prevent
-
పిలవని పెళ్లిళ్లకు.. పోలీసులు రెడీ..
పాత తెలుగు సినిమాల్లో క్లైమాక్స్ చివర్లో డిష్యూం డిష్యూం ఫైటింగ్‌లు అయిపోయాక పోలీసులు వచ్చి శుభం కార్డు పడటం అందరం చూసే ఉంటాం. ఆగ్రా పోలీసులు మాత్రం పెళ్లిళ్లలో చిట్టచివర్లో కాకుండా ముందే వస్తారు. అదీ కూడా పిలవకుండానే వచ్చి పెళ్లిలో అత్యంత కీలకమైన, విలువైన వధువు నగలు, పెళ్లివారి నగదు వంటి వాటిపై నిఘా పెడతారు. ఎందుకంటే వాటిని కొట్టేసేందుకు చోరశిఖామణులు పెళ్లి మండపాల్లో తచ్చాడుతారని పోలీసులుకు బాగా తెలుసు. అందుకే మఫ్టీల్లో వచి్చమరీ పటిష్ట భద్రత కల్పిస్తారు. ఇదంతా ఉచితమే. ఇలా అదనపు మొహరింపు వెనక ఒక పెద్దకారణమే ఉంది. ఈ వివరాలను ఆగ్రా సిటీ డెప్యూటీ పోలీస్ కమిషనర్ సూరజ్ రాయ్ వెల్లడించారు. టీనేజర్లూ డేంజరే ‘‘రాత్రిళ్లు దొంగలు పడటం సర్వసాధారణం. పట్టపగలు పెళ్లి పందిళ్లు, మండపాల్లో దొంగలు చేతవాటం చూపించడం ఈమధ్య మరీఎక్కువైంది. ముఖ్యంగా పెళ్లి నగలు, నగదుపై కన్నేసి కొట్టేసిన ఘటనలు చాలా జరిగాయి. అందుకే పోలీసు సిబ్బందిని సాధారణ దుస్తుల్లో వివాహవేడుకలకు బందోబస్తుగా మేమే పంపిస్తున్నాం. బంధువుల్లా కలిసిపోయి అందరిపైనా ఓ కన్నేస్తాం. వధూవరుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను ముఖ్యంగా గమనిస్తాం. ఎందుకంటే వాళ్ల దగ్గర ఉండే నగలు, నగదునే దొంగలు కొట్టేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల సాయంతోనూ నిఘా కొనసాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆగ్రా జిల్లాలోని ప్రతి కీలకమైన వేడుకకు మేం పిలవకున్నా వెళ్తున్నాం. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను గమనిస్తాం. కొన్ని సార్లు ఆ అనుమానాస్పద వ్యక్తుల వెంట వచ్చే టీనేజర్లనూ ఓ కంట కనిపెడతాం. ఎందుకంటే ఆ మధ్య ఒక పెళ్లిలో టీనేజీ పిల్లాడే కోట్లవిలువైన చోరీకి పాల్పడ్డాడు. పెళ్లిమంటపాలు, బాంకెట్ హాళ్లు, వివాహ వేదికలు ఇలా మొత్తం 18 క్లస్టర్లకు పోలీసులను పంపుతున్నాం. స్థానికులు సైతం తమ పెళ్లికి నిఘా కావాలంటే ముందస్తుగా సమీప పోలీస్‌స్టేషన్‌ను సంప్రదిస్తే ప్రతి పెళ్లికి కుదిరితే బందోబస్తును ఏర్పాటుచేస్తాం’’అని ఆయన వివరించారు. – ఆగ్రా -
బంగ్లాదేశ్ సంక్షోభం: ఒడిశా అప్రమత్తం.. తీరంలో గస్తీ పెంపు
అశాంతితో దెబ్బతిన్న బంగ్లాదేశ్ నుండి భారత్‌లోకి చొరబడాలని చూస్తున్న అక్కడి ప్రజలను అడ్డుకునేందుకు ఒడిశా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 480 కిలోమీటర్ల తీరప్రాంతంలో నిఘాను మరింతగా పెంచింది. ఈ విషయాన్ని సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.ఒడిశా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు చిన్న పడవలను ఉపయోగించి ఒడిశాలోకి అక్రమంగా ప్రవేశిస్తుంటారన్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అశాంతి నెలకొన్న సమయంలో, అక్కడి నేరస్తులు జైలు నుండి బయటకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు. అలాంటి వారు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించే అవకాశాలున్నయని, అందుకే తాము మరింత అప్రమత్తం అయ్యామన్నారు.నేరస్తులలో పాటు సామాన్యులు కూడా ఒడిశాలోకి చొరబడే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని 18 మెరైన్ పోలీస్ స్టేషన్లను హై అలర్ట్‌లో ఉంచామన్నారు. మరోవైపు ఒడిశాలోకి బయటి వ్యక్తుల అక్రమ ప్రవేశాన్ని నిరోధించేందుకు ప్రత్యేకించి రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని కోస్తా జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లను ఆదేశించింది. కేంద్రపారా, జగత్సింగ్పూర్, భద్రక్ తదితర జిల్లాలపై నిఘా సారించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. -
ఖర్జూరం తింటే మలబద్దకం వస్తుందా..?
ఖర్జూరం ఆరోగ్యానికి మంచిదని అందరికి తెలుసు. దీనిలో అనేక విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అలాంటి ఖర్జూరం తీసుకుంటే మలబద్దకం వస్తుందా?. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదించే అవకాశం ఉందా?. అంటే ఔననే చెబుతున్నారు నిపుణులు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలందించే ఖర్జూరంతో కూడా సమస్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. రీజన్ ఏంటో సవివరంగా చూద్దామా..!.మలబద్ధకం అనేది సాధారణ సమ్య. దీనిని సరైన ఆహారం, జీవనశైలితో సర్దుబాటు చేయవచ్చు. సహజ చక్కెరలకు, ఖనిజాలకు అద్భుతమైన ఈ ఖర్జూరం మలబద్ధకాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. దీనిలో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. అందువల్ల దీన్ని అతిగా తీసుకుంటే జీవక్రియ నెమ్మదించి..మలబద్దకం ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువగా తీసుకోవడం మొదలుపెడితే జీర్ణం కావడం కష్టమవుతుంది. శరీరం లోపల అగ్నిని తగ్గిస్తుంది. ఖర్జూరాల్లో తీపి కారణంగా శరీరానికి చలువ చేస్తాయి. అందువల్ల ఎక్కువ తీసుకుంటే జీర్ణం కావడం కష్టమవుతుంది. సరైన మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అలాకాకుండా వాటిమీద మక్కువకొద్ది లాగిస్తే సమస్యలు తప్పవని చెబుతున్నారు నిఫుణలు.ఎలా తీసుకుంటే బెటర్..నానాబెట్టిన ఖర్జూరాలు బరువు తగ్గించేందుకు, జీర్ణక్రియకు మంచిది. ఖర్జూరాలు తినే ముందు ఎండు అల్లం పొడిన జోడించండి. పొడి అల్లం లేదా సాంత్ ఆహారాన్ని వేడి చేయడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహిస్తుంది. అంతేగాదు ఖర్జూరం, ఎండుద్రాక్ష, అత్తిపండ్లతో కూడిన 'ఖజురాధి మంథా'ని తయారు చేయడానికి ఒక కూలింగ్ డ్రింక్ సిద్ధం చేయండి. ఈ రిఫ్రెష్ డ్రింక్ జీర్ణ సమస్యలను నివారించి, హైడ్రేట్‌గా ఉంటుంది. మంచి ప్రయోజనాలను పొందాలంటే రోజుకు మూడు ఖర్జూరాలను స్నాక్‌గా తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు, ఆరోగ్యానికి కూడా మంచిందని చెబుతున్నారు. (చదవండి: నాజూగ్గా ఉండాలనుకుంటే..మొరింగనీటిని ట్రై చేయండి..!) -
అల్జీమర్ వ్యాధికి దానిమ్మ చెక్ పెట్టగలదా?
అల్జీమర్స్ వ్యాధిని న్యూరోడిజెనరేటివ్ డిజార్డర్ అని అంటారు. దీని కారణంగా జ్షాపక శక్తి క్షీణించిపోతుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని తీవ్రమైన మతిమరుపుగా పేర్కొనవచ్చు. దీని కారణంగా రోజు వారి కార్యకలాపాలు కూడా సరిగా నిర్వహించలేరు బాధితులు. ఇది ఎక్కువగా 65 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తుంటుంది. ఈ వ్యాధి ప్రభావాన్ని తగ్గించగలమే గానీ పూర్తిగా నివారించలేం. అయితే తాజాగా యూనివర్సిటీ ఆఫ్ కోపనహాగన్, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు చేసిన అధ్యయనంలో అల్జీమర్స్ వ్యాధికి చెక్ పెట్టడంలో దానిమ్మపండు ప్రభావవంతంగా ఉంటుందని వెల్లడించారు. వారి అధ్యయనంలో దానిమ్మ పండు గుణాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అల్జీమర్లో వ్యాధిని చికిత్స చేయండంలో 'యురోలిథిన్ ఏ' కీలమకమని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడు నుంచి దెబ్బతిన్న మైటోకాండ్రియాను తొలగించడంలో యూరోలిథిన్ ఏ అనేది కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించారు పరిశోధకులు. ఇక్కడ యూరోలిథిన్ ఏ అనేది ఎల్లాజాటానిన్ల సమ్మేళనం. ఈ ఎల్లాజాటానిన్లు సమ్మెళనాలు అధికంగా దానిమ్మలో ఉంటాయి. దీన్ని ఆహారంగా తీసుకున్నప్పుడూ గట్ బ్యాక్టీరియా ద్వారా రూపాంతరం చెంది 'యురోలిథిన్ ఏ'ను ఉత్పత్తి చేస్తాయి. ఇది మైటోకాండ్రియా పనితీరుని మెరుగుపరిచి కండరాల ఆరోగ్యాన్ని కాపాడుతుందని పరిశోధన పేర్కొంది.ఈ దానిమ్మలో పాలీఫైనాల్స్, ప్యూనికాలాజిన్స్, ఆంథోసైనిన్స్పు పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, వాపుని తగ్గిస్తాయి. ముఖ్యంగా అల్జీమర్స్ వంటి న్యూరోడెజనరేటివ్ వ్యాధులను నయం చేయడంలో తోడ్పడతాయని పరిశోధనలో తేలింది. ఈ పండులో సీ, కే, ఫోలేట్ వంటి విటమిన్లు కూడా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ప్రీ రాడికల్స్ , యాంటీ ఆక్సిడెంట్ల మధ్య అసమతుల్యత కారణంగా ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది సెల్ డ్యామేజ్‌కు దారితీస్తుంది. నూర్యాన్ల క్షీణతలో ఆక్సీకరణ ఒత్తిడి ప్రధాన అంశం. ఈ దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్టీకరించి మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడుతుందని పరిశోధకులు తెలిపారు.అల్జీమర్స్‌ను తీవ్రతరం చేసే అమిలాయిడ్ బీటా ఫలకాల నిక్షేపణలను తగ్గించడంలో దానిమ్మపండు ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించారుఅంతేగాదు ఈ దానిమ్మ పండు అల్జీరమర్స్ వ్యాధిపి సమర్థవంతంగా నియంత్రిస్తుందా? లేదా అని చేసిన అధ్యయనంలో మంచి పలితాలు వచ్చాయని చెబుతున్నారు పరిశోధకులు. అందుకోసం తాము వృద్ధుల జ్ఞాపకశక్తిపై అధ్యయనం నిర్వహించగా..వారిలో గణనీయమైన మెరుగదల కనిపించిందని తెలిపారు. ఈ అధ్యయనం న్యూరోబయాలజీ ఆఫ్ ఏజింగ్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది.అంతేగాదు ఈ దానిమ్మలో ఉండే విటమిన్లు ఇన్ఫ్లమేటరీ మార్గాలను నిరోధిస్తాయి. ప్రో-ఇన్ఫ్లమేటరీ సైటోకిన్ల స్థాయిలను తగ్గించి, న్యూరోఇన్‌ఫ్లమేషన్‌ను నివారిస్తాయి.పైగా దీనిలోని సమ్మేళనాలు కొత్త న్యూరాన్ల పెరుగుదలను ప్రోత్సహించి జ్ఞాపకశక్తి పనితీరుని మెరుగ్గా ఉంచుతుంది. అంతేగాదు దీనిలో ఉండే విటమిన్లు, ఫైబర్లు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచేలా చేసి దీర్ఘాయువుని అందిస్తుంది.(చదవండి: కూర్చొని వర్సెస్ నిలబడి: ఎలా తింటే బెటర్?) -
వడదెబ్బకు గురైన నటుడు షారూఖ్! దీని బారిన పడకూడదంటే..!
సమ్మర్ అంటే సూర్యుడి భగభగలు మాములుగా ఉండవు. పట్టపలే చుక్కలు చూపిస్తున్నట్లుగా ఎండ దంచి కొడుతుంది. మిట్ట మధ్యాహ్నాం బయటకు వెళ్లాలంటేనే హడలిపోతారు. ఈ ఉష్ణోగ్రతలుకు ఎంతో మంది వృద్ధులు పిట్టలు రాలినట్లుగా చనిపోతారు. అందుకే ఈ వడదెబ్బకు గురికాకుండా ఉండేలా ద్రవపదార్థాలు ఎక్కువగా తాగమని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఈ ఎండకాలంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ వడదెబ్బ బారిన పడకుండా ఉండకూదంటే ఏం చేయాలి? ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అంటే..ఐపీఎల్ ప్లే ఆఫ్‌కు మ్యాచ్‌కు హాజరైన బాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ షారుక్ ఖాన్ డీహైడ్రేషన్‌కు (వడదెబ్బ) గురైనట్లు సమాచారం. దీంతో ఆయన అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చికిత్స అందుకున్నారు. ఆ తర్వాత షారుక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. అదీగాక భారత వాతావరణ శాఖ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీతో సహా అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు వడదెబ్బలకు గురయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అసలు ఈ వడదెబ్బ బారిన ఎలా పడతాం? దీని బారిన పడినట్లు ఎలా గుర్తించాలి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం. వడదెబ్బకు గురైన సంకేతాలు..వేడి, పొడి చర్మం: బాగా చెమటలు పట్టిన బాడీ చల్లబడకపోవడం. చర్మం వేడిగా, పొడిబారిన పడినట్లు అయిపోతేహృదయ స్పందన రేటు పెరిగినా..: శరీరం తనను తాను చల్లబరుచుకోవటానికి ప్రయత్నించినపుడు హృదయస్పందన రేటు పెరుగుతుంది.శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది: శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను నిర్వహించడానికి కష్టపడటం, తద్వారా వేగంగా శ్వాస తీసుకోవడానికి దారితీస్తుంది. తలనొప్పి: పెరిగిన శరీర ఉష్ణోగ్రత, నిర్జలీకరణం ఫలితంగా తీవ్రమైన తలనొప్పి ఏర్పడవచ్చు.వికారం, వాంతులు: వికారం వాంతులు కారణంగా నిర్జలీకరణం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీయడం.స్ప్రుహ కోల్పోవడం: తీవ్రమైన సందర్భాల్లో అధిక ఉష్ణోగ్రత మెదడుపై ప్రభావం చూపి స్ప్రుహ కోల్పోవడం, కోమాలోకి వెళ్లిపోవడం వంటివి జరుగుతాయి. ఒక్కోసారి మూర్చ వంటివి రావడం జరుగుతుంది.నివారణ చర్యలు..హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవడం. దాహం అనిపించకపోయినా తరుచుగా నీళ్లు తాగడం, ఆల్కహాల్, కెఫిన్ వంటి పానీయాలకు దూరంగా ఉండటం వంటివి చేయాలి. వేడి నుంచి తప్పించుకునేలా ఎయిర్ కండిషన్డ్ పరిసరాల్లో ఉండటానికి ప్రయత్నించండి. గాలి వచ్చేలా ఉండే ఫ్యాన్లు వంటివి ఉపయోగించటం వంటివి చేయాలి. ఈ వేడికి తగ్గట్టు కాటన్ లేదా నార వంటి మెత్తని తేలికైన బట్టలను ఎంచుకోండి. సూర్మరశ్మని గ్రహించకుండా ఉండేలా రంగులను ఎంచుకుని మరీ దుస్తులను ధరించండి. అలాగే ఎండ ఎక్కువగా ఉన్న సమయాల్లో కాకుండా చల్లగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. చర్మాన్ని సంరక్షించుకునేలా ఎస్పీఎఫ్ సన్‌స్క్రీన్, సన్‌బర్న్ వంటివి ఉపయోగించండి. శరీరం ఉష్ణోగ్రత పెరగకుండా ఉండేలా చలువ చేసే పదార్థాలను తినడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికపాటి భోజనం తినాలిహైడ్రేటింగ్గా ఉండేలా చేసే పండ్లు, కూరగాయలను తినండి. (చదవండి: బోన్ మ్యారో క్యాన్సర్..నియంత్రణ ఇలా...!) -
ఇలా చేస్తే చర్మం నిత్య యవ్వనంగా ఉంటుంది!
చర్మం ఎప్పటికి కాంతిమంతంగా ఉండాలంటే మన ఇంట్లో మనం నిత్యం ఉపయోగించవాటితో ఈజీగా పొందొచ్చు. ముఖ్యంగా కాల్షియం కోసం తాగే పాలతో ముఖాన్ని నిత్య యవ్వనంగా ఉండేలా చేసుకోవచ్చు. అంతేగాదు వార్థప్యపు లక్షణాలకు కూడా చెక్‌పెట్టొచ్చు. పాలతో చర్మ సౌందర్యం పెంచుకునే సింపుల్ చిట్కాలేంటంటే.. పాలతో చర్మ సౌందర్యం చర్మం కాంతిమంతంగా మెరవాలంటే క్రీమ్‌లు లోషన్లకు బదులు ఇంట్లో ఉండే పాలతో ప్రయత్నించి చూడండి. పచ్చి పాలలో దూదిని ముంచి మెడ, గొంతు, ముఖాన్ని తుడిస్తే చర్మం మీద పట్టేసిన మురికి (సబ్బుతో శుభ్రం చేసినప్పటికీ వదలని మురికి) వదిలిపోతుంది. రెండు టీ స్పూన్ల పచ్చిపాలలో టీ స్పూన్ శనగపిండి, రెండు చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కొద్దిగా నీటిని చల్లి వలయాకారంగా మసాజ్ చేస్తూ శుభ్రం చేయాలి. ముఖం మీద సన్నని గీతలతో చిన్న వయసులోనే వార్థక్యపు లక్షణాలు కనిపిస్తుంటే రోజూ మిల్క్ ప్యాక్ వేయాలి. ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసిన తర్వాత పచ్చి పాలలో దూదిని ముంచి ముఖం మీద అద్దాలి. పాలు ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేసి పెసరపిండి ప్యాక్ వేయాలి. రెండు టీ స్పూన్ల పెసర పిండిలో రెండుచుక్కల తేనె వేసి తగినంత నీటితో కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే చర్మం నిత్య యవ్వనంతో ఉంటుంది. వార్థక్య లక్షణాలు దూరమవుతాయి. (చదవండి: గ్రీన్ టీ మంచిదని తాగేస్తున్నారా? దానివల్ల ఎదురయ్యే సమస్యలివే..!) -
నాకిప్పుడు మూడోనెల, ఆ రిస్క్ ఉండకూడదంటే..?
నాకిప్పుడు మూడో నెల. బరువు 96 కేజీలు. మూడో కాన్పు. మొదటి రెండు కాన్పులు సిజేరియనే. రెండో కాన్పు అప్పుడు అనెస్తీషియా రిస్క్ ఎక్కువగా ఉండింది. ఈసారి ఆ రిస్క్ లేకుండా ఏం చేయాలో దయచేసి చెప్పగలరు. – రమణి విశ్వం, పిడుగురాళ్ల మీ ఎత్తు, బరువును బట్టి బాడీ మాస్ ఇండెక్స్.. బీఎమ్‌ఐని కాలిక్యులేట్ చేస్తారు. బాడీ మాస్ ఇండెక్స్ సాధారణంగా 20– 25 మధ్య ఉంటే ప్రెగ్నెన్సీ, ప్రసవమప్పుడు సమస్యలు తక్కువగా ఉంటాయి. బీఎమ్ఐ 30 కన్నా ఎక్కువ ఉన్నవారిలో ప్రెగ్నెన్సీ, అనెస్తీషియా, రికవరీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందే 5–10 శాతం బరువు తగ్గితే ప్రయోజనం ఉంటుంది. ఇప్పడు మీకు మూడోనెల అంటున్నారు కాబట్టి మీ బీఎమ్ఐ కాలిక్యులేట్ చేసి 30 కన్నా ఎక్కువ ఉంటే ఫ్యామిలీ హిస్టరీ, బీపీ, సుగర్ వంటి పరీక్షలన్నీ చేసి.. ఫలితాలను నిర్ధారించి.. ప్రెగ్నెన్సీలోనే రక్తం పలుచబడడానికి మాత్రలు స్టార్ట్ చేస్తారు. దీనివల్ల మీకు డెలివరీ.. సర్జరీ సమయంలో డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డకట్టే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది. మల్టీవిటమిన్స్, విటమిన్ డీ3, కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తారు. అంతేకాదు ప్రెగ్నెన్సీ సమయంలో క్రమం తప్పకుండా చేసే వ్యాయామాలూ నేర్పిస్తారు. మీరు నిర్ధారిత బరువుకు రావడానికి డైట్ కౌన్సెలింగ్కీ వెళ్లాలి. లెగ్ మజిల్ మూవ్మెంట్ ఎక్సర్సైజెస్, మసాజ్లను సూచిస్తారు. కంప్రెషన్ స్టాకింగ్స్ అనే సాక్స్‌లను కాళ్లకు వేసుకోవాలి. ప్రసవం తరువాత మీ బరువును బట్టి రక్తం పలుచబడడానికి వారం నుంచి పది రోజుల దాకా ఇంజెక్షన్స్‌ను ఇస్తారు. దీనివల్ల ఛాతీ, కాళ్లలో బ్లడ్ క్లాట్ అయ్యే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది. అనెస్తీషియా రిస్క్ కూడా తగ్గుతుంది. పూర్తి శరీరానికి ఇచ్చే జనరల్ అనెస్తీషియాకన్నా కూడా నడుముకు ఇచ్చే రీజనల్ అనెస్తీషియాలోనే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అధిక బరువు ఉన్న వారిలో మెడలో ఉండే థిక్నెస్ వల్ల శ్వాస సంబంధమైన, స్లీప్ ఆప్నియా సమస్యలు తలెత్తుతాయి. ఇవి జనరల్ అనెస్తీషియాలో ఇబ్బందులు కలిగిస్తాయి. ఏ అనెస్తీషియా ఇవ్వాలి అనేది తొమ్మిదవ నెలలోనే అనెస్తెటిస్ట్ (మత్తు డాక్టర్) చూసి కౌన్సెల్ చేస్తారు. అధిక బీఎమ్‌ఐలో ఆక్సిజన్ అవసరాలు పెరుగుతాయి. అనెస్తీషియా సమయంలో ఆ జాగ్రత్త తీసుకుంటారు. బీఎమ్ఐ అధికంగా ఉంటే కొన్ని పెయిన్ రిలీఫ్ మందులు సరిగా పనిచేయవు. హైరిస్క్ అనెస్తీషియా టీమ్ ఈ విషయాలను గమనించి.. అనెస్తీషియా తర్వాత సమస్యలు రాకుండా చూస్తుంది. మీరు పౌష్టికాహారం తీసుకుంటూ.. తగిన వ్యాయామం చేస్తూ క్రమం తప్పకుండా చెకప్స్‌కి వెళుతూ.. ఈసారి ప్రసవమప్పుడు రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: అర్జున బెరడు గురించి విన్నారా? సైన్సు ఏం చెబుతుందంటే..) -
వృద్ధులను వేదించే గొంతులోని కఫం సమస్యకు..ఇలా చెక్ పెట్టండి!
వయసు మళ్లాక వచ్చే సమస్యలు అన్నిఇన్ని కావు. ఏది తినాలన్న భయం. పైగా ఏది అంత తొందరగా జీర్ణం కాదు. దీంతో అన్ని జావా, సూప్ మాదిరిగా తీసుకుంటుంటారు. ఘన పదార్థాలు తీసుకోనే అవకాశం లేకపోవడం, ఇతరత్ర సమస్యలు కారణంగా గొంతులో కఫం పేరుకుని ఇబ్బంది పెడుతుంది. దీని నుంచి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు ఆయుర్వేద నిపుణుల నవీన్ నడిమింటి. వీటిని వృద్ధులే కాక ఎవ్వరైనా వాడొచ్చని అంటున్నారు. గొంతు కఫాన్ని నివారించే మార్గం.. ఆయుర్వేదిక్ షాప్ లో మాసికాయ అని ఉంటుంది. అది తీసుకువచ్చి బుగ్గని పెట్టి చప్పరిస్తూ ఉంటే ఆ రసం మన కడుపులో దిగి కఫం అనేది పూర్తిగా తొలిగిపోతుంది ఈ మాసికాయ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఒక్కసారి వాడి చూడండి వామాకు, తులసాకు,తమలపాకుని రోజు తిన్న మంచి ఫలితం ఉంటుంది. మెత్తగా దంచి జల్లించిన కరక్కాయ పొడి, తేనెలో కలిపి రెండు పూటలా చప్పరించాలి. ఉదయం లేవగానే గోరు వెచ్చని మంచినీరు రెండు గ్లాసులు త్రాగాలి. రాత్రి పడుక్కోడానికి అరగంట ముందు రెండు చిటికెల పసుపు, నాలుగు మిరియాలు ( దంచిన ముక్కలు) పంచదార కొంచెం ( షుగరు లేకపోతే ఉంటే మెత్తని ఎండు ఖర్జూరం పొడి) ఒక గ్లాసు పాలు లో మరిగించి, వడకట్టి త్రాగాలి. ఐతే వృద్ధులుకి ఏది ఇచ్చినా అది ద్రవ రూపంలో లేదా మెత్తని పౌడర్ రూపంలో ఉండాలి. --ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి (చదవండి: మీనియర్స్ డిసీజ్ అంటే..!) -
కోటా హాస్టల్స్‌లో ఆత్మహత్యల కట్టడికి కొత్త ఆలోచన
జైపూర్: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వీటిని అరికట్టడానికి నివారణ చర్యలు చేపట్టింది. హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో 'స్బ్రింగ్ లోడెడ్ ఫ్యాన్ల'ను అమర్చుతున్నారు. ప్రస్తుతం ఈ అంశంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. విద్యార్థుల మానసిక స్థితిని మార్చడానికి ప్రయత్నించాలి కానీ.. సీలింగ్ ఫ్యాన్లు కాదని నెటిజన్లు ఫైరవుతున్నారు. ఐఐటీ, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు నిలయంగా ఉంటుంది రాజస్థాన్‌లోని కోటా. ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు అక్కడికి వచ్చి శిక్షణ పొందుతుంటారు. ఈ క్రమంలో ప్రతి ఏడాది విద్యార్థులు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత ఏడాది 15 మంది ప్రాణాలు కోల్పోగా.. ఈ సారి 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల ఓ విద్యార్థి(18) చనిపోయిన వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నెలలో ఇది నాలుగో ఆత్మహత్య కావడం గమనార్హం. #WATCH | Spring-loaded fans installed in all hostels and paying guest (PG) accommodations of Kota to decrease suicide cases among students, (17.08) https://t.co/laxcU1LHeW pic.twitter.com/J16ccd4X0S — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 18, 2023 అయితే.. ఎక్కువగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉండటంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను అమర్చారు. ఏమాత్రం బరువు పడినా వెంటనే ఊడివచ్చేలా ఫ్యాన్లను అమర్చారు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థుల మానసిక స్థితిగతులను మార్చాలని, అందుకు కౌన్సిలింగ్ వంటి చర్యలు చేపట్టాలని నెటిజన్లు సూచనలు చేస్తున్నారు. ఇదీ చదవండి: ఆత్మనిర్భర్ స్ఫూర్తి.. దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు.. అదీ 45 రోజుల్లో! -
ఈ అలవాట్లు ఉన్నాయా..? క్యాన్సర్ బారిన పడినట్టే..!
ఏయూ క్యాంపస్(విశాఖపట్నం): ప్రస్తుత కాలంలో క్యాన్సర్ వ్యాధులు విపరీతంగా పెరిగిపోయాయి. వీటిలో అత్యంత క్లిష్టమైన జీర్ణాశయాంతర క్యాన్సర్ రోగులపై ఏయూ హ్యూమన్ జెనిటిక్స్ విభాగ పరిశోధక విద్యార్థి కోడెల్లి శ్రీనివాసరావు అధ్యయనం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 400 మందికి సంబంధించిన రక్త నమూనాలు సేకరించారు. వీరిలో 200 మంది క్యాన్సర్ సోకిన వారు కాగా.. మరో 200 మంది ఆరోగ్యవంతులు ఉన్నారు. వీరి ఆహారపు, జీవన అలవాట్లు, జన్యువుల ప్రభావాలను ఆయన అధ్యయనం చేశారు. చదవండి: చిరుతిళ్లను ఆరోగ్యంగా తినొచ్చు ఈ పరిశోధనకు ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ లభించింది. విభాగ సీనియర్ ఆచార్యులు జి.సుధాకర్ పర్యవేక్షణలో ‘స్టడీస్ ఆన్ జెనిటిక్ పాలిమారిజం ఆఫ్ పీ 53, ఎంఎంపీ2, ఎంఎంపీ9 ఇన్ గ్యాస్ట్రో ఇంటస్టెయిన్ పేషెంట్స్ ఆఫ్ నార్త్‌కోస్టల్ ఆంధ్రప్రదేశ్’అంశంపై పరిశోధన చేసి.. వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డి నుంచి డాక్టరేట్ ఉత్తర్వులు స్వీకరించారు. జన్యువుల విశ్లేషణ క్యాన్సర్ కారకాలుగా భావించే పీ 53, ఎంఎంపీ 2, ఎంఎంపీ 9 జన్యువులను శ్రీనివాసరావు అధ్యయనం చేశారు. క్యాన్సర్ బారిన పడిన 200 రోగుల రక్తనమూనాలను పరిశీలించగా వీరిలో ఎంఎంపీ 9 అత్యధికంగా ఉండటం గుర్తించారు. తర్వాత స్థానంలో ఎంఎంపీ 2లు జీర్ణాశయాంతర క్యాన్సర్ రోగుల్లో కనిపించాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ క్యాన్సర్ బారిన పడిన వారిలో ఎంఎంపీ 9 జన్యువు అధికంగా మ్యూటేషన్ కావడం గమనించారు. పురుషుల్లోనే అధికం తన అధ్యయనంలో భాగంగా 200 మంది క్యాన్సర్ రోగుల ఫలితాలను విశ్లేషించి పరిశీలిస్తే జీర్ణాశయాంతర క్యాన్సర్ వచ్చే ముప్పు పురుషుల్లో 73 శాతం ఉండగా స్త్రీలలో 27 శాతంగా ఉంది. నిరక్షరాస్యుల్లో 58 శాతం ఉండగా.. ఉన్నత విద్యావంతుల్లో 4.5 శాతం ఉండటం గమనించారు. ఆహారపు అలవాట్లను పరిశీలిస్తే మాంసాహారుల్లో 77 శాతం మంది, శాకాహారుల్లో 23 శాతం మంది దీని బారిన పడుతున్నట్లు గుర్తించారు. పల్లె ప్రజలకంటే పట్టణాల్లో నివసించే వారిలో అధికంగా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు తెలిపారు. పొగతాగేవారు, పొగాకు నమిలే అలవాటు కలిగిన వారిలో ఈ క్యాన్సన్ ముప్పు ఎక్కువగా ఉంది. మద్యం సేవించే అలవాటు కలిగిన వారిలో 58 శాతం మంది ఈ వ్యాధి బారిన పడినట్లు గుర్తించారు. ఆహారపు, జీవన అలవాట్లు కారణం తన పరిశోధనలో భాగంగా 20 నుంచి 70 ఏళ్ల వయసు కలిగిన క్యాన్సర్ రోగులపై అధ్యయనం చేశారు. వారి రక్త నమూనాలను సేకరించి టోటల్ ప్రొటీన్, సీరం క్రియేటినిన్, బ్లడ్ యూరియా, బ్లడ్ సుగర్, కార్సినో–ఎంబ్రియోనిక్ యాంటిజెన్, బిలిరుబిన్, కాలేయ సంబంధ ఎంజైములు, అల్బూమిన్, గ్లోబులిన్, సోడియం, పొటాషియంల జీవరసాయన స్థాయిలను అంచనా వేశారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యవంతుల నమూనాలను సేకరించి వారి డీఎన్ఏలను వేరుచేసి.. పీసీఆర్, ఆర్ఎఫ్ఎల్పీ విధానాల్లో అధ్యయం జరిపారు. యాంత్రిక సమాజంలో మారిపోతున్న ఆహారపు అలవాట్లు క్యాన్సర్‌కు కారణంగా మారే అవకాశాలు ఉన్నాయి. తగినంత శారీరక వ్యాయామం ఎంతో అవసరమని ఆయన తెలిపారు. క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదిస్తే.. ఈ మహమ్మారిని జయించడం సులవవుతుంది. జీవనశైలిలో మార్పు రావాలి మంచి ఆరోగ్య అలవాట్లను కలిగి ఉండటం ఎంతో అవసరం. మన జీవనంలో దురాలవాట్లు, మత్తు పదార్థాలను దరిచేరనివ్వకుండా చూడాలి. జన్యువుల ప్రభావం మనిషిపై ఉంటుంది. దానికంటే ఆహారం, మద్యపానం, ధూమపానం, పొగాకు వంటి పదార్థాల ప్రభావం అధికంగా ఉంటోంది. మంచి జీవన అలవాట్లను కలిగి ఉండటం వలన క్యాన్సర్‌ను నిరోధించడం సాధ్యపడుతుంది. – డాక్టర్ కె.శ్రీనివాసరావు -
యుద్ధ నివారణే పాలకుల కర్తవ్యం!
‘‘స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్లతో బంధితుడై ఉన్నాడు’’ అన్నాడు ఫ్రెంచ్ తత్వవేత్త రూసో తన ‘సోషల్ కాంట్రాక్ట్’ గ్రంథంలో. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం ఉక్రెయినియన్లకు జీవన్మరణ పోరాటం అయింది. జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని శరణార్థులుగా ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. శరణార్థులుగా వారు అప్పటి వరకు అనుభవించిన స్వేచ్ఛ, అస్తిత్వాలను కోల్పోవడం కనిపిస్తోంది. లక్షల సంవత్సరాల మానవపరిణామ క్రమంలో మనిషి నేర్చుకున్నదేంటి? ఒక మనిషి మరొక మనిషిపై ఏదో ఒక రూపంలో అజమాయిషీ లేదా ఆధిపత్యం చలాయించటం దేనికి? తాజాగా మితిమీరిన రష్యా రాజ్యకాంక్ష వల్లనే లక్షలాది మంది జన్మభూమిని వదిలి విదేశాలకు వెళ్లవలసి వచ్చింది. యుద్ధం వల్ల బాల్యం ప్రశ్నార్థకం అవుతోంది. లక్షలాది మంది ఉక్రెయిన్ పౌరులు నేడు సరిహద్దు దేశాలకు వెళ్తున్న దృశ్యాలు చూస్తుంటే కన్నీరు రాక మానదు. పదకొండు సంవత్సరాల ‘హసన్ అక్లాఫ్’ అనే పిల్లవాడు చేతిపై తన బంధువుల ఫోన్ నంబర్ రాసుకొని ఏడువందల యాభై మైళ్ళ దూరంలో ఉన్న స్లొవేకియాలోని బంధువుల దగ్గరికి రైలు ప్రయాణం చేసి వెళ్ళడం బాధకల్గించే విషయం కాకపోతే ఏమిటి? అదే విధంగా అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించినప్పుడు కాబూల్ విమానాశ్రయంలో జరిగిన సన్నివేశాలు ఎందరినో కంట తడి పెట్టించాయి. పాలకులు యుద్ధాన్ని నివారించే ప్రయత్నం చేయకపోతే ఏం జరుగుతుందో ఇవన్నీ సజీవ ఉదాహరణలు. మొదటి, రెండు ప్రపంచ యుద్ధాల వల్ల మానవాళి సాధించిందేమిటి? ఇరాక్‌పై అమెరికా చేసిన యుద్ధం ఫలితం ఏమిటి? అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లను వేటాడటం కోసం వెళ్లిన అమెరికా సైన్యం ఆదేశానికి చేసింది మేలా, కీడా? మనుషులు అనుభవించే స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఆయా ప్రభుత్వాలు తమ అనాలోచిత నిర్ణయాలతో హరించి వేస్తున్నాయి. యుద్ధం వల్ల జరిగిన మానవ విధ్వంసాన్ని చూసి వగచే కన్నా... అసలు యుద్ధమే రాకుండా నివారించడం పాలకుల కర్తవ్యం. సంధి ప్రయత్నాలు ఎప్పటికీ స్వాగతించాల్సినవే. (క్లిక్: జూలియన్ అసాంజే అప్పగింత తప్పదా?) రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అణ్వస్త్ర దాడికి గురైన హిరోషిమా, నాగసాకి పట్టణాలలోని ప్రజలు నేటికీ పర్యవసానాలు ఎదుర్కుంటూనే ఉన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ విషయంలో రెండు దేశాలూ తప్పుడు విధా నాలు అవలంబించాయనేది అందరికీ తెలిసిన విషయమే. నాటో దేశాల ద్వారా ఉక్రెయిన్‌కి అగ్ర రాజ్యమైన అమెరికా ఆయుధాలు సరఫరా చేసి యుద్ధాన్ని ప్రోత్సహించడం కన్నా, పెద్దన్న పాత్ర పోషించి యుద్ధాన్ని నివారించి ఉంటే బాగుండేది. అలా కాక యుద్ధం చేయడానికి ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా ద్వారా సొమ్ము చేసుకోవడం... ‘శవాలపై పేలాలు ఏరు కోవడం’ లాంటిదే. ఉక్రెయిన్ పునర్నిర్మాణం తిరిగి ఎన్నటికి సాధ్యమవుతుందో ఓసారి కూలిన శిథిలాల మధ్య నిలబడి అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఆలోచించుకోవడం ఉత్తమం. రష్యా కోరినట్టుగా నాటోలో చేరబోమని హామీ ఇస్తే ఉక్రెయిన్‌కు వచ్చిన నష్టమేమిటి? ఫలితంగా యుద్ధం నివారింపబడేది. లక్షలమంది నిరాశ్రయులు కాకుండా, కష్టపడి నిర్మించుకున్న ఆశలసౌధాలు కళ్లముందు నేలమట్టం కాకుండా ఉండేవి. (క్లిక్: అంతర్జాతీయ సంఘీభావమే ఆయుధం) - డా. మహ్మద్ హసేన్ వ్యాసకర్త రాజనీతి విశ్లేషకులు -
తలనొప్పి వేధిస్తోందా?..నివారించవచ్చు ఇలా..
వెర్రి వేయి విధాలు అన్నట్లు తలనొప్పుల్లో 200కి పైగా రకాలున్నాయట. వీటిలో వెంటనే తగ్గిపోయే సాధారణ తలనొప్పులతోబాటు కొన్ని ప్రాణాంతకమైన తలనొప్పులూ ఉన్నాయి. తల, మెడ భాగాల్లోని తొమ్మిది సున్నితమైన ప్రాంతాలు లేదా తలలోని రక్త నాళాలు ఒత్తిడికి లోనుకావడం లేదా వాపు వల్ల తలనొప్పి వస్తుందని వైద్యులు చెబుతారు. అయితే, తరచు తలనొప్పి వస్తున్నట్లయితే దానిని నిర్లక్ష్యం చేయకూడదు. తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే.. తలనొప్పి ఎన్నో రకాల సమస్యలతో ముడిపడి ఉంటుంది కాబట్టి. ఏ తలనొప్పో ఎలా గుర్తించాలి..? ∙తలనొప్పి ఓ వైపు మాత్రమే ఉంటే అది ‘మైగ్రేన్’. ఎక్కువ ఎండలో నిల్చున్నా లేదా పెద్ద శబ్దం విన్నా ఈ తరహా తల నొప్పి ఎక్కువ అవుతుంది. ∙తల లోపల ఎక్కువ ఒత్తిడి అనిపించినా, తల చుట్టూ ఏదో చుట్టేసినట్టుగా అనిపించినా అది మానసిక ఒత్తిడి వల్ల వచ్చినట్టే. సహజంగా ఇది ప్రమాదకరమైన తలనొప్పి కాదని భావించవచ్చు. ∙నుదుటి వెనుక, కళ్ల మధ్య, కంటి దిగువన, తల వెనుక నొప్పి వస్తే అది సైనస్ తల నొప్పి. సాధారణంగా సైనస్ తల నొప్పులు దీర్ఘకాలంగా ఉంటాయి. ∙తలనొప్పితోపాటు కళ్లు ఎర్రబడడం, వాయడం, కళ్ల నుంచి నీళ్లు రావడం వంటివి జరిగితే అది ‘క్లస్టర్ తల నొప్పి’. ∙కొన్నిరకాల ఆహార పదార్థాలు తీసుకున్నా లేదా కొన్ని రకాల వాసనలు పీల్చినా తలనొప్పి వస్తే అది ‘అలెర్జీ తల నొప్పి’. ∙జెనెటిక్ కారణాలతోపాటు, పరిసరాలూ వాతావరణ పరిస్థితులూ కూడా తలనొప్పికి కారణం కావచ్చు. వయసు, జాతి, వర్గ, వర్ణ లింగ భేదం లేకుండా అందరినీ పట్టి పీడించే అతి సాధారణ సమస్య తలనొప్పి. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో దీనిబారిన పడకుండా వుండరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం ప్రపంచ జనాభాలో సగం మంది కనీసం సంవత్సరానికొకసారయినా తలనొప్పితో బాధపడుతూ వుంటారంటే, తలనొప్పి ఎంత సాధారణ సమస్యో అర్థం అవుతుంది. అలాగని కేవలం సాధారణ సమస్యగా కూడా దీనిని తీసిపారేయడానికి వీలు లేదు. తలనొప్పికి సాధారణమైన, ప్రమాదంలేని కారణాలతోబాటు అసాధారణమైన, ప్రమాదకరమైన జబ్బులు కూడా కారణం కావచ్చు. తలనొప్పి రకరకాల కారణాల వల్ల వస్తుంది. ముందు కారణాలు తెలుసుకోవాలి. తర్వాత అది సాధారణ సమస్యా, అసాధారణ సమస్యా అన్నది నిర్ధారించుకుంటే, దాని నివారణోపాయాలు తెలుసుకోవచ్చు. తలనొప్పి గురించి, దానికి ఉపశమన చర్యల గురించి చెప్పుకుందాం... సాధారణ తలనొప్పుల నుంచి ఉపశమనం కోసం... ∙ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి తగ్గుతుంది. ∙గోరు వెచ్చని ఆవుపాలు సైతం తలనొప్పి నివారణిగా పనిచేస్తుందట. ∙తలనొప్పిని తగ్గించడంలో యూకలిప్టస్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ∙కప్పు పాలలో కొద్దిగా రాతి ఉప్పును కలిపి ఆ పాలు తాగితే తలనొప్పి తగ్గుతుంది. ∙మంచి గంధపు చెక్క ఉంటే, దానిని సాన మీద అరగతీసి నుదుటి మీద పట్టు వేసుకుంటే కొద్దిసేపటిలోనే తలనొప్పి మాయమవుతుంది. గంధపు చెక్క, సాన లేకపోతే ఇంటిలో రెడీగా ఉన్న చందనం పొడిని పేస్టులా చేసుకుని నుదుటికి, కణతల మీద పట్టు వేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ∙చిన్న అల్లం ముక్క, యాలకులు దంచి వేసిన టీ లేదా కొద్దిగా స్ట్రాంగ్ కాఫీని తాగడం ∙చిన్న అల్లం ముక్కను పై పొట్టు తీసి దానిని మెల్లగా నమిలినా తలనొప్పి తగ్గుతుంది. ∙డార్క్ చాకొలేట్ లేదా మామూలు చాకొలేట్ చప్పరించినా తలనొప్పి ఉపశమిస్తుంది. ∙వెలుతురు తక్కువగా... ఏకాంతంగా ఉండే గదిలో కాసేపు విశ్రాంతి తీసుకోవడం కూడా సత్ఫలితాలనిస్తుంది. ∙కొద్దిగా వెల్లుల్లిని తీసుకుని నీటితో కలిపి పేస్టులా చేయండి. ఆ మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే చాలు తలనొప్పి తగ్గుతుంది. ∙తలనొప్పిని తగ్గించడంలో కొబ్బరి నూనె చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని కాస్త మాడు మీద వేసుకుని మర్దనా చేసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ∙విటమిన్–ఇ, ఈ, బి 12, కాల్షియం ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. తలనొప్పిగా ఉన్నప్పుడు మసాలా ఫుడ్‌ను అస్సలు తీసుకోవద్దు. ∙మంచి నిద్ర, వ్యాయామం తలనొప్పిని దరిచేరకుండా చూడడంలో కీలకపాత్ర వహిస్తాయి. తలనొప్పి తెప్పించే ఆహారం... ∙కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల తల నొప్పి రావడమో లేదా తల నొప్పి ఎక్కువవడమో జరగొచ్చని అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా.. కొంతమందికి ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్, చాక్లెట్స్, కెఫిన్, ఫ్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, ఐస్ క్రీమ్స్ వంటివి కొంత మందిలో తల నొప్పికి కారణమవుతుంటాయి. తలనొప్పి తగ్గించే ఆహారం... ∙జీడిపప్పు, పిస్తా, బాదం పప్పులు వంటివి పెయిన్ కిల్లర్స్‌గా పని చేస్తాయి. తల నొప్పిని తగ్గిస్తాయి. ∙మైగ్రేన్‌తో బాధపడేవారు క్రమం తప్పకుండా పుదీనా తీసుకుంటే మంచిది. అల్లంలో కూడా మైగ్రేన్ తల నొప్పిని తగ్గించే లక్షణం ఉంది.∙చెర్రీస్ తింటే తల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది పనిభారం ఎక్కువ కావడం వల్ల వచ్చే తలనొప్పి విషయంలో బాగా పని చేస్తుంది. ∙కొన్నిసార్లు డీహైడ్రేషన్ వల్ల కూడా తల నొప్పులు వస్తాయి. అందుకే నీటి శాతం ఎక్కువగా ఉండే కీరా దోస వంటివి ఆహారంలో చేర్చుకుంటే మంచిది. ∙అరటి పండ్లు, కొద్ది మొత్తంలో కాఫీ, బ్రకోలీ, పాలకూర వంటివి తలనొప్పిని నివారిస్తాయి. కొన్ని రకాల ఆసనాల వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా తల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ∙ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే సంరక్షణగా క్యాప్ పెట్టుకుంటే మంచిది. ∙తల స్నానం చేసిన వెంటనే పూర్తిగా ఆరబెట్టకపోతే తల నొప్పి వచ్చే అవకాశాలెక్కువ. అందుకే స్నానం చేసిన తర్వాత కచ్చితంగా హెయిర్ డ్రైర్‌తో లేదా ఫ్యాన్ కింద కూర్చుని కురులను ఆరబెట్టుకోవాలి. ∙కంప్యూటర్ను చూస్తూ వర్క్ చేసే వారికి తరచూ తల నొప్పి వస్తుంటుంది. అందుకే మధ్య మధ్యలో పనికి విరామం ఇవ్వాలి. స్క్రీన్ బ్రైట్‌నెస్‌ని తక్కువగా పెట్టుకోవాలి. ∙కంటి నిండా నిద్ర లేకపోతే తల నొప్పి ఖాయం. అందుకే.. రోజుకు కనీసం 8 గంటల నిద్ర ఉండాలి. ఇతర సమస్యల వల్ల వచ్చే తలనొప్పి ∙నేత్ర వ్యాధుల వల్ల దృష్టి దోషాలూ, ట్యూమర్లూ, అక్యూట్ కంజెస్టివ్ గ్లాకోమా ∙చెవిలో గుల్లలూ, వాపులూ, చీముగడ్డలు ∙‘సైనసైటిస్ ‘లో వచ్చే ‘సైనస్ హెడేక్’ నుదురు దగ్గర,ముక్కు మొదట, దవడ ఎముకల దగ్గర నొప్పి అనిపిస్తుంది, ముందుకు వంగినా దగ్గినా తుమ్మినా ఎక్కువ అవుతుంది. ∙జీర్ణాశయ సమస్య లు, వాంతులు, విరేచనాలు, హై బీపీ. ∙బ్రెయిన్ ట్యూమర్, ఇతర కాన్సర్లలో తలనొప్పినే ప్రధాన లక్షణంగా గుర్తిస్తారు. ∙చిన్న పిల్లలలో అంటే 10–20 మధ్య వయసు వారిలో మెదడు లో చేరిన పురుగుల గుడ్లు తలనొప్పికీ, ఫిట్స్కీ కారణం కావచ్చు. ∙మెనింజైటిస్, ఎన్ సెఫలైటిస్ వీటిలో తీవ్రమైన తలనొప్పి వుంటుంది. -
కరోనా కట్టడి: ‘ఇది కొరియా షైన్ సక్సెస్’
ప్యాంగ్యాంగ్: కరోనా కట్టడికి విధించిన నిబంధలనలకు ఎలాంటి సడలింపులు ఇచ్చేది లేదని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా చైనా సరిహద్దును ఇప్పట్లో తెరిచేది లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో కరోనా వైరస్ వెలుగు చూసిన నాటి నుంచి ఉత్తర కొరియా అన్ని సరిహద్దులను మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఉత్తర కొరియా అధికార మీడియా వేదికగా కథనాలు ప్రచురించింది. ఈ విషయాన్ని గురువారం నాటి సమావేశంలో మరోసారి పునరుద్ఘాటించిన కిమ్.. ప్రపంచమంతా ఆరోగ్య సంక్షోభంలో మునిగిపోయిన వేళ తమ దేశం మాత్రం సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పరిస్థితి చేజారలేదని వ్యాఖ్యానించారు. అయితే పొరుగు దేశాల్లో ఇప్పటికీ మహమ్మారి విజృంభిస్తోందని.. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇక ఉత్తర కొరియా అధికార వార్తా పత్రిక ఈ సమావేశానికి హాజరైన కిమ్, ఇతర అధికారుల ఫొటోలను ప్రముఖంగా ప్రచురించింది. అయితే ఇందులో కిమ్‌తో సహా ఎవరూ కూడా మాస్క్ ధరించకపోవడం గమనార్హం. మీడియా సమావేశంలో కిమ్ మాట్లాడుతూ... ‘దేశంలో కరోనా కట్టడికి చేపట్టిన చర్యలు సత్పలితాలిస్తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీనిని ‘షైన్ సక్సెస్’గా చెప్పాలి. అలా అని ఊపిరి పీల్చుకోవడానికి వీలులేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. మన పొరుగు దేశమైన చైనాలో మహమ్మారి తగ్గుముఖం పట్టి మళ్లీ వ్యాపిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి’ అని హెచ్చరించారు. (సోదరి ఆదేశాలు.. సైనిక చర్య వద్దన్న కిమ్!) ఇప్పటికే ప్యాంగ్యాంగ్కు రాకపోకలపై నిషేధం విధించామని కిమ్ తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 30 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి లేకపోతే ప్రభుత్వం కఠిన చర్యలు తిసుకుంటుదని హెచ్చరించారు. అయితే ప్యాంగ్యాంగ్లోని పలు రాయబార కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసినట్లు కిమ్ చెప్పారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం చైనా సరిహద్దును తెరిచేందుకు వీలు లేదని, దీనివల్ల దేశం తీవ్ర ఆర్థిక నష్టాన్ని చూడాల్సి వస్తుంది. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తున్నందున సరిహద్దులను మూసివేయడం తప్ప ఉత్తర కొరియాకు వేరే మార్గం లేదని ఇన్ట్సీట్ట్యూట్ ఫర్ నేషనల్ యూనిఫికేషన్ ఉత్తర కొరియా డివిజన్ డైరెక్టర్ హాంగ్ మిన్ పేర్కొన్నారు. పతనమైన ఆర్థిక వ్యవస్థ కరోనా నేపథ్యంలో కిమ్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైపోయిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఉత్తర కొరియా మిత్ర దేశమైన చైనాకు చెందిన ఎకనమిక్ రీసెర్చ్ సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు 90 శాతం మేర పడిపోయాయి. ఇదిలా ఉండగా.. కరోనా విజృంభిస్తున్న తొలినాళ్లలో చైనా సహా ఇతర దేశాలకు వెళ్లి వచ్చిన అధికారులు, వ్యాపారులకు కఠిన నిబంధనలు విధించడమే గాకుండా.. కరోనా సోకిన వారిని ఉత్తర కొరియా దారుణంగా హతమార్చిందనే వార్తలు ప్రచారమైన విషయం తెలిసిందే. -
దేశ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా
సాక్షి, ఢిల్లీ: కరోనా నివారణకు కేంద్రం అన్నిచర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిరోజూ అన్నిరాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాల్లో పర్యవేక్షణ కోసం జాయింట్ సెక్రటరీలను నియమించామని తెలిపారు. జనవరి 26 నుంచి అన్ని విమానాశ్రయాల్లో పరీక్షలు ప్రారంభించామని పేర్కొన్నారు. కరోనా అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. (కరోనా సునామీ: ఒక్క రోజే 33 కేసులు) రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఓడల ద్వారా వచ్చే సరకు రవాణాను నిషేధించామని వెల్లడించారు. విదేశాల్లో ఉన్న రాయబారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని తెలిపారు. దేశ సరిహద్దుల్లో కట్టుదిట్టుమైన నిఘా పెట్టామని తెలిపారు. మనీలాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలలో సామూహిక ప్రార్థనలు సాధ్యమైనంత వరకు తగ్గించాలని కోరారు. కరోనా నేపథ్యంలో జనగణన ను వాయిదా వేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. (ఇటలీ వీధుల్లో కరోనా విజృంభణ) -
టీడీపీ నేతల అత్యుత్సాహం
సాక్షి, నెల్లూరు(కలిగిరి) : మండలంలోని భట్టువారిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించి తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలను అడ్డుకోవడానికి టీడీపీ నాయకులు విశ్వప్రయత్నాలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి తగిన బలం లేకపోయినప్పటికీ ఎలాగైనా ఎన్నికను నిలిపివేయాలని అత్యుత్సహం చూపారు. పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించి మొత్తం 47 ఓట్లు ఉన్నాయి. ప్రధానోపాధ్యాయుడు ఎం.ప్రభాకరరావు, కానిస్టేబుల్ గోపీ సమక్షంలో ఓటర్లను పేరుపేరునా పిలిచారు. ఓ వర్గానికి అనుకూలంగా ఉన్న వారు 30 మంది ఎన్నికలు నిర్వహించే గదిలోకి వెళ్లారు. టీడీపీ నాయకుల వద్ద ఉన్న 17 మందిని పాఠశాల ఆవరణలోనే ఒక్క పక్కన ఉంచి లోపలికి పంపలేదు. సరిపడా కోరం ఉండడంతో హెచ్ఎం ఎన్నికను ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత టీడీపీ నాయకులు అక్కడి చేరుకొని ఎన్నికను అడ్డుకొని రసాభాస చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఎస్సై పి.ఆదిలక్ష్మి అక్కడి చేరుకున్నారు. ఉద్దేశపూర్వకంగా ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తున్న టీడీపీ నాయకులను మందలించారు. పాఠశాల ఆవరణలో నుంచి ఇరువర్గాలను బయటకు పంపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుండడంతో ఎస్సై ఆదిలక్ష్మి విధి నిర్వహణలో వేరే గ్రామానికి వెళ్లగా టీడీపీ నాయకులు మరలా ఎన్నికలను నిలిపివేయడానికి కుటిల యత్నాలు మొదలుపెట్టారు. సమాచారం అందుకున్న ఎస్సై మరలా పాఠశాల వద్దకు చేరుకొని టీడీపీ నాయకులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పాఠశాల ఎన్నికల్లో జ్యోకంగా చేసుకోవడం సరికాదని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మందలించారు. ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షించి ఎన్నికలను ప్రశాంతంగా ముగించారు. చైర్మన్‌గా ఆదినారాయణమ్మ గెలుపొందగా, వైస్ చైర్మన్‌గా పెసల శ్రీదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
స్మార్ట్‌ఫోన్‌తో సైబర్ నేరాలకు చెక్
న్యూయార్క్: స్మార్ట్ఫోన్లలో తీసిన ఫొటోను క్షుణ్నంగా పరిశీలించి అది ఏ ఫోన్‌ను ఉపయోగించి తీసిందో కనిపెట్టే కొత్త సాంకేతికతను శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. భద్రత పరంగా వేలిముద్రలు, పాస్వర్డ్లు, పిన్ నంబర్లకు ఈ సాంకేతికత ప్రత్యామ్నాయం కాగలదనీ, దీనిని ఉపయోగించి సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని వారు చెబుతున్నారు. ప్రపంచంలో ఏ రెండు స్మార్ట్ఫోన్ల నుంచి తీసిన ఫొటోలు కూడా ఒకేలా ఉండవనీ, దీనికి కారణం ప్రతి ఫోన్ నుంచి తీసే ఫొటోల్లో చాలా సూక్ష్మమైన లోపాలు ఉండటమనేనని వారు వివరిస్తున్నారు. ఫొటో–రెస్పాన్స్ నాన్–యూనిఫామిటీగా పిలిచే ఓ కొత్త విధానం ద్వారా ఇలాంటి లోపాలను కనిపెట్టవచ్చనీ, తద్వారా ఏ ఫొటో ఏ ఫోన్ నుంచి తీసిందో గుర్తించగలరని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. -
గంజాయి రవాణ అడ్డుకునేందుకు 10 చెక్‌పోస్టులు
-
మహిళా సదస్సును అడ్డుకునేందుకు టీడీపీ కుయుక్తులు
-
నీటి ఎద్దడి నివారణకు చర్యలు
హిందూపురంలో వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయండి ఈఎన్సీ పాండురంగారావు అనంతపురం న్యూసిటీ : వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముం దస్తు చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య విభాగం చీఫ్ ఇంజినీర్ (ఈఎన్సీ) పాండురంగరావు మునిసిపల్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని ఓ హోటల్లో అనంతపురం నగరపాలక సంస్థ, హిందూపురం మునిసిపాలిటీ, కర్నూలు నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో ఈఎన్సీ సమావేశమయ్యారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా గార్లదిన్నె ప్రాజెక్ట్, పందిపాడు రిజర్వాయర్, ముచ్చుమర్రి రిజర్వాయర్ నుంచి కెనాల్‌కు నీరు తీసుకొచ్చి, అక్కడి నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు నీరు నింపాలన్నారు. మార్చి, ఏప్రిల్, మే వరకు నీటి సమస్య ఉండదన్నారు. హిందూపురంలో చాలా ప్రాంతాల్లో నీటి సమస్య ఉందని ఈఎస్సీ దృష్టికి మునిసిపల్ అధికారులు తీసుకెళ్లారు. నిధులు ఏమేరకు ఉన్నాయని ఎస్ఈ శ్రీనాథ్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ట్యాంకర్లకు వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను తప్పక అమర్చాలన్నారు. ఎన్ని కిలో మీటర్లు తిరిగినది, నీరు సరఫరా చేసిన విధా నం తప్పక నమోదు చేయాలన్నారు. ఇష్టారాజ్యంగా బిల్లులు పెడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించా రు. అలాగే గొ ల్లపల్లి రిజర్వాయర్ పైప్‌లైన్ పనులు ఎం త వరకు వచ్చాయని, వాటి డీపీఆర్‌ను పరిశీలించారు. నీటి సమస్య లేదు : అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో నీటి సమస్య లేదని, పీఏబీఆర్ డ్యాంలో 2.5 టీఎంసీ నీరు నిల్వ ఉందని ఎస్ఈ సురేంద్రబాబు ఈఎన్‌సీకు వివరించారు. వేసవికాలంలో 0.6 నుంచి 0.7 టీఎంసీ ఉండే సరిపోతుందన్నారు. సమా వేశంలో కర్నూలు ఎస్ఈ శివరామిరెడ్డి, ఈఈ రాజశేఖర్, డీఈ రమణమూర్తి, హిం దూపురం కమిషనర్ విశ్వనాథ్, ఈఈ రమేష్, ఏపీఎండీసీ ఈఈ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. డిసెంబర్‌లోపు పనులు పూర్తికావాలి ప్రణాళికతో పైపులైన్ పనులు వేగవంతంగా చేసి, డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఐహెచ్పీ కంపెనీ నిర్వాహకులు, ఏపీఎండీపీ అధికారులను ప్రజారోగ్య విభాగం ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ ( ఈఎన్సీ) పాండురంగారావు ఆదేశించారు. పైపుల నిల్వ ఎంత ఉంది..ఎన్ని కిలో మీటర్ల పైపులైన్ వేశారని ఆరాతీశారు. అలాగే ఇనుము నాణ్యతను పరిశీలించారు. అందుకు ఏపీఎండీపీ ఈఈ రామ్మోహన్ రెడ్డి 130 కిలో మీటర్లకు సరిపడా పైపులు, ఇతర సామగ్రి అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఈఈ సురేంద్రబాబు, ఏఈ సుభాష్, ఐహెచ్పీ కంపెనీ ప్రతినిధులు క్రాంతి కుమార్, శర్మ తదితరులున్నారు. -
అగ్ని ప్రమాదాల నివారణపై శిక్షణ
కర్నూలు(హాస్పిటల్): అగ్ని ప్రమాదాల నివారణపై శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శిక్షణ ఇచ్చారు. జిల్లా అగ్నిమాపక అధికారి ఎం. భూపాల్‌రెడ్డి ఆద్వర్యంలో ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బందికి అంశాల వారీగా తర్ఫీదునిచ్చారు. ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంటల్లో చిక్కుకున్న వారిని ఏ విధంగా రక్షించాలనే అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక సహాయ అధికారి జి. బాలరాజు, జాయ్ సెక్యూరిటి మేనేజర్ జాయ్ కుమార్ పాల్గొన్నారు. -
పాలివ్వొద్దంటూ భార్యను అడ్డుకున్న భర్తపై చర్యలు
కోజీకోడ్: అప్పుడే పుట్టిన బిడ్డకు పాలివ్వొద్దంటూ భార్యను అడ్డుకున్న ఓ వ్యక్తిపై కోజీకోడ్ జిల్లా కలెక్టర్ చర్యలకు ఆదేశించారు. 'ఏ మతం కూడా పుట్టిన బిడ్డను ఆకలితో ఉంచమని చెప్పదు.. ఈ చర్యకు పాల్పడిన, అందుకు ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే' అంటూ కలెక్టర్ ప్రశాంత్ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కోజికోడ్ జిల్లా ముక్కమ్ లోని ఓ ఆసుపత్రిలో అబూబాకర్ సిద్ధిక్ అనే వ్యక్తి భార్య బుధవారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన వెంటనే పాలు పట్టమని ఆసుపత్రి సిబ్బంది తల్లికి సూచించారు. అయితే.. బిడ్డకు పాలివ్వడానికి వీలు లేదంటూ అబూబాకర్ భార్యను అడ్డుకున్నాడు. పుట్టిన బిడ్డ ప్రార్థనలు వినేంతవరకు పాలుపట్టడానికి వీలు లేదంటూ అడ్డుకున్నాడు. ఈ విషయంలో ఆసుపత్రి సిబ్బంది అబూబాకర్‌కు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా అతడు మాత్రం తన పట్టు వీడలేదు. తనకు మొదటి బిడ్డ పుట్టినప్పుడు సైతం ఇలాగే చేశానని.. అతడు ఆరోగ్యంగానే ఉన్నాడంటూ వాదించాడు. అంతేకాదు.. బిడ్డకు ఏదైనా జరిగితే ఆసుపత్రి వారికి ఎలాంటి సంబంధం లేదు అంటూ పేపర్‌పై సంతకం కూడా చేశాడు. ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం గురువారం మధ్యాహ్నం తరువాతే బిడ్డకు పాలుపట్టారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో విచారణ జరపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్థానిక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు శుక్రవారం అబూబాకర్, ఆయన భార్యను విచారించారు. అయితే.. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రానందున కేసు నమోదు చేయలేదని స్థానిక పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. దీనిపై అబూబకర్ నుంచి వివరణ కోరామని తెలిపారు. -
అరికట్టకపోతే ఆత్మహత్యలే
యాడికి : పవర్‌లూమ్స్‌ను అరికట్టకపోతే చేనేతలకు ఆత్మహత్యలే శరణ్యమని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజనేయులు ఆవేదన చెందారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం యాడికిలో నిర్వహించిన చేనేతల మహా ధర్నాలో ఆయన పాల్గొన్నారు. పవర్‌లూమ్స్ రాకతో చేనేత వృత్తి పూర్తిగా అంతరించిపోతోందన్నారు. జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, చేనేత రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. శిల్క్‌హౌస్‌ల పేరుతో పవర్‌లూమ్స్ చీరలను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, చేనేతల రుణమాఫీని అమలు చేయాలని, కొత్త రుణాలు మంజూరు చేయాలని కోరారు. అనంతరం తహశీల్దార్ కుమారస్వామికి వినతిపత్రం ఇచ్చారు. చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మామిళ్ల నారాయణస్వామి, మండల అధ్యక్షుడు మోహన్, అభివృద్ధి వేదిక కన్వీనర్ కులశేఖర్‌నాయుడు, సీపీఎం పట్టణ కార్యదర్శి బషీర్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
విష జ్వరాలు రాకుండా చర్యలు తీసుకోవాలి
l ఆరోగ్యశాఖ సిబ్బందికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు ఎంజీఎం : జిల్లాలో మలేరియా, డెంగీ వ్యాధి కేసులు గుర్తించి, తగిన చికిత్స అందించాలని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులను ఆదేశించారని డీఎంహెచ్ఓ సాంబశివరావు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నాం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయా జిల్లాల వైద్యశాఖ సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. కలుషిత నీటి వల్ల వ్యాధుల రాకుండా చర్యలు తీసుకోవాలని, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాలతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. అడిషనల్ డీఎంహెచ్ఓ శ్రీరాం, డీఐఓ హరీశ్‌రాజు, జబ్బార్, కోఆర్డినేటర్ శ్యామ నీరజ, ఐడీఎస్పీ కృష్ణారావు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న కర్ఫ్యూ, ఆంక్షలు
శ్రీనగర్: కశ్మీర్లో పోలీసుల పహారా కొనసాగుతోంది. వేర్పాటువాదులు ఈ నెల 31 వరకు ఆందోళనలు కొనసాగుతాయని ప్రకటించిన నేపథ్యంలో.. శ్రీనగర్ పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ, ఆంక్షలు కొనసాగుతున్నాయని సీనియర్ పోలీస్ అధికారి శుక్రవారం మీడియాతో వెల్లడించారు. అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా ప్రజలంతా సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వాని ఎన్‌కౌంటర్‌తో చెలరేగిన హింసతో ఇప్పటివరకు ఇద్దరు పోలీసులతో పాటు 48 మంది పౌరులు మృతి చెందారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బుధవారం మాట్లాడుతూ.. అనంతనాగ్‌లో ఎన్కౌంటర్ జరిగిన సమయంలో బుర్హాన్ ఆ ఇంట్లో ఉన్న విషయం భద్రతా బలగాలకు తెలియదని.. ఒకవేళ తెలిస్తే లొంగిపోవడానికి అవకాశం ఇచ్చి ఉండేవారని పేర్కొన్న విషయం తెలిసిందే. -
అంతరిక్ష యాత్రికుల కోసం 'స్పేస్ బూట్'
న్యూయార్క్: అంతరిక్ష యాత్రికుల కోసం మసాచూసెట్స్ యూనివర్సిటీ పరిశోధకులు కొత్త రకం బూట్లను(స్పేస్ బూట్) తయారుచేశారు. ప్రత్యేకమైన సెన్సార్లు, హ్యాప్టిక్ మోటార్లతో రూపొందించిన ఈ బూట్లు వైబ్రేషన్స్ కలిగిస్తాయి. ఈ వైబ్రేషన్ల మూలంగా ఆస్ట్రోనాట్లు అంతరిక్షంలో చిన్నచిన్న ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ఉండొచ్చని పరిశోధకులు వెల్లడించారు. అంతరిక్ష యాత్రికులకు వారి బరువైన స్పేస్ సూట్ మూలంగా ఉన్నటువంటి అసౌకర్యాన్ని ఈ స్పేస్ బూట్ తొలగిస్తుందని పరిశోధకురాలు లియా స్టిర్లింగ్ తెలిపారు. 'భారీ వ్యయంతో కూడిన అంతరిక్ష యాత్రల్లో ఆస్ట్రోనాట్లు కొన్నిసార్లు నియంత్రణ కోల్పోయి కింద పడటం మూలంగా వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లడంతో పాటు.. ప్రాజెక్ట్ మొత్తం ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ బూట్ల ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు' అని ఆమె వెల్లడించారు. -
ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : డీఎం
కోదాడఅర్బన్: ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు తమ విధి నిర్వహణలో ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు వహించాలని కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు సూచించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రమాద రహిత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కోదాడ డిపోలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయాణికుల భద్రతే సంస్థ ప్రధాన విధి అని, ప్రమాద రహిత డ్రైవింగ్ సంస్థకు ప్రధాన ఆధారమని ఆయన అన్నారు. డ్రైవర్లు, సిబ్బంది ఆర్టీసీని ప్రమాదాల బారి నుంచిల కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ సైదులు, మెకానికల్ సూపర్వైజర్ బాలయోగి, ఆర్ఎం కార్యాలయ అసిస్టెంట్ ఇంజనీర్ విజయ్, కార్మిక సంఘాల నాయకులు కేవీ రత్నం, సుధాకర్‌గౌడ్, సామేలు, సీతయ్య, ప్రసాద్, పలువురు కార్మికులు పాల్గొన్నారు. -
ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : డీఎం
కోదాడఅర్బన్: ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు తమ విధి నిర్వహణలో ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు వహించాలని కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు సూచించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రమాద రహిత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కోదాడ డిపోలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయాణికుల భద్రతే సంస్థ ప్రధాన విధి అని, ప్రమాద రహిత డ్రైవింగ్ సంస్థకు ప్రధాన ఆధారమని ఆయన అన్నారు. డ్రైవర్లు, సిబ్బంది ఆర్టీసీని ప్రమాదాల బారి నుంచిల కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ సైదులు, మెకానికల్ సూపర్వైజర్ బాలయోగి, ఆర్ఎం కార్యాలయ అసిస్టెంట్ ఇంజనీర్ విజయ్, కార్మిక సంఘాల నాయకులు కేవీ రత్నం, సుధాకర్‌గౌడ్, సామేలు, సీతయ్య, ప్రసాద్, పలువురు కార్మికులు పాల్గొన్నారు. -
అప్రమత్తతతో ప్రమాదాల నివారణ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : రహదారిపై వాహనాలు నడిపే ప్రతి డ్రైవరూ అప్రమత్తంగా వ్యవరిస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యమని ట్రాఫిక్ డీఎస్పీ మేకా సుధాకర్ అన్నారు. స్థానిక ఆర్టీసీ డిపో గ్యారేజ్‌లో శుక్రవారం ఆర్టీసీ ప్రమాద రహిత వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డ్రై వర్లు విధులకు హాజరయ్యే ముందు మానసిక ప్రశాంతతో ఉండాలన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ డ్రై వర్లు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలని సూచించారు. ఏటా శిక్షణ తరగతులు ఆర్టీసీలో డ్రై వర్లకు సంస్థ ఏటా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తూ వారిలో నైపుణ్యాభివద్ధికి తోడ్పడుతుందని ఆర్టీసీ డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎస్.మురళీకష్ణ అన్నారు. సంస్థలో చేరిన నాటి నుంచి ప్రమాద రహితంగా డ్రై వింగ్ చేస్తూ సంస్థకు గర్వకారణంగా నిలిచిన ఎందరో డ్రై వర్లు ఉన్నారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ ప్రమాద బాధితులకు ఆర్టీసీ నష్టపరిహారంగా రూ.60 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని, ఈ సొమ్ము సంస్థకు మిగిలితే కార్మికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే అవకాశముండేదన్నారు. ఏలూరు డిపో మేనేజర్ ఎ.సుబ్రహ్మణ్యం, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. -
గైట్ విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ
రాజానగరం: బస్సుల్లో సంభవించే అగ్ని ప్రమాదాల నుంచి భద్రత కల్పించే ఆటోమేటిక్ వ్యవస్థను తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని గైట్ కళాశాల ఆటోమొబైల్ విభాగం విద్యార్థులు రూపొందించారు. అకడమిక్ ప్రాజెక్టులో భాగంగా హెచ్ఓడీ వి.సుబ్రహ్మణ్యం మార్గదర్శకత్వంలో టీడీఎస్ సుబ్బారెడ్డి, జి.మణికంఠ, కె.మురళీకృష్ణ, కె.దుర్గాశ్రీకాంత్ దీనిని రూపొందించారు. తొలుత ఒక బస్సు మోడల్ని తయారుచేశారు. ఇదే కళాశాలలో ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న టి. వెంకటశివారెడ్డి సహకారంతో బస్సు క్యాబిన్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు అప్రమత్తం చేసే వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రమాదం జరిగిన వెంటనే బస్సు ఇంజన్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. అత్యవసర ద్వారం తెరుచుకుని కార్బన్ డై ఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది. ముందుగా నిర్ణయించిన మొబైల్ నంబర్లకు సంఘటన జరిగిన ప్రాంతం వివరాలను సంక్షిప్తంగా మెసేజ్ పంపిస్తుంది. ఈ వ్యవస్థకు ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్ (ఎఫ్డీఎస్ఎస్) అని పేరుపెట్టారు. -
'జెట్ లాగ్'కు ఫ్లాష్ లైట్ థెరపీ...
సుదీర్ఘ ప్రయాణం అంటే భయం వేస్తోందా? జెట్ లాగ్ సమస్య మిమ్మల్ని వేధిస్తోందా? కొత్త టైమ్ జోన్ లో అలవాటు పడటానికి ఇబ్బందులు పడుతున్నారా? అటువంటి వారికి ఫ్లాష్ లైట్ చికిత్స ఎంతో సహాయ పడుతుందంటున్నారు పరిశీలకులు. ఈ కొత్త టెక్నిక్... టైమ్ జోన్ మారినా నిద్ర లేవడంలో రీఫ్రెష్ ఫీలింగ్ తెస్తుందంటున్నారు. ప్రయాణానికి ముందు నిద్రపోయే సమయంలో ఫ్లాష్ లైట్ థెరపీ చేయడం జెట్ లాగ్ ను అధిగమించేందుకు ఉత్తమ మాగ్గమని చెప్తున్నారు. ప్రయాణానికి ముందు రాత్రి నిద్రించే సమయంలో ఫ్లాష్ లైట్ల వెలుగులో నిద్రిస్తే మంచిదంటున్నారు. ఫ్లాష్ లైట్ థెరపీ శరీరంలో అలవాటు పడ్డ సమయాన్ని సరి చేస్తుందని తాజా పరిశోధనల్లో కనుగొన్నారు. సుదీర్ఘ ప్రయాణం చేయాలనుకునే ముందు కొత్త టైమ్ జోన్ కు అలవాటు పడాలంటే ఫ్లాష్ లైట్ థెరపీతో అధిక ప్రయోజనం ఉంటుందంటున్నారు. కొత్త ప్రదేశానికి వెళ్ళినపుడు శరీరం అక్కడి పరిస్థితులకు, సమయానికి అలవాటు పడేవరకూ జెట్ లాగ్ ఇబ్బంది పెడుతుంటుంది. దీంతో అరుగుదల తగ్గి కడుపులో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే విషయాలపట్ల ఏకాగ్రత తగ్గడం, అలసటగా ఉండి.. విసుగు చెందడం వంటి అనేక సమస్యలు కూడ వస్తుంటాయి. కొన్ని గంటలపాటు పగటిపూట ప్రకాశవంతమైన లైట్ దగ్గర కూర్చొని లైట్ థెరపీ చికిత్స తీసుకోవడం జెట్ లాగ్ లక్షణాలను తగ్గించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని ఇంతకు ముందు తెలిసినదే. అయితే నిద్ర సమయంలో ఫ్లాష్ లైట్ థెరపీ జెట్ లాగ్ సమస్యకు అత్యంత ఉపయోగపడుతుందని నూతన పరిశోధనలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న ఇతర పద్ధతులకన్నా ఈ తాజా పరిశోధనలు తక్కువ సమయంలో జెట్ లాగ్ నుంచి ఉపశమనం కలిగిస్తాయని అమెరికా స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ కు చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ జామీ జెట్జర్ చెప్తున్నారు. కళ్ళు మూసుకొని పడుకొని ఉన్పపుడు రెటీనా పై పడే ఫ్లాష్ లైట్... సంకేతాల ద్వారా... మెదడులోని రోజువారీ వ్యవస్థను సరిచేస్తుందని ఆయన చెప్తున్నారు. రెండువారాల పాటు ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయి, లేచేట్టు సుమారు 19 నుంచి 39 ఏళ్ళ మధ్య వయస్కులపై పరిశోధనలు జరిపారు. అలాగే నిద్రపోయే సమయంలో ఫ్లాష్ లైట్, లేదా పూర్తిగా లైట్ ను ప్రయోగించి చూశారు. పూర్తిగా ప్రకాశవంతమైన లైట్ కేవలం 36 నిమిషాల తేడాను మాత్రమే చూపించగా... ఫ్లాష్ లైట్ తో ఎక్కువ ప్రయోజనం కలిగినట్లు గుర్తించగలిగారు. అందుకే సుమారు 2000 మైళ్ళకు మించి ప్రయాణం చేయాలనుకున్నవారు ముందురోజు రాత్రి టైమ్ జోన్ మార్పులకు అలవాటు పడేందుకు ఫ్లాష్ లైట్ థెరపీని చేయాలని జెట్జర్ సూచిస్తున్నారు. అంతేకాక ఫ్లాష్ లైట్ వల్ల నిద్ర పట్టదు అన్న అపోహ ఎంతోమందికి ఉంటుందని, అది నిజం కాదని... ఆయన చెప్తున్నారు. ఈ థెరపీ నైట్ షిఫ్ట్ లో పనిచేసే వారికి, లారీ డ్రైవర్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు ఓ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ జర్నల్ లో ప్రచురించారు.