
బంకబంకగా జిగురుగా ఉండే ఆముదం చూడగానే ముట్టుకోవడానికి ఇష్టపడం.. కానీ ఇది అందానికి, కురుల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్య పరంగా కూడా ఎంతో మేలు. దీన్ని సంప్రదాయ వైద్య విధానంలో కూడా ఉపయోగిస్తారు. అన్ని ప్రయోజనాలని అందించే ఈ ఆముదం నూనెని జుట్టు, చర్మం సంరక్షణ కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
టేబుల్ స్పూను ఆముదం, టేబుల్ స్పూను కొబ్బరి నూనెలను కలిపి వేడి చేసి గోరువెచ్చగా అయిన తరవాత మాడుకు పట్టించి పదినిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే.. చుండ్రు తగ్గడంతోపాటు, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
పొడిబారిన చర్మానికి సైతం ఆముదం మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. బాడీ లోషన్స్‌కు బదులు ఆముదాన్ని రాసుకుంటే మరింత మంచిది.
గోరువెచ్చని ఆముదాన్ని పలుచగా ఉన్న కనుబొమ్మలకు రాసి రెండు నిమిషాలు మర్దన చేసి ఉదయం కడిగేయాలి. ఇలా కొన్నిరోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా కనిపిస్తాయి.
రాత్రి పడుకునే ముందు ఆముదాన్ని పెదవులకు రాసి మూడు నిమిషాలపాటు మర్దన చేయాలి. చిన్న బాక్స్‌లో ఆముదాన్ని ΄ోసుకుని రోజులో అప్పుడప్పుడు లిప్‌బామ్‌లా రాసుకుంటూ ఉంటే పెదవులు మృదువుగా, పింక్ కలర్‌లోకి మారతాయి.
- క్లెన్సర్లు, లోషన్లు, సౌందర్య సాధనాలలో విస్తృతంగా ఈ ఆముదాన్ని ఉపయోగిస్తారు.
- దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు కాలిన గాయాలు, ప్రెజర్ అల్సర్లు, డయాబెటిక్ అల్సర్లు, శస్త్రచికిత్సా గాయాలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది.
- ఇది జుట్టును లూబ్రికేట్ చేయడంలో సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. ఇందులోని ఒలీక్, లినోలిక్ యాసిడ్ రక్త ప్రసరణను పెంచి మీ జుట్టును బలంగా, మృదువుగా మార్చుతాయి.
(చదవండి: బీపీ-హైబీపీకి మధ్య తేడా ఏంటి..? వంశపారపర్యంగా వస్తుందా..?)
Comments
Please login to add a commentAdd a comment