చర్మ సంరక్షణ కోసం వివిధ రకాల మాయిశ్చరైజర్లను వాడటం గురించి విన్నాం. ఇప్పుడూ ఏకంగా ముఖానికే నేరుగా ఇంజెక్ట్ చేస్తారట. దీనివల్ల ముఖం హైడ్రేటెడ్‌గా ఉండి మృదువుగా కనిపిస్తుంది. పైగా ఏజ్‌లెస్‌గా కనిపిస్తుందట. స్కిన్‌టోన్ కూడా చాలా బాగుంటదట . అసలేంటిది? ఎలా చేస్తారు తదితరాల గురించి తెలుసుకుందాం!.
ఇప్పుడూ చర్మ సంరక్షణపై విపరీతమైన అవగాహన, ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. అందుకు తగ్గట్టుగానే మార్కెట్లో బ్యూటీకి సంబంధించిన కొత్తకొత్త చికిత్సా విధానాలు వచ్చాయి. ఈ చర్మ సంరక్షణకు సంబంధించి సర్జరీలు, చికిత్సలు భారత్‌లో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ముఖ్యంగా ఆసియ పసిఫిక్ ప్రాంతాలైన భారత్, చైనా, జపాన్‌లో బ్యూటీ ప్రొడక్ట్‌లు, చికిత్సలు మంచి ఆదాయాలు అందించే మార్కెట్. ఆ క్రమంలోనే కొత్త చర్మ సంరక్షణ ట్రెండ్ ఒకటి వచ్చింది. ఇంతకీ ఏంటీ ఇంజెక్షన్ మాయిశ్చరైజర్స్?
ఇంజెక్ట్ చేసే మాయిశ్చరైజర్‌లను స్కిన్ బూస్టర్‌లుగా పిలుస్తారు. ఇవి హెలురోనిక్ యాసిడ్‌తో తయారు చేస్తారు. ఇది శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మానికి హైడ్రేషన్, మృదుత్వాన్ని అందిస్తుంది. సాధారణ మాయిశ్చరైజర్ల మాదిరిగా కాకుండా సూదులతో ఇంజెక్ట్ చేయడం వల్ల ఇది చర్మం పొరల్లోకి లోతుగా చొచ్చుకునిపోయి కాంతిగా ఉండేలా చేస్తుంది. అలాగే ముఖాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, ముఖంపై ఉండే గీతలు, ఆకృతి సమస్యలు, వృధాప్య ముడతలను నివారిస్తుంది.
చర్మాన్ని రిపేర్ చేసేలా తేమ స్థాయిని నింపుతుంది. ఇది యవ్వనపు ఛాయను అందించి, ముఖం ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. చర్మాన్ని పునరుజ్జీవింపబడేలా చేస్తుంది. మిగతా కాస్మెటిక్ చికిత్స విధానాల కంటే ఇది తక్షణ ఫలితాన్ని ఇస్తుంది. చర్మం ఆకృతిని, రంగును మెరుగ్గా ఉంచుతుంది. ముఖం ఎప్పటికీ యవ్వనంలా కనిపించాలానుకునేవారికి ఈ పద్ధతి మేలు. వృధాప్య ఛాయలను నివారించాలనుకునే వారికి, యూబైలలో ఉన్న మహిళలకు ఈ చికిత్స విధానం బెస్ట్ ఆప్షన్. ఈ ఇంజెక్ట్ మాశ్చరైజర్‌లు కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తాయి. దీంతో చర్మానికి మంచి బూస్టింగ్ లభించడమే గాక మేను యవ్వనంగా మారేలా పునరుజ్జీవింప చేసి ముడతలను దూరం చేస్తుంది. అయితే ఈ చికిత్సను అర్హులైన నిపుణుల పరివేక్షణలో చేయించుకోవడం ఉత్తమం.
(చదవండి: ఈ డివైజ్‌తో కాళ్లు నొప్పులు మాయం!)
Comments
Please login to add a commentAdd a comment