Castor oil
-
మట్టి + ఆముదం + కుంకుడు ద్రావణం: పంటలు పచ్చగా, నిండుగా!
పొలంలోని మట్టినే సేంద్రియ ఎరువుగా, పురుగులనునియంత్రించే ద్రావణం వాడి సత్ఫలితాలు పొందటం ద్వారా ఆరోగ్య దాయకమైన ద్రాక్ష, వరి తదితర పంటలు పండించిన ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి (సివిఆర్) మరో ద్రావణాన్ని రూ పొందించారు. మట్టి+ఆముదంతో పాటు కుంకుడు రసం కలిపి చల్లితే పంటలకు చీడపీడల నియంత్రణతోపాటు పెరుగుదల బాగుందని గుర్తించారు. ఈ ద్రావణాన్ని తయారు చేసి మొదట తన పెరట్లోని టొమాటో, మొక్కజొన్న పంటలపై ఆయన ప్రయోగించి చూశారు. కేవలం వారం నుండి 10 రోజుల్లోనే పంటలో విపరీతమైన మార్పును గమనించారు. అంతకు ముందు మొక్కజొన్న ఆకులను పురుగులు తినటం, పంట పసుపు పచ్చగా ఉన్నపుడు ఈ ద్రావణం పిచికారీ చేశారు. కేవలం వారం నుంచి పది రోజుల్లోనే ఆ పంట పచ్చదనంతో కళకళలాడుతూ, ఆకులు కూడా వెడల్పుగా రావటం అంటే పంటలో మంచి ఎదుగుదలను గమనించారు. మరి కొందరు రైతులు కూడా సత్ఫలితాలు సాధించటంతో ఈ ద్రావణం సామర్థ్యంపై సివిఆర్ నిర్థారణకు వచ్చారు.మట్టి, ఆముదం, కుంకుడు ద్రావణం తయారీ విధానంలోపలి మట్టి (బాగా జిగటగా ఉండే మట్టి) 10 కిలోలు (ఒక తట్టెడు) తీసుకొని, గడ్డలు చిదిపి మెత్తని మట్టిని సిద్ధం చేసుకోవాలి. ఆ మట్టిలో 250 మి.లీ. నుంచి 500 మి.లీ. వరకు ఆముదం కలపాలి. 250 నుండి 500 గ్రా. కుంకుడు కాయలు తీసుకొని కొంచెం నీటిలో వాటిని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వాటిని చేతితో పిసికి, విత్తనాలు తీసివేసి, పేస్టులాగా తయారు చెయ్యాలి. అలా తయారైన పేస్టును అంతకు ముందు రోజు ఆముదం కలిపి పక్కన పెట్టిన మట్టిలో వేసి, బాగా కలియ తిప్పాలి. ఈ మిశ్రమాన్ని 200 లీటర్ల నీటి డ్రమ్ములో వేసి కర్రతో బాగా కలపాలి. మట్టి మిశ్రమం అంతా నీటిలో బాగా కలిసిపోయిన తర్వాత కొద్దిసేపటికి నీటిలోని మట్టి రేణువులు నీటి అడుగుకు పేరుకుంటాయి. పైకి తేరుకున్న ద్రావణాన్ని వడకట్టి స్ప్రేయర్లలో పోసుకొని పంటపై పిచికారీ చెయ్యాలి. రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే మట్టి ద్రావణం నీటిలో కలిపిన తర్వాత 4 గంటల్లోగా వంటపై పిచికారీ చేయాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. ఆలన్యం అయితే ఆముదం ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది. కుంకుడుతో పచ్చదనం వస్తోంది!పైకి పురుగు కనిపిస్తూ ఉంటే గతంలో చెప్పినట్లు మట్టి 20 కిలోలు, ఆముదం పావు కిలో నుంచి అర కిలో వరకు కలిపిన ద్రావణం చల్లితే పురుగుల నియంత్రణ బాగుంటుంది. అయితే, పెరుగుదల ఉండేది కాదు. మొలకల ద్రావణం చల్లాల్సి వచ్చేది. ఇప్పుడు కుంకుడు రసం కలపటం వల్ల ఆ కొరత తీరి పచ్చదనం వస్తోంది. తెగుళ్లు నివారిస్తుంది. పురుగులను గుడ్లు పెట్టనివ్వదు. అనేక పంటల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఇది చల్లిన వారం, పది రోజుల్లోనే పంటలు ఆకుపచ్చని రంగులోకి మారి, గ్రోత్ వేగాన్ని అందుకుంటున్నది. మల్బరీ తప్ప ఏ పంటలోనైనా చల్లొచ్చు. పత్తి రైతులు కాయ పగలటానికి ముందు దశలోనే ఈ ద్రావణం వాడాలి. టొమాటోలో ఏ తెగుళ్లు, పురుగులూ రాలేదు. మిర్చిలో తామర పురుగు నియంత్రణకు మట్టి, ఆముదం, కుంకుళ్లతో పాటు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా కలిపి తయారు చేసిన ద్రావణం వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ద్రావణాన్ని వర్షాలు బాగా పడే రోజుల్లో వారానికోసారి చల్లాలి. ఇప్పటి నుంచి పది రోజులకోసారి చల్లితే సరిపోతుంది. ఇది చల్లిన 2 గంటల వరకు వర్షం పడకపోతే చాలు, పనిచేస్తుంది. – చింతల వెంకటరెడ్డి (98668 83336), పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆల్వాల్, సికింద్రాబాద్చాలా పంటలపై చల్లా.. రిజల్టు బాగుంది!మట్టి, ఆముదం, కుంకుడు రసం ద్రావణం వాడిన వారం రోజుల్లోనే చీడపీడల నియంత్రణతో పాటు పంటల్లో పెరుగుదల బాగా కనిపించింది. 10 కిలోల లోపలి మట్టికి 250 ఎంఎల్ ఆముదం కలిపి పెట్టుకోవాలి. కుంకుడు కాయలను గింజలతో ΄ాటు నలగ్గొట్టి, ఉడక బెట్టాలి. నానబెట్టిన దానికన్నా, కుంకుడు విత్తనాలు కూడా పగులగొట్టి ఉడకబెడితే మరింత ప్రయోజనం ఉంటుందని నాకు అనిపించింది. ఆ తెల్లారి కుంకుళ్లను పిసికి రసం తీసుకోవాలి. ఆముదం కలిపిన మట్టిలో ఈ కుంకుడు రసం కలిపి 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. పసుపు, మామిడి, నిమ్మ, అవకాడో, అరటి తదితర పంటలన్నిటిపైనా ఈ ద్రావణాన్ని పిచికారీ చేశాను. వారంలోనే గ్రోత్ చాలా కనిపించింది. నూనెలు చల్లితే గ్రోత్ వస్తుంది. ఇక్కడ ఆముదం వాడుతున్నందున గ్రోత్తోపాటు చీడపీడల నియంత్రణ కూడా జరుగుతుంది. మట్టి ద్వారా మినరల్స్ కూడా పంటకు అందుతున్నాయి. 12–15 రోజులకోసారి అన్ని పంటలపైనే పిచికారీ చేస్తున్నా. ఈ రెండు పిచికారీల మధ్య ఒకసారి వేపనూనె పిచికారీ చేస్తే పురుగుల గుడ్లు నశించి మరింత మెరుగైన ఫలితాలుంటాయి. – పడాల గౌతమ్ (98497 12341), ఎస్టేట్ మేనేజర్, రుషి వ్యాలీ స్కూల్, మదనపల్లిదివంగత సంజీవరెడ్డి సూచనలతో 2007 నుంచి మా 20 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. 2014లో ‘సాక్షి సాగుబడి’లో సివిఆర్ మట్టి ద్రావణం గురించి చదివినప్పటి నుంచి వంగ, సాంబారు దోస, పూల తోట, వేరుశనగ వంటి అన్ని పంటలకూ లోపలి మట్టి+ ఆముదం ద్రావణం వాడుతూ మంచి ఫలితాలు పొందుతున్నాను. సివిఆర్ కొత్తగా చెప్తున్నట్లు మట్టి, ఆముదంతోపాటు కుంకుడు రసం కూడా కలిపి పత్తి పంట 20 రోజుల దశలో రెండు నెలల క్రితం ఒకసారి, ఆ తర్వాత మరోసారి పిచికారీ చేశాను. పంట ముదురు ఆకుపచ్చగా బలంగా పురుగుల బెడద లేకుండా పెరిగింది. ఇప్పుడు పత్తి తీస్తున్నాను. ఇతర రైతులతో కూడా మట్టి ద్రావణం వాడిస్తున్నాం. – పి. గిరీష్ గౌడ్ (80732 45976), ఇనగలూరు,అగళి మండలం, సత్యసాయి జిల్లా -
వందేళ్లనాటి కాను(టు)క ఇది : ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
ఇంట్లో పసిపాప వస్తోంది అంటే చాలు అమ్మమ్మ, నానమ్మల హడావిడి మొదలవుతుంది. పొత్తిళ్లలో బిడ్డకు కావాల్సిన మెత్తటి బట్టలు సేకరించడం, పాపాయికి సౌకర్యంగా ఉండేలా పాత చీరలతో చేసిన బొంతలు తయారీ మొదలు, కాటుక, ఆముదం లాంటివి సిద్ధం చేసుకునేందుకు రడీ అయిపోయేవారు. సహజంగాఇంట్లోనే కాటుకునే తయారుచేసుకునే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పత్తి దారంతో కొద్దిగా వామ్ము గింజలు వేసి వత్తి తయారు చేసిన దాన్ని ఆవ నూనెలో ముంచి మట్టి ప్రమిదలో దీపం వెలిగించింది. దానిపై వెడల్పాటి మూతను పెట్టింది. వత్తి మొత్తం కాలి ఆ మసి అంతా పళ్లానికి అంటుకుంది. ఈ మసిని తీసి కాజల్( కాటుక)గా తయారు చేసింది. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఆముదం, నూలు బట్ట సహాయంతో తమ నాన్నమ్మ, అమ్మమ్మ ఇలానే చేసేది అంటూ నెటిజన్లు గుర్తు చేసు కున్నారు. ఇందులో కెమికల్స్ ఉండవు. పైగా చిన్నపిల్లలకు కంటికి శీతలం కూడా అని వ్యాఖ్యానించారు.సహజమైన పదార్థాలతో ఇంట్లో తయారు చేసుకున్న కాటుక అయితే అందమైన అమ్మాయి కళ్ళు మరింత విశాలంగా బ్రైట్‌గా, బ్యూటీఫుల్‌గా మెరిసి పోతాయి. కళ్ళకి కాటుక పెట్టుకోవడం వల్ల కంటిలోని ఎర్రటి చారలు తొలగిపోతాయి. పైగా కాటుక పెట్టుకోవడం వల్ల దుమ్ము, ధూళి కణాలు కళ్ళలో పడకుండా ఉంటుంది. Did you know this 100 years old technique of Kajal making? Ingredients: Cotton, Ajwain, Mustard Oil and Ghee… pic.twitter.com/K6rF6yRcal — Aparajite | ಅಪರಾಜಿತೆ (@amshilparaghu) April 15, 2024 నోట్: చాలావరకు డాక్టర్లు శిశువులకు కాటుక పెట్టవద్దని చెబుతారు. ఎందుకంటే రసాయనాలతో తయారు చేసిన కాటుకల వల్ల కంటి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుందనేది గమనించ గలరు. -
రోజూ ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి
కొంతమందికి కనుబొమలు బాగా పలుచగా, ఉండీ లేనట్టుగా కనిపిస్తాయి. కనుబొమలు తీరైన ఆకృతితో, దట్టంగా ఉంటేనే ముఖారవిందం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పలుచని కనుబొమ్మలను ఒత్తుగా... నల్లగా మార్చుకోవడానికి ఇలా ప్రయత్నించి చూడండి... ఆముదం: జట్టు పెరుగుదలకు దోహదపడే వాటిలో ఆముదం ముందు వరుసలో ఉంటుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, విటమిన్ ఇ, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. దూదిని ఆముదంలో ముంచి పలుచని ఐబ్రోస్ మీద అద్దుకుని ఐదు నిమిషాలు మర్దన చేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. ఉల్లిపాయ రసం: ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఉల్లిపాయ రసాన్ని రోజూ కనుబొమలకు రాసుకోవాలి. రెండు మూడు వారాల్లోనే చక్కని ఫలితం కనిపిస్తుంది. ఆలివ్ ఆయిల్ : ఫీనాలిక్ కాంపౌండ్స్ ఉండే ఆలివ్ నూనెను కనుబొమ్మలకు రాస్తే .. వెంట్రుకలు నల్లగా పెరుగుతాయి. -
రోజూ జుట్టుకు ఆముదం పట్టిస్తే చుండ్రు తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది!!
Castor Oil Benefits for Skin and Hair: చలికాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. చర్మంతోపాటు జుట్టుకూడా పొడిబారుతుంది. దీంతో చుండ్రు సమస్య మొదలవుతుంది. ఇప్పటికే చుండ్రు ఉంటే సమస్య మరింత తీవ్రమవుతుంది. అయితే ఈ సమస్యలేవి రాకుండా ఉండాలంటే చలికాలం ఉన్నన్ని రోజులు జుట్టుకు ఆముదం పట్టిస్తే మంచిది. ►టేబుల్ స్పూను ఆముదం, టేబుల్ స్పూను కొబ్బరి నూనెలను కలిపి వేడి చేసి గోరువెచ్చగా అయిన తరవాత మాడుకు పట్టించి పదినిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే..చుండ్రు తగ్గడంతోపాటు, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ►పొడిబారిన చర్మానికి సైతం ఆముదం మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. బాడీ లోషన్స్‌కు బదులు ఆముదాన్ని రాసుకుంటే మరింత మంచిది. ►గోరువెచ్చని ఆముదాన్ని పలుచగా ఉన్న కనుబొమ్మలకు రాసి రెండు నిమిషాలు మర్దన చేసి ఉదయం కడిగేయాలి. ఇలా కొన్నిరోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా కనిపిస్తాయి. ►రాత్రి పడుకునే ముందు ఆముదాన్ని పెదవులకు రాసి మూడు నిమిషాలపాటు మర్దన చేయాలి. చిన్న బాక్స్‌లో ఆముదాన్ని పోసుకుని రోజులో అప్పుడప్పుడు లిప్‌బామ్‌లా రాసుకుంటూ ఉంటే పెదవులు మృదువుగా, పింక్ కలర్లోకి మారుతాయి. చదవండి: ఆ హార్మోన్ వల్లనే బరువు పెరుగుతారు..! యాలకులు, వెల్లుల్లి, కరివేపాకు, తేనె, మజ్జిగ.. -
ఆముదం నూనె కలిపిన మట్టితో చీడపీడలకు చెక్
భూమి లోపలి నుంచి తీసి ఎండబెట్టిన 10 కిలోల మెత్తని మట్టి (సబ్ సాయిల్)కి అర లీటరు ఆముదం నూనెను బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని పంట మొక్కల పాదుల్లో లేదా డ్రిప్పర్ల వద్ద పిడికెడు వేసి నీరు అందిస్తే ఆ పంటలకు ఇక చీడపీడల బెడద అసలు ఉండదని రుజువైందని ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట రెడ్డి (సీవీఆర్) తెలిపారు. మొక్క నాటిన/విత్తిన పది రోజులకు మొదటిసారి, అక్కడి నుంచి 15–20 రోజులకు మరోసారి పిడికెడు వేస్తే చాలు. వంగ, టమాటో, బెండ, బీర వంటి పంటలతోపాటు పత్తి, వరి, గోధుమ పంటల్లో సైతం ఈ ప్రయోగం సఫలమైందన్నారు. వంగ వంటి కూరగాయ పంటలకు పురుగు బెడద ఎక్కువ. భూమి లోపలి నుంచి తీసిన మట్టిని ఎండబెట్టి వంగ మొక్కల పాదుల వద్ద వేయడంతోపాటు, ఆ మట్టిని నీటిలో కలిపి 4–5 రోజులకోసారి పిచికారీ చేయటం ద్వారా వంగ పంటలో చీడపీడలు రాకుండా చూసుకోవచ్చని సీవీఆర్ గతంలో చెప్పారు. ఇటీవల లోపలి మట్టికి ఆముదం నూనె కలిపి పాదుల్లో లేదా డ్రిప్లర్ల దగ్గర వేస్తే పచ్చ దోమ, తెల్ల దోమ వంటి రసంపీల్చే పురుగులతోపాటు కాయ తొలిచే పురుగు కూడా ఆయా మొక్కల దరిదాపుల్లోకి రావటం లేదని గుర్తించారు. మొక్కల పెరుగుదల బాగా ఉందని, దిగుబడి కూడా బాగా వచ్చిందని సీవీఆర్ వివరించారు. ఆముదం నూనెను వాడేటప్పుడు ఎమల్సిఫయర్ ద్రావణాన్ని కలపటం పరిపాటి అని అంటూ.. లోపలి మట్టే ఎమల్సిఫయర్‌గా పనిచేస్తోందని.. ఆముదం నూనె వాసనకు చీడపీడలు దరిచేరటం లేదని గుర్తించానని వివరించారు. ఆముదం నూనె కలిపిన మట్టి మిశ్రమం వేసిన తర్వాత కుళ్లింపజేసే పశువుల ఎరువు, ఘనజీవామృతం, వర్మీకంపోస్టు వంటి సేంద్రియ ఎరువులను చెట్ల దగ్గర వేయకూడదని రైతులు గమనించాలన్నారు. అలా వేస్తే మట్టిలో కలిపి వేసిన ఆముదం నూనె (చీడపీడలను తరిమేసే) ప్రభావాన్ని కోల్పోతుందన్నారు. అదేవిధంగా, ద్రవ జీవామృతం, గోకృపామృతం, వేస్ట్ డీకంపోజర్)ను ఆముదం నూనె కలిపిన మట్టి మిశ్రమంపై పోయటం లేదా డ్రిప్ ద్వారా అందించడం కూడా చేయవద్దని సీవీఆర్ హెచ్చరించారు. అయితే, వీటిని ఆయా పంటలపై పిచికారీ చేసుకోవచ్చని సూచించారు. 10 కేజీల భూమి లోపలి నుంచి తీసిన మెత్తని పొడి మట్టికి పావు లీటరు ఆముదం నూనె, మరో పావు లీటరు వేప/కానుగ నూనెను కలిపి కూడా వేసుకోవచ్చని సీవీఆర్ సూచించారు. ఆముదం నూనె కలిపిన మట్టి మిశ్రమం 200 గ్రాములను 20 లీటర్ల నీటిలో కలిపి పంటలపై వారానికోసారి పిచికారీ చేయటం మరీ మంచిదని సీవీఆర్ తెలిపారు. చింతల వెంకట రెడ్డి -
అముదం నూనెతో అద్భుత ప్రయోజనాలు
కాస్టర్ ఆయిల్(ఆముదం నూనె).. ఆముదం చెట్టు గింజల నుంచి లభించే ఈ నూనె ఎన్నో సమస్యలకు నివారణిగా పనిచేస్తోంది. చర్మంతో పాటు జుట్టుకు సంబంధించిన అనేక రకరకాల సమస్యలను దూరం చేయడంలో ఆముదం పాత్ర అగ్రస్థానం. మృదువైన శిరోజాలు సొంతం కావాలంటే... ఆముదం వల్లే సాధ్యం. ఇందులో రిసినోలిస్ యాసిడ్ సంవృద్ధిగా ఉంటుంది, ఇది యాంటీఇన్ఫ్లమేటరి, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది అందమైన శరీరానికి దోహదం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకునేందుకు బాగా పనిచేస్తాయి. గుండె జబ్బులు, విషజ్వరం, కుష్ఠు, దురద, వాపు, నులిపురుగులు, మలమూత్ర సంబంధ సమస్యలను సులువుగా నివారిస్తుంది. (అందానికి తెలుపు అవసరం లేదు) తేమను పునరుద్ధరిస్తుంది: ఆముదం నూపె సహజమైన తేమను కలిగి ఉంటుంది. ఇది గాలి నుంచి తేమను చర్మంలోకి లాగగలదు, చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇది చర్మం బయటి పొర ద్వారా తేమను నిలుపుకుంటుంది. ఆముదం నూనెలో ఉండే అధిక స్నిగ్ధత కారణంగా ఈ నూనె కొద్దిగా చిక్కగా ఉండి ఒక రకమైన వాసన వస్తుంటుంది. అయితే ఇది చర్మం మీద మందపాటి పొరను ఏర్పరచి, తేమను లాక్ చేస్తుంది. మీద చర్మంపై మందపాటి, రక్షిత పొరను ఏర్పరుస్తుంది. దీని ద్వారా డస్ట్ చర్మలోపలి పొరల్లోకి వెళ్లకుండా అడ్డకుంటుంది. (బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఈ ఒక్కటి చేస్తే చాలు) మొటిమలతో పోరాడుతుంది: ఆముదం నూనె యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది, మొటిమలు, బ్లాక్ హెడ్స్ రాకుండా ఉండేందుకు, లేదా తగ్గించేందుకు పనిచేస్తుంది. జుట్టు రాలడం అరికడుతుంది: ఆముదం నూనె జుట్టు రాలడాన్ని అరికట్టి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో బెస్ట్ హోం రెమెడీ . ఉత్తమ ఫలితాలను పొందడానికి వారానికొకసారి ఆముదంను తలకు పట్టించాలి.జుట్టు బాగా రాలుతున్నప్పుడు ఇలా చేయొచ్చు... నాలుగు చెంచాల చొప్పున కొబ్బరినూనె, ఆముదం సమపాళ్లలో తీసుకుని అందులో నాలుగు చుక్కల నిమ్మరసం, గుడ్డులోని తెల్ల సొన కలిపి... తలకు పూతలా వేసుకోవాలి. ఓ గంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేస్తే....జుట్టు రాలకుండా ఉంటుంది. చర్మం ముడత నుంచి కాపాడుతుంది: ఆముదం నూనెలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి రాసుకుంటే చర్మం పగలకుండా ఉంటుంది. మృదువుగా మారుతుంది. ముడతలను నివారిస్తుంది. చర్మ సౌందర్యం పెరుగుతుంది. (ఆరోగ్యానికే కాదు.. అందానికీ ఔషధమేమే) జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది : ఆముదంలో ఉండే రిసినోలిక్ యాసిడ్ హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది. ఇది తలలో పిహెచ్ లెవల్ ను బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే తలలో నేచురల్ ఆయిల్స్ కోల్పోకుండా సహాయపడుతుంది. డల్ మరియు డ్యామేజ్ హెయిర్‌ను నివారించడంలో ఇది ప్రముఖ పాత్రం పోషిస్తుంది. ఆముదం నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ జుట్టుకు నేచురల్ షైనింగ్, స్ట్రాంగ్ నెస్‌ను అందిస్తుంది. అందువల్లే, ఆముదం నూనె అనేక జుట్టు సమస్యలను ఎదుర్కోగలుగుతుంది. ఆముదంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి. మన శరీరంలో పలు హార్మోన్లు సక్రమంగా పనిచేయాలంటే అందుకు కొవ్వు పదార్థాలు సరిగ్గా జీర్ణం కావాలి. అయితే ఆముదాన్ని సేవిస్తే ఆ కొవ్వు పదార్థాలు శరీరంలో బాగా ఇమిడిపోతాయి. దీంతో హార్మోన్లు సక్రమంగా పనిచేస్తాయి. హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది. జీవక్రియలు మెరుగుపడతాయి. ఇదిలా ఉండగా.. ఆముదం ఎన్ని మంచి గుణాలనుకలిగి ఉన్నప్పటికీ అందరికీ సరిపోదు. కొందరికి మంచి ఫలితాలను ఇచ్చిప్పటికీ అందిరిపై ఒకే ప్రభావాన్ని చూపించదు. కొంతమందికి ఎలర్జీని తెచ్చిపెడుతుంది. ఆముదము నూనె మందంగా ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో మొటిమలకు కారణం అవుతుంది. మొఖంపై జిడ్డు చేరి ఆకర్షణ తగ్గుతుంది. -
ఆముదం ధరలు పైపైకి?
ముంబై: ఆముదం గింజల ఉత్పత్తి క్షీణిస్తూ ఎగుమతులు వృద్ధి చెందుతుండడంతో నూనె ధరలు పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. 2011-12లో వీటి ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరగ్గా ఆ తర్వాత వరుసగా రెండేళ్లూ ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. 2011-12లో 4 లక్షల టన్నులు, తర్వాతి ఏడాది 4.30 లక్షల టన్నుల ఆముదం నూనె ఎగుమతి అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్ - డిసెంబర్) 3.70 లక్షల టన్నులు ఎగుమతి అయిన నేపథ్యంలో ఏడాది మొత్తమ్మీద 4.6 లక్షల టన్నులు ఎగుమతి కావచ్చని అంచనా. నూనె ఎగుమతులు పెరుగుతున్నాయంటే, అంతకుముందు నిల్వచేసిన గింజలను గానుగ ఆడుతున్నట్లే లెక్క. అంటే, ఆముదం గింజల నిల్వలు తగ్గిపోతున్నాయన్నమాట. ఆముదం నూనె ఉత్పత్తి, ఎగుమతుల్లో ప్రపంచంలోనే 90 శాతం వాటాతో భారత్ అగ్రస్థానంలో ఉంది. భవిష్యత్‌పై ఆశలు... ఆముదం గింజల ఉత్పత్తి గణాంకాలపై పరిశ్రమ వర్గాల్లో ఏకాభిప్రాయం లేదు. ఉత్పత్తి తగ్గుతోందన్నది మాత్రం స్పష్టం. ఆముదం మార్కెట్ ఫండమెంటల్స్ పటిష్టమవుతున్నాయని ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన గ్లోబల్ కేస్టర్ కాన్ఫరెన్సులో వక్తలు పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిన నేపథ్యంలో ఆముదం ధరలు గణనీయంగా పెరుగుతాయని అంచనా. దీంతో ఆముదం రైతులకు మేలు జరగనుంది. సబ్బులు, పెయింట్లు, రెసీన్, వార్నిష్, లూబ్రికెంట్లు, ప్లాస్టిసైజర్ తదితరాల తయారీలో ఆముదాన్ని విరివిగా వినియోగిస్తారు. గతేడాది చైనాకు 2.30 లక్షల టన్నులు, యూరప్‌నకు 1.30 లక్షల టన్నులు, అమెరికాకు 45 వేల టన్నుల ఆముదం నూనె ఎగుమతి అయింది. వివిధ దేశాలకు ఆముదం నూనె ఎగుమతి ద్వారా 85 కోట్ల డాలర్ల (సుమారు రూ.5 వేల కోట్లు) విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్ ఆర్జిస్తోంది. దేశీయ ఎగుమతిదార్ల మధ్య అనారోగ్యకరమైన పోటీ నెలకొని ఉండడంతో ఆముదం నూనెకు తగిన ధరను పొందలేకపోయామని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.