లవ్లీ స్కిన్ కోసం ఆలివ్ ఆయిల్
బ్యూటిప్స్
రెండు-మూడు టేబుల్‌స్పూన్ల ఆలివ్ ఆయిల్‌ను గోరువెచ్చగా చేసి ఒంటికి పట్టించి మర్దన చేసుకుని అరగంట తర్వాత స్నానం చేయాలి.
♦ ఒక టేబుల్ స్పూను ఆలివ్ ఆయిల్‌లో ఒక కోడిగుడ్డు సొన, కొద్దిగా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో కడగాలి. ఈ ప్యాక్ పొడి చర్మానికి చక్కటి మాయిశ్చరైజర్. ఈ కాలంలో పొడి చర్మం కలిగిన వారయితే వారానికి కనీసం నాలుగుసార్లు, సాధారణ చర్మానికయితే వారానికి ఒకటి- రెండు సార్లు ఈ ప్యాక్ వేస్తే పగుళ్లు రాకుండా చర్మం మృదువుగా ఉంటుంది.
♦ కొన్ని రకాల ప్యాక్‌లు, చర్మం మీద గాయాలున్నప్పుడు మినహాయించాల్సి ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌లోని చర్మరక్షణ గుణాలు చిన్నచిన్న గాయాలను, చర్మ సమస్యలను కూడా తగ్గిస్తాయి కాబట్టి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.
♦ మస్కారా పొడిబారినట్లయితే అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేస్తే తిరిగి మామూలుగా వస్తుంది.
♦ రెండు టీ స్పూన్ల చక్కెరలో అంతే మోతాదులో ఆలివ్ ఆయిల్ కలిపి చేతులకు పట్టించి రుద్దినట్లయితే మృతకణాలు తొలగిపోవడంతోపాటు మృదువుగా మారి చర్మం మెరుస్తుంది.
♦ అరకప్పు ఆలివ్ ఆయిల్‌లో పావుకప్పు వెనిగర్, పావుకప్పు నీటిని కలిపి రాత్రి పడుకునే ముందు ముఖం, మెడ, చేతులకు పట్టిస్తే నిర్జీవంగా ఉన్న చర్మం కాస్తా ఉదయానికి కాంతులీనుతుంది. ఈ సీజన్‌లో ఇది మంచి ట్రీట్‌మెంట్. ఈ మిశ్రమాన్ని ఒకసారి తయారుచేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుని నాలుగైదు రోజులపాటు వాడుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని పట్టించే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి.