రొటీన్‌గా చేసే పనుల్లో చేసుకోదగిన చిన్న చిన్న మార్పులు న్యూ ఇయర్(New Year)తో 50 ఏళ్లు నిండుతాయా...ఎంతో హుషారుగా, మరెంతో శ్రమతో లేదంటే.. గడిచిన నాలుగు పదులనూఓ జ్ఞాపకంలా మార్చుకుంటూ ఐదు పదుల్లోకి అడుగుపెట్టి ఉంటారు. ఇప్పటివరకు ఒక లెక్క...ఇక నుంచి ఒక లెక్క అన్నట్టు 50 ఏళ్ల నుంచి మహిళల శరీరంలోనూ, మనస్తత్వంలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఇంటా బయట ఎదురయ్యే ఒత్తిళ్లు, తమ పట్ల తాము పట్టించుకోని విధానం ఎప్పుడూ ఉంటుంది. పర్లేదు అని నిర్లక్ష్యం చేసే రోజువారీ అలవాట్లను వదిలేసికొత్తగా ఈ అలవాట్లను అలవరచుకోండి. 50 ఏళ్లలోనూ ఫిట్ అండ్ హెల్తీగా ఉండండి.
వ్యాయామాలు(Exercises)
కార్డియో ఎక్సర్‌సైజులు చేయాలనుకోకండి. శరీరానికంతటికీ శక్తినిచ్చే వ్యాయామం కండర కణజాలాన్ని సంరక్షిస్తుంది. ఎముక నష్టం కాకుండా పోరాడుతుంది. సమతుల్యతను కాపాడుతుంది. సడెన్‌గా పడిపోయే ప్రమాదాలను నివారిస్తుంది.
సెల్ఫ్‌కేర్(Self Care)
ఎప్పుడూ తమ కన్నా ముందు ఇతరులకు ఇవ్వడానికే శక్తిని ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక నుంచి రోజులో కొంత సమయం ‘నా కోసం నేను’ అనేలా మిమ్మల్ని మీరు సంతోషపరుచుకునే మానసిక ఆరోగ్యాన్ని పెం΄÷ందించే అలవాట్లు, కార్యకలా΄ాలకు
ప్రాధాన్యత ఇవ్వండి.
చురుకుగా ఉండటానికి..
50 లలో ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. గంటల తరబడి కూర్చుంటే గుండె జబ్బుల రిస్క్ పెరగవచ్చు. ఊబకాయం వల్ల కీళ్లపై భారం పడి మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి. అందుకని శరీరం, మైండ్ చురుకుదనానికి రెగ్యులర్ మూవ్‌మెంట్స్ ఉండేలా చూసుకోవాలి.
నిల్వ పదార్థాలకు ‘నో’
ఉప్పు, చక్కెర మోతాదు నిల్వ పదార్థాలలో ఎక్కువ. అంతేకాదు, వీటిలో అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకని మైదాతోపాటు ఇతర నిల్వ ఉండే పదార్థాలను పక్కనపెట్టండి.
చర్మం పట్ల జాగ్రత్త! (Skin Care)
చర్మ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే వృద్ధాప్యం వేగంగా వచ్చేస్తుంది. చర్మ కేన్సర్ ప్రమాదాన్నీ పెంచుతుంది. వయసుతోపాటు చర్మమూ పొడిబారుతుంటుంది. ఎండవేళలో బయటకు వెళ్లినప్పుడు ఈ సమస్య మరీ పెరుగుతుంది. అందుకని, ఎండ నేరుగా చర్మంపై పడకుండా ఎస్‌పిఎఫ్ ప్రొటెక్షన్ ఉన్న క్రీమ్స్ ఉపయోగించాలి..
ప్రోటీన్స్(Proteins)
ఇన్నిరోజులు రుచిగా ఉండే ఆహారంపైన దృష్టి పెట్టి ఉంటారు. కానీ, తినే ఆహారంలో ప్రోటీన్ తక్కువ ఉంటే కండరాలకు వేగంగా నష్టం వాటిల్లడమే కాదు రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అందుకని నట్స్, గుడ్లు, మొక్కల నుంచి లభించే ప్రోటీన్లు గల ఆహారాన్ని భోజనంలో చేర్చండి.
తరచూ నీళ్లు
డీహైడ్రేషన్ ప్రభావాలు చర్మం సాగే గుణం, అజీర్తి, శక్తి స్థాయిలపై పడుతుంది. దాహం వేయడం అనే సంకేతాలు వయస్సుతోపాటు తగ్గుతుంటాయని గ్రహించి, తరచూ నీళ్లు తాగుతుండాలి.
హాయిగొలిపే నిద్ర
నిద్రలేమి జీర్ణక్రియ, మానసిక స్థితి, జ్ఞాపశక్తిపైన ప్రభావం చూపుతుంది. ఈ రోజుల్లో మొబైల్, టీవీ స్క్రీన్ల వల్ల అర్ధరాత్రి తర్వాత నిద్రకు ఉపక్రమించేవాళ్లే ఎక్కువ. ఈ జాబితాలో మీరుంటే, స్క్రీన్లను త్వరగా కట్టిపెట్టి రోజూ 6–8 గంటల సమయాన్ని నిద్రకు కేటాయించండి. రాత్రివేళ కెఫీన్ వంటి పానీయాలకు దూరంగా ఉంటే నిద్ర లేమి సమస్య తలెత్తదు.
అభిరుచులు
ఈ వయసులో తలెత్తే మానసిక ఒత్తిడి, ఆందోళన లేదా డిప్రెషన్‌ని విస్మరిస్తే అవి దీర్ఘకాలం నష్టం జరగవచ్చు. అందుకని మానసిక శ్రేయస్సును ప్రోత్సహించే శ్రద్ధ, అభిరుచుల కోసం సమయం కేటాయించుకోవాలి.
(చదవండి: 'యూపీఎస్సీ చాట్ భండార్'..నాటి స్వాతంత్య్ర సంగ్రామాన్ని..!)
Comments
Please login to add a commentAdd a comment