రోజూ ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి | Tips To Grow Thicker And Black Eyebrows Fastly | Sakshi
Sakshi News home page

రోజూ ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి

Published Thu, Aug 10 2023 10:44 AM | Last Updated on Thu, Aug 10 2023 10:49 AM

Tips To Grow Thicker And Black Eyebrows Fastly - Sakshi

కొంతమందికి కనుబొమలు బాగా పలుచగా, ఉండీ లేనట్టుగా కనిపిస్తాయి. కనుబొమలు తీరైన ఆకృతితో, దట్టంగా ఉంటేనే ముఖారవిందం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పలుచని  కనుబొమ్మలను ఒత్తుగా... నల్లగా మార్చుకోవడానికి ఇలా ప్రయత్నించి చూడండి...

ఆముదం: జట్టు పెరుగుదలకు దోహదపడే వాటిలో ఆముదం ముందు వరుసలో ఉంటుంది. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు, విటమిన్‌ ఇ, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్‌ జుట్టు పెరుగుదలను  ప్రోత్సహిస్తాయి. దూదిని ఆముదంలో ముంచి పలుచని ఐబ్రోస్‌ మీద అద్దుకుని ఐదు నిమిషాలు మర్దన చేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.



ఉల్లిపాయ రసం: ఉల్లిపాయలో ఉండే సల్ఫర్‌ జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఉల్లిపాయ రసాన్ని రోజూ కనుబొమలకు రాసుకోవాలి. రెండు మూడు వారాల్లోనే చక్కని ఫలితం కనిపిస్తుంది.

ఆలివ్‌ ఆయిల్‌ : ఫీనాలిక్‌ కాంపౌండ్స్‌ ఉండే ఆలివ్‌ నూనెను కనుబొమ్మలకు రాస్తే .. వెంట్రుకలు నల్లగా పెరుగుతాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement