
వయసు ప్రభావం చర్మంపై కనిపించకుండా ఉండాలంటే, మర్దనను మించినది లేదు. రకరకాల తైలాలతో శరీరాన్ని మర్దన చేసే పద్ధతులు పురాతన కాలం నుంచి ఉన్నాయి. ఏ తైలాలను ఉపయోగించినా, ఇతర ద్రావణాలను ఉపయోగించినా, చర్మం లోలోతుల్లోకి చేరితేనే ఫలితం ఉంటుంది.
ఎవరికి వారే స్వయంగా మర్దన చేసుకునేందుకు వీలుగా అందుబాటులోకి వచ్చిన సాధనమే ఈ డెర్మా మసాజ్ రోలర్. మర్దనకు అవసరమైన తైలాలు లేదా సీరమ్‌లు నింపుకోవడానికి ప్రత్యేకమైన మినీకంటైనర్‌తో రూపొందిన ఈ పరికరం పైభాగంలో రోలర్ హెడ్‌కు అన్నివైపులా టిటానియం నీడిల్స్ ఉంటాయి. దీనిని చర్మానికి ఆనించి, మర్దన చేసుకునేటప్పుడు రోలర్ గుండ్రంగా తిరుగుతుంది.
దాంతో దీనికి ఉన్న నీడిల్స్ చర్మాన్ని లోతుగా ఒత్తి, రక్తనాళాలను ఉత్తేజితం చేస్తాయి. ఈ రోలర్‌తో ఎవరికి వారే స్వయంగా మర్దన చేసుకోవచ్చు. ఇది ఎలాంటి నొప్పిని కలిగించదు. నుదురు, బుగ్గలు, ముక్కు, పెదవులు, గడ్డం, చేతులు, పొట్ట వంటి భాగాల్లో ఈ రోలర్‌తో కావలసిన నూనె లేదా సీరమ్ ఉపయోగించి, మర్దన చేసుకోవచ్చు. ఇది కేశసంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది.
తలపై కూడా దీనితో మర్దన చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని వినియోగించిన తర్వాత రోలర్‌ను, కంటైనర్‌ను వేరుచేసి, శుభ్రం చేసుకున్న తర్వాత మెత్తని వస్త్రంతో తుడిచి, ఆరబెట్టుకోవాలి. ఈ రోలర్‌తో ట్రాన్స్‌పరెంట్ క్యాప్ లభిస్తుంది. వాడకం పూర్తయ్యాక రోలర్‌కు క్యాప్ పెట్టుకున్నట్లయితే, దీనిపై దుమ్ము, ధూళి చేరకుండా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment