'అందం అమ్మాయైతే నీలా ఉంటుందే...' అనేలా ఉంటుంది కాజల్ అగర్వాల్. చందమామలాంటి మోముతో చూడముచ్చటగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లితో హీరోయిన్ల కథ కంచికి అనుకుంటారు. కానీ కాజల్ విషయం అందుకు విరుద్ధం. పెళ్లై ఓ బిడ్డకు తల్లైనా ఇప్పటకీ అంతే గ్లామర్‌తో కట్టిపడేస్తుంది. పైగా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో కాజల్ ఇంతలా గ్లామర్‌ని మెయింటైన్ చేసేందుకు ఏం చేస్తుందో, అలాగే ఫిట్‌గా ఉండేందుకు ఎలాంటి డైట్ ఫాలో అవుతుందో సవివరంగా తెలుసుకుందామా..!
కాజల్ అందం, ఫిట్‌నెస్ గురించి అభిమానుల్లో ఎల్లప్పడూ చర్చనీయాంశమే. ఆమె ఇప్పటికీ అలానే ఉందంటూ మాట్లాడుకుంటుంటారు. పెళ్లైతే ఎలాంటి హీరోయిన్ల క్రేజ్ అయినా తగ్గిపోతుంది. కానీ కాజల్ విషయంలో నో ఛాన్స్ చెప్పేస్తున్నారు అభిమానులు. అంతలా సహజ సౌందర్యంతో మైమరిపించే కాజల్ ఓ ఇంటర్వ్యూలో తన అందం, ఫిటెనెస్‌ల సీక్రెట్ గురించి షేర్ చేసుకుంది.
అందం కోసం..
కాజల్ తప్పనిసరిగా మాయిశ్చరైజింగ్, సన్‌స్క్రీన్, హైడ్రేషన్ నైట్ సిరమ్‌లు తప్పనిసరిగా వాడతానని అంటోంది. అవి తన చర్మాన్ని ప్రకాశంతంగా కనిపించేలా చేస్తాయని తెలిపింది. స్కిన్ గ్లో కోసం ప్రత్యేకమైన కేర్ తీసుకుంటానంటోంది.
ఫిట్‌నెస్ కోసం..
ఎంత బిజీ షెడ్యూల్ అయినా వ్యాయామాలు, యోగా, వర్కౌట్‌లు స్కిప్ చేయనని చెబుతోంది. సినిమా షూటింగ్‌లు, కుటుంబానికి సంబంధించిన కమిట్‌మెంట్స్ ఉన్నా సరే..రోజువారి దినచర్యలో భాగమైన వ్యాయామాలను చేసే తీరతానని అంటోంది. అలాగే ప్రతిరోజు కనీసం 30-40 నిమిషాలు పైలెట్స్ చేసేలా లక్ష్యం పెట్టుకుంటానని చెబుతోంది.
డైట్ కోసం..
సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇస్తానంటోంది. తాజా పండ్లు, ఆకుకూరలు, కొబ్బరి నీళ్లు, రోజువారీ డైట్‌లో తప్పనిసరి అని చెబుతోంది. పైగా పండ్ల సహజ చక్కెరలతో తక్షణ శక్తి, ఆకుకూరల ద్వారా పోషకాలు, నట్స్ ద్వారా అవసరమైన కొవ్వులు అందుతాయని చెబుతోంది.
కొబ్బరి నీరు తన దినచర్యలో భాగమని అంటోంది. ఇది తనను హైడ్రేటెడ్‌గా ఉంచడమే గాక రిఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది. తాను ఎలాంటి మోడ్రన్ డైట్‌లు ఫాలోకానని తేల్చి చెప్పింది. ఆరోగ్యకరమై డైట్‌తో ఫిట్‌గా, అందంగా ఉండేలా కేర్ తీసుకుంటానని పేర్కొంది కాజల్.
(చదవండి: ఏడు పదుల వయసులోనూ ఎంతో చలాకీగా, ఫిట్‌గా శక్తికపూర్..! హెల‍్త్ సీక్రెట్ ఇదే..)
Comments
Please login to add a commentAdd a comment