శీతాకాలంలో చలిగా అనిపించడం సహజం. దీంతో చలి నుంచి తప్పించుకునేందుకు ఉన్ని దుస్తులు ధరిస్తారు. రాత్రిపూట మందపాటి రగ్గులు కప్పుకుంటారు. అయినప్పటికీ కొందరు తమకు ఏమ్రాతం చలి తగ్గలేదని చెబుతుంటారు. పైగా కాళ్లు చేతులు, చల్లబడిపోతున్నాయని, చలికి తట్టుకోలేకపోతున్నామని అంటుంటారు. అయితే ఇందుకు వారి శరీరంలో వివిధ విటమిన్లు, పోషకాల లోపం కారణం కావచ్చంటున్నారు నిపుణులు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇవి కూడా చలికి కారణమే..
మెగ్నీషియం లోపం: మెగ్నీషియం లోపం వల్ల కండరాల తిమ్మిర్లు, నొప్పులు తలెత్తుతాయి. రక్త ప్రసరణ సరిగా జరగదు. ఫలితంగా ఇది చేతులు, కాళ్లు చల్లబడేందుకు కారణంగా నిలుస్తుంది. తృణధాన్యాలు, ఆకు కూరలు వంటి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం లేదా మెగ్నీషియం సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు.
ఇనుము: శరీరంలో ఐరన్ లేనప్పుడు, అది రక్తహీనతకు కారణమవుతుంది. ఫలితంగా అలసట, నీరసంతోపాటు చేతులు, కాళ్ళు చల్లగా మారుతాయి. ఆహారంలో లీన్ మీట్, పౌల్ట్రీ, చేపలు, బీన్స్, ఆకు కూరలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం వలన ఐరన్ లోపాన్ని నివారించవచ్చు.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు: ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ, రక్త ప్రసరణలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల లోపం రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. ఫలింగా చలిగా ఉన్నట్లు అనిపిస్తుంది.
విటమిన్ బీ12: విటమిన్ బీ12 శరీరంలో రక్త కణాలను తయారు చేయడంలో, నరాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. బీ 12 లోపం కండరాల దృఢత్వాన్ని దెబ్బతీస్తుంది. ఈ లోపాన్ని తగ్గించేందుకు చేపలు, మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులతోపాటు బలవర్థకమైన తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి.
విటమిన్ డి: ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో, శరీరంలో కాల్షియం స్థాయిలను నియంత్రించడంలో విటమిన్ డి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం బలహీనమైన రక్త ప్రసరణకు కారణమవుతుంది. ఈ లోపం చేతులు, కాళ్లు చల్లబడేలా చేస్తుంది. ఎండలో బయట కాస్త సమయం గడపడం, చేపలు, గుడ్లు, బలవర్థకమైన పాల ఉత్పత్తులు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. తద్వారా శరీరంలో విటమిన్ డి స్థాయి కొనసాగుతుంది. ఫలితంగా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
ఇది కూడా చదవండి: Year Ender 2024: విమాన ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు
Comments
Please login to add a commentAdd a comment