winter season
-
చలికాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన ‘సూపర్ పండు’ ఎన్ని లాభాలో!
ప్రకృతి చాలా మహమాన్వితమైంది. సీజన్‌కు తగ్గట్టు మనకు ఎన్నో అద్భుతమైన ఫలాలను అందిస్తుంది. అందుకే ఏ కాలంలో దొరికే పళ్లు, కూరగాయలు ఆకాలంలో విరివిగా తినాలని పెద్దలు చెబుతారు. మరి శీతాకాలంలో మాత్రమే దొరికే ఒక అద్భుతమైన చిట్టి పండు గురించి తెలుసుకుందాం. రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఏమిటా పండు? దాని లాభాలేంటి? చూద్దామా. శీతాకాలంలో మాత్రమే దొరికే రేగి పండు(jujube fruit)తీపి పులుపు కలగలిపిన అద్భుతమైన రుచి. చూడ్డానికి చిన్నగా కనిపించినా పోషక విలువలు మాత్రం మెండుగా లభిస్తాయి. అందుకే ఆయుర్వేద చికిత్సలో, ఔషధాల్లో ప్రాముఖ్యత కూడా ఉంది. రేగు పండ్లు తరచూ జ్వరం, జలుబు రాకుండా చేస్తాయి. తలనొప్పి, డయేరియా, రక్త విరేచనాలను అరికట్టడానికి రేగి చెట్టు బెరడును ఉపయోగిస్తారు. బెరడు కషాయం మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది.ఈ పండ్లను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతగానో ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా రేగు పళ్లతో చేసే ఒడియాలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్కసారి అలవాటు పడితే తినకుండా ఉండలేం. వీటి రుచి మహాగమ్మత్తుగా ఉంటుంది. రేగి పళ్ళపై ఉప్పు కారం చల్లుకుని తింటారు. ఇంకా వీజామ్లూ, జెల్లీలూ, జ్యూస్, టీ, వినెగర్, క్యాండీలూ లాంటి వాటిని కూడా తయారు చేస్తారు. రేగుపళ్లలో పురుగులు బాగా ఉంటాయి. చూసుకొని తినాలి రేగు పండ్లలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ కారణంగా శరీరం దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. రేగిపండులో ఉన్న పోటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.రక్తహీనతతో బాధపడేవారికి రేగుపళ్లు చాలా మేలు చేస్తాయి. గర్భిణీ స్త్రీలు కూడా తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే వేవిళ్లు, వాంతుల సమయంలో రేగుపళ్లుతో తయారు చేసిన రేగుపళ్లను కొద్ది కొద్దిగా చప్పరిస్తూ ఉంటే నోటికి పుల్లగా బావుంటుంది. అలాగే వాంతులు కూడా తగ్గే అవకాశాలున్నాయి. అద్బుతమైన ప్రయోజనాలురేగిపండులోని విటమిన్ సీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ పళ్లలోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని వైరస్లు, బాక్టీరియా వంటి హానికరమైన సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తాయి శీతాకాలంలో వచ్చే సీజనల్ జలుబు, దగ్గు వంటి ఇతర ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. సహజసిద్ధమైన చక్కెరలు , బీ విటమిన్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.రక్తహీనతను (Anaemia) నివారిస్తుంది. రేగిపండులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా రక్తహీనత తగ్గుతుంది. అనీమియాసమస్యలతో బాధపడేవారు కొన్ని రేగిపండ్లను రోజూ తీసుకుంటే రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు.రేగిపండులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని పాడతాయి. ముఖంపై మచ్చలు, ముడతలు , తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులోని విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి,చర్మానికి మెరుపునిస్తుంది. సౌందర్యం కోసం రేగిపండును ఫేస్ ప్యాక్ లాగా కూడా ఉపయోగిస్తారు.అంతేనా...ఇంకాదీర్ఘకాలిక ఆందోళన, ఒత్తిడితో బాధపడేవాళ్లకి రేగుపండ్లు ఔషధంలా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లు తింటే డిప్రెషన్ దూరం అవుతుంది. అలాగే నిద్రలేమి (Insomnia) సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ మతిమరుపూ ఆల్జీమర్స్ రాకుండానూ అడ్డుకుంటుందని ఒక అధ్యయనంలో తేలింది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్ (Phytochemicals) వల్ల రక్తంలో ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రేగిపండును (మితం) తీసుకోవచ్చు.రేగిపండులో కూడా క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. కనుక బరువు పెరుగుతామనే బెంగ అవసరం లేదు. పైగా ఇది కడుపుని తేలికగా,తృప్తిగా ఉంచుతుంది. రేగిపండులో కేల్షియం, ఫాస్పరస్, మ్యాగ్నీషియం ఎముకలను బలపరుస్తాయి. ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకల సమస్యలకు ఉపశమనం పనిచేస్తాయి.రేగిపండులో యాంటీ-క్యాన్సర్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాల వృద్ధిని నియంత్రిస్తాయి . ప్రత్యేకంగా బ్రెస్ట్ క్యాన్సర్ , లివర్ క్యాన్సర్ ముప్పును తగ్గించే అవకాశం ఉంది.ఎవరు తినకూడదుయాంటీ డిప్రెసెంట్ మందులువాడేవారుమూర్చ వ్యాధితో బాధపడుతున్న వారుస్కిన్ అలెర్జీ, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నవారు.ఆస్తమా వ్యాధితోబాధపడుతున్నారు కూడా రేగుపళ్ళను అతిగా తినకూడదు.ఎక్కువగా తింటే విరేచనాలు అయ్యే ప్రమాదముంది గనుక, ఇప్పటికే ఈ సమస్యతో బాధపడేవారు కూడా దూరంగా ఉండాలి. నోట్: ఇది అవగాహన కోసం అందించిన మాత్రమే. ఏదైనా అతిగా తినకూడదు. అతిగా తింటే కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు. గొంతులో కఫం పెరగడం, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. -
భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!
శీతాకాలం ప్రారంభం కాగానే కొన్ని రకాల శ్వాసకోస వ్యాధులు, కీళ్లు, మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. అందుకే ఈ సీజన్లో రుచితో పాటు,ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆహారంపై దృష్టి పెట్టాలి. అలాంటి ఒక గొప్ప సూపర్ ఫుడ్ అవిశె, నువ్వుల లడ్డు. పోషకాలతోపాటు అనేక రకాలుగా మనకు లాభాలను చేకూర్చే అవిశె గింజలు, నువ్వుల లడ్డూ(Flax Seeds And Sesame Seeds Laddu) ఎలా తయారు చేయాలో చూద్దాం.ఈ లడ్డూలు తినడానికి ఎంత రుచికరంగా ఉంటాయో, ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తాయి. అంతేకాకుండా, వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. నువ్వులలో విటమిన్ బి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, భాస్వరం, జింక్, మాలిబ్డినం, సెలీనియం మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. ఇక అవిశె గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులకు అద్భుతమైన మూలం. పోషకాలకు శక్తివంతమైనది కూడా. వీటి ద్వారా విటమిన్ బి, సి, డైటరీ ఫైబర్, సోడియం, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ , ఫోలేట్ వంటి విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా అందుతాయి. బెల్లంతో మంచి ఐరన్ లభిస్తుంది. అంతటి శ్రేష్టమైన వీటికి దేశీ నెయ్యి , సేంద్రీయ బెల్లంతో కలిసి లడ్డూలను తయారు చేసుకుంటే అది సూపర్ ఫుడ్ కాక ఏమవుతుంది.అవిశె గింజలు - నువ్వుల లడ్డు తయారీకావాల్సిన పదార్థాలునువ్వులు, అవిశెగింజలు, బెల్లం, కొద్దిగా బాదం, జీడింపప్పులు, బెల్లం, కొద్దిగా నెయ్యి, చిటికెడు యాలకుల పొడిముందుగా రెండు కప్పుల అవిశె గింజలు( Flax Seeds) దోరగా వేయించిన, అలాగే ఒక కప్పు నువ్వులను కూడా దోరంగా వేయించుకోవాలి. దీంతోపాటు బాదం, జీడి పప్పులను కూడా నూనె లేదా నెయ్యి లేకుండానే వేయించుకోవాలి. ఇవి గోరు వెచ్చగా ఉండగానే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ,రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి (Ghee) ఒకటిన్నర కప్పు ఆర్గానిక్ బెల్లం తురుము వేసి పాకం పట్టుకోవాలి. పాకం వచ్చినాక, ముందుగా పొడి చేసిపెట్టుకున్న అవిశె, నువ్వుల పొడిని వేసుకుంటూ బాగా కలపాలి. కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఇందులో చిటికెడ్ యాలకుల పొడి, బాదం, జీడిపప్పుల పొడి వేసుకోవాలి. కొద్దిసేపాక దింపేసుకుని కొంచెం వేడిగా ఉండగానే చేతులకు నెయ్యి రాసుకొని ఉండలుగా చుట్టుకోవాలి. ఈ లడ్డూ వలన ఎముకలు బలోపేతమవుతాయి. ఇదీ చదవండి: వింటర్ కేర్ : పాదాల పగుళ్లకు స్ప్రేఅవిశె గింజలు - నువ్వుల లడ్డు లాభాలుశీతాకాలంలో చలి నుండి రక్షిస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది.బరువు నిర్వహణలో సహాయపడుతుంది. బరువు తగ్గాలన్నా, పెరగాలన్నా రెండు విషయాల్లోనూ ప్రయోజనకరంగా ఉంటుంది.క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.అధిక రక్తపోటును తగ్గించడంలో, శరీరంలో సాధారణ బీపీ నిర్వహణలో సహాయపడుతుంది.కడుపుకు చాలా ప్రయోజనకరం. డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . జీవక్రియను కూడా పెంచుతుంది.ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ,మంచి కొలెస్ట్రాల్ ( HDL)ను పెంచడంలో సహాయపడుతుంది.రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.ఎముకలు ,కండరాలను బలపరుస్తుంది.మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది .నిద్ర సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది.అలసటను తొలగించి శరీరాన్ని శక్తివంతం చేస్తుంది.అనేక చర్మ, జుట్టు సమస్యలను తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది.గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఇంకా మోకాళ్లు , కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని మోకాళ్ళ నొప్పులు(Knee Pain) వేధిస్తున్నాయి. అలాంటి వారికి ఇది చాలా మేలు చేస్తుంది.(37 కిలోలు తగ్గి, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన గృహిణి)నోట్: వయసుతోపాటు వచ్చే మోకాళ్ల నొప్పులకు జీవన శైలిమార్పులు, కండరాలను బలోపేతం చేసే కొన్ని రకాల వ్యాయామాలు తప్పనిసరి. దీంతోపాటు వైద్యుల సలహా ప్రకారం అవసరమైతే కొన్ని మందులను వాడాల్సి ఉంటుంది. -
చలికాలంలో కీళ్ల నొప్పులా? ఇవిగో ది బెస్ట్ టిప్స్!
చలికాలం రాగానే ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. దీంతో జలుబు, గొంతునొప్పి, జ్వరం లాంటి వివిధ వ్యాధుల బారిన పడటం సాధారణంగా. అలాగే చల్లని వాతావరణం వల్ల కీళ్ల నొప్పులు పెరుగుతాయని, ఆర్థరైటిస్ లక్షణాలు మరింత తీవ్రమవుతాయని కూడా నమ్ముతారు. అయితే ఇందులో నిజమెంత? చలికాలానికి, మోకాళ్ల నొప్పులకు సంబంధం; మరి ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం.పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లో మన జీవన పరిస్థతులకనుగుణంగానే శారీరక మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. జర్నల్ సెమినార్స్ ఇన్ ఆర్థరైటిస్ , అండ్ రుమాటిజంలో ప్రచురించిన 2024 అధ్యయనం ప్రకారం వాతావరణ మార్పులు నేరుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ఆస్టియో ఆర్థరైటిస్ , ఇతక కీళ్ల నొప్పులను పెద్దగా ప్రభావితం చేయవని వెల్లడించింది.అయితే చల్లని వాతావరణం కీళ్లను గట్టిపరుస్తుంది ,రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది, చిన్న కదలికలను కూడా కష్టతరం చేస్తుంది. తక్కువ తేమతో కూడిన అధిక ఉష్ణోగ్రతలు గౌట్ మంట ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయని అధ్యయనం కనుగొంది. ఆర్థరైటిస్‌తో బాధపడే వ్యక్తులు శీతాకాలంలో వాతావరణ ఒత్తిడి మార్పు వల్ల కీళ్ళు సాధారణం కంటే ఎక్కువగా ఉబ్బి, నొప్పి పెరగడానికి దారితీస్తుందని తేలింది.తక్కువ బారోమెట్రిక్ పీడనం శరీరంలోని కణజాలాలు నరాలపై ఒత్తిడిని పెంచుతుంది.మరి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి?వింటర్ సీజన్లో శారీరక శ్రమ తగ్గడం వల్ల ఎముకల మధ్య కదలిక తగ్గిపోతుంది. దీంతోపాటు విటమిన్ డి లోపం కూడా కీళ్ల నొప్పులకు మరో కారణం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కండరాలు దృఢంగా ఉండే వ్యాయామాలను ఎంచుకోవాలి.వేడి నీటి కొలనులో ఈత కొట్టడం లేదా ఇంట్లోనే సైక్లింగ్ చేయడం వంటి తక్కువ-ప్రభావ వ్యాయామాలు ఉత్తమం.ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండకుండా, కదలిక ఉండేలా చూసుకోండి. .యోగ, ధ్యానం లాంటివి చేయాలి. కీళ్లలో నొప్పినుంచం ఉపశమనం కలిగే , దృఢత్వాన్ని పెంచే ఆసనాలు తెలుసుకొని ఆచరించాలి. చలికాలం కదా అశ్రద్ధ చేయకుండా, తగినంత నీరును తాగాలి. చలికాలం వచ్చిందంటే వృద్ధులకే కాదు, యుక్తవయస్సులో ఉన్నవారిలో కూడా కొంతమందికి మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి రక్త ప్రసరణ మెరుగుపరచడానికి , దృఢత్వాన్ని తగ్గించడానికి వెచ్చని బట్టని ధరించాలి. వేడి నీటి స్నానం మంచిది.నొప్పి ఉన్న ప్రదేశంలో ఉపశమనం కోసం హీట్ ప్యాడ్లను వాడవచ్చు.కీళ్ల నొప్పులకు మరో చక్కటి ఉపశమన ప్రక్రియ మసాజ్. ఇది చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.నువ్వుల నూనె, కొబ్బరి నూనె, లేదా కొన్ని ఆయుర్వేద తైలాలతో పది నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. నోట్: శారీరకంగా చురుకుగా ఉండటం, హీట్ థెరపీ, చక్కటి ఆహారం ద్వారా చాలావరకు సమస్యలనుంచి తప్పించుకోవచ్చు. దీంతో పాటు సమస్య తీవ్రతను గుర్తించి, సంబంధిత వైద్యులను సంప్రదించి, చికిత్స తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు -
HousewifeDermatitis గురించి విన్నారా? చలి చేతికి చిక్కొద్దు!
ఈ చర్మవ్యాధిని గృహిణులకు వచ్చే సమస్యగా ప్రత్యేకంగా పేర్కొంటారు. ఎందుకంటే ఇంటి గచ్చును శుభ్రం చేస్తుండటం, బట్టలు ఉతికే సమయంలో సబ్బు (డిటెర్జెంట్) వీళ్ల చేతుల్ని ప్రభావితం చేస్తుండటం, ఇంటిపనుల్లో ఇంకవైనా రసాయనాలు తగిలి చేతులు ఇరిటేషన్‌కు లోనవ్వడం వంటివి జరుగుతుంటాయి కాబట్టి దీన్ని ‘హౌజ్ వైఫ్ డర్మౖటెటిస్’ అంటారు. దాంతోపాటు చెయ్యిపై దుష్ప్రభావాలు పడతాయి కాబట్టి దీన్ని ‘హ్యాండ్ ఎక్సిమా’, ‘హ్యాండ్ డర్మటైటిస్’ అని కూడా అంటారు. నిజానికి ఇది కేవలం గృహిణులనే కాకుండా పలు రకాల రసాయనాలు వాడే వృత్తుల్లో ఉండే వారందరికీ వస్తుంది. ముఖ్యంగా శుభ్రం చేసే వృత్తుల్లో ఉన్నవారూ, కేటరింగ్, బ్యూటీ కేర్ సెలూన్లలో హెయిర్ డ్రస్సింగ్ చేసేవారూ, హెల్త్‌కేర్ ఇండస్ట్రీలో ఉన్నవారు... వీళ్లంతా ఏదో ఒక డిటర్జెంట్ లేదా రసాయనం చేతుల్లోకి తీసుకొని పనిచేస్తుంటారు కాబట్టి వీళ్లందరినీ ఈ ఎగ్జిమా లేదా డర్మటైటిస్ ప్రభావం చూపుతుంది. పైగా చలి పెరిగే ఈ సీజన్లో ఇది మరింత బాధిస్తుంటుంది. మహిళలను ఎక్కువగా బాధించే ఈ సమస్య గురించి తెలుసుకుందాం. ఈ వింటర్ సీజన్లో మామూలుగానే చర్మం పొడిబారడం ఎక్కువ. దీనికి తోడు రసాయనాలూ చేతులపై దుష్ప్రభావం చూపడం వల్ల ఈ సమస్య మరింతగా అరచేతులూ, చేతివేళ్లూ, గోళ్ల చుట్టూ ఉండే చర్మం (పెరీ ఉంగ్యువల్) ప్రభావితమయ్యే భాగాల్లో ఈ సమస్య తీవ్రంగా మారినప్పుడు అక్కడ నీటిపొక్కుల్లా రావడాన్ని పామ్ఫాలిక్స్’ అని అంటారు. ఒక్కోసారి కొందరిలో ఈ సమస్య అనువంశీకంగానూ కనిపిస్తుంది. తమ సొంత వ్యాధి నిరోధక శక్తే తమ చర్మాన్ని దెబ్బతీయడం వల్ల ఇలా జరుగుతుంది. కొన్ని అలర్జిక్ రియాక్షన్స్, ఆహారం వల్ల కలిగే అలర్జీలు, చాలాసేపు నీళ్లలో ఉండటం వంటి అంశాలూ దీన్ని మరింత పెచ్చరిల్లేలా చేస్తాయి. డ్రై స్కిన్ ఉన్నవారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి ఇక్కడ ఇన్ఫెక్షన్లా కూడా మారి మరింత ఇబ్బంది కలిగించే అవకాశముంది. నివారణ / మేనేజ్మెంట్ / చికిత్స... ఇంటి పనులు అయిన వెంటనే ఘాటైన సువాసనలు లేని మంచి క్లెన్సర్‌ను గోరు వెచ్చని నీటిలో వేసి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. (ఇందుకు వేడి నీళ్లు ఉపయోగించకూడదు. కేవలం గోరువెచ్చని నీళ్లే వాడాలి). ఇక క్లెన్సర్‌ను ఎంపిక చేసే విషయంలో వాటిల్లో ఘాటైన లేదా చేతికి హానిచేసే తీవ్రమైన రసాయన సాల్వెంట్స్ లేకుండా జాగ్రత్తపడాలి. ∙చేతులకు ఈ సమస్యను తెచ్చిపెట్టే డిటర్జెంట్లు / రసాయనాలు కలిపిన నీళ్లు... వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండటం లేదా తప్పనప్పుడు ఈ ఎక్స్పోజర్ వ్యవధిని వీలైనంతగా తగ్గించడం. చేతులను శుభ్రంగా ఉంచుకోవడం (హ్యాండ్ హైజీన్‌ను పాటించడం). ఇందుకోసం ఘాటైన సబ్బులను కాకుండా గ్లిజరిన్, ఆల్కహాల్ బేస్డ్ మైల్డ్ శానిటైజర్లు వాడటం. (కీర్తి సురేష్ పెళ్లి చీర : స్పెషల్‌గా కీర్తి ఏం చేసిందో తెలుసా?)ఇల్లు శుభ్రం చేసే సమయంలో లేదా ఇంటి పనులప్పుడు శుభ్రమైన కాటన్ గ్లౌజ్ వాడటం. ఇంటికి సంబంధించిన కాస్తంత మురికి పనులు (డ్రైయిన్లు శుభ్రం చేయడం వంటివి) చేసేటప్పుడూ గ్లౌజ్ ధరించడం. చర్మ సంరక్షణ కోసం వాడే వాసన లేని ఎమోలియెంట్స్ (చేతులకు హాయిగొలిపే లేపనాల వంటివి) వాడటం. అరచేతులు, చేతివేళ్లు తేమ కోల్పోకుండా ఉండేందుకు చేతికి కొబ్బరి నూనె లేదా చేతులు తేమ కోల్పోకుండా చేసే ఆయింట్మెంట్స్ / క్రీమ్స్ వాడటం. చేతులకు తగిలే చిన్న చిన్న దెబ్బలు, గీరుకుపోవడం వంటి వాటినీ నిర్లక్ష్యం చేయకుండా వాటికి తగిన బ్యాండ్ఎయిడ్ వంటివి వేయడం. ఈ జాగ్రత్తలు పాటించాక కూడా ఇంకా చేతులు పొడిబారిబోయి, చర్మం లేస్తుండటం, పొట్టురాలుతుండటం, పగుళ్లు వస్తుండటం జరుగుతుంటే డర్మటాలజిస్టుకు చూపించాలి. వారు తగిన పూతమందులు, ఇతరత్రా చికిత్సలతో సమస్యను తగ్గిస్తారు. లక్షణాలు... చేతులపై చర్మం బాగా పొడిగా మారడం, ఇంతగా పొడిబారడంతో పొట్టు లేస్తుండటం చేతివేళ్లపై పగుళ్లు, ఈ పగుళ్ల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న చిన్న పుండ్లలా మారడం (బ్లిస్టర్స్) చర్మం ఊడిపోతూ ఉండటం , చర్మం ఎర్రబారడం ఒక రకమైన నొప్పితో కూడిన ఇబ్బంది. -డా. స్వప్నప్రియసీనియర్ డర్మటాలజిస్ట్ -
మందపాటి రగ్గు కప్పుకున్నా చలి తగ్గడంలేదా.. కారణమిదే..
శీతాకాలంలో చలిగా అనిపించడం సహజం. దీంతో చలి నుంచి తప్పించుకునేందుకు ఉన్ని దుస్తులు ధరిస్తారు. రాత్రిపూట మందపాటి రగ్గులు కప్పుకుంటారు. అయినప్పటికీ కొందరు తమకు ఏమ్రాతం చలి తగ్గలేదని చెబుతుంటారు. పైగా కాళ్లు చేతులు, చల్లబడిపోతున్నాయని, చలికి తట్టుకోలేకపోతున్నామని అంటుంటారు. అయితే ఇందుకు వారి శరీరంలో వివిధ విటమిన్లు, పోషకాల లోపం కారణం కావచ్చంటున్నారు నిపుణులు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఇవి కూడా చలికి కారణమే..మెగ్నీషియం లోపం: మెగ్నీషియం లోపం వల్ల కండరాల తిమ్మిర్లు, నొప్పులు తలెత్తుతాయి. రక్త ప్రసరణ సరిగా జరగదు. ఫలితంగా ఇది చేతులు, కాళ్లు చల్లబడేందుకు కారణంగా నిలుస్తుంది. తృణధాన్యాలు, ఆకు కూరలు వంటి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం లేదా మెగ్నీషియం సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు.ఇనుము: శరీరంలో ఐరన్ లేనప్పుడు, అది రక్తహీనతకు కారణమవుతుంది. ఫలితంగా అలసట, నీరసంతోపాటు చేతులు, కాళ్ళు చల్లగా మారుతాయి. ఆహారంలో లీన్ మీట్, పౌల్ట్రీ, చేపలు, బీన్స్, ఆకు కూరలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం వలన ఐరన్ లోపాన్ని నివారించవచ్చు.ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు: ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ, రక్త ప్రసరణలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల లోపం రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. ఫలింగా చలిగా ఉన్నట్లు అనిపిస్తుంది.విటమిన్ బీ12: విటమిన్ బీ12 శరీరంలో రక్త కణాలను తయారు చేయడంలో, నరాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. బీ 12 లోపం కండరాల దృఢత్వాన్ని దెబ్బతీస్తుంది. ఈ లోపాన్ని తగ్గించేందుకు చేపలు, మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులతోపాటు బలవర్థకమైన తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి.విటమిన్ డి: ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో, శరీరంలో కాల్షియం స్థాయిలను నియంత్రించడంలో విటమిన్ డి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం బలహీనమైన రక్త ప్రసరణకు కారణమవుతుంది. ఈ లోపం చేతులు, కాళ్లు చల్లబడేలా చేస్తుంది. ఎండలో బయట కాస్త సమయం గడపడం, చేపలు, గుడ్లు, బలవర్థకమైన పాల ఉత్పత్తులు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. తద్వారా శరీరంలో విటమిన్ డి స్థాయి కొనసాగుతుంది. ఫలితంగా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: విమాన ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు -
చలికాలంతో జాగ్రత్త.. ఆరోగ్యం, ప్రమాదాలు నుంచి రక్షణ కోసం.. (ఫొటోలు)
-
మౌంట్ అబూపై చంపేస్తున్న చలి.. అయినా తగ్గని పర్యాటక జనం
జైపూర్: రాజస్థాన్‌లో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. పలు జిల్లాల్లో గడ్డకట్టేంత చలి ఉంటోంది. రాజధాని జైపూర్‌లో ఉష్ణోగ్రత 10 డిగ్రీల దిగువకు పడిపోయింది. ఇక్కడి హిల్ స్టేషన్ మౌంట్ అబూలో ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు చేరుకుంది. గరిష్ట ఉష్ణోగ్రత 23.8 డిగ్రీలుగా నమోదయ్యింది. ఇంతటి చలిలోనూ మౌంట్ అబూను సందర్శించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఇంతకీ మౌంట్ అబూలో చూసేందుకు ఏమున్నాయి?రాజస్థాన్‌లోని ప్రకృతి అందాలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. అక్కడి సంస్కృతి, ప్రజల జీవనశైలి, సంప్రదాయ వారసత్వం ఎవరినైనా ఆకట్టుకుంటుంది. రాష్ట్రంలోని మౌంట్ అబూ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది రాజస్థాన్‌లోని ఏకైక హిల్ స్టేషన్. నిత్యం ఇక్కడ పర్యాటకుల సందడి కనిపిస్తుంది. చరిత్రలోని వివరాల ప్రకారం సిరోహి మహారాజు ఒకప్పుడు మౌంట్ అబూను బ్రిటిష్ వారికి లీజుకు ఇచ్చాడు. దీంతో బ్రిటీషర్లు మౌంట్ అబూను తమ వేసవి విడిదిగా మార్చుకుని, అభివృద్ధి చేశారు. అచల్‌ఘర్ కోటమౌంట్ అబూలోని అచల్‌ఘర్ కోట ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. హిల్ స్టేషన్‌కు ఈ కోట అందాన్ని తీసుకువస్తుంది. ఈ కోటను మావద్ రాణా కుంభ్ నిర్మించాడు. ఈ కోట ఒక కొండపై ఉంది. ఇక్కడ నుండి కిందనున్న పట్టణాన్ని చూడవచ్చు. కోటలో అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. ఆలయంలో కొలువైన శివునికి ఇక్కడికి వచ్చే పర్యాటకులు పూజలు నిర్వహిస్తుంటారు.సన్‌సెట్ పాయింట్హిల్ స్టేషన్లలో సూర్యోదయం- సూర్యాస్తమయం పాయింట్లు ఎంతో ముచ్చటగొలుపుతాయి. ఇదేవిధంగా మౌంట్ అబూపై నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూడటం మధురానుభూతులను అందిస్తుంది. ఈ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు ఇక్కడికి తరలివస్తుంటారు.టోడ్ రాక్మౌంట్ అబూలో తప్పక చూడాల్సిన వాటిలో ఒకటి టోడ్ రాక్. ఇదొక భారీ రాయి. ఈ రాయి ఆకారం కప్ప మాదిరిగా ఉంటుంది. ఈ రాతికప్ప నదిలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. టోడ్ రాక్‌ను చూసినవారు ఆశ్చర్యానికి గురవుతుంటారు. నక్కీ సరస్సుఈ సరస్సును దేవతలు స్వయంగా తవ్వారని చెబుతుంటారు. ఈ సరస్సులోని నీరు శీతాకాలంలో ఘనీభవిస్తుంది. నీటిపై మంచు ఒక షీట్ మాదిరిగా విస్తరించివుంటుంది. ఎత్తైన కొండపై ఉన్న ఈ సరస్సు ఇక్కడి ప్రకృతి అందాలకు పరాకాష్టగా నిలుస్తుంది. సాయంత్రం సమయాన ఈ సరస్సును చూడటం ప్రత్యేక అనుభూతని అందిస్తుంది.ఎలా వెళ్లాలి?మౌంట్ అబూకు పలు రవాణా మార్గాలలో చేరుకోవచ్చు. ఇక్కడికి 185 కి.మీ దూరంలో ఉదయపూర్ విమానాశ్రయం ఉంది. అక్కడి నుంచి బస్సు లేదా టాక్సీని పట్టుకుని మౌంట్ అబూను చేరుకోవచ్చు. అలాగే ఇక్కడికి సమీపంలో అబూ రోడ్ రైల్వే స్టేషన్ ఉంది. అలాగే ఢిల్లీ నుంచి నేరుగా మౌంట్ అబూకు బస్సులు ఉన్నాయి. ఇది కూడా చదవండి: Year Ender 2024: మారిన ప్రభుత్వాలు.. చేజారిన అధికారాలు -
వింటర్ ఎంటరైంది..అలర్జీలూ, ఆస్తమాలతో జాగ్రత్త!
ఆస్తమా, అలర్జీ వేర్వేరనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ ఆస్తమా కూడా అలర్జీ తాలూకు వ్యక్తీకరణల్లో ఒకటి అని అంటున్నారు నిపుణులు. అలర్జీ వల్ల అప్పర్ ఎయిర్ వే అనే విండ్ పైపులోని పై భాగం ప్రభావితమైతే ‘అలర్జిక్ రైనైటిస్’ అనీ, అదే కింది భాగమైన లోయర్ రెస్పిరేటరీ ఎయిర్ వే ప్రభావితమైతే అయితే అది ఆస్తమా అని పేర్కొంటారన్నది నిపుణుల మాట. అందుకే తరచి చూసినప్పుడు మన జనాభాలోని బాధితుల్లో 60% నుంచి 70% మందిలో అలర్జీలూ, అస్తమా ఈ రెండూ ఉంటాయి. చలికాలంలో మరింత ప్రభావం చూపే అలర్జీలూ, ఆస్తమాల గురించి తెలుసుకుందాం. సరిపడని పదార్థమేదైనా ఒంట్లోకి ప్రవేశించినప్పుడు... ఒంట్లోని వ్యాధి నిరోధకశక్తి దాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో వ్యాధినిరోధక శక్తి చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది. ఆ తీవ్రత కారణంగా దేహంపై పడే ప్రతికూల ప్రభావాన్ని ‘అలర్జీ’ అంటారు. ఆ అలర్జీని కలిగించే పదార్థాలను ‘అలర్జెన్స్’ అంటారు. ఈ అలర్జీ అన్నది ఏ పదార్థం లేదా కారణం వల్లనైనా రావచ్చు. ఉదాహరణకు... కొందరిలో గోధుమలతో లేదా పాలతో చేసిన పదార్థాలు సరిపడకపోవచ్చు. ఇక ఆహారాలు కాకుండా పొగ, దుమ్ము ధూళి, ఫుడ్‌పై పడి, దోమల మందులు... ఇలా ఏ కారణాలతోనైనా రావచ్చు. అలాగే కొన్ని మందులు సరిపడకపోవడంతోనూ అలర్జీలు వచ్చే అవకాశముంది. అలర్జీ వచ్చినప్పుడు... అలర్జెన్స్ లోపలికి రాగానే కొందరికి అప్పర్ ఎయిర్వేలోని సున్నితమైన ప్రాంతాలు ఎర్రబారతాయి. అక్కడి ప్రాంతాలను రక్షించుకునేందుకు స్రావాలు వెలువడతాయి. ముక్కు, కళ్లు ఎరుపెక్కడం, దురద, మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలర్జీ కేవలం ముక్కు, దాని పరిసరాలూ, శ్వాస వ్యవస్థలో పైభాగానికే పరిమితమైతే దాన్ని ‘అలర్జిక్ రైనైటిస్’గా చెబుతారు, ఒకవేళ కింది భాగమూ ప్రభావితమైతే మాటిమాటికీ దగ్గు వస్తుండటం (రికరెంట్ కాఫ్), పిల్లికూతలు, శ్వాస తీసుకోవడం కష్టం కావడం (బ్రీతింగ్ డిఫికల్టీ) కనిపిస్తాయి. ఆస్తమా అంటే...? అదే మరింత తీవ్రమై లోవర్ ఎయిర్వేస్ ప్రభావితం కావడం... అంటే ఊపిరితిత్తులూ, గాలిగదుల తోపాటు కాస్త పైన ఉండే గాలి పీల్చుకున్నప్పుడు ప్రవహించే నాళాలైన (బ్రాంకై) వాచి, బాగా సన్నబారి΄ోయి శ్వాసతీసుకోవడం కష్టమవుతుంది. అలా ఊపిరి తీసుకోవడం కష్టమై΄ోయే సమస్యను ‘ఆస్తమా’ అంటారు. కొందరిలో దీని తీవ్రతతో ఆయాసపడే స్థితి మరింత ఎక్కువైనప్పుడు అది ‘ఎనైఫిలాక్సిస్’’ అనే ప్రమాదకరమైన స్థితికి దారి తీయవచ్చు. ఆస్తమా లక్షణాలు... ఊపిరి అందడంలో ఇబ్బందితో ఆయాసం ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ఒక్కోసారి దగ్గు ఆయాసడుతున్నప్పుడు శ్వాస సమయంలో గొంతులోంచి పిల్లికూతలు వినిపించడం. ఆస్తమాను ప్రేరేపించే (ట్రిగర్ చేసే) అంశాలు... అలర్జిక్ ఆస్తమా : అలర్జీ తీవ్రతరమైనప్పుడు ఆస్తమాకి దారితీయవచ్చు. సరిపడని పదార్థాన్ని తిన్నప్పుడు లేదా సరిపడని అంశానికి ఎక్స్΄ోజ్ అయినప్పుడు ఆయాసం మొదలుకావచ్చు. వ్యాయామం : కాస్త కష్టమైన వ్యాయామం మొదలుపెట్టగానే కొందరిలో అది ఆస్తమాకు దారితీయవచ్చు. దాన్నే ‘ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా’ అంటారు. అజీర్తి / పులితేన్పులుతో : కొందరిలో తిన్న ఆహారం గొంతులోకి రావడమేనే సమస్య ఉంటుంది. దీన్నే ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ ఇంటస్టినల్ డిసీజ్’ (జీఈఆర్డీ) అంటారు. వీళ్లలో ఆహారం తీసుకున్న తర్వాత వాళ్ల కడుపులో ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఉపయోగపడే యాసిడ్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంది. ఆ యాసిడ్ గొంతులోకి తన్నినప్పుడు కడుపు/గొంతులో మంట కనిపిస్తుంది. అది పులితేన్పుల రూపంలో గొంతులోకి రాగానే యాసిడ్ కారణంగా గొంతు మండుతుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది. చాలామందిలో రాత్రి భోజనం కాస్త ఎక్కువగా తింటే కడుపు బరువుగా మారి, ఆయాసంగా ఉండటం, తర్వాత నిద్రలో సమస్య తీవ్రమై మెలకువ వచ్చి ఆయాసంతో బాధపడతారు. పెరిమెనుస్ట్రువల్ ఆస్తమా: మహిళల్లోని కొందరికి రుతుస్రావం మొదలుకాబోయే ముందుగా కెటామేనియల్ ఆస్తమా లేదా ప్రీ/పెరీమెనుస్ట్రువల్ ఆస్తమా అని పిలిచే ఆస్తమా కనిపిస్తుంది. ఇతర కారణాలతో : పొగాకు, పొగ, కట్టెల పొయ్యినుంచి వెలువడే పొగ, రంగులూ (పెయింట్స్) లేదా అగరుబత్తీల వంటి ఘాటైన వాసనలు సరిపడక΄ోవడంతో కూడా ఆస్తమా రావచ్చు. కొందరిలో తాము పనిచేసే ప్రదేశం తమకు సరిపడక΄ోవడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. దీన్నే ‘వర్క్‌ప్లేస్ ఆస్తమా’ అంటారు. నిర్ధారణ పరీక్షలు... అలర్జీలో ముక్కు కారడం, దగ్గు, కొందరిలో చర్మం మీద ర్యాష్, ముక్కు/కళ్లు ఎర్రబారి బాగా రుద్దుకోవాలనిపించడం, దురదగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన ఆయాసం, పిల్లికూతలు వంటి లక్షణాలతో ఆస్తమాను తెలుసుకోవచ్చు. కొన్ని అలర్జీలను ‘స్కిన్ ప్రిక్ టెస్ట్’ అనే పరీక్షతో నిర్ధారణ చేస్తారు. స్పైరోమెట్రీ/పీఎఫ్‌టీ (PFT) అనే పరీక్ష ఆస్తమా నిర్ధారణకు ఉపయోగపడుతుంది. ఈ పరీక్షలో బాధితులతో ఓ పరికరం ద్వారా గాలి ఊదేలా చేస్తారు. బాధితులు ఏమేరకు ఊదగలుగుతున్నారనే అంశం ఆధారంగా వాయునాళాలు ఏమేరకు ముడుచుకుపోయాయనే అంశాన్ని తెలుసుకుని, దాని ఆధారంగా రూపొందించిన గ్రాఫ్ సహాయంతో ఆస్తమా తీవ్రతను తెలుసుకుంటారు. కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు : ఆస్తమా నిర్ధారణతో పాటు, దాని తీవ్రతను తెలుసుకోవడం కోసం ఊపిరితిత్తుల్లోని వాయునాళాలు ముడుచుకు΄ోయేలా చేస్తారు. ఇందులో ‘మెథాకైలైన్’ అనే రసాయనాన్ని ఉపయోగించడం గానీ... లేదా కొందరితో వ్యాయామం చేయించి ఆయాసపడేలా చేస్తారు. అటుతర్వాత ‘పీక్ ఎక్స్పిరేటరీ ఫ్లో టెక్నిక్’ అనే ప్రక్రియతో ఆస్తమాను తెలుసుకుంటారు. ఎవరికైనా ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటే ఈ పరీక్ష సహాయంతో అది ప్రారంభం కాకముందే తెలుసుకోవచ్చు. నిశ్వాసలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ పరీక్ష (FENO): గాలి వదిలే నిశ్వాస ప్రక్రియలో కార్బన్ డై ఆక్సైడ్‌ను వదిలే సమయంలో ఆస్తమా బాధితుల్లో ఇజినోఫిల్స్ అనే తెల్ల రక్తకణాల వృద్ధి కారణంగా వారి నిశ్వాసలో నైట్రిక్ ఆక్సైడ్ పాళ్లు ఎక్కువ. అందుకే ఆస్తమా బాధితుల్లో... మందులు ఏ మేరకు పనిచేస్తున్నాయి, ఊపిరితిత్తుల్లో వాపు, మంట, ఎర్రబారడం (ఇన్ఫ్లమేషన్) ఏమేరకు ఉన్నాయి అని తెలుసుకోడానికి ఈ పరీక్ష చేస్తారు. రక్తపరీక్ష : ఆస్తమా వచ్చినవారి రక్తంలో ఇజినోఫిల్స్ అనే తెల్లరక్తకణాలు ఎక్కువ. అవి రక్తంలో ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోడానికి ఈ పరీక్ష చేస్తారు. అలాగే ఓ వ్యక్తిలో ఏ నిర్దిష్టమైన పదార్థం వల్ల ఆస్తమా వచ్చిందనేది తెలుసుకోవడం కోసం కూడా కొన్ని సెన్సిటివిటీ రక్త పరీక్షలు చేస్తారు. ఎక్స్–రే : ఆస్తమా వ్యాధి నిర్ధారణలో ఎక్స్–రే కీలకం. సీటీ స్కాన్ : కొందరిలో సీటీస్కాన్ (ఛాతీ) అవసరం కావచ్చు. ఆస్తమా నిర్ధారణలో కేవలం... ఆయాసం, పిల్లికూతలు అనే రెండు ప్రధాన అంశాలతో ఆస్తమాను నిర్ధారణ చేయకూడదు. ఇవే లక్షణాలు గుండెజబ్బులు, కేన్సర్, సీవోపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్), వోకల్ కార్డ్ లకు సంబంధించిన సమస్యల్లోనూ కనిపించే అవకాశమున్నందున ఆస్తమా నిర్ధారణలో నిశితమైన పరిశీలన అవసరం.నివారణ / చికిత్స... అలర్జీ అయినా లేదా ఆస్తమా అయినా దాన్ని ప్రేరేపించే ‘అలర్జెన్స్’కు దూరంగా ఉండటం అన్నది మంచి నివారణ మార్గం. కొంత వయసు పైబడినవారికి డాక్టర్ సలహా మేరకు ఫ్లూ, నిమోకోకల్ వ్యాక్సిన్లు ఇప్పిస్తూ ఆస్తమాను నివారించవచ్చు.అలర్జీలకు చికిత్స ఇలా... అలర్జీలను నెమ్మదింపజేయడానికి ‘అలర్జెన్ స్పెసిఫిక్ ఇమ్యూనోథెరపీ’ (సిట్) చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాదు... అలర్జీ సమయంలో బాధితుల దేహంలో వెలువడే జీవరసాయనాలను బట్టి ఆయా వ్యక్తులకు వ్యక్తిగతమైన మందులు అంటే ‘హ్యూమనైజ్డ్ మోనోక్లోనల్ యాంటీబాడీ’ల పరిశోధనలు ఇప్పటికే విజయవంతమయ్యాయి. అయితే వాటి ప్రభావాలు అందరి విషయంలో ఒకేలా ఉండక΄ోవచ్చు. ఉదాహరణకు ఒమాలిజుమాబ్ వంటివి మాస్ట్ సెల్స్, బేసోఫిల్స్ మీద... ఇక రెస్లిసుమాబ్, మె΄÷లిజుమాబ్, బెర్నాలిజుమాబ్ వంటివి ఐఎల్–5ల సహాయంతో ఇజినోఫిల్స్ వెలువడటాన్ని అరికడుతూ... అలా తీవ్రమైన ఆస్తమాతో బాధపడే వారి విషయంలో ప్రభావపూర్వకంగా పనిచేస్తాయి. ఆస్తమా చికిత్స ఇలా..!ఆస్తమాను నివారించేందుకు ‘ప్రివెంటార్స్’ అనే ఇన్హేలర్లూ, ఆస్తమా వచ్చిన సమయంలో దాన్ని తగ్గించేందుకు ‘రిలీవర్స్’ అనే ఇన్హేలర్లు వాడుతుంటారు. ఈ ఇన్హేలర్లు హానికరమనే అ΄ోహ కొందరిలో ఉంటుంది. నిజానికి అవి పూర్తిగా సురక్షితమైనవి. ముందస్తు నివారణ కోసం నెబ్యులైజర్లలాంటి పీల్చే చికిత్స (ఇన్హెలేషన్ థెరపీ) కూడా చేస్తుంటారు. నేసల్ స్ప్రేలు కూడా అందుబాటులో ఉన్నాయి. అవి బిగుసుకుపోయిన వాయునాళాలను రిలాక్స్ చేసి, తేలిగ్గా గాలి ఆడేలా చేస్తాయి. ఆస్తమా సమయంలో ఊపిరితిత్తుల లైనింగ్/మ్యూకస్ మెంబ్రేన్స్‌లో వచ్చిన వాపు, మంట, ఎర్రబారడాన్ని (ఇన్ఫ్లమేషన్ను) తగ్గించే యాంటీ హిస్టమైన్ వంటి మందుల్ని వాడతారు.ఇప్పుడు అలర్జీలనూ, ఆస్తమానూ వేర్వేరుగా చూడటం సరికాదని డాక్టర్లు చెబుతుంటారు. ఇందుకు ‘ఏరియా’ అనే అంశాన్ని ప్రమాణంగా చూపుతారు. ఇక్కడ ‘ఏరియా’ అంటే... ‘ఏ.. ఆర్... ఐ.. ఏ’ అనే స్పెలింగ్తో ‘అలర్జిక్ రైనైటిస్ అండ్ ఇంటర్మిట్టెంట్ ఆస్తమా’ అని అర్థం. అందుకే అలర్జీలనూ, ఆస్తమానూ కలిపి ‘ఒన్ ఎయిర్‌వే డిసీజ్’గా పరిగణిస్తూ... అవసరాన్ని బట్టి శ్వాసవ్యవస్థ పైభాగంలోని రైనైటిస్కూ, కింద ఆస్తమాకూ చికిత్స చేయాలన్నది ఇప్పుడు ఆధునిక దృష్టికోణంలో అవసమన్నది డాక్టర్లు చెబుతున్న మాట. ఇక అలర్జీ అంటే ఏమిటో, ఆస్తమా అని దేన్ని అంటారో చూద్దాం. డా. ఏ. రఘుకాంత్, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ (చదవండి: ఆ నాలుగు 'వైట్ ఫుడ్స్'ని నివారిద్దాం..ఆరోగ్యంగా ఉందాం..!) -
శీతాకాలం : స్నానానికి వేడి నీళ్లా? చన్నీళ్లా?
వేసవి కాలంలో చన్నీటి స్నానం ఎంతో హాయినిస్తుంది. అయితే శీతాకాలం వచ్చింది అనగానే స్నానానికి దాదాపు అందరూ వేడి నీళ్లే వాడతారు. ఎందుకంటే చల్లనీటితో స్నానం చేస్తే జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలొస్తాయనే భయం కూడా దీనికి ప్రధాన కారణం. మరోవైపు కార్తీకస్నానాలు, అయ్యప్పమాల ధరించిన భక్తులు ఎంత చలిగా ఉన్నా సరే చన్నీటి స్నానాలే ఆచరిస్తారు. అసలు స్నానానికి ఏ నీళ్లు వాడితే మంచిది? తెలుసుకుందాం. అయితే ఏ కాలంలో అయినా స్నానానికి మరీ వేడినీళ్లు కాకుండా, గోరువెచ్చని నీళ్లు వాడాలి అనేది నిపుణుల మాట. రోజూ ఎక్కువ వేడి నీటి స్నానంతో చర్మానికి కొన్నిఇబ్బందులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో ముందుగా వేడి నీటి స్నానం ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.వేడి నీటి స్నానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?వేడి నీటి స్నానంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలసట తీరుతుంది. చర్మానికి రక్త ప్రవాహం పెరుగుతుంది. శరీరంలో బీపీ తగ్గుతుంది. శరీర నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడితో కుచించుకు పోయిన కండరాలకు, ఎముకలకు వేడి నీటి స్నానంతో రిలీఫ్ లభిస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల (గుండె జబ్బు) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే హాట్ టబ్ బాత్, ఆవిరిస్నానంతో ఈ ప్రయోజనాలు మరింత మెరుగ్గా ఉంటాయంటున్నారు. అసలే శీతాకాలంలో చర్మంలో తేమ శాతం తక్కువగా చర్మం పొడిగా మారిపోతుంది. దీనికి వేడి నీటి స్నానం మరింత ఆజ్యం పోస్తుంది. సేబుమ్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. చర్మంలోని సహజమైన ఆయిల్స్ తగ్గిపోతాయి. ఫలితంగా మంట, దురదలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సోరియాసిస్, ఎగ్జిమా, రోసాసియా లాంటి సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి. జుట్టుకు చేటువేడి, వేడి నీళ్లతో తల స్నానం అస్సలు మంచిది కాదు. వెంట్రుకలు బలహీనంగా మారతాయి. జుట్టులోని కెరాటిన్, లిపిడ్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది.చన్నీటితో స్నానం వల్ల కలిగే లాభాలుమరీ గడ్డ కట్టేంత చల్లని నీరు కాకుండా, ఒక మాదిరి చన్నీటిస్నానం వల్ల శరీరానికి ఉపశమనం లభిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. జుట్టు, చర్మానికి మంచిది. బరువు తగ్గడానికి సహాయపడుతుందని కూడా చెబుతారు. తలకు కూడా చల్ల నీటి స్నానం మంచిదే.నోట్: చిన్న పిల్లలకు, వృద్ధులకు, శ్వాసకోశ వ్యాధులు, ఉబ్బసం, ఇతర అనారోగ్యంతో ఉన్నవారికి చన్నీటి స్నానం మంచిది కాదు. ఏ వయసు వారికైనా గోరు వెచ్చటి స్నానం ఉత్తమం. అటు వాటు ఉన్నవారు, తట్టుకోగల శక్తిఉన్నవారు చన్నీటి స్నానం చేయవచ్చు. లేదంటే గోరు వెచ్చని నీటితో స్నానం బెటర్. స్నానానికి ముందు శరీరానికి నూనెతో మసాజ్ చేసుకుంటే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాగే స్నానం తరువాత మాయిశ్చరైజింగ్ క్రీమ్ వాడాలి. -
‘వినియోగం’ గణనీయంగా తగ్గింది!
దాదర్: ముంబైలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. గత వారం దాకా ఉక్కపోతతో సతమతమైన ముంబైకర్లకు ఇప్పుడు చలి కారణంగా కొంతమేర ఊరట లభించినట్లైంది. పగలు కొంత ఉక్కపోత భరించలేకపోయినప్పటికి రాత్రుల్లో వాతావరణంలో ఆకస్మాత్తుగా మార్పులు జరుగుతున్నాయి. ఫలితంగా ఇళ్లలోని ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం చాలా శాతం వరకు తగ్గింది. దీంతో ముంబైలో గత వారం కిందట మూడు వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగ్గా ఇప్పుడది 2,500 మెగావాట్లకు పడిపోయింది. చలికాలం ప్రారంభంలోనే సుమారు 500 మెగావాట్ల వరకు విద్యుత్ వినియోగం తగ్గిపోయింది. మరికొద్ది రోజుల్లో ఇది 1,500 మెగావాట్లకు చేరడం ఖాయమని అధికారులు భావిస్తున్నారు. వేసవికాలంలో 4,550 మెగావాట్లపైనే.... వేసవి కాలంలో ఎండలు మండిపోవడంతో ఉదయం 10 గంటల తరువాత ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనాలు జంకుతారు. ఇళ్లల్లో, కార్యాలయాల్లో, వ్యాపార, వాణిజ్య సంస్ధల్లో పనిచేసే ఉద్యోగులు ఉక్కపోత భరించలేక సతమతమవుతారు. నిరంతరంగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు పనిచేసినప్పటికీ వాతావరణం చల్లబడదు. దీంతో వేసవి కాలంలో ముంబైలో విద్యుత్ వినియోగం ఏకంగా 4,500 మెగావాట్లకు పైనే చేరుకుంటుంది. ఏటా విద్యుత్ వినియోగం రికార్డులను బ్రేక్ చేస్తూనే ఉంటుంది. వేసవి కాలం మినహా మిగిలిన సీజన్లలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఇళ్లు, షాపులు, కార్యాలయాల్లో విశ్రాంతిలేకుండా ఫ్యాన్లు, ఏసీలు పనిచేయడంతో రెండు రోజుల కిందట విద్యుత్ వినియోగం 2,500 మెగావాట్లకు చేరుకుంది. టాటా పవర్ నుంచి 382 మెగావాట్లు, అదాణీ డహాణు విద్యుత్ కేంద్రం నుంచి 288 మెగావాట్లు, ముంబై ఎక్చేంజ్ నుంచి 1,971 మెగావాట్లు విద్యుత్ సరఫరా జరిగింది. ముంబైలో భిన్నంగా... ఇదిలాఉండగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిపోయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభమైనప్పటికీ అనేక జిల్లాల్లో వాతావరణం ఇంకా వేసవి ఎండలు తలపిస్తున్నాయి. రోజు ఏకంగా 31,001 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. పెద్ద మొత్తంలో విద్యుత్ వినియోగం పెరిగిపోవడంతో మహానిరి్మతి కంపెనీ నుంచి 6,252 మెగావాట్లు, ప్రైవేటు కంపెనీల నుంచి 8,728 మెగావాట్లు, ఎక్చేంజి నుంచి సుమారు 8 వేల మెగావాట్లు విద్యుత్ సేకరించి ఈ డిమాండ్‌ను పూరిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ ప్రధాన నగరాలతో పోలిస్తే ముంబైలో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్ధలు అధికంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. వీటితోపాటు జంక్షన్ల వద్ద, ప్రధాన రహదారులపై, పర్యాటక ప్రాంతాల్లో వాణిజ్య, వ్యాపార ప్రకటనల బోర్డులు, హోర్డింగులు అడుగడుగున ఉంటాయి. వీటిలో కొన్ని ఎల్రక్టానిక్, డిజిటల్ బోర్డులుంటాయి. రాత్రుల్లో వాటికి విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సాధారణ బోర్డులకు ప్లడ్ లైట్లు వెలుగుతాయి. దీంతో రాత్రి వాతావరణం చల్లిబడినప్పటికి విద్యుత్ వినియోగం పగలు మాదిరిగానే జరుగుతుంది. అయితే కొద్ది నెలల కిందట ఘాట్కోపర్లోని చడ్డానగర్ జంక్షన్ వద్ద భారీ హోర్డింగ్ కూలడంతో సుమారు 17 మంది చనిపోగా 30 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనతో అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగులు, బోర్డుల అంశం తెరమీదకు వచి్చంది. వివిధ రంగాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో కళ్లు తెరచిన ప్రభుత్వం, బీఎంసీ పరిపాలన విభాగం తనిఖీలు ప్రారంభించింది. అక్రమంగా ఏర్పాటుచేసిన హోర్డింగులు, సైన్ బోర్డులతోపాటు వాటికి విద్యుత్ సరఫరా చేస్తున్న కనెక్షన్లను కూడా తొలగిస్తున్నారు. ఆ ప్రకారం ముంబైలో కొంత శాతం విద్యుత్ వినియోగం తగ్గాలి. కానీ ఇవేమీ విద్యుత్ వినియోగంపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. -
చలికాలంలో మీ స్కిన్ మృదువుగా ఉండాలంటే.!
చలికాలం చర్మం పొడిబారి, జీవం కోల్పోయినట్టు కనపడుతుంది. ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కలిగి ఉండాలి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అందుకు సంబంధించి కొన్ని టిప్స్ మీకోసం. టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు, పాదాలకు రాసి మసాజ్ చేయాలి. స్నానం చేసేముందు నాలుగు చుక్కల బాదం నూనె బకెట్ నీటిలో కలపాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. అరటిపండు గుజ్జు, కప్పు పెరుగు, టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ ఓట్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మేనికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీంతో చర్మానికి జీవకళ వస్తుంది. స్నానం చేయడానికి అరగంట ముందు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె మేనికి రాసుకోవాలి. మృదువుగా మర్దనా చేసి, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి చలికాలం నూనె శాతం అధికంగా ఉన్న మాయిశ్చరైజర్లు వాడాలి. ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చలికాలం మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. టీ స్పూన్ శనగపిండిలో అర టీ స్పూన్ తేనె, పచ్చిపాలు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పొడిబారిన ముఖ చర్మం ముడతలు తగ్గుతాయి. చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. అలాగని చర్మాన్ని మరీ రబ్ చేయకూడదు. కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి, మర్దనా చేయాలి. మృతకణాలు తొలగి పోయి చర్మం మృదువుగా మారుతుంది. -
వెలుగు స్తంభాలు
నేల నుంచి నింగికి వేసిన కాంతి నిచ్చెనల్లా ఉన్నాయి కదూ! పశ్చిమ కెనడాలో మైనస్ 30 డిగ్రీల చలితో వణికిపోతున్న ఆల్బర్టా ప్రాంతంలో దర్శనమిస్తున్న ఈ నిట్టనిలువు వెలుతురు స్తంభాల సోయగాలు చూపరుల మనసు దోస్తున్నాయి. ఇవి ఏర్పడాలంటే పర్యావరణపరంగా పలు అంశాలు కలిసి రావాల్సి ఉంటుంది. –10 నుంచి –40 డిగ్రీల మధ్యలో వాతావరణం అతి శీతలంగా, హెచ్చు తేమతో, గాలన్నదే వీయకుండా స్తబ్ధుగా ఉండాలి. అలాంటి వాతావరణంలో 0.02 మి.మీ. మందంతో కూడిన బుల్లి మంచు రేణువులు నిట్టనిలువుగా కాకుండా నేలకు కాస్త సమాంతరంగా కిందకు పడుతూ ఉండాలి. వాటి గుండా కాంతి నిర్దిష్ట కోణాల్లో ప్రసరిస్తే ఆ మంచు రేణువులు లక్షలాది బుల్లి అద్దాలుగా మారతాయి. వాటిపై పడుతూ కాంతి ఊహాతీతమైన తీరులో పరావర్తనం చెందుతుంది. ఫలితంగా ఇలాంటి నిలువు వెలుగులు సాక్షాత్కరిస్తాయి. ఆ కాంతికి మూలం వీధి దీపాలు మొదలుకుని చంద్ర కిరణాల దాకా ఏదైనా కావచ్చు. కెనడాతో పాటు అలస్కా, రష్యా తదితర చోట్ల అతి శీతల ప్రాంతాల్లో ఇవి తరచూ ఏర్పడుతుంటాయి. ఇవి నిజానికి కేవలం ఓ దృశ్య భ్రాంతి మాత్రమేనని సైంటిస్టులు అంటారు. వాళ్లేం చెప్పినా స్థానికులు వీటిని మానవాతీత శక్తి తాలూకు విన్యాసాలుగా నమ్ముతుంటారు. ఎగిరే పళ్లేల్లాగే ఇవి కూడా గ్రహాంతరవాసుల వాహనాలని భావిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మీ చేతి ఉన్నివస్త్రం
‘తపాలా బండి గంటల చప్పుడుకు ఏ పడుచు పిల్లయినా నిద్ర లేచినా మళ్లీ అటు తిరిగి పడుకుని తియ్యటి కలలు కంటుంది’ అని ఉంటుంది చెహోవ్ రాసిన ‘ఒక చలి రాత్రి’ కథలో! ఊహించండి. దట్టమైన చలికాలం. రాత్రి మూడు గంటల సమయం. ఏ వెధవ ప్రాణమైనా ముడుక్కుని పడుకుని కాసింత సుఖాన్ని అనుభవించే వేళ. ఒడలు మరిచే వేళ. వెచ్చదనమూ భోగమే అని భావించే వేళ. పొట్టకూటి కోసం, రోజూ చేయాల్సిన పని కోసం తపాలా మూటలను బగ్గీలో వేసుకుని స్టేషనుకు చేర్చక తప్పని మెయిల్మేన్ మనసులో ఎలా ఉంటుంది? నిశ్శబ్దాన్ని కప్పుకొని గాఢ సుషుప్తిలో ఉన్న ఊరి వీధుల గుండా అతడొక్కడే చలికి వణుకుతూ, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటిలో వెళుతూ ఉంటే అతడి అంతరంగ జగాన ఏముంటుందో ఆ సమయాన ఇళ్లల్లోని గదుల్లో రగ్గుల చాటున శయనిస్తున్న మనుషులకు తెలుస్తుందా?శ్రీమంతులు కూడా భలే వాళ్లులే! చలి రాత్రుళ్లలో వారికి మజాలు చేయాలనిపిస్తుంది. అతిథులను పిలవాలనిపిస్తుంది. పార్టీలూ గీర్టీలూ. పనివాళ్లను తొందరగా ఇళ్లకు పోండి అంటారా ఏమి? లేటు అవర్సు వరకూ పని చేయాల్సిందే! బయట చలి ఉంటుంది. పాకల్లో పసిపిల్లలు ‘కప్పుకోవడానికి ఇవాళైనా దుప్పటి కొనుక్కుని రా నాన్నా’ అని కోరడం గుర్తుకొస్తూ ఉంటుంది. ఒంటి మీదున్న ఈ కనాకష్టం బట్టలతో ఇంతరాత్రి చలిలో ఇంటికి ఎలా చేరాలనే భీతి ఉంటుంది. వెచ్చటి ద్రవాలు గొంతులో ఒంపుకునే శ్రీమంతులు ‘ఒరే... ఆ రగ్గు పట్టుకుపో’ అంటారా? ‘ఈ పాత స్వెటరు నీ కొడుక్కు తొడుగు’ అని దయతో పారేస్తారా? ఆ సోయి ఉంటే కొందరు ఎప్పటికీ శ్రీమంతులు కాలేరు. పాపం పనివాడు రంగడు పార్టీలో యజమాని ఉండగా ఆ అర్ధరాత్రి రగ్గు దొంగిలిస్తాడు. పేదవాణ్ణి దొంగను చేసింది లోపలి పెద్దమనిషా... బయటి చలా? డి.వెంకట్రామయ్య ‘చలి’ కథ ఇది.దర్శకుడు బి.నరసింగరావు కథలు కూడా రాశారు. ‘చలి’ అనే కథ. నగరానికి వచ్చిన వెంటనే మొగుడు పారిపోతే ఆ వలస కూలీ చంకన బిడ్డతో వీధుల్లో తిరుగుతూ చలిరాత్రి ఎక్కడ తల దాచుకోవాలా అని అంగలారుస్తుంటుంది. అక్కడ నిలబడితే ఎవరో కసురుతారు. ఇక్కడ నిలబడితే ఎవరో తరుముతారు. నోరూ వాయి లేని చెట్టు ‘పిచ్చిదానా... నిలుచుంటే నిలుచో. నీకేం వెచ్చదనం ఇవ్వలేను’ అని చిన్నబోతూ చూస్తుంది. చెట్టు కింద తల్లీబిడ్డా వణుకుతుంటారు. చలి. చెట్టు కింద తల్లీ బిడ్డా కొంకర్లు పోతూ ఉంటారు. శీతలం. చెట్టు సమీపంలోని చాటు అటుగా వచ్చి ఆగిన కారులోని యువతీ యువకులకు మంచి ఏకాంతం కల్పిస్తుంది. బయట చలి మరి. ఒకే తావు. చెట్టు కింద చావుకు దగ్గరపడుతూ తల్లీబిడ్డ. అదే తావులో ఏమీ పట్టని వెచ్చని సరస సల్లాపం. చలి ఒకటే! బహు అర్థాల మానవులు.శతకోటి బీదలకు అనంతకోటి ఉపాయాలు. పేదవాడు బతకాలంటే నోరు పెంచాలి. లేదా కండ పెంచాలి. కండ పెంచిన మల్లయ్య రైల్వేస్టేషన్ దగ్గర సగం కట్టి వదిలేసిన ఇంటి వసారాను ఆక్రమించుకుంటాడు. తక్కిన కాలాల్లో దాని వల్ల లాభం లేదు. చలికాలం వస్తే మాత్రం రాత్రిళ్లు తల దాచుకోవడానికి అలగా జనాలు ఆ వసారా దగ్గరికి వస్తారు. తలకు ఒక్కరూపాయి ఇస్తే వెచ్చగా పడుకునేందుకు చోటు. కొందరి దగ్గర ఆ రూపాయి కూడా ఉండదు. దీనులు. పేదవాడు మల్లయ్య దయ తలుస్తాడా? తరిమి కొడతాడు. లేచిన ప్రతి ఆకాశహర్మ్యం నా ప్రమేయం ఏముందని నంగనాచి ముఖం పెట్టొచ్చుగాని అది ఎవడో ఒక పేదవాడిలో మంచిని చంపి రాక్షసత్వం నింపుతుంది. వి. రాజా రామమోహనరావు ‘చలి వ్యాపారం’ కథ ఇది.చలిరాత్రి ఎప్పటికీ అయిపోదు. అది పేదవాళ్లకు తామెంత నగ్నంగా జీవిస్తున్నారో గుర్తు చేయడానికే వస్తుంది. చలికి వణికే కన్నబిడ్డల్ని చూపి బాధ పెట్టడానికే వస్తుంది. మనందరం మధ్యతరగతి వాళ్లమే. ఇంటి పనిమనిషిని అడుగుదామా ‘అమ్మా... నీ ఇంట ఒక గొంగళన్నా ఉందా... పిల్లలకు ఉన్ని వస్త్రమైనా ఉందా?’.... ‘చలికి వ్యక్తి మృతి’ అని వార్త. మనిషి చలికి ఎందుకు చనిపోతాడు? ప్రభుత్వం అతనికి ఇస్తానన్న ఇల్లు ఇవ్వకపోతే, ఇల్లు ఏర్పాటు చేసుకునేంత ఉపాధి చూపకపోతే, నీ దిక్కులేని బతుకును ఇక్కడ వెళ్లదీయమని వింటర్ షెల్టరైనా చూపకపోతే, తన నిర్లక్ష్యాన్ని తోడు చేసుకుని చలి హత్యలు చేయగలదని గ్రహించకపోతే అప్పుడు ఆ వ్యక్తి ‘చలికి చనిపోయిన వ్యక్తి’గా వార్తలో తేలుతాడు. విలియమ్ సారోయాన్ అనే రచయిత రాస్తాడు– చలి నుంచి కాపాడటానికి కనీసం శవాల మీదున్న వస్త్రాలనైనా తీసివ్వండ్రా అని! అతని కథలో ఒక యువకుడు ఆకలికి తాళలేక ఓవర్‌కోట్ అమ్మి చలితో చచ్చిపోతాడు.పగిలిన గాజుపెంకుతో కోసినట్టుగా ఉంటుందట చలి. అదంత తీవ్రంగా ఉండేది మను షుల్లో నిర్దయను పెంచడానికా? కాదు! దయను పదింతలు చేయడానికి! పాతదుప్పట్లో, పిల్లలు వాడక వదిలేసిన స్వెటర్లో, నాలుగు కంబళ్లు కొనేంత డబ్బు లేకపోలేదులే అని కొత్తవి కొనో వాటిని స్కూటర్లో, కారులో పడేసి ఆఫీసు నుంచి వచ్చేప్పుడు ఒక్కరంటే ఒక్కరికి ఇచ్చి వస్తే ఎలా ఉంటుందో ఈ చలికాలంలో చూడొద్దా? ఉబ్బెత్తు బ్రాండెడ్ బొంతలో నిద్రపోయే వేళ మన చేతి ఉన్నివస్త్రంతో ఒక్కరైనా నిద్ర పోతున్నారన్న భావన పొందవద్దా? అదిగో... అర్థమైందిలే... మీరు అందుకేగా లేచారు! -
శీతాకాలంలో కీళ్ల నొప్పులు : నువ్వులను ఇలా తింటే..!
చలికాలం వచ్చేసింది. కీళ్లు బిగుసుకుపోతుంటాయి. నువ్వులతో దేహాన్ని వెచ్చబరచాలి. ఎముకలకు తగినంత శక్తినివ్వాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో పాటు ఒక ఓట్స్ లడ్డు. ఈవెనింగ్ స్నాక్‌గా డేట్స్ లడ్డు. రాత్రి భోజనంలోకి వేడిగా నువ్వుల రైస్. చలికాలం పేజీలను నవ్వుతూ తిప్పేద్దాం. డేట్స్ లడ్డు. కావలసినవి: కర్జూరాలు – 300 గ్రాములు (సీడ్లెస్ అయితే 280 గ్రాములు చాలు); నువ్వులు – కప్పు; నువ్వులు – పావు కప్పు (పైన చల్లడానికి); జీడిపప్పు పలుకులు – పావు కప్పు; యాలకులు – 4.తయారీ: ∙మంద పాటి బాణలిలో నువ్వులను (అన్నింటినీ) వేయించాలి (నూనె వేయకూడదు). చల్లారిన తర్వాత పావు కప్పు విడిగా తీసి పెట్టుకుని మిగిలిన నువ్వులను, యాలకులకు మిక్సీలో పొడి చేయాలి ∙కర్జూరాలను గింజలు తొలగించి వెడల్పు పాత్రలో వేసి చిదమాలి. అందులో నువ్వుల పొడి వేసి సమంగా కలిసే వరకు వేళ్లతో చిదుముతూ కల పాలి. బాగా కలిసిన తరవాత జీడిపప్పు పలుకులను వేసి పెద్ద నిమ్మకాయంత సైజులో లడ్డులు చేయాలి. వేయించి పక్కన తీసి పెట్టిన నువ్వులను ఒక ప్లేట్లో పలుచగా వేయాలి. లడ్డును ఆ నువ్వుల మీద పెట్టి రోల్ చేయాలి. లడ్డుకు అంటుకున్న నువ్వులు రాలిపోకుండా ఉండడానికి రెండు అర చేతుల్లో పెట్టి గట్టిగా అదమాలి. ఇవి వారం పాటు తాజాగా ఉంటాయి. ఓట్స్ సెసెమీ లడ్డు కావలసినవి: ఓట్స్ – పావు కేజీ; నువ్వులు – పావు కేజీ; యాలకులు – 4; బెల్లం తురుము – ఒకటిన్నర కప్పులు; జీడిపప్పు పలుకులు – 20తయారీ: ∙మంద పాటి పాత్రలో ఓట్స్ వేసి మీడియం మంట మీద వేయించాలి (నూనె లేకుండా). చిటపటలాడుతుంటే సమంగా వేగినట్లు గుర్తు. చిటపటలాడేటప్పుడు ఒకసారి గరిటెతో కలియతిప్పి దించేయాలి. వేగిన ఓట్స్‌ను ఒక ప్లేట్లోకి మార్చి అదే పాత్రలో నువ్వులను వేయించాలి. నువ్వులు కూడా చల్లారిన తర్వాత ఓట్స్, నువ్వులు, యాలకులను కలిపి మిక్సీలో పొడి చేయాలి. అందులో బెల్లంపొడి వేసి మరోసారి తిప్పాలి ∙ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో పోసి చేత్తో చిదిమినట్లు కలిపి, జీడిపప్పు పలుకులు కలిపి పెద్ద నిమ్మకాయంత లడ్డులు చేయాలి. ఇవి వారం రోజులు తాజాగా ఉంటాయి.నువ్వుల రైస్కావలసినవి: నువ్వులు – వంద గ్రాములు; బియ్యం – పావు కేజీ; ఎండుమిర్చి – 6; మినప్పప్పు – టీ స్పూన్ ; నువ్వుల నూనె– టేబుల్ స్పూన్; ఉప్పు పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి. పోపు కోసం: నూనె – టీ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్; కరివేపాకు – 2 రెమ్మలు.తయారీ: ∙బియ్యం కడిగి అన్నాన్ని కొంచెం పలుకుగా వండుకోవాలి. వెడల్పు పాత్రలోకి మార్చి చల్లారనివ్వాలి. అందులో ఉప్పు, టీ స్పూన్ నువ్వుల నూనె వేసి గరిటెతో జాగ్రత్తగా కల పాలి మిగిలిన నూనె బాణలిలో చేసి వేడెక్కిన తర్వాత మినప్పప్పు, ఎండుమిర్చి వేయించాలి. అవి వేగిన తర్వాత నువ్వులు వేసి వేయించాలి. నువ్వులు చిట్లుతున్న శబ్దం వచ్చిన తర్వాత ఒక అరనిమిషం పాటు బాగా కలియబెట్టి స్టవ్ ఆపేయాలి నువ్వులు, ఎండుమిర్చి చల్లారిన తర్వాత మిక్సీలో ముందుగా ఎండుమిర్చి వేసి పొడి చేయాలి. అవి గరుకుగా మెదిగిన తర్వాత బాణలిలో ఉన్న అన్నింటినీ వేసి మెత్తగా పొడి చేయాలి. ఈ పొడిని అన్నం మీద పలుచగా చల్లాలి అదే బాణలిలో పోపు కోసం తీసుకున్న నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేయించాలి. ఈ పోపును అన్నంలో వేయాలి. నువ్వుల పొడి, పోపు సమంగా కలిసే వరకు గరిటెతో కలపాలి. రుచి చూసుకుని అవసరమైతే మరికొంత ఉప్పు కలుపుకోవచ్చు. -
పెట్ లవర్స్.. బీ కేర్‌ఫుల్..!
పెంపుడు జంతువులు.. మన జీవన శైలిలో ఓ భాగం. అయితే ఆ మూగ జీవాలను ప్రాణప్రదంగా భావించేవారు కోకొల్లలు. కంటికి రెప్పలా కాస్తూ.. విడదీయరాని మైత్రి బంధాన్ని కొనసాగించే వారు మరికొందరు. మనుషుల్లానే చలికాలంలో వాటికీ రక్షణ అవసరమే.. అందుకే జంతు ప్రేమికులు చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వాటిపట్ల జాగ్రత్తగా మసలుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనుషుల మాదిరిగానే వాటికీ సీజనల్ వ్యాధులు వస్తాయి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వాటి ఆరోగ్యానికీ ఢోకా ఉండదని చెబుతున్నారు కెన్నెల్ క్లబ్ ఆఫ్ ఇండియా, తెలంగాణలోని సనత్ నగర్‌కి చెందిన కెనైన్ అసోసియేషన్ కార్యదర్శి విశాల్ సూదం. మనుషులకే కాదు.. పెంపుడు జంతువులకూ చలికాలంలో వేడి పుట్టించే వివిధ రకాల యాక్సెసరీస్ అందుబాటులోకి వచ్చాయి. కుక్కలకు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ఎప్పటికప్పుడు వాష్ చేసుకునేందుకు వీలుగా ఫ్లాట్ బెడ్, రౌండ్ బెడ్లు దొరుకుతున్నాయి. కుక్కలు, పప్పీస్ చలి తీవ్రతను వీటి ద్వారా అరికట్టవచ్చు. దీంతోపాటు ప్రత్యేక స్వెట్టర్లు జంతువులకు రక్షణ నిలుస్తున్నాయి. అన్ని సైజుల కుక్కలకూ అనువుగా ఉండేలా వివిధ మోడళ్లతో ఊలుతో తయారుచేసిన స్వెట్టర్లు లభిస్తున్నాయి. ఇవి కూడా వాటి సైజు, నాణ్యత ఆధారంగా వివిధ ధరల్లో లభిస్తున్నాయి. అలాగే. కాళ్లకు రక్షణ కలిగించే రీతిలో శీతాకాలంలో షూష్ అందుబాటులో ఉన్నాయి.శీతాకాలంలో మంచు కారణంగా గాలిలో తేమ శాతం కారణంగా గాలి నాణ్యత తక్కువగా ఉంటుంది. దీంతో పెంపుడు జంతువులు వాయు కాలుష్యం బారిన పడి శ్వాసకోశ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే బయటకు తీసుకెళ్లకపోవడమే ఉత్తమం. పెట్స్ ఆరోగ్యంగా ఉండడానికి రెగ్యులర్‌గా గ్రూమింగ్ చేయడం అవసరం. నీళ్లు తాగించేందుకు ఉపయోగించే గిన్నెలు, పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. సీజనల్ వ్యాధులు.. శీతాకాలలో వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువ. చలి కాలంలో ఫ్లీస్, టిక్, మైట్స్ (గోమర్లు) అనే బాహ్య పరాన్నజీవులు కుక్కల చర్మంపై చేరతాయి. దీంతో జుట్టు రాలిపోవడం, టిక్ ఫీవర్ రావడం, బ్లడ్ లాస్ కావడం, దురదలు కారణంగా కుక్కలు వాటంతట అవే శరీరాన్ని కొరుక్కుంటాయి. గాలి సంక్రమణ ద్వారా ఒక కుక్క నుంచి మరో కుక్కకు పాకుతుంటాయి. అందుకోసం ముందుగానే నిపుణుల సలహా మేరకు బెల్టు టైపులో ఉండే యాంటీ టిక్ కాలర్ ఏర్పాటు చేయడం రక్షణగా ఉంటుంది. అలాగే తరచూ యాంటీ రాబీస్, సెవన్ ఇన్ వన్ వంటి టీకాలను వేయించాలి. షాంపో, పౌడర్, స్ప్రేస్తో ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే ఆరోగ్యకరంగా ఉంటాయి. ప్రత్యేక శ్రద్ధ అవసరం..శీతాకాలంలో మంచుకురిసే అవకాశం ఉన్నందున సాధ్యమైంత వరకూ పెంపుడు జంతువులకు ప్రత్యేక షెల్టర్ గానీ, ఇంట్లో వెచ్చని ప్రదేశాన్ని గానీ కేటాయిస్తే బాగుంటుంది. ముఖ్యంగా పప్పీస్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వాటి దినచర్యలో ఏవైనా మార్పులు వస్తే.. వైద్యుల సలహా పాలించాలి. – విశాల్ సూదం, కెనైన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి (చదవండి: వినదగ్గదే శ్రీమతి చెబుతుంది) -
మంచు కురిసిన వేళ: కశ్మీర్ సొగసు చూడ తరమా!
శీతాకాలం మంచు అనగానే ఇండియాలో తొలుతగా గుర్తొచ్చే ప్రదేశం జమ్ము కశ్మీర్. రాష్ట్రంలో లోని పలు ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు, దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. #WATCH | J&K: Upper reaches of Bandipora, including border areas of Gurez, Tulail & Kanzalwan, covered under a white sheet of snow as snowfall continues in the region. pic.twitter.com/UL23aw4xwX— ANI (@ANI) November 16, 2024 కాశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతం, స్కీయింగ్‌కు ప్రసిద్ధి చెందిన గుల్మార్గ్లో శనివారం తొలి మంచు ప్రవాహమై మెరిసింది. ఇంకా కుప్వారా జిల్లా , బందిపొరా జిల్లా, గురెజ్ , కంజల్వాన్ తదితర ప్రాంతాల్లో కూడా భారీగా మంచు కురుస్తోంద. కొండలపై ఎటు చూసిన వెండి వెన్నలలా మంచుకురుస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. కాశ్మీర్‌లోని ఎగువ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి మంచు కురుస్తుందని, మైదాన ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షం కురిసిందని అధికారులు ఇక్కడ తెలిపారు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది . Snowing heavily over Sonamarg, almost 1-2 inches snowfall accumulated in the area. pic.twitter.com/RTAGuMPGaP— Kashmir Weather Forecast (@KashmirForecast) November 16, 2024 -
చలికాలంలో చిటపటలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శీతాకాలం ప్రారంభం వేళ విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొన్నది. చలి పెరగాల్సిన సమయంలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. చలికాలంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టాల్సి ఉండగా.. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. దాదాపు వారం రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నది. ప్రస్తుత సీజన్లో నమోదు కావాల్సిన దాని కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ మేర అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం, వేగంగా వీస్తున్న గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.గురువారం రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదయ్యాయి. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 4 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదైంది. మెదక్, నిజామాబాద్‌లో 3 డిగ్రీలు, హైదరాబాద్, అదిలాబాద్, భద్రాచలంలో 2 డిగ్రీలు, వరంగల్, హన్మకొండలో ఒక డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది. గురువారం గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 34.5 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 16 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. సాధారణంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు శీతాకాలం ఉంటుంది.వాతావరణంలో మార్పులతో..సాధారణంగా సీజన్ మారుతున్న సమయంలో వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రస్తుతం ఈశాన్య రుతుపవన కాలం మధ్యస్థానికి చేరుకుంది. రుతుపవనాల ప్రభావంతో ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం, దీనికి తోడు సీజనల్ యాక్టివిటీస్‌తో వాయు కాలుష్యం ఒక్కసారిగా పెరగడంతో ఆ ప్రభావం ఉష్ణోగ్రతలపై పడినట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అందువల్లనే గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణానికి కాస్త అటుఇటుగా నమోదవుతున్నాయి.ఈ ప్రభావం మరో వారం రోజులపాటు ఉండొచ్చని అధికారులు అంటున్నారు. నవంబర్ నెలాఖరు నుంచి ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గుముఖం పడతాయి. దీంతో చలి తీవ్రత కూడా పెరుగుతుంది. ఈ ఏడాది చలికాలంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే ఉంటాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. డిసెంబర్ నెలాఖరు నాటికి ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోతాయని, ఆ సమయంలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత అధికంగా ఉంటుందని ఐఎండీ వెల్లడించింది.కాస్త ఎక్కువగానే గరిష్ట ఉష్ణోగ్రతలురాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయి. దీనికి తోడు వాయుకాలుష్యం పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణం కంటే కాస్త ఎక్కువగానే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెలాఖరు నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి. డిసెంబర్ నెలతో పాటు జనవరి నెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటె తక్కువగా నమోదవుతాయని అంచనాలున్నాయి. – శ్రావణి, వాతావరణ శాఖ అధికారి -
భారత్‌లో విచిత్రమైన వాతావరణం!! 123 ఏళ్ల తర్వాత..
ఢిల్లీ: భారత్‌లో దాదాపు 120 ఏళ్ల తర్వాత విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నవంబర్ నెల వచ్చేసింది. అయినా చలి జాడ లేకుండా పోయింది. దీంతో ఈ నెల కూడా సూర్యతాపం తప్పదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.భారత్‌లో నెలకొన్ని ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులపై ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో భారత వాతావరణ శాఖ(IMD) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర వివరించారు. బంగాళాఖాతంలో అల్పపీడనలు తరచూ ఏర్పడడం, తూర్పు గాలుల ప్రభావం, పశ్చిమ దిశ నుంచి ఎలాంటి అవాంతరాలు లేకపోవడం.. తదితర కారణాల వల్ల దేశవ్యాప్తంగా వాతావరణం వెచ్చగా ఉంటోందని వెల్లడించారు. అలాగేవాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. 1901 తర్వాత ఈ ఏడాది అక్టోబర్ అత్యంత వెచ్చని నెలగా రికార్డయ్యింది. సాధారణం కంటే.. 1.23 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. అలాగే దేశవ్యాప్తంగా సరాసరి ఉష్ణోగ్రత చూసినా.. 1.84 డిగ్రీల సెల్సియస్(20.01 డిగ్రీల సెల్సియస్ బదులు 21.85 డిగ్రీల సెల్సియస్ నమోదైంది) అధికంగానే రికార్డు అయ్యింది. ఈ గణాంకాలను బట్టి నవంబర్ నెల కూడా ఉష్ణోగ్రతల్లో తగ్గుముఖం ఉండకపోవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. అలాగే.. రాబోయే రెండు వారాలు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చని చెబుతోంది.అంటే.. ఈసారి నవంబర్ చలితో వణికించదని ఐఎండీ డైరెక్టర్ మహాపాత్ర చెబుతున్నారు. అలాగే.. డిసెంబర్ నుంచి మొదలయ్యే చలి జనవరి, ఫిబ్రవరి నెలలపాటు కొనసాగుతుందని వెల్లడించారు. అంతేకాదు.. దక్షిణ భారతంలో నవంబర్ నెలలో రుతుపవనాల తిరోగమనం సమయంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని కూడా తెలిపారాయన. -
మీ చిన్నారులలో ఈ సమస్యా..? అయితే వెంటనే ఇలా చేయండి!
'చిన్నపిల్లల చర్మం చాలా కోమలంగా ఉంటుంది. చలికాలంలో వారి చర్మం పొడిబారడంతో అనేక సమస్యలు వస్తాయి. మొదటే మృదువైన చర్మం. దానికి తోడు చలికాలంలో పొడిబారి పగలడం, చిట్లడం వంటి అనర్థాలు చోటు చేసుకుంటాయి. వైద్యపరిభాషలో ఈ సమస్యను ‘అటోపిక్ డర్మటైటిస్’ అంటారు. ఈ సీజన్లో నెలల పిల్లలు మొదలు.. ఎదిగిన పిల్లల్లోనూ అనేక వయసు చిన్నారులో కనిపించే అటోపిక్ డర్మటైటిస్ సమస్యలు, వాటికి పరిష్కారాలను తెలిపే కథనమిది.' అటోపిక్ డర్మటైటిస్లో మొదట్లో చర్మం పొడిబారి, దురదతో ఎర్రగా మారుతుంది. పిల్లలు ఆ ప్రాంతంలో పదే పదే గీరుతుండటంతో చర్మం కాస్త మందంగా మారుతుంది. ఇలా కావడాన్ని ‘లైకెనిఫికేషన్’ అంటారు. ఇది జరిగాక దురద ఇంకా పెరుగుతుంది. దాంతో మరీ ఎక్కువగా గీరడం, దేనికైనా రాస్తుండటంతో చర్మం మరింత మందమవుతుంది. ఈ ప్రక్రియలు ఒకదాని తర్వాత మరొకటి ఒక సైకిల్లా (ఇచ్ అండ్ స్క్రాచ్ సైకిల్) సాగుతుంటాయి. కొందరిలో ఇదొక దీర్ఘకాలిక సమస్య (క్రానిక్)గా కూడా మారవచ్చు. ఎందుకిలా జరుగుతుందంటే.. చలికాలంలో చెమ్మ (తేమ) ఇగిరిపోతూ ఉండటంతో చర్మం పొడిబారడం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ఇలాంటప్పుడు చర్మం పొడిబారి, ఎర్రబారుతుంది. కుటుంబ ఆరోగ్య చరిత్రలో ఆస్తమా, డస్ట్ అలర్జీలు ఉండేవారిలో అటోపిక్ డర్మటైటిస్ సమస్య ఎక్కువ. వివిధ వయసుల పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్ తీవ్రత ఇలా.. రోజుల పిల్లల నుంచి 12 నెలల వరకు.. ఈ వయసు పిల్లల్లో చర్మం ఎర్రబారడం ప్రధానంగా ముఖంపైన, మెడ దగ్గర కనిపిస్తుంటుంది. అయితే కొందరిలో దేహంలోని ఏ ప్రాంతంలోనైనా ఇలా జరిగే అవకాశముంది. ఉదాహరణకు పాకే పిల్లల్లో వాళ్ల మోకాళ్లు నేలకు ఒరుసుకుపోతుండటం వల్ల మోకాళ్ల దగ్గర ఎటోపిక్ డర్మటైటిస్ కనిపిస్తుంటుంది. ఏడాది నుంచి రెండేళ్ల పిల్లల్లో.. ఈ వయసు పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్‌తో చర్మం ప్రభావితం కావడమన్నది చర్మం ముడతలు పడే ప్రాంతాల్లో ఎక్కువ. అంటే.. మోచేతులు, మోకాళ్ల వెనక భాగం, మెడ పక్కభాగాలు, ముంజేయి, పిడికిలి, మడమ వంటి ప్రాంతాల్లో అన్నమాట. ఈ వయసు పిల్లల్లో చర్మం ముడుత వద్ద ఒక గీతలా (స్కిన్లైన్) ఉన్నచోట్ల దురద వచ్చి, అది పగులు బారుతున్నట్లవుతుంది. రెండు నుంచి ఆరేళ్ల పిల్లల్లో.. ఈ వయసు పిల్లల్లో చర్మం పొడిబారడం కాస్త ఎక్కువ. పైగా ఈ పొడిబారడమన్నది మోకాళ్ల కింది భాగంలో ఎక్కువ. అందుకే ఈ వయసు పిల్లల కాళ్లు.. పొడి బారినప్పుడు బయట ఆడి వచ్చినట్లుగా తెల్లగా కనిపిస్తుంటాయి. ముఖం పెద్దగా పగలదు. కానీ... పెదవులు పొడిబారి, పగుళ్లలాగా వస్తుంది. పెదవుల చుట్టూ చర్మమంతా పగుళ్లుబారి ఓ సరిహద్దులా స్పష్టంగా కనిపిస్తూ, ఆ భాగం మంట పుడుతుంటుంది. దీన్ని ‘పెరీ–ఓరల్ డర్మటైటిస్’ అంటారు. ఏడు నుంచి పద్నాలుగేళ్ల పిల్లల్లో.. ఏడేళ్ల వయసు నుంచి (అంతకంటే తక్కువ వయసు పిల్లలతో పోలిస్తే) పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి క్రమంగా పెరుగుతూ పోతుంటుంది. కాబట్టి ఈ వయసునుంచి లక్షణాల తీవ్రత క్రమంగా తగ్గుతూ పోతుంది. అయితే ఈ వయసు పిల్లల్లోనూ చర్మం పొడిబారుతుంది. ఈ సమస్యలతో పాటు కొందరిలో సైనుసైటిస్ కూడా ఉండవచ్చు. చికిత్స / మేనేజ్మెంట్ తొలి దశ చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్): అటోపిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లలకు తొలి దశల్లో చికిత్స చాలా తేలిక. చర్మంపై పొడిదనాన్ని తగ్గించడానికి వైట్ పెట్రోలియమ్ జెల్లీ, లిక్విడ్ పారఫీన్ ఆయిల్ వంటివి రాస్తే చేస్తే చాలు. పగుళ్లు, దురద, పొడిదనం తగ్గుతాయి. దాంతో గీరుకోవడం తగ్గుతుంది. రాత్రి నిద్రపడుతుంది. అలర్జీని ప్రేరేపించే అంశాలను నివారించడం: సబ్బులు, డిటర్జెంట్లు.. అలర్జీని ప్రేరేపిస్తున్నాయా అన్నది చూసుకోవాలి. అలా జరుగుతుంటే.. సబ్బులను, డిటర్జెంట్లను మార్చాలి. ఘాటైన సబ్బులకు బదులు మైల్డ్‌గా ఉండే క్లెన్సెర్స్ తో శుభ్రం చేసుకోవాలి. పిల్లల్ని పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి. పిల్లల్లో అలర్జీ కలిగించే ఆహారాన్ని గుర్తించి (ముఖ్యంగా నట్స్, సీ ఫుడ్), ఒకవేళ ఆ ఆహారాలతో అలర్జీ వస్తుంటే వాటి నుంచి దూరంగా ఉంచాలి. పూత మందులతో చికిత్స: పిల్లలకు ఎమోలియెంట్స్ అని పిలిచే.. లిక్విడ్ పారఫీన్, గ్లిజరిన్, మినరల్ ఆయిల్ వంటివి పూయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. స్నానం చేయించిన వెంటనే ఎమోలియెంట్స్ పూయాలి. తీవ్రత ఎక్కువగా ఉన్న పిల్లల్లో ఎమోలియెంట్స్ పూశాక వాటిపైన పూతమందుగా వాడే స్టెరాయిడ్స్ కూడా వాడవచ్చు. పైపూతగా వాడే స్టెరాయిడ్స్‌ను ఎక్కువ రోజులు వాడకుండా ఉండేందుకు టాపికల్ క్యాల్సిన్యూరిన్ ఇన్హిబిటర్ క్రీమ్ వాడవచ్చు. డాక్టర్ల సలహా మేరకు పైపూత యాంటీబయాటిక్, స్టెరాయిడ్ కాంబినేషన్స్‌ను వాడవచ్చు. నోటిద్వారా తీసుకోవాల్సిన మందులు: నిద్రకు ముందు డాక్టర్ సలహా మేరకు నాన్ సెడెటివ్ యాంటీహిస్టమైన్స్ కూడా ఇవ్వాల్సి రావచ్చు. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాల్సి రావచ్చు. రెండోదశ చికిత్స: మొదటిదశ చికిత్స (ఫస్ట్‌లైన్ ట్రీట్మెంట్)తో అంతగా ఫలితం లేనప్పుడు స్టెరాయిడ్ డోస్ పెంచడమూ, అప్పటికీ గుణం కనిపించకపోతే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాల్సి రావచ్చు. అల్ట్రా వయొలెట్ రేడియేషన్ చికిత్స: కొంతమంది పిల్లలకు అల్ట్రావయొలెట్ బి– కిరణాలతో చికిత్సతో మంచి ఫలితాలు వస్తాయి. మూడో దశ చికిత్స (థర్డ్ లైన్ ట్రీట్మెంట్): నోటిద్వారా కార్టికోస్టెరాయిడ్స్ ఇవ్వడం లాంటి ఈ థర్డ్ లైన్ ట్రీట్మెంట్ అంతా పూర్తిగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే జరగాలి. వెట్ ర్యాప్ టెక్నిక్.. అటోపిక్ డర్మటైటిస్ తీవ్రత ఎక్కువగా ఉంటే ‘వెట్ ర్యాప్ టెక్నిక్’తో మంచి ఫలితాలుంటాయి. చర్మమంతా పగుళ్లు ఉన్న పిల్లలకు మొదట ఎమోలియెంట్స్ పూయాలి. ఆ తర్వాత ఒంటిపైన బ్యాండేజ్‌ను ఒక పొరలా కట్టి, దాన్ని గోరువెచ్చని నీటితో తడపాలి. దానిపైన మరో పొరలా పొడి బ్యాండేజ్ వేయాలి. ఇలా వేసిన బ్యాండేజీని ప్రతి పన్నెండు గంటలకు ఒకమారు మార్చాలి. దీన్నే వెట్ ర్యాప్ టెక్నిక్ అంటారు. దీంతో అటోపిక్ డర్మటైటిస్ తీవ్రతను తగ్గించవచ్చు. లక్షణాలు.. చర్మం పొడిబారి దురదలు వచ్చాక గుల్లలు, నీటిగుల్లలూ రావచ్చు. ఎర్ర బారినచోట చర్మం పొట్టు కట్టినట్లు అవుతుంది. మందంగానూ (లైకెనిఫికేషన్) మారుతుంది. కొన్నిసార్లు కాస్తంత పొట్టు రాలడంతోపాటు అక్కడ గాటు కూడా పడవచ్చు. మందంగా తెట్టుకట్టిన చర్మం పై పొర లేచిపోయినప్పుడు అక్కడ ద్రవం ఊరుతుండవచ్చు (ఊజింగ్). ఈ దశలోనూ చికిత్స అందకపోతే సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముంది. డా. స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్ ఇవి చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ మిరాకిల్ జ్యూస్ తాగితే..! -
చలికాలంలో ఇలా ఎందుకవుతుందంటే..? కారణం ఇదే!
'చలికాలం కీళ్లనొప్పులతో బాధపడేవారికి ఓ పీడకల. కీళ్లలో ఇన్ఫ్లమేషన్ వచ్చి నొప్పి కలిగించే ‘ఆర్థరైటిస్’ సమస్య చలికాలంలో పెచ్చుమీరడానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కారణాలవుతాయి. అవేమిటో, చలికాలంలో ఈ కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం పొందడం ఎలా.. వంటి అనేక విషయాలపై అవగాహన కోసం ఈ కథనం.' చలికాలంలో ఆర్థరైటిస్‌తో బాధపడేవారి వెతలు మరింతగా పెరుగుతాయి. అందుకు కారణాలు ఈ కింది విధంగా ఉంటాయి. చలికాలంలో కీళ్లనొప్పులు పెరిగేదెందుకంటే.. మానవ శరీరంపై వాతావరణం ప్రభావం తప్పక ఉంటుంది. దేహంలో జరిగే చాలా జీవక్రియలు, రోగనిరోధక వ్యవస్థ వాతావరణంలోని తేడాలకు తగ్గట్లుగా మార్పులకు లోనవుతుంటాయి. దాంతో ఆర్థరైటిస్ కీళ్లనొప్పులతో బాధపడేవారి కండరాలు మరింతగా బిగుసుకుపోవడం, బాధలు పెరగడం జరుగుతాయి. వయసు పెరుగుతున్నకొద్దీ ఈ బాధలూ పెరుగుతాయి. ఇందుకు దోహదపడే అంశాలివి.. చలికాలంలో చేయి లేదా కాలి వేళ్లకు రక్తప్రసరణ కాస్త మందగిస్తుంది. ఇలా జరగడాన్ని వైద్యపరిభాషలో ‘రెనాడ్స్ ఫినామినా’ అంటారు. అప్పటికే ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారిలో ఇది మరింత ఎక్కువ. ఇది మరింత తీవ్రతరం అయినప్పుడు కొందరిలో చేతివేళ్లు, కాలివేళ్లు కుళ్లిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఇలా జరగడాన్ని ‘గ్యాంగ్రీన్’ అంటారు. ఆర్థరైటిస్ వల్ల లంగ్స్ ప్రభావితం అయినప్పుడు ఐఎల్‌డీ అనే జబ్బు వచ్చి, చలికాలంలో తీవ్రత మరింత పెరిగి బాధితుల్లో దగ్గు, ఆయాసం పెరుగుతాయి. మయోసైటిస్ అనే రకం కీళ్లవాతంతో బాధపడేవారిలో ఈ కాలంలో కండరాలకి రక్తప్రసరణ తగ్గడంతో వాటి కదలికలు మరింత తగ్గుతాయి. ఫలితంగా తగినంత వ్యాయామం సమకూరక.. వ్యాధి లక్షణాలు పెరిగి, ఇబ్బందికరంగా మారతాయి. అందుకే కీళ్లనొప్పులతో బాధపడుతుండేవారు చలికాలం వస్తుందంటేనే ఆందోళన చెందుతుంటారు. ఈ కాలంలో కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నవారు కొన్ని చిన్న చిన్న సూచనలు పాటించడం ద్వారా చలికాలంలో పెరిగే తమ బాధలను చాలావరకు అధిగమించడం సాధ్యమే.. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. ఉన్ని దుస్తులు, కాళ్లకు సాక్స్, చేతులకు గ్లౌవ్స్ ధరించాలి. వెచ్చదనం వల్ల నొప్పిని కలిగించే రసాయనాల తొలగింపు ప్రక్రియ, వాటిని బయటకు పంపడం మరింత వేగవంతమవుతుంది. వెచ్చదనం కారణంగా రక్తప్రవాహమూ మెరుగుపడుతుంది. కండరాలు బిగుసుకు పోవడమూ తగ్గుతుంది. చలికాలంలో కండరాల కదలికలు ఇబ్బందికరంగా మారడం, నొప్పులు మరింత తీవ్రతరం కావడంతో బాధితులు తమ దేహ కదలికలను బాగా తగ్గిస్తారు. తగినంత వ్యాయామం సమకూరకపోవడంతో బాధలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. వీరు తమకు శ్రమ కలగని రీతిలో ఎంతోకొంత వ్యాయామం చేయాలి. చలికాలంలో సూర్యరశ్మి తక్కువ. ఫలితంగా ఒంట్లో విటమిన్–డి ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఈ కారణంగా వ్యాధి లక్షణాల పెరిగి, బాధలు మరింత పెచ్చరిల్లుతాయి. అప్పటికే ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నవారు డాక్టర్లు నిర్ణయించిన మోతాదులో, వారు సూచించిన కాలానికి విటమిన్–డి సప్లిమెంట్లు తీసుకోవాలి. ఈ కాలం వైరస్, బ్యాక్టీరియాల మనుగడకు అనుకూలంగా ఉండటంతో అంటువ్యాధులు పెరిగే ప్రమాదం ఉంటుంది. కీళ్లవాతాల తీవ్రతా పెరగవచ్చు. కాబట్టి ఆర్థరైటిస్ రోగులు చలికాలం రాకముందే డాక్టర్లు సూచించిన వ్యాక్సిన్లు తీసుకోవాలి. అంటువ్యాధుల వల్ల వయోవృద్ధులకు ముప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు తప్పనిసరిగా వ్యాక్సిన్లు తీసుకోవాలి. చలికాలంలో నీళ్లు, ద్రవాహారాలు తక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఒంట్లో ద్రవాలు తగ్గి, డీ–హైడ్రేషన్ ముప్పు పెరుగుతుంది. అందుకే ఈ కాలంలో అందరూ తగినన్ని నీళ్లు, ద్రవాహారాలు తీసుకుంటూ ఉండాలి. ఆర్థరైటిస్ కోసం వాడే మందుల్ని డాక్టర్ సలహా మేరకు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తల ద్వారా ఆర్థరైటిస్ బాధితులు చలికాలంలో ఎదుర్కొనే బాధలను చాలావరకు నివారించవచ్చు. ఇవి చదవండి: వింటర్లో సెల్యులైటిస్తో సమస్యా..? అయితే ఇలా చేయండి! -
వింటర్లో సెల్యులైటిస్తో సమస్యా..? అయితే ఇలా చేయండి!
'సెల్యులైటిస్ అనేది ఓ చర్మవ్యాధి. కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో చర్మంపై పగుళ్లు రావడం, ఎర్రబారడం, కొద్దిపాటి వాపు మంట వంటి లక్షణాలతో బాధించే ఈ వ్యాధి తాలూకు బాధలు చలికాలంలో ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా ఉన్నప్పుడు మరింత ఎక్కువవుతాయి. అసలు సెల్యులైటిస్ రావడానికి ఏయే అంశాలు కారణమవుతాయి, లక్షణాలేమిటి, చలికాలంలో ఇది ఎందుకిలా మరింత ఎక్కువగా బాధిస్తుంది వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.' చర్మం పగుళ్లుబారినట్లుగా కనిపిస్తూ, కొద్దిపాటి వాపు, ఎర్రబారడం వంటి వాటితో వ్యక్తమయ్యే ఈ వ్యాధి స్ట్రెప్టోకాకస్, స్టెఫాలోకాకస్ వంటి బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. చర్మంపై ఒకచోట వస్తే మిగతా చోట్లకు పాకుతుంది. అయితే ఇది అంటువ్యాధి కాదు. ఒకరినుంచి మరొకరికి వ్యాపించదు. ప్రేరేపించే అంశాలు.. స్ట్రెప్టోకాకస్, స్టెఫాలోకాకస్ వంటి బ్యాక్టీరియా వల్ల వచ్చినప్పటికీ... కొన్ని అంశాలు దీన్ని తీవ్రతరం చేస్తాయి. అవి.. కాళ్లు, చేతుల్లోని రక్తనాళాల్లో ఏమైనా సమస్యలతో రక్తసరఫరాలో తేడాలు, ఊబకాయం, కాళ్లవాపులు, డయాబెటిస్, మద్యం తాగే అలవాటు కారణాలతో పాటు వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనం కావడం. లక్షణాలు.. ఈ ఆరోగ్య సమస్యలో కనిపించే ఓ కీలకమైన అంశం ఏమిటంటే.. సాధారణంగా సెల్యులైటిస్ దేహంలోని ఒకవైపునే కనిపిస్తుండటం విశేషం. ఈ వ్యాధి ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణాలివి.. ఈ వ్యాధి సోకిన ప్రాంతంలో చర్మం దురద పెడుతుండటంతో పాటు ఈ దురదలు క్రమంగా పక్కలకు వ్యాపిస్తూ ఉంటాయి. వ్యాధిసోకిన చర్మపు ప్రాంతంలో వాపు, ముట్టుకోనివ్వకపోవడం (టెండర్నెస్) నొప్పి, వేడిగా అనిపించడం జ్వరంతో పాటు అది కొందరిలో చలిజ్వరంగా వ్యక్తం కావడం సెల్యులైటిస్ వచ్చిన ప్రాంతాల్లో మచ్చలతో పాటు నీటి పొక్కుల్లా (బ్లిస్టర్స్) రావడం. కొందరిలో చర్మంపై గుంటల్లా పడుతూ, చర్మం వదులైన తోలు మాదిరిగా కనిపించడం (స్కిన్ డింప్లింగ్) చలికాలంలో బాధలు ఎందుకు పెరుగుతాయంటే.. సెల్యులైటిస్ లక్షణాలతో వచ్చే బాధలు చలికాలంలో పెరగడానికి, ఈ సీజన్లో చర్మంపై కనిపించే కొన్ని అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు.. చర్మం పొడిబారడం (డ్రైస్కిన్): ఈ సీజన్లో తేమ తగ్గడంతో చర్మం బాగా పొడిబారిపోతూ ఉండటం చాలామందికి అనుభవంలో వచ్చే విషయమే. పైగా చలిగాలులకు వెళ్లినప్పుడు మరింతగా పెరుగుతుంది. ఇలా పొడిబారిన చర్మం బ్యాక్టీరియా చేరడానికి అనువుగా ఉంటుంది. దాంతో సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఈ సీజన్లో మాయిశ్చరైజర్లతో చర్మాన్ని తేమగా ఉంచుకుంటే ఇలా పగుళ్లుబారడంతో పాటు సెల్యులైటిస్నూ నివారించవచ్చు. వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనపడటం / వ్యాధినిరోధక శక్తి తగ్గడం: చలికాలంలో మామూలుగానే వ్యాధినిరోధక వ్యవస్థ పనితీరు కాస్త మందగించే అవకాశముంది. దీనికి తోడు డయాబెటిస్ ఉండటం, మద్యం అలవాట్ల వంటివి ఉంటే అది వ్యాధి నిరోధక వ్యవస్థను మరింత మందకొడిగా మార్చవచ్చు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో సమతులాహారం తీసుకోకపోవడం, ఆహారంలో విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు తక్కువగా ఉండటం లాంటి అంశాలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే అవకాశముంది. సెల్యులైటిస్ నివారణ ఇలా... చర్మాన్ని శుభ్రంగా, తేటగా ఉంచుకోవాలి. ఘాటైన రసాయనాలతో కూడిన వాసన సబ్బులు కాకుండా, మైల్డ్ సోప్ వాడాలి. మిగతా చర్మంతో పోలిస్తే.. మేనిపై పొడిగా ఉండే భాగాలైన మోచేతులు, మోకాళ్లు వంటి చోట్ల మాయిశ్చరైజర్ వంటివి రాసి, తేమగా ఉండేలా చూసుకోవడం మంచిది. చర్మం పగుళ్లు బారి, తోలు రేగిన ప్రాంతాల్లో వాటిని గిల్లడం, లాగడం చేయకూడదు. గోళ్లు, చర్మంతో గోళ్లు ముడిపడే భాగాల్ని శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే అక్కడి నుంచి బ్యాక్టీరియా చర్మంపై దాడి చేసే అవకాశాలుంటాయి. చలికాలంలో చర్మానికి మంచి రక్షణ కలిగేలా, ఒళ్లంతా కప్పి ఉంచేలాంటి దుస్తులు వాడటం మేలు. చలిగాలులు వేగంగా తాకకుండా ఉండేలా దుస్తులు ఉండాలి. తమ వ్యక్తిగత దుస్తులు, సామగ్రిని ఇతరులతో పంచుకోకూడదు. ఇల్లు శుభ్రం చేసుకోవడం, తోటపని వంటి మన రోజువారీ కార్యక్రమాల్లో చర్మానికి ఎలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తపడాలి. ఎక్కడైనా చర్మం తెగినా, గాయపడ్డా డాక్టర్ సలహా మేరకు తగిన యాంటీబయాటిక్ క్రీమ్స్ వంటివి రాస్తూ, గాయాలు వేగంగా తగ్గేలా జాగ్రత్త తీసుకోవాలి. పాదాల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా బాగా పొడిబారి పగుళ్లకు అవకాశం ఉండే మడమలు, అలాగే వేళ మధ్యభాగాలు తేమతో, ఆరోగ్యంగా ఉంచుకునేలా జాగ్రత్త వహించాలి. రోజూ తగినన్ని నీళ్లు తాగాలి. వ్యాధినిరోధక వ్యవస్థ చురుగ్గా ఉండేందుకు అన్ని పోషకాలూ, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన మంచి ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకుంటూ ఉండాలి. డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, తమ జబ్బులను అదుపులో పెట్టుకునేలా క్రమం తప్పకుండా మందులు వాడటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఆరోగ్యపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. చివరగా.. చలికాలంతో కొన్ని సౌకర్యాలున్నప్పటికీ.. దాంతోపాటు మరికొన్ని ఆరోగ్యసమస్యలనూ తీవ్రం చేసే సీజన్ అది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చర్మాన్నీ, దేహాన్నీ ఆరోగ్యంగా ఉంచుకుంటే ఈ సీజన్ నిరపాయకరంగా గడిచిపొతుంది. ఇవి చదవండి: వింటర్లో ముఖం తేటగా ఉండాలంటే వెంటనే ఇలా చేయండి! -
ఖాళీ కడుపుతో నారింజ తింటున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?
చలికాలంలో వచ్చే సాధారణ సమస్యలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, బొంగురుపోవడం వంటి సమస్యలను కలిగిస్తుంది. అయితే చలికాలంలో రోజూ పండ్లు తింటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అదీ పుల్లటి నారింజ పండు. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. అదెలాగో చూద్దామా.. అసలే చలికాలం కదా... నారింజ తింటే జలుబు వస్తుందనే భయంతో ఎక్కువ మంది తినడం లేదు. అయితే చలికాలంలో నారింజ పండ్లు తినడం చాలా మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు. జలుబు–దగ్గు మొదలైన వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులలో కఫం ఉంటే నారింజ మీకు ఔషధం.శీతాకాలంలో నారింజ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నిజానికి నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి శరీరం లోపల నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ప్రతిరోజూ రెండు నారింజలను తింటే, మీ రోజువారీ మోతాదుకు తగ్గ విటమిన్ సి లభిస్తుంది. ఫలితంగా శరీరం లోపల బలం పెరుగుతుంది. ఇది కాకుండా, నారింజలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మీ శరీరంలో మంట లేదా ఇన్ఫెక్షన్ వంటి వాటికి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. నారింజ పండ్లను తినడం వల్ల ముఖం, ముఖంపై ఉండే మొటిమలు మాయమవుతాయి. ఇది శరీరాన్ని ఎక్కువసేపు తేమగా ఉంచుతుంది. ముఖంపై పగుళ్లు, పొడిబారడం వంటి సమస్యలను ఇది సరిచేస్తుంది. నారింజ పండ్లను ఉదయం ఖాళీ కడుపుతో తినకూడదు. ఇది మీ శరీరంలో ఎసిడిటీకి దారితీస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. పూర్తి ప్రయోజనాలు పొందాలంటే మధ్యాహ్నం పూట ఈ పండును తినడం మంచిది. అయితే మంచిది కదా అని రోజుకు రెండు పండ్ల కంటే ఎక్కువ తినకూడదు. అలా తినడం వల్ల ఇతర సమస్యలు వస్తాయి. -
చలికాలంలో నగ్నంగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదట
ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం మాత్రమే కాదు, నిద్ర కూడా అంత కంటే ఎక్కువే అవసరం. ఈ చలికాలంలో సాధారణం కంటే ఎక్కువ గంటలు నిద్రపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మందపాటి దుప్పటి ఉంటేనే హాయిగా నిద్రపడుతుంది. అయితే చలికాలంలో బట్టలు లేకుండా నగ్నంగా పడుకోవడం వల్ల మీ అందం మరింత రెట్టింపు అవుతుందని మీకు తెలుసా? దీనివల్ల అనేక చర్మ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చట. చలికి బట్టలు లేకుండా పడుకోవడమంటే చాలా పెద్ద సాహసమనే చెప్పాలి. మరి ఈ కాలంలో నగ్నంగా నిద్రించడం వల్ల నిజంగానే అన్ని లాభాలున్నాయా చూసేద్దాం. ►శీతాకాలంలో వెచ్చదనాన్ని పొందడానికి పెద్ద పెద్ద దుప్పట్లను వేసుకొని నిద్రపోతుంటారు. అయితే వింటర్ సీజన్లో ఒంటిపై నూలిపోగు కూడా లేకుండా పడుకోవడం వల్ల బాగా నిద్రపట్టడంతో పాటు ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గుతుందట. ► రాత్రిపూట బిగుతుగా ఉండే బట్టలు ధరించడం వల్ల చాలా మందిలో రక్తనాళాలు దెబ్బతింటున్నాయి. దీని కారణంగా కొందరిలో అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అదే నగ్నంగా నిద్రపోవడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. ► నగ్నంగా నిద్రించడం వల్ల బాడీ టెంపరేచర్‌ను కూడా రెగ్యులేట్ చేస్తుందట. దీని వల్ల శరీరంలో అధిక చెమటను నివారించడంలో సహాయపడుతుంది ► వాతావరణ మార్పుల వల్ల కలిగే అనారోగ్యాలను ఎదుర్కొనే శక్తి సహజంగానే శరీరం సంతరించుకుంటుందట. ► నగ్నంగా పడుకోవడం వల్ల శరీరంలో ఆక్సిజన్, పోషకాల స్థాయిలు కూడా పెరుగుతాయి. దీనివల్ల చర్మం మృదువుగా, ఆరోగ్యంగా మారుతుందట.అంతేకాకుండా ముడతలు, వృద్దాప్య సంకేతాలను నివారిస్తుంది. ► నిద్రలేమి సమస్యకు కూడా ఇది మంచి పరిష్కారమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ► నగ్నంగా నిద్రించడం వల్ల మీరు ఎక్కువ కేలరీలను కూడా కరిగిస్తుంది. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. ► అంతేకాకుండా కొన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి కూడా శరీరాన్ని కాపాడుతుంది. ► నగ్నంగా నిద్రపోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. -
ఇలా చేస్తే..కేవలం 24 గంటల్లో జలుబును తగ్గించుకోవచ్చు
జలుబు వచ్చిందంటే ఓ పట్టాన వదలదు. ఇప్పటివరకు జలుబును తగ్గించేందుకు ఎలాంటి ఇన్స్టంట్ మెడిసిన్స్ లేవు. కొందరికి వారం రోజుల్లో తగ్గితే, మరికొందరికి నెల రోజులైనా తగ్గదు. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. పెద్దలకు ఏడాదిలో మూడు సార్లు, చిన్నపిల్లలకు అయితే ఏడాదిలో పది లేదా అంతకంటే ఎక్కువ సార్లు జలుబుతో బాధపడుతుంటారని ఓ అధ్యయనంలోవెల్లడైంది. ఎలాంటి మెడిసిన్స్ వాడకుండానే ఇంట్లోనే దొరికే వస్తువులతో కేవలం 24 గంటల్లో జలుబుకు చెక్ పెట్టొచ్చు ఇలా.. ►ఏ కాలంలో అయినా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చాలామంది చలికాలంలో సరిగా నీళ్లు తాగరు. ఇలా అస్సలు చేయకూడదు. జలుబు చేసినప్పుడు తేనెతో కలిపిన నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ► వేడి నీటిలో లేదా పాలలో ఒక టీ స్పూన్ పసుపు కలపి తాగండి. దీని వల్ల జలుబు, దగ్గు నుంచి మీకు ఉపశనం కలుగుతుంది. పసుపులో ఆంటీ బాక్టీరియల్ గుణాలు జలుబు, దగ్గు నుంచి కోలుకోవడంలో ఉపయోగపడతాయి. ► తేనె, నిమ్మరసం వాడటం వల్ల జలుబు, దగ్గు నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఒక చెంచాడు నిమ్మరసం, రెండు చెంచాల తేనెను వేడి నీళ్లు లేదా వేడి పాలలో కలిపి తాగండి. ► అల్లం టీ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. జలుబు, దగ్గు ఉన్న సమయంలో మీరు అల్లం టీ తాగితే రిలీఫ్ గా ఉంటుంది. దీని కోసం మీరు చేయాల్సిందల్లా కొన్ని అల్లం ముక్కలు తీసుకోని వాటిని నీటిలో లేదా పాలలో కలిపండి. తరువాత దాన్ని బాగా మరిగించి తాగండి. ► ఒక గ్లాసు నీళ్లలో పావు స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఉప్పు కలిపిన నీళ్లతో బాగా పుక్కిలిస్తే గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. జింక్ లాజెంజెస్ అనే పెప్పర్మెంట్స్ మార్కెట్లో దొరుకుతాయి. ఇవి జలుబును చాలా త్వరగా తగ్గించగలవు. ఇందులో బెర్రీ, లెమన్.. ఇలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అయితే మీరు యాంటీబయాటిక్స్ వాడితే మాత్రం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించి వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. గుమ్మడి గింజలు, పప్పు ధాన్యాలు, బాదం, చేపలు వంటి వాటిల్లోనూ జింక్ అధికంగా ఉంటుంది. జలుబులో వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. ► బీట్రూట్ జ్యూస్‌లో డైటరీ నైట్రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరపు నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాకుండా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. జలుబుతో బాధపడుతున్న 76మందిలో.. రోజుకు ఏడు కంటే ఎక్కువసార్లు బీట్రూట్ తాగిన వారిలో జలుబు లక్షణాలు తగ్గినట్లు ఓ అధ్యయనంలో తేలింది. ► టాబ్లెట్లల కంటే నాజిల్ స్ప్రేలు మెరుగ్గా పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి జలుబు తాలూకూ బాక్టీరియాను చంపి ఇన్స్టంట్ రిలీఫ్ ఇవ్వగలదు. వీటితో పాటు జలుబు అటాక్ అయినప్పుడు సాధ్యమైనంత వరకు గోరువెచ్చని నీళ్లే తాగితే బెటర్. ఇక అన్నింటి కంటే ముఖ్యమైనది విశ్రాంతి. ట్యబ్లెట్స్ వేసుకున్నా, హోమ్ రెమిడీలు ట్రై చేసినా సరైన విశ్రాంతి తీసుకున్నప్పుడే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. -
అందుకే ఆడవాళ్లకు ఎక్కువగా కీళ్లనొప్పులు.. తేలిగ్గా తీసుకోవద్దు
చలికాలం వచ్చిందంటే చాలు కీళ్ల నొప్పులు,ఒంటి నొప్పులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. చాలామందికి చలికాలంలో కీళ్ల నొప్పులతో లేచి నడవలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఇక ఉదయం పూట పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. కీళ్లు గట్టి పడిపోవడం, జాయింట్లు సహకరించకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు చలికాలంలో కీళ్ల నొప్పుల నుండి, ఒంటి నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు. చలికాలంలో వాతావరణంలోని చల్లదనానికి కీళ్లమధ్యలో ఉండే మృదువైన కార్టిలేజ్ కుచించుకుపోతుంది. చర్మం, కండరాలు బిగుసుకుపోతాయి. అందుకే చాలామందికి చలికాలంలో కీళ్ల సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఆడవాళ్లలో రక్తహీనత కారణంగా కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఈ సీజన్లో శరీరాన్ని వీలైనంత వెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కీళ్ల నొప్పులను తేలిగ్గా తీసుకోకూడదు. చలికాలంలో వచ్చే సాధారణ కీళ్ల నొప్పులను తగ్గించడానికి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా భుజాలు, తొడ కండరాలు గట్టిపడే వ్యాయామాలు చేస్తే కీళ్లపై ఒత్తిడి పడదు. అలాగే గంటల తరబడి కూర్చొని పనిచేసేవాళ్లు అప్పుడప్పుడు లేచి అటు ఇటు నడుస్తుండాలి. నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కోసం వేడినీళ్ల కాపడం, మసాజ్, ఫిజియోథెరపీ వ్యాయామాలు లాంటివి ఉపయోగపడతాయి. కీళ్ల అరుగుదల, కీళ్లవాతం లాంటి సమస్యలు ఉన్నవాళ్లు చలికాలంలో డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి. కీళ్లు మరీ వీక్‌గా ఉన్నవాళ్లు డాక్టర్ల సలహా మేరకు క్యాల్షియం, విటమిన్ డి మాత్రలు వేసుకోవచ్చు. ఇక వీటితో పాటు చలికాలంలో జంక్ ఫుడ్ తగ్గించి శరీరంలో వేడిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, విటమిన్–డి, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. కీళ్లను వెచ్చగా ఉంచుకునేందుకు మందపాటి బట్టలు వేసుకోవాలి. శరీరాన్ని చలికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. చలికాలంలో సూర్యరశ్మి శరీరానికి కావలసినంత అందకపోవడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. విటమిన్–డి లోపాన్ని తగ్గించుకోవడానికి విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం ఎంతో మంచిది. సల్ఫర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా కాస్త కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు బాధిస్తున్న వారు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటే మంచిది. నారింజ, క్యాబేజీ, బచ్చలికూర, టమోటాలు వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం మరీ మంచిది.చలికాలంలో మనకు తెలియకుండానే తక్కువ నీటిని తీసుకుంటాం కాబటి బాడీ డీహైడ్రేషన్ కు గురవుతుంది. దానివల్ల కీళ్ల నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. అందువల్ల అది గుర్తుంచుకుని కీళ్లనొప్పులతో బాధపడేవారు శరీరం డీ హైడ్రేట్ కాకుండా తగినంత నీటిని తాగడం మంచిది.