Health Tips: Castor Oil Benefits For Skin And Hair - Sakshi
Sakshi News home page

Amudham Oil Benefits In Telugu: ఆముదంతో చర్మం, జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చిలా! 

Published Sat, Nov 20 2021 1:12 PM | Last Updated on Sat, Nov 20 2021 1:59 PM

Castor Oil Benefits For Skin And Hair In Telugu - Sakshi

Castor Oil Benefits for Skin and Hair: చలికాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. చర్మంతోపాటు జుట్టుకూడా పొడిబారుతుంది. దీంతో చుండ్రు సమస్య మొదలవుతుంది. ఇప్పటికే చుండ్రు ఉంటే సమస్య మరింత తీవ్రమవుతుంది. అయితే ఈ సమస్యలేవి రాకుండా ఉండాలంటే చలికాలం ఉన్నన్ని రోజులు జుట్టుకు ఆముదం పట్టిస్తే మంచిది. 

►టేబుల్‌ స్పూను ఆముదం, టేబుల్‌ స్పూను కొబ్బరి నూనెలను కలిపి వేడి చేసి గోరువెచ్చగా అయిన తరవాత మాడుకు పట్టించి పదినిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే..చుండ్రు తగ్గడంతోపాటు, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 


►పొడిబారిన చర్మానికి సైతం ఆముదం మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. బాడీ లోషన్స్‌కు బదులు ఆముదాన్ని రాసుకుంటే మరింత మంచిది. 
►గోరువెచ్చని ఆముదాన్ని పలుచగా ఉన్న కనుబొమ్మలకు రాసి రెండు నిమిషాలు మర్దన చేసి ఉదయం కడిగేయాలి. ఇలా కొన్నిరోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా కనిపిస్తాయి. 
►రాత్రి పడుకునే ముందు ఆముదాన్ని పెదవులకు రాసి మూడు నిమిషాలపాటు మర్దన చేయాలి. చిన్న బాక్స్‌లో ఆముదాన్ని పోసుకుని రోజులో అప్పుడప్పుడు లిప్‌బామ్‌లా రాసుకుంటూ ఉంటే పెదవులు మృదువుగా, పింక్‌ కలర్‌లోకి మారుతాయి. 

చదవండి: ఆ హార్మోన్‌ వల్లనే బరువు పెరుగుతారు..! యాలకులు, వెల్లుల్లి, కరివేపాకు, తేనె, మజ్జిగ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement