![A Way To Prevent Phlegm In the Throat For Old Age People - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/22/Old.jpg.webp?itok=qzy8g29H)
వయసు మళ్లాక వచ్చే సమస్యలు అన్నిఇన్ని కావు. ఏది తినాలన్న భయం. పైగా ఏది అంత తొందరగా జీర్ణం కాదు. దీంతో అన్ని జావా, సూప్ మాదిరిగా తీసుకుంటుంటారు. ఘన పదార్థాలు తీసుకోనే అవకాశం లేకపోవడం, ఇతరత్ర సమస్యలు కారణంగా గొంతులో కఫం పేరుకుని ఇబ్బంది పెడుతుంది. దీని నుంచి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు ఆయుర్వేద నిపుణుల నవీన్ నడిమింటి. వీటిని వృద్ధులే కాక ఎవ్వరైనా వాడొచ్చని అంటున్నారు.
గొంతు కఫాన్ని నివారించే మార్గం..
- ఆయుర్వేదిక్ షాప్ లో మాసికాయ అని ఉంటుంది. అది తీసుకువచ్చి బుగ్గని పెట్టి చప్పరిస్తూ ఉంటే ఆ రసం మన కడుపులో దిగి కఫం అనేది పూర్తిగా తొలిగిపోతుంది ఈ మాసికాయ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఒక్కసారి వాడి చూడండి
- వామాకు, తులసాకు,తమలపాకుని రోజు తిన్న మంచి ఫలితం ఉంటుంది.
- మెత్తగా దంచి జల్లించిన కరక్కాయ పొడి, తేనెలో కలిపి రెండు పూటలా చప్పరించాలి.
- ఉదయం లేవగానే గోరు వెచ్చని మంచినీరు రెండు గ్లాసులు త్రాగాలి. రాత్రి పడుక్కోడానికి అరగంట ముందు రెండు చిటికెల పసుపు, నాలుగు మిరియాలు ( దంచిన ముక్కలు) పంచదార కొంచెం ( షుగరు లేకపోతే ఉంటే మెత్తని ఎండు ఖర్జూరం పొడి) ఒక గ్లాసు పాలు లో మరిగించి, వడకట్టి త్రాగాలి. ఐతే వృద్ధులుకి ఏది ఇచ్చినా అది ద్రవ రూపంలో లేదా మెత్తని పౌడర్ రూపంలో ఉండాలి.
--ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి
(చదవండి: మీనియర్స్ డిసీజ్ అంటే..!)
Comments
Please login to add a commentAdd a comment