
పచ్చని ఆరోగ్యం
గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపుపొడి వేసుకొని ఉదయం, సాయంత్రం తాగితే జలుబు త్వరగా తగ్గుతుంది.
⇔ గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపుపొడి వేసుకొని ఉదయం, సాయంత్రం తాగితే జలుబు త్వరగా తగ్గుతుంది. కొద్దిగా నీటిని చేర్చి పచ్చిపసుపు దంచి రసం తీయాలి. దీన్ని చర్మం పై ఎలర్జీ ఉన్న చోట అప్లైచేస్తే ఉపశమనం లభిస్తుంది. పసుపుపొడిని నీటిలో కలిపి ముద్ద చేయాలి. దీన్ని వేపాకు గుజ్జులో కలిపి చర్మం పైన çపూయడం ద్వారా ఎగ్జిమా వంటి చర్మవ్యాధులను నివారించ వచ్చును.
⇔ నువ్వుల నూనెలో పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మం పైన దద్దుర్లు వచ్చినప్పుడు రుద్దితే ఉపశమనం కలుగుతుంది. పసుపులో కొంచెం సున్నం కలిపిన మిశ్రమంతో బెణికిన చోట మర్దనా చేస్తే నొప్పి తగ్గుతుంది.