selfies
-
దారి పొడవునా బ్రహ్మరథం
సాక్షి ప్రతినిధి, కడప/ సాక్షి నెట్వర్క్: వైఎస్సార్ జిల్లాలో నాలుగు రోజుల పర్యటన ముగించుకుని రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్లిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారిపొడవునా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం పులివెందుల– బెంగళూరు మార్గంలోని పల్లెల జనమంతా రోడ్డుపైకి వచ్చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. తమ అభిమాన నాయకుడు ఆ రహదారిలో వెళ్తున్నారని తెలుసుకుని ఆయా గ్రామాల వద్ద రోడ్డుపై తిష్ట వేశారు. దారి పొడువునా జననేతకు బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్ సైతం ఏ ఒక్కరినీ నిరాశ పరచకుండా అందరినీ పలకరిస్తూ, సెల్ఫీలు దిగుతూ, అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మార్గం మధ్యలో ఆయా గ్రామాల్లో నేతలందరినీ పేరు పేరునా పలకరిస్తూ ముందుకు సాగారు. అంబకపల్లి క్రాస్, దొరిగల్లు మీదుగా ముదిగుబ్బ బైపాస్ రోడ్డుకు చేరుకున్న జగన్‌కు.. కాకతీయ దాబా వద్ద కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వారందరికీ జగన్ అభివాదం చేశారు. తర్వాత కట్టకిందిపల్లె మీదుగా బత్తలపల్లి మండలం రామాపురం చేరుకున్న జగన్ కాన్వాయ్‌ని ప్రజలు ఆపి, జై జగన్ అంటూ నినదించారు. బత్తలపల్లి టోల్‌ప్లాజా వద్దకు కాన్వాయ్ చేరుకునే సరికే భారీ సంఖ్యలో జనం, పార్టీ శ్రేణులు వేచి ఉన్నారు. ఇక్కడ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు కాన్వాయ్‌కు అడ్డుపడుతూ తమతో మాట్లాడాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో జననేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వాహనంలో నుంచి బయటకు వచ్చి అభివాదం చేశారు. టోల్‌ప్లాజా వద్దనే అడుగడుగునా వాహనానికి అడ్డుపడడంతో జగన్ వాహనంలో నుంచి మూడు సార్లు బయటకు వచ్చి అభివాదం చేయాల్సి వచ్చింది.కరచాలనానికి పోటాపోటీరాప్తాడులోని నాలుగు రోడ్ల కూడలికి జగన్ కాన్వాయ్ చేరుకోగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అహుడా మాజీ చైర్మన్ మహాలక్ష్మీ శ్రీనివాస్, భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.జగన్‌తో మాట్లాడటానికి, కరచాలనం చేయడానికి ప్రజలు పోటీ పడ్డారు. మార్గం మధ్యలోని బొమ్మేపర్తి, లింగనపల్లి, హంపాపురం, గొల్లపల్లి, మరూరు, ఎం.చెర్లోపల్లి, చెన్నేకొత్తపల్లి సమీపంలో పార్టీ శ్రేణులు, ప్రజలు, మహిళలు ఎక్కడికక్కడ ఘన స్వాగతం పలికారు. సోమందేపల్లి వై.జంక్షన్ వద్ద శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్, వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, చిలమత్తూరు మండలానికి సమీపంలోని బాగేపల్లి టోల్‌ప్లాజా వద్ద హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఇక్కడ జగన్‌తో కరచాలనం చేసేందుకు యువతీ యువకులు పోటీపడ్డారు. టోల్ ప్లాజా దాటేందుకు సుమారు గంట సమయం పట్టడం గమనార్హం. జగన్‌ను చూసేందుకు వచ్చిన జనాన్ని, పార్టీ శ్రేణుల్ని నిలువరించడానికి ఏపీ, కర్ణాటక పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.అక్రమ కేసులకు భయపడొద్దురాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బాధితులకు భరోసా ఇచ్చారు. ఇటీవల చిలమత్తూరు మండల టీడీపీ కన్వీనర్ రంగారెడ్డి చేసిన దాడిలో శివప్ప, అతని సోదరుడు వెంకట్‌తో పాటు మత్సేంద్ర, నారాయణప్ప, పవన్ గాయపడ్డారు. అయితే.. పోలీసులు బాధితులపైనే అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వారంతా పెద్దనపల్లి వద్ద వైఎస్ జగన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. అన్యాయంగా కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేయించారని వాపోయారు. వారి కష్టాన్ని ఓపికగా విన్న జగన్.. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అక్రమ కేసులకు భయపడొద్దని వారికి ధైర్యం చెప్పారు. -
చినబాబు చీప్ ట్రిక్స్
సాక్షి, అనకాపల్లి/మునగపాక/తుమ్మపాల (అనకాపల్లి జిల్లా): నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు... అన్నట్టుగా ఉంది టీడీపీ నేత నారా లోకేశ్ తీరు. అనకాపల్లి జిల్లాలో ఈ నెల 7వ తేదీతో మిచాంగ్ తుపాను ప్రభావం పోయింది. అప్పటినుంచి చినుకు జాడలేదు. గడచిన వారం రోజుల్లో పొలాలు అన్నీ తడారిపోయాయి. కల్లాల్లోని వరి పంట కడ దశకు చేరుకుంది. కానీ.. లోకేశ్ పుణ్యమా అని ఇప్పుడు రోడ్డుపై ఉన్నపళంగా నీళ్లొచ్చాయి. అక్కడ పచ్చ చొక్కాలతో కలిసి లోకేశ్ ఫొటోలకు ఎడాపెడా ఫోజులిచ్చారు. సెల్ఫీలు తీసుకుని లేనిపోని హడావుడి చేశారు. ఈ ఫొటోలు ఎల్లో మీడియాకు చేరడంతో ఒక్కసారిగా ఊదరగొట్టేశాయి. ఆ రాతలు చూసిన స్థానికులు అవాక్కయ్యారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు జిల్లాలో జనం నుంచి ఎక్కడా స్పందన లేకపోవడంతో చినబాబు ఇటువంటి చీప్ ట్రిక్స్‌కు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో నిర్వహించిన యువగళం పాదయాత్ర సందర్భంగా తిమ్మరాజుపేట వద్ద అచ్యుతాపురం–అనకాపల్లి రహదారిపై గుంతలో టీడీపీ కార్యకర్తలతో నీళ్లు పోయించి మరీ ఫొటోలకు ఫోజులిచ్చిన లోకేశ్ అడ్డంగా దొరికిపోయారు. 22 కిలోమీటర్ల మేర పొడవున్న ఈ రోడ్డులో ఎక్కడా చుక్కనీరు లేదు. అలాంటిది రాత్రి 8 గంటల సమయంలో మరో ఐదు నిమిషాల్లో పాదయాత్రకు విరామం ఇవ్వనున్న దశలో రోడ్డుపై గుంతలో మాత్రం అప్పుడే పెద్ద వర్షం వచ్చినట్టుగా నీళ్లు ప్రత్యక్షమవడంతో స్థానికులు నివ్వెరపోయారు. కేవలం ప్రభుత్వంపై బురద చల్లాలని ఇలా చీప్ ట్రిక్స్‌కు పాల్పడడం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే ఇదిలా ఉండగా, పాదయాత్రలో భాగంగా లోకేశ్ శనివారం మునగపాక, అనకాపల్లి మండలాల్లో నడిచారు. మునగపాకలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల శిబిరం వద్దకు వెళ్లి మద్దతు తెలిపిన లోకేశ్ ఈ సందర్భంగా వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, మరో మూడు నెలల్లో కష్టాలు తీరిపోతాయని చెప్పారు. అనంతరం పూడిమడక రోడ్డు జంక్షన్ వద్ద విశాఖపట్నం–విజయవాడ జాతీయ రహదారి దాటుకుని అనకాపల్లి పట్టణంలోకి ప్రవేశించిన లోకేశ్ నెహ్రూచౌక్ మీదుగా గవరపాలెంలోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. యువగళం యాత్ర 3,100 కిలోమీటర్ల పైలాన్‌ను ఆవిష్కరించారు. అక్కడినుంచి మునగపాక మండలం తోటాడలో ఏర్పాటుచేసిన బసకు చేరుకున్నారు. -
అక్కడ సెల్ఫీలు తీస్తే జరిమానా..కానీ క్లిక్ మనిపించకుండా ఉండలేం!
ఇటీవల కాలంలో సెల్ఫీ మోజు మూములగా లేదు. అందుకోసం ప్రాణాలు పోగొట్టుకున్నా వారు ఉన్నారు. అయినా సెల్ఫీ క్రేజ్ తగ్గలేదు. ఐతే ఇలా అన్ని చోట్ల సాధ్యం కాదు. కొన్నిప్రదేశాల్లో తీస్తే పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తారు. ఎవ్వరూ ఫోటోలు తీయకుండా స్ట్రిట్ రూల్స్ ఫాలవుతారట అక్కడి ప్రజలు. వివరాల్లోకెళ్తే..ఇటాలిలోని రివేరాలో రంగురంగుల పట్టణమైన పోర్టోఫినో అత్యంత సుందరమైన పర్యాటక ప్రాంతం. అక్కడకు వచ్చిన ఎవ్వరికైన తమ కెమరాను క్లిక్ మనిపించకుండా ఉండలేరు. ఎందుకంటే అంతా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఆ ప్రదేశం. అందువల్ల అక్కడ పర్యాటకుల తాకిడి ఎక్కువే. చిత్రాకారుల సైతం ఆ అందాలను చిత్రీకరించకుండా ఉండలేనంతగా కట్టిపడేస్తోంది ఆ నగరం. ఐతే ఈ సెల్ఫీల కారణంగానే వీధులన్ని కిక్కిరిసిపోయి గందరగోళానికి దారితీసిందని, అక్కడ సెల్ఫీలు గానీ, ఫోటోలు తీయడం గానీ చేయకూడదంటూ నిషేధించారు. ఈ మేరకు అక్కడకు వచ్చిన పర్యాటకులెవరు ఉదయం 10.30 నుంచి 6 గంటల వరకు ఈ ప్రదేశాల్లో సెల్ఫీలు గానీ ఫోటోలు తీయడం గానీ చేయకూడదు. అక్టోబర్ వరకు ఇలానే నిషేధం అమలవుతుందట. ఇలాంటి నిబంధనలే అమెరికా, ఫ్రాన్స్, యూకేలతో సహా కొన్ని దేశాల్లో ఉన్నాయి. (చదవండి: గాల్లో ఉండగానే పెద్ద శబ్దాలతో ఇంజన్లో మంటలు..ఆ తర్వాత విమానం..) -
హాట్ టాపిక్‌గా నిర్మలా సీతారామన్ సెల్ఫీ
షిమ్లా: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పెషల్ సెల్ఫీ దిగారు. అదీ తన కాన్వాయ్‌ను ఆపి మరి!. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గురువారం(నవంబర్ 10)తో ఎన్నికల ప్రచారం ముగిసిన సంగతి తెలిసిందే. ఆఖరిరోజు కీలక నేతల ప్రచారంతో ఆ రాష్ట్రంలో హడావిడి నెలకొంది. ఈ క్రమంలో.. షిమ్లాలో నిర్వహించిన రోడ్‌షోలో బీజేపీ నేత నిర్మలా సీతారామన్ ఉల్లాసంగా పాల్గొన్నారు. అయితే.. కార్యక్రమం కోసం వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఆమెకు తారసపడ్డారు. అప్పటికే వాళ్లంతా ప్రియాంక గాంధీ వాద్రా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను చూసి చేతులు, తమ మెడలోని కండువాలు ఊపారట. అది గమనించిన సీతారామన్ కాన్వాయ్‌ను ఆపించి.. వాళ్ల దగ్గరకు వెళ్లారు. వాళ్లతో కాసేపు ఆప్యాయంగా మాట్లాడి.. వాళ్ల కోరిక మేరకు సెల్ఫీలు కూడా దిగారు. ఈ విషయాన్ని బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ కరణ్ నందా తెలియజేశారు. ఆ కాసేపటికే మాల్ రోడ్లో మధ్యాహ్నాం నిర్వహించిన జన్ సంపర్క్ ప్రచారంలో ప్రియాంక గాంధీ కార్యక్రమానికి ఆ కార్యకర్తలు హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. సీతారామన్‌తో సెల్ఫీలు దిగడంపై కాంగ్రెస్ గుస్సాగా ఉంది. అలా చేయడంపై కార్యకర్తలను షిమ్లా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ చీఫ్ వివరణ కోరారు. సీతారామన్ మహిళలను తలెత్తుకునేలా చేశారని, అందుకే ఆమెతో సెల్ఫీలు దిగామని ఆ కార్యకర్తల ప్రతినిధి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చర్యపై పార్టీపరమైన చర్యలుంటాయా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
డిజిటల్ దేశభక్తి: మువ్వన్నెల జెండా సెల్ఫీలతో రికార్డు బద్ధలు!
ఢిల్లీ: కోట్లాదిమంది పౌరులు తమ దేశభక్తిని డిజిటల్ రూపంలోనూ చూపించారు. తాము ఎగరేసిన త్రివర్ణ పతాకంతో కలిసి సెల్ఫీలు, ఫొటోలు దిగి హర్ ఘర్ తిరంగా వెబ్‌సైట్‌కు పంపాలని ఇటీవల కేంద్ర సాంస్కృతిక శాఖ పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు స్పందన అనూహ్యరీతిలో వచ్చింది. ఏకంగా ఐదు కోట్లకుపైగా పౌరులు త్రివర్ణ పతాక సెల్ఫీలను ‘హర్ ఘర్ తిరంగా’ వెబ్సైట్లోకి అప్లోడ్ చేశారని సాంస్కృతిక శాఖ సోమవారం పేర్కొంది. ‘ఇళ్ల వద్ద జెండావిష్కరణ జరపాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు వచ్చిన స్పందన అనుపమానం. కోటానుకోట్ల స్వీయచిత్రాలతో వెబ్సైట్ నిండిపోతోంది. సోమవారం సాయంత్రం నాలుగింటికే ఐదు కోట్ల మార్క్ దాటాం’ అని పౌరులను అభినందించింది. మంగళవారం ఉదయం కూడా వెబ్సైట్లోకి ఫోటోలు అప్లోడ్ అవుతుండడం విశేషం. సాధారణంగా అధిక జనాభా ఉన్న(రెండో దేశం) భారత్ నుంచి.. ప్రపంచ స్థాయిలోనే ఇదొక కొత్త రికార్డు అయ్యి ఉంటుందని సాంస్కృతిక శాఖ అంచనా వేస్తోంది. ఇదీ చదవండి: స్వాతంత్ర వేడుకల్లో గాంధీ ఎందుకు పాల్గొనలేదో తెలుసా? -
లండన్ వీధుల్లో ధోనికి వింత అనుభవం
-
అట్టహాసంగా లగ్జరీ కారుల్లో డ్యాన్స్‌లు చేస్తూ... పెళ్లి ఊరేగింపు...సీన్ కట్ చేస్తే...
ఇటీవల యువత చాలా అట్టహాసంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. చాలా డబ్బు ఖర్చుపెట్టి మరీ గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటున్నారు. ఐతే ఇక్కడోక ఉత్తరప్రదేశ్‌కి చెందిన వరడుకి కేవలం పెళ్లి ఊరేగింపుకే రెండు లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఎందుకో తెలుసా! వివరాల్లోకెళ్తే....ముజఫర్నార్ హరిద్వార్ జాతీయ రహదారిపై ఒక పెళ్లి బృందం వరుస లగ్జరీ అడీ కార్లలతో సందడి చేసింది. వరుడు అతని స్నేహితుల బృందం టాప్‌లెస్ కారులో డ్యాన్స్‌లు చేశారు. మరికొంతమంది కారు కిటికిలోంచి వేలాడుతూ సెల్పీలు తీయడం వంటి పనులు చేశారు. ఐతే ఇలాంటి స్టంట్లు తోటి ప్రయాణికుల భద్రతను ఎలా దెబ్బతీస్తుందో తెలియజేస్తూ అంకిత్ కుమార్ అనే వ్యక్తి ట్విట్టర్లో ఈ ఘటనకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేశారు. అతను ట్విట్టర్లో... తాను హరిద్వార్ నుంచి నోయిడా వెళ్తున్న సమయంలో.. ముజఫర్ నగర్ జిల్లాలో కొంతమంది తమ వినోదం కోసం ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు గ్రహిస్తారని ఆశిస్తున్న అని ట్వీట్ చేశారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సదరు పెళ్లి బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడమే కాకుండా ఆ ఊరేగింపులో ఉపయోగించిన తొమ్మిది కార్లను స్వాధీనం చేసుకున్నారు. సదరు కారు యజమానులపై రూ. 2 లక్షలు జరిమాన విధించారు కూడా. ➡️हाइवे पर गाडियों से स्टंट करने वाले वाहनों के विरुद्ध मुजफ्फरनगर पुलिस द्वारा की गयी कार्यवाही। ➡️कुल 09 गाडियों का 02 लाख 02 हजार रुपये का चालान।@Uppolice @The_Professor09 @ankitchalaria pic.twitter.com/VqaolvazhO — MUZAFFARNAGAR POLICE (@muzafarnagarpol) June 14, 2022 (చదవండి: వీడియో: దిగజారిపోతున్న పుతిన్ ఆరోగ్యం? వణికిపోతూ.. నిలబడలేక!) -
24 ఏళ్ల క్రితం రాళ్లు రువ్వారు.. కట్‌చేస్తే
ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్ గడ్డపై 24 సంవత్సరాల తర్వాత పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. 1998లో చివరిసారిగా పర్యటించిన ఆసీస్ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పాక్ గడ్డపై మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టి20లు ఆడేందుకు వచ్చింది. ఇప్పటికే రెండు టెస్టులు పూర్తవ్వగా.. సోమవారం నుంచి చివరి టెస్టు జరగనుంది. ఇక విషయంలోకి వెళితే.. పాకిస్తాన్ ఆటగాళ్లలాగే అక్కడి క్రికెట్ ఫ్యాన్స్ అనిశ్చితికి మారుపేరు. ఆటగాళ్ల వైఖరి నచ్చలేదో సొంత దేశ క్రికెట్ర్ అని చూడకుండా దుమ్మెత్తిపోస్తారు. అంతేకాదు వారి ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి. తాజాగా ఒక ఆస్ట్రేలియన్ అభిమానితో సెల్ఫీ కోసం పాక్ అభిమానులు ఎగబడుతున్నారు. అతనే ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ వీరాభిమాని లూక్ గిల్లియన్. ఇదే ఆస్ట్రేలియన్ అభిమానిపై 24 ఏళ్ల క్రితం పాక్‌కు చెందిన కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వారు.. మా దేశం నుంచి వెళ్లిపో అంటూ అరిచారు. ఇప్పుడు మాత్రం నాతో ఫోటోలు దిగేందుకు ఇష్టపడుతున్నారని గిల్లియన్ పేర్కొన్నాడు. ''1998లో ఆస్ట్రేలియా పాక్ పర్యటనకు వచ్చినప్పుడు ఒక అభిమానిగా అక్కడికి వెళ్లాను. అప్పటి పరిస్థితులు దారుణంగా ఉండేవి. బయటికి వెళ్లాలంటేనే భయపడేవాళ్లం. అయినా ధైర్యం తెచ్చుకొని బయటికి వెళ్లాను. అప్పటికే రోడ్లపై గుంపులుగా తిరుగుతూ అడ్డు వచ్చిన వాళ్లపై రాళ్లు రువ్వుతున్నారు. అలా నాపై కూడా రాళ్ల వర్షం కురిపించారు. ఇక లాభం లేదనుకొని వెంటనే ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాను. ఆ తర్వాత మళ్లీ పాకిస్తాన్‌కు వెళ్లలేదు. అయితే 24 ఏళ్ల తర్వాత మళ్లీ మా జట్టు పాక్ పర్యటనకు వెళుతుందని తెలుసుకున్నా. ఇప్పుడు వెళ్తే చంపేస్తారేమో అని మొదట వద్దనుకున్నా. కానీ ఆటపై నాకున్న అభిమానం పాక్ గడ్డపై అడుగుపెట్టేలా చేసింది. కానీ ఇప్పుడు అక్కడి పరిస్థితులు మునుపటిలా లేవు. రావల్పిండిలో దిగగానే నాకు పాక్ అభిమానుల నుంచి మంచి స్వాగతం లభించింది. ఎవరైతే నాపై రాళ్లు రువ్వారో వాళ్లే నాతో ఫోటోలు దిగుతూ క్షమాపణ కోరారు. అలా ఐదు రోజుల పాటు నాతో 500 మంది ఫోటోలు దిగేవారు.. ఇది నాకు చాలా సంతోషంగా అనిపించేది. అంతేకాదు వారితో కలిసి కప్పు టీలు ఎన్నిసార్లు తాగానో గుర్తులేదు. ఇక లెక్కలేనన్ని కేక్‌లు.. పెప్సీ బాటిళ్లు, ఫ్రీ హెయిర్‌కట్, ఫ్రీ లాండ్రీ వెరసి వారి అభిమానానికి ఫిదా అయిపోయా'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Ravichanran Ashwin: ‘‘రెండో ఆలోచన వద్దు.. రనౌట్ చేసేయండి’ ’ PAK vs AUS: 23 ఏళ్ల క్రితం టీమిండియా బ్యాటర్.. ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటర్; సీన్ రిపీట్ -
సెల్ఫీ విత్ బతుకమ్మ..
సహజ సౌందర్యానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకయైన పండుగ బతుకమ్మ. తంగేడు, గునుగు, కట్ల, గుమ్మడి, రుద్రాక్ష వంటి తీరొక్కపూలను ఒక్కచోట చేర్చి గౌరమ్మను కొలిచే వేడుక. ఏడాదికి ఒకసారైనా ఊరు ఊరంతా ఒక్కచోట చేరి సంబరంగా జరుపుకునే ఉత్సవం. తెలంగాణ విలక్షణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ఈ పూల జాతరలో సందడంతా ఆడపడుచులదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది కేవలం పూల పండుగే కాదు, ఆడపిల్లల ఆటవిడుపు పండుగ కూడా. ఏడాదంతా అత్తవారింట్లో గడిపిన, ఆడపడుచులను తప్పనిసరిగా పుట్టింటికి తీసుకువచ్చే ఈ పండుగ నాడు ఆటపాటలు, కోలాటాలతో గౌరీదేవిని కొలిచే మన ఇంటి మహాలక్ష్ములను చూసేందుకు రెండుకళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. చిన్నా, పెద్దా ప్రతిఒక్కరికి సంతోషాన్ని పంచే బతుకమ్మ వేడుకలు, శరన్నవరాత్రులు ప్రారంభమైన నేపథ్యంలో.. మీ పండుగ ఫొటోలు, మధుర జ్ఞాపకాలను ప్రపంచంతో పంచుకునే అవకాశాన్ని ‘సాక్షి’మీకు కల్పిస్తోంది. సెల్ఫీ విత్ సాక్షి పేరిట sakshi.com నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలంటే 9010533389 వాట్సాప్ నంబర్‌కు బతుకమ్మతో ఉన్న మీ సెల్ఫీలు పంపండి. పండుగ సంబరాన్ని మాతో షేర్ చేసుకోండి. మీరు పేరు, ఏరియా పేరు రాయడం మర్చిపోకండి. -
అక్కడ సెల్ఫీ తీసుకుంటే అదుర్స్!
న్యూఢిల్లీ : సెల్ఫీలు దిగడం అనేది ఈ రోజుల్లో వేలం వెర్రిగా మారిన విషయం తెల్సిందే. ఇక ‘ఇన్స్టాగ్రామ్’ లాంటి ఫొటో సోషల్ మీడియా బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత సోలో, ఫ్రెండ్స్ ఫొటోలకు కూడా యమ డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో మంచి బ్యాక్‌గ్రౌండ్ కోసం యువతీ యువకులు అతి సుందర నందన వనాలను వెతుక్కుంటూ సుదూర తీరాలకు సైతం పోతున్నారు. దాంతో అనామక ప్రాంతాలు కూడా పాపులర్ అవుతున్నాయి. అలా ప్రసిద్ధి చెందినదే లండన్‌కు 15 మైళ్ల దూరంలోని సర్రీకి సమీపంలో ఉన్న ‘మేఫీల్డ్స్ లావెండర్ ఫామ్’. ఇంగ్లీషు, ఫ్రెంచ్ ఉదా రంగు పూల వికాసంతో కళకళలాడుతున్న ఆ తోటలోకి ఫొటోల కోసం పోటీ పడుతున్నారు. ఇదే అదనుగా 25ఎకరాల ఆ తోట యజమాని మనిషికి ప్రవేశ రుసుమంటూ భారతీయ కరెన్సీలో దాదాపు 250 రూపాయలు విధించారు. అయినా లెక్క చేయకుండా జనం విరగబడుతూనే ఉన్నారు. వారాంతంలో ఫొటో సెషన్ కోసం వచ్చే వారి సంఖ్య మరీ పెరగడంతో తోట యజమాని అక్కడే తిష్టవేసి ‘మంచి ఫొటోలు తీసుకుంటే మళ్లీ మళ్లీ రావాల్సిన అవసరం ఉండదు’ అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇదంతా వారాంతంలో రద్దీని తగ్గించడానికేనని ఆయన చెబుతున్నారు. ఇంతవరకు రెండు, మూడు లేదా ఐదు గంటలు అంటూ సమయాన్ని నిర్దేశించలేదని, రద్దీ పెరిగితే అది చేయాల్సి రావచ్చని చెప్పారు. ఇప్పటి వరకు ఫొటో సెషన్లకు ప్రసిద్ధి చెందిన ‘నాటింగ్ హిల్’, ‘కాట్స్‌వోల్డ్స్ విలేజ్’ ప్రాంతాలు వెనకబడి పోతున్నాయి. -
‘పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ తీసుకోకూడదు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలంగాణ సీఈఓ రజత్‌కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రంలో ఓటేశాక సెల్పీ తీసుకోకూడదన్నారు. అలా చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నిజామాబాద్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. తెలంగాణలో 2 కోట్ల 97 లక్షల 8599 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు సామాగ్రి పంపిస్తున్నాం. అభ్యర్థులు 48 గంటల ముందు ప్రచారం బంద్ చేయాలి. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరనుంది. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. 4,169 పోలింగ్ కేంద్రాలకు లైవ్ వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నాం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాం. 90 శాతం ఓటరు స్లిప్‌లు పంపిణీ చేశాం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నిఘా పెట్టి చర్యలు తీసుకుంటున్నాం. పెయిడ్ న్యూస్ కింద 579 కేసులు నమోదు చేశాం. రాష్ట్రంలో 52 కోట్ల 62 లక్షల రూపాయలు సీజ్ చేశాం. సీ విజిల్ యాప్‌కు మంచి స్పందన వస్తుంది. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు పోలింగ్ రోజు సెలవు ఇవ్వాలి లేదంటే తీసుకుంటామ’ని రజత్ కుమార్ తెలిపారు. -
వాజ్‌పేయి అస్థికలతో బీజేపీ నేత సెల్ఫీలు
సాక్షి, ముంబై : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి అస్థికల యాత్రలో బీజేపీ నేత సెల్ఫీ తీసుకుంటూ వివాదంలో చిక్కుకున్నారు. ఔరంగాబాద్ డిప్యూటీ మేయర్ విజయ్ ఔతడే దివంగత నేత అస్థికల యాత్ర సాగుతుండగా సెల్ఫీ తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాజ్‌పేయి అస్థికల యాత్ర ముంబై నుంచి ఔరంగబాద్‌లోని ఉస్మాన్పురాకు చేరుకుని జల్నాకు వెళుతుండగా ఔతడే సెల్ఫీలు తీసుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు బీజేపీ నేత చర్యను తప్పుపట్టారు. మరోవైపు చత్తీస్‌గఢ్‌లో జరిగిన వాజ్‌పేయి సంస్మరణ సభలో ఇద్దరు మంత్రులు నవ్వుల్లో మునిగితేలడం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. సంతాప సభలో మంత్రులు బ్రిజ్మోహన్ అగర్వాల్, అజయ్ చంద్రార్కర్‌లు జోక్‌లు చెప్పుకుంటూ బిగ్గరగా నవ్వడం వివాదాస్పదమైంది. ఈ ఇద్దరు మంత్రుల తీరుపైనా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దిగ్గజ నేతకు నివాళులు అర్పించేంది ఇలాగేనా అంటూ మంత్రులను నెటిజన్లు నిలదీశారు. -
సెల్ఫీల్లో అందం కోసం తపనా ఓ రోగమే
బోస్టన్: ఫొటోను అందంగా ఎడిట్ చేసుకుని నిజ జీవితంలోనూ తమకు ఇలాంటి ముఖమే వచ్చేట్లు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని వైద్యులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇటీవల ప్లాస్టిక్ సర్జన్లను కలిసిన వారిలో సెల్ఫీల్లో అందంగా వచ్చేలా తమ ముఖాన్ని తీర్చిదిద్దమని కోరిన వారే 55 శాతమట! ఏ లోపం లేకుండా సెలబ్రిటీల్లా సోషల్‌మీడియాలో కనపడాలనే తపనను ‘స్నాప్డైమోఫియా’అనే రుగ్మతగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా స్నాప్‌చాట్, ఫేస్ట్యూన్ యాప్‌ల వంటి సోషల్‌మీడియా ఫొటో ఎడిటింగ్ టెక్నిక్స్ మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. బోస్టన్ వర్సిటీ పరిశోధకులు చేపట్టిన ఈ అధ్యయనం వివరాలు జమా ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఎడిటింగ్ టెక్నిక్స్ వల్ల అందంపై దృక్పథం మారిందని, దీంతో ఆత్మగౌరవం దెబ్బ తినడంతో పాటు శారీరక రుగ్మతలకు దారి తీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ‘అందంగా కనపడాలనే తపనతో చర్మవ్యాధులు, ప్లాస్టిక్ సర్జరీ నిపుణులను కలవడం ఒక రుగ్మత, వీరి మనసు నిండా అందం గురించిన ఆలోచనలే ఉంటాయి’ అని పరిశోధనలో పాల్గొన్న నీలమ్ వశీ పేర్కొన్నారు. సర్జరీతో అందం రాదని, సర్జరీ దీనికి ఎంత మాత్రం పరిష్కారం కాదన్నారు. సహజమైన అందాన్ని ప్రేమించగలిగేలా వీరికి మానసిక చికిత్స అవసరమని సూచించారు. -
మామా.. జాగ్రత్త సుమా..!
కృష్ణా : మామా.. ఎన్ని లైక్‌లు, ఎన్ని కామెంట్లు వచ్చాయిరా .. అబ్బబ్బా ఏం ఫొటో అప్లోడ్ చేశావ్‌రా.. ఈ రోజంతా ఫేస్బుక్లో మన ఫ్రెండ్స్ అంతా నీ ఫొటో గురించే చర్చ. సూపర్ మామా.. అని తోటి స్నేహితుడు అంటుంటే ఫోన్ వైపు చూసుకుంటూ తన ఫొటోను మరొక్కసారి తిలకిస్తూ మురిసిపోయాడు మరో స్నేహితుడు.. ఇలాంటి ప్రశంస కోసం నేటి యువత వెర్రెక్కిపోతోంది. ఒకవైపు అర్ధరాత్రి హైవేపై జిగేల్మనే లైటింగ్‌లో సెల్ఫీలతో కుల్ఫీ అవుతోంది. మరో వైపు రయ్యిమంటూ దూసుకెళ్లే రైలు పక్కన రాజాలా ఫోజులు పెడుతోంది. ప్రమాదాన్ని పక్కన పెట్టుకుని చిరు దరహాసం చేస్తోంది. ఎన్ని లైక్‌లు వచ్చినా, ఎన్ని కామెంట్లు ముంచెత్తినా వీటన్నింటికన్నా ప్రాణం ఖరీదైంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఎంజాయ్ చేయాలి. జీవితంలో మజాను ఆస్వాదించారు. విజయవాడలో ఆదివారం యువత సీతానగరం వద్ద రైల్వే బ్రిడ్జి, కృష్ణానదిలో పడవలపైనా ఇలా ఫొటోలు దిగుతుండగా సాక్షి క్లిక్‌మనిపించింది. – ఫొటోలు, నడిపూడి కిషోర్,సాక్షి ఫొటోగ్రాఫర్ -
ఉలికిపాటు.. అంతలోనే ఆనందం!
సమయం గురువారం మిట్టమధ్యాహ్నం ఒంటిగంట.. జనమంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఇంతలో పెద్ద శబ్దంతో హెలికాప్టరొకటి సోంపేట మండలం శారదాపురం గ్రామ సమీపంలోని పొలాల్లో దిగిపోయింది. దీంతో జనమంతా ఉలికిపాటుకి గురయ్యారు. ఏం జరిగిందోనని తీవ్ర ఆందోళన చెందారు. ఎప్పుడూ ఆకాశ మార్గంలో వెళ్లేటపుడు మాత్రమే హెలికాప్టర్‌ను చూసే గ్రామీణులు తమ పరిసరాల్లో అకస్మాత్తుగా దిగిపోవడంతో ఏం జరిగి ఉంటుందోనని గందరగోళానికి గురయ్యారు. ఇంతలో సాంకేతిక లోపంతో హెలికాప్టర్ దిగినట్టు తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. పాడైన దాన్ని బాగు చేసేందుకు సాంకేతిక సిబ్బంది మరో హెలికాప్టర్లో రావడం..అది కూడా పొలంలోనే దిగడంతో.. ఒకేసారి రెండింటినీ చూసిన సోం³ట మండల వాసులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. సోంపేట: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బక్రాపూర్ నుంచి చెన్నై వెళ్తున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ గురుప్రీత్ సింగ్ గురువారం మధ్యాహ్నం 1:10 గంటల సమయంలో సోంపేట మండలం శారదాపురం గ్రామ సమీపంలోని పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. హెలికాప్టర్లో పైలట్ సింగ్‌తో సహా సి బ్బంది ప్రశాంత్, కిరణ్టాకోన్ ఉన్నారు. హెలి కాప్టర్ పాడైన విషయాన్ని విశాఖలోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విభాగానికి సమాచారం అందజేశారు. దీంతో నావికాదళానికి చెందిన ప్రత్యేక హెలికాప్టర్లో సాంకేతిక బృందం సుమా రు నాలుగు గంటల సమయంలో శారదాపురం చేరుకున్నారు. మరమ్మతులకు గురైన హెలికాప్టర్ పైలట్ సింగ్‌తో సిబ్బంది మాట్లాడారు. 30 నిమిషాల్లోనే సాంకేతిక సమస్యను పరిష్కరిం చారు. అనంతరం రెండు హెలికాప్టర్లు ఒడిశా రాష్ట్రంలోని గోపాల్‌పూర్‌కు సాయంత్రం 5:10 గంటల సమయంలో బయలుదేరి వెళ్లిపోయా యి. కాగా రక్షణ విభాగానికి చెందిన హెలికాప్టర్లు కావడంతో సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. ఒడిశా రాష్ట్రం గోపాల్పూర్ క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న ఆర్మీ సిబ్బందిని శారదాపురానికి పంపించారు. ఆసక్తి చూపిన జనం.. ఒక హెలికాప్టర్ సాంకేతిక లోపంతో పొలాల్లో దిగిందని, దాన్ని బాగు చేసేందుకు మరకొటి వచ్చిందని తెలుసుకున్న శారదాపురంతోపాటు పరిసర గ్రామాల ప్రజలు వాటిని చూసేందుకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొంతమంది హెలికాప్టర్ల ఫొటోలను సెల్ఫోన్లలో బంధించారు. మరికొందరు సెల్ఫీలు తీసుకున్నారు. సోంపేట సీఐ సన్యాసినాయుడు, బారువ, సోంపేట ఎస్సైలు భాస్కరారవు, దుర్గా ప్రసాద్‌లు హెలికాప్టర్ల వద్దకు స్థానికులను వెళ్లనీయకుండా చర్యలు చేపట్టారు. -
హంతకులు సెల్ఫీలు..
సాక్షి, ముజఫర్‌నగర్ : ఉత్తరప్రదేశ్‌లో నేరస్తులు జైళ్లలో ఎంజాయ్ చేస్తున్నారు. ఏం చక్కా ఫోన్లు మాట్లాడుకుంటూ వాటిల్లోనే సెటిల్మెంట్లు చేసుకుంటూ, దర్జాగా ఫొటోలు దిగుతూ తమకే దిగులు లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆ విషయం కాస్త బయటకు పొక్కడంతో ఇప్పుడు తీవ్రస్థాయిలో జైలు శాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. ఇంతకు వారు ఏం చేశారో తెలుసా.. ముజఫర్‌నగర్ జైలులో ఉన్న ఓ ముగ్గురు ఖైదీలు ఏకంగా జైలు సెల్ఫీలు దిగి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. వీరు ముగ్గురిపై కూడా హత్య కేసులు, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. అయితే, జైలులో ఖైదీల వద్ద ఎలాంటి సెల్ఫోన్లు ఉండొద్దని నిబంధన ఉన్న విషయం తెలిసిందే. కానీ, వాటన్నింటిని ఖాతరు చేయకుండా వారు విచ్చలవిడిగా ఫోన్లు వాడటం, వారు వాడుతున్న విషయాన్ని ఇలా బాహటంగా బయటపెట్టడంతో అధికారులు చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం ఆ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిపై అదనంగా కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. -
సెల్ఫీలతో బుక్కవుతున్నారు..
లండన్ : సెల్ఫీలతో ప్రాణాలను పణంగా పెడుతున్న ఉదంతాలు కోకొల్లలుగా వెల్లడవుతుంటే తాజాగా సెల్ఫీలతో కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంటూ ప్రమాదం కొనితెచ్చుకుంటున్నారు. సెల్ఫీల్లో ముక్కు పెద్దదిగా కనిపిస్తుండటంతో పెద్దసంఖ్యలో యువత కాస్మెటిక్ సర్జరీతో ముక్కు తీరును మార్చుకుంటోందని ఓ అథ్యయనం వెల్లడించింది. ముఖానికి 12 ఇంచ్‌ల దూరం నుంచి తీసుకున్న ఫోటోల్లో ముక్కు పరిమాణం 30 శాతం పెరిగినట్టుగా కనిపిస్తుంది. దీంతో కాస్మెటిక్ సర్జన్లను ఆశ్రయిస్తున్న యువత తమ ఆరోగ్యాలను పణంగా పెడుతోందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. మరికొంతమంది ఫేస్బుక్, ట్విటర్లలో తాము బాగా కనిపించాలనే తపనతో ముక్కు సర్జరీలకు ముందుకొస్తున్నారని అథ్యయనంలో పాల్గొన్న 42 శాతం మంది ప్లాస్టిక్ సర్జన్లు చెప్పారు. మీ ముఖ ఆకృతిలో సెల్ఫీ ఎలాంటి మార్పు తెచ్చిందో ప్రజలు అర్థం చేసుకోవాలని ఫేషియల్ ప్లాస్టిక్స్, రీకన్స్ర్టక్టివ్ సర్జన్ డాక్టర్ బొరిస్ పషోవర్ చెప్పారు. తమ ముక్కు ఆకృతి సరిగా లేదని సెల్ఫీలను తీసుకొస్తున్న పేషెంట్లకు తాను వారి ముక్కు వాస్తవంగా అలా లేదన్న విషయం విడమరచి చెబుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. -
మానవత్వం మంటగలిసిన వేళ..
సాక్షి, తిరువనంతపురం : కేరళలో మానవత్వం మంటగలిసింది. మానసిక వైకల్యం ఉన్న వ్యక్తిని దొంగతనానికి పాల్పడ్డాడనే కారణంతో దారుణంగా కొట్టారు. అలా కొడుతుంటే సాటి మనుషులుగా ఆపాల్సింది పోయి దాడి జరిగే సమయంలో సెల్ఫీలకోసం పోటీ పడ్డారు. వీరిలో అధికంగా యువకులే ఉన్నారు. ఓపక్క వారిని నిలువరించకుండా పైగా దెబ్బలతో సతమతమవుతున్న ఆ వ్యక్తితో సెల్ఫీలు తీసుకున్నారు. అయితే, తీవ్రంగా గాయాలపైన ఆ యువకుడిని పోలీసులు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలుకోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ 27 ఏళ్ల యువకుడు మతిస్థిమితం లేని వాడు. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో గల అత్తపాడి అనే గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో తిరుగుతూ బతికేస్తున్నాడు. అయితే, అతడు ఆ గ్రామంలోని దుకాణాల్లో తినుబండారాలు దొంగిలించి జీవనం సాగిస్తున్నాడని నలుగురు చెబుతుండటంతో అతడిని ప్రత్యేకంగా పట్టుకున్నారు. కట్టేసి కొన్ని గంటలపాటు టార్చర్ పెట్టారు. మధ్యాహ్నం వేళ జాలి చూపిన ఓ వ్యక్తి పోలీసులకు కబురు చేయడంతో వారు వచ్చి అతడిని విడిపించారు. అప్పటికే అతడు వాంతులు చేసుకొని కుప్పకూలిపోయాడు. ఐదుగంటల ప్రాంతంలో ఆస్పత్రికి తరలించగా అతడు చనిపోయాడు. -
మరో అభిమాని మరణించకుండా..
సాక్షి, చెన్నై : వీరాభిమాని మరణంతో నటుడు, దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన తన అభిమానిలా మరొకరు మృతి చెందకుండా లారెన్స్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆర్.శేఖర్ అనే లారెన్స్ అభిమాని ఆయనతో ఫోటో తీసుకునేందుకు వెళ్తుండగా చనిపోయాడు. ఇది లారెన్స్‌ను చాలా బాధించింది. దీంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా లారెన్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తనకు టైమ్ దొరికినప్పుడల్లా అభిమానుల దగ్గరకు తానే వెళ్లి పిక్స్ తీసుకుని వస్తానని.. అభిమానులెవరూ తన కోసం రావద్దని స్పష్టం చేశారు.ఈ మేరకు లారెన్స్ ఓ ట్వీట్ చేశారు. 'హాయ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్..! నాతో ఫొటో తీసుకునేందుకు వస్తూ ఇటీవలే నా వీరాభిమాని శేఖర్ చనిపోయాడని మీకందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది. అతని అంత్యక్రియలకు కూడా నేను వెళ్లాను. ఆ సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆ ఘటనతో నేనొక నిర్ణయం తీసుకున్నా. ఇక మీదట నాతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎవరూ నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. నేనే నా అభిమానులు ఉండే ప్రాంతాలకు వచ్చి వారితో ఫోటోలు దిగుతాను. ఇప్పటి నుంచి నాకు ఫ్రీ టైమ్ దొరికినప్పుడల్లా అభిమానులున్న ప్రాంతాలకే వచ్చి ఫోటోలు దిగుతా. మొదటగా ఈ నెల 7న సేలం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. నేను మీకోసం వస్తున్నా. శేఖర్ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను.’’ అని లారెన్స్ ట్వీట్ చేశారు. ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాలతో మానవత్వాన్ని చాటుకుంటున్న లారెన్స్ ఈ నిర్ణయంతో అభిమానుల మనసును మరోసారి గెలుచుకున్నారు. Hi dear Friends and Fans..! I’m coming for you to Salem on 7th pic.twitter.com/xX56Al7lpS — Raghava Lawrence (@offl_Lawrence) February 4, 2018 -
ప్రభాస్ సీక్రెట్ క్రష్.. ఓ బాలీవుడ్ హీరోయిన్!
సాక్షి, సినిమా : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు బాహుబలి సిరీస్ ఇచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆ చిత్రం మూలంగా డార్లింగ్ తన సిగ్గును పక్కనపెట్టేసి బాలీవుడ్‌కు వెళ్లి మరీ చిత్రాన్ని ప్రమోట్ చేయాల్సి వచ్చింది. ఏది ఏమైనా ప్రభాస్ ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న హీరో. మరి అలాంటి హీరోకి ఓ సీక్రెట్ క్రష్ కూడా ఉందంట. అది ఎవరి మీదో కాదు.. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టండన్. అఫ్ కోర్స్ ఈ విషయాన్ని ప్రభాస్ గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడనుకోండి. రవీనాకు తాను వీరాభిమానినని.. అందాజ్ అప్నా అప్నా చిత్రంలోని ‘ఎలో జీ సనమ్’ పాట ప్రతీ క్షణం తనని వెంటాడుతుందని ప్రభాస్ చెప్పాడు. ఆమెతో నటించే అవకాశం వస్తే అస్సలు వదలిపెట్టనన్నాడు. అయితే అనుకోకుండా బాహుబలి సిరీస్‌ను ఆమె భర్త అనిల్ టండానీ బాలీవుడ్లో డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఇంకేం బాహుబలి ప్రమోషన్ కోసం ముంబై వెళ్లిన ప్రతీసారి ప్రభాస్ రవీనా టండన్ దంపతులను కలిసేవాడు. ఆ తర్వాత కూడా వీలుచిక్కినప్పుడల్లా అక్కడికి వెళ్తున్న ప్రభాస్ అదే పని చేస్తూ వస్తున్నాడు. అంతెందుకు ఈ మధ్య కూడా ఓసారి డిన్నర్ కోసం ప్రభాస్ వాళ్లింటికి వెళ్లి.. రవీనాతో సెల్ఫీలు దిగి సంబరపడిపోయాడు. ఏది ఏమైనా కోట్ల సంఖ్యలో అభిమానులను తయారు చేసుకున్న ప్రభాస్.. ఓ అభిమానిగా తన ముచ్చట తీర్చుకోవటం మాత్రం ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో సాహోలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, మళయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
సెల్ఫీ దిగుతూ గల్లంతు.. మృతదేహాలు లభ్యం
సాక్షి, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోలవరం కుడికాలువ వద్ద నిన్న(బుధవారం) సెల్ఫీలు దిగుతూ ప్రమాదవశాత్తూ కాలువలో పడి గల్లంతైన మున్నా, కార్తీక్ అనే విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పోలవరం కుడి కాలువ లాకుల వద్ద మృతదేహాలు కనిపించినట్లు సమాచారం. మృతదేహాలను వెలికి తీసిన అనంతరం పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల మృతదేహాల వద్ద తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. -
సెల్ఫీకన్నా.. ప్రాణం గొప్పదా?!
-
సెల్ఫీకన్నా.. ప్రాణం గొప్పదా?!
కెమెరా ఫోన్లు అందులోనూ.. సెల్ఫీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాక.. ఈ పిచ్చి ప్రపంచమంతా బాగా ముదిరింది. ప్రమాదాల అంచుల్లోనూ, హరికేన్ల విలయతాండవం దగ్గరా.. యాక్సిడెంట్ అయిన చోటా.. ఇలా ఒకటేమిటి ప్రతిచోటా సెల్ఫీలే. ఈ పిచ్చి నేడు మరింత పీక్ స్టేజ్‌కు చేరుకుంది. అత్యంత ప్రమాకర ప్రాంతాల్లో సైతం సెల్ఫీ తీసుకుని దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనేంతగా యువతను పరుగులు తీయిస్తోంది. ఈ ప్రాంతంలో సెల్ఫీలు తీసుకునే క్రమంలో పదుల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకున్నారని అధికారులు చెబుతున్నా.. యువత ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సెల్ఫీ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తామంటోది నేటి యువత. -
టెకీ రక్తమోడుతుంటే సెల్ఫీలా!
పుణే: తీవ్ర రక్తస్రావం అవుతున్నా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణాలు కాపాడాలనే ఆలోచన కూడా లేకుండా వీడియోలు, ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. మరికొంత సమయానికి ఓ వ్యక్తి స్పందించి ఆస్పత్రికి తరలించినా టెకీ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషాదం పుణేలోని భోసారిలో బుధవారం చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ సతీవ్ ప్రభాకర్ మెటే స్వస్థలం ఔరంగాబాద్ కాగా మోషిలో నివాసం ఉంటున్నారు. స్థానిక బోసారిలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఏదో పని మీద సతీశ్ బుధవారం సాయంత్రం బయటకు వెళ్లారు. భోసారిలో రోడ్డుపై వెళ్తుండగా ఓ గుర్తుతెలియని వాహనం టెకీని ఢీకొట్టింది. అతడికి ఏమైందో చూడకుండా ఆ వాహనం డ్రైవర్ అలాగే వెళ్లిపోయాడు. కొన్ని క్షణాల్లోనే పదుల సంఖ్యలో జనాలు టెకీ చుట్టూ గుమిగూడారు. ఓవైపు తీవ్రంగా రక్తస్రావమవుతున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ సతీశ్‌ను కాపాడాల్సింది పోయి, కొందరు వీడియో తీస్తున్నారు. మరికొందరు గాయపడ్డ టెకీని ఫొటోలు, సెల్ఫీలు తీశారు. ఇంతలో కార్తీరాజ్ కాటే అనే డెంటిస్ట్ జరిగిన దారుణాన్ని చూసి చలించిపోయారు. కొందరి సాయంతో టెకీ సతీశ్‌ను పింపిరిలోని యశ్వంత్‌రావు చౌహాన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. టెకీని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతిచెందినట్లు నిర్ధారించారు. టెకీ సతీశ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన డెంటిస్ట్ కార్తీరాజ్ మాట్లాడుతూ.. బోసారిలో ఓ చోట కొందరు గుమిగూడగా వెళ్లిచూసి షాకయ్యాను. ఓ వ్యక్తి రక్తపు మడుగులో అపస్మారకస్థితిలో పడి ఉండగా చుట్టూ ఉన్నవారు సహాయం చేయాల్సింది పోయి తమ ఫోన్లలో ఇది చిత్రీకరిస్తున్నారు. నేను స్పందించినా అప్పటికే ఆలస్యమైందని ఆయన వాపోయారు. టెకీని ఢీకొన్న వాహనం నెంబర్‌ను గుర్తించిన వారు 020-27130003 కు కాల్ చేసి వివరాలు అందించాలని ఇన్స్పెక్టర్ భిమ్రావ్ షింగాడో కోరారు. -
ఇస్రో ‘బాహుబలి రాకెట్’ సెల్ఫీలు చూశారా..!
న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే అతి పెద్ద ప్రయోగాన్ని చేపట్టి విజయపతాకాన్ని ఎగరేసిన ఇస్రో ‘బాహుబలి’ రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్ 3డీ1 రాకెట్ మరో అద్భుతం చేసింది. తాను నింగిలోకి దూసుకెళ్లే క్రమంలో టకటకా సెల్ఫీలు తీసి పంపించింది. సెల్ఫీలు సాధారణంగా మనుషులు మాత్రమే తీసుకోవడం జరుగుతుండగా ఇలా రాకెట్లు స్వీయచిత్రాలు తీసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. దేశ చరిత్ర నలుదిశలా వ్యాపింపజేసేలా నిప్పులు చిమ్ముకుంటూ జీఎస్ఎల్వీ మార్క్3డీ1 రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన విషయం తెలిసిందే. 3,136 కిలోల బరువున్న భారీ ఉపగ్రహం జీశాట్–19ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రెండు రోజుల కిందట ఈ ప్రయోగం పూర్తికాగా తాజాగా సెల్ఫీ చిత్రాలు తీసి పంపించింది. అయితే, ప్రయోగం ప్రారంభమైన తర్వాత కూడా సోమవారం కొన్ని సెల్ఫీలు తీసుకుంది. బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్‌తో ఇన్ఫ్రారెడ్ కలర్లో కనిపిస్తూ 200 టన్నుల బూస్టర్లు ఎర్రగా మండిపోతున్న దృశ్యాలు, అనంతరం జీశ్యాట్ ఉపగ్రహాన్ని ఆర్బిట్‌లో ప్రవేశపెడుతున్నప్పటి చిత్రాలను తానే స్వయంగా చిత్రించి బుధవారం ఇస్రో శాస్త్రవేత్తలకు పంపించింది. -
రాజకీయాల్లోకి వస్తా!
-
రాజకీయాల్లోకి వస్తా!
దేవుడు ఆదేశిస్తేనే... అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలన అందిస్తా - రజనీకాంత్ సంచలన ప్రకటన సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాల్లోకి రావాలనే కోరిక తనకు లేదని, ఒకవేళ దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వచ్చి అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలన అందిస్తానని సూపర్‌స్టార్ రజనీకాంత్ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన ద్వారా రజనీ రాజకీయ అరంగేట్రంపై సంకేతాలు ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏడాదికోసారి అభిమానులను కలవడం అలవాటుగా పెట్టుకున్న రజనీకాంత్ కొన్నేళ్ల క్రితం దాన్ని నిలిపే శారు. అయితే సుదీర్ఘ విరామం తరువాత సోమవారం మళ్లీ సమావేశమయ్యారు. ఐదు రోజులపాటు జిల్లాల వారీగా అభిమానులను కలుసుకునే సమావేశాలు చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి రజనీ ప్రసంగించారు. 25 ఏళ్ల క్రితం ఒకసారి రాజకీయాలు మాట్లాడి తలనొప్పులు తెచ్చుకున్నానని, అప్పటి నుంచి తనను రాజకీయాలతో ముడిపె ట్టడం పరిపాటిగా మారిందని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతి ఎన్నికల్లోనూ తన పేరు వాడుకుంటున్నారని విమర్శిం చారు. దీంతో తాను ఎవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదని తరచూ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అభిమానులైన మీరు రాజకీయాల్లో ఉండండి, అయితే రాజకీయాలను అడ్డుపెట్టుకుని సంపాదించాలని ఆశించకండని హితవు పలికారు. తన జీవితాన్ని దేవుడే నడిపిస్తున్నాడని, దేవుడు నన్ను రాజకీయాల్లోకి దింపితే స్వచ్ఛమైన హృదయం, శరీరంతో సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వస్తే డబ్బు సంపాదించాలని ఆశించేవారిని దగ్గరికి రానీయనని స్పష్టం చేశారు. ఒకప్పుడు తాను అతిగా మద్యం తాగేవాడినని, పెద్దల సలహాతో మానివేశానని చెప్పారు. మద్యం తాగవద్దు, ఆస్తులు కోల్పోవద్దని హితవు పలికారు. తొలిసారిగా చిహ్నం: అభిమానులతో రజనీ సమావేశం కొత్తకాకున్నా, ఈ సమావేశంలో వేదికపై అమర్చిన ఒక చిహ్నం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొన్నేళ్ల క్రితం ‘బాబా’ చిత్రంలో రజనీకాంత్ తన కుడిచేతి వేళ్లను చిత్రంగా మడిచి చూపుతుంటారు. తెల్లని కలువపువ్వులో అదే తరహాలో చేతివేళ్లు చిహ్నంగా తీర్చిదిద్ది ఫ్లెక్సీలో అమర్చారు. -
రాజకీయాలపై క్లారిటీ ఇచ్చిన రజనీ
-
ఎనిమిదేళ్ల తర్వాత రజనీకాంత్..
చెన్నై: ఎనిమిదేళ్ల తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్‌ను కలవనున్నారు. ఇందుకు చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమండపం వేదిక కానుంది. ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ నాలుగు రోజుల పాటు రజనీకాంత్ ఫ్యాన్స్‌ను కలుస్తారు. చివరగా 2007లో శివాజీ సినిమా విడుదల తర్వాత రజనీ అభిమానులను కలుసుకున్నారు. ఈ మీట్లో విడిగా ఒక్కొక్కరితో రజనీ సెల్ఫీ దిగుతారు. అయితే, రజనీతో విడిగా మాట్లాడే అవకాశం మాత్రం లేదు. వాస్తవంగా ఏప్రిల్‌లోనే ఫ్యాన్స్ మీట్ జరగాల్సివుంది. కొన్ని అనివార్య కారణాలతో అది వాయిదా పడింది. -
‘సెలబ్రిటీలతో సెల్ఫీలు దిగడం ఆపేయండి’
న్యూఢిల్లీ: సెలబ్రిటీలతో సెల్ఫీలు దిగడం ఆపేయాలని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) తమ సంస్థ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఆధార్ కార్డుకు సంబంధించి ఎంఎస్ ధోనీ వచ్చినప్పుడు సంస్థలో సెల్ఫీల గందరగోళం నెలకొని పనులకు అంతరాయం ఏర్పడింది. కొంతమంది ఉద్యోగుల మధ్యలో మనస్ఫర్థలు కూడా ఏర్పడ్డాయట. ఈ నేపథ్యంలో ఇలాంటివి మున్ముందు జరగకుండా ఉండేందుకు ఇకపై సెలబ్రిటీలు వస్తే వారితో ఫొటోలు దిగడం, సెల్ఫీలు తీసుకోవడం ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత ప్రాముఖ్యతలను విధుల నిర్వర్తించే సమయంలో పక్కన పెట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ‘ఆధార్ కార్డు నమోదు చేసే సమయంలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని మేం మా ఉద్యోగులకు ఆదేశించాం. సెలబ్రిటీల ఆధార్ నమోదు చేసే సమయంలో ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత ప్రాముఖ్యతకు చోటివ్వొద్దు. సెల్ఫీల్లాంటివి తీసుకోవడం చేయొద్దు’ అని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే స్పష్టం చేశారు. -
యాసిడ్ బాధితురాలు పక్కన కూర్చుని సెల్ఫీలు
లక్నో : సెల్ఫీ పిచ్చి ఎంత దారుణంగా ఉందంటే.. ఓ వైపు యాసిడ్ బాధితురాలు బెడ్‌పై విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే ఆమెకు సంరక్షణగా ఉండాల్సిన మహిళా పోలీసులు ఆమె బెడ్ పక్కనే కూర్చుని సెల్ఫీలు దిగుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కూతురు పరీక్షల కోసం లక్నో వెళ్లి తిరిగి రైలులో వస్తున్న ఓ 35 ఏళ్ల మహిళపై నిన్న గ్యాంగ్ రేప్ జరిగింది. గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు ఆమెకు బలవంతంగా యాసిడ్ కూడా తాగించారు. ఈ ఘటన అనంతరం మాట్లాడలేని స్థితిలోకి వెళ్లిన మహిళ లక్నో పోలీసులను ఆశ్రయించింది. వెంటనే ఫిర్యాదు నమోదుచేసుకున్న పోలీసులు, ఆమెను కింగ్ జార్జ్స్ మెడికల్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు సంరక్షణగా ముగ్గురు మహిళా పోలీసులను నియమించారు. అయితే ఆమెకు ప్రొటక్షన్ గా వచ్చిన ఈ మహిళా పోలీసులు మాత్రం బాధితురాలి బెడ్ పక్కన కూర్చుని నవ్వుతూ ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఓ వైపు బాధితురాలు గ్యాంగ్ రేప్, యాసిడ్ అటాక్‌తో కొట్టుమిట్టాడుతుంటే, మహిళా పోలీసులై ఉండి నవ్వుతూ ఫోటోలు దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పోలీసులపై వెంటనే యాక్షన్ తీసుకుంటూ వారికి సస్పెన్షన్ ఆదేశాలు జారీచేశారు. ఈ ముగ్గురు పోలీసులకు కనీసం ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదని, వెంటనే వీరిపై చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసు ఆఫీసర్ ఏ సతీష్ గణేష్ చెప్పారు. అయితే ఈ బాధితురాల్ని పరామర్శించేందుకు యూపీ కొత్త సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆసుపత్రికి వచ్చి వెళ్లాక ఈ సెల్ఫీల ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రికి వచ్చిన యోగి ఆదిత్యానాథ్ వెంటనే ఆ ఆగంతుకులను అరెస్టు చేసి, చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలో ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ మహిళపై 2008 నుంచి ఇప్పటికీ పలుసార్లు గ్యాంగ్ రేప్‌లు జరిగాయి. పలుసార్లు ఆమెకు ఈ దిగ్భ్రాంతికర సంఘటనలు ఎదురవుతుండటంతో ఆమె ఎప్పటినుంచో ప్రొటక్షన్ కూడా కోరుతున్నారు. కానీ ఆమెకు ఇప్పటివరకు ఎలాంటి ప్రొటక్షన్ అందలేదు. యాసిడ్ అటాక్ బాధితుల కోసం ఈమె ఓ కేఫ్ లో పనిచేస్తోంది. తన కూతురు పరీక్షల కోసం లక్నో వెళ్లి రైలులో వస్తున్న మహిళపై ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రైన్ లక్నో వచ్చిన వెంటనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. యాసిడ్ ను బలవంతంగా తాగించడంతో మాట్లాడలేని స్థితిలో ఉన్న ఈమె, జరిగిన విషయమంతా రాతపూర్వకంగా తెలియజేసింది. -
చార్మినార్‌కు సెల్ఫీ టెర్రర్!
సాక్షి, హైదరాబాద్: చార్మినార్.. హైదరాబాద్ నగర సంతకం. ఆ చారిత్రక కట్టడం పైనుంచి నగర సౌందర్యాన్ని చూస్తుంటే ఆ అనుభూతే వేరు. పైఅంతస్తు పిట్టగోడకు అనుకుని నిలబడి, నగిషీలు చెక్కిన గోడలమధ్య నుంచి భాగ్యనగర అందాలు వీక్షించాలని పర్యాటకులు తహతహలాడుతుంటారు. కానీ కొత్తగా ముదిరిన సెల్ఫీల పిచ్చి కారణంగా చార్మినార్‌పై ‘అడ్డుగోడలు’ వెలియనున్నాయి. యువత, కొందరు పర్యాటకులు పిట్టగోడలపై కూర్చుని, పైకి ఎక్కి సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో.. ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో పర్యాటకులు పిట్టగోడల వరకు వెళ్లకుండా స్టీల్ కడ్డీలతో అడ్డుగోడలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదాన్నీ లెక్కచేయకుండా.. సెల్ఫీ.. సెల్ఫీ.. సెల్ఫీ.. సరదాగా మొదలై ఇప్పుడు వణుకుపుట్టిస్తున్న అంశమిది. ఈ మోజులో ప్రమాదకర సాహసాలకు దిగుతూ ప్రాణాలు కోల్పోతున్నవారెందరో ఉన్నారు. ఇప్పుడీ సెల్ఫీ దడ చార్మినార్‌ను చుట్టుముట్టింది. చార్మినార్‌కు వస్తున్న యువత సెల్ఫీ తీసుకునేందుకు కట్టడం పిట్టగోడపైకి ఎక్కుతుండటం అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఏ క్షణాన ఎవరు ప్రమాదానికి గురవుతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. సెక్యూరిటీ సిబ్బంది సంఖ్యను పెంచినా ఫలితం లేకపోవటంతో.. ఇక ముందు పర్యాటకులను మొదటి అంతస్తులో కట్టడం అంచుల వరకు వెళ్లకుండా నియంత్రించాలని నిర్ణయించారు. ఈ మేరకు స్టెయిన్లెస్ స్టీలు పైపులతో మూడడుగుల ఎత్తుతో బారికేడ్లు నిర్మిస్తున్నారు. నెల రోజుల్లో అది పూర్తికానుందని అధికారులు చెబుతున్నారు. రక్షణ సిబ్బందితో ఘర్షణ.. చార్మినార్‌ను సగటున రోజుకు ఐదున్నర వేల మంది సందర్శిస్తుంటారు. అందులో కనీసం 1,500 మంది సెల్ఫీల కోసం హడావుడి చేస్తున్నారు. ఇంతమందిని నియంత్రించటం పరిమిత సంఖ్య లో ఉండే సెక్యూరిటీ సిబ్బంది వల్ల కావట్లేదు. గతంలో మొదటి అంతస్తులో కేవలం నలుగురు సెక్యూరిటీ సిబ్బంది ఉండేవారు. సెల్ఫీ ఆగడాలు పెరిగిపోవడంతో వారి సంఖ్యను ఆరుకు పెంచటంతోపాటు పురావస్తు శాఖ (ఏఎస్ఐ) ఉద్యోగులు నలుగురిని కూడా నియమించారు. కానీ గుంపులుగా వచ్చే సందర్శకులు సిబ్బందితో ఘర్షణ పడి మరీ పిట్టగోడలెక్కి సెల్ఫీలు తీసుకుంటున్నారు. చెక్కతో చేసిన బారికేడ్లు ఏర్పాటు చేసినా.. సందర్శకులు వాటిని జరిపి మరీ ముందుకెళుతున్నారు. కొందరు జారి కిందపడిపోయే దాకా వెళ్లింది. సిబ్బంది సందర్శకులను గట్టిగా నియంత్రించే ప్రయత్నం చేస్తుండటంతో ఘర్షణలు జరిగి పోలీసుస్టేషన్ వరకు వెళ్తున్నాయి. దీంతో అ«ధికారులు విషయాన్ని ఢిల్లీలోని పురావస్తు శాఖ(ఏఎస్ఐ) ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చార్మినార్ వారసత్వ కట్టడం కావడంతో ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులు అనుమతివ్వలేదు. కానీ గోడలకు అనుసంధానం చేయకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు అనుమతించారు. దీంతో స్టీలు పైపులతో బారికేడ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదాలూ.. నేరాలూ.. * ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఓ కుటుంబంలోని నలుగురు 1986లో చార్మినార్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో సందర్శకులకు పైకి ఎక్కేందుకు అనుమతి రద్దు చేశారు. తిరిగి 2000లో అనుమతి పునరుద్ధరించినా మొదటి అంతస్తుకే పరిమితం చేశారు. * 2006లో ఓ గృహిణి కట్టడంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. * 2007లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా తోటి పర్యాటకులు కాపాడారు. * 2009లో 16 ఏళ్ల బాలికను ఓ యువకుడు కట్టడంపై నుంచి తోసేయటంతో కిందపడి తీవ్ర గాయాలతో మృతి చెందింది. -
సెల్ఫీ స్పాట్.. ట్యాంక్‌బండ్..!
► ఇక్కడికి వచ్చే వారు ఒకటో రెండో సెల్ఫీలు తీసుకోకుండా వెళ్లరు ► ‘లవ్ హైదరాబాద్’ టైపో స్కల్ప్చర్ ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘లవ్ హైదరాబాద్ టైపో స్కల్ప్చర్(లవ్ హైదరాబాద్ అక్షరా లతో కూడిన శిల్పం)’తో నగరంలోని ట్యాంక్‌బండ్ సెల్ఫీ స్పాట్‌గా మారనుం దని.. ఇక్కడికొచ్చే ప్రతి ఒక్కరూ ఒకటో, రెండో సెల్ఫీలు తీసుకోకుండా వెళ్లరని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. ‘స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్’ ముగింపును పురస్కరించుకుని ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’, ‘కృష్ణకృతి ఫౌండేషన్’ సంస్థలు జీహెచ్ఎంసీ సహకారంతో ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ‘లవ్ హైదరాబాద్’ టైపో స్కల్ప్చర్ను శుక్రవారం సాయంత్రం మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లవ్ హైదరాబాద్ టైపో స్కల్ప్చర్ నగరానికి అదనపు ఆకర్షణ కానుందన్నారు. హైదరాబాద్ ప్రజలకు ఆహ్లాదం, ఉల్లాసం కలిగించేలా, పర్యాటక ప్రాంతంగా ట్యాంక్‌బండ్‌ను మరింత సుందరంగా తీర్కిదిద్దాల్సిన బాధ్యత తమపై ఉంద న్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పర్యాటక శాఖల సమన్వయంతో సాధ్యమైనంత త్వరగా ట్యాంక్‌బండ్‌ను, హైదరాబాద్‌ను అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్లో భాగంగా ముంబై, ఢిల్లీ తరహాలో నెక్లెస్‌రోడ్‌లో పీపుల్స్ ప్లాజా ఎదుట ఎంఎస్ మక్తాలోని భవనాలు, గోడలకు స్థానిక కళాకారులతోపాటు జాతీయ, అంతర్జాతీయ కళాకారులు సృజనాత్మకం గా వేసిన చిత్రాలను మంత్రి సందర్శించా రు. మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. నాలుగు వందల ఏళ్లకు పైబడిన ఘన చరిత్ర కలిగిన హైదరా బాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థారుులో మరింతగా అభివృద్ధి పరిచేందుకు ప్రయత్నిస్తున్నామని, తద్వారా పర్యాట కంగానూ నగరం మరింత అభివృద్ధి చెందగలదని అన్నారు. ప్రభుత్వ సలహా దారు బీవీ పాపారావు మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో కళాత్మకత, సౌందర్య దృష్టి పెరుగుతాయ న్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, టూరిజం సెక్రటరీ బి.వెంకటేశం, ట్రాఫిక్ ఏసీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆజాద్ తుపాకీతో సెల్ఫీ తీసుకోవచ్చు
స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ ఉపయోగించిన పిస్టల్ తో సెల్ఫీ దిగేందుకు అలహాబాద్ మ్యూజియం అనుమతిచ్చింది. తనను ప్రాణాలతో పట్టుకోవాలని బ్రిటిషర్లు ప్రయత్నించగా.. ఆజాద్ తుపాకీతో తనని తాను కాల్చుకుని మరణించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యూపీ సాంస్కృతిక సంక్షేమ శాఖ ప్రజలకు ఆజాద్ పిస్టల్ తో సెల్ఫీ తీసుకునేందుకు అనుమతినివ్వాలని మ్యూజియానికి సూచించింది. కనీస ధరతో పిస్టల్ ను వీడియో తీసుకునేందుకు అనుమతి మంజూరు చేయాలని పేర్కొంది. 1903 కోల్ట్ మోడల్ కు చెందిన ఈ పిస్టల్ ను పాకెట్ హ్యమర్ లెస్ సెమీ-ఆటో టెక్నాలజీతో తయారుచేశారు. 1931 ఫిబ్రవరి 27వ తేదిన బ్రిటిష్ పోలీసులతో ఆల్ఫ్రెడ్ పార్కులో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆజాద్ ఈ తుపాకీతో తనని తాను కాల్చుకున్నారు. ఆజాద్ గురించి నేటి యువతరానికి తెలియజెప్పడానికే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు మ్యూజియం డైరెక్టర్ చెప్పారు. పిస్టల్ తో సెల్ఫీ కోసం రూ. 50, వీడియోకు రూ.1,000 చార్జ్ చేయనున్నట్లు చెప్పారు. మహాత్మాగాంధీని అంత్యక్రియలకు తీసుకువెళ్లేప్పుడు ఉపయోగించిన వాహనంతో కూడా సెల్ఫీలు తీసుకోవచ్చని తెలిపారు. -
అలాంటి సెల్ఫీలను పోస్ట్ చేయవద్దు!
ముంబై: ఫొటో షాప్ చేసిన సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దంటూ బాలీవుడ్ నటి ఈవ్లెన్ శర్మ కోరుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే... మనం ఎలా ఉన్నామో.. చక్కగా అలాగే సెల్ఫీలు, ఫొటోలు దిగి ఆన్ లైన్ మాధ్యమాలలో అప్ లోడ్ చేస్తే బాగుంటుందని ఇండో-జర్మన్ నటి పేర్కొంది. సహజ సౌందర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అయితే ఫొటోషాప్ చేసిన సెల్ఫీలు, ఫొటోలతో అసలు లుక్ బయటపడదని చెప్పింది. తమని తాము ప్రతి ఒక్కరూ ప్రేమించుకోవాలని, అందులో భాగంగా మంచి సెల్ఫీలు దిగాలంటూ పిలుపునిచ్చింది. ఇప్పటికైనా మేల్కొనండీ.. సహజ అందాలను గుర్తించండీ అని చెబుతోంది. నిజానికి ఈవ్లెన్ శర్మకు సెల్ఫీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అలవాటు ఉంది. సెలబ్రిటీలు సెల్ఫీలు తీసుకున్నాక ఫొటోషాప్ చేసి వాటికి హంగులు అద్దిన తర్వాత అప్ లోడ్ చేస్తున్నారని, అందులో సహజత్వం ఉండదని అభిప్రాయపడింది. ఆమె నటించిన 'భయ్యాజీ సూపర్ హిట్' త్వరలో విడుదల కానుంది. -
సెల్ఫీతో బహుపరాక్
ప్రముఖులని సెల్ఫీలు ఎలా బోల్తా కొట్టించగలవో చెప్పే ఒక ఘటన ఆ మధ్య పాకిస్తాన్లో జరిగింది. ముఫ్తి అబ్దుల్ కావి పాకిస్తాన్‌కు చెందిన అత్యున్నత ధార్మిక పీఠం రయిత్ ఇ హిలాల్ సభ్యుడు. ఆయనతో కలసి వివాదాస్పద మోడల్ ఖాందిల్ బలోచ్ తీసు కున్న మూడు సెల్ఫీలు ఫేస్బుక్ పేజీలలో కనిపించ డంతో అబ్దుల్ కావి జాతకమే మారిపోయింది. ఇంతకీ ఆ ఫొటోతో పాటు కనిపించిన చిత్రాలు, వినిపించిన మాటలు బలోచ్‌కు కావి మంచి మాటలు చెప్పాడనే అనిపిస్తున్నాయి. మోడలింగ్ వదిలిపెట్టి, వివాదాల నుంచి బయటపడి ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలని ఆయన ఆ మోడల్‌కి ఉపదేశించారు. కానీ ఇది చాలామందికి నచ్చలేదు. దీనితో ఆయనను పీఠం నుంచి సస్పెండ్ చేశారు. తన పార్టీ తేహ్రీక్ ఇన్సాఫ్ సభ్యత్వం నుంచి కూడా ఇమ్రాన్‌ఖాన్ ఆ మత పెద్దను సస్పెండ్ చేశారు. ఆమె ఎన్నో విన్నపాలు చేసుకుంటే, ఒక హోటల్లో కలుసుకోవడానికి తాను అనుమతించానని కావి డాన్న్యూస్కి చెప్పారు. కావి అంత మంచి విషయాలేమీ చెప్పలేదంటోందామె. -
టాలెస్ట్ పోలీసుతో సెల్ఫీల పిచ్చి
చండీగఢ్: హర్యానాలోని గుర్గావ్లో ట్రాఫిక్ పోలీసు విధులు నిర్వహిస్తున్న అత్యంత పొడుగరి రాజేష్ కుమార్ ఇప్పుడు ఓ పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. దారంటా పోయే బాటసారులే కాకుండా కార్లలో వెళుతున్న వారు కూడా దిగొచ్చి ఆయనతో సెల్ఫీలు దిగుతున్నారు. ఇప్పుడాయన డ్యూటీలో ఎక్కువ సమయాన్ని పర్యాటకులు, ప్రయాణికులతో సెల్ఫీలు దిగేందుకే కేటాయిస్తున్నారు. ఏడు అడుగుల నాలుగు అంగుళాల ఎత్తున్న 39 ఏళ్ల రాజేష్ కుమార్ భారత పోలీసు డిపార్ట్మెంట్లోనే అత్యంత పొడుగరి రికార్డుల్లోకి ఎక్కారు. తొలుత పంజాబ్‌లో పోలీసుగా చేరిన ఆయన ఇప్పుడు గుర్గావ్లో ట్రాఫిక్ పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రాఫిక్ భద్రతా వారోత్సవాల కారణంగా ఆయన సెలబ్రిటీగా మారిపోయారు. తన అసాధారణ పొడుగు కారణంగా తాను ఎన్నడూ ఇబ్బంది పడలేదని, తన పొడుగుతనం తన విధులకు ఎంతో ఉపయోగపడిందని కూడా ఆయన చెబుతున్నారు. ట్రాఫిక్ జామైన సందర్భాల్లో తాను పొడుగు ఉండడం వల్ల చాలా దూరం వరకు చూసే అవకాశం లభిస్తోందని, ఫలితంగా ఎక్కడ సమస్య ఉందో తెలుస్తోందని చెప్పారు. తన పొడుగు కారణంగా చిన్నప్పుడు తనను స్కూల్లో కొంతమంది ఆకతాయిలు ఏడిపించే వారని, వాటిని ఎప్పుడూ లెక్క చేయలేదని ఆయన చెప్పారు. ఇప్పుడు తాను పొడుగు ఉన్న కారణంగానే సెలబ్రిటీగా మారిపోవడం, తనతో సెల్ఫీలు దిగేందుకు ప్రజలు పోటీ పడడం చూస్తుంటే ఆనందంగా ఉంటోందని చెప్పారు. వాస్తవానికి తనకు ‘వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టేన్మెంట్ (డబ్లూడబ్లూఈ)’లో పాల్గొనడం ఇష్టమని, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలైనప్పుడల్లా విధులకు సెలవుపెట్టి రెజ్లింగ్ శిక్షణకు వెళుతున్నానని ఆయన తనను కలసుకున్న మీడియాకు తెలిపారు. తాను రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనడం ద్వారా కూడా ప్రజలను విశేషంగా ఆకర్షిస్తానన్న నమ్మకం కూడా తనకు ఉందని ఆయన చెప్పారు. -
అమ్మాయిలూ.. సెల్ఫీలతో జరభద్రం!
► అర్ధనగ్న సెల్ఫీలు సేకరించి బ్లాక్మెయిల్ ► అమ్మాయిలపై వల వేస్తున్న సైబర్ నేరగాళ్లు ► కేసులు పెట్టేందుకు ముందుకురాని తల్లిదండ్రులు ► తెలిసిన వారి చేతుల్లోనే ఎక్కువ మోసాలు ► ఎవరికీ ఫొటోలు ఇవ్వద్దని సైబర్ క్రైం పోలీసుల సూచన హైదరాబాద్ అమ్మాయిలను బుట్టలో వేసుకుని.. వాళ్లతో అర్ధనగ్నంగా సెల్ఫీలు తీసుకుని.. ఆ తర్వాత ఆ ఫొటోలతో వాళ్లను బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యవహారాలు హైదరాబాద్‌లో ఎక్కువయ్యాయి. సఫిల్‌గూడకు చెందిన నిజాముద్దీన్ హైదర్ (32) 2011లో హైదరాబాద్‌కు ఇంటర్వ్యూకు వచ్చిన ఎంబీఏ విద్యార్థినితో పరిచయం పెంచుకుని, తాను అనాథనని చెప్పి స్నేహం చేశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. రెండేళ్ల పాటు వారి స్నేహం కొనసాగింది. ఈ మధ్యలో ఆమెతో సన్నిహితంగా ఉంటూ సెల్ఫీలు తీసుకున్నా, ఆమెకు అనుమానం రాలేదు. తర్వాత అతడికి అప్పటికే పెళ్లయిన విషయం ఆమెకు తెలిసింది. అప్పట్నుంచి ఆ సెల్ఫీలతో ఆమెను బ్లాక్మెయిల్ చేయడంతో ఆమె సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఎట్టకేలకు మొన్న ఏప్రిల్ నెలలో నిజాముద్దీన్‌ను అరెస్టు చేశారు. మరోకేసులో, భోలానగర్‌కు చెందిన అబ్దుల్ మాజిద్ (21) కొందరు టీనేజి అమ్మాయిల నుంచి వందలాదిగా అర్ధనగ్న సెల్ఫీలు సేకరించాడు. ఫేస్బుక్లో వాళ్లతో అమ్మాయిలా చాట్ చేస్తూ ఇవి తీసుకున్నాడు. అమ్మాయిలు తమ తల్లిదండ్రులకు కూడా తెలియని చాలా విషయాలు అతడితో చెప్పేవారు. మందుకొట్టడం, సిగరెట్లు తాగడం, బోయ్‌ఫ్రెండ్లు, సెక్స్ అనుభవాలు.. అన్నింటినీ వెల్లడించేవారు. ఆ ఫొటోలు, వివరాలు తీసుకున్న తర్వాత.. వాటిని ఇంటర్నెట్లో పెడతానంటూ అతడు వాళ్లను బ్లాక్మెయిల్ చేశాడు. ఏడు నెలల్లోనే రెండుసార్లు అరెస్టయిన అతడిపై పోలీసులు పీడీ యాక్ట్ కూడా పెట్టారు. మహిళలు ఎ్టటి పరిస్థితుల్లోనూ సెల్ఫీలను ఇతరులకు షేర్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రైం విభాగానికి వచ్చే కేసుల్లో చాలావరకు తమకు తెలిసినవారి చేతుల్లో మోసపోయేవారే ఉంటున్నారన్నారు. చాలా కేసుల్లో అమ్మాయిల తల్లిదండ్రులు కేసు పెట్టడానికి ఇష్టపడకపోవడంతో పోలీసులు నిందితులను పట్టుకున్నా, ఫొటోలు డిలీట్ చేసి.. వాళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చి పంపేయాల్సి వస్తోంది. -
సెల్ఫీల కోసం నా ఇంటి ముందు పడిచస్తారు..!
లండన్: హాలీవుడ్ అందాల భామ జెన్నిఫర్ లారెన్స్ పెద్ద గొప్పలకు పోతోంది. తనకు పాపులారిటీ ఎంత ఉందో మనకు చెప్పకనే చెబుతోంది. తన కోసం ఎప్పుడూ ఇంటి ముందు ఓ పది మంది మగవాళ్లు పడిగాపులు కాస్తారని చెప్పింది. తనతో ఫొటో దిగేందుకు ఎప్పుడూ చాలా మంది ఇలా వస్తూనే ఉంటారని, వారికి తన దర్శనం కోసం ఎదురుచూపులు తప్పవని తెలిసినా ఈ ప్రక్రియ జరగుతూనే ఉంటుందని ఈ చిన్నది హోయలు పోయింది. ఎక్స్ మెన్ మూవీతో జెన్నిఫర్ లారెన్స్ స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. ఎప్పుడూ పాత వ్యక్తులేనా.. అంటూ బుంగమూతి పెట్టుకుంటోందట. ఎప్పుడూ అవే ముఖాలను చూడటం బోర్ కొడుతుందని, తనతో సెల్ఫీల కోసం కొత్త వ్యక్తులు రావాలని ఈ ముద్దుగుమ్మ ఆశ పడుతుంది. నిద్రలేవగానే కొత్త వ్యక్తులను చూడాలని తాపత్రయపడగా అదే వ్యక్తులు ప్రతిరోజు ఇంటి ముందు తారస పడుతుండటంతో కాస్త నిరాశ చెందిన విషయాన్ని వెల్లడించింది. రెగ్యూలర్ గా ఆ పది మంది వ్యక్తులు తన ఇంటి ముందు ఆమె దర్శనం కోసం పడుకుని ఉంటారని, ఈ విషయాన్ని తోటి నటీనటులతో పంచుకున్నట్లు వివరించింది. వారిలో కొందరికి ఇదే సమస్య ఉందని చెప్పారని, ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నందుకు అదృష్టవంతులుగా భావించాలని వారు డిసైడ్ అయిపోయారట. ఇంటి వద్ద మరీ ఆ విధంగా పడిగాపులు కాస్తూ ఎదురుచూసే కంటే కూడా షూటింగ్స్ లో, మూవీ ప్రమోషన్లలో పాల్గొన్నప్పుడు, సినిమాలో తనను ఫ్యాన్స్ చూడటాన్ని మాత్రమే ఎంకరేజ్ చేస్తానని జెన్నిఫర్ అంటోంది. -
అనుష్క సెల్ఫీలు చూస్తే..
మూతి మూడు వంకర్లు తిప్పి, రకరకాల హావభావాల సెల్ఫీ ఫోజులతో సెల్పీలకే కొత్త అర్థాన్నిస్తున్న విభిన్నమైన ఫోటోలను మనం సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో కుర్రకారు, బ్యూటీలు, సెలబ్రిటీలు, హీరోహీరోయిన్లనే తారతమ్యం లేదు. ఎవ్వరూ తక్కువ తినడంలేదు. మేము సైతం అంటూ సెల్ఫీలతో పిచ్చెక్కించడం మామూలే. ఇపుడు ఈ కోవలోకి తాజాగా టాలీవుడ్ సూపర్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా చేరిపోయింది. అవును... సాధారణంగా సోషల్ మీడియా హల్ చల్ కి దూరంగా ఉండే ఈ బొమ్మాళి సెల్పీలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వినయం, అభినయం కలగలుపుతో అరవిచ్చిన అందం అనుష్క రీసెంట్గా తన ఫేస్ బుక్ పేజ్‌లో అమ్మ, నాన్న ,అన్నయ్య, కజిన్లతో కలిసి విచిత్ర హావభావాలతో సెల్ఫీలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేఈ గాడ్జియస్ బ్యూటీ ఫోటోలు వైరల్ అయ్యాయి. వరుస అవకాశాలతో బిజీగా ఉండే అనుష్క కుటుంబంతో సరదాగా గడిపిన క్షణాలను ఫ్యామిలీ టైమ్, ఫన్ టైం..అంటూ షేర్ చేసింది. మాంచి రిలాక్సింగ్ మూడ్ లో ఉన్నప్పటి తన చిలిపి, చిలిపి సెల్ఫీలను పోస్ట్ చేసింది. కాగా అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో తన టాలెంట్ ను నిరూపించకున్న ఈ సైజ్ జీరో హీరోయిన్ ప్రస్తుతం బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ లో బిజీగా ఉంది. మరోవైపు చిరంజివి ప్రతిష్టాత్మక 150వ సినిమాలో మెగాస్టార్ తో జతకట్టేందుకు అనుష్క దాదాపు సైన్ చేసిందనేది టాలీవుడ్ టాక్. -
పాప్ స్టార్ మరోసారి మాట తప్పాడు..
లాస్ ఏంజెలిస్: పాప్ స్టార్ జస్టిన్ బీబర్ ఈ ఏడాది మరోసారి మాటతప్పాడు. స్మోకింగ్ కు దూరంగా ఉంటానని బహిరంగంగానే ప్రకటించిన పాప్ సంచలనం బీబర్.. కొన్ని రోజులకే పొగతాగుతూ కెమెరాకు చిక్కి తొలిసారి మాట తప్పాడు. ఈ న్యూ ఇయర్ నుంచి స్మోక్ చేయనని నిర్ణయించుకున్నానని చెప్పిన కొద్ది రోజులకే.. జనవరి 9న సాయంకాలం ఓ హోటల్ బయట సిగరెట్ కాలుస్తూ కెమెరాకు చిక్కిన విషయం తెలిసిందే. మరోసారి తాను పదేపదే చెప్పిన మాట తప్పాడు బీబర్. అభిమానులతో సెల్ఫీలు, ఫొటోలు దిగనని చెప్పిన బీబర్.. మే 10న ఓ హోటల్ మేనేజర్ తో సెల్ఫీలు దిగాడు. దీంతో రెండోసారి మాట తప్పినట్లయింది. బోస్టన్, మసాచుసెట్స్ లో హాయిగా పర్యటిస్తున్న బీబర్ గతంలో తానిచ్చిన నో సెల్ఫీ ప్రామిస్ కు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. మేనేజర్ తో సెల్ఫీ దిగడం, అది సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఫ్యాన్స్ తనను కలిసినప్పుడు కనీసం పలకరించరని, కేవలం ఫొటోలకు మాత్రమే ఫోజులిస్తారని కాస్త అప్ సెట్ అయ్యాడు. అయినా సరే అభిమానులు కోరడంతో సెల్ఫీలకు సై అంటున్న పాప్ స్టార్ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. -
సెల్ఫీలు.. అహంకారులు!
సియోల్: తమ అందాన్ని చూసుకొని మురిసిపోయే వారు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా సెల్ఫీలు పెడతారని ఓ అధ్యయనంలో తేలింది. దక్షిణ కొరియాలోని కొరియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు స్వయం మోహితం (నార్సిసిజం)కు...వ్యక్తుల సెల్ఫీ పోస్టింగ్, వాటికొచ్చిన కామెంట్లపై ఆసక్తి చూపడం మధ్యగల సంబంధాన్ని అధ్యయనం చేశారు. కాగా తమకొచ్చిన కామెంట్లు, ఇతరుల సెల్ఫీలపై వారు ఫీడ్ బ్యాక్ ఇచ్చే అవకాశాలు తక్కువేనని తేల్చారు. నలుగురిలో గౌరవం పొందడం కోసం ఇతరుల కన్నా వారు తమను తాము ఎక్కువగా చూపించుకునేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. ఇలాంటివారిలో అహంకార ధోరణి ఎక్కువగా కనిపిస్తుందని, ఇతరుల అభిప్రాయాలను వీరు గౌరవించేందుకు ఆసక్తి చూపరని శాస్త్రవేత్తలు తెలిపారు. -
సెల్ఫీలు పెట్టేది అహంకారులే!
సియోల్: అహంకార పూరిత వ్యక్తులే సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ అయిన ఫేస్బుక్, ట్విటర్లలో సెల్ఫీలు పెడతారని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధనను దక్షిణ కొరియాకు చెందిన కొరియా వర్సిటీ చేపట్టింది. అహంకారం వ్యక్తులకు, సెల్ఫీల పోస్టింగ్‌కు ఉన్న సంబంధాన్ని వీరు పరిశోధించారు. దీనిలో అహంకారం ఎక్కువగా ఉన్న వ్యక్తులే సెల్ఫీలు పోస్ట్ చేసే అవకాశాలు అధికమని తేలింది. వారి సెల్ఫీలకు ఇతరులు చేసే కామెంట్స్‌ను తెలుసుకునేందు కు ఇష్టపడతారు, కానీ ఇతర స్నేహితుల సెల్ఫీలను పట్టించుకోరని గుర్తించారు. -
చోరీ చేసిన చోటల్లా.. సెల్ఫీలు
ముగ్గురు వ్యక్తులు యూకేలో ముఠాగా ఏర్పడి గ్యాంబ్లింగ్ మిషిన్లను లక్ష్యంగా చేసుకొని వరుస చోరీలు చేసేవారు. వీరిలో ఇద్దరు సెల్ఫీల మీద పిచ్చితో చోరీలు చేసి చోటే ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగేవారు. బెంజమిన్ రాబిన్సన్(30), డానియెల్ హట్చిన్సన్(24) లు చోరీలు చేసిన తర్వాత అక్కడే(గ్యాంబ్లింగ్ మిషిన్ల దగ్గర) నవ్వుతూ ఫోజులు ఇచ్చి మరీ సెల్ఫీలు దిగేవారు. చివరికి ఆ సెల్ఫీల పిచ్చే వారు చేసిన నేరాలను నిరూపించడానికి ఆధారాలుగా మారాయి. దీంతో సోమవారం బ్రాడ్ ఫోర్డ్ క్రోన్ కోర్టు ముగ్గురిని దోషిగా తేల్చి శిక్ష విధించింది. వివరాలు.. స్కిప్టన్ లో 2014 జూన్‌లో అతివేగంగా వెలుతున్నారని పోలీసులు గుర్తించి వారి కారును ఆపారు. నార్త్ యార్క్‌షైర్ పోలీసులు వీరు ప్రయాణిస్తున్న కారులో మాస్కులు, స్క్రూడ్రైవర్లతో పాటూ భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు వ్యక్తులు మాస్కులను తీసేసి మరీ చోరీ చేసిన ప్రదేశంలో దిగిన సెల్ఫీలను కూడా పోలీసులు గుర్తించారు. విచారిస్తున్న సమయంలోనే జాక్ పాట్ కేసును పట్టుకున్నామని మాట్ వాకర్ అనే పోలీసు అధికారి అన్నారు. చోరీ చేయగా వచ్చిన డబ్బుతో ఏం చేయాలో కూడా ఎలాంటి ముందుస్తు ప్రణాళికలు చేసుకోలేదు. వాళ్ల అత్యాశ, సెల్ఫీల మీద ఉన్న పిచ్చి వాళ్లను నేరస్తులుగా నిరూపించి కటకటాల పాలయ్యేలా చేశాయని పోలీసులు తెలిపారు. పోలీసులు పక్కా ఆధారాలను కోర్టుకు సమర్పించడంతో మరో దారిలేకుండా చేసిన నేరాన్ని కోర్టులో అంగీకరించి కటకటాల పాలయ్యారు. -
కన్నుకొట్టి... కొనొచ్చు
- కన్నుగీటే సెల్ఫీతో చెల్లింపు చేయొచ్చు - అమెజాన్ అమ్ములపొదిలో కొత్త టెక్నాలజీ - పేటెంట్ పొందిన ఆన్లైన్ దిగ్గజం ఆన్లైన్ పోర్టల్‌లో ఏదైనా వస్తువు కొనాలంటే... పేమెంట్ చేయడానికి క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలివ్వాలి... వన్‌టైమ్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ల గోల తప్పదు. ఈ గోల ఏమీ లేకుండా ఓ సెల్ఫీతో ఆన్లైన్ పోర్టల్‌లో మనకు నచ్చిన వస్తువులు కొనేసుకొంటే. ఇదేదో సూపర్‌గా ఉంటుంది కదూ. ఆన్లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్ ఈ దిశగా పెద్ద ముందడుగు వేసింది. సెల్ఫీతో మన కార్డు లేదా బ్యాంకు వివరాలను లింక్ చేసి.. వస్తువులు మనం కొంటున్నవేనని నిర్ధారించుకొని, పేమెంట్ జరిగిపోయే టెక్నాలజీకి అమెజాన్ ఇటీవలే పేటెంట్ పొందింది. సమీప భవిష్యత్తులో అమెజాన్‌లో ఈ సౌకర్యం కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. నిజానికి కొద్దికాలం కిందటే మాస్టర్‌కార్డ్ సెల్ఫీతో చెల్లింపులను ఆథరైజ్ చేసే టెక్నాలజీని (సెల్ఫీ పే) పరీక్షించింది. అయితే ఎవరైనా మన ఫొటోను మన సెల్‌ఫోన్ కెమెరా ముందుంచి ఫొటో తీసి కొనుగోలు చేస్తే మనం మోసపోయే అవకాశం ఉంది. ఇప్పుడు అమెజాన్ ఇలాంటి మోసాలను నివారించి కెమెరా ఎదురుగా ఉన్నది నిజమైన కొనుగోలుదారేనని, జీవించి ఉన్న వ్యక్తేనని నిర్ధారించుకోవడానికి కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసి.. పేటెంట్ పొందింది. మనం కొనుగోలు చేసే వస్తువులను ఎంపిక చేసుకున్నాక చెల్లింపు జరపడానికి సెల్ఫీ తీసుకోవాలి. దీన్ని వాళ్ల రికార్డుల్లో ఉన్న మన ఫొటోతో సరిపోల్చుకొని తదుపరి మరో సెల్ఫీ అడుగుతుంది. నిజంగా మనమే కొంటున్నామని నిర్ధారించుకోవడానికి కుడి కన్నుగీటమని అడుగుతుంది. కన్నుకొట్టేస్తే.. మనం అంతకుముందే వారికిచ్చిన కార్డు వివరాల ఆధారంగా కొనుగోలు చేసిన వస్తువులకు చెల్లింపు జరిగిపోతుంది. ఆయా కార్డులపై బిల్లింగ్ జరుగుతుంది. వస్తువులు మనకు డెలివరీ అవుతాయి. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ల చౌర్యం, దుర్వినియోగం అనే సమస్యలే ఉండవని, ఇదో సురక్షిత చెల్లింపు విధానమని అమెజాన్ చెబుతోంది. కన్నుకొట్టడం అనేది సరదాగా ఉంటుందని ఈ విధానాన్ని ఎంచుకున్న అమెజాన్ తలను ఒక దిశలో కదపడం, నవ్వడం ద్వారా కూడా మన ఐడెంటిటీని ఆథరైజ్ చేసే వెసులుబాటును పొందుపర్చింది. 4(ఎ):మొబైల్లో అమెజాన్ సైట్లోకి వెళ్లి కొనాల్సిన వస్తువులను ఎంపిక చేసుకోవాలి. 4(బి): సెల్ఫీ కోసం ఒక బాక్స్ వస్తుంది. మన ముఖం అందులో వచ్చేలా సెల్ఫీ దిగాలి. ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా అమెజాన్ వద్దనున్న రికార్డుల్లోని మన ఫోటోతో దీన్ని పోల్చిచూస్తుంది. 4(సి): ఇతరులు మన మొబైల్ ద్వారా మన ఫోటోను కెమెరా ముందు పెట్టి దుర్వినియోగం చేయకుండా... ‘దయచేసి కుడికన్ను కొట్టండి’ అని అడుగుతుంది. కన్నుకొడితే... కొనుగోలు చేస్తున్నది అసలైన వ్యక్తేనని గుర్తించి చెల్లింపును ఆథరైజ్ చేస్తుంది. 4(డి): చెల్లింపు జరిగిపోయాక... మన ఆర్డర్‌ను ధ్రువీకరిస్తూ... కృతజ్ఞతలు తెలిపే సందేశం వస్తుంది. -
సెల్ఫీ పిచ్చితో డాల్ఫిన్‌ను చంపేశారు..
బ్యూనస్ ఎయిర్స్: విభిన్న రీతుల్లో సెల్ఫీలు తీసుకోవడం, వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి హిట్స్, లైక్స్ పొందడం ఓ వ్యసనంగా మారింది. ఇది ఎంతలా అంటే సెల్ఫీల మోజులో తమ ప్రాణాలను పోగొట్టుకోవడమే కాదు.. ఇతర జీవుల ప్రాణాలను సైతం తీస్తున్నారు. అర్జెంటీనాలో సెల్ఫీ తీసుకోవడానికి పోటీ పడి ఓ డాల్ఫిన్‌ను చంపేశారు. సముద్రతీర పట్టణమైన సాంటా టెరిసిటాలో బీచ్‌లో సేదతీరుతున్న వారికి ఓ బేబీ డాల్ఫిన్ కనిపించింది. అదీ అరుదైన జాతికి చెందిన లాప్లాటా డాల్ఫిన్. అంతే.. అక్కడున్న వారు దానిని నీటిలోకి వదలాలనే కనీస విషయాన్నే మరచిపోయి దానితో పోటీలు పడి సెల్ఫీలు దిగారు. ఒకరి చేతిలో నుండి ఇంకొకరు తీసుకుంటూ దానిని బయటే ఉంచారు. దీంతో ఆ డాల్ఫిన్ మృతి చెందింది. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో చూసిన జంతుప్రేమికులు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. లాప్లాటా డాల్ఫిన్లు ప్రపంచ వ్యాప్తంగా 30,000 మాత్రమే ఉన్నాయి. ఇవి అర్జెంటీనా, ఉరుగ్వే, బ్రెజిల్ తీరాల్లో మాత్రమే కనిపించే అరుదైన రకానికి చెందినవి. ఇప్పటికే వీటిని అంతరించి పోతున్న జీవుల జాబితాలో అత్యంత ప్రమాదకరమైన దశలో ఉన్నట్లుగా రెడ్ లిస్ట్‌లో చేర్చారు. అర్జెంటీనా వైల్డ్‌లైఫ్ ఫౌడేషన్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి డాల్ఫిన్లు కనిపిస్తే వాటిని వెంటనే నీటిలోకి వదలాలని ఓ ప్రకటనను విడుదల చేసింది. -
ఎట్టకేలకు ఫేస్బుక్లో వాళ్ల ఖాతా క్లోజ్...
మారుపేర్లతో సెల్ఫీలను పోస్టు చేసి బెదిరింపులకు పాల్పడిన ఖైదీలను ఎట్టకేలకు జైలు అధికారులు కనిపెట్టారు. మూడేళ్ళపాటు ఫేస్ బుక్ లో అకౌంట్లను కొనసాగించిన వారిని గుర్తించి ఆ ఖాతాలను మూసివేయించారు. ఓ వ్యక్తిని కత్తితో పొడిచి హత్యచేసి, జైలులో శిక్షను అనుభవిస్తున్న మార్క్ మెక్ గార్ట్ ల్యాండ్.. సహా మరి కొందరు హంతకులు సామాజిక నెట్ వర్కింగ్ సైట్ ను ఆయుధంగా చేసుకొని, బెదిరింపు సందేశాలను పంపుతున్నట్లుగా డైలీ రికార్డ్ రిపోర్ట్ లో వెల్లడైంది. లెనార్క్ షైర్ షాట్స్ జైల్లో ఉన్న థగ్ కూడా తన సెల్ నుంచీ సెల్ఫీలను పోస్ట్ చేశాడు. మెక్ గార్ట్ ల్యాండ్ వంటి వారు ఫేస్ బుక్ లో తమ సెల్ఫీలను పోస్టు చేయడం ఎంతో హాస్యాస్పదంగా ఉందని, బాధిత కుటుంబ సభ్యులకే ఇది అవమానకరమని జైలు అధికారులు అంటున్నారు. స్కాటిష్ జైళ్లలోని ఖైదీలు గత ఐదు సంవత్సరాల్లో ఫేస్ బుక్ ను దాదాపు ఐదు వందలసార్లు వినియోగించినట్లు ఆధారాలు తెలుపుతున్నాయి. మెక్ గార్ట్ ల్యాండ్... స్మైలర్ యా బాస్ పేరున 2013 లో ఫేస్ బుక్ లో తన ఖాతాను తెరిచాడు. అదే సంవత్సరం అందులో కక్ష సాధింపు చర్యలకు ఉసి గొల్పుతూ... బూతు పదాలను వాడుతూ ఎన్నో రాతలు రాశాడు. మరో పోస్ట్ లో అతను నీతి బోధలు చేశాడు. మెక్ గార్ట్ ల్యాండ్ తన ప్రొఫైల్ ఫొటోగా పెంపుడు కుక్కను పెట్టుకున్నాడు. అయితే డైలీ రికార్డ్ ఆధారంగా చివరిగా నవంబర్ 16 న అతని పోస్ట్ తర్వాత విషయం కనిపెట్టిన జైలు అధికారులు అకౌంట్ క్లోజ్ చేశారు. మెక్ గార్ట్ ల్యాండ్ కు 2007 సంవత్సరంలో హత్యకేసులో 14 ఏళ్ళ కాగాగార శిక్ష పడగా... మరో ఖైదీ థగ్ కు పదిహేనేళ్ళ శిక్ష పడింది. ఇలా పలు కేసుల్లో జైల్లో శిక్షలు అనుభవిస్తున్నవారు సెల్ ఫోన్లను జైల్లో వాడుతూ, నెట్ వర్కింగ్ సైట్లలో క్రిమినల్ చర్యలకు సంబంధించిన వివిధ పోస్ట్ లు చేయడం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే జైళ్ళలో సామాజిక మీడియా సైట్లు, ఇంటర్నెట్ కు తాము అనుమతి ఇవ్వమని, ఖైదీలకు అకౌంట్ ఉన్నట్లుగా గుర్తిస్తే వెంటనే ఆ అకౌంట్ క్లోజ్ చేయమని అభ్యర్థిస్తామని ఓ స్కాటిష్ జైలు అధికారి చెప్తున్నారు. ఖైదీలు తమ సంరక్షణలో ఉన్నపుడు ఫేస్ బుక్ లో అకౌంట్ ఉన్నట్లు తెలిస్తే తొలగించమనే అధికారం తమకు ఉంటుందని చెప్తున్నారు. జైళ్ళలో మొబైల్ ఫోన్ వినియోగం క్రిమినల్ చర్య అయినప్పటికీ స్కాట్స్ జైళ్ళలో ఇది ఎక్కువగా కనిపిస్తున్నట్లు రికార్డులు చెప్తున్నాయి. సైట్లలో లాగిన్ అయ్యి, బయటి వ్యక్తులతో సన్నిహితంగా ఉండేందుకు ఖైదీలు స్మగుల్డ్ ఫోన్లను ఉపయోగింస్తున్నట్లు స్కాటిష్ ప్రిజన్ సర్వీస్ రికార్డుల ద్వారా తెలుస్తోంది. 2010 నుంచి గతేడాది చివరి వరకూ 474 మంది ఖైదీలు.. వారి సన్నిహితులతో మాట్లాడేందుకు ఫేస్ బుక్ ను వినియోగించినట్లు ఎస్ పీ ఎస్ అధికారిక గణాంకాలు తెలిపాయి. మొబైల్ ఫోన్ వాడకం స్కాట్స్ జైళ్ళలో పెద్ద సమస్యగా మారినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. 2015 లో మొత్తం 309 మంది ఖైదీలను మొబైల్ ఫోన్ వాడుతుండగా పట్టుకున్నారని, 2013,14 ల్లో కంటే ఈ సంఖ్య ఎంతో ఎక్కువగా ఉన్నట్లు లెక్కల్లో తేలింది. -
సెల్ఫీలంటూ చావగొడుతున్నారు
- పాకిస్థానీ అభిమానులను ఉద్దేశించి ఓంపురి సరదా వ్యాఖ్య - 'యాక్టర్ ఇన్ లా'తో దాయాది గడ్డపై సీనియర్ నటుడి అరంగేట్రం ఇస్లామాబాద్: తనదైన విలక్షణ శైలితో గొప్ప నటుడిగా పేరుపొందిన ఓంపురి.. తొలిసారి దాయాదిదేశపు వెండితెరపై అలరించనున్నారు. ఆయన నటించిన పాకిస్థానీ చిత్రం 'యాక్టర్ ఇన్ లా' విడుదలకు సిద్ధమైంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా యూనిట్ తో కలిసి సోమవారం ఇస్లామాబాద్ లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పాకిస్థానీలు తనను ఆదరిస్తున్న తీరకు ముగ్థుణ్నవుతున్నానని ఓంపురి అన్నారు. 'పాకిస్థాన్ వచ్చానని తెలిస్తేచాలు తెలిసినవాళ్లు ఫోన్లమీద ఫోన్లు చేస్తుంటారు. ఎప్పుడైనా బయటికి వెళ్తానా.. సెల్ఫీ దిగాలంటూ అభిమానులు చావగొడుతున్నారు. వాళ్లలా అడగటం నాకూ ఇష్టమే' అని ఓంపురి సరదాగా వ్యాఖ్యానించారు. పాకిస్థానీలతో తన బంధం రెండు దశాబ్ధాలనాటిదని, ఇరుదేశాల ప్రజల మధ్య ఉన్న ప్రేమానురాగాలు చూస్తే ఇండియా- పాకిస్థాన్ లు తగువులాడుకోవటం విస్మయం కలిగిస్తుందని, ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 40 ఏళ్ల కెరీర్ లో తొలి ఐటమ్ సాంగ్!? షానీ అర్షద్ ద్వయం సంగీతం అందిస్తున్న 'యాక్టర్ ఇన్ లా' సినిమాలోని నాలుగు పాటల్లో ఒకటి ఐటమ్ సాంగ్. సినిమాలో ప్రాధాన్యం ఉన్న పాత్ర పోశిస్తోన్న ఓంపురి ఐటమ్ సాంగ్ లోనూ కనిపిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై దర్శకుడు నబీల్ ఖురేషీ మాట్లాడుతూ.. 'అలా ప్రచార జరగటం మంచిదే. ఎందుకంటే 40 ఏళ్ల కెరీర్ లో ఓంపురి ఏనాడూ ఐటమ్ సాంగ్ లో కినిపించలేదు. ఇలానైనా ఆ రికార్డ్ బ్రేక్ అవుతుందేమో' అని అన్నారు. -
రైల్వే ట్రాక్ లనూ వదలని సెల్ఫీల పిచ్చి..
యాండ్రాయిడ్ ఫోన్ల పుణ్యమాని... జనంలో సెల్ఫీల పిచ్చి రోజు రోజుకూ ముదిరిపోతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధికి వినియోగించుకోవడం మంచిదే. కానీ వేళాపాళా, సమయం సందర్భం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఫొటోలకు పోజులిచ్చేస్తూ.. అనవసరమైన ప్రమాదాలను కొనితెచ్చుకోవడం ఇటీవల బాగా పెరిగిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సీసీ టీవీ ఫుటేజ్ ను చూస్తే.. జనం ఏ లెవెల్ లో సెల్ఫీలు దిగుతున్నారో షాకింగ్ కు గురిచేస్తోంది. ఎప్పుడూ పాసింజర్లతో రద్దీగా ఉండే ఇంగ్లాండ్ డర్బీషైర్ మ్యాట్ లాక్ బాత్ స్టేషన్ ప్రాంతం... ఇప్పుడు సెల్ఫీల పిచ్చోళ్ళకూ కేంద్రంగా మారింది. పిల్లలు, టీనేజర్లు, ఫ్యామిలీలు ఒక్కరేమిటీ అక్కడినుంచీ ప్రయాణించే ప్రతివారూ ట్రైన్ వచ్చేలోపూ ఏకంగా పట్టాలమీదే సెటిలైపోతున్నారు. లెవెల్ క్రాసింగుల్లో ట్రైన్ వస్తుందని కూడా చూడకుండా సెల్ఫీలు తీసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఉన్నట్టుండి రైలు వస్తే ప్రాణాలకే ప్రమాదమని రైల్వే బాసులు చెప్పినా పట్టించుకోవడం లేదు. తాజాగా న్యూయార్క్ రైల్ రిలీజ్ చేసిన ఓ వీడియో ఫుటేజ్ ను పరిశీలిస్తే భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ట్రాక్ లపై ఆటలాడుతూ, నడుస్తూ ఫొటోలకు పోజులివ్వడమే కాక, ఫోనుల్లో మెసేజ్ లు పంపుతూండటం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఏకంగా ఓ తల్లి తన పిల్లలను ఫొటో తీసేందుకు ట్రాక్ పై కూర్చోపెట్టడం... రైల్వే అధికారులను షాక్ అయ్యేట్టు చేసింది. ట్రైన్ వచ్చే సమయంలో గేట్లు మూసుకుపోతాయని, పట్టాలపై ఉన్నవారు జాగ్రత్త వహించాలని రైల్వే సిబ్బంది హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా ట్రాక్ లపై కాలక్షేపం చేయడం విస్మయ పరుస్తోంది. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వ్యక్తులను గుర్తించి వారిని మందలించేందుకు సిద్ధమౌతున్నారు. అందుకు ప్రజల సహాయం కూడ తీసుకుంటున్నారు. లెవెల్ క్రాసింగ్ ల వద్ద సుందరమైన ప్రాంతాలను చిత్రీకరించడం ఎంతో ఆనందాన్నివ్వచ్చు. కానీ అది ఎంతమాత్రం మంచిది కాదు. రైల్వే ట్రాక్ లు... ప్లే గ్రౌండ్లు కాదు అంటున్నారు నెట్ వర్క్ రైల్ ఆపరేషన్స్ రిస్క్ ఎడ్వైజర్ మార్టిన్ బ్రౌన్. ట్రైన్ ఎప్పుడైనా, ఎటువైపునుంచైనా వచ్చే అవకాశం ఉంటుందని, ట్రాక్ లపై ఫోటోలు దిగడం, ఛాటింగ్ చేయడం, ఆటలాడటం తగదని, ప్రమాదాలకు దారితీస్తుందని ఆయన హెచ్చరిస్తున్నారు. మ్యాట్ లాక్ బాత్ స్టేషన్ మీదుగా రోజూ సుమారు 30 ట్రైన్స్ వెడుతుంటాయని, ఇక్కడ సుమారు 5 వందల మంది సైకిలిస్టులు, పాదచారులు లెవెల్ క్రాస్ చేస్తుంటారని, ఇటువంటి రద్దీ ఉండే క్రాస్ వద్ద ఉన్న స్టాప్.. లుక్... లిజన్... వంటి సూచనలు తప్పకుండా ప్రయాణీకులు ఫాలో అవ్వాలని లేదంటే ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. విక్టోరియన్ రైల్వే నెట్ వర్క్ లో అంతర్భాగంగా బ్రిటన్ మొత్తం సుమారు 6 వేల వరకూ లెవెల్ క్రాసింగ్ లు నిర్మించారని, వాటిని సద్వినియోగం చేసుకోకుంటే ప్రమాదాలకు హేతువుగా మారుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తమ తమ పిల్లలను బయటకు పంపేప్పుడు కుటుంబ సభ్యులు, ఇంట్లోని వారు తగు జాగ్గత్తలు చెప్పాలని, ప్రమాదం జరిగిన తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదని బ్రిటిష్ ట్రాన్స్ పోర్ట్ పోలీస్ అధికారి ఎడ్డీ కార్లిన్ హెచ్చరిస్తున్నారు. తాజా ఫుటేజ్ ను బట్టి చూస్తే.. ఎంత గస్తీ ఏర్పాటు చేసినా ప్రజలు కూడ తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రయోజనం ఉండదని, ఫోటోల సరదా ప్రాణాలనే తీస్తుందని అంటున్నారు. -
ఈ స్పూన్ సెల్ఫీలు తీస్తుంది గురూ..!
ఇది.. సెల్ఫీల యుగం.. ప్రతి సన్నివేశాన్ని, స్టైల్ ను, సీన్ ను, ఒక్కటేమిటి.. ఏ కొత్తదనం కనిపించినా సెల్ఫీగా మలచడం ప్రస్తుతం ట్రెండ్ గా మారింది.. అయితే ఈ సెల్ఫీ.. ఇప్పుడు స్టిక్ నుంచి స్పూన్ కు చేరింది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నప్పుడు సెల్ఫీ తీసుకోవాలనుకున్న వారికి ఇప్పుడు అందుబాటులో సెల్ఫీ స్పూన్లు కూడ మార్కెట్లోకి వచ్చేశాయ్.. స్టిక్ కు స్పూన్ అమర్చిన కొత్త పరికరం (సెల్ఫీ స్పూన్) ఇప్పుడు మార్కెట్లో హల్ చల్ చేస్తోంది. స్పూనుకు 30 అంగుళాల స్టిక్‌ను కలిపి తయారు చేసిన ఈ స్పూన్.. సెల్ఫీ ప్రియులను ఆకట్టుకుంటోంది. టిఫిన్ తింటూ ఎవరికి వారు అందంగా ఫొటోలను తీసుకునేందుకు వీలుగా న్యూయార్క్‌కు చెందిన సినామన్ టోస్ట్ క్రంచ్ ఈ పరికరాన్ని పరిచయం చేసింది. జనరల్ మిల్స్ బ్రాండ్ రూపొందించిన ఈ కొత్త సెల్ఫీ స్టిక్‌లో ఎప్పటికప్పుడు తీసిన ఫొటోలను పోస్ట్ చేసే అవకాశం ఉంది. సెల్ఫీ స్పూన్ ను వాడాలనుకునేవారు ముందుగా తమ స్మార్ట్ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేయాలి. అందులోని వైట్ రిమోట్లో కనిపించే గ్రే బటన్ ను నొక్కితే ఆండ్రాయిడ్ ఫోన్లోనే కాక ఐవోఎస్ డివైజ్‌లో కూడా ఫొటోలు సేవ్ అవుతాయి. దీంతో ఎప్పటికప్పుడు తీసుకున్న ఫొటోలను పోస్ట్ చేయడం కూడా సులభం అవుతుందట. -
ఆయన దొరికితే అంతే...
ఫన్ డాక్టర్ కలాంగారు నాకు బాగా తెలుసు. ఆయనే కాదు - వాజ్‌పాయి కూడా బాగా తెలుసు. ఆ మాటకొస్తే మోడీ, సోనియా కూడా బాగా తెలుసు. కాకపోతే వాళ్లెవరికీ నేను తెలీదు. అంతే. నేమ్ డ్రాపింగ్ అన్నది ఓ కళ. మనకి చాలామంది తారసపడ్తుంటారు. సంభాషణలో సూటిగా చెప్పకుండా, ఇలా మాట్లాడుతూ ఓ అమితాబ్‌ని, అలా మాట్లాడ్తూ ఓ టెండుల్కర్ని - ‘‘మాకు చాలా క్లోజ్ అండి బాబూ’’ అని బిల్డప్ ఇస్తుంటారు. మరికొంతమంది పేర్లతో ఆగరు. ఫొటో ఆల్బమ్‌లు వెంటేసుకుని తిరుగుతుంటారు. పరిచయం మొదటి నిమిషంలోనే - వాళ్లు సెలెబ్రిటీస్‌తో దిగిన, దింపిన ఫొటోలన్నీ చూయించే స్తారు. సెల్ కెమెరాలు, సెల్ఫీలు వచ్చిన తర్వాత వీళ్ల పని ఇంకా సులువైంది. అంతకుముందంటే కెమెరా వేరేవాడికిచ్చి ‘‘బాబ్బాబూ, ఓ ఫొటో తీయవా పెద్దా యనతో’’ అని అడుక్కో వాల్సి వచ్చేది. మళ్లీ సదరు వ్యక్తి సాగర సంగమంలో ‘భంగిమ’ ఫొటోగ్రాఫర్లాంటివాడను కోండి.. ‘‘ఇవి నా కాళ్లు, అవి మహేష్ బాబు కాళ్లు’’ అని చెప్పుకోవాల్సి వచ్చేది. అసలు విషయానికి వద్దాం. అబ్దుల్ కలాంగారి గురించి. ఓ వ్యక్తి చనిపోయి - ఇంతమంది గుండెల్లో బ్రతికుండటం చాలారోజుల తర్వాత చూశాను. చాలా మంది, చాలా రకాలుగా పరమపదిస్తుం టారు. కానీ ఈయన చావేంటండీ బాబూ! ఎంత అద్భుతం, ఎంత అదృష్టం! తనకు ఇష్టమైన పని.. అదే, యువతని ప్రబోధ పరిచే ఉపన్యాసం ఇస్తూ అలానే నిష్ర్కమిం చడం... ఎంత పుణ్యం చేసుకుంటే ఆ వరం దొరుకుతుందో కదా! ఇంకో రకంగా ఆలోచించండి. ఈ మాజీ ప్రెసిడెంట్‌గారి అదృష్టం బాగోలేక - ఆ రోజు హార్ట్ అటాక్‌తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడనుకోండి. మా డాక్టర్లం దరం రెచ్చిపోయి స్టంట్లు చేసి, స్టంట్లు వేసి వెంటిలేటర్ మీద బాధించి, ‘ఎపుడు వదులుతార్రా - నా పని నేను చేసుకో వాలి’ అనుకుంటూ - చుట్టుపక్కలే తిరుగుతున్న ఎం.ధర్మరాజుతో పోట్లాడి ఆట్లాడి, ప్రెసిడెంట్గార్ని కనీసం ఓ సంవత్సరం పాటన్నా కోమాలోనో, హార్ట్ ఫెయిల్యూర్లోనో, స్ట్రోక్లోనో ఉంచే ఏర్పాటు చేసేవాళ్లం. అందుకనే నాకు చాలా భయం. చావంటే కాదు - చచ్చిపోయే ప్రదేశం గురించి! హాయిగా ఎక్కడో హాలీడేలో, అద్భుతమైన ప్రకృతిని ఆస్వాదిస్తూనో టపా కట్టేస్తే - ఎంత ఆనందం. ‘‘కరెక్ట్‌గా చచ్చిపోయే టైమ్‌కి నిన్ను స్విట్జర్లాండ్‌కో, ప్యారిస్కో తీసుకెళ్లడం.. అక్కడి నుంచి నీ పార్ధివ దేహాన్ని ఇండియా తీసుకురావడం, చాలా ప్లానింగ్‌తోనూ, ఖర్చుతోనూ కూడిన పని మగడా. అలాంటి చచ్చు ఐడియాలు పెట్టుకోమాకు’’ అని మా ఆవిడ క్లాస్ పీకే అవకాశం ఉంది కాబట్టి ఈ కోరికని చంపేస్తున్నాను ప్రస్తుతానికి. సరే ఆ ఇష్టం తీరడం కష్టం అంటున్నారు కాబట్టి ఇంకో చిన్న ఇష్టా న్నైనా తీర్చుకుంటూ పోనివ్వండర్రా! ఏమిటంటారా! చాలా సులువైన ఇష్టం ఇది. జీవిత నేస్తాలతో సొల్లు చెప్పు కుంటూ బాల్చీ తన్నేయడం ఊహించు కోండి. ‘ఒరేయ్’... ‘వెధవా’... ‘నీకంత సీనులేదురా’ లాంటి మాటలు మాట్లాడు కోగల ఫ్రెండ్స్‌తో నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ‘ఒరేయ్’, ‘చచ్చావురా నా చేతుల్లో’ అని చతుర్లాడుకుంటూ కుంటూ - ఇంతే సంగతులు. ఎంత అదృష్టం! చెప్పానుగా నా భయం. పొరపాటున, నా చివరి రోజులు బాగోక - మా హాస్పిటల్లోనే దొరికిపోయాననుకోండి. చచ్చానే. ‘వీడు నా జీతం పెంచడా’ అని కోపంతో కొంతమంది, ‘వీడి టార్చర్ ఇన్నాళ్లూ భరించాం, ఇదే ఛాన్స్’ అని మరికొంతమంది... డాక్టర్లు, సర్జన్లు, సర్సులు, వార్డ్ బాయ్స్ అందరూ మూకుమ్మడిగా నాకు గ్యాస్ట్రోస్కోప్, ఆర్థోస్కోప్, లరింగోస్కోప్ - చివరకు కొలనోస్కోప్ కూడా చేసేసి - నాకు చావడానికి స్కోప్ లేకుండా చేస్తారేమోనని చచ్చేంత భయం. ఈ చావు కబుర్లు, చావు కోరికలన్నీ ఎందుకు రాస్తున్నానంటే పుణ్యాత్ములకే ఇలాంటి వరం దొరుకుతుందట. కాబట్టి పుణ్యాలు చేయండి అని చెప్పడానికే. కాళోజీ అన్నట్లు ‘పుటక నీది - చావు నీది - బ్రతుకంతా దేశానిది’. ఇంకోరకంగా చెప్పాలంటే పుట్టుక మన చేతుల్లో లేదు. చావు మన చేతుల్లో లేదు. మధ్యనున్న బ్రతుకే - మనిష్టం. నల్గురిలో మంచి ఉంచుకుంటూ, పెంచుకుంటూ జీవించ డమే ముఖ్యం. నాకు కోట్స్ చాలా ఇష్టం. అవి గుండెల్లో స్ఫూర్తినింపుతాయి. ధైర్యాన్ని స్తాయి. ‘సాహసం చేయరా డింభకా’ అని ముందుకు తోస్తాయి. మార్టిన్ లూథర్ కింగ్, గాంధీ, వివేకానందుడు లాంటి మహనీయులు ఇచ్చిన ప్రబోధ వాక్యాలు మనందరినీ వెన్నుతట్టి ముందుకు నడుపు తుంటాయి. కాంటెంపరరీ టైమ్స్‌లో అలాంటి మాణిక్యాలు అందించినవాళ్లు అరుదు - అబ్దుల్ కలాం మినహా. ఆయన రాసిన పుస్తకాల్లో అయితేనేమి - ఆయన ప్రసంగాల్లో అయితేనేమి - దొర్లిన కొన్ని మాటలు సదా గుర్తుకొచ్చి, కర్తవ్య బోధన చేసే ఆణిముత్యాలు. కలాం చెప్పారు... ‘‘నిద్రలో వచ్చి పోయే కలల గురించి కాదు నేను చెప్పేది, నువ్వు కనే కల నిన్ను నిద్రపో నివ్వకుండా చేయాలి. అలాంటి కలలు రావాలి నీకు.’’ అదేంటో నాకొచ్చే కలలన్నీ సన్నాసివి వస్తుంటాయి. పరీక్షకు లేట్‌గా వెళ్తే లోపలికి రానివ్వనట్లు, నా ఐస్‌క్రీమ్ ఎవడో లాక్కు న్నట్లు, కలాంగారి లెవెల్‌కి ఎప్పుడు ఎదుగుతానో!! - డా॥గురవారెడ్డి -
ఇలా ఎగబడడం దారుణం!
ఇది సెల్ఫీల ట్రెండ్. బెస్ట్ ఫ్రెండ్‌తో సెల్ఫీ... ముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్లతో సెల్ఫీ... పిచ్చి పిచ్చి హావభావాలిస్తూ సెల్ఫీ... ఇలా కాదేదీ సెల్ఫీకి అనర్హం అన్నట్లుగా ఉంది. అంతమటుకు ఫర్వాలేదు కానీ.. అంతకుమించి చేస్తేనే పిచ్చి ముదిరింది అనాలనిపిస్తుంటుంది. అమితాబ్ బచ్చన్ ఆ మాటే అంటున్నారు. ఇటీవల ఫ్రెండ్ చనిపోతే, అంతిమక్రియల్లో పాలుపంచుకోవడానికి అమితాబ్ ఢిల్లీ వెళ్లారు. ఇది హఠాన్మరణం అని, అస్సలు ఊహించలేదని ఈ సందర్భంగా బిగ్ బి పేర్కొన్నారు. ఫ్రెండ్ పోయిన బాధలో ఉన్న ఆయన్ను మరో విషయం విపరీతంగా బాధపెట్టింది. అంతిమక్రియల్లో పాలుపంచుకోవడానికి వెళ్లిన అమితాబ్‌తో సెల్ఫీలు దిగడానికి చాలామంది ఎగబడ్డారట. ‘‘మరణించినవారికీ మర్యాద ఇవ్వడం లేదు.. వాళ్ల చివరి క్రియలను దగ్గరుండి చేయడానికి హాజరయ్యే బతికున్నవాళ్లకీ మర్యాద లేదు. సమయం, సందర్భం కూడా పట్టించుకోకుండా సెల్ఫీల కోసం ఎగబడటం దారుణం’’ అని అమితాబ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆటోగ్రాఫ్ ఔట్.. సెల్ఫీ ఇన్!
లక్నో: 'సెల్ఫీ' ఈ పదం ఇప్పుడు యువత ఫాలో అవుతున్న సరికొత్త ట్రెండ్. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఎప్పుడైనా ఎక్కడైనా చక్కగా సెల్ఫీలు తీసేసుకోవచ్చు. ఎవరైనా సెలబ్రిటీలు వస్తే చాలు.. ఒకప్పుడు ఆటోగ్రాఫ్ పుస్తకాలు పట్టుకుని యువత హడావుడి చేసేవారు. ఇప్పుడు చేతిలో ఫోన్ పట్టకుని.. సెల్ఫీ ప్లీజ్ అని అడుగుతున్నారు. కెమెరా మోసుకుని వెళ్లాల్సిన అవసరం లేకుండా, అత్యాధునిక ఫీచర్లు, మంచి కెమెరాలతో స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఎక్కడిపడితే అక్కడ సెల్ఫీలకు పోజులిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బుధవారం తన పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న సందర్భంగా సెల్ఫీలపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. నేటి యువత ఆటోగ్రాఫ్‌ల కంటే సెల్ఫీలనే ఎక్కువగా కోరుకుంటున్నారని చెప్పారు. అంతేకాక తన చిన్ననాటి తరానికి ఇప్పటి తరానికి మధ్య చాలా మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా అభినందించడానికి వచ్చినవాళ్లలో కూడా ఆటోగ్రాఫ్ అడిగిన వాళ్ల కంటే సెల్ఫీలు అడిగినవాళ్లే ఎక్కువగా ఉన్నారన్నారు. -
టాయ్ గన్‌తో సెల్పీ...తుపాకీ గుళ్లకి బలి
ఇస్లామాబాద్: టీనేజర్ ఫర్హన్ తన వద్దనున్న టాయి్ గన్‌తో సెల్ ఫోన్లో సెల్ఫీ తీసుకోవడమే అతడి జీవితానికి అఖరి క్షణాలయ్యాయి. ఫర్హన్ వద్దనున్న టాయ్గన్ నిజమైనదని... అతడు దొంగ అని భావించిన ఓ పోలీసు.. ఫర్హన్పై కాల్పులు జరిపాడు. దాంతో పోలీసు ఎటువంటి హెచ్చరికలు చేయకుండానే ఫర్హన్పై కాల్పులు జరిపాడు.దాంతో ఫర్హన్ కుప్పకూలిపోయి.. మరణించాడు. అక్కడే ఉన్న అతడి స్నేహితుడు ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ తర్వాత ఘటన స్థలానికి వచ్చిన కాల్పులు జరిపిన పోలీసు... ఫర్హన్ వద్ద ఉన్నది టాయి గన్ అని నిర్థారించుకున్న సదరు పోలీసు తప్పు చేశానని తెలుసుకున్నాడు. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. కాల్పులు జరిపిన పోలీసును పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సోమవారం పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్ నగరంలో చోటు చేసుకుందని మీడియా మంగళవారం ఓ కథనాన్ని ప్రసారం చేసింది. -
సెల్ఫీలంటే మరీ అంత పిచ్చా!
లండన్: అభివృద్ధి చెందిన దేశాలతోపాటు వర్థమాన దేశాల యువతీ యువకుల్లో సెల్ఫీలు తీసుకోవడం పట్ల మోజు రోజురోజుకు పెరుగుతోంది. లండన్ యువతుల్లో మాత్రం ఈ మోజు మరీ పిచ్చి స్థాయికి చేరుకొంది. సెల్ఫీల్లో ముఖాలు అందంగా, ఆకర్షణీయంగా కనిపించడం కోసం ముఖ చర్మం కింద దారపు పోగుల్లా ఉండే సిరలను శస్త్ర చికిత్సల ద్వారా తొలగించుకుంటున్నారు. 40 ఏళ్ల లోపుండే యువతులు ఎక్కువగా శస్త్ర చికిత్సలను ఆశ్రయిస్తున్నారని, సాధారణంగా మేకప్ చేసుకొంటే ఈ సిరలు బయటకు కనిపించవని, మేకప్ లేకుండా సెల్ఫీలు దిగడం ఓ మోజుగా మారిందని, అందుకే వారు శస్త్ర చికిత్సలకు ముందుకొస్తున్నారని లండన్ వైద్యులు తెలిపారు. లండన్‌లో గత ఆరునెలల కాలంలోనే 40 ఏళ్లలోపు యువతుల్లో 15 శాతం మంది తమ ముఖాల చర్మం కింద ఉండే సిరలను శస్త్ర చికిత్సల ద్వారా తొలగించుకున్నారని వారు చెప్పారు. సూపర్ స్టార్స్ జెన్నీఫర్ లోపెజ్, జెన్నీఫర్ అనిస్టన్, రిహన్నా, గ్వినెథ్ పాల్త్రో, రోజీ హంటింగ్టన్లాంటి వారు మేకప్ లేకుండా సెల్ఫీలు దిగుతూ ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నారని, దేన్నో చూసి ఏదో వాత పెట్టుకున్నట్టు వారి బాటలోనే లండన్ యువతరం పయనిస్తోంది. ఇలాంటి శస్త్ర చికిత్సలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించవా? అని డాక్టర్లను మీడియా ప్రతినిధులు అడిగితే ‘ఎవరి పిచ్చి వారికానందం’ అంటూ అసలు విషయాన్ని దాట వేస్తున్నారు. హైరెసల్యూషన్ కలిగిన హెచ్డీ కెమేరాలు, స్మార్ట్‌ఫోన్ కెమేరాలు అందుబాటులోకి రావడంతో ముఖచర్మం కింద ఉండే సిరలు సెల్ఫీల్లో కనిపిస్తున్నాయని, అందుకే వాటిని తొలగించుకునేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తున్నారని డాక్టర్ న్యూమాన్స్ క్లినిక్ మెడికల్ డెరైక్టర్ డాక్టర్ పీటర్ ఫనిగన్ చెప్పారు. అమెరికాలో కూడా ఓ మోజీ ఇటీవల విపరీతంగా పెరిగిపోయిందని ‘ప్యూ రీసర్చ్ సెంటర్’ వెల్లడించింది. సామాజిక వెబ్సట్లలో ఫొటోలు పోస్ట్‌చేసే అమెరికన్ల సంఖ్య 2006లో 79 శాతం ఉండగా, ఇప్పుడది 91 శాతానికి చేరుకుందని ఆ రీసర్చ్ సెంటర్ పేర్కొంది. వాస్తవానికి లండన్‌లో ఏడాది క్రితం క్యాన్సర్ రీసర్చ్ విరాళాల కోసం సినిమా తారలు సెల్ఫీలు తీసుకొని సామాజిక మీడియాలో వాటిని పోస్ట్ చేయడం మొదలైంది. విరాళాల కోసం మొదలైన ఆ ఉద్యమం ముగిసిపోయినప్పటికీ ఇప్పటికీ జెన్నీఫర్ అనిస్టన్, జెన్నీఫర్ లోపెజ్ లాంటి తారలు ఇప్పటికీ సెల్ఫీలు పోస్టు చేస్తున్నారు. వారికి తందాన అంటూ తాళం వేస్తున్న లండన్ యువతులు తగుదునమ్మా అంటూ సెల్ఫీల మీద సెల్ఫీలు పోస్టు చేస్తున్నారు. ఇక అది ఆదృష్టమో దురదృష్టమో చూసేవాళ్లే తేల్చుకోవాలి! -
సెల్ఫీ.. క్రేజీ!
అందంగా ముస్తాబయ్యి కొత్తబట్టలు వేసుకొని ఫొటో స్టూడియోకి వెళ్లి.. ఫ్లవర్వాజ్పై చేయి వేసి నిటారుగా నిల్చుని ఫొటో దిగడం ఒకనాటి మాట. ఇప్పుడు పెళ్లిళ్లకు, ఇతర ఫంక్షన్స్‌కు తప్ప ఫొటోగ్రాఫర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోయింది. సెల్‌ఫోన్స్‌లో కెమెరా ఫొటోల్లో ఓ విప్లవాన్నే తెచ్చింది. ఎవరో ఒకరు ఫొటో తీయడం పక్కకు పోయి... ఫ్రంట్ కెమెరాలతో సెల్ఫీస్ వచ్చాయి. తరువాత ఆ స్థానంలో గుల్ఫీస్, హెల్ఫీస్, వేల్ఫీస్... ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ పెల్ఫీస్! ఫ్రంట్ కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్స్, హై రిజల్యూషన్ కలిగిన ట్యాబ్స్, మొబైల్స్‌కి ఆదరణ పెరిగింది. దాంతో తమ క్లాస్మేట్స్, పేరెంట్స్ ఫేవరెట్ ప్లేస్‌లో గుల్ఫీలు తీసుకుని మురిసిపోయిన నగరవాసులు ట్రెండ్‌ని సృష్టించారు. అతివలు తమ అందమైన కురులను మాత్రమే ఫొటో తీసి దానికి హెల్ఫీగా నామకరణం చేసి సోషల్ నెట్‌వర్క్స్‌లో అప్లోడ్ చేశారు. ఆ తరువాత వర్కవుట్స్ వంతు వ చ్చింది. జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న ఫొటోస్ను తీసి వాటిని ‘వెల్ఫీ’లుగా అప్డేట్ చేశారు. ఇప్పుడు కొత్తగా... ఈ కోవలోకే చేరింది ‘పెల్ఫీ’! తమ బెస్ట్ బడ్డీలుగా పెంచుకుంటున్న పెట్స్‌తో సెల్ఫీలు దిగి.. సోషల్వెబ్సైట్స్లో, వాట్సప్‌లలో ప్రొఫైల్ పిక్చర్స్‌గా పెట్టేస్తున్నారు. అంతేకాదు ఆ ఫొటోకి తగ్గ కామెంట్ రాసి తమ క్రియేటివిటీని చాటుకుంటున్నారు. ఇంకొందరైతే ఇంకో అడుగు ముందుకేసి తమ పెట్స్‌ని పార్లర్‌కి తీసుకెళ్లి, గ్రూమింగ్ చేయించి యాక్సెసరీస్ వేసి మరీ అందంగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని పోస్ట్ చేస్తున్నారు. దానికి వచ్చే లైక్స్, కామెంట్స్‌ను చూసుకుని మురిసిపోతున్నారు. షార్ట్ ఫిలింస్... అయితే ఈ తరహా పెట్స్ ప్రిఫరెన్స్ వెస్ట్రన్ కంట్రీస్‌లో పాతదే! మన దేశంలోకి ఇప్పుడిప్పుడే స్పోర్ట్స్ పర్సన్స్, సెలబ్రిటీస్, బిజినెస్‌మెన్స్, నిత్యం బిజీగా ఉండే పొలిటీషియన్స్ సైతం తీరిక దొరికినప్పుడల్లా రిలాక్స్ అవ్వడానికి ఇదే రూట్‌ని ఎంచుకుంటున్నారు. ‘పెల్ఫీ’స్తో కాలక్షేపం చేస్తూ ఆనందిస్తున్నారు. మరికొందరైతే... తమ పెట్స్‌తో ఏకంగా షార్ట్ ఫిలింస్, డాక్యుమెంటరీలే తీస్తున్నారు. మన నగరంలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఈ ‘పెల్ఫీస్’ ట్రెండ్ సెలబ్రిటీస్‌కి కాలక్షేపం... సాధారణ జనానికి ఆసక్తిగా మారింది! - సిరి -
రాక్ అండ్ షేక్
అరవైల్లో ఇరవై అయిపోయారు బామ్మలు, తాతలు. ఇరవైల్లోని అమ్మాయిలతో కలసి స్టెప్పులేసి దుమ్ము లేపారు. ముచ్చటగా సెల్ఫీలూ దిగారు. దాగుడుమూతలూ ఆడేశారు. రాగాలు తీసి... మురిపాలు కురిపించి... మైమరిపించారు. కాసేపట్లో సీను రివర్స్. ‘సీనియర్లు’ ఇచ్చిన ఎనర్జీతో టీనేజర్స చెలరేగిపోయారు. ప్యాంట్లు, షర్ట్స్ వేసుకొని అబ్బాయిల గెటప్‌లో ఈల వేసి గోల చేశారు. సింగ్ సాంగంటూ డ్యూయెట్సూ వేసుకున్నారు. బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ ఆధ్వర్యంలోని ‘కాఫీ క్లబ్’ వార్షికోత్సవంలో ‘సీనియర్ సిటిజన్ డే’ ఉత్సాహాల కేళీ అయింది. అదిరిపోయే యాక్టివిటీస్‌తో కళాశాల ప్రాంగణంలో దుమ్మురేగింది. అంతా కలసి ఆనందాల విందు చేసుకుని హాయిగా ఆస్వాదించేశారు. మెమరబుల్ మూమెంట్స్‌ను ‘క్లిక్స్’లో భద్రంగా దాచేసుకున్నారు. యూఐడీఏ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ ఎంవీఎస్ రామిరెడ్డి ప్రతిభ చూపిన వారికి బహుమతులిచ్చి అభినందించారు. -
సెల్ఫీ సరదాతో కూలిన విమానం
డెనివర్(అమెరికా): సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలానే విన్నాం. కానీ సెల్ఫీ తీసుకోవాలనే సరదా ఒక విమానం కూలడానికి కారణం అయ్యింది. గతేడాది జరిగిన విమాన ప్రమాదానికి సెల్ఫీ సరదానే కారణమని ఆలస్యంగా వెలుగు చూసింది. డెనివర్ సమీపంలో సంవత్సరం కింద ఒక చిన్న కొలరాడో విమానం కూలి పైలట్‌తో సహా మరో వ్యక్తి మరణించాడు. విమానం కూలడానికి గల కారణాలని అన్వేషించిన ఫెడరల్ ఆసిడెంట్ ఇన్వెస్టిగేటర్స్ ఒక నివేదికని అందజేసింది. పైలెట్ సెల్ఫీ తీయడానికి ప్రయత్నిస్తూ పరధ్యానంతో విమానం నడిపిన కారణంగానే అదుపుతప్పి కూలిందని అధికారులు తేల్చారు. -
అదేపనిగా సెల్ఫీలు పోస్ట్ చేయొద్దు!
ఫేస్బుక్ లో అదేపనిగా సెల్ఫీలు పోస్ట్ చేస్తున్నారా. అయితే ఈ అలవాటు మానుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు సలహాయిస్తున్నారు. సామాజిక సంబంధాల వెబ్సైట్లలో ఎక్కువగా సెల్ఫీలు పోస్ట్ చేసే వారికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు, సహచరులకు దూరమవుతారని పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మనుషుల మధ్య బంధాలను 'సోషల్ సెల్ఫీలు' దెబ్బ తీస్తాయని పరిశోధనలో రుజువైందని అంటున్నారు. సెల్ఫీలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేయడాన్ని సన్నిహిత స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇష్టపడరని బర్మింగ్‌హామ్ బిజినెస్ స్కూల్ పరిశోధకుడు డేవిడ్ హాగ్టన్ తెలిపారు. సెల్ఫీలను ఒకొకరు ఒక్కొక్క కోణంలో చూసి కామెంట్ చేస్తారని దీంతో అభిప్రాయబేధాలు తలెత్తే అవకాశముందని వివరించారు. ఫేస్బుక్లో సెల్ఫీలు పోస్ట్ చేసే ముందు బాగా ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు.