
Feet Care Tips: విటమిన్ ‘ఈ’ క్యాప్య్సూల్స్‌తో ఇలా.. పువ్వుల్లా పాదాలు!
Winter Feet Care Tips: కొందరికి పాదాలు విపరీతంగా పగిలి చూడటానికి వికారంగా కనిపిస్తాయి. అలాంటప్పుడు శరీరం తట్టుకోగలిగినంత వేడినీళ్లల్లో కొన్ని చుక్కల షాంపూ, కొద్దిగా నిమ్మరసం, టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి.
ఈ నీళ్లలో పాదాలను ఉంచి, పదినిమిషాల తరువాత పమిస్ స్టోన్ లేదా పాత టూత్ బ్రష్ తీసుకుని పాదాలనుంచి అరికాళ్ల దాకా నెమ్మదిగా రుద్ది కడగాలి. ఇలా చేయడం వల్ల పాదాలపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. కడిగిన పాదాలను తడిలేకుండా శుభ్రంగా తుడవాలి.
తెల్లగా ఉండే టూత్ పేస్టును అర టేబుల్ స్పూను తీసుకుని దానిలో రెండు విటమిన్ ఈ క్యాప్య్సూల్స్‌లోని మిశ్రమాన్ని వేసి రెండింటిని బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని పగుళ్లపై రాసి సున్నితంగా మర్దనా చేయాలి.
తరువాత సాక్సులు వేసుకుని పడుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు తగ్గి పువ్వుల్లా మృదువుగా ముద్దుగా తయారవుతాయి.
చదవండి: Legs Swelling Health Tips: ధనియాలను నీటిలో మరిగించి తాగారంటే...