old age people
-
ఈ అలవాట్లు ఉంటే! 50లో హెల్దీ అండ్ హ్యాపీ..!
రొటీన్‌గా చేసే పనుల్లో చేసుకోదగిన చిన్న చిన్న మార్పులు న్యూ ఇయర్(New Year)తో 50 ఏళ్లు నిండుతాయా...ఎంతో హుషారుగా, మరెంతో శ్రమతో లేదంటే.. గడిచిన నాలుగు పదులనూఓ జ్ఞాపకంలా మార్చుకుంటూ ఐదు పదుల్లోకి అడుగుపెట్టి ఉంటారు. ఇప్పటివరకు ఒక లెక్క...ఇక నుంచి ఒక లెక్క అన్నట్టు 50 ఏళ్ల నుంచి మహిళల శరీరంలోనూ, మనస్తత్వంలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఇంటా బయట ఎదురయ్యే ఒత్తిళ్లు, తమ పట్ల తాము పట్టించుకోని విధానం ఎప్పుడూ ఉంటుంది. పర్లేదు అని నిర్లక్ష్యం చేసే రోజువారీ అలవాట్లను వదిలేసికొత్తగా ఈ అలవాట్లను అలవరచుకోండి. 50 ఏళ్లలోనూ ఫిట్ అండ్ హెల్తీగా ఉండండి.వ్యాయామాలు(Exercises)కార్డియో ఎక్సర్సైజులు చేయాలనుకోకండి. శరీరానికంతటికీ శక్తినిచ్చే వ్యాయామం కండర కణజాలాన్ని సంరక్షిస్తుంది. ఎముక నష్టం కాకుండా పోరాడుతుంది. సమతుల్యతను కాపాడుతుంది. సడెన్‌గా పడిపోయే ప్రమాదాలను నివారిస్తుంది. సెల్ఫ్‌కేర్(Self Care)ఎప్పుడూ తమ కన్నా ముందు ఇతరులకు ఇవ్వడానికే శక్తిని ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక నుంచి రోజులో కొంత సమయం ‘నా కోసం నేను’ అనేలా మిమ్మల్ని మీరు సంతోషపరుచుకునే మానసిక ఆరోగ్యాన్ని పెం΄÷ందించే అలవాట్లు, కార్యకలా΄ాలకు ప్రాధాన్యత ఇవ్వండి.చురుకుగా ఉండటానికి..50 లలో ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. గంటల తరబడి కూర్చుంటే గుండె జబ్బుల రిస్క్ పెరగవచ్చు. ఊబకాయం వల్ల కీళ్లపై భారం పడి మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి. అందుకని శరీరం, మైండ్ చురుకుదనానికి రెగ్యులర్ మూవ్మెంట్స్ ఉండేలా చూసుకోవాలి.నిల్వ పదార్థాలకు ‘నో’ఉప్పు, చక్కెర మోతాదు నిల్వ పదార్థాలలో ఎక్కువ. అంతేకాదు, వీటిలో అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకని మైదాతోపాటు ఇతర నిల్వ ఉండే పదార్థాలను పక్కనపెట్టండి.చర్మం పట్ల జాగ్రత్త! (Skin Care)చర్మ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే వృద్ధాప్యం వేగంగా వచ్చేస్తుంది. చర్మ కేన్సర్ ప్రమాదాన్నీ పెంచుతుంది. వయసుతోపాటు చర్మమూ పొడిబారుతుంటుంది. ఎండవేళలో బయటకు వెళ్లినప్పుడు ఈ సమస్య మరీ పెరుగుతుంది. అందుకని, ఎండ నేరుగా చర్మంపై పడకుండా ఎస్పిఎఫ్ ప్రొటెక్షన్ ఉన్న క్రీమ్స్ ఉపయోగించాలి..ప్రోటీన్స్(Proteins)ఇన్నిరోజులు రుచిగా ఉండే ఆహారంపైన దృష్టి పెట్టి ఉంటారు. కానీ, తినే ఆహారంలో ప్రోటీన్ తక్కువ ఉంటే కండరాలకు వేగంగా నష్టం వాటిల్లడమే కాదు రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అందుకని నట్స్, గుడ్లు, మొక్కల నుంచి లభించే ప్రోటీన్లు గల ఆహారాన్ని భోజనంలో చేర్చండి.తరచూ నీళ్లుడీహైడ్రేషన్ ప్రభావాలు చర్మం సాగే గుణం, అజీర్తి, శక్తి స్థాయిలపై పడుతుంది. దాహం వేయడం అనే సంకేతాలు వయస్సుతోపాటు తగ్గుతుంటాయని గ్రహించి, తరచూ నీళ్లు తాగుతుండాలి.హాయిగొలిపే నిద్రనిద్రలేమి జీర్ణక్రియ, మానసిక స్థితి, జ్ఞాపశక్తిపైన ప్రభావం చూపుతుంది. ఈ రోజుల్లో మొబైల్, టీవీ స్క్రీన్ల వల్ల అర్ధరాత్రి తర్వాత నిద్రకు ఉపక్రమించేవాళ్లే ఎక్కువ. ఈ జాబితాలో మీరుంటే, స్క్రీన్లను త్వరగా కట్టిపెట్టి రోజూ 6–8 గంటల సమయాన్ని నిద్రకు కేటాయించండి. రాత్రివేళ కెఫీన్ వంటి పానీయాలకు దూరంగా ఉంటే నిద్ర లేమి సమస్య తలెత్తదు.అభిరుచులుఈ వయసులో తలెత్తే మానసిక ఒత్తిడి, ఆందోళన లేదా డిప్రెషన్‌ని విస్మరిస్తే అవి దీర్ఘకాలం నష్టం జరగవచ్చు. అందుకని మానసిక శ్రేయస్సును ప్రోత్సహించే శ్రద్ధ, అభిరుచుల కోసం సమయం కేటాయించుకోవాలి. (చదవండి: 'యూపీఎస్సీ చాట్ భండార్'..నాటి స్వాతంత్య్ర సంగ్రామాన్ని..!) -
వృద్ధుల డిమెన్షియా కోసం స్మార్ట్ వాచ్ ఆలోచన అద్భుతం
హైదరాబాద్: వృద్ధులలో డిమెన్షియా (మతిమరుపు) సమస్య సర్వసాధారణంగా వస్తుందని, కానీ దాన్ని అధిగమించేందుకు తగిన వ్యవస్థలు ఇన్నాళ్లూ సరిగా లేవని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అన్వయ సంస్థ వారికోసం ప్రత్యేకంగా ఒక స్మార్ట్ వాచ్ రూపొందించడం, దానికి పేటెంటు కూడా పొందడం ఎంతో అద్భుతమైన ఆలోచన అని కొనియాడారు. దీనివల్ల వృద్ధులు ఎక్కడున్నా తెలుస్తుందని, అలాగే వారికి ఏం జరిగినా వారి సంరక్షకులకు క్షణాల్లో సమాచారం వెళ్తుందని.. ఇలాంటి పరికరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వయోవృద్ధులందరి సంరక్షణలో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. అన్వయ సంస్థ ఎనిమిదో వార్షికోత్సవం, వ్యవస్థాపకుల దినోత్సవాన్ని బేగంపేటలోని ఫ్యామిలీ వరల్డ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ సంతోష్ మెహ్రా, టెక్ మహీంద్రా హెచ్ఆర్ గ్లోబల్ హెడ్ వినయ్ అగర్వాల్, టి-హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు, ఇండియా-ఇన్ఫర్ సంస్థ ఎండీ రంగ పోతుల, ఇండిపెండెంట్ స్ట్రాటజిక్ అడ్వైజర్ శక్తిసాగర్, అన్వయకేర్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ రెడ్డి, డైరెక్టర్ దీపికారెడ్డి తదితరులు పాల్గొన్నారు.టి-హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు మాట్లాడుతూ, స్టార్టప్ ఆలోచనలు చాలా విభిన్నంగా ఉంటున్నాయని, వృద్ధుల సంరక్షణ కోసం ఏఐ ఆధారిత యాప్ తీసుకురావడం, వారి సమస్యలను సమగ్రంగా పరిష్కరించే ప్రయత్నాలు చేయడం ఎంతో అభినందనీయమని చెప్పారు. అన్వయ కేర్ సంస్థ సేవలు మరింతమందికి అందాలని అభిలషించారు. “డిమెన్షియా అనేది వయోవృద్ధులందరిలో చాలా ఎక్కువగా కనపడుతున్న సమస్య. అయితే దీన్ని పరిష్కరించేందుకు ఎవరూ పెద్దగా ముందుకు రావట్లేదు. అసలు వృద్ధులు అంటే కేవలం ఆరోగ్య సమస్యలే కాదు.. ఇంకా చాలా ఉంటాయి. అన్వయ సంస్థ అద్భుతమైన సేవలు అందిస్తోంది. వాళ్లు ఒక స్మార్ట్ వాచ్ తయారుచేసి, దానికి పేటెంటు కూడా తీసుకోవడం చాలా బాగుంది. యూరోపియన్ దేశాల్లో సైకిళ్లపై వెళ్లేవారు తరచు ప్రమాదాలకు గురవుతారు. వాళ్లు ఆస్పత్రికి వెళ్లేలోపే వాళ్ల వైటల్స్, ఇతర వివరాలు అన్నీ డాక్టర్‌కు చేరిపోతాయి. ఇక్కడ ఈ వాచీని కూడా ప్రమాద బాధితులకు ఉపయోగపడేలా చేయాలి. వాళ్లను అంబులెన్సులోకి ఎక్కించగానే వాచీ పెట్టినా.. ముఖ్యమైన వివరాలన్నీ వైద్యులవద్ద సిద్దంగా ఉండి, వెంటనే చికిత్స ప్రారంభించగలరు. ఇలాంటి మంచి ఆలోచనలు వచ్చినందుకు ప్రశాంత్‌కు అభినందనలు” అని ఆయన చెప్పారు.ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, “వయోవృద్ధులకు సేవలు అందించే లక్ష్యంతో మా సంస్థను స్థాపించాం. అనతికాలంలోనే బెంగళూరు, చెన్నై లాంటి 40 నగరాలకూ విస్తరించాం. దీనికిగాను మాకు ఐఐటీ మద్రాస్ నుంచి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, హైసియా నుంచి.. ఇలా పలు వర్గాల నుంచి మాకు గుర్తింపు, అవార్డులు వచ్చాయి. కొవిడ్ నుంచి చాలామందిని రక్షించాం. హోం క్వారంటైన్ ఏర్పాటుచేశాం. అన్వయ స్మార్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టంను ఏర్పాటుచేసి, దానికి పేటెంటు కూడా సాధించాం. డిమెన్షియా కేర్ రంగంలో ఏమీ లేదని, వృద్ధులకు సేవలు అందించాలని గుర్తించాం. అప్పుడే భారతదేశంలోనే తొలిసారిగా ఏఐ ఎనేబుల్డ్ డిమెన్షియా కేర్ ఎట్ హోంను ప్రారంభించాం. ఉద్యోగుల సంరక్షణ కోసం అనన్య నిశ్చింత్ అనే ఏఐ ప్లాట్‌ఫాం తీసుకొచ్చాం. అనన్య కిన్ కేర్ అనే రిమోట్ పేషెంట్ మానిటరింగ్ సిస్టం ప్రవేశపెట్టాం. ఇది రాబోయే 20 ఏళ్లకు సరిపోయే వ్యవస్థ. పెద్దవాళ్లు మనల్ని పెంచి పెద్దచేసి, ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. వారికి అవసరమైనవి కల్పించడం మన విధి. అందుకే వారికి ఇంటివద్ద నర్సులు, డాక్టర్లను పంపడం, ల్యాబ్ శాంపిళ్లు ఇంటివద్దే సేకరించడంతో పాటు చివరకు ప్లంబర్లను పంపడం, ఉబర్ క్యాబ్‌లు బుక్ చేయడం వరకు అన్నిరకాల సేవలనూ అనన్య సంస్థ అందిస్తుంది” అని వివరించారు. -
వృద్దులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎంపీ మోపిదేవి
-
వృద్ధులను వేదించే గొంతులోని కఫం సమస్యకు..ఇలా చెక్ పెట్టండి!
వయసు మళ్లాక వచ్చే సమస్యలు అన్నిఇన్ని కావు. ఏది తినాలన్న భయం. పైగా ఏది అంత తొందరగా జీర్ణం కాదు. దీంతో అన్ని జావా, సూప్ మాదిరిగా తీసుకుంటుంటారు. ఘన పదార్థాలు తీసుకోనే అవకాశం లేకపోవడం, ఇతరత్ర సమస్యలు కారణంగా గొంతులో కఫం పేరుకుని ఇబ్బంది పెడుతుంది. దీని నుంచి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు ఆయుర్వేద నిపుణుల నవీన్ నడిమింటి. వీటిని వృద్ధులే కాక ఎవ్వరైనా వాడొచ్చని అంటున్నారు. గొంతు కఫాన్ని నివారించే మార్గం.. ఆయుర్వేదిక్ షాప్ లో మాసికాయ అని ఉంటుంది. అది తీసుకువచ్చి బుగ్గని పెట్టి చప్పరిస్తూ ఉంటే ఆ రసం మన కడుపులో దిగి కఫం అనేది పూర్తిగా తొలిగిపోతుంది ఈ మాసికాయ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఒక్కసారి వాడి చూడండి వామాకు, తులసాకు,తమలపాకుని రోజు తిన్న మంచి ఫలితం ఉంటుంది. మెత్తగా దంచి జల్లించిన కరక్కాయ పొడి, తేనెలో కలిపి రెండు పూటలా చప్పరించాలి. ఉదయం లేవగానే గోరు వెచ్చని మంచినీరు రెండు గ్లాసులు త్రాగాలి. రాత్రి పడుక్కోడానికి అరగంట ముందు రెండు చిటికెల పసుపు, నాలుగు మిరియాలు ( దంచిన ముక్కలు) పంచదార కొంచెం ( షుగరు లేకపోతే ఉంటే మెత్తని ఎండు ఖర్జూరం పొడి) ఒక గ్లాసు పాలు లో మరిగించి, వడకట్టి త్రాగాలి. ఐతే వృద్ధులుకి ఏది ఇచ్చినా అది ద్రవ రూపంలో లేదా మెత్తని పౌడర్ రూపంలో ఉండాలి. --ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి (చదవండి: మీనియర్స్ డిసీజ్ అంటే..!) -
80 ఏళ్ల వృద్ధులు స్కై డైవింగ్‌తో... గిన్నిస్ రికార్డు
80 ఏళ్ల వయసులో ఉండే బామ్మ లేదా తాతలు ఎలా ఉంటారో మనందరకీ తెలుసు. పాపం ఆ వయసులో నడవడానకి, తినడానికి కూడా ఇబ్బంది పడతారు. కనీసం ఎక్కడికైనా పంపించాలన్న భయపడతాం. పైగా వారు కూడా కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపేందుకే ఇష్టపడతారు. తాము గడిపని ప్రదేశాల నుంచి వచ్చేందుకు కూడ ఇష్టపడరు. అలాంటిది 80 ఏళ్ల వయసులో ఎనిమిది మంది వృద్ధులు విమానం నుంచి జంప్ చేసే స్కై డైవింగ్‌ని చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ది జంపర్స్ ఓవర్ ఎయిటీ సోసైటీ (జేంఈఎస్)కి చెందిన ఎనిమిది మంది సభ్యులు జిమ్ కుల్హనే, క్లిఫ్ డేవిస్, స్కాటీ గాలన్, వాల్ట్ గ్రీన్, పాల్ హినెన్, స్కై హుమిన్స్కీ, వుడీ మెక్కే, టెడ్ విలియమ్స్ తదితరులు ఈ రికార్డును సృష్టించారు. వారంతా విమానం నుంచి దూకి ఒక వృత్తాకారంలో స్కై డైవింగ్ చేశారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ స్కైడైవింగ్ హాల్ ఆఫ్ ఫేమ్ సెలబ్రేషన్ కోసం మూడు రోజుల ఈవెంట్లో భాగంగా స్కైడైవ్ డిలాండ్లో నిర్వహించిన స్కైడైవ్లో వారు ఫీట్‌ని ప్రదర్శించారు. ఈ ఆధునిక స్కై డ్రైవింగ్ క్రీడలో మా బృందం కాలానుగణంగా అభివృద్ధి చెందుతుంది అని తెలిపేలా ఈ ప్రదర్శన ఇచ్చినందుకు తమకు గర్వంగా ఉందని ఆ వృద్ధ సభ్యులు చెబుతున్నారు. (చదవండి: ట్రక్కును ఢీకొట్టిన ఖడ్గమృగం.. వీడియో షేర్ చేసిన సీఎం) -
వృద్ధ భారత్‌కు పరిష్కారమేది?
భారతదేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది. 2061 నాటికి దేశంలో ప్రతి నాలుగో వ్యక్తి 60 ఏళ్లకు పైబడిన వారే ఉంటారు. ఒక దేశంగా, కుటుంబాలు, వ్యక్తులుగా ఇంత వేగంగా పెరుగుతున్న ఈ అంశాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అన్నదే అసలైన ప్రశ్న. పైగా భారత్ సంపన్న దేశం కావడానికి ముందే వృద్ధాప్యంలో కూరుకుపోనుంది. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం, ముసలివాళ్లలోనే దారిద్య్ర స్థాయి ఎక్కువ. వీరిలో ఆర్థికంగా పూర్తిగా ఆధారపడేవారు 52 శాతం కాగా, పాక్షికంగా ఆధారపడేవారు 18 శాతం. తప్పనిసరి ఆర్థిక పరిస్థితుల కారణంగానే వీరు అరవై ఏళ్లు దాటినా పని చేస్తున్నారు. కార్పొరేట్లు, పౌర సమాజం తోడ్పాటుతో జాతీయ, రాష్ట్రాల స్థాయిలో క్రియాశీలకమైన విధానాలతో వృద్ధాప్య సమస్యలను పరిష్కరించాలి. లేకుంటే, ప్రస్తుతం మన యువత పేలవమైన నైపుణ్యాలతో సతమతమవుతున్నట్లుగానే భవిష్యత్తులో వృద్ధాప్యం కూడా పరిష్కరించలేని సమస్యగా మారిపోతుంది. దశాబ్దాలుగా సంతాన నిరోధక చర్యలు, మరణాల రేటును తగ్గించడంలో భారత్ ఎంతో సముచితంగా వ్యవహరించింది. వివిధ రాష్ట్రాల్లో వివిధ దశల్లో జనాభాపరమైన పరివర్తన కారణంగా దేశవ్యాప్తంగా 60 సంవత్సరాలకు పైబడిన జనాభా పెరుగుతున్న పరిస్థితి వైపు మనం అడుగు లేస్తున్నాము. అయితే ప్రభుత్వం, పలు ఇతర ఏజెన్సీలు వెలువరించిన జనాభా ధోరణులను పరిశీలిస్తే... వృద్ధాప్యం భారత్‌కు ఆందోళనకరమైన సమస్యగా మారబోతోంది. ఇది రాజకీయపరంగా, విధానపరంగా తీవ్రమైన, తక్షణ ప్రభావాలను కలిగించనుంది. యాభై ఏళ్లలో నాలుగు రెట్లు 2011 జనాభా లెక్కల ప్రకారం, దేశ జనాభా మొత్తంలో వృద్ధుల శాతం (8.6 శాతం) తక్కువ గానే కనిపిస్తున్నప్పటికీ, వృద్ధుల సంఖ్య (10.4 కోట్లు) ఎక్కువగానే ఉంది. 2036 నాటికి ఇది రెట్టింపై 22.5 కోట్లకు పెరగనుందనీ, 2061 నాటికి 42.5 కోట్లకు చేరనుందనీ అంచనా. అంటే 50 ఏళ్లలో వీరి సంఖ్య నాలుగు రెట్లు పెరగనుంది. మొత్తం జనాభాలో వృద్ధుల నిష్పత్తి వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంటోంది. ఈశాన్య, మధ్య భారత రాష్ట్రాల్లో తక్కువగానూ, దక్షిణాదిలో ఎక్కువగానూ ఉంది. బిహార్‌లో ఇది 7.4 శాతం కాగా, కేరళలో 12.6 శాతం. ఈ లెక్కప్రకారం, 2041 నాటికి బిహార్‌లో 11.6 శాతం, కేరళలో 23.9 శాతానికి పెరుగుతుందని అంచనా. వివిధ రాష్ట్రాల్లో వృద్ధుల కోసం ప్రణాళికలు రూపొందిం చడానికి విభిన్నమైన వైఖరి చేపట్టవలసిన అవస రాన్ని ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. భారతదేశంలో వృద్ధాప్యం శరవేగంతో విస్తరి స్తోంది. ఫ్రాన్స్, స్వీడన్లలో వీరి జనాభా 7 నుంచి 14 శాతానికి అంటే రెట్టింపు కావడానికి 110, 80 సంవత్సరాల సమయం పట్టింది. కానీ భారత్‌లో ఈ పరిణామం సంభవించడానికి 20 ఏళ్లు మాత్రమే పడుతుందని అంచనా. 2011 నుంచి 2061 వరకు, అంటే 50 ఏళ్ల కాలంలో మన జనాభాలో 60 ఏళ్ల పైబడిన వారి సంఖ్య 32 కోట్లకంటే ఎక్కువ కాబోతోందని అంచనా. 2030 నాటికి జనాభాలో 12.5 శాతం అవుతుందనీ, 2050 నాటికి 20 శాతానికి చేరుకుంటుందనీ అంచనా. 2061కి 25 శాతం కానుంది. అంటే అప్పటికి భారతీయుల్లో ప్రతి నాలుగో వ్యక్తి 60 ఏళ్లకు పైబడినవారే అయివుంటారు. ఒక దేశంగా, కుటుంబాలు, వ్యక్తులుగా ఈ సమస్యను ఎదు ర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అన్నదే అసలైన ప్రశ్న. అరవై దాటినా తప్పని పని భారత్ సంపన్న దేశం కావడానికి ముందే వృద్ధాప్యంలో కూరుకుపోనుంది. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి సంస్థ 2012లో చేసిన అధ్యయనం ప్రకారం, ముసలివాళ్లలోనే దారిద్య్ర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో ఆర్థికంగా పూర్తిగా ఆధారపడేవారు 52 శాతం కాగా, పాక్షికంగా ఆధారపడేవారు 18 శాతం. తప్పనిసరి ఆర్థిక పరిస్థితుల కారణంగానే వీరిలో చాలామంది పని చేయడం కొనసాగిస్తున్నారు. 2019–20లో మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద లబ్ధి పొందినవారిలో 93 లక్షల మంది 61 ఏళ్ల పైబడిన వారే అనేది దీనికి రుజువుగా నిలుస్తోంది. 2021లో ఈ పథకం కింద లబ్ధిపొందిన వారిలో 10 శాతం మంది 61, లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారే. భారతదేశంలోని శ్రామికుల్లో 90 శాతం మంది అనియత రంగంలోనే ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలి. వీరు పొదుపు చేయగలిగేది సాపేక్షికంగా తక్కువే కాబట్టి, సామాజిక రక్షణ పెద్దగా ఉండదనేది వాస్తవం. పెన్షన్ అందు కుంటున్నవారిలో 85 శాతం మంది ఆహారం, ఇతర జీవన అవసరాలు, ఆరోగ్య సంరక్షణ వంటి వాటి కోసమే తమ పించన్ ఉపయోగించుకుంటూ ఉంటారు. 60 ఏళ్ల వయస్సు వచ్చిన వారిలో 10 శాతం (సుమారు కోటిమంది) మంది శారీరకంగా కదలలేని స్థితిలో ఉంటున్నారు. మరో పది శాతం మంది ప్రతి సంవత్సరం ఆసుపత్రి పాలవు తుంటారు. ఇక 70 సంవత్సరాల వయస్సులో 50 శాతం మంది ఒకటి లేదా ఎక్కువ దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్నారు. ఇక 60 నుంచి 84.1 సంవత్సరాల పైబడిన వారిలో ప్రతి 1000 మందిలో 51.8 శాతం మంది వైకల్యంతో బాధపడుతున్నారు. అదే సాధారణ జనాభాలో వెయ్యిమందిలో 22.1 శాతం మంది వైకల్యంతో బాధపడుతున్నారు. మన దేశంలో ముసలివాళ్లకు ఎన్నో పథకాలు ఉంటున్నాయి కానీ అవి వారి జీవితాలపై అర్థవంతమైన ప్రభావం కలిగించడం లేదు. 1999లో వృద్దుల విషయంలో ఒక జాతీయ విధానాన్ని దేశం తీసుకొచ్చింది. తర్వాత సంవత్స రాలపాటు విధాన పథకాలను అమలు చేశారు. చెప్పాలంటే వృద్ధాప్యంపై ‘మాడ్రిడ్ ఇంటర్నేషనల్ యాక్షన్ ప్లాన్’ను ముందుకు తీసుకుపోయిన ఘనత భారత్‌కు దక్కాలి. ఒకరకంగా ఆ ప్లాన్‌ని భారత్ ప్రభావితం చేసిందని కూడా చెప్పాల్సి ఉంటుంది. వృద్ధుల జనాభా భారీ సంఖ్యలో ఉన్న కేరళ వంటి రాష్ట్రాలు పంచాయతీ స్థాయి నుంచి వృద్ధుల కోసం బడ్జెట్ కేటాయింపులు చేస్తూ వచ్చాయి. గత రెండేళ్లకాలంలో సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కొన్ని సృజనాత్మకమైన పరిష్కా రాలతో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. అయినా కూడా వీటిని పూర్తిగా అమలు చేయడానికి ఈ శాఖకు ఆర్థిక మద్దతు కష్టంగా ఉంటోంది. కాబట్టి వృద్ధుల పేలవమైన ఆర్థిక ప్రతిపత్తి, అమల వుతున్న పథకాలకు ఆర్థిక మద్దతు లేకపోవడం నేపథ్యంలో ఈ అంశంపై అత్యున్నత స్థాయిలో రాజకీయ జోక్యం అవసరం. విధానపరమైన జోక్యం అవసరం ఈ రంగానికి సంబంధించినంతవరకు తైవాన్, చైనా వంటి దేశాల అనుభవాల నుంచి మనం నేర్చుకోవలిసింది చాలానే ఉంది. కార్పొరేట్లు, పౌర సమాజం తోడ్పాటుతో జాతీయ, రాష్ట్రాల స్థాయిలో క్రియాశీలకమైన విధానాలు, కార్య క్రమాలను చేపట్టడం ద్వారా వృద్ధాప్య సమస్యలను ఇప్పుడు పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే, ప్రస్తుతం మన యువత పేలవమైన నైపుణ్యాలతో సతమతమవుతున్నట్లు గానే, వృద్ధాప్య సమస్య కూడా పరిష్కరించలేని సమస్యగా మారిపోతుంది. దశాబ్దాలకు ముందు నుంచే యువత సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడం వల్ల వారు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని గ్రహించాలి. దేశ సామూహిక చైతన్యం నుంచి వృద్ధులు పక్కకు తొలిగే పరిస్థితిని భారత్ భరించలేదు. – వెంకటేశ్ శ్రీనివాసన్, దేవీందర్ సింగ్ ‘ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫంఢ్’లో ఇండియా మాజీ ఉద్యోగులు -
మనోబలం: బామ్మలందరూ కలిసి బాల్యంలోకి వెళ్లొచ్చారు!
‘అదిగదిగో విమానం’ అంటూ ఆకాశాన్ని చూస్తూ పరుగులు తీశారు చిన్నప్పుడు. వృద్ధాప్యంలోకి వచ్చాక పరుగులు తీసే శక్తి లేదు. అయినా ఆ ఉత్సాహం ఎక్కడికీ పోలేదు. ‘ఒక్కసారైనా విమానం ఎక్కలేకపోయామే’ అని నిట్టూర్చేవారు. అయితే అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరకకుండానే వారి చిరకాల కల నెరవేరింది... చిన్నప్పుడు ఆకాశంలో వినిపించీ, వినిపించని శబ్దం చేస్తూ కనిపించే చిట్టి విమానాన్ని చూసి మౌనిక ఎంత ముచ్చటపడేదో! పెద్దయ్యాక ఎలాగైనా విమానం ఎక్కాలని చిన్నారి మౌనిక ఎంతో బలంగా అనుకుంది. అయితే వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ ఆమె కోరిక నెరవేరలేదు. ఆరుబయటకు వచ్చినప్పుడు ఆకాశంలో కనిపించే విమానాన్ని చూస్తూ ‘చిన్నప్పుడు ఎన్నో అనుకుంటాం’ అని తనలో తాను నవ్వుకునేది మౌనిక. నిజానికి మౌనికలాంటి ‘విమాన కల’ బామ్మలు ఎందరో ఉన్నారు. కోచి(కేరళ)లోని ‘హెల్ప్‌ఏజ్ ఇండియా’ అనే స్వచ్ఛందసంస్థ, కోచి మున్సిపల్ కార్పోరేషన్‌తో కలిసి 27 మంది బామ్మల సుదీర్ఘకాల విమానప్రయాణ కలను నెరవేర్చింది. ఎంతసేపు ప్రయాణించాం, ఎంత దూరం వెళ్లాం అనేది ముఖ్యం కాదు... ఆ అనుభూతి ముఖ్యం! బామ్మలు కోచి నుంచి కన్నూర్‌కు విమానంలో ప్రయాణించి కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకున్నారు. ‘ఇంకో వారంలో రోజుల్లో విమానం ఎక్కబోతున్నాం’ అనే ఆనందం రోజీమేరీ, మారియాలను ఒక దగ్గర ఉండనివ్వలేదు. ఎందరికో ఎన్నోసార్లు చెప్పుకొని మురిసిపోయారు. ‘విమానం ఎక్కడం కాదు... అసలు నేను విమానాశ్రయం అనేది చూడడం ఇదే మొదటిసారి’ నవ్వుతూ అంటుంది 67 సంవత్సరాల రోజీమేరి. ‘చిన్నప్పటి కోరిక నెరవేరిందనే సంతోషంతో నా మనోబలం రెట్టింపు అయింది’ అంటుంది 61 సంవత్సరాల మారియా. ఇక విమానంలో బామ్మల సందడి చూస్తే... వారు విమానం ఎక్కినట్లుగా లేదు. టైమ్‌మిషన్‌లో బాల్యంలోకి వెళ్లినట్లుగా ఉంది. ఏ బామ్మను కదిలించినా.... వారి కళ్లలో... మాటల్లో సంతోషమే సంతోషం! వీరి విషయంలో మాత్రం ‘సంతోషం సగం బలం’ కానే కాదు. సంపూర్ణబలం! కోరిక గట్టిదైతే, ఎప్పుడో ఒకప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది... అనే మాటను విన్నాను. అది నా విషయంలో నిజమైంది. వినేవాళ్లు ఉండాలేగానీ నా విమానప్రయాణం గురించి కొన్ని రోజుల వరకు చెప్పగలను. – మౌనిక (88) -
‘మాతో ఉండండి.. వేధించకండి..వేడుకుంటున్నాం ’
సాక్షి, హైదరాబాద్: తమతో పిల్లలు మరింత సమయం గడపాలని కోరుకుంటున్నారు కొందరు. అదే సమయంలో పిల్లల వేధింపులు తట్టుకోలేకపోతున్నామంటున్నారు. మరికొందరు. ఓ వయసు దాటిన తర్వాత అటు సమాజం ఇటు కుటుంబం రెండు వైపులా నిర్లక్ష్యాన్ని ఎదుర్కుంటున్న వృద్ధాప్యపు స్థితిగతులపై ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల వ్యాప్తంగా ‘హెల్పేజ్ ఇండియా’ ఆధ్వర్యంలో అధ్యయనం నిర్వహించింది. ఇందులో ఎన్నో ఆసక్తికర, ఆలోచించాల్సిన, తప్పకుండా స్పందించాల్సిన అంశాలు వెలుగు చూశాయి. అవి శాతాల వారీగా ఇలా... ఎంతెంత దూరం..ఆరోగ్యం ► కీళ్లు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నవారు 78 శాతం ► డయాబెటిస్ తో 48 శాతం రక్తపోటు సమస్యతో 37 శాతం ► గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు 21 శాతం ► ఆరోగ్యం కోసం రోజూ నడక కొనసాగిస్తున్నారు 76 శాతం ► యోగా, ప్రాణాయామం చేసేవారు 21 శాతం ► సరైన పద్ధతిలో ఔషధాలు వాడుతున్నవారు 71 శాతం ► తమ ఆరోగ్యం పట్ల పిల్లలు శ్రద్ధ తీసుకోవాలంటున్నారు 50 శాతం ► ఆరోగ్య బీమా తమకు అన్ని విధాలా అందుబాటులో ఉండాలంది 43 శాతం ► ఆహారాన్ని నియంత్రిత పద్ధతిలో తీసుకుంటున్నది 69 శాతం ► సరైన ఆరోగ్య సేవలు పొందుతున్నది 32 శాతం ► బలహీనమైన కాళ్ల కారణంగా పడిపోతామని భయపడుతున్నవారు 37 శాతం ► కంటిచూపు తగ్గిందని బాధపడుతున్నవారు 37 శాతం ► ప్రైవేట్ ఆసుపత్రుల్లో, డయాగ్నసిస్ సెంటర్లలోనూ తమకు తక్కువ ధరకు వైద్య సేవలు లభించాలని ఆశిస్తోంది 35 శాతం ఆర్థికం.. అంతంత మాత్రం.. ► ఆర్థిక అవసరాల కోసం కుటుంబంపైనే ఆధారపడింది 67 శాతం ► ఆర్థిక భద్రత కలిగి ఉంది 58 శాతం ► పింఛను తదితరాలపై ఆధారపడ్డవారు 45 శాతం పరివారం.. పరిస్థితి ఇదీ... ► కుటుంబ సభ్యుల నిరాదరణకు గురవుతున్నది 56 శాతం ► తరచూ కుటుంబ సభ్యుల చేత తిట్లు తింటోంది 36 శాతం ► పిల్లల చేతిలో దెబ్బలు తింటున్నవారు 18 శాతం ► తమ ఉనికిని కుటుంబం నిర్లక్ష్యం చేస్తోందంటున్నవారు 9 శాతం ► తమను ఆర్ధిక ఇబ్బందులు పెడుతున్నారంటున్నవారు 9 శాతం ► వేధింపుల నుంచి ఎలా బయటపడాలో తెలియని వారు 24 శాతం ► తమ కుటంబ సభ్యులకు కౌన్సెలింగ్ కావాలంటున్నవారు 71 శాతం ► సామాజిక వేధింపులకు గురవుతున్నామని అంటోంది 42 శాతం ఇలా ఉన్నాం.. అలా ఉండాలనుకుంటున్నాం... ► సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారు 21 శాతం ► సమాజసేవకు సై అంటోంది 25 శాతం ► కుటుంబంతో సమయం గడుపుతున్నవారు 53 శాతం ► సెల్‌ఫోన్ వాడుతున్న వృద్ధులు 96 శాతం ► వీడియో కాల్ ద్వారా మాట్లాడుతున్నవారు 15 శాతం ► తమ వయసువారిని ముఖాముఖి కలుసుకుంటోంది 45 శాతం ► పిల్లలకు దూరంగా ఉన్న వృద్ధుల్లో పిల్లలకు దగ్గరగా ఉండాలనుకుంటున్నవారు 43 శాతం ► కుటుంబంతోనే ఉన్నప్పటికీ, తమ కుటుంబ సభ్యులు తమతో మరింత సమయం గడపాలని కోరుకుంటున్న వారు 61శాతం ► తమ సమస్యలపై సమాజం స్పందించాలని, ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆశిస్తోంది 53 శాతం -
నిందితులు చిక్కినా న్యాయం జరగట్లే!
సాక్షి, హైదరాబాద్: ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్’... ఇన్సూరెన్స్ ఫాడ్స్ర్ చేసిన త్రయం విషయంలో ఈ ఆంగ్ల నానుడి సరిగ్గా సరిపోతుంది. నగరానికి చెందిన ఇద్దరు వృద్ధులను టార్గెట్‌గా చేసుకున్న ముగ్గురు నిందితులు రూ.6.74 కోట్లు కాజేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు తొలి కేసు నమోదైన మూడు రోజుల్లోనే ముగ్గురు నిందితులనూ అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించిన అధికారులు మోసం సొత్తుతో స్థిర, చరాస్తులు ఖరీదు చేసినట్లు గుర్తించారు. అయితే కథ ఇక్కడితో ఆగిపోవాల్సి వస్తోంది. ఈ రెండు కేసులూ మోసాన్ని సూచించే ఐపీసీలోని 420 తదితర సెక్షన్లతో నమోదు కావడంతో ఆ ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది. పక్కాగా స్కెచ్ వేసి స్వాహా... కుత్భుల్లాపూర్‌లో నివసిస్తున్న పుల్లేటి సుబ్రహ్మణ్యం, బీరంగూడ వాసి ఉడుత మనోజ్‌కుమార్, గుర్రంగూడకు చెందిన బండారి మహేష్ గౌడ్లతో కూడిన ముఠా ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో మోసాలకు పథకం వేసింది. వివిధ కంపెనీలకు చెందిన పాలసీ హోల్డర్ల ఫోన్ నంబర్లు సేకరించి ప్రధానంగా వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని వారికి నమ్మకం కలిగించి నిండా ముంచింది. నగరానికి చెందిన ఇద్దరి నుంచి వేర్వేరుగా రూ.6.74 కోట్లు నగదు రూపంలో తీసుకుని నకిలీ బాండ్లు అంటగట్టి మోసం చేసింది. తన కుమారుడు విదేశాల నుంచి వచ్చి గుర్తించే వరకు ఒక బాధితుడు, వీరి అరెస్టు విషయం పత్రికల్లో చూసే వరకు మరో బాధితుడు తాము మోసపోయినట్లు గుర్తించలేకపోయారు. కస్టడీలో కీలక విషయాలు వెలుగులోకి... మొదటి బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు గత నెల ఆఖరి వారంలో ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆపై న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలోనే మోసం సొమ్మును ముగ్గురూ పంచుకున్నట్లు తేలింది. ప్రధాన నిందితుడు సుబ్రహ్మణ్యం తన స్వస్థలమైన గుడివాడలోని ఎస్ఎన్ పురంలో రూ.60 లక్షలు వెచ్చించి ఇల్లు నిర్మించాడని, కుత్భుల్లాపూర్‌లో రూ.కోటితో ప్లాట్ కొన్నాడని, తన కుమార్తె పేరుతో రూ.1.5 లక్షలు పోస్టాఫీస్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడని తెలుసుకున్నారు. మనోజ్‌కుమార్ బీరంగూడలో రూ.70 లక్షలతో ఫ్లాట్ ఖరీదు చేయగా, మహేష్ తన వివాహానికి డబ్బు ఖర్చు చేయడంతో పాటు భార్యకు పది తులాల బంగారం, తమ కోసం ఓ కారు ఖరీదు చేసుకున్నట్లు గుర్తించారు. స్వాధీనానికి ఆస్కారం లేకపోవడంతో... విలాసాలకు అలవాటుపడిన వీరు భారీ మొత్తాన్ని ఖర్చు చేసి విహారయాత్రలకు వెళ్లి వచ్చారు. వృద్ధుల నుంచి కొట్టేసిన సొమ్ముతోనే ఇవన్నీ చేశామంటూ వారు అంగీకరించినా... పోలీసులకు ఆధారాలు లభించినా వాటి జోలికి వెళ్లే ఆస్కారం లేకుండా పోయింది. ఈ కేసును పోలీసులు ఐపీసీలోని 420 తదితర సెక్షన్ల కింద నమోదు చేశారు. కేవలం డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద నమోదైన వాటిలోనే ఆస్తుల స్వాధీనానికి ఆస్కారం ఉంది. ఈ చట్టం వర్తించాలంటూ నిందితులు బాధితుల నుంచి డబ్బును డిపాజిట్ల రూపంలో తీసుకుని ఉండాలి. ఈ ఇన్సూరెన్స్ నేరం ఆ తరహాకు చెందినది కాకపోవడంతో అలా చేసే వీలులేదు. దీంతో ఈ వివరాలతో పాటు స్థిరచరాస్తులకు సంబంధించిన పత్రాలను పోలీసులు న్యాయస్థానానికి అప్పగించాలని నిర్ణయించారు. కోర్టు నిర్ణయం మేరకే తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. రెండో కేసులో వీరిని కస్టడీలోకి తీసుకున్నప్పుడు మరిన్ని వివరాలు సేకరించాలని భావిస్తున్నారు. అనివార్యంగా మారిన చట్ట సవరణ... కేవలం ఈ ఒక్క కేసులోనే కాదు అనేక మోసాల కేసుల్లో బాధితుల పరిస్థితి ఇలానే ఉంటోంది. నిందితులు అరెస్టు అయినా వారికి న్యాయం అందడం లేదు. ఒకప్పుడు రూ.వేలు, రూ.లక్షలతో ముడిపడి ఉన్న మోసాల కేసుల ‘విలువ’ ఇప్పుడు రూ.కోట్లకు చేరుతోంది. ఈ నేపథ్యంలోనే చట్ట సవరణతోనే బాధితులకు న్యాయం జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం నగర పోలీసు కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్ సంస్కరణలకు కేరాఫ్ అడ్రస్. కేవలం పోలీసు విభాగంలోనే కాకుండా ఆయన డిప్యుటేషన్‌పై పని చేసిన ఎక్సైజ్, పౌరసరఫరాల శాఖల్లోనూ అనేక సంస్కరణలు తీసుకువచ్చి తన మార్కు చూపించారు. ఈ విషయంలోనే ఆయన స్పందించి భారీ మొత్తాలతో ముడిపడి ఉన్న మోసం కేసుల్లోనూ ఆస్తులు స్వాధీనం చేసుకునేలా సవరణకు ప్రతిపాదించాల్సిన అవసరం కనిపిస్తోంది. అప్పుడే మోసగాళ్లకు కళ్లెం పడటంతో పాటు బాధితులకు పూర్తి న్యాయం జరగడానికి ఆస్కారం ఉంది. (చదవండి: పోలీసునంటూ బెదిరింపులు...నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే జంటలే టార్గెట్) -
TSRTC: టీఎస్ఆర్టీసీ పండగ ఆఫర్లు
సాక్షి, హైదరాబాద్: ఉగాది, శ్రీరామనవమిలను పురస్కరించుకుని ప్రయాణికులకు ఆర్టీసీ కొన్ని రాయితీలు ప్రకటించింది. 65 ఏళ్ల వయసుపైబడ్డ వారు ఉగాది రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే కండక్టర్‌కు వయసు ధ్రువీకరణ పత్రాన్ని చూపాల్సి ఉంటుంది. అలాగే ఆర్టీసీ కార్గో పార్శిల్ సర్వీసుకు సంబంధించి, ఐదు కిలోల బరువున్న పార్శిల్ బుకింగ్ చార్జీలపై 25 శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇది అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఇక విమానాశ్రయానికి తిరుగుతున్న పుష్ప క్ బస్సుల్లో అప్ అండ్ డౌన్ టికెట్లు తీసుకుంటే తిరుగు ప్రయాణ చార్జీలో 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఈ రాయితీని పది రోజులలోపు ఎపుడైనా వాడుకోవచ్చని పేర్కొన్నారు. On the occasion of #Ugadi #TSRTC Offers Free Ride to Senior Citizens above 65 years only on 2nd April 2022 in all types of #TSRTCBusServices @TSRTCHQ @ntdailyonline @TV9Telugu @Eenadu_Newspapr @sakshinews @way2_news @TelanganaToday @IndiaToday @bbcnewstelugu @baraju_SuperHit pic.twitter.com/v5fUK4uOyL — V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) March 31, 2022 -
జాతీయ మెడికల్ కమిషన్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: చిన్న పిల్లలకు పీడియాట్రిక్స్ స్పెషలైజేషన్‌లాగే... వృద్ధులకు ప్రత్యేకంగా వైద్యం అందించేలా పీజీ మెడికల్‌లో జీరియాట్రిక్స్ స్పెషలైజేషన్ కోర్సును కేంద్ర ప్రభుత్వం పరిచయం చేయనుంది. ఈ మేరకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తాజాగా ప్రకటించింది. దేశంలో వృద్ధుల జనాభా పెరుగుతుండటం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వృద్ధులు జీవితాంతం నాణ్యమైన జీవితాన్ని గడిపేలా ఈ కోర్సును తీర్చిదిద్దుతారు. ప్రస్తుతం పీజీ ఎండీ, ఎంఎస్‌లలో 32 కోర్సు లున్నాయి. వీటిల్లో కొత్తగా 4 కోర్సులను ప్రారంభిస్తారు. సూపర్ స్పెషాలిటీలో ప్రస్తుతం 38 కోర్సు లున్నాయి. ఈ కేటగిరీలో కొత్తగా 8 కోర్సులను ప్రారంభించాలని ఎన్ఎంసీ నిర్ణయం తీసుకుంది. చదవండి: ఏపీ: ప్రతి 100 మందిలో 30 మందికి అప్పుడే పెళ్లిళ్లు వైద్య రంగంలో నైతిక విలువలు... వైద్యరంగంలో నైతిక విలువలపై ప్రత్యేకంగా ఎటువంటి కోర్సు లేదు. కానీ రాబోయే రోజుల్లో పీజీ మెడికల్‌లో ఐసీఎంఆర్ నిర్వహించే మెడికల్ ఎథిక్స్ అనే సర్టిఫికెట్ కోర్సును తప్పనిసరిగా చదవాలి. మొదటి ఏడాదిలోనే ఈ కోర్సును పూర్తి చేయాలి. దాన్ని రాయకుంటే ఫైనలియర్ పరీక్ష రాయడానికి వీలుండదు. ఒక డాక్టర్ వేరే డాక్టర్ గురించి చెడుగా చెప్పకూడదు.. కమీషన్ల కోసం ఇతర ఆసుపత్రులకు రోగులను రిఫర్ చేయకూడదు.. డాక్టర్, రోగుల మధ్య సంబంధాలపై మానవీయ కోణాన్ని పెంపొందించడానికి ఈ కోర్సును ఉద్దేశించారు. చదవండి: మహానేత వైఎస్సార్‌కు సీఎం వైఎస్ జగన్ నివాళి మరికొన్ని అంశాలు... పీజీ మెడికల్‌లో మొదటి ఏడాది ఐసీఎంఆర్ నిర్వహించే బేసిక్ బయో మెడికల్ రీసెర్చి కోర్సును ఆన్లైన్లో చదివి రాయాల్సి ఉంటుంది. వైద్య విద్యార్థుల్లో పరిశోధనను పెంపొందించాల్సి ఉంది. ఎలాంటి అంశాలపై చేయవచ్చు అన్న దానిపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. ♦ బేసిక్ లైఫ్ సపోర్టుపై అన్ని స్పెషలైజేషన్ కోర్సు ల వైద్య విద్యార్థులకు తప్పనిసరి చేశారు. అత్యవసర వైద్యాన్ని అందరూ నేర్చుకోవాలి. ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. తర్వాత సరి్టఫికెట్ ఇస్తారు. ♦గతంలో పీజీ మెడికల్‌లో మొదటి ఏడాది, చివరి ఏడాది మాత్రమే పరీక్ష ఉండేది. ఇప్పుడు కోర్సును 50 మాడ్యూల్స్‌గా విభజిస్తారు. దాని ప్రకారం వాళ్లకి శిక్షణ ఇచ్చి, అంతర్గత పరీక్షలు నిర్వహిస్తారు. మాడ్యూల్స్ పూర్తి కాగానే పరీక్ష నిర్వహిస్తారు. ఇవన్నీ ప్రాక్టికల్ పరీక్షలే. ♦పీజీ మెడికల్ విద్యార్థులు జిల్లా ఆసుపత్రిలో కోర్సు పీరియడ్‌లో తప్పనిసరిగా 3 నెలలు పనిచేయాలి. దీనివల్ల జిల్లా ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్య సేవలు మెరుగుపడతాయి. జాతీయ ఆరోగ్య పథకాలు, స్థానిక జబ్బులపై అవగాహన కలి్పంచడానికి దీన్ని ఉద్దేశించారు. ♦ అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల అనుభవం, పరిశోధనల ఆధారంగా పీజీ సీట్లను ఆయా కాలేజీలకు అనుమతిస్తారు. ప్రస్తుతం ఒక అసోసియేట్ ప్రొఫెసర్‌కు 2, ప్రొఫెసర్‌కు 3 సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేస్తోంది. ప్రొఫెసర్ల సామర్థ్యం సరిగా లేకుంటే అటువంటి కాలేజీలకు ప్రొఫెసర్‌కు ఒక సీటునే మంజూరు చేస్తారు. ♦ప్రతీ ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ కోర్సులను ప్రారంభించాలంటే తప్పనిసరిగా ఎంఆర్ఐ, సీటీ స్కాన్లు ఉండాలన్నది నిబంధన. ఎంవోయూ లేదా ఔట్సోర్సింగ్ పద్ధతిలో బయ ట సమకూర్చుకోవడాన్ని అనుమతించరు. కొత్త కోర్సులు... మెడికల్ పీజీలో (ఎండీ, ఎంఎస్) ♦ ఏరోస్పేస్ మెడిసిన్ ♦ మెరైన్ మెడిసిన్ ♦ ట్రమటాలజీ అండ్ సర్జరీ... ♦ జీరియాట్రిక్ సూపర్ స్పెషాలిటీలు... ♦ మెడికల్ జెనెటిక్స్ ♦వైరాలజీ మెడిసిన్ ♦ చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీ ♦ జీరియాట్రిక్ మెంటల్ హెల్త్ ♦ హెపటాలజీ (లివర్) ♦ ఎంసీహెచ్ ఎండోక్రైన్ సర్జరీ ♦ హెపటో పాంకీయాట్రో బిలియరీ సర్జరీ ♦ రీప్రొడెక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ 20 ఏళ్ల తర్వాత మార్పులు 20 ఏళ్ల తర్వాత పీజీ మెడికల్‌లో పలు కీలకమైన మార్పులు చేశారు. ప్రస్తుతం తీసుకొచ్చిన కోర్సులు శాస్త్రీయంగా, సామాజిక అవసరాలకు తగినట్లుగా ఉన్నాయి. మెడికల్ కాలేజీల్లో వైద్య పరిశోధనకు ఊపు తీసుకురావాలని ఎన్ఎంసీ నిర్ణయించడం ముదావహం. నియమాలు ఒకవైపు సరళతరం చేస్తూనే మరోవైపు కొన్ని కొత్త మార్పులు సూచించారు. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
వృద్ధులకు ప్రాణాంతకంగా కరోనా
సాక్షి, ముంబై: వయోవృద్ధుల్లో కరోనా ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ముంబై నగరంలో మిగతా వయసుల వారీతో పోల్చితే కరోనా సోకిన వృద్ధుల్లో మరణాల రేటు ఎక్కువగా ఉంటోందని వైద్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అందిన వివరాల మేరకు.. ముంబైలో ఆగస్టు 12వ తేదీ వరకు 7,38,520 మంది కరోనా బారిన పడగా, వారిలో 15,975 మంది కన్నుమూశారు. నగరంలోని 90 సంవత్సరాల పైబడినవారిలో 2,736 మందికి కరోనా సోకగా.. అందులో 260 మంది అంటే 9.50 శాతం మంది మరణించారు. 80–89 ఏళ్ల వయసు వారిలో 16,999 మందికి కరోనా సోకగా.. అందులో 1,820 మంది అంటే 10.70 శాతం మంది మృతిచెందారు. ఇక 70–79 ఏజ్ గ్రూప్‌లో 48,162 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 3,741 మంది అంటే 7.76 శాతం మంది అసువులు బాసారు. 60–69 సంవత్సరాల వయసు వారిలో 87,535 మందికి కరోనా సోకగా.. వీరిలో 4,358 మంది మరణించారు. ఈ గ్రూపులో మరణాల రేటు 4.97 శాతంగా ఉంది. 50–59 ఏళ్ల వయో గ్రూపులో 1,22,835 మంది కరోనా బారిన పడగా.. అందులో 3,364 మంది చనిపోయారు. వీరిలో మరణాల రేటు 2.73 శాతంగా నమోదైంది. ఇక, 30–39 ఏళ్ల వయసు వారిలో 1,41,341 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో 562 మంది మృత్యు వాత పడ్డారు. వైద్య శాఖ అందించిన ఈ వివరాలను బట్టి చూస్తుంటే కరోనా వైరస్‌తో వృద్ధులకు ఎక్కువ ప్రమాదం ఉంటుందన్న విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుతానికి చిన్న పిల్లల్లో కరోనా ప్రభా వం తక్కువగానే ఉంది. తొమ్మిది సంవత్సరాల లోపు వారిలో ఇప్పటివరకు 20 మంది కరోనాతో మరణించారు. 10–19 సంవత్సరాల పిల్లల్లో 41 మంది చనిపోగా, 20–29 సంవత్సరాల వయసు వారిలో 173 మందిని కరోనా బలితీసుకుంది. -
మీ ఇంట్లో వృద్ధులున్నారా? అయితే, ఈ మార్పులు చేయాల్సిందే!
చలాకీగా ఉండే వయసు హరించుకుపోయి జీవిత చరమాంకానికి చేరుకునే తరుణంలో మనిషికి మానసిక స్వాంతన ఎంతో అవసరం. తన అనుకున్నవారికి తానే భారం అవుతున్నానన్న బాధ పెద్దవారికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంట్లోవారిదే! ఇందుకోసం ఇంట్లో పెద్దల అవసరాలకు తగినట్లు కొద్దిపాటి మార్పులు చేయించడం కీలకమని డాక్టర్ల సలహా. దీనివల్ల వృద్ధులు తమ పనులు తాము చేతనైనంత వరకు సొంతంగా చేసుకుంటూ, ఒకరిపై ఆధారపడకుండా జీవించే వీలు చిక్కుతుంది. ఒకరిపై ఎక్కువగా ఆధారపడకుండా వృద్ధాప్యం గడిచేందుకు ఇంట్లో చేయాల్సిన చిన్నపాటి మార్పులను చూద్దాం! ► అవసరమైన చోట్ల వీల్‌చైర్ లేదా వాకర్ కోసం ర్యాంప్ ఏర్పాటు చేయాలి. ► టాయిలెట్లు, షవర్ల దగ్గర హ్యాండ్ రెయిల్స్, గ్రాబ్ బార్స్‌ను ఏర్పరచాలి. ► వీలుంటే మాములు టాయిలెట్ల బదులు ఒక్కటైనా రైజ్డ్ టాయిలెట్ ఏర్పాటు చేయించడం మంచిది. ► ఇంట్లో స్మోక్, హీట్ డిటెక్టర్లను ఇన్స్టాల్ చేయించాలి ►వృద్దులకు అవసరమైనంత గాలి, వెలుతురు ఇంట్లోకి వచ్చేలా అవసర వెంటిలేషన్ ఏర్పరచాలి. ►నిద్రలో నడిచే అలవాటు ఉన్న వారుంటే ఆటో సెన్సర్లను ఇన్స్టాల్ చేయించడం ద్వారా రాత్రుళ్లు వారి కదలికలపై కన్నేసి ఉంచొచ్చు. ►ఇంట్లో అనవసరమైన ఫర్నిచర్, సామగ్రి అడ్డదిడ్డంగా లేకుండా సర్దుకోవాలి. ►టెలిఫోన్ , ఇంటర్నెట్ తదితర వైర్లేవీ కాళ్లకు అడ్డం తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ►ఇంట్లో కరెంట్ కనెక్షన్లు షార్ట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్త వహించాలి. వీలయినంత వరకు ఎవరో ఒకరు పెద్దవారిని గమనిస్తూ ఉండడం, వారికి వేళకు సరైన ఆహారాన్ని అందించడం, మందులు వాడుతుంటే మర్చిపోకుండా సమయానికి అందించడం, వారి మాటలకు విసుక్కోకుండా వారితో కొంత సమయం గడపడం, వీలైతే వారికి ఏదైనా వ్యాపకం కల్పించడం వంటి చర్యలు వృద్ధాప్యంలో ఉన్నవారికి ఊరటనిస్తాయి. ఒకవేళ తప్పనిసరైన పరిస్థితుల్లో పెద్దవారిని వృద్ధాశ్రమాల్లో చేర్చాల్సివస్తే సదరు ఆశ్రమాల్లో పైన పేర్కొన్న అంశాలున్నాయో, లేదో పరిశీలించి ఎంచుకోవడం మంచిది. -
వృద్ధులపై సొంత ఇంట్లోనే శారీరకంగా, మానసికంగా వేధింపులు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్‌ను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కాలంలో దేశంలో దాదాపు 73 శాతం వృద్ధులపై వేధింపులు పెరిగాయి. ‘ఏజ్‌వెల్ ఫౌండేషన్’ తాజాగా తన నివేదికలో ఈ విషయం వెల్లడించింది. ఈ ఫౌండేషన్ 5,000 మంది వృద్ధులపై అధ్యయనం నిర్వహించింది. కరోనా కాలంలో తమ కష్టాలు పెరిగిపోయాయని 82 శాతం మంది బదులిచ్చారు. తమ జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని చెప్పారు. కుటుంబసభ్యుల నుంచే తమపై వేధింపులు పెరిగాయని 73 శాతం మంది తెలిపారు. వ్యక్తిగత సంబం ధాలు క్షీణించడమే దీనికి కారణమని వీరిలో 61 శాతం మంది పేర్కొన్నారు. సన్నిహితుల నిర్లక్ష్యం సన్నిహితులే తమను నిర్లక్ష్యం చేశారని 65 శాతం మంది అన్నారు. కుటుంబంలోనే కాకుండా సమాజంలోనూ చీత్కారాలను చవిచూడాల్సి వచ్చిందని 58 శాతం మంది ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ఇంట్లోనే శారీరకంగా, మానసికంగా వేధింపులు ఎదుర్కొన్నామని ప్రతి ముగ్గురిలో ఒకరు (35.1 శాతం మంది) వాపోయారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్, లాక్డౌన్ ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపిందని, వృద్ధులపై ఈ ప్రభావం ఎన్నోరెట్లు అధికంగా ఉందని ఏజ్‌వెల్ ఫౌండేషన్ చైర్మన్ హిమాన్షు రథ్ ఉద్ఘాటించారు. కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు, నిరాదరణ విషయంలో వృద్ధులు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందన్నారు. వారికి అండగా నిలిచే చట్టాలు, వ్యవస్థలు, హక్కుల గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. చాలామంది వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులపైనే ఆధారపడాల్సి వస్తోందని, వేధింపులకు ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఇక వృద్ధ మహిళల విషయంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందన్నారు. చదవండి: ముకుల్‌రాయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి -
60 దాటిన వారిలో ఆందోళన!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ ఉధృతి పెరుగుతున్న కొద్దీ 60 ఏళ్లు పైబడిన వారిలో భయాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసుల వృద్ధితో తామెక్కడ ఆ వైరస్ బారిన పడతామోనన్న ఆదుర్దాతో మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న వారూ ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన నాటి నుంచి 60 ఏళ్లు పైబడిన వాళ్లు, పదేళ్ల లోపు పిల్లలు దీని బారిన ప్రమాదం ఎక్కువగా ఉన్నం దున, బయటకు రావొద్దంటూ ప్రభుత్వాలు, డాక్టర్ల నుంచి వెలువడిన హెచ్చరికలు కూడా వీరిలో భయాలు మరింత పెరిగాయి. మొదట సుదీర్ఘ లాక్డౌన్ విధింపు, ఆ తర్వాతా కోవిడ్ తీవ్రత పెరుగుతున్న సందర్భంలోనూ పెద్దలు, అందులోనూ బీపీ, షుగర్, ఇతర అనారోగ్య సమస్యలున్న వారు 4 నెలలకు పైగా ఇళ్లకే పరిమితం కావడంతో ఆందోళన మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇతర విషయాలపై సైకియాట్రిస్ట్‌లు ఎమ్మెస్‌రెడ్డి, నిశాంత్ వేమన, సైకాలజిస్ట్ సి.వీరేందర్ సాక్షి ఇంటర్వూ్యలో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాం శాలు.. వారి మాటల్లోనే.. ఆందోళనలొద్దు.. ప్రశాంతంగా ఉండండి: సైకియాట్రిస్ట్ ఎమ్మెస్ రెడ్డి మరో 6 నెలలు పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇప్పుడున్నట్టుగానే పెద్ద వయసు వారంతా మరికొంత కాలం గడపాల్సి ఉంటుంది. ఒకవేళ భార్యాభర్తలిద్దరే ఉంటుంటే అన్యోన్యం గా, ఉల్లాసంగా కాలం గడపండి. జాయింట్ ఫ్యామిలీలో ఉంటే కొడుకులు, కోడళ్లతో సఖ్యతగా ఉంటూ మనవలు, మనవరాళ్లతో ఎక్కువ సమయం గడపండి. పెద్దవాళ్లంతా ఇళ్లలోనే ఉంటున్నా రు కాబట్టి వారికి కరోనా దాదాపు సోకదు. బాల్కనీలో లేదా ఇళ్లలోనే కనీసం అరగంట పాటు నడక తప్పని సరి. దీనివల్ల రక్తప్రసారం పెరిగి ఆరోగ్యానికి మంచి చేయడంతో పాటు, మనసును ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. ప్రాణాయామం, ఇతర బ్రీథింగ్ ఎక్సర్‌సైజులతో లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. షుగర్, బీపీ వంటి వాటిని కంట్రోల్లో ఉంచుకోండి. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, ఆప్తులతో ఫోన్లో ముచ్చట్లు వంటి వాటితో గడపండి. టీవీల్లో కోవిడ్ సంబంధ వార్తలు ఎక్కువసేపు చూడొద్దు. యువతరం అవగాహన కల్పించాలి: సైకాలజిస్ట్ సి.వీరేందర్ ఆందోళన కలిగించే వార్తలు, బయటి పరిస్థితులు 60 ఏళ్లు పైబడిన వారిపై ప్రభావం చూపుతున్నాయి. కోవిడ్ గురించి అవగాహన ఉన్న కొంత వయసు పైబడిన వారి లో తమకు ఈ వ్యాధి సోకుతుందేమోనన్న భయాలు పెరుగుతున్నాయి. ఇక దీని గురిం చి తెలియని వారు, నిరక్షరాస్యులు తమకేమీ కాదని మా స్కులు, శానిటైజర్లు ఉపయోగించేందుకూ విముఖత చూపుతున్నారు. అందువల్ల ఇళ్లలోని యువతరం.. ఈ రెండు వర్గాల వారికి అవగాహన కల్పించాలి. ఇప్పుడు ఏర్పడిన క్లిష్ట పరిస్థితులను అంగీకరించి వాటిని ఎదుర్కొనేందుకు అంతా సిద్ధం కావాలి. శారీరకంగా, మానసికంగా శక్తి సామర్థ్యాలను పెంచుకోవడం, ఏదైనా వస్తే వైద్యపరంగా చికిత్స తీసుకోవడం, కుటుంబ, సామాజికపరంగా చేదోడువాదోడుగా నిలవడం వంటి చర్యల ద్వారా ప్రస్తుతం ఎదురయ్యే సమస్యలను సులభంగా అధిగమించొచ్చునని అందరూ గ్రహించాలి. పెద్దల్లో ఆ లక్షణాలుంటే లేట్ చేయొద్దు: సైకియాట్రిస్ట్ నిశాంత్ వేమన పెద్ద వయసు వారిలో ముఖ్యంగా వివిధ అనారోగ్య సమస్యలున్న వారు దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న లక్షణాలు స్వల్పంగా కనిపించినా ఆందోళన చెందుతున్నారు. ఈ ఆరోగ్య సమస్యలపై ఆసుపత్రులకు వెళ్లేందుకూ భయపడుతున్నారు. ఆస్పత్రికి వెళితే ఎక్కడ తమకు కరోనా వైరస్ అంటుకుంటుందో నని తమ డాక్టర్లను కూడా సంప్రదించేందుకు కొంద రు వెనుకాడుతున్నారు. అంతకుముందు జబ్బులు న్నా, పెద్ద వయసు వారైనా కోవిడ్ నుంచి అధిక శాతం కోలుకుంటున్నందున అనవసర ఆందోళనలకు గురికావొద్దు. ఆశావహ దృక్పథంతో ఉంటూ, బ్రీథింగ్, రెస్పిరేటరీ ఎక్సర్సైజులు చేస్తూ, ఆప్తులు, ఇష్టమైన వారితో తరచుగా ఫోన్లో మాట్లాడుతూ అహ్లాదంగా ఉంటే ఏ సమస్యలూ రావు. ఏమాత్రం లక్షణాలు బయటపడినా వెంటనే ఇంట్లో వాళ్లకు చెప్పాలి. తగిన చికిత్స తీసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేతప్ప కరోనా గురించి భయపడి, ఆలస్యం చేయొద్దు. -
పండుటాకులు కోరే చిరునవ్వు
మీ ఇంటి పెద్దవారిని జాగ్రత్తగా చూసుకోండి అన్నారు ప్రధాని. అంటే వేళకు మందులివ్వడం, వేళకు అవసరాలు గమనించడం, వేళకు అన్నీ అమర్చి పెట్టడం... ఇది మాత్రమే కాదు అర్థం. వారితో కూర్చోవాలి. మాట్లాడాలి. మనసు వినాలి. వారు తమ కుటుంబ సభ్యులను సంతృప్తిగా చూసుకుంటూ ఒక చిన్న చిర్నవ్వు నవ్వేలా చూడగలగాలి. కరోనా సమయంలో వారికి కావలసిన ఇమ్యూనిటీ కొడుకులు.. కూతుర్లు... మనవలు... మనవరాళ్లు. వారి కోసం ఉన్నారా వీరంతా? మేడ్చల్‌లో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అది. మేనేజర్ కొంచెం వర్రీగా ఉన్నాడు. పద్దెనిమిది గదుల్లో పద్దెనిమిది వృద్ధ జంటలు ఆ హోమ్‌లో ఉన్నాయి. లాక్డౌన్ ప్రకటించాక విజిటర్స్ రాకపోకలు పూర్తిగా నిషేధం అయినా లోపల జరగవలసిన కార్యక్రమాలు పెద్ద ఆటంకాలు లేకుండా జరుగుతూనే ఉన్నాయి. ఎగువ మధ్యతరగతి వారి కోసం కొంచెం ఫీజు ఎక్కువ తీసుకుని శ్రద్ధగా నడిపే హోమ్ అది. ఉంటున్న వాళ్లంతా ఉత్సాహంగా ఉంటారు. రొటీన్‌గా కాలక్షేపం చేస్తుంటారు. కాని రూమ్ నంబర్ నాలుగులోని జంట మాత్రం గత ఐదారు రోజులుగా రూమ్ నుంచి సరిగ్గా బయటకు రావడం లేదు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అది కూడా ఇద్దరికి కాకుండా ఒకరికే... రూమ్‌కు తెప్పించుకుని కాస్త కాస్త తిని ఊరుకుంటున్నారని హెల్పర్స్ ద్వారా తెలిసింది. మేనేజర్ వారి రూమ్ దగ్గరకు వెళ్లి పలకరించే ప్రయత్నం చేశాడు. కాని తలుపు తీయలేదు. ‘మాకు మూడ్ బాగలేదు. మళ్లీ మాట్లాడతాం మేనేజర్గారూ’ అన్నారు లోపలి నుంచే. మేనేజర్‌కు ఏం చేయాలో తోచలేదు. ∙∙ ‘ఏమంటున్నారు మీరు?’ అన్నాడు సైకియాట్రిస్ట్. ‘అవును సార్. ఆ వెంకటేశ్వర్లు, మాణిక్యమ్మ జంటే. సడన్‌గా బాగా డల్ అయిపోయారు. మీరొకసారి వచ్చి చూడాలి’ అన్నాడు మేనేజర్ ఫోన్లో. ‘ఇప్పుడు కదలడం కష్టం కదా లాక్డౌన్లో’ అన్నాడు సైకియాట్రిస్ట్. ‘ఎమర్జన్సీ కద సార్. డాక్టర్లను ఎవరు ఆపుతారు’ అన్నాడు మేనేజర్. ‘సరే రేపు వస్తాను’ అన్నాడు సైకియాట్రిస్ట్. ∙∙ సైకియాట్రిస్ట్‌కు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర్లు, మాణిక్యమ్మ అతనికి తెలుసు. ప్రతి రెండు నెలలకు ఒకసారి హోమ్‌వారు సైకియాట్రిస్ట్‌ను పిలిపిస్తారు. అక్కడ ఉన్న జంటల ఉద్వేగాలు, భయాలు, సందేహాలు, యాంగ్జయిటీ, డిప్రెషన్... ఇటువంటి వాటికి సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది. ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. సాధారణంగా అక్కడ రెండు రకాల జంటలు ఉంటాయి. మొదటిది పిల్లల్ని ప్రయోజకులను చేసి, వారు రెక్కలొచ్చి ఎగిరిపోయాక, తమ ఇష్టం మేరకు సంతోషంగా వచ్చి చేరిన జంటలు. పిల్లలు తమకు తల్లిదండ్రులు భారమని తలచి, తమ దగ్గర వారు ఉంటామన్నా వినకుండా, చేర్పించిన జంటలు. వెంకటేశ్వర్లు, మాణిక్యమ్మ మొదటి కేటగిరిలోకి వస్తారు. వాళ్లకు ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యాడు. కూతురు కూడా అమెరికాలో కొన్నాళ్లు ఉండి ఐదేళ్ల క్రితం ఇండియా తిరిగి వచ్చి ముంబైలో కుటుంబంతో ఉంటోంది. వెంకటేశ్వర్లు, మాణిక్యమ్మ తమ బాధ్యతలు తీరాయని ఆరేళ్ల క్రితం ఈ హోమ్‌లో చేరారు. ఇద్దరూ హుషారుగా ఉంటారు. అక్కడ ఉన్న జంటలకు సగం కౌన్సెలింగ్ వీరే చేస్తుంటారు. సలహాలు చెబుతుంటారు. ధైర్యం ఇస్తుంటారు. అది గమనించిన సైకియాట్రిస్ట్ ఓల్ట్ ఏజ్ హోమ్‌కు వెళ్లినప్పుడల్లా ‘ఆ రూమ్ నంబర్ నాలుగు జంటను చూడండి. వాళ్లతో రోజూ ఒక గంట మాట్లాడండి. మీ హెల్త్ బాగుంటుంది’ అని చెప్పేసి వస్తుంటాడు. అలాంటిది ఆ జంటే మెత్తబడిందంటే కారణం ఏమిటో తెలుసుకోవాలని సైకియాట్రిస్ట్‌కు అనిపించింది. ∙∙ ‘డాక్టర్ గారూ.. ఆ ఇద్దరూ వాళ్లతో వీళ్లతో కొంచెం మాట్లాడారట. దాన్ని బట్టి వాళ్ల సమస్యలు నాకు అర్థమయ్యాయి. 1. ప్రతి సంవత్సరం కొడుకు తప్పనిసరిగా వాళ్లను చూడటానికి వస్తాడు. ఈసారి నాలుగేళ్ల తర్వాత మనవలను తీసుకుని వస్తున్నట్టు చెప్పాడు. తీరా బయల్దేరే సమయానికి విమానాలు ఆగిపోయాయి. కరోనా వుద్ధృతి అమెరికాలో ఎక్కువగా ఉంది. దాంతో ఇక కొడుకును, మనవలను ఎప్పటికీ చూడలేమేమో, విమానాలు ఇక ఎప్పటికీ రావేమోనని కుంగిపోయారు. 2. అమెరికాలో కరోనా వార్తలు బాగా ఫాలో అవుతున్నారు. అది తన కొడుకు కుటుంబానికి ఎక్కడ సోకుతుందో అని ఆందోళన చెందుతున్నారు. 3. కరోనా తమకే సోకితే ఎలా అని మరో భయం వారిని వెన్నాడుతోంది. 4. ఎటుపోయి ఎటొచ్చి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ మూతపడితే తమ పరిస్థితి ఏంగాను.. కొత్తగా ఎక్కడికి పోవాలి... అని మరో భయం.. ఇలా ఉన్నాయి సార్ వారి ఆలోచనలు’ అన్నాడు హోమ్ మేనేజర్ సైకియాట్రిస్ట్‌తో. సైకియాట్రిస్ట్ రూమ్ నంబర్ 4 దగ్గరకు వెళ్లాడు. వారు తలుపు తీయలేదు. కేవలం కిటికీ మాత్రం తీశారు. ‘హాయ్... గుడ్‌మార్నింగ్... తలుపు తీస్తారా మంచి టానిక్ ఇస్తాను’ అని నవ్వాడు సైకియాట్రిస్ట్. ∙∙ సైకియాట్రిస్ట్ మొదట చేసిన పని సమస్యను పది మందిలో వేయడం. ‘మీరు లోపల్లోపల కుళ్లబెట్టుకుంటూ కూచుంటే ఇలాగే అవుతారు. పదిమందితో మాట్లాడండి’ అని ఒక కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడించారు. అందులో వెంకటేశ్వర్లు, మాణిక్యమ్మల కొడుకు సతీష్, కూతురు ధరణి, కోడలు, అల్లుడు ఉన్నారు. అందరి గొంతులు ఒక్కసారి వినేసరికి వాళ్ల ప్రాణం లేచి వచ్చింది. సమస్య గురించి ముందే కొడుకుతో సైకియాట్రిస్ట్ మాట్లాడటం వల్ల ఎక్కువ కౌన్సెలింగ్ కొడుకే ఇచ్చాడు. ‘అమ్మా.. నాన్నా... మీరు మా ఇల్లు చూశారు కదా. వచ్చి ఉన్నారు కదా. సేఫ్‌గా ఉన్నాం అందరం. ఎవ్వరం బయటకు వెళ్లడం లేదు. కరోనా అసలు మా ఊళ్లో చాలా తక్కువగా ఉంది. దాని గురించి భయపడకండి. ఇక పిల్లలను తీసుకొని మీ దగ్గరకు రావడం ఇప్పుడు జరక్కపోతే మూడు నెలల తర్వాత జరుగుతుంది లేదా ఆరు నెలల తర్వాత జరుగుతుంది. అంతే తప్ప అసలు రాకుండా పోవడం అంటూ ఉండదు. విమానాలు ఎగరకపోతే ప్రపంచం నడవదనే డౌట్ తీసేయండి. ఇక మీకు కరోనా రావడం గురించి. పల్లెటూళ్లో గట్టి తిండి తిని పెరిగినవారు మీరు. బి.పి, సుగర్లను ముప్పై ఏళ్లుగా కంట్రోల్లో పెట్టుకుని ఉన్నారు. మీకేమవుతుంది చెప్పండి. అసలు మీరున్న హోమ్ చాలా జాగ్రత్తగా మెయింటెయిన్ చేస్తున్నారు. రసాయనాలు కూడా చల్లారని చెప్పారు. మీరేమైనా బయటకు వెళుతున్నారా కరోనా రావడానికి? ఇక హోమ్ మూసివేత గురించి. ఈ ప్రశ్న మీ మేనేజర్‌ను కాదు ఏకంగా మేనేజ్మెంట్నే అడిగాను. వారు నవ్వుతున్నారు. ఇంకో ఇరవై రూములు ఎక్స్పాండ్ చేస్తారట తప్పితే మూసివేయరు. అయినా అంతగా మూసివేస్తే నేనో చెల్లాయో ఉన్నాం కదా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకోవడానికి. కావాలంటే చెప్పండి.. నేనొచ్చినప్పుడు అమెరికాకు తీసుకెళతా’ అన్నాడు కొడుకు. పిల్లలు చెప్పే ఒక్కోమాట వారిలో ఎంతో ధైర్యం నింపింది. ముఖాలు విప్పారాయి. ‘అయినా నాన్నా... చిన్నప్పటి నుంచి ఊళ్లో, ఉద్యోగంలో ఎన్ని ఇష్యూస్ హ్యాండిల్ చేశారు మీరు. మిమ్మల్ని చూస్తేనే నాకు ధైర్యం వచ్చేస్తుంటుంది. మీరు డల్ అయితే ఎలా?’ అన్నాడు కొడుకు. ‘హాయిగా ఉండండి అమ్మా.. నాన్నా... రోజూ మీతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడతాం కదా’ అంది కూతురు. వెంకటేశ్వర్లు, మాణిక్యమ్మల భ్రమాజనిత ఒంటరితనం ఎగిరిపోయింది. సైకియాట్రిస్ట్ వొచ్చిన పని ముగిసింది. ఈ కాన్ఫరెన్స్ కాల్ వీరికి మాత్రమే కాదు... ఇలాంటి ప్రతి పండుటాకుకూ కావాలి... దొరకాలి. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
కరోనా: ఒకే ఇంట్లో ఐదుగురికి సోకిన వైరస్
కరోనాతో బెజవాడ గడగడలాడుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 35 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వాటిలో 27 మంది విజయవాడకు చెందిన వారే కావడం గమనార్హం. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. కరోనా సోకిన వారిలో ఇద్దరు మృత్యు ఒడికి చేరగా, చికిత్సతో ముగ్గురు యువకులు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. జిల్లాలో నమోదైన కరోనా కేసుల వివరాలతో ప్రత్యేక కథనం. లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 35 పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 27 మంది పురుషులు, ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారిలో 50 ఏళ్ల వయస్సు పైబడిన ఇద్దరు (54, 56 వయస్సు) వ్యక్తులు మృత్యువాత పడగా, విదేశాల నుంచి వచ్చిన ముగ్గురు యువకులు కరోనాను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 30 మంది కరోనా బాధితులు విజయవాడ ప్రభుత్వాస్పత్రి, గన్నవరంలోని పిన్నిమనేని సిద్ధార్థ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరందరి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు. కరోనా వైరస్ ప్రభావం 50 ఏళ్లు పైబడిన వారు, మధుమేహం, రక్తపోటు ఉన్న వారిపై ఎక్కువగా ఉంటోందని, వారు రికవరీ అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ సోకిన వారిలో యువత త్వరగా కోలుకుంటున్నట్లు చెబుతున్నారు. కరోనా వైరస్ సోకిందిలా.. జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారిలో నలుగురు విదేశాల నుంచి వచ్చిన వారు కాగా, ఢిల్లీ సమావేశానికి వెళ్లి వచ్చిన వారు 14 మంది ఉన్నారు. ఢిల్లీ సమావేశానికి వెళ్లి వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన వారు 12 మందికి కరోనా పాజిటివ్ రాగా, వైరస్ ఎలా సోకింది అనే అంశం తెలియని మరో ఐదుగురు కూడా ఉన్నారు. ఆ ఐదుగురిలో కొత్తపేటకు చెందిన 43 ఏళ్ల మహిళ, సూర్యారావుపేటకు చెందిన 21 ఏళ్ల యువకుడు, బారిష్టర్ వీధికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి, కుమ్మరిపాలేనికి చెందిన 24 ఏళ్ల యువకుడు, భవానీపురానికి చెందిన 32 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. వారికి ఎలా సోకింది, కాంటాక్ట్ ఎక్కడ అనే దానిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి సారించారు. వారికి జలుబు, దగ్గు, జ్వరం రావడంతో స్వచ్ఛందంగా ఆస్పత్రులకు వచ్చారు. కుమ్మరిపాలెం సెంటర్లో ఒకే డోర్ నంబరు గల ఇంట్లో ఐదుగురికి పాజిటివ్ రావడం, వీరితో పాటు పరిసర ప్రాంతాల్లో ఇద్దరికి పాజిటివ్ రావడం, అదే ప్రాంతంలో ఒకరు మృతి చెందడంతో అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి, ప్రత్యేక దృష్టి సారించారు. వాళ్లు రావడమే సీరియస్ కండీషన్లో వస్తున్నారు 50 ఏళ్లు పైబడిన వయస్సు వారిలో కరోనా పాజిటివ్ వస్తే ఆస్పత్రికి వచ్చేటప్పటికే సీరియస్ కండీషన్లో ఉంటున్నారు. మధుమేహం, రక్తపోటు ఉన్న వారిలో సైతం కరోనా వస్తే తగ్గడానికి సమయం పడుతోంది. మా వద్ద చికిత్స పొందిన ముగ్గురు యువకులు పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఒకరిద్దరు సీరియస్ కండీషన్లో ఉన్నారు. వారిని ఐసీయూలో ఉంచాం. అవసరమైతే వెంటిలేటర్ సపోర్టు పెడతాం. వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. –డాక్టర్ ఎన్.గోపీచంద్, నోడల్ ఆఫీసర్, కోవిడ్–19 ట్రీట్మెంట్ సెంటర్ -
ఏలూరులో పెన్షన్ల కోసం వృద్ధుల అగచాట్లు
-
అందని ‘ఆసరా’..!
పింఛన్ రాక లబ్ధిదారుల తిప్పలు కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు పట్టించుకోని అధికారులు ప్రభుత్వం విధించే కొన్ని నిబంధనలు ఒక్కొక్కసారి ప్రజల్లో ఎంత అసహనాన్ని పుట్టిస్తాయి అంటే నరాల్లోని రక్తం ఉడికే అంత. అసలే పండుటాకులు, పైగా సరిగ్గా నిల్చోలేని పరిస్థితి. ఆ దీన స్థితిలో ఉన్న వద్ధులను పట్టుకొని ‘‘నువ్వు బతికే ఉన్నావా? పింఛన్ నువ్వే తీసుకుంటున్నావా? మీ సేవా కేంద్రం నుంచి ధ్రువీకరణ పత్రాలు తేవాల్సిందే. లేకుంటే వచ్చే నెల సంది పింఛన్ రాదు’’. రెండు నెలల క్రితం వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులకు అధికారులు విధించిన నిబంధన ఇది. ఈ నిబంధన కారణంగా లబ్ధిదారులు పడరాని పాట్లు పడ్డారు. చివరకు బతికే ఉన్నాం అంటూ బతుకు పోరు కొనసాగిస్తున్నారు. ఇది ఒక తీరు వ్యథ.. కొత్త పింఛన్లు మంజూరు కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ బతుకు జీవుడా అంటున్న మరికొందరివి కన్నీటి కష్టాలు ఆదిలాబాద్ అర్బన్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఆసరా పథకం’ అర్హులందరికి అందడం లేదు. ఫలితంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆసరా పథకం అభాసుపాలవుతోంది. నెలనెల పింఛన్లు రాక లబ్ధిదారులు పడరాని పాట్లు పడుతున్నారు. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు మాత్రం కనికరించడం లేదు. అర్హులకు దక్కాల్సిన పింఛన్ సొమ్ము అనర్హులకు దక్కుతున్నాయనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు పింఛన్ అందించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినా అధికారులు నిర్లక్ష్యంతో ఆసరా పథకం లక్ష్యం నెరవేరడం లేదు. నూతన పింఛన్ల జాడే లేదు.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు పింఛన్లు మంజూరు కాక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పింఛన్ అర్హులు ప్రతి సోమవారం గ్రీవెన్స్‌లో ఆసరా నివ్వండి సారూ అంటూ కలెక్టర్‌ను కలిసి అర్జీ పెట్టుకుంటున్నారు. ఇప్పటికి దాదాపు 3వేలకు పైగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ నియోజకవర్గంలో జైనథ్, బేల, ఆదిలాబాద్ మండలాలకు కలిపి 20,587 వివిధ రకాల పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. నియోజకవర్గంలో పింఛన్లు ఇలా.. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని మూడు మండలాలకు కలిపి 20,587 వివిధ రకాల పింఛన్లు ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్ మండలంలో మొత్తం 6,420 పింఛన్లు ఉన్నాయి. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 3,158, వితంతు 2,331, దివ్యాంగ పింఛన్లు 626, అభయ హస్తం పింఛన్లు 304తో పాటు ఒక కల్లుగీత పింఛన్ ఉంది. ఆదిలాబాద్ అర్బన్‌లో మొత్తం 6,077 పింఛన్లు ఉండగా, ఇందులోంచి వద్ధాప్య పింఛన్లు 3,191, వితంతు పింఛన్లు 2,096, దివ్యాంగుల పింఛన్లు 743, అభయహస్తం 47 పింఛన్లు ఉన్నాయి. బేల మండలంలో మొత్తం 3,050 పింఛన్లు ఉండగా, ఇందులోంచి 1,745 వృద్ధాప్య పింఛన్లు, 778 వితంతు, 266 దివ్యాంగుల పింఛన్లు, 261 అభయహస్తం పింఛన్లు ఉన్నాయి. జైనథ్ మండలంలో మొత్తం 5,040 వివిధ రకాల పింఛన్లు ఉండగా, వృద్ధాప్య పింఛన్లు 2,647 వితంతు పింఛన్లు 1,485, దివ్యాంగ పింఛన్లు 466, అభయహస్తం పింఛన్లు 442 ఉన్నాయి. వీరందరూ ప్రస్తుతం నెలనెల పింఛన్లు పొందుతున్నట్లుగా అధికారుల రికార్డుల్లో ఉంది. లబ్ధిదారులకు తప్పనిపాట్లు పింఛన్లు పొందడంలో అర్హులైన లబ్ధిదారులకు పాట్లు తప్పడం లేదు. పింఛన్ కోసం ప్రతి వారం దరఖాస్తులు చేసుకున్న ఫలితం ఉండడం లేదని అర్హులు ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పటికే పింఛన్ల తీసుకుంటున్న లబ్ధిదారులు అధికారులు ఆన్లైన్ ప్రక్రియను ముడిపెట్టడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చేసేదేమి లేక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. -
పించన్లు అందక లబ్దిదారుల ఇక్కట్లు