 మందికిపైగా చనిపోయారు. కొందరు మంచులోనే గడ్డకట్టి కన్నుమూశారు. మరికొందరు వివిధ ప్రమాదాల్లో మరణించారు. That’s happened during a Historic Bomb Cyclone after a Decades. pic.twitter.com/uy10cJFfSM — Adeel Ali (@AdeelAl03137938) December 25, 2022 Bomb Cyclone Light house, Michigan City, 🇺🇸 pic.twitter.com/0BUQWIgMFR — Earth & beyond (@umadevipavuluri) December 26, 2022 పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. మరోవైపు దొంగలు రెచ్చిపోయారు. స్టోర్లలోకి వెళ్లి దొంగతనాలకు పాల్పడ్డారు. దొరికిన కాడికి నగదు, వస్తువులు దోచుకెళ్లారు. Bomb Cyclone Buffalo, NY, 🇺🇸 Many stores were under theft pic.twitter.com/rT0E0mGToJ — Earth & beyond (@umadevipavuluri) December 26, 2022 అమెరికాలో మంచు తుఫాన్‌కు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రోడ్లపై కార్లు జారుకుంటూ వెళ్లడం, వేడి నీటిని గాల్లోకి విసిరితే మంచులా మారడం వంటి వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. The view out my parents garage in Prince Edward County. The drift is up to their second story patio #ONstorm #BombCyclone pic.twitter.com/ocbD9KPuZF — Smith (@RileyZSmith) December 25, 2022 Shouldn't laugh but..........#ice #blizzard #WinterStorm #BombCyclone #Elliott #wind #snow #Ice #WeatherBomb video:@kayokayla pic.twitter.com/jJyswxJDkd — Volcaholic (@CarolynnePries1) December 24, 2022 Bomb Cyclone ! Ashtoshing Scenas, Drone Camera Work , Shows Hudge Snow Mountains in NY. Buffalo, NY, 🇺🇸 #BombCyclone #BombCylonebyDrone #BuffaloNY #BuffaloStorm2022 pic.twitter.com/LxKa0oKM5b — Top Viral Videos (@ManojKu40226010) December 26, 2022 Amid plunging temperatures, one person in Montana decided to throw some boiling water in the air and make more snow. The huge winter storm pummelling the US has intensified into a "bomb cyclone", with 60% of the population under a winter weather warning.https://t.co/4DalHHz9Lj pic.twitter.com/ADu80WBRKP — Sky News (@SkyNews) December 24, 2022 Snow plows at work as Mammoth winter storm unleashes chaos in #Vancouver Extremely Dangerous travel conditions, due to freezing rain @TranBC @MainroadLM#BritishColumbia #BCStorm #Canada #Elliott #ColdWave #BombCyclone #Weather #Climate #GlobalWarming #BCSnow #PortMannBridge pic.twitter.com/ZGyHRQejuP — Earth42morrow (@Earth42morrow) December 23, 2022 చదవండి: రిటైర్డ్ పోప్ బెనెడిక్ట్16 ఆరోగ్యం విషమం -
ఇలా నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శనివారం ఢిల్లీలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ని పలువురు ఈ శీతకాలంలో మీరు ఎందుకు కేవలం టీ షర్ట్ ధరించి నడుస్తున్నారు, మీకు చలిగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. దీనికి ప్రతిగా రాహుల్ రైతు, కార్మికుడు, పేద పిల్లలను ఎప్పుడైనా ఇలా అడిగారా అని ఎదురు ప్రశ్న వేశారు. నులు వెచ్చని బట్టలు ప్రాథమిక వస్తువులు, వాటిని కొనుగోలు చేయని వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని అడిగారు. నేను సుమారు 2,800 కిలోమీటలర్లు నడిచాను కానీ అది ఏమంతా పెద్ద విషయం కాదు. నిజానికి వ్యవసాయం చేసే రైతులు, కార్మికులు, రోజు చాలా దూరం నడుస్తారు, కష్టపడతారు అని చెప్పారు. ఈ యాత్రలో అన్నిరకాల ప్రజలను కలిశాను. తాను ఇప్పుడూ ఎవరి చేయినైనా పట్టుకుని వారు ఏం పని చేశారో చెప్పగలను అన్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమయ్యే ఈ జోడో యాత్ర కాశ్మీర్లో ముగియనుంది. "నాకు సాధారణ ప్రజలలో ద్వేషం కనిపించలేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ద్వేషాన్ని, భయాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపణలు చేశారు. కానీ నాకు యాత్ర ప్రారంభించినప్పుడూ ప్రజల్లో ద్వేషం ఉంటుందేమోనని చాలా భయపడ్డాను." అని అన్నారు. రాహుల్ చేపట్టిన ఈ జోడోయాత్రలో ప్రముఖులు, స్టార్లు, కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే తోపాటు తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక వాద్రాతో సహా అగ్ర నేతలందరూ ఈ యాత్రలో పాల్గొన్నారు. (చదవండి: జోడో యాత్రలో పాల్గొంటే పొలిటికల్ కెరీర్ నాశనం అవుతుందన్నారు’) -
చలి కాచే కోటు..
చలికాలంలో ఒక్కోసారి స్వెట్టర్లు వేసుకున్నా, చలి తగ్గినట్లుగా అనిపించదు. అలాంటి ఇబ్బందేమీ లేకుండా నిమిషాల్లోనే ఒళ్లంతా వెచ్చబరచే అరకోటు అందుబాటులోకి వచ్చింది. వేడిని నిల్వచేసుకునే కెమికల్ జెల్ నింపి రూపొందించిన ఈ వస్త్రవిశేషం ‘ఎంట్రోపీ వెస్ట్’. టీషర్ట్ లేదా చొక్కా మీదుగా దీనిని అరకోటు ధరించినట్లే సులువుగా ధరించవచ్చు. దీనికి ఎలాంటి బ్యాటరీలతోను, విద్యుత్తుతోను పనిలేదు. దీనిని యాక్టివేట్ చేసుకుంటే చాలు, నిమిషాల్లోనే 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను అందిస్తుంది. నడుస్తున్నా, కదులుతూ పనులు చేసుకుంటూ ఉన్నా, క్రమంగా వేడి తగ్గి, శరీర ఉష్ణోగ్రత వద్ద స్థిరపడుతుంది. దీని ఉష్ణోగ్రత పూర్తిగా తగ్గినట్లు అనిపిస్తే, ఉడుకు నీళ్లలో కాసేపు నానబెట్టి, ఆ తర్వాత ఆరవేసుకుంటే చాలు. యథాతథంగా పనిచేస్తుంది. ఉడుకు నీళ్లలోని ఉష్ణోగ్రతను ఈ వస్త్రంలోని జెల్ గ్రహించి, నిల్వ చేసుకుంటుంది. లండన్‌లోని ‘పెటిట్ ప్లీ’కి చెందిన శాస్త్రవేత్తలు ఈ సరికొత్త చలివస్త్రానికి రూపకల్పన చేశారు. దీని ధర 500 పౌండ్లు (రూ.50,104). చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి
-
తెలుగు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు
-
చలి ఎఫెక్ట్: రాబోయే నాలుగు రోజులు జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో చలికాల ప్రభావం మొదలైంది. ప్రధాన నగరాలతో పాటు ముఖ్యపట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో గురువారం చలి విజృంభణ కనిపిస్తోంది. ఉదయం చలిగాలుల ఉధృతి పెరగడంతో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సీజనల్ వ్యాధులతో పాటు శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా.. పట్టణాల్లోనూ చలి ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పొద్దుపొద్దునే రహదారులన్నీ పొగమంచు కప్పుకోవడంతో.. ప్రయాణికులు ఇబ్బంది పడుతోన్నారు. రోజు రోజూ రాత్రి , పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఒకవైపు.. తెలంగాణాలోని అన్ని జిల్లాలో చలి తీవ్రత పెరుగుతుంది. పలు జిల్లాల్లో ఇప్పుడే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, అదిలాబాద్ జిల్లాల్లో చలి బీభత్సంగా కనిపిస్తోంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. HIGH INTENSE COLD weather ahead even tonight in entire Telangana. Humidity has dropped to season's lowest so far and cool winds coming from North. Super cool weather with min temp upto 7°C in rural TS and upto 11°C expected in parts of Hyderabad 🥶⚠️ — Telangana Weatherman (@balaji25_t) November 16, 2022 మరోవైపులోనూ ఏపీలోనూ చలి విజృంభిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పాడేరులో 12, మినుములురులో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అరుకులోయలో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రాబోయే నాలుగు రోజులు చలి విజృంభణ మరింతగా ఉంటుందని, కాబట్టి, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆ తర్వాతి పరిస్థితిని బట్టి మరిన్ని సూచనలు చేస్తామని తెలిపారు. -
Health Tips: తలనొప్పి.. ప్రధాన కారణాలు! ఇలా చేశారంటే..
తలనొప్పి, జ్వరం, జలుబు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు / అతి సాధారణమైన శారీరక బాధలకు ఇంట్లోనే కొన్నిచిట్కాలున్నాయి. తలనొప్పి 1. తలనొప్పికి చాలా సర్వసాధారణమైన కారణం ఆకలి. మనకి ఆకలి వేసినప్పుడు మన శరీరంలోని రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. షుగర్ లెవల్స్ పెరిగినపుడు శరీరంలో నరాలు సంకోచించి మెదడుకు సిగ్నల్‌ను పంపడం వలన తలనొప్పి వస్తుంది. మెదడుకి కావాల్సిన ఆక్సిజన్ సరిగా అందకపోవచ్చు కూడా. అందుకే ఉదయం కాలి కడుపుతో ఉండరాదు. ఏదో ఒక్కటి తీసుకోవాలి. 2. సాధారణమైన తలనొప్పి చాలా రకాలుగా రావచ్చు. ఎక్కువ అలసిపోయినా, డీ హైడ్రేషన్‌కి గురైనా, జలుబు, జ్వరం సమయాల్లో, ఏదైనా అనవసర విషయాలు ఎక్కువగా ఆలోచిస్తున్నా, నిద్ర చాలకున్నా కూడా తలనొప్పి వస్తుంది. రోజువారీ జీవితంలో ఎక్కడ తేడా వచ్చిందో పసిగడితే సగం పరిష్కారం ఉంటుంది. ఆ కారణం తెలిస్తే లేదా ఊహించగలిగితే తలనొప్పి నుంచి బయటపడవచ్చు. డీ హైడ్రేషన్ అయితే ఎక్కువ నీళ్లు తాగడం, నిద్ర చాలకుంటే కాసేపు పడుకోవడం ఇలా. ఆ చిన్న చిన్న పనులతో మీ తలనొప్పి తగ్గించుకోవచ్చు. 3. మామూలుగా ఒక మనిషి సగటున రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు కచ్చితంగా తీసుకోవాలి. అలా తీసుకోకపోవడం వల్ల జరిగే నష్టాలు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటగా శరీరంలో నీటి శాతం తక్కువగా ఉన్నప్పుడు బాడీ డీహైడ్రేషన్ కు గురిఅవుతుంది. దాని వల్ల శరీరంలో వేడి శాతం పెరగడం, దాని వల్ల తలనొప్పి రావడం, నీరసంగా ఉండటం, తల తిరగడం, కిడ్నీలో రాళ్లు చేరడం జరుగుతుంది. కిడ్నీలో రాళ్లు వస్తే విపరీతమైన నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు తద్వారా నీరసం, అలాగే గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం, మలబద్ధకం వల్ల ఫైల్స్ ఇలా ఒకదానికొకటి తోడవుతాయి. ఇప్పుడు నీటిని ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. 1. ముందుగా జలుబు గురించి చూసుకుంటే మీరు కచ్చితంగా నెల రోజుల పాటు మరగబెట్టి చల్లార్చిన గోరువెచ్చని నీటిని తీసుకోండి. 2. ఉదయం లేవగానే రెండు గ్లాసులు నీటిని గోరువెచ్చగా వేడి చేసి బ్రష్ చేయక ముందే తాగాలి (2X200=400 ఎంఎల్ ) 3. ఏదైనా ఆహారం తీసుకునే ఒక అరగంట ముందు ఒక గ్లాసు వాటర్ తాగండి, అలాగే భోజనం సమయంలో మంచి నీళ్లను కేవలం గొంతు దిగడం కోసం మాత్రమే తాగండి, ఎక్కువగా తాగవద్దు. భోజనం సమయంలో వాటర్ ఎక్కువగా తాగడం వల్ల మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి విడుదలయ్యే యాసిడ్‌ను పలుచన చేస్తుంది. దానివల్ల ఆహారం జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దానివల్ల గ్యాస్ ట్రబుల్ అల్సర్ వస్తూ ఉంటాయి. 4. మిగతా సమయంలో కచ్చితంగా 3, 4 లీటర్ల నీళ్లను తాగండి. గోరు వెచ్చని నీటిని తీసుకోవడం ఇంకా మంచిది, అలాగే మీరు చల్లటి నీళ్లను (ఫ్రిజ్ వాటర్‌ను) తీసుకోవడం వంద శాతం తగ్గించండి. వీటితో పాటు రోజుకి అరగంట ఏదైనా తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఉండాలి. అత్యవసరం అయితే మాత్రం మందులు వాడాలి. వైద్యుడి సలహా ఉత్తమం. సాధ్యమైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం మంచిది. తీవ్ర మైన ఇబ్బంది సమయంలో సొంత వైద్యం చేసుకోవద్దు. ఏదో ఒక మందు వేసుకొని ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు. -డా. నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు చదవండి: Health Tips: పిల్లలు, వృద్ధులు ఖర్జూరాలు తరచుగా తింటే! Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల.. -
సాక్షి కార్టూన్ 14-7-2022
...షోకాజ్‌లు ఇస్తున్నారని ఇప్పుడే నిప్పుల మీద నుంచి తీసిన చాయ్ ఇచ్చాన్సార్! -
ఆకస్మిక చలి.. ఆరోగ్యం జాగ్రత్త.. వాట్సాప్, ఫేస్బుక్లో సందేశాల వెల్లువ
సాక్షి, సిటీబ్యూరో: 'వాతావరణంలో ఏర్పడుతున్న ప్రత్యేక పరిస్థితి కారణంగా గత శుక్రవారం నుంచి అనూహ్యంగా చలి పెరిగింది. ఈ చలి తీవ్రత వల్ల నెలన్నర రోజుల పాటు ప్రజలకు రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తనున్నాయి’. ఈ మేరకు వాట్సాప్, ఫేస్బుక్ తదితర మాధ్యమాలలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు తగ్గట్టే ఆకస్మికంగా తీవ్రమైన చలి, దగ్గు, జలుబు ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ పోస్టు చర్చనీయాంశంగా మారింది. భూమితో సహా అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయనేది తెలిసిందే. అలా తిరిగే క్రమంలో సంవత్సరానికి ఒకసారి సూర్యుడి నుంచి భూమి నిర్ధిష్ట దూరం కన్నా ఎక్కువ దూరంగా జరుగుతుంది. దీనిని అఫెలియన్ స్థితి అని పేర్కొంటారు. చలి పెరిగి...అనారోగ్యం కలిగి.. సూర్యుడి నుంచి భూమి దూరంగా కదులుతున్న నేపథ్యంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం సహజంగానే ఉంటుంది. ఈ రకమైన అఫెలియన్ స్థితి గురువారం ఉదయం 5.27 గంటలకు ప్రారంభమైందనీ, ప్రాంతాలను బట్టి ఒక్కో చోట ఒక్కో సమయంలో దీని ప్రభావం ప్రారంభమవుతుందని సోషల్ సందేశాలు చెబుతున్నాయి. అలాగే ఈ పరిస్థితి ఆగస్ట్ 22న ముగుస్తుందనీ అంటున్నారు. భూమికి సూర్యునికి మధ్య దూరం సాధారణం కంటే 6.6 శాతం ఎక్కువ కావడం వల్ల ఈ అఫెలియన్ కాలంలో చలి బాగా పెరిగి, దీంతో ఒళ్లు నొప్పులు, జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. కావున వెచ్చని వస్త్రాలు ధరించాలని, రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్లు, సప్లిమెంట్లను వినియోగించాలని సూచనలు కూడా జోడిస్తున్నారు. వాస్తవం ఉందా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? దీనిపై నగరానికి చెందిన వాతావరణ నిపుణులొకరు మాట్లాడుతూ...ఇప్పటికే నాసా దీనిపై స్పష్టత ఇచ్చిందన్నారు. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ప్రకారం, భూమికీ సూర్యునికీ మధ్య సగటు దూరం దాదాపు 150 మిలియన్ కిమీ కాగా, అఫెలియన్ సమయంలో అది దాదాపు 152 మిలియన్ కి.మీ.కి చేరుతుందనీ, ఈ వ్యత్యాసం ఉష్ణోగ్రతపై ప్రభావం చూపడానికి సరిపోదన్నారు. నిజానికి అఫెలియన్ అనేది ఏటేటా సర్వసాధారణంగా ఏర్పడే పరిస్థితేనన్నారు. భూమి దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నందున, సూర్యుడు భూమి మధ్య దూరం సంవత్సరం పొడవునా మారుతూ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా, భూమి సాధారణం కన్నా ఎక్కువగా సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు పెరిహెలియన్ స్థితి అంటారనీ , అఫెలియన్ సాధారణంగా ప్రతి సంవత్సరం జూలై 6న ప్రారంభమైతే, జనవరి 2వ తేదీన పెరిహెలియన్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. వీటివల్లనే ఆరోగ్య సమస్యలు వస్తాయనేందుకు ఎటువంటి రుజువులు లేవన్నారు. వాతావరణ మార్పులతోనే ఆరోగ్య సమస్యలు బంజారాహిల్స్: వానాకాలంలో వాతావరణ మార్పుల వల్ల విస్తరించే వైరస్‌లను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని ‘మా’ఈఎన్టీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈఎన్టీ చీఫ్ సర్జన్ డాక్టర్ కే.ఆర్. మేఘనాథ్ మాట్లాడారు. ప్రస్తుతం జ్వరం, జలుబు, చెవి, గొంతు నొప్పి, దగ్గులకు వైరస్ కారణంగా ఆయన చెప్పారు. మాస్క్ ధరించే అలవాటు కొనసాగించడం వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందదన్నారు. జలుబు, దగ్గు తదితర సమస్యలు తీవ్రంగా లేకపోతే ఆవిరి పట్టడం, కషాయం వంటివి ఉపకరిస్తాయన్నారు. మనం తినే ఆహారంలో విటమిన్లు, మినరల్స్ ఉండేలా చూసుకుంటే రోగాలతో పోరాడేందుకు మరింత శక్తి సమకూరుతుందన్నారు. - డాక్టర్ కేఆర్ మేఘనాథ్ -
జలుబుకు ఔషధంగా చికెన్ సూప్ ఎలా పనిచేస్తుందంటే..?
బాగా జలుబు చేసినప్పుడు చాలామంది చికెన్ సూప్ చేయించుకుని తాగడం లేదా సూప్‌లా వండిన చికెన్గ్రేవీతో అన్నం తినడం చేస్తుంటారు. చాలామంది ఇది ఓ సంప్రదాయ చికిత్స అనుకుంటారుగానీ... నిజానికి చికెన్సూప్ ఉపశమనానికి బాగానే పనిచేస్తుంది. దీనికి శాస్త్రీయ కారణాలూ ఉన్నాయి. సూప్‌లా వండిన చికెన్‌లో ‘సిస్టిన్/సిస్టయిన్’ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది మాత్రమే గాకుండా... ఇలా వండే సమయంలో ఆ సూప్‌లోకి ఖనిజ లవణాలూ, విటమిన్లతో పాటు మంచి పోషకాలన్నీ ద్రవంలా ఉడికే సూప్‌లోకి స్రవిస్తాయి. ఇదే సూప్‌లోకి ‘గ్లైసిన్’, ‘ప్రోలైన్’ లాంటి అనేక అమైనో యాసిడ్స్ సముదాయమైన జిలాటిన్ కూడా స్రవిస్తుంది. ఈ అమైనో యాసిడ్లూ, ఇతర పోషకాలు కలగలసిన సూప్ మన వ్యాధి నిరోధకశక్తిని మరింతగా పెంచుతుంది. ఈ అంశాలన్నీ జలుబు ఇతరత్రా ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. అంతేకాదు... ఈ చికెన్సూప్ దాదాపు ద్రవరూపంలో ఉండటం త్వరగా జీర్ణం కావడంతో పాటు అన్ని పోషకాలను వేగంగా దేహానికి అందిస్తుంది. జీర్ణశక్తినీ, కాలేయం పనితీరును మెరుగుపరిచి, ఎముకలను మరింత పటిష్టం చేయడానికీ చికెన్సూప్ దోహదపడుతుంది. -
24 వేల ఏళ్లుగా గడ్డకట్టే మంచులోనే పడిఉంది... కానీ ఆ జీవి బతికే ఉంది!
Cold grave for nearly 24,000 years without eating or drinking: చాలా షాకింగ్ ఘటనలు చూస్తే అసలు అదేలా సాధ్యం అని కూడా అనుకుంటాం. నిజానికి ఈ విశాలా విశ్వంలో మన ఊహకు అందని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కాకపోతే అసాధ్యం అనుకునేవి జరిగేంత వరకు కూడా మనం అంత తేలిగ్గా నమ్మం. అచ్చం అలాంటి సంఘటనే ఆర్కిటిక్ మంచు ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఆర్కిటిక్‌లో మైనస్ డిగ్రీల ఉష్టోగ్రత ఉంటుంది. పైగా చాలా దారుణమైన గడ్డకట్టుకుపోయేంత చలి. అలాంటి ప్రాంతంలో మంచు తుపానులో చిక్కుకున్న లేదా కూరుకుపోయిన బతికే ఛాన్స్ లేనే లేదు. కానీ శాస్త్రవేత్తలు ఆర్కిటిక్‌లోని గడ్డకటట్టే చలిలో పరిశోధనలు చేయడానికి వెళ్లినప్పుడూ వారికి ఒక ఊహించని షాకింగ్ ఘటన ఎదురైంది. అక్కడ మంచులో కూరుకుపోయి పడి ఉన్న ఒక వింత జీవిని చూశారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అది నిక్షేపంగా బతికే ఉంది. అయితే ఆ జీవి దాదాపు 24 వేల ఏళ్లుగా ఏమి తినకుండా, తాగకుండా మంచులోనే పడి ఉంది. ఇలాంటి వాటిని మైక్రో-జోంబీ జీవులు అంటారని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇలాంటి జంతువులు 50 మిలియన్ల ఏళ్ల క్రితం వివిధ నీటి ప్రాంతాల్లో కనుగొన్నారని చెప్పారు. అయితే ఈ జీవి చర్మం మంచు ప్రభావం ఏ మాత్రం కనిపించలేదని చెప్పారు. ఇది మాత్రమే కాదు, వీటిని లేడ్ రోటిఫర్స్ లేదా వీల్ యానిమల్స్ అని కూడా పిలుస్తారని అన్నారు. అయితే వీటి చర్మంపై చాలా కణాలతో కూడిన సూక్ష్మ జీవుల ఉంటాయని, పైగా నోటి చుట్టూ దట్టంగా వెంట్రుకలు ఉంటాయని అన్నారు. ఇంతకుముందు రష్యన్ శాస్త్రవేత్తలు -20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పది సంవత్సరాల వరకు జీవించగల అటువంటి రోటిఫర్‌లను కనుగొన్నారని కూడా చెప్పారు. అయితే ఇవి జన్మనివ్వవని, అలైంగికమైనవని తెలిపారు. అయితే శరీరం పొడవుగా ఉంటుందన్నారు. వాటి పొడవు 0.04 నుంచి 2 మిల్లీమీటర్ల వరకు ఉంటుందని, కానీ చాలా వరకు 0.5 మిల్లీమీటర్లకు మించి పెరగవు అని వెల్లడించారు. పరిమాణంలో చిన్నది అయినప్పటికీ వారి శరీరంలో చాలా క్లిష్టమైన అవయవాలు ఉన్నాయని వాటిని మైక్రోస్కోప్ లేకుండా చూడలేమని చెబుతున్నారు. ఈ రోటిఫర్‌లను చూస్తే ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింత జీవులు ఉన్నాయని అనిపిస్తుంది కదా (చదవండి: ఇంతకీ ఐపీఎస్ అధికారి సూట్ కేస్‌లో ఏముందో తెలుసా!) -
అయ్యో పాపం.. నిద్ర లేచేసరికి గతం మర్చిపోయింది!
జలుబు చేయడంతో ఓ మహిళ రాత్రి త్వరగా నిద్రలోకి జారుకుంది. ఉదయం ఆలస్యంగా నిద్ర లేచింది. అందులో ఏముంది అనుకుంటున్నారా? పడుకొని లేచేసరికి ఆమె తన గతం మర్చిపోయింది. ఇంగ్లండ్‌కు చెందిన క్లైర్ మఫ్ఫెట్ రీస్ అనే మహిళ 2021లో ఓ రోజు తీవ్రంగా జలుబు చేయడంతో త్వరగా నిద్రలోకి జారుకుంది. అయితే పొద్దునలేచేసరికి ఆమె కోమాలోకి వెళ్లింది. సుమారు16 రోజులు కోమాలోనే ఉండిపోయింది. కోమా నుంచి బయపడిన ఆమె దాదాపు 20 ఏళ్ల జ్ఞాపకాలను మర్చిపోయింది. ఇద్దరు పిల్లలు ఉన్న క్లైర్ మఫ్ఫెట్కు మెదడువాపు వ్యాధి సోకడంతో తన గతం మర్చిపోయినట్లు ఆమె భర్త స్కాట్ చెప్పాడు. ఫిబ్రవరి 22న ప్రపంచ మెదడు వ్యాపు వ్యాధి దినోత్సవం రోజున క్లైర్ మఫ్ఫెట్ తనకు జరిగిన ఈ ఘటనను వెల్లడించింది. Tomorrow marks World Encephalitis Day, so catch me and @Chipfatinasock on @PackedLunchC4 to raise awareness of encephalitis and how serious it is#worldencephalitisday #red4wed #theencephalitissociety #encephalitis #abi #acquiredbraininjury #stephspackedlunch #channel4 pic.twitter.com/33VXkBiF5y — Claire Muffett-Reece (@MrsMuffettReece) February 21, 2022 రెండు వారాల నుంచి ఆమెకు జలుబు ఉంది. తర్వాత ఆమె ఆరోగ్యం కూడా క్షిణించినట్లు స్కాట్ గుర్తించాడు. జలుబుతో పడుకున్న క్లైర్ మఫ్ఫెట్ పొద్దున నిద్రలేవలేదని.. అస్వస్థతకు గురైనట్లు కనిపించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కోమాలోకి వెళ్లిన ఆమెకు వెంటిలేటర్ అమర్చి వైద్యులు చికిత్స అందించారు. అయితే వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆమెకు మెదడువాపు వ్యాధి సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. "I woke up and had forgotten the past 20 years - I couldn't remember my kids' birthdays" Great article from Claire - a member of @encephalitis - who shares her story in @TheSun Read now 👉 https://t.co/DnHrINxWMa pic.twitter.com/OUlZ5veovX — Encephalitis Society (@encephalitis) January 24, 2022 క్లైర్ మఫ్ఫెట్ మాట్లాడుతూ.. ‘నేను దాదాపు 20 ఏళ్ల జ్ఞాపకాలను మర్చిపోయాను. అయితే అదృష్టవశాత్తు నాకు పిల్లలు ఉన్నారన్న విషయం గుర్తుంది. కానీ, వారికి నేను జన్మనిచ్చినట్టు, వారి పుట్టినరోజులు, అభిరుచులు, మొదటిసారిగా వారిని స్కూల్‌కు తీసుకెళ్లిన విషయాలు మర్చిపోయాను’ అని తెలిపింది. అయితే మరో అదృష్టకరమైన విషయం ఏమిటంటే.. తాను తన భర్తను మర్చిపోలేదని తెలిపారు. అలా జరిగి ఉంటే ఎలా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. కొన్ని జ్ఞాపకాలు మర్చిపోయినా తను ప్రస్తుతం సంతోషంగా ఉన్నానని తెలిపింది. -
మళ్లీ చలి..చలి.. రానున్న మూడు రోజులు తగ్గనున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశముందని వాతావరణశాఖ సూచించింది. రెండ్రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. మారిన వాతావరణ పరిస్థితులతో రానున్న మూడ్రోజుల పాటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదు కానుంది. రాష్ట్రంపై ఉత్తర–దక్షిణ ద్రోణి కొనసాగు తోంది. ఇది నైరుతి బిహార్ నుంచి ఛత్తీస్‌గఢ్, విదర్భల మీదుగా ఉత్తర తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతో శని, ఆది, సోమవారాల్లో నారాయణపేట్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మిగతా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మొత్తంగా సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత నిజామాబాద్‌లో 33.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 11.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కాగా, రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని వెల్లడించింది. -
మరో రెండ్రోజులు చలి తీవ్రత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు బలంగా వీస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరుగుతున్నట్టు వివరించింది. రానున్న రెండ్రోజులు ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని సూచించింది. ఆదివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 6.7 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 31 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సోమ, మంగళవారాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. -
వణికిస్తున్న చలి.. తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది ఎక్కడో తెలుసా?
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్రాన్ని మళ్లీ చలి చుట్టేసింది. అన్ని ప్రాంతాల్లో సాధారణ సగటు కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా అర్లీ(టీ)లో 4.9 డిగ్రీలుగా నమోదైంది. ఇంకా కుమరంభీంలో 5.8, సిర్పూర్ (యు)లో 5.8, గిన్నెధరిలో 6.0, సంగారెడ్డి జిల్లా న్యాలకల్‌లో 6.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలవారీగా చూస్తే పెద్దపల్లి, హన్మకొండ జిల్లాల్లో వీస్తోన్న ఈశాన్య గాలుల ఫలితంగా ఏకంగా 6 నుంచి 8 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడు రోజుల చలి తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. కాగా, గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 30.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. -
జ్వరం, జలుబు, దగ్గుతో ఉక్కిరిబిక్కిరి.. కరోనా కావచ్చేమోనని?
సాక్షి, హైదరాబాద్: ఎల్లారెడ్డిగూడకు చెందిన సతీష్‌కు 10 రోజులుగా జలుబు, దగ్గు. రాత్రిళ్లు శ్వాస పీల్చుకోవడం కష్టంగా మారింది. ఇంటి వైద్యాలు, అలవాటైన మందులు వాడుతున్నా తగ్గినట్టే తగ్గుతూ పెరుగుతూ ఉంది. జలుబూ దగ్గు వదలకపోవడం ఒళ్లునొప్పులు, తేలికపాటి జ్వరం.. ఇవన్నీ చూసి కరోనా పరీక్షలు చేయించుకోమంటూ సన్నిహితులు పోరు చేస్తున్నారు.. ప్రస్తుతం నగరంలో అనేక మందికి సతీష్ లాంటి పరిస్థితి ఎదురవుతోంది. తమకు వచ్చింది సాధారణ సీజనల్ సమస్యా? కరోనా? అనే సందేహాలతో సతమతమవుతున్నవారు. ఇలాంటివారు నగరంలో రోజురోజుకూ పెరుగుతున్నారు. కష్టాలు పెంచిన వర్షాలు... గత కొన్ని రోజులుగా నగరంలో చలి తీవ్రతను మించి వర్షాలు, చలిగాలుల తాకిడి ఎక్కువైంది. ఇది సహజంగానే సిటిజనుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఓ వైపు వింటర్ సీజన్. మరోవైపు అకాల వర్షాలు.. దీంతో సీజనల్‌గా వచ్చే జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్.. వంటివి మరింతగా పెరిగాయి. మరోవైపు కరోనా సైతం విజృంభిస్తుండడం దీని లక్షణాలు కూడా దాదాపుగా అవే కావడంతో ఏది సాధారణ వ్యాధో, ఏది మహమ్మారో తెలియక నగరవాసులు అయోమయానికి, భయాందోళనకు గురవుతున్నారు. పరీక్షకు వెళ్లాలంటే ఓ రకమైన భయం, వెళ్లకపోతే మరో రకమైన భయం వారిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో కంగారు పడవద్దని కాస్త అప్రమత్తంగా ఉంటే చాలని వైద్యులు చెబుతున్నారు. చదవండి: ‘ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు మాస్కులు ధరించడం లేదు’ సాధారణమైతే సందేహం వద్దు.. జలుబు, దగ్గు కొందరికి సీజనల్‌గా దాదాపు ప్రతి యేటా వస్తుంటాయి. అలాంటివారికి ఈ అకాల వర్షాల వాతావరణంలో మరింత సులభంగా వస్తాయి. అంతేకాకుండా అస్తమా, డయాబెటిస్ వంటి వ్యాధులున్నా, బైపాస్ సర్జరీ చేయించుకున్నా, స్టంట్ వేయించుకున్న వారిలో సహజంగానే ఇమ్యూనిటీ తక్కువగా ఉండి శ్వాసకోస వ్యాధులు, సీజనల్ ఫ్లూ రావచ్చు. ► ఇలాంటి వారు చల్లటి వస్తువులు తీసుకోవడం, చల్లటి ప్రదేశాల్లో ఉండడం, వర్షంలో తడవాల్సి రావడం వల్ల ఈ సమస్యలు రెట్టింపవుతాయి. వెంటనే ఇది కరోనా కావచ్చని ఆందోళన చెందనక్కర్లేదు. అలాగే ఎక్కువగా బయటకు వెళ్లాల్సిన, సమూహాల్లో పనిచేయాల్సిన అవసరం లేనివాళ్లు కూడా బెంబేలెత్తనవసరం లేదు. అలాగని మరీ నిర్లక్ష్యం చేయకూడదనీ వైద్యులు చెబుతున్నారు. చదవండి: దేశీయ వ్యాక్సిన్‌తో ఒమిక్రాన్‌కి చెక్! 3 రోజులు దాటితే... తగినంత ఇమ్యూనిటీ ఉండి, సీజనల్ వ్యాధులకు గురయ్యే మెడికల్ హిస్టరీ లేనివాళ్లు, జ్వరం, ఒళ్లునొప్పులు తదితర సమస్యలు 3 రోజులు దాటి ఉంటే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవడం మంచిది. ఒకవేళ కరోనా అని తేలినా ఆందోళన చెందనవసరం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడితే 2 వారాల వ్యవధిలోనే పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. ఏదేమైనా భయాందోళనలకు గురికాకపోవడం అన్నిరకాలుగా మంచిది. ఏ సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభం నుంచే వైద్యుల సలహా మేరకు నడచుకోవడం ఇప్పటి పరిస్థితుల్లో అవసరం. పాజిటివ్ పెరుగుతున్నా... తీవ్రత లేదు సీజనల్ వ్యాధులన్నీ కరోనా కావచ్చనే భయం సహజమే అయినా అన్నీ అవుతాయనుకోలేం. ఫ్లూ లక్షణాలు 3 రోజులు పైబడి ఉన్నవారికి కరోనా పరీక్షలు తప్పనిసరిగా సిఫారసు చేస్తున్నాం. అలా సిఫారసు చేస్తున్నవారిలో ప్రస్తుతం గత 10 రోజులుగా చూస్తే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారే ఎక్కువ. గతంలో ఉన్నంత తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేకపోవడం మాత్రం ఊరట కలిగించే అంశం. – డా.జి.నవోదయ, కేర్ ఆస్పత్రి -
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తోన్న చలి తీవ్రత
-
ఫీలింగ్ గజగజ..
-
వణుకుతున్న తెలంగాణ.. ఈ సీజన్లోనే అత్యల్పం నమోదైంది అక్కడే..
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో చలిగాలులు వణుకు పుట్టిస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో సాయంత్రం ఆరేడు గంటల నుంచే చలి ప్రభావం చూపిస్తోంది. హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలులతో రాష్ట్రంలో, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఒక్కరోజులోనే కనిష్ట ఉష్ణోగ్రత దాదాపు మూడు డిగ్రీలు తగ్గిపోవడం చలి తీవ్రతను స్పష్టం చేస్తోంది. సోమవారం ఈ సీజన్లోనే అత్యల్పంగా కుమురం భీం జిల్లా సిర్పూరు(యూ)లో 6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. మంగళవారం ఇదే జిల్లాలోని గిన్నెదరిలో 3.5 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. సిర్పూరు(యూ)లో 3.8 నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లా బేలాలో కూడా 3.8, అర్లి(టీ)లో 3.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీనికి ముందు 2015 జనవరి 10న సంగారెడ్డిలోని కోహిర్లో తెలంగాణ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. అంతకుముందు 2014 డిసెంబర్ 18న కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో 2.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఆ తర్వాత ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇదే మొదటిసారి. దీంతో అత్యవసరం అయితే తప్ప రాత్రి, ఉదయం పూట ప్రజలు బయటికి రావడం లేదు. తెల్లవారుజామున పొగమంచు కమ్ముకుంటోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరో వారం రోజుల పాటు గణనీ యంగా పడిపోయే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతా వరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొ న్నారు. బుధవారం రాత్రి కొన్ని ప్రాంతాల్లో సాధా రణ ఉష్ణోగ్రతల కన్నా 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశముందని నాగరత్న తెలిపారు. ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదం చలికాలంలో చాలామందిలో జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఎక్కువగా కన బడుతుంటాయి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదముంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకు రెండు పూటలా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ కాలంలో చర్మంపై దద్దుర్లు, అలర్జీలు వస్తుం టాయి. కాబట్టి ఉన్ని దుస్తులు ధరించాలి. చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్ వాడాలి. వాహ నదారులు స్వెటర్లు, సాక్స్, గ్లౌజ్‌లు వాడాలి. వేపుడు పదార్థాలు, మసాలాలు కాకుండా పోష కాలు ఉండే ఆహారం, కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. గోరువెచ్చని నీటిని తాగాలి. ఆహారం కూడా వేడివేడిగా తీసుకోవాలి. అస్తమా, టీబీ వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. గుండె జబ్బులు ఉన్నవారు ఉదయం చలిగాలిలో వాకింగ్ చేయకూడదు. ఉదయం 8 గంటలకు ముందు, సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు వెళ్లకూడదు. వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. –డాక్టర్ హెఫ్సిబా, హైదరాబాద్ -
చలిపులితో పోరాటం!
దేశమంతా గజగజ వణుకుతోంది. ఉత్తరాది నుంచి దక్షిణాది దాకా డిసెంబర్ నాటికే చలి పులి చేతికి చిక్కి, జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్రమైన శీతల గాలులతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తత్ఫలితంగా తలెత్తుతున్న అనారోగ్య పరిణామాలు ఆందోళన రేపుతున్నాయి. దేశరాజధానిని చలి గాలి బలంగా తాకింది. ఢిల్లీలో ఈ సీజన్‌లోకెల్లా అతి తక్కువ ఉష్ణోగ్రత (3.1 డిగ్రీలు) సోమవారం నమోదైంది. కొద్దిరోజులుగా శ్రీనగర్‌లో వరుసగా రెండు రాత్రుళ్ళు మైనస్ 6 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పడిపోయింది. రాజస్థాన్‌లోని చురూలో ఏకంగా మైనస్ 0.5 డిగ్రీలకు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో హైదరాబాద్ సహా అనేక ప్రాంతాలు చలితో గడగడలాడుతున్నాయి. శీతల, అతి శీతల గాలుల గుప్పెట్లో ఉత్తర భారతావని ఉందని భారత వాతావరణ శాఖ శనివారం ప్రకటించింది. కొద్ది రోజుల పాటు బాధలు తప్పవని హెచ్చరించింది. ఢిల్లీ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్ము – కాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్ – బాల్టిస్తాన్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లు ఇప్పటికే తీవ్రమైన చలి గాలుల్లో చిక్కుకున్నాయి. మార్గశిర, పుష్య మాసాల హేమంత ఋతువులో శీతల పవనాలు, హిమ శీకరాలు సాధారణమే. కానీ, ప్రకృతి కోపించినట్లు ఇంతలేసి చలి మాత్రం ఇటీవలి అసాధారణం. 1991 నుంచి 2019 మధ్య మూడు దశాబ్దాల్లో శీతల గాలులు విజృంభిస్తున్నాయనీ, గత రెండు దశాబ్దాల్లో 4,712 మంది చనిపోయారనీ అధికారిక లెక్క. మానవ తప్పిదాల వల్ల ఎండాకాలంలో ఎండ, వానాకాలంలో వాన, శీతకాలంలో చలి – మూడూ దుర్భరస్థాయికి ఎగబాకడం ఇప్పుడు ప్రపంచవ్యాప్త ఆందోళనకర పరిణామం. ఉష్ణోగ్రతల్లోని భారీ మార్పులు వ్యవసాయం, పశుసంపద, జీవనోపాధి, పర్యావరణం, ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నాయి. సాక్షాత్తూ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ఆ మాట చెప్పింది. వర్ధమాన దేశాల్లో ఏటా పెద్ద సంఖ్యలో మరణాలూ సంభవిస్తున్నాయి. ఉత్తర భారతావనిలో కొండ ప్రాంతాలు, వాటిని ఆనుకొన్న మైదానాలతో 17 రాష్ట్రాలలో ‘ప్రధానమైన శీతల గాలుల జోన్’ విస్తరించి ఉంది. దాదాపు 90.90 కోట్ల జనాభా ఈ జోన్లోనే జీవిస్తోంది. వీరిని బాధిస్తున్న శీతల గాలులపై ఎక్కడికక్కడ యాక్షన్ ప్లాన్లు సిద్ధం చేసుకొనేందుకు ‘జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ’ (ఎన్డీఎంఏ) ఈ ఏప్రిల్‌లో మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిని ఎవరు, ఎంత వరకు ఆచరణలో పెట్టారో ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టమే. కనిష్ఠ ఉష్ణోగ్రత మైదాన ప్రాంతాల్లో 10 డిగ్రీల కన్నా తగ్గినా, పర్వత ప్రాంతాల్లో సున్నా డిగ్రీల కన్నా తగ్గినా అది ‘శీతల గాలి’ పరిస్థితి అని భారతీయ వాతావరణ శాఖ లెక్క. మరోలా చెప్పాలంటే, సాధారణ ఉష్ణోగ్రత కన్నా 4.5 నుంచి 6.4 డిగ్రీలు తగ్గితే – కోల్డ్ వేవ్. 6.4 డిగ్రీలకు మించి తగ్గితే, తీవ్రమైన కోల్డ్ వేవ్. దేశంలో అనేక చోట్ల ఇప్పుడీ పరిస్థితే ఉంది. తలదాచుకొనే గూడు, ఒంటి నిండా వస్త్రాలు లేని అధిక శాతం మందికి జీవన్మరణ సమస్యగా పరిణమించింది. అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ వైద్య సంస్థలో వైద్యం కోసం వచ్చిన రోగులు, వారి కుటుంబాలు పడకలు ఖాళీ లేక, చలిలో రోడ్డు మీద తాత్కాలిక గుడారాలు వేసుకొని, కాలక్షేపం చేస్తున్న దయనీయ దృశ్యాలు జాతీయ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. కొన్నేళ్ళుగా ప్రతి ఏటా దర్శనమిస్తున్న ఈ దృశ్యాలు ఈసారీ షరా మామూలు కావడం విషాదం. ప్రభుత్వాలు, పాలకుల పాత్ర ఇక్కడే కీలకం. తలదాచుకొనేందుకు నీడ లేని నిర్భాగ్యులను ఎముకలు కొరికే చలికి వదిలేయడం ఏ రకంగా చూసినా ధర్మం కాదు. నిజానికి, నిరాశ్రయులకు దేశంలో మరే నగరంలోనూ లేనన్ని షెల్టర్లున్నది దేశ రాజధానిలోనే! ఈసారి కూడా నిరాశ్రయులను చలి కోరల నుంచి కాపాడేందుకు ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్ నవంబర్లోనే యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించింది. మొన్న నవంబర్ 7 నుంచి వచ్చే మార్చి 15 వరకు ఆ ప్లాన్‌ను అమలులో పెడతామంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న 206 షెల్టర్లలో 7092 మందికి ఆశ్రయమిచ్చే అవకాశం ఉంది. కొత్తగా మరో 2 వేల మందికి, 250 తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేయాలని ఢిల్లీ సర్కార్ సంకల్పించింది. చాపలు, దుప్పట్లు, లాకర్లు, కాలకృత్యాలకు వసతులు – అన్నీ కల్పిస్తా మన్నారు. అయితే, క్షేత్రస్థాయిలో అనేక లోటుపాట్లున్నట్టు జాతీయ మానవ హక్కుల సంఘం సహా అనేక ఎన్జీఓల పరిశీలనలో వెల్లడైంది. నిరాశ్రయుల సంఖ్యకు తగ్గట్టు షెల్టర్లు లేవు. ఉన్నవి కూడా దయనీయావస్థలో ఉన్నాయి. అవసరార్థులకు సమీప షెల్టర్ల సమాచారం చెప్పే పరిస్థితి లేదు. తెలిసి వెళ్ళినా, రాత్రి 8 గంటల వేళకే జనంతో నిండిపోతున్నాయి. చాలామందికి జాగా లేని దుఃస్థితి. దాదాపుగా దేశంలోని ప్రతి నగరంలోనూ నిర్భాగ్యులకు ఎదురవుతున్నది ఇలాంటి నిర్లక్ష్యమే! అసలు ఇలాంటి అభాగ్యులకు నిలువ నీడ కల్పించడానికి ‘జాతీయ పట్టణప్రాంత జీవనోపాధి ప్రణాళిక – పట్టణప్రాంత నిరాశ్రయులకు ఆవాసం’ పేరిట ఓ జాతీయ ప్రణాళిక ఉంది. సుప్రీమ్ కోర్టు మార్గదర్శకాల ప్రకారమైతే, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిరాశ్రయుల కోసం గౌరవప్రదమైన, శాశ్వత షెల్టర్లను నిర్మించడం చట్టప్రకారం విధాయకం. కానీ, స్థానిక, రాష్ట్ర సర్కార్లు ఏ మేరకు చొరవ చూపుతున్నాయి? ఇప్పటికైనా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రభుత్వాలు కాగితంపై ఉన్న కేంద్రీయ విధానాన్నీ, కోర్టు మార్గదర్శకాలనూ తు.చ. తప్పక కార్యాచరణలో పెట్టాలి. అప్పుడే ఈ చలి పులి పంజా విసురు నుంచి నిర్భాగ్యులు తప్పించుకోగలుగుతారు. -
మైనస్ 1 డిగ్రీ చలిలో.. షర్ట్ తీసేసి పరుగులు పెడుతున్న హీరో.. వీడియో వైరల్
గతంలో సినిమా హీరోలు నటన, డాన్స్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు. ట్రెండ్ మారుతుండడంతో కాలానుగుణంగా హీరోలలోనూ మార్పులు వచ్చాయి. ప్రస్తుతం హీరోలు తమ శరీరాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అందుకే ఒకప్పుడు సిక్స్ ప్యాక్ హీరోల జాబితాలో ఒకరో ఇద్దరో ఉంటే ప్రస్తుతం చాలా మంది ఆ జాబితాలో చేరిపోయారు. ఇక ప్రత్యేకంగా బాలీవుడ్లో.. టైగర్ ష్రాఫ్ తన బాడీ ఫిట్‌గా ఉంచడంలో ఏ మాత్రం రాజీ పడడన్న విషయం తెలిసిందే. అలా శ్రద్ధ తీసుకుంటున్నాడు కాబట్టే బీ టౌన్లో రకరకాల స్టంట్స్ చేస్తూ యాక్షన్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. తాజాగా టైగర్ ‘గణ్‌పత్’ సినిమా షూటింగ్ యూరప్‌లో జరుగుతోంది. యూరప్ లాంటి దేశాలలో ప్రస్తుతం గడ్డకట్టే చలి వాతావరణం ఉంటుందన్న సంగతి తెలిసిందే. టైగర్ ష్రాఫ్ అంతటి చలి వాతావరణంలో కూడా ఉదయాన్నే లేచి షర్టు లేకుండా కేవలం షార్ట్స్ ధరించి అలా జాగింగ్ చేశాడు. ఆ వీడియోని తన ఇన్‌స్టా అకౌంట్లో షేర చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వాళ్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. అందులో దిషా పటానీ.. ‘లోల్’, రకుల్.. ‘వావ్! అంత చలిలో ఎలా?’ అంటూ స్పందించారు. ‘గణ్‌పత్’ చిత్రంలో టైగర్ సరసన కృతి సనన్ హీరోయిన్గా నటిస్తోంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్న ఈ చిత్రం జాకీ భగ్నానీ నిర్మిస్తున్నారు. ఇది వరకే వీరిద్దరు హీరోపంతీ అనే సినిమాలో కలిసి నటించారు. View this post on Instagram A post shared by Tiger Shroff (@tigerjackieshroff) చదవండి: Vicky Kaushal-Katrina Kaif: భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకొచ్చిన కత్రినా, విక్కీ కౌశల్ -
ఐస్‌క్రీమ్ చల్లగా ఉందేంటి, నా డబ్బులు తిరిగి ఇచ్చేయండి.. కస్టమర్ ఫిర్యాదు
గతంలో పుడ్ తినాలంటే హోటల్‌కి వెళ్లి తినేవాళ్లం. కానీ స్విగ్గి, జొమాటో లాంటి ఆన్లైన్ యాప్‌లు వాడకంలోకి వచ్చాక కూర్చున్న చోటు నుంచే నచ్చిన పుడ్‌ని తెప్పించుకు తింటున్నాం. కస్టమర్ల సౌకర్యం కోసం ఆన్లైన్ పుడ్ డెలివరీ యాప్‌లు కొన్ని రూల్స్‌ని పాటిస్తుంటాయి. అయితే కొందరు కస్టమర్లు మాత్రం వీటిని అలుసుగా తీసుకుని డబ్బులు ఇవ్వకుండా కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు. ఇటువంటి ఘటనలే యూకేలోని ఓ హోటల్లో చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. యూకేలోని ఓల్డ్‌హామ్‌లో హాసన్ హాబిబ్ అనే వ్యక్తికి జస్ట్ ఈట్ అనే రెస్టారెంట్ ఉంది. అన్ని హోటల్లో లానే అందులో టేక్ అవే సౌకర్యం ఉంది. ఆ ప్రాంతంలో పుడ్ సరిగా లేకుంటే మనీ రీఫండ్ లాంటి స్వీమ్‌లు కొన్ని కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంటాయి. అయితే కొందరు దాన్నే అదునుగా తీసుకుని ఫుడ్ ఆర్డర్ చేస్తూ డెలివరీ అయ్యాక ఏదో ఒక సాకులు చెప్పి.. డబ్బులు రిఫండ్ చేయాలంటూ రెస్టారెంట్‌పై ఫిర్యాదులు చేస్తున్నారట. ఇటీవల ఓ కస్టమర్.. ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసి డెలివరీ కాగానే ఐస్‌క్రీమ్ చల్లగా ఉంది నాకేమి నచ్చలేదు మనీ రిఫండ్ చేయాలని రిక్వెస్ట్ పెట్టాడట. ఇదొక్కటే కాదు ఇలాంటి సిల్లీ కారణాలతో మనీ రిఫండ్ చేయాలని ఫిర్యాదులు రోజు వస్తూనే ఉండడంతో ఆ రెస్టారెంట్ ఓనర్ ఆన్లైన్ ఆర్డర్స్, టేక్ అవేని ఆపేశాడట. చివరకి ఆ రెస్టారెంట్ యజమాని తన కస్టమర్లు ఎవరైనా ఫుడ్‌పై ఫిర్యాదు చేయాలనుకుంటే.. దానికి కొంత చార్జ్ వసూలు చేయడం మొదలు పెట్టాడు. కనీసం 30 రోజుల గడువు తీసుకొని ఆలోపు కస్టమర్ల ఫిర్యాదులో పేర్కొన్న విధంగా సమస్య ఉంటే.. రిఫండ్ ఇవ్వడం ప్రారంభించారు. చదవండి: వర్క్ ఫ్రం హోం చేసినా బీమా చెల్లించాల్సిందే! -
ఈసారి ‘చలించుడే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలో గత రెండ్రోజులుగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 4 నుంచి 6 డిగ్రీల మేర తగ్గాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సగటున 30 డిగ్రీల కన్నా తక్కువగా ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం ఆదిలాబాద్‌లో అతి తక్కువగా 12.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డవగా, మెదక్‌లో అతి ఎక్కువగా 32.6 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ శీతాకాలంలో ఇప్పటివరకు నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యల్పం. రెండ్రోజులు పొడి వాతావరణం ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, హన్మకొండ, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు 4 నుంచి 6 డిగ్రీల మేర పడిపోయాయి. రానున్న 4 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండ్రోజులు పొడి వాతావరణమే ఉంటుందని చెప్పింది. ఈశాన్య రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేకున్నా ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో కనిష్ణ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రేపు దక్షిణ అండమాన్‌లో అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రంలో ఈ నెల 30న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 48 గంటల తర్వాత అల్పపీడనం బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని తెలిపింది. -
అల్లం పాలు తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..?
Benefits of drinking ginger milk: ఒక కప్పు పాలలో టీ స్పూను అల్లం తురుము వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. తరువాత చిటికెడు మిరియాలపొడి, చిటికెడు దాల్చినచెక్క పొడి, కొద్దిగా బెల్లం తురుము కలపాలి. గోరువెచ్చగా ఉండగానే ఈ పాలను తాగాలి. అల్లం పాలను రోజూ తాగడం వల్ల జలుబు, ఫ్లూ, అజీర్ణ వంటి సమస్యలు తగ్గుతాయి. అల్లం పాలలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరానికి అందుతాయి. ముఖ్యంగా చలి కాలంలో ఈ పాలను తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది చదవండి: ఎయిర్ హోస్టెస్‌ల అర్థనగ్న నిరసనలు.. కారణం అదేనట..! -
నోటి నుంచి దుర్వాసన, దగ్గు, పుండ్లతో బాధపడుతున్నారా.. ఇవి పాటిస్తే!
ఇమ్యునిటీ బలహీనంగా ఉంటే సీజనల్ వ్యాధులు ఎప్పుడూ పొంచి ఉంటాయి. ఇక జలుబు, దగ్గు వంటి వ్యాధులైతే దాడి చేస్తూనే ఉంటాయి. గొంతు పొడిబారటం, పొడి దగ్గు రావటం వీటి ప్రధాన లక్షణాలు. సాధారణంగా కఫం ఉత్పత్తికాకపోతే దగ్గు వస్తుంది. ఒక్కోసారి అయితే వైరల్ ఇన్ఫెక్షన్లు, అలర్జీల వల్ల కూడ దగ్గు వస్తుంది. ఇది ఎక్కువకాలం కొనసాగితే ఆహారం నమలడం, మింగడంలో సమస్యలు తలెత్తుతాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ అండ్ క్రానియోఫేషియల్ రీసెర్చ్ నివేదికల ప్రకారం నోరు మంట, పెదాల పగుళ్ళు, గొంతులో చికాకు, దగ్గు, నోటి పుండ్లు, దుర్వాసన వంటివి పొడిగా ఉండే నోటి లక్షణాలు. మనలో చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య ఇది. అయితే ఇంటిలో సులభంగా తయారు చేసుకునే రెమిడీలతో వీటినుంచి ఉపశమనం పొందవచ్చు! నిపుణులు సూచించిన ఈ చిట్కాల ద్వారా పొడిగొంతు సమస్యను ఏ విధంగా అధిగమించవచ్చో తెలుసుకుందాం.. తులసి, తేనెలతో టీ పూర్వం నుంచే మన ఆయుర్వేద శాస్త్రంలో తులసి, తేనెలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రకృతి అందించే సహజసిద్ధమైన తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటి ఫంగల్ కారకాలు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలను నివారించడంలో తోడ్పడతాయి. అలాగే తులసిలో కూడా ఔషద గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇంటి వైద్యం, నాటు వైద్యాలలో వీటికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తులసి, తేనెలతో తయారు చేసిన టీ పొడి దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పసుపు కలిపిన పాలు పొడి గొంతు సమస్యలకు, దగ్గు సంబంధిత రుగ్మతలకు ఇది బాగా పనిచేస్తుంది. పసుపును ఆహారంలో భాగంగా తీసుకున్నట్టయితే వ్యాధుల బారి నుంచి కాపాడటమేకాక, ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. గ్లాసు వేడిపాలల్లో, చిటికెడు పసుపు వేపి తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. నెయ్యితో మిరియాల పొడి యాంటీ బ్యాక్టీరియల్ (సూక్ష్మజీవుల వినాశక), యాంటీ ఫంగల్ (తాపనివారక) లక్షణాలు నెయ్యిలో అధికంగా ఉంటాయి. ఒక టేబుల్ స్ఫూన్ వేడి నెయ్యిలో చిటికెడు మిరియాల పొడిని కలిపి తినండి. గొంతు తడిగా ఉంచడానికి ఇది బాగా పనిచేస్తుంది. అయితే దీనిని తిన్నతర్వాత ఏ విధమైన పానియాలు తాగకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ములేథి లేదా లికోరైస్ మూలిక చూర్ణం లికోరైస్ అనేది ఒక ఆయుర్వేద మూలిక. ఈ ఔషధ మొక్క రుచి తియ్యగా ఉండటం వల్ల దీనిని అతిమధురం అని కూడా అంటారు. ఈ మూలికను చిన్న ముక్కగా తుంచి, నోట్లో వేసుకుని నమలడం వల్ల రోజంతా గొంతును తడిగా ఉంచుతుంది. సాధారణంగా దీనిని శ్వాస, పేగు సంబంధిత రుగ్మతల నివారణకు వినియోగిస్తారు. ఉప్పునీరు పొడి గొంతు సమస్య నివారణకు తేలికైన, అత్యంత ప్రభావవంతమైన మరొక పద్ధతి ఉప్పు నీటి పుక్కిలింత. వేడి నీటిలో ఉప్పు కలిపి రోజుకి కనీసం రెండు సార్లైనా పుక్కిలించాలి. ఈ విధంగా చేయడం వల్ల గొంతులో పేరుకుపోయిన జిగట వంటి శ్లేష్మాన్ని కరిగించి పలచబరుస్తుంది. తక్షణ ఉపశమనానికి ఇది చక్కని మార్గం. హెర్బల్ టీ కాలుష్యం, దుమ్మూ ధూళి వల్ల గొంతులో చికాకుపుట్టించే సమస్యలకు శ్రేష్ఠమైన పరిష్కారం హెర్బల్ టీ. వీటివల్ల ఊపిరితిత్తులు కూడా ప్రభావితం అవుతాయి. పచ్చ యాలకులు, లవంగ మొగ్గలు వంటి సమాలా దినుసుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటితో తయారు చేసిన టీ తాగడం వల్ల కాలుష్యకారకాలైన ధూళికణాలు ఆరోగ్యానికి హాని తలపెట్టకుండా నిరోధించడంలో తోడ్పడుతుంది. మెంతుల డికాషన్ వివిధ రకాల గొంతు రుగ్మతలను నివారించడంతోపాటు, పలు ఆరోగ్య సమస్యల నివారణలో కూడా మెంతులు ఉపయోగపడతాయి. మెంతి గింజలను నీటిలో వేసి రంగు మారేంతవరకు ఉడికించాలి. అనంతరం ఈ డికాషన్‌ను చల్లార్చి, రోజుకు రెండు సార్లైనా పుక్కిలించాలి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా పొడి దగ్గు, గొంతు పొడిబారడం వంటి రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: Weight Loss: ప్రతి ఉదయం ఈ డ్రింక్ తాగారంటే.. మీరే ఆశ్చర్యపోతారు!! -
కరోనా వచ్చి పోయినా జలుబు తగ్గట్లేదు.. బ్లాక్ ఫంగసా?
సాక్షి, ఖమ్మం: కరోనా సోకిన వారు అనవసర ఆందోళన చెందొద్దని, ధైర్యంగా ఉండి.. వైద్యులు సూచించిన మందులు వాడడం ద్వారా మహమ్మారిని జయించొచ్చని ఖమ్మంలోని సాయిరాం గ్యాస్ట్రో, లివర్ హాస్పిటల్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ డాక్టర్ జంగాల సునీల్ కుమార్ అన్నారు. మంచి ఆహారం, ప్రశాంత జీవనం, కంటినిండా నిద్ర ద్వారా త్వరగా కోలుకోవచ్చని తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉండి కూడా మనో నిబ్బరంతో కరోనా గండాన్ని అధిగమించిన వారు అనేకమంది ఉన్నారని తెలిపారు. గాలి, వెలుతురు ఉన్న గదిలో ఉంటూ, ఎక్కువ శాతం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇంట్లో వారితో దూరం పాటిస్తూ ఉండాలని, ప్రతిరోజూ 3 నుంచి∙4 లీటర్ల మంచినీళ్లు తాగుతూ, ప్రొటీన్, విటమిన్లతో కూడిన ఆహారం తీసుకోవాలన్నారు. సాక్షి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అనేకమంది ఫోన్ చేసి సందేహాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జంగాల సునీల్ కుమార్ వాటిని నివృత్తి చేశారు. డాక్టర్ జంగాల సునీల్ కుమార్, గ్యాస్ట్రెంటాలజిస్ట్, సాయిరాం గ్యాస్ట్రో లివర్ హాస్పిటల్, ఖమ్మం చదవండి: Corona: పిల్లల్లో కోవిడ్ లక్షణాలను ఎలా గుర్తుపట్టాలి? ఆ వివరాలు ఇలా.. ఖమ్మం నుంచి సాంబయ్య: నేను పది రోజుల్నుంచి హోం ఐసోలేషన్‌లో ఉన్నా. కరోనా ఎప్పుడు తగ్గిపోతుంది సార్? డాక్టర్: ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటే 15 రోజుల్లో తగ్గిపోతుంది. ఆ తర్వాత సాధారణ జీవనాన్ని కొనసాగించవచ్చు. కరోనా తగ్గినా చాలా మందికి నీరసంగా ఉంటుంది. బలవర్థకమైన ఆహారాన్ని తీసుకోవాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉంటే మంచిది. కామేపల్లి నుంచి సంతోష్: ఈ రోజుల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? డాక్టర్: లక్షణాలు ఉన్న వారు ప్రతిరోజూ లిక్విడ్ ఫుడ్ తీసుకోవడం మంచిది. తరచూ పండ్ల జ్యూస్, పెరుగన్నం, కొబ్బరి నీళ్లు, జావ, ఉడక బెట్టిన గుడ్లు తీసుకోవాలి. లక్షణాలు తగ్గిన తర్వాత చేపలు, కాయగూరలు, పన్నీరు, డ్రైఫ్రూట్స్, వాటర్ మిలన్ సీడ్స్, గుమ్మడి కాయసీడ్స్, పొద్దుతిరుగుడు గింజలతో కూడినవి తీసుకోవాలి. అలాగే ప్రొటీన్ ఫుడ్ కూడా తీసుకోవాలి. ఖమ్మం నుంచి నాగేశ్వరరావు: నాకు కరోనా వచ్చి పోయింది. కానీ జలుబు తగ్గట్లేదు ఎందుకు? డాక్టర్: ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్లాక్ ఫంగస్‌కి సాధారణంగా కళ్లు, ముఖం వాపు, జ్వరం, తదితర లక్షణాలు ఉంటాయి. ఇది అలాంటిది కాదులెండి. సిట్రజిన్ టాబ్లెట్ వేసుకోండి. రెండు, ముడు రోజుల్లో తగ్గుద్ది. ఖమ్మం నుంచి షర్ఫుద్దీన్: నాకు 20 రోజులుగా ఆయాసం వస్తోంది. కరోనా అనుకోవచ్చా డాక్టర్? డాక్టర్: పల్స్ ఆక్సిమీటర్‌తో చెక్ చేసుకుంటే 95 శాతానికి పైగా ఉంటే ఇబ్బంది లేదు. అంతకన్నా తక్కువైతే డాక్టర్‌ను సంప్రదించండి. కరోనా లక్షణాలు ఉన్న వారు 7 రోజులకు సీటీ స్కాన్ చేయించుకుంటే కచ్చితమైన రిపోర్ట్ వస్తుంది. చింతకాని నుంచి అనంత్: నాకు కరోనా వచ్చి రెండు వారాలైంది. ఆక్సిజన్ లెవెల్స్ 85 శాతానికి పడిపోయాయి. ఏం చేయాలి? డాక్టర్: ఆక్సిజన్ లెవెల్స్ 95 శాతానికి పడిపోతే ఇబ్బంది ఉంటుంది. ఆక్సిజన్ రేటు సాధారణ స్థితికి వచ్చే వరకు ఆక్సిజన్ పెట్టుకోవాలి. భయపడకుండా ఉండండి. తగ్గిపోతుంది. ముదిగొండ నుంచి సీతారామరాజు: బీపీ, షుగర్ ఉన్న వారు టీకా తీసుకోవచ్చా? డాక్టర్: బీపీ, షుగర్‌కు టీకా తీసుకోవడానకి ఎలాంటి సంబంధం లేదు. నిర్భంయంగా తీసుకోవచ్చు. తర్వాత కొందరికి జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తుంటాయి. అంతమాత్రాన ఆందోళన చెందకూడదు. ఒకటి, రెండు రోజులు మాత్రమే ఉంటాయి. బల్లేపల్లి నుంచి రఘురాం: కోవిషీల్డ్ రెండో డోసు ఎప్పుడు వేయించుకుంటే మంచిది? డాక్టర్: సాధారణంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ 6 నుంచి 8 వారాల మధ్య వేసుకోవాలి. ఇటీవల ఐసీఎంఆర్ 12 నుంచి 16 వారాల మధ్య వేసుకోవచ్చని సూచించింది. కరోనా నుంచి బయట పడాలంటే వ్యాక్సిన్ వేయించుకోవడం ఒక్కటే మార్గం. -
దారుణం.. ప్రాణం తీసిన జలుబు
కశ్మీర్: వాతావరణ మార్పులు, డస్ట్ ఎలర్జీ ఉన్నవారు జలుబుతో బాగా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా వర్షా కాలం, చలి కాలల్లో ఈ సమస్య కాస్త తీవ్రంగా ఉంటుంది. డాక్టర్ దగ్గరకు వెళ్లడం.. చిట్కాలు పాటించడం వంటి చేసి తగ్గించుకుంటాం. కానీ జలుబుతో మృతి చెందడం అనేది చాలా చాలా అరుదు.. ఒకరకంగా చెప్పాలంటే అసంభవం కూడా. చివరకు సైనస్ లాంటి సమస్య ఉన్నా మరణించడం మాత్రం జరగదు. కానీ జమ్మూ కశ్మీర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. విపరీతంగా జలుబు చేసి.. ఇదర్దు సంచార జాతి పిల్లలు మరణించారు. వివరాలు.. ఓ సంచార జాతి కుటుంబం దక్షిణ కశ్మీర్‌లోని దేవ్సార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వారికి ఇల్లు లేదు. ఓ టార్పాలిన్ టెంట్లో ఉంటున్నారు. మాములు రోజుల్లో అయితే ఈ టెంట్ వారిని రక్షించేది. కానీ ఇది శీతాకాలం. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయి మంచు కురుస్తుంది. ఈ అతి శీతల వాతావరణం నుంచి టెంట్ ఆ కుటుంబాన్ని కాపాడలేకపోయింది. దాంతో ఆ కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులకు జలుబు చేసింది. అది కాస్తా తీవ్రంగా మారి తీవ్రమైన జ్వరం వచ్చి చిన్నారులు ఇద్దరు మరణించారు. (చదవండి: ఈ ఐదు లక్షణాలు కనిపిస్తున్నాయా.. జాగ్రత్త!) ఇక ఈ విషాదం గురించి తెలిసిన అనంతరం స్థానికులు వారికి తమ ఇళ్లలో ఆశ్రయం కల్పించారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘చిన్నారులిద్దరు బ్రైనల్ లామర్ గ్రామంలోని అడవుల్లో నివసిస్తున్న బేకర్వాల్ కుటుంబానికి చెందినవారు. వీరికి ఇల్లు లేదు. టార్పాలిన్ టెంట్లోనే నివాసం ఉంటారు. దాంతో చిన్నారులిద్దరికి జలుబు చేసి తీవ్ర రూపం దాల్చి మరణించారు. మరో ఇద్దరు సభ్యులకు కూడా అనారోగ్యంగా ఉండటంతో కుల్గాం ఆస్పత్రికి తరలించాము’అన్నారు. ఇక మృతుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. పిల్లలు మరణించారనే వార్త తెలిసిన తర్వాత అధికారులు వచ్చి బ్లాంకెట్స్ ఇచ్చి వెళ్లారు అన్నారు. ప్రస్తుతం కశ్మీర్లో చలి తీవ్రంగా ఉంది. దాదాపు 40 రోజుల పాటు దారుణంగా భయపెట్టే ఈ కాలాన్ని స్థానికులు చిల్లై కలాన్ అంటారు. డిసెంబర్ 21 నుంచి జనవరి 31 వరకు ఉండే ఈ చిల్లై కలాన్‌లో ఉష్గోగ్రతలు దారుణంగా పడిపోతాయి. దాల్ సరస్సుతో సహా నీటి వనరులన్ని గడ్డకడతాయి. -
ఢిల్లీని వణికిస్తున్న చలి
న్యూఢిల్లీ: ఉత్తరభారతం చలి దుప్పటి కప్పుకుంది. ఢిల్లీపై తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. దీంతో నూతన సంవత్సరం తొలిరోజున రాజధానిలో 1.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గత పదిహేనేళ్లలో ఇదే కనిష్ఠం కావడం విశేషం. అంతకుముందు 2006లో 0.2 డిగ్రీలు, 1935లో మైనస్ 0.6 డిగ్రీల ఉష్ణోగ్రత(ఆల్‌టైమ్ కనిష్ఠం) ఢిల్లీలో నమోదయింది. గతేడాది జనవరిలో 2.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగత్ర ఢిల్లీలో నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది. చలిపులి కారణంగా ఉదయం 6గంటల సమయంలో దట్టమైన పొగమంచు నగరాన్ని కమ్ముకుంది. దీంతో కనీసం మీటర్ దూరంలో వస్తువులు కూడా కనిపించకపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. గత గురువారం ఢిల్లీలో 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. జనవరి 2 నుంచి 6 వరకు మధ్యధరా ప్రాంతం నుంచి వీచే గాలుల(వెస్టర్న్ డిస్ట్రబెన్సెస్) కారణంగా ఉత్తర భారతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కాస్త పెరగవచ్చని ఐఎండీ అధిపతి కులదీప్ శ్రీవాస్తవ చెప్పారు. -
ఆనియన్ టీతో రోగనిరోధక శక్తి
సాధారణంగా సీజనల్ వ్యాధులను నివారించుకోవడానికి మన ఇళ్లలోనే ఎన్నో చిట్కాలు ఉంటాయి. జలుబు, దగ్గు, తుమ్ములు వంటి సాధారణ వ్యాధులకు ఇంట్లోని పెద్దవాళ్లు వంటింటి వస్తువులతోనే చిటికెలో ఉపశమనం కలిగించే ఔషధాన్ని తయారు చేసి ఇస్తుంటారు. వీటి వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని వారు తరచూ చెబుతుంటారు. కానీ వాటిపై ఈ తరం వారు అంతగా నమ్మకం ఉంచరు. అయితే పెద్దలు చెప్పినట్లుగానే వంటింటి పదార్థాలలో తక్షణ ఉపశమనం పొందే ఎన్నో గుణాలు ఉన్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అందులో ఒకటి ఉల్లిపాయ టీ కూడా. ఉల్లిపాయలు వంటల్లో రుచిని ఇవ్వడమే కాక, మంచి ఆరోగ్యాన్నిచ్చే ఎన్నో లక్షణాలను ప్రేరేపిస్తుందట. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడి కూడా ఉంది. అయితే ప్రస్తుతం చలికాలంలో చాలా మంది జలుబు, తగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారంతా తక్షణ ఉపశమనం కోసం ఈ ఉల్లిపాయ టీ తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆనియన్ టీ రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావంతంగా పనిచేస్తుందని పరీశోధనలో కూడా వెల్లడైందట. అంతేగాక ఉల్లిపాయ విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలకు కూడా అమూల్యమైన వనరుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఓ కప్పు టీని మీ రోజువారి ఆహారపు అలవాట్లలో చేర్చుకుని రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ టీని ఉల్లిపాయతో లేదా వాటి తొక్కలతో కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయ టీ: ఒక గ్లాసు నీరు మరిగించి అందులో తరిగిన ఉల్లిపాయ, 2-3 నల్ల మిరియాలు, 1 యాలుకతో పాటు సగం చెంచా సోపు గింజలను జోడించాలి. దీనిని 15-20 నిమిషాల పాటు మరగించి తర్వాత వడకట్టుకుని తాగాలి. ఉల్లిపాయ పీల్ టీ: టీ పొడి లేదా గ్రీన్ టీ ఆకులు వేసి నీటిని మరగించాలి, ఆ తర్వాత మరిగించిన నీటిని చిన్న ఉల్లిపాయ లేదా సగం ఉల్లిపాయ తొక్కలు తీసి ఉంచుకున్న కప్పులో పోయాలి. వేడి వేడి నీటిలో సుమారు 10 నిమిషాలు పాటు ఈ ఉల్లిపాయ తొక్కలు నానబెట్టాలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి తేనె, నిమ్మరసం కలుపుకుని తాగాలి. -
చీకటి పడితే గజగజ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై చలి పులి పంజా విసురుతోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నప్పటికీ.. రాత్రిళ్లు మాత్రం చలి గజగజ వణికిస్తోంది. గత మూడ్రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. ఇదే స్థాయిలో కొనసాగితే పగటి ఉష్ణోగ్రతలు సైతం తగ్గుతాయని వాతావరణ శాఖ అభిప్రాయపడుతోంది. గతేడాది ఇదే సమయంలో పగలు, రాత్రి సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. అయితే గత సంవత్సరం రాష్ట్రంలో సాధారణ వర్షాలే కురిశాయి. కానీ ఈసారి చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దాదాపు 18 జిల్లాల్లో అతిభారీ వర్షపాతం, 9 జిల్లాల్లో భారీ వర్షపాతం, మరో 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. భూగర్భ జలాలు సైతం భారీగా పెరిగాయి. ఈ పరిస్థితులతోనే ఉష్ణోగ్రతల నమోదులో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. 9 డిగ్రీలు పతనం.. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు చూస్తుంటే ఈసారి చలి తీవ్రత భారీగా ఉండే అవకాశముంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం దాదాపు 9 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గింది. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్, నిజామాబాద్‌లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ శాఖ 12 కేంద్రాల్లో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తోంది. ఇందులో ఖమ్మం మినహా మిగతా 11 కేంద్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల్లోపే నమోదు కావడం గమనార్హం. పగటి ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 30 డిగ్రీలకు పైబడి నమోదవుతున్నాయి. ఖమ్మంలో గరిష్టంగా 33.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లో 32 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా నవంబర్ నెలాఖరులో చలి తీవ్రత పెరుగుతుంది. కానీ ఈనెల మొదటి వారంలోనే చలి పెరగడంతో ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. బేలలో 10.3 డిగ్రీలు.. రాష్ట్రంలో పలుచోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు శుక్రవారం నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో అత్యల్పంగా 10.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా కుబీర్‌లో 10.6 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో 11.3 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 11.5 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా మథూర్‌లో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా బోధన్, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 12 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. -
ఢిల్లీలో అత్యంత శీతల అక్టోబర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాసులు గత 58 ఏళ్లలోనే ఎన్నడూ లేనంత శీతల పరిస్థితులను ఈ అక్టోబర్ నెలలో చవిచూశారు. 1962 అక్టోబర్ నెల సరాసరి కనిష్ట ఉష్ణోగ్రత 16.9 డిగ్రీల సెల్సియస్ కాగా దాదాపు 62 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో ఈ ఏడాది అక్టోబర్‌లో సరాసరి కనిష్ట ఉష్ణోగ్రతలు 17.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. సాధారణంగా ఢిల్లీలో సరాసరి కనిష్ట ఉష్ణోగ్రత 19.1 డిగ్రీలుగా ఉంటుంది. ఢిల్లీలో గురువారం కనిష్ట ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో 12.5 డిగ్రీలు కాగా.. దాదాపు 26 ఏళ్ల తర్వాత, 1994 తర్వాత ఇంత తక్కువగా నమోదైందని ఐఎండీ పేర్కొంది. గాలి వేగం మందగించడం, ఆకాశం మేఘావృతమై ఉండటమే ఈ పరిస్థితికి కారణమని ఐఎండీకి చెందిన కుల్దీప్ శ్రీవాస్తవ వివరించారు. ఏటా సాధారణంగా ఇదే సమయంలో కనిష్ట ఉష్ణోగ్రత 15–16 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని తెలిపారు. ఢిల్లీలో ఆల్‌టైం కనిష్ట ఉష్ణోగ్రత 1937 అక్టోబర్ 31వ తేదీన 9.4 డిగ్రీలుగా నమోదు అయ్యింది. -
ఈ ఐదు లక్షణాలు కనిపిస్తున్నాయా.. జాగ్రత్త!
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన నాటి నుంచి జనాల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువయ్యింది. ఇంటి, ఒంటి శుభ్రతతో పాటు తినే ఆహారంలో కూడా తగన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనాకు ముందు బయటి ఆహారాన్నే ఇష్టపడ్డవారు సైతం ఇప్పుడు ఇంటి భోజనమే బెటర్ అంటున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెంచే తిండికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మన శరీరం చూపే కొన్ని లక్షణాలను బట్టి మన రోగనిరోధక శక్తి బలంగా ఉంది లేనిది అనే దాని గురించి తెలుసుకోవచ్చు అంటున్నారు వైద్యులు. అవేంటో చూడండి.. (చదవండి: నాటుకోడి నోరూరిస్తోంది..!) తరచు జలుబు, దగ్గు.. తరచుగా జలుబు చేసినా.. గొంతులో చిరాకుగా ఉండి దగ్గు సూచనలు కనిపించినా మీ ఇమ్యూనిటీ వీక్‌గా ఉన్నట్లే అంటున్నారు నిపుణులు. ఒకవేళ మీకు గనక సంవత్సరంలో నాలుగు సార్లకంటే అధికంగా దగ్గు, జలుబు వచ్చాయంటే మీ ఇమ్మూనిటీ లెవల్స్ బలహీనంగా ఉన్నాయని అర్థం. నిద్ర లేచాక.. భారంగా ఉంటుందా.. రాత్రి నిద్రపోయాక తరచుగా మెలకువ వస్తుందా.. అలానే 7-8 గంటలు నిద్ర పోయి లేచిన తర్వాత కూడా మీకు భారంగా అనిపిస్తుందా. ఈ రెండు ప్రశ్నలకు మీ సమాధానం అవును అయితే.. మీ రోగ నిరోధక శక్తి ప్రమాదంలో ఉన్నట్లే. తరచుగా జీర్ణసంబంధ సమస్యలు తలెత్తడం.. మీరు బయట ఆహారం తిన్నారు.. కడుపులో అనిజీగి ఉందా. అయితే మీ ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీనంగా ఉన్నట్లే. ఎందుకంటే రోగనిరోధక శక్తిని పెంచే 70 శాతం కణజాలం జీర్ణవ్యవస్థలోనే ఉంటుంది. కనుక జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే మిగత శరీర భాగాలు కూడా రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. గాయాలు నెమ్మదిగా నయమవుతున్నాయా.. దెబ్బ తగిలినప్పుడు.. కాలినప్పుడు కొత్త చర్మ కణాలు ఉత్పత్తి అయ్యి ఆ గాయాలు మానిపోతాయి. అయితే ఈ ప్రక్రియకు చాలా సమయం తీసుకుంటే.. గాయాలు నెమ్మదిగా మానితే.. మీ రోగనిరోధక శక్తి మందగించిందని అర్థం. అంతేకాక మీ శరీరం, చర్మాన్ని రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలను అందించడం లేదనడానికి గుర్తు. తరచుగా ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారా.. మీరు జలుబు, దగ్గుతో పాటు మూత్ర, చెవి, సైనస్ సమస్యలకు తరచుగా గురవుతున్నారంటే ఇమ్యూనిటీ వీక్‌గా ఉందని అర్థం. మీ రోగనిరోధక వ్యవస్థ మీ శరీరంపై దాడి చేసిన వైరస్లు, బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా తగినన్ని ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయలేకపోతుందనడానికి ఇది సంకేతం. ఈ పైలక్షణాలు మీకు కనిపిస్తే.. వెంటనే మీ రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవడం.. వ్యాయమాలు చేయడం ప్రారంభించండి అంటున్నారు వైద్యులు. (చదవండి: ‘ప్రోటీన్ల’ను పట్టించుకోరేమీ!) -
జలుబు, దగ్గు మాత్రలు కొనేవారి సమాచారం తీసుకోండి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో జ్వరం, దగ్గు, జలుబు మందులు కొనుగోలు చేసిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించాల్సిందిగా మందుల షాపులకు కొన్ని రాష్ట్రాలు ఆదేశాలు జారీచేశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర, ఒరిస్సా, బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లోని మెడికల్ షాపులకు ఈ ఆదేశాలు జారీచేశారు. కోవిడ్ –19 లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలు చేయించుకోకుండా, తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. కోవిడ్ లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు మందులు కొనుగోలు చేసిన వ్యక్తుల ఫోన్ నంబర్, అడ్రస్‌లను తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కరోనా లక్షణాలను దాచి ఉంచే అవకాశం ఇవ్వకుండా పై అధికారులకు ఈ సమాచారం చేరుస్తారనీ, ఇది కేవలం ముందు జాగ్రత్త చర్య మాత్రమేనని అధికారులు తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం లాంటి కరోనా లక్షణాలు కనిపించినప్పటికీ, ఎవరైనా ఏమైనా అనుకుంటారనే భయంతోనూ, సంశయంతోనూ కొందరు సొంత వైద్యం చేసుకుంటున్నారని తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. -
కరోనా అయినా మామూలు జలుబైనా
కరోనా సీజన్ కొనసాగుతున్న ఈ తరుణంలో ఎవరైనా కాస్తంత దగ్గినా... ఏమాత్రం తుమ్మినా ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. సమీపంలో ఉన్నవారు దూరంగా తొలగిపోతుంటారు. మనం దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాల్లోకి వ్యాపించే తుంపర్లతో కరోనా వస్తుందన్న విషయం తెలిసిందే. ఇలా వ్యాపించడం అన్నది ఎంత వేగంగా జరుగుతుందో తెలుసుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ⇔ ఎవరైనా దగ్గగానే వారి నోటి నుంచి వచ్చే తుంపర్లు ప్రయాణం చేసే వేగం... గంటకు దాదాపు 60 మైళ్లు. (దాదాపు 96 కిలోమీటర్లు/గంటకు) ⇔ ఇక తుమ్మువల్లనైతే ఈ తుంపర్లు ప్రయాణం చేసే వేగం... గంటకు 100 మైళ్లు (దాదాపు 160 కి.మీ./గంటకు) ఉంటుంది. ⇔ జలుబు సమయంలో తుమ్మినప్పుడు సమీపంలోని గాల్లోకి వెలువడే తుంపర్ల సంఖ్య దాదాపు 40,000 వరకు ఉంటుంది. ⇔ ఈ తుంపర్లు గరిష్టంగా 200 అడుగులు (60 మీటర్ల) వరకు ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంది. ⇔ తుమ్మినప్పుడు 30 సెకండ్లపాటు కర్చిఫ్ అడ్డుగా పెట్టుకున్నప్పుడు ఆ కర్చిఫ్పై ఒక చదరపు సెం.మీ. భాగంలో చేరే సూక్ష్మజీవుల సంఖ్య దాదాపు లక్ష వరకు ఉంటుంది. ⇔ ఒకవేళ అప్పటికే ఆ తుమ్మిన వ్యక్తికి కరోనా సోకి ఉందనుకుంటే... సూదిమోపినంత స్థలంలోనే మిలియన్ల కొద్దీ వైరస్లు ఉండి... అవి కళ్లు, ముక్కు, నోటికి తగలగానే వెంటనే జబ్బును వ్యాప్తి చేయగలుగుతాయి. ⇔ అందుకే దగ్గు వచ్చినా లేదా తుమ్మాల్సిన పరిస్థితులు ఏర్పడ్డా పొడవు చేతుల చొక్కా (లాంగ్‌స్లీవ్స్) దగ్గర మోచేతి మడతలో దగ్గడం, తుమ్మడం చేయాలి. అక్కడే ఎందుకంటే... మనం ఆ ప్రదేశాన్ని దాదాపుగా ముట్టుకోం. అలాగే ఒకవేళ చేతులతో షేక్ హ్యాండ్ ఇచ్చినా... వాటి మీద వైరస్ ఉండదు. ఈ కారణం చేతనే దగ్గడం లేదా తమ్ముడం వంటివి చేసినప్పుడు చేతులు ఎంతమాత్రమూ అడ్డుపెట్టుకోకూడదు. -
గడ్డకట్టే చలిలో స్నానమంటే...
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో మానవులు నివసించే అత్యంత శీతల ప్రాంతం రష్యాకు సమీపంలోని సైబీరియా. అక్కడి ఉష్ణాగ్రతల గురించి తెలుసుకుంటేనే మనకు నిలువెల్లా వణకు పుట్టాల్సిందే! శీతల కాలంలో మైనస్ డిగ్రీలకు పడిపోయే అతి శీతల ప్రాంతాల్లో మానవులు ఆ కొద్దికాలం చలిని తట్టుకోవాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అదే ఎప్పుడూ మైనస్ డిగ్రీల సెల్సియెస్ అంటే, మైనస్ ఐదు నుంచి మైనస్ 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే సైబీరియా ప్రాంతంలో నివసించాలంటే నిత్య పోరాటమే. కానీ అది అక్కడి స్థానికులకు అంతగా వర్తించదు. అతిశీతలంగా ఉండే సైబీరియాలోని యకుటియా ప్రాంతంలో నివసిస్తున్నవారు అక్కడి వాతావరణానికి పూర్తిగా అలవాటు పడిపోయారు. అక్కడ వేడి నీళ్లలో చొక్కా, పైజామా ఉతికి ఆరేసే లోపే అవి గడ్డకట్టుకుపోయి మంచు విగ్రహాల్లా తయారవుతాయి. వేడి నీళ్లలోనూ ఆకాశంలోకి కుమ్మరిస్తే ఆకాశంలోనే గడ్డ కట్టుకుపోయి మంచులా కురుస్తుంది. వేడి వేడి న్యూడిల్స్ దింతామన్న లోపే అది గాలిలోనే గడ్డకుపోతాయి, కొన్ని వేడి వేడి తిను పదార్థాలైతే నోటిలోకి పోగానే గొంతులో గడ్డకట్టుకు పోతాయట. గత వారం ఓ పర్యాటక బృందం అక్కడికి వెళ్లినప్పుడు అక్కడ నిజంగా మైనస్ 59 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. అంతటి శీతల మంచు ప్రాంతంలో ఓ స్కూల్ టీచర్ గలైనా డావిడోవా, బట్టలుతికితే అవి ఎలా క్షణాల్లో గడ్డకట్టుకుపోతాయో చూపించారు. గ్లాసులో పోసిన వేడి వేడి నీళ్లు క్షణాల్లో ఎలా మంచుగా మారుతాయో చూపారు. అన్నింటికంటే దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే సమీపంలోని చురాప్చా కుగ్రామంలో మంచుతో కూడిన నీటి గుంటలో దాదాపు 80 ఏళ్ల వృద్ధుడు స్నానం చేయడం. అలాంటి నీళ్లలో స్నానం చేస్తే తప్పా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించదని ఆ వృద్ధుడు తెలిపారు. సైబీరియాలో కుగ్రామాలే కాదు, పెద్ద పెద్ద నగరాలు కూడా ఉన్నాయి. శీతాకాలంలో మాస్కో నగరంలో మంచు కురిసినట్లు అక్కడి గ్రామల్లో, నగరాల్లో ఎప్పుడూ మంచు కురుస్తూనే ఉంటోంది. మంచు నీటిలో, మంచులో దొరికే చేపలు అక్కడి ప్రజలకు ప్రధాన ఆహారం. చలిని తట్టుకునేందుకు వారు చలి కోట్లు, చలి ప్యాంట్లు, చలి టోపీలు ధరిస్తారు. -
ఢిల్లీని కమ్ముకున్న మంచు
న్యూఢిల్లీ: దేశరాజధానిలో డిసెంబరులో సోమవారం(30న)ను అత్యంత చలిదినంగా భారతవాతావరణ శాఖ ప్రకటించింది. ఢిల్లీలో 119 ఏళ్ళలో ఎప్పుడూ లేనంతగా డిసెంబర్లో 9.4 డిగ్రీ సెల్సియస్‌ల అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. సఫ్దర్జంగ్లో సోమవారం 9.4 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు ట్విట్టర్లో వెల్లడించారు. దీని ప్రభావం విమానరాకపోకలపై పడింది. మంచుకారణంగా సోమవారం ఉదయం ఢిల్లీలో 20 విమానాలను దారిమళ్ళించారు. 530 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.∙మంచుకురుస్తుండటంతో రైళ్ళ రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. 30 రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నట్టు నార్తర్న్ రైల్వే ప్రకటించింది. మరోవైపు, దట్టమైన పొగమంచు కారణంగా గ్రేటర్ నోయిడా ప్రాంతంలోని ఓ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలో పడింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఢిల్లీలో చలి పెరిగింది! ఢిల్లీలో రెండో అత్యంత శీతల డిసెంబర్‌గా 2019 డిసెంబర్ నిలిచింది. ఇందుకు కారణాలను వాతావరణ నిపుణులు విశ్లేషించారు. ఢిల్లీకి ఉత్తరంగా ఉన్న కొండప్రాంతాల్లో డిసెంబర్ నెలలో భారీగా మంచు కురవడానికి, చలికాలంలో అక్కడ వర్షాలు కురవడానికి కారణమైన పశ్చిమ తుపాను గాలులు(వెస్ట్రన్ డిస్ట్రబెన్సెస్) గత 10 రోజులుగా వీయకపోవడం అందుకు కారణమని పేర్కొన్నారు. ఆ గాలులు ఢిల్లీ వైపు వీచే అతి శీతల గాలుల దిశను మారుస్తాయని, అవి రాకపోవడం వల్ల ఢిల్లీలో చలి తీవ్రస్థాయికి చేరిందని భారత వాతావరణ శాఖ ప్రాంతీయ వాతావరణ సమాచార కేంద్ర డైరెక్టర్ కుల్దీప్ శ్రీవాస్తవ వివరించారు. ఉత్తరాది పీఠభూమి ప్రాంతంపై.. పంజాబ్ నుంచి ఉత్తర ప్రదేశ్ వరకు 2 వేల నుంచి 3 వేల అడుగుల ఎత్తులో దట్టంగా అలుముకున్న పొగమంచు కారణంగా సూర్య కిరణాలు భూమిని చేరలేకపోతున్నాయని, ఈ డిసెంబర్ చలికి అది కూడా కారణమని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌లో పనిచేస్తున్న నిపుణుడు మహేశ్ పాలవత్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం యూపీ నుంచి ఢిల్లీ వైపు వీస్తున్న తూర్పు గాలులు కూడా అత్యంత శీతలంగా ఉన్నాయన్నారు. ఈ తూర్పుగాలుల్లోని తేమ కారణంగా దట్టమైన పొగమంచు ఏర్పడుతోందన్నారు. -
జలుబు చేసిందా... పాప్‌కార్న్ తిని చూడండి!
ఈసారి మీకు జలుబు చేసినట్లు అనిపించగానే ఏ ట్యాబ్లెట్ కోసమో మందులషాపుకు పరుగులు తీయకండి. ఆన్‌కౌంటర్ మెడిసిన్ కొని ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి. ఈసారి జలుబు చేసినప్పుడు పాప్‌కార్న్ తిని చూడండి. ఇలా చేయడం వల్ల జలుబు తగ్గుతుందనేది పెన్సిల్వేనియాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ స్క్రాంటన్’కు చెందిన అధ్యయనవేత్తలు చెబుతున్న మాట. పాప్‌కార్న్‌లో పాలీఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ పాళ్లు ఎక్కువగా ఉంటాయనీ, అవి జలుబును తగ్గిస్తాయని వాళ్లు పేర్కొంటున్నారు. మరో విషయం ఏమిటంటే ఇలా పాప్‌కార్న్‌లో లభ్యమయ్యే ఈ యాంటీఆక్సిడెంట్స్ మోతాదులు కొన్ని పండ్ల నుంచి లభ్యమయ్యే వాటి కంటే కూడా చాలా ఎక్కువని వారు అంటున్నారు. పనిలో పనిగా మరో జాగ్రత్త కూడా చెబుతున్నారు. ఇలా పాప్‌కార్న్ తినే సమయంలో అందులో ఉప్పు వేసుకోకపోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు. ఉప్పు వేయడం వల్ల పాప్‌కార్న్ వల్ల ఒనగూరే ప్రయోజనాలు తగ్గిపోతాయని, పైగా దేహానికి కూడా కొత్త సమస్యలు వస్తాయని కూడా వారు హెచ్చరిస్తున్నారు. -
అసలు జలుబుకు మందు ఉందా!?
న్యూఢిల్లీ : ‘జలుబుకు మందు వాడితే వారం రోజుల్లో తగ్గుతుంది. మందు వాడకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుంది’ అనే కామెంట్ వినే ఉంటాం. జలుబు దానంతట అది తగ్గాల్సిందేగానీ దానికి మందు లేదనే అర్థంలోనే ఈ కామెంట్ చేయడం కద్దూ! బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే జబ్బులకు మందులు ఉన్నాయని, జలుబు వైరస్ల ద్వారా వస్తుంది కనుక మందులేదని వాదించే వారు ఉన్నారు. వారి వాదనలో నిజమెంత? వాతావరణంలో ఉండే దాదాపు రెండు వందల రకాల వైరస్‌ల్లో ఏదో దాని వల్ల జలుబు, దాంతోపాటు దగ్గు వస్తుంది. ఇది ఒకరికి సంవత్సరానికి మూడుసార్లు పట్టి పీడిస్తుంది. శీతాకాలం, వర్షాకాలంలో జలుబు ఎక్కువగా రావడానికి కారణం ఆ సమయాల్లో వైరస్లు క్రియా శీలకంగా ఉంటాయి. ఎవరైనా ఒక్కసారి ముక్కు చీది నపుడు కొన్ని లక్షల వైరస్ కణాలు బయటకు వస్తాయి. వాటిని శాస్త్ర విజ్ఞానపరంగా ‘వైరియాన్స్’ అంటారు. వీటిలో దేనివల్ల నైనా ఇతరులకు జలుబు రావచ్చు. ఒకరు ముక్కు ద్వారా ఊపరి తిత్తుల్లోకి గాలి పీల్చుకున్నప్పుడు దాదాపు పదివేల వైరస్ కణాలు లోపలికి వెళతాయి. అవి తిరిగి బయటకు వచ్చేటప్పుడు గొంతు, ముక్కులోని ‘ఎపిథెలియల్ సెల్స్’కు కొన్ని వందల వైరస్ కణాలు అతుక్కుపోతాయి. అక్కడ వాటి పరాన్న సైకిల్ మొదలవుతుంది. దాని వల్ల జలుబు, దగ్గు వస్తుంది. చిన్నగా ప్రారంభమయ్యే జలుబు మూడు రోజుల్లోనే ముదురుతుంది. ఒక్క రోజులోనే కొన్ని లక్షల వైరస్ ఎన్ఫెక్ట్ అయిన ప్రాంతాన్ని ఆక్రమిస్తాయి. విక్స్, ఇతర జలుబు మందుల వల్ల 50 శాతమే జలుబును నివారించవచ్చని, మొదటి రోజు తీసుకునే జాగ్రత్తల వల్లనే దీన్ని త్వరగా నయం చేసుకోవచ్చని లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్శిటీలో వైరాలజిస్ట్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ జాన్ ఆక్స్‌వర్డ్, కార్డిఫ్ యూనివర్శిటీలోని ‘కామన్ కోల్డ్ సెంటర్ డైరెక్టర్’గా పనిచేస్తున్న ప్రొఫెసర్ రాన్ ఎకిల్స్, లండన్ ఇంపీరియల్ కాలేజీలో ఎక్స్పర్మెంట్ మెడిసిన్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పీటర్ ఓపెన్‌షా తెలియజేశారు. జలుబు సోకగానే చేతులు, ముక్కు, నోరు ఎప్పటికప్పుడు సబ్బుతో కడుక్కోవాలి. తుమ్ములు వచ్చినప్పుడు శుభ్రంగా ఉతికిన గుడ్డలను మార్చి మార్చి వాడాలి. కళ్లు నలుపుకో కూడదు. అలా చేస్తే కళ్లకు వైరస్ సోకుతుంది. రోజుకు వేడి నీళ్లలో తేనె, నిమ్మ రసం కలుపుకొని మూడు సార్లు తాగాలి. గొంతు మంట నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. చికెన్ సూప్ రెండు సార్లు తీసుకుంటే అది బాగా పని చేస్తుంది. ఐబ్రూఫిన్ లాంటి మందులు కూడా ఉపశమనం ఇస్తాయి. జలుబు వచ్చినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఊపిరితిత్తులకు బ్యాక్టీరియా సోకి, నిమోనియా వచ్చే ప్రమాదం ఉంటుందని ఆ ముగ్గురు వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరికి జలుబు ఎక్కువగా రావడానికి, కొందరికి రాకపోవడానికి కారణం వారి రక్తంలో ఉండే తెల్లరక్త కణాల సంఖ్యపై ఆధార పడి ఉంటుందని, తెల్ల రక్తకణాలు వైరస్‌లను శక్తివంతంగా ఎదుర్కొంటాయని వారు చెప్పారు. -
వాతావరణంలో మార్పులతో... వెంటనే తుమ్ములు, జలుబు
మా పాప వయసు 12 ఏళ్లు. వాతావరణంలో మార్పులు వచ్చాయంటే చాలు... అదేపనిగా తుమ్ములు, జలుబు, ముక్కుదిబ్బడతో బాధపడుతూ ఉంటుంది. స్కూల్‌కు కూడా పోవడం లేదు. మా పాప సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? అలర్జీ గురించి మనం సాధారణంగా రోజూ వింటూ ఉంటాం. అలర్జీ అనేది రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన ఒక రుగ్మత. వర్షాకాలం తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం ఇస్తుంది. అలాగే అది పలు రకాల వ్యాధులతో బాధపెట్టవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వర్షాకాలంలో అలర్జీ సమస్య చాలామందిని వేధిస్తూనే ఉంటుంది. తుమ్ములూ, దగ్గులు మాత్రమే కాదు... ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఈ జలుబు, దగ్గు రావడం సహజంగా వైరల్ జ్వరాలకు దారితీస్తుంది. వర్షాకాలంలో ఆస్తమా, అలర్జీ, బ్రాంకైటిస్, ఫ్లూ వంటి వ్యాధులను ఎక్కువగా చూస్తుంటాం. అలాగే మన ఆధునిక జీవితం, పారిశ్రామిక ప్రాంతాలు, పెద్ద పెద్ద నగరాలూ, పట్టణాల్లో వాతావరణ కాలుష్యం కూడా ఈ అలర్జీకి ఒక పెద్ద కారణం. అలర్జీతో ఇబ్బందులు పడేవారి బాధ వర్ణనాతీతం. వయసుతో నిమిత్తం లేకుండా చిన్నా పెద్దా అందరూ అలర్జీతో బాధపడుతుంటారు. అలర్జీని కలిగించే పదార్థాలను ‘అలర్జెన్స్’ అంటారు. అలర్జీతో బాధపడేవారిలో వారు ఏదో ఒక ప్రత్యేకమైన పదార్థానికి దగ్గరగా వచ్చినప్పుడు లేదా దాన్ని తీసుకున్నప్పుడు మన రక్తంలో ఉండే ఒక రకమైన యాంటీబాడీస్‌తో ఈ అలర్జెన్స్ కలవడం వల్ల హిస్టమిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. దీని కారణంగానే వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతాయి. ఒక వ్యక్తి తాలూకు తత్వం, వాతావరణం, వంశపారంపర్య చరిత్రతో పాటు గాలి, నీరు, ఆహారంలో మార్పులు, కాలుష్యాల వల్ల రక్తంలో జరిగే మార్పులతో ఈ లక్షణాలు బయటపడతాయి. అం్ట కొన్ని రకాల పదార్థాలు, వస్తువులు ఈ అలర్జీకి కారణమవుతాయన్నమాట. కారణాలు : ►దుమ్ము, ►పుప్పొడి రేణువులు ►పెంపుడు జంతువుల వెంట్రుకలు ►ఘాటైన వాసనలు ►చల్లటిగాలి ►శీతలపానియాలు ఐస్‌క్రీమ్‌లు ►మస్కిటో రిపల్లెంట్స్ వాతావరణంలో మార్పులు లక్షణాలు : ►తుమ్ములు ►ఆయాసం ►శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు / ఉబ్బసం ►వాంతులు ►ముక్కుకారడం ►ఒంటిపై దద్దుర్లు ►కళ్లు దురదలు పెట్టడం. వ్యాధి నిర్ధారణ : సీబీపీ, ఈఎస్ఆర్, ఇజినోఫిల్ కౌంట్, ఐజీ–ఈ యాంటీబాడీస్, ఎక్స్‌రే, పల్మునరీ ఫంక్షన్ టెస్ట్, సీటీ స్కాన్, అలర్జిక్ ప్రొఫైల్... మొదలైనవి. చికిత్స : హోమియోలో అలర్జీ నుంచి పూర్తిగా ఉపశమనం కలిగించే మందులు అందుబాటులో ఉన్నాయి. అవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. వాటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే అలర్జీ సమూలంగా తగ్గిపోతుంది. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఒళ్లంతా తెల్లటి మచ్చలు... తగ్గేదెలా? నా వయసు 42 ఏళ్లు. నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. మొదట్లో కాస్త చిన్నవిగా ఉండి, ఇప్పుడు క్రమంగా పెద్దవవుతూ అందరూ గమనించేలా ఉంటున్నాయి. ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాను. నాకు హోమియోలో పరిష్కారం సూచించండి. శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్ కూడా ఉంటాయి. ఏ ప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. ఇప్పుడు మీరు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల లోపిస్తుంది. దాంతో మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. ►బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు. డిప్రైషన్, యాంగై్జటీ న్యూరోసిస్ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు. ►పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు. ►జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు. దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు : ►ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల గానీ, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు కనిపించవచ్చు. ►మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ►కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్స్ లోపాలు, డయాబెటిస్‌లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది. ►వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల మన సొంతకణాలే మనపై దాడి చేయడం వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది. లక్షణాలు : మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
జలుబు మంచిదే.. ఎందుకంటే!
ఇప్పటివరకు మందు కనిపెట్టని వ్యాధి ఏంటి అంటే చాలా మంది ఎయిడ్స్ అనో.. కేన్సర్.. ఎబోలా అనో చెబుతారు. కానీ అదేదో రుషి అనే సినిమాలో ఓ డాక్టర్ చెప్పే సమాధానం ఏంటో తెలుసా.. జలుబు..! నిజమే జలుబుకు ఇప్పటివరకు ఎలాంటి మందు కనిపెట్టలేదు. అందరూ అంటుంటారు కూడా.. జలుబు మందులు వేసుకుంటే వారంలో తగ్గుతుంది.. వేసుకోకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుంది అని. అయితే ఇదంతా ఎందుకంటే జలుబు మంచిదే అంటున్నారు కొందరు పరిశోధకులు. అదెలా అంటే.. జలుబుకు కారణమయ్యే వైరస్.. మూత్రాశయ కేన్సర్‌ను తగ్గిస్తుందట. కేన్సర్ కణాలకు ఈ వైరస్ సోకి వాటిని చంపేస్తుందట. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సర్రేకు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని చెబుతున్నారు. ఈ పరిశోధనల ద్వారా మూత్రాశయ కేన్సర్‌కు సరికొత్త చికిత్స అందుబాటులోకి రానుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాక్స్సాకీవైరస్ (సీవీఏ21) మూత్రాశయ కేన్సర్ సోకిన 15 మందికి కణతులను తొలగించే శస్త్రచికిత్సకు వారం రోజుల మందు మూత్రాశయంలోకి ఎక్కించారు. శస్త్రచికిత్స చేసిన తర్వాత కేన్సర్ కణాలను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. ఈ వైరస్ కేన్సర్ కణాలకు సోకి వాటిని నాశనం చేశాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఒక్కరిలో కేన్సర్ కణాలు పూర్తిగా అదృశ్యమయ్యాయని చెబుతున్నారు. మరో 14 మందిలో కేన్సర్ కణాలు చనిపోతున్నట్లు తేలింది. బ్రిటన్‌లో మూత్రాశయ కేన్సర్ ఏటా 10 వేల మందికి సోకుతుందట. అయితే దీని చికిత్సకు వాడే మందుల వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయట. -
హెల్త్‌టిప్స్
చిన్న చిన్న సమస్యలకు కూడా మందులు వాడుతూ ఉంటే వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్‌తో ఇతర అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతో కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన మెడిసిన్‌ను వాడాలి. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైగా ఎలాంటి అనారోగ్యాన్నయినా ఇట్టే తగ్గించుకోవచ్చు జలుబు, ఫ్లూ జ్వరానికి... ఒక కప్పు మరుగుతున్న నీటిలో ఒక నిమ్మకాయను పిండి అనంతరం ఆ తొక్కను కూడా అందులో వేయాలి. దాన్ని 10 నిమిషాల ఉంచాక తీసేయాలి. ఆ నీటిలో టీస్పూన్ తేనె కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల జలుబు, ఫ్లూ జ్వరం తగ్గుతాయి. వికారంగా ఉంటే... కడుపు అంతా ఉబ్బరంగా అదోలా ఉండి, వికారంగా ఉంటే నల్లమిరియాల పొడి, నిమ్మరసం తీసుకుని వాటిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలపాలి. అనంతరం ఆ నీటిని కొద్ది కొద్దిగా తాగుతుంటే వికారం తగ్గుతుంది. గాల్ స్టోన్స్‌కు... నిమ్మరసం, నల్ల మిరియాల పొడిని బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని ఆలివ్ ఆయిల్‌తో కలిపి తింటుంటే గాల్ స్టోన్స్ పోతాయి. దానివల్ల వచ్చే నొప్పి కూడా తగ్గుతుంది. -
సర్దుకుపోతే సంతోషమే!
ఒక అడవిలో ఆ సంవత్సరం ఎన్నడూ లేనంత భయంకరమైన చలి వ్యాపించి అనేక జంతువులు, జీవాలు చనిపోయాయి. నాయకుడికి తమ జాతిని రక్షించాల్సిన బాధ్యత ఏర్పడింది. ‘‘చలి అధికంగా వుండే రాత్రివేళల్లో మీరంతా ఒకరికొకరు వెచ్చగా ఉండేలా మూకుమ్మడిగా గడిపితే గాలి దూరే సందు లేక చలి ఉండదని, తెల్లారే వరకు ప్రాణాలు నిలుపుకుంటే, సూర్యుడి వెలుగుతో వేడి జనించి సౌకర్యంగా ఉండొచ్చని’’ చెప్పింది తమ వాళ్ళకి. ముళ్ళ పందులన్నీ ఆ సూచన పాటించాయి. సందు లేకపోవడంతో రాత్రంతా వేడి పుట్టి ప్రాణం నిలబెట్టుకున్నాయి పందులు. కొన్ని ముళ్ళపందులు తోటి పందుల ముళ్ళు తగిలి ఇబ్బంది కలిగినట్టు నాయకుడికి ఫిర్యాదు చేసాయి. ‘‘చలి తట్టుకుని ప్రాణం నిలుపుకోవడం ముఖ్యం కాబట్టి ఇబ్బందిని మరచిపోయి సర్దుబాటు చేసుకుంటే మీ ప్రాణాలు నిలబడతాయి. ఇబ్బంది భరించలేమని అనుకుంటే మీ ఇష్టం’’ అంది నాయక పంది. ముళ్ళ పందులు సర్దుకుపోయి ప్రాణాలు నిలుపుకున్నాయి. సమాజంలో బతకాలంటే ఇరుగు పొరుగుల వేధింపులు, సాధింపులు, వెక్కిరింపులు, అవమానాలు, అనుమానాల ముళ్ళు గుచ్చుకుంటూనే వుంటాయి. సర్దుకుపోతే సమస్యలన్నీ తీరిపోతాయి. సమాజంలో జీవించడం సులభమౌతుంది. – నారంశెట్టి ఉమామహేశ్వరరావు -
హెల్త్ టిప్
వాతావరణం మారుతున్న ఈ కాలంలో చాలామందికి తుమ్ములు, దగ్గు, జలుబు, గొంతునొప్పి సహజం. ప్రతిదానికీ ట్యాబ్లెట్లు వేసుకునేకంటే కప్పు పాలల్లో ఒక స్పూను అల్లం తురుము, చిటికెడు పసుపు వేసుకుని మరిగించి, వడపోసుకుని తాగితే చక్కటి ఉపశమనం లభిస్తుంది. అసలు హాచ్ హాచ్లు రాకుండా ఉండాలంటే ఆహారం లో అల్లం, జీలకర్ర, పసుపు ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. -
సిటీ గజగజ..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చలి తీవ్రత కొనసాగుతోంది. మంచు, చలితో జనం ఇబ్బందులు పడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ నమోదవుతున్నాయి. మరిన్ని రోజులు చలి తీవ్రత కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. గడిచిన వారం రోజులుగా పడిపోతున్న పగటి పూట ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు సైతం తక్కువగా నమోదు అవుతున్నాయి. జనవరి 14 తర్వాత క్రమంగా పెరిగిన ఉష్ణోగ్రతలు ఇటీవలి తుపాను కారణంగా మళ్లీ తగ్గాయి. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌లో 12.8 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. అది సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువ. పగటి పూట సైతం సగటు కంటే తక్కువగానే నమోదైంది. మంగళవారం నగరంలో 26.7 డిగ్రీలు నమోదు కాగా, ఇది కూడా సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువ. ఈ ఉష్ణోగ్రతలు స్వైన్ ఫ్లూకు కారణమయ్యే హెచ్1ఎన్1 వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తాయని వైద్యులు హెచ్చరించారు. నగర వాసులు స్వైన్‌ఫ్లూపై అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ జారీ చేసింది. -
ఇంత పసిదానికి ఈ గురక ఏమిటి?
మా పాపకు ఐదున్నర నెలలు. తాను పుట్టిన రెండో వారం నుంచి గురక వస్తోంది. ఇటీవల ఆ శబ్దం మరీ ఎక్కువయ్యింది. తరచూ వాంతులు కూడా చేసుకుంటోంది. డాక్టర్‌కు చూపిస్తే తగ్గిపోతుందన్నారు. పాప సమస్య ఏమిటి? మాకు ఆందోళనగా ఉంది. సలహా ఇవ్వండి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పాపకు ‘లారింగో మలేసియా’ సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. అంటే... శ్వాస తీసుకునే నాళంలోని ఒక భాగం బలహీనంగా ఉండటం. కొద్దిమంది పిల్లల్లో శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం రావడం... మరీ ముఖ్యంగా ఆ శబ్దం... చిన్నారులు మెలకువగా ఉన్నప్పుడు, ఇతరత్రా ఇన్ఫెక్షన్లు (దగ్గు, జలుబు వంటివి) ఉన్నప్పుడు, ఆహారం తీసుకుంటున్నప్పుడు ఎక్కువ కావచ్చు. ఇలా ఎక్కువగా శబ్దం రావడాన్ని వైద్యపరిభాషలో స్ట్రయిడర్ అంటారు. పిల్లల్లో 60 శాతం మందిలో స్ట్రయిడర్ రావడానికి కారణం లారింగో మలేసియానే. ఇటువంటి పిల్లల్లో శ్వాససంబంధమైన సమస్యలు పుట్టిన రెండో వారం నుంచే మొదలై... ఆర్నెల్ల వయసప్పటికి తీవ్రతరం కావచ్చు. చాలామందిలో ఇది క్రమేణా తగ్గుముఖం పట్టడం, పరిస్థితుల్లో మెరుగుదల కనిపించడం జరుగుతుంది. ఈ మెరుగుదల ఎప్పుడైనా మొదలుకావచ్చు. అయితే కొద్దిమంది పిల్లల్లో లారింగోమలేసియాతో పాటు దగ్గు, వాంతులు కనిపించే లారింగో ఫ్యారింజియల్ రిఫ్లక్స్ అనే కండిషన్‌తో సమస్య తన తీవ్రతను చూపించవచ్చు. ఇలాంటి పిల్లల్లో కొన్నిసార్లు నీలంగా మారడం (సైనోసిస్), దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలను ఎదుర్కోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొన్నిసార్లు మరికొన్ని ఇతర రకాల సమస్యలైన... సబ్‌గ్లాటిక్ స్టెనోసిస్, లారింజియల్ వెబ్స్, ట్రాకియో బ్రాంకియో మలేసియా... మొదలైన కండిషన్లలోనూ మీరు చెప్పిన లక్షణాలే కనిపిస్తుంటాయి. పై అంశాలను బట్టి విశ్లేషిస్తే మీ పాపకు లారింగో మలేసియాతో పాటు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ కండిషన్ ఉన్నట్లు అనిపిస్తోంది. దీన్ని నిర్ధారణ చేయడానికి ఫ్లెక్సిబుల్ లారింగోస్కోపీ, బ్రాంకోస్కోపీ, రేడియోగ్రాఫిక్ స్టడీస్ చేయించాల్సి ఉంటుంది. ఈ సమస్యకు చికిత్స అన్నది పిల్లల్లో కనిపించే లక్షణాల తీవ్రత, శ్వాసతీసుకునే సమయంలో ఇబ్బందిని ఏ మేరకు భరిస్తున్నారు, పిల్లల్లో ఉన్న ఇతరత్రా వైద్య సమస్యలు, ఇన్వెస్టిగేషన్ డేటా, అన్నిటి కంటే ముఖ్యంగా ఈ జబ్బు కారణంగా కుటుంబంపై పడుతున్న మానసిక ఒత్తిడి తాలూకు తీవ్రత వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాపకు ఉన్నది చాలా తీవ్రమైన లారింగోమలేసియా అని నిర్ధారణ అయితే శస్త్రచికిత్స ద్వారా దీన్ని సరిచేయవచ్చు. కాబట్టి... మీరు మీ పిల్లల వైద్యుడిని, పీడియాట్రిక్ ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించి, ఫాలోఅప్‌లో ఉండండి. పిల్లి కరిచింది... సలహా ఇవ్వండి మా బాబుకి ఐదేళ్లు. వాడు ఆడుకుంటూ, ఆడుకుంటూ పిల్లి దగ్గరికి వెళ్లినప్పుడు అది కరిచింది. అది పెంపుడు పిల్లి కాదు. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే పూర్తి వ్యాక్సిన్ వేయించాలని చెప్పారు. మావాడి విషయంలో ఆందోళనగా ఉంది. దయచేసి మాకు సరైన సలహా ఇవ్వండి. జంతువుల వల్ల మనుషులకు వచ్చే జబ్బులను, జంతువులు కరవటం వల్ల వచ్చే జబ్బులను జూనోటిక్ వ్యాధులు అంటారు. ప్రమాదకరమైన జూనోటిక్ వ్యాధులలో రేబిస్ ఒకటి. అందరూ అనుకుంటున్నట్లు రేబిస్ కేవలం కుక్కల ద్వారానే కాక– పిల్లులు, నక్కలు, గబ్బిలాలు, కోతులు, అరుదుగా ఎలుకల వల్ల కూడా కలుగుతుంది. అన్ని జంతువులలో రేబిస్ ఉండకపోవచ్చు. అయితే స్ట్రే యానిమల్స్ కరిచినప్పుడు– దాని ద్వారా రేబిస్ సంక్రమిస్తుందో లేదో అని నిర్ధారణకు అయ్యేవరకు వాటికి రేబిస్ ఉన్నట్లుగానే పరిగణించి, జంతువు కాటుకు గురైన వారికి చికిత్స చేయాలి. ఒక వేళ కరిచిన జంతువు పదిరోజులలోపు చనిపోయినా లేదా అది రేబిస్ ఉన్న జంతువు అని నిర్ధారణ అయినా పూర్తి ట్రీట్మెంట్ ఎంతైనా అవసరం.జంతువుల వల్ల అయిన గాయాన్ని మూడు కేటగిరీలుగా విభజించడం జరుగుతుంది. గాయం 2, 3 కేటగిరీలకు చెందినదైతే వైద్యం తప్పనిసరిగా చేయించవలసి ఉంటుంది. వ్యాక్సిన్ కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. అదే విధంగా కేటగిరీని బట్టి 3 నుంచి 5 సార్లు యాంటీరేబిస్ వ్యాక్సిన్ ఇవ్వటం కూడా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో జంతువులు విపరీతంగా కరిచినప్పుడు వ్యాక్సిన్‌తో పాటు యాంటీ రేబిస్ ఇమ్యునో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్ కూడా ఇవ్వాలి. కరిచిన జంతువుకు రేబిస్ లేకపోయినా ఇది తప్పనిసరి. మామూలుగా మన పరిసరాలలో తిరిగే జంతువులు గీరటం లేదా కరవటం జరిగినప్పుడు మొదటి పదిరోజుల్లో ఆ జంతువుకి ఎటువంటి హాని జరగకపోతే మొదటి మూడు డోసులతో వ్యాక్సిన్‌ను నిలిపివేయవచ్చు. ఇంత చిన్న బాబుకూ తలనొప్పా? పీడియాట్రిక్ కౌన్సెలింగ్స్ మా బాబుకు ఎనిమిదేళ్లు. ఇటీవల వాడు తరచూ తలనొప్పి అంటూ ఏడుస్తున్నాడు. కొన్నిసార్లు వాంతులు కూడా అవుతున్నాయి. కొన్నిసార్లు కాసేపు నిశ్శబ్దంగా పడుకోబెడితే తలనొప్పి తగ్గుతోంది. కానీ చాలాసార్లు మాత్ర వేస్తేగానీ తగ్గడం లేదు. కొన్ని సందర్భాల్లో కడుపునొప్పి, కళ్లు తిరుగుతున్నాయని కూడా చెబుతున్నాడు. మా బాబు సమస్య ఏమిటి? వాడికి తగ్గేదెలా? మీరు చెబుతున్న దాన్ని బట్టి మీ బాబుకు తరచూ తలనొప్పి ఒకింత తీవ్రంగానే ఉన్నట్లు అనిపిస్తోంది. చిన్న పిల్లలతో పాటు టీనేజర్లలో తలనొప్పి రావడం మామూలే. పిల్లల్లో పదేపదే తీవ్రమైన తలనొప్పులకు కారణాలు అనేకం. వాటిలో ముఖ్యమైన వాటిల్లో మైగ్రేన్ ఒకటి. ఇక దీనితో పాటు టెన్షన్ హెడేక్, అటనామిక్ డిస్ట్రబెన్సెస్ వల్ల కూడా తలనొప్పులు రావచ్చు. అలాగే కొన్నిసార్లు కొన్ని సెకండరీ కారణాల వల్ల అంటే... ఇతరత్రా అవయవాల్లో సమస్యల వల్ల... (ఉదాహరణకు సైనసైటిస్, కంటికి సంబంధించిన సమస్యలు లేదా మెదడుకు సంబంధించిన రుగ్మతలు ఉన్నప్పుడు) కూడా తలనొప్పి రావచ్చు. ఇక మీ బాబు విషయానికి వస్తే అది మైగ్రేన్ అని చెప్పవచ్చు. మైగ్రేన్ జబ్బు తరచూ ఒక మాదిరి నుంచి తీవ్రమైన తలనొప్పితో వస్తుంటుంది. ఇది ఒక చోట కేంద్రీకృతమైనట్లుగా ఉండవచ్చు. కొన్నిసార్లు వికారం, వాంతులు, కాంతిని చూడటాన్ని, శబ్దాలు వినడాన్ని ఇష్టపడకపోవడం, కొన్నిసందర్భాల్లో ఏదో అవయవం బలహీనంగా ఉన్నట్లు అనిపించడం, తూలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐదు నుంచి పదిహేనేళ్ల పిల్లల్లో 10 శాతం మందికి ఏదో ఒక రూపంలో మైగ్రేన్ కనిపిస్తుంది. తలనొప్పి వచ్చే పిల్లలందరికీ అన్ని పరీక్షలూ అవసరం లేకపోయినప్పటికీ తీవ్రత ఎక్కువగా ఉండటం లేదా దానితో పాటు నరాలకు సంబంధించిన లక్షణాలు (అసోసియేటెడ్ న్యూరలాజికల్ సింప్టమ్స్) ఉన్న కొద్దిమందిలో మాత్రం కొన్ని ఇమేజింగ్ పరీక్షలు అవసరమవుతాయి. ఇక చికిత్స విషయానికి వస్తే... తలనొప్పి కనిపించిన సందర్భం (అక్యూట్ ఫేజ్)లో ఎన్ఎస్ఏఐడీ గ్రూపు మందులతో తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. ఇక దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉన్న పిల్లలకు అది రాకుండా నివారించడానికి కొన్ని మందులు... ఉదాహరణకు ఎమిట్రిప్టిలిన్, ప్రొప్రొనలాల్ వంటివి అనేకం ఇప్పుడు వాడుతున్నారు. ఇవి కొన్ని నెలల పాటు వాడటం వల్ల లక్షణాలు మళ్లీ కనిపించకపోవడం లేదా చాలారోజుల పాటు కనిపించకుండా ఉండటం జరుగుతుంది. ఇలాంటి పిల్లలకు బిహేవియర్ థెరపీతో నొప్పి తీవ్రత తగ్గి, మంచి మెరుగుదల కనిపిస్తుంది. ఇక మైగ్రేన్‌ను ప్రేరేపించే ట్రిగ్గర్స్... అంటే ఏదైనా పూట ఆహారం తీసుకోకుండా ఉండటం, నీళ్లు తక్కువగా తాగడం, నిద్రలేమి, కెఫిన్ ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. దీనితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, క్రమబద్ధంగా ఒకేవేళకు ఆహారం తీసుకోవడం, కంటి నిండా నిద్రపోవడం వంటివి చేసేవారిలో నొప్పి తీవ్రత తక్కువ. పైన పేర్కొన్న సూచనలు పాటిస్తూ మీరు ఒకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని సంప్రదించండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
వర్రీ వద్దు వంటిల్లు ఉందిగా...
జడివానలో తడిసినప్పుడు జలుబు దగ్గు చేసినా, ఎండ ధాటికి తలనొప్పి వచ్చినా, చలి తాకిడికి చర్మం పొడిబారినా, బరువులు మోయడం వల్ల చేతులు గుంజినా, తడి నేల మీద పొరపాటున జారడం వల్ల కాలు బెణికినా.. ఇలాంటి చిన్నా చితకా సమస్యలు ఏవి తలెత్తినా ఇటీవలి తరానికి చెందిన జనాలు వైద్యుల కోసం వెంపర్లాడుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ పరుగులు తీస్తున్నారు. చిన్న చిన్న జబ్బులకు కూడా పెద్ద పెద్ద ల్యాబుల్లో నానా పరీక్షలూ చేయించుకుంటున్నారు. వ్యాధులు నయం కావడం సరే, జేబులకు భారీ చిల్లులు పడుతున్నందుకు కుమిలిపోతున్నారు. ఇదివరకటి కాలంలోనూ ఎండా వానా చలీ ఉండేవి. రుతువులు మారినప్పుడల్లా కాలానుగుణమైన జబ్బులు మనుషులను ఇబ్బందిపెట్టేవి. అలాగని నాటి తరం వాళ్లెరూ చిన్నా చితకా సమస్యలకు ఆస్పత్రుల చుట్టూ పరుగులు తీసేవారు కాదు. ఎందుకంటే, అప్పట్లో దాదాపు ప్రతి ఇంటిలోనూ అనుభవంతో తలలు పండిన బామ్మలు ఉండేవాళ్లు. పోపుల డబ్బానే మెడికల్ కిట్లా, వంటింటినే క్లినిక్‌లా ఉపయోగించేవాళ్లు. చిన్నా చితకా సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం కలిగించేవాళ్లు. నిన్న మొన్నటి తరం వరకు ఇళ్లల్లో బామ్మలే డాక్టర్లు. వాళ్ల చిట్కాలను మీరూ పాటిస్తే ప్రతి చిన్న సమస్యకూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. రోజువారీ జీవితంలో తలెత్తే చిన్నా చితకా ఆరోగ్య సమస్యలకు డాక్టర్ బామ్మల చిట్కాలు కొన్ని మీ కోసం... తలనొప్పి చిన్నా పెద్దా తేడా లేకుండా ఎవరికైనా తరచుగా ఎదురయ్యే సమస్య తలనొప్పి. రకరకాల కారణాల వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది. చాలామంది మెడికల్ షాపుల్లో దొరికే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడేస్తూ ఉంటారు. సింపుల్‌గా శొంఠికొమ్ముతో సరిపోయే దానికి మెడికల్ షాపుల వరకు వెళ్లడం సరికాదు. శొంఠికొమ్మును నీటితో తడిపి సానరాయి మీద బాగా అరగదీసి, ఆ గంధాన్ని తలనొప్పి ఉన్న ప్రదేశంలో బాగా పట్టిస్తే చాలు. ఆ గంధం గాలికి ఆరిపోయే లోగానే తలనొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. తలనొప్పి నివారణ కోసం శొంఠికొమ్ము కషాయాన్ని కూడా తీసుకోవచ్చు. రెండు కప్పుల నీటిలో రెండు గ్రాముల శొంఠికొమ్మును బాగా నలగ్గొట్టి వేసి, ఆ నీరు సగం అయ్యేంత వరకు మరిగించాలి. అలా తయారు చేసిన కషాయాన్ని వడగట్టి, అందులో పటికబెల్లం కలుపుకొని తాగితే తలనొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. కొందరు పార్శ్వపు తలనొప్పితో బాధపడుతుంటారు. ‘మైగ్రేన్’ అనే ఈ పార్శ్వపు తలనొప్పి ఒక పట్టాన వదలదు. దీర్ఘకాలం వేధించే మైగ్రేన్‌కూ శొంఠికొమ్ములతోనే చక్కని విరుగుడు ఉంది. వంద గ్రాముల శొంఠికొమ్ములను తీసుకుని, నేతిలో దోరగా వేయించుకోవాలి. వేగిన శొంఠికొమ్ములను బాగా దంచి, వస్త్రఘాళితం పట్టాలి. మెత్తగా తయారైన ఈ శొంఠిపొడిలో రెండువందల గ్రాముల పాతబెల్లం కలిపి బాగా దంచాలి. దీనిని ఒక గాజు లేదా పింగాణీ జాడీలో నిల్వ చేసుకుని, ప్రతిరోజూ రెండు పూటలా భోజనానికి ముందు ఐదు గ్రాముల చొప్పున తీసుకుని, కాసేపు చప్పరిస్తే చాలు. ఎలాంటి దోషం వల్ల తలెత్తిన తలనొప్పి అయినా మటుమాయం కావాల్సిందే. అంతేకాదు, శొంఠి–బెల్లం కలిపి ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని తినడం వల్ల అరుచి పోయి, బాగా ఆకలి కూడా కలుగుతుంది. తలనొప్పికి విరుగుడుగా ‘చల్ల చల్లని... కూల్ కూల్...’ తలనూనెల కోసం దుకాణాలపైనే ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చక్కని తలనొప్పి నివారణ తైలాన్ని తయారు చేసుకోవచ్చు. పావుకిలో నువ్వులనూనెను మూకుడులో వేసి, పొయ్యిమీద సన్నని మంటపై వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో సన్నగా తరిగిన శొంఠి ముక్కలు, వస వేరు ముక్కలు, అతిమధురం వేరు ముక్కలు... ఒక్కొక్కటి పాతిక గ్రాముల చొప్పున వేసి, గరిటెతో కలియదిప్పుతూ వేయించుకోవాలి. ఇవి నల్లగా మారగానే, పాత్రను దించేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ నూనెను వడగట్టి గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రోజూ తలకు రాసుకుంటూ ఉంటే ఎలాంటి తలనొప్పులైనా నయమవుతాయి. జలుబు – దగ్గు ప్రతి ఒక్కరికీ తప్పని సమస్య జలుబు. సాధారణంగా రుతువులు మారే సమయంలో జలుబు, ముక్కదిబ్బడ పట్టి పీడిస్తాయి. జలుబు చేసిన వెంటనే మెడికల్ షాపుల్లో దొరికే మాత్రలు వేసుకుంటారు చాలామంది. ఇవి జలుబును తక్షణమే తగ్గించలేవు. జలుబు పూర్తిగా తగ్గడానికి కొన్ని రోజులు పడుతుంది. మందు మాకులు వాడినా, వాడకపోయినా సర్వసాధారణంగా ఒక వారం రోజుల్లో జలుబు దానంతట అదే నయమవుతుంది. అలాంటి దానికి మెడికల్ షాపుల వరకు వెళ్లకుండా, వంటింటి సామగ్రితో ఉపశమనం పొందడమే మేలు. పసుపు కొమ్మును కాల్చి, ఆ పొగను పీలిస్తే జలుబు వల్ల కలిగే ముక్కుదిబ్బడ కొంత వరకు నయమవుతుంది. ఉల్లిరసం, అల్లంరసం, తేనె సమపాళ్లలో కలిపి మూడుపూటలా రెండేసి చెంచాల చొప్పున సేవిస్తే జలుబు, రొంప నుంచి ఉపశమనం దొరుకుతుంది. దనియాల చూర్ణం, మెత్తగా దంచిపెట్టుకున్న పటిక బెల్లం సమపాళ్లలో కలిపి తీసుకుంటే జలుబు, గొంతునొప్పి, ముక్కదిబ్బడ లక్షణాలు కొంత త్వరగా నయమవుతాయి.జలుబు ఎక్కువై, గొంతులో కఫం చేరినట్లయితే చెంచాడు తేనెలో అరచెంచా కరక్కాయ పొడి కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. శొంఠి, మిరియాలు, పసుపు కొమ్ములు సమపాళ్లలో తీసుకుని, వీటిని మెత్తని పొడిగా చేసుకోవాలి. అరకప్పు గోరువెచ్చని నీటిలో ఈ పొడిని ఒక చెంచాడు కలుపుకుని మూడుపూటలా తీసుకుంటే జలుబు, ముక్కుదిబ్బడ, దగ్గు, తలనొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. జలుబుతో పాటు దగ్గు, గొంతునొప్పి కూడా బాధిస్తున్నట్లయితే తులసిపాకంతో ఉపశమనం పొందవచ్చు. తాజా తులసి ఆకులను బాగా నూరి, ఆ ముద్దను శుభ్రమైన వస్త్రంలో మూటలా ఉంచి రసం పిండుకోవాలి. వంద గ్రాముల తులసి రసంలో వంద గ్రాముల పటిక బెల్లం, పాతిక గ్రాముల అల్లం రసం, పది గ్రాముల మిరియాల పొడి చేర్చి, ఒక పాత్రలో వేసుకుని సన్ననిమంట మీద నీరంతా ఇగిరిపోయేంత వరకు మరిగించుకోవాలి. పూర్తిగా నీరింకిన తర్వాత పాత్రను దించేసి, చల్లారిన తర్వాత పాకాన్ని గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ పాకాన్ని చెంచా నుంచి రెండు చెంచాల వరకు కప్పు గోరువెచ్చని నీటిలో వేసి కలిపి తాగుతున్నట్లయితే త్వరగా జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం దొరుకుతుంది. తులసిపాకం సేవిస్తున్నట్లయితే అలర్జీ వల్ల కలిగే దద్దుర్లు, ఆకలి మందగించడం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. చర్మ జుట్టు సమస్యలు కాలుష్యం పెరుగుతున్నందు ఇటీవలి కాలంలో చర్మ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ముఖ్యంగా ముఖంపై మొటిమలు, చర్మం పొడిబారడం లేదా అతిగా జిడ్డుగా మారడం, ముఖంపై మచ్చలు ఏర్పడటం, జుట్టు రాలడం వంటి సమస్యలు యువతను మానసికంగా కూడా కుంగదీస్తున్నాయి. బజారులో దొరికే క్రీములు, లోషన్లు ఎన్ని వాడినా ఈ సమస్యలు పూర్తిగా సమసిపోవు. మంచి ముఖవర్చస్సు కోరుకునేవారు ఇంట్లోనే చక్కని ఔషధ లేపనాన్ని తయారు చేసుకోవచ్చు.తెల్ల ఆవాలు, కలువపూల రేకులు, తామరపూల రేకులు, అతిమధురం, లొద్దుగ చెక్క, కస్తూరి పసుపు, మంచిపసుపు ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున తీసుకోవాలి. వీటిని కొద్ది పరిమాణం నీటితో మెత్తని గుజ్జుగా రుబ్బుకోవాలి. ఈ గుజ్జులో నాలుగువందల గ్రాముల ఆవునెయ్యి కలిపి, ఈ మిశ్రమాన్ని ఒక మందపాటి పాత్రలో వేసుకుని సన్నని మంటపై నెయ్యి మాత్రమే మిగిలేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీనికి రెండువందల గ్రాముల తేనెమైనాన్ని కలిపి ఆరబెట్టాలి. పూర్తిగా చల్లారిన లేపనాన్ని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రోజూ రాత్రిపూట నిద్రపోయే ముందు ఈ లేపనాన్ని ముఖానికి పట్టించి, బాగా చర్మంలోకి ఇంకేలా మర్దన చేయాలి. ఇలా చేస్తే ముఖం మీద మచ్చలు మాయమవుతాయి. శరీరం మీద ఎక్కడ మచ్చలు ఉన్నా ఈ లేపనాన్ని ఉపయోగించుకోవచ్చు. జీలకర్ర, పటికబెల్లం సమభాగాలుగా తీసుకోవాలి. జీలకర్రను సన్నని మంటపై దోరగా వేయించుకోవాలి. ఇప్పడు జీలకర్రను, పటికబెల్లాన్ని కలిపి మెత్తని పొడిగా చేసుకోవాలి. ప్రతిరోజూ రెండుపూటలా బోజనానికి ముందు ఈ చూర్ణాన్ని ఒక చెంచాడు చొప్పున నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉన్నట్లయితే జుట్టురాలడం తగ్గుతుంది. కాంతిహీనంగా మారిన జుట్టుకు తిరిగి జీవకళ వస్తుంది.ఎండిన పొగాకును సన్నని ముక్కలుగా చేసి, మూకుడులో వేసి, పెద్దమంట మీద పెట్టాలి. మంట వేడికి పొగాకు మాడిపోయి బూడిదలా తయారవుతుంది. ఈ బూడిదను వస్త్రఘాళితం చేసుకుని, అందులో తగినంత కొబ్బరినూనె వేసి లేపనంలా తయారు చేసుకోవాలి. తామర తదితర ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఉన్నచోట ఈ లేపనాన్ని పూస్తున్నట్లయితే ఫంగస్ ఇన్ఫెక్షన్లు నయమవుతాయి. బూరుగు పూలు, గులాబి రెక్కలు, కస్తూరి పసుపు సమపాళ్లలో తీసుకుని, వాటిని విడివిడిగా ఆరబెట్టుకుని, పొడి చేసుకోవాలి. ఈ మూడింటి పొడిని వస్త్రఘాళితం చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పాలమీగడలో కలిపి రాత్రివేళ ముఖానికి పట్టించి, ఉదయం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తుంటే ముఖం మీద మొటిమలు, నల్లమచ్చలు వంటివి తొలగిపోతాయి.అరలీటరు కొబ్బరినూనెలో, ఐదు నిమ్మకాయల రసం వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సన్నని మంటపై నిమ్మరసం ఇగిరిపోయి కొబ్బరినూనె మాత్రమే మిగిలేంత వరకు మరిగించుకోవాలి. చల్లారిన తర్వాత ఈ నూనెను గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రోజూ దీనిని తలకు రాసుకుంటున్నట్లయితే చండ్రు, జుట్టురాలడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఒంటి, కీళ్ల నొప్పులు దెబ్బలు తగలడం మాత్రమే కాకుండా నానా కారణాల వల్ల కీళ్లనొప్పులు, ఒంటినొప్పులు, వస్తుంటాయి. ఇలాంటి నొప్పులకు పెయిన్ కిల్లర్స్‌పై ఆధారపడకుండా ఇంట్లోనే తగిన ఔషధాలను తయారు చేసుకోవచ్చు. ఆముదపు గింజలను తెచ్చి వాటిని చితక్కొట్టి పైపెంకును తీసేసి, లోపలి పప్పును వంద గ్రాములు తీసుకోవాలి. దీనికి వంద గ్రాముల శొంఠి, వంద గ్రాముల పటికబెల్లం చేర్చి మెత్తగా దంచుకోవాలి. రెండుపూటలా కప్పు గోరువెచ్చని నీటిలో ఈ పొడిని చెంచాడు కలిపి తీసుకుంటే కీళ్లనొప్పులు క్రమంగా నయమవుతాయి.దోరగా వేయించిన శొంఠిపొడి, అశ్వగంధ పొడి, నల్లనువ్వుల పొడి, పటికబెల్లం పొడి సమపాళ్లలో తీసుకుని, నాలుగింటినీ కలిపి వస్త్రఘాళితం చేసుకోవాలి. మూడు పూటలా భోజనం చేసేటప్పుడు ఈ పొడిని రెండు చెంచాల ఆవునేతితో కలిపి తీసుకుంటే నడుము నొప్పి, ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. రోగనిరోధక శక్తి పెరిగి ఒంటికి బలం వస్తుంది.శొంఠి పది గ్రాములు, వాయు విడంగాలు (మిరియాల్లాగే ఉంటాయి) పది గ్రాములు పొడిలా దంచుకుని, ఈ పొడిని ఒక పాత్రలో వేసి, రెండు కప్పుల నీటిలో సన్నని మంటపై మరిగించుకోవాలి. నీరు సగానికి సగం ఇగిరిపోయి కషాయం తయారయ్యాక అందులో ముప్పయి గ్రాముల పాతబెల్లం కలిపి రోజుకు ఒకసారి చొప్పున తీసుకుంటే, మహిళలకు వచ్చే నడుమునొప్పి తగ్గిపోతుంది.నిమ్మరసం పావులీటరు, నువ్వులనూనె పావులీటరు, వెల్లుల్లి గుజ్జు పావుకిలో తీసుకుని, ఈ మూడింటినీ కలిపి సన్నని మంటపై నూనె మాత్రమే మిగిలేంత వరకు మరిగించుకోవాలి. చల్లారిన తర్వాత నూనెను వడగట్టి, అందులో యాభై గ్రాముల ముద్ద కర్పూరం కలిపి గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. నొప్పులు ఉన్న చోట ఈ నూనెతో మర్దన చేస్తున్నట్లయితే త్వరలోనే ఉపశమనం దొరుకుతుంది. దంత సమస్యలు ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది దంత సమస్యలతో బాధపడుతుంటారు. అతిగా శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లకు అలవాటు పడటం, దంతాలకు అంటుకుపోయే పిజ్జా, బర్గర్ వంటి జంక్‌ఫుడ్ పదార్థాలు తరచుగా తీసుకోవడం వంటి కారణాల వల్ల చిగుళ్ల వాపు, దంతాలు వదులవడం, పిప్పిపళ్లు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి తగిన ఔషధాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.తుమ్మకట్టెలను కాల్చి తయారు చేసిన బొగ్గులు వంద గ్రాములు, సన్నని మంటపై పొంగించిన పటిక వంద గ్రాములు, సైంధవ లవణం వంద గ్రాములు.. ఈ మూడింటినీ మెత్తని పొడిగా తయారు చేసుకుని నిల్వ చేసుకోవాలి. దీనినే పళ్లపొడిగా వాడుతున్నట్లయితే దంతాలకు దృఢత్వం కలుగుతుంది. చిగుళ్ల నుంచి రక్తం కారడం, నోటి దుర్వాసన వంటి సమస్యలు దూరమవుతాయి. వంద గ్రాముల సుద్దపొడిలో నలభై గ్రాముల ఏలక గింజల పొడి, అరవై గ్రాముల సైంధవ లవణం పొడి కలిపి వస్త్రఘాళితం చేసుకుని, నిల్వ ఉంచుకోవాలి. రోజూ ఈ పొడితో పళ్లు తోముకుంటే దంతాలు దృఢంగా, తెల్లగా తయారవుతాయి. నోటి దుర్వాసన వంటి సమస్యలు మటుమాయమవుతాయి.పటికను పొంగించి పొడిగా చేసుకోవాలి. సైంధవ లవణాన్ని దోరగా వేయించి పొడిగా చేసుకోవాలి. తుమ్మబొగ్గులను పొడిగా చేసుకోవాలి. మూడింటినీ సమపాళ్లలో తీసుకుని వస్త్రఘాళితం చేసుకోవాలి. ఈ పొడితో పళ్లు తోముకుంటే దంత సమస్యలు, నోటి దుర్వాసన రాకుండా ఉంటాయి. కంటి సమస్యలు టీవీలు, స్మార్ట్ఫోన్లు వచ్చాక చిన్నారులు సైతం కళ్లద్దాలు వాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కంటి చూపు మందగించకుండా ఉండటానికి, చిన్నా చితకా కంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఇంట్లోనే చక్కని ఔషధాలను తయారు చేసుకోవచ్చు. పిప్పళ్లు, వాయు విడంగాలు, అతి మధురం, శొంఠి, సైంధవలవణం.. ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పున తీసుకోవాలి. వీటిని కచ్చాపచ్చాగా దంచుకుని నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మర్నాటి ఉదయం వీటిని గుజ్జులా నూరుకోవాలి. ఒక మూకుడులో అరలీటరు నువ్వులనూనె, అరలీటరు మేకపాలు వేసి, అందులో ఈ గుజ్జును వేసి సన్నని మంటపై వేడి చేయాలి. బాగా ఉడికిన తర్వాత మూకుడును దించేసి, చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని వడగట్టాలి. వడగట్టిన తైలాన్ని గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ తైలాన్ని ముక్కులో నాలుగు చుక్కల చొప్పున వేసుకుని నశ్యంలా పీలుస్తుంటే కంటికైన గాయాలు, కంటిలో ఏర్పడి పుండ్లు తగ్గుతాయి. కంటిచూపు క్షీణించకుండా ఉండటానికి త్రిఫలాఘృతం అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కరక్కాయల బెరడు, గింజలు తీసేసిన ఉసిరికాయ ముక్కలు, తానికాయ ముక్కలు.. ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పన తీసుకుని, వీటిని కచ్చాపచ్చాగా నూరుకోవాలి. ఒక పాత్రలో మూడు లీటర్ల నీరు తీసుకుని, నూరుకున్న త్రిఫలాల పొడిని నీట్లో వేసి, లీటరు కషాయం మిగిలేంత వరకు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఈ కషాయాన్ని వడగట్టుకొని, అందులో అరలీటరు ఆవుపాలు, పావులీటరు ఆవునెయ్యి వేసి నెయ్యి మాత్రమే మిగిలేంత వరకు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఇలా తయారైన త్రిఫలా ఘృతాన్ని గాజుసీసాలో నిల్వ చేసుకుని, ప్రతిరోజూ పది గ్రాముల చొప్పున భోజనానికి ముందు సేవిస్తున్నట్లయితే కంటిచూపు మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి పెరిగాక అజీర్తి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కడుపులో ఏకాస్త ఇబ్బంది తలెత్తినా ఎడాపెడా యాంటాసిడ్ సిరప్లు, పౌడర్లు వాడేస్తూ ఉంటారు చాలామంది. ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు వంటింటి సామగ్రిని సజావుగా ఉపయోగించుకున్నట్లయితే, యాంటాసిడ్లతో పనే ఉండదు.శొంఠికొమ్ములను, మిరియాలను, శుభ్రం చేసుకుని ఆరబెట్టుకున్న వేపచెట్టు బెరడును సమపాళ్లలో దోరగా వేయించుకుని మెత్తని పొడిగా చేసి పెట్టుకోవాలి. అరకప్పు గోరువెచ్చని నీటిలో ఈ పొడిని ఒక చెంచాడు కలుపుకొని పరగడుపున తీసుకుంటున్నట్లయితే ఎసిడిటీ, పులితేన్పులు వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. కరక్కాయ, పిప్పళ్లు, శొంఠి, వాము, సైంధవ లవణం.. వీటిని ఒక్కొక్కటి యాభై గ్రాముల పరిమాణం చొప్పున తీసుకోవాలి. వీటిలో వాము, శొంఠి, పిప్పళ్లను దోరగా వేయించుకోవాలి. వీటికి సైంధవ లవణాన్ని, కరక్కాయలను చేర్చి మెత్తని పొడిగా చేసుకోవాలి. భోజనానికి అరగంట ముందు ఈ పొడిని అరచెంచా చొప్పున గోరువెచ్చని నీటితో తీసుకుంటున్నట్లయితే మందగించిన ఆకలి మళ్లీ మామూలు స్థితికి వస్తుంది. జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. నిమ్మరసంలో సైంధవ లవణం కలిపి, ఆ మిశ్రమంలో సన్నగా తరిగిన తాజా అల్లం ముక్కలను వారం రోజులను నానబెట్టాలి. ఇలా నానబెట్టిన అల్లం ముక్కలను ఎండబెట్టాలి. ఈ అల్లాన్నే ‘భావన అల్లం’ అంటారు. ‘భావన అల్లం’ ముక్కలను ఒక అరచెంచాడు నోట్లో వేసుకుని నమిలితే అరుచి తగ్గి, ఆకలి పుడుతుంది. ‘భావన అల్లం’ తయారు చేసుకున్నట్లే నిమ్మరసం సైంధవ లవణాలతో జీలకర్రను కలిపి, వారం రోజులు నానబెట్టి, ఆ తర్వాత ఎండబెట్టిన జీలకర్రను ‘భావనజీర’గా తయారు చేసుకోవచ్చు. ‘భావన జీర’ కూడా జీర్ణకోశ సమస్యలకు మంచి విరుగుడుగా పనిచేస్తుంది.రెండు చిటికెల ఇంగువ, పావుచెంచా వాము దోరగా వేయించి, పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం దొరుకుతుంది. తాజా కరివేపాకును మెత్తగా రుబ్బుకొని, ఆ ముద్దను వస్త్రంలో వేసుకుని రసం తీసుకోవాలి. ఇలా తీసుకున్న కరివేపాకు రసం రోజూ రెండు చెంచాల చొప్పున తీసుకున్నట్లయితే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. ఆకలి పుడుతుంది. రక్తహీనత తగ్గుతుంది. చిన్న కరక్కాయలు యాభై గ్రాములు, సోంపు గింజలు పది గ్రాములు, జీలకర్ర పది గ్రాములు, సైంధవ లవణం పది గ్రాములు ఒక వెడల్పాటి పళ్లెంలోకి తీసుకోవాలి. వీటికి ఒక చెంచాడు నిమ్మరసం, ఒక చెంచాడు అల్లంరసం కలిపి, ఎండబెట్టాలి. ఇవన్నీ బాగా ఎండిన తర్వాత మెత్తని పొడిగా చేసుకుని గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. చెంచాడు తేనెలో ఈ చూర్ణాన్ని అరచెంచాడు కలిపి రెండుపూటలా తీసుకుంటన్నట్లయితే అజీర్తి, కడుపు ఉబ్బరం, కడుపునొప్పి మాత్రమే కాకుండా నోటి దుర్వాసన, నిద్రలేమి వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.దానిమ్మగింజలను ఎండబెట్టి, వంద గ్రాముల పొడి తయారు చేసుకోవాలి. అలాగే పుదీనా ఆకులను ఎండబెట్టి యాభై గ్రాముల పొడిని తయారు చేసుకోవాలి. వీటికి పాతిక గ్రాముల సైంధవ లవణం పొడిని జత చేసి మూడింటినీ వస్త్రఘాళితం చేయాలి. ఈ పొడిని గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. మూడుపూటలా భోజనం తర్వాత ఈ పొడిని అరచెంచాడు చొప్పున కప్పు గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక అజీర్ణ సమస్యల నుంచి కడుపునొప్పి నుంచి విముక్తి లభిస్తుంది. -
చలి నొప్పి.. ఇదిగో రిలీఫ్
గాలి తగిలితే శరీరం జివ్వుమంటుంది. నీళ్లు తగిలితే చాలు వణుకు పుడుతుంది. చలికాంలో ఇవి ప్రత్యక్షంగా అందరూ అనుభవించేవే. ఇవిగాక ఈ కాలంలో పరోక్షంగా వచ్చే శారీరక సమస్యలు మరెన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒళ్లు, కీళ్ల నొప్పులు ప్రధానమైనవి. ప్రస్తుతం ఈ సమస్యలతో తమను సంప్రదించేవారు పెరిగారంటున్నారు అపోలో ఆస్పత్రి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కౌశిక్‌రెడ్డి. ఈ సమస్య గురించి, దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఆయన పలు సూచనలు చెబుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో :వింటర్ (చలికాలం) సీజన్లో శరీర అవయవాలు కదలమని మొరాయించడం, తరచుగా పట్టేసినట్టు ఉండడం సహజం. రక్తప్రసరణలో ఏర్పడే లోపాలు ఇందుకు ప్రధాన కారణం. చలి వాతావరణం వల్ల ఏర్పడే ఈ లోపం కారణంగా గాలిలో ఒత్తిడి తగ్గి కీళ్ల చుట్టూ ఉన్న నరాలు ఉబ్బుతాయి. మనకు తెలియకుండానే శారీరక కదలికలు మందగిస్తాయి. దీంతో కీళ్లు బిగుసుకుపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది కూడా నొప్పులకు ఓ కారణమవుతుంది. ఎక్కువగా మోకాలి నొప్పులు, భుజాల నొప్పులు, ఫింగర్ జాయింట్స్‌లో సర్వసాధారణంగా ఉంటాయి. ఇవి కాకుండా ఎవరైనా దీర్ఘకాలికంగా నొప్పులతో బాధపడుతుంటే అవి ఈ సీజన్లో మరింతగా పెరుగుతాయి. ఈ సీజన్లో వ్యాయామం చేయాల్సిందే సిటీలో కూర్చుని చేసే ఉద్యోగాలే ఎక్కువ. సమ్మర్ సీజన్లో కూడా సమస్యలకు కారణమయ్యే ఇలాంటి జీవనశైలితో చలికాలం మరిన్ని ఇబ్బందులు తప్పవు. మరోవైపు కాస్త రెగ్యులర్‌గా వర్కవుట్ చేసే వాళ్లు కూడా బద్ధకించే సీజన్ ఇది. అయితే, తప్పనిసరిగా వ్యాయామం చేయాల్సిన వాతావరణం కూడా ఇదే. శరీరానికి అవసరమైన ఉష్టోగ్రతను సహజంగా అందించడానికి, కదలికలను మెరుగుపరచడానికి, రక్తప్రసరణ లోపాలను సరిచేయడానికి, కండరాలు ఫ్లెక్సిబుల్‌గా మారడానికి వ్యాయామం ఉపకరిస్తుంది. అయితే వెయిట్స్తో చేసే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లాంటి వ్యాయామాల కన్నా, స్ట్రెచ్చింగ్, యోగా వంటివి చాలా మంచిది. అలాగే సవ్యమైన రీతిలో శరీరానికి చేసే మసాజ్ కూడా ఉపకరిస్తుంది. వెచ్చని నీరుతో ఉపశమనం ఈ కాలంలో తరచుగా వేడి నీళ్లు తాగాలి. మరీ గొంతు కాలే వేడి కాకుండా కాసింత వేడి నీళ్లు తాగడం చాలా మంచిది. ఓ మోస్తరు వేడి నీళ్లు రోజు మొత్తం మీద అప్పుడప్పుడు తాగడం నొప్పులకు పరిష్కారంగా పనిచేస్తుంది. స్నానానికి కూడా తగినంత వేడి ఉన్న నీటిని వినియోగించాలి. ఆహారంగా.. క్యాబేజీ, పినాచె, ఆకు కూరలు, కాయగూరలు వంటివి నొప్పి నివారిణిగా పనికొస్తాయి. వీటిలో ఉండే విటమిన్ ‘కె’ నొప్పి నివారణకు ఔషధంగా ఉపకరిస్తుంది. కమలాలు, టమాటాలు వంటి వాటిలో విటమిన్ ‘సి’ కూడా ఉపయుక్తమే. ఇది కీళ్ల మధ్యలోని కార్టిలేజ్ భాగం డ్యామేజ్ అవకుండా చేస్తుంది. మరీ అవసరమైతే తప్ప పెయిన్ రిలీఫ్ మందులు వాడవద్దు. ఆహారం రూపంలో గాని, లేదా క్యాప్సూల్స్ రూపంలో గాని ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే నొప్పులు పెరగకుండా ఉపకరిస్తుంది. ఈ సీజన్లో మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. దళసరి, వెచ్చదనాన్ని అందించే దుస్తులు ధరించడం, సూర్యకాంతి వంటికి తగిలేలా చూసుకోవడం, విటమిన్ డి, ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవడం కూడా నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. -
వింటర్..డర్
వామ్మో చలి చంపేస్తోంది. వెచ్చగా దుప్పటి కప్పుకుని ఇంకో గంట కునుకు తీయాలనిపిస్తోంది.. ఇది జిల్లాలో ప్రస్తుత పరిస్థితి. పలు పట్టణాల్లో చలి పంజా విసురుతోంది. అడుగు బయట పెట్టాలంటేనే వణుకు పుడుతోంది. బారెడు పొద్దెక్కినా బెడ్ నుంచి కాలు కిందకు మోపాలంటే భయమేస్తోంది. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. చిన్నపాటి జాగ్రత్తలతో మన ఆరోగ్యం పదిలంగా కాపాడుకుందాం.. నెల్లూరు(బారకాసు): శీతాకాలంలో ఏర్పడే మంచుతెరలు కొందరితో కేరింతలు కొట్టిస్తే.. మరి కొందరికి వణుకు పుట్టిస్తాయి. సాయంత్రం వేళ వీచే చల్లటి గాలులు కొందరికి ఆహ్లాదంగా ఉండి హాయిని కలిగిస్తే.. మరికొందరికి గుండె దడ పుట్టిస్తాయి. సీజన్ మారగానే కొన్ని రకాల వ్యాధులు శరీరంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. చలికాలంలో తుమ్ములు, దగ్గు, ఆస్తమా, ఆయాసం, ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి. ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటే వృద్ధులు, పిల్లలు చలికి బయటకు రాలేక వణికిపోతారు. వచ్చినా వారికి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో వ్యాధులు ప్రబలే అవకాశం అధికం. చలికాలంలో వ్యాధులబారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం. హచ్..హచ్కి.. తూచ్ చెప్పేద్దాం.. శీతాకాలం కారణంగా రకరకాల వ్యాధులు విజృంభించే వీలుంది. ♦ ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస పీల్చుకోవడం క్లిష్టతరమవుతుంది. కొంత మందిలో ఆయాసం పెరుగుతుంది. శ్వాసకోస సంబంధిత కేసులు అధికంగా నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు. ♦ ఆస్తమా ఉన్నవారు చలిగాలుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి నొప్పుల తీవ్రత అధికమవుతోంది. చలి తీవ్రతకు కాళ్లు ముడుచుకోవడం వల్ల మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ♦ ఆరు పదులు దాటినవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వారు ఉదయం వేళ నడకకు, వ్యాయామానికి దూరంగా ఉండాలి. ♦ చలి తీవ్రతకు కండరాలు బిగుసుకు పోయి రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. శ్వాసకోశ వ్యాధులతో పాటు జ్వరాలు వచ్చే వీలుంది. అంతేకాకుండా స్వైన్‌ఫ్లూ కూడా సోకే అవకాశం ఉంది. ♦ ధూమపానం చేసేవారిలో ఆయాసం లక్షణాలు కనిపిస్తాయి. ప్రతి ఆరుగురిలో ఇద్దరికి ఆస్తమా.. నగరంలో శ్వాసకోశ, ఆస్తమా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రులకు వస్తున్న పిల్లల్లో ప్రతి ఆరుగురిలో ఇద్దరు ఈ సమస్యతో సతమతమవుతున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గడం, చలిగాలులతో పాటు పెరుగుతున్న వాతావరణ కాలుష్యం కారణంగా పెద్దలు, చిన్నారుల్లో శ్వాస సంబంధ వ్యాధులు ప్రబలుతున్నాయి. విపరీతమైన జనసాంద్రత, దోమల బెడద ఎక్కువగా ఉండటంతో మస్కిటో కాయిల్స్, లిక్విడ్స్ వాడటం వల్ల చలికాలంలో పిల్లలతో పాటు, పెద్ద వారిలో కూడా శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆస్తమా సోకిన చిన్నారులకు శ్వాస నాళాలు ముడుచుకుని వాటిలో కఫం చేరడం వలన శ్వాస తీసుకోవడం తీవ్ర ఇబ్బంది కరంగా మారుతోంది. దీంతో నిమోనియాకు దారితీయడంతో పాటు, ఒక్కో సమయంలో ప్రాణాంతకంగా మారుతోంది. గుండె జబ్బులు ఉన్న వారు చలికాలంలో బయటకు రాకూడదు. చలి అధికంగా ఉన్నప్పుడు హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. చిన్నారులకు చిక్కులు పసిపిల్లలకు చలిగాలుల కారణంగా మరిన్ని సమస్యలు వచ్చే వీలుంది. జలుబు, దగ్గు, వారిని వేధించడం పరిపాటి. కొంత మంది పిల్లల్లో నిమోనియా వచ్చే ప్రమాదం ఉంది. చర్మం కమిలిపోయి, బుగ్గలు, శరీరంపై కురుపులు వస్తాయి. చర్మం చిట్లిపోయి మంట, దురదలు ఇబ్బంది పెడతాయి. చర్మానికి శత్రువు.. చలి ♦ చలిగాలిలో తేమ బాగా తక్కువగా ఉంటుం ది. దాంతో చర్మం పొడిబారిపోతుంది. ♦ చర్మం చిట్లిపోయి పగులుతుంది. పెదవులు, ముఖం, అరికాళ్లు, పాదాలు, చేతులు పగిలిపోయి మంటపుడుతుంది. కొందరిలో రక్తం శ్రవిస్తుంది. మరికొందరిలో సోరియాస్ వ్యాధి తీవ్రతరమవుతుంది. చర్మం కమిలిపోయినట్లు ఉంటుంది. వృద్దుల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్లు అనేకం.. ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడంతో వ్యాధి కారక సూక్ష్మజీవులు శరవేగంగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వేగంగా వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్లు అయిన స్వైన్‌ఫ్లూ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు అవసరం ♦ చలితీవ్రత అధికంగా ఉన్న సమయంలో, ముఖ్యంగా రాత్రి వేళ బయటకు రాకుండా ఉంటే ఎంతో మేలు. ♦ రాత్రిపూట విధి నిర్వహణకు వెళ్లేవారు శరీరమంతా కప్పుకునే విధంగా వస్త్రాలు ధరించాలి. ముఖానికి మాస్క్‌లు ధరించడం మంచిది. ♦ జలుబు, దగ్గు ఒకరి నుంచి మరొకరికి రాకుండా మాస్కులు ధరించాలి. ఉన్ని వస్త్రాలు చాలా ఉత్తమం. జలుబు, దగ్గు ఉన్న వారు చల్లని నీరు, ఐస్‌క్రీమ్ తీసుకోకూడదు. ♦ పిల్లలకు వేడి వేడి ఆహార పదార్థాలు ఇవ్వాలి. పిల్లలను ఉదయం పూట స్కూల్స్‌కి పంపే సమయంలో స్వెట్టర్లు వేయాలి. ముఖానికి మాస్క్‌లు వేసి పంపితే ఇంకా మంచింది. ♦ కాచి చల్లార్చిన నీటిని తాగించాలి. చల్లని నీరు అధికంగా తాగితే సైన్సైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. దీని ప్రభావం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముందు జాగ్రత్తలు తప్పనిసరి ఆస్తమాను సైతం చలికాలంలో ఎటువంటి దుష్ప్రభావం లేకుండా చూసుకోవచ్చు. అవగాహన కలిగి ఉండి మందు జాగ్రత్తలు తీసుకోవాలి. చలి అధికంగా ఉన్నప్పుడు ఆస్తమా తీవ్రత పెరిగితే నెబ్యులైజర్ చికిత్సతో పాటు, అవసరమైన సమయంలో ఇంజక్షన్లు ఇవ్వాలి. దీర్ఘకాలిక ఆస్తమాకు ఇన్హేలర్లు అత్యుత్తమం. ఇన్హేలర్లు ద్వారా ఇచ్చే మందులు డోసులు, నోటి ద్వారా, ఇంజక్షన్ల ద్వారా ఇచ్చే మందుల డోసుల కంటే చాలా తక్కువ. ప్రయోజనం ఎక్కువ.– డాక్టర్ సత్యప్రకాష్, అసిస్టెంట్‌ప్రొఫెసర్, పిడియాట్రిక్ విభాగం, జీజీహెచ్ -
చలి గండం!
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చలి గండం పొంచి ఉంది. ఉత్తరభారతం నుంచి వీస్తోన్న శీతగాలుల తీవ్రత ఇంకా కొనసాగుతోంది. దీంతో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు 14.5 డిగ్రీలకు పడిపోతున్నాయి. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గుతూనే ఉన్నాయి. దీంతో నగరంలో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చలి నుంచి కాపాడుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తూ..ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 25లో చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ఇంట్లో బొగ్గులకుంపటి ఏర్పాటు చేసుకున్న బుచ్చివేణి, ఆమె కుమారుడు పద్మరాజులు ఊపిరి ఆడక మరణించిన ఘటన నగరంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చలి తీవ్రతతో నగరంలోసాయంత్రం, తెల్లవారుజామున రోడ్లపైకి వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇదిలా ఉంటే గురువారం నుండి రాత్రి ఉష్ణోగ్రతలు మరో 0.5 డిగ్రీలు పడిపోయే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఈ తీ వ్రత శుక్ర, శనివారాల్లో కూడా కొనసాగే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో నగరంలో ఆకాశమంతా మేఘావృతమవటంతో గాలి నాణ్యత కూ డా ఓ మోస్తరుగానే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. గాలిలో తేమ శాతం అతి తక్కువగా ఉండటంతో చలి గాలుల తీవ్రత అధికంగా ఉండి చర్మం చిట్లటంతో పాటు శ్వాస సం బంధ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని వై ద్యులు హెచ్చరించారు. పిల్లలు, గుండె, శ్వాస సం బంధమైన వ్యాధులున్న వారు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు పేర్కొన్నారు. -
గజగజ
ఖమ్మంమయూరిసెంటర్: పెథాయ్ తుపాన్ వణుకు పుట్టిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా గజగజలాడాల్సి వస్తోంది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి వరకు కురిసిన వర్షం వల్ల జిల్లావ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి గాలులు పెరిగాయి. రెండు రోజుల క్రితం వరకు 24 డిగ్రీలు ఉన్న కనిష్ట ఉష్ణోగ్రత ఇప్పుడు 18 డిగ్రీలకు పడిపోయింది. చలికాలం ప్రారంభంలో కూడా ఇంతటి ప్రభావం కనిపించలేదు. ఆదివారం నుంచి చలిగాలులు వీస్తున్నప్పటికీ సోమ, మంగళవారాల్లో చలి పంజా విసిరి.. ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలకు చేరాయి. చలి తీవ్రత ఇంకా రెండు రోజులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటనలు చేయడం, శీతల గాలులతోపాటు చలి మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో ఎలా తట్టుకోవాలని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆస్తమా రోగులు, వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు చలితో ఇబ్బంది పడుతున్నారు. తీవ్రతను తట్టుకునేందుకు స్వెట్టర్లు, జర్కిన్లు, మఫ్లర్లు, మంకీ క్యాప్‌ల కోసం నేపాలీ షాపుల వద్ద కు పరిగెడుతున్నారు. రోజువారీ పనులకు వెళ్లే వారు సైతం బయటకు రావాలంటే జంకుతున్నారు. వణికిస్తున్న చలి.. ఈ ఏడాది చలికాలంలో ఉష్ణోగ్రతలు గతం అంత గా తగ్గనప్పటికీ తుపాన్ ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోవడంతోపాటు చలిగాలులు ఎక్కువయ్యా యి. దీంతో మూడు రోజుల నుంచి తీవ్రమైన చలితో జిల్లా ప్రజలు గజగజలాడుతున్నారు. పట్టణాలకంటే పల్లెలు, మారుమూల అటవీ ప్రాంతా ల్లో చలి తీవ్రత అధికంగా ఉండడంతో గిరిజన గూడేల్లో నెగడ్లు(మంటలు) పెట్టుకొని చలి కాగుతున్నారు. చలి తీవ్రత కారణంగా ఉదయం.. సాయంత్రం అని తేడా లేకుండా ఇంటికే పరిమితమవుతున్నారు. బయటకు అడుగు వేయాలంటే భయపడుతున్నారు. ఇక వృద్ధులు, పిల్లలు, గర్భిణులు రాత్రి.. పగలు తేడా లేకుండా దుప్పటిని వీడడం లేదు. దీంతో రాత్రి 11 గంటల వరకు జనసందోహంతో ఉండే పట్టణాల్లోని ప్రధాన వీధులు ఆరు గంటలకే నిర్మానుష్యంగా మారుతున్నాయి. పూరి గుడిసెలో ఉన్నవారితోపాటు కిటికీలు, తలుపులు లేని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు చలికి వణుకుతూ ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామునే లేవాల్సిన పేపర్ బాయ్‌లు, పాలు, కూరగాయల వ్యాపారులు చలి నుంచి కాపాడుకునేందుకు దుప్పట్లు కప్పుకొని పనుల్లోకి వస్తున్నారు. రాత్రిపూట పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు వణుకుతూనే పనులు చేయాల్సి వస్తోంది. చలి తీవ్రత పెరగడంతో శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థలో మార్పులు వస్తాయని, ఇందుకోసం జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చలి జాగ్రత్తలు ఇలా.. సాధ్యమైనంత వరకు పసిపిల్లలను బయట తిప్పొద్దు. రాత్రి పడుకునే ముందు ముఖానికి పాండ్స్ రాయాలి. కాళ్లు, చేతులను కప్పి ఉంచే ఉన్ని దుస్తులను ఎంపిక చేసుకొని పిల్లలకు తొడిగించాలి. పిల్లలు జలుబు, దగ్గుతో బాధపడే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే నిమోనియాకు దారితీసే ప్రమాదం ఉంది. వెంటనే డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. ఉదయం 10 గంటలు దాటిన తర్వాతే బయటకు తీసుకురావాలి. స్కూల్ పిల్లలకు వేడి నీటితోనే స్నానం చేయించాలి. సాయంత్రం కాగానే ఇంటి నుంచి బయటకు పంపించొద్దు. అప్రమత్తత అవసరం చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నూలు, ఉన్ని దుస్తులు ధరించాలి. చెవుల్లోకి చలిగాలి వెళ్లకుండా చూసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలు జలుబు, దగ్గుతో బాధపడే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే నిమోనియాకు దారితీసే ప్రమాదం ఉంది. వెంటనే వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. ఉదయం 10 దాటిన తర్వాతే బయటకు తీసుకురావాలి. స్కూల్ పిల్లలకు వేడి నీటితోనే స్నానం చేయించాలి. సాయంత్రం ఇంటి నుంచి బయటకు పంపించొద్దు. – గంగరాజు, జనరల్ ఫిజీషియన్ -
అమ్మో చలి!
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌పై చలి పంజా విసురుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఈ నెలారంభంలో 17 నుంచి 18 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. వాతావరణంలో అల్పపీడన ప్రభావంతో ఈ నెల 10వ తేదీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చిరుజల్లులు కురియడంతో పాటు వాతావరణంలో మార్పులతో రెండు రోజులుగా విపరీతమైన చలి ప్రజలను వణికిస్తోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడంతో ప్రజలు భయపడుతున్నారు. గ్రేటర్ పరిధిలో కనిష్ఠంగా 15 డిగ్రీలు ఉండగా శనివారం రాత్రి ఈ ప్రభావం మరింత పెరిగింది. ఉదయం, రాత్రి వేళల్లో చలి గాలులు పెరుగుతుండడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల వరకు తీవ్రత తగ్గకపోవడంతో పాటు సాయంత్రం 5 గంటల నుంచే చలి ప్రభావం మొదలవుతోంది. దీంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పగటివేళల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల తీరు కూడా తగ్గుతుండడం గమనార్హం. నగర వ్యాప్తంగా ఇదే పరిస్థితి గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరుగుతుండడంతో భాగ్యనగర ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వేకువజాము నుంచి ఉదయం 9 గంటల దాకా మంచు దుప్పటి కమ్మేయడంతో రింగ్‌రోడ్ సహా ఇతర మార్గాల్లో వెళ్లే వాహనాలు వేగం బాగా తగ్గిపోయింది. -
పొంచి ఉన్న ప్రాణాంతక నిమోనియా ..
సాక్షి, ఆలేరు : చలిగాలుల తీవ్రత అధికమౌతుంది. దీంతో చిన్నారులతో సహా పెద్దలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సూర్యుడు అస్తమయం కాకుండానే చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. వాతావరణంలో వస్తున్న ఈ మార్పులు చర్మ సంబంధ వ్యాధులను కలగచేస్తాయి. అరికాళ్లు, పెదవులు పగలడం, చర్మం తెల్లగా పొడిబారినట్టుగా మారిన లక్షణాలు కనిపిస్తాయి. పొంచి ఉన్న నిమోనియా .. శీతాకాలంలో చిన్నారులకు ప్రాణాంతకమైన నిమోనియా వ్యాధి పొంచి ఉంది. వాతావరణంలో మార్పుల కారణంగా చిన్నారుల పాలిట ఈ వ్యాధి ప్రమాదకరంగా మారింది. మండలంలో ఇటీవల న్యుమోనియా కేసులు అక్కడ క్కడా నమోదవుతున్నాయి. ఇటీవల మండల పరిధిలో అనేక మంది చిన్నారులకు జలుబు, జ్వరం వచ్చి ఆస్పత్రిపాలు అయ్యారు. వైరస్ లేదా, బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. రోగ నిరోధక శక్తి, తక్కువగా ఉండే చిన్నారులను ఈ వ్యాధి వెంటాడుతుంది. మొదట జలుబుతో మొదలై దగ్గుతో చివరకు నిమోనియాగా మారుతుంది. న్యూమోనియా తీవ్రత పెరిగితే అస్తమా, ఫిడ్స్‌కు గురవుతారు. సూక్ష్మజీవుల ద్వారా 5 సంవత్సరాలలోపు ఉండే పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశముంది. పిల్లలకు తీవ్ర జ్వరం, శ్వాస ఆడకపోవడం, దగ్గు, డొక్కలు ఎగరవేయడం, పెదాలు, చేతులు నీలం రంగులోకి మారడం తదితర వంటివి నిమోనియా లక్షణాలు. తేమశాతం తగ్గడం, పెరగడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్లు వస్తాయి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆహార నియమాలు పాటించకపోవడం కూడా నిమోనియా బారిన పడే అవకాశముందని వైద్యులు చెపుతున్నారు. అందుబాటులోకి పెంటావాలెంట్ వ్యాక్సిన్: చిన్నారుల ప్రాణాంతక నిమోనియా బారిన పడకుండా పెంటావాలెంట్ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చారు. నిమోనియా కారణంగా ప్రపంచంలో ఇప్పటి వరకు 3.70 లక్షల మంది చిన్నారులు మరణించారని 2009లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్థారించింది. అప్పటి నుంచి వ్యాధి తీవ్రతను గుర్తించి దశల వారీగా అన్ని ప్రాంతాలకు ఈ టీకాలు సరఫరా చేస్తున్నారు. పెంటావాలెంట్ టీకాతో హిమోíఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్ బీ (íß బ్) బ్యాక్టీరియా వలన కలిగే నిమోనియా పూర్తిగా తగ్గిస్తుంది. జాగ్రత్తలు తప్పనిసరి .. పిల్లలు బయట తిరగకుండా చూసుకోవాలి. కాలుష్యం, అపరిశుభ్రత, ఆహార కాలుష్యం, పౌష్టికాహారలోపం లేకుండా చూసుకోవాలి, నిద్ర సమయంలో గురక, ఎక్కువగా చాతి కదలడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. చల్లటి పదార్థాలు, చల్లటి నీరు తాగించవద్దు. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు అజాగ్రత్త వహించవద్దు. గోరువెచ్చటి నీటిని చిన్నారులకు తాగించాలి ఒకటి రెండు రోజుల్లో జలుబు, దగ్గు తగ్గకుంటే చిన్న పిల్లల వైద్యులను సంప్రదించాలి. -
అప్పుడే గజగజ
చింతపల్లి (పాడేరు): ఈ ఏడాది చలి ముందుగానే వచ్చేసింది. చలి పులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు ఒక్క సారిగా దిగజారుతుండడంతో గిరిజనులు గజగజ వణుకుతున్నారు. మంగళవారం ఇక్కడ 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం పర్యవేక్షకుడు కె.దిలీప్ తెలిపారు. గత నెల 25న 6 డిగ్రీలు, 26న 5 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రతలు తరువాత పెరిగి 7, 8గా నమోదయ్యాయి. సోమవారం 8 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత మంగళవారానికి ఒక్క సారిగా 4 డిగ్రీలకు పడిపోయింది. దీంతో ఉదయం 10 గంటలైనా చలి గిలిపెడుతూనే ఉంది. మిట్ట మధ్యాహ్నం కూడా ఉన్ని దుస్తులు లేకుండా ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించలేని పరిస్థితి. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కిటికీలు వేసుకుని ప్రయాణిస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే గిరిజనులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు చలికి అవస్థలు పడుతున్నారు. డిసెంబర్లో చలి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని దిలీప్ చెప్పారు. మంచు, చలి కారణంగా సోకే వ్యాధుల పట్ల గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రి వైద్యాధికారి రఘురామ్ సూచించారు. కాగా, ఏజెన్సీ వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. మధ్యాహ్నం నుంచే తేలికపాటి మంచు అరకులోయ: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి మన్యంలో వాతావరణంపై ప్రభావం చూపింది. సోమవారం ఆర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురిసింది. ఉదయం 9గంటల వరకు మంచు తెరలు వీడలేదు. చలిగాలుల తీవ్రత కాస్త తగ్గినా సూర్యోదయం తరువాత కూడా వాతావరణమంతా మబ్బుగా ఉండడంతో ఎండ లేకుండా పోయింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తేలికపాటి మంచుతో కొండలు, రోడ్లు దర్శనమిచ్చాయి. ఆకాశమంతా మబ్బులు కమ్ముకోవడంతో వర్షం కురుస్తుందని ప్రజలు భావించారు. జల్లులు కూడా కురవలేదు. -
చలిస్తున్న విశాఖ
సాక్షి, విశాఖపట్నం: విశాఖపై చలి పంజా విసురుతోంది. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రాష్ట్రంలో కెల్లా విశాఖలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం విశేషం. గడచిన వారం రోజులను పరిశీలిస్తే రాత్రి ఉష్ణోగ్రతలు ఏడు డిగ్రీలు తక్కువకు పడిపోయాయి. ఈ నెల 19న నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 23.4 డిగ్రీలు నమోదు కాగా సోమవారం 16 డిగ్రీలకు పడిపోయింది. ఇది సాధారణంకంటే ఐదు డిగ్రీలు తక్కువ. మరోవైపు విశాఖ ఏజెన్సీలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు క్షీణిస్తున్నాయి. లంబసింగిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రానున్న రోజుల్లో చలి మరింతగా పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
పతనం
అది ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఒక మూలగా ఉన్న గూడ్స్షెడ్ల ఆవరణ. ఆ డిసెంబర్ చలిలో ఒకామె వొణుకుతూ నడుస్తున్నది. ఒకప్పుడు ఆమె పేరు సద్రాన్. ఇప్పుడామె ముసలి సద్రాన్. ఆమె కళ్లు కూడా తడిగా ఉన్నాయి. ముక్కు కారుతున్నది. మిగిలి ఉన్న కొద్ది పళ్లూ చలికి కొట్టుకుంటున్నాయి. కాళ్లూ చేతులూ స్పర్శ పోగొట్టుకున్నాయి. దారి కనపడటం కోసం కళ్ల మీది చెమ్మను అప్పుడప్పుడూ తుడుచుకుంటున్నది. ఆమె కాళ్లనూ చలి తొలిచేస్తున్నది. అరిగిపోయిన చెప్పులు మట్టితోనూ గోనెసంచుల పీచుతోనూ నిండిపోయి ఉన్నాయి. ఆ స్థితిలోనే కాళ్లీడ్చుకుంటూ పరుగులాంటి నడకతో ముందుకెళుతున్నది. చేతిలో చిన్న సంచీ చిన్న పార ఉన్నాయి.ఆ రైల్వే ప్రాంతంలో శ్మశాన ప్రశాంతత నెలకొని ఉంది. చలిగాలి హోరు ఎక్కువగా ఉంది. ఆవరణ అసాధారణంగా ఖాళీగానూ భీతిగొలుపుతూనూ ఉంది. వినియోగంలో లేని వ్యాగన్ల నీడలో ఆమె నడుస్తున్నది. ‘కాసేపట్లో సూర్యోదయం అవుతుంది. యార్డులో ఒక్క పిట్ట కూడా లేదు. సాధారణంగా జరిగే ఇంజన్ల షంటింగు కూడా లేదు. చలి మనుషులందర్నీ ఇళ్లలోనికి నెట్టేసినట్టుంది. ఎవరూ చలిని ఎదిరించే సాహసం చెయ్యలేరు. కాని డ్యూటీల్లో ఉన్నవారు ఎలాగో నెట్టుకొస్తారు. వారికి తప్పదు. కాపలాదార్లు మందమైన చలికోట్లు వేసుకొని వ్యాగన్లలో కునికిపాట్లు పడుతూ ఉంటారు. నిజానికి వారు మేల్కొని ఉండి రైల్వే ఆస్తులను కాపాడటానికే ప్రభుత్వం జీతాలు ఇస్తున్నది. అయితే ఇంత చలిలో ఎవరు మాత్రం బయట తిరిగి అపాయం కొని తెచ్చుకుంటారు? ఎవరి సుఖం వారిది. ఒక్క నాకే సుఖసంతోషాలు లేవు. శాంతి లేదు. పూట గడవటానికి కొట్లాడవలసి వస్తున్నది. ఈ జీవితం మీద ఆశా లేదు, ఆసక్తీ లేదు. ఈ రైల్వే ఆవరణలోని బొగ్గుని ఊడ్చి సేకరిస్తూ నా యవ్వనమంతా వ్యర్థమైంది. ఇప్పుడు ముసిలినై జీవిత చరమాంకంలో ఉన్నాను. అయినా తిండి కోసం పాట్లు తప్పడం లేదు. ఇన్నేళ్ల బతుకులో రేపనేది ఎప్పుడూ ప్రశ్నార్థకమే.’’ఇలా తన ఆలోచనల్లో మునిగి ముసలి సద్రాన్ రైల్వే లైన్లని దాటుకుంటూ తడబడుతూ నడుస్తున్నది. కళ్లు మిరుమిట్లుగొలిపే విద్యుద్దీపాల కాంతిలో రైల్వే లైన్లు మెలికలు తిరిగిన పాముల్లా కనపడుతున్నాయి. ఆ పాములు నోర్లు తెరిచి ఆమెనే మింగడానికి సిద్ధంగా ఉన్నట్టున్నాయి. సద్రాన్ ఇక్కడ బొగ్గును దొంగిలించి బయట అమ్ముతూ జీవిక సాగిస్తుంది. బొగ్గుని సేకరించడం కోసం అనేక సంవత్సరాలుగా ఈ రైల్వే ఆవరణని ఊడుస్తున్నది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని ప్రతి అంగుళం ఆమెకు చిరపరిచితమే. పద్మవ్యూహంలా ఉండే ఈ లైన్లు ఎక్కడ కలుసుకుంటాయో, ఎక్కడ విడిపోతాయో, ఎక్కడ వొంపు తిరుగుతాయో ఆమెకు తెలుసు. స్విచ్చులు, కూపాలు, వ్యర్థాలు చేరే గోతులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆమెకు తెలుసు. బొగ్గుని పోగు చేస్తుండగా కాపలాదారు కంటపడితే దాక్కోవడం, తనతో పాటు బొగ్గుని దాచడం ఆమెకు తెలుసు. ఒకవేళ పట్టుబడిపోతే అతన్ని ఎలా మెప్పించి ఒప్పించాలో కూడా ఆమెకు తెలుసు. పై అధికారితో కూడా కబుర్లు చెప్పి మాయ చేయడం ఆమెకు తెలుసు. క్లీనర్లనీ, ఫిట్టర్లనీ ఎలా ప్రలోభపెట్టి తప్పించుకోవాలో ఆమెకు తెలుసు. బొగ్గు కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టిన రోజులు ఉన్నాయి. షంటింగ్ ఇంజన్ ముందు నుంచి మెలకువగా జారుకునేటప్పుడు ఇంజన్ కదిలిపోతే అంతే సంగతి. అయినా ఆమె ఆ వృత్తినే చేసింది. చేస్తున్నది. మరోపని చెయ్యడం ఆమెకు చేతకాదు.ముసలి సాద్రాన్ ఇలా తలపోస్తున్నది. ‘‘డబ్బుకు లొంగే జనంతో ఇబ్బంది లేదు. కాకపోగా వారికి సంతోషమే. ఒకటి రెండు అణాలు ముట్టజెప్పి బుట్ట నిండా బొగ్గుని మోసుకుపోవచ్చు. కొంతమందైతే ఆ బొగ్గు తామే మోసుకొచ్చి తనకు కావలసిన చోట వేసి వెళతారు. అలా డబ్బు తీసుకున్న వారే ఉత్తములు. వాళ్లెవరూ నన్ను ఇబ్బంది పెట్టరు. కాని నిజాయతీపరులతోనే చిక్కంతా. వారు నేను పోగు చేసిన బొగ్గంతా తీసుకుంటారు. లేకపోతే వారితో ఖాళీ కోచ్‌లోనికి రమ్మంటారు. కుక్కలు! తుచ్ఛులు! వారు తల్లుల్నీ, అక్కచెల్లెళ్లనీ, కూతుళ్లనీ వొదిలిపెట్టరేమో! నీచులు! వారికి వయసుతో పనిలేదు. అందంతో పనిలేదు. ఆడది అయితే చాలు. వారికి కావలసిందల్లా... ముసలి ఎముకలు పగిలిపోయినా వారికి పట్టదు. ముసలి స్త్రీలకు నరకం కనిపించినా వారికి సంబంధం లేదు. కేవలం నగదు తీసుకోకుండా శీలాన్ని హరించినవాడు నిజాయతీపరుడు! వీళ్లనే రైల్వే మెచ్చుకుని మెడల్స్ వేస్తుంది. ఏమైనా ఈ స్థితిలో నన్నెవరూ కన్నెత్తి చూడరు. కాకపోతే మోటాగానూ, అసభ్యంగానూ మాట్లాడతారు. బయటికి గెంటివేస్తారు..’’ముసలి సాద్రాన్ తన ఆలోచనల్లో మునిగిపోయి కళ్లను తుడుచుకున్నది. ముఖం మీది ముడుతలు మంచుతో గడ్డకట్టుకుపోయినట్టు అనిపించింది. ఆమె మళ్లీ పరధ్యానంలో పడిపోయింది. ‘ఒకప్పుడు నా యవ్వనాన్ని దాచుకునేదాన్ని. అప్పుడు ముసలితనం తొందరగా రావాలని కోరుకునేదాన్ని. యవ్వనం సుఖశాంతుల్ని ఇవ్వలేదు. కాని వృద్ధాప్యం ఇంకా బాధాకరమైనది. ఇప్పుడు అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు. ముసలితనం ఒక శాపం. ధనం, యవ్వనం రెండూ సిగ్గుపడవలసినవి కావు. కాని ఇప్పుడు ఆ రెండూ నా వద్ద లేవు..’ సాద్రాన్ తన సంపాదనంతా తన కొడుకు బరాదాన్ అనారోగ్యం కోసం ఖర్చుపెట్టింది. భర్త చనిపోయిన తర్వాత వాడిని పెంచడానికి ఎన్నో ఇబ్బందులు పడింది. వాడికి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించడానికి తన శరీరాన్ని అమ్ముకున్నది. చివరికి వాడి పెళ్లి చేసింది. వాడికొక పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడే ఇప్పుడు తన సర్వస్వం. కాని బరాదాన్ పెళ్లి అనర్థదాయకమే అయింది. తెలియని వ్యాధితో మంచం పట్టాడు. ముసలి సాద్రాన్‌కు తన పెళ్లినాటి జ్ఞాపకాలు వెంటాడాయి. బరాదాన్ తండ్రి ఈమెని తన ఇంటికి తీసుకెళ్లాడు. ‘‘సాద్రాన్ సాద్రాన్’’ అన్న పిలుపు అతడి పెదవుల మీద ఉండేది. అదేపనిగా ఆమె వెంట తిరిగేవాడు. ఆమెని ఇంటి వద్ద వొదిలి డ్యూటీకి వెళ్లడానికీ ఇష్టపడేవాడు కాదు. ఏదో వంక పెట్టి ఇంటి వద్దనే ఉండిపోయేవాడు. ‘‘సాద్రాన్! మనిద్దరికీ నా జీతం సరిపోతుంది. మనం పోషించవలసిన వారెవరూ లేరు’’ అనేవాడు.‘‘మన ఇరుగుపొరుగు నవ్వుతున్నారు. అత్తమామలు లేరట. నేనే ఇంటికి రాణినట. నిన్ను ఇంట్లో కట్టి పడేస్తున్నానట’’ అనేది తను. ‘‘సాద్రాన్! ఎవరేమనుకున్నా నాకు లెక్కలేదు. నీ సంతోషమే నాక్కావాలి.ఎవరైనా సంతృప్తిగా జీవిస్తే వారు చూడలేరు’’ అనేవాడు. అలాంటి భర్త.. కొడుకు బరాదాన్ని ఇచ్చి చనిపోయాడు. అప్పటి నుంచీ తనకు కష్టాలు మొదలయ్యాయి.సాద్రాన్ నిట్టూర్చింది. ఒక్కసారిగా ఒక గాలి కెరటం రైల్వేయార్డులో ప్రవేశించింది. ఆమె ఆలోచనలకు భంగం కలిగించింది. విద్యుద్దీపాల కాంతి తీవ్రతలో ఆమె కళ్లు తెరిచి ఉంచలేకపోతున్నది. లైన్ స్విచ్చులకుఅడ్డంగా యాంత్రికంగా నడవసాగింది. చేతిని నుదుటిపై ఉంచి కళ్లకు చాటు పెట్టుకున్నది. ఒక దొంగలా చుట్టూ జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు అడుగులేస్తున్నది. ఒక్కోసారి ఒక వ్యాగన్ నీడలోకి చేరిపోయి ఎవరూ తనను గమనించడం లేదని నిర్ధారించుకుంటున్నది. ఇప్పుడు ముసలి సాద్రాన్ బొగ్గు ముక్కల పోగుల్ని చేరుకున్నది. అవి ఆమెకు బంగారు బిస్కట్ల దొంతర్లలా కనపడుతున్నాయి. రెండు పోగుల బొగ్గు ముక్కలు తీసుకెళ్తే సరి. బరాదాన్ కోసం మందులు కొనగలదు. మనవడి కోసం బియ్యం కొనగలదు. తనకీ కోడలికీ చాలినంత జొన్నపిండి కొనగలదు.చలి కొరికేస్తున్నప్పటికీ ఒకటి మాత్రమే కాదు, రెండు బొగ్గు పోగుల్ని తీసుకెళ్లడానికి ఇదే అదనుగా భావించింది. రెండు పోగుల్ని కొట్టేస్తే చాలు చలికాలం గడిచిపోతుంది. ఆ తర్వాత పగటిపూట చిన్న బొగ్గుముక్కలు ఎప్పుడైనా ఏరుకోవచ్చు. బూడిద కుప్పల నుంచి బొగ్గు ముక్కల్ని ఏరుకుంటే ఎవరూ ఏమీ అనరు. అభ్యంతరపెట్టరు. ఆ బూడిద పోగుల నుంచి ముందుగా కొడుకు బరాదాన్, ఆపైన మనవడూ పైకి లేస్తున్నట్టు ఆమె ఊహించుకుంది.ఇల్లు గడవటం కష్టంగా ఉంది. బరాదాన్కు మందులు కావాలి. కొడలూ మనవడూ తనూ తినాలి. తనొక్కతే సంపాదించాలి. కోడల్ని ఇదే వ్యాపారం, ఇదే రొంపిలోకి దింపడం ఆమెకు ఇష్టం లేదు. ఈ నికృష్టమైన వృత్తి తనతోనే అంతం కావాలనుకున్నది.రెండు విడతల బొగ్గు తీసుకెళ్లడానికి రెండుసార్లు తిరగాలి. ఇదే సరైన సమయం. ఇటువంటి చలిలో చీకటిలో ఏ ఉద్యోగీ బయటకు రాడు. కాబట్టి రెండుసార్లు సులువుగా తిరగ్గలదు. ఆమె ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నవి. ‘‘హిందుస్తాన్, పాకిస్తాన్, దేశం ఏదైతేనేం? పేదలకు బాధలు తప్పవు. ఒకప్పుడు హిందువులూ ముస్లిములూ ఎంతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. ఒకరికొకరు ప్రాణాలు ఇచ్చుకొనేవారు. ఇప్పుడు దేశం ముక్కలైన తర్వాత ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నారు. కుర్బాన్ అలీషా విద్వేషాలకి బలి అయిపోయాడు. అతడే ఈరోజు బతికి ఉన్నట్లయితే నాకీ కష్టాలు ఉండేవి కావు. నాకోసం తన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాడు. అతడు ఉన్నంత కాలమూ నాకు డబ్బుకొరత ఉండేది కాదు. డ్రైవర్ నాథ్‌సింగ్ కూడా ఉండేవాడు. కానీ అతడు కుర్బాన్ అలీ ఉండగా తనని తాకడానికి సాహసించేవాడు కాదు. నాథ్‌సింగ్ ఇలా అనేవాడు. ‘‘కోడలా! నా మాట విను. అలీని పెళ్లి చేసుకో. ఇదే మంచి సమయం. నీ యవ్వనం, నీ అందం ఎల్లకాలమూ ఉండవు. మతం గురించి పట్టించుకోకుండా అతన్ని పెళ్లి చేసుకో.’’అందుకు నేనిలా అనేదాన్ని. ‘‘నాథ్‌సింగ్! ముస్లిముని పెళ్లి చేసుకొని నన్ను నేను మోసం చేసుకోవాలా?’’ అతడిలా అనేవాడు ‘‘మరి ఇది బాగుందా? అతడు ప్రతిరోజూ నిన్ను కోచ్‌లోకి తీసుకెళుతున్నాడు. ఈ సంగతి అందరికీ తెలుసు. ఇలా చాటుగా తిరగడానికి అడ్డురాని మతం పెళ్లికెందుకు అడ్డం? కొద్ది రోజుల తర్వాత అలీ కూడా నిన్ను పట్టించుకోడు. అప్పుడు పశ్చాత్తాపపడతావు.’’ఈ సంభాషణ తర్వాత దేశం విడిపోయింది. అలీని హిందువులే పొట్టన పెట్టుకున్నారు. నిజంగా తన పొట్టనూ కొట్టినట్టయింది.సాద్రాన్ గట్టిగా నిట్టూర్చింది. ఒక వాషింగ్లైను దాటుతుండగా ఆమె కాలు ఒక గోతిలో పడింది. అసహాయంగా ముందుకి తూలిపోయింది.మోకాలికి గట్టి దెబ్బ తగిలింది. పాదం కింది భాగంలో ఏదో లోహపు ముక్క గీసుకొనిపోయింది. చెప్పుల మీద నుంచే రక్తం కారడం కనపడింది. కదల్లేకపోతున్నది. బాధతో మూలుగుతున్నది.అలాగే పడి ఉన్న చోటే చనిపోతే నయమనిపించింది. కానీ ఏదో అదృశ్య శక్తి జీవితం మీద వ్యామోహం కలిగించింది. నెమ్మదిగా పాకుతూ రైల్వే ట్రాక్ రెండో వైపు చేరింది. అంతలోనే అతి వేగంగా ఆ ట్రాక్ పైనుంచే రైలు పరుగెత్తింది. అది తన మీదుగా వెళుతున్నట్లు అనిపించింది.ముసలి సాద్రాన్ నెమ్మదిగా లేచింది. పాదం తీవ్రంగా సలుపుతున్నది. కాస్త దూరంలో ఎవరో చలిమంట కాగుతున్నారు. అక్కడ దగ్గుతూ కూర్చున్న ముసలివాడిని గుర్తించింది. అతడు ఆమెకు తెలుసు. వెళితే వాడు తన పాత కథలన్నీ ఏకరువు పెడతాడు. చావుకు దగ్గరగా ఉన్నాడు కానీ సరసాలు మానడు. కాబట్టి ఆమె అటు వెళ్లడానికి ఇష్టపడలేదు.కనీసం ఒక విడత బొగ్గునైనా మోసుకెళ్లాలని భావించింది. ఆ పోగుల వద్దకు వెళ్లేసరికి ఏదో టార్చి కాంతి పడుతున్నట్టు గ్రహించింది. కొందరు కాపలాదార్లు టోపీలు సర్దుకుంటూ వినియోగంలో లేని కోచ్ నుంచి అటువైపే వస్తున్నారు. వారిని చూసి ఆమె వెనుతిరగక తప్పలేదు. గాయమైనా సరే వచ్చిన పని పూర్తి కానందుకు చింతించింది. ముసలి సాద్రాన్ ఖాళీ చేతులతో గుడిసె చేరింది. ఆమెను చూసి కోడలు జోమన్ రెచ్చిపోయింది. ‘‘ఈ ముసిల్ది చావనైనా చావదు. తను సంపాదించలేదు. నన్ను బయటికి వెళ్లనివ్వదు. చీకటిపడ్డాక వెళ్లి ఇప్పుడు తిరిగొచ్చింది. అదీ ఖాళీ చేతుల్తో ఏడుస్తూ వచ్చింది. రాత్రంతా మంచి చలిమంట దగ్గర ఉండి హాయిగా తిరిగి వచ్చేసింది. నువ్వేమీ పని చెయ్యలేవని, ఇంటి వద్దనే ఉండమని చెప్పాను. నేను వెళ్తానని బొగ్గు తెస్తానని చెప్పాను. అయినా వినదు. చేతకాని గొప్పలకు పోతుంది. నన్ను ఇల్లు కదలనివ్వదు. నేనేదో ఐస్క్రీమునైతే నన్నెవరో తినేస్తారన్నట్టు భావిస్తుంది. ఈరోజు కుటుంబమంతా పస్తులుండాలి.’’సాద్రాన్ కోడలు జోమన్ అరుపులు విన్నది. ఏడ్చింది. కాని పైకి ఏమీ అనలేకపోయింది. ఒకవేళ ఏమైనా అన్నా కోడలు మరింత బిగ్గరగా అరిచి తిరగబడుతుందని ఆమెకి తెలుసు.‘‘రేపు నేనే వెళ్లి బొగ్గు తెస్తాను’’అన్నది జోమన్.సాద్రాన్ గట్టిగా వొద్దనలేదు. అంటే కారణాల్ని వివరించాలి. అది ఆమె చెయ్యలేదు. ‘‘రైల్వే యార్డు నుంచి బొగ్గు సేకరించడంలో కష్టాలు కోడలికి తెలియవు’’ అని తనలోనే అనుకున్నది. సాద్రాన్‌కు దెబ్బ తగిలిన కాలు నొప్పెడుతున్నది. ఒక గోనెసంచి ముక్క కట్టుకున్నది. ‘‘నా జీవితం ఎలాగూ నాశనమైంది. నా దుర్గతి కోడలికి రాకూడదు’’ అని పదే పదే అనుకున్నది.మరునాడు సాద్రాన్ నిద్రలేచింది. జోమన్ గుడిసెలో లేనట్టు కనుగొన్నది. ఖాళీ సంచి, పార కూడా లేవు. ఆమె హృదయం బాధగా మూలగడం మొదలుపెట్టింది. గుడిసె ద్వారం వద్దకు పరుగెత్తింది. ఒక తుపానువల్ల గుడిసె పెళ్లగించబడినట్టు వెయ్యి ముక్కలు చెక్కలైనట్టు అనిపించింది. ముసలామె గాఢాంధకారంలోనికి చూస్తూ ద్వారం వద్దనే కూలబడింది.తెలతెల్లవారుతుండగా జోమన్ తిరిగి వచ్చింది. గుడిసె ముందర సంచి నిండా బొగ్గు పెట్టింది. ఆ ఇద్దరూ స్త్రీలూ ఒకరి కళ్లలోనికి ఒకరు చూసుకున్నారు. ముసలి సాద్రాన్ చూపు కోడలి చెదిరిన జుత్తుపైనా, చినిగిన చొక్కాపైనా పడింది. అత్త తన పరిస్థితిని చదివేసిందని కోడలికి తెలిసిపోయింది. జోమన్ అపరాధభావంతో చూపును కిందకు దించుకుంది. కేవలం ఒక సంచిడు బొగ్గు కోసం తన కోడలు అమూల్యమైనదేదో కోల్పోయిందని ముసలామె గ్రహించింది. ఒక విధమైన వేదనతో కుప్పకూలిపోయింది. పంజాబీ మూలం : బూటా సింగ్ అనువాదం: టి.షణ్ముఖరావు -
కమ్ముకున్న జ్వరం
స్వైన్‌ఫ్లూ గురించి ఆందోళన వద్దు మొదట దాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడు నివారణ ఎంత తేలికో అర్థమవుతుంది. సమర్థంగా నివారిస్తే చికిత్స తప్పిపోతుంది అసలది రాకుండా ఉండాలంటే టీకా ఉండనే ఉంది. చలి ప్రారంభమైంది. వ్యాధులు విజృంభించడానికి ఇది అనువైన కాలం. జ్వరాలు పెచ్చరిల్లే కాలం. సాధారణ జలుబు, జ్వరం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేకున్నా ఈ కాలంలోనే ఎక్కువగా దాడి చేసే స్వైన్ ఫ్లూ గురించి అప్రమత్తంగా ఉండాలి. స్వైన్‌ఫ్లూ లక్షణాలన్నీ మామూలు జలుబులాగే అనిపిస్తుంటాయి. కానీ సాధారణ జలుబు కంటే ఇది ఒకింత ప్రమాదకరం. తీవ్రత కూడా ఎక్కువ. అందుకే దీని గురించి తెలుసుకోవడం మరింత అవసరం. ఏమిటీ వైరస్? ‘స్వైన్‌ఫ్లూ’ను హాగ్ ఫ్లూ, పిగ్ ఫ్లూ అని కూడా అంటారు. స్వైన్‌ఫ్లూ అంటే పంది నుంచి వచ్చే ఫ్లూ అని అర్థం. జలుబుతో వచ్చే సాధారణ (ఫ్లూ) జ్వరానికి ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ కారణమవుతుంది. ప్రధానంగా గాలి, దగ్గు, తుమ్ము తాలూకు తుంపర్ల ద్వారానే ఈ వైరస్ రోగి నుంచి మామూలు వ్యక్తికి వ్యాపిస్తుంది. ఫ్లూకు కారణమయ్యే ఇన్‌ఫ్లుయెంజాలో అనేక రకాల వైరస్లు ఉన్నాయి. స్వైన్ఫ్లూనకు కారణమయ్యే వైరస్‌ను ‘హెచ్1ఎన్1’ వైరస్‌గా నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఈ తరహా వైరస్‌లను ‘ఇన్ఫ్లుయెంజా ఎ’ అనీ, ‘ఇన్ఫ్లుయెంజా బీ’ అని, ‘ఇన్ఫ్లుయెంజా సి’ అని మూడురకాలుగా వర్గీకరిస్తారు. ఇందులో ‘ఇన్ఫ్లుయెంజా బీ’ అన్న రకం పందుల్లో ఉండదు. కానీ ‘ఇన్ఫ్లుయెంజా ఎ’, ‘ఇన్ఫ్లుయెంజా సి’ రెండూ పందుల్లో కనిపిస్తాయి. అందులో ప్రస్తుతం కనిపిస్తున్న వైరస్ ‘ఇన్ఫ్లుయెంజా ఎ’ గ్రూపునకు చాలా దగ్గరగా ఉంది. అలాంటి వైరస్‌లో ఒకటైన ఇది కొన్ని మ్యూటేషన్స్‌కు గురై, మానవులకు సోకే విధంగా రూపొందిందని నిపుణుల మాట. ఈ వైరస్ గతంలో పందుల్లో కనుగొన్న వైరస్‌తో పూర్తిగా సరిపోలడం లేదు.దాంతో సాధారణ పరిభాషలో ప్రస్తుతం ‘స్వైన్ ఫ్లూ’గా అభివర్ణిస్తున్న ఈ వైరస్‌ను నిపుణులు ‘క్వాడ్రపుల్ రీ–అసార్టెంట్’ వైరస్ అని అంటున్నారు. అంటే ఇందులో పందులకు వచ్చే వైరస్ల జీన్స్, పక్షులకు వచ్చే వైరస్ల జీన్స్, మానవులకు వచ్చే వైరస్ల జీన్స్... ఇలా నాలుగు జీన్స్ ఉన్నా... రెండూ పందులకు వచ్చేవే ఉండటంతో దీన్ని ‘స్వైన్ ఫ్లూ’ అని పిలుస్తున్నారు. పిల్లల్లో ఈ కింది లక్షణాలు కనిపిస్తే... ఆయాసపడుతున్నా లేదా శ్వాస అందడంలో ఇబ్బంది ఉన్నాచర్మం రంగు నీలంగా లేదా బూడిద రంగు (గ్రే)గా మారినా తగినంతగా ద్రవ పదార్థాలు తాగలేకపోతున్నా వాంతులు అవుతున్నా సరిగ్గా నడవలేకపోతున్నా లేదా సంభాషించలేకపోతున్నా తట్టుకోలేనట్లుగా కనిపిస్తూ అస్థిమితంగా ఉన్నా ఫ్లూ లక్షణాలు తగ్గినా జ్వరం, దగ్గు మళ్లీ మళ్లీ వస్తున్నా... వెంటనే అలాంటి పిల్లలను వైద్య సహాయం కోసం డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. పెద్దలలో ఈ కింది లక్షణాలు కనిపిస్తే... ఆయాసపడుతున్నా లేదా శ్వాస అందకపోయినా ఛాతిలో నొప్పి, కడుపులో నొప్పి లేదా పట్టేసినట్లుగా ఉన్నా అకస్మాత్తుగా తలతిరుగుతున్నట్లు అనిపించినా అయోమయంగా అనిపించినా ఆగకుండా తీవ్రంగా వాంతులు అవుతున్నా ఫ్లూ లక్షణాలు తగ్గినా దగ్గు, జ్వరం మళ్లీ వచ్చినా... అలాంటి పెద్దవాళ్లూ (అడల్ట్స్) కూడా వైద్య సహాయం కోసం వెంటనే డాక్టర్‌ను కలవాలి. వ్యాప్తిచెందే అవకాశాలిలా... ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి గాలి ద్వారా సోకుతుంది. దగ్గడం, తుమ్మడం వంటి చర్యలతో గాలిలో కలిసి ఈ వైరస్ ఒకరినుంచి ఒకరికి వ్యాపించవచ్చు. అలాగే రోగి ముట్టుకున్న ప్రదేశాలను ఆరోగ్యవంతులు ముట్టుకున్నప్పుడు కూడా ఇది వ్యాపిస్తుంది. స్వైన్‌ఫ్లూ ...మరికొన్ని వ్యాధులకు మార్గం చూపచ్చు... స్వైన్‌ఫ్లూ విషయంలో మరికాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వ్యాధి గ్రస్తులకు మరికొన్ని వ్యాధులు తేలిగ్గా సంక్రమించే అవకాశం ఉంది. ఉదాహరణకు న్యుమోనియా, బ్రాంకైటిస్, సైనస్ ఇన్ఫెక్షన్, చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు తేలిగ్గా వస్తాయి. ఇలాంటి వాళ్లు అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్డీఎస్) బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఈ వ్యాధులను ఫ్లూ–రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటారు. ఉదాహరణకు ఆస్తమా ఉన్న వ్యక్తికిగానీ లేదా హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తికిగానీ స్వైన్‌ఫ్లూ సోకితే అది మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. ఏయే పరిస్థితుల్లో వైరస్ మనుగడ సాగించలేదంటే... కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో స్వైన్‌ఫ్లూ వైరస్ మనుగడ సాగించలేదు. 75 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 100 డిగ్రీల సెంటీగ్రేడ్ (167–212 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత వద్ద ఇన్ఫ్లుయెంజా వైరస్ బతికి ఉండే అవకాశం లేదు. క్లోరిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి జెర్మిసైడ్స్, డిటర్జెంట్ సబ్బుల వల్ల కూడా వైరస్ నిర్మూలన జరుగుతుంది. ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్వైప్స్, జెల్స్ వంటివీ వైరస్‌ను నిర్మూలిస్తాయి. చికిత్స... సాధారణ ఫ్లూకు లాగే దీనికీ చికిత్స చేస్తారు. అయితే... ఫ్లూకు సంబంధించిన సాధారణ లక్షణాలు కనిపించగానే ఇష్టం వచ్చినట్లుగా యాంటీబయోటిక్స్ యాంటీవైరల్ మందులను ఉపయోగించడం ఎంతమాత్రం సరికాదు. తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ యాంటీవైరల్ మందులను మాత్రం డాక్టర్ సలహా మేరకు వాడవచ్చు. సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపించగానే యాంటీవైరల్ మందులు వాడటం వల్ల మామూలు వైరస్‌లకూ మందులను ఎదుర్కొనే శక్తిని (రెసిస్ట్ చేసే శక్తి లేదా రెసిస్టెన్స్) మరింతగా పెరుగుతుంది. ఒకవేళ యాంటీవైరల్ మందులనే వాడాల్సి వస్తే డాక్టర్లు తమ విచక్షణతోనూ, అనుభవంతోనూ ఆ విషయాన్ని నిర్ధారణ చేస్తారు. వీళ్లు కాస్త హైరిస్క్ వ్యక్తులు... సాధారణంగా మిగతా వారితో పోలిస్తే కొంత మంది స్వైన్‌ఫ్లూకు గురయ్యే అవకాశం ఎక్కువ. వాళ్లెవరంటే... 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు, గర్భిణులు, యుక్తవయస్కుల్లో ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు స్వైన్ ఫ్లూ వ్యాధి వ్యాపించడానికి అవకాశం ఉన్నవారిగా పరిగణిస్తారు. డయాబెటిస్, గుండెజబ్బులు, ఆస్తమా, సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్) లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులున్నవారు, మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు, నరాల వ్యాధిగ్రస్తులు, ఎండోక్రైన్ వ్యవస్థలో లోపాలున్న వ్యాధిగ్రస్తులు, కాలేయ వ్యాధులు ఉన్నవారు, దీర్ఘకాలంగా ఆస్పిరిన్, స్టెరాయిడ్స్ వంటి మందులు తీసుకుంటున్నవారు, హెచ్ఐవీ వంటి ఇమ్యూనిటీ తక్కువయ్యే వ్యాధులుండేవారిని హైరిస్క్ గ్రూపునకు చెందినవారిగా పేర్కొనవచ్చు. సాధారణ లక్షణాలివే... సాధారణ ఫ్లూ జ్వరంలో ఉండే లక్షణాలే దీన్లోనూ కనిపిస్తాయి. అంటే కాస్తంత జ్వరం, దగ్గు, గొంతులో ఇన్ఫెక్షన్, గొంతులో గరగర, ముక్కు దిబ్బడ, ముక్కుకారడం, ఒంటినొప్పులు, తలనొప్పి, చలి, అలసట, నీరసం, కళ్లు–ముక్కు ఎర్రబారడం, కడుపులో నొప్పి... లాంటి లక్షణాలు ఇందులో ఉంటాయి. కొందరిలో వాంతులు, విరేచనాలు కూడా కనిపించవచ్చు. టీకాతో కచ్చితమైన నివారణ... స్వైన్ ఫ్లూకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. కచ్చితమైన నివారణ కోసం వ్యాక్సిన్ తీసుకోవడం మేలు. ఈ వ్యాక్సిన్ సూదిమందు, నేసల్ స్ప్రే రూపాలలో లభిస్తున్నది. సూదిమందుగానో లేక నేసల్స్ప్రేగానో ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల వ్యక్తిలో సైన్‌ఫ్లూ వ్యాధిని ఎదుర్కోగల రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. ఆరు నెలల పసివాళ్లు మొదలుకొని వయోవృద్ధుల వరకు అందరూ ముందుజాగ్రత్త చర్యగా స్వైన్‌ఫ్లూ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. ఈ టీకాను గర్భిణీలు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. రోగికి దగ్గర ఉండేవారు కీమోప్రొఫిలాక్సిస్ మందులను తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వ్యాధి వచ్చే అవకాశాలను ఎక్కువగా ఉండే హెల్త్ ఇండస్ట్రీకి చెందిన డాక్టర్లు, నర్స్‌లకు ప్రభుత్వమే ఈ ప్రొఫిలాక్టిక్ మందులను ఇస్తుంటుంది. నివారణ ఇలా... దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడకుండా రుమాలును అడ్డుపెట్టుకోవాలి. రుమాలు లేనప్పుడు వ్యక్తులు విధిగా తమ మోచేతి మడతలో ముక్కు, నోటిని దూర్చి తుమ్మాలి. దీని వల్ల వైరస్ లేదా వ్యాధిని సంక్రమింపజేసే ఇతర సూక్ష్మజీవులు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించవు. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు చేతులను అడ్డుపెట్టుకున్నవారు ఆ తర్వాత వాటిని శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. దగ్గు, తుమ్ము సమయంలో ఉపయోగించిన రుమాలు/టిష్యూను వేరొకరు ఉపయోగించకూడదు.దాన్ని తప్పనిసరిగా డిస్పోజ్ చేయాలి. జలుబు లేదా ఫ్లూ ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. ఇలాంటి రోగులు తమ లక్షణాలు తగ్గిన 24 గంటల తర్వాత కూడా ఒకటి రెండురోజులు అందరి నుంచి దూరంగా ఉండటమే మంచిది. జ్వరంతో ఉన్నవారు పిల్లల ఆటవస్తువులను ముట్టుకోకపోవడమే మేలు. పరిసరాలను, కిచెన్లను, బాత్రూమ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోగి పక్కబట్టలను, పాత్రలను విడిగా శుభ్రపరచాల్సినంత అవసరం లేదు. వ్యక్తిగత పరిశుభ్రత కోసం ఒకరి బట్టలు, పక్కబట్టలు, పాత్రలను మరొకరు ఉపయోగించకపోవడం మంచిదే. పబ్లిక్ ప్లేసెస్‌లో ఒకే బాత్రూమ్ ఉపయోగించినప్పుడు అందరూ తలుపు హ్యాండిల్గాని, కొళాయి నాబ్ ఉపయోగించినప్పుడు ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దాన్నే ఫొమైట్ ట్రాన్స్మిషన్ అంటారు. కాబట్టి హ్యాండిల్స్/నాబ్స్‌ను ఉపయోగించినతర్వాత చేతులను తప్పనిసరిగా ‘హ్యాండ్ శానిటైజర్స్’తో శుభ్రం చేసుకోవడం అవసరం. పబ్లిక్ ప్రదేశాలలో మాస్క్ వాడటం కొంత మేరకు మంచిదే. -
రాష్ట్రంలో పెరిగిన చలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి మొదలైంది. తెలంగాణలో అన్ని చోట్లా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు చలి పెరిగింది. ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత ఏకంగా 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. రామగుండంలో 16, హన్మకొండలో 17 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో రెండు డిగ్రీలు తక్కువగా 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలావుంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిం ది. ఫలితంగా గురువారం రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
చలి మొదలైంది...
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో చలి మొదలైంది. తెల్లవారుజామున, సాయంత్రం, రాత్రి వేళల్లో వీస్తున్న చలిగాలులు సిటీజనులను వణికిస్తున్నాయి. ఆదివారం కనిష్టంగా 19 డిగ్రీలు, గరిష్టంగా 30 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 30 శాతానికి పడిపోయింది. చర్మ, శ్వాస సమసమస్యలున్న రోగులు, వృద్ధులు చలితో ఇబ్బందులు పడుతున్నారు. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పులుంటాయని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. -
పెరుగుతో జలుబు దూరం!
టెక్సాస్: పెరుగు ఆరోగ్యానికి మంచిది. ఎముకలను దృఢంగా చేయడమే కాకుండా రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అయితే జలుబు చేసినప్పుడు ఎక్కువ అవుతుందని చాలామంది పెరుగుకు దూరంగా ఉంటారు. కానీ పెరుగు జలుబు లక్షణాలను తగ్గిస్తుందని అమెరికాలోని నేషనల్ డైరీ కౌన్సిల్‌లోని న్యూట్రీషియన్ రీసెర్చి వైస్ ప్రెసిడెంట్ మైకీ రుబిన్ తెలిపారు. పెరుగులో ఉండే జింక్, ప్రోబయాటిక్స్లు జలుబును నియంత్రించడంలో తోడ్పడతాయని పేర్కొన్నారు. -
ఆ నీరసం బిడ్డపై ప్రభావం చూపుతుందా?
నా వయసు 26. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. నాకు చాలా తరచుగా జలుబు చేస్తూ ఉంటుంది. ఈ సమయంలో జలుబు చేస్తే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? మందులు వాడవచ్చా? జలుబు వల్ల వచ్చే నీరసం పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుందా? నాకు ఆందోళనగా ఉంది. దయచేసి వివరంగా తెలియజేయగలరు. – పి.హారిక, నంద్యాల కొంతమందిలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటం వల్ల గానీ, లేక డస్ట్ అలర్జీ వల్ల గానీ మాటిమాటికి జలుబు చేస్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జలుబు ఎక్కువసార్లు వచ్చే అవకాశం ఉంటుంది. పక్కనవాళ్ల నుంచి కూడా తొందరగా సోకుతోంది. ఈ సమయంలో వీలైనంతవరకూ దుమ్ము ధూళికి దూరంగా ఉండటం మంచిది. అలాగే జనసంద్రం ఎక్కువగా ఉన్న చోటికి తక్కువగా వెళ్లడం మంచిది. ఈ సమయంలో మాటిమాటికి జలుబు చెయ్యడం వల్ల కొద్దిగా చిరాకుగా ఉండటం, కొన్నిసార్లు ముక్కురంధ్రాలు మూసుకొని ఊపిరి ఆడటం కష్టంగా ఉండటం, నోటితో గాలి తీసుకోవలసిరావటం, దానివల్ల నిద్రసరిగా పట్టకపోవడం, పగలంతా నిద్ర వచ్చేట్లుగా ఉండటం, తలనొప్పి వంటి ఇబ్బందులు ఉంటాయి. ఇలా మాటిమాటికి అవ్వడం వల్ల కొన్నిసార్లు బిడ్డకు కూడా ఆక్సిజన్ సరఫరా తగ్గి బిడ్డ బరువు తక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. జలుబుకి మందులు వాడే ముందు, గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకొని పుక్కిలించి ఊయడం, మరిగే నీటిలో అమృతాంజన్ వంటివి వేసుకుని ఆవిరి పట్టించుకొని చూడవచ్చు. దీనివల్ల కొద్దిగా ఉపశమనం ఉంటుంది. అలర్జీ వల్ల వచ్చే జలుబులో ముక్కు నుంచి నీరు కారిపోతూ ఉంటుంది. దానికి సగం సెట్రిజిన్ మాత్ర వేసుకుని చూడవచ్చు. ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు జలుబు మాత్రలు వాడుకోవచ్చు. నా వయస్సు 44. మెనోపాజ్ దశకు చేరువయ్యే మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఈ దశలో ఎలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి? వాటి నివారణమార్గాలు తెలియజేయగలరు. – యస్ఎన్, గోదావరిఖని మెనోపాజ్ దశకు చేరువయ్యే మహిళల్లో అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ మెల్లగా తగ్గిపోతుంది. దీనివల్ల వీరిలో శారీరక, మానసిక మార్పులు, ఇబ్బందులు ఏర్పడతాయి. చల్లగా ఉన్నాగానీ చెమటలు పట్టడం, అంతలోనే శరీరంలో వేడిగా అనిపించడం (hot flashes), కాల్షియం తగ్గిపోయి ఎముకలు అరగడం, ఒళ్లు నొప్పులు, నడుమునొప్పి, కీళ్ల నొప్పులు, చర్మంలో మార్పులు, మూత్ర సమస్యలు, సెక్స్‌పై ఆసక్తి లేకపోవడం, ఇబ్బంది, యోనిలో మంట, చిరాకు, డిప్రెషన్, మతిమరుపు వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో వీరు ఆహారంలో కాల్షియం బాగా దొరికే పదార్థాలైన పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, కూరగాయలు పండ్లు వంటివి తీసుకోవడం మంచిది. అలాగే సోయాబీన్స్‌లో ఉండే ఫైటోఈస్ట్రోజన్ అనే పదార్థం, కొద్దిగా ఈస్ట్రోజన్ హార్మొన్లాగా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆహారంలో సోయాబీన్, వాటి ఉత్పత్తులయిన సోయాపాలు, సోయాపౌడర్ వంటివి ఆహారంలో తీసుకోవడం మంచిది. అలాగే నడక, వ్యాయామం వంటివి చెయ్యడం వల్ల మానసికంగా, శారీరకంగా దృఢత్వం ఏర్పడుతుంది. అవసరమైతే కాల్షియం, విటమిన్–డి, మల్టీ విటమిన్ మాత్రలు వేసుకోవచ్చు. లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు గైనకాలజిస్ట్‌ను సంప్రదించి అవసరాన్ని బట్టి, శరీరతత్వాన్ని బట్టి ఈస్ట్రోజన్ హార్మోన్‌ను హార్మోన్ రీప్లేస్మెంట్ చికిత్సగా తీసుకోవచ్చు. ∙నా వయసు 20. నాకు రీసెంట్గా పెళ్లైంది. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నాం. అయితే ప్రెగ్నెంట్ ఉమెన్స్ rubella గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇటీవల ఓ పుస్తకంలో చదివాను. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనే దాని గురించి కాస్త వివరంగా తెలియ జేయగలరు. – వి.జమున, వికారబాద్ రుబెల్లా వ్యాధి (german measles) రుబెల్లా అనే వైరస్ వల్ల సోకుతాయి. ఇందులో కొద్దిగా తలనొప్పి, జలుబు, శరీరం మీద red rashes వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు వాటంతట అవే నాలుగు నుంచి ఐదురోజులకు తగ్గుతాయి. దీనికి ఎటువంటి మందులు పనిచేయవు. లక్షణాల ఉపశమనానికి పారసెటిమా వంటి మాత్రలు వాడుకోవచ్చు. మామూలు వారికి రుబెల్లా రావడం వల్ల ఎటువంటి సమస్య లేదు. కానీ ప్రెగ్నెన్సీ సమయంలో రుబెల్లా వస్తే ఈ వైరస్ తల్లి నుంచి మాయ ద్వారా బిడ్డకు పాకే ప్రమాదం ఎక్కువ. దానివల్ల అబార్షన్లు, బిడ్డ కడుపులోనే చనిపోవడం, పుట్టుకతో రుబెల్లా సిండ్రోమ్ (చెవుడు, ఆటిజమ్, గుండె జబ్బులు, బరువు తక్కువగా పుట్టడం, బుద్ధిమాంద్యం వంటి లక్షణాలు) వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మొదటి మూడునెలల్లో ఈ వ్యాధి సంక్రమిస్తే మరిన్ని ప్రమాదాలు పొంచి ఉన్నట్లే. రుబెల్లా వ్యాధి వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవటానికి ఏమి ఉండదు. ప్రెగ్నెన్సీ రాకముందే.. మహిళలు రుబెల్లా IGG, IGM యాంటీబాడీ రక్తపరీక్ష చెయ్యించుకోవాలి. ఒకవేళ ఆ పరీక్షల్లో యాంటీబాడిస్ ఉన్నట్లు తేలితే వారికి ఇంతకు ముందే రుబెల్లా వచ్చిపోయినట్లు అర్థం. కాబట్టి వారికి మళ్లీ రుబెల్లా వచ్చే అవకాశాలు ఉండవు. యాంటీబాడీస్ లేవని వస్తే వీరికి రుబెల్లా వచ్చే అవకాశాలు ఉన్నాయని అర్థం. కాబట్టి వీరు డాక్టర్ల సలహా మేరకు ప్రెగ్నెన్సీ రాకముందే రుబెల్లా వ్యాక్సిన్ ఒక డోస్ తీసుకోవటం మంచిది. ఇది తీసుకున్నప్పుడు ఒక నెల వరకు ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్తపడాలి. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
జలుబుకు ఏ సూప్ మంచిదంటే!
వాతావరణంలో మార్పులు మన శరీరం మీద ప్రభావం చూపుతాయి. అవి, జలుబు, ఒళ్ళు నొప్పులతో కూడిన జ్వరం, దగ్గు రూపంలో బాధిస్తాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇంట్లోనే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. జులుబు, జ్వరం, దగ్గు సమస్యల ఉపశమనానికి... చికెన్ సూప్: ఉల్లికాడలు, ఉల్లిపాయలు, మిరియాల పొడి కలిపి తయారుచేసుకున్న చికెన్ సూప్ జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలకు త్వరగా ఉపశమనం ఇస్తుంది. మష్రూమ్/పాల కూర సూప్: శాకాహారులు పుట్టగొడుగులు, పాలకూరలతో సూప్‌లను తయారుచేసుకోవచ్చు. దీంట్లోనూ ఉల్లికాడలు, మిరియాలు, వెల్లుల్లి, జిలకర్ర కలిపి తయారుచేసుకొని సేవించాలి. ♦ సూప్‌లు ఏ సమయంలోనైనా వేడి వేడిగా తీసుకుంటే రుచిగానూ ఉంటాయి. అనారోగ్యసమస్యల నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే... ♦ రోజూ ఉదయం అల్పాహారంతో పాటు ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. దీంట్లో ఉండే ‘సి’ విటమిన్, యాంటీయాక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ♦ ఈ సీజన్లో నీటి కాలుష్యం ఎక్కువ. వడకట్టడం, మరిగించి చల్లార్చిన నీళ్లు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోకపోతే విరేచనాలు అవుతుంటాయి. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే పెరుగు, మజ్జిగ వంటి ద్రవాలు తీసుకుంటూ ఉండాలి. ♦ వారానికి ఒకరోజు లేదా 15 రోజులకొకసారి ఉపవాసం ఉండాలి. అంటే పూర్తిగా ఆహారం తీసుకోకుండా కాదు. ఆ రోజు మొత్తం కూరగాయలు, పండ్లు, పళ్ల రసాలు, నీళ్ల మీదే ఉండాలి. వేరే ఇతర ఆహార పదార్థాలేవీ తీసుకోకూడదు. దీని వల్ల శరీరంలో మలినాలు తొలగి, జీర్ణవ్యవస్థ పనితీరు చురుకు అవుతుంది. శరీరానికి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా శాతం పెరిగి అనారోగ్యసమస్యలు దరిచేరవు. ♦ ఆరెంజ్ జ్యూస్, దానిమ్మ జ్యూస్‌లు ఈ కాలం చాలా మంచివి. ♦ ఈ కాలం మూత్రవ్యవస్థకు సంబంధించిన సమస్యలు, ఇన్ఫెక్షన్లు అధికంగా వస్తుంటాయి. అలాగే – ఊపిరితిత్తులు, ముక్కుకు సంబంధించినవి, మలబద్దకం సమస్యలకు అవకాశాలు ఎక్కువ. రోజులో 2–3 లీటర్లు శుభ్రమైన నీళ్లు సేవిస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ల సమస్య ఉండదు. పీచు పదార్థాలు ఎక్కువ ఉండే పదార్థాలు తినడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే విరేచనం సాఫీగా అవుతుంది. ♦ కాయగూరల్లో బీట్రూట్, క్యారెట్ వంటి సూప్‌లను ఎర్రకందిపప్పును ఉపయోగించి తయారుచేసుకోవాలి. ఇది సలాడ్‌లా తయారుచేసుకొని భోజనంలా కూడా తినవచ్చు. ∙టొమాటో రసం, టొమాటో పప్పు.. టొమాటోతో కూడిన వంటకాలు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యకరం. ♦ జీర్ణకోశం నుంచే రోగనిరోధక కణాలు పుడుతూ ఉంటాయి. అందుకని జీర్ణకోశాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే ఈ కాలం అంత ఆరోగ్యంగా ఉంటాం అనే విషయాన్ని విస్మరించకూడదు. – డాక్టర్ బి.జానకి, న్యూట్రిషనిస్ట్ -
జులుబుకు ఏ సూప్ మంచిదంటే!
వాతావరణంలో మార్పులు మన శరీరం మీద ప్రభావం చూపుతాయి. అవి, జలుబు, ఒళ్ళు నొప్పులతో కూడిన జ్వరం, దగ్గు రూపంలో బాధిస్తాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇంట్లోనే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. జులుబు, జ్వరం, దగ్గు సమస్యల ఉపశమనానికి... చికెన్ సూప్: ఉల్లికాడలు, ఉల్లిపాయలు, మిరియాల పొడి కలిపి తయారుచేసుకున్న చికెన్ సూప్ జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలకు త్వరగా ఉపశమనం ఇస్తుంది. మష్రూమ్/పాల కూర సూప్: శాకాహారులు పుట్టగొడుగులు, పాలకూరలతో సూప్‌లను తయారుచేసుకోవచ్చు. దీంట్లోనూ ఉల్లికాడలు, మిరియాలు, వెల్లుల్లి, జిలకర్ర కలిపి తయారుచేసుకొని సేవించాలి.సూప్‌లు ఏ సమయంలోనైనా వేడి వేడిగా తీసుకుంటే రుచిగానూ ఉంటాయి. అనారోగ్యసమస్యల నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే... రోజూ ఉదయం అల్పాహారంతో పాటు ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. దీంట్లో ఉండే ‘సి’ విటమిన్, యాంటీయాక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచుతాయి.ఈ సీజన్లో నీటి కాలుష్యం ఎక్కువ. వడకట్టడం, మరిగించి చల్లార్చిన నీళ్లు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోకపోతే విరేచనాలు అవుతుంటాయి. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే పెరుగు, మజ్జిగ వంటి ద్రవాలు తీసుకుంటూ ఉండాలి. వారానికి ఒకరోజు లేదా 15 రోజులకొకసారి ఉపవాసం ఉండాలి. అంటే పూర్తిగా ఆహారం తీసుకోకుండా కాదు. ఆ రోజు మొత్తం కూరగాయలు, పండ్లు, పళ్ల రసాలు, నీళ్ల మీదే ఉండాలి. వేరే ఇతర ఆహార పదార్థాలేవీ తీసుకోకూడదు. దీని వల్ల శరీరంలో మలినాలు తొలగి, జీర్ణవ్యవస్థ పనితీరు చురుకు అవుతుంది. శరీరానికి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా శాతం పెరిగి అనారోగ్యసమస్యలు దరిచేరవు. ఆరెంజ్ జ్యూస్, దానిమ్మ జ్యూస్‌లు ఈ కాలం చాలా మంచివి. ఈ కాలం మూత్రవ్యవస్థకు సంబంధించిన సమస్యలు, ఇన్ఫెక్షన్లు అధికంగా వస్తుంటాయి. అలాగే – ఊపిరితిత్తులు, ముక్కుకు సంబంధించినవి, మలబద్దకం సమస్యలకు అవకాశాలు ఎక్కువ. రోజులో 2–3 లీటర్లు శుభ్రమైన నీళ్లు సేవిస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ల సమస్య ఉండదు. పీచు పదార్థాలు ఎక్కువ ఉండే పదార్థాలు తినడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే విరేచనం సాఫీగా అవుతుంది. కాయగూరల్లో బీట్రూట్, క్యారెట్ వంటి సూప్‌లను ఎర్రకందిపప్పును ఉపయోగించి తయారుచేసుకోవాలి. ఇది సలాడ్‌లా తయారుచేసుకొని భోజనంలా కూడా తినవచ్చు. ∙టొమాటో రసం, టొమాటో పప్పు.. టొమాటోతో కూడిన వంటకాలు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యకరం.జీర్ణకోశం నుంచే రోగనిరోధక కణాలు పుడుతూ ఉంటాయి. అందుకని జీర్ణకోశాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే ఈ కాలం అంత ఆరోగ్యంగా ఉంటాం అనే విషయాన్ని విస్మరించకూడదు. – డాక్టర్ బి.జానకి, న్యూట్రిషనిస్ట్ -
జలుబు మంచిదే...
జలుబు చేసి తుమ్మితే.. ‘‘శతమానం భవతి’’ అని పెద్దవాళ్లు దీవించేవారు గుర్తుందా? ఏదో పెద్దల చాదస్తం అని అనుకునేవారు. అందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్‌హామ్ శాస్త్రవేత్తలు. జలుబు చేసినప్పుడు శరీరం లోపల ఉష్ణోగ్రతలు తగ్గిపోయి కణస్థాయిలో మంచి కొవ్వు ఉత్పత్తి వేగం అందుకుంటుందని వీరు అంటున్నారు. శరీరంలో కొవ్వు తయారీ ముందుగా నిర్దేశించిన ప్రకారం కాకుండా పరిస్థితికి తగ్గట్టుగా జరుగుతుందని తమ అధ్యయనం చెబుతోందని, మధుమేహం తదితర వ్యాధులను మరింత మెరుగ్గా నియంత్రించేందుకు ఇది ఉపయోగపడుతుందని డాక్టర్ వర్జినీ సొటిల్ తెలిపారు. ఏ రకమైన కొవ్వు ఉత్పత్తి చేయాలో శరీరం ఎలా నిర్ణయిస్తుందో తెలుసుకునేందుకు తాము అధ్యయనం చేపట్టామని చెప్పారు. ఎముక మజ్జ తాలూకూ మూల కణాలతో తాము ప్రయోగాలు చేయగా.. పరిసరాల్లోని ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల కంటే తక్కువైనప్పుడు మంచి కొవ్వు ఉత్పత్తి మొదలైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కణాల్లో ఉష్ణోగ్రతలకు స్పందించే వ్యవస్థ ఏమిటో గుర్తించగలిగితే దాని ఆధారంగా భవిష్యత్తులో మధుమేహానికి సరికొత్త మందులు తయారు చేయడం వీలవుతుందని సొటిల్ తెలిపారు. ఈ మందులు వేసుకుంటే మంచి కొలెస్ట్రాల్ ఎక్కువవుతుందని, తద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులను కూడా నియంత్రించవచ్చునని సొటిల్ తెలిపారు. -
మండుతున్న ఎండలు!
సాక్షి, మచిలీపట్నం: భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మార్చి ప్రారంభంలోనే పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. మూడు రోజులుగా ఉష్ణోగ్రతల పెరుగుదల ఎక్కువగా ఉంది. రెండు రోజులుగా మచిలీపట్నంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వివరాలు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 35 డిగ్రీల మేరకు నమోదయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరితో పోల్చితే ప్రస్తుతం ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వింత పరిస్థితి ఎదురవుతోంది. రాత్రిళ్లు విపరీతమైన చలి, ఉదయం 8 గంటల వరకు పొగమంచుతో కూడిన చలి ఉంటుండగా.. ఉదయం 10 గంటలు సమిపిస్తుండగానే ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంటోంది. వేడి గాలులు, వేడి తీవ్రత అధికమవుతోంది. వెరసి రాత్రిళ్లు చలికి వృద్ధులు వణుకుతుండగా.. ఉదయం ఎండ వేడిమి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ పరిస్థితిలో బట్టి చూస్తే.. జిల్లాలో వేసవి ఉపశమన చర్యలకు తక్షణం యంత్రాంగం ఉపక్రమించాల్సిన అవసం ఎంతైనా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏటా వేసవిలో వేసవిలో ఉపశమన చర్యలను కట్టుదిట్టుంగా అమలు చేయడంలో యంత్రాంగం విఫలమవుతోంది. గత ఏడాది వడదెబ్బ నుంచి ప్రజలను కాపాడటం కోసం పెద్ద ఎత్తున చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించినా క్షేత్ర స్థాయిలో మాత్రం ఇది సరిగా అమలు కాలేదు. ప్రస్తుతం అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం అన్ని గ్రామాలతో పాటు నగరాలు, పట్టణాల్లో ఎద్ద ఎత్తున చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మార్చి ఒకటి నుంచి జూన్ 30 వరకు చలివేంద్రాలు నిర్వహించాలని సూచిస్తున్నారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకుని చలివేంద్రాల్లో తాగునీటితో మజ్జిగ కూడా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటే మరింత మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్చి ఒకటో తేదీ నుంచి వేసవి తీవ్రత అధికమైన పరిస్థితిలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఎక్కడా కార్యాచరణ ప్రారంభం కాలేదు. వెంటాడుతున్న నిర్లక్ష్యం.. వేసవిలో ప్రజలను వడగాలులు, వేడిమి నుంచి కాపాడటంలో వైద్య, ఆరోగ్య శాఖ కీలక పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో మేరకు వైద్య బృందాలను ఏర్పాటు ఉంటుంది, వేసవిలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పనులను నిత్యం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు చేపట్టవద్దన్న ఆదేశాలున్నా ఇంత వరకు కూలీలకు అమలు చేసినా దాఖలాలు లేవు. ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో నీడ కోసం షామియానాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. స్థానికంగా వీరికి మజ్జిగ ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. ప్రతి సారీ నిధుల గోల... వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయండి, తాగునీరు, మజ్జిగ అందజేయండి. అని ఉన్నతాధికారులు సూచిస్తున్నా మండల స్థాయిలో దీని అమలు మాత్రం అగ్యగోచరంగా మారుతోంది. నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోందని మండల స్థాయి అధికారులు పేర్కొంటున్నారు. దీంతో వీటి అమలులో వారు వెనుకంజ వేస్తున్నారు. గత ఏడాది కూడా మండలాలు, పురపాలక సంఘాలకు బాధ్యతలు అప్పజెప్పగా తూతూ మంత్రంగా నిర్వహించారు. రెండు రోజులు కేంద్రాలు పెట్టి మూడో రోజు ఎత్తేశారు. అసలే పరీక్ష కాలం.. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా.. త్వరలో పదో తరగతి, డిగ్రీ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో తాగునీటి సౌకర్యం కల్పించడంపై నిర్వాహకులు దృష్టి సారించాల్సి ఉంది. -
పగలు భగభగ.. రాత్రి గజగజ
వెంకటగిరి రూరల్: మార్చి ప్రారంభమైన కొద్దిరోజుల నుంచి పగలు ఎండ తీవ్రత, రాత్రి చలితో ప్రజలు వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒక వైపు ఉదయం 11 గంటల నుంచే ఎండ ప్రభావం తీవ్రమవుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. మరో వైపు రాత్రి 10 నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు వరకు మంచు కురుస్తోంది. దీంతో వాహనచోదకులు మంచులో దారి సరిగా కనపడక ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ ఉదయం 11 గంటలు దాటితే చాలు ఎండ తీవ్రతకు రహదారులు, రద్దీ ప్రాంతాలు అంతా నిర్మానుష్యంగా మారుతున్నాయి. వేసవి ఆరంభంలోనే ఎండలు ఇలా ఉంటే రానున్న ఏప్రిల్, మే నెలల్లో ఏ స్థాయిలో ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో మార్పుతో ఇక్కట్లు నాయుడుపేట టౌన్: ఉదయం పూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి, రాత్రి పూట చలి తీవ్రంగా ఉండటంతో ప్రజలు వాతవారణ మార్పునకు సతమతమవుతున్నారు. మార్చి ప్రారంభమైన కొద్ది రోజులుగా ఉదయం 9 గంటల నుంచే 35 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే అధికంగా ఎండలు కాస్తుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఎప్పుడూ జనాలతో కిటకిటలాడే బజారువీ«ధి, గడియారం సెంటర్, దర్గావీధి, పాతబస్టాండు తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటలకే రహదారులు బోసిపోతున్నాయి. -
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
బాబుకు తరచూ జలుబు... సలహా ఇవ్వండి మా బాబుకు తొమ్మిదేళ్లు. తరచూ జలుబు చేస్తుంటుంది. చల్లటి పదార్థాలు, పానీయాలు వద్దన్నా మానడు. ఒక్కోసారి ఊపిరి సరిగ్గా ఆడటం లేదని చెబుతుంటాడు. డాక్టర్‌ను సంప్రదించాం. మందులు ఇచ్చారు. వాటి ప్రభావం సరిగ్గా లేదు. బాబు ఆరోగ్య విషయంలో ఎటువంటి సలహాలు పాటించాలో తెలియజేయండి. – ఎమ్. సుభానీ, నెల్లూరు మీ బాబుకు ఉన్న కండిషన్‌ను అలర్జిక్ రైనైటిస్ అంటారు. అందులోనూ మీ బాబుకు ఉన్నది సీజనల్ అలర్జిక్ రైనైటిస్‌గా చెప్పవచ్చు. పిల్లల్లో సీజనల్ అలర్జిక్ రైనైటిస్ లక్షణాలు ఆరేళ్ల వయసు తర్వాత ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సమస్య ఉన్న పిల్లల్లో జలుబు, ముక్కు దురద, కళ్ల నుంచి నీరు కారడం, ముక్కు దిబ్బడ, ఊపిరి తీసుకోవడంలో కష్టం వంటి లక్షణాలు చూస్తుంటాం. ఈ సమస్య చాలా సాధారణం. దీనికి నిర్దిష్టమైన కారణం చెప్పలేకపోయినప్పటికీ వంశపారంపర్యంగా కనిపించడంతో పాటు వాతావరణ, పర్యావరణ మార్పులు కూడా ఇందుకు దోహదం చేస్తాయి. పూల మొక్కలు, దుమ్ము, ధూళి, పుప్పొడి, రంగులు, డిటర్జెంట్స్ వంటివి శరీరానికి సరిపడకపోవడం వంటివి ఈ సమస్యకు ముఖ్య కారణాలు. మీ బాబుకు యాంటీహిస్టమైన్స్, ఇమ్యునోమాడ్యులేటర్స్, ఇంట్రానేసల్ స్టెరాయిడ్ స్ప్రేస్ వాడటం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. మీ అబ్బాయి విషయంలో ఎలాంటి ఆందోళనా అవసరం లేదు. చల్లటి పదార్థాలు తగ్గించడం, సరిపడనివాటికి దూరంగా ఉంచడంతో చాలావరకు ప్రయోజనం ఉంటుంది. బాబు మాటిమాటికీ మూత్రానికి లేస్తున్నాడు... మా బాబు వయసు పన్నెండేళ్లు. రాత్రిళ్లు చాలాసార్లు మూత్రవిసర్జనకు లేస్తుంటాడు. పగటి వేళ కూడా చాలాసార్లు వెళ్తుంటాడు. ఇప్పటికీ పక్కతడుపుతున్నాడు. ఈ సమస్యతో వాడికీ, మాకూ చాలా ఇబ్బందిగా ఉంది. తగిన సలహా ఇవ్వండి. – సులక్షణ, సిద్ధిపేట మీ బాబుకు ఉన్న కండిషన్‌ను ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అని చెప్పవచ్చు. దాంతోపాటు యూరిన్ ఎక్కువగా రావడాన్ని బట్టి చూస్తే పాలీయూరియా అన్న కండిషన్ కూడా ఉందేమోనని కూడా అనుమానించాలి. ఈ సమస్యకు అనేక కారణాలు ఉంటాయి. నీళ్లు ఎక్కువగా తాగడం, యూరినరీ ఇన్ఫెక్షన్స్,ఎండోక్రైన్ సమస్యలు, యూరినరీ బ్లాడర్ డిజ్‌ఫంక్షన్, దీర్ఘకాలికమైన కిడ్నీ సమస్యలు, సైకలాజికల్ సమస్యలు, మలబద్ధకం వంటివి ముఖ్యమైనవి. మీ బాబు విషయంలో అతడి సమస్యకు నిర్దిష్టమైన కారణాన్ని తెలుసుకోవడానికి కంప్లీట్ యూరిన్ అనాలిసిస్, 24 గంటల్లో అతడు విసర్జించే మూత్రపరిమాణం పరీక్షలతో పాటు యూరిన్ ఆస్మనాలిటీ, అల్ట్రాసౌండ్ ఆఫ్ కేయూబీ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో సాధారణంగా సాయంత్రం నుంచి రాత్రివరకు నీళ్లు ఎక్కువగా తాగకుండా చూడటం, తియ్యటి పదార్థాలను ఎక్కువగా తీసుకోకుండా చూడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో పాటు వాళ్లు మూత్రవిసర్జన చేసే సమయంలో అసంపూర్తిగా కాకుండా పూర్తిగా చేసేలా చూడాలి. ఇలాంటి మంచి విసర్జక అలవాట్లతో ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. అయితే మీవాడి సమస్యకు కారణాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయించండి. మీరు ఒకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని సంప్రదించండి. - డా. రమేశ్‌బాబు దాసరి ,సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
బ్యూటిప్
జలుబు వల్ల ఉదయం నిద్రలేవగానే కళ్ల కింద ఉబ్బుగా కనిపిస్తుంది. ఎండిన చిట్టి చేమంతులను పొడి చేసి, ఆ పొడిని ఒక గుడ్డలో వేసి మూట కట్టాలి. వేడి నీటిలో ఆ మూటను కాసేపు ఉంచి, ఉబ్బుగా ఉన్న కళ్ల కింద మృదువుగా అద్దుతూ (తగినంత మాత్రమే వేడి ఉండేలా జాగ్రత్తపడాలి) ఉండాలి. రోజూ ఉదయాన్నే ఇలా చేస్తే కళ్లకింద ఉబ్బుతో పాటు నల్లని వలయాలు కూడా తగ్గుముఖం పడతాయి. చామంతి పొడితో కాచిన తేనీటిని మాడుకు పట్టించి, తర్వాత తలస్నానం చేస్తే ఎంతకీ తగ్గని చుండ్రు సమస్య పరిష్కారం అవుతుంది. -
పని పెరిగితే జలుబు చేస్తుంది!
వానలో తడవడం, చల్లని వాతావరణంలో ఎక్కువగా గడపడం వంటి కారణాల వల్ల జలుబు చేసే అవకాశాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే, పని ఒత్తిడి పెరిగినప్పుడు కూడా జలుబు చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. పని ఒత్తిడి మితిమీరినప్పుడు ముఖానికి చేరాల్సిన రక్తప్రసరణ దారిమళ్లి మెదడులోని న్యూరాన్లకు చేరుతుందని, దీని వల్ల ముక్కు చల్లబడి జలుబు చేస్తుందని ఇంగ్లాండ్‌లోని నాటింగ్‌హామ్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. కొంతమంది వలంటీర్లను ఎంపిక చేసి, రకరకాల ఒత్తిడి స్థాయి గల కంప్యూటర్ గేమ్స్ వారితో ఆడించి, థెర్మల్ ఇమేజింగ్ కెమెరాల సాయంతో వారి శరీర ఉష్ణోగ్రతలలో మార్పులను వారు గుర్తించారు. ఎక్కువ ఒత్తిడి గల గేమ్స్ ఆడిన వారిలో ముఖం, ముక్కు భాగాల్లో ఉష్ణోగ్రత తగ్గిందని వారు వివరించారు. ముఖంలోని అవయవాలకు చేరాల్సిన రక్తప్రసరణ దారిమళ్లడం వల్లనే ఇలా జరుగుతుందని, ఇదే పరిస్థితి గంటల తరబడి కొనసాగితే ముక్కు చల్లబడి జలుబు చేస్తుందని తెలిపారు. -
వణికిస్తున్న చలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో సాధారణం కంటే ఏడు డిగ్రీల వరకు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆదిలాబాద్‌లో రాత్రి 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 11 డిగ్రీలుగా రికార్డయింది. ఖమ్మంలో 12 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. ఐదు డిగ్రీలు తక్కువగా రామగుండంలో 12, భద్రాచలంలో 13 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. హకీంపేటలో 13, హైదరాబాద్‌లో 14, మహబూబ్‌నగర్‌లో 16, హన్మకొండలో 17 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. -
కొనసాగుతున్న చలి తీవ్రత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పాత ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హె చ్చరించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 2 నుంచి 7 డిగ్రీల వరకు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 6 డిగ్రీలు, మెదక్‌లో 9, భద్రాచలంలో 10, ఖమ్మం, రామగుండంలలో 11, హైదరాబాద్‌లో 12, నల్లగొండలో 13, హకీంపేట, హన్మకొండ, నిజామాబాద్‌లలో 14, మహబూబ్‌నగర్ లో 15 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. -
ఢిల్లీ.. కూల్‌కూల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లో అతి చల్లని వాతావరణం నెలకొంది. కనిష్ట ఉష్ణోగ్రత 7.6 డిగ్రీలుగా బుధవారం నమోదైంది.ఈ సీజన్లో సగటు కనిష్ట ఉష్ణోగ్రతకంటే ఒక పాయింట్ అధికంగా ఉంది. ఉత్తర ప్రాంతంలో మంచు కారణంగా మొత్తం 18 రైళ్లను రద్దు చేయగా 6 రైళ్ల రాకపోకల వేళల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో ఈ ఉదయం 8.30 గంటలకు వాతావరణంలో తేమ 95 శాతంగా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 23.7 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ఈ సీజన్లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత కంటే 3 పాయింట్లు అధికం. -
దుప్పటికి నిప్పు, వృద్ధుడి సజీవ దహనం
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం చలిమంటలు అంటుకుని ఓ వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామానికి చెందిన అప్పలస్వామి(80) అనే వృద్ధుడు చలికి తట్టుకోలేక పూరిపాకలో కుంపటి పెట్టుకిని మంటలు వేసుకుని పక్కనే కూర్చున్నాడు. అయితే... ప్రమాదవశాత్తూ దుప్పటికి నిప్పు అంటుకుని మంటలు చెలరేగి సజీవ దహనమయ్యాడు. దాంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. -
పాప ముక్కు నుంచి తరచూ రక్తం?
ఈఎన్టీ కౌన్సెలింగ్ మా పాప వయసు ఎనిమిదేళ్లు. ఆమె ముక్కు నుంచి తరచూ రక్తం కారుతోంది. డాక్టర్‌కి చూపించి ట్రీట్మెంట్ తీసుకున్నాం. కానీ మళ్లీ వెంటనే నాలుగు నెలల్లో తిరిగి రక్తస్రావం మొదలైంది. జలుబు కూడా తరచూ వస్తుంటుంది. ముక్కులో వేళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. దీనివల్ల ఇలా అవుతోందా లేక ప్రమాదకరమైన జబ్బు వేరే ఏదైనా ఉండవచ్చా? మా సమస్యకు పరిష్కారం చూపండి. – రాగిణి, నిజామాబాద్ ముక్కు చాలా సున్నితమైన భాగం. ముక్కులోని భాగాలు కూడా చాలా సున్నితంగా ఉంటాయి. కొన్నిసార్లు చిన్న ఒత్తిడికి లోనైనా రక్తస్రావం అవుతుంటుంది. ముక్కులో వేళ్లు పెట్టుకునే అలవాటు ఉన్న వారిలో చేతి గోళ్ల వల్ల, గట్టిగా తిప్పడం వల్ల లోపలి భాగాలకు దెబ్బతగలడం వల్ల రక్తస్రావం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇలా ముక్కు నుంచి రక్తం కారడాన్ని వైద్య పరిభాషలో ఎపిస్టాక్సిస్ అంటారు. ఈ ఒక్క సమస్య మాత్రమే గాక పాపకు తరచూ జలుబు చేస్తుందంటున్నారు కాబట్టి మీ పాపకు అడినాయిడ్ ఇన్ఫెక్షన్ కూడా ఉండవచ్చేమో చూడాలి. దీనివల్ల కూడా తరచూ జలుబు రావడానికి అవకాశం ఉంది. మీరు మొదట ఈఎన్టీ వైద్య నిపుణులను సంప్రదించి వారితో చెవి, ముక్కు, గొంతు భాగాలలో వారు సూచించిన విధంగా అవసరమైన పరీక్షలు చేయించుకోండి. అడినాయిడ్స్ ఉన్నట్లయితే అడినాయిడ్ ఎక్స్‌రే, ఎండోస్కోపీ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. మొదట మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. మీ పాప ముక్కులో వేళ్లు పెట్టుకోకుండా చూడండి. తన గోళ్లు ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండండి. అలాగే రక్తం రావడం మొదలు కాగానే వెంటనే ముక్కు రంధ్రాలను కాస్త ఒత్తిడి కలగజేస్తూ గట్టిగా పట్టుకోవాలి. తర్వాత ఐస్ క్యూబ్స్‌తో ముక్కుపై అద్దండి. ఇలా ఐస్ప్యాక్తో ముక్కు పైభాగంలో రుద్దుతూ ఉండటం వల్ల పాపకు ఉపశమనం కలుగుతుంది. అయితే ముక్కు నుంచి రక్తస్రావం అన్నది ఇతర కారణాలతో జరిగినప్పుడు దానికి తగిన చికిత్స ఇప్పించడం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అలాంటి సమస్య ఏదైనా ఉందేమో తెలుసుకోవడం కోసం ఒకసారి ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించండి. మాటిమాటికీ జలుబు..? నాకు తరచూ జలుబు చేస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. దాంతో చాలా బలహీనంగా మారుతున్నాను. రోజువారీ పనులు కుదరడం లేదు. జలుబు టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఆ తర్వాత మళ్లీ మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. – సంతోష్, కొత్తవలస మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీకు ‘నేసల్ అలర్జీ’ ఉండవచ్చు అనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఈ సమస్య బాధిస్తోందనీ, దీనివల్ల మీకు ఇబ్బంది ఉందంటున్నారు కాబట్టి దీనికి మీరు సరైన చికిత్స తీసుకోలేదని అనిపిస్తోంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందంటే... ముక్కు, చెవి, గొంతు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. దాంతో ఒక భాగంలో సమస్య వస్తే అది మిగతా రెండు చోట్లా సమస్యలకు దారితీయవచ్చు. యాంటీ అలర్జిక్ టాబ్లెట్ వాడటం శాశ్వత పరిష్కారం కాదు. దాన్ని ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ఇతర సమస్యలు కూడా రావచ్చు. దీనికంటే ‘నేసల్ స్ప్రే’లు వాడటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. వాటితో సైడ్ఎఫెక్ట్స్ కూడా తక్కువ. మీరు ముందుగా నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం చికిత్స తీసుకోండి. మీకు అలర్జీ కలిగించే అంశాలను గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండండి. అదే ప్రస్తుతానికి మీకు ఉత్తమమైన పరిష్కారం. ముక్కు ఎప్పుడూ దిబ్బడ పడ్డట్లు ఉంటోంది! నాకు ముక్కులో తెలియనిదేదో ఎప్పుడూ అడ్డం పడినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ ముక్కు దిబ్బడ సమస్య నుంచి బయటపడటానికి చాలా రకాల మందులు వాడాను. ప్రస్తుతం మెడికల్ షాపుల్లో దొరికే చుక్కల మందు వాడుతున్నాను. అది వాడినప్పుడు మాత్రం సమస్య తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. ఆ మందుకు అలవాటు పడతానేమోననే ఆందోళనతో మానేశాను. దాంతో రాత్రంతా ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. చాలాసార్లు నోటితో గాలి తీసుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకు ఎందుకీ సమస్య? తగిన సలహా, పరిష్కారం సూచించండి. – పి. రామారావు, నకిరేకల్ ఇటీవల వాతావరణ కాలుష్యం పెరిగిపోవడం వల్ల మీరు చెబుతున్న సమస్య చాలా మందిలో కనిపిస్తోంది. పైగా చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యల వల్ల ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో బయటపడే లక్షణాలలో ముక్కుకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడమో లేదా అలర్జీ ఉండటమో లేదా ముక్కులో పాలిప్స్ ఉండటమో లేదా ఈ సమస్యలన్నీ ఉండటమో జరగవచ్చు. మొదట మీరు నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయించి, అవసరమైతే సీటీ స్కాన్ (పీఎన్ఎస్) కూడా తీయించాక మీ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్‌తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చే సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులను దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్ని రకాల నేసల్ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – డాక్టర్ ఇ.సి. వినయ కుమార్, హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ -
శీతల ప్రదేశాల్లోని ప్రజలకు కేన్సర్!
జెరూసలేం: శీతల ప్రదేశాల్లో నివసించేవారికి కేన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది. డెన్మార్క్, నార్వే వంటి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే దేశాల్లోని జనాల్లో ఎక్కువ మంది కేన్సర్ బారినపడినవారున్నట్లు ఓ అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు. శీతల ప్రదేశాలతోపాటు ఎత్తయిన ప్రదేశాల్లో నివసించే వారికి కేన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని సైప్రస్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్త కోన్స్టాంటినస్ ఓస్కరైడ్స్ వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులు మనుషుల్లోని రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతాయని వివరించారు. ఈ మేరకు ప్రాంతాల ఉష్ణోగ్రతలు, ప్రజల్లో కేన్సర్ ప్రమాదం మధ్య సంబంధాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులోభాగంగా ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేన్సర్ కేసుల వివరాలను అధ్యయనం చేసినట్లు కోన్స్టాంటినస్ చెప్పారు. శీతల, ఎత్తయిన ప్రదేశాల్లోని ప్రజలు ఊపిరితిత్తులు, రొమ్ము కేన్సర్ బారిన అధికంగా పడుతున్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించినట్లు తెలిపారు. -
మంచు ముసుగులో ఢిల్లీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో చలి తీవ్రత మరింత పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రత 7.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది ఈ సీజన్లో సగటు కంటే తక్కువగా ఉంది. పలు ప్రాంతాల్లో పొగ మంచు కారణంగా రైల్వే శాఖ 8 రైళ్లను రద్దు చేసింది. 15 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రెండు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసింది. మబ్బులు వీడి 25 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కానుందని వాతావరణ శాఖాధికారులు తెలుపుతున్నారు. తేమ 73 శాతం ఉందని, 2,500 మీటర్ల దూరం వరకు ఉన్నవి మాత్రమే కనిపిస్తున్నాయన్నారు. శుక్రవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 9.4 డిగ్రీలు కాగా, గరిష్టంగా 25.2 డిగ్రీలు నమోదైనట్లు వివరించారు. -
చికెన్ సూప్‌తో జలుబు తగ్గుతుందట!
బాగా జలుబు చేసినప్పుడు వేడి వేడి చికెన్‌సూప్‌ను చప్పరిస్తూ అలా కాసేపు తాగితే జలుబు తగ్గుతుందనేది చాలాకాలం నుంచి ఉన్న నమ్మకం. అయితే కాస్త ఘాటుగా ఉన్న వేడి వేడి చికెన్‌సూప్‌ను అలా ఆస్వాదించడం వల్ల జలుబు తగ్గిన అనుభూతితో కాస్త ఉపశమనం కలుగుతుంది కానీ... అది వాస్తవం కాదని కొందరంటారు. కానీ చికెన్సూప్ జలుబును తగ్గించడమే కాదు... దాని సువాసనలో ఉండే యాంటీ–ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఒనగూరుతాయని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కాకు చెందిన అధ్యయనవేత్త. ఇప్పుడిది కేవలం చిట్కా వైద్యం కాదనీ... దీనికి సశాస్త్రీయ ఆధారాలున్నాయని పేర్కొంటున్నారు డాక్టర్ స్టీఫెన్ రెనార్డ్ అనే అక్కడి వైద్యపరిశోధకుడు. బామ్మ చేసే సూప్ అంటూ ‘గ్రాండ్ మా సూప్’ అని పిలిచే ఇందులో ఇన్ఫెక్షన్స్ తో పోరాడే గుణాలున్నట్లు తాను గుర్తించానని చెబుతున్నారాయన, చికెన్ సువాసన (అరోమా)తో సైనసైటిస్ తగ్గుతుందనీ, శ్వాసకోశవ్యవస్థ పైభాగంలో ఏదో అడ్డుకున్నట్లుగా ఉండి గాలి ఆడనట్లుగా ఉండే ఫీలింగ్ కూడా తగ్గుతుందని చెబుతున్నాడు పరిశోధకుడు. -
ఇంకా పక్క తడుపుతున్నాడు...
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబు వయసు పదేళ్లు. వాడు ఇప్పటికీ పక్కతడుపుతూనే ఉంటాడు. రాత్రిళ్లు ప్రతి రెండు గంటలకోసారి యూరిన్‌కు వెళ్తుంటాడు. పగలు కూడా ఎక్కువగానే వెళ్తుంటాడు. ఈ సమస్యతో చాలా ఇబ్బంది పడుతుంటాడు. మావాడి సమస్యకు తగిన సలహా ఇవ్వండి. – సుమశ్రీ, ఖమ్మం మీ బాబుకు ఉన్న కండిషన్‌ను ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అని చెప్పవచ్చు. దాంతోపాటు యూరిన్ పరిమాణం ఎక్కువగా రావడాన్ని పాలీయూరియా అన్న కండిషన్ కూడా ఉందేమోనని కూడా అనుమానించాలి. ఈ సమస్యకు అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా నీళ్లు ఎక్కువగా తాగడం, యూరినరీ ఇన్ఫెక్షన్స్, మనస్తత్వ సంబంధమైన సమస్యలు, ఎండోక్రైన్ సమస్యలు, యూరినరీ బ్లాడర్ డిజ్‌ఫంక్షన్, దీర్ఘకాలికమైన కిడ్నీ సమస్యలు, మలబద్దకం వంటివి ముఖ్యమైనవి. మీ బాబు విషయంలో అతడి సమస్యకు నిర్దిష్టమైన కారణాన్ని తెలుసుకోడానికి కంప్లీట్ యూరిన్ అనాలిసిస్, 24 గంటల్లో అతడు విసర్జించే మూత్రపరిమాణం పరీక్షలతోపాటు యూరిన్ ఆస్మనాలిటీ, అల్ట్రాసౌండ్ ఆఫ్ కేయూబీ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో సాధారణంగా సాయంత్రం నుంచి రాత్రివరకు నీళ్లు ఎక్కువగా తాగకుండా చూడటం, తియ్యటి పదార్థాలను ఎక్కువగా తీసుకోకుండా చూడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో పాటు యూరిన్ పాస్ చేసేటప్పుడు విసర్జన పూర్తిగా చేసేలా చూడటం ప్రధానం. (ముఖ్యంగా వాయిడింగ్ డిస్ఫంక్షన్ అవాయిడ్ చేయడానికి). ఇలాంటి మంచి విసర్జక అలవాట్లతో ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. అయితే పైన పేర్కొన్న కారణాలలో ఏవైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు పూర్తిస్థాయి మూత్రపరీక్షలు (కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్) చేయించండి. మీరు ఒకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని సంప్రదించండి. పాపకుఇప్పుడు మరో చెవిలో నొప్పి... మా పాప వయస్సు ఆరేళ్లు. రెండు నెలల క్రితం మా పాపకు జలుబు వస్తే ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాం. ఆయన చికిత్స చేశాక తగ్గిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ మరోపక్క చెవి నొప్పిగా ఉందని అంటోంది. ఇలా జరిగే అవకాశం ఉందా? – రమ్య, ఒంగోలు మీ పాపకు ఉన్న కండిషన్‌ను ‘అడినాయిడైటిస్ విత్ యూస్టేషియన్ కెటార్’ అని చెప్పవచ్చు. ఎడినాయిడ్స్ అనే గ్రంధులు ముక్కు వెనకాల, టాన్సిల్ పైన ఉంటాయి. ఈ గ్రంథులకు టాన్సిల్స్ తరహాలో ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇది కొన్ని వారాలు, నెలలు ఉండవచ్చు. చిన్నపిల్లల్లో ఈ కండిషన్‌ను తరచూ చూస్తుంటాం. ఇలాంటిది జరిగినప్పుడు మధ్య చెవి నుంచి ముక్కు వెనుక భాగంలో ఉండే యూస్టేషియన్ ట్యూబులో కొన్ని మార్పులు జరగవచ్చు. ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సైనసెటిస్, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, నోటితో గాలి పీల్చడం, నిద్రపట్టడంలో ఇబ్బంది వంటి ఇతర లక్షణాలూ కనిపించవచ్చు. ఇలాంటి పిల్లలకు యాంటీహిస్టమిన్, యాంటీబయాటిక్ కోర్సులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నొప్పి ఉంటే పెయిన్ మెడికేషన్ కూడా అవసరం కావచ్చు. ఇలాంటి లక్షణాలు దీర్ఘకాలం కొనసాగితూ ఉంటే కొందరిలో చాలా అరుదుగా ఎడినాయిడ్స్‌ను తొలగించాల్సి రావచ్చు. మీరు మీ పీడియాట్రీషియన్ లేదా ఈఎన్టీ సర్జన్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. పాపకు ఒంటి మీద మచ్చలు... ఎందుకిలా? మా పాపకు 14 ఏళ్లు. ఏడాది కిందటినుంచి ఒంటిమీద, ముఖం మీద చాలా మచ్చలు వస్తున్నాయి. ఈ మచ్చలు పోవడానికి ఏం చేయాలి? – ప్రియ, ఆదిలాబాద్ మీ పాపకు ఉన్న కండిషన్ నీవస్ అంటారు. దీన్ని వైద్యపరిభాషలో మల్టిపుల్ నీవస్ అనీ, సాధారణ పరిభాషలో చర్మంపై రంగుమచ్చలు (కలర్డ్ స్పాట్స్ ఆన్ ద స్కిన్) అంటారు. ఇవి రెండు రకాలు. మొదటిది అపాయకరం కానివీ, చాలా సాధారణంగా కనిపించే మచ్చలు. రెండోది హానికరంగా మారే మెలిగ్నెంట్ మచ్చ. ఒంటిపై మచ్చలు పుట్టకతోనే రావచ్చు. మధ్యలో వచ్చే మచ్చలు 10 నుంచి 30 ఏళ్ల మధ్య రావచ్చు. నీవస్ చర్మానికి రంగునిచ్చే కణాల వల్ల వస్తుంది. ఇది శరీరంలో ఎక్కడైనా (అరచేతుల్లో, అరికాళ్లలో, ఆఖరుకు గోళ్లమీద కూడా) రావచ్చు. సూర్యకాంతికి ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం, కుటుంబ చరిత్రలో ఇలాంటి మచ్చలున్న సందర్భాల్లో ఇది వచ్చేందుకు అవకాశం ఎక్కువ. కొన్ని సందర్భాల్లో నీవాయిడ్ బేసల్ సెల్ కార్సినోమా అనే కండిషన్ కూడా రావచ్చు. ఇది పుట్టుకనుంచి ఉండటంతో పాటు, యుక్తవయస్సు వారిలోనూ కనిపిస్తుంది. వారికి ఈ మచ్చలతోపాటు జన్యుపరమైన అబ్నార్మాలిటీస్ చూస్తుంటాం. అలాంటి వాళ్లకు ముఖ ఆకృతి, పళ్లు, చేతులు, మెదడుకు సంబంధించిన లోపాలు కనిపిస్తాయి. మీ పాపకు ఉన్న కండిషన్‌తో పైన చెప్పినవాటికి సంబంధం లేదు. మీ పాపది హానికరం కాని సాధారణ నీవస్ కావచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. క్యాన్సర్‌గా మారే అవకాశం కూడా చాలా తక్కువ. అయితే... కొన్ని నీవస్‌లు క్రమంగా క్యాన్సర్ లక్షణాలను సంతరించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒంటిపై మీ పాపలా మచ్చలు ఉన్నవారు రెగ్యులర్‌గా డెర్మటాలజిస్ట్‌లతో ఫాలో అప్‌లో ఉండటం మంచిది. అది ఎలాంటి మచ్చ అయినా... ఏ, బీ, సీ, డీ అన్న నాలుగు అంశాలు గమనిస్తూ ఉండటం మంచిది. ఏ– అంటే ఎసిమెట్రీ... అంటే పుట్టుమచ్చ సౌష్టవంలో ఏదైనా మార్పు ఉందా?, బీ– అంటే బార్డర్... అంటే పుట్టుమచ్చ అంచుల్లో ఏదైనా మార్పు ఉందా లేక అది ఉబ్బెత్తుగా మారుతోందా?, సీ– అంటే కలర్... అంటే పుట్టుమచ్చ రంగులో ఏదైనా మార్పు కనిపిస్తోందా?, డీ– అంటే డయామీటర్... అంటే మచ్చ వ్యాసం (పరిమాణం) పెరుగుతోందా? ఈ నాలుగు మార్పుల్లో ఏదైనా కనిపిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. అప్పుడు బయాప్సీ తీసి పరీక్ష చేసి అది హానికరమా కాదా అన్నది వారు నిర్ణయిస్తారు. ఇక ఇలాంటివి రాకుండా ఉండాలంటే... ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం పూర్తిగా తగ్గించాలి. హానికారక అల్ట్రావాయొలెట్ కిరణాలు తాకకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లేప్పుడు ఎక్కువ ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలి. మీ పాపకు ఉన్న మచ్చల్ని అప్పుడప్పుడూ డెర్మటాలజిస్ట్‌తో పరీక్ష చేయిస్తూ ఉండటం మంచిది. ఇలాంటి నీవస్‌లు ముఖం మీద ఉండి కాస్మటిక్‌గా ఇబ్బంది కలిగిస్తుంటే... దీన్ని ఎక్సెషన్ థెరపీతో వాటిని తొలగించవచ్చు. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత
సాక్షి, హైదరాబాద్: వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల చలి తీవ్రతతో రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు నల్లగొండ మినహా అన్ని చోట్లా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తగ్గాయి. అత్యంత తక్కువగా ఆదిలాబాద్, మెదక్‌లలో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. భద్రాచలం, ఖమ్మంలలో సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలంలో కనిష్ట ఉష్ణోగ్రత 17, ఖమ్మంలో 16 డిగ్రీలుగా నమోదైంది. మెదక్‌లో సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత రికార్డయింది. హన్మకొండలో 3 డిగ్రీలు తక్కువగా 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువగా హైదరాబాద్‌లో 17 డిగ్రీలు, రామగుండంలో 18, మహబూబ్‌నగర్‌లో 19 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండలో మాత్రం రాత్రి ఉష్ణోగ్రత ఒక డిగ్రీ అధికంగా 23 డిగ్రీలు నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికం.. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధికంగా ఉండటం గమనార్హం. గత 24 గంటల్లో ఖమ్మంలో 3 డిగ్రీలు అధికంగా 34 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే మెదక్‌లోనూ 3 డిగ్రీలు అధికంగా 33 డిగ్రీలు రికార్డయింది. మహబూబ్‌నగర్, నల్లగొండల్లో 2 డిగ్రీలు అధికంగా 33 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాల కాలం నడుస్తోందని, దీంతో ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. వాతావరణశాఖ లెక్క ప్రకారం అసలైన శీతాకాలం జనవరి, ఫిబ్రవరి నెలలేనన్నారు. అయితే నవంబర్, డిసెంబర్‌లలోనూ చలి ఉంటుందని వెల్లడించారు. -
గొంతునొప్పి, మంట, దగ్గా..?
టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం, అర స్పూన్ నల్ల మిరియాల పొడి, టీస్పూన్ ఉప్పులను ఒక గ్లాస్ వేడినీటిలో కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. దీన్ని నోటిలో పోసుకుని పుక్కిలిస్తూ ఉంటే గొంతునొప్పి, మంట, దగ్గు తగ్గుతాయి. తలనొప్పి నివారణకు యాస్ప్రిన్ వేసుకోవడం అందరూ చేసే పనే. అలా కాకుండా దాల్చిన చెక్కను నీటితో తడిపి అరగదీసి కణతలకు పూస్తూ ఉంటే తలనొప్పి ముఖ్యంగా జలుబు వల్ల వచ్చే తలనొప్పి సులువుగా తగ్గిపోతుంది. అజీర్తి, పులితేన్పులు వస్తుంటే రెండు చిటికలు దాల్చిన చెక్కపొ రెండు చిటికలు శొంఠిపొడి, నాలుగు చిటికలు యాలకుల పొడీ కలిపి రోజూ భోజనానికి ముందు సేవిస్తూ ఉంటే అజీర్ణం, తేపులు రాకుండా ఉంటాయి. -
పచ్చని ఆరోగ్యం
⇔ గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపుపొడి వేసుకొని ఉదయం, సాయంత్రం తాగితే జలుబు త్వరగా తగ్గుతుంది. కొద్దిగా నీటిని చేర్చి పచ్చిపసుపు దంచి రసం తీయాలి. దీన్ని చర్మం పై ఎలర్జీ ఉన్న చోట అప్లైచేస్తే ఉపశమనం లభిస్తుంది. పసుపుపొడిని నీటిలో కలిపి ముద్ద చేయాలి. దీన్ని వేపాకు గుజ్జులో కలిపి చర్మం పైన çపూయడం ద్వారా ఎగ్జిమా వంటి చర్మవ్యాధులను నివారించ వచ్చును. ⇔ నువ్వుల నూనెలో పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మం పైన దద్దుర్లు వచ్చినప్పుడు రుద్దితే ఉపశమనం కలుగుతుంది. పసుపులో కొంచెం సున్నం కలిపిన మిశ్రమంతో బెణికిన చోట మర్దనా చేస్తే నొప్పి తగ్గుతుంది. -
హెల్త్ టిప్స్
వర్షంలో తడిస్తే జలుబు చేస్తుందనుకుంటాం. కానీ అది పూర్తిగా అపోహ మాత్రమే. వర్షంలో తడిసినప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే తలస్నానం చేసి, జుట్టు ఆరబెట్టుకుంటే జలుబు చేయదు. తల ఎక్కువసేపు నానినట్లయితే తలస్నానం చేసిన తర్వాత మాడుకు కొద్దిగా పసుపు రాయాలి. -
జలుబును తగ్గించే నిమ్మ!
గుడ్‌ఫుడ్ నిమ్మరసం తాగితే జలుబు చేస్తుందని అనుకుంటారు. కానీ నిమ్మలో విటమిన్–సి సమృద్ధిగా ఉంటుంది. అందుకే నిమ్మరసం రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. కాబట్టి జలుబు తగ్గుతుంది. నిమ్మలో ఉన్న పోషకాలివి. నిమ్మలో ఉండే విటమిన్–సి చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్. నిమ్మను తరచూ వాడేవారికి క్యాన్సర్‌నుంచి స్వాభావికమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. నిమ్మలో ఎండార్ఫిన్ అనే రసాయనాలు ఎక్కువ. అందుకే నిమ్మ నీరు లేదా నిమ్మ షర్బత్ తాగిన తర్వాత ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. ఈ ఎండార్ఫిన్ రసాయనాల్లో యాంగై్జటీ తగ్గించే గుణం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా తీవ్రమైన ఒత్తిడి లేదా యాంగై్జటీ కలిగినప్పుడు నిమ్మరసం ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది.అర లీటరు నీళ్లలో ఒక నిమ్మపండు రసాన్ని పిండి అందులో చిటికెడంత ఉప్పు, చారెడు పంచదార వేసి తాగితే అది డీ–హైడ్రేషన్ ప్రమాదం నుంచి కాపాడుతుంది. నిమ్మలోని వ్యాధి నిరోధకతను కలిగించే పోషకాల వల్ల అది అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. -
అడినాయిడ్స్ వాపు ఎందుకు?
హోమియో కౌన్సెలింగ్ మా పాపకు తొమ్మిదేళ్లు. తరచూ జలుబు చేస్తోంది. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు చేసి అడినాయిడ్స్ వాచాయని, వాటిని శస్త్రచికిత్స చేసి తొలగించాలని చెప్పారు. మాకు ఆందోళనగా ఉంది. పాపకు శస్త్రచికిత్స అవసరం లేకుండా హోమియో మందులతో నయమయ్యే అవకాశం ఉందా? – నందిని, నిడదవోలు మన శరీర రోగనిరోధక వ్యవస్థలో భాగమైన అడినాయిడ్స్ చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్స్ కలిగించే బ్యాక్టీరియాను నశింపజేసి వ్యాధులను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఈ అడినాయిడ్స్ ఐదేళ్ల వయసు దాటాక కుంచించుకుపోవడం మొదలవుతాయి. యుక్తవయసునకు చేరేసరికి ఇవి పూర్తిగా అదృశ్యమైపోతాయి. బ్యాక్టీరియాను నశింపజేసే ప్రక్రియలో ఒక్కోసారి అవి వాపునకు గురై మళ్లీ మామూలుగా మారతాయి. కానీ కొన్ని సందర్భాల్లో అవి కూడా ఇన్ఫెక్షన్కు గురికావడం వల్ల, వాచిపోయి శ్వాసద్వారాలకు అడ్డుగా నిలిచి శ్వాస తీసుకోవడం ఇబ్బందిని కలగజేస్తాయి. అడినాయిడ్స్ గురైన సందర్భాల్లో టాన్సిల్స్ కూడా వాచేందుకు అవకాశం ఉంది. అడినాయిడ్స్ ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు కనిపించే లక్షణాలు ∙ముక్కు మూసుకుపోయినట్లుగా ఉండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. దాంతో నోటి దుర్వాసన, పెదవులు పగలడం, నోరు ఎండిపోయినట్లుగా అనిపించడం, ముక్కు దిబ్బడ ఏర్పడవచ్చు. ∙నిద్రంచే సమయంలో ప్రశాంతంగా లేకపోవడం, గురక వంటివి కనిపించవచ్చు. ∙గొంతు భాగంలోని గ్రంథుల వాపు, చెవి సమస్యలను గమనించవచ్చు. చికిత్స: హోమియో విధానంలో జెనెటిక్ కాన్స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స అందించడం ద్వారా అడినాయిడ్స్ సమస్యను పూర్తిగా నయం చేయడానికి అవకాశం ఉంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడం వల్ల శస్త్రచికిత్స అవసరం లేకుండానే సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
వాన జబ్బులకు చికిత్స సాధ్యమే!
హోమియో కౌన్సెలింగ్ వాన జబ్బులకు చికిత్స సాధ్యమే! వర్షాకాలం వచ్చిందంటే మనసుకు బాగా ఉంటుంది. కానీ శారీరకంగా అనేక సమస్యలు వస్తున్నాయి. జలుబు, దగ్గు, ఆస్తమా వదలడం లేదు. బయటకు వెళ్లాలంటేనే ఆందోళనగా ఉంటుంది. వర్షాకాలం, చలికాలం ఈ బాధలు భరించాల్సిందేనా? – వేణు, ఒంగోలు వర్షాకాలం పచ్చదనాన్ని, చల్లటి వాతావరణాన్ని తెచ్చి వేసవి వేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే ఈ కాలం పలు రకాల వ్యాధులనూ ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా బ్యాక్టీరియా, ఇంటి కీటకాలు, ఫంగస్ పెరుగుదలకు వర్షాకాలం అనువుగా ఉంటుంది. ఈ సీజన్లో ఆస్తమా, అలర్జీ, బ్రాంకైటిస్, ఫ్లూ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. అలర్జిక్ రైనైటిస్ : వరస తుమ్ములతో ముక్కు కారడం, కళ్లు–ముక్కు దురదగా ఉండటం కనిపిస్తుంది. అలర్జీ : సాధారణంగా జలుబు లక్షణాలు నిర్ణీత కాలానికి మించి కొనసాగుతూ ఉంటే దాన్ని అలర్జీగా పరిగణించవచ్చు. అయితే కొందరిలో పొగ, దుమ్ము, ధూళి, కాలుష్యాల వంటివి అలర్జీని ప్రేరేపిస్తాయి. అప్పుడు సాధారణ జలుబు సమయంలో కనిపించే లక్షణాలు కనిపిస్తాయి. ఆస్తమా : ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది ఊపిరితిత్తుల్లోని వాయునాళాల్లో వచ్చే సమస్య. ఇది తేమ వాతావరణంలో ఉండే పుప్పొడి వంటి అలర్జెన్ల కారణంగా వస్తుంది. ఇది వచ్చిన వారిలో పిల్లికూతలు, ఛాతీ పట్టేయడం, రాత్రిపూట దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. జాగ్రత్తలు : పై సమస్యలు ఉన్నవారు చాలాకాలంగా లోపల దాచి ఉంచిన ఉన్ని దుస్తులు ధరించే ముందు కాసేపు ఎండలో ఉంచాలి. చల్లటి వాతావరణానికి దూరంగా ఉండాలి. కూల్‌డ్రింక్స్, చల్లటి పానీయాలు తీసుకోకూడదు. తమ సమస్యను ప్రేరేపించే అంశాల నుంచి దూరంగా ఉండాలి. చికిత్స : అలర్జిక్ రైనైటిస్, అలర్జీలు, ఆస్తమా వంటివి వచ్చిన వారికి ఎప్పటికీ తగ్గదని చాలామంది అనుకుంటుంటారు. అయితే అది నిజం కాదు. జీవనశైలిని మార్చుకొని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, హోమియోలో ఆర్సినిక్ ఆల్బ్, ఇపికాక్, నేట్రమ్సల్ఫ్, కాలీ కార్బ్, స్పంజియా వంటి మందులను అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడితే పైన పేర్కొన్న అన్ని సమస్యలనూ శాశ్వతంగా నయం చేయవచ్చు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఇంత చిన్న వయసులో డయాబెటిసా? హోమియో కౌన్సెలింగ్ మా అబ్బాయికి 12 ఏళ్లు. టైప్–1 డయాబెటిస్ అంటున్నారు. ఇంత చిన్న వయసులో డయాబెటిస్ వస్తుందా? దీని గురించి వివరించి, మావాడు పాటించాల్సిన ఆహార నియమాలు వివరించండి.– సుకుమార్, రాజమండ్రి 15 ఏళ్ల లోపు వారిలో వచ్చే చక్కెరవ్యాధిని టైప్–1 డయాబెటిస్ అంటారు. టైప్–1 డయాబెటిస్ అంటే క్లోమగ్రంథి పనిచేయదు. వీరికి వైద్యం ఇన్సులిన్ మాత్రలతో ఆరంభించి, ఇంజెక్షన్లు ఇస్తుంటారు. ఆహారనియమాలు :పిల్లల్లో ఎలాంటి ఆహార నియమాలు వద్దు. ∙లావుగా ఉంటేనే బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. జంక్‌ఫుడ్ తగ్గించుకోవాలి. ఇన్సులిన్ నిరోధకత రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ను పెంచుతుంది కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే ఆహారంలో పిండిపదార్థాలు తగ్గించుకోవాలి. ∙5 – 15 ఏళ్ల వసువారికి ఎలాంటి ఆహారనియమాలు పెట్టకూడదు. వారి ఎదుగుదల కోసం వాళ్ల బరువుకు తగినట్లు ఎన్ని క్యాలరీలు అవసరమవుతాయో డైటీషియన్‌ను సంప్రదించి వారు చెప్పినట్లు పాటించాలి. త్వరగా జీర్ణమయ్యే పిండి పదార్థాలను వాడాలి. పిజ్జా, బర్గర్, ఐస్‌క్రీమ్స్, నూడుల్స్, బిస్కెట్లు వాడకూడదు. ∙ఆహారం విషయంలో ఆంక్షలు విధించడం, ఆహారాన్ని తగ్గించి, వ్యాయామాలను పెంచడం మంచిది కాదు. పిల్లల్లో అసలే తక్కువగా ఉండే రోగనిరోధకశక్తి... మరింతగా తగ్గిపోయి క్షయవ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తలివే... సాధారణ సమయంలో రక్తంలో గ్లూకోజ్ పాళ్లు 140కి మించకుండా చూసుకోవాలి. మరీ బరువుంటే తప్ప బరువును తగ్గించే ప్రయత్నం చేయకూడదు. 5 నుంచి 15 ఏళ్ల వయసు చాలా కీలకం. పిల్లల వేళ్ల మధ్య, జననాంగాల వద్ద తేమ లేకుండా, ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా చూసుకోవాలి. పిల్లలకు మధుమేహం వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి మధుమేహాన్ని అదుపులో పెట్టుకుంటే సాధారణ వ్యక్తుల కంటే కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. హోమియో వైద్యవిధానంలో చికిత్స : హోమియోలో టైప్–1కు అద్భుతమైన వైద్యచికిత్స ఉంది. ఇన్సులిన్‌తోపాటు హోమియో మందులు ఇవ్వడం వల్ల పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరిగి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఎదుగుదలలోపాన్ని, సోమరితనం, అతిమూత్రం లాంటి లక్షణాలను నయం చేయవచ్చు. ఇది పూర్తిగా సురక్షితం, దుష్పరిణామాలు ఉండవు. - డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ పైల్స్, ఫిస్టులా, ఫిషర్ సమస్యలు తగ్గుతాయి... హోమియో కౌన్సెలింగ్ నా వయసు 37. బాగా ముక్కి ముక్కి మలవిసర్జన చేయాల్సి వస్తోంది. అలాంటి సమయాల్లో మలద్వారం వద్ద ఇబ్బందిగా ఉంటోంది. – మోహన్‌రావు, కాకినాడ మీ ప్రశ్నలో మీరు పైల్స్, ఫిషర్ లేదా ఫిస్టులా సమస్యల్లో దేనితో బాధపడుతున్నారన్న స్పష్టత లేదు. అయితే ఈ మూడు సమస్యల్లోనూ మలబద్దకం వచ్చి, మలవిసర్జన సాఫీగా జరగదు. పైల్స్‌ను వాడుకలో మొలలు అంటారు. మలద్వారం వద్ద ఉండే సిరలు ఉబ్బడం వల్ల ఈ సమస్య వస్తుంది. పీచుపదార్థాలు తక్కువగా తీసుకునేవారిలో మలం గట్టిపడి మలబద్దకానికి దారితీస్తుంది. తద్వారా కలిగే ఒత్తిడి వల్ల మలద్వారం చుట్టూ ఉండే సిరలు ఉబ్బుతాయి. పైల్స్ ఉన్నవారిలో నొప్పి, కొందరిలో మలవిసర్జన సమయంలో రక్తం పడటం, మలద్వారం వద్ద ఏదో అడ్డంకి ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక యానల్ ఫిషర్ సమస్య ఉన్నవారిలో మలద్వారం చుట్టూ ఉండే చర్మం చిట్లిపోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం మలబద్దకం వల్ల మలం బయటకు రావడానికి అధికంగా ముక్కడం. యానల్ ఫిషర్లో ప్రధానమైన లక్షణం మలం బయటకు వచ్చేటప్పుడు నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఇక యానల్ ఫిస్టులా అనేది మలద్వార భాగానికీ, చర్మానికీ మధ్యలో ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడటం. విసర్జన సమయంలో కలిగే తీవ్రమైన ఒత్తిడికి మలద్వారంలో ఉండే కణజాలం దెబ్బతింటుంది. ఆ కణజాలంలోకి బ్యాక్టీరియా ప్రవేశించి తొలిచేస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడుతుంది. మలద్వారం వద్దగల చర్మంపై ఇది ఒక చీముతో కూడిన గడ్డలాగా కనపడుతుంది. దీన్ని చీముగడ్డగా భావించి చికిత్స చేయడం వల్ల పైన చర్మం మీద ఉన్న గడ్డ నయమవుతుంది. కానీ లోపల ఉండే ద్వారం అలాగే మిగిలి ఉంటుంది. అందుకే ఈ సమస్య తరచూ వచ్చి ఇబ్బంది పెడుతుంది. యానల్ ఫిస్టులాలో కనపడే ప్రధాన లక్షణం మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, దీనితో పాటు అక్కడ ఏర్పడ్డ రంధ్రం నుంచి చీముతో కూడిన రక్తం బయటకు వస్తుంటుంది. పైల్స్, ఫిషర్, ఫిస్టులా... ఈ మూడు సమస్యలకూ హోమియోపతిలో అద్భుతమైన మందులు ఉన్నాయి. రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులు ఇస్తారు. - డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
అల్లం... ఆర్థరైటిస్ మందు
గుడ్‌ఫుడ్ మనకు జలుబు చేసినట్లు అనిపించగానే మొదట చేసే పని మామూలు టీకి బదులు, జింజర్ టీ తాగడమే. అంటే అల్లంలో ఏవో వైద్యపరమైన అద్భుతాలు ఉన్నాయన్న విషయాన్ని సమాజమే మనకు పరోక్షంగా నేర్పిస్తుందన్నమాట. ఇలా మనకు పెద్దగా తెలియకుండానే అల్లాన్ని జలుబుకు విరుగుడుగా వాడుతుంటాం. ఇదొక్కటే కాదు అల్లంతో ప్రయోజనాలు ఎన్నెన్నో... అల్లానికి ఉండే ఓ విచిత్రమైన రుచి, వాసనలకు (ఫ్లేవర్కు) కారణం దానిలోని జింజెరాల్ అనే స్వాభావికమైన రసాయనం. దాని వల్ల మనకు ఉండే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. జింజెరాల్ అన్న ఆ శక్తిమంతమైన పదార్థంలో నొప్పి, వాపు, మంటను తగ్గించే గుణంతో పాటు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. వికారం, వాంతులను అరికట్టే గుణం ఉన్నందున వేవిళ్లతో సతమతమయ్యే మహిళలకూ, సీ సిక్నెస్తో బాధపడే పురుషులకు ఆ సమస్య తీరడానికి అల్లంతో చేసిన పదార్థాలు ఇస్తారు. అంతేకాదు... కీమోథెరపీ తీసుకుంటున్న వారిలో కనిపించే వికారాన్ని నివారించడానికి కూడా అల్లాన్ని ఉపయోగిస్తారు. గొంతునొప్పి, గొంతులో ఇబ్బంది ఉన్నవారికి ఆ సమస్య తగ్గడం కోసం అల్లం ఘాటు ఉన్న పదార్థాలను ఇస్తారు. అల్లానికి ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం (వాపు, నొప్పి, మంటను తగ్గించడం) వల్ల దీన్ని ఆస్టియోఆర్థరైటిస్ రోగులకు ఇస్తుంటారు. అల్లం గుండెజబ్బులను నివారించడంతో పాటు రక్తంలో చక్కెరపాళ్లను తగ్గిస్తుంది. అల్లం జీర్ణశక్తిని పెంపొందించడంతో పాటు కడుపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. -
చలచల్లగా మోసం
– కోట్ల రుణం ఎగవేతతో కదిలిన బ్యాంకు అధికారులు - కోల్డ్ స్టోరేజీలో పని చేస్తున్న కూలీల పేరుతో రుణాలు మంజూరు - పరిశీలనలో వేరుశెనగ తొక్కలు, చెక్కపొట్టు ప్రత్యక్షం - వాటినే వ్యవసాయ ఉత్పత్తులుగా నమ్మించి రుణం ప్రత్తిపాడు : రైతుల పాలిట కల్ప వృక్షాలుగా ఉండాల్సిన కోల్డ్ స్టోరేజీలు సంబంధిత యజమానులకు కాసులు కురిపించే కేంద్రాలుగా మారుతున్నాయి. అక్కడ పని చేసే కూలీలనే రైతులుగా మార్చేసి ... వారే తమ స్టోరేజీల్లో పంటలు భద్ర పరుచుకున్నారని వస్తోత్పత్తులను చూపించి బ్యాంకులకు బురిడీ కొట్టి కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు. ఇందుకు కొంతమంది బ్యాంకు సిబ్బంది కూడా సహకరించడంతో మోసం మరింత సులవవుతోంది. ఈ తరహాలోని కోల్డ్ స్టోరేజీ మోసం మరొకటి జిల్లాలో బయటపడింది. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి కోట్ల రూపాయల రుణం పొంది ఎగనామం పెట్టిన ప్రత్తిపాడు జాతీయ రహదారి పక్కన ఉన్న ధర్మవరం సాయిభ్య అగ్రి కోల్డ్ స్టోరేజీ ఆస్తులను శుక్రవారం సాయంత్రం కాకినాడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. ధర్మవరం జాతీయ రహదారి సమీపాన రెండు దశాబ్దాల క్రితం కంచుస్తభం వెంకట సత్య ప్రసాద్ సాయిభ్య ఆగ్రి కోల్డు స్టోరేజీని నెలకొల్పారు. కాకినాడ దేనా బ్యాంకు నుంచి రూ. 28 కోట్లు బినామీ రుణాలు పొంది, ఎగవేయడంతో దేనా బ్యాంక్ అధికారులు కంచుస్తంభం వెంకట సత్య ప్రసాద్‌తోపాటు మరో 111 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ స్టోరేజీలో రైతులు అందజేసే చింతపండు, ఎర్ర మిరప, మామిడి తాండ్ర, పత్తి విత్తనాలు తదితర వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయాలి. కానీ అవేవీ నిల్వ చేయకుండానే ఉన్నట్టుగా లెక్కలు చూపించి భారీగా రుణాలు తీసుకోవడంతో అసలుకే ఎసరు వచ్చింది. రైతుల పేరుతో తీసుకున్న రుణాలకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులను బ్యాంకు అధికారలు పరిశీలించగా ఖాళీ పెట్టెల్లో వేరుశెనగ తొక్కలు, చెక్క పొట్టుతో ఉన్నాయి. రుణం పొందిన బినామీ రైతులంతా కోల్డు స్టోరేజీలో పనిచేస్తున్న కూలీలే. దీనిపై మహబూబ్ నగర్ జిల్లా కొత్త వనపర్తి మండలానికి చెందిన దేనా బ్యాంకు కాకినాడ బ్రాంచి మేనేజర్ గత ఫిబ్రవరి నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రత్తిపాడు సీఐ అద్దంకి శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్టోరేజీ యజమాని సత్య ప్రసాద్ పరారీలోనే ఉన్నారు. -
జలుబుకు కారణం తెలుసా ?
వాషింగ్టన్: వేసవిలో కూడా జలుబు చేస్తోంది. నీళ్లల్లో తడిసినప్పుడు జలుబు చేసినట్లుగానే అదేపనిగా ముక్కు కారుతోంది. సైనస్ సమస్య ఉన్నవారు కూడా చల్లటి వాతావరణంతో సంబంధం లేకుండానే ఇబ్బందులు పడుతున్నారు. కారణమేంటి? అని అడిగితే కాలుష్యమేనని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కాలుష్యం కారణంగానే రోగనిరోధక శక్తి తగ్గుతోందని, రోగాల తీవ్రత పెరుగుతోందంటున్నారు. న్యూఢిల్లీ, బీజింగ్ వంటి మహానగరాల్లో నివసిస్తున్న ప్రజలు తరచూ జలుబు బారిన పడడం, సైనస్ వంటి సమస్యలు ఎదుర్కోవడం ఎక్కువగా కనిపిస్తోందని, అందుకు కారణం కాలుష్యమేనని ఎలుకల మీద చేసిన పరిశోధనల్లో తేలిందని భారత సంతతి శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ఇందుకోసం 38 ఎలుకలపై పరిశోధనలు చేశామని, అందులో 19 ఎలుకలను స్వచ్ఛమైన గాలి పీల్చుకునేలా, మరో 19 ఎలుకలు కాలుష్యపూరిత గాలిని పీల్చుకునేలా ఏర్పాట్లు చేయగా.. కలుషితమైన గాలిని పీల్చుకున్న ఎలుకల్లో జలుబు, సైనస్ వంటి అనారోగ్య లక్షణాలు కనిపించాయని తెలిపారు. చల్లగా ఉండే ప్రాంతాల్లో వెచ్చదనం కోసం పెట్టే మంటల కారణంగా కూడా కాలుష్యం పెరిగి, ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని హాప్కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్త రామనాథన్ తెలిపారు. -
స్వైన్‌ఫ్లూ కౌన్సెలింగ్
మామూలు జలుబులా కనిపిస్తూ సమస్యలు సృష్టించే స్వైన్‌ఫ్లూ! నా వయసు 25 ఏళ్లు. చిన్నప్పటి నుంచి నాకు తరచు జలుబు చేస్తోంది. డాక్టర్ల్ దానివల్ల ప్రమాదం ఏదీ లేదని, శరీర తత్వం వల్ల కొందరికి తేలిగ్గా జలుబు చేస్తుందని చెప్పారు. రెండేళ్ల కిందట ఒక కాల్ సెంటర్లో ఉద్యోగిగా చేరాను. చల్లగా ఉండే వాతావరణంలో ఉండటం వల్ల మరింత తరచుగా నాకు జలుబు చేస్తోంది. ఈ మధ్య తరచూ వార్తా పత్రికల్లో స్వైన్‌ఫ్లూ కేసుల గూర్చి వార్తలు వినవస్తున్నాయి. నాకు ఆ రకమైన జలుబు వస్తుందేమోనని భయంగా ఉంది. స్వైన్‌ఫ్లూ అంటే ఏమిటి? ఎవరికి వస్తుంది? దానిని ఎలా గుర్తించాలి? తెలియజేయండి. – కవిత, సికింద్రాబాద్ స్వైన్‌ఫ్లూ అనేది ఇన్ఫ్లుయెంజా–ఏ అనే వైరస్ వల్ల వచ్చే శ్వాససంబంధిత వ్యాధి. ఇది సాధారణ జలుబుకు పూర్తిగా భిన్నమైనది. వ్యాధి లక్షణాల విషయానికి వస్తే ఇతర ఫ్లూ రకాల మాదిరిగా దీనిలోనూ జ్వరం, దగ్గు, గొంతులో మంట, తలనొప్పి, వణుకు, కండరాల–కీళ్లనొప్పులు ఉంటాయి. కొంతమందిలో వీటికి తోడు వాంతులు, విరేచనాలు కూడా కనిపిస్తాయి. వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు లక్షల సంఖ్యలో వైరస్లు గది వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. గది తలుపులకు ఉన్న హ్యాండిల్స్, వాష్ బేసిన్లలోని కుళాయిల పైన పడ్డ తుంపర్ల నుంచి వైరస్ ఆ తర్వాత ముట్టుకున్న వారి చేతలకు అంటడం ద్వారా, గాలిలో తేలియాడుతున్న వైరస్లు శ్వాస ద్వారా ఆ పరిసరాల్లో వ్యక్తుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. వ్యాధిగ్రస్తుడైన వ్యక్తికి సన్నిహితంగా మెలగడం ద్వారా కూడా స్వైన్ ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. మీరు పనిచేసే చోట స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తులు ఉంటే తప్పించి కేవలం చల్లటి వాతావరణంలో పనిచేయడం వల్ల స్వైన్‌ఫ్లూ సోకే అవకాశం ఎంతమాత్రమూ లేదు. పందిమాసం తినడం వల్ల స్వైన్‌ఫ్లూ వస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. పందుల పెంపకం కేంద్రాలలో పనిచేసేవారు, ఇళ్లలో పందులను పెంచేవారికి మాత్రం వాటి నుంచి స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకే అవకాశం ఉంది. స్వైన్‌ఫ్లూ నివారణకు కచ్చితమైన మార్గం వ్యాక్సినేషన్ (టీకా) వేయించుకోవడమే. ఈ వ్యాక్సిన్ సూదిమందు, నేసల్ స్ప్రే రూపాలలో లభిస్తున్నది. వ్యాధికారక వైరస్‌లను బలహీనపరచి దీనిని తయారుచేస్తారు. సూదిమందుగానో లేక నేసల్స్ప్రేగానో ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల వ్యక్తిలో సైన్‌ఫ్లూ వ్యాధిని ఎదుర్కోగల రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. ఆరు నెలల పసివాళ్లు మొదలుకొని వయోవృద్ధుల వరకు అందరూ ముందుజాగ్రత్త చర్యగా స్వైన్‌ఫ్లూ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. స్వైన్‌ఫ్లూ వల్ల కలిగే తీవ్ర అసౌకర్యానికి తోడు ఈ వ్యాధి కారణంగా నిమోనియా, శ్వాసకోశాల ఇన్ఫెక్షన్ల వంటి ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ముందుజాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇప్పటికే ఆస్తమా, డయాబెటిస్ ఉన్నవారిలో స్వైన్‌ఫ్లూ వల్ల పరిస్థితి మరింత విషమిస్తుంటుంది. అందువల్ల జలుబుకు తోడు పొట్టలో నొప్పి, తీవ్రమైన వాంతులు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వెంటనే డాక్టర్‌కు చూపించుకోవడం అవసరం. డాక్టర్ వి. నాగార్జున మాటూరు సీనియర్ పల్మనాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ పైల్స్... మందులతో తగ్గుతుందా! హోమియో కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. నాకు గత మూడు నెలలుగా మల విసర్జన సమయంలో రక్తం పడుతోంది. మలద్వారం వద్ద బుడిపెలా ఏర్పడి నొప్పి, మంట ఉంటున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే పైల్స్ అని చెప్పారు. ఈ సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – స్వరూప, కొత్తగూడెం పైల్స్ అనేది మారుతున్న జీవనశైలి, మారుతున్న ఆహార అలవాట్లు, వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల్లో ఒకటి. తరచూ వచ్చే సమస్యల్లో ఇదీ ఒకటి. మలాశయం లోపల, బయట చిన్న బుడిపెల రూపంలో ఇవి ఏర్పడతాయి. మల ద్వారం చివర్లో ఉన్న సిరలలో మార్పుల వల్ల అవి ఉబ్బడం వల్ల ఏర్పడతాయి. ఈ వ్యాధిలో మొత్తం నాలుగు దశలుంటాయి. గ్రేడ్ – 1: మొలలు పైకి కనిపించవు. నొప్పి ఉండదు. కానీ రక్తం పడుతుంది. గ్రేడ్ – 2: రక్తం పడవచ్చు – పడకపోవచ్చు. కానీ మొలలు బయటకు వస్తాయి. మల విసర్జన తర్వాత వాటంతట అవే లోపలికి పోతాయి. గ్రేడ్ – 3: మల విసర్జన చేసినప్పుడు పైల్స్ బయటకు వస్తాయి. కానీ వేలితో నెడితేనే లోపలికి వెళ్తాయి. గ్రేడ్ – 4: మొలలు బయటే ఉంటాయి. నెట్టినా అవి లోపలికి వెళ్లవు. నివారణ: మలబద్దకం లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. చాలా ఎక్కువ సేపు కూర్చొని పనిచేసే వారికి మొలల సమస్య వస్తుందని భావిస్తారు. అది కేవలం అపోహ. సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేనివారికి మలబద్దకం వచ్చే అవకాశం ఉంది.కొబ్బరినీళ్లు తీసుకోవడం, మెత్తటి పరుపు మీద కూర్చోవడం, వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల ఈ సమస్య నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. నూనెలో వేయించిన మాంసం, బిర్యానీ, ఆలుగడ్డ, చామదుంప వంటి వాటి వల్ల సమస్య పెరుగుతుంది. ఎక్కువ ప్రయాణాలు చేస్తూ, సరైన ఆహారం తీసుకోని వారికి, మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం, అధిక వేడి ప్రదేశంలో పనిచేసేవారికి, గర్భస్రావం తర్వాత స్త్రీలకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. నీరు ఎక్కువగా తీసుకోవడం, పీచుపదార్థాలు తినడం (బీరకాయ, ఆనప, బచ్చలి) వల్ల ఈ సమస్య నుంచి కొద్దిగా ఉపశమనం పొందవచ్చు .హోమియోలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను బట్టి కాన్స్టిట్యూషన్ చికిత్స ఇచ్చి వ్యాధి నిరోధకత పెంచడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించడం జరుగుతుంది. ఇలా సమస్యను పూర్తిగా అదుపులోకి తీసుకువస్తారు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ తగినంత బరువు పెరగవచ్చు ! హోమియో కౌన్సెలింగ్ నా వయసు 24 ఏళ్లు. సన్నగా ఉంటాను. ఎంత తిన్నా లావుకావడం లేదు. ఎప్పుడూ నీరసంగా, చర్మం పొడిబారినట్లుగా ఉంటోంది. టానిక్కులు తాగినా బరువు పెరగడం లేదు. నా సమస్యకు హోమియోలో మందులు ఉన్నాయా? – సునీత, నిజామాబాద్ వ్యక్తి ఆరోగ్యానికి... కావలసిన బరువు ఉండడం చాలా అవసరం. మెదడు సామర్థ్యాన్ని, వ్యాధి నిరోధక శక్తిని బట్టి ఆరోగ్యవంతంగా ఉన్నామని చెప్పలేం. బరువు అనేది మన శరీర పోషణ, జీర్ణశక్తి, జీర్ణమైన ఆహారాన్ని గ్రహించుకునే శక్తి... లాంటి పలు అంశాలను నిర్ణయిస్తుంది. అధిక బరువు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకని చాలామంది అధికంగా బరువు పెరగకుండా అదుపులో ఉంచుకుంటున్నారు. అలాగే కొంతమంది తక్కువ బరువు ఉన్నవారు ఎంతగా ప్రయత్నించినా బరువు పెరగరు. కొందరి శరీర ఆకృతి అలా ఉంటుంది. తక్కువ బరువు ఉన్న వారు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది అమ్మాయిలే గాక, అబ్బాయిలు, వారి వయసుకు తగినంత బరువు ఉండరు. ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు ఉన్నవారు ఏదో ఒక కారణంతో బాధపడుతూ ఉంటారు. ఇది వ్యాధి వల్ల కాదు. జీర్ణశక్తి తగ్గిపోవడం వల్లనే. బరువు తక్కువగా ఉంటే ఇతర వ్యాధులు త్వరగా సోకుతాయి. బరువు పెరగడానికి తమ ఆహార నియమావళిలో మార్పులను, శారీరక శ్రమలో మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ బరువుకు కారణాలు: పని ఒత్తిడి, ప్రశాంత జీవనానికి దూరంగా ఉండటం. చిరాకు, దుఃఖం. విరేచనాలు, డయాబెటిస్, థైరాయిడ్ వంటి వ్యాధులు . సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం . ఆహారంలో అవసరమైన విటమిన్లు, మినరల్స్ లేకపోవడం. అతిగా శారీరక శ్రమ చేయడం, మానసిక సమస్యలు. లక్షణాలు: అలసట, నీరసం త్వరగా అలసిపోవడం బలహీనంగా ఉండటం ఆకలి ఎక్కువగా లేకపోవడం వ్యాధి నిర్ధారణ: బీఎంఐ చికిత్స: హోమియో వైద్యవిధానంలో ఈ తక్కువ బరువు (అండర్ వెయిట్) అనే పరిస్థితికి చికిత్స అందించడానికి దాదాపు 50 నుంచి 60 వరకు మందులు ఉన్నాయి. ఉదా: కాల్కేరియా ఫాస్, అర్జంటమ్, నైట్రికమ్, సిలికా, అయోడమ్, ఆరమ్‌మెట్ మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. హోమియో మందులు ఇచ్చే ముందు శారీరక, మానసిక పరిస్థితులు, ఆరోగ్య అలవాట్లు వంటి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఒంట్లో స్రవించే హార్మోన్ల సమతౌల్యతను చక్కదిద్దాల్సి కూడా రావచ్చు. ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తే ఈ సమస్యను అధిగమించ వచ్చు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డిఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ -
జలుబుతో బాధపడుతున్నారా?
లండన్: జలుబుతో బాధపడుతున్నారా, ఏ మందులు వాడిన త్వరగా తగ్గడం లేదా..అయితే మీ జలుబును త్వరగా తగ్గించుకోవాడానికి పరిశోధకులు ఓ మార్గం కనుగొన్నారు . విటమిన్-సీ ఉండే పదార్థాలను ఎక్కువగా తింటే జలుబు త్వరగా నయమవుతుందని పరిశోధనలో వెల్లడైంది. రోజుకు 6-8 గ్రాముల డోస్‌లో విటమిన్ సీ ఉండే పదార్ధాలు తింటే జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చని ఫిన్లాండ్ హెస్లినిక్ యూనివర్సీటి పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధన వివరాలను న్యూట్రిన్ జర్నల్ ప్రచురించింది. జలుబుతో బాధపడేవారిని రెండు గ్రూప్‌లుగా విభజించి పరీక్షించారు. విటమిన్ సీ పుష్కలంగా ఉండే కివీ ప్రూట్స్, బెర్రీస్, సిట్రస్, టమాటో, పీస్, బోప్పాయి, డార్క్ లీఫీ గ్రీన్స్లను అందజేశారు. ఒక గ్రూప్‌కు 6 గ్రాముల డోస్, మరో గ్రూప్‌కు 8 గ్రాముల డోస్ విటమిన్ సీ అందించారు. 6 గ్రామ్‌ల అందించిన వారిలో జలుబు కాలవ్యవధి 17 శాతం, 8 గ్రాములు తీసుకున్నవారిలో 19 శాతం తగ్గిందని పరిశోధనలో వెల్లడయింది. -
కోర్టు కేసుతో నిలిచిన కోల్డ్ స్టోరేజీ స్వాధీనం
ప్రత్తిపాడు : కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ధర్మవరంలోని హైవేపై ఉన్న సాయిభ్య అగ్రి కోల్డ్ స్టోరేజీని స్వాధీనం చేసుకునేందుకు కాకినాడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అధికారులు మంగళవారం తరలివచ్చారు. అయితే బినామీ రుణాలపై కేసు నడుస్తున్నందున న్యాయ సలహా తీసుకున్న తరువాత అప్పగిస్తామని తహసీల్దార్ కె.నాగమల్లేశ్వరరావు చెప్పడంతో బ్యాంకు అధికారులు కోల్డ్ స్టోరేజీని పరిశీలించి వెళ్లారు. ధర్మవరం సాయిభ్య అగ్రి కోల్డ్ స్టోరేజీ యజమాని కంచుస్తంభం వెంకట సత్యప్రసాద్.. స్టోరేజీలోని కార్మికులను రైతులుగా చూపించి ఈ బ్యాంకు నుంచి రూ.27.58 కోట్లు స్వాహా చేసిన విషయం విదితమే. దేనా బ్యాంకుకు రుణాల చెల్లింపులు నిలిచిపోవడంతో బ్యాంకు అధికారులు స్టోరేజీని పరిశీలించినపుడు రైతుల వ్యవసాయ ఉత్పత్తులు లేకపోవడంతో ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో 111 మంది రైతులపై (బినామీలపై) కేసు నమోదైంది. దీంతో కోల్డ్ స్టోరేజీని సీజ్ చేశారు కాకినాడ సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి పది మంది పేర్లతో రూ.పది లక్షల రుణం పొందిన కంచుస్థంబం వెంకట సత్యప్రసాద్ ఐదుగురు రుణాల చెల్లించి మరో ఐదుగురి రుణాలు చెల్లించలేదని బ్యాంకు సీనియర్ మేనేజర్ రాజేశ్వరరావు తెలిపారు. ఇదిలాఉండగా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, కాకినాడ సూర్యారావు పేట బ్రాంచి నుంచి కూడా ఈ సంస్థల పేరుతో రుణం పొందారు. ఈ బ్యాంకుకు సుమారు రూ.22.38 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2014 జనవరిలో బ్యాంకు డిమాండ్ నోటీస్ జారీజేసింది. సంస్థ స్పందించకపోవడంతో బ్యాంకు అధికారులు కోర్టును ఆశ్రయించారు. స్టోరేజి ఆస్తులతో పాటు తాళ్లరేవులోని ఐస్ ప్యాక్టరీని ఐఓబీకి అప్పగించాలంటూ కలెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, స్టోరేజీని స్వాధీనం చేయమంటూ ఐఓబీ విశాఖ రీజియన్ చీఫ్ మేనేజర్ బి.హన్సాద, కాకినాడ బ్రాంచ్ మేనేజర్ బి.అప్పలరాజు, రికవరీ ఆఫీసర్ రామాంజనేయులు తదితరులు తహసీల్దార్‌ను కలిశారు.