Olive Oil
-
రోజూ ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి
కొంతమందికి కనుబొమలు బాగా పలుచగా, ఉండీ లేనట్టుగా కనిపిస్తాయి. కనుబొమలు తీరైన ఆకృతితో, దట్టంగా ఉంటేనే ముఖారవిందం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పలుచని కనుబొమ్మలను ఒత్తుగా... నల్లగా మార్చుకోవడానికి ఇలా ప్రయత్నించి చూడండి... ఆముదం: జట్టు పెరుగుదలకు దోహదపడే వాటిలో ఆముదం ముందు వరుసలో ఉంటుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, విటమిన్ ఇ, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. దూదిని ఆముదంలో ముంచి పలుచని ఐబ్రోస్ మీద అద్దుకుని ఐదు నిమిషాలు మర్దన చేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. ఉల్లిపాయ రసం: ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఉల్లిపాయ రసాన్ని రోజూ కనుబొమలకు రాసుకోవాలి. రెండు మూడు వారాల్లోనే చక్కని ఫలితం కనిపిస్తుంది. ఆలివ్ ఆయిల్ : ఫీనాలిక్ కాంపౌండ్స్ ఉండే ఆలివ్ నూనెను కనుబొమ్మలకు రాస్తే .. వెంట్రుకలు నల్లగా పెరుగుతాయి. -
Hair Care Tips: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే!
Hair Care Tips In Telugu: ఉల్లి లేని కూరలను.. ఉప్పు లేని పప్పు చారుతో పోల్చుతారు కొంతమంది. ఎందుకంటే ఉల్లి వల్ల వంట రుచికరంగా ఉండడంతోపాటు ఆరోగ్యానికీ ఎంతో మేలు. అలాగే. ఉల్లి వల్ల జుట్టుకు కూడా ఎంతో మంచిదని ఇటీవల కాలంలో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ►ఉల్లి రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. ముఖ్యంగా ఇది జుట్టును ఊడిపోకుండా కాపాడుతుంది. అందుకు ఏం చేయాలంటే..? ►ఉల్లిని మెత్తగా గ్రైండ్ చేసి.. దాన్నుంచి రసాన్ని తీసి.. ఒక గిన్నెలో నిల్వ చేసి కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు రాసుకుంటూ ఉండాలి. ►ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ►ఈ నూనెను గోరువెచ్చగా వేడి చేసు రాసుకున్నా మంచిదే. ఈ నూనె బట్టతల సమస్యలు రాకుండా కాపాడుతుంది. మెరిసే జుట్టును సొంతం చేసుకునేందుకు ఇలా చేయండి తేనె, ఆలివ్ ఆయిల్.. ►టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీస్పూన్ నిమ్మరసం కలపాలి. ►ఈ మిశ్రమాన్ని కోడిగుడ్డులోని తెల్లసొనని వేసి కలపాలి. ►దీనిని కుదుళ్ల నుంచి జుట్టుకి పట్టించాలి. ►20 నిమిషాల తరువాత తల స్నానం చేయాలి. కరివేపాకుతో.. ►కప్పు కొబ్బరినూనె, ఒక కప్పు ఆవాల నూనె కలపాలి. ►ఈ మిశ్రమంలో ఒక కప్పు కరివేపాకుల్ని వేసి రాత్రంతా నానబెట్టాలి. ►మరుసటి రోజు ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి చిన్న మంట పై వేడి చేయాలి. ►కరివేపాకు కాస్త వేగగానే నూనె మిశ్రమంలోంచి తీసేయాలి. ►ఆ తరువాత దింపేసి మూడు కర్పూరం బిళ్లలు వేయాలి. ►చల్లారిన తరువాత నూనె మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి జుట్టుకంతా పట్టించి రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు తలస్నానం చేయా లి. ►ఇలా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చదవండి: Health Tips: కాలీఫ్లవర్, క్యారెట్లు, బీట్రూట్, పుట్టగొడుగులు అతిగా తింటే అంతే సంగతులు! కాస్త.. -
Beauty Tips: పంచదార, తేనె, ఆలివ్ ఆయిల్, నిమ్మ.. దెబ్బకు జిడ్డు వదులుతుంది!
వర్షాకాలంలో పేరుకుపోయిన మృతకణాలతో ముఖం జిగటగా ఉంటుంది. ఈ జిగటను తొలగించే స్క్రబ్‌ను ఇంట్లోనే అత్యంత సులువుగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం... ►కప్పు పంచదారలో టీస్పూను తేనె, అరటీస్పూను నిమ్మరసం, టీస్పూను ఆలివ్ ఆయిల్ వేసి కలపాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసి ఆరిన తర్వాత సున్నితంగా మర్దన చేసి నీటితో కడిగేయాలి. ►వారంలో రెండు సార్లు ఈ స్క్రబ్ అప్లై చేయడం వల్ల జిగటపోయి ముఖచర్మం ఆరోగ్యంగా, కాంతిమంతంగా కనిపిస్తుంది. సహజమైన క్లెన్సర్స్ ►ముఖం మరీ మురికిగా అనిపిస్తే పాలు, మీగడ, పెరుగు, మజ్జిగ ఏది అందుబాటులో ఉంటే దానిని పట్టించి మెల్లగా రుద్దాలి. ఇవి సహజమైన క్లెన్సర్స్. ►మార్కెట్లో దొరికే క్లెన్సింగ్ మిల్క్‌కు బదులుగా వీటిని వాడవచ్చు. ►రోజూ మామూలుగా ముఖాన్ని శుభ్రం చేస్తున్నప్పటికీ దుమ్ముకణాలు చర్మం లోపలి గ్రంథుల్లోకి వెళ్లి చర్మానికి పట్టేస్తాయి. ►అలాంటప్పుడు కూడా ఈ క్లెన్సర్‌ను వాడవచ్చు. చదవండి: Health Tips: ఇవి తరచుగా తింటే ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది! అంతేకాదు.. -
Hair Care: హెయిర్ స్ట్రెయిటనింగ్.. కొబ్బరి నీళ్లు, ఆలివ్ ఆయిల్ ఉంటే చాలు!
Hair Straightening Tips Without Using Heat: రసాయనాలు ఎప్పుడూ జుట్టు సహజత్వాన్ని కోల్పోయేలా చేస్తాయి. అందుకే ఎటువంటి రసాయనాలు, స్ట్రెయిటనింగ్ యంత్రాలు వాడకుండా రింగులు తిరిగిన కురులను సహజసిద్ధంగా స్ట్రెయిటనింగ్ ఎలా చేసుకోవచ్చో చూద్దాం... ►రింగుల జుట్టుని స్ట్రెయిట్‌గా మార్చేందుకు... కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలపాలి. ►ఈ నీటిని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి నలభై నిమిషాలు ఆరనివ్వాలి. ►తరువాత చల్లటినీళ్లు, సాధారణ షాంపుతో తలస్నానం చేయాలి, వారానికి ఒకసారి ఇలా చేయాలి. ఇలా కూడా చేయొచ్చు! ►ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెలో ఆలోవెరా జెల్ వేసి చక్కగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి నలభై నిమిషాల పాటు ఆరనివ్వాలి. ►తరువాత సల్ఫేట్ లేని షాంపుతో తలస్నానం చేయాలి. వీటిలో ఏ ఒక్క పద్ధతిని అయినా క్రమం తప్పకుండా అనుసరిస్తే రింగులు తిరిగిన జుట్టు స్ట్రెయిట్‌గా మారి మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చదవండి: Hair Care Tips: వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉల్లిపాయ రసం, కొబ్బరి నూనెతో దీపిక పదుకోణ్ ఒత్తయిన జట్టు వెనుక రహస్యమిదే..! -
Hair Care: చిన్నపాటి చిట్కాలు పాటిస్తే.. మృదువైన జుట్టు మీ సొంతం!
ప్రతి ఒక్కరూ ఒత్తైన, మెరిసే, సిల్కీ హెయిర్ కోసం ఆరాటపడుతుంటారు. కానీ జట్టు ఒత్తుగా ఉన్నప్పుడు చిక్కబడి విపరీతంగా విసిగిస్తుంటుంది. ఎక్కడికైనా అర్జంటుగా వెళ్లాల్సి వచి్చనప్పుడు తల దువ్వుకోవాలన్నా, ఏదైనా సరికొత్త హెయిర్ స్టైల్ చేసుకుందామన్నా అస్సలు కుదరదు. చిక్కులు పడే కురులను చిన్నపాటి చిట్కాల ద్వారా మృదువుగా మార్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం.. ►తలస్నానం చేసిన చేసిన తరువాత సాధారణంగా మందమైన టవల్ లేదా బట్టతో తలను గట్టిగా తుడుచుకుంటూ ఉంటారు. దానికి బదులు పలుచటి వస్త్రంతో తలను మృదువుగా తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ చిక్కుపడదు. ప్రతి మూడు నెలలకోసారి స్ప్లిట్ ఎండ్స్ తీసేసి, జుట్టును ట్రిమ్ చేయాలి. జుట్టుకు పోషకాలనందించే స్పాను తప్పనిసరిగా నెలకోసారి చేసుకోవాలి. ►దీర్ఘకాలికంగా బాధిస్తున్న చిక్కులకు కెరాటిన్ ట్రీట్మెంట్ కూడా బాగా పనిచేస్తుంది. దీనివల్ల జుట్టు మృదువుగా మారడమేగాక మెరుపుని సంతరించుకుంటుంది. ►ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల సీరమ్‌లు దొరుకుతున్నాయి. వీటిలో మీ జుట్టుకు నప్పే సీరమ్‌ను వాడడం వల్ల కూడా కురులు మృదువుగా మారతాయి. ►సల్ఫేట్ తక్కువగా ఉండే షాంపు వాడడం వల్ల జుట్టు ఎక్కువ చిక్కుపడదు. ►చర్మసంరక్షణలో వాడే గ్లిజరిన్ కేశాల సమస్యలకు మంచి పరిష్కారం చూపుతుంది. గ్లిజరిన్‌ను జుట్టుకు కండీషనర్‌లా పట్టిస్తే.. కురులు పొడిబారడం తగ్గి మృదుత్వాన్ని సంతరించకుంటాయి. ►మార్కెట్లో దొరికే హెయిర్ మాస్క్‌లు కాకుండా ఇంట్లో తయారు చేసుకున్న మాసు్కలు జుట్టును పదిలంగా ఉంచుతాయి. తేనె, ఆలివ్ ఆయిల్‌లను హెయిర్ మాస్్కగా వాడితే స్ప్లింట్ ఎండ్స్, చిక్కులు పడడం తగ్గుతుంది. ►ఆలివ్ ఆయిల్, తేనెను సమపాళల్లో తీసుకుని మైక్రో వేవ్‌లో 30 సెకన్ల పాటు ఉంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి కొద్దిగా మజ్జిగ కలిపి జుట్టుకు పట్టించాలి. అరగంటపాటు ఆరనిచ్చి సాధారణ షాంపూతో కడిగేయాలి. ►మనం పడుకునేటప్పుడు తలకింద పెట్టుకునే దిండు కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందువల్ల దిండు కవర్ సిల్క్‌తో తయారైనదిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే కాటన్ దిండు కవర్ వల్ల వెంట్రుకలు పొడిబారతాయి. ►ఇవన్నీ పాటిస్తే జుట్టు చిక్కులు పడడం తగ్గుతుంది. చదవండి: Hair Care: తెల్ల జట్టు సమస్యా.. హెన్నా పెడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే! -
ఇలా తలస్నానం చేయండి!
నూనెతో మర్దన: గోరువెచ్చని కొబ్బరినూనె లేదా నువ్వులనూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను మాడుకు, కుదుళ్లకు పట్టించి మర్దన చేయాలి. తర్వాత జుట్టుకంతా నూనె రాయాలి. ఆవిరితో మెరుగు: టర్కీ టవల్‌ను వెచ్చని నీటిలో ముంచి, పిండి, తలకు చుట్టాలి. దీంతో రక్తప్రసరణ మెరుగై కుదుళ్లు చురుకు అవుతాయి. ఈ విధంగా నెలకు ఒకసారైనా జుట్టుకు ఆవిరిపట్టాలి. దీని వల్ల వెంట్రుకల రాలడం సమస్య తగ్గుతుంది. ఆరబెట్టేదిలా: జుట్టు తడిలేకుండా త్వరగా ఆరాలని డ్రయ్యర్‌ని ఉపయోగించవద్దు. మెత్తటి కాటన్ లేదా టర్కీ టవల్ని ఉపయోగించడమే మంచి మార్గం. తలకు టవల్ చుట్టి కాసేపు వదిలేయాలి. తడిని టవల్ పీల్చుకుని, జుట్టు పొడిగా అవుతుంది. ►జుట్టు మెరవాలని హెయిర్ స్ప్రేలు వాడకూడదు. వీటి వల్ల వెంట్రుకలు సహజత్వాన్ని కోల్పోయి, మరింత పొడిబారుతాయి. వెంట్రుకలు చిట్లే సమస్య కూడా పెరుగుతుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే శిరోజాలు ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటాయి. బ్యూటిప్స్ -
చుండ్రు నివారణకు
►వేప నూనె, ఆలివ్ ఆయిల్ సమపాళ్లలో కలిపి వేడి చేయాలి. గోరువెచ్చని ఈ నూనెను తలకు పట్టించి వేళ్లతో మృదువుగా మర్దనా చేయాలి. 15 నిమిషాల తర్వాత రసాయనాల గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ►చిన్న అల్లం ముక్కను సన్నగా తరగాలి. ఈ ముక్కలను నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత కుదుళ్లకు నూనె పట్టేలా మర్దనా చేయాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు తగ్గుతుంది.. ►ఆపిల్ సైడర్ వెనిగర్‌లో అరటిపండు గుజ్జును బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి పది నిమిషాల తర్వాత వెచ్చని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. ►కప్పు నీళ్లలో 2–3 టేబుల్ స్పూన్ల ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ►బేబీ ఆయిల్‌ను తలకు పట్టించి, మర్దనా చేసి వెచ్చని నీళ్లలో ముంచి తీసిన టర్కీ టవల్ని చుట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత చుండ్రు నివారణకు ఉపయోగించే షాంపూతో తలస్నానం చేయాలి. ►కలబంద గుజ్జును మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. కలబంద చుండ్రును నివారించడమే కాకుండా మాడుపైన దురద వంటి చర్మ సమస్యలనూ నివారిస్తుంది. వెంట్రుకలకు మృదుత్వాన్ని ఇస్తుంది. -
నిగారింపు ఇలా సొంతం
చర్మ సంరక్షణకు ఏ సౌందర్య ఉత్పాదనలు వాడాలనే సందేహం చాలా మందికి ఉంటుంది. కానీ, ఇంట్లో రోజూ తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలతోనే చర్మం నిగారింపును కాపాడుకోవచ్చు. ►కళ్ల కింద ఉబ్బు, వలయాలు ఏర్పడటం వంటివి గమనిస్తే.. రాత్రి పడుకునే ముందు వేలితో తేనె అద్దుకొని కళ్ల కింద ఉబ్బుగా ఉన్న చోట రాయాలి. అలాగే ముఖమంతా తేనె రాసి, మృదువుగా రుద్దాలి. తేనె మరీ జిడ్డుగా అనిపిస్తే టీ స్పూన్ నీళ్లు కలిపి రాయాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే చర్మకాంతి పెరుగుతుంది. ►రోజూ రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్లో ముంచిన దూది ఉండతో ముఖమంతా రాయాలి. అదే ఉండతో కాస్త ఒత్తిడి చేస్తూ మసాజ్ చేయాలి. దీంతో ముఖంపైన దాగున్న దుమ్ము కణాలు, శుభ్రపరిచినా మిగిలిన మేకప్ డస్ట్ సులువుగా వదిలిపోతుంది. ఆ తర్వాత ముఖాన్ని ఫేస్‌వాష్‌తో శుభ్రపరుచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మం నిగారింపు పెరుగుతుంది. -
హెయిర్ కేర్
రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ అంతే మొత్తం కొబ్బరి నూనెలో గుడ్డు సొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించాలి. మృదువుగా మసాజ్ చేయాలి. ఈ మిశ్రమం వెంట్రుకలకు మంచి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. కుదుళ్లు బలంగా అవుతాయి. దీంతో వెంట్రుక పెరుగుదల బాగుంటుంది. ♦ వెంట్రుకలు చిట్లడం, చుండ్రు సమస్యలు ఉంటే జుట్టు రాలడం కూడా ఎక్కువే ఉంటుంది. ఈ సమస్య నివారణకు కొబ్బరినూనెలో కొన్ని కరివేపాకులు వేసి వేడిచేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. రాత్రిపూట ఇలా చేసి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ♦ ఆలివ్ ఆయిల్, దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ప్రతి మూడు రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. -
జుట్టుకు ఉసిరి నూనె
ఎండకాలంలో వేడి, దుమ్ముకు శిరోజాల ఆరోగ్యం, అందం దెబ్బ తింటుంది. వెంట్రుక కుదుళ్లకు సరైన పోషణ లభించి, నిగనిగలను కాపాడుకోవాలంటే... ►కొబ్బరి నూనె – ఉసిరి నూనె సమపాళ్లలో తీసుకొని, మాడుకు పట్టేలా రాసుకోవాలి. వారంలో రెండు సార్లయినా ఈ నూనెను తలకు పట్టించి,. మరుసటి రోజు పొద్దున తలస్నానం చేయాలి. ►పచ్చికొబ్బరిని మెత్తగా రుబ్బి, పాలు పిండి తీయాలి. ఈ పాలను వెంట్రుక కుదుళ్లకు పట్టేలా మాడుకు, జుట్టు మొత్తానికి పట్టించాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఈవిధంగా చేస్తుంటే వెంట్రుకల మృదుత్వం దెబ్బతినకుండా ఉంటుంది. ►తేనెలో ఆలివ్ ఆయిల్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. వారానికి ఒకసారైనా ఈ విధంగా చేస్తే వెంట్రుకల సహజసిద్ధమైన నూనెలు కోల్పోకుండా ఉంటాయి. రసాయనాల గాఢత తగ్గి వెంట్రుకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ►మాడు ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తుంది చుండ్రు. చుండ్రును నియంత్రణలో ఉంచుకోవడానికి ఇంటి చిక్సితలు పాటిస్తూనే చర్మవైద్యులు చెప్పే సూచనలు పాటించాలి. ►పిండి పదార్థాలతో పాటు పీచు ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు.. వంటి పోషకాహారాన్ని సమంగా తీసుకోవాలి. ►వేసవిలో 2–3 లీటర్ల నీళ్లు తాగడం తప్పనిసరి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలటం సమస్య తగ్గుతుంది. -
జుట్టు చిట్లుతుంటే...
కేశాలకు తగినంత పోషణ, నూనె లేనప్పుడు వీటికి తోడుగా ఎక్కువ వేడి తగులుతున్నట్లయితే చివర్లు చిట్లుతాయి. ఇలాంటప్పుడు హెయిర్ డ్రయర్లు వాడకపోవడమే మంచిది. కనీసం వారానికి ఒక రోజు చిట్లిన చివర్లను కత్తిరించుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఒక టేబుల్ స్పూను ఆముదాన్ని గోరువెచ్చగా చేసి తలకు, జుట్టు చివర్ల వరకు పట్టించి, ఉదయం తలస్నానం చేయాలి. ఒక టీ స్పూను ఆముదం, అంతే మోతాదులో ఆవనూనె, ఆలివ్ ఆయిల్ కలిపి తలకు పట్టించి మర్దన చేసి జుట్టుకంతటికీ చివరి వరకు పట్టించాలి. తరువాత వేడి నీటిలో ముంచిన టవల్‌ను తలకు చుట్టి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. బ్లెమిషెస్ పోవాలంటే.. ముఖం మీద ఉన్న మచ్చలు పోవాలంటే నిమ్మకాయ బాగా పని చేస్తుంది. ప్యాక్‌ల కోసం టైం కేటాయించలేని వాళ్లు వంటలోకి పిండిన నిమ్మచెక్కను తిరగేసి ముఖానికి రుద్ది పది నిమిషాల తర్వాత చన్నీటితో కడిగితే చాలు. క్రమంగా మచ్చలు చర్మంలో కలిసిపోతాయి.నిమ్మచెక్కను రసం పిండేసిన తర్వాత వెనక్కి తిప్పి చక్కెరలో అద్ది ముఖానికి మర్దన చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే నల్లమచ్చలు, యాక్నె, పింపుల్స్ అన్నీ పోయి ముఖం క్లియర్‌గా మారుతుంది.రెండు టీ స్పూన్ల పెసరపిండిలో చిటికెడు పసుపు కలిపి అందులో రెండు చుక్కల నిమ్మరసం, ఒక స్పూను పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. ప్రతిరోజూ ఈ ప్యాక్ వేస్తుంటే నెల రోజులకు ముఖంలో ఊహించని మార్పు చోటుచేసుకుంటుంది. -
ఆలివ్ ఆయిల్‌తో...
ఆలివ్ ఆయిల్ కేశాల నుంచి, కాలి గోళ్ల వరకు సౌందర్యాన్ని ఇనుమడించడంలో బాగా ఉప యోగపడుతుంది. దీనిని మేకప్ రిమూవ్ చేయడానికి కూడా వాడవచ్చు.ఆలివ్ ఆయిల్ చక్కటి హెయిర్ కండిషనర్‌గా పని చేస్తుంది. ఒక టేబుల్ స్పూను గోరువెచ్చని ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేస్తే పొడిబారిన కేశాలు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. ఏ హెయిర్ స్టయిల్ వేసుకోవాలన్నా సాధ్యమవుతుంది. జుట్టు చక్కగా అమరుతుంది. వారానికి ఒకసారి తలకు ఆయిల్ మసాజ్ చేస్తుంటే కేశాలతోపాటు శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది.ఇది మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. శీతా కాలంలో ఆలివ్ ఆయిల్‌ను రోజువారీ వాడకంలో భాగం చేసుకోవచ్చు. ఒక టీ స్పూను ఆయిల్ తీసుకుని అందులో దూదిని ముంచి ముఖాన్ని తుడిస్తే శరీరం విడుదల చేసే టాక్సిన్లతోపాటు బయటి నుంచి పడిన దుమ్ము, ధూళి వంటివి పూర్తిగా తొలగిపోతాయి. సహజమైన మాయిశ్చరైజర్‌గా పని చేసి చర్మాన్ని పొడిబారనివ్వదు. ఒంటిని ఆలివ్ ఆయిల్‌తో మర్దన చేసిన తర్వాత వేడినీటితో స్నానం చేయాలి. గాఢత తక్కువగా ఉన్న సబ్బును మాత్రమే వాడాలి. ఫేషియల్ మసాజ్‌కు వాడే క్రీమ్‌లకు బదులుగా ఆలివ్ ఆయిల్‌ను వాడడం మంచిది. మసాజ్ పూర్తయి ముఖం కడిగిన తర్వాత పన్నీటిలో దూదిని ముంచి ముఖానికి, మెడకు పట్టించి ఆరేవరకు అలాగే ఉంచాలి. -
ఆలివ్ ఆయిల్‌తో లవ్లీ స్కిన్
రెండు–మూడు టేబుల్స్పూన్ల ఆలివ్ ఆయిల్‌ను గోరువెచ్చగా చేసి ఒంటికి పట్టించి మర్దన చేసుకుని అరగంట తర్వాత స్నానం చేయాలి.ఒక టేబుల్ స్పూను ఆలివ్ ఆయిల్లో ఒక కోడిగుడ్డు సొన, కొద్దిగా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో కడగాలి. ఈ ప్యాక్ పొడి చర్మానికి చక్కటి మాయిశ్చరైజర్. పొడి చర్మం కలిగిన వారయితే వారానికి కనీసం నాలుగుసార్లు, సాధారణ చర్మానికయితే వారానికి ఒకటి– రెండు సార్లు ఈ ప్యాక్ వేస్తే పగుళ్లు రాకుండా చర్మం మృదువుగా ఉంటుంది. కొన్ని రకాల ప్యాక్‌లు, చర్మం మీద గాయాలున్నప్పుడు మినహాయించాల్సి ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌లోని చర్మరక్షణ గుణాలు చిన్నచిన్న గాయాలను, చర్మ సమస్యలను కూడా తగ్గిస్తాయి కాబట్టి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. మస్కారా పొడిబారినట్లయితే అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేస్తే తిరిగి మామూలుగా వస్తుంది.రెండు టీ స్పూన్ల చక్కెరలో అంతే మోతాదులో ఆలివ్ ఆయిల్ కలిపి చేతులకు పట్టించి రుద్దినట్లయితే మృతకణాలు తొలగిపోవడంతోపాటు మృదువుగా మారి చర్మం మెరుస్తుంది.అరకప్పు ఆలివ్ ఆయిల్లో పావుకప్పు వెనిగర్, పావుకప్పు నీటిని కలిపి రాత్రి పడుకునే ముందు ముఖం, మెడ, చేతులకు పట్టిస్తే నిర్జీవంగా ఉన్న చర్మం కాస్తా ఉదయానికి కాంతులీనుతుంది. ఈ మిశ్రమాన్ని ఒకసారి తయారుచేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుని నాలుగైదు రోజులపాటు వాడుకోవచ్చు. మిశ్రమాన్ని పట్టించే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. -
ఆలివ్‌నూనెతో మధుమేహానికి అడ్డుకట్ట
న్యూయార్క్ : మధుమేహానికి ఆలివ్‌నూనె వాడటం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అందులో ఉండే ‘ఒలెరోపిన్’ సమ్మేళనం ఎక్కువ ఇన్సులిన్ స్రవించేలా శరీరానికి సాయం చేసి, మధుమేహాన్ని అడ్డుకుట్టుందని అమెరికాలోని వర్జీనియా పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ అండ్ స్టేట్ యూనివర్సిటీ (వర్జీనియా టెక్) పరిశోధకులు తెలిపారు. ఆలివ్‌నూనెలో ఉండే ఆయుర్వేద గుణాలు రోగ క్రిమినాశకంగా పనిచేస్తాయని వెల్లడించారు. అలాగే వందలాది ఏళ్ల నుంచి మధ్యధరా సముద్ర తీర ప్రాంతాల్లో ఆలివ్ నూనెను వంటల్లో వినియోగిస్తున్నారు. వంటల్లో ఆలివ్ నూనెను ఉపయోగించడం వల్ల చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది. అలాగే సౌందర్య సాధనంగా ఆలివ్ ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. మరో సింపుల్ టిప్ ఏంటంటే... రాత్రి పడుకునేముందు అరటిపండు గుజ్జులో ఆలివ్ ఆయిల్ కలిపి, ముఖానికి మసాజ్ చేసుకుంటే ముడతలు రావు. -
గోరంత పోషణ
బ్యూటిప్స్ గోళ్లు పొడిబారకూడదు: గోరు పొడిబారడం అనేది దేహారోగ్యం మీద, సౌందర్య పోషణ మీద ఆధారపడి ఉంటుంది. దేహంలో అన్ని రకాల పోషకాలు సమతులంగా ఉంటే గోరు ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. అయితే ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే... కొందరిలో చేసే పనుల రీత్యా గోళ్లు పొడిబారుతుంటాయి. అలాంటప్పుడు... రోజూ ఉదయం, రాత్రి గోళ్ల మీద ఒక చుక్క ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె వేసి మునివేళ్లతో గోళ్లను వలయాకారంగా మర్దనా చేయాలి. గాయాలను నిర్లక్ష్యం చేయకూడదు: గోళ్లకు సౌందర్య పోషణతోపాటు గోళ్లు, చిగుళ్ల గాయాలకు చికిత్స కూడా చాలా అవసరం. గోళ్లు కత్తిరించేటప్పుడు కానీ మరే ఇతర కారణాలతోనైనా గోరు చిగురు దగ్గర చీలిపోతుంది. దానికి తేనె చక్కటి ఔషధం. గాయాన్ని కడిగి, తడి తుడిచిన తర్వాత అరచేతిలో నాలుగు చుక్కల తేనె వేసుకుని గాయానికి పట్టించాలి. ఇలా ఇరవై నిమిషాల పాటు గాయానికి తేనె తగులుతూ ఉంటే ఇక గాయానికి ఇన్ఫెక్షన్ చేరదు. గోళ్లు విరిగిపోతుంటే: గోళ్లు గరుకుగా మారిపోవడం, పెళుసుబారి మధ్యలో విరిగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే... నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి అందులో గోళ్లను ముంచాలి. అలాగే 15 – 20 నిమిషాల సేపు ఉంచిన తర్వాత గోళ్లను నూనెలో నుంచి తీయాలి. కారుతున్న నూనెను మాత్రం తుడిచి గోళ్లను సబ్బుతో కడగకుండా అలాగే ఉంచాలి. ఒకటి– రెండు రోజులు నెయిల్ పాలిష్ వేయకుండా గోళ్లకు గాలి తగలనివ్వాలి. గోళ్లకు నొప్పి లేకపోయినప్పటికీ, అవి దేహంలో ప్రాణం ఉన్న ఇతర భాగాల వంటివే. కొద్దిగానైనా సరే వాటికి గాలి అందాలి, పోషకాలు అందాలి, రక్తప్రసరణ కావాలి, సంరక్షణ కావాలి. -
డ్రై కేర్... పొడి చర్మానికి చికిత్స
బ్యూటిప్స్ పొడి చర్మానికి రకరకాల ఫేస్‌ప్యాక్‌లు వేయడం కంటే సింపుల్‌గా ఆయిల్ థెరపీ ఇస్తే చాలు. చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి బాదం నూనె కాని ఆలివ్ ఆయిల్ కాని రాయాలి. ముఖంతోపాటు పాదాలు, అరచేతులు, మోచేతుల వంటి చర్మం పొడిబారి గట్టిపడిన ప్రదేశాల్లో కూడా ఆయిల్ రాయాలి. ఆయిల్ రాయడానికి ముందు చర్మం మీద దుమ్ము, ధూళి లేకుండా సబ్బుతో కడగాలి. రోజూ పదినిమిషాల సేపు హాట్‌థెరపీ ఇస్తే చర్మంలోని నూనెగ్రంథులు ఉత్తేజితమై పొడి చర్మానికి స్వాంతన çకలుగుతుంది. హాట్ థెరపీ చాలా సింపుల్... గోరువెచ్చటి నీటిని దోసిట్లోకి తీసుకుని ముఖాన్ని నీటిలో మునిగేటట్లు ఉంచాలి. ఇదే హాట్‌థెరపీ. ఉదయం స్నానం చేయడానికి ముందు ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి చేస్తే చాలు. ప్యాక్‌ల విషయానికి వస్తే... ఒక కోడిగుడ్డు సొనలో, ఒక టీ స్పూన్ కమలారసం, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, నాలుగైదు చుక్కల పన్నీరు, అంతే మోతాదులో నిమ్మరసం బాగా కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి.బాగా మగ్గిన అరటిపండును మెత్తగా చిదిమి ముఖానికి, మెడకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడగాలి. ఇది పొడిచర్మానికి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది, మెడ మీద చర్మం నల్లగా ఉంటే క్రమంగా ఆ నలుపు కూడా వదులుతుంది. పొడిచర్మాన్ని మృదువుగా మార్చడంలో గ్రేప్సీడ్ ఆయిల్ బాగా పని చేస్తుంది. దేనితోనూ కలపాల్సిన అవసరం లేకుండా ఆయిల్‌ను యథాతథంగా ఒంటికి రాసి మర్దన చేస్తే చాలు. ఇది ఇప్పుడు అన్ని సూపర్మార్కెట్లలోనూ దొరుకుతోంది.పొడిచర్మం తీవ్రంగా బాధిస్తున్నప్పుడు... అనేక రకాల కాంబినేషన్లతో ప్యాక్‌లు తయారు చేసుకోవడానికి సాధ్యం కాకపోతే చర్మానికి స్వచ్ఛమైన ఆముదం కాని అవొకాడో ఆయిల్ కాని రాసి మర్దన చేయాలి. -
గోరు... అనిపించకూడదు బోరు..!
నెయిల్ జిగేల్ గోళ్లు మరీ బలహీనంగా ఉంటే వాటిని నీళ్లతో తడిపి గోరువెచ్చని ఆలివ్ ఆయిల్లో రోజు విడిచి రోజు 20 నిమిషాల పాటు ఉంచితే బలంగా తయారవుతాయి. మ్యానిక్యూర్ చేయించేప్పుడు ఒక్కోసారి బ్యుటీషియన్స్ గోటి క్యూటికిల్ కూడా తీసేస్తారు. ఇలా చేయడం సరికాదు. దీనివల్ల ఒక్కోసారి ఇన్ఫెక్షన్లు రావచ్చు. వారానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు నెయిల్ పాలిష్ తీసేసి మళ్లీ వేసుకోవడం సరికాదు. అంటే... వారానికి ఒకసారి ఒక్క నెయిల్ పెయింట్ మాత్రమే వేసుకోవడం ఆరోగ్యకరం. మీ గోళ్లకు స్వాభావికమైన మెరుపు రావాలంటే వాటిపై పెట్రోలియమ్ జెల్లీ పూసి, పాలిష్ చేసినట్లుగా ఒక పొడి గుడ్డతో బఫ్ చేయాలి. గోళ్లకు సబ్బు తగిలి ఉంటే అవి పెళుసుగా మారిపోతాయి. కాబట్టి స్నానం చేసిన వెంటనే, లేదా చేతులు శుభ్రం చేసుకున్న వెంటనే వాటికి తగిలి ఉన్న సబ్బు పోయేలా కడిగి పొడిగుడ్డతో శుభ్రం చేసుకోవాలి. గోరు ఆరోగ్యం కోసం బ్రాకోలీ, చేపలు, ఉల్లి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. మంచి నీళ్లు ఎక్కువగా తాగుతూ, ఆకుపచ్చని కూరలు తీసుకుంటూ ఉంటే గోరు మరింత ఆరోగ్యంగా ఉంటుంది. -
ఆయిల్‌తో చర్మం కాంతివంతం
బ్యూటిప్స్ కొబ్బరి నూనె – అర కప్పు అలోవెరా ఆకు – సగం ఉల్లిపాయలు – రెండు ఉసిరిపొడి – రెండు టీ స్పూన్లు శీకాయ పొడి – రెండు టీ స్పూన్లు పాత్రలో కొబ్బరి నూనె సన్నని మంట మీద పెట్టాలి. దీంట్లో ఆమ్లా పౌడర్, శీకాకాయ్ పౌడర్ ఒకదాని తరవాత ఒకటి వేసి కలపాలి. రెండు నిమిషాల తరవాత కాగుతున్న నూనె మిశ్రమంలో ఆలోవెరా ఆకును చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. మిశ్రమం మరుగుతుండగా ఉల్లిపాయ ముక్కలు వేసి అయిదు నిమిషాలు మరిగించి దింపేయాలి. నూనె మిశ్రమం చల్లారిన తరవాత బాటిల్లో నిల్వ చేసుకోవాలి. అవసరమయినప్పుడు ఈ మిశ్రమం బాడీకంతటికీ పట్టించాలి. 30 నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి ఒక్కసారి చేస్తే శరీరం కాంతివంతం అవుతుంది. గమనిక: కొబ్బరినూనెకు బదులుగా ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, బాదం నూనెలను కూడా ఉపయోగించవచ్చు. -
పట్టులాంటి జుట్టు కోసం...
బ్యూటిప్స్ ఒక పాత్రలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టీ స్పూన్ నిమ్మరసం, కోడిగుడ్డు సొన ఒకదాని తరువాత ఒకటి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల దగ్గర నుండి చివరి వరకూ పట్టించి ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి.తలంటుకునే ముందు షాంపూలో కొద్దిగా వెనిగర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కురులకంతటికీ పట్టించి పది నిమిషాల తరువాత తల స్నానం చేయాలి.వారంలో ఒక్కసారయినా టీ డికాషన్ తో జుట్టుని కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. పెరుగు కదుళ్ల నుండి జుట్టుకంతటికీ పట్టించి పది నిమిషాలయ్యాక తల స్నానం చేస్తే పట్టులా Ðð‡ురుస్తుంది. -
సహజ సౌందర్యం
బ్యూటిప్స్ ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బాదం నూనె కాని, ఆలివ్ ఆయిల్ కాని ముఖానికి, చర్మం పొడిబారిన ప్రదేశాల్లోనూ రాయాలి. ఆయిల్ అప్లయ్ చేసే ముందు మురికి, దుమ్ము లేకుండా చర్మం శుభ్రంగా ఉండాలి. పొడిచర్మాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. దోసిట్లో నీళ్లు తీసుకుని ముఖాన్ని నీటిలో మునిగేటట్లు ఉంచాలి. ఇలా రోజూ పది నిమిషాల సేపు ముఖానికి హాట్‌వాటర్ థెరపీ చేయాలి. ఒక కోడిగుడ్డు సొనలో, ఒక టీ స్పూన్ కమలారసం, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, నాలుగైదు చుక్కల పన్నీరు, అంతే మోతాదులో నిమ్మరసం తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. పొడిచర్మానికి ఈ ప్యాక్ మంచి ఫలితాన్నిస్తుంది. పొడిచర్మాన్ని మృదువుగా మార్చడంలో గ్రేప్సీడ్ ఆయిల్ బాగా పని చేస్తుంది. దేనితోనూ కలపాల్సిన అవసరం లేకుండా ఆయిల్‌ను ఒంటికి రాసి మర్దన చేస్తే సరిపోతుంది. బాగా మగ్గిన అరటిపండును మెత్తగా చిదిమి, ముఖానికి, మెడకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇది పొడిచర్మానికి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది, మెడనల్లగా ఉంటే క్రమంగా ఆ నలుపును వదిలిస్తుంది. పొడిచర్మం తీవ్రంగా బాధిస్తున్నప్పుడు అనేక రకాల కాంబినేషన్లతో ప్యాక్‌లు తయారు చేసుకోవడానికి సాధ్యం కాకుంటే స్వచ్ఛమైన ఆముదం కాని, అవొకాడో ఆయిల్ కాని రాసి మర్దన చేయాలి. -
సహజ సౌందర్యం
బ్యూటిప్స్ ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బాదం నూనె కాని ఆలివ్ ఆయిల్ కాని ముఖానికి, చర్మం పొడిబారిన ప్రదేశాల్లోనూ రాయాలి. ఆయిల్ అప్లయ్ చేసే ముందు మురికి, దుమ్ము లేకుండా చర్మం శుభ్రంగా ఉండాలి. పొడిచర్మాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. దోసిట్లో నీళ్లు తీసుకుని ముఖాన్ని నీటిలో మునిగేటట్లు ఉంచాలి. ఇలా రోజూ పది నిమిషాల సేపు ముఖానికి హాట్‌వాటర్ థెరపీ చేయాలి. ఒక కోడిగుడ్డు సొనలో, ఒక టీ స్పూన్ కమలారసం, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, నాలుగైదు చుక్కల పన్నీరు, అంతే మోతాదులో నిమ్మరసం తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. పొడిచర్మానికి ఈ ప్యాక్ మంచి ఫలితాన్నిస్తుంది. పొడిచర్మాన్ని మృదువుగా మార్చడంలో గ్రేప్సీడ్ ఆయిల్ బాగా పని చేస్తుంది. దేనితోనూ కలపాల్సిన అవసరం లేకుండా ఆయిల్‌ను ఒంటికి రాసి మర్దన చేస్తే సరి. ఇది పొడిచర్మానికి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది, మెడ నల్లగా ఉంటే క్రమంగా ఆ నలుపును వదిలిస్తుంది. -
ఆలివ్ ఆయిల్ మసాజ్
బ్యూటిప్స్ పొడిబారి, జీవం లేనట్టుగా ఉండే జుట్టుకు గోరువెచ్చని ఆలివ్ నూనె ఎంతో మేలుచేస్తుంది. అర కప్పు ఆలివ్ ఆయిల్ (లేదా మీ జుట్టుకు తగినంత) వేడి చేయాలి. చల్లారాక వేళ్లతో అద్దుకొని, జుట్టు కుదుళ్లకు పట్టించాలి. దువ్వెనతో కుదుళ్ల దగ్గర నుంచి కిందవరకు దువ్వాలి. ఆ తర్వాత షవర్ క్యాప్ లేదా టవల్‌ను తలకు చుట్టాలి. అలా రాత్రి మొత్తం ఉంచవచ్చు. మరుసటి రోజు ఉదయం రసాయనాల గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టుకు జీవకళ వస్తుంది. కొబ్బరి నూనెతోనూ ఇలాగే చేయవచ్చు. పొడిబారిన మాడు దురద కూడా పెడుతుంటుంది. ఈ సమస్యకు విరుగుడుగా అర కప్పు ఆలివ్ ఆయిల్లో 2 టీ స్పూన్ల తేనె కలిపి మాడుకు పట్టించాలి. వేడి నీళ్లలో ముంచిన టవల్ని గట్టిగా పిండి, దానిని తలకు చుట్టాలి. (భరించగలిగేంటతటి వేడి మాత్రమే ఉండాలి) 15 నిమిషాల తర్వాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. అర కప్పు వేడి చేసిన ఆలివ్‌ను తలకు పట్టించి, 2-3 గంటల తర్వాత తలస్నానం చేయాలి. చివర్లో 3-4 టీ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన మగ్గు నీళ్లతో తలంతా తడపాలి. పది నిమిషాల తర్వాత మంచి నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కురులు, మాడుపై చర్మం మృదువుగా మారుతుంది. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. -
లవ్లీ స్కిన్ కోసం ఆలివ్ ఆయిల్
బ్యూటిప్స్ రెండు-మూడు టేబుల్స్పూన్ల ఆలివ్ ఆయిల్‌ను గోరువెచ్చగా చేసి ఒంటికి పట్టించి మర్దన చేసుకుని అరగంట తర్వాత స్నానం చేయాలి. ♦ ఒక టేబుల్ స్పూను ఆలివ్ ఆయిల్లో ఒక కోడిగుడ్డు సొన, కొద్దిగా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో కడగాలి. ఈ ప్యాక్ పొడి చర్మానికి చక్కటి మాయిశ్చరైజర్. ఈ కాలంలో పొడి చర్మం కలిగిన వారయితే వారానికి కనీసం నాలుగుసార్లు, సాధారణ చర్మానికయితే వారానికి ఒకటి- రెండు సార్లు ఈ ప్యాక్ వేస్తే పగుళ్లు రాకుండా చర్మం మృదువుగా ఉంటుంది. ♦ కొన్ని రకాల ప్యాక్‌లు, చర్మం మీద గాయాలున్నప్పుడు మినహాయించాల్సి ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌లోని చర్మరక్షణ గుణాలు చిన్నచిన్న గాయాలను, చర్మ సమస్యలను కూడా తగ్గిస్తాయి కాబట్టి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ♦ మస్కారా పొడిబారినట్లయితే అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేస్తే తిరిగి మామూలుగా వస్తుంది. ♦ రెండు టీ స్పూన్ల చక్కెరలో అంతే మోతాదులో ఆలివ్ ఆయిల్ కలిపి చేతులకు పట్టించి రుద్దినట్లయితే మృతకణాలు తొలగిపోవడంతోపాటు మృదువుగా మారి చర్మం మెరుస్తుంది. ♦ అరకప్పు ఆలివ్ ఆయిల్లో పావుకప్పు వెనిగర్, పావుకప్పు నీటిని కలిపి రాత్రి పడుకునే ముందు ముఖం, మెడ, చేతులకు పట్టిస్తే నిర్జీవంగా ఉన్న చర్మం కాస్తా ఉదయానికి కాంతులీనుతుంది. ఈ సీజన్లో ఇది మంచి ట్రీట్మెంట్. ఈ మిశ్రమాన్ని ఒకసారి తయారుచేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుని నాలుగైదు రోజులపాటు వాడుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని పట్టించే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. -
రెప్పలకు ఆలివ్... ముఖానికి ఆరంజ్...
మగువ కళ్లకు మరింత అందాన్ని చేకూర్చేవి ఆమె ఐ లాషెస్ (కనురెప్ప వెంట్రుకలు). అవి పొడవుగా ఉంటే వచ్చే అందం అంతా ఇంతా కాదు. అలాంటి ఐ లాషెస్ మీ సొంతం కావాలంటే ప్రతిరోజూ పడుకునే ముందు కనురెప్ప వెంట్రుకలకు ఆలివ్ ఆయిల్ కానీ ఆముద నూనెను కానీ తేలిగ్గా రాసుకోవాలి. ఇలా క్రమంగా చేస్తే ఐ లాషెస్ ఒత్తుగా, పొడవుగా పెరుగుతాయి. నారింజ తొక్కలను ఎండబెట్టి వాటిని పొడిగా చేసుకొని ముఖారవిందం మెరుపుకోసం ఉపయోగించడం అందరికీ తెలుసు. కానీ ఎంతమందికి అలా చేసే సమయం ఉంటుంది చెప్పండి? కాబట్టి సులువైన చిట్కాతో మీ ముఖానికి తేజస్సును ఇవ్వండి. తాజా నారింజ తొక్కలను నీళ్లలో ఉడక పెట్టండి. తర్వాత ఆ తొక్కలను తీసేసి ఆ రసంతో ముఖంపై మృదువుగా మర్దనా చేస్తుండండి. బయట తిరిగి రావడం వల్ల కందిపోయిన ముఖం కూడా తాజాగా నిగనిగలాడేందుకు ఈ టిప్ పనిచేస్తుంది. -
అందమె ఆనందం
ఎండబెట్టిన ఉసిరికాయలు, కుంకుడు కాయలు, శీకాయల్ని నీటిలో వేసి బాగా మరిగించాలి. తర్వాత చల్లారబెట్టి, సీసాలో వేసి భద్రపర్చుకుని... వారానికోసారి దీనితో తలంటుకుంటే జుత్తు బలంగా తయారవుతుంది. పెదవులు పొడిబారి చిట్లిపోతుంటే... ఆలివ్‌నూనెలో కొంచెం తేనె, చెంచాడు పంచదార కలిపి పెదవులపై మసాజ్ చేసుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే వారం తిరిగేసరికి అందంగా తయారవుతాయి.