చర్మం ఎప్పటికి కాంతిమంతంగా ఉండాలంటే మన ఇంట్లో మనం నిత్యం ఉపయోగించవాటితో ఈజీగా పొందొచ్చు. ముఖ్యంగా కాల్షియం కోసం తాగే పాలతో ముఖాన్ని నిత్య యవ్వనంగా ఉండేలా చేసుకోవచ్చు. అంతేగాదు వార్థప్యపు లక్షణాలకు కూడా చెక్‌పెట్టొచ్చు. పాలతో చర్మ సౌందర్యం పెంచుకునే సింపుల్ చిట్కాలేంటంటే..
పాలతో చర్మ సౌందర్యం
- చర్మం కాంతిమంతంగా మెరవాలంటే క్రీమ్‌లు లోషన్‌లకు బదులు ఇంట్లో ఉండే పాలతో ప్రయత్నించి చూడండి.
- పచ్చి పాలలో దూదిని ముంచి మెడ, గొంతు, ముఖాన్ని తుడిస్తే చర్మం మీద పట్టేసిన మురికి (సబ్బుతో శుభ్రం చేసినప్పటికీ వదలని మురికి) వదిలిపోతుంది.
- రెండు టీ స్పూన్‌ల పచ్చిపాలలో టీ స్పూన్ శనగపిండి, రెండు చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కొద్దిగా నీటిని చల్లి వలయాకారంగా మసాజ్ చేస్తూ శుభ్రం చేయాలి.
- ముఖం మీద సన్నని గీతలతో చిన్న వయసులోనే వార్థక్యపు లక్షణాలు కనిపిస్తుంటే రోజూ మిల్క్ ప్యాక్ వేయాలి. ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసిన తర్వాత పచ్చి పాలలో దూదిని ముంచి ముఖం మీద అద్దాలి. పాలు ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేసి పెసరపిండి ప్యాక్ వేయాలి.
- రెండు టీ స్పూన్‌ల పెసర పిండిలో రెండుచుక్కల తేనె వేసి తగినంత నీటితో కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే చర్మం నిత్య యవ్వనంతో ఉంటుంది. వార్థక్య లక్షణాలు దూరమవుతాయి.
(చదవండి: గ్రీన్ టీ మంచిదని తాగేస్తున్నారా? దానివల్ల ఎదురయ్యే సమస్యలివే..!)
Comments
Please login to add a commentAdd a comment