రాక్ అండ్ షేక్
అరవైల్లో ఇరవై అయిపోయారు బామ్మలు, తాతలు. ఇరవైల్లోని అమ్మాయిలతో కలసి స్టెప్పులేసి దుమ్ము లేపారు. ముచ్చటగా సెల్ఫీలూ దిగారు. దాగుడుమూతలూ ఆడేశారు. రాగాలు తీసి... మురిపాలు కురిపించి... మైమరిపించారు. కాసేపట్లో సీను రివర్స్. ‘సీనియర్లు’ ఇచ్చిన ఎనర్జీతో టీనేజర్‌స చెలరేగిపోయారు. ప్యాంట్లు, షర్ట్స్ వేసుకొని అబ్బాయిల గెటప్‌లో ఈల వేసి గోల చేశారు. సింగ్ సాంగంటూ డ్యూయెట్సూ వేసుకున్నారు.
బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ ఆధ్వర్యంలోని ‘కాఫీ క్లబ్’ వార్షికోత్సవంలో ‘సీనియర్ సిటిజన్ డే’ ఉత్సాహాల కేళీ అయింది. అదిరిపోయే యాక్టివిటీస్‌తో కళాశాల ప్రాంగణంలో దుమ్మురేగింది. అంతా కలసి ఆనందాల విందు చేసుకుని హాయిగా ఆస్వాదించేశారు. మెమరబుల్ మూమెంట్స్‌ను ‘క్లిక్స్’లో భద్రంగా దాచేసుకున్నారు. యూఐడీఏ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ ఎంవీఎస్ రామిరెడ్డి ప్రతిభ చూపిన వారికి బహుమతులిచ్చి అభినందించారు.