Senior Citizen
-
వయసుకే వృద్ధాప్యం.. !
వయసుకే వృద్ధాప్యం..మనసుకు మాత్రం కాదు.. అన్నట్లు హుషారైన వాతావరణం అక్కడి వారి సొంతం. ఆట ఏదైనా సై అంటూ రంగంలోకి దిగి తమదైన శైలిలో ప్రతిభను చాటుతుంటారు హైదరాబాద్ సనత్‌నగర్‌లోని మోడల్‌కాలనీ సీనియర్ సిటిజన్స్. ఉదయం, సాయంత్రం వేళల్లో కాలనీకి చెందిన సీనియర్ సిటిజన్స్ అంతా ఒకచోట చేరి సందడిగా గడుపుతున్నారు. అలాంటి హుషారైన వేదికకు అసోసియేషన్ కార్యాలయం.. సీనియర్ సిటిజన్స్ ఆనందానికి నెలవైంది. వయస్సు మీద పడింది కదా.. అని ఏదో మూలన కూర్చోవడం ఒకప్పటి మాట. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ మాత్రం ఆటలతో అదరగొట్టేస్తున్నారు. కేరమ్స్, చెస్ వంటి ఆటలతో మానసికోల్లాసం పొందడమే కాకుండా థ్రెడ్‌మిల్‌పై సాధన చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. చాలా కుటుంబాల్లో తమవారంతా కార్యాలయాలకో, పిల్లలు స్కూళ్లకో, కళాశాలలకో వెళ్లిపోతుండగా.. సీనియర్ సిటిజన్స్ ఇక్కడికి వచ్చి ఎవరికి ఇష్టమైన గేమ్‌లో వారు ఆడుతూ ఒంటరితనాన్ని దూరం చేసుకుంటున్నారు. రెండు వేల పుస్తకాలతో.. ఆడుకునేవారు ఆడుకుంటుంటే.. మరికొందరు ఇక్కడి లైబ్రరీలో పుస్తకాలతో కుస్తీ పడుతూ విజ్ఞాన సముపార్జన చేస్తుంటారు. సాహిత్యం, ఆధ్యాతి్మకం, హిస్టరీ.. ఇలా దాదాపు నాలుగు వేల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. కాలనీవాసులు ఇంటికీ తీసుకెవెళ్లేందుకు కూడా అనుమతిస్తారు. అలాగే దినపత్రికలు, మ్యాగజైన్స్ చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటుంటారు. ప్రతిరోజూ ఇక్కడికి నాలుగు రకాల పత్రికలతో పాటు వివిధ రకాల వీక్లీ మ్యాగజైన్స్ వస్తుంటాయి. వాటిని చదువుతూ ప్రపంచ విశేషాలను తెలపడమే కాదు.. ఇంటికెళ్లి తమ వారితో పంచుకుంటుంటారు. ఆటల పోటీల్లో.. జనవరి 26, ఆగస్టు 15, అక్టోబర్ 1 (సీనియర్ సిటిజన్స్ డే) సందర్భంగా ఆసరా కమిటీ సహకారంతో జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్లోని సీనియర్ సిటిజన్స్ పలు క్రీడాంశాల్లో పోటీ పడుతుంటారు. కేరంబోర్డు, చదరంగం, బ్రిస్క్ వాకింగ్, టగ్ ఆఫ్ వార్, జనరల్ నాలెడ్జ్ వంటి అంశాల్లో పోటీలు నిర్వహిస్తూ బహుమతులు ప్రదానం చేస్తారు. ఏడు పదులు దాటిన వయోధికులకు మోడల్‌కాలనీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతియేటా సన్మానిస్తూ ఎప్పటికప్పుడు వారిలో నూతనోత్తేజాన్ని నింపుతోంది. భవిష్యత్తు తరాలకు సీనియర్ సిటిజన్స్‌కు ఏవిధమైన గౌరవం, ఆప్యాయత చూపించాలో కళ్లకు కట్టినట్లు చూపిస్తుండడం విశేషం. ఆత్మాభిమానంతో బతకాలి.. ఏ సమాజంలో వృద్ధులు తల ఎత్తుకుని ఆత్మాభిమానంతో మనుగడ సాగిస్తారో ఆ సమాజమే నాగిరిక సమాజం. ఆ సమాజం సర్వతోముఖాభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లో ముందంజవేసి భావితరాలకు కరదీపికగా నిలుస్తుంది. ఇది ఒక భావన, ఆకాంక్ష, స్వప్నం. దీనిని సాకారం చేసుకోవాలంటే కలలో నుంచి ఇలలోకి రావాలి. నేటి సమాజంలోని వృద్ధుల స్థితిగతులను సామాజిక, శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించాలి. – జేఎస్టీ శాయి, ప్రధాన కార్యదర్శి, మోడల్‌కాలనీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ -
ఇదే జరిగితే.. రూ.10 లక్షల వరకు నో ట్యాక్స్?
ప్రతి సంవత్సరం బడ్జెట్ సమయంలో.. ట్యాక్స్ మినహాయింపుపై ప్రభుత్వం ఏమైనా కొత్త ప్రకటనలు చేస్తుందా? అని పన్ను చెల్లింపుదారులు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పరిమిత ఆదాయ వనరులతో.. సీనియర్ సిటిజన్లు పెన్షన్లపై ఆధారపడతారు. కాబట్టి ట్యాక్స్ మినహాయింపు వారికి కీలకమైన ఆర్థిక భద్రతగా పనిచేస్తుంది.2020 - 21 బడ్జెట్ సమయంలో కొత్త పన్ను విధానం ప్రకటించిన తరువాత.. పన్ను విధానంలో ఎలాంటి మార్పులు జరగలేదు. కాబట్టి త్వరలోనే జరగనున్న బడ్జెట్లో ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) ఎట్టకేలకు పాత పన్ను విధానంలో పన్ను స్లాబ్‌లను సవరించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.2023-24 బడ్జెట్లో, ప్రభుత్వం ప్రాథమిక ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు.. అంతకంటే ఎక్కువ) రూ.3 లక్షలకు, సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 ఏళ్లు & అంతకంటే ఎక్కువ) రూ.5 లక్షలకు పెంచింది. అయితే రాబోయే బడ్జెట్లో ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని సీనియర్ సిటిజన్లకు రూ.5 లక్షలు, సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.7 లక్షలకు పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభిస్తుంది.పాత పన్ను విధానంప్రస్తుతం పాత పన్ను విధానం ప్రకారం.. 60 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న సీనియర్ సిటిజన్లకు రూ. 3 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు. అయితే రూ. 3,00,001 నుంచి రూ. 5,00,000 మధ్య 5 శాతం, రూ. 5,00,001 నుంచి రూ. 10,00,000 మధ్య 20 శాతం, రూ. 10 లక్షలు దాటితే 30 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది.80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారికి రూ. 5 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. అయితే రూ. 5,00,001 నుంచి రూ. 10,00,000 మధ్య 20 శాతం, రూ. 10 లక్షలకు పైన 30 శాతం ట్యాక్స్ ఉండేది. సీనియర్ సిటిజన్లు సాధారణంగా కొన్ని సేవింగ్స్ స్కీముల్లో సేవింగ్స్ చేసుకుంటారు. వీరికి పాత పన్ను విధానంలోనే సెక్షన్ 80సీ మినహాయింపులు లభిస్తాయి. కొత్త పన్ను విధానంలో పరిమితిని పెంచితే.. ట్యాక్స్ నుంచి వారికి కొంత ఉపసమయం లభిస్తుంది.కొత్త శ్లాబులుఫిబ్రవరి 1న జరగనున్న బడ్జెట్లో పన్ను మినహాయింపు పరిమితిని పెంచితే.. 60 నుంచి 79 ఏళ్ల మధ్య వయసున్న వారు రూ. 5 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే రూ. 5,00,001 నుంచి రూ. 10,00,000 మధ్య 20 శాతం, రూ. 10 లక్షల పైన 30 శాతం ట్యాక్స్ చెల్లింపు ఉంటుంది.సూపర్ సీనియర్ సిటిజన్ల కోసం లేదా 80 సంవత్సరాలు & అంతకంటే ఎక్కువ వయసున్న వారు రూ. 7,00,000 వరకు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 7,00,001 నుంచి రూ. 10,00,000 వరకు.. 20 శాతం, రూ. 10 లక్షల పైన 30 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: 'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు': ఆనంద్ మహీంద్రాపన్ను మినహాయింపు పరిమితి పెరిగితే 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్నవారు.. తమ ఆదాయం 10 లక్షలయినా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఎలా అంటే.. వారి ఆదాయం రూ. 10 లక్షలు అనుకుంటే.. అందులో రూ. 5 లక్షలు ప్రాథమిక మినహాయింపు పరిమితి. సెక్షన్ 80సీ ద్వారా రూ. 1.50 లక్షలు, సెక్షన్ 80సీసీడీ (1బీ) ద్వారా రూ. 50,000, సెక్షన్ 80డీ ద్వారా రూ. 50వేలు, స్టాండర్డ్ డిడక్షన్ మరో రూ. 50,000, సెక్షన్ 80TTB ద్వారా రూ. 50,000.. ఫ్యామిలీ పెన్షన్ స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా రూ. 15,000.. సెక్షన్ 80DDB ద్వారా రూ. 1 లక్ష తగ్గింపు లభిస్తాయి. ఇలా మొత్తం మీద తగ్గింపు రూ. 5,65,000. కాబట్టి దీని ప్రకారం ఆదాయం 10 లక్షల రూపాయలైనా ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. -
ఈ అలవాట్లు ఉంటే! 50లో హెల్దీ అండ్ హ్యాపీ..!
రొటీన్‌గా చేసే పనుల్లో చేసుకోదగిన చిన్న చిన్న మార్పులు న్యూ ఇయర్(New Year)తో 50 ఏళ్లు నిండుతాయా...ఎంతో హుషారుగా, మరెంతో శ్రమతో లేదంటే.. గడిచిన నాలుగు పదులనూఓ జ్ఞాపకంలా మార్చుకుంటూ ఐదు పదుల్లోకి అడుగుపెట్టి ఉంటారు. ఇప్పటివరకు ఒక లెక్క...ఇక నుంచి ఒక లెక్క అన్నట్టు 50 ఏళ్ల నుంచి మహిళల శరీరంలోనూ, మనస్తత్వంలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఇంటా బయట ఎదురయ్యే ఒత్తిళ్లు, తమ పట్ల తాము పట్టించుకోని విధానం ఎప్పుడూ ఉంటుంది. పర్లేదు అని నిర్లక్ష్యం చేసే రోజువారీ అలవాట్లను వదిలేసికొత్తగా ఈ అలవాట్లను అలవరచుకోండి. 50 ఏళ్లలోనూ ఫిట్ అండ్ హెల్తీగా ఉండండి.వ్యాయామాలు(Exercises)కార్డియో ఎక్సర్సైజులు చేయాలనుకోకండి. శరీరానికంతటికీ శక్తినిచ్చే వ్యాయామం కండర కణజాలాన్ని సంరక్షిస్తుంది. ఎముక నష్టం కాకుండా పోరాడుతుంది. సమతుల్యతను కాపాడుతుంది. సడెన్‌గా పడిపోయే ప్రమాదాలను నివారిస్తుంది. సెల్ఫ్‌కేర్(Self Care)ఎప్పుడూ తమ కన్నా ముందు ఇతరులకు ఇవ్వడానికే శక్తిని ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక నుంచి రోజులో కొంత సమయం ‘నా కోసం నేను’ అనేలా మిమ్మల్ని మీరు సంతోషపరుచుకునే మానసిక ఆరోగ్యాన్ని పెం΄÷ందించే అలవాట్లు, కార్యకలా΄ాలకు ప్రాధాన్యత ఇవ్వండి.చురుకుగా ఉండటానికి..50 లలో ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. గంటల తరబడి కూర్చుంటే గుండె జబ్బుల రిస్క్ పెరగవచ్చు. ఊబకాయం వల్ల కీళ్లపై భారం పడి మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి. అందుకని శరీరం, మైండ్ చురుకుదనానికి రెగ్యులర్ మూవ్మెంట్స్ ఉండేలా చూసుకోవాలి.నిల్వ పదార్థాలకు ‘నో’ఉప్పు, చక్కెర మోతాదు నిల్వ పదార్థాలలో ఎక్కువ. అంతేకాదు, వీటిలో అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకని మైదాతోపాటు ఇతర నిల్వ ఉండే పదార్థాలను పక్కనపెట్టండి.చర్మం పట్ల జాగ్రత్త! (Skin Care)చర్మ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే వృద్ధాప్యం వేగంగా వచ్చేస్తుంది. చర్మ కేన్సర్ ప్రమాదాన్నీ పెంచుతుంది. వయసుతోపాటు చర్మమూ పొడిబారుతుంటుంది. ఎండవేళలో బయటకు వెళ్లినప్పుడు ఈ సమస్య మరీ పెరుగుతుంది. అందుకని, ఎండ నేరుగా చర్మంపై పడకుండా ఎస్పిఎఫ్ ప్రొటెక్షన్ ఉన్న క్రీమ్స్ ఉపయోగించాలి..ప్రోటీన్స్(Proteins)ఇన్నిరోజులు రుచిగా ఉండే ఆహారంపైన దృష్టి పెట్టి ఉంటారు. కానీ, తినే ఆహారంలో ప్రోటీన్ తక్కువ ఉంటే కండరాలకు వేగంగా నష్టం వాటిల్లడమే కాదు రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అందుకని నట్స్, గుడ్లు, మొక్కల నుంచి లభించే ప్రోటీన్లు గల ఆహారాన్ని భోజనంలో చేర్చండి.తరచూ నీళ్లుడీహైడ్రేషన్ ప్రభావాలు చర్మం సాగే గుణం, అజీర్తి, శక్తి స్థాయిలపై పడుతుంది. దాహం వేయడం అనే సంకేతాలు వయస్సుతోపాటు తగ్గుతుంటాయని గ్రహించి, తరచూ నీళ్లు తాగుతుండాలి.హాయిగొలిపే నిద్రనిద్రలేమి జీర్ణక్రియ, మానసిక స్థితి, జ్ఞాపశక్తిపైన ప్రభావం చూపుతుంది. ఈ రోజుల్లో మొబైల్, టీవీ స్క్రీన్ల వల్ల అర్ధరాత్రి తర్వాత నిద్రకు ఉపక్రమించేవాళ్లే ఎక్కువ. ఈ జాబితాలో మీరుంటే, స్క్రీన్లను త్వరగా కట్టిపెట్టి రోజూ 6–8 గంటల సమయాన్ని నిద్రకు కేటాయించండి. రాత్రివేళ కెఫీన్ వంటి పానీయాలకు దూరంగా ఉంటే నిద్ర లేమి సమస్య తలెత్తదు.అభిరుచులుఈ వయసులో తలెత్తే మానసిక ఒత్తిడి, ఆందోళన లేదా డిప్రెషన్‌ని విస్మరిస్తే అవి దీర్ఘకాలం నష్టం జరగవచ్చు. అందుకని మానసిక శ్రేయస్సును ప్రోత్సహించే శ్రద్ధ, అభిరుచుల కోసం సమయం కేటాయించుకోవాలి. (చదవండి: 'యూపీఎస్సీ చాట్ భండార్'..నాటి స్వాతంత్య్ర సంగ్రామాన్ని..!) -
టాలీవుడ్ యంగ్ హీరో కాళ్లు మొక్కిన సీనియర్ సిటిజెన్.. వీడియో వైరల్!
ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా పొంగల్ పోటీలో సూపర్ హిట్‌గా నిలిచింది. గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్ చిత్రాలతో పోటీపడి రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించారు. అయితే ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ వేడుకల్లో తేజ సజ్జా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో హనుమాన్ మూవీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా తేజ సజ్జా వేదికపై సందడి చేశారు. ఆ సమయంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ సీనియర్ సిటిజెన్ తేజ సజ్జా కాళ్లకు నమస్కరించాడు. అయితే వెంటనే తేజ ఆయనను అలా చేయవద్దని కోరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా.. తేజ ప్రస్తుతం మరో మూవీలో హీరోగా నటిస్తున్నారు. Super Hero @tejasajja123 received a memorable felicitation at @IFFIGoa after the screening of the Historic Blockbuster #HanuMan !#TejaSajja #IFFI2024 pic.twitter.com/QBHFwiVD3j— Rajesh Manne (@rajeshmanne1) November 23, 2024 -
‘జ్ఞాపకాలు..అనుభవాలు ఎంతో మధురం’
సోలాపూర్: ‘సాధారణంగా పిల్లలు ఆడుకుంటే పెద్దలు చూసి సంతోషిస్తారు. కానీ ఈరోజు మేం ఆటపాటలతో గడుపుతుంటే పిల్లలు చప్పట్లు కొడుతూ ఉత్సాహపరచడం మాకెంతో ఆనందాన్నిచ్చింది’ అని పలువురు సీనియర్ సిటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. పట్టణంలోని పద్మ కమల్ ప్రతిష్టాన్, పద్మశాలీ సఖీ సంఘం ఆధ్వర్యంలో‘బాల్యం అనుభూతులు నెమరు వేసుకోవడం‘అనే పేరుతో సీనియర్ మహిళలు, బాలల కోసం ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించారు. తమకు పెళ్లిళ్లై 35 నుంచి 40 సంవత్సరాలు పూర్తయ్యాయని, కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లు , మనవళ్లు, మనవరాళ్ళు ఇలా అందరినీ మరిచి ఈ వయసులో మళ్లీ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకునే అవకాశం కల్పించినందుకు పద్మ కమల్ ప్రతిష్టాన్, పద్మశాలీ సఖీ సంఘం సభ్యులు కృతజ్ఞతలు చెబుతున్నామని పేర్కొన్నారు. శ్రీ మార్కండేయ సోషల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరీ శంకర్ కొండ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మశాలి సఖీ సంఘం అధ్యక్షురాలు మేఘ ఇట్టం ముందుగా ప్రాస్తావికోఉపన్యాసం చేస్తూ కార్యక్రమ ఉద్దేశ్యాన్ని గురించి వివరించారు. పద్మ కమల్ ప్రతిష్టాన్ వ్యవస్థాపకుడు గోపీకృష్ణ వడ్డేపల్లి తన చిన్ననాటి జ్ఞాపకాలను అందరితో పంచుకోగా, దయానంద్ కొండ బత్తిని,స్నేహల్ శిందే , ఛత్రపతి అఖేన్, తదితరులు తాము చిన్ననాడు ఆడిన ఆటల గురించి, తమ అనుభవాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా మ్యూజికల్ చైర్ పోటీ నిర్వహించి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మహిళలు, పురుషుల బృందాలకు పద్మావతి సంఘ, రేణుక చింత, మంజుల ఆడం, కళ చెన్నపట్నం, వనిత సురా, పద్మ మేడిపల్లి తదితరులు బహుమతులను అందజేశారు. -
చలికాలంలో చుండ్రు బాధ, ఒళ్లు పగులుతుంది ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే!
ఈ ఏడాది నవంబరు మాసం వచ్చినా కూడా సాధారణంగా ఉండేంత చలి వణికించకపోయినా, మిగతా సీజన్లతో పోలిస్తే చలి కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. చలిగాలులు సోకకుండా ఉన్ని,ఊలు దుస్తులను ధరించడంతోపాటు, రోగనిరోధక శక్తిని కాపాడుకునేలా ఆహారం విషయంలో జాగ్రత్తపడాలి.చలికాలంలో శ్వాసకోస వాధులు, ఇన్ఫెక్షన్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అ ప్రమత్తంగా ఉండాలి. శరీరం వేడిగా ఉండేలా జాగ్రత్తలు పాటించాలి. స్వెట్లర్లు, సాక్సులు, మంకీ క్యాప్‌లు విధింగా ధరించేలా చూడాలి. లేదంటే జలుబు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. తాజా పండ్లు, ఆకుకూరలతో పాటు, తృణధాన్యాలతో కూడిన పోషకాహారాన్ని మన ఆహారంలో చేర్చుకోవాలి. నిల్వచేసిన, ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారానికి బదులుగా ఎప్పటికప్పుడు వేడిగా తినడం మంచిది. అలాగే చలిగా ఉంది కదా అని మరీ వేడి నీటితో స్నానం చేయకూడదు. తల స్నానానికి కూడా గోరు వెచ్చని నీరు అయితే మంచిది. చుండ్రు సమస్య రాకుండా ఉండాలంటే, చలికాలంలో జుట్టును శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. మైల్డ్ షాంపూ వాడాలి. చలికాలంలో వేడి నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు ఉండవు. గొంతు నొప్పి లాంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.ముఖ్యంగా విటమిన్ సీ, ఏ, లభించేలా చూసుకోవాలి. అలాగే చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ డీ అందేలా చూసుకోవాలి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఇలా అనేక రకాల సీజనల్ వ్యాధులను, ఇన్ఫెక్షన్ల ప్రమాదం నుంచి ఇది కాపాడతాయి. కొవ్వు చేపలు, కోడిగుడ్డు,మష్రూమ్స్, సోయా మిల్క్ వంటి వాటిలో డీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది.రోగనిరోధక శక్తిని పెంచేలా విటమిన్ సీ లభించే సిట్రస్ పండ్లను తీసుకోవాలి. నిమ్మ, నారింజ, బ్రోకలీ, బెర్రీ, వివిధ రకాల సిట్రస్ పండ్లపై దృష్టిపెట్టాలి. నట్స్, సీడ్స్, కోడిగుడ్లు, గుమ్మడి గింజలు, చేపలు వంటివి తీసుకోవాలి.విటమిన్ ఏ ఎక్కువగా లభించే క్యారెట్లు, చిలగడ దుంపలు, పాలకూర, పాలు, చీజ్ బీఫ్ లివర్, క్యాప్సికం, గుమ్మడి కాయ కూరగాయలను తీసుకోవాలి. విటమిన్ ఏ చర్మానికి, కంటి ఆరోగ్యానికి మంచిది. వీటితోపాటు, శరీరానికి అవసరమయ్యే అత్యంత ముఖ్యమైన బీ 12,బీ6ను తీసుకోవాలి. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులనుంచి రక్షిస్తాయి. సాల్మన్ చేపలు, టునా ఫిష్, చికెన్, కోడిగుడ్లు, పాలు వంటి పదార్థాల్లో విటమిన్ బి 12 లభిస్తుంది. చలికాలంలో చర్మంపై కూడా చాలా ప్రభావం ఉంటుంది. పగలడం, ఎండిపోయినట్టు అవ్వడం చాలా సాధారణంగా కనిపించే సమస్యు. అందుకే దాహంగా అనిపించకపోయినా, సాధ్యమైనన్ని నీళ్లను తాగుతూ ఉండాలి. దీంతో శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా, తేమగా ఉంటుంది. రాగుల జావ, తాజా పండ్ల రసాలు తీసుకోవాలి.డ్రై స్కిన్ ఉన్న వారికి చిట పటలాడం, మంట పెట్టడం, దురద పెట్టడం లాంటి ఇబ్బందులు మరీ ఎక్కువగా వస్తాయి. అలాంటి వారు ఖ వింటర్ సీజన్ లో మాయిశ్చ రైజింగ్ క్రీములు వాడాలి. చర్మ సంరక్షణ కోసం రసాయన సబ్బులకు బదులుగా ప్రకృతిసిద్ధంగా లభించే వాటితో తయారు చేసుకున్న సున్ని పిండి వాడితే ఉత్తమం. లేదా ఆయుర్వేద, లేదా ఇంట్లోనే తయారు చేసుకున్న సబ్బులను వినియోగించాలి. లేదంటే గ్లిసరిన్ సబ్బులను ఎంచుకోవాలి. విటమిన్ ఇ లభించే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. -
మోకాళ్లు నొప్పులా? ఎముక పుష్టికోసం ఇలా చేయండి!
వయసు నలభై దాటిందో లేదో చాలామందిలో కీళ్ల నొప్పులు, ఎముకలు బలహీనపడటం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. జీవన శైలి, ఆధునిక అలవాట్లతో పాటు, ఎండ ఎరగని ఉద్యోగాలు, యుక్తవయసు నుంచీ డైటింగ్ పేరుతో పోషకాహారం తీసుకోకపోవడంతో ఎముకలు బలహీన పడుతున్నాయి. ఫలితగా మోకాళ్ల నొప్పులు రికెట్స్ ,బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులకు కారణమవుతుంది. ఇది పెద్ద వయసులో తూలి పడిపోవడం, కాళ్లు చేతులు, ప్రధానంగా తుంటి ఎముక విరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. మరి ఎముకల గట్టిదనం కోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి.మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. అందుకే ఆరోగ్య కరమైన సమతుల్య ఆహారం చిన్న వయస్సు నుండే అలవాటు చేయాలి. ఇది జీవితాంతం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తు పెట్టుకోవాలి. పెద్దలకు రోజుకు 700మిల్లీగ్రాముల కాల్షియం అవసరం.మెనోపాజ్ఆడవారిలో మెనోపాజ్ తరువాత ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి ఈ విషయాన్ని మరింత అప్రమత్తంగా ఉండాలి. బహిష్టులు ఆగిపోయిన తరువాత ఈస్ట్రోజెన్ ఉత్పత్తి ఆగిపోవడంతో ఇది ఎముకలపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే కాల్షియం ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. శరీరం కాల్షియంను గ్రహించాలంటే విటమిన్ డీ చాలా అవసరం. నిరంతరం వ్యాయామం చేయాలి. ముఖ్యంగా 40 దాటిన తరువాత కాళ్లు, చేతులు, కండరాలు, ఎముకలను పటిష్టం చేసే వ్యాయామాలను చేయాలి. మోకాళ్లు నొప్పులొచ్చిన తరువాత కచ్చితంగా నడక, యోగా తదితర తేలికపాటి వ్యాయామాలు చేయాల్సిందే. ఏదైనా ఎముకలకి సంబంధించి ఏదైనా సమస్యను గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, చికిత్స పొందాలి. నిపుణుల సలహా మేరకు సంబంధిత వ్యాయామాలను రెగ్యులర్‌గా చేయాలి. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు తీసుకోవాలి.చేపలు, గుడ్లు, పాలు, బాదం, మొలకెత్తిన ధాన్యాలు ఆహారంలో చేర్చుకోవాలి. బలవర్థకమైన సోయా,నువ్వులతోపాటు విటమిన్ సి లభించే సిట్రస్‌పండ్లను తీసుకుంటే మంచిది. అలాగే విటమిన్ డి కోసం ఉదయం ఎండలో కొద్దిసేపు కూర్చోవాలి. తగినంత నిద్రపోవాలి. -
AB-PMJAY: 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఆరోగ్య బీమా
న్యూఢిల్లీ: డెబ్భై ఏళ్లు, ఆ పైబడిన వృద్ధుల ఆరోగ్య సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయంతో నిమిత్తం లేకుండా వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్‌మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎంజేఏవై) కింద రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమాకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు ప్రతిపాదనలను ఆమోదించింది. అర్హులైన లబి్ధదారులకు త్వరలో కొత్త కార్డులు మంజూరు చేయనున్నట్లు తెలిపింది.కుటుంబసభ్యులు ఏబీపీఎంజేఏవై కింద లబ్దిదారులుగా ఉన్నా 70 ఏళ్లు, ఆపై వయసు సీనియర్ సిటిజన్లకు విడిగా ఏటా రూ.5 లక్షల ఆరోగ్యబీమా కల్పించనున్నారు. వృద్ధులు ప్రైవేట్ ఆరోగ్య బీమా పాలసీలు, ఈఎస్ఐ పథకంలో ఉన్నా ఈ పథకం వర్తిస్తుంది. కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్), మాజీ సైనికుల కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) పథకాల లబ్ది పొందుతున్న వాళ్లు మాత్రం వాటినో, ఏబీపీఎంజేఏవైనో ఏదో ఒకదానినే ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 4.5 కోట్ల కుటుంబాల్లోని వృద్ధులకు మేలు చేకూరనుంది. ఏబీపీఎంజేఏవై ప్రపంచంలోనే ప్రభుత్వరంగంలో అమలవుతోన్న అతిపెద్ద ఆరోగ్యబీమా పథకమని కేంద్రం తెలిపింది. 12.34 కోట్ల కుటుంబాల్లోని 55 కోట్ల మందికి ఈ పథకం లబ్దిచేకూరుస్తుందని కేంద్రం పేర్కొంది. వయసుతో సంబంధంలేకుండా కుటుంబంలోని అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథం కింద ఇప్పటికే 7.37 కోట్ల మంది ఆస్పత్రిలో వైద్యసేవలు పొందారు. వీరిలో 49 శాతం మంది మహిళలే ఉన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చుచేసింది. తొలినాళ్లలో జనాభాలో దిగువ తరగతి 40 శాతం మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. తర్వాత 2022 జనవరిలో లబ్దిదారుల సంఖ్యను 12 కోట్ల కుటుంబాలకు పెంచింది. తర్వాత 37 లక్షల ఆశా/అంగన్వాడీ/ఏడబ్ల్యూహెచ్ఎస్లకూ వర్తింపజేశారు. 31వేల మెగావాట్ల హైడ్రో ప్రాజెక్టులకూ గ్రీన్ సిగ్నల్ రూ.12,461 కోట్ల వ్యయంతో మొత్తంగా 31,350 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్ ప్రాజెక్టులకూ కేబినెట్ ఓకే చెప్పింది.→ పీఎం గ్రామ్ సడక్ యోజన–4 కింద అదనంగా 62,500 కి.మీ. మేర రోడ్ల నిర్మాణానికి కేబినెట్ సరేనంది. కొత్తగా 25వేల జనావాసాలను కలుపుతూ ఈ రోడ్లను నిర్మించనున్నారు. ఈ మార్గాల్లో వంతెనలనూ ఆధునీకరించనున్నారు. → విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎం ఈ–డ్రైవ్, పీఎం–ఈబస్ సేవా–పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం పథకాల అమలు కోసం రూ.14,335 కోట్లు కేటాయించేందుకు కేంద్రం అనుమతి ఇచి్చంది. విద్యుత్ ద్విచక్ర, త్రిచక్ర, అంబులెన్స్, ట్రక్కు, ఇతర వాహనాలపై రూ.3,679 కోట్ల మేర సబ్సిడీ ప్రయోజనాలు పౌరులకు కలి్పంచనున్నారు. → ముందస్తు వాతావరణ అంచనా వ్యవస్థలను మరింత బలోపేతం చేయనున్నారు. రెండేళ్లలో రూ.2,000 కోట్ల వ్యయంతో ‘మిషన్ మౌసమ్’ను అమలుచేయనున్నారు. భారత వాతావరణ శాఖతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటరాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ విభాగాల ద్వారా ఈ మిషన్‌ను అమలు చేయనున్నారు. -
World Elder Abuse Awareness Day : మెయింటెనెన్స్ హక్కులు, ఆసక్తికర సంగతులు
ఈ రోజు (జూన్ 15) ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం (WEAAD, world elder abuse awareness day) జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఎల్డర్ అబ్యూస్ (INPEA) జూన్ 2006లో వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డేని స్థాపించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ దీనిని డిసెంబర్ 2011లో అధికారికంగా గుర్తించింది. వృద్ధులపట్ల గౌరవాన్ని పెంపొందిస్తూ, వృద్ధుల పట్ల నిర్లక్ష్యం ఎదుర్కొనే వేధింపులు దోపిడీ గురించి అవగాహన పెంచడమే ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం లక్ష్యం.ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది వృద్ధులు నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవుతున్నారు. సమకాలీన సామాజిక, ఆర్థిక పరిస్థితులు వృద్ధులకు శాపంగా మారాయి. కుటుంబం సంక్షేమం, అభివృద్ధి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన వారికి జీవిత చరమాంకంలో సముచిత స్థానం లభించడం లేదు సరికదా, వృద్ధులపై జరుగుతున్న పలురకాల హింస,దాడులు బాధాకరం. భారతదేశంలో దాదాపు 60 శాతం మంది వృద్ధులు వేధింపులను ఎదుర్కొంటున్నారు.ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే ప్రకారం, భారతదేశంలో దాదాపు 60 శాతం మంది వృద్ధులు వేధింపులకు గురవుతున్నారు. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, నాగ్‌పూర్, కాన్పూర్ , మదురై సహా అనేక నగరాలను ఈ సర్వేలో చేర్చారు. అందిన నివేదిక ప్రకారం, 73శాతం మంది యువకులు వృద్ధుల పట్ల చెడుగా ప్రవర్తిస్తున్నారు, దాడికి పాల్పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 మందిలో ఒకరు ఈ వేధింపులకు గురవుతున్నారు.కన్నబిడ్డల్నితల్లిదండ్రులు ఎంత అప్యాయంగా, ప్రేమగా పెంచి, ఆసరాగా ఉన్నట్లే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడం ప్రతి బిడ్డ విధి. కానీ వృద్ధాప్యంలో తల్లిదండ్రులు చాలా కష్టాలను అనుభవించాల్సి వస్తోంది. ఆస్తి కోసం, శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్నారు. సామాన్య మానవుల నుంచి కార్పొరేట్ కుటుంబాల దాకా ఇలాంటి సంఘటనలను ప్రతీనిత్యం చూస్తూనే ఉన్నాంWEAAD 2024 థీమ్: అత్యవసర పరిస్థితుల్లో వృద్ధులపై ప్రత్యేక దృష్టి అనేది ఈ ఏడాది థీమ్. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు, సాయుధ పోరాటాలు , కోవిడ్ -19 లాంటి సంక్షోభ పరిస్థితుల్లో వృద్ధులు ఎదుర్కొనే ప్రత్యేక సవాళ్లను ఇది నొక్కి చెబుతుంది. అత్యవసర సమయాల్లో వృద్ధుల నిర్దిష్ట అవసరాలు పరిష్కరించడం చాలా కీలకమనే విషయాన్ని తెలియజేస్తుంది.వృద్ధులు లేదా సీనియర్ సిటిజన్ల హక్కులను, కుటుంబ సభ్యులతోపాటు, సమాజం కూడా గుర్తించాలి. వృద్ధులకు విలువనిచ్చి, వారిని గౌరవించే సమాజాన్ని సృష్టించేందుకు కుటుంబ సభ్యులతో పాటు సమాజం, సాంఘిక సంఘాలు ఐక్యంగా ఉంటూ, వృద్ధులు శారీరకంగా, భావోద్వేగంగా, ఆర్థికంగా ఎలాంటి అభద్రతా భావం లేకుండా గౌరవంగా జీవించగలిగే ప్రపంచాన్ని నిర్మించాలి.చట్టాలుసీనియర్ సిటిజన్స్ చట్టం 2007 ప్రకారం సీనియర్ సిటిజన్ల చట్టపరమైన హక్కులు సీనియర్ సిటిజన్‌ను ఎక్కడైనా వదిలిపెట్టడం చట్టరీత్యా నేరం. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక వృద్ధాశ్రమాన్ని నెలకొల్పాలని, అలాగే సీనియర్ సిటిజన్లకు తగిన వైద్య సంరక్షణను అందించాలని కూడా ఈ చట్టం చెబుతుంది.ఈ చట్టంలోని సెక్షన్ 20 ప్రతి హిందువు తన/ఆమె జీవితకాలంలో తన/ఆమె వృద్ధులైన లేదా బలహీనమైన తల్లిదండ్రులను కాపాడుకోవాల్సిన బాధ్యతను విధిస్తుంది. కాబట్టి, వృద్ధులు లేదా బలహీనంగా ఉన్న తల్లిదండ్రులను కాపాడుకోవడం కొడుకులు, కుమార్తెలు ఇద్దరి బాధ్యత ఉంటుంది.తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం, 2007 కింద, వారు మెయింటెనెన్స్ ట్రిబ్యునల్‌లో దరఖాస్తును ఫైల్ చేయవచ్చు. పిల్లలు లేదా బంధువులు వీరిని జాగ్రత్తగా చూసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని కోర్టు గుర్తిస్తే, వారికి నెలవారీ మెయింటెనెన్స్ చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయవచ్చు. ఎంత మెయింటెనెన్స్ చెల్లించాల్సి ఉంటుందో అనేది కూడా కోర్టు విచారణ చేసిన నిర్ణయిస్తుంది దరఖాస్తు తేదీ నుండి మెయింటెనెన్స్ మొత్తంపై వడ్డీ (5-8 శాతం) తో కలిపి చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించవచ్చు. కోర్టు ఆర్డర్ తర్వాత కూడా మెయింటెనెన్స్ అందకపోతే ఏదైనా ఇలాంటి కోర్టు (మెయింటెనెన్స్ ట్రిబ్యునల్)కి వెళ్లి, ఆర్డర్‌ను అమలు చేయడంలో సహాయం కోసం అడగవచ్చు. -
తెలంగాణలో సకెస్ అయిన ఎల్డర్ లైన్
-
World Senior Citizen Day 2023: లఖోటియా కాలేజ్ ఆఫ్ డిజైన్ ఆధ్వర్యంలో వృద్ధులతో ఫ్యాషన్ షో (ఫోటోలు)
-
పార్కింగ్ సమస్య.. ఏకంగా సీఎం సిద్ధరామయ్య కారునే అడ్డగించి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసం వద్ద కాసేపు హైడ్రామా నెలకొంది.సీఎం ఇంటి ఎదురుగా నివసిస్తున్న ఓ సీనియర్ సిటిజన్ ఏకంగా సిద్ధరామయ్య వాహనాన్ని అడ్డగించి నిలదీశాడు. ముఖ్యమంత్రి ఇంటికి వస్తున్న అతిథుల కారణంగా తమ కుటుంబం కొన్నేళ్లుగా పార్కింగ్ సమస్యను ఎదుర్కొంటుందని, దీనిని పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. కాగా వీఐపీలు, సెలబ్రిటీలు నివసించే ప్రాంతాలు ఎప్పుడూ బిజీబిజీగా ఉంటాయన్న విషయం తెలిసిందే. వారిని కలిసేందుకు నిత్యం వందలాది మంది తమ నివాసాలకు వస్తుంటారు. ఈ క్రమంలో ఇంటి పరిసర ప్రాంతాల్లో వాహనాలు పార్క్ చేయడం ద్వారా చుట్టుపక్కల నివసించే వారిని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. తాజాగా సీఎం సిద్ధరామయ్య ఇంటి వద్ద నివసించే ఓ వృద్ధుడికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో విసిగిపోయిన నరోత్తమ్ అనే పెద్దాయన శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వస్తున్న సీఎం కాన్వాయ్‌నే అడ్డుకున్నాడు. ఈ ఘటనతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే తాను సీఎంతో మాట్లాడాలని చెప్పడంతో అధికారులు అనుమతించారు. దీంతో సీఎం కారు వద్దకు వెళ్లిన అతడు.. ‘మీ కోసం వచ్చే వారు తమ వాహనాలను ఎక్కడపడితే అక్క పార్క్ చేస్తున్నారని.. దీంతో అతని గేట్ బ్లాక్ అవుతుందని తెలిపాడు. ఈ కారణంగా నేను, నా కుటుంబ సభ్యులు కార్లు బయటకు తీసే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పాడు. గత అయిదేళ్లనుంచి ఇదే సమస్య ఎదుర్కొంటున్నమని, ఇక భరించలేమంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై స్పందించిన సిద్ధరామయ్య పార్కింగ్ సమస్యను పరిష్కరించాలని తన భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఇదిలా ఉండగా సీఎం అయినప్పటికీ సిద్ధరామయ్య తన అధికారిక నివాసంలోకి మారలేదు. ఆయన ఇంకా తనకు గతంలో కేటాయించిన ప్రతిపక్ష నాయకుడి బంగ్లాలోనే ఉంటున్నారు. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పనే ఇప్పటికీ సీఎం అధికారిక నివాసంలో నివసిస్తున్నారు. అయితే వచ్చే నెల ఆగస్టులో సిద్దరామయ్య కొత్త ఇంటికి మారే అవకాశం ఉంది. -
సొంతిల్లు కొంటున్నారా?, అదిరిపోయే ఈ కేంద్ర ప్రభుత్వ స్కీం గురించి తెలుసా?
పదవీ విరమణ తీసుకున్నారు. ఉండడానికి సొంతిల్లు ఉంది. కానీ, పింఛను సదుపాయం లేదు. ఉద్యోగం లేదా సంపాదనా కాలంలో పెద్దగా పొదుపు చేయలేకపోయారు. చేసిన పొదుపు ఇప్పటి జీవన అవసరాలను తీర్చే స్థాయిలో లేదు. అదనపు ఆదాయం కావాలి. ఇందుకోసం వృద్ధాప్యంలో ఏం చేయాలి..? ఇలాంటి సందిగ్ధత ఎదుర్కొనే ప్రతి ఒక్కరి ముందున్న ఆప్షన్ రివర్స్ మార్ట్గేజ్ లోన్. వృద్ధాప్యంలో జీవన అవసరాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర సర్కారు 2007లోనే దీన్ని తీసుకొచ్చింది. కానీ, మన దేశంలో అంతగా ప్రజాదరణకు నోచుకోలేదు. దీని గురించి తెలిసింది చాలా తక్కువ మందికే. బ్యాంకులు వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, క్రెడిట్ కార్డుల గురించి ప్రకటనలు ఇవ్వడం గమనించే ఉంటారు. కానీ, ఏ బ్యాంకు కూడా ఎక్కడా రివర్స్ మార్ట్గేజ్ స్కీమ్ గురించి ప్రకటన ఇచ్చినట్టు కనిపించదు. దీనికి కారణం బ్యాంకులకు ఈ ఉత్పత్తిపై ఆసక్తి లేకపోవడమే. వృద్ధాప్యంలో పోషణకు ఎలాంటి ఆదాయం లేని వారిని సొంతిల్లే ఆదుకుంటుంది. ఇంటిని బ్యాంకు తనఖాగా ఉంచుకుని నెలవారీ ఆదాయం సమకూరుస్తుంది. ఈ పథకం ప్రయోజనాలు, అర్హతలపై మరిన్ని వివరాలు అందించే కథనమే ఇది. ఇది ఎలా పనిచేస్తుంది..? రివర్స్ మార్ట్గేజ్ అంటే నివాస యోగ్యమైన గృహంపై తీసుకునే రుణం. మార్ట్గేజ్ అన్నది ఇంటిని సొంతం చేసుకోవడం కోసం తీసుకునే రుణం. దీనికి విరుద్ధంగా ఇంటిపై రుణం తీసుకునేది కనుక రివర్స్ మార్ట్గేజ్ అని పేరు పెట్టారు. ఇంటి కోసం మార్ట్గేజ్ రుణం తీసుకుంటే నెలవారీ ఈఎంఐ ఎలా అయితే చెల్లిస్తారో.. రివర్స్ మార్ట్‌గేజ్‌లో బ్యాంక్ కూడా రుణ గ్రహీతకు అదే విధంగా చెల్లిస్తుంది. అద్దె ఇంట్లో ఉండే వారికి ఈ రుణానికి అర్హత ఉండదు. సొంతిల్లు, దానిపై సంపూర్ణ హక్కులు ఉన్న వారే దీన్ని తీసుకోగలరు. ఇంటి విలువ ఎంత, అది ఏ ప్రాంతంలో ఉంది? తదితర అంశాలను చూసిన తర్వాత బ్యాంక్‌లు ఎంత రుణం ఇవ్వాలన్నది నిర్ణయిస్తాయి. ఇంటి విలువలో రుణంగా (ఎల్టీవీ) 60 నుంచి 80 శాతం మధ్య నిర్ణయిస్తాయి. రివర్స్ మార్ట్గేజ్ కింద చాలా బ్యాంకులు గరిష్టంగా రూ. కోటి రుణ పరిమితిని అమలు చేస్తున్నాయి. అంటే రివర్స్ మార్ట్గేజ్ కింద తనఖా పెట్టే ఇంటి విలువ రూ.2 కోట్లు ఉన్నా సరే గరిష్టంగా రూ.కోటి వరకే పొందగలరు. గరిష్టంగా 20 ఏళ్ల కాలానికి రుణాన్ని బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. చదవండి👉 ధర ఎంతైనా తగ్గేదేలే..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియా ఇళ్లే కావాలి! రుణాన్ని చెల్లించక్కర్లేదు.. వృద్ధాప్యంలో జీవన అవసరాల కోసం ఇంటిని తనఖా పెట్టి రుణం తీసుకుంటున్నారని అనుకుందాం. అలాంటప్పుడు తిరిగి ఎలా చెల్లించగలం? అన్న ప్రశ్న రావచ్చు. నిజమే తీసుకున్న రుణాన్ని తప్పనిసరిగా తిరిగి చెల్లించాలనేమీ లేదు. ఉదాహరణకు వినయ్ (62) 20 ఏళ్ల కాలానికి రివర్స్ మార్ట్గేజ్ రుణం తీసుకున్నారని అనుకుందాం. ఆయన 82 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా జీవించే ఉన్నారు. కాల వ్యవధి ముగిసింది కనుక ఆ తర్వాత నుంచి బ్యాంక్ ఎలాంటి చెల్లింపులు చేయదు. అయినా, రుణ గ్రహీత అదే ఇంటిలో నిశ్చింతగా నివసించొచ్చు. ఇంటి యజమాని మరణించిన తర్వాతే అది బ్యాంక్ పరం అవుతుంది. ఒకవేళ భార్యా, భర్త జాయింట్‌గా రివర్స్ మార్ట్గేజ్ రుణం తీసుకుంటే వారిద్దరి మరణానంతరమే బ్యాంకులకు హక్కులు లభిస్తాయి. రుణ గ్రహీత మరణానంతరం రుణం, దానిపై వడ్డీ బకాయిలు చెల్లించే ఆప్షన్‌ను బ్యాంక్‌లు వారసులకు కల్పిస్తాయి. వారు ముందుకు రాకపోతే అప్పుడు ఆ ఇంటిని బ్యాంక్ వేలం వేస్తుంది. అన్ని బకాయిలు మినహాయించుకుని ఏమైనా మిగిలి ఉంటే వారసులకు చెల్లిస్తుంది. ఇంటిని విక్రయించగా వచ్చిన మొత్తం బకాయిలు తీర్చేంత లేకపోతే, మిగిలినది బ్యాంక్ నష్టం కింద సర్దుబాటు చేసుకుంటుంది. వారసులకు బాధ్యత ఉండదు. చదవండి👉 హైదరాబాద్: ట్రెండ్ మారింది.. దూరమైనా పర్లేదు, అలాంటిదే కావాలంటున్న నగరవాసులు! రెండు రకాల చెల్లింపులు... రివర్స్ మార్ట్గేజ్ రుణాన్ని రుణ గ్రహీత కోరిక మేరకు బ్యాంక్‌లు రెండు రకాలుగా చెల్లిస్తాయి. ఒకటి ప్రతి నెలా వాయిదాల రూపంలో అందుకోవచ్చు. లేదంటే త్రైమాసికం, ఆరు నెలలు లేదా ఏడాదికోసారి చెల్లింపులు చేస్తుంది. రెండు ఏక మొత్తంలో మంజూరు చేస్తుంది. బ్యాంక్ నుంచి రివర్స్ మార్ట్గేజ్ రుణాన్ని ఏక మొత్తంలో ఒకే విడత అందుకున్నా లేక నెలవారీ వాయిదాల రూపంలో అందుకున్నా, ఆ మొత్తంపై పన్ను పడదు. ఎందుకంటే ఆదాయపన్ను చట్టం దీన్ని ఆదాయం కింద పరిగణించదు. రుణంగానే భావిస్తుంది. దీంతో పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. చెల్లింపుల మొత్తాన్ని పెంచుకునే ఆప్షన్ లేదు. ఉదాహరణకు ప్రాపర్టీ విలువ రూ.కోటి ఉందని అనుకుందాం. లోన్ టు వ్యాల్యూ (ఎల్టీవీ) 80 శాతం అనుకుంటే అప్పుడు రుణం కింద రూ.80 లక్షలు ఖరారు అవుతుంది. ఇందులో వడ్డీ భాగం కూడా ఉంటుందని మర్చిపోవద్దు. రూ.80 లక్షలను 8.5 శాతం రేటుపై 20 ఏళ్ల కాలానికి తీసుకునేట్టు అయితే, అప్పుడు చెల్లించాల్సిన వడ్డీ రూ.45 లక్షలు అవుతుంది. రూ.80 లక్షల్లో రూ.45 లక్షలు పోను రూ.35 లక్షలను బ్యాంక్ రుణ గ్రహీతకు చెల్లిస్తుంది. ఇది నెలవారీ చెల్లింపులకు సంబంధించి అనుసరించే విధానం. ఏక మొత్తంలో చెల్లింపులు కోరుకుంటే అప్పుడు లోన్టు వ్యాల్యూలో 50 శాతం లేదా రూ.15 లక్షలు ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తారు. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? ఎప్పుడైనా చెల్లించొచ్చు.. రివర్స్ మార్ట్గేజ్ రుణాన్ని ఎప్పుడైనా తిరిగి చెల్లించొచ్చు. కాల వ్యవధి పూర్తి కాక ముందు చెల్లించినా ఎలాంటి చార్జీలు ఉండవు. ‘‘ఒకవేళ మరో బ్యాంక్‌కు రివర్స్ మార్ట్ గేజ్ రుణాన్ని బదిలీ చేసుకోవడం ద్వారా పాత బ్యాంకు వద్ద ముందే తీర్చేస్తున్నట్టు అయితే, అప్పటికి మిగిలి ఉన్న రుణ బకాయి మొత్తంపై 0.5–2 శాతం మధ్య పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది’’అని మైలోన్‌కేర్ డాట్ ఇన్ సంస్థ సీఈవో గౌరవ్‌గుప్తా తెలిపారు. రుణాలపై వడ్డీ రేట్లు గతేడాది నుంచి 2.5 శాతం మేర పెరిగాయి. ఇక ఇక్కడి నుంచి పెరుగుదల పెద్దగా ఉండదన్నది విశ్లేషకుల అంచనా. అంతేకాదు అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు సర్దుకుని, అనిశ్చితులు తగ్గితే తిరిగి రుణ రేట్లు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక రివర్స్ మార్ట్గేజ్ రుణాన్ని తీసుకునే వారు వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయని వెనుకాడక్కర్లేదని నిపుణులు సూచిస్తున్నారు. రివర్స్ మార్ట్గేజ్ రుణం తీసుకోవడానికి అవసరమే ప్రామాణికం. జీవనానికి ఇతరత్రా ఆదాయం లేని వారు, ఉన్నా చాలని వారు, తమ వారసులకు తమ ప్రాపర్టీ అవసరం లేని వారు, మరింత సుఖవంతమైన జీవనం సాగించాలని అనుకునే వారు, అవసరాల్లో రాజీ పడే ఉద్దేశ్యం లేని వారు రివర్స్ మార్ట్గేజ్ రుణానికి వెళ్లొచ్చు. ఎస్బీఐ రివర్స్ మార్ట్గేజ్ రుణంపై రేటును రెపో రేటుతో అనుసంధానిస్తోంది. దాదాపు గృహ రుణం స్థాయిలోనే రేట్లు ఉంటాయి. రెపో రేటుకు అనుసంధానమై ఉండడం వల్ల వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, తగ్గినప్పుడు వెంటనే అది రుణాలపై ప్రతిఫలిస్తుంది. విలువ మదింపు.. రివర్స్ మార్ట్గేజ్ కింద తనఖా ఉంచిన ఇంటి విలువను బ్యాంక్‌లు ఐదేళ్లకోసారి మదింపు వేస్తుంటాయి. తనఖా పెట్టిన ప్రాపర్టీ విలువ రుణం మంజూరు చేసే నాటి విలువ స్థాయిలోనే ఉందా? పెరిగిందా లేక తగ్గిందా? అన్నది సమీక్షిస్తుంటాయి. ఎందుకంటే రివర్స్ మార్ట్గేజ్ రుణాల్లో ఎక్కువ శాతం ఆయా ప్రాపర్టీలు బ్యాంక్‌ల స్వాధీనం అవుతుంటాయి. రుణం తీసుకున్న వారు లేదా వారి వారసులు తిరిగి చెల్లించే దాఖలాలు తక్కువ. దీంతో బ్యాంక్‌లు తాము ఇచ్చిన రుణం, దానిపై వడ్డీ బకాయిల వసూలుకు వాటిని వేలం వేస్తుంటాయి. వేలంలో సరైన విలువను పొందేందుకు వీలుగా బ్యాంక్‌లు రిస్క్ కోణంలో ఇలా ప్రాపర్టీ విలువను ఐదేళ్లకోసారి మదింపు వేస్తాయి. కివర్స్ మార్ట్గేజ్ రుణానికి ఎన్‌బీఎఫ్‌సీల కంటే బ్యాంకులే మెరుగైన ఆప్షన్. సమర్పించాల్సినవి ఇవీ.. రివర్స్ మార్ట్గేజ్ రుణం తీసుకోవాలని అనుకునే వారు.. గుర్తింపు, నివాస గుర్తింపు పత్రాలు ఇవ్వాలి. ప్రాపర్టీ అసలు పేపర్లు, గడిచిన ఆరు నెలల బ్యాంకు ఖాతా స్టేట్మెంట్, అప్పటికే ఏదైనా రుణం తీసుకుని ఉంటే దానికి సంబంధించి చివరి ఏడాది స్టేట్మెంట్ సమర్పించాల్సి ఉంటుంది. చదవండి👉వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉద్యోగులు, రాకెట్ వేగంతో పెరుగుతున్న ఇళ్ల ధరలు! ఎందుకు ఆదరణ లేదు..? రివర్స్ మార్ట్గేజ్ గురించి అందరికీ తెలియకపోవడం ఇది పెద్దగా విస్తరించపోవడానికి ఒక కారణం. సాధారణంగా ఇంటితో అనుబంధం ఉంటుంది. అంత సులభంగా దాన్ని తెంపుకోలేరు. తమ గుర్తుగా, వారసత్వంగా పరిగణిస్తుంటారు. బ్యాంకులు దీని గురించి ప్రచారం చేయకపోవడం కూడా ఒక ముఖ్య కారణం. ఎక్కడా ప్రకటనలు ఇవ్వవు. కనీసం వాటి వెబ్సైట్లలోనూ వివరాలను అందుబాటులో ఉంచవు. బ్యాంకుకు వెళ్లి వివరాలు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఉదాహరణకు బ్యాంక్ 15 ఏళ్ల కాలానికి రివర్స్ మార్ట్గేజ్ రుణం ఇచ్చిన తర్వాత.. ఇంటి యజమాని 30 ఏళ్లు జీవించారని అనుకుందాం. అప్పటి వరకు ఆ ఇంటిని బ్యాంకులు ఏమీ చేయలేవు. ఇచ్చిన రుణాన్ని స్వచ్చందంగా చెల్లిస్తే తప్ప అవి వసూలు చేసుకోలేవు. రుణ గ్రహీత చనిపోయే వరకు ఆగాల్సిందే. నివసిస్తున్న ఇల్లు వారసులకు అవసరం లేనట్టయితే అప్పుడు దాన్ని విక్రయించే ఆప్షన్‌ను కూడా పరిశీలించొచ్చు. మంచి విలువ పలికే ప్రాంతంలో ఉంటే విక్రయించి, తక్కువ రేటున్న ఇంటిని కొనుగోలు చేసుకోవడం ఒక మార్గం. ఈ రూపంలో మిగిలిన మొత్తాన్ని స్థిరాదాయ పథకాల్లోకి మళ్లించుకుని ప్రతి నెలా ఆదా యం వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. చదవండి👉 మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! వీటిని దృష్టిలో పెట్టుకోవాలి ►60 ఏళ్లు నిండిన ఎవరైనా రివర్స్ మార్ట్గేజ్ రుణానికి అర్హులు. జీవిత భాగస్వామి సహ దరఖాస్తుదారు అయితే ఆమె వయసు 55–58 ఏళ్లకు తక్కువ ఉండకూడదు. బ్యాంకుల మధ్య ఇది వేర్వేరుగా ఉంది. ► గరిష్టంగా రూ.కోటి వరకే రుణం లభిస్తుంది. ఈ మొత్తాన్ని రుణ గ్రహీత ఏ అవసరం కోసం అయినా వినియోగించుకోవచ్చు. ►ఇంటి విలువ, రుణ గ్రహీత వయసు, అమల్లో ఉన్న వడ్డీ రేటు ఆధారంగా రుణం మొత్తాన్ని, కాల వ్యవధిని బ్యాంకులు నిర్ణయిస్తాయి. ►కనీసం పదేళ్లు, గరిష్టంగా 20 ఏళ్ల కాలాన్ని చాలా బ్యాంకులు అమలు చేస్తున్నాయి. ► సొంతిల్లు అయి ఉండి, దాన్ని అద్దెకు ఇవ్వకుండా, అందులో నివసిస్తుంటే రివర్స్ మార్ట్గేజ్ చేసుకోవచ్చు. ► ఇంటిపై ఎలాంటి వివాదాలు ఉండకూడదు. ► వాణిజ్య ఆస్తిపై రివర్స్ మార్ట్‌గేజ్‌కు అవకాశం లేదు. ►తనఖా పెట్టే ఇంటి జీవన కాలం అక్కడి నుంచి 20 ఏళ్లకు తక్కువ కాకుండా ఉండకూడదు. ► ప్రాసెసింగ్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, ప్రాపర్టీ ఇన్సూరెన్స్, వీటిపై జీఎస్టీ చార్జీలను చెల్లించాలి. ►పెనాల్టీ లేకుండా ఎప్పుడైనా ఈ రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించొచ్చు. ► ప్రతి ఐదేళ్లకోసారి ప్రాపర్టీ విలువను బ్యాంక్‌లు మదింపు వేస్తాయి. ►రివర్స్ మార్ట్గేజ్ కింద తనఖా పెట్టిన ఇంటిని నవీకరించాలని అనుకుంటే, బ్యాంక్ నుంచి అనుమతి తీసుకోవాలి. ►ఇంటి నిర్వహణకు అయ్యే ఖర్చులను రుణ గ్రహీత (ఇంటి యజమాని) పెట్టుకోవాల్సిందే. అంతేకాదు ఆ ఇంటికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్, ఇతర పన్నులు ఏవైనా ఉంటే అందులో నివసిస్తున్న వారే చెల్లించుకోవాలి. చదవండి👉 తక్కువ ధరకే ప్రభుత్వ ఫ్లాట్లు, ఇళ్ల కోసం ఎగబడుతున్న జనం! -
చేతిలో రూ.25 లక్షలు ఉన్నాయ్.. పీఎంవీవీవైలో ఇన్వెస్ట్ చేయొచ్చా?
నాకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)లో రూ.4 లక్షల పెట్టుబడులు ఉన్నాయి. మూడేళ్ల తర్వాత నా పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే పెనాల్టీ చెల్లించాలా? ఇందుకు అనుసరించాల్సిన ప్రక్రియ ఏది? – ధీరజ్ సన్యాల్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కాల వ్యవధి ఐదేళ్లు. 8 శాతం వార్షిక రాబడిని (హామీతో కూడిన) మూడు నెలలకు ఒకసారి చొప్పున చెల్లిస్తారు. ఈ పథకం వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంటారు. కానీ డిపాజిట్ చేసిన రోజు ఉన్న రేటే ఐదేళ్ల కాలానికి అమలవుతుంది. అంటే కొత్తగా ప్రారంభించే ఖాతాలకే సవరించిన రేటు అమల్లో ఉంటుంది. ఈ పథకం కాలవ్యవధి ఐదేళ్లే అయినా, ఫారమ్–2 సమర్పించడం ద్వారా ముందుగానే ఖాతాను మూసివేయవచ్చు. కాకపోతే ఇన్వెస్ట్ చేసిన కాలవ్యవధి ఆధారంగా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసిన ఏడాది లోపు వెనక్కి తీసుకుంటే ఎలాంటి వడ్డీ చెల్లించరు. అప్పటికే మూడు నెలలకు ఒకసారి చెల్లించిన వడ్డీ మొత్తాన్ని అసలు నుంచి మినహాయించుకుంటారు. ఏడాది నుంచి రెండేళ్ల మధ్య డిపాజిట్‌ను రద్దు చేసుకుంటే పెట్టుబడిలో 1.5 శాతాన్ని జరిమానా కింద చెల్లించాల్సి వస్తుంది. ఇక రెండు నుంచి ఐదేళ్ల మధ్యలో డిపాజిట్ రద్దు చేసుకుంటే అప్పుడు పెట్టుబడిపై 1 శాతం జరిమానా పడుతుంది. మూడేళ్ల తర్వాత మీ డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నారు కనుక మీరు మీ పెట్టుబడి మొత్తం రూ.4 లక్షలపై ఒక శాతం చొప్పున రూ.4,000 పెనాల్టీ మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. మొదటి ఐదేళ్ల కాలానికే ఈ నిబంధనలు అమలవుతాయి. ఎస్సీఎస్ఎస్ పథకాన్ని ఐదేళ్ల తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఇలా పొడిగించి కాలంలో ఏడాది నిండిన తర్వాత, అంటే మొత్తంగా ఆరేళ్ల తర్వాత ఎప్పుడు ముందస్తుగా రద్దు చేసుకున్నా, ఎలాంటి పెనాల్టీ పడదు. నా వయసు 74 ఏళ్లు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ త్వరలోనే గడువు తీరి (మెచ్యూరిటీ) రూ.25 లక్షలు చేతికి రానున్నాయి. నేను ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మెరుగైన రాబడులు వస్తాయి? ప్రభుత్వ పథకాలు అయిన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), ప్రధాన మంత్రి వయవందన యోజన (పీఎంవీవీవై), పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (ఎంఐఎస్)లో పూర్తి స్థాయిలో నాకు పెట్టుబడులు ఉన్నాయి. – ఎస్.అరుణ్ ఫిక్స్డ్ డిపాజిట్లో రాబడులు మెరుగ్గా ఉండవు. కనుక మీరు మెరుగైన రాబడుల కోసం ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎఫ్డీలతో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్ అస్థిరతలతో ఉంటాయి. కాకపోతే అచ్చమైన ఈక్విటీ ఫండ్స్‌లో మాదిరిగా అస్థిరతలు ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌లో ఉండవు. ఇవి 15–30 శాతం వరకు ఈక్విటీల్లో, మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్, ఆర్బిట్రేజ్ అవకాశాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. స్వల్పకాలంలో ఈ ఫండ్స్‌లోనూ రిస్క్ ఎక్కువే ఉంటుంది. అయితే మూడు నుంచి ఐదేళ్లు అంతకుమించిన కాలానికి రిస్కీ అని నేను అనుకోను. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ మరోక ఆప్షన్. ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరే షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లోనూ రాబడులు ఉంటాయి. వీటిల్లో లిక్విడిటీ ఎక్కువ. పోస్టాఫీసు ఎంఐఎస్, ఎస్సీఎస్ఎస్, పీఎంవీవీవై పథకాల్లో పెట్టుబడులు ఉన్నాయి కనుక క్రమం తప్పకుండా ఆదాయం వస్తుంటుంది. ఈ పథకాల నుంచి రాబడి తీసుకుంటూ ఉంటారు. కనుక పెట్టుబడి విలువ పెరగదు. కనుక మీకు ఉన్న వాటిల్లో ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ మెరుగైన ఆప్షన్ అవుతుంది. ఈక్విటీ వద్దనుకుంటే షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌కు వెళ్లొచ్చు. -
సైరా... సైకిల్ సవారీ.. ఆమెకు 74 సంవత్సరాలు అంటే నమ్మడం కష్టం
ఉత్తర కర్ణాటకలోని గోకర్ణకు చెందిన జ్యోత్స్న కాగల్ను చూస్తే ‘74 సంవత్సరాలు’ అని నమ్మడం చాలా కష్టం. దీనికి కారణం ఆమె చలాకీతనం. 74 ఏళ్ల వయసులో కొందరికి నడవడం కష్టం కావచ్చు. అయితే జ్యోత్స్న మాత్రం వేగంగా నడవడంతో పాటు వేగంగా సైకిల్ తొక్కుతూ వీధి వీధీ తిరుగుతుంది. 1968లో తన తొలి సైకిల్‌ను కొన్నది. ఆ రోజుల్లో ఆడవాళ్లు సైకిల్ తొక్కడం అనేది అతి అరుదైన దృశ్యం. అలాంటి రోజుల్లో సైకిల్‌పై మెరుపు వేగంతో దూసుకుపోయే జ్యోత్స్నను చూసి సర్వజనులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టేవారు. ఆమె పేరు తెలియక ‘సైకిల్ అమ్మాయి’ అని పిలిచేవారు. ఆమె గోకర్ణలోని మహాబలేశ్వర్ కో–ఆపరేటివ్ సొసైటీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసింది. ధ్యానం, యోగాలతో జ్యోత్స్న దినచర్య మొదలవుతుంది. సైకిల్ సవారీ తన విజయ రహస్యం అని చెబుతున్న జ్యోత్స్న కాగల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
IDBI: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్, పూర్తి వివరాలు చూడండి!
సాక్షి,ముంబై: ప్రైవేట్ బ్యాంకు ఐడీబీఐ సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెప్పింది. "అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ" ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఏడు రోజుల నుంచి ఐదేళ్ల కాల డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఇందులో సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై గరిష్టంగా 7.65 శాతం వడ్డీని అందించ నుంది. దీంతోపాటు సాధారణ ప్రజలకు 7.15 శాతం వడ్డీని చెల్లిస్తుంది. (షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు) బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం,రెండుకోట్లరూపాయల లోపు డిపాజిట్లపై కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2023 నుండి అమల్లో ఉన్నాయి. బ్యాంక్ ప్రస్తుతం సాధారణ ప్రజలకు 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు సీనియర్ సిటిజెన్లకు 3.5 శాతం నుండి 6.75 శాతం వరకు , మిగిలినవారికి 3-6.25 శాతం వడ్డీ రేటును వర్తింప చేస్తుంది. (స్టార్ బ్యాటర్ కోహ్లీ అరుదైన ఘనత: గిఫ్ట్‌గా అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్) ఆరు నెలలు, ఒక రోజు నుండి ఒక సంవత్సరం, ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల (444 రోజులు కాకుండా) మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై వరుసగా 5.5 శాతం, 6.75 శాతం వడ్డీని పొందవచ్చు.. ఐదేళ్ల పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లకు సాధారణ ప్రజలకు 6.25 శాతం, సీనియర్లకు 6.75 శాతం వడ్డీ రేటును చెల్లించనుంది. (మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం: 7.5 శాతం వడ్డీరేటు, ఎలా అప్లై చేయాలి?) -
ఈ పథకంతో సీనియర్ సిటిజన్స్‌కు రూ.20 వేల వరకు రాబడి!
సీనియర్ సిటిజన్ల పొదుపునకు సంబంధించి ఓ అద్భుతమైన పథకం ఉంది. దాని పేరు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. దీని కింద సంవత్సరానికి 8 శాతం వడ్డీ లభిస్తుంది. మదుపు సొమ్ము 5 సంవత్సరాలకు మెచ్యూర్ అవుతుంది. ఆ తర్వాత మరో మూడేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో గరిష్టంగా రూ.30 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్ సందర్భంగా పేర్కొన్నారు . అయితే దీనిపై అధికారిక నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఈ పథకంలో రూ. 30 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా సీనియర్ సిటిజన్లు వడ్డీ కింద నెలకు రూ. 20,000 వరకు ఆదాయం పొందవచ్చు. ఒక వేళ భార్యాభర్తలిద్దరూ కలిపి డిపాజిట్ చేస్తే నెలకు రూ. 40,000 వరకు రాబడి లభిస్తుంది. వడ్డీ రేటు మరింత పెరిగేనా? సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును ప్రభుత్వం మరింత పెంచవచ్చని సీనియర్ సిటిజన్లు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా జరగనున్న చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్ల తదుపరి సవరణను దృష్టిలో ఉంచుకుని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును ప్రభుత్వం పెంచుతుందని ఆశిస్తున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అంటే డిసెంబర్లో ప్రభుత్వం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును మార్చింది. ప్రస్తుతం ఇది 8 శాతంగా ఉంది. అయితే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు మరింత పెరిగే అవకాశం లేదని ఎస్ఏజీ ఇన్ఫోటెక్ ఎండీ అమిత్ గుప్తా చెబుతున్నారు. మై ఫండ్ బజార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో వినిత్ ఖండారే కూడా ఈ వడ్డీ రేటు మరింత పెంచే అవకాశం లేదన్నారు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ దిగుబడిలో పెరుగుదల కారణంగా ప్రభుత్వం స్వల్పకాలిక చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటును పెంచవచ్చని భావిస్తున్నప్పటికీ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును ఇటీవలే సవరించిన నేపథ్యంలో మరో సారి సవరణ ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. -
చీరకట్టులో డైవింగ్ చేసిన సీనియర్ సిటిజన్ మహిళలు: వీడియో వైరల్
స్విమ్మింగ్ కాంపిటీషన్లో చూస్తుంటాం తలకిందులుగా నీటిలో దూకడం. ఆ పోటీలో పాల్గొన్న వాళ్లంతా స్విమ్‌సూట్ వేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని మరీ చేస్తుంటారు. కానీ ఇక్కడ సీనియర్ సీటిజన్ మహిళలు అలాంటివి ఏమి లేకుండా చీర కట్టులోనే డైవింగ్ చేసి చూపించారు. ఇది అందర్నీ ఆశ్చర్యపరిచడమే గాక చాలా ఆదర్శంగా కూడా ఉంది. ఈ ఘటన తమిళనాడులో కల్లిడైకురిచి వద్ద తామిరబర్నీ నది వద్ద చోటు చేసుకుంది. అక్కడ మహిళలందరికి ఇది నిత్యకృత్యం. ఒక పెద్దావిడ కల్లిడైకురిచిలో పేరుగాంచిన తామిరబరిణి నదిలో చీరకట్టులో డైవింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియోని ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియా సాహు పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సీనియర్ సిటజన్ మహిళంతా చాలా అలవోకగా బ్రిడ్జిపై నుంచి నదిలో దూకి స్విమ్మింగ్ చేస్తూ..కనిపించారు. అదికూడా చీరకట్టులోనే చేశారు. వారంతా పెద్దవాళ్లే కానీ, ఏమాత్రం బెరుకు లేకుండా చాలా ఉత్సాహంగా డైవింగ్ చేశారు. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి ఆ నది అంతా లోతు లేదు కాబట్టే చేయగలుగుతున్నారని ఒకరు, కొన్నిగ్రామాల్లోని పురుషులు, మహిళలు, పిల్లలకు ఇలాంటి వాటిల్లో చాలా నైపుణ్యత ఉంటుందని మరోకరు ట్వీట్ చేశారు. Awestruck to watch these sari clad senior women effortlessly diving in river Tamirabarni at Kallidaikurichi in Tamil Nadu.I am told they are adept at it as it is a regular affair.😱Absolutely inspiring 👏 video- credits unknown, forwarded by a friend #women #MondayMotivation pic.twitter.com/QfAqEFUf1G — Supriya Sahu IAS (@supriyasahuias) February 6, 2023 (చదవండి: అరవింద్ కేజ్రీవాల్‌ని పోలిన వ్యక్తి చాట్ అమ్ముతూ..) -
సీనియర్ సిటిజన్ల కోసం బజాజ్ నుంచి సరికొత్త ఇన్సూరెన్స్ ప్లాన్స్
హైదరాబాద్: ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ బజాజ్ అలయాంజ్ తాజాగా సీనియర్ సిటిజన్ల కోసం ’రెస్పెక్ట్ సీనియర్ కేర్’ రైడర్‌ను ప్రవేశపెట్టింది. మూడు ప్లాన్లలో ఇది అందుబాటులో ఉంటుంది. దీనికి ప్రీమియం రూ. 700 నుంచి రూ. 7,500 వరకూ (జీఎస్టీ కాకుండా) ఉంటుందని సంస్థ తెలిపింది. ప్లాన్‌ను బట్టి ఎమర్జెన్సీ రోడ్ అంబులెన్స్ సర్వీస్, స్మార్ట్ వాచ్ ఫాల్ డిటెక్షన్, ఫిజియోథెరపి.. నర్సింగ్ కేర్ తహా హోమ్ కేర్ సర్వీసులు, మెడికల్ టెలీ–కన్సల్టేషన్ సర్వీసులు మొదలైనవి ఈ రైడర్‌తో పొందవచ్చని కంపెనీ ఎండీ తపన్ సింఘెల్ తెలిపారు. 50 ఏళ్లు పైబడి, కంపెనీ అందించే బేస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్న వారు ఈ రైడర్‌ను ఎంచుకోవచ్చు. -
ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్
సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ శుభవార్త చెప్పింది. ఇకపై లబ్ధిదారులు బ్యాంకును సందర్శించే అవసరం లేకుండా కొత్త సర్వీసుల్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా పెన్షన్ స్లిప్‌ను లబ్ధి దారుల వాట్సాప్‌కు పంపే సర్వీసును ప్రారంభించినట్లు తెలిపింది. మొబైల్ నంబరు నుంచి 9022690226కి ‘హాయ్’ అని వాట్సాప్ మెసేజ్ పంపాలి. అలా పంపిన యూజర్లకు పెన్షన్ స్లిప్ తో పాటు అకౌంట్లకు సంబంధించిన మినిస్టేట్మెంట్,బ్యాలెన్స్ ఎంక్వైరీ సమాచారం పొందవచ్చు. Now get your pension slip over WhatsApp! Avail hassle-free service at your comfort. Send a "Hi" on +91 9022690226 over WhatsApp to avail the service. #SBI #AmritMahotsav #WhatsAppBanking #PensionSlip pic.twitter.com/rGgXMTup32 — State Bank of India (@TheOfficialSBI) November 17, 2022 ఇందుకోసం వినియోగదారులు వారి బ్యాంక్ అకౌంట్‌కు జత చేసిన ఫోన్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోవాలి.ఆ మొబైల్ నంబర్ నుంచి WAREG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ అకౌంటర్ నంబర్‌ను టైప్ చేసి 72089 33148 నంబర్‌కు మెసేజ్ చేస్తే సరిపోతుంది. -
63 ఏళ్ల వయసులో 6,000 కిలో మీటర్ల సైక్లింగ్
ఆయన వయసు 63 సంవత్సరాలు. జెట్ స్పీడ్‌తో సైకిల్ తొక్కుతూ రయ్ రయ్ అంటూ దూసుకెళ్తున్నారు. తొక్కుతున్న సైకిల్ స్పీడ్ చూస్తే 25 ఏళ్ల వయసు ఉన్న యువకుడు అనుకుంటారు. తన ఫేస్‌కు ఉన్న మాస్క్ తీస్తే కానీ తెలియదు ఆయన 60 ఏళ్ళకి పైబడిన వ్యక్తి అని. ఆయనే హైదరాబాద్‌కు చెందిన మేజర్ జనరల్ డాక్టర్ ఆలపాటి వెంకటకృష్ణ (ఏవీకే) మోహన్. సోమవారం హైదరాబాద్ నుంచి సిద్దిపేటలోని రంగనాయకసాగర్‌కు సైక్లింగ్ చేసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా సాక్షి పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే... సాక్షి, సిద్దిపేట: మా నాన్న దేవాదాయ శాఖలో విధులు నిర్వర్తించేవారు. కాకినాడలో ఎంబీబీఎస్ పూర్తి చేశాను. 1984లో సికింద్రాబాద్‌లోని మిలటరీ హాస్పిటల్లో డాక్టర్‌గా జాబ్ వచ్చింది. 37 ఏళ్ల పాటు ఆర్మీలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించి ఆర్మీ సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ పుణేలో మెడికల్ హెడ్‌గా మేజర్ జనరల్‌గా ఉద్యోగ విరమణ తీసుకున్నాను. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కౌకూర్‌లో నివాసం ఉంటున్నాను. నా కూతురు ప్రసన్న డెంటల్ స్పెషలిస్ట్ గౌహతిలో ప్రాక్టీస్ చేస్తోంది. పర్వతారోహణ...బైకింగ్: 1991లో ఇటాలియన్లతో కలిసి మౌంట్ సతోపంత్‌కు పర్వతారోహణ యాత్ర చేశా. 2000 సంవత్సరం ప్రారంభంలో కాంగోలోని మౌంట్ నైరాగాంగోలో ప్రత్యక్ష అగ్నిపర్వతం అధిరోహించిన ఆర్మీ బ్రిగేడ్‌లో మొదటి వ్యక్తి నేనే. ఈశాన్యంలోని మొత్తం ఎనిమిది రాష్ట్రాలల్లో బైకింగ్ చేసుకుంటూ తిరిగి వచ్చాను. 2019లో దే«శంలోని మూడు కార్నర్లు తూర్పు, పడమర దక్షణంలో 11,500 కిలో మీటర్లు మోటార్ బైకింగ్ చేశాను. సైక్లింగ్ అంటే ఇష్టంతో: నాకు చిన్నప్పటి నుంచి సైక్లింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. డిసెంబర్ 2014లో చెన్నైకి బదిలీపై వచ్చాను. అప్పటికే చెన్నై నగరంలో ప్రసిద్ధ సైక్లింగ్ గ్రూప్ అయిన చెన్నై జాయ్ రైడర్జ్ ఉంది. అందులో చేరాను. చెన్నై నుంచి విజయవాడ , 2015లో కర్ణాటక, కేరళ , తమిళనాడులో 900 కి.మీ, టూర్ ఆఫ్ నీలగిరీస్ సైక్లింగ్ పర్యటన చేశాను. 2016లో స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైక్లింగ్ చేశాను. జలశక్తి మిషన్ కింద 2019లో కచ్(గుజరాత్) నుంచి గౌహతి(అస్సాం) వరకు 3,200 కిలోమీటర్లు సైక్లింగ్ చేశాను. ఈ నెల 20 నుంచి నెల రోజుల పాటు గోల్డెన్ క్వాడ్రీలెట్రల్ ఈ నెల 20వ తేదీ నుంచి నెల రోజుల పాటు గోల్డెన్ క్వాడ్రీలెట్రల్ సైక్లింగ్ చేయనున్నాను. 6 వేల కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. ఔరంగాబాద్‌లో ప్రారంభమై జార్ఖండ్, వెస్ట్‌బెంగాల్, కోల్‌కతా, చెన్నై, ముంబై, ఢిల్లీ మీదుగా మళ్లీ ఔరంగాబాద్‌కు చేరుకుంటాను. ఇలా నెల రోజుల పాటు సైక్లింగ్ చేస్తాను. ఫిట్నెస్ ఔత్సాహికులకు సలహాలు, మెరుగైన జీవనం వైపు అడుగులు వేసేందుకు ఇతరులకు ఆదర్శంగా ఉండాలనేదే ఆలోచన. (చదవండి: గిన్నిస్ రికార్డు...ఒక్క నిమిషంలో 1,140!) -
88వ పెళ్లికి సిద్ధమవుతున్న వృద్ధుడు...మరోసారి మాజీ భార్యతో
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయి అంటారు. అది ఎంత వరకు నిజమో తెలియదు. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లిళ్లు నిలబడటం అత్యంత కష్టంగా ఉంది. అలాంటి స్థితుల్లో ఇక్కడొక వ్యక్తి ఒకటి రెండు కాదు ఏకంగా 87 పెళ్లిళ్లు చేసుకున్నాడు. వివరాల్లోకెళ్తే...ఇండోనేషియాలోని వెస్ట్ జావాలోని మజలెంగ్కాకు చెందిన 61 ఏళ్ల ఖాన్ అనే వృద్ధుడు 88వ పెళ్లికి సద్ధమవుతున్నాడు. అది కూడా తన మాజీ భార్యనే వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఆయన సుమారు 87 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఖాన్ ఇలా చాలా సార్లు పెళ్లిళ్లు చేసుకున్నందు వల్ల ఆయన్ని ప్లేబాయ్ కింగ్ అని పిలుస్తుంటారు. ఆయన ఒక సామాన్య రైతు. అతను 14 ఏళ్ల వయసులో తొలిసారిగా వివాహం చేసుకున్నాడు. ఐతే ఖాన్ మొదటి భార్య అతని కంటే రెండేళ్లు పెద్దదని, తన పేదరికం గురించి చెప్పకపోవడంతో కేవలం రెండేళ్లలోనే విడాకులు తీసుకుని వెళ్లిపోయిందని చెబుతున్నాడు. ఈ సంఘటన తర్వాత తనకు చాలా కోపం వచ్చిందని అప్పుడే చాలా మంది మహిళలు తనతో ప్రేమలో పడేలా చేసుకునే తెలివతేటలు సంపాదించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తాను మహిళలకు ఇబ్బంది కలిగించేవి, చేయనని, వారి భావోద్వేగాలతో కూడా ఆడుకోననని అందువల్లే చాలా మంది తన ప్రేమలో పడ్డారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను పెళ్లి చేసుకోబుతున్న తన మాజీ భార్య తన నుంచి విడిపోయి చాలా కాలం అయ్యిందని అయినప్పటికీ తనను ఇంకా ప్రేమిస్తూనే ఉందని చెబుతున్నాడు. అలాగే తన కోసం తిరిగి వచ్చే తన మాజీ ప్రేయసులను తిరస్కరించలేనని చెప్పాడు. ఐతే 87 పెళ్లళ్లు చేసుకున్న ఖాన్ తనకు ఎంతమంది పిల్లలున్నారనే దాని గురించి మాత్రం వెల్లడించలేదు. (చదవండి: మాకు సరైన నాయకుడే లేడంటూ 100 ఏళ్ల వ్యక్తి పార్లమెంట్ బరిలోకి) -
సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ బంపరాఫర్
సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ బంపరాఫర్ ఇచ్చింది. ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం ఎస్బీఐ వీకేర్ గడువును మార్చి 31,2023 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఈ స్కీమ్ పథకంలో చేసిన డిపాజిట్లకు అదనపు వడ్డీ లభిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్ ఎఫ్డి స్కీమ్ ఎస్బీఐ వీకేర్ ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టే గడువును మార్చి 31, 2023 వరకు పొడిగించింది. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం..సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక “ఎస్బీఐ వీకేర్” డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టబడింది. ఈ స్కీమ్‌లో అర్హత పొందిన సీనియర్ సిటిజన్లు 30 బేసిస్ పాయింట్లు అదనంగా పొందవచ్చు. అంటే సాధారణ ప్రజలకంటే 50 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ ఎస్బీఐ సీనియర్ సిటిజన్లకు లభిస్తుంది. సిటిజన్లకు సాధారణ ప్రజలకు వర్తించే రేటు కంటే 80 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ ఈ పథకం ద్వారా లభిస్తుంది. ప్రస్తుతం ఎస్బీఐ సాధారణ ప్రజలకు 5ఏళ్ల ఎఫ్డీకి 5.65శాతం వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుండగా...సీనియర్ సిటిజన్ ప్రత్యేక ఎఫ్డీ పథకంలో చేసిన డిపాజిట్లకు 6.45శాతం వడ్డీ లభిస్తుంది. డిపాజిట్ వ్యవధి : కనిష్టంగా - 5 సంవత్సరాలు. గరిష్టంగా - 10 సంవత్సరాలు వడ్డీ చెల్లింపు : టర్మ్ డిపాజిట్ - నెలవారీ/ త్రైమాసిక వ్యవధిలో ప్రత్యేక టర్మ్ డిపాజిట్ : మెచ్యూరిటీ వడ్డీపై టీడీఎస్ డిడక్ట్ చేసి కస్టమర్ ఖాతాకు జమ చేయబడుతుంది రుణ సౌకర్యం సీనియర్ సిటిజన్లకు పలు బ్యాంకులు ప్రత్యేక ఎఫ్డి పథకాల్ని ఇతర బ్యాంకులు సైతం అందిస్తున్నాయి. వీటిలో ఐసిఐసిఐ బ్యాంక్ , హెచ్డీఎఫ్సీ బ్యాంకులతో పాటు ఇతర బ్యాంకులున్నాయి. -
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇకపై ఆధార్ కార్డు డిజిటల్ అయినా ఓకే!
సాక్షి, అమరావతి: సీనియర్ సిటిజన్లకు బస్ టికెట్లలో రాయితీ కోసం డిజిటల్ ఆధార్ కార్డును కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆర్టీసీ నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ టికెట్ల ధరల్లో 25 శాతం రాయితీ ఇస్తోంది. అందుకోసం ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్, రేషన్‌కార్డులను గుర్తింపు కార్డులుగా పరిగణిస్తున్నారు. ఇక నుంచి డిజిటల్ ఆధార్‌ను కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆర్టీసీ ఈడీ కేఎస్ బ్రహ్మానందరెడ్డి అధికారులను ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
సీనియర్ సిటిజన్స్ కోసం అదిరిపోయే స్కీమ్, రిస్క్ లేకుండా అధిక వడ్డీతో..
సీనియర్ సిటిజన్స్ కోసం తక్కువ రిస్క్, అధికరాబడిని అందించే రకరకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో పోస్టాఫీస్ అందించే ఈ స్కీమ్ ప్రత్యేకం. ఎందుకంటే మిగిలిన స్కీమ్స్‌తో పోలిస్తే ఈ పథకంలో రాబడి ఎక్కువగా ఉందని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు మనం ఆ స్కీమ్ గురించి, ఆ స్కీమ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పోస్టాఫీస్‌లో ఈ స్కీమ్‌ను సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) అని పిలుస్తారు. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు తక్కువ రిస్క్‌తో పోస్టల్ స్కీమ్ అందిస్తుంది. అధిక వడ్డీ రేటు, ఆదాయపు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీస్‌లో లేదా కొన్ని బ్యాంకుల్లో కూడా తెరవవచ్చు. ముఖ్యంగా పథకంలో డబ్బులు పొదుపు చేయాలంటే ఈ ఖాతా తెరిచే సయమానికి సంబంధిత ఖాతాదారుని వయస్సు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. అయితే కొన్ని వర్గాలకు చెందిన వ్యక్తులకు వయో సడలింపు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఖాతాలో సీనియర్ సిటిజన్లు రూ.15 లక్షల వరకు డిపాజిట్లపై త్రైమాసిక వడ్డీని పొందవచ్చు. ఎవరు అర్హులు పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్ లైన అతని/ఆమె విడివిడిగా లేదంటే సంయుక్తంగా ఎస్సీఎస్ఎస్ ఖాతాను ఓపెన్ చేయొచ్చు. వడ్డీ రేటు ప్రస్తుతం ఎస్సీఎస్ఎస్ వడ్డీరేటు 7.4శాతం ఉండగా కేంద్రం త్రైమాసిక ప్రాతిపదికన ఇతర పథకాలతోపాటు ఈస్కీమ్ వడ్డీ రేటును సవరిస్తుందనే విషయాల్ని గుర్తించుకోవాలి. ఇటీవల కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ స్కీమ్ వడ్డీ రేటు 2022 (నూతన సంవత్సరం 2022 మొదటి త్రైమాసికంలో) మారలేదు. ఆదాయపు పన్ను మినహాయింపు ఎస్సీఎస్ఎస్ ఖాతాలో చేసిన పెట్టుబడి ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయింపు పొందచవ్చు. అధికారిక పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్ నుండి వచ్చిన అప్డేట్ల ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని ఎస్సీఎస్ఎస్ ఖాతాలలో మొత్తం వడ్డీ రూ. 50,000 కంటే ఎక్కువ ఉంటే వడ్డీపై పన్ను విధించబడుతుంది. మెచ్యూరిటీ పీరియడ్ ఎస్సీఎస్ఎస్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి ఐదు సంవత్సరాల కాలవ్యవధికి వడ్డీ లభిస్తుందని డిపాజిటర్లు తప్పనిసరిగా గమనించాలి. డిపాజిటర్ ఖాతా మెచ్యూరిటీ అయిన ఒక సంవత్సరంలోపు, మూడు సంవత్సరాలకు ఒకసారి పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిపాజిట్ పరిమితి సీనియర్ సిటిజన్లు గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఎస్సీఎస్ఎస్ ఖాతాలో పెట్టుబడి పెట్టవచ్చు. ఎస్సీఎస్ఎస్ ఖాతాను తెరవడానికి అవసరమైన కనీస మొత్తం రూ.1000గా ఉంది. చదవండి: ఎల్ఐసీకి భారీ షాక్, తగ్గుతున్న ఆదాయం -
హైదరాబాద్‌లో దారుణం.. 72 ఏళ్ల వృద్ధుడు 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి.. ఆపై
సాక్షి హైదరాబాద్: 72 ఏళ్ల వృద్ధుడు 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుజాత లా పబ్లిషింగ్ హౌస్ రచయిత అయిన గాదె వీరారెడ్డి (72) బర్కత్‌పురలోని గోకుల్ధామ్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్నాడు. 2010లో అతడి ఇంట్లో బాధితురాలి తల్లి పని మనిషిగా పని చేసేది. 2017లో ఆమెను బడంగ్‌పేటలోని తన ఓపెన్ ప్లాట్‌కు వాచ్‌మెన్‌గా నియమించుకున్నాడు. ఆ తర్వాత బాధితురాలి తల్లి, ఆమె మేనమామ ఇద్దరు కలిసి మీర్‌పేట పీఎస్ పరిధిలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి వారు అక్కడే ఉండేవాళ్లు. ఇంటి పనులు మానేసి జీవనోపాధి కోసం టైలరింగ్ చేస్తుండేది. ఈ నేపథ్యంలో నిందితుడు వీరారెడ్డి తన న్యాయ పుస్తకాలను భద్రపరిచేందుకు సంచులు కావాలన్న నెపంతో తరచూ బాధితురాలి ఇంటికి వెళ్తుండేవాడు. గతేడాది డిసెంబర్లో బాధితురాలి తల్లి కుమార్తెను ఇంట్లో వదిలి సొంతూరికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని విషయం తెలుసుకున్న వీరారెడ్డి అక్రమంగా చొరబడి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఊరి నుంచి తిరిగొచ్చిన తల్లికి బాధితురాలు విషయం చెప్పడంతో ఆమె మీర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు వీరారెడ్డి కేసు ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో మీ పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలి తల్లిని బెదిరించాడు. తనను వేధిస్తున్నారని పేర్కొంటూ నాన్–జ్యూడీషియల్ స్టాంప్ పేపర్లపై వివరాలు రాసి బాధితురాలి తల్లి, ఆమె మేనమామకు వాట్సాప్ ద్వారా పంపించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. అతడి నుంచి రెండు నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పేపర్లు, స్కూటర్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. -
విమానంలో వృద్దుడిపై మహిళ అమానుష దాడి
ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది మాస్క్ ధరించకుండా బయటకు వస్తే ఊరుకోవడం లేదు. ఆఖరికి తమ స్నేహితులను, బంధువులను సైతం మాస్క్ ధరించకపోతే ఊరుకోవటం లేదు. ఎవరికివారుగా స్వచ్ఛందంగా ఇలా సురకక్షితంగా ఉండటం మంచిదే గానీ అది సృతి మించితే ఇతరులకు, మన తోటివారికి కూడా ఇబ్బందే. అచ్చం అలానే ఒక మహిళ తింటున్నప్పుడూ మాస్ ఎందుకు ధరించవంటూ ఒక వృద్దుడిపై దాడి చేసింది. (చదవండి: నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!) అసలు విషయంలోకెళ్లితే...డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ మాస్క్ ధరించకుండా భోజనం చేస్తున్న వృద్దుడిపై దాడి చేసింది. పైగా చాలా అమానుషంగా తిట్టడం వంటివి చేసింది. అయితే నిజానికి ఆమె మాస్క్ ధరించకుండా వృద్దుడుని తిట్టడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అక్కడ ఉన్నవాళ్లందరికీ. పైగా వాళ్లంతా కూర్చొమని వారిస్తున్న వినకుండా ఆ వృద్దుడిని కొడుతుంది. దీంతో ఆ విమాన సిబ్బంది ఆమెను అడ్డుకుని అక్కడ నుంచి తీసుకువెళ్తారు. ఆ తర్వాత ఆ వృద్దుడు ఆమెను నువ్వు జైలుకు వెళ్తావు అంటాడు. ఈమేరకు ఆ విమానం అట్లాంటాలో ల్యాండ్ అయిన వెంటనే అక్కడి పోలీసులు ఆ వృద్దుడిపై దాడి చేసిన మహిళ ప్యాట్రిసియా కార్న్‌వాల్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే ఈ సంఘటన తర్వాత విమానయాన సంస్థలు ఇలాంటి వికృత ప్రవర్తనను సహించేది లేదని ప్రకటించడం విశేషం. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: మమ్మీలను తాకకుండానే పుట్టు పూర్వోత్తరాలు..!) -
KBR Park: కేబీఆర్ పార్కు టికెట్టు ధర పెంపు
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్కు ప్రవేశ రుసుముతో పాటు వార్షిక పాస్ ధరలను అటవీశాఖాధికారులు భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 1 నుంచి అమలు కానున్న ఈ ప్రవేశ రుసుముతో పాటు వార్షిక పాస్‌లను ఆన్లైన్లో రెన్యూవల్ చేసుకోవాలని నోటీసును అతికించారు. వార్షిక ఎంట్రీపాస్(జనరల్) 2021లో రూ. 2250 ఉండగా 2022 నుంచి రూ. 2500 చేశారు. అలాగే సీనియర్ సిటిజన్ వార్షిక ఎంట్రీ ఫీజు పాస్ కోసం గతంలో రూ. 1500 ఉండగా వచ్చే ఏడాది నుంచి రూ. 1700 వసూలు చేయనున్నారు.ఇప్పటి వరకు నెలవారి ఎంట్రీఫీజు రూ. 600 మాత్రమే ఉండగా వచ్చే నెల 1వ తేదీ నుంచి రూ. 700 ఉండనుంది. అలాగే రోజువారి ప్రవేశ రుసుము పెద్దలకు గతంలో రూ. 35 ఉండగా ఇప్పుడది రూ. 40కి చేరింది. పిల్లలకు మొన్నటి వరకు ఎంట్రీఫీజు రూ. 20 ఉండగా ఇప్పుడది రూ. 25కు చేరింది. అలాగే పార్కు వేళలను కూడా కుదించారు. ఉదయం 5 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే వాకింగ్, సందర్శకులకు అనుమతిస్తారు. చదవండి: భార్య, ప్రియుడి హత్య కేసు: భర్త అరెస్ట్ -
4 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు భారంగా రైల్వేశాఖ నిర్ణయం!
అవసాన దశలో ఇతరులపై ఆధారపడి జీవించే వారికి శాపంగా మారింది రైల్వేశాఖ నిర్ణయం. అరకొర ఆదాయంతోనే పొదుపు చేసుకున్న సొమ్ముతోనో ప్రయాణం చేసే సీనియర్ సిటిజన్స్‌కి రైల్వేశాఖ నిర్లక్ష్య వైఖరి భారంగా మారింది. కరోనా సంక్షోభం సమయంలో ఎత్తి వేసిన రాయితీలు నేటికి పునరుద్ధరించకపోవడంతో తమకు ఇబ్బందిగా మారిందంటున్నారు సీనియర్ సిటిజన్లు. రాయితీలకు కోత సామాజిక బాధ్యతగా రైల్వేశాఖ సమాజంలోని సీనియర్ సిటిజన్లు, ఉద్యోగార్థులు, రోగులు, జర్నలిస్టులు, ఆర్మీ తదితర వర్గాలకు రైలు ప్రయాణం సందర్భంగా రాయితీలు కల్పిస్తోంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు సంబంధించి 58 ఏళ్లు దాటిన స్త్రీలకు 50 శాతం 60 ఏళ్లు దాటిన పురుషులకు 40 శాతం రాయితీ ఉంది. అయితే కరోనా కారణంగా దేశవ్యాప్తంగా రైళ్ల సర్వీసులను 2020 మార్చి 24 నుంచి రద్దు చేశారు. ఆ తర్వాత మూడు నెలల తర్వాత రైళ్లు క్రమంగా ప్రారంభం అయ్యాయి. అయితే రాయితీ మాత్రం పునరుద్ధరించలేదు. అధిక ఛార్జీలు రైలు సర్వీసులు ప్రారంభమైనా రాయితీల విషయంలో రైల్వేశాఖ మౌనముద్ర వహించింది. దీంతో గత ఏడాది కాలంగా అన్ని రైళ్లలో ప్రయాణిస్తున్న సీనియర్ సిటిజన్లు టిక్కెట్టు ఛార్జీలు పూర్తిగా చెల్లించాల్సి వస్తోంది. పైగా ప్రస్తుతం నడుస్తున్నవి ప్రత్యేక రైళ్లు కావడంతో అన్నింటా అధికంగానే సొమ్ములు చెల్లించాల్సి వస్తోంది. ఆదాయం తగ్గిపోయి, అనారోగ్యాలకు చేరువైన సీనియర్ సిటిజన్లకు రైలు ప్రయాణాలు భారంగా మారాయి. ముఖ్యంగా హెల్త్ చెకప్‌ల కోసం క్రమం తప్పకుండా ప్రయాణాలు చేసే వారు మరీ ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు కోట్ల మంది లాక్డౌన్ తర్వాత స్పెషల్ ట్యాగ్‌తో రైల్వే సర్వీసులు ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ఎంత మంది సీనియర్ సిటిజన్లు రైళ్లలో ప్రయాణించారనే వివరాలు కావాలంటూ మధ్యప్రదేశ్‌కి చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే ఆర్టీఐ కార్యకర్త దరఖాస్తు సమర్పించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. 2021 సెప్టెంబరు 31 నాటికే దేశవ్యాప్తంగా రిజర్వ్డ్ రైళ్లలోనే 3,78,50,668 మంది ప్రయాణం చేసినట్టు రైల్వే రికార్డులు వెల్లడించాయి. ఈ రోజు వరకయితే ఈ సంఖ్య నాలుగు కోట్లకు తక్కువగా ఉండదు. మంత్రి కేటీఆర్ ట్వీట్ ఆర్టీఐ ద్వారా సమాచారం వెల్లడి కావడంతో ఒక్కసారిగా రైల్వేశాఖపై విమర్శలు పెరిగాయి. కరోనా వంటి సంక్షోభం సమయంలో ఓ వైపు ఆదాయం తగ్గిపోయి అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే రాయితీలకు కోత పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ సమాజానికి సర్వం ధారపోసిన వృద్ధుల పట్ల నిర్థయగా వ్యవహరించడం సరికాదంటూ సుతిమొత్తగా హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సైతం రైల్వేశాఖ తీరును తప్పు పట్టారు. రాయితీలు పునరుద్ధరించాలంటూ రైల్వేమంత్రికి విజ్ఞప్తి చేశారు. VerY unfortunate situation Railway Minister @AshwiniVaishnaw Ji Please review the decision in the interest of crores of senior citizens who deserve our assistance and respect https://t.co/cNvbyHx0oH — KTR (@KTRTRS) November 23, 2021 చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. -
సీనియర్ సిటిజన్లకు ‘పన్ను’ లాభాలు
నేను ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాను. జీతం రూ. 8 లక్షలు. పాన్ ఉంది. రిటర్న్ వేయటం లేదు. ప్రతి సంవత్సరం మా యజమాని కొంత మొత్తం ఇన్‌కం ట్యాక్స్ నిమిత్తం కట్ చేస్తారు. వివరాలు ఇవ్వడం లేదు – ఎస్ రామచంద్ర నాయుడు, మెదక్ మీ తరఫు నుంచి ఆలోచిస్తే, మీరు స్వయంగా ఆదాయపు పన్ను చట్టప్రకారం ట్యాక్సబుల్ ఇన్‌కం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం రిటర్ను దాఖలు చేయాలి. మార్చి 21తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్ను దాఖలు చేయండి. ఆన్లైన్లో వేయవచ్చు. ఇక రిటర్ను వేయడానికి మీ జీతం వివరాలు, ఇతర ఆదాయపు వివరాలు, బ్యాంకు అకౌంటు వివరాలు, బ్యాంకులో జమ అయిన వడ్డీ, రెడీగా ఉండాలి. దీనితో పాటు మీ యజమాని మీకు ఫారం 16 ఇవ్వాలి. అడగండి. ఫారం 16లో అన్ని వివరాలు ఇవ్వాలి. పన్ను భారాన్ని మీ యజమాని మీ దగ్గర్నుండి ’కట్’ చేశారు కాబట్టి ఆ వివరాలు వారి దగ్గర ఉంటాయి. దీన్నే టీడీఎస్ అంటారు. అలా కట్ చేసిన మొత్తాన్ని మీ యజమాని సకాలంలో ప్రభుత్వానికి చెల్లించాలి,. ఆ తర్వాత ఆ వివరాలను అప్లోడ్ చేయించాలి. మొత్తం సమాచారం ఫారం ’26 అ ’లో కనిపిస్తుంది. ఇలా కనిపించిందంటే మీరేం గాభరా పడనక్కర్లేదు. ఆ వివరాలతో మీరు దాఖలు చేసుకోవచ్చు. అలా కాకుండా, మీ దగ్గర్నుంచి ’కట్’ చేసి, ఆ మొత్తాన్ని మీ తరఫున ప్రభుత్వానికి చెల్లించకపోవటం చట్టరీత్యా నేరం. చట్టరీత్యా శిక్ష పడుతుంది. కాబట్టి పూర్తిగా చెక్ చేసుకోండి. అన్నీ సవ్యంగా ఉంటే సరి. లేదంటే మీ ఉద్యోగస్తులందరూ కలిసి యజమానిని అడగండి. సమస్య సమసిపోతుంది. లేదంటే తగిన సాక్ష్యాధారాలతో ఆదాయపు పన్ను అధికారులకు తెలియజేయండి. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టంలోని అంశాలు తెలియజేయగలరు – కేఆర్ రెడ్డి, ఏలూరు సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి కేవలం రెసిడెంట్లకు మాత్రమే వర్తిస్తాయి. నాన్ రెసిడెంట్లకు వర్తించవు. 60 సం.లు దాటి, 80 సం.ల లోపు ఉన్న వారిని సీనియర్ సిటిజన్లు అంటారు. 80 సం.లు దాటిన వారిని వెరీ సీనియర్ సిటిజన్లు అంటారు. 31–3–2021 నాటికి ఈ రూలు వర్తింపచేస్తారు. చాలా మంది రిటర్నులు దాఖలు చేసిన తేదీకి వర్తిస్తుంది అని అనుకుంటారు. 60 సం. లోపు వారికి బేసిక్ లిమిట్ రూ.2,50,000, 60–80 సం.ల వారికి ఇది రూ. 3,00,000 కాగా, 80 సం.లు దాటిన వారికి బేసిక్ లిమిట్ రూ. 5,00,000గా ఉంది. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులో మినహాయింపు ఉంది. సీనియర్ సిటిజన్లకు వ్యాపారం/వృత్తి నుంచి ఆదాయం లేకపోతే వారు ముందుగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యాపారం/వృత్తి నుంచి ఆదాయం వచ్చే వారికి ఈ మినహాయింపు లేదు. 80 ఖీఖీఆ ప్రకారం రూ. 50,000 వరకు నిర్దేశిత వడ్డీ మీద మినహాయింపు ఉంది. టీడీఎస్ మినహాయింపు ఉంది. ప్రతి బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ (మొత్తం వడ్డీ కాదు) రూ. 50,000 దాటకపోతే టీడీఎస్ ఉండదు. 80 ఈఈఆ ప్రకారం వైద్య చికిత్స నిమిత్తం మినహాయింపులు ఉన్నాయి. అలాగే 80 ఈ ప్రకారం ఇన్సూరెన్స్ క్లెయిమ్, వైద్య చికిత్స కోసం మినహాయింపులు ఉన్నాయి. 75 ఏళ్లు దాటిన వారు రిటర్నులు వేయనవసరం లేదు. - కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిఫుణులు -
బామ్మ జ్యూస్ స్టాల్: వావ్ అంటున్న నెటిజనులు, వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: వృద్ధాప్యంలో హాయిగా కృష్ణా రామా అనుకుంటూ కాలు మీద కాలు వేసుకుని జీవించే అదృష్టం ఎంతమందికి ఉంటుందో తెలియదు గానీ, తమకు ఏజ్ జస్ట్ ఒక నంబరు మాత్రమే. అసలు వయసు ఒక సమస్యేకాదు అని చాలామంది సీనియర్ సిటిజన్స్ నిరూపిస్తున్నారు. ఎనిమిది పదుల వయసు దాటినా మాకు మేమే సాటి అంటూ ఈమధ్య కాలంలో చాలామంది దర్శనమిస్తున్నారు. తమ టాలెంట్‌తో ఇంటర్నెట్లో సంచలనంగా మారుతున్నారు. తాజాగా పంజాబ్‌కు చెందిన జ్యూస్ స్టాల్ బామ్మ వార్తల్లో నిలిచారు. అమృత్‌సర్‌లోని 80 ఏళ్ల బామ్మ నడుపుతున్న జ్యూస్ స్టాల్ విశేషంగా నిలిచింది. చకాచకా బత్తాయి రసం తీసి యిస్తూ కస్టమర్లను భలే ఆకట్టుకుంటున్నారు. ముదిమి వయసులో కూడా చాలా కష్టపడుతూ జ్యూస్ బండి ద్వారా జీవనాన్ని సాగిస్తూ పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంతేకాదు యుక్తవయసులో కూడా పనీ పాటా లేకుండా తిరిగే ఆవారా బ్యాచ్‌కు ఈ బామ్మ పెద్ద సవాలే విసురుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేనా తన కష్టార్జితాన్ని నమ్ముకుని గౌరవంగా జీవించాలనుకునేవారికి ఆమె ఒక రోల్ మోడల్ అని అభిప్రాయపడుతున్నారు. ఈ వయసులో ఆమె చాలా కష్టపడుతున్నారు. దయచేసిన ఎవరైనా ఆమెకు సాయం చేయండి అంటూ ఒక ట్విటర్ యూజర్ వీడియోను ట్వీట్ చేశారు. అంతే అది క్షణాల్లో వైరల్ అయింది. ఆమెకు సాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. వీలైతే ఆమెకు ఒక ఎలక్ట్రానిక్ జ్యూసర్ ఇవ్వాలనుకుంటున్నానని ఒకరు ట్వీట్ చేయగా మరికొందరు భిన్నంగా స్పందించారు. పాశ్చాత్య దేశాలలో, సీనియర్లు సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు వీలుగా పెన్షన్లు పొందుతారు. కానీ మన దేశంలో మాత్రం వారికి నరకమే అంటూ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సులభంగా డబ్బు కావాలనుకునే యువత ఈమెను చూసి సిగ్గుపడాలని మరొకరు ట్వీట్ చేశారు. The bibiji in the video below has her juice stall in Amritsar. She is working hard in her old age. Please show some love and support to her. The address of her stall is Rani da bagh Amritsar, Opp SBI Bank, near Uppal Neuro Hospital. Please share with your contacts 🙏 pic.twitter.com/YTpjk4IIWm — A Sidhu (@asidhu_) July 27, 2021 -
సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారతదేశంలోని సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఎఫ్డీ పథకాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ఎఫ్డీ పథకం కింద ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి పెట్టుబడి పెట్టె నగదుపై ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్ల కన్న అధిక వడ్డీని ఆఫర్ చేస్తుంది. ఎస్బీఐ వీకేర్ డిపాజిట్ గా పిలువబడే ఈ కొత్త స్కీమ్ వల్ల వారి ఎఫ్డీ డిపాజిట్లపై అదనంగా 30 బేసిస్ వడ్డీ పాయింట్లు లభిస్తాయి. ప్రస్తుతం, ఎస్బీఐ అన్ని కాలవ్యవధుల టర్మ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్ల ను అందిస్తుంది. వీకేర్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టడంతో వారు ఇప్పుడు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టె టర్మ్ డిపాజిట్లపై 80 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీని పొందవచ్చు. సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ వీకేర్ ప్రత్యేక ఎఫ్డీ స్కీమ్ ఇప్పుడు సెప్టెంబర్ 30, 2021 వరకు అందుబాటులో ఉంటుంది. ఎస్బీఐ వీకేర్ డిపాజిట్ ఎఫ్డీ స్కీమ్ వివరాలు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు అర్హులు. ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి ఇందులో ఎఫ్డీ చేయాలి. బ్యాంకు గరిష్ట డిపాజిట్ రూ.2 కోట్లు ప్రత్యేక ఎఫ్డీ పథకాన్ని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. ఈ డిపాజిట్లపై బ్యాంకు సీనియర్ సిటిజన్లకు 80 బేసిస్ పాయింట్ల అధిక వడ్డీ రేట్లను అందిస్తోంది. ఒక సీనియర్ సిటిజన్ ప్రత్యేక ఎఫ్డీ స్కీమ్ కింద డబ్బును ఎఫ్డీ చేస్తే వర్తించే వడ్డీ రేటు 6.2 శాతం గడువు కన్న ముందు నగదు విత్ డ్రా చేస్తే అదనపు 30 బిపీఎస్ ప్రీమియం వర్తించదు. బ్యాంకు 0.5 శాతం జరిమానా విధించవచ్చు. -
బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్...!
న్యూఢిల్లీ: ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజ సంస్థలు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు పలు బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్(ఎస్సీఎస్ఎస్) పథకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. సీనియర్ సిటిజన్లకు నిర్ణీత కాల డిపాజిట్లపై అధికంగా వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) పథకంతో అధిక వడ్డీ రేట్లనే కాకుండా, వీటిపై అదనపు ప్రయోజనాలు కూడా రానున్నాయి. ఇటీవలకాలంలో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో చాలా మంది ఖాతాదారులు ఫిక్స్డ్ డిపాజిట్లను చేయడం లేదు. తిరిగి ఖాతాదారులను ఆకర్షించడానికి ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు వర్తించే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డి) పై ఉన్న రేట్లపై అదనపు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ పథకాన్ని 2021 సెప్టెంబర్ 30 వరకు పెంచుతూ బ్యాంకులు ఉత్తర్వులు జారీ చేశాయి. ఎస్బీఐ స్పెషల్ ఎఫ్డీ స్కీం ఫర్ సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ ప్రత్యేక ఎఫ్డీ పథకంతో సాధారణ ఖాతాదారులకు లభించే రేటు కంటే 80 బేసిస్ పాయింట్ల అధికంగా అందిస్తుంది. ప్రస్తుతం ఎస్బీఐ సాధారణ ఖాతాదారులకు ఐదేళ్ల ఎఫ్డీపై 5.4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ప్రత్యేక ఎఫ్డి పథకం కింద సీనియర్ సిటిజన్లకు 6.20 శాతం వడ్డీ రేట్లను ఇవ్వనుంది. రిటైల్ టర్మ్ డిపాజిట్ విభాగంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఎస్బీఐ ప్రవేశపెట్టిన ‘ఎస్బీఐ వీకేర్‘ లో భాగంగా 30 బిపిఎస్ అదనపు ప్రీమియం పాయింట్లను వారి రిటైల్ టిడి కోసం చెల్లించబడుతుంది. అందుకోసం ఆయా బ్యాంకుల్లో ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఖాతాదారునిగా ఉండాలి. ఎస్బీఐ వీ కేర్ పథకాన్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్పెషల్ ఎఫ్డీ స్కీం ఫర్ సీనియర్ సిటిజన్స్ ఐదు సంవత్సరాల వ్యవధితో 5 కోట్ల కన్నా తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ కలిగి ఉన్న సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.25% అదనపు ప్రీమియం అందించనుంది. ఈ ప్రత్యేక డిపాజిట్ ఆఫర్ 2021 సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని బ్యాంక్ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఈ స్పెషల్ డిపాజిట్లపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 75 బిపిఎస్ పాయింట్లను కూడా ఇవ్వనుంది. ప్రత్యేక ఎఫ్డి పథకం కింద సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషల్ ఎఫ్డీ స్కీం ఫర్ సీనియర్ సిటిజన్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ సిటిజన్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 100 కంటే ఎక్కువ బిపిఎస్ పాయింట్లను ఇస్తోంది. ఈ పథకంలో డిపాజిట్ చేస్తే 6.25 వడ్డీ రేటు లభిస్తోంది. చదవండి: బ్యాంకులకు కీలక సూచనలు చేసిన ఎస్బీఐ డిప్యూటీ ఎండీ -
కరోనాను జయించిన 103 ఏళ్ల వృద్ధుడు..
భోపాల్: దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఈ మహమ్మారి పేరేత్తగానే ప్రతిఒక్కరూ భయంతో వణికిపోతున్నారు. కానీ ఒక శతాధిక వృద్ధుడు కరోనాను జయించి అందరికి ఆదర్శంగా నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే.. మధ్య ప్రదేశ్‌లోని బెతుల్‌కి చెందిన 103 ఏళ్ల బిర్దిచంద్ అనే వృద్ధుడు ఈనెల 5న కరోనా బారిన పడ్డాడు. కోవిడ్ లక్షణాలున్నప్పటికి బిర్దిచంద్ ఏమాత్రం భయపడలేదు. ప్రతిరోజు బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పాజిటీవిటిగా ఉండటం వల్ల ఆయన వైరస్‌ను జయించాడని బిర్దిచంద్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్బంగా, చంద్ మాట్లాడుతూ.. ‘నేను అప్పట్లో.. స్వాతంత్రోద్యమంలో ఆంగ్లేయులతో పోరాడి విజయం సాధించినట్లే... ఇప్పుడు, కరోనాపై పోరాడి విజయం సాధించానని’ పేర్కొన్నాడు. అయితే, చింద్వారాకు చెందిన ఒక డాక్టర్ సలహా మేరకు మాత్రం కొన్ని మందులు వాడినట్లు చంద్ తెలిపాడు. కాగా ఆధార్ కార్డు ప్రకారం ఈయన 1917 నవంబరు 2 న జన్మించాడు. చదవండి: వామ్మో.. పొరుగు దేశంలో కొత్త రకం కరోనా -
వారికి మీరే ప్రేరణ, థ్యాంక్స్ : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హోరాహోరీగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల పోరులో పేలవమైన పోలింగ్ శాతం నిరాశపరుస్తున్న తరుణంలో పెద్దవాళ్లు శ్రమకోర్చి మరీ ఓటు వేస్తున్న సంఘటనలు ఆసక్తికరంగా మారాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌పై నగర వాసుల ఆసక్తి అంతంత మాత్రంగానే ఉండగా వికలాంగులు, వయోవృద్ధులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా 80 ఏళ్ల సీనియర్ సిటిజన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు పద్మశ్రీ ట్విటర్లో వెల్లడించారు. తన అమ్మమ్మకు టీఆర్ఎస్కు ఓటు వేసేందుకు లాక్డౌన్ తరువాత తొలిసారి గడప దాటి బయటకు వచ్చిందని పేర్కొన్నారు. ఇందుకు తనకు చాలా సంతోషంగా ఉందంటూ దీన్ని మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేయగా, ఆయన స్పందించారు. అమ్మమ్మకు చాలా థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చారు. ఫిర్యాదులు తప్ప బయటకు వచ్చి ఓటు వేయడానికి ప్రయత్నించని వారందరికీ ఆమె స్ఫూర్తిదాయకమని ట్వీట్ చేశారు. కరోనాకారణంగా గత 3 నెలలుగా కదల్లేకుండా ఉన్నప్పటికీ, రవీందర్ (చీఫ్ ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్) అమీర్‌పేట పోలింగ్ కేంద్రానికి వీల్ చైర్లో వచ్చి మరీ ఓటు వేశారు. మరో సంఘటనలో తన తండ్రి, హృద్రోగి. నడవలేని స్థితిలో టీఆర్ఎస్కు ఓటు వేశారంటూ మరొకరు ట్వీట్ చేశారు. మీపనితనాన్ని చూసిన మా అత్తగారు తన జీవితంలో తొలిసారి ఓటువేశారంటూ ఇంకొకరు ట్వీట్ చేయడం విశేషం. అటు భార్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతోంది. ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు బోసి పోయి కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధికారిక లెక్కలప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ శాతం 18.20 శాతం మాత్రమే. మరోవైపు గ్రేటర్ మేయర్ పీఠంపై కన్నేసిన టీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. దొంగ ఓట్లు వేస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అధికార టీఆర్ఎస్ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో పలుచోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. అటు గుర్తులు తారుమారుకావడంతో ఓల్డ్ మలక్‌పేటలో పోలింగ్ రద్దయింది. ఓల్డ్ మలక్‌పేట 69వ డివిజన్లో డిసెంబరు 3న రీపోలింగ్ నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించింది. Many thanks to your Ammama🙏 She is an inspiration to all those who only complain but do not make the effort to come out and vote https://t.co/bA10KQGKzn — KTR (@KTRTRS) December 1, 2020 Senior Actor #KotaSrinivasaRao along with his wife casted vote at FNCC.#GHMCElections2020 #GHMC2020 pic.twitter.com/5OHe1Ev2fE — BARaju (@baraju_SuperHit) December 1, 2020 🙏 https://t.co/Gf3AQ0oq0i — KTR (@KTRTRS) December 1, 2020 -
సీనియర్ సిటీజన్లను కాపాడిన పోలీసులు
-
కరోనా హగ్ టైం : వైరల్ వీడియో
సాక్షి, ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర మరోసారి ఆసక్తికరమైన విషయాన్ని ట్విటర్ లో షేర్చేశారు. కరోనా వైరస్ కోరల్లో చిక్కి ప్రపంచమంతా ఇంకా అల్లాడుతూనే ఉంది. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు, ఊరటలు లభించినప్పటికీ, మనుషులంతా భౌతిక దూరాన్ని పాటిస్తూ..కనీస సామాజిక సంబంధాలకు దూరంగా బతకాల్సిన పరిస్థితి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, ఈ మహమ్మారి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పెద్ద వాళ్ల ఆలింగనాలకు, ఆప్యాయతకు చిన్నారులు, చిన్నారులు, సన్నిహితులు స్పర్శకు పెద్దవాళ్లు నోచుకోలేకపోతున్నారు. అయితే ఇలాంటి అనుభవాన్ని మిస్ కాకుండా కనిపెట్టిన ఒక విలక్షణమైన పరికరానికి సంబంధించిన ఒక వీడియోను ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. (మనమే మాయం చేశాం..సిగ్గుతో తలదించుకోవాలి!) ఈ పరికరాన్ని సృష్టించడానికి నోబెల్ బహుమతి విజేత కానవసరంలేదు.. కానీ ఆప్తుల ఆలింగనాన్ని కోల్పోయిన వృద్ధుల జీవితాలను ఈ ఆవిష్కరణ మార్చేసింది.... మనం ఎంతో ఎదురు చూస్తున్న వైరస్ టీకా అంత ముఖ్యమైనది ఇది కూడా అని ఆయన ట్వీట్ చేశారు. (కరోనా: వారికి ఎం అండ్ ఎం బంపర్ ఆఫర్లు) -
40 ఏళ్లుగా వెతికా 63 వచ్చాయి ఇక మీరే వెతికి పెట్టాలి
బెంగళూరు: మనమలు, మనవరాళ్ళకు పెళ్లి సంబంధాలను చూడాల్సిన వయసులో ఓ వృద్ధుడు తనకు తోడు కోసం అధికారులకు అభ్యర్థన పెట్టుకున్నాడు. ఒంటరి జీవితం దుర్భరంగా ఉంది. జీవిత భాగస్వామి లేక లైఫ్ బోరింగ్లా ఉంది. వధువు కోసం వెతుకులాటలోనే 40 ఏళ్లు గడిచిపోయాయి. 63 ఏళ్లు వచ్చాయి. ఇక మిగిలింది వృద్ధాప్యమే కాబట్టి కృష్ణా, రామా అంటూ గడిపెయ్యాలి. కానీ.. ఈ వయసులో తోడు కావాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పంచాయతీ ఆఫీసుకు తనకు వధువు కావాలని దరఖాస్తు పెట్టుకున్నాడు. ఆ దరఖాస్తు చూసి ఆశ్చర్యపోవడం వారి వంతైయ్యింది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లాలోని నరేగల్ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ధ్యామన్న కమ్మర్ అనే వ్యక్తి ఓ మందిరంలో పూజారిగా పని చేస్తున్నాడు. ఆయనకు చాలా కాలంగా పెళ్లి కావడం లేదు. 40 ఏళ్లుగా అమ్మాయి కోసం పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నాడు. దీంతో విసుగు చెందిన ఆ ముసలాయన పంచాయతీ అధికారులకు ఓ దరఖాస్తు పెట్టుకున్నాడు. అందులో నా బాగోగులు చూడడానికి ఎవరూ లేరు. అందువల్ల నా సొంత కులానికి చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి సరైన అమ్మాయిని వెతికి పెట్టండి అంటూ దరఖాస్తు చేసుకున్నాడు. అధ్యక్షుడు, పంచాయతీ అభివృద్ధి అధికారి ధ్యామన్న దరఖాస్తును స్వీకరించి రసీదు ఇచ్చారు. కొంతమంది గ్రామ పంచాయతీ సభ్యులు కూడా ధ్యామన్న దరఖాస్తుపై సంతకం చేసి మద్దతు ఇవ్వడం గమనార్హం. -
కన్నతల్లిని కంటికి రెప్పలా చూడాలి
సాక్షి, మచిలీపట్నం : కన్న తల్లి యోగక్షేమాలను జీవితాంతం కన్న బిడ్డలే చూడాలని ఆదేశిస్తూ సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. పేగు తెంచుకు పుట్టిన బిడ్డలే తన్ని తరిమేయడంతో తనకు న్యాయం చేయాలంటూ ఓ వృద్ధురాలు స్పందనలో ఇచ్చిన అర్జీ ఆధారంగా ట్రిబ్యునల్ విచారించింది. ప్రతీ నెలా పోషణ ఖర్చులు ఇస్తూ జీవితాంతం ఆమెను కంటికి రెప్పలా చూసుకోవాలని తీర్పు నిచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన కొండపల్లి ఖైరున్నీసా(92)కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. ఉయ్యూరు పంచాయతీ వార్డు సభ్యురాలిగా పనిచేసిన ఖైరున్నీసాకు తన భర్త ద్వారా సంక్రమించిన ఆస్తులను కుమారులు తమ పేరిట రాయించుకుని ఇంటి నుంచి తన్ని తరిమివేశారు. ఆమె తనకు న్యాయం చేయాలంటూ గత నెల 9వ తేదీన ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్ ఇంతియాజ్‌ను కలిసి మొర పెట్టుకుంది. అదే రోజు ఆమె మనో వేదనకు అక్షరరూపమిస్తూ ‘‘కన్నబిడ్డలే కాదు పొమ్మన్నారు’’ అనే శీర్షికన ‘సాక్షి’ మెయిన్ ఎడిషన్‌లో ప్రచురించిన కథనం జిల్లా యంత్రాంగాన్ని కదిలించింది. కలెక్టర్ ఈ కేసును సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్‌కు అప్పగించారు. ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్డ్కర్ ఖైరున్నీసా కుమారులైన మొహమ్మద్ యాకుబ్, అబ్దుల్ కలాం, సనావులకు నోటీసులు జారీ చేసి విచారించారు. ఇక నుంచి తల్లిని బాగా చూసుకుంటామని కుమారులు ముందుకొచ్చినా వారి వద్ద ఉండేందుకు ఖైరున్నీసా ఇష్టపడలేదు. దీంతో ఓ అటెండర్ సహాయంతో విడిగా ఉండేందుకు ఏర్పాట్లు చేయాలని కుమారులను ట్రిబ్యునల్ ఆదేశించింది. ఆమె పోషణ నిమిత్తం ప్రతి నెలా సంతానం నలుగురూ రెండేసి వేలు చొప్పున ఆమె బ్యాంకు ఖాతాలో వేయాలని, అలాగే క్రమం తప్పకుండా ఆమె బాగోగులు చూస్తుండాలని ఈ నెల 1వ తేదీన ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన స్పందన కార్యక్రమానికి, తన మనోవేదనను అర్థం చేసుకున్న ‘సాక్షి’ పేపర్‌కు తాను జీవితాంతం రుణపడి ఉంటానని ఈ సందర్భంగా ఖైరున్నీసా అన్నారు. -
అనంతపురం: అసౌకర్యాలు.. అవస్థలు
సాక్షి, అనంతపురం న్యూసిటీ: నగరంలోని వివిధ పోలింగ్ బూత్‌లలో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. కనీసం తాగునీరు ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రజలు మండుటెండలో ఓటర్లు నరకం చూశారు. ఇక వృద్ధులు, ప్రమాదాలు జరిగి ఇబ్బందులు పడుతున్నవారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. 27వ డివిజన్ భాష్యం స్కూల్ 150, 151, 152వ బూత్‌లలో ర్యాంప్, మెట్లు పెద్దగా ఉండడంతో వృద్ధులు, మహిళలు, కాలు, చేయి విరిగిన వారు అవస్థలు పడ్డారు. 33వ డివిజన్ శ్రీకృష్ణదేవరాయ నగరపాలక ఉన్నత పాఠశాలలో వీల్‌చైర్ సదుపాయం లేకపోవడంతో దివ్యాంగురాలు నాగేంద్రమ్మను తమ్ముడు రమేష్ ఎత్తుకుని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటేయించాడు. 24వ డివిజన్ బుడ్డప్పనగర్ 230, 231, 232, 233 బూత్‌లలో వృద్ధులు, వికలాంగులు ఓటేసేందుకు ఇబ్బందులు పడ్డారు. అదే బూత్‌లలో నీరు లేకపోవడంతో మహిళలు వాటర్ ప్యాకెట్ల కోసం ఎగబడ్డారు. అరవిందనగర్ పోలింగ్ బూత్ 130, లా కళాశాల పోలింగ్ బూత్ 243, 244, 245, 246 బూత్‌లలో తాగునీరు, షామియాన ఏర్పాటు చేయకపోవడంతో ఓటర్లు ఎండలోనే ఇబ్బంది పడ్డారు. బుడ్డప్పనగర్ 236 బూత్‌లో ఓ బాలింత ఎండలో నిల్చోలేక కన్నీటి పర్యంతమైంది. అదే డివిజన్లో బారికేడ్లు సరిగా ఏర్పాటు చేయకపోవడంతో అవి కిందకు పడిపోయాయి. 242 బూత్లోనూ అదే పరిస్థితి. అగ్రికల్చర్ జేడీ ఆఫీస్ బూత్ నెంబర్ 242లో రెండు గంటల పాటు ఈవీఎంలు మొరాయించాయి. కేఎస్ఆర్ కళాశాల బూత్‌నెంబర్ 123లో ఈవీఎం మొరాయించడంతో గంటన్నర ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. బూత్ నెంబర్ 230లో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. బుడ్డప్పనగర్ పోలింగ్ బూత్ 236లో తన ఓటు లేదని గుప్తా అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు స్లిప్పు కోసం వెళితే మరో అడ్రస్ మార్చి తికమక చేశారన్నారు. శ్రీకృష్ణదేవరాయ స్కూల్లో జాన్ అనే వృద్ధుడు తన ఓటు గల్లంతైందని ఆవేదన వ్యక్తం చేశాడు. ► తలమర్లలో అర్ధరాత్రి వరకూ పోలింగ్ పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం తలమర్లలోని రెండో నంబర్ బూత్‌లో ఈవీఎం పలు దఫాలుగా మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో పరిస్థితి అదుపుతప్పింది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అక్కడకు చేరుకుని అధికారులతో చర్చించారు. రీపోలింగ్ జరపాలని జిల్లా ఎన్నికల అధికారి జి.వీరపాండియన్‌తో పాటు స్థానిక ప్రిసెడింగ్ అధికారిని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన అధికారులు.. కొత్త ఈవీఎంలు సమకూర్చి రాత్రి 8 గంటలకు పోలింగ్ ప్రారంభించారు. అర్ధరాత్రి వరకూ ఓటర్లు పోలింగ్ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►బాలయ్యకు చుక్కెదురు తనకు ఎదురు వచ్చిన వారిపై విచ్చణారహితంగా దాడి చేసే హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యను అదే నియోజకవర్గం గోళాపురం వాసులు బెంబేలెత్తించారు. వివరాల్లోకి వెళితే.. పోలింగ్ సరళిని పరిశీలిస్తూ.. గురువారం గోళాపురం గ్రామానికి వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ సతీమణి సవిత మాధవ్ చేరుకున్నారు. ఆమెకు గ్రామస్తులు ఘన స్వాగతం పలుకుతూ జై జగన్ అనే నినాదాలతో హోరెత్తించారు. కొద్ది సేపటికి బాలకృష్ణ కూడా అక్కడికి చేరుకున్నారు. పోలింగ్ బూత్‌ను పరిశీలించి బాలయ్య బయటకు రాగానే ఒక్కసారిగా గోళాపురం వాసులు జై జగన్ అంటూ ఆయనను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేశారు. వారి మధ్యలో నుంచి బాలయ్యను బయటకు తీసుకువచ్చేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అతి కష్టంపై బాలయ్య తన వాహనాన్ని ఎక్కి డోర్ వేసుకునే లోపు పలువురు వాహనంపైకి ఎక్కి బాలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, కిందకు దిగగానే.. అప్పటికే అవమాన భారంతో మండిపడుతున్న బాలయ్య.. ఒక్కసారిగా వాహనాన్ని ముందుకు దూకించారు. వాహనం వేగానికి దుమ్ము ఎగిసిపడి కొద్ది సేపటి వరకూ రహదారి కనిపించకుండా పోయింది. -
సీనియర్ సిటిజన్స్‌కు నోటీసులు
సాక్షి, పాకాల : ఎన్నికల హడావుడి మొదలుకావడంతో పోలీసులు వైఎస్సార్సీపీ సానుభూతి పరులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా గొడవలతో సంబంధం లేని విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులకు నోటీసులు ఇస్తున్నారు. పోలీసు స్టేషన్‌కు రావాలని చెబుతుండడంతో వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. శాంతికి భంగం కలిగించకుండా ఉండాలని, ముందస్తుగా రూ.2 లక్షలకు ప్రామిసరీ నోటు రాసివ్వాలని పోలీసులు చెబుతున్నారని, ఇలా ఎప్పుడూ లేదని వారు పేర్కొంటున్నారు. ఈ విషయంపై ఎస్ఐ సునీల్‌కుమార్‌ని వివరణ కోరగా శాంతిభద్రతల దృష్ట్యా అన్ని పార్టీల వారికి నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. -
జనచైతన్యం కోసం ఓ అశోకుడి అలుపెరుగని కృషి!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైరైన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? హాయిగా కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్లతో హాయిగా కాలం వెళ్లదీస్తూ.. జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటారు. కానీ 68 ఏళ్ల అశోక్‌కుమార్ మునికుంట్ల అలా ఆలోచించలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ (సీజీడీఏ)లో ఉద్యోగిగా పనిచేసి 2010లో పదవీ విరమణ పొందిన ఆయన.. హాయిగా ఇంట్లో కూచొని కాలక్షేపం చేస్తే సరిపోతుందనుకోలేదు. సమాజానికి తనవంతు సేవ చేయాలని తపించారు. సీనియర్ సిటిజెన్ అయినప్పటికీ.. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. నగరంలో ఎక్కడ తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలు జరిగినా.. అక్కడ కెమెరాతో వాలిపోయేవారు. ఉద్యమ ఘట్టాలను తన కెమెరాలో బంధించి.. సోషల్ మీడియాలో పంచుకునేవారు. తెలంగాణ ఉద్యమంలో ఒక కార్యకర్తగా, ఒక ఉద్యమకారుడిగా చురుగ్గా పాల్గొన్న అశోక్.. రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ప్రజల ఆకాంక్షల సాకారం దిశగా దృష్టి సారించారు. తెలంగాణలో 50శాతానికిపైగా బడుగు, బహుజన వర్గాల ప్రజలు ఉన్నారు. అయినా, వారికి రాజకీయ అధికారం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. జనాభాలో అతి తక్కువగా ఉన్న కొన్ని వర్గాల వారే రాజకీయాధికారాన్ని అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలకు ప్రభుత్వంలో, రాజకీయాల్లో తగిన ప్రాధాన్యం లేకపోవడంతో ఆయనను ఆలోచింపజేసింది. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఆయనే సొంతంగా ఒక రాజకీయ పార్టీ స్థాపించారు. బహుజన రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరిట పార్టీని నెలకొల్పి.. ప్రస్తుత ఎన్నికల్లో 10మంది అభ్యర్థులను బరిలో నిలిపారు. బహుజన రాజకీయ స్పృహను మరింత పెంచేందుకు, బీసీలు, ఎంబీసీలు, ఎస్సీ, ఎస్టీల్లో మరింత చైతన్యం తీసుకొచ్చేందుకు తాను పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పే అశోక్‌కుమార్ మునికుంట్ల స్వయంగా సనత్‌నగర్ నియోజకవర్గంలో పోటీకి దిగారు. ప్రస్తుతం ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్న ఆయన.. ప్రస్తుత ఎన్నికల్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు టికెట్ ఇవ్వడంలో తీవ్ర అన్యాయం చేశాయని, జనాభా దామాషా ప్రకారం బహుజన వర్గాల వారికి ప్రాధాన్యం ఇవ్వకుండా వివక్షకు గురి చేశాయని అంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంలో మమేకమైనప్పుడే వారి సమస్యల పరిష్కారం సులువు అవుతుందని, అమరులు ఆకాంక్షించిన నిజమైన తెలంగాణ సాకారమవుతుందని తెలిపారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న వారిలో ఇద్దరు బీసీ, ఒకరు ఎస్సీ, ఒకరు క్రిష్టియన్, ఐదుగురు ఎంబీసీలు ఉన్నారు. బహుజన రాష్ట్ర సమతి (బీఆర్ఎస్) పార్టీని ఎన్నికల సంఘం గుర్తించి.. పడవ గుర్తును కేటాయించింది. -
పాన్ మసాలా ఇవ్వలేదని కొట్టిచంపారు..
లక్నో: దేశవ్యాప్తంగా మూక దాడులు కొనసాగుతున్నాయి. పాన్ మసాలా ఇచ్చేందుకు నిరాకరించిన 60 ఏళ్ల సీనియర్ సిటిజన్‌పై స్ధానికులు మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. అప్పుపై పాన్ మసాలా ఇవ్వలేదనే కోపంతో వారు వృద్ధుడిని కొట్టి చంపారు. యూపీలోని హర్దోయ్ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. మూక దాడిలో బాధితుడు ఘటనా ప్రదేశంలోనే మరణించాడని, నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని డీఎస్పీ శైలేంద్ర సింగ్ తెలిపారు. మరోవైపు దేశరాజధాని ఢిల్లీలో జనసమ్మర్ధ కన్నాట్‌ప్లేస్‌లో సిగరెట్లు ఇవ్వలేదని ఇద్దరు యువకులపై అల్లరి మూకలు దాడికి తెగబడ్డాయి. మూక దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరో వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
దారుణం : డాక్టర్‌పై ఓ సీనియర్ సిటిజన్..
సాక్షి, ముంబై : గోరేగావ్‌లో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్‌పై ఓ సీనియర్ సిటిజన్ లైంగిక దాడికి యత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కాపాడారు. అయితే, నిందితున్ని పట్టుకొని పోలీసులకు అప్పగించేలోపే ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగింది. ఈ ఘటన పోష్ ప్రాతంలో ఆదివారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పోష్ హౌసింగ్ సొసైటీలోని అపార్ట్మెంట్లో ఓ డాక్టర్ (33), తన తల్లితో కలిసి నివసిస్తున్నారు. పక్కింట్లో ఉంటున్న వృద్ధుడు (61) ఆమెను చెరబట్టాలనుకున్నాడు. ఏదో సాకుతో ఆమెను తరచూ ఫాలో అయ్యేవాడు. అయితే సదరు డాక్టర్ అవేవీ పెద్దగా పట్టించుకోలేదు. పెద్దాయన ప్రవర్తనను అంచనా వేయలేక పోయింది. అతనిలో దాగున్న దురాలోచన కనిపెట్టలేకపోయింది. ఆదివారం ఉదయం ఆమె ఇంట్లో ఒంటరి ఉండడం చూసిన వృద్ధుడు లోనికి చొరబడి లైంగిక దాడికి యత్నించాడు. దాడిని ప్రతిఘటించడంతో సుత్తితో ఆమె తల, కాలిపై మోది గాయపరిచాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వచ్చి కాపాడారని పోలీసులు తెలిపారు. స్థానికులు బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకునేలోపే మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. -
ఈ ఫోన్ ధర రూ. 4వేలు : స్పెషల్ ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్లకోసం ఒక సులభతరమైన ఒక మొబైల్‌ను విడుదల చేసిందో కంపెనీ. సీనియర్ వరల్డ్ అనే కంపనీ ‘ఈజీ ఫోన్ గ్రాండ్’ పేరుతో ఒక ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదీ బడ్జెట్ ధరలోనే. తద్వారా ఫీచర్ ఫోన్లన్నీ కేవలం యూత్‌కోసమే కాదు...సీనియర్ సిటిజన్లకోసం కూడా అన్న సందేశాన్నిస్తోంది. వారు సౌలభ్యంగా వినియోగించుకునేందుకు వీలుగా చాలా ‘ఈజీ’గా రూపొందించామని కంపెనీ చెప్పింది. భారత దేశంలో ఈ తరహా ఫోన్ లాంచ్ చేయడం ఇదే మొదటిసారని కంపెనీ చెబుతోంది. వినికిడి సమస్య ఉన్న వారు, హియరింగ్ సాధనాలు పెట్టుకోవడానికి ఇష్టపడని వారికి తమ ఫోన్ మంచి పరిష్కారమంటోంది. స్పెషల్ టెక్నాలజీ, స్పెషల్ ఇయర్‌ఫోన్స్ ఈ డివైస్ ప్రత్యేకత అని కంపెనీ పేర్కొంది. సరసమైన దరలో కేవలం రూ. 3,990కే ఈ ఈజీఫోన్‌ను కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సీనియర్లకు అవసరమయ్యే అన్ని రకాల ఫీచర్లతో ఈ ఫోన్ రూపొందించామని చెప్పింది. పెద్ద స్క్రీన్ , పెద్ద ఫాంట్ సైజ్, డయలింగ్ కీలు కూడా పెద్దవిగా, ఫోటో డయిల్, క్రాడిల్ చార్జర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయని కంపెనీ తెలిపింది. సీనియర్ వరల్డ్.కామ్, అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్, ఈబే ఇండియా లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. నాలుగు ఆటోమేటెడ్ పనులను నిర్వహించేలా ఎస్ఓఎస్ బటన్‌తో పాటు ఇంకా ఐదు ఎమర్జెన్సీ కాంటాక్టులు, వాటికి కాల్స్, ఎస్ఎంఎస్ చేసుకునే సౌలభ్యం, ఇన్ కామింగ్ కాల్స్ లిస్ట్, కస్టమైసెబుల్ మెనూ ఫీచర్లను ఆటోమేటెడ్‌గా ఈ ఫోన్లో పొందుపరిచామని పేర్కొంది. సీనియర్ సిటిజనుల ప్రత్యేక అవసరాలకు, కచ్చితంగా ఈ ఫోను ఉపయోగపడుతుందనే విశ్వాసాన్ని కంపెనీ సీఈవో రాహుల్ గుప్తా వ్యక్తం చేశారు. -
నేను చనిపోతా.. పర్మిషన్ ఇవ్వండి
లక్ష్మీపురం (గుంటూరు): ‘వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కుమారుడు పట్టించుకోవడం లేదు.. మరోవైపు ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి దగ్గర నుంచి నా ద్వారా రూ.25 లక్షలు తీసుకుని తోటి ఉద్యోగి మోసం చేశాడు. డబ్బులిచ్చిన వారు నాపై ఒత్తిడి చేస్తున్నారు. ఇక నాకు చావే శరణ్యం. కారుణ్య మరణానికి అనుమతివ్వండి’ అని పురావస్తు శాఖ విశ్రాంత ఉద్యోగి పి.రామచంద్రరావు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ సీహెచ్ విజయరావుకు విజ్ఞప్తి చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన ఎస్పీని కలిసి వినతిపత్రం అందించారు. రామచంద్రరావు గుంటూరు శ్రీనగర్ కాలనీలో నివసిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అనారోగ్య కారణంగా రామచంద్రరావు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) చేసి పెద్ద కుమారుడు పి.సురేష్ కుమార్‌కు అదే శాఖలో ఉద్యోగం ఇప్పించారు. కాగా, తనతో పాటు అదే శాఖలో గోల్కొండలో ఏడేళ్లపాటు అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తించిన మల్లెల శివకుమార్.. ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి తన ద్వారా రూ.25 లక్షలు తీసుకుని మోసం చేశాడని రామచంద్రరావు ఆరోపించాడు. డబ్బు చెల్లించిన వారు నిత్యం వేధింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుమారుడికి ఉద్యోగం కోసం రూ.6 లక్షలు అప్పు చేశానని, ఆ డబ్బును తన కుమారుడు ఇవ్వడం లేదని వాపోయాడు. ఈ పరిస్థితుల్లో తనకు చావే శరణ్యమని.. కారుణ్య మరణానికి అనుమతివ్వాలని ఎస్పీ ఎదుట కన్నీటిపర్యంతమయ్యాడు. డబ్బు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించలేదని రామచంద్రరావుపై నమోదైన కేసుపై ఎస్పీ ఆరా తీశారు. కేసును క్షుణ్నంగా దర్యాప్తు చేయాలని, రామచంద్రరావుకు ఇబ్బందులు కలగకుండా చూడాలని డీఎస్పీని ఆదేశించారు. -
సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్‌పాస్‌లు
టీ.నగర్: సీనియర్ సిటిజన్లకు బుధవారం నుంచి మూడు నెలల పాటు ఉచిత బస్ పాసు, టోకెన్లు అందించే సౌకర్యం కల్పిస్తూ నగర రవాణా సంస్థ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. చెన్నైలో నివశిస్తున్న సీనియర్ సిటిజన్లు నగర రవాణా సంస్థ బస్సుల్లో ప్రయాణించేందుకు ఉచిత బస్ పాసులు, టోకెన్లు కొత్తగా తీసుకునే వారికి మాత్రం ఆయా డిపోల్లో అన్ని పనిదినాల్లో అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కొత్తగా వీటికోసం దరఖాస్తు చేసుకునేవారికి బుధవారం నుంచి ఉచిత బస్ పాసులు, టోకెన్లు లభిస్తాయని తెలిపారు. బ్రాడ్వే, సెంట్రల్ రైల్వే స్టేషన్, గిండి ఎస్టేట్, కేకే.నగర్, మందవెలి, వేలచ్చేరి, సైదాపేట సహా 42 కేంద్రాలు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు. -
అంబటి రాయుడి రౌడీయిజం
హైదరాబాద్: భారత క్రికెటర్ అంబటి రాయుడు హబ్సిగూడలో హల్ చల్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్‌ను ప్రశ్నించిన ఓ సినీయర్ సిటీజన్‌పై ఏకంగా చేయిచేసుకొన్నారు. దీన్ని ఫోన్లో చిత్రికరించిన ఓ సిటీజన్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడిది వైరల్ అయింది. సికింద్రాబాద్ హబ్సిగూడలోని జెన్పాక్ట్ కాలనీలో ఉంటున్న రాయుడు గురువారం ఉదయం కారులో వేగంగా వెళ్తున్నారు. అదే సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ సీనియర్ సిటీజన్ను తాకుతూ అతని కారు వెళ్లింది. దీంతో ఆ వ్యక్తి నెమ్మదిగా వెళ్లాలని అరిచాడు. దీనికి కోపం తెచ్చుకున్న రాయుడు కారు దిగి ఆయన్ను దుర్భాషలాడటంతోపాటు చేయి చేసుకున్నారు. అతని తీరు చూసిన స్థానికులు నివ్వెరపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సీనియర్ సిటిజన్స్ ఫోరం ప్రతినిధులు తెలిపారు. ఇక రాయుడు భారత్ తరుపున 34 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు, 6 టీ20 మ్యాచ్‌లు ఆడారు. ఇక ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టు తరుపున ఆడుతూ గర్తింపు పొందారు. . -
అంబటి రాయుడి రౌడీయిజం
-
పోలీసులా.. మజాకా...!
– 74 ఏళ్ల వృద్ధుడిపై గంజాయి కేసు – కోర్టు ప్రశ్నలతో పోలీసుల ఉక్కిరి బిక్కిరి – సమగ్ర విచారణకు ఆదేశం చెన్నై: పోలీసులు తలచుకుంటే తప్పు చేయని వాడి మీద కూడా కేసుల మోతతో ఊచలు లెక్కించేలా చేస్తారన్న నానుడికి అద్దంపట్టే రీతిలో ఇటీవల ఓ వృద్ధుడి మీద కేసు నమోదైంది. 74 ఏళ్ల వృద్ధుడిపై గంజాయి కేసు పెట్టడం కోర్టును సైతం విస్మయంలో పడేసినట్టుంది. కోర్టు ప్రశ్నలతో చెన్నై పోలీసులు ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి. సమగ్ర విచారణకు ఆదేశిస్తూ, ఆ వృద్ధుడికి నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు అయింది. ఆర్కేనగర్ – మణలి రోడ్డులో ఉన్న ఎలిల్ నగర్‌కు చెందిన వేదక్కన్ నాడార్ (74)పై గత నెల పోలీసులు ఓ కేసు పెట్టారు. రెండు కేజీల వంద గ్రామాలు గంజాయిని తన ఇంటి బీరువాలో దాచి ఉంచిన అభియోగంపై ఆర్కేనగర్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆగమేఘాలపై కోర్టుకు హాజరు పరిచి కటకటాల్లోకి నెట్టారు. కోర్టు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి : పిటిషనర్ తరపున న్యాయవాది ఆర్ రాజన్ హాజరై వాదన వినిపించారు. రూ 1000 కోట్ల విలువచేసే 250 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు సాగాయని, సాగుతున్నాయని, ఇందుకు అడ్డుగా ఉన్న వేదక్కన్ నాడార్‌ను గురిపెట్టి ఈ తప్పుడు కేసు బనాయించారని వాదించారు. పోలీసులు కాలయాపణ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేయడం లేదని బెంచ్ దృష్టికి తెచ్చారు. వాదనల అనంతరం న్యాయమూర్తి సంధించిన ప్రశ్నలకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి. 74 వృద్ధుడి మీద ఈ కేసు నమోదు కావడం బట్టి చూస్తే, తప్పుడు కేసు బనాయించారా..? మరేదైనా కారణాలు ఉన్నాయా..? ఉంటే, సమగ్ర విచారణకు సాగించాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కేసును ప్రత్యేక అధికారి ద్వారా విచారించేందుకు తగ్గ చర్యలు చేపట్టాలని చెన్నై పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చారు. అలాగే, వేదక్కన్ నాడార్కు నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. -
చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించాలి
హైకోర్టు ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్ తిరుపతి లీగల్: వయో వృద్ధులకు రక్షణగా ఉన్న చట్టాలు, హక్కులపై వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉమ్మడి హైకోర్టు ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ చెప్పారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో శనివారం వృద్ధుల హక్కులు, చట్టాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ, చిత్తూరు జిల్లా న్యాయసేవా సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ రమేశ్‌రంగనాథన్ మాట్లాడుతూ... వృద్ధులపై జరిగిన నేరాలకు సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలతో కూడిన ప్రత్యేకమైన రిజిస్టర్‌ను ప్రతి పోలీస్ స్టేషన్లో నిర్వహించాలని సూచించారు. వయోవృద్ధుల సమస్యలపై ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసులు స్పందించాలన్నారు. నిరుపేద వృద్ధుల కోసం ప్రభుత్వాలు దశలవారీగా వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయాలని చట్టం చెబుతోందన్నారు. న్యాయసేవా సంస్థలు, చిత్తూరు జిల్లా విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధులు సంక్షేమ శాఖ సంయుక్తంగా తెలుగులో ముద్రించిన పుస్తకాన్ని జస్టిస్ రమేశ్‌రంగనాథన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ మెంబర్ సెక్రటరీ పి.రాంబాబు, చిత్తూరు జిల్లా జడ్జి సీహెచ్ దుర్గారావు, జిల్లా సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి నరసింహరాజు, రాష్ట్ర వయోవృద్ధుల సమాఖ్య అధ్యక్షుడు పరమేశ్వర్‌రెడ్డి, 13 జిల్లాల న్యాయసేవా సంస్థల కార్యదర్శులు(న్యాయమూర్తులు), న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
నగదు కొరత: మానవత్వం చాటుకున్న ఊరిజనం
పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లో విధించిన పరిమితులకు ఓ సీనియర్ సిటిజన్‌కు తన భార్య అంత్యక్రియలు నిర్వహించడానికి డబ్బులు దొరకని పరిస్థితి నెలకొంది. బ్యాంకు వారు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఊరిజనమే విరాళాల రూపాలుగా నగదు సేకరించి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.... జ్యుయర్ కాజూర్ జార్ఖాండ్‌లోని లాతేహార్ జిల్లా బ్రిష్ రాంపుర్కు చెందిన ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. గురువారం ఉదయం తన భార్య హీరామని కాజూర్ మరణించడంతో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడానికి రూ.10వేల అవసరం పడ్డాయి. తన అకౌంట్లో ఉన్న నగదును విత్‌డ్రా చేసుకోవడానికి మేనల్లుడితో కలిసి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా శాఖకు వెళ్లాడు. అయితే కాజూర్ అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి క్యాషియర్ నిరాకరించారు. మొత్తం పరిస్థితిని వివరించినప్పటికీ, ఆయన రూ.4000 కంటే అధికంగా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కాజూర్కు మరో అవకాశం లేకపోవడంతో ఇచ్చిన నగదుని తీసుకుని ఇంటికొచ్చాడు. బ్యాంకుల్లో జరిగిన పరిస్థితినంతా గ్రామస్తులకు వివరించాడు. కాజూర్ బాధను చూసి చలించిపోయిన స్థానికులు తమకు తోచినంతా సాయంగా అందించి అతని భార్యకు అంత్యక్రియలు నిర్వహించారు. వారి వద్ద నగదు తక్కువున్నప్పటికీ, తన భార్య అంత్యక్రియలకు సాయంగా ముందుకు వచ్చి, కార్యక్రమం నిర్వహించారని, గ్రామస్తులందరికీ తాను రుణపడి ఉంటానని తెలిపాడు. తమ అవసరాలకు కూడా తీసుకోవడానికి పనికి రాని నగదును బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేయడమెందుకని అతను ఆవేదన వ్యక్తంచేశాడు. తనకు నగదు అందిన వెంటనే గ్రామస్తులకు చెల్లిస్తానని మాటిచ్చాడు. కాజూర్, పాలమూ జిల్లాలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్మెంట్ పొందాడు. -
ప్రాణాలు పోతున్నా..కనికరం లేదా?
- పింఛన్ కోసం వృద్ధుల ఆందోళన డోన్ టౌన్ : ‘బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తూ.. ప్రాణాలు పోగొట్టుకుంటున్నా అధికారులకు తమ పట్ల కనికరం లేదా’ అంటూ వృద్ధులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం డోన్ పట్టణంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పింఛన్ కోసం స్థానిక ఎస్బీఐ వద్దకు..వందల మంది వృద్ధులు వచ్చారు. డబ్బులు లేవని బ్యాంకు మేనేజర్ యశోదర కృష్ణారావు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూలో నిలబడ్డామని.. డబ్బులేదనడం ఏం న్యాయమని నిప్పులు చెరిగారు. బ్యాంకు ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎస్ఐ శ్రీనివాసులు సర్దిచెప్పినప్పటికీ వినుకోలేదు. రెండు రోజుల క్రితం సుంకులమ్మ అనే వృద్ధురాలు ఆంధ్రాబ్యాంక్‌కు పింఛన్‌కోసం వచ్చి గుండెపోటుతో మృతి చెందిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. పింఛన్లు ఇచ్చేలోపు ఇంకా ఎంతమంది చావాలి అంటూ నిలదీశారు. బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నంబర్ లింక్ కాకపోవడం, ఇతరత్రా సాంకేతిక కారణాలతో పింఛన్ అందజేయడంలో ఆలస్యం జరుగుతోందని మేనేజర్ యశోదర కృష్ణారావు చెప్పారు. మంగళవారం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి..అందరికీ పింఛన్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో వృద్ధులు ఆందోళన విరమించారు. -
రోడ్డెక్కిన ‘పండుటాకులు’
- గూడూరులో 3 గంటల పాటు రాస్తారోకో - బ్యాంక్‌లో నగదు లేకపోవడంతో వృద్ధుల ఆందోళన గూడూరు: పింఛన్ డబ్బుల కోసం వృద్ధులు.. సోమవారం గూడూరులో రోడ్డెక్కారు. తమకు వెంటనే పింఛన్ అందించాలంటూ మూడు గంటలపాటు రాస్తారోకో చేశారు. సామాజిక భద్రత (ఎన్టీఆర్ భరోసా ) పింఛన్లు..ఈ నెల 1 నుంచి బ్యాంక్‌లలో తీసుకునేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే బ్యాంక్‌లలో తగినంత డబ్బులు లేకపోవడంతో రెండు, మూడు రోజుల నుంచి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పడిగాపులు కాస్తున్నారు. సోమవారం వందలాది మంది పింఛన్‌దారులు స్థానిక ఎస్బీఐకి రావడంతో గందరగోళం ఏర్పడింది. పోలీసులకు అదుపు చేయడం కష్టంగా మారింది. ఇటువంటి పరిస్థితులలో విధులు నిర్వర్తించలేమంటూ సిబ్బంది బ్యాంక్‌ను మూసేసారు. దాదాపు గంట సేపు వేచి చూసినా బ్యాంక్‌ను తెరవకపోవడంతో పింఛన్‌దారులు, ఖాతాదారులు ప్ర«ధాన రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. బ్యాంక్ సిబ్బందికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలిసి.. ఎస్ఐ పీరయ్య సంఘటనా ప్రాంతానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పినా వినలేదు. దీంతో బ్రాంచి మేనేజర్ ప్రదీప్‌కుమార్‌తో ఎస్ఐ చర్చలు జరిపి..నగదు ఇచ్చేందుకు ఒప్పించడంతో ఆందోళనను విరమించారు. అయితే రెగ్యులర్ ఖాతాదారులు తమ ఆందోళనను మరోగంట సేపు కొనసాగించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు సర్దిచెప్నపగా.. ఆందోళన విరమించారు. -
ఆశకుపోయిన వృద్ధుడు.. నిలువునా మోసం
ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఓ వృద్ధుడు నిలువునా మోసపోయాడు. అతి తక్కువ రేటుకే ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తానని చెప్పి ఓ వ్యక్తి అతడిని మోసపుచ్చాడు. ఆయన నుంచి ఓ బ్లాంక్ చెక్కు తీసుకొని సంతకాన్ని ఫోర్జరీ చేసి ఏకంగా రూ.60 వేలు కాజేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆయన చివరకు పోలీసులను ఆశ్రయించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రామచంద్ర ప్రజాపతి (74) అనే పెద్దాయన వద్దకు ఓ వ్యక్తి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్ ఇప్పిస్తానంటూ వచ్చాడు. ప్రస్తుతం అక్కడ నెలకు రూ.2,500 కనెక్షన్ ఇస్తుండగా తాము మాత్రం సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ఆఫర్ ద్వారా రూ.74కు అందిస్తున్నామంటూ నచ్చజెప్పాడు. అది కూడా చెక్ ద్వారా అందిస్తున్నామన్నారు. అతడిని చూసి మంచివాడే అని నమ్మిన ప్రజాపతి రూ.74కు చెక్ రాసిచ్చాడు. అదే సమయంలో మరో ఖాళీ చెక్కును సేల్స్ మెన్ గా వచ్చిన వ్యక్తి తీసుకున్నాడు. ఇది నవంబర్ 4న జరిగింది. ఇటీవల తన పాస్ బుక్ అప్ డేట్ కోసం బ్యాంకుకు వెళ్లినప్పుడు తన ఖాతాలో నుంచి రూ.60,000 చెక్ ద్వారా డ్రా అయినట్లు తెలిసి అవాక్కయ్యాడు. అనంతరం సేల్స్‌మెన్‌కు ఖాళీ చెక్కు ఇచ్చిన విషయం గుర్తొచ్చి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. -
ప్రియాంక ఆ విషయాన్ని రివీల్ చేసేసింది!
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి.. కానీ ఒక్కరూ మాత్రం ఆమెను ఇష్టపడలేదట. ఈ విషయాన్ని ప్రియాంక చోప్రానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. ప్రియాంకను ఇష్టపడని వారెవరో తెలుసా? ఓ సీనియర్ సిటిజన్ అట. ఓసారి చాలా బ్యాంగులు మోస్తూ కనిపించిన ఓ సీనియర్ సిటిజన్‌ను చూసి చలించిపోయిన ప్రియాంక, ఆమెకు సహాయం చేయాలని భావించింది. వెళ్లి వెంటనే తాను సహాయం చేయదలిచినట్టు చెప్పగానే, ఆ మహిళ ప్రియాంకపై మండిపడిందట. ఏమిటి? నాకోసం నేను ఈ సామాన్లు మోయలేనని అనుకుంటున్నావా? అని ప్రియాంక ఆఫర్‌ను తిరస్కరించిందట. ఆ మహిళ అచ్చం తనకు ప్రతిబింబంలా అనిపించిందని, సహాయం అడిగినందుకు మనస్తాపం చెంది, వెంటనే క్షమాపణ చెప్పి వచ్చినట్టు ప్రియాంక ఇంటర్వ్యూలో పేర్కొంది. ప్రస్తుతం ప్రియాంక తన పాపులర్ టెలివిజన్ సిరీస్ క్వాంటికోగా రెండో సీజన్లో బిజీగా ఉంది. యాక్షన్ చిత్రాలపై ప్రియాంక ఎక్కువగా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. క్వాంటికోగాలో ప్రియాంక సీఐఏ ఏజెంట్‌గా నటిస్తోంది. ఇప్పటికే తాను చాలా యాక్షన్ సినిమాలు చేశానని, వాటిలో అనుభవం కలిగి ఉన్నాయని, తాను చాలా జాగ్రత్తగా ఉంటానని ప్రియాంక పేర్కొంది. ప్రియాంక టాప్ యాక్షన్ మూవీలు డాన్ సిరీస్, జైన్ గంగాజల్. -
అమ్మను అడవిలో వదిలేసింది!
రంగారెడ్డి జిల్లాలో ఓ కూతురు నిర్వాకం ధారూరు: కన్నతల్లిని నిర్దాక్షిణ్యంగా అడవిలో వదిలేసిందో కూతురు. ఇంటికి రావొద్దని బెదిరించింది. దీంతో ఆ వృద్ధురాలు తిండిలేక.. కదలలేని స్థితిలో ధారూరు రైల్వేస్టేషన్లో పడి ఉంది. రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం గోపాల్‌పూర్‌కు చెందిన వడ్డె బిచ్చమ్మ(75)కు ఐదుగురు కూతుళ్లు. నలుగురికి పెళ్లిళ్లయ్యాయి. మరో కూతురుకి వివాహం కావాల్సి ఉంది. పెద్ద కూతురు బాలమ్మకు ఇల్లరికం పెళ్లి చేసి కూతురు, అల్లుడును తనవద్దే ఉంచుకుంది. బాలమ్మ తల్లి బిచ్చమ్మకు చెందిన ఇంట్లో ఉంటూ ఆమెకున్న ఐదెకరాల పొలాన్ని అనుభవించడమే కాకుండా నెలనెలా వచ్చే పింఛన్‌ను కూడా తీసుకునేది. నెల రోజుల క్రితం బాల మ్మ తన తల్లిని ఇంట్లో ఉండవద్దని చెప్పి ఆమెను తీసుకెళ్లి తాండూరు రైల్వేస్టేషన్లో వదిలి వెళ్లింది. బిచ్చమ్మ ఎలాగోలా తిరిగి ఇంటికి చేరింది. దీంతో బాలమ్మ, ఇద్దరు కుమారులు ఆదివారం ధారూరు రైల్వేస్టేషన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. అక్కడి నుంచి ఆమె రైల్వేస్టేషన్‌కు చేరింది. అప్పటి నుంచి అన్నపానీయాలు లేకుండా అక్కడే పడి ఉంది. కదలలేని స్థితిలో ఉన్న ఆమెను చూసిన రైల్వేస్టేషన్ మాస్టర్ రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. రైల్వే పోలీసులు బాలమ్మ కుమారులకు ఫోన్‌చేసి విషయం చెబితే వారు ఆమెను తీసుకుపోవడానికి నిరాకరించారు. దీంతో ఆమె ఆదివారం అర్ధరాత్రి నుంచి రైల్వేస్టేషన్లోనే కూర్చొంది. -
వృద్ధురాలి గొంతు కోసి ఆభరణాలతో పరార్
నాగోల్‌లో సంఘటన హైదరాబాద్: బంధువని ఆత్మీయంగా ఆహ్వానించి అన్నం పెట్టిన ఓ వృద్ధురాలి గొంతునే కోసి బంగారు నగలతో ఉడాయించాడో దుర్మార్గుడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కొమ్మూరి దినేశ్‌రెడ్డి, శిరీషలు నగరానికి వచ్చి నాగోలు జైపురికాలనీ బాలాజీ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. దినేశ్‌రెడ్డి తల్లి సువర్ణ (60) కూడా వీరితో పాటే ఉంటోంది. దినేశ్‌రెడ్డి మార్కెటింగ్ ఉద్యోగం చేస్తుండగా శిరీష చెంగిచెర్లలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. గురువారం భార్యాభర్తలు ఇద్దరు విధులకు వెళ్లారు. దినేశ్‌రెడ్డి కుమారుడు స్కూల్‌కు వెళ్లగా ఇంట్లో కూతురు, సువర్ణ మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో శిరీష పెద్దమ్మ కుమారుడు శ్యామ్ ఇంటికి వచ్చాడు. సువర్ణ అతన్ని ఇంట్లోకి ఆహ్వానించి అన్నం పెట్టింది. అనంతరం వెళ్లి నిద్ర పోతుండగా శ్యామ్ ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని ఇవ్వాలని బెదిరించాడు. దీనికి సువర్ణ నిరాకరించడంతో శ్యామ్ కత్తితో గొంతు కోసి ఆమె మెడలోని 4 తులాల బంగారు గొలుసు, చేతికున్న 4 బంగారు గాజులు, 2 బంగారు ఉంగరాలను తీసుకుని పారిపోయాడు. వెంటనే దినేశ్‌రెడ్డి కూతురు, సువర్ణ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వృద్ధురాలిని చికిత్స నిమిత్తం నాగోలులోని సుప్రజ ఆసుపత్రికి తరలించారు. దినేశ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రాక్ అండ్ షేక్
అరవైల్లో ఇరవై అయిపోయారు బామ్మలు, తాతలు. ఇరవైల్లోని అమ్మాయిలతో కలసి స్టెప్పులేసి దుమ్ము లేపారు. ముచ్చటగా సెల్ఫీలూ దిగారు. దాగుడుమూతలూ ఆడేశారు. రాగాలు తీసి... మురిపాలు కురిపించి... మైమరిపించారు. కాసేపట్లో సీను రివర్స్. ‘సీనియర్లు’ ఇచ్చిన ఎనర్జీతో టీనేజర్స చెలరేగిపోయారు. ప్యాంట్లు, షర్ట్స్ వేసుకొని అబ్బాయిల గెటప్‌లో ఈల వేసి గోల చేశారు. సింగ్ సాంగంటూ డ్యూయెట్సూ వేసుకున్నారు. బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ ఆధ్వర్యంలోని ‘కాఫీ క్లబ్’ వార్షికోత్సవంలో ‘సీనియర్ సిటిజన్ డే’ ఉత్సాహాల కేళీ అయింది. అదిరిపోయే యాక్టివిటీస్‌తో కళాశాల ప్రాంగణంలో దుమ్మురేగింది. అంతా కలసి ఆనందాల విందు చేసుకుని హాయిగా ఆస్వాదించేశారు. మెమరబుల్ మూమెంట్స్‌ను ‘క్లిక్స్’లో భద్రంగా దాచేసుకున్నారు. యూఐడీఏ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ ఎంవీఎస్ రామిరెడ్డి ప్రతిభ చూపిన వారికి బహుమతులిచ్చి అభినందించారు. -
వృద్ధురాలి హత్య
ఏలూరు (వన్‌టౌన్/ఫైర్‌స్టేషన్ సెంటర్) : ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలి మెడలో బంగారు నగలపై కన్నేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను కిరాతకంగా హత్య చేసి నగలు కాజేశారు. నగరంలోని వన్‌టౌన్‌లో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన ఈ ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురిజేసింది. తూర్పువీధిలోని వేణుగోపాలస్వామి గుడి వద్ద కొప్పు సత్యవతి (75) ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈమె ఎవరితో మాట్లాడకుండా తన పనులు తాను చేసుకుంటుంది. భర్త వాసుదేవరావు ఆరేళ్ల క్రితమే మరణించాడు. కాగా ఈమె ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఒక కుమార్తెకు వివాహం కాగా, మరొక కుమార్తె చనిపోయింది. కుమారుడు చెన్నైలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయి ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పుడూ తెల్లవారుఝామునే నిద్రలేచి పూజలు చేసుకునే సత్యవతి గురువారం తెల్లవారినా ఇంట్లో అలికిడి లేకపోవడంతో సందులో నుంచి చూసిన స్థానికులకు గుమ్మం బయటకు కాళ్లు కనబడటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలు హత్యకు గురైనట్టు నిర్ధారించారు. బండరాతితో తలపై మోది హత్య చేసి భావిస్తున్నారు. ఒంటిపై ఉన్న సుమారు 15 కాసుల బంగారు ఆభరణాలు అపహరించారని అనుమానిస్తున్నారు. పోలీసు జాగిలాన్ని రప్పించి గాలించగా ఇంటి నుంచి రెండు వీధుల వరకూ వెళ్లి ఆగింది. ఘటనాస్థలాన్ని ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి, డీఎస్పీ ఎం.సత్తిబాబు పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వన్‌టౌన్ ఇన్చార్జి సీఐ వై.సత్యకిషోర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. నగల కోసమే పక్కా ప్రణాళికతో హత్యకు పాల్పడి ఉండవచ్చని సీఐ చెప్పారు. -
గవర్నర్... మీకు ఇంత సెక్యూరిటీ అవసరమా?
‘నీకు ఇంత సెక్యూరిటీ అవసరమా? ఇన్ని వాహనాలు, ప్రజాధనం వృథా చేయడమేమిటి సార్?’.. అంటూ ఓ సీనియర్ సిటిజన్ గవర్నర్ నరసింహన్‌ను నిలదీశారు. శనివారం సెంట్రల్ యూనివర్సిటీలో డీఎన్ఏ-13 సదస్సుకు వచ్చిన విజయ్ అనే సీనియర్ సిటిజన్ గవర్నర్‌పై ప్రశ్నల వర్షం కురిపించాడు. ‘‘నిజాం రాజులు ఓపెన్‌టాప్ జీపులో ఒంటరిగా వెళ్లేవారు.. నీకు ఇంత సెక్యూరిటీ అవసరమా? ఇన్ని వాహనాలు, ప్రజాధనాన్ని వృథా చేయడమేంటి సార్?’’ అని నిలదీశారు. దీంతో అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు, డీజీపీతో పాటు సదస్సుకు వచ్చిన డెలిగేట్లు అవాక్కయ్యారు. తనకు నాలుగు రక్షణ వాహనాలే ఉన్నాయని, మిగతావన్నీ మీడియా వాహనాలేనని గవర్నర్ సమాధానమిచ్చారు. ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులంటూ శాస్త్రవేత్త సారస్వత్ కల్పించుకున్నారు. దాంతో విజయ్.. ‘‘మా డబ్బులు ఊరికే ఉన్నాయా?’’ అని అంటుండగానే అక్కడికి వచ్చిన పోలీసులు దూరంగా తీసుకువెళ్లారు. -
పెద్దల భద్రతకు గట్టి చర్యలు!
న్యూఢిల్లీ: వయో వృద్ధుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. వారి రక్షణకు సం బంధించి పోలీసింగ్ ఏర్పాట్లపై అత్యవసరంగా సమీక్షించి లోపాలను నివారించాలని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ పలు సూచనలు చేసింది. ఒంటరిగా నివసిస్తున్న వయో వృద్ధుల సమాచారం, నేరాలు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి వారికి తగిన సూచనలు చేయాలని కోరింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి పోలీస్ స్టేషన్ వయో వృద్ధుల భద్రతకు చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు సమీక్షించేలా పోలీస్ ప్రధాన కార్యాలయం చర్యలు చేపట్టాలని తెలిపింది. రాత్రి, పగటి పూట కూడా పెట్రోలింగ్ నిర్వహించాలని మార్గదర్శకాల్లో సూచించింది. ధనవంతులైన వయో వృద్ధుల భద్రత పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని, వారి ఇళ్లలో పనిచేసే పనిమనుషులు, సిబ్బంది వివరాలను సేకరించాలని పేర్కొంది. కొద్ది దశాబ్దాలుగా ఉమ్మడి కుటుంబాల సం ఖ్య తగ్గటం, పిల్లలు ఉద్యోగ రీత్యా దూరంగా ఉండటం, సంతానం లేకపోవటం తదితర అంశాల వల్ల ఒంటరిగా నివసించే వృద్ధుల సంఖ్య పెరుగుతున్నందున సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు వ్యవహరించాలని సూచించింది. ‘వయో వృద్ధుల వివరాల రికార్డులను పోలీస్ ఉన్నతాధికారులు తరచుగా సమీక్షిస్తుండాలి. వారి నివాస ప్రాంతాల్లో గస్తీ పెంచాలి. సీనియర్ సిటిజన్ల భద్రత పర్యవేక్షణకు పోలీస్‌శాఖ ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలి. నిరంతరం పనిచేసేలా టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి’ అని మార్గదర్శకాల్లో పేర్కొంది.